OPERATION TRIDENT

PART - 1 - THE ROBBERY

ఉదయం 9 గంటల సమయం... ఢిల్లీ కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుగాం నగరంలో ఢిల్లీ - జైపూర్ నేషనల్ హైవే కి పక్కనే ఉన్న సైబర్ హబ్ కాంప్లెక్స్ లోకి ఒక కార్ ప్రవేశించింది. మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ టీం ఆ కారు కింద భాగాన్ని అద్దం తో చెక్ చేశారు... ఆ తరువాత కార్ బూట్ ని కూడా ఓపెన్ చేశారు... కార్ బూట్ లో ఒక బ్యాక్ ప్యాక్ బాగ్... ఒక టెక్నిషియన్స్ టూల్ కిట్ ఉన్నాయి... బూట్ ని చెక్ చేసాక క్లోజ్ చేసి కార్ ని సైబర్ హబ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళడానికి దారికి అడ్డం గా ఉన్న బూమ్ బారియర్ ని పైకి లేపారు... ఆ కార్ నేరుగా వెళ్లి ఓరియన్ టవర్ బిల్డింగ్ కి దగ్గర ఉన్న విజిటర్ పార్కింగ్ లో ఆగింది. ఆ కారు నుంచి గౌతమ్ దిగాడు. గౌతమ్ ఆరడుగుల ఎత్తు... చాలా బలమైన ఫిజిక్...విశాలమైన భుజాలు... గంభీరమైన ముఖం... చూడడానికి చాలా సీరియస్ గా... ఒక బాలీవుడ్ హీరో లాగా ఉంటాడు... స్ఫురద్రూపి... ఆజానుబాహుడు... అనే పదాలకి ఖచ్చితమైన నిర్వచనం లా ఉన్నాడు . ఆ రోజు ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ లాగా చాలా ఫార్మల్ గా డ్రెస్ అయ్యాడు... కళ్ళకి రేబాన్ ఏవియేటర్ గ్లాస్సెస్ పెట్టుకోవడంతో అతను చుట్టు పక్కల పరిసరాలను అతి జాగ్రత్తగా పరిశీలించడం ఎవరు గమనించడం లేదు. ఆ రోజు సోమవారం కావడంతో సైబర్ హబ్ అంతా చాలా బిజీ గా ఉంది. వచ్చే పోయే వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు. గౌతమ్ నేరుగా ఓరియన్ టవర్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న కాఫీ షాప్ లోకి వెళ్లి ఒక ఖాళీ టేబుల్ చూసుకొని కూర్చున్నాడు...ఓరియన్ టవర్ మొత్తం 20 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ రిజిస్టర్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక లోక్ సభ MP నరసింహం ప్రారంభించాడు. కాఫీ షాప్ లో గౌతమ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి ఒక వెయిటర్ వచ్చి "గుడ్ మార్నింగ్ సర్... వాట్ డు యు లైక్ టు హావ్?" అని మర్యాదగా అడిగాడు. గౌతమ్ కళ్ళకి పెట్టుకున్న రేబాన్ గ్లాస్సెస్ తీసి టేబుల్ మీద పెట్టి చిరునవ్వుతో "క్లబ్ సాండ్ విచ్ అండ్ ఫ్రెష్ ఆరంజ్ జ్యూస్" అంటూ ఆర్డర్ చేసాడు. వెయిటర్ వెళ్ళగానే తన బాగ్ లోంచి లాప్ టాప్ ని బయటకి తీసి ఆన్ చేసి గ్లాస్ విండో లోంచి బయటకి పరిశీలనగా చూసాడు... బిల్డింగ్ కారిడార్ లో ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఉద్యోగులు కొంత మంది బిల్డింగ్ బయట సిగరెట్స్ కాలుస్తూ మొబైల్ ఫోన్స్ లో మాట్లాడుతున్నారు... కేఫ్ లోపల కూడా చాలా రష్ గా ఉంది... అందరూ బ్రేక్ ఫస్ట్ చేస్తూ... కాఫీ తాగుతూ... సీరియస్ గా మాట్లాడుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ గా ఉన్నారు. ఇంతలో గౌతమ్ ఆర్డర్ చేసిన సాండ్ విచ్... ఫ్రెష్ ఆరెంజ్యూస్ ని వెయిటర్ తీసుకొని వచ్చాడు... గౌతమ్ సాండ్ విచ్ ని తింటూ తన కార్ పార్కింగ్ చేసిన ప్రదేశం వైపు చూసాడు... ఆ ఏరియా దాదాపు 50 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడ పార్క్ చేసిన తన కార్ ని చూస్తూ మనసులో "సిగ్నల్ రేంజ్ లోనే ఉంది..." అని అనుకున్నాడు. తాపీగా సాండ్ విచ్ తిని... ఆరెంజ్ జ్యూస్ తాగాడు.

గౌతమ్ తన ఆపిల్ ఐఫోన్ ని టేబుల్ మీద పెట్టి అందులో Personal Hotspot ని ఆన్ చేసాడు. లాప్ టాప్ ఆన్ కాగానే ఆటోమేటిక్ గా మొబైల్ ఫోన్ లోని Personal Hotspot ద్వారా  ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యింది.  గౌతమ్ తాను స్పెషల్ గా వ్రాసుకున్న ఒక ప్రోటోటైప్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ని స్టార్ట్ చేసాడు... ఆ అప్లికేషన్ ద్వారా ఒక సిగ్నల్ పంపాడు... ఆ సిగ్నల్ ద్వారా పార్కింగ్ ప్లేస్ లో ఉన్న తన కార్ బ్యాక్ సీట్ కింద అమర్చిన ఇంటర్నెట్ సిగ్నల్ జాంమింగ్ డివైజ్ ఆన్ అయ్యింది... ఆ జామింగ్ డివైజ్ వెంటనే ఆ కార్ కి 150 మీటర్స్ రేడియస్ లో ఇంటర్నెట్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసింది... ఆ 150 మీటర్స్ రేడియస్ లో ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ బిల్డింగ్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ లో ఆప్టిక్ ఫైబర్ ఇంటర్నెట్ పూర్తిగా షట్ డౌన్ అయ్యింది... బిల్డింగ్ లో ఎంప్లాయిస్ అంతా హాస్పిటల్ ICU లో ఆక్సిజన్ సప్లై కట్ అయినప్పుడు పేషెంట్స్ ఎలా గిల గిల కొట్టుకుంటారో... అలా విలవిల్లాడారు... వాళ్లకి ఇంటర్నెట్ లేకపోతే ఒక్క నిమిషం కూడా పని జరగదు. ఓరియన్ గ్రూప్ కంపెనీ వాళ్ళు వెంటనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) కి ఫోన్ చేశారు... ISP తమ సిస్టం లో ఓరియన్ టవర్ ఇంటర్నెట్ సిగ్నల్ స్టేటస్ ని చెక్ చేశారు...  ఆ బిల్డింగ్ కి ఇంటర్నెట్ సిగ్నల్స్ వస్తున్నాయి... 1GB స్ట్రెంగ్త్... ISP ఇంజనీర్స్ కి అర్ధం కాలేదు... ISP ఆ సైబర్ హబ్ మొత్తం ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ తో కవర్ చేశారు... ఎటువంటి ఆటకం కలగకుండా ఇంటర్నెట్ పనిచేయాలి... బిల్డింగ్ లో  అమర్చిన ఇంటర్నెట్ జంక్షన్ బాక్స్ లో ఏదైనా పార్ట్ షార్ట్ అయ్యి పనిచెయ్యడం లేదేమోనని వెంటనే ఒక టీం ని పంపారు... వాళ్ళు ఓరియన్ టవర్ కి చేరుకోవడానికి 45 నిమిషాల టైం పట్టింది... గౌతమ్ మనసులో " 45 మినిట్స్ ..." అని అనుకున్నాడు... వాళ్ళు బిల్డింగ్ లోకి ప్రవేశించగానే... గౌతమ్ తన లాప్ టాప్ తో ఇంకో సిగ్నల్ పంపాడు... కార్ లోని సిగ్నల్ జామింగ్ మెషిన్ ఆఫ్ అయ్యింది. దాంతో ఓరియన్ టవర్ లో ఇంటర్నెట్ పని చెయ్యసాగింది... అది గమనించిన ISP టీం ఊపిరి తీసుకుంది... ఎందుకైనా మంచిదని వాళ్ళు ఆ బిల్డింగ్ లో అమర్చిన జంక్షన్ బాక్స్ ని చెక్ చేశారు... అంతా బాగానే పనిచేస్తోంది... ISP టీం వెళ్ళిపోయింది... గౌతమ్ ఒక 30 నిమిషాలు ఆగి ఇంకోసారి ఇంటర్నెట్ సిగ్నల్ జామింగ్ మెషిన్ ఆన్ చేసాడు... బిల్డింగ్ లో ఇంటర్నెట్ కట్ అయ్యింది...  మళ్ళీ ISP టీం వచ్చింది... ఈసారి 35 మినిట్స్ లో ఓరియన్ టవర్ కి చేరుకున్నారు... వాళ్ళు రాగానే గౌతమ్ జామింగ్ మెషిన్ ఆఫ్ చేసేసాడు...

ఆ రోజు ఉదయం నుండి మధ్యాన్నం రెండు గంటల దాకా గౌతమ్ ఇంటర్నెట్ సిగ్నల్ జామింగ్ మెషిన్ ని స్విచ్ ఆన్ / ఆఫ్ చేస్తూనే ఉన్నాడు... దాంతో ఓరియన్ గ్రూప్ కంపెనీ ఎంప్లాయిస్ బాగా విసిగిపోయారు... ఉదయం నుంచి ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడం తో పని కి బాగా అంతరాయం కలిగింది... ISP కి పరిస్థితి అర్ధంకాలేదు... ఓరియన్ టవర్ కి సిగ్నల్స్ వస్తున్నాయి...  సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్ గా వుంది. ... ఓరియన్ టవర్ లోపల ఎదో కారణంతో ఇంటర్నెట్ డిస్టర్బ్ అవుతోంది... ముందు జాగ్రత్త చర్యగా ISP  తన టీం ని ఓరియన్ టవర్ లో ప్రతి ఫ్లోర్ లోని మెయిన్ జంక్షన్ పాయింట్స్ అన్నింటిని జాగ్రత్తగా చెక్ చేయడానికి దాదాపు ఒక 40 మంది టెక్నిషియన్స్ ని పంపింది. గౌతమ్ సరిగ్గా ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు... వెంటనే తన లాప్ టాప్ ని క్లోజ్ చేసి బాగ్ లో పెట్టుకొని...బ్రేక్ ఫాస్ట్ బిల్ పే చేసి... కాఫీ షాప్ లోంచి బయటకి వచ్చి నేరుగా పార్కింగ్ లో పెట్టిన తన కారు దగ్గరకు వెళ్లి లాప్ టాప్ బాగ్ ని కార్ బూట్ లో పెట్టి... అందులోంచి ఒక బ్యాక్ ప్యాక్... టెక్నిషియన్స్ టూల్ కిట్ ని తీసుకొని నేరుగా ఓరియన్ టవర్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లోని పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి తలుపు వేసుకొని ముందుగా బ్యాక్ ప్యాక్ లోంచి ISP ఇంజనీర్స్ యూనిఫామ్ ని బయటకి తీసి టాయిలెట్ డోర్ హుక్ కి తగిలించాడు... ఆ తరువాత తన ఒంటి మీద ఉన్న బట్టలు... బూట్లు విప్పేసి... నీట్ గా మడత పెట్టి బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని ISP కంపెనీ ఇంజనీర్స్ వేసుకునే యూనిఫామ్ వేసుకొని టాయిలెట్ లోంచి బయటకి వచ్చి ఆ బ్యాక్ ప్యాక్ ని కార్ బూట్ లో పెట్టేసి.. ఒక ISP కంపెనీ వాళ్ళ కాప్ పెట్టుకొని...  టెక్నిషియన్ టూల్ కిట్ తీసుకొని నేరుగా ఓరియన్ టవర్ లోకి అడుగుపెట్టాడు.

ఓరియన్ టవర్ లాబీ చాలా బిజీ గా ఉంది . ISP కంపెనీ టెక్నిషియన్స్ చాలా మంది హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. కొంతమంది బేస్మెంట్ లో ఉన్న జంక్షన్ బాక్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు... కొంత మంది బిల్డింగ్ లోని ప్రతి ఫ్లోర్ కి వెళ్లి అక్కడి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ చెక్ చేస్తున్నారు... గౌతమ్ నేరుగా రిసెప్షన్ డెస్క్ దగ్గ్గరికి వెళ్లి అక్కడి ఎంప్లొయ్ తో  "నా పేరు కుమార్... నేను ISP కంపెనీ ఇంజనీర్... ఇంటర్నెట్ చెక్ చెయ్యడానికి వచ్చాను" అని అన్నాడు... ఉదయం నుంచి ISP టెక్నిషియన్స్ వచ్చిపోతూండడంతో రిసెప్షన్ లో ఎంప్లాయ్ గౌతమ్ ని పెద్దగా ప్రశ్నలు వేయకుండా... ఒక రిజిస్టర్ చూపించి... "ఇందులో పేరు... ఫోన్ నెంబర్ రాయి" అని అన్నది. గౌతమ్ రిజిస్టర్ లో పేరు వ్రాసి... ఫోన్ నెంబర్ వేసి... రిసెప్షనిస్ట్ ఇచ్చిన విజిటర్ యాక్సిస్ కార్డు తీసుకొని లాబీ లోని లిఫ్ట్ ఎక్కి నేరుగా 17వ అంతస్తుకి చేరుకున్నాడు... అక్కడ కంపెనీ ఎగ్జిక్యూటివ్ టీం ఆఫీస్ ఉంది... గౌతమ్ నేరుగా ఆ కంపెనీ CFO రాజీవ్ వర్మ కేబిన్ ముందున్న CFO సెక్రటరీ నటాషా దగ్గరికి వెళ్లి చాలా మర్యాదగా " మార్నింగ్ నుంచి మీ ఇంటర్నెట్ ట్రబుల్ ఇస్తోంది కదా... కొన్ని పాయింట్స్ ని రాండమ్ గా చెక్ చేస్తున్నాను... మీ కనెక్షన్ చెక్ చేయవచ్చా?" అని అడిగాడు... నటాషా సీట్ లోంచి లేచి టేబుల్ మీదున్న  కాఫీ మగ్ తీసుకొని "సరే... చెక్ చెయ్యండి" అని కాఫీ తెచ్చుకోవడానికి  కాంటీన్ కి వెళ్ళింది... గౌతమ్ వెంటనే నటాషా టేబుల్ కింద దూరి ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్ ని ఊడదీసి... తన ప్యాంటు జేబులోంచి ఒక చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్ తీసాడు... అది చూడటానికి ఒక చిన్న అగ్గిపెట్టె సైజ్ లో ఉంది... కానీ... అది చాలా పవర్ఫుల్ హాకింగ్ డివైజ్... ఆ డివైస్ కి డబల్ సైడెడ్ టేప్ ని అతికించి... దాన్ని ఆ ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్ బాక్స్ లో ఫిక్స్ చేసి... ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ కి కనెక్ట్ చేసి... క్లోజ్ చేసేసాడు... ఇంతలో నటాషా కాఫీ తీసుకొని వచ్చింది...గౌతమ్ ఆమెతో  " ఇక్కడ అంతా బానే ఉంది..." అంటూ రాజీవ్ వర్మ రూమ్ ని చూపిస్తూ " ఆ రూమ్ లో కూడా చెక్ చెయ్యమంటారా?" అని అడిగాడు... నటాషా వెంటనే "ఎస్... ఆ రూమ్ కూడా చెక్ చెయ్యండి... అది నా బాస్ రూమ్... ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నన్ను చంపేస్తాడు.." అని అన్నది...

గౌతమ్ వెంటనే రాజీవ్ వర్మ కేబిన్ లోకి వెళ్లి మెయిన్ పవర్ పాయింట్ ఓపెన్ చేసి నటాషా వర్క్ స్టేషన్ దగ్గర అమర్చిన హాకింగ్ డివైజ్ లాంటి దాన్నే అమర్చి బయటకి వచ్చేసాడు...  ఆ క్యాబిన్ బయట నటాషా తో ఓరియన్ గ్రూప్ CTO రోహిత్ గుప్త సెక్రటరీ ఆషా మాట్లాడుతోంది... ఆమె గౌతమ్ ని చూడగానే... "మా బాస్ కేబిన్ లో కూడా చెక్ చెయ్యి..." అంటూ తన తన బాస్ రోహిత్ గుప్త కేబిన్ ని చూపించింది... గౌతమ్ వెంటనే టైం వేస్ట్ చేయకుండా  CTO రోహిత్ గుప్త కేబిన్ లో కూడా హాకింగ్ డివైజ్ ఫిట్ చేసి బయటకి వచ్చి...  ఎందుకైనా మంచిదని CTO సెక్రటరీ ఆషా వర్క్ స్టేషన్ దగ్గర కూడా ఇంకో హాకింగ్ డివైజ్ ఫిట్ చేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బిల్డింగ్ లాబీ చేరుకొని రిసెప్షన్ డెస్క్ దగ్గర కి వెళ్లి విజిటింగ్ యాక్సిస్ కార్డు ని రిసెప్షన్ లో ఇచ్చేసి బిల్డింగ్ లోంచి బయటకు వచ్చి... రెండోసారి పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని... ISP యూనిఫామ్ తో పాటు టూల్ కిట్ కి కూడా కార్ బూట్ లో పెట్టేసి... అందులోంచి లాప్ టాప్ బాగ్ తీసుకొని తాను అమర్చిన హ్యాకింగ్ డివైస్ లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయడానికి ఓరియన్ గ్రూప్ కంపెనీ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లి లంచ్ ఆర్డర్ చేసి లాప్ టాప్ ని ఆన్ చేసి తాను సొంతంగా తయారు చేసుకున్న ఇంటర్నెట్ సిగ్నల్ హ్యాకింగ్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ రన్ చేసి... 17వ అంతస్తులో ఫిక్స్ చేసిన "JUICE JACKING " డివైజ్ లు యాక్టివేట్ చేసాడు... గౌతమ్ ఓరియన్ టవర్ లో అమర్చిన ఆ  4 డివైజ్ లు ఆన్ అయ్యాయి... ఆ డివైస్ ల ద్వారా ఓరియన్ గ్రూప్ CFO రాజీవ్ వర్మ లాప్ టాప్ ని హాక్ చేసాడు...

JUICE JACKING అంటే... "Juice jacking is a type of cyber stealing, where, once your mobile is connected tounknown / unverified charging ports, unknown apps / malware are installed withwhich, the fraudsters can control / access / steal sensitive data, email, SMS, savedpasswords" ఎలక్ట్రిక్ పవర్ పాయింట్ / ఛార్జింగ్ పోర్ట్  కి ఎవరైనా మొబైల్ ఫోన్... లేదా లాప్ టాప్... ని చార్జింగ్ చేయడానికి పెట్టినప్పుడు దాని ద్వారా మొబైల్ ఫోన్ / లాప్ టాప్ ని హాక్ చెయ్యడం కోసం MALWARE ని వాటిలో ఇన్స్టాల్ చేస్తారు... దీంతో ఆ మొబైల్ ఫోన్ / లాప్ టాప్ హకెర్ ఆధీనంలోకి వస్తాయి... గౌతమ్ 17వ అంతస్తులో అమర్చిన JUICE JACKING డివైజ్ ద్వారా MALWARE ని నటాషా... రాజీవ్ వర్మ మొబైల్ / లాప్ టాప్ లో ఇన్స్టాల్ చేసాడు. ఇప్పుడు రెండు మొబైల్ ఫోన్స్... రెండు లాప్ టాప్స్ గౌతమ్ ఆధీనంలోకి వచ్చాయి... గౌతమ్ వెంటనే రాజీవ్ వర్మ అఫీషియల్ ఇమెయిల్ అకౌంట్ ని చెక్ చేసాడు... ప్రతి సోమవారం... రాజీవ్ వర్మ సెక్రటరీ నటాషా ఇమెయిల్ నుంచి ఒక వీక్లీ ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ వస్తుంది... ఆ రోజు అది ఇంకా రాలేదు.

ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. BSE & NSE లో లిస్ట్ అయింది. దీనిని ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన లోక్ సభ MP నరసింహం 20 ఏళ్ళ క్రితం స్థాపించాడు. మొదట్లో చిన్న చిన్న సివిల్ కాంట్రాక్ట్స్... సబ్ కాంట్రాక్ట్స్ చేసేవాడు. లోక్ సభ కి ఎన్నికైన తరువాత చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ పెరగడంతో నెమ్మదిగా తన కంపెనీ కూడా పెద్దది అయ్యింది. ప్రస్తుతం ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ లో చాలా డివిషన్స్ ఉన్నాయి... ఇన్ఫ్రాస్ట్రక్చర్... కన్స్ట్రక్షన్... నార్త్ ఈస్ట్ లో పవర్ ప్రాజెక్ట్స్... మైనింగ్... రెన్యూవబుల్ ఎనర్జీ... ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్సప్లోరేషన్ ... కాపిటల్ మార్కెట్స్...  మనీ మార్కెట్స్...  ఇలా చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది. ఓరియన్ గ్రూప్ లో ప్రతి సోమవారం పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. వెండార్ పెమెంట్స్... కాంట్రాక్ట్ పెమెంట్స్... కాపిటల్ మార్కెట్స్ లో ఆ వారం కొనాల్సిన బాండ్స్... వందల కోట్ల లో ఫండ్ ట్రాన్స్ఫర్ కి కావాల్సిన రిక్వెస్ట్ ఫారం రాజీవ్ వర్మ దగ్గరికి వస్తుంది. ప్రతి సోమవారం ఆఫీస్ కి రాగానే నటాషా ఓరియన్ గ్రూప్ లోని అన్ని ఫైనాన్స్ డిపార్టుమెంట్స్  నుంచి వచ్చిన పేమెంట్ రిక్వెస్ట్ ఫార్మ్స్ అన్నింటిని కలిపి ఒక  కన్సాలిడేటెడ్ లిస్ట్ ని MS EXCEL ఫైల్ తయారు చేస్తుంది... ఆ MS EXCEL ఫైల్ లో పేమెంట్ పార్టీ పేరు... బ్యాంకు అకౌంట్ నెంబర్... బ్యాంకు నేమ్... స్విఫ్ట్ కోడ్... అమౌంట్... డీటెయిల్స్ ఉంటాయి. ఆ లిస్ట్ కి కావాల్సిన కవరింగ్ లెటర్ ప్రిపేర్ చేసి ఒక ఇమెయిల్ లో ప్రతి సోమవారం మధ్యాన్నం 12 గంటల లోపల గ్రూప్ CFO రాజీవ్ వర్మ  కి పంపిస్తుంది. ఆ ఇమెయిల్ కి రాజీవ్ వర్మ అప్రూవల్ ఇచ్చి దానిని బ్యాంకు కి ఫార్వర్డ్ చేస్తాడు. బ్యాంకు అదే రోజు ఫండ్స్ ని అన్ని పార్టీస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ... ఆ రోజు ఆఫీస్ లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడంతో అన్ని డిపార్టుమెంట్స్ నుంచి నటాషా కి కావాల్సిన డీటెయిల్స్ చాలా లేట్ గా వచ్చాయి... ఆమె ఆ లిస్ట్ ని ఫైనలైజ్ చేసి... MS EXCEL ఫైల్ ని ఇమెయిల్ ద్వారా  ఆ రోజు 4 గంటలకి పంపింది... గౌతమ్ ఆ ఇమెయిల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు... ఆ ఇమెయిల్ రాజీవ్ వర్మ inbox లోకి రాగానే దానికి అటాచ్ చేసిన MS EXCEL ఫైల్ ని edit mode లో ఓపెన్ చేసాడు. ఆ రోజు చాల పెద్ద ఎత్తున ఫండ్ ట్రాన్సఫర్ జరుగుతోంది. మొత్తం Rs. 780 కోట్ల విలువైన ఫండ్ ట్రాన్స్ఫర్....

గౌతమ్ ఆ ఇమెయిల్ కి అటాచ్ చేసిన MS EXCEL ఫైల్ లోని ప్రతి ఎంట్రీ ని చాలా జాగ్రత్తగా చెక్ చేసాడు... ఆ MS EXCEL షీట్ లో 98 ఎంట్రీస్ ఉన్నాయి... గౌతమ్ MS EXCEL ఫైల్ లో మూడు మార్పులు చేసాడు.

1. ఆ ఫైల్ లోని కొన్ని ఎంట్రీస్ ని EDIT చేసి బెనిఫిషియరీ పేరు... బ్యాంకు అకౌంట్ నెంబర్... స్విఫ్ట్ కోడ్ మార్చి వాటి స్థానంలో ముంబై లో తనకి బాగా తెలిసిన ఒక మనీ లాండరింగ్ ఏజెంట్ పేరు... అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్... స్విఫ్ట్ కోడ్ వేసి మొత్తం ₹200 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాడు...

2. ఇంకో రెండు ఎంట్రీస్ కి తన సవిత తమ్ముళ్లు ఇద్దరి ని బెనిఫిషియరీస్ గా మార్చి ఆ ఇద్దరికీ చెరో ₹25 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా మార్పులు చేసాడు...

3. చివరిగా ఒక ₹5 కోట్ల రూపాయలు కోనసీమకి చెందిన ఒక బెస్త పాలెం లోని డాక్టర్ బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసాడు.

ఆ రోజు గౌతమ్ అతి సులభంగా... ఎవరికి అనుమానం రాకుండా ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ నుంచి  ₹255 కోట్ల రూపాయలని దొంగిలించాడు...

ముంబై లోని మనీ లాండరింగ్ ఏజెంట్ కి పంపిన ₹200 కోట్లు తన అకౌంట్ లోకి రాగానే... ఆ ఏజెంట్  తన కమిషన్ ని మినహాయించుకుని మిగతా అమౌంట్ ని వెంటనే హవాలా మార్గం లో స్విట్జర్లాండ్ లోని ఒక బ్యాంకు కి EURO CURRENCY లో క్రెడిట్ అయ్యేలా చేస్తాడు. గౌతమ్ వచ్చిన పని అయ్యింది. రాజీవ్ వర్మ ఆ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇమెయిల్ ని బ్యాంకు కి పంపే దాకా వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం 4:45 నిమిషాలకు రాజీవ్ వర్మ తన సెక్రటరీ నటాషా పంపిన ఇమెయిల్ కి తన అప్రూవల్ ఇచ్చి ఆ మెయిల్ ని బ్యాంకు కి ఫార్వర్డ్ చేసాడు. గౌతమ్ ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి రాజీవ్ వర్మ ఇమెయిల్ OUTBOX లోకి వెళ్లి బ్యాంకు కి పంపిన ఇమెయిల్ ని ఓపెన్ చేసి దాని attachment ని ఓపెన్ చేసాడు. గౌతమ్ చేసిన మార్పులు ఆ ఫైల్ లో కనిపించాయి... గౌతమ్ తృప్తిగా తల పంకించి ఆ ఇమెయిల్ ని క్లోజ్ చేసాడు... సరిగ్గా అదే సమయంలో రాజీవ్ వర్మ ఇంకో ఇమెయిల్ పంపాడు... OUTBOX లోకి వచ్చిన ఆ ఇమెయిల్ ని గౌతమ్ పొరపాటున ఓపెన్ చేసాడు... అది ఒక పార్టీ ఇన్విటేషన్... రాబోయే శనివారం సాయంత్రం 7 గంటలకి రాజీవ్ వర్మ ఇంట్లో పార్టీ ఆరెంజ్ చేసాడు. ఆ మెసేజ్ కింద ఒక అందమైన గులాబీ పువ్వు ఫోటో ఉంది ... ఆ ఫోటో చూడగానే గౌతమ్ కి ఎదో అనుమానం వచ్చింది చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేసాడు... ఆ ఫోటో రెసొల్యూషన్ ఎందుకో డల్ గా ఉంది... గౌతమ్ తన లాప్ టాప్ స్క్రీన్ మీద కుడిచేతి బొటనవేలు... చూపుడు వేలు కలిపి పెట్టి ఆ గులాబీ పువ్వు ఫోటో ని పించ్ జూమ్ చేసాడు... గౌతమ్ గుండెలు దడ దడ కొట్టుకున్నాయి... మనసులో "STEGANOGRAPHY IMAGE... అంటే ఇమెయిల్ పార్టీ ఇన్విటేషన్ కాదు... IT IS SECRET MESSAGE " అనుకున్నాడు... రాజీవ్ వర్మ ఎవరికో సీక్రెట్ మెసేజ్ పంపిస్తున్నాడు... వెంటనే ఆ ఇమెయిల్ ఎవరికి వెళ్ళిందో చెక్ చేసాడు... ఆ ఇమెయిల్ ఒకే ఒక్కడికి వెళ్ళింది... debashishganguly@deltaanalyticalservices.com....

గౌతమ్ బుర్ర శర వేగంగా పనిచేసింది... తాను వచ్చిన పని ఎటువంటి ఆటంకం లేకుండా ప్లాన్ ప్రకారం పూర్తి అయ్యింది... ఈ హాకింగ్ వర్క్ ఇంతటితో ఆపేసి కామ్ గా వెళ్ళిపోతే మంచిది... అని అనుకున్నాడు... మళ్ళీ వెంటనే... ఆ సీక్రెట్ మెసేజ్ ఏమిటో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు... కాఫీ తాగుతూ ఆలోచించాడు. దాదాపు ఒక 30 నిమిషాల పాటు చాలా సీరియస్ గా లాప్ టాప్ లో ఒక చిన్న సాఫ్ట్ వేర్  ప్రోగ్రాం ని వ్రాసి... కంపైల్ చేసి... రన్ చేసాడు... అంతే... ఒక 20 నిమిషాల్లో రాజీవ్ వర్మ ఇమెయిల్ డేటాబేస్ మొత్తం తన లాప్ టాప్ లోకి REPLICATE అయ్యింది. లాప్ టాప్ ని క్లోజ్ చేసి రెస్టారంట్ లో బిల్ పే చేసి బయటకి వచ్చి బొంబాయి లో మనీ లాండరింగ్ ఏజెంట్ కి ఫోన్ చేసి "ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యింది..." అని చెప్పి ఆ ఫోన్ ని శాశ్వతం గా స్విచ్ ఆఫ్ చేసేసి... తన కార్ ఎక్కి సైబర్ హబ్ లోంచి బయటకి వచ్చి... తన అపార్టుమెంట్ కి వెళ్తూ... "ఆ సీక్రెట్ మెసేజ్ ఏమయ్యుంటుంది..." అని ఆలోచిస్తూ కార్ ని డ్రైవ్ చెయ్యసాగాడు...


PART - 2 - THE CODE

గౌతమ్ గురుగ్రామ్ లో గోల్ఫ్ కోర్స్ ఎక్సటెన్షన్ రోడ్ లోని తన అపార్టుమెంట్ కి చేరుకున్నాడు. నేరుగా తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి లాప్ టాప్ ని ఆన్ చేసి రాజీవ్ వర్మ ఆ రోజు దేబశీష్ గంగూలీ కి పంపించిన సీక్రెట్ మెసేజ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న గులాబీ పువ్వు ఫోటో ని తన కంప్యూటర్ లోని లోకల్ డ్రైవ్ లో సేవ్ చేసాడు. తరువాత తన దగ్గరున్న STEGANOGRAPHIC డికోడర్ సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసి గులాబీ పువ్వు ఫోటో ని లోడ్ చేసి రన్ చేసాడు... లాభం లేక పోయింది... ఆ ఫోటో లోని సీక్రెట్ ఫైల్ ని ఎన్క్రిప్షన్ అల్గోరిథం ని వాడి CYPHER TEXT ని తయారు చేసి... ఆ CYPHER TEXT ని STEGANOGRAPHIC ENCODER లోకి లోడ్ చేసి STEGANO OBJECT తయారుచేసి... ఆ STEGANO OBJECT ని ఇమెయిల్ కి అటాచ్ చేసి పంపాడు... ఇప్పుడు ఆ ఇమెయిల్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళ దగ్గర STEGANOGRAPHIC DECODER ఉంటుంది. ఆ వ్యక్తి ఈ STEGANO OBJECT ని ఆ DECODER లోకి లోడ్ చేస్తే... సీక్రెట్ మెసేజ్ డీకోడ్ అవుతుంది.

స్టెగనోగ్రఫీ గురించి తెలుసుకునే ముందు... క్రిప్టోగ్రఫీ అంటే ఏమిటో తెలుసుకోవాలి... ఏదైనా మెసేజ్ ని ఎవరికి అర్ధంకాకుండా పంపాలంటే... ఒక కోడ్ ని వాడి ENCRYPTED MESSAGE ని తయారు చేసి దానిని పంపిస్తారు. ఆ మెసేజ్ ఎవరికైతే అందుతుందో వాళ్ళు దగ్గర ENCRYPTED MESSAGE ని డీకోడ్ చెయ్యడానికి ఒక KEY ఉంటుంది. ఆ KEY ని వాడితే సీక్రెట్ మెసేజ్ తెలుస్తుంది. ఉదాహరణకి... ఇంగ్లీష్ లో "మనం వెంటనే గుడి లో కలవాలి" అన్న మెసేజ్ ని సీక్రెట్ గా పంపాలంటే... దానికి చాలా పద్ధతులు ఉన్నాయి... ఒక పద్దతి ఏమిటంటే... ఇంగ్లీష్ లో ఉన్న 26 అక్షరాలని రెండు సరి సమాన గ్రూపులుగా విభజించాలి ... దీనిని KEY అని అంటారు... ఈ KEY ని వాడి మెసేజ్ ని ENCRYPT చెయ్యడానికి... ENCRYPTED మెసేజీ ని DECRYPT చెయ్యడానికి వాడతారు.

A B C D E F G H I J K L M ---- ఈ 13 అక్షరాలు ఒక గ్రూప్ |

|KEY

Z Y X W V U T S R Q P O N ---- ఈ 13 అక్షరాలు రెండో గ్రూప్ |

ఇప్పుడు " మనం వెంటనే గుడి లో కలవాలి ( WE SHOULD MEET IMMEDIATELY AT TEMPLE)" అన్న మెసేజ్ ని పైన వివరించిన KEY ని వాడి సీక్రెట్ మెసేజ్ తయారుచెయ్యాలంటే... WE అన్న పదంలో W కి బదులుగా D అక్షరాన్ని... E అక్షరానికి బదులుగా V ని వాడితే WE అన్న పదానికి సీక్రెట్ కోడ్ DV అవుతుంది... అదేరకంగా SHOULD అన్నపదానికి సీక్రెట్ కోడ్ HSLFOW అవుతుంది... MEET అన్న పదానికి సీక్రెట్ కోడ్ NVVG అవుతుంది... IMMEDIATELY అన్న పదానికి సీక్రెట్ కోడ్ RNNVWRZGVOB అవుతుంది AT పదానికి ZG... TEMPLE అన్న పదానికి GVNKOV సీక్రెట్ కోడ్ వస్తుంది... ఇలా వ్రాయడాన్ని ENCRIPTION అంటారు. ఇప్పుడు ENCRIPTED MESSAGE ఇలా ఉంటుంది.

DV HSLFOW NVVG RNNVWRZGVOB ZG GVNKOV

ఈ మెసేజ్ ని ఎవరికైతే వెళ్తుందో... వాళ్ళు కూడా పైన వివరించిన KEY ని వాడి డీకోడ్ చేసే పద్దతిని DECRYPTION అంటారు... పైన వివరించిన కోడింగ్ విధానాన్ని SUBSTITUTION CYPHER అని పిలుస్తారు...

STEGANOGRAPHY... ఈ పదము గ్రీక్ భాష లోని STEGANOGRAPHIA అనే పదము నుండి వచ్చింది... గ్రీక్ భాషలో STEGANO అంటే... "COVERED or CONCEALED" అనగా "దాచిపెట్టడం" అని అర్ధం... GRAPHIA అనగా... "వ్రాయడం" అని అర్ధం... STEGANOGRAPHY అనే పదాన్ని తెలుగు భాషలోకి తర్జుమా చేస్తే... ఇంచు మించు... "ఎవరికి కనపడకుండా మెసేజెస్ ని సీక్రెట్ గా దాచడం" అని అర్ధం వస్తుంది. ప్రస్తుతం కంప్యూటర్ యుగం లో రకరకాల సాఫ్ట్ వేర్స్ వాడి STEGANOGRAPHIC ENCODER / DECODERS ని తయారుచేస్తున్నారు... ఈ సాఫ్ట్ వేర్ ని ఉపయోగించి ఏదైనా మెసేజ్ ని సీక్రెట్ గా ఒక IMAGE లో పొందుపరుస్తారు... దీనినే STEGANO IMAGE అని అంటారు... మామూలు IMAGE కి STEGANO IMAGE కి తేడా ఉంటుంది... ఉదాహరణకి iPHONE తో ఏదైనా 4K రెసొల్యూషన్ తో ఫోటో తీస్తే... ఆ ఫోటో ఇమేజ్ చాలా షార్ప్ గా క్లియర్ గా ఉంటుంది... అదే 4K రెసొల్యూషన్ ఇమేజ్ STEGANOGRAPHIC ఇంకోడేరులోకి లోడ్ చేసి... ఆ ఇమేజ్ లో ఏదైనా సీక్రెట్ మెసేజ్ ని పొదుపరిస్తే... ఆ 4K రెసొల్యూషన్ దెబ్బతింటుంది... కారణం... 4K అంటే... సాధారణంగా ప్రతి చదరపు అంగుళానికి దాదాపు 4000 పిక్సల్స్ ఉంటాయి... ఆ ఇమేజ్ లో సీక్రెట్ మెసేజ్ ని పొందుపరచిన వెంటనే ఆ ఇమేజ్ పిక్సల్స్ స్తానం లో మెసేజ్ ఆక్రమించడంతో 4K పిక్చర్ ఇమేజ్ కి ఉండే సహజసిద్ధమైన SHARPNESS దెబ్బతింటుంది... కానీ... ఈ విషయం STEGANOGRAPHY అంటే ఏమిటో తెలిసిన వాళ్లకి మాత్రమే అర్ధమవుతుంది...

రాజీవ్ వర్మ దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తో తయారైన STEGANOGRAPHIC ENCODER / DECODER ని వాడి మెసేజెస్ ని హై రెసొల్యూషన్ ఫొటోస్... ఇమేజెస్ లలో పొందుపరచి STEGANO IMAGE ని తయారు చేసి... దాన్ని ఇమెయిల్ ద్వారా పంపిస్తూ ఉంటాడు... గౌతమ్ దాదాపు 3 రోజుల పాటు రాజీవ్ వర్మ పంపిన సీక్రెట్ మెసేజ్ ని రకరకాల పద్ధతులు వాడి డీకోడ్ చెయ్యడానికి ట్రై చేసాడు... వీలు కాలేదు... రాజీవ్ వర్మ పంపిన మెస్సగెస్ ని డీకోడ్ చెయ్యాలంటే... ఆ ENCODER ... దానితో పాటు DECODER కూడా కావాలి. ఒకానొకప్పుడు గౌతమ్ ఎటువంటి మెసేజ్ అయినా సునాయాసంగా డీకోడ్ చేసేవాడు... ఆ రోజుల్లో తాను ఏ ఆర్గనైజేషన్ లో పని చేసాడో... అక్కడ రకరకాల అడ్వాన్సడ్ టెక్నాలజీ లభ్యం అయ్యేది. ఇప్పుడు ఆ టెక్నాలజీ గౌతమ్ దగ్గర లేదు. ఈ మెసేజెస్ ని డీకోడ్ చెయ్యాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది... రాజీవ్ వర్మ కంప్యూటర్ మొత్తాన్ని క్లోన్ చెయ్యాలి... అప్పుడే రాజీవ్ వర్మ లాప్ టాప్ లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్... అప్లికేషన్స్ దొరుకుతాయి.

మరుసటి రోజు ఉదయం మళ్ళీ సైబర్ హబ్ కి వెళ్ళాడు... ఈసారి STARBUCKS కాఫీ షాప్ లో కూర్చొని లాప్ టాప్ ని సెట్ చేసుకున్నాడు... అందులో తాను స్పెషల్ గా తయారు చేసుకున్న సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ని రన్ చేసాడు. ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ ఆఫీస్ లో ఫిక్స్ చేసిన JUICE JACKING డివైజ్ లు పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసాడు... అవి పని చేస్తున్నాయి... అప్పుడు సమయం ఉదయం 11 గంటలు ఆవుతోంది. రాజీవ్ వర్మ లాప్ టాప్ ఆన్ చేసి ఉంది... JUICE JACKING డివైస్ ద్వారా వెంటనే రాజీవ్ వర్మ లాప్ టాప్ ని హాక్ చేసి ఆ లాప్ టాప్ లోని ఒక్కో ప్రోగ్రామ్ చాలా జాగ్రత్తగా చెక్ చేయ్యసాగాడు. చివరికి తాను వెతుకుతున్న STEGANOGRAPHIC ENCODING & DECODING సాఫ్ట్ వేర్ అప్లికేషన్ దొరికింది. దానిని వెంటనే తన లాప్ టాప్ లోకి కాపీ చేసి ఇంస్టాల్ చేసి రన్ చేసి... అందులోకి ఒక మెసేజ్ ని... దానితో పాటే ఒక ఫోటో ని అప్లోడ్ చేసి... ENCRIPTION ALGORITHEM వాడి CYPHER TEXT తయారుచేసాడు... ఆ తరువాత CYPHER TEXT ని STEGANOGRAPHIC ENCODER లోకి లోడ్ చేసి STEGANO OBJECT ని తయారు చేసాడు. చివరిగా ఆ STEGANO OBJECT ని తన సొంత మెయిల్ ID కి ఇమెయిల్ చేసుకున్నాడు. సొంత ఇమెయిల్ ని ఓపెన్ చేసి INBOX లోకి వచ్చిన కొత్త మెయిల్ ని ఓపెన్ చేసాడు... అందులోని STEGANO OBJECT ని లోడ్ చేసి DECODE చేసాడు... అద్భుతం... పర్ఫెక్ట్ గా పనిచేసింది... వచ్చిన పని అయ్యింది. ఆలస్యం చెయ్యకుండా లాప్ టాప్ ని క్లోజ్ చేసి వెంటనే సైబర్ హబ్ నుండి బయలుదేరాడు...

ఇంటికి చేరగానే రాజీవ్ వర్మ... దేబశీష్ గంగూలీ కి పంపిన గులాబీ పువ్వు ఫోటో ని STEGANOGRAPHIC ENCODING & DECODING అప్లికేషన్ లోకి లోడ్ చేసి డీకోడ్ చేసాడు... ఆ ఫోటో లో దాగున్న సీక్రెట్ మెసేజ్ ఓపెన్ అయ్యింది... ఆ మెసేజ్ దాదాపు 10 పేజీల డాక్యుమెంట్... జాగ్రత్తగా దానిని చదివాడు... అందులో బొంబాయ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడింగ్ అవుతున్న పెద్ద పెద్ద కంపెనీస్ కి సంభందించిన INSIDE INFORMATION ఉంది... సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే 5 రోజుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు... ఆ నిర్ణయాల వల్ల పెద్ద పెద్ద కంపెనీల షేర్లు ఎలా ట్రేడ్ అవబోతున్నాయి... ఏయే షేర్స్ కొనాలి... ఏయే షేర్స్ ని అమ్మాలి... వచ్చిన డబ్బుని ఇల్లీగల్ గా ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో డిటైల్డ్ ఇంస్ట్రుక్షన్స్ ఉన్నాయి... చాల సీరియస్ మేటర్... ఇంకో ఇమెయిల్ ఓపెన్ చేసాడు... అందులో భారతదేశంలో ఒక అతి పెద్ద కంపెనీ కి సంబంధించిన బోర్డు మీటింగ్ వివరాలు ఉన్నాయి... ఇంకో ఇమెయిల్ లో డిఫెన్స్ మినిస్ట్రీ రాబోయే 3 నెలల్లో తీసుకోబోయే నిర్ణయాల గురించి డీటెయిల్స్ వున్నాయి... వేరే ఇమెయిల్ లో ఫైనాన్స్ మినిస్ట్రీ కి సంభందించిన సీక్రెట్స్... దొరికాయి...ఒక్కో ఇమెయిల్ లో ఒక్కో సీక్రెట్ బయటపడుతోంది. ఒక ఇమెయిల్ లో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఓరియన్ గ్రూప్ నడుపుతున్న పవర్ జనరేషన్ కంపెనీస్ ట్రక్స్ లో డ్రగ్స్ రవాణా వివరాలు... రకరకాల సీక్రెట్స్ బయటపడసాగాయి. రాజీవ్ వర్మ ప్రతి రోజూ ఒక ఇమెయిల్ ని దేబశీష్ గంగూలీ కి పంపిస్తాడు... అసలు ఈ దేబశీష్ గంగూలీ ఎవరో తెలుసుకోవడానికి గౌతమ ఇంటర్నెట్ లో deltaanalyticalservices.com వెబ్ సైట్ ని చెక్ చేసాడు. DELTA ANALYTICS అనేది ఒక ఫైనాన్సియల్ సర్వీసెస్... అనలిటిక్స్... కాపిటల్ మర్కెట్స్ రీసెర్చ్... ఇన్కమ్ టాక్స్ సర్వీసెస్... రకరకాల ఫైనాన్సియల్ సర్వీసెస్ బిజినెస్ చేస్తోంది... ఆ వెబ్ సైట్ లో పెద్దగా అనుమానకరమైన విషయాలు తెలియడం లేదు... ఎందుకైనా మంచిదని LINKEDIN వెబ్ సైట్ లో కి వెళ్ళి డెల్టా కంపెనీ గురించి వెతికాడు... దేబశీష్ గంగూలీ ఆ కంపెనీ కి చైర్మన్ & CEO... అని మాత్రమే వుంది... అంతకు మించి పెద్దగా డీటెయిల్స్ ఏమి లేవు. ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ తో పాటు వేరే చాలా పెద్ద పెద్ద కంపెనీలకు డేటా అనలిటిక్స్ సర్వీసెస్ ని అందిస్తుంది...

గౌతమ్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఫైల్ లో డీటెయిల్స్ మార్చిన తరువాత... రాజీవ్ వర్మ ఆ ఫైల్ ని బ్యాంకు కి పంపాడు... బ్యాంకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసింది... కొన్ని పార్టీస్ కి చేరాల్సిన ఫండ్స్ చేరలేదు. వాళ్ళు వెంటనే రాజీవ్ ని కాంటాక్ట్ చేశారు. రాజీవ్ బ్యాంకు కి పంపిన ఫైల్ చెక్ చెయ్యగా... అందులో Rs 255 కోట్లు వేరే బ్యాంకు అకౌంట్స్ లోకి వెళ్లనట్లు తెలిసింది. ముందుగా నటాషా ఇమెయిల్ SENT బాక్స్ లో ని ఇమెయిల్ కి జతపరిచిన ఫైల్ ని స్టడీ చేసాడు. అందులో డీటెయిల్స్ సరిగ్గానే ఉన్నాయి... రాజీవ్ బ్యాంకు కి పంపిన ఫైల్ లో ఎదో ప్రాబ్లెమ్ వచ్చింది. వెంటనే కంపెనీ CTO రోహిత్ గుప్త కి రిపోర్ట్ చేసాడు. రోహిత్ డిపార్టుమెంటు నుంచి ఒక టీం వచ్చి ఓరియన్ గ్రూప్ ఇమెయిల్ సర్వర్ ని పూర్తిగా చెక్ చేశారు... అది హాక్ కాలేదని నిర్ధారణ అయ్యింది... నటాషా ఇమెయిల్ పంపిన తరువాత దాన్ని రాజీవ్ తప్ప ఇంకెవరూ ఆ ఫైల్ ని తాకలేదని నిర్ధారణ అయింది. అప్పుడు సడన్ గా కంపెనీ CTO రోహిత్ గుప్త కి గుర్తుకొచ్చింది... ఏ రోజైతే కంపెనీ లో ఇంటర్నెట్ ప్రాబ్లెమ్ వచ్చిందో అదే రోజు ఫండ్స్ ట్రాన్స్ఫర్ లో ప్రాబ్లెమ్ వచ్చింది... డీప్ గా ఎంక్వయిరీ చెయ్యగా... నటాషా కి ISP కంపెనీ వ్యక్తి 17వ అంతస్తులోకి రావడం... రాండమ్ గా ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చెయ్యడం గుర్తుకొచ్చి ఆ విషయాన్ని CTO రోహిత్ గుప్త కి చెప్పింది... " ఆ రోజు వచ్చిన ISP కంపెనీ ఇంజనీర్స్ అందరూ జంక్షన్ బాక్స్ దగ్గర... సర్వర్ రూమ్ లోనే పనిచేశారు... 17వ అంతస్తులోకి ఎవరూ రాలేదు... ఇక్కడికి వచ్చింది ఎవరు? వాడు ఏమి చేసాడు? " అని అడిగాడు... నటాషా వివరంగా ఆ రోజు జరిగింది చెప్పింది... CTO రాజీవ్ గుప్త వెంటనే నటాషా సీట్ దగ్గర ఎలక్ట్రికల్ పవర్ పాయింట్ ని ఊడదీసాడు... అక్కడ దొరికిన వస్తువు ని చూడగానే " OH .... MY .... GOD " అని గట్టిగా అరిచాడు... ఆ తరువాత CTO రాజీవ్ గుప్త స్వయంగా రాజీవ్ రూమ్ లోని ఎలక్ట్రికల్ పవర్ పాయింట్ ని కూడా చెక్ చేసాడు... మళ్ళీ గట్టిగా OH MY GOD అని అరిచాడు... ఆ తరువాత తన రూంలో... తన సెక్రటరీ ఆషా సీట్ దగ్గర దొరికిన వస్తువులు చూడగానే... " CALL THE POLICE ... WE HAVE BEEN JUICE JACKED " అని అన్నాడు...

హర్యానా సైబర్ క్రైమ్ డిపార్టుమెంటు పోలీసులు వచ్చి జరిగింది తెలుసుకున్నారు... ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ వెనక చాలా పెద్ద మనుషులు ఉండడంతో ఎంక్వయిరీ చాలా చురుగ్గా జరిగింది. కంపెనీ లో ఇంటర్నెట్ డౌన్ అయినా రోజున 17వ అంతస్తు CCTV రికార్డింగ్ చెక్ చేశారు... గౌతమ్ రావడం... JUICE JACKING డివైజెస్ పెట్టడం.. వెళ్లడం కనిపించింది... కానీ... గౌతమ్ ఆ రోజు నెత్తిమీద ISP కంపెనీ కాప్ పెట్టుకొని కిందకి చూస్తూ నడవడంతో... CCTV రికార్డింగ్ లో అతని మొహం కనిపించలేదు... ఆఫీస్ లోకి వచ్చి వెళ్ళింది ఎవరో తెలియలేదు. డబ్బులు ఏయే అకౌంట్స్ లోకి వెళ్ళింది తెలిసింది. Rs 200 కోట్లు బొంబాయి లో ఒక మనీ లాండరింగ్ ఏజెంట్ అకౌంట్ కి వెళ్ళింది... హవాలా ట్రేడింగ్ చేసేవాళ్ళు తమ క్లయింట్ డీటెయిల్స్ ఎవరికి చెప్పరు... ఆ విషయం పోలీసులకి బాగా తెలుసు... కానీ... రాజీవ్ పొలిటికల్ ప్రెషర్ తేవడంతో... ఆ హవాలా ట్రేడర్ ఆ డబ్బులు స్విట్జర్లాండ్ లో ఏ బ్యాంకు లో ఏ అకౌంట్ కి ఆ డబ్బులు వెళ్ళాయో తెలియచేసాడు... కానీ... ఆ అకౌంట్ ఓనర్ పేరు తెలియలేదు... అది ఒక NUMBERED ACCOUNT కావడంతో పూర్తి డీటెయిల్స్ ని స్విస్ బ్యాంక్స్ ఇవ్వరు... స్విస్ బ్యాంక్స్ లో NUMBERED ACCOUNTS ని HIGH SECURITY ACCOUNTS అని కూడా పిలుస్తారు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం తమ బ్యాంకు కస్టమర్స్ డీటెయిల్స్ బయటవాళ్ళకి తెలియనీకుండా చాలా జాగ్రత్త వహిస్తారు... ఓరియన్ గ్రూప్ ఓనర్... లోక్ సభ MP నరసింహం ఇప్పుడు గవర్నమెంట్ అఫ్ ఇండియా ద్వారా స్విట్జర్లాండ్ నుంచి ఆ డబ్బులు వెనక్కి తెప్పించే పనిలో ఉన్నాడు... అయితే అందరికీ తెలుసు... స్విట్జర్లాండ్ కి డబ్బులు వెళ్లడమే కానీ... వెనక్కి రావని... అయినా మదిలో ఎదో చిన్న ఆశ... RS 50 కోట్లు రెండు మొత్తాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని రెండు వేరు వేరు బ్యాంకు అకౌంట్స్ లోకి వెళ్లడం గమనించి... ఆ అకౌంట్ హోల్డర్స్ మీద సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టారు. ఆ ఇద్దరినీ విచారించిన పోలీస్ ఆఫీసర్ మొదటి రోజే అర్ధమయింది... "వీళ్ళకి ఇంత పెద్ద క్రైమ్ చేసే సీన్ లేదు... ఇది వేరే ఎవరో చేసిన పని" అని తేల్చి పారేసాడు... మిగిలిన అయిదు కోట్ల రూపాయల విషయమే చాలా వింతగా ఉంది.

అయిదు కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కోస్తా జిల్లాలోని ఒక మోస్తరు టౌన్ లో ఒక చిన్న క్లినిక్ నడుపుతున్న డాక్టర్ బ్యాంకు అకౌంట్ కి పంపించడం జరిగింది. ఆ డబ్బులు ఆ డాక్టర్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో పడగానే... ఆయన వెంటనే ఆ అయిదు కోట్లని చిన్న చిన్న మొత్తాలుగా... అంటే ₹1,00,000 రూపాయలు చొప్పున 500 ట్రాన్సక్షన్స్ ద్వారా... అదే టౌన్ కి దగ్గరలో వున్న ఒక బెస్త పాలెం లోని 500 కుటుంబాలకి ఆన్ లైన్ లో పంపడం జరిగింది. ఏ రోజైతే ఆ డబ్బులు బెస్త వాళ్ళ అకౌంట్స్ లోకి వచ్చాయో... అదే రోజు రాత్రి 11:30 నిమిషాలకు ముందుగా ₹50,000 (డైలీ WITHDRAWAL అమౌంట్ లిమిట్) ATM లోంచి withdraw చేసేసారు... ఆ తరువాత ఇంకో 40 నిమిషాల వెయిట్ చేసి బ్యాంకింగ్ సిస్టం లో డేట్ మారగానే ఇంకో ₹50,000 WITHDRAW చేశారు... దాంతో ఆ రోజు వాళ్ళ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లోకి వచ్చిన ₹5 కోట్ల రూపాలు మొత్తం తమ అకౌంట్స్ లోంచి తీసేసారు... తరువాత పోలీసులు ఎంక్వయిరీ చేస్తే... వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు పెట్టేశామని చెప్పారు...ఆ అయిదు కోట్ల రూపాయలు ఏ డాక్టర్డ అకౌంట్ కి ట్రాన్సఫర్ అయ్యిందో... ఆ డాక్టర్ అదే రోజు రాత్రి ఆ వూరు విడిచి వెళ్ళిపోయాడు... ఆయన ఎక్కకడికి వెళ్ళాడో... ఏమయ్యాడో ఎవరికి తెలియదు... పోలీసులు ఏమి చెయ్యలేక వెనక్కి వచ్చేసారు...

అసలు జరిగింది ఏమిటంటే... గౌతమ్ ₹5 కోట్ల రూపాయలు డాక్టర్ కి పంపగానే... ఆయన ఆ డబ్బుని ఆన్ లైన్ ద్వారా బెస్త పాలెంలో ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున పంచేసాడు... ఆ బెస్త పాలం ప్రజలు ఆ డబ్బులు వెంటనే ATM నుంచి withdraw చేసి... ₹50,000 వాళ్ళు తీసుకొని... మిగతా ₹50,000 డాక్టర్ కి ఇచ్చేసారు... అంటే... ₹2,50,00,000 డాక్టర్ కి వెనక్కి వచ్చాయి... ఆ డాక్టర్ తన దగ్గర చాలా కాలంగా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్న ఇద్దరు కంపౌండర్స్ కి చెరి ₹25,00,000 చొప్పున ఇచ్చాడు. మిగిలిన రెండు కోట్ల రూపాయలు తీసుకొని అదే రోజు రాత్రి ఎవరికి చెప్పకుండా... ఎక్కడికో వెళ్ళిపోయాడు...

గౌతమ్ రెండు నెలల పాటు కష్టపడి రాజీవ్ వర్మ పంపిన అన్ని ఇమెయిల్స్ ని డీకోడ్ చేసాడు... గత 7 ఏళ్లుగా రాజీవ్ వర్మ... గంగూలీ మధ్య ఇమెయిల్స్ నడిచాయి... ఆ సీక్రెట్ మెసేజెస్ అన్నింటిని కేటగిరీస్ ప్రకారం ఫైల్స్ తయారు చేసాడు. 1. స్టాక్ మార్కెట్ అఫైర్స్... 2. ఫైనాన్స్ మినిస్ట్రీ... 3. డిఫెన్సె మినిస్ట్రీ... 4. పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్... 5. గవర్నమెంట్ అఫీషియల్ డాక్యూమెంట్స్... ఇంకా చాలా రకాల సీక్రెట్ డాక్యూమెంట్స్ కి సంభందించిన వివరాలు దొరికాయి. గౌతమ్ దీర్ఘంగా ఆలోచించాడు... ఇంకోసారి సైబర్ హబ్ కి వెళ్లి రాజీవ్ వర్మ మొబైల్ ఫోన్ ని క్లోన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

హర్యాన పోలీసులు చివరికి ఆ కేసు ని CBI అప్పగించారు... ఎంక్వయిరీ నడుస్తోంది... ఈ విషయాలు తెలియని గౌతమ్ ఒక రోజు సైబర్ హబ్ వెళ్ళాడు...


PART - 3 - THE SURVILLANCE

JUICE JACKING జరిగిన వెంటనే ఆ విషయం ఓరియన్ గ్రూప్ కంపెనీస్ ప్రమోటర్ & ఓనర్ నరసింహం కి తెలిసింది. ఒకేసారి రెండువందల యాభయ్ అయిదు కోట్ల రూపాయలు మాయం అయ్యాయని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. ఓరియన్ గ్రూప్ కి నరసింహం ఒక్కడే షేర్ హోల్డర్ కాదు... అది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అందులో చాలా మంది పలుకుబడి ఉన్న పెద్దమనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు... పోయింది చిన్న మొత్తం కాదు కాబట్టి అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. హవాలా ట్రేడర్ ఇచ్చిన డీటెయిల్స్ ని స్విట్జర్లాండ్ లో ఒక ఏజెంట్ కి పంపించారు. ఆ ఏజెంట్ తన పలుకుబడి ఉపయోగించి ఆ డబ్బులు ఏ బ్యాంకు అకౌంట్ లోకి వెళ్ళాయో తెలుసుకున్నాడు... ఆ బ్యాంకు పేరు EDMOND De ROTHSCHILD GROUP... ఈ బ్యాంకు ROTHSCHILD ఫ్యామిలీ కి చెందినది. ఈ ఫామిలీ పాతకాలపు విలువలకి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. స్విట్జర్లాండ్ లోని అన్ని బ్యాంకులు CLIENT CONFIDENTIALITY కి చాలా విలువ ఇస్తాయి. ఈ బ్యాంకు తమ కస్టమర్స్ కి ప్రత్యేకంగా NUMBERED ACCOUNT సౌకర్యాన్ని కలిపిస్తుంది... NUMBERED ACCOUNTS అంటే... ఆ అకౌంట్స్ కి ఒక వ్యక్తి లేదా... సంస్థ పేరు బదులుగా 24 అంకెల నెంబర్ కలిగివుంటుంది. ఒక్కోసారి కస్టమర్స్ తమకు ఇష్టమైన CODE WORD ని కూడా అకౌంట్ కి పెట్టుకుంటారు. ప్రస్తుతం ఓరియన్ గ్రూప్ నుంచి గౌతమ్ దొంగిలించిన ₹200 కోట్ల రూపాయలు EDMOND De ROTHSCHILD GROUP బ్యాంకు లో ఒక NUMBERED అకౌంట్ లో EURO CURRENCY లో ఉన్నాయి. నరసింహం ఏజెంట్ ప్రస్తుతం ఆ బ్యాంకు లో పనిచేసే ఒక ఎంప్లాయ్ ని లంచం ఇచ్చి ఆ అకౌంట్ ఓనర్ డీటెయిల్స్ కనుక్కునే పనిలో ఆ ఏజెంట్ నిమగ్నమయ్యాడు... గౌతమ్ సవతి కొడుకుల బ్యాంకు అకౌంట్స్ లో క్రెడిట్ అయిన యాభై కోట్లు వెనక్కి లాక్కున్నాడు... వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు బుక్ చేసి లాక్ అప్ లో పెట్టారు. కోర్ట్ వాళ్లకి మూడు వారాల జ్యూడిషియల్ కస్టడీ ఇచ్చింది. బెస్త వాళ్ళ కి చేరిన రెండుకోట్ల రూపాయలకి నరసింహం తిలోదకాలు ఇచ్చేసాడు... దానికి చాలా పెద్ద కారణం ఉంది... ఆ బెస్త పాలం తన లోక్ సభ నియోజకవర్గం లోకి వస్తుంది. ఆ బెస్త పాలెం లో దాదాపు 1500 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కోట్ల కోసం వాళ్ళని బెదిరిస్తే... ఆ బెస్త వాళ్ళు ఈ జన్మ లో నరసింహానికి ఓటు వెయ్యరు.

హర్యానా సైబర్ సెల్ పోలీసులు చేసిన ఎంక్వయిరీ లో చాలా విషయాలు తెలిసాయి. 17వ అంతస్తులో దొరికిన సీసీటీవీ రికార్డింగ్ లో గౌతమ్ ISP కంపెనీ యూనిఫామ్ వేసుకొని... తల మీద కంపెనీ క్యాప్ పెట్టుకోవడం తో సీసీటీవీ కెమెరా కి గౌతమ్ మొహం సరిగ్గా రికార్డు అవ్వలేదు. 17వ అంతస్తు లో లిఫ్ట్ ఎక్కడం... గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న లాబీ కి చేరుకొని విజిటర్ యాక్సిస్ కార్డు ని రిసెప్షన్ లో ఇవ్వడం... బిల్డింగ్ లోంచి బయటకు వెళ్లడం కనిపించింది. బిల్డింగ్ బయట సెక్యూరిటీ కెమెరాలలో గౌతమ్ పబ్లిక్ టాయిలెట్ వైపు వెళ్లడం కనిపించింది... అయితే ఆరోజున టాయిలెట్స్ వున్నా ఏరియా లో సెక్యూరిటీ కెమెరాలు ఎందుకో పనిచేయలేదు... దాంతో... గౌతమ్ పబ్లిక్ టాయిలెట్ లోకి వెళ్లడం... డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకి వచ్చి బ్యాక్ ప్యాక్ ని ... టూల్ కిట్ ని కార్ బూట్ లో పెట్టడం ఎక్కడా రికార్డు కాలేదు.

JUICE JACKING చేసిన మరుసటి రోజు... గౌతమ్ తన కారు ని గురుగ్రామ్ నుంచి ఫరీదాబాద్ వెళ్లే పహాడీ రోడ్ లోని అడవిలో ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ లో కొన్ని కెమికల్స్ కలిపి కార్ మీద పోసి తగలపెట్టేసాడు... ఆ కార్ తో పాటు అందులోవున్న ఇంటర్నెట్ సిగ్నల్ జామింగ్ ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా కాలి నాశనమయ్యింది. ఇప్పుడు గౌతమ్ ఓరియన్ గ్రూప్ CFO రాజీవ్ వర్మ మొబైల్ ఫోన్ ని హాక్ చెయ్యడానికి సైబర్ హబ్ కి ఓలా టాక్సీ లో వెళ్ళాడు. సైబర్ హబ్ బయట దిగిపోయి తన లాప్ టాప్ ని పట్టుకొని సెక్యూరిటీ చెకింగ్ పూర్తిచేసుకొని సైబర్ హబ్ లోకి అడుగు పెట్టి ఓరియన్ గ్రూప్ బిల్డింగ్ వైపు అడుగులు వేసాడు... అక్కడ... ఓరియన్ టవర్ బిల్డింగ్ దగ్గర సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలా కాస్తోంది... వాళ్ళ చేతుల్లో పవర్ఫుల్ అస్సాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి... ఓరియన్ గ్రూప్ బిలింగ్ లో వెళ్లే ప్రతి ఒక్కరిని ఆపి చెక్ చేస్తున్నారు. ఆ హడావిడి చూడగానే గౌతమ్ కి అర్ధమయ్యింది. మనసులో నవ్వుకుంటూ 'ఆల్రైట్... పోలీసులకి JUICE JACKING గురించి తెలిసిపోయిందన్నమాట...' అని అనుకుంటూ ఆ బిల్డింగ్ దగ్గర ఆగకుండా ముందుకు వెళ్ళాడు... ఆ బిల్డింగ్ కి దగ్గరలోని ఒక కాఫీ షాప్ లో కూర్చొని ఆలోచించాడు... బయట చాలా సెక్యూరిటీ వుంది. ఇప్పుడు బిల్డింగ్ లో కి వెళ్లడం చాల కష్టం.

JUICE JACKING డివైజ్ లు దొరకగానే ఓరియన్ గ్రూప్ CTO రాజీవ్ గుప్త ఆ డివైజుల్లో ఒక మైక్రోచిప్ ని ఇన్స్టాల్ చేసి ఆ నాలుగు JUICE JACKING డివైజులు అలాగే వొదిలేసాడు... ఒకవేళ ఆ డబ్బులు దొంగతనం చేసినవాడు ఇంకో సారి ఈ JUICE JACKING డివైజులని ఆన్ చేస్తే... వెంటనే వాటిలో ఇన్స్టాల్ చేసిన మైక్రోచిప్ ఒక HOMING డివైస్ లాగా పనిచేసి... ఆ వ్యక్తి కి సంభందించిన GEOLOCATION COORDINATES ని డిటెక్ట్ చేస్తుంది... దాంతో ఓరియన్ గ్రూప్ లో ఫండ్స్ దొంగతనం చేసినవాళ్లు కంప్యూటర్ IP అడ్రస్ దొరుకుతుంది... ఎవరికి అనుమానం రాకుండా రాజీవ్ వర్మ ఫోన్ ని హాక్ చేసే మార్గం ఏమిటీ? గౌతమ్ చాలా సేపు ఆలోచించాడు... ఒక ఐడియా వచ్చింది... కొంచం రిస్క్ తో కూడిన పని... రాజీవ్ ఇమెయిల్స్ చెక్ చేసినప్పుడు ఒక విషయం తెలిసింది... ఓరియన్ గ్రూప్ నార్త్ ఈస్ట్ లో తమ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్సప్లోరేషన్ కంపెనీ పని కోసం జపాన్ నుంచి ఒక కొత్త ఎక్విప్మెంట్ ని ఇంపోర్ట్ చేసుకుంటోంది... ఈ విషయం మీద రాజీవ్ వర్మ రెగ్యులర్ గా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా... కన్నాట్ ప్లేస్ బ్రాంచ్ లో పనిచేసే పళణివేలు అనే సీనియర్ మేనేజర్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు.

గౌతమ్ వెంటనే సైబర్ హబ్ లోని ఆపిల్ మొబైల్ షాప్ కి వెళ్లి కొత్త ఐఫోన్ కొనుక్కున్నాడు... దానికి ఒక కొత్త SIM కార్డు వేసి ఆక్టివేట్ చేయించుకున్నాడు. కొత్త నెంబర్ ఆక్టివేట్ కావడానికి 45 మినిట్స్ పడుతుంది. గౌతమ్ వెంటనే గురుగావ్ సైబర్ హబ్ నుంచి ఓలా టాక్సీ లో న్యూ ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ బయలుదేరాడు... దారిలో తన లాప్ టాప్ కి కొత్తగా కొన్న ఐఫోన్ ని కనెక్ట్ చేసి అందులో ఒక MALWARE APP ని ఇంస్టాల్ చేసాడు... ఇప్పుడు ఆ అప్లికేషన్ ని ఆన్ చేసి... దాని ద్వారా ఎవరికైన ఫోన్ చేసి మాట్లాడితే... ఆ MALWARE APP అవతలి వాళ్ళ మొబైల్ హ్యాండ్ సెట్ లో 60 సెకండ్స్ లోపు ఇన్స్టాల్ అవ్వడమే కాకుండా అవతలి వ్యక్తి ఫోన్ హాక్ అవుతుంది. గౌతమ్ కన్నాట్ ప్లేస్ చేరుకొని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మెయిన్ ఆఫీస్ కి వెళ్లి రిసెప్షన్ లో "పళణివేలు ని కలవాలి" అని అన్నాడు... వాళ్ళు గౌతమ్ ని 6వ అంతస్తుకి దారి చూపారు... గౌతమ్ లిఫ్ట్ లో 6వ ఫ్లోర్ కి చేరుకొని పళణివేలు కోసం వెతికాడు... అక్కడ డైలీ బ్యాంకు కి వచ్చే కస్టమర్స్ తో బిజీగా ఉంది... పళణివేలు మూల ఒక కేబిన్ లో కూర్చొని ఫోన్ లో మాట్లాడుతున్నాడు. గౌతమ్ జాగ్రత్తగా పళణివేలు కేబిన్ బయట చెక్ చేసాడు. అక్కడ ఒక టేబుల్ మీద "ప్రమోద్ గుప్త - ఇండస్ట్రియల్ క్రెడిట్ మేనేజర్" అన్న బోర్డు కనిపిచింది. ఆ టేబుల్ మీద ఎటువంటి ఫైల్స్... డాకుమెంట్స్ లేవు. ఖాళీగా... చాలా నీట్ గా ఉంది. ఆ టేబుల్ కి పక్క సీట్లో కూర్చొని బిజీ గా పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి చాలా మర్యాదగా పలకరించి "ప్రమోద్ గుప్త గారు ఇవాళ ఆఫీస్ కి రాలేదా?" అని అడిగాడు. దానికి బదులుగా ఆ వ్యక్తి "ప్రమోద్ గుప్త 15 రోజుల లీవ్ తీసుకొని ఫ్యామిలీ తో సిమ్లా వెళ్ళాడు" అని చెప్పాడు... గౌతమ్ వెంటనే అంతకు ముందు కొన్న కొత్త మొబైల్ ఫోన్ లోని MALWARE APP ఆన్ చేసి దాని నుంచి రాజీవ్ వర్మ మొబైల్ కి ఫోన్ చేసి "గుడ్ మార్నింగ్ సర్... నా పేరు ప్రమోద్ గుప్త... నేను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఇండస్ట్రియల్ క్రెడిట్ మేనేజర్ ని... పళణివేలు గారు జపాన్ కన్సైన్మెంట్ గురించి మాట్లాడడానికి మిమ్మల్ని మా ఆఫీస్ కి రమ్మని చెప్పమన్నారు... కొంచం కాన్ఫిడెన్షియల్ మేటర్ అని చెప్పమన్నారు... మీరు ఇవ్వాళ 3 గంటలకి మా ఆఫీస్ కి రాగలరా?" అని అన్నాడు... దానికి బదులుగా రాజీవ్ వర్మ " తప్పకుండా వస్తాను" అని అన్నాడు.... ఈ లోపల గౌతమ్ ఫోన్ నుంచి MALWARE APP రాజీవ్ మొబైల్ ఫోన్ లో ఇంస్టాల్ అయ్యి ఆక్టివేట్ అయింది... గౌతమ్ వెంటనే తన కొత్త మొబైల్ ఫోన్ లోకి ... రాజీవ్ వర్మ మొబైల్ ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్.... మెసేజెస్.... వాట్సాప్ మెసేజెస్ డేటాబేస్ మొత్తాన్ని కాపీ చేసుకొని... కొత్త SIM కార్డు ని మొబైల్ ఫోన్ లోంచి తీసేసి నాశనం చేసి డస్ట్ బిన్ లో పడేసి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బిల్డింగ్ లోంచి బయటకి వచ్చేసి టాక్సీ ఎక్కి నేరుగా గురుగ్రామ్ బయలుదేరాడు...

సరిగ్గా అదే సమయంలో రాజీవ్ వర్మ కి అనుమానం వచ్చింది... పళణివేలు ఏదైనా అర్జెంటు పనివుంటే తనకి వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు... ఇలా తన కింద పనిచేసే వాళ్ళతో ఫోన్ చేయించడు... వెంటనే పళణివేలు కి ఫోన్ చేసాడు... ఆయన ఫోన్ బిజీ గా ఉంది... రీడైల్ చేసి ట్రై చేస్తూనే ఉన్నాడు... అవతల పళణివేలు ఫోన్ లో మాట్లాడడం అయిపోగానే రింగ్ అయింది... "మీ ఆఫీస్ లో పనిచేసే ప్రమోద్ గుప్త నాకు ఫోన్ చేసి నన్ను మీ ఆఫీస్ కి ఇవ్వాళ 3 గంటలకి రమ్మని చెప్పాడు... నాకు ఫోన్ చెయ్యమని మీరు ప్రమోద్ గుప్త కి చెప్పారా?" అని అడిగాడు... పళణివేలు అయోమయంగా ... "మిమ్మల్ని నేను ఎప్పుడైనా ఆఫీస్ కి రమ్మని పిలిచానా?? మీరు మా ఆఫీస్ కి రావాల్సిన అవసరం ఏముంది? ... పైగా మా ప్రమోద్ 15 రోజుల లీవ్ తీసుకొని ఫ్యామిలీతో సిమ్లా వెళ్ళాడు..." రాజీవ్ వెంటనే ఫోన్ కట్ చేసి కంపెనీ CTO రాజీవ్ గుప్త దగ్గరకి పరిగెత్తుకుని వెళ్లి "నాకు ఎదో డౌట్ గా ఉంది... నా ఫోన్ ని చెక్ చెయ్యి..." అని జరిగింది చెప్పాడు... CTO రాజీవ్ గుప్త వెంటనే రాజీవ్ వర్మ ఫోన్ లో డయాగ్నోస్టిక్స్ రన్ చేసి చెక్ చేసాడు... రాజీవ్ మొబైల్ హ్యాండ్ సెట్ లో రిమోట్ గా ఇంస్టాల్ అయిన MALWARE APP దొరికింది. "నీ ఫోన్ రిమోట్ గా హాక్ అయింది.." అంటూ ఆ మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసాడు... ఇద్దరికి వెన్నుపూస వొణికింది... వెంటనే హర్యానా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చారు.

గౌతమ్ దారిలో రాజీవ్ వర్మ మొబైల్ ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్... మెసేజెస్... వాట్సాప్ డేటా బేస్ ని తన లాప్ టాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసాడు.. ఇంటికి చేరిన వెంటనే లాప్ టాప్ లో డేటా ని ఒకసారి చెక్ చేసుకొని తృప్తి చెంది... కొత్త గా కొన్నఆపిల్ ఐఫోన్ ని సుత్తి తో ముక్కలు ముక్కలు కొట్టి ఆ ముక్కల్ని జాగ్రత్తగా ఒక జిప్ లాక్ బాగ్ లో భద్రంగా దాచాడు... ముందుగా రాజీవ్ వాట్సాప్ మెసేజెస్ జాగ్రత్తగా చెక్ చేసాడు... మొత్తం మెసేజెస్ చదవి అర్ధం చేసుకోవడానికి 4 రోజులు పట్టింది... రాజీవ్ వర్మ సామాన్యమైన వ్యక్తి కాదని తెలిసింది... రాజీవ్ వర్మ వాట్సప్ డేటా బేస్ లో చాలా పేర్లు దొరికాయి... ముఖ్యం గా గంగూలీ తో డైలీ చాలా చాటింగ్ చేస్తాడు. చాలా వరకు కోడ్ వర్డ్స్... అక్రోనీమ్స్ వాడతారు. అవి అన్ని బ్రేక్ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది... అయితే ఒక చాట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా... చాలా విచిత్రం గా ఉంది... మొత్తం హిందీ లోనే వుంది... చాలా వరకు "ఆజ్ ఆయా.", "అభి గయా", "ఆజ్ ఆయా", "అభి తక్ నహి గయా" అన్న పదాలు కనిపించాయి... గౌతమ్ కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఆ చాట్ చేసిన వ్యక్తి పేరు ప్రవీణ్ కుమార్. ఆ చాట్ లోని Display Picture మీద క్లిక్ చేసాడు... ప్రవీణ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ప్రవీణ్ ఎవరో తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు... గౌతమ్ ఇంకోసారి తన MALWARE APP ని ఆన్ చేసి దాని ద్వారా ప్రవీణ్ కి ఫోన్ చేసాడు...

గౌతమ్ : హలో... ఎవరు మాట్లాడుతున్నారు?

ప్రవీణ్ : మీకు ఎవరితో మాట్లాడాలి?

గౌతమ్ : నేను ICICI బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను... మీకు ఏదైనా లోన్ అవసరం ఉన్నదా?

ప్రవీణ్: మీరు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు?

గౌతమ్ : పర్సనల్ లోన్స్ 12%, హోమ్ లోన్స్ 10.5%, వెహికల్ లోన్స్ కి 11%... మీరు ₹15,00,000 కి మించి లోన్ తీసుకుంటే... మేము 2% ఇంట్రెస్ట్ ని తగ్గిస్తాము... పైగా ప్రాసెసింగ్ చార్జెస్ కూడా తీసుకోము... మీకు లోన్ అమౌంట్ ని 5 రోజుల్లోపల మీ బ్యాంకు అకౌంట్ లో క్రెడిట్ అయ్యేలా చేయగలము... 5 నుంచి 15 సంవత్సరాల వరకు లోన్ ఇస్తాము...

ప్రవీణ్: నాకు వద్దు...

ప్రవీణ్ ఫోన్ పెట్టేసాడు. చాలు... ఆ సమయం లో ప్రవీణ్ ఫోన్ లో MALWARE డౌన్ లోడ్ అవ్వడమేకాకుండా ఆ ఫోన్ ఇప్పుడు గౌతమ్ ఆధీనంలోకి వచ్చేసింది. గౌతమ్ ఇప్పుడు ప్రవీణ్ ఫోన్ CURRENT LOCATION ని ట్రాక్ చేసాడు... ఆ ఫోన్ గురుగ్రామ్ లోని సెక్టార్ 56 లోని షాపింగ్ సెంటర్ లో ఆక్టివ్ గా కనిపిచింది. గౌతమ్ వెంటనే ఆటో ఎక్కి సెక్టార్ 56 షాపింగ్ సెంటర్ కి వెళ్ళాడు... ఆ షాపింగ్ సెంటర్ చాలా చిన్నది. మొత్తం కలిపితే 60 షాప్స్ కి మించి ఉండవు. చాలా మిడిల్ క్లాస్ షాప్స్. పచారీ షాప్స్, మెడికల్ షాప్స్, బట్టల కొట్లు, ఫాన్సీ ఐటమ్స్ షాప్స్, టాయ్ స్టోర్స్... చిన్న సైజు రెస్టారెంట్స్... చిన్న చిన్న వెజిటబుల్... ఫ్రూప్ట్స్ షాప్స్... పాలు... పన్నీర్... అమ్మే దుకాణాలు... కనిపించాయి. ఈ దుకాణాలు అన్ని దాటుకుంటూ వెళ్లగా కొంచం దూరం లో... ఆ షాపింగ్ సెంటర్ కి చివర్లో ఒక షాప్ ఉంది... ఆ షాప్ ముందున్న బోర్డు మీద "ప్రవీణ్ న్యూ ఏజెంట్స్ & ఓల్డ్ బుక్స్ షాప్" అని వ్రాసి వుంది. ఆ బోర్డు పక్కనే ఇంకో బోర్డు కూడా వుంది. దాని మీద... ఓల్డ్ బుక్స్ BUYING RATE ... మ్యాగజైన్స్... చిల్డ్రన్ బుక్స్... RS . 1/-, స్కూల్ బుక్స్ RS. 2/- నొవెల్స్, కాలేజీ బుక్స్, OTHER BOOKS RS. 5/-... ఓల్డ్ బుక్స్ SELLING RATE... మ్యాగజైన్స్... చిల్డ్రన్ బుక్స్... RS . 2/-, స్కూల్ బుక్స్ RS. 5/- నొవెల్స్, కాలేజీ బుక్స్, OTHER BOOKS RS. 10/-... గౌతమ్ ఆ షాప్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు... అప్పుడు సాయంత్రం 5 గంటలు అవ్వడంతో... ఆ షాప్ లో ఎక్కువగా స్కూల్ కిడ్స్ కామిక్స్ కొనుక్కోవడానికి వచ్చారు... చాలా కోలాహలం గా ఉంది... "అంటే వీడు పాత పుస్తకాలు తక్కువ రేట్ కి కొని... కొంచం లాభం వేసుకొని అమ్ముతాడు... వీడి ఫోన్ నెంబర్ రాజీవ్ వర్మ దగ్గర ఎందుకుంది? "అని మనసులో అనుకున్నాడు...

గౌతమ్ ఆ బుక్ షాప్ దగ్గలోని ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతూ ఆ షాప్ వైపు చూస్తూ వాట్సాప్ లో ప్రవీణ్ మొబైల్ ఫోన్ లోని చాట్ హిస్టరీ ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు... "ఆజ్ ఆయా"... "అభి గయా"... "ఆజ్ ఆయా"... "అభి తక్ నహి గయా"... గౌతమ్ బుర్ర శరవేగంతో ఆలోచించసాగింది... "ఇవ్వాళ వచ్చింది"... "ఇప్పుడే వెళ్ళింది"... "ఇప్పుడే వచ్చింది"... "ఇంకా వెళ్ళలేదు".... 'వీటి అర్ధం ఏమిటీ? వీడి దగ్గరకి ఏమి వచ్చింది... ఏమి వెళ్ళింది...' గౌతమ్ చాలా లాజికల్ గా ఆలోచించసాగాడు... వీడి దగ్గరకి వచ్చేది... వెళ్ళేది ఏమిటీ? బుక్స్...

గౌతమ్ పెదాలమీద సన్నటి చిరునవ్వు వెలసింది... రాజీవ్ వర్మ ఒక పెద్ద కంపెనీ కి CHIEF FINANCE OFFICER... రెగ్యులర్ గా STEGANO MESSAGES పంపిస్తూ ఉంటాడు... రాజీవ్ కి ఆ మెసేజెస్ ఎక్కడనుండి వస్తున్నాయి? ఈ బుక్ షాప్ కి రాజీవ్ కి ఉన్న కనెక్షన్ నెమ్మదిగా అర్ధమవ్వసాగింది... టీ తాగడం పూర్తి చేసి నెమ్మదిగా ఆ బుక్ షాప్ కి చుట్టూ పరికించాడు... ఒక 50 మీటర్స్ దూరం లో ఊడలు దిగిన ఒక పెద్ద రావి చెట్టు కనిపిచింది... ఆ చెట్టు సరిగ్గా ప్రవీణ్ బుక్ షాప్ కి ఎదురుగా ఉంది... దాని చూడగానే గౌతమ్ కి ఒక ఐడియా తట్టింది... దాన్ని అమలు చెయ్యాలని నిర్ణయించుకొని ఇంటికి బయలుదేరాడు. . ఆ రోజు రాత్రి... రెండు గంటల ప్రాంతం లో గౌతమ్ మోటార్ బైక్ మీద ప్రవీణ్ బుక్ షాప్ చేరుకున్నాడు... మోటార్ సైకిల్ ని దిగి హెల్మెట్ ని బైక్ మీద పెట్టి చుట్టూ చాలా జాగ్రతగా చూసాడు. ఎవరూ లేరు... పైగా నవంబర్ నెల కావడం తో అర్ధరాత్రి బాగా చల్లగా ఉంది. కొంచం FOG కూడా ఉండడం తో సెక్టార్ 56 షాపింగ్ సెంటర్ ఖాళీగా ఉంది. గౌతమ్ పూర్తిగా బ్లాక్ డ్రెస్ వేసుకొని నెత్తికి బ్లాక్ కలర్ BALACLAVA మాస్క్ ని ఒక్క కళ్ళు తప్ప మొహమంతా కవర్ అయ్యేలా పెట్టుకున్నాడు... భుజానికి బ్యాక్ ప్యాక్ ఉంది. అటూ ఇటూ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ నేరుగా ప్రవీణ్ బుక్ షాప్ కి ఎదురుగా ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టుని అవలీలగా ఎక్కాడు... ఒక కొమ్మ మీద కూర్చొని... బ్యాక్ ప్యాక్ లోంచి ఒక కెమెరా ని బయటకి తీసాడు... దాన్ని ఎవరికి కనపడకుండా... కొమ్మలు... ఆకులు అడ్డం రాకుండా ఉండేలా ఆ రావి చెట్టుకి గట్టిగా కట్టి అమర్చి... ఆ కెమెరాని ఆన్ చేసి చెట్టు దిగి కిందికి వచ్చి బ్యాక్ ప్యాక్ లోంచి iPAD బయటకి తీసి దాని ద్వారా ఆ కెమెరాని డైరెక్ట్ గా ప్రవీణ్ బుక్ షాప్ మీద ఫోకస్ అయ్యేలా ADJUST చేసి సెట్ చేసాడు. ఇప్పుడు ఆ కెమెరా ఆ క్షణం నుంచి 15 రోజుల పాటు ప్రవీణ్ షాప్ కి వచ్చే పోయే వాళ్ళ కదలికల్ని రికార్డు చేస్తుంది. ఆ కెమెరా బ్యాటరీ 15 రోజుల దాకా ఛార్జ్ చెయ్యకుండా పనిచేస్తుంది. ఈ 15 రోజుల్లో " ఆజ్ ఆయా"... "అభి గయా"... "ఆజ్ ఆయా"... "అభి తక్ నహి గయా"... అన్న పదాలకి అర్ధం తెలుస్తుంది... గౌతమ్ తలకి హెల్మెట్ పెట్టుకొని బైక్ మీద కూర్చొని ఇంకో సారి ఆ ప్రాంతాన్ని చాలా జాగ్రత్త గా చెక్ చేసాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని మోటార్ బైక్ స్టార్ట్ చేసి బయలుదేరి వెళ్తూ మనసులో " THIS IS NOT A BOOK SHOP ... BLOODY DROP BOX " అని అనుకున్నాడు


PART - 4 - THE DROP BOX

ప్రవీణ్ కుమార్... 38 ఏళ్ళ క్రితం బీహార్ రాష్ట్రం లోని ఒక చిన్న గ్రామం లో ఒక అతి పేద కుటుంబంలో జన్మించాడు. ప్రవీణ్ కి 4 ఏళ్ళ వయసప్పుడు అతని తల్లిదండ్రులు ఉపాధి వెతుక్కుంటూ బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో రోజువారీ కార్మికులుగా పని చెయ్యసాగారు. ప్రవీణ్ ని స్కూల్ కి పంపే స్తోమత లేకపోవడం తో వాడిని గాలికి వొదిలేశారు. ప్రవీణ్ తోటి పిల్లలతో కలిసి ప్రతిరోజూ ఊరంతా బలాదూర్ తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునేవాడు... ప్రవీణ్... అతని ఫ్రెండ్స్ కి పాట్నా రైల్వే స్టేషన్ ప్లాటుఫారం అనువైన ప్రదేశం గా మారింది. ఆ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల దగ్గర నుంచి చిన్న చిన్న వస్తువులు దొంగతనం చేసి వాటిని పాట్నా మార్కెట్ లో అమ్ముకునేవారు... చిల్లర మల్లర గా తిరుగుతూ... తోటి పిల్లలతో ఆడుకుంటూ ఏదో ఒకటి తిని బాగా పొద్దుపోయాక ఇంటికి చేరేవాడు. ప్రవీణ్ తన ఫ్రండ్స్ తో చేసే చిల్లర పనులన్నీ అదే ప్లాటుఫారం మీద టీ షాప్ నడిపే యాదవ్ అనే వాడు గమనించాడు... యాదవ్ ఒకప్పుడు అదే రైల్వే స్టేషన్ లో చిల్లర దొంగతనాలు చేసేవాడు... గూడ్స్ పెట్ట నుంచి బొగ్గు ని దొంగతనం చేసి ఊళ్ళో అమ్ముకునే వాడు. చాలా సార్లు పట్టుబడి జైలు కి కూడా వెళ్ళాడు... ఆ రైల్వే స్టేషన్ లో తిరుగుతున్న ఆ పిల్లలందరిని నెమ్మదిగా మచ్చిక చేసుకున్నాడు... వాళ్ళ చేత జేబుదొంగతనాలు చేయించసాగాడు. వాళ్ళు కి ప్రయాణికుల దగ్గర నుంచి పర్సులు... చిన్న చిన్న హ్యాండ్ బాగ్స్ ని ఎలా కొట్టెయ్యలో నేర్పాడు. క్రమంగా యాదవ్ ఇచ్చిన ట్రైనింగ్ తో ఆ కుర్రోళ్ళు విపరీతంగా రెచ్చిపోయి దొంగతనాలు చేసి పర్సులు... హ్యాండ్ బాగ్స్ ని తీసుకొచ్చి ఆ టీ కొట్టు ఓనర్ యాదవ్ కి ఇచ్చేవాళ్ళు... వాడు పిల్లలకి కొద్దోగొప్పో డబ్బులు ఇచ్చేవాడు... ఆ పిల్లలు ఆ డబ్బులతో వాడి టీ షాప్ లోనే ఎదో ఒకటి కొనుక్కు తినేవాళ్లు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి...

ఒక రోజు తన జీవితం లో మొట్ట మొదటిసారి ప్రవీణ్ రైల్వే స్టేషన్ లో ఒక ప్యాసెంజర్ పర్సు కొట్టి దొరికిపోయాడు... ఆ పాసెంజర్ ప్రవీణ్ ని పట్టుకొని "దొంగా... దొంగా..." అని అరవడంతో జనాలు అతడిని చుట్టుముట్టి కొట్టబోతే భయంతో తెగించి వాళ్ళని పక్కకి తోసేసి... తను దొంగతనం చేసిన ఆ పర్సు ని దూరంగా విసిరేసి అదే ప్లాటుఫారం మీద అప్పుడే కదులుతున్న రైల్ ఎక్కేసాడు... పక్క స్టేషన్ లో దిగి వెనక్కి రావాలని అనుకున్నాడు... కానీ... దురదృష్టవశాత్తూ ఆరోజు ప్రవీణ్ ఎక్కింది కలకత్తా నుంచి న్యూ ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్సప్రెస్... ఆ ట్రైన్ పాట్నా ... ఢిల్లీ మధ్యలో 6 చోట్ల మాత్రమే ఆగుతుంది... ప్రవీణ్ బాగా అలసిపోవడం తో రైల్ ఎక్కగానే నిద్ర పోయాడు... కంపార్టుమెంట్ డోర్ దగ్గర పడుకున్న ప్రవీణ్ ని ఎవరూ పట్టించుకోలేదు... ప్రవీణ్ లేచి చూసేటప్పటికి రైల్ బీహార్ దాటి ఉత్తప్రదేశ్ లో ప్రవేశించింది... ఎక్కడా ఆగకుండా వెళ్తోంది... ఆకలివేస్తోంది... జేబులో డబ్బులు లేవు... రైల్ లో అడుక్కుంటూ చివరికి ఢిల్లీ చేరాడు... న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ చేరగానే పాత అలవాటు ప్రకారం కనిపించిన మొదటి ప్యాసింజర్ జేబు కొట్టాడు... కానీ ... మళ్ళీ పట్టుపడ్డాడు... ఆ ప్యాసింజర్ ప్రవీణ్ ని కొట్టబోతే వాడు ఏడుస్తూ "నాది ఈ వూరు కాదు... రైల్ ఎక్కి వచ్చేసాను... ఆకలేస్తోంది..." అన్నాడు... ప్రవీణ్ బిహారి యాసలో హిందీ లో మాట్లాడటం గమనించిన ఆ ప్యాసింజర్ ప్రవీణ్ ని అదే బిహారి యాసలో "నువ్వు పాట్నా నుంచి వచ్చావా?" అని అడిగాడు... దాంతో ప్రవీణ్ ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు... ఆ పాసింజర్ పేరు గోస్వామి... ఆయన కూడా బీహార్ నుంచే వచ్చాడు... ప్రవీణ్ ని చూసి జాలి పడి వాడిని రైల్వే స్టేషన్ దగ్గరున్న దాబా కి తీసుకెళ్లి తిండి పెట్టించి వాడి వివరాలు తెలుసుకున్నాడు... గోస్వామి కి ప్రవీణ్ పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది... బీహార్ లో పేదవాళ్ళు చాలా ఎక్కువ... వాళ్ళ పిల్లలు గాలికి తిరగడం పెద్ద విషయం కాదు... గోస్వామి కి ఇంకో విషయం కూడా తెలుసు... ప్రవీణ్ తల్లిదండ్రులు వాడు ఇంటి నుంచి వెళ్ళిపోతే పెద్దగా బాధ పడరు... బీహార్ లో పిల్లలు ఇల్లు విడిచి వెళ్లడం కూడా ఏమంత పెద్ద విషయం కాదు... గోస్వామి "టికెట్ కొని పెడతా ఇంటికి వెళ్తావా?" అని అడిగాడు... ప్రవీణ్ వెంటనే "మీతో నే ఉంటాను... ఏదైనా పని ఇవ్వండి" అని అన్నాడు... "నీ వయసెంత?" అని అడిగాడు గోస్వామి .... ప్రవీణ్ కి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు... తన వయసెంతో ప్రవీణ్ కి తెలీదు... గోస్వామి నవ్వుకుంటూ వాడిని తనతో పాటు గురుగ్రామ్ తీసుకొని వెళ్ళాడు... అప్పుడు ప్రవీణ్ వయస్సు 12 సంవత్సరాలు...

గోస్వామి కి ఒక చిన్న న్యూస్ పేపర్ ఏజెన్సీ ఉంది... ప్రతి రోజు ఉదయం 4 గంటలకల్లా లేచి షాప్ కి వెళ్తాడు... న్యూస్ పేపర్ వాన్ పేపర్స్ పడేసి వెళ్తుంది... ఆ తరువాత పాల వాన్ వచ్చి... పాల పాకెట్స్... బ్రెడ్... కోడి గుడ్లు ఇచ్చి వెళ్తుంది... గోస్వామి దగ్గర ఆరుగురు కుర్రోళ్ళు పనిచేస్తున్నారు... ఆ ఏరియా లో చాలా సొసైటీస్ ఉన్నాయి... అక్కడ నివసించే వాళ్ళ ఇళ్లలో ప్రతిరోజూ ఉదయం పేపర్... పాల పాకెట్స్... ఎగ్స్ ని ఇచ్చిరావడం వాళ్ళ పని. ఉదయం 9 గంటలకి వాళ్ళు వెళ్లి పోతారు... గోస్వామి కి న్యూస్ పేపర్... బ్రెడ్... ఎగ్స్ తో పాటు స్కూల్ బుక్స్ స్టేషనరీ షాప్ ఉంది. ప్రవీణ్ ని ఆ షాప్ దగ్గర ఉంచాడు. ప్రతి రోజూ ఆ షాప్ ని ఓపెన్ చెయ్యడం.... క్లీనింగ్ చెయ్యడం... గోస్వామి చెప్పిన పని చెయ్యడం... ఇదే ప్రవీణ్ దినచర్య... గోస్వామి రాత్రి షాప్ మూసేసాక ప్రవీణ్ ఆ షాప్ దగ్గరే పడుకుంటాడు... వాడికి కావాల్సిన తిండి... బట్ట... ఖర్చులు అన్ని గోస్వామి చూసుకునేవాడు... నెమ్మదిగా ప్రవీణ్ పేపర్ ... మిల్క్... ఎగ్స్... డెలివరీ కి వెళ్ళసాగాడు... కొన్నాళ్ళకి ఇంటింటికి వెళ్లి డబ్బులు కలెక్ట్ చేసుకొని రాసాగాడు..కొత్త జీవితాన్ని బాగా అలవాటు అలవాటు చేసుకున్నాడు... షాప్ లో జరిగే విషయాలు నెమ్మదిగా తెలియసాగాయి... బీహార్ వెళ్లాలన్న ఆలోచన ప్రవీణ్ కి ఎప్పుడూ రాలేదు... కొంత కాలానికి ప్రవీణ్ షాప్ ని తానే నడపసాగాడు... ప్రతి రోజూ రాత్రి గోస్వామి ఇంటికి వెళ్లి ఆ రోజు షాప్ లో జరిగిన బిజినెస్ కల్లెక్షన్ ఇచ్చేవాడు... నెలవారీ ఖర్చులు పోనూ... పెద్దగా మిగిలేది కాదు. ప్రవీణ్ ఎప్పుడూ జీతం కావాలని అడగలేదు. గోస్వామి కి నెమ్మది నెమ్మదిగా ప్రవీణ్ అంటే బాగా నమ్మకం కలిగింది... అంచెలంచెలుగా గోస్వామి తన షాప్ బాధ్యతలు పూర్తిగా ప్రవీణ్ కి అప్పగించాడు... ప్రవీణ్ ఎప్పుడూ గోస్వామి ని మోసం చెయ్యలేదు... గోస్వామి కి ఫ్యామిలీ అంటూ ఏమి లేదు... ఒంటరివాడు. గోస్వామి భార్య ఆయనతో గొడవ పెట్టుకుని పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది... ఆయనకు తోడుగా నమ్మిన బంటు ప్రవీణ్... గోస్వామి కి వయస్సు పైబడడంతో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది. తన న్యూ ఏజెన్సీ షాప్ పూర్తి భాద్యతలు ప్రవీణ్ కి అప్పగించేసాడు... షాప్ కి వెళ్లడం పూర్తిగా మానేసాడు... గోస్వామి మాట విని ప్రవీణ్ ఒకసారి బీహార్ లో తన సొంత వూరు వెళ్ళాడు... ప్రవీణ్ తల్లిదండ్రులు చాలా కాలం తరువాత వచ్చిన కొడుకుని చూసి చాలా ఆనందించారు... ప్రవీణ్ కి పెళ్లి చేశారు... ప్రవీణ్ తల్లిదండ్రులు అతని తో పాటు బీహార్ నుంచి గురుగ్రామ్ వచ్చేసి కొడుకు ఇంట్లో ఉండి... గోస్వామి బాగోగులు చూసుకోసాగారు... తమ కొడుకు ని ఇన్నాళ్లు జాగ్రత్తగా చూసుకొని ప్రయోజకుడిని చేసిన కృతజ్ఞత చూపించారు... ఇలా ఉండగా ఒకరోజు... గోస్వామి దగ్గర కి ఒక వ్యక్తి వచ్చాడు... గోస్వామి... ఆయన... చాలా సేపు సీక్రెట్ గా ఎదో మాట్లాడుకున్నారు... ఆ వ్యక్తి వెళ్లి పోయాక గోస్వామి ఫోన్ చేసి ప్రవీణ్ ని ఇంటికి పిలిచాడు...

గోస్వామి: మనం వెంటనే మన షాప్ లో న్యూస్ ఏజెన్సీ తో పాటు ఓల్డ్ బుక్స్ కొనడం... అమ్మకం కూడా మొదలెట్టాలి...

ప్రవీణ్ : అలాగే సర్... ఎలా చెయ్యాలో చెప్పండి...

గోస్వామి: నువ్వు ఈ ఏరియా లో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకి పనికి రాని మ్యాగజైన్స్... ఓల్డ్ బుక్స్ ని కొనుక్కొచ్చి మన షాప్ లో పెట్టు... షాప్ ముందు ఒక బోర్డు పెట్టు... పాత పుస్తకాలు కొనుగోలు కి ఒక రేట్... అమ్మకానికి ఒక రేట్ పెట్టు... చాలా తక్కువ ధరకు కొని కొంచం లాభం వేసుకొని వాటిని అమ్మాలి... ఎక్కువ రేట్ పెడితే ఎవరు కొనడానికి రారు...

ప్రవీణ్: మీరు ఎలా చెపితే అలా చేస్తాను...

గోస్వామి చెప్పిన ప్రకారం ఆ రోజు నుంచి ఆ ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు పనికిరాని పాత మ్యాగజైన్స్... బుక్స్ కొనుక్కొచ్చి కొంచం లాభానికి అమ్మసాగాడు... కొంత కాలానికి ప్రవీణ్ ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ప్రవీణ్ షాప్ కి తెచ్చి... అమ్మడం... కొనడం మొదలెట్టారు... బిజినెస్ బాగుంది... షాప్ వచ్చే పోయే వాళ్ళు పెరిగారు... సరిగ్గా అదే సమయానికి గోస్వామి ఒకరోజు ప్రవీణ్ ని ఇంటికి పిలిచి "నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది... నేను చనిపోయిన తరువాత నా ఇల్లు... షాప్ నీకు చెందేలా నీ పేరు మీద వ్రాసాను... నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి... రేపటినుంచి ప్రతి రోజూ ఉదయం మన షాప్ కి ఒక వ్యక్తి వచ్చి నీకు ఒక పుస్తకం ఇచ్చి... అయిదు రూపాయలు ఇమ్మని అడుగుతాడు... ఆ తరువాత ఇంకో వ్యక్తి వచ్చి నీకు పది రూపాయలు ఇచ్చి పుస్తకం ఇవ్వమని అడుగుతాడు. ఉదయం నీ దగ్గరకి వచ్చిన పుస్తకాన్ని జాగ్రత్తగా ఇవ్వాలి... ఇలా చేస్తే నీకు ప్రతి నెల పాతిక వేల రూపాయలు అందుతాయి... ఆ పుస్తకం నీకు ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చారు? అందులో ఏముంది? ఇలాంటి ప్రశ్నలు వెయ్యకు... నీ పని ప్రతి రోజూ ఒకడి దగ్గర పుస్తకాన్ని తీసుకొని... ఇంకొకడికి ఇవ్వడమే నీ పని... ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా... నువ్వు ప్రమాదం లో పడతావు... నీకు ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను... నీ చేతికి పుస్తకం రాగానే " అభి ఆయా" ఆ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించాలి... అదే విధం గా పుస్తకాన్ని రెండో వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళగానే " అభీ గయా " అన్న మెసేజ్ ని అదే ఫోన్ నెంబర్ కి పంపాలి... ఈ మెసేజెస్ పంపడం చాలా ముఖ్యం... అప్పుడే నీకు ప్రతి నెలా పాతికవేల రూపాయలు వస్తాయి..." అని చెప్పాడు...

గోస్వామి చెప్పినట్లే మరుసటి రోజు ఉదయం 11 గంటల సమయం లో ఒక వ్యక్తి వచ్చి "కితాబ్ లేలో... పాచ్ రూపాయ్ దేదో" అని అన్నాడు... ప్రవీణ్ అయిదు రూపాయలు ఇచ్చి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టుకొని గోస్వామి ఇచ్చిన మొబైల్ ఫోన్ నెంబర్ కి "అభి ఆయా" అని వాట్సాప్ లో మెసేజ్ పంపాడు... ఆ మెసేజ్ రాజీవ్ వర్మ కి చేరింది... రాజీవ్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. సాయంత్రం 4 గంటల సమయం లో ఇంకో వ్యక్తి వచ్చి పది రూపాయల నోటు ఇచ్చి.. "కితాబు దేదో" అని అన్నాడు... ప్రవీణ్ ఉదయం తన దగ్గరకి వచ్చిన పుస్తకాన్ని ఆ వ్యక్తికీ ఇచ్చి వాట్సాప్ లో "అభీ గయా" అని ఒక మెసేజ్ ని పంపాడు... గోస్వామి చెప్పిన ప్రకారం ప్రవీణ్ ఎప్పుడూ ఆ ఇద్దరి గురించి పట్టించుకోలేదు... ప్రతి నెల ఒకటో తారీఖ్ ఒక వ్యక్తి వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్తాడు... అందులో పాతికవేల రూపాయలు ఉన్నాయి... ఆ విధం గా DROP BOX మొదలయ్యింది...

DROP BOX లేదా DEAD DROP ... ఇది ఒక సదుపాయం... సీక్రెట్ గా మెసేజెస్ ఒకరి నుంచి ఇంకొకరికి... వేరే ఎవరికి అనుమానం రాకుండా రహస్యంగా చేరవేయడానికి ఉపయోగపడే సాధనం... దీన్ని ఎక్కువగా గూఢచారులు వాడుతూ ఉంటారు. ఏదైనా సీక్రెట్ మెసేజ్... లేదా ముఖ్యమైన డాక్యుమెంట్ ని ఎవరికి తెలియకుండా ఒక ప్రదేశంలో పెడతారు... అవసరమైనప్పుడు ఆ ప్రదేశం గురించి తెలిసినవాళ్ళు వెళ్లి ఆ మెసేజ్ ని... లేదా డాక్యూమెంట్ ని తీసుకుంటారు... సాధారణంగా పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ బాక్స్... రైల్వే స్టేషన్ లోని క్లోక్ రూమ్... ఇతర సీక్రెట్ ప్లేసెస్ ని వాడతారు... ఖరీదైన వస్తువులని దాచడం కోసం బ్యాంకు లోకెర్స్... వాడతారు.... కొన్ని విదేశాల్లోని ఎయిర్ పోర్ట్స్ లో కొన్ని స్టోరేజ్ కంపెనీస్ లాకర్స్ అద్దెకి ఇస్తూ ఉంటారు... CIA... FBI... MI6... MOSSAD... RAW... FSB... KGB లాంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఇలాంటి డ్రాప్ బాక్సులు ఎక్కువగా వాడతారు... ఇదే ఐడియాతో గోస్వామి తన షాప్ ని కూడా DROP BOX గా మార్చేశాడు... కొన్ని సంవత్సరాలుగా ప్రవీణ్ షాప్ కి ప్రతి రోజూ ఒక వ్యక్తి వచ్చి బుక్ ఇచ్చి వెళ్లడం... ఇంకో వ్యక్తి వచ్చి ఆ బుక్ తీసుకొని వెళ్లడం... జరుగుతోంది.... కొంత కాలానికి గోస్వామి ఆనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు ఆ డ్రాప్ బాక్స్ కి ప్రవీణ్ యజమాని అయ్యాడు... ఇప్పటిదాకా మూడో కంటికి తెలియకుండా పని జరిగింది. ఇప్పుడు సడన్ గా గౌతమ్ సీన్ లోకి రావడంతో కథ పెద్ద మలుపు తిరగబోతోంది...

ప్రవీణ్ షాప్ కి ఎదురుగా కెమెరా ని అమర్చిన మరుసటి రోజునించి ప్రవీణ్ పంపించే వాట్సాప్ మెస్సగెస్ ని జాగ్రత్త గా ట్రాక్ చెయ్యడం మొదలెట్టాడు... ప్రతి రోజూ ఉదయం 11 గంటలకి డ్రాప్... మధ్యాన్నం 4 గంటలకి పిక్ అప్ జరగడం గమనించాడు... జాగ్రత్త గా ఖచ్చితమైన టైం ని నోట్ చేసుకోడవం మొదలెట్టాడు... 14 రోజులు గడిచాయి... ప్రతిరోజూ డ్రాప్... పిక్ అప్ టైమింగ్స్ లో పెద్ద తేడా ఏమి లేదు. క్రమం తప్పకుండా వారానికి ఏడు రోజులు డ్రాప్... పిక్ అప్ జరుగుతోంది. ఆ రోజు రాత్రి మళ్ళీ గౌతమ్ రాత్రి రెండు గంటల సమయం లో నల్లటి డ్రెస్ వేసుకొని మొహానికి ముసుగు పెట్టుకొని మోటార్ బైక్ మీద ప్రవీణ్ షాప్ కి వెళ్ళాడు... మోటార్ బైక్ ఆపి దిగకుండా దాదాపు ఒక 15 నిమిషాల పాటు చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలించి... ఆ ఏరియా లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత మోటార్ బైక్ దిగి నేరుగా ప్రవీణ్ షాప్ కి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు ఎక్కాడు... కొమ్మకి కట్టిన కెమెరా ఇంకా రికార్డు చేస్తోంది. కెమెరా ని ఆఫ్ చేసి దాన్ని కొమ్మ నుంచి ఊడదీసి... జాగ్రత్త గా బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని కిందకి దిగి మోటార్ బైక్ దగ్గరకి వచ్చి మళ్ళీ ఆ చుట్టుపక్కల పరిసరాలు ఇంకోసారి జాగ్రత్తగా చెక్ చేసి ఎవరూ లేరని నిర్ధారించుకొని మోటార్ బైక్ ఎక్కి తన ఇంటికి వెళ్ళాడు...

గౌతమ్ ఆ కెమెరా ని లాప్ టాప్ కి కనెక్ట్ చేసి గత 14 రోజులుగా రికార్డు అయ్యిన డేటా ని డౌన్ లోడ్ చేసి ఆ ఫైల్ ని రన్ చేసాడు... సరిగ్గా ఉదయం 11 గంటల సమయం దాకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాడు... మొదటి రోజు ఉదయం 11: 14 నిమిషాలకి ప్రవీణ్ వాట్సాప్ ని రాజీవ్ కి పంపాడు... ఉదయం 11 గంటల నుండి వీడియో ని రన్ చేసాడు... సరిగ్గా ఉదయం 11:09 నిమిషాలకి ఒక వ్యక్తి వచ్చి బుక్ ఇవ్వడం... ప్రవీణ్ ఆ బుక్ తీసుకొని ఆ వ్యక్తి కి డబ్బులు ఇవ్వడం కనిపిచింది. ఆ వ్యక్తి వెళ్లడానికి వెనక్కి తిరగగానే అతని మొహం క్లియర్ గా కనిపించడంతో... గౌతమ్ ఆ ఫ్రేమ్ ని ఫ్రీజ్ చేసి పించ్ జూమ్ చేసాడు... 40 మెగా పిక్సెల్ కెమెరా తో రికార్డు చెయ్యడంతో ఇమేజ్ చాలా క్లియర్ గా ఉంది... గౌతమ్ ఆ ఫ్రీజ్ చేసిన ఫ్రేమ్ ని ప్రింట్ చేసాడు... బుక్ ని డ్రాప్ చేసిన వ్యక్తి ఫోటో దొరికింది... గౌతమ్ వీడియో ని మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాడు... సరిగ్గా సాయంత్రం 4 గంటల దగ్గర ఆపి ప్లే చేసాడు... అదే రోజు సాయంత్రం దాదాపు 4:05 నిమిషాల సమయంలో ఇంకో వ్యక్తి వచ్చి ఆ బుక్ ని పిక్ అప్ చేసుకొని ప్రవీణ్ కి డబ్బులు ఇచ్చి వెళ్లడం... వెంటనే ప్రవీణ్ వాట్సాప్ లో రాజీవ్ కి మెసేజ్ పంపడం కంపించింది... గౌతమ్ బుక్ ని పిక్ అప్ చేసిన వ్యక్తి ఫోటో ని కూడా ప్రింట్ చేసాడు... వీడియో ని ప్లే చేసి ప్రతి రోజు వాట్సాప్ మెసేజ్ వెళ్లిన టైం కి ప్రవీణ్ షాప్ ఎవరు వచ్చారో చెక్ చేసాడు... డైలీ ఈ ఇద్దరే వచ్చి వెళ్లడం రికార్డు అయ్యింది... డ్రాప్ చేసిన వ్యక్తి... పిక్ అప్ చేసిన వ్యక్తి ఫొటోస్ గౌతమ్ కి చిక్కాయి...

మరుసటి రోజు ఉదయం 10:30 నిమిషాలకు గౌతమ్ బయలుదేరి ప్రవీణ్ బుక్ షాప్ కి చేరుకొని టీ షాప్ దగ్గర కూర్చొని బుక్ డ్రాప్ చేసే వ్యక్తి కోసం వెయిట్ చెయ్యసాగాడు... సుమారు 11:15 నిమిషాల సమయంలో ఒక వ్యక్తి వచ్చి బుక్ ని డ్రాప్ చేసి ప్రవీణ్ ఇచ్చిన అయిదు రూపాయలు తీసుకొని బయలుదేరాడు... గౌతమ్ ఆ వ్యక్తిని చాలా జాగ్రత్తగా గమనించాడు... అయిదు అడుగుల పది అంగుళాల ఎత్తు... సాధారణమైన శరీరం... సుమారు 45 ఏళ్ళు ఉంటాయి... ఆ వ్యక్తి స్కూటర్ ఎక్కి బయలుదేరాడు... గౌతమ్ అతని వెనకాలే ఒక 500 మీటర్స్ దూరంలో అతడిని ఫాలో అవ్వసాగాడు... సెక్టార్ 56 షాపింగ్ సెంటర్ నుంచి బయలుదేరి గోల్ఫ్ కోర్స్ రోడ్ లోకి ప్రవేశించి... నేరుగా వెళ్లి నేషనల్ హై వే ఎక్కి ఢిల్లీ వైపు వెళ్ళసాగాడు... గౌతమ్ తన మొబైల్ ఫోన్ తో అతని స్కూటర్ నెంబర్ ని ఫోటో తీసుకొని అతనికి అనుమానం రాకుండా ఫాలో అవ్వసాగాడు... స్కూటర్ మీద ఆవ్యక్తి నేషనల్ హై వే మీద ప్రయాణిస్తూ... ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాటి... మహిపాల్ పుర దగ్గర ఢిల్లీ లోకి ప్రవేశించి...నేరుగా సుబ్రతో పార్క్ దాటి ఢిల్లీ కంటోన్మెంట్ దాటుకుంటూ వెళ్లి తీహార్ జైలు దాటిన తరువాత హరి నగర్ డిపో దగ్గర ఎడమ వైపు కి తిరిగి జనకపురి లోకి ప్రవేశించి B బ్లాక్ లో ఒక DDA అపార్టుమెంట్స్ దగ్గర స్కూటర్ ఆపి ఫస్ట్ ఫ్లోర్ లోని అపార్ట్మెంట్ లోకి వెళ్ళాడు... అతని వెనకాలే వచ్చిన గౌతమ్ ఆ వ్యక్తి వెళ్లిన అపార్టుమెంట్ నెంబర్ ని కూడా మొబైల్ ఫోన్ తో ఫోటో తీసుకున్నాడు... ఒక పది నిమిషాలు ఆగి ఆ వ్యక్తి అపార్టుమెంట్ కి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు... ఒక లేడీ వచ్చి తలుపు తీసింది...

గౌతమ్: సంజయ్ కపూర్ సాబ్ తో మాట్లాడాలి... పిలుస్తారా?

లేడీ: ఇది సంజయ్ కపూర్ ఇల్లు కాదు... మీరు ఎవరు?

గౌతమ్: నేను ఢిల్లీ జల్ బోర్డు నుంచి వస్తున్నాను... సంజయ్ కపూర్ గారి ఇంట్లో వాటర్ మీటర్ చెక్ చెయ్యడానికి వచ్చాను.

లేడీ: ఇది అజయ్ సక్సేన గారి ఇల్లు...

గౌతమ్: మా రికార్డ్స్ ప్రకారం ఇక్కడ సంజయ్ కపూర్ నివసిస్తున్నారు...

లేడీ: ఇక్కడ ఆ పేరు తో ఎవరూ లేరు... ఇది మా సొంత ఇల్లు...

గౌతమ్: సారీ మేడం... ఎక్కడో పొరపాటు జరిగింది...

గౌతమ్ అక్కడనుండి బయలుదేరుతూ మనసులో "ఈ అజయ్ సక్సేన ఎవరో తెలుసుకోవాలి" అని అనుకుంటూ గురుగ్రామ్ బయలుదేరాడు... సాయంత్రం సరిగ్గా 4 గంటల సమయానికి మళ్ళీ ప్రవీణ్ బుక్ షాప్ దగ్గరికి చేరుకొని ఆ బుక్ ని పిక్ అప్ చేసుకోవడానికి వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూడసాగాడు. దాదాపు 4:25 నిమిషాలకి ప్రవీణ్ బుక్ షాప్ కి ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి బుక్ తీసుకొని బయలుదేరాడు... గౌతమ్ కూడా అతని వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాడు... ఆ వ్యక్తి సెక్టార్ 56 మార్కెట్ దాటి గోల్ఫ్ కోర్స్ రోడ్ మీదుగా ప్రయాణించి నేరుగా DLF సైబర్ హబ్ లోకి ప్రవేశించి నేరుగా ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ బిల్డింగ్ చేరుకొని అక్కడ రిసెప్షన్ లో తాను తెచ్చిన బుక్ ని ఇచ్చేసి బయటకి వచ్చి స్కూటర్ ఎక్కి సైబర్ హబ్ లోంచి బయటకి వచ్చి నేషనల్ హైవే మీదుగా ప్రయాణించి 32 మైల్ స్టోన్ దగ్గర U టర్న్ తీసుకొని ఓల్డ్ గురుగ్రం సెక్టార్ 15 లోకి ప్రవేశించాడు... అతని వెనకాలే గౌతమ్ కొంచం దూరం లో ఫాలో అవ్వసాగాడు... ఆ వ్యక్తి సందులు తిరుగుతూ ఒక రెసిడెన్షియల్ లొకాలిటీ లో ప్రవేశించి ఒక ఇంటిలోకి వెళ్ళాడు... గౌతమ్ ఆ ఇంటికి కొంచం దూరం లో తన మోటార్ సైకిల్ ఆపి ఎవరికి అనుమానం రాకుండా ఆ వ్యక్తి ప్రవేశించిన ఇంటి మెయిన్ డోర్ మీదున్న నేమ్ ప్లేట్ ని చెక్ చేసాడు "రాజేంద్ర యాదవ్" అని వ్రాసి ఉంది. గౌతమ్ వచ్చిన పని అయ్యింది. వెంటనే అక్కనుంచి బయలుదేరాడు.

ఇంటికి రాగానే తన లాప్ టాప్ ని ఓపెన్ చేసి ఒక అప్లికేషన్ రన్ చేసి ఢిల్లీ / హర్యానా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెబ్ సైట్ లోకి ప్రవేశించి రాజేంద్ర యాదవ్... అనిల్ సక్సేన... వాడిన వెహికల్ నంబర్స్ కి సంభందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెక్ చేసాడు. అందులో రెసిడెన్స్ అడ్రస్ కూడా మ్యాచ్ అయ్యింది... ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్ కి వాడిన ఆధార్ కార్డు నంబర్స్ దొరికాయి... ఆ ఆధార్ నంబర్స్ ని సాఫ్ట్ వేర్ అప్లికేషన్ రన్ UIDAI డేటాబేస్ లోకి ప్రవేశించి ఆ ఇద్దరి డీటెయిల్స్ చెక్ చేసాడు. అనిల్ సక్సేన జనకపురి లో చిన్న సైజు జనరల్ షాప్ కి ఓనర్... రాజేంద్ర యాదవ్ ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ లో పని చేస్తున్నాడు... గౌతమ్ మనసులో "అనిల్ సక్సేన... రాజేంద్ర యాదవ్... వీళ్ళు ఇద్దరూ COURIERS... రాజేంద్ర ఓరియన్ గ్రూప్ లో పనిచేస్తున్నాడు... కాబట్టి ఆ బుక్ ని రాజీవ్ వర్మ కి ఇస్తాడని అనుకున్నా... అనిల్ కి ఆ బుక్ ఎక్కడనుంచి వస్తోందో తెలుసుకోవాలి... ఇంకోసారి జనక్ పురి వెళ్ళాలి..." అని డిసైడ్ అయ్యాడు


Part - 5 - The Investigation

గురుగ్రమ్ సెక్టార్ 56 నుంచి జనకపురి దాదాపు 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆరోజు వర్కింగ్ డే అవ్వడంతో ఢిల్లీ - జైపూర్ హైవే చాలా బిజీ గా ఉంది... గౌతమ్ జనకపురి కి వెళ్తూ ఆలోచిస్తున్నాడు... 'ఇది చాలా పెద్ద విషయం లాగా ఉంది... వీలయినంత త్వరగా గవర్నమెంట్ అథారిటీస్ చెప్పాలి... ఎలా చెప్పాలి? అసలు నేను ఈ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానని అడిగితే ఏమని జవాబు చెప్పాలి? ఆకాశరామన్న ఉత్తరం పనిచేయదు. పర్సనల్ గా వెళ్లి కంప్లైంట్ చేసి ఎవిడెన్స్ చూపించాలి... అయితే ఇక్కడే పెద్ద ప్రాబ్లెమ్ ఉంది... గవర్నమెంట్ ఎంక్వయిరీ లో ₹255 కోట్ల విషయం కూడా బయటపడే అవకాశం లేకపోలేదు. ఎలా మేనేజ్ చెయ్యాలి???'

జనకపురి చేరగానే సక్సేన నడుపుతున్న జనరల్ స్టోర్స్ కి దూరం గా మోటార్ బైక్ ఆపి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఉదయం 9:30 నిమిషాలు అయింది. సక్సేన షాప్ లోనే ఉన్నాడు. కస్టమర్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. సక్సేన మొబైల్ ఫోన్ నెంబర్ ఆ షాప్ ముందున్న బోర్డు మీద దొరికింది. గౌతమ్ వెంటనే తన మొబైల్ ఫోన్ లోని MALWARE APP ఓపెన్ చేసి అందులోంచి సక్సేనా కి ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అయ్యింది. సక్సేన ఫోన్ ఎత్తాడు...

గౌతమ్: సక్సేన జీ... నేను B బ్లాక్ లో హౌస్ నెంబర్ 36B నుంచి మాట్లాడుతున్నాను... కొన్ని సామాన్లు కావాలి... పంపిస్తారా?

సక్సేన : పంపిస్తాను ఏమేమి కావాలో చెప్పండి రాసుకుంటాను.

గౌతమ్ : బాసుమతి రైస్ 3 కిలోలు... కందిపప్పు 2 కిలోలు... రాజ్మా 1 కిలో... కిచెన్ కింగ్ మసాలా ఒక ప్యాకెట్... టాటా సాల్ట్ ఒక ప్యాకెట్... పూజ అగర్బత్తి ఒక ప్యాకెట్... ఇవన్నీ ఎంత సేపట్లో పంపిస్తారు?

సక్సేన : 20 నిమిషాల్లో పంపిస్తాను... దీంతో పాటు బిల్ కూడా పంపిస్తా... డబ్బులు క్యాష్ ఇస్తారా... లేక PAYTM చేస్తారా?

గౌతమ్: PAYTM చేస్తాను... ఇదే నెంబర్ మీద చెయ్యమంటారా?

సక్సేన: అవును. ఇదే నెంబర్ కి చెయ్యండి.

గౌతమ్ చేసిన ఫోన్ కాల్ తో సక్సేన మొబైల్ ఫోన్ లో MALWARE APP ఇంస్టాల్ అయ్యింది. ఇప్పుడు ఆ ఫోన్ వచ్చే పోయే ఫోన్ కాల్స్ అన్ని గౌతమ్ మొబైల్ ఫోన్ లో రికార్డు అవుతాయి. సక్సేన వాట్సాప్ అకౌంట్ కూడా గౌతమ్ హాక్ చేయగలిగాడు. వచ్చిన పని అవ్వడంతో గౌతమ్ తన మోటార్ బైక్ దగ్గరకు వెళ్లి సక్సేన కోసం వెయిట్ చెయ్యసాగాడు... సక్సేన ఫోన్ కి వస్తున్న ఫోన్ కాల్స్... అన్నింటిని వినసాగాడు... చాలా వరకు కస్టమర్స్ దగ్గరనుంచి వస్తున్నాయి. సరుకులు హోమ్ డెలివరీ అడుగుతున్నారు. ఇంతలో సక్సేన వాట్సాప్ కి ఒక మెసేజ్ వచ్చింది " కితాబు తయ్యార్ హై... లేకే జావ్" ... ఈ మెసేజ్ ని చూడగానే సక్సేన షాప్ లో పనిచేసే కుర్రోడికి భాద్యతలు అప్పగించి హడావిడిగా తన స్కూటర్ ఎక్కి బయలుదేరాడు.

సక్సేన వెనకాలే గౌతమ్ కూడా బయలుదేరాడు. సక్సేన కొంచం హడావిడిగా స్కూటర్ నడుపుతున్నాడు. గౌతమ్ అతని వెనకాలే ఒక 200 మీటర్స్ దూరం లో మోటార్ బైక్ మీద ఫాలో అవుతున్నాడు... సక్సేన జనకపురి నుంచి బయలుదేరి... వికాసపురి దాటి మధుబన్ చౌక్ వైపు వెళ్ళసాగాడు. ఆ సమయంలో ఆ రోడ్ చాలా బిజీ గా ఉంది. సిటీ బస్సులు... కార్లు... టు వీలర్స్... త్రి వీల్లెర్స్... లారీలు... ఇతర వాహనాలు తో చాలా బిజీ గా ఉంది. అలా బిజీ గా ఉన్న రోడ్ మీద సక్సేన ని ఫాలో అవ్వడం గౌతమ్ కి చాలా ఈజీ గా ఉంది... ఆ వాహనాలు మధ్యలో సక్సేన... గౌతమ్ ని గుర్తు పట్టడం చాలా కష్టం... సక్సేన దాదాపు 30 నిమిషాల పాటు ప్రయాణించి షాలిమార్ బాగ్ లో ఒక ఇంటి ముందు ఆగాడు... స్కూటర్ ని పార్క్ చేసి హడావిడిగా ఆ ఇంట్లోకి వెళ్ళాడు... సక్సేన రెండే రెండు నిమిషాల్లో ఒక పుస్తకం పట్టుకుని బయటకు వచ్చి. స్కూటర్ ఎక్కి వెనక్కి బయలుదేరాడు. గౌతమ్ కి తెలుసు... ఇప్పుడు సక్సేన నేరుగా గురుగ్రామ్ వెళ్లి ఆ బుక్ ని ప్రవీణ్ కి ఇస్తాడు... గౌతమ్ అక్కడే ఆగిపోయాడు... సక్సేన ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి నేమ్ ప్లేట్ చెక్ చేసాడు. ఆ ఇల్లు ఒక అతుల్ మాథుర్ అనే ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగికి చెందినది... గౌతమ్ ఆ ఇంటి పరిసరాలను చెక్ చేసాడు. అతుల్ మధుర్ ఇంటి ముందు AIRTEL కంపెనీ వాళ్ళ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కి సంబంధించిన జంక్షన్ బాక్స్ కనిపిచింది. గౌతమ్ పెదాలమీద చిరునవ్వు వెలసింది... మనసులో "TIME TO HACK..." అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు...

అతుల్ మాథుర్ ఇంటి ముందు AIRTEL వాళ్ళ జంక్షన్ బాక్స్ ఉంది... ప్రతి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ప్రతి కిలోమీటర్ కి ఒక జంక్షన్ బాక్స్ పెడుతుంది. అంటే... ఆ జంక్షన్ బాక్స్ నుంచి ఒక కిలోమీటర్ రేడియస్ లో వున్నా అన్ని ఇళ్లకు ఇంటర్నెట్ సిగ్నల్స్ వెళ్లేలా వైరింగ్ చేస్తారు... ఆ జంక్షన్ బాక్స్ ని కనుక టాంపర్ చేస్తే చాలు ఆ ఏరియా లోని ప్రతి ఇంటర్నెట్ IP ADDRESS ని కంట్రోల్ చేయవచ్చు. ఆ జంక్షన్ బాక్స్ ని ఎలా టాంపర్ చెయ్యాలో ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. ఒక మూడు రోజుల తరువాత... AIRTEL కంపెనీ యూనిఫామ్ వేసుకొని... టూల్ కిట్ పట్టుకొని నేరుగా అతుల్ మాథుర్ ఇంటి దగ్గర ఉన్న AIRTEL బ్రాడ్ బ్యాండ్ జంక్షన్ బాక్స్ ని ఓపెన్ చేసి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయేలా అడ్జస్ట్ చేసాడు... దీంతో ఒక కిలోమీటర్ రేడియస్ లో ఇంటర్నెట్ సిగ్నల్ స్ట్రెంగ్త్ బాగా పడిపోయింది.... నేరుగా అతుల్ మధుర్ ఇంటికి కి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు... పనిమనిషి డోర్ ఓపెన్ చేసింది... ఆమె వెనకాలే ఒక పెద్దావిడ వచ్చింది...

పెద్దావిడ : ఎవరు మీరు? ఏమి కావాలి??

గౌతమ్: సారీ టు ట్రబుల్ యూ ... ఈ ఏరియా లో ఇంటర్నెట్ కనెక్షన్ బాగా స్లోగా ఉన్నదని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి... మీ ఇంట్లో ఇంటర్నెట్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలి???

పెద్దావిడ : మా అబ్బాయి ని పిలుస్తాను... వాడిని అడగండి

పెద్దావిడ తన కొడుకుని పిలిచింది... ఒక 25 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు... షార్ట్స్... టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు ... మెడలో హెడ్ ఫోన్స్ సెట్ వుంది... చింపిరి జుట్టు... బాగా పెరిగిన గడ్డం... చేతిలో వైర్లెస్ గేమింగ్ కంట్రోల్... నోట్లో చూయింగ్ గం...

కుర్రోడు : ఏమి కావాలి?

గౌతమ్: మీ ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ ఎంత వస్తోంది??

కుర్రోడు : మీరు 100mbps దాకా స్పీడ్ వస్తుంది అని అంటారు... కస్టమర్స్ కి మాత్రం 30 నుంచి 40 mbps మాత్రమే వస్తుంది... ఈ రోజు మరీ దారుణంగా ఉంది.

గౌతమ్: మీ ఇంట్లో ఇంటర్నెట్ కి ఎన్ని డివైజ్ లు కనెక్ట్ చేస్తారు?

కుర్రోడు: రెండు లాప్ టాప్స్... నాలుగు మొబైల్ ఫోన్స్... ఒక iPAD...

గౌతమ్: మాకు చాలా కంప్లయింట్స్ వచ్చాయి... నేను జంక్షన్ బాక్స్ చెక్ చేస్తాను... మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది...

కుర్రోడు: మీరు అలాగే అంటారు.... పెద్దగా ఉపయోగం ఉండదు...

కుర్రోడు లోపలికి వెళ్ళిపోయాడు... గౌతమ్ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు... ఆ రోజు గౌతమ్ తలకు విగ్గు పెట్టుకున్నాడు... సోడాబుడ్డి కళ్ళ జోడు పెట్టుకున్నాడు... కొంచం గడ్డం కూడా పెరగడం తో దానికి మెహిందీ పెట్టాడు... దీంతో గౌతమ్ రూపం లో చాలా మార్పు వచ్చింది... రియల్ గౌతమ్ ని గుర్తుపట్టడం అంత ఈజీ కాదు... "ఈ ఇంట్లో ఒక లాప్ టాప్ ఈ కుర్రోడు... ఇంకో లాప్ టాప్ అతుల్ మాథుర్ వాడుతున్నట్లున్నారు... నాలుగు మొబైల్ ఫోన్స్... ఒకటి అతుల్ మాధుర్... రెండోది కుర్రాడు... మూడోది మాథుర్ వైఫ్... నాలుగోది ఎవరిది?? పనిమనిషి దా... లేక ఇంట్లో వాళ్ళకి రెండో ఫోన్ ఉందా... ఒక ఐపాడ్" ఇలా ఆలోచిస్తూ... నేరుగా ఆ ఏరియా లోని AIRTEL ఏర్పాటు చేసిన బ్రాడ్ బ్యాండ్ జంక్షన్ బాక్స్ దగ్గరకి వెళ్ళాడు... బాక్స్ ఓపెన్ చేసాడు... అందులో చాలా కనెక్షన్స్ ఉన్నాయి... అవి ఆ ఏరియా లోని ఇళ్ళకి ఇచ్చిన కనెక్షన్స్... ఇందులో అతుల్ మాథుర్ కనెక్షన్ ఎదో ఆ బాక్స్ లోంచి తెలుసుకోవడం చాలా కష్టం... గౌతమ్ ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆ జంక్షన్ బాక్స్ మెయిన్ కనెక్షన్ కి ఒక హాకింగ్ డివైజ్ అటాచ్ చేసి బాక్స్ ని మూసేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఒక 500 మీటర్స్ దూరం లో పార్క్ చేసిన తన కారు దగ్గరకు వెళ్లి వెనక సీట్ లో లో కూర్చొని లాప్ టాప్ ఓపెన్ చేసి... ఒక సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం రన్ చేసాడు... ఆ ఏరియాలో ఆ సమయంలో ఆక్టివ్ గా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ కి సంబంధించిన ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రసులు దొరికాయి... మొత్తం 164 ఇంటర్నెట్ ప్రొటొకాల్స్ ఆక్టివ్ గావున్నాయి... ఈ 164 ఆక్టివ్ కనెక్షన్స్ లో అతుల్ మాథుర్ ఇంట్లో డివైజ్ ల IP అడ్రస్ ని కనుక్కోవడానికి... గ్లోబల్ IP అడ్రస్ లొకేషన్ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ 164 అడ్రస్ లు ఆ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ లోకి అప్లోడ్ చేసాడు. గ్లోబల్ IP అడ్రస్ లొకేషన్ సాఫ్ట్ వేర్ ఈ ప్రపంచం లో ప్రతి IP అడ్రస్ ఫిజికల్ లొకేషన్ తెలియచేస్తుంది... అయితే ఆ ఫిజికల్ లొకేషన్ LONGITUDE & LATITUDE లో తెలుస్తుంది... ప్రస్తుతం గౌతమ్ రన్ చేసిన గ్లోబల్ IP అడ్రస్ లొకేషన్ సాఫ్ట్ వేర్ 164 GEO LOCATIONS ని చూపించింది... గౌతమ్ ఒక్కో GEO LOCATION ని సెపరేట్ గా ఇంకో సాఫ్ట్ వేర్ అప్లికేషన్ లో లోడ్ చేసి రన్ చేసాడు... ప్రతి IP అడ్రస్ ఫిజికల్ లొకేషన్ తెలిసింది... అందులో అతుల్ మాథుర్ ఇంట్లో ఆక్టివ్ గా ఉన్న IP అడ్రస్ లు దొరికాయి... రెండు లాప్ టాప్స్ ఆ సమయంలో ఆన్ చేసి ఉండటంతో రెండు లాప్ టాప్ డివైజెస్ ని గౌతమ్ వెంటనే హాక్ చేసాడు...

ముందుగా అతుల్ మాథుర్ లాప్ టాప్ ని క్లోన్ చేసి... అతని కంప్యూటర్ ని చెక్ చేసాడు... అందులో మైక్రో డాట్ తయారుచేసే సాఫ్ట్ వేర్ దొరికింది.... BINGO... కావాల్సిందే దొరికింది. మైక్రో డాట్స్ ముఖ్యం గా మొదటి... రెండు.. ప్రపంచ యుద్దాల సమయం లో గూఢచారులు రహస్య సందేశాలు శత్రువులకు ఎవరికీ తెలియకుండా పంపడానికి ఉపయోగించారు. ఈ మైక్రో డాట్స్ ఒక మిల్లిమీటర్ వ్యాసార్థం లో ఉండడంతో అవి కంటికి కనిపించవు. ఈ మైక్రో డాట్స్ మొదట్లో మెటల్ తో తయారు చేసే వాళ్ళు... కాలక్రమేణా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడంతో ఒక రకమైన ప్లాస్టిక్ తో కూడా మైక్రో డాట్స్ తయారు చేస్తున్నారు. ఇది వరకు రోజుల్లో ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో విరివిగా వాడారు... ఆ తరువాత 1947 నుంచి 1989 వరకు జరిగిన COLD WAR సమయంలో ఈ మైక్రో డాట్స్ ని విపరీతంగా వాడి రహస్య సందేశాల్ని చేరవేశారు... ఇదే COLD WAR సమయంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందడం తో మైక్రో డాట్స్ తయారీ బాగా సులభతరమయ్యింది... మొదట్లో... అంటే మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక మైక్రోడాట్ ని తయారుచేయడానికి ANALOG SLR కెమెరా.... ఎక్కువగా జర్మనీ లో తయారైన LEICA కెమెరాల కి ఒక పవర్ఫుల్ లెన్స్ అమర్చి ... కోడాక్ 400 TMAX ఫిలిం ని వాడేవారు. ముందుగా మెసేజ్ ని ఫోటో తీసి... ఆ ఫిలిం ని డెవలప్ చేసి... ఆ మెసేజ్ నెగటివ్ వీలైనంత చిన్న సైజు లోకి కుదిస్తే మైక్రో డాట్ తయారవుతుంది. ఆ మైక్రో డాట్ లోని మెసేజ్ ని ఒక ప్రత్యేకమైన మైక్రో డాట్ రీడింగ్ మెషిన్ వాడి అందులోని మెసేజ్ ని చదువుకుంటారు... అయితే కాలక్రమేణా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటంతో మైక్రో డాట్ తయారీ చాలా సులభతరంగా అయ్యింది... ప్రస్తుతం ఒక మైక్రో డాట్ ని తయారు చెయ్యాలంటే... ఒక డాక్యుమెంట్ స్కానర్... ఒక లాప్ టాప్ లో మైక్రో డాట్ సాఫ్ట్ వేర్ ఉంటే చాలు... ఎవరైనా మైక్రో డాట్ ని తయారు చేయవచ్చు... ముందుగా డాక్యుమెంట్ ని స్కానర్ తో స్కాన్ చేసి... ఆ ఇమేజ్ ని సాఫ్ట్ వేర్ లోకి లోడ్ చేసి... మైక్రో డాట్ మేకింగ్ మెషిన్ ద్వారా అతి చిన్న సైజు లో మైక్రో డాట్ తయారుచేయవచ్చు... ఈ రోజుల్లో మైక్రో డాట్ టైపు రైటర్ లో FULLSTOP క్యారెక్టర్ ఏ సైజు లో ఉంటుందో... అంత చిన్న సైజు లో తయారు చేయవచ్చు... మైక్రో డాట్స్ ని వాడి మెసేజెస్ పంపడం STEGANOGRAPHY లో ఒక భాగం. ఒక్కో మైక్రో డాట్ లో దాదాపు ఒక A4 సైజు పేపర్ లోని ఇన్ఫర్మేషన్ ని కుదించి పొందుపరచవచ్చు. ఈ మైక్రో డాట్స్ ని సాధారణంగా ఏదైనా పుస్తకం లో FULLSTOP ఉన్న చోట సులువుగా అమర్చవచ్చు. అతుల్ మాథుర్ ప్రతి రోజూ సక్సేన కి ఇచ్చే పుస్తకం లో రహస్య సమాచారం పొందుపరిచిన మైక్రో డాట్స్ ఉంటాయి...

గౌతమ్ కి మతి పోయింది... ఇది చాలా పెద్ద విషయం... లాప్ టాప్ ని మూసేసి కార్ ని స్టార్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరాడు... మనసులో " ఈ పని ఇక్కడితో ఆపేయాలి... ఇక మీద ఏమి చేయాలన్నా... ఒక టీం అవసరమవుతుంది... " అని అనుకోని ఇంటికి చేరుకొని ఒక పేపర్ మీద వ్రాయసాగాడు...

1. SUPPLIER : అతుల్ మాథుర్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని ఎవరు సప్లై చేస్తున్నారు? ఎంతమంది ఇన్ఫర్మేషన్ ని పంపిస్తున్నారు.?? ఎలా పంపిస్తున్నారు???

2. INFORMATION : ఆ సప్లయర్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని... ఎక్కడ నుంచి సంపాదించి అతుల్ మాథుర్ ఇస్తున్నాడు?

3. PROCESSOR : ఇన్ఫర్మేషన్ ని మైక్రో డాట్ రూపంలోకి ఎవరు ప్రాసెస్ చేస్తున్నారో తెలుసు... అతుల్ మాథుర్...

4. OUTPUT : సప్లయర్ డాక్యుమెంట్ రూపంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మైక్రో డాట్స్ గా మార్చి... ఆ మైక్రో డాట్స్ ని ఒక బుక్ లో పొందుపరచి కొరియర్ - సక్సేన కి ఇస్తున్నాడు

5.COURIERS : అనిల్ సక్సేనా... రాజేంద్ర యాదవ్... వీళ్ళిద్దరూ COURIERS... బుక్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి చేరవేస్తున్నారు.

6. CUSTOMER : అతుల్ మధుర్ పంపే ఇన్ఫర్మేషన్ కి ముఖ్యమైన కస్టమర్ --- రాజీవ్ వర్మ...

7. END USER : రాజీవ్ వర్మ మైక్రో డాట్స్ లోని ఇన్ఫర్మేషన్ ని STEGANOGRAPHIC ENCODER వాడి... STEGANO OBJECT తయారుచేసి... గంగూలీ కి పంపిస్తాడు... గంగూలీ ఆ ఇన్ఫర్మేషన్ ని వాడి ఫైనాన్స్ క్రైమ్స్ చేస్తున్నాడు... చాలా పెద్ద నెటవర్క్ సెట్ అప్ చేసుకున్నారు...

1. అతుల్ మాధుర్ కి ఇన్ఫర్మేషన్ సప్లై చేసేది ఎవరో తెలుసా?

2. సక్సేన కి అతుల్ మాథుర్... ప్రవీణ్ కుమార్ తప్ప వేరే ఎవరూ తెలియదు...

3. ప్రవీణ్ కుమార్ కి సక్సేన... యాదవ్ తప్ప వేరే ఎవరూ తెలిసే అవకాశం లేదు.

4. యాదవ్ కి ప్రవీణ్... రాజీవ్ మాత్రమే తెలుసు...

5. రాజీవ్ కి యాదవ్ తప్ప మిగతా వాళ్ళు తెలుసా?

గౌతమ్ చాలా సేపు ఆలోచించి తను ఈ పని ఇంతటితో ఆపేసి... చెప్పవలసిన వాళ్లకి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.


Part - 6 - The Background

గౌతమ్ మరుసటి రోజు ఉదయం 3:30 నిమిషాలకి నిద్రలేచాడు. దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకొని బాత్ రూమ్ లో అద్దం ముందు నుంచొని షేవ్ చేసుకుంటూ ఆలోచించసాగాడు... "ఎలా మొదలు పెట్టాలి? ఏమేమి చెప్పాలి? ముందుగా ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ లో JUICE JACKING ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాలి... అప్పుడు రెండు వందల యాభై అయిదు కోట్ల సంగతి కూడా బయటకు వస్తుంది. ఎలా జస్టిఫై చేసుకోవాలి? మిగతా విషయాలు ఈజీ గా ఎక్సప్లయిన్ చెయ్యవచ్చు... ₹ 255 కోట్ల సంగతి అందరికి చెప్పలేము... ఎవరి దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్పాలి.." అని ఆలోచిస్తూ షేవ్ చేసుకోవడం పూర్తి చేసి... స్నానం చేసి బెడ్ రూమ్ లోకి వచ్చి ఫార్మల్ గా డ్రెస్ అయ్యి మొబైల్ ఫోన్ లో టైం చూసుకున్నాడు... సరిగ్గా ఉదయం 4:30 నిమిషాలు అయ్యింది. ఇంటికి తాళం వేసి లిఫ్ట్ ఎక్కి బేసెమెంట్ లోని కార్ పార్కింగ్ చేరుకొని. తన కార్ బూట్ ని ఒకసారి చెక్ చేసుకున్నాడు... అందులో ఒక కార్డు బోర్డు బాక్స్ ఉంది... ఆ బాక్స్ లో గౌతమ్ అప్పటిదాకా సంపాదించిన ఎవిడెన్స్ పేపర్స్ ఉన్నాయి. గౌతమ్ కార్ బూట్ మూసి... లాక్ చేసి కార్ ని స్టార్ట్ చేసి అపార్టుమెంట్ బేసెమెంట్ లోంచి బయటకి వచ్చి గోల్ఫ్ కోర్స్ రోడ్ ఎక్కి నేషనల్ హై వే చేరుకొని ఢిల్లీ వైపు వెళ్ళసాగాడు... చలి కాలం కావడంతో ఊరంతా పొగమంచు తో నిండిపోయింది... కార్ నడుపుతున్న గౌతమ్ కి రోడ్ సరిగ్గా కనిపించడం లేదు... కార్ ని ఫాగ్ లైట్ వేసుకొని నడుపుతున్నాడు... గౌతమ్ ఆలోచనలు గతం లోకి పరుగు తీశాయి...

(గౌతమ్ కి చెందిన మొదటి ఫ్లాష్ బ్యాక్ - ప్రారంభం)

గోపాలరావు ... సరోజ లకి ఏకైక సంతానం గౌతమ్ కుమార్... వాళ్ళది గోదావరి జిల్లాలో ఒక చిన్న సైజు పట్టణం... పేరు సింహపురి... గోపాలరావు కి ఆ ఊరి బయట 15 ఎకరాల పొలం కూడా ఉంది. వరి పండుతుంది. గోపాలరావు కి రైస్ మిల్ కూడా ఉంది... తన పొలంలో పండిన వరిని తన సొంత రైస్ మిల్ లో ఆడించి... బియ్యాన్ని తయారు చేసి గోపాలరావు సొంతంగా లారీ కి ఎక్కించి మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకుంటాడు. డబ్బుకి ఎటువంటి లోటు లేదు... చీకు చింత లేని కుటుంబం. ఊళ్ళో మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. గోపాలరావు కి ఊరి నడిబొడ్డున రెండు ఎకరాల స్థలంలో పెద్ద పాత కాలపు ఇల్లు ఉంది. గౌతమ్ కి 4 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు సరోజకి జబ్బు చేసి చనిపోయింది. దాంతో గౌతమ్ తల్లి లేని పిల్లవాడు అయ్యాడు... గోపాలరావు బంధువులు... మిత్రులు... నచ్చ చెప్పి రెండో పెళ్లికి ఒప్పించారు. గోపాలరావు కి రెండో పెళ్లి అయ్యింది... నాగరత్నం ఇంటికి ఇల్లాలుగా వచ్చింది... అప్పటి నుంచి గౌతమ్ కి కష్టాలు మొదలయ్యాయి... గోపాలరావు ఇంట్లో ఉన్నప్పుడు నాగరత్నం గౌతమ్ ని బానే చూసేది... గోపాలరావు ఇంటి గడప దాటిన వెంటనే గౌతమ్ చేత చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా ఇంట్లో పనులు చెయ్యించేది. మొదట్లో గోపాలరావు కి ఈ విషయం తెలియదు. ఒకరోజు బయటకి వెళ్లిన గోపాలరావు ఎదో గుర్తుకొచ్చి ఇంటికి రావడంతో గౌతమ్ పెరట్లో పశువులకి మేత వేస్తూ కనిపించాడు... గోపాలరావు కి పరిస్థితి అర్ధమయ్యింది. నాగరత్నం సవతి కొడుకుని సరిగ్గా చూసుకోదని గ్రహించి గౌతమ్ ని వెంటనే తన మొదటి భార్య సరోజ అన్న ఇంటికి పంపాడు... ప్రతి నెల డబ్బులు పంపేవాడు... అప్పుడు గౌతమ్ కి 7 ఏళ్ళు...

మొదట్లో సరోజ అన్న... వదిన గౌతమ్ ని బానే చూసుకున్నారు. తమ పిల్లలతో పాటు స్కూల్ కి పంపారు... నెమ్మదిగా వాళ్ళ బుద్ధి మారింది... వాళ్ళు కూడా గౌతమ్ చేత చిన్న చిన్న పనులు చేయించసాగారు... పచారీ కొట్టు నుంచి సరుకులు... మార్కెట్ నుంచి కూరలు తెప్పించసాగారు... గోపాలరావు ప్రతి నెల వచ్చి కొడుకుని చూసి... ఆ నెలకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు... క్రమంగా గౌతమ్ ని అతని మేనమామ స్కూల్ మానిపించి ఇంటి పనులు కూడా చేయించడం మొదలెట్టారు... ఇది గమనించిన ఒక శ్రేయోభిలాషి వెంటనే గోపాలరావు కి ఫోన్ చేసి చెప్పాడు... గోపాలరావు ఒకరోజు చెప్పాపెట్టకుండా గౌతమ్ ని చూడడానికి ఆ వూరు వచ్చి స్కూల్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసాడు... "మీ వాడిని ఎప్పుడో స్కూల్ మాన్పించి TC తీసుకొని వెళ్ళిపోయారు" అని హెడ్ మాస్టర్ చెప్పారు... ఇది విన్న గోపాలరావు కి గుండె ఆగినంత పని అయ్యింది...

హెడ్ మాస్టర్: మీకు పరిస్థితి నాకు బాగా తెలుసు... మీకు నేను ఒక హెల్ప్ చేస్తాను... ఈ సమస్య కి ఒక పరిష్కారం ఉంది.

గోపాలరావు: చెప్పండి మాష్టారు... గౌతమ్ కోసం ఏమైనా చేస్తాను...

హెడ్ మాస్టర్: ఇప్పుడు గౌతమ్ కి పదేళ్లు... అయిదవ తరగతి లో ఉన్నాడు... మంచి తెలివైన వాడు. మీరు గౌతమ్ ని వెంటనే స్కూల్ లో జాయిన్ చెయ్యండి. నేను మీ అబ్బాయిని మా ఇంట్లో ఉంచుకొని ఈ సంవత్సరం పూర్తిచేయించి... కోరుకొండ లోని సైనిక్ స్కూల్ కి ఎంట్రన్స్ వ్రాయిస్తాను... గౌతమ్ కి అందులో సీట్ తప్పకుండా వస్తుంది... హాస్టల్ ఉండి చదువుకుంటాడు... మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు... మీకు తోచినప్పుడు వెళ్లి గౌతమ్ ని చూసుకోవచ్చు...

గోపాలరావు వెంటనే గౌతమ్ ని మళ్ళీ స్కూల్ లో చేర్చాడు... గౌతమ్ ని హెడ్ మాస్టర్ ఇంట్లో వదిలిపెట్టి ఆయనకి ₹5000 ఇవ్వబోతే... ఆయన "వొద్దండి... నేను డబ్బులకోసం మీకు ఈ సొల్యూషన్ చెప్పలేదు. గౌతమ్ చాలా తెలివైన వాడు... ఆ తెలివి తేటలు వేస్ట్ కాకూడదని నా అభిప్రాయం" అని అన్నాడు... గోపాలరావు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి గౌతమ్ ని వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు... మరుసటి రోజు ఆ హెడ్ మాస్టర్ ఇంటి దగ్గర ఒక లారీ అయింది. అందులోంచి కూలీలు 10 బస్తాల బియ్యం... కందిపప్పు... ఇతర సరుకులు దింపారు... హెడ్ మాస్టర్ కి అర్ధమయ్యింది... గోపాలరావు పంపాడని...

గోపాలరావు కి ఇచ్చిన మాట ప్రకారం... హెడ్ మాస్టర్... ఇతర స్టాఫ్ మెంబెర్స్ అందరూ కలసి గౌతమ్ మంచి కోచింగ్ ఇచ్చి కోరుకొండ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకి ప్రిపేర్ చేశారు... గౌతమ్ కూడా చాలా శ్రద్ధగా చదివాడు... మరుసటి సంవత్సరం కోరుకొండ సైనిక్ స్కూల్ కి సెలెక్ట్ అయ్యాడు... దాంతో గౌతమ్ కష్టాలు తీరాయి... హెడ్ మాస్టర్ ఇంటి నుంచి బయలుదేరి కోరుకొండ కి వెళ్లేముందు గౌతమ్ తన తండ్రితో "హెడ్ మాస్టర్ గారికి ఒక ఇల్లు కొనిపెడతావా?" అని అడిగాడు. గౌతమ్ తన జీవితం లో కోరిన మొట్టమొదటి కోరిక... గోపాలరావు ఆనందంగా కొడుకు కోరిక తీర్చాడు...

సైనిక్ స్కూల్ గౌతమ్ కి బాగా నచ్చింది... అక్కడ అందరూ పిల్లలే... ఎటువంటి కుటుంబ బాదరబందీ లేదు... స్టూడెంట్స్ అందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కావడం తో గౌతమ్ అప్పటిదాకా పడ్డ కష్టాలు మర్చి పోయాడు... చదువు లో ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు... ఆటల్లో .... ముఖ్యంగా ఫుట్ బాల్ బాగా ఆడేవాడు... సైనిక్ స్కూల్ మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ నడుపుతుంది... 1961 లో VK కృష్ణ మీనన్... ఆనాటి రక్షణ మంత్రి దేశం లో సైనిక్ స్కూల్స్ ని ప్రారంభించాడు... ప్రస్తుతం ఇండియా లో 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి... ఈ సైనికి స్కూల్స్ భావి భారత మిలిటరీ ఆఫీసర్స్ ని తయారు చేస్తున్నాయి... దాదాపు 30% డిఫెన్స్ ఆఫీసర్ల ని ఈ స్కూల్స్ తయారు చేస్తాయి... ఇంట్రెస్ట్ ఉన్నవారు చదువు పూర్తికాగానే డిఫెన్స్ సర్వీసెస్ లో చేరుతారు... కానీ... ఇంటర్మీడియట్ పూర్తికాగానే గౌతమ్ ఎంసెట్ వ్రాసాడు... 10వ ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ లో చేరాడు... ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ బ్రాంచ్ లో చేరాడు... చిన్నప్పటినుండి సైనిక్ స్కూల్ డిసిప్లిన్ కి అలవాటు పడ్డ గౌతమ్ కి ఇంజనీరింగ్ కాలేజీ... హాస్టల్ వాతావరణం అంతగా నచ్చలేదు... గౌతమ్ సైనిక్ స్కూల్ లో నేర్చుకున్న డిసిప్లిన్ ని ఇంజనీరింగ్ కాలేజీ లో కూడా కంటిన్యూ చేసాడు... ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు... ఆమె పేరు లావణ్య... ఒక రెండు సంవత్సరాలు బానే గడిచింది... చివరికి ఫైనల్ ఇయర్ లో ఉండగా "మా వాళ్ళు నాకు వేరే సంబంధం చూశారు" అని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. గౌతమ్ జీవితం లో మొదటి హార్ట్ బ్రేక్... ఫైనల్ ఇయర్ పూర్తి అవుతున్న సమయంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించిన పరీక్షలో మొదటి ర్యాంక్ సంపాదించాడు... సైనిక్ స్కూల్ స్టూడెంట్ కావడంతో గౌతమ్ కి ఆర్మీ లో చాలా ఈజీ గా ఉద్యోగం దొరికింది... న్యూ ఢిల్లీ లో సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా చేరాడు.

మొదటిసారి న్యూ ఢిల్లీ వెళ్తున్న గౌతమ్ తో పాటు గోపాలరావు కూడా వెళ్ళాడు... గౌతమ్ కి ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా లోని ఆఫీస్ లో పోస్టింగ్ ఇచ్చారు... జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు... ఆర్మీ లో జాయిన్ అవ్వగానే ఫార్మాలిటీస్ లో భాగంగా గౌతమ్ ని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా... కంటోన్మెంట్ బ్రాంచ్ లో ఆర్మీ సర్వీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారు... గోపాలరావు తనతో పాటు ఒక ₹15 లక్షలకు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని వచ్చాడు. బిజినెస్ మాన్ కావడం తో ఎందుకైనా మంచిదని గౌతమ్ చేత కెనరా బ్యాంకు లో ఇంకో అకౌంట్ ఓపెన్ చేయించి అందులో ₹15 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ని డిపాజిట్ చేయించారు. అప్పుడు గౌతమ్ కి 22 ఏళ్ళు... పెద్దవాడైన కొడుకుతో గోపాలరావు "నీకు మన కుటుంబం గురించి... మన ఆస్తి పాస్తుల గురించి చెప్పాలి... మనకి ఊరిలో 15 ఎకరాల పొలం... ఒక రైస్ మిల్... ఉన్నాయి... ఇవి నాకు నా పూర్వీకులనుంచి సంక్రమించిన ఆస్తి... ఊళ్ళో మనం ఉంటున్న ఇల్లు మీ అమ్మకి మా పెళ్లి సమయంలో మీ తాతగారు వ్రాసి ఇచ్చిన ఇల్లు... నువ్వు పుట్టగానే మీ అమ్మ ఆ ఇల్లు నీ పేరు మీద రాసి రిజిస్టర్ చేసింది." అని అంటూ ఇంటి దస్తావేజులు గౌతమ్ కి ఇచ్చాడు... "ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి...?" అని అన్నాడు గౌతమ్... "నీకు తెలుసుగా... నీ సవతి తల్లి... ఆమె పిల్లలకు నువ్వంటే ఇష్టం లేదు. వాళ్ళు నీకు పొలం... రైస్ మిల్ లో వాటా ఇస్తారని నాకు నమ్మకం లేదు. అందుకే నీకు దక్కాల్సిన ఆస్తి ని నీకు ఇప్పుడు ఇచ్చేస్తే... నాకు ఒక బాధ్యత తీరుతుంది." అని అన్నాడు... మరుసటిరోజు గోపాలరావు తన ఊరికి బయలుదేరాడు.

గౌతమ్ కి ఢిల్లీ లో ఆర్మీ కంటోన్మెంట్ లైఫ్ బాగా నచ్చింది... ప్రతి రోజు ఉదయం 4 గంటలకల్లా లేచి కనీసం 5 కిలోమీటర్స్ రన్నింగ్ చెయ్యడం... ఆఫీసర్ మెస్ లో బ్రేక్ ఫాస్ట్ చేసి రోజంతా ఆఫీస్ లో బాగా బిజీ గా పని చెయ్యడం... బాగా అలసిపోయి మళ్ళీ రాత్రి ఆఫీసర్ మెస్ లో భోజనం చేసి వచ్చి పడుకోవడం... ప్రతినెలా సగం శాలరీ ని కెనరా బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసాడు... గౌతమ్ కి ముందుగా పూణే లో సిగ్నల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో 10 వారాల ట్రైనింగ్ ఇచ్చారు... క్రిప్టాలజీ... సిగ్నల్ ఇంటెలిజెన్స్ ని ఎలా కలెక్ట్ చెయ్యాలి... ఎలా అనలైజ్ చేయాలి... ఎలా వాడాలి... బాగా నేర్చుకున్నాడు... ట్రైనింగ్ అవ్వగానే జమ్మూ కాశ్మీర్ లో జాయింట్ సైఫెర్ బ్యూరో లో జూనియర్ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చారు... జాయింట్ సైఫెర్ బ్యూరో IB & RAW తో చాలా క్లోజ్ గా పనిచేస్తాయి. క్రిప్టో అనాలిసిస్... సెన్సిటివ్ డేటాను ఎన్క్రిప్ట్ చెయ్యడం... అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చెయ్యడం జాయింట్ సైఫెర్ బ్యూరో ముఖ్య ఉద్దేశ్యం... జమ్మూ కాశ్మీర్ లో ఒక "లిజనింగ్ పోస్ట్" దాని మెయిన్ జాబ్ పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే వైర్లెస్... మెసేజెస్ ని కాప్చర్ చేసి వాటిని అనలైజ్ చెయ్యడం... ఆ మెసేజస్ వివిధ గవర్నమెంట్ డిపార్టుమెంట్స్... మిలిటరీ ఇంటలిజెన్స్... నావెల్ ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్స్ కి పంపడం మెయిన్ డ్యూటీ. ... దీనినే సిగ్నల్ ఇంటలిజెన్స్ అని అంటారు.

ఈ డిపార్టుమెంటు లో పనిచేయడంతో గౌతమ్ కి చాలా డిపార్టుమెంట్స్ లో చాలామందితో సంబంధాలు ఏర్పడ్డాయి... ముఖ్యంగా మిలిటరీ ఇంటలిజెన్స్... RAW డిపార్టుమెంట్స్ చాలా క్లోజ్ గా పనిచేశాడు. ఒక రోజు తన కమాండింగ్ ఆఫీసర్ పిలిచి "నువ్వు అర్జెంటు గా URI సెక్టార్ వెళ్ళాలి... అక్కడ మేజర్ మాధవ్ రావు కి నీ సహాయం చాలా అవసరం... పాకిస్తాన్ నుంచి కొన్ని మెసేజెస్ వచ్చాయి... వాటిని DECRYPT చెయ్యాలి. వెంటనే బయలుదేరు" అని ఆర్డర్ వేసాడు... గౌతమ్ బయలు దేరి URI సెక్టార్ చేరుకున్నాడు. గౌతమ్ తన జీవితం లో మొదటిసారి మేజర్ మాధవరావు ని కలిసాడు... మేజర్ మాధవ్ కి గౌతమ్ పనితనం బాగా నచ్చింది... గౌతమ్ DECRYPT చేసిన మెసేజెస్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మాధవ్ ఆ ఇంటలిజెన్స్ ని వెంటనే RAW... IB వాళ్ళకి పంపాడు... వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ని యూనియన్ కాబినెట్ సెక్రెటరీ కి అందించారు... కాబినెట్ సెక్రటరీ ఈ విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో డిస్కస్ చేసాడు. అప్పుడు PMO నుంచి ఒక సెక్యూర్ ఫోన్ కాల్ మాధవ్ కి వెళ్ళింది. ఆ ఫోన్ కాల్ లో కొన్ని ఇంస్ట్రుక్ష ఉన్నాయి. ఆ ఇంస్త్రుక్షన్స్ ని తన టీం తో పంచుకున్నాడు... మాధవ్ ఆ తరువాత గౌతమ్ ని పిలిచి

మాధవ్: నువ్వు ఆర్మీ లో ఎందుకు జాయిన్ అయ్యావు?

గౌతమ్: దేశ సేవ చెయ్యడానికి...

మాధవ్: అది అందరూ చెప్పే సమాధానం... నువ్వు ఎందుకు చేరావు?

గౌతమ్: నేను కోరుకొండ మిలిటరీ స్కూల్ లో చదివాను. నాకు చిన్నప్పటి నుండి డిసిప్లిన్ బాగా నచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీ లో చదివేటప్పుడు నాకు ఆ వాతావరణం నచ్చలేదు. అందుకే ఇంజనీరింగ్ అవ్వగానే ఆర్మీ లో చేరాను.

మాధవ్: దేశం కోసం చావడానికి సిద్ధమా...

గౌతమ్(అటెన్షన్ లో నుంచొని సెల్యూట్ కొట్టి): ఎస్ సర్... ఐ యాం రెడీ టు డై ఫర్ ది కంట్రీ... జై హింద్

మాధవ్(సెల్యూట్ కొట్టి) : జైహింద్... గౌతమ్ ... ఒకటి గుర్తు పెట్టుకో... దేశం కోసం చావడం అనేది పాత పద్ధతి... ఇప్పుడు మన దేశ భద్రత కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధం గా ఉండాలి.... మర్నా నహీ... మార్నా హై... ఇప్పుడు నేను ఒక మిషన్ మీద నా టీం తో వెళ్తున్నా... నువ్వు కూడా వస్తావా?

గౌతమ్: తప్పకుండా వస్తా... ఎప్పడు బయలుదేరాలి?

మాధవ్: గుడ్... మా టీం రెడీ అవుతోంది... నువ్వు కూడా వాళ్ళతో కలసి రెడీ అవ్వు... నేను ఒక 30 నిమిషాల్లో... ఫైనల్ బ్రీఫింగ్ చేస్తాను...

గౌతమ్ కూడా మాధవ్ టీం లో పాటు మిషన్ మీద వెళ్ళడానికి స్పెషల్ కామోఫ్లాజ్ యూనిఫామ్ వేసుకొని అస్సల్ట్ రైఫిల్... అమ్మూనిటిన్ తో రెడీ గా వున్నాడు... సరిగ్గా 30 నిమిషాల తరువాత మాధవ్ తన టీం కి గౌతమ్ ని పరిచయం చేస్తూ...

మాధవ్: గౌతమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని నేను హెడ్ క్వార్టర్స్ కి పంపడం జరిగింది. నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడికి 100 కిలోమీటర్స్ దూరం లో LOC దగ్గర ఒక టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నదని తెలిసింది. ఇవ్వాళా రాత్రి పాకిస్తాన్ లో ట్రైనింగ్ పొందిన టెర్రరిస్ట్స్... దాదాపు 50 మంది బోర్డర్ క్రాస్ చేసి ఇండియా లోకి చొరబడడానికి రెడీ గా ఉన్నారని తెలిసింది. వాళ్ళని ఆపాలి. కుదిరితే ప్రాణాలతో పట్టుకోవాలి... లేదంటే... చంపెయ్యాలి... ఎట్టి పరిస్థితిలో వాళ్ళు బోర్డర్ దాటడానికి వీలు లేదు.ఎనీ డౌట్స్?

ఒక జవాన్: మీరు చెప్పిన LOC దగ్గర పూర్తిగా కొండలు... అడవులు... ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ఏ రూట్ లో వస్తుందో ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఉందా?

మాధవ్: ఆ డీటెయిల్స్ గౌతమ్ చెప్తాడు...

గౌతమ్: ఇక్కడికి 100 కిలోమీటర్స్ దూరంలో సెక్టార్ 78 కి దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి... మనకి వచ్చిన సమాచారం ప్రకారం టెర్రరిస్ట్స్ లో ఒక సొరంగం తవ్వారు. అది దాదాపు 2 కిలోమీటర్స్ పొడుగున ఉంటుంది. ఈ సొరంగం... కొంత భాగం కొండ ని తొలచి... దారిని వేశారు... అక్కడనుంచి నేల లో సొరంగాన్ని తవ్వారు... ఆ సొరంగం మన భూభాగంలో రెండు కొండల మధ్య పూర్తి అవుతుంది. ఆ ఏరియా లో దాదాపు 8 కొండలు ఉన్నాయి... అందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం... ఒక ప్రాంతాన్ని గుర్తించాము... వాళ్ళు ఖచ్చితం అక్కడి నుంచే వస్తారు... ఆక్కడ అడవి చాలా దట్టంగా ఉంటుంది...

మాధవ్: ఇంకా వేరే డౌట్స్ ఉన్నాయా...

అందరూ ముక్త కంఠం తో "నో సర్" అని అరిచారు... 40 మంది సైనికులతో మేజర్ మాధవ్ 4 ఆర్మీ హెలీకాఫ్టర్స్ లో LOC వైపు వెళ్ళాడు... అప్పడు సమయం రాత్రి 9 గంటలు అవుతోంది.... హెలీకాఫ్టర్స్ అందరిని సురక్షితంగా డ్రాప్ చేసి వెనక్కి వచ్చేసాయి... అక్కడ నుంచి ముందుగా మాధవ్ దారో చూపిస్తూంటే... వెనకాలే 4 కెప్టెన్స్ నాలుగు టీమ్స్ ని తీసుకొని వెళ్లారు... దాదాపు 12 గంటల ప్రాంతం లో అందరూ సొరంగం ఏరియా చేరుకున్నారు... మాధవ్ తన కింద పనిచేస్తున్న 4 కెప్టెన్స్ పిలిచి "నేను... గౌతమ్ వెళ్లి ఆ సొరంగం ఎక్కడుందో చూసి వస్తాము... మీరు మా సిగ్నల్ కోసం వెయిట్ చెయ్యండి..." అని చెప్పి గౌతమ్ ని తన వెంట తీసుకొని సొరంగం వైపు వెళ్ళాడు... వాళ్ళు చాలా సేపు వెతికారు... సొరంగం ఆనవాళ్లు కనిపించలేదు... మాధవ్ కి డౌట్ వచ్చింది... గౌతమ్ తో "మనకి వచ్చిన ఇంటెల్ కరెక్ట్ కాదా... నువ్వు చెప్పినట్లు ఇక్కడ సొరంగం ఎక్కడా కనిపించడం లేదు..." అని అన్నాడు... దానికి గౌతమ్ బదులుగా "లేదండి... ఇంటెల్ కరెక్ట్... ఈ రెండు కొండల మధ్యలోనే ఎంట్రన్స్ ఉండాలి... వాళ్ళు ఇవాళ రాత్రి రెండు... నాలుగు మధ్యలో బోర్డర్ క్రాస్ చేస్తారు" అన్నాడు... మాధవ్ నైట్ విషన్ గాగుల్స్ పెట్టుకొని ఆ ఏరియా ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు... ఏమి తెలియడం లేదు... రాత్రి రెండు గంటలు దాటింది... సడన్ గా ఇండియా సైడ్ ఒక లైట్ వెలగడం కనిపిచింది... ఆ లైట్ వెలుగుతూ... ఆరుతూ ఎదో సిగ్నల్ పంపిస్తోంది... గౌతమ్ నవ్వుతూ... మాధవ్ కి ఆ సిగ్నల్ ని చూపించాడు... మాధవ్ వెంటనే తన వాకీ టాకీ లో తన టీం ని రమ్మని చెప్పాడు... వాళ్ళు GPS ద్వారా మాధవ్ ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వచ్చారు...

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్స్ కి ట్రైనింగ్ క్యాంప్స్ ని నిర్వహిస్తూ ఉంటుంది... ట్రైనింగ్ పూర్తి కాగానే ఆ టెర్రరిస్ట్స్ ని ఇండియా - పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరలో ఒక ప్రాంతానికి తరలిస్తారు... అక్కడ ఈ టెర్రరిస్ట్స్ సమయం చూసి ఇండియా భూభాగం లోకి చొరబడతారు... ట్రేనింగ్ అయినా తరువాత వాళ్ళు వెయిట్ చేసే ప్రదేశాన్ని "లాంచ్ పాడ్" అని అంటారు. ప్రస్తుతం సెక్టార్ 78 కి దగ్గరలో ఉన్న ఒక లాంచ్ పాడ్ నుంచి ఇండియా లోకి చొరబడడానికి కొంతమంది టెర్రరిస్ట్స్ రెడీ గా ఉన్నారు... వాళ్ళని పట్టుకోవడానికి మాధవ్ తన టీం తో అక్కడకి చేరుకున్నాడు... ఇండియా సైడ్ టార్చి లైట్ తో సిగ్నల్ ఇచ్చిన వాడు ఇండియన్ ఆర్మీ కి కనిపించాడు... మాధవ్ వాడిని ఏమి చెయ్యలేదు... వాడిని చంపితే... రావాల్సిన టెర్రరిస్ట్స్ ఆగిపోతారు... అప్పుడు ఆ సొరంగం ఎక్కడుందో తెలియదు. ఇండియన్ సైడ్ ఉన్న టెర్రరిస్ట్ మళ్ళీ టార్చ్ లైట్ తో సిగ్నల్ పంపాడు... అప్పుడే పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా టార్చ్ లైట్ తో ఇచ్చిన ఇంకో సిగ్నల్ కనిపిచింది... ఇప్పుడు పాకిస్తాన్ వైపునుంచి తవ్విన సొరంగం ఎక్కడుందో ఇండియన్ ఆర్మీ కి తెలిసిపోయింది... వెంటనే మాధవ్ తన దగ్గరున్న సైలెన్సర్ అటాచ్ చేసిన రివాల్వర్ తో ఇండియా సైడ్ లో టార్చ్ లైట్ తో సిగ్నల్స్ ఇస్తున్న వాడిని కాల్చి చంపేశాడు... సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ సైడ్ నుంచి సొరంగం ద్వారా టెర్రరిస్ట్స్ బోర్డర్ క్రాస్ చేయసాగారు...మాధవ్ ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాడు...

ఇండియన్ ఆర్మీ సోల్డర్స్ అందరూ నైట్ విషన్ గాగుల్స్ పెట్టుకొని ఉండడం తో బోర్డర్ క్రాస్ చేస్తున్న ప్రతి టెర్రరిస్ట్ క్లియర్ గా కనిపించడంతో... ఫైరింగ్ ఓపెన్ చేశారు... అంతే... ఆ ఏరియా మొత్తం ఒక అరగంట సేపు తుపాకుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది... బోర్డర్ దాటిన ప్రతి ఒక్క టెర్రరిస్ట్ నేలకొరిగాడు... మాధవ్ తన టీం తో ఒకవైపు కాల్పులు జరుపుతూ సొరంగం వైపు పరిగెత్తాడు... ఇది గమనించిన కొంత మంది టెర్రరిస్ట్స్ సొరంగంలోకి దూరి పాకిస్తాన్ వైపు పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నించారు... ... మాధవ్ తన టీం తో సొరంగలోకి దూసుకెళ్లాడు... కనిపించిన ప్రతి టెర్రరిస్ట్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు... ఆ సొరంగం అంతా దాటుకుంటూ పాకిస్తాన్ భూభాగం లో అడుగు పెట్టి అక్కడ ఎవరైనా ఉన్నారేమోనని చెక్ చేసాడు... కొంతమంది పాకిస్తాన్ భూభాగం లోకి పారిపోయారు... సొరంగం ఎక్కడైతే మొదలవుతుందో... అక్కడ ఎవరో సడన్ గా కాల్పులు జరిపారు... దాంతో 4 ఇండియన్ సోల్జర్స్ కి బుల్లెట్స్ తగిలాయి... గౌతమ్ ఆ గన్ పేల్చిన వాడి వైపు దూసుకెళ్లాడు... గౌతమ్ అలా పరిగెత్తుకుని వస్తాడని పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఊహించలేదు... పారిపోవడానికి ప్రయత్నించాడు... లాభం లేకపోయింది... గౌతమ్ వాడి కాలికి గురిచూసి కాల్చాడు... వాడు తిరిగి కాల్చేలోపల ఇండియన్ ఆర్మీ వాడిని ప్రాణాలతో పట్టుకుంది... వాడిని సొరంగం మొత్తం ఈడ్చుకుంటూ భారత్ భూభాగంలోకి తీసుకొని వచ్చారు...

మాధవ్ కి ఒక ఐడియా వచ్చింది... వెంటనే బేస్ క్యాంపు కి ఫోన్ వచ్చిన పని అయ్యింది... పిక్ అప్ కావాలి... 4 సోల్జర్స్ కి బుల్లెట్స్ తగిలాయి... ఎయిర్ అంబులెన్సు పంపండి... వాటితో పాటు హెవీ ఎక్సప్లోజివ్ ని కూడా పంపమని ఇంస్ట్రుక్షన్స్ ఇచ్చాడు... ఆ హెలీకాఫ్టర్స్ రావడానికి రెండు గంటలు పట్టింది... ఈ లోపల ఇండియన్ ఆర్మీ సోల్డర్స్ సొరంగలోకి వెళ్లి చంపిన ప్రతి టెర్రరిస్ట్ ని ఈడ్చుకుంటూ ఇండియా వైపు తీసుకొని వచ్చి పడేసారు... హెలీకాఫ్టర్స్ రాగానే మాధవ్ తనతో పాటు ఒక 10 మంది సోల్డర్స్ ని వెంట పెట్టుకొని హెలికాఫ్టర్ లో వచ్చిన హెవీ ఎక్సప్లోజివ్స్ తీసుకొని సొరంగం ఎక్కడ మొదలవుతుందో అక్కడివెళ్ళాడు... ఆ సొరంగం మొదట్లో తాము తెచ్చిన హెవీ ఎక్సప్లోజివ్స్ ని అమర్చి తనతో పాటు వచ్చిన సోల్జదరిని వెనక్కి పంపేశాడు... వాళ్ళు సేఫ్ గా సొరంగం దాటారని నిర్ధారించుకొని... ఆ ఎక్సప్లోజివ్స్ నిప్పు పెట్టి ఇండియన్ భూభాగం వైపు పరిగెత్తుతూ గట్టిగా "భారత్ మాత కి జై" అని అరుస్తూ పరిగెత్తాడు... మాధవ్ సొరంగ సగం దాటాడో లేదో... పాకిస్తాన్ భూభాగం వైపు... సొరంగం ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ పెద్ద ఎత్తున ఎక్సప్లోజివ్స్ పేలడంతో ఆ సొరంగం మొత్తం రాళ్లతో నిండిపోయి శాశ్వతంగా మూసుకొని పోయింది... ఇది గమనించిన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పెద్ద ఎత్తున "భారత్ మాత కి జై" అంటూ గాల్లో కాల్పులు చేశారు...

అప్పటికే బాగా తెల్లవారడంతో చనిపోయిన టెర్రరిస్ట్స్ ఫొటోస్ తీసుకొని అక్కడికి వచ్చిన ఒక ట్రక్ లో ఆ శవాలని ఎక్కించారు...మొత్తం 47 మంది టెర్రరిస్ట్స్ ని చచ్చారు... మిగతా వాళ్ళు వెనక్కి పారిపోయారు... ఆ టెర్రరిస్ట్స్ ఇంక ఈ సొరంగాన్ని వాడుకోలేరు... పట్టుపడ్డ టెర్రరిస్ట్ తో సహా అందరూ హెలీకాఫ్టర్స్ ఎక్కి బేస్ క్యాంపు కి చేరుకున్నారు.

టెర్రరిస్ట్స్ దేశం లోకి రాకుండా ఆపినందుకు అందరి దగ్గరనుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి... గౌతమ్ పట్టుకున్న టెర్రరిస్ట్ ని ఐడెంటిఫై చేశారు... వాడి పేరు బుఖారి... వాడు LOC కి దగ్గలోవున్న 10 లాంచ్ పాడ్స్ కి ఇంచార్జి... ఇండియన్ ఆర్మీ వాడి కోసం చాలా కాలంగా వెతుకుతోంది... వాడి తలా మీద ₹10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది... ఆ రోజు జరిగిన ఆపరేషన్ లో గౌతమ్ ఒక పెద్ద చేపని పట్టుకున్నాడు...

గౌతమ్ కి కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చింది... టెర్రిరిస్ట్స్ దేశంలోకి రానియ్యకుండా ఆపడమేకాకుండా... ఎంతో ధైర్యంగా తన ప్రాణాలని పణంగా పెట్టి సొరంగాన్ని పేల్చేసిన మాధవ్ కి Lt కల్నల్ గా ప్రమోషన్ వచ్చింది... ఆ తరువాత గౌతమ్ ని మాధవ్ పెర్మనెంట్ గా తన టీం లో ఉంచుకున్నాడు... ఆ రోజు రాత్రి వాళ్ళు వెళ్లిన మిషన్ పేరు ... "OPERATION DAYBREAK"


Part - 7 - The Confession

మాధవ్ టీం లో గౌతమ్ చేరిన కొంత కాలానికి ఇండియన్ ఆర్మీ లో కొన్ని విప్లవాత్మక మార్పులు జరిగాయి. ఇండియన్ ఆర్మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది... మాధవ్ టీం OPERATION DAYBREAK లో పెద్ద ఎత్తున టెర్రరిస్ట్స్ ని మట్టుపెట్టింది మొదలు భారతదేశ సైన్యానికి ఒక రకమైన కొత్త ఉత్సాహం వచ్చింది... పాకిస్తాన్ లో ట్రైనింగ్ పొంది ఇండియా లో కి చొరబడే టెర్రరిస్ట్ కి ఎటువంటి రూల్స్... రెగ్యులేషన్స్ ఉండవు... వాళ్ళు ఎప్పుడైనా... ఎటునుంచైనా భారత దేశంలో చొరబడగలరు... ఏదైనా చేయగలుగుతున్నారు... అటువంటి టెర్రరిస్ట్ ని వారించి... వాళ్ళతో పోరాడే భారతీయ సైనికులకు మాత్రమే ఆంక్షలు ఎందుకు ఉండాలి? మనవాళ్ళు కూడా ఆ టెర్రరిస్ట్స్ లాగానే కిరాతకం గా ప్రవర్తించి... టెర్రరిస్ట్స్ తో ఎందుకు పోరాడకూడదు? ఒక టెర్రరిస్ట్ ని ప్రాణాలతో పట్టుకుంటే... దేశానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ... వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి... మీడియా కవరేజ్ విపరీతంగా ఉంటుంది... వాళ్ళని మానవతా దృక్పధం తో చూడాలని మానవ హక్కుల కమిషన్ వాళ్ళు పోరాటాలు చేస్తారు... అదే మానవ హక్కుల సంఘం ఒక్క సైనికుడి కోసం కూడా పోరాడదు... సరిగ్గా అదే సమయంలో ఒకరోజు ఆర్మీ చీఫ్ ఎవరికీ తెలియకుండా... అనఫిషియల్ గా... రికార్డ్స్ లో ఎక్కడా పేర్కొనకుండా... తనకి బాగా నమ్మకమైన కొంతమంది జనరల్స్ తో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టాడు... వాళ్లంతా ఆ రోజు గోల్ఫ్ ఆడుతూ మాట్లాడుకున్నారు...

ఆర్మీ చీఫ్ : మొన్న జరిగిన OPERATION DAYBREAK లో మనకి టెర్రరిస్ట్స్ సొరంగాలు తవ్వారని తెలిసింది... ఈ విషయం ఢిల్లీ కి తెలియడం తో ఆఫీషియల్ ఆపరేషన్ చేయాల్సివచ్చింది... ఆఫీషియల్ ఆపరేషన్ అంటే... రూల్స్... రెగ్యులేషన్స్ పాటించాలి... ఆరోజు మనవాళ్ళు ఒక సొరంగాన్ని బాంబులు పెట్టి పేల్చి... మూసేసారు... THAT WAS GREAT... కానీ... ఇలాంటి సొరంగాలు ఇంకా ఎన్ని ఉన్నాయి?

జనరల్ 1 : మీరు చెప్పింది నిజమే... ఇంకా చాలా సొరంగాలు ఉండే ఛాన్స్ ఉంది. రూల్స్ ప్రకారం వెళితే... ఆ సొరంగాలను కనిపెట్టి మూసేయడానికి చాలా కాలం పడుతుంది... పొలిటికల్ బాసులు కి తెలియకుండా ఏమి చెయ్యలేము...

జనరల్ 2 : నా దగ్గర ఒక ఐడియా ఉంది...

ఆర్మీ చీఫ్ : ఏమిటీ ఆ ఐడియా...

జనరల్ 2 : మనం కూడా ఒక సీక్రెట్ టీం ని తయారుచేసి వాళ్ళకి విపరీతమైన అధికారాలు ఇచ్చి... వాళ్ళు ఏమి చేసినా ప్రశ్నించకుండా... వాళ్లకి ఏమి కావాలంటే అది ఇచ్చి... ఇండియా లోకి వచ్చే టెర్రరిస్ట్స్ ని ఆపడం... బోర్డర్ దగ్గర ఉన్న సొరంగాలు కనిపెట్టి వాటిని మూసెయ్యడం... అవసరమైతే... బోర్డర్ క్రాస్ చేసి పక్క దేశం లోకి వెళ్లి ట్రైనింగ్ క్యాంప్స్... లాంచింగ్ పాడ్స్ వివరాలు సేకరించడం... కుదిరితే వాటిని నాశనం చెయ్యడం...

ఆర్మీ చీఫ్ : ఐడియా బానే ఉంది... విపరీతమైన అధికారాలు ఇవ్వడం మంచిది కాదని నా అభిప్రాయం... మనం రెండు టీమ్స్ ని తయారుచేద్దాం... వాటి వివరాలు ఎక్కడ రికార్డ్స్ లో ఉండకూడదు. TEAM ONE - వీళ్ళు పని సొరంగాలు కనిపెట్టి వాటిని నాశనం చెయ్యడం... TEAM TWO - వీళ్ళ పని దెస సరిహద్దులు దాటి పక్క దేశం లోకి వెళ్లి... ట్రైనింగ్ క్యాంప్స్... లాంచింగ్ పాడ్స్... ని కనిపెట్టి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం... ఈ రెండు టీమ్స్ SPECIAL OPERATIONS టీమ్స్... DEATH SQUADS... వీళ్ళ గురించి ఎటువంటి రికార్డ్స్ ఉండవు. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ కి పట్టుబడ్డా... లేదా చనిపోయినా వాళ్ళని ఇండియన్ ఆర్మీ పట్టించుకోదు. వాళ్ళు ఏమి చేసినా... ఎలా చేసినా... ఇండియన్ ఆర్మీ పట్టించుకోదు... వాళ్ళు బ్రతికి వెనక్కి వస్తే... వాళ్లకి ఆఫీషియల్ గా ఎటువంటి పతకాలు... ప్రమోషన్స్ లభించవు... ఇలాంటి షరతులకు లోబడి పనిచేసే వాళ్ళు దొరికితే ఈ రెండు టీమ్స్ ని తయారుచేయండి... వాళ్లకి కావాల్సిన పరికరాలు ఇవ్వండి...

ఈ ఐడియా అందరికి బాగా నచ్చింది... వెంటనే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మంచి మంచి సైనికుల్ని 20 మందిని సెలెక్ట్ చేశారు... ఫ్రంట్ లైన్ సోల్జర్స్ తో పాటు టెక్నికల్ స్టాఫ్ ని కూడా సెలెక్ట్ చేశారు... వాళ్లలో మాధవ్... గౌతమ్ కూడా ఉన్నారు...సొరంగాలను వెతికి నాశనం చేసే మిషన్ కి OPERATION MOUSETRAP అని పేరు పెట్టారు... దేశం దాటి పక్క దేశానికి వెళ్లి టెర్రర్ క్యాంప్స్ ని కనిపెట్టి నాశనం చేసే మిషన్ కి OPERATION LIGHTHOUSE అని పేరు పెట్టారు... మాధవ్... గౌతమ్ OPERATION LIGHTHOUSE టీం తో కలసి ఒకరోజు రాత్రి భారతదేశ సరిహద్దులు దాటి పక్క దేశం లో అడుగు పెట్టారు... (ఇక్కడితో గౌతమ్ కి చెందిన మొదటి ఫ్లాష్ బ్యాక్ సమాప్తం)


(కథ వర్తమానంలోకి వచ్చింది)

గౌతమ్ నడుపుతున్న కార్ ఢిల్లీ లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో లోకి ప్రవేశించింది... అప్పుడు సమయం ఉదయం 5 గంటలు దాటింది... నేరుగా బ్రిగేడియర్ మాధవ్ రావు ఇంటి దగ్గరకి వెళ్లి కార్ ఆపాడు... ఇంటి ముందు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఉంది... అందులోంచి ఒక ఆర్మీ జవాన్ బయటకి "ఎవరు కావాలి" అని అడిగాడు... గౌతమ్ " బ్రిగేడియర్ సాబ్ ని అర్జెంటుగా కలవాలి... నా CODE NAME - BUDUGU... ఫోన్ చేసి సాబ్ కి చెప్పు" అని అన్నాడు... గౌతమ్ కి మాధవ్ పెట్టిన ముద్దు పేరు "బుడుగు" ఈ ముద్దు పేరు ఆర్మీ లో ఎవరికీ తెలియదు... LOC లో OPERATION LIGHTHOUSE సమయంలో మాధవ్ గౌతమ్ ని బుడుగు అని పిలిచేవాడు... సెక్యూరిటీ గార్డ్ తన మొబైల్ ఫోన్ లో మాధవ్ కి ఫోన్ చేసాడు... మాధవ్ అప్పటికే నిద్ర లేచి ట్రేడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తున్నాడు... సెక్యూరిటీ గార్డ్ చెప్పింది వినగానే... మాధవ్ కి ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయ్యింది... తాను విన్నది నిజమో కాదో అర్ధం కాలేదు... ఆ సెక్యూరిటీ గార్డ్ ని రెట్టించి అడిగాడు... రెండోసారి సెక్యూరిటీ గార్డ్ చెప్పింది విని... ట్రేడ్ మిల్ ఆఫ్ చేసి... అదిరే గుండెల తో బయటకి వేగంగా పరిగెత్తాడు... మాధవ్ ని చూడగానే గౌతమ్ కార్ దిగి నుంచున్నాడు... ఆ సమయం లో ఢిల్లీ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా లో పొగ మంచు చాలా దట్టంగా ఉంది... మాధవ్ కి ఆ పొగమంచు లో ఒక దయ్యం... భూతం... లాగా గౌతమ్ కనిపించాడు... గౌతమ్ ని చూడగానే మాధవ్ స్టన్ అయ్యాడు... తన ముందు నుంచున్నది నిజంగా గౌతమేనా... లేక గౌతమ్ ని పోలిన వేరే మనిషా... నమ్మకం కలగక కళ్ళు నులుముకుని చూసాడు... మాధవ్ తన జీవితం లో ఎన్నోసార్లు చనిపోయాడనుకున్న సైనికులు కొంత కాలం తరువాత బ్రతికి రావడం చూసాడు... విన్నాడు... కానీ... చనిపోయాడనుకున్న తన ఆప్త మిత్రుడు ఒక్కసారిగా ప్రత్యక్షమవడం తో స్టన్ అయ్యాడు... నెమ్మదిగా తేరుకొని... సెక్యూరిటీ గార్డ్ తో "గేట్ ఖోల్ కె ఐస్ ఆద్మీ కో అండర్ అనే దీజీయే..." అని అన్నాడు... సెక్యూరిటీ గార్డ్ గేట్ ఓపెన్ చేసాడు... గౌతమ్ కార్ ని ఇంటి దగ్గర పార్క్ చేసి... మాధవ్ కోసం వెయిట్ చేసాడు... మాధవ్ కూడా గేట్ దగ్గరనుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు... అప్పటికే మాధవ్ బయటకు పరిగెత్తడం గమనించిన మాధవ్ భార్య కవ్లీన్  కూడా బయటకు వచ్చి... గౌతమ్ ని చూసి... కెవ్వున కేక పెట్టి... "బాప్ రే... గౌతమ్ జిందా హై" అంటూ కొంచం ఆశ్చర్యం... ఆనందం... తో గట్టిగా అరిచింది... ముగ్గురూ ఇంట్లో కి వెళ్లారు... మాధవ్... గౌతమ్... ఎదురెదురుగా సోఫా లో కూర్చున్నారు... ఇద్దరూ మాట్లాడ కుండా మౌనంగా ఉన్నారు. ఇంతలో కవ్లీన్ ఇద్దరికీ కాఫీ తీసుకొని వచ్చి ముందుగా గౌతమ్ కి ఇచ్చి తరువాత రెండో కప్ మాధవ్ కిఇచ్చి తాను కూడా ఇంకో కప్ తీసుకొని మాధవ్ పక్కన కూర్చొని...

కవ్లీన్ : గౌతమ్ అసలు ఏమి జరిగింది? నువ్వు చనిపోయావని ఆర్మీ కి మెసేజ్ వచ్చింది... నీ తమ్ముళ్లు వచ్చి నీ డెత్ సర్టిఫికెట్ చూపించి నీకు రావాల్సిన బెనిఫిట్స్ ని నెక్స్ట్ కిన్ వాళ్ళే కావడం తో అన్ని తీసుకొని వెళ్లారు...

మాధవ్ : నాకు ఫోన్ కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నావా? ఇన్నాళ్లు నన్ను ఎందుకు కలవలేదు?

గౌతమ్: ఆడో పెద్ద కథ... అన్ని రకాలుగా మోసపోయాను... నా అనుకున్నవాళ్ళు నన్ను నిలువునా ముంచేశారు...

మాధవ్ : అసలు ఏమి జరిగింది?

గౌతమ్ చెప్పడం మొదలెట్టాడు... ఆర్మీ లో 20 ఏళ్ళు పనిచేసాక... రిటైర్ అయ్యి స్వగ్రామానికి వెళ్లడం... అక్కడ అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనలు... కుటుంబ సభ్యుల స్వార్ధానికి ఎలా బాలి అయ్యాడు... ఎన్ని కస్టాలు పడ్డాడు... చివరికి ఎలా న్యూ ఢిల్లీ చేరుకున్నాడు... ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ గురించి ఆరా తియ్యడం... ఓరియన్ గ్రూప్ లో దూరి JUICE JACKING చెయ్యడం... ఇమెయిల్... మొబైల్ హ్యాండ్ సెట్స్ ని హాక్ చెయ్యడం... ₹255 కోట్లు కొట్టెయ్యడం... యాక్సిడెంటల్ గా STEGANOమెసేజెస్ కనిపెట్టడం... వాటిని డీకోడ్ చేయడం... ప్రవీణ్ కుమార్ గురించి తెలుసుకోవడం... బుక్ షాప్... డ్రాప్ బాక్స్ ని కనిపెట్టడం... ఇద్దరు కౌరియర్స్ ని కనిపెట్టడం... ఇన్ఫర్మేషన్ ప్రోసెసర్ ని కనిపెట్టడం... మైక్రో డాట్ సాఫ్ట్ వేర్ ని కనిపెట్టడం... అన్ని విషయాలు చెప్పాడు... మాధవ్... కవ్లీన్ కన్నార్పకుండా గౌతమ్ చెప్పింది విన్నారు... చివరికి కవ్లీన్ "ఓహ్ మై గాడ్... ఇంత జరిగిందా..." అని అన్నది... మాధవ్ మాత్రం గంభీరంగా గౌతమ్ వైపు చూస్తూ

మాధవ్ : నువ్వు స్పృహలోకి రాగానే నాకు ఎందుకని ఫోన్ చెయ్యలేదు?

గౌతమ్: ఎస్... అది నా తప్పే... మీకు వెంటనే చెప్పి ఉండాల్సింది... కానీ... జరిగిన సంఘటనల వల్ల మిమ్మల్ని వీలయినంత దూరంగా ఉంచాలని మీతో నే కాదు... ఆర్మీ లో ఎవరితోనూ కాంటాక్ట్ పెట్టుకోలేదు... ఇప్పుడు నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు ఇవ్వాలి... నేను ఆల్రెడీ ఒక క్రైమ్ చేసాను... పైగా నేను ఇండియా లో గవర్నమెంట్ లెక్కల ప్రకారం I AM A DEAD MAN...

మాధవ్: అదంతా నాకు అనవసరం... నీకు స్పృహ రాగానే... నువ్వు నాకు ఫోన్ చేసి... నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావో నాకు చెప్తే... నేనే నీకు హెల్ప్ చేసేవాడిని... నీ కుటుంబ సభ్యులు మొదటి నుంచి నీకు పెద్ద ఎత్తున ద్రోహం చేస్తున్నారు. నువ్వు చనిపోలేదని నేను అప్పుడే ప్రూవ్ చేసి నీకు న్యాయం చేసేవాడిని. నువ్వు స్పృహలోకి వచ్చాక చాలా కాలం మౌనంగా ఉండడంతో... సిట్యుయేషన్ చెయ్యి దాటి పోయింది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీకు ఎటువంటి సహాయం చెయ్యలేని పరిస్థితిలోకి నన్ను నెట్టేసావు... ఆ డాక్టర్ ఎవరు? వాడికి మన OPERATION LIGHTHOUSE గురించి డీటెయిల్స్ తెలుసా...??

గౌతమ్: లేదు. నేనేమి చెప్పలేదు... ఆ డాక్టర్ పెద్ద ప్రాబ్లెమ్ కాదు. ఒకప్పుడు త్రివేండ్రం లో మంచి పేరున్న జనరల్ సర్జన్... గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేసేవారు. ఆయన ఆపరేషన్ చేసిన ఒక సెలెబ్రెటీ  పేషెంట్ చనిపోవడం తో పెద్ద కేసు అయ్యింది. అది తప్పించుకోవడానికి ఆ డాక్టర్ కేరళ నుంచి పారిపోయి ఆంధ్ర ప్రదేశ్ వచ్చి మా వూరికి దగ్గర చిన్న క్లినిక్ పెట్టుకుని బతుకుతున్నారు. నన్ను సేవ్ చేసినప్పుడు OPERATION LIGHTHOUSE కి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి... అది చూసి డాక్టర్ భయపడ్డాడు... నన్ను డీటెయిల్స్ ఏమి అడగలేదు... నేను కూడా ఏమి చెప్పలేదు...

మాధవ్ : ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడున్నాడో తెలుసా?

గౌతమ్ : లేదు. అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ ఎప్పుడూ ఆ డాక్టర్ ని కాంటాక్ట్ చేయలేదు... డబ్బులు చేతికి వచ్చాక ఆ ఊరి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు... నేను కూడా పట్టించుకోలేదు...

మాధవ్ : ఈ విషయం అంత చిన్నది కాదు... నాకు తెలిసిన ఇంకో వ్యక్తి ని కూడా ఇంవోల్వ్ చెయ్యాలి...

మాధవ్ ఫోన్ చేసి రవీంద్ర ని అర్జెంటు గా తన ఇంటికి రమ్మని చెప్పి ... గౌతమ్ తో "నేను స్తానం చేసి వస్తాను... ఈ లోపల నా ఫ్రెండ్ వస్తాడు.." అని చెప్పి లోపలి వెళ్ళాడు...

మాధవ్ రెడీ అయ్యి వచ్చేటప్పటికి రవీంద్ర వచ్చాడు. అందరూ బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగుతున్నప్పుడు మాధవ్ అన్ని విషయాలు రవీంద్ర కి చెప్పాడు... గౌతమ్ కార్ నుంచి డాకుమెంట్స్ ఉన్న బాక్స్ ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. దాదాపు 6 గంటల పాటు ముగ్గురూ ఒక్కో డాక్యుమెంట్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేశారు. రవీంద్ర చాలా సీరియస్ ప్రతి డాక్యూమెంట్ ని చెక్ చేసాడు... కొంచం సేపు మౌనంగా ఉండిపోయాడు. చివరికి...

రవీంద్ర : మా డిపార్టుమెంటు కి ఈ మధ్య ఒక ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది... ఢిల్లీ లోని సెంట్రల్ సెక్రటేరియట్ తో పాటు కొన్ని ముఖ్యమైన మినిస్ట్రీస్ లో ఇన్ఫర్మేషన్ లీక్ అవుతోందని... కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తోందని... ఇన్వెస్టిగేట్ చెయ్యమని ఒక రిక్వెస్ట్ వచ్చింది... మేము ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము.పెద్దగా ప్రోగ్రెస్ లేదు... గౌతమ్ చేసిన పనికి... ఇన్ఫర్మేషన్ చివరికి ఎక్కడికి చేరుతోందో తెలిసింది... ఆ ఎండ్ యూజర్ గంగూలీ ని ట్రాక్ చేస్తాము... ఇప్పుడు అసలు ఈ ఇన్ఫర్మేషన్ అతుల్ మాథుర్ దాకా ఎలా వెళ్తోంది? ఎవరు పంపిస్తున్నారు?

మాధవ్(గౌతమ్ తో): నువ్వు రవీంద్ర కి టచ్ లో ఉండు... ఏదైనా హెల్ప్ కావాలంటే చెయ్యి...

రవీంద్ర : గౌతమ్ ఒక DEAD MAN WALKING... మనకి ఒక GHOST OPERATIVE లాగా పనికి వస్తాడు. డిపార్టుమెంటు కి తెలియకుండా గౌతమ్ ఐడెంటిటీ లో జాగ్రత్తగా కాపాడాలి...

మాధవ్ : అవును... గౌతమ్ చాలా మంచి రిసోర్స్... టెక్నికల్ నాలెడ్జ్ బాగుంది. నమ్మకస్తుడు... ముందుగా గౌతమ్ ని ఒక సెక్యూర్ లొకేషన్ కి తరలించాలి...

రవీంద్ర : ఆ విషయం నాకు వదిలెయ్యి... అవసరమైతే... వేరే వూరు పంపుదాం... మా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ లో గౌతమ్ ఇన్వాల్వ్మెంట్ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి...

మాధవ్ : గుడ్ ఐడియా... అవసరమైతే హైదరాబాద్ పంపుదాం... అక్కడ కరుణాకర్... శేఖర్ ఉన్నారు... లేదంటే... ముంబయి పంపుదాం... అక్కడ అవినాష్ ఉన్నాడు...

రవీంద్ర : అవును... ఆప్షన్స్ ఉన్నాయి... ప్రస్తుతానికి గౌతమ్ కామ్ గా ఉంటాడు... ప్రతిరోజూ ప్రవీణ్ బుక్ షాప్ లో బుక్ డ్రాపింగ్ ... పిక్ అవుతుందో లేదో మానిటర్ చెయ్యాలి...

గౌతమ్: నేను ప్రవీణ్... సక్సేన ఫోన్స్ ని టాప్ చేసాను... ఎక్కడికి వెళ్లకుండా డ్రాప్ బాక్స్ ని మానిటర్ చెయ్యగలను...

రవీంద్ర(గౌతమ్ తో) : నేను ఈ డాకుమెంట్స్ ని ఇంకో సారి జాగ్రత్తగా స్టడీ చేసి మిమ్మల్ని  కాంటాక్ట్ చేస్తాను... మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి...

గౌతమ్ తన కాంటాక్ట్ డీటెయిల్స్ మాధవ్... రవీంద్ర... ఇద్దరికి ఇచ్చాడు... రవీంద్ర వెళ్ళిపోయాడు... మాధవ్ కి ఇంకా కోపం తగ్గలేదు..." నువ్వు స్పృహ లోకి రాగానే నాకు ఫోన్ చేసి ఉండాలి... ఈ ప్రాబ్లెమ్ వచ్చేది కాదు..." అని అన్నాడు... కొంచం సేపు మాధవ్ తో మాట్లాడి... గౌతమ్ గురుగ్రామ్ కి బయలుదేరాడు... కార్ నడుపుతున్న గౌతమ్ ఆలోచనలు గతం లోకి మళ్ళాయి...


PART - 8 - THE FLASHBACK

గౌతమ్ కి ఆర్మీ లో జీవితం చాలా బాగా సాగింది. కొత్త ప్రదేశాలు... కొత్త మనుషులు... ముందుగా పూణే లో ట్రైనింగ్... ఢిల్లీ లో "లిజనింగ్ పోస్ట్" లో ఉద్యోగం... "లిజనింగ్ పోస్ట్" లేదా "లిజనింగ్ స్టేషన్" అనేది ప్రతి దేశ మిలిటరీ లో సెట్ అప్ లో ఒక ముఖ్య భాగం... రేడియో ట్రాన్స్మిషన్ ద్వారా ప్రయాణించే ధ్వని తరంగాల లోని సందేశాలు ఒక ప్రత్యేకమైన... ఆధునిక పరికరాల ద్వారా తెలుసుకునే విధానాన్ని MILITARY RECONNAISSANCE అని అంటారు... మన దేశంలో చాలా చోట్ల ఈ "లిజనింగ్ పోస్ట్" లేదా "లిజనింగ్ స్టేషన్" లు వున్నాయి... మన దేశానికి ఆనుకొని వున్న దేశాలు ముఖ్యంగా పాకిస్తాన్... చైనా... బంగ్లాదేశ్... బర్మా... దేశాలనుంచి వచ్చిన సీక్రెట్ సందేశాల్ని మన దేశ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి క్షణం చాలా అలెర్ట్ గా వింటూ ఉంటుంది... అదే రకంగా మన దేశ మిలిటరీ మెసేజెస్ ని కూడా వేరే దేశ మిలిటరీ వాళ్ళు కూడా వింటూ వుంటారు... అయితే... ఈ మెసేజెస్ అన్ని ఒక కోడెడ్ లేదా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటాయి... వాటిని డీకోడ్ చేయడం ఈ "లిజనింగ్ పోస్ట్" లేదా "లిజనింగ్ స్టేషన్" ల ముఖ్య ఉద్దేశ్యం... ఒక్కోసారి కొన్ని దేశాలు కలసి కూడా జాయింట్ గా "లిజనింగ్ పోస్ట్" లేదా "లిజనింగ్ స్టేషన్" ను ఏర్పాటు చేసుకుంటారు... ఉదాహరణకి USA, UK, CANADA, AUSTRALIA మరియు NEW ZEALAND... ఈ అయిదు దేశాలు కలసి ఒక పెద్ద "లిజనింగ్ పోస్ట్" లేదా "లిజనింగ్ స్టేషన్" ని నెలకొల్పాయి... దాని పేరు ECHELON... దీనికి ఇంకో పేరు కూడా వుంది... FIVE EYES... అంటే అయిదు దేశాలు అని అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టారు...

గౌతమ్ తన తెలివితేటలతో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కు వచ్చే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ డీకోడ్ చెయ్యడంలో మన దేశ మిలిటరీ కి చాలా సహాయపడ్డాడు... ముఖ్యంగా URI సెక్టార్ లో మాధవ్ ని కలవడం... ఆపరేషన్ డే బ్రేక్...ఆపరేషన్ లైట్ హౌస్... ఆపరేషన్ ఆస్మాన్... ఇలా చాలా సార్లు దేశం కోసం ప్రాణాలు లెక్క చెయ్యకుండా అతి ప్రమాదమైన ప్రదేశాలకి వెళ్లి పనిపూర్తి చేసుకొని వచ్చాడు. వాటిలో అతి ముఖ్యమైనది ఆపరేషన్ లైట్ హౌస్... ఆరు నెలలపాటు పాకిస్తాన్ దేశం లో వాళ్ళ ఆర్మీ నిర్వహిస్తున్న టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ కి సంభందించిన లొకేషన్ వివరాలు అతి రహస్యంగా భారత్ కి చేరవేసి ఆ ట్రైనింగ్ క్యాంప్స్... లాంచ్ పాడ్స్ ని నాశనం చెయ్యడంలో మాధవ్ కి ఎంతో ఉపయోగపడ్డాడు.

ఆక్రమిత కాశ్మీర్ లో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తారు. ఆ టెర్రర్ ట్రైనింగ్ నాలుగు స్టేజెస్ లో జరుగుతుంది.స్టేజి 1 ప్రాధమిక దశ... 20 రోజుల పాటు సాగుతుంది...స్టేజి 2 మధ్యస్థ దశ... 21 రోజులు... స్టేజి 3 అడ్వాన్సుడ్ ట్రైనింగ్ ... 75 రోజులు...స్టేజి 4 ఎక్సపర్ట్ ట్రైనింగ్... 30 రోజులు... ఆ ట్రైనింగ్ సమయంలో స్టెరాయిడ్స్... డ్రగ్స్ కూడా వాడతారు. అడ్వాన్సుడ్ స్టేజి ట్రైనింగ్ ఇవ్వడానికి పాకిస్తాన్ ఆర్మీ నుంచి సోల్జర్స్... ఆఫీసర్స్ వస్తారు... రకరకాల టెర్రర్ ఆర్గనైజేషన్స్ కి సంభందించిన వ్యక్తులు... ఒక్కోసారి విదేశీయులు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తారు. ట్రైనింగ్ లో IED (IMPROVISED EXPLOSIVE DEVICES) బాంబ్స్ తయారుచెయ్యడం... వెపన్స్ ని వాడడం బాగా నేర్పుతారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక టెర్రరిస్ట్స్ ని ఇండియా లోకి పంపడానికి ఒక చోట చేరుస్తారు... ఆ ప్రాంతాన్ని "లాంచ్ పాడ్" అంటారు... సరైన సమయం చూసుకొని ఆ "లాంచ్ పాడ్స్" నుంచి టెర్రరిస్ట్స్ భారత్ దేశం లోకి చొరపడతారు.

మాధవ్ టీం ఈ ట్రైనింగ్ క్యాంప్స్... లాంచ్ పాడ్స్ కి సంభందించిన లొకేషన్ డీటెయిల్స్ ని చాలా కష్టపడి సంపాదించారు. ఆ డీటెయిల్స్ ని డీకోడ్ చేసి ఆ మెసేజెస్ ని శత్రువులకు అందకుండా న్యూ ఢిల్లీ చేరవేయడంలో గౌతమ్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. న్యూ ఢిల్లీ కి చేరిన మెసేజెస్ లోని డీటెయిల్స్ ప్రకారం... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి శత్రు స్థావరాలని నాశనం చేశారు. ఇంకోసారి దుబాయ్ లో 4 నెలలు కష్టపడి పాకిస్తాన్ మిలిటరీ కి సంభందించిన క్రిప్టోగ్రాఫిక్ కీ ని సంపాదించి భారతదేశానికి తీసుకొని వచ్చారు. కొంత కాలానికి న్యూ ఢిల్లీ లో పోస్టింగ్ వచ్చింది. నాలుగేళ్లు ఢిల్లీ లో గడిపాడు. ఒకరోజు... షాపింగ్ చేయడానికి న్యూ ఢిల్లీ లోని సౌత్ ఎక్సటెన్షన్ షాపింగ్ సెంటర్ కి వెళ్ళాడు. పెద్ద గా షాపింగ్ ఏమి చెయ్యలేదు... జస్ట్ అటూ.... ఇటూ... సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1... పార్ట్ 2 లో విండో షాపింగ్ చేయసాగాడు... ప్రతి రోజు లాగానే SOUTH EX షాపింగ్ ఏరియా చాలా హడావిడిగా వచ్చి... పోయే కస్టమర్స్ తో కళకళలాడుతోంది... చాలా సేపు అక్కడ గడిపిన తరువాత వెనక్కి ఆర్మీ కంటోన్మెంట్ కి వెళ్లబోతుండగా సడన్ గా గౌతమ్ కి ఒక అమ్మాయి కనిపించింది... ఆమె చాలా అందంగా ఉంది... పొడుగ్గా... సన్నగా బాపు బొమ్మలాగా ఉంది... జీన్స్ ప్యాంటు... టీ షర్ట్ వేసుకొని మెడలో ఒక సిల్క్ స్కార్ఫ్ ని అందంగా చుట్టుకొని వుంది... గౌతమ్ తనకి తెలుయకుండానే ఆమె వెనకాలే వెళ్ళసాగాడు... ఆమె మొదట ఒక బట్టల దుకాణంలోకి వెళ్ళింది. గౌతమ్ కూడా ఆమె వెనకాలే ఆ షాప్ లోకి వెళ్ళాడు... గౌతమ్ ఆమెని ఫాలో అవ్వడం ఆమె చాలా త్వరగానే కనిపెట్టింది... మొదట్లో గౌతమ్ ని ఎవరో రోడ్ సైడ్ రోమియో అని అనుకుంది... ఆమెకి అనుమానం రాకుండా గౌతమ్ అదే షాప్ లో కుర్తా... పైజామా లు చూడసాగాడు... ఆమె దాదాపు ఒక 30 నిమిషాలు రకరకాల బట్టలు చూసి ఏమి కొనకుండా బయటకి వచ్చేసింది... ఆ తరువాత ఆమె నేరుగా LEE జీన్స్ షాప్స్ లోకి వెళ్ళింది... గౌతమ్ కూడా అదే షాప్ లోకి వెళ్ళాడు... అప్పుడు ఆమె గౌతమ్ ని చాలా జాగ్రత్తగా గమనించింది... చాలా డిగ్నిఫైడ్ గా... ఒక జెంటిల్మన్ లాగా కనిపించాడు... ఇంకొంచం పరీక్షగా చూసింది... గౌతమ్... హెయిర్ కట్... ఫిజికల్ అప్పీరెన్స్... చాలా డిఫరెంట్ వుంది... ఆర్మీ క్రూ హెయిర్ కట్... రేబాన్ గ్లాస్సెస్... మంచి ఖరీదైన డ్రెస్ చూడగానే ఆమెకి అర్ధమయ్యింది... 'వీడెవడో ఆర్మీ వాడి లాగా వున్నాడు' అని మనసులో అనుకుంది...

ఆ షాప్ లో కూడా ఏమి కొనకుండానే ఒక 30 నిమిషాలు అన్ని రకాల డ్రెస్సులు చూసి బయటకి వచ్చి ఆటో ఎక్కింది. అది గమనించిన గౌతమ్ కూడా ఇంకో ఆటో ఎక్కి ఆమెని వెంబడించాడు. ఆమె ఎక్కిన ఆటో ఒక 20 నిమిషాలు ప్రయాణించి లోధీ గార్డెన్ లో ఒక బిల్డింగ్ ముందు ఆగింది. ఆమె ఆటో కి డబ్బులు ఇచ్చి బిల్డింగ్ లోపలికి వెళ్ళింది... గౌతమ్ అదే బిల్డింగ్ కి దగ్గరలో ఆటో దిగి ఆ బిల్డింగ్ వైపు వెళ్ళాడు... ఆ బిల్డింగ్ ముందు ఒక బోర్డు మీద Alliance Française de Delhi అని వ్రాసి ఉంది... ఆ బిల్డింగ్ ఫ్రెంచ్ ఎంబసీ కి సంభందించినది... ఫ్రెంచ్ ఎంబసీ వాళ్ళు ఇండియా లో ఔత్సాహికులకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్పడం... ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికెట్ ఇస్తారు. గౌతమ్ బిల్డింగ్ లోకి వెళ్ళబోతే... సెక్యూరిటీ గార్డ్ అతడిని ఆపేసాడు... గౌతమ్ ఆ గార్డ్ తో "నేను ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వచ్చాను... కోర్స్ డీటెయిల్స్ కనుక్కోవాలి" అని అన్నాడు. సెక్యూరిటీ గార్డ్ గౌతమ్ ని పైనించి కింద దాకా ఎగా దిగా చూసి... తానే స్వయంగా గౌతమ్ ని వెంటపెట్టుకుని రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు తీసుకెళ్లాడు. గౌతమ్ రిసెప్షన్ లో దాదాపు ఒక అరగంట సేపు ఫ్రెంచ్ లాంగ్వేజ్ కోర్స్ డీటెయిల్స్... ఫీ డీటెయిల్స్... అన్ని వివరాలు పదే పదే అడిగి తెలుసుకున్నాడు... ఆ రిసెప్షనిస్ట్ కి అనుమానం వచ్చి... "మీరు నిజంగానే ఫ్రెంచ్ లాంగ్వేజి నేర్చుకోవాలనుకుంటున్నారా... లేక ఎదో టైం పాస్ చెయ్యడానికి వచ్చారా?" అని అడిగింది... దానికి బదులుగా గౌతమ్ తన ఆర్మీ ID చూపించి... "I AM GENUINELY INTERESTED... JUST WANNA MAKE SURE I COLLECT ALL THE DETAILS" అని అన్నాడు... ఆ తరువాత తనతో పాటు వచ్చిన గార్డ్ గౌతమ్ ని వెంట పెట్టుకుని బయటకు తీసుకొని వచ్చి అదోలా నవ్వుతూ... "ఆప్ అబ్ జాయియే..." అని అన్నాడు...

గౌతమ్ ఆమె కోసం దాదాపు రెండు వారాలు పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ Alliance Française de Delhi చుట్టూ తిరిగాడు...ఫలితం లేదు... ఆమె జాడ తెలియలేదు. చాలా నీరసపడ్డాడు... ఒక రోజు ఆర్మీ ఆఫీసర్స్ మెస్ లో పెద్ద పార్టీ జరిగింది. గౌతమ్ కూడా ఆ పార్టీ కి ఫుల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాడు... అక్కడ ఆఫీసర్స్ తో మాట్లాడుతుండగా... గౌతమ్ కి సడన్ గా తను గత రెండు వారాలుగా వెతుకుతున్న అమ్మాయి ప్రత్యక్షమయింది... గౌతమ్ మొదట నమ్మలేకపోయాడు. ఆ రోజు ఆమె లైట్ బ్లూ కలర్ బిన్నీ సిల్క్ సారీ కట్టుకున్నది... చాలా అందంగా వుంది... గౌతమ్ ఆమెను చాలా సేపు దూరం నుంచి గమనించాడు. ఆమెను ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక తికమక పడసాగాడు... సరిగ్గా అదే సమయంలో గౌతమ్ వెనక నుంచి "చాలా సేపటినుంచి గమనిస్తున్నాను... ఇంకా ఎంతసేపు దూరంగా నుంచొని చూస్తూ ఉంటావు? వెళ్లి పరిచయం చేసుకో... ఆ బ్లూ సిల్క్ సారి పేరు షెఫాలీ... జనరల్ గైక్వాడ్ కూతురి ఫ్రెండ్... వెళ్లి పరిచయం చేసుకో..." అని వెనక నుంచి ఒక లేడీ వాయిస్ చెప్పింది... ఆ వాయిస్ ఎవరిదో గౌతమ్ కి బాగా తెలుసు... మాధవ్ భార్య కవ్లీన్... వెనక్కి తిరిగి చూడకుండా మనసులో నవ్వుకుంటూ... "థాంక్స్ మేడం..." అని అంటూ ముందుకెళ్లి షెఫాలీ తో "హాయ్... ఐ యామ్ గౌతమ్... కెప్టెన్ ఇన్ ది ఆర్మీ... మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్??" అని అన్నాడు... షెఫాలీ ఒక నిమిషం గౌతమ్ ని పైనుంచి కిందదాకా తేరిపార చూసింది... ఆరడుగుల ఎత్తు... చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు... ఆర్మీ యూనిఫామ్ లో చాలా స్టైల్ గా... కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. షెఫాలీ నవ్వుతూ "మాధవ్ భార్య కవ్లీన్ మీ గురించి ఇప్పుడే చెప్పింది... ఐ యాం షెఫాలీ... లాంగ్వేజ్ స్పెషలిస్ట్..." అంటూ పరిచయం చేసుకుంది. ఆ రోజు పార్టీ లో వాళ్ళు ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు క్లోజ్ గా మాట్లాడుకోవడం అందరూ చూసారు.

రోజులు గడుస్తున్నాయి... క్రమంగా గౌతమ్... షెఫాలీ ల పరిచయం ప్రేమగా మారింది. షెఫాలీ కి Alliance Française de Delhi లో ఇన్స్ట్రక్టర్ గా జాబ్ వచ్చింది. గౌతమ్ వెంటనే ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి Alliance Française de Delhi లో చేరాడు... మొదట్లో షెఫాలీ కి దగ్గరగా ఉండడానికి మాత్రమే లాంగ్వేజ్ కోర్స్ లో చేరిన గౌతమ్... క్రమంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు సంపాదించాడు. ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యి డిప్లొమా సంపాదించాడు. ఆ తరువాత వాళ్లిద్దరూ ఎప్పుడూ ఫ్రెంచ్ భాషలోనే ఎక్కువగా మాట్లాడుకునేవారు. 3 ఏళ్ళు చూస్తుండగానే కాల గర్భం లో కలిసిపోయాయి. గౌతమ్ తండ్రి ఒకసారి ఢిల్లీ వచ్చినప్పుడు షెఫాలీ ని పరిచయం చేసి... ఆమెని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడు... గోపాలరావు చాలా ఆనందించాడు. "నా సంతానం లో నువ్వు ఒక్కడివే ప్రయోజకుడివయ్యావు... నీ సవతి తమ్ముళ్లు వెధవల్లాగా తయారయ్యారు. డబ్బు దుబారా చెయ్యడం... ఊరంతా బలాదూర్ తిరగడం... అప్పులు చెయ్యడం... అప్పులిచ్చిన వాళ్ళు నా దగ్గర వసూలు చెయ్యడం... భరించలేకపోతున్న.." అంటూ వాపోయాడు. గౌతమ్ కి ఆయనని ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. గోపాలరావు వూరు వెళ్తూ "వీలైతే ఒకసారి ఇంటికి రా.. నీతో చాలా విషయాలు మాట్లాడి సెటిల్ చెయ్యాలి" అని అన్నాడు... గౌతమ్ ఆయనని సజీవంగా చూడడం అదే చివరిసారి... నెల రోజుల తరువాత ఒకరోజు గోపాలరావు ఫ్రెండ్ ఒకాయన దగ్గరనుండి ఫోన్ వచ్చింది... "మీ నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది... హాస్పిటల్ లో ఉన్నాడు... డాక్టర్ సీరియస్ అని అంటున్నాడు... నువ్వు వీలైనంత త్వరగా వస్తే మంచిది... కనీసం చివరి చూపైనా దక్కుతుంది..." అని అన్నాడు... గౌతమ్ వెంటనే బయలుదేరి ఊరెళ్ళాడు.

గౌతమ్ ఊరు చేరుకొని హాస్పిటల్ లో చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్న తండ్రిని చూసి తన సవతి తమ్ముళ్ళని "ఇంత సీరియస్ గా ఉంటే మీరు నాకు వెంటనే ఎందుకు చెప్పలేదు?" అని గట్టిగా అడిగాడు... వాళ్ళు దానికి చాలా పెడసరిగా "నీ ఫోన్ నెంబర్ మాకు తెలీదు" అని అన్నారు... గోపాలరావు ఫ్రెండ్ గౌతమ్ తో "మీ నాన్నని నీ సవితి తల్లి... పిల్లలు చాలా హింసించారు... వాళ్ళు ఊరంతా అప్పులు చెయ్యడం... చెడు తిరుగుళ్ళు తిరగడం బాగా అలవాటయ్యింది... ఈ మధ్య వీళ్ళకి లోకల్ MLA బాగా ఫ్రెండ్ అయ్యాడు. వీళ్ళు వాడి చుట్టూ తిరుగుతున్నారు." అంటూ చాలా చెప్పి వాపోయాడు... వారం రోజుల తరువాత గోపాలరావు చనిపోయాడు. గౌతమ్ ఆయన అంత్యక్రియలు జరిపాడు... ఒక రోజు గోపాలరావు లాయర్ అందరిని తన ఆఫీస్ కి పిలిచాడు...

లాయర్(గౌతమ్ తో) : మీ నాన్న చనిపోయేముందు వీలునామా వ్రాసాడు... దాని ప్రకారం 1. తన 15 ఎకరాల పొలం మొదటి కొడుకు గౌతమ్ కి 10 ఎకరాలు... మిగతా ఇద్దరికీ చెరో 2.5 ఎకరాలు చెందాలి. 2. రైస్ మిల్లు లో గౌతమ్ కి 50%.... మిగతా ఇద్దరికీ 25% చొప్పున సమానంగా చెందాలి... 3. బ్యాంకు లో బాలన్స్ మొత్తం గౌతమ్ కి చెందాలి... 4. గౌతమ్ దయతలచి తన సవతి తమ్ముళ్ళకి ఏదైనా ఇస్తే తనకి ఎటువంటి అభ్యంతరం లేదు.

సవతి తల్లి: మరి... ఆ ఇల్లు సంగతి ఏమిటీ? దాని కూడా పెద్ద భార్య కొడుక్కి రాసేసాడా...

లాయర్ : ఆ ఇల్లు గౌతమ్ తల్లి గారైన సరోజ గారి తండ్రిగారు... అంటే గౌతమ్ తాతగారి స్వార్జితం... ఆయన గౌతమ్ పుట్టినప్పుడు ఆ ఇంటిని సరోజ గారి పేరున వ్రాసి... ఆమె తదనంతరం గౌతమ్ కి చెందేలా ఏర్పాటు చేసాడు... ఆ ఇల్లు పూర్తిగా గౌతమ్ కి తాతలనుండి సంక్రమించింది... ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు గౌతమ్ దగ్గర ఉన్నాయి...

ఇదంతా విన్న గౌతమ్ సవతి తమ్ముళ్లు ఆ లాయర్ ని బండ బూతులు తిడుతూ వెళ్లిపోయారు... వారి వెనకాలే సవతి తల్లి కూడా వెళ్ళిపోయింది... గోపాలరావు బ్యాంకు అకౌంట్స్ లో ఉన్న మొత్తం అమౌంట్ ని తన సవతి తమ్ముళ్ల బ్యాంకు అకౌంట్స్ నంబర్స్ తీసుకొని ఇద్దరికీ సరి సమానంగా బ్యాంకు ట్రాన్సఫర్ చేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు.

గౌతమ్ ఢిల్లీ కి వచ్చాక చాలా మార్పులు జరిగాయి... షెఫాలీ కి యునైటెడ్ నేషన్స్ లో మంచి ఉద్యోగం వచ్చి న్యూ యార్క్ వెళ్ళింది... సరిగ్గా అదే సమయంలో గౌతమ్ స్పెషల్ ఆపరేషన్స్ టీం కి సెలెక్ట్ అయ్యాడు. చాలా మిషన్స్ చేసాడు... ఒకదాని తరువాత ఇంకోటి ఆగకుండా 4 ఏళ్ళ పాటు చాలా బిజీగా ఉన్నాడు. షెఫాలీ దగ్గరనుంచి మొదట్లో ప్రతి రోజూ ఇమెయిల్స్ వచ్చాయి... ఆ తరువాత క్రమంగా మెయిల్స్ రావడం తగ్గింది. పైగా చాలా కాలం గౌతమ్ కి ఇమెయిల్ చెక్ చేసే సమయం కూడా దొరకలేదు. ఎక్కువగా విదేశాలకి వెళ్లడం... ఫీల్డ్ ఆపరేటివ్ గా పనిచెయ్యడం... ప్రాణాలని పణంగా పెట్టి అండర్ కవర్ ఆపరేషన్స్ చాలా చేసాడు. చాల కాలం దుబాయ్... టర్కీ... అబూ దాబి... కతర్... మస్కట్... రెండేళ్లపాటు బలూచిస్తాన్ లో చాలా సీక్రెట్ గా కాలంగా గడిపాడు. అటువంటి సమయంలో మాధవ్ సారధ్యంలో ఒక ఆపరేషన్ చేసాడు... దాని పేరు ఆపరేషన్ సన్ షైన్ ... ఆ టీం లో మొత్తం 8 మంది ఉన్నారు... మాధవ్ దానికి లీడర్... ఆ ఆపరేషన్ చాలా వరకు స్మూత్ గానే జరిగింది... ఆ టీం కి చెందిన 7 మంది వివిధ రూట్స్ లో ఇండియా క్షేమంగా చేరారు... గౌతమ్ మాత్రం కరాచీలో పాకిస్తాన్ ISI వాళ్లకి దొరికిపోయాడు... ఒక 15 రోజుల పాటు వాళ్ళు గౌతమ్ ని విపరీతంగా హింసించారు... రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు... కట్టేసి కొట్టారు... కాళ్ళ... చేతి వేళ్ళ గోళ్లు పీకేశారు... అన్నింటిలో "WATER BOARDING" చాలా దారుణమైన చిత్రహింస... గౌతమ్ ని కట్టేసి ఒక బెంచి మీద పడుకో పెట్టి మొహం మీద ఒక తడి టవల్ ని పెట్టి... ఆ టవల్ మీద ఆపకుండా బకెట్స్ తో నీళ్లు పోశారు... గౌతమ్ దాదాపు చనిపోయినంత పని అయ్యింది... అయినా పెదవి విప్పలేదు... ఆహారం పెట్టకుండా హింసించారు... గౌతమ్ పడుకున్నప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హై వాల్యూమ్ లో భయంకరమైన శబ్దాలు వినపడేలా చేసేవారు... అలా చేయడాన్ని SLEEP DEPRIVATION అని అంటారు... నిద్ర... ఆహారాలు లేకుండా చేసి విపరీతంగా హింసించారు...

ఇండియా చేరగానే మాధవ్ కి అర్ధమయ్యింది... గౌతమ్ పట్టుపడ్డాడని... వెంటనే ఆలస్యం చేయకుండా కరాచీ చేరుకున్నాడు... అక్కడ ఇండియన్ ఎంబసీ లో పనిచేసే RAW ఏజెంట్ కి బాగా తెలిసిన ఒక ISI డీప్ అసెట్ ద్వారా పాకిస్తాన్ వాళ్ళు గౌతమ్ ని ఎక్కడ బందించారో తెలుసుకున్నారు... అదృష్టవశాత్తు వాళ్ళు గౌతమ్ ని ఏ జైల్లోనే కాకుండా ఒక ISI బ్లాక్ సైట్ లో హింసిస్తున్నారని తెలుసుకొని మాధవ్ ఇంకో నలుగురు RAW ఏజెంట్స్ తో కమెండో ఆపరేషన్ నిర్వహించాడు... ఒక రోజు అర్ధరాత్రి కరాచీలోని ISI బ్లాక్ సైట్ మీద మెరుపుదాడి చేశారు... ముందుగా హ్యాండ్ గ్రనేడ్స్ వాడి ఆ బ్లాక్ సైట్ కాంపౌండ్ లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు... ఆ తరువాత బ్లాక్ సైట్ లో దూసుకొనివెళ్ళి కనికరం చూపకుండా కనిపించిన ప్రతి ISI ఏజెంట్ ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు... బ్లాక్ సైట్ మొత్తం గాలించగా ఎక్కడో నేల మాళిగలో ఒక మూల కోన ఊపిరితో పడివున్న గౌతమ్ కనిపించాడు... అది చూడగానే మాధవ్ కి కోపం ఆగలేదు... ISI ఏజెంట్స్ ని చంపడమే కాకుండా వాళ్ళ బ్లాక్ సైట్ మొత్తాన్ని C4 ఎక్సప్లోజివ్ తో పేల్చేసాడు... గౌతమ్ ని అతి జాగ్రత్తగా కరాచీ లోని ఇండియా కి చెందిన ఒక సేఫ్ హౌస్ లోకి తరలించి దాదాపు మూడు వారాల పాటు చాలా సీక్రెట్ గా ఇండియన్ ఎంబసీ సహాయంతో చికిత్స చేయించగా గౌతమ్ కళ్ళు తెరిచాడు... ఇంకో వారం రోజులకి గౌతమ్ ఆరోగ్యం బాగా కుదుట పడిన వెంటనే మాధవ్ స్వయంగా గౌతమ్ ని కరాచీ ఫిషింగ్ హర్బోర్ లో ఒక ఫిషింగ్ బోట్ లో ఎక్కించి మూడు రోజుల తరువాత ముంబై చేర్చి అక్కడ ఇంకో నెలరోజుల పాటు నేవీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వగా గౌతమ్ పూర్తిగా కోలుకున్నాడు... గౌతమ్ పాకిస్తాన్ లో చేసిన సాహసానికి సౌర్య చక్ర దక్కింది... గౌతమ్ ని కాపాడి క్షేమంగా ఇండియా తీసుకొని వచ్చిన మాధవ్ కి వీర్ చక్ర లభించింది...

గౌతమ్ పూర్తిగా కోలుకున్న తరువాత కొంతకాలం DEBRIEFING జరిగింది... ఆ తరువాత మళ్ళీ సర్వీస్ లోకి తీసుకున్నారు... చివరికి గౌతమ్ కి ఆర్మీ లో కల్నల్ ప్రమోషన్ కూడా వచ్చింది. ఒక సంవత్సరం పాటు డెస్క్ జాబ్ లో గడిపాడు. గౌతమ్ కి డెస్క్ జాబ్ చాలా వింతగా వుంది. ఎప్పుడూ ఆక్టివ్ గా ఫీల్డ్ డ్యూటీ చేసే వాడిని సడన్ గా ఆఫీస్ లో కూర్చోపెడితే కాళ్ళు... చేతులు... ఆడని పరిస్థితి... పైగా పెద్ద గా వర్క్ ప్రెషర్ కూడా లేదు. మాధవ్ సహాయంతో షెఫాలీ గురించి ఎంక్వయిరీ చేసాడు... ఆమె న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ లో TRANSLATOR గా పనిచేస్తోంది... చాలా కాలం తరువాత ఇద్దరూ కాంటాక్ట్ లోకి వచ్చారు... సరిగ్గా అదే సమయం లో గౌతమ్ ఆర్మీ లో చేరి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి షెఫాలీ ని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకొని ఆర్మీ నుంచి రిలీవ్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. మాధవ్ అప్పటికే R&AW లో జాయిన్ అయ్యాడు. చివరికి గౌతమ్ ఆర్మీ నుంచి రిలీవ్ అయ్యాడు...

ఆర్మీ లో చేరినప్పుడు గోపాలరావు ₹15 లక్షల రూపాయలు గౌతమ్ కి ఇచ్చి కెనరా బ్యాంకు లో అకౌంట్ ఓపెన్ చేయించాడు... ఆ తరువాత గౌతమ్ ప్రతి నెల తన జీతం లో సగ భాగం కెనరా బ్యాంకు అకౌంట్ లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకున్నాడు... 10 సంవత్సరాల తరువాత ఒక రోజు కెనరా బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి ఒకసారి బ్యాంకు కి రమ్మని చెప్పాడు...

గౌతమ్ : చెప్పండి... ఎందుకో రమ్మని పిలిచారు...

బ్యాంకు మేనేజర్ : మీ సేవింగ్స్ అకౌంట్స్ లో ప్రతి నెల క్రెడిట్ వస్తోంది... ఇప్పుడు ఆ అకౌంట్ లో దాదాపు కోటి రూపాయలు వున్నాయి... మీరు ఆ డబ్బులని సేవింగ్స్ అకౌంట్ లో పెడితే పెద్దగా ఇంటరెస్ట్ రాదు. ప్రస్తుతం గురుగ్రామ్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా నడుస్తోంది... మీకు ఇంటరెస్ట్ ఉంటే... నాకు తెలిసిన బిల్డర్ ఒకడున్నాడు... చాలా నమ్మకమైన వాడు... మీకు పరిచయం చేస్తాను... మీకు ఇష్టముంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చెయ్యండి...

గౌతమ్ ఈ విషయాన్ని మాధవ్ కి చెప్పాడు... ఇద్దరూ బాగా ఎంక్వయిరీ చేసిన తరువాత ఒక సొసైటీ లో అపార్టుమెంట్ కొనడానికి డిసైడ్ అయ్యాడు... వెంటనే ఆ బిల్డర్ ని కాంటాక్ట్ చేసి ఒక అపార్టుమెంట్ కొన్నాడు... బ్యాంకు నుంచి ఇంకో కోటి రూపాయలు లోన్ తీసుకున్నాడు... ఆర్మీ నుంచి రిటైర్ అయ్యే నాటికి ఆ హౌసింగ్ లోన్ మొత్తం తీరిపోయింది. ఆర్మీ ఇచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకొని గురుగ్రామ్ లోని అపార్టుమెంట్ కి చేరుకున్నాడు... బాగా సెటిల్ అయ్యాక ఒక రోజు తన సొంత వూరికి బయలుదేరాడు...


PART - 9 - THE MALICIOUS INTENT

మాఫియా... ఇది చాలా చిన్న పదం... ఒకప్పుడు మాఫియా అనేది ఇటలీ దేశం లోని సిసిలీ అనే ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు గ్యాంగ్స్ గా తయారయ్యి... గ్యాంబ్లింగ్ క్లబ్స్ నడపడం... డ్రగ్ ని తయారుచేసి అమ్మడం... జనాలని బెదిరించి డబ్బులు వసూలు చెయ్యడం... వ్యక్తుల మధ్య... లేదా వ్యవస్థల మధ్య సెటిల్మెంట్ చెయ్యడం... ఇటువంటి పనుల ద్వారా డబ్బులు సంపాదించడం... ఆ డబ్బుని మనీ లాండరింగ్ ద్వారా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం... తద్వారా... సంఘం లో పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యేవాళ్ళు... వాళ్ళకి రాజకీయ నాయకులు... పోలీసులు... లాయర్స్... ఒక్కోసారి కోర్ట్ జడ్జీలు కూడా సహకరిస్తారు అనేకన్నా... వాళ్ళని మాఫియా పెద్దలకి సహకరించేలా మలుచుకుంటారు... దానికోసం... లంచాలు ఇవ్వడం... బెదిరించడం... బ్లాక్ మెయిల్ చెయ్యడం... కిడ్నాప్ చెయ్యడం... ఒక్కోసారి కుదరకపోతే చంపేసి అడ్డు తొలగించుకోవడం... రకరకాల పద్ధతులు ఉపయోగించి తమ పనులు అయ్యేలా చూసుకుంటారు. కాలక్రమేణ మాఫియా అనేది బాగా పరిణతి చెందింది... 19వ శతాబ్దం చివరి అంకం లో ఈ మాఫియా అనేది క్రమంగా అమెరికా... కెనడా... ఐరోపా దేశాలకి వ్యాప్తి చెంది అక్కడ బాగా వృద్ధి చెంది స్థిరపడింది... ప్రస్తుతం మనదేశంలో కూడా చాలా రకాల మాఫియా గ్యాంగ్స్ తయారయ్యాయి... వైద్యరంగంలో ఎలాగైతే స్పెషలిస్ట్స్ ... కార్డియాలజిస్టు... నెఫ్రాలజిస్ట్... న్యూరాలజిస్ట్... ఆర్థోపెడిక్... ఉన్నారో... అదే రకంగా మాఫియా లో కూడా చాలా బ్రాంచెస్ వెలిశాయి...వాటిలో ముఖ్యంగా...

డ్రగ్స్ మాఫియా... వీళ్ళు డ్రగ్స్ ని తయారు చేయడం... ఎగుమతి / దిగుమతి చెయ్యడం... మార్కెట్ లో అమ్మడం...

బిల్డర్ మాఫియా... కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళ గుప్పిట్లో ఉంటుంది... వర్కర్స్ ని సప్లై చెయ్యడం... వాళ్లకి వేతనాలు నిర్ణయించడం... రియల్ ఎస్టేట్ ధరలు నియంత్రించడం... పర్మిట్స్... లైసెన్స్ ని నియంత్రించడం... నల్ల ధనాన్ని కంట్రోల్ చెయ్యడం...

సిని మాఫియా... సినిమా ఇండస్ట్రీ ని కొంతమంది పెద్ద మనుషులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని సినిమా ప్రొడక్షన్... డిస్ట్రిబ్యూషన్... ఎక్సిబిషన్... కలెక్షన్... ఫైనాన్సింగ్... అన్ని ఆక్టివిటీస్ ని తమ గుప్పిట్లో పెట్టుకోవడం...

వాటర్ మాఫియా... మున్సిపల్ పంపుల్లో వచ్చే నీళ్లు దగ్గరనుంచి... పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కావాల్సిన నీళ్లు దాకా... వీళ్ళ ఆధీనంలో ఉంటుంది. ఎవరెవరికి ఎంత వాటర్ సప్లై చేయాలి వాళ్ళు చూసుకుంటారు... చాలా వరకు గవర్నమెంట్ కూడా వీళ్ళ మాట వింటుంది... రాజకీయ నాయకులు... బ్యూరోక్రాట్స్... వీళ్ళకి అందాల్సిన సొమ్ము అందుతుంది.

పోర్ట్ మాఫియా... దేశంలోని ప్రతి సీ పోర్ట్ ఎవరో ఒకరి చేతిలో ఉంటుంది. పోర్ట్ లో పనిచేసే వర్కర్స్... సరుకు ఎగుమతి... దిగుమతి... రవాణా అన్ని వాళ్ళ చేతుల్లో ఉంటాయి...

సాండ్ మాఫియా... ఇసుక సప్లై ని నియంత్రించి మార్కెట్ లో ఇసుక కి డిమాండ్ పెంచి... ధరలు నిర్ణయించి... వాళ్ళ వాటా కమిషన్ తీసుకుంటారు...

ట్రాన్స్పోర్ట్ మాఫియా... లారీలు... ట్రక్స్... ట్రాక్టర్లు... వీటి సప్లై... అవి ప్రయాణించే రూట్స్... ని కంట్రోల్ చెయ్యడం...

ఇవి కాకుండా ఇంకా చాలా రకాల మాఫియాలు ఇండియా లో ఉన్నాయి... ఈ మాఫియా గ్రూప్స్ మధ్యలో విపరీతమైన ఐక్యత ఉంటుంది. ఉదాహరణకి డ్రగ్స్ మాఫియా... పోర్ట్ మాఫియా... కలసి పనిచేస్తాయి... ఒకరి అవసరం ఇంకొకరికి చాలా వుంది. పోర్ట్ మాఫియా సహాయం లేకుండా డ్రగ్స్ మాఫియా సరుకును ఎగుమతి... దిగుమతి చెయ్యలేదు... అదే రకంగా పోర్ట్ కి వచ్చిన డ్రగ్స్ ని బయట అమ్మడానికి పోర్ట్ మాఫియా కి డ్రగ్స్ మాఫియా అవసరం ఉంటుంది... వీళ్ళ మధ్య వ్యాపారం నమ్మకం మీద జరుగుతుంది. ఒక రంగంలో ఉన్న వాళ్ళు వేరే రంగం లో కి అనుమతి లేకుండా అడుగుపెట్టరు.

ఇదే కాకుండా ఇంకో రకమైన మాఫియా కూడా ఉంది... ఇది బయట ప్రపంచానికి అంతగా తెలియదు. ఇన్ఫర్మేషన్ మాఫియా... రాష్ట్ర ప్రభుత్వం... లేదా కేంద్ర ప్రభుత్వం లో చాలా మినిస్ట్రీస్... డిపార్టుమెంట్స్ ఉంటాయి. ప్రతి మినిస్ట్రీ... డిపార్ట్మెంట్ తీసుకునే నిర్ణయాలకు చాల ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ముందస్తుగా తెలుసుకోవడానికి మన దేశం లోనే కాదు... విదేశాల్లో కూడా ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటారు... ఉదాహరణకి ఫైనాన్స్ మినిస్ట్రీ... లేదా... ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో జరిగే విషయాలు తెలుసుకోవడానికి దేశంలో చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు... ఆ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఎంత అమౌంట్ అయినా ఇవ్వడానికి రెడీ గా ఉంటారు... ఈ ఇన్ఫర్మేషన్ మాఫియా ని నడుపుతోంది ఎవరో కాదు... ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక లోక్ సభ MP... ఆయన పేరు నరసింహం...

నరసింహం గోదావరి జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఉమ్మడి కుటుంబం... పెద్దలు ఇచ్చిన ఆస్తి... ఎటువంటి లోటు లేదు. నరసింహానికి చదువు అంతగా అబ్బలేదు... అతి కష్టం మీద ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు... అది కూడా మార్కులు కొనుక్కొని... ఆ తరువాత చదువు మానేశాడు. అదే సమయంలో రాష్ట్ర శాసనసభ కు ఎన్నికలు జరిగాయి. ఆ ఊరి శాసనసభ కి MLA గా వాళ్ళ కుటుంబానికి చెందిన వ్యక్తి...నరసింహానికి వరుసకి బాబాయ్ అవుతాడు... ఆయన పోటీ చేసాడు... నరసింహం ఆ ఎన్నికల ప్రచారం... డబ్బులు పంచి ఓట్లు కొనడం... పోలింగ్... ఓట్లు లెక్కింపు... అన్ని రకాల ఆక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొన్నాడు... వాళ్ళ కుటుంబ వ్యక్తి ఆ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర కాబినెట్ లో మంత్రి అయ్యాడు... అంతే... నరసింహం ఆయన చుట్టూ తిరగసాగాడు... మంత్రి దగ్గరకి వచ్చేవాళ్ల కి పనులు చేసి పెట్టడం... మంత్రి తరఫున డబ్బులు వసూలు చెయ్యడం... దాచడం... ఇతర మంత్రులతో కలివిడిగా ఉండటం... ముఖ్యంగా వేరే మినిస్ట్రీస్ లో జరిగే వ్యవహారాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం సంపాదించడం... ఆ సమాచారాన్ని సరసమైన ధరకు అమ్మడం... తద్వారా రాష్ట్రం లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గా ఎదిగాడు... క్రమంగా అందరూ తమ పనుల కోసం నరసింహం దగ్గర కి రావడం మొదలెట్టారు... నరసింహానికి పలుకుబడి... ఇంపార్టెన్స్ విపరీతంగా పెరిగింది. ఒకసారి ఒక ఇండస్ట్రియలిస్ట్ పనిమీద న్యూ ఢిల్లీ వచ్చాడు... నరసింహానికి ఢిల్లీ వాతావరణం బాగా నచ్చింది... డబ్బులు వెదజల్లితే ఎటువంటి పనైనా అవుతుందని గమనించాడు... ఆ తరువాత రాష్ట్రం లో ఎవరికైనా ఢిల్లీ లో ఏ పని అవ్వాలన్న నరసింహం దగ్గరకి రావడం మొదలెట్టారు... విపరీతమైన బ్లాక్ మనీ పోగయ్యింది... సరిగ్గా అదే సమయానికి లోక్ సభ కి ఎన్నికలు జరిగాయి... నరసింహం తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసాడు... విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టాడు... ప్రజల దగ్గర నుంచి సరసమైన ధరలకు ఓట్లని కొనుగోలు చేసాడు... ఫలితం కనిపిచింది... మొదటిసారి MP గా గెలిచి... లోక్ సభ లో అడుగుపెట్టాడు...

మొదటి రోజు నుంచి నరసింహం ప్రతి మినిస్ట్రీ... ప్రతి డిపార్ట్మెంట్ లో ముఖ్యమైన వాళ్ళని గుర్తించడం లో నిమగ్నమయ్యాడు... ఫైనాన్స్... డిఫెన్స్... ఆయిల్ అండ్ గ్యాస్... పెట్రోలియం... పోర్ట్స్ అండ్ హార్బర్స్... రోడ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్... హెవీ ఇండస్ట్రీస్... కార్పొరేట్ అఫైర్స్... మొదలైన పెద్ద పెద్ద మినిస్ట్రీస్ లో ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించాలో ప్లాన్ చేయసాగాడు... కొంత మందికి డబ్బులు ఇచ్చాడు... కొంత మందికి విదేశీ పర్యటనలు ఏర్పాటు చేసాడు... కొంత మందికి ప్లాట్స్... కొంతమందికి అపార్టుమెంట్స్... ఇచ్చాడు.. లొంగని వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు... తనకి లొంగేదాకా ఎంత దూరమైనా వెళ్ళేవాడు... దీనికి సరైన ఉదాహరణ...

ఒక మినిస్ట్రీ లో పనిచేసే ఒక ముఖ్యమైన వ్యక్తి నరసింహం చెప్పింది చెయ్యడానికి నిరాకరించాడు.... నరసింహం అన్ని రకాలుగా ట్రై చేసాడు... సామ... దాన... భేద... దండ... అన్ని ప్రయోగించాడు... 1. సామం ... నరసింహం ముందుగా ఆయనని వ్యక్తిగతంగా కలసి సామరస్యంగా... చాలా మర్యాదగా నచ్చచెప్పాడు... "అందరూ చేస్తున్నదే మిమ్మల్ని కూడా చెయ్యమంటున్నాను... మీరు మాకు కావాల్సింది చేస్తే... మేము మీకు కావాల్సింది చేస్తాము..." అని ఎంతో నచ్చచెప్పాడు... ఆయన వినలేదు... 2. దానం... విపరీతం గా డబ్బులు... ఆస్తులు ఎర చూపించాడు... అయినా ఆయన లొంగలేదు... 3. భేదం... ఈ సారి ఆయన కుటుంబ సభ్యులకు డైరెక్ట్ గా లంచాలు ఎరవేసి... వాళ్ళ ద్వారా ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలని చాలా ట్రై చేసాడు... అది కూడా కుదరలేదు... 4. దండం... ఎంత చెప్పినా మాట వినడం లేదని ఒక రోజు ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూండగా ఆయన కార్ ని ఒక ట్రక్ తో గుద్దించాడు... అదృష్టం బాగుంది... ఆయన ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు... వెంటనే నరసింహన్ని పిలిపించి... "మీరు నన్ను హింసించడం ఆపకపోతే నేను మా పై అధికారులకి రిపోర్ట్ చేసి మీ అంతు చూస్తాను" అని చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం తో నరసింహం వెనక్కి తగ్గాడు... అయినా తన ప్రయత్నాలు మానలేదు... నరసింహం దృష్టిలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది... అది తెలిస్తే చాలు... ఆ వ్యక్తి లొంగుతాడు... ఆ బ్యూరోక్రాట్ పేరు పంకజ్ గుప్త... ఒక పెద్ద మినిస్ట్రీ లో ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేస్తున్నాడు...

మరుసటి రోజు నుంచి నరసింహం ఇంకో రకంగా పంకజ్ ని దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు.... ముందుగా... పంకజ్ ఎక్కడ పుట్టాడు... ఎక్కడ పెరిగాడు... తోబుట్టువులు ఎంతమంది... ఎక్కడ చదివాడు... ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు... అలవాట్లు ఎలాంటివి... భార్య ఎలాంటింది... పిల్లలు ఎంత మంది... అన్ని రకాల డీటెయిల్స్ సంపాదించాడు. పంకజ్ చాలా సాదా... సీదా మనిషి... పెద్దగా చెడు అలవాట్లు ఏమి లేవు... ఎటువంటి అప్పులు లేవు... ఒక హౌసింగ్ లోన్ నడుస్తోంది... ఇంకో రెండేళ్లలో ఆ లోన్ కూడా తీరిపోతుంది... పిల్లలు పెద్దవాళ్లు... పెళ్లిళ్లు అయ్యాయి... విదేశాల్లో సెటిల్ అయ్యారు... డీసెంట్ ఫామిలీ... ఎటువంటి వీక్నెస్ కనిపించలేదు... అయినా... నరసింహం వొదలలేదు... పంకజ్ వెంట ఒక ప్రైవేట్ డిటెక్టివ్ 24/7 ఉండేలా చూసాడు... డైలీ రొటీన్ తెలుసుకున్నాడు... పంకజ్ ఉదయం 5 గంటలకి లేస్తాడు... భార్యతో కలిసి ఇంటికి దగ్గరలో పార్క్ కి వెళ్లి ఒక గంట సేపు వాకింగ్ చేస్తాడు... ఆ తరువాత ఒక అరగంట సేపు ప్రాణాయామం... యోగ చేస్తాడు... ఇంటికి వచ్చి పనులు కానిచ్చుకొని బ్రేక్ ఫాస్ట్ చేసి సరిగ్గా 8:30 నిమిషాలకి ఆఫీస్ వెళ్తాడు... సాయంత్రం 6 - 7 మధ్యలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు... వీక్ ఎండ్ లో షాపింగ్... గురుద్వారా కి వెళ్లడం... ఎప్పుడైనా సినిమా కి వెళ్లడం... అంతే... రొటీన్ లో పెద్ద మార్పు ఉండదు. అయినా కూడా నరసింహం వొదలలేదు...

నరసింహం తన నెక్స్ట్ స్టెప్... పంకజ్ ఆఫీస్ లో ఆయనతో క్లోజ్ గా పని చేసేవాళ్ళని గుర్తించాడు... పంకజ్ కి ఆఫీస్ లో మంచి పేరు ఉంది... ఆయన స్టాఫ్ మెంబెర్స్ ఆయన మీద చెడు గా మాట్లాడలేదు... నరసింహన్ కి ఒక విషయం మీద చాలా నమ్మకం... పైకి ఎంతో సిన్సియర్ గా కనిపించే వాళ్లకు ఎదో ఒక వీక్నెస్ తప్పకుండా ఉంటుంది... నరసింహం దృష్టిలో HONOURABLE GENTLEMAN అనే వాడు ఈ ప్రపంచం లో ఎవరూ లేరని ప్రఘాడ నమ్మకం... నర్సింహం చేస్తున్న ప్రయత్నాల్ని ఒక వ్యక్తి గమనించాడు... అతని పేరు రజాక్... పంకజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు... రజాక్ కి చాలా కాలంగా ప్రమోషన్ పెండింగ్ లో ఉంది. దానికి కారణం పంకజ్ అని రజాక్ నమ్ముతాడు... నరసింహం చేస్తున్న ప్రయత్నాలు గమనించి...

రజాక్ : మీకు ఏమి కావాలో చెప్పండి... నేను చేస్తాను...

నరసింహం : మీ బాస్ చాలా సెన్సిటివ్ డాక్యూమెంట్స్ హేండిల్ చేస్తాడు... నాకు వాటి కాపీలు కావాలి... నీకు డబ్బులు ఇస్తాను...

రజాక్ : చాలా కష్టం... ఆ డాకుమెంట్స్ ని లాకర్ లో పెడతాడు. ఏదైనా డాక్యూమెంట్ ని ఫోటో కాపీ తియ్యాలన్న... లేదా డిస్ట్రాయ్ చెయ్యాలన్నా... ఎవరికి ఇవ్వడు... తానే స్వయంగా ఫోటోకాపీ మిషన్ దగ్గరికి వెళ్లి కావాల్సిన కాపీస్ తీసుకుంటాడు... ఒకవేళ ష్రెడ్డింగ్ చెయ్యాలంటే... తానే స్వయంగా చేసుకుంటాడు... ఎవరిని నమ్మడు.

నరసింహం : మాకు పంకజ్ హేండిల్ చేసే డాకుమెంట్స్ కావాలి... నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా?

రజాక్ : లేదు... పంకజ్ చాలా సిన్సియర్... సర్వీస్ లో ఎక్కడా రిమార్క్ లేదు.

నరసింహం : ఒక పని చెయ్యి... ఇవాల్టి నుంచి ఒక రెండు వారాల పాటు పంకజ్ ఆఫీస్ లో ఏమేమి చేస్తాడు... ఎక్కడెక్కడికి వెళ్తాడు... అన్ని డీటెయిల్స్ ని క్లియర్ గా నోట్ చేసి మాకు ఎప్పటికప్పడు చెప్పాలి...

రజాక్: అలా చేస్తే నాకేమిటి లాభం?

నరసింహం: నీకు డబ్బులు ఇస్తాం... ఎంత కావాలో చెప్పు...

రజాక్: నాకు డబ్బులతో పాటు చాల కాలంగా ఆగిపోయిన ప్రమోషన్ కూడా కావాలి... అప్పుడే మీకు కావాల్సిన పని చేస్తాను...

రజాక్ పెట్టిన డిమాండ్స్ ని నరసింహం ఒప్పుకున్నాడు... రజాక్ అప్పటినుంచి ప్రతి రోజూ పంకజ్ ఆఫీస్ కి ఎన్నిగంటలకి వస్తాడు... ఎవరెవరిని కలిసాడు... ఏ ఏ ఫైల్స్ మీద పని చేసాడు... ఎక్కడెక్కడికి వెళ్ళాడో... ఇంటికి ఎన్నింటికి వెళ్తాడు అన్ని డీటెయిల్స్ ని రెండు వారాల పాటు చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేసి నరసింహానికి ఇచ్చాడు... పెద్దగా ఏమి తెలియలేదు... పంకజ్ ప్రతి రోజూ ఆఫీస్ వస్తాడు... పని చేస్తాడు... అవసరమైతే వేరే డిపార్టుమెంట్స్ లేదా మినిస్ట్రీస్ కి వెళ్తాడు... ఎటువంటి అనుమానాస్పద మూమెంట్స్ లేవు... మూడో వారం కూడా రజాక్ దగ్గరనుంచి రిపోర్ట్ వచ్చింది... అది స్టడీ చేసిన నరసింహం ఒక విషయాన్ని గమనించాడు... పంకజ్ ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆఫీస్ కి దగ్గరలోని మాతా మందిర్ కి వెళ్తాడు... వెనక్కి రెండు గంటలకు వెనక్కి వస్తాడు... నరసింహం ఆలోచించాడు... మాతా మందిర్ పంకజ్ పని చేసే ఆఫీస్ కి చాలా దగ్గరలో ఉంది... అయిదు నిమిషాల నడిస్తే చాలు... బుధవారం ఆ సమయంలో మాతా మందిర్ లో భక్తులు పెద్దగా ఉండరు. ఆ మాతా మందిర్ కి పెద్ద పేరు కూడా లేదు... చాలా చిన్న గుడి... ప్రతి వారం క్రమం తప్పకుండా వెళ్ళడానికి కారణం ఏముంటుంది?

నరసింహం మరుసటి బుధవారం స్వయంగా మాతా మందిర్ దగ్గర కార్ లో వెయిట్ చేసాడు... టైం ప్రకారం ఒంటి గంటకు పంకజ్ మాతా మందిర్ కి వచ్చాడు... మందిర్ రూల్స్ ప్రకారం... మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసి గుడి బయట కౌంటర్ లో డిపాజిట్ చేసి టోకెన్ తీసుకోవాలి... ఆ కౌంటర్ లోని వ్యక్తి ఆ ఫోన్ ని చిన్న చిన్న పిచ్చుక గూళ్ళ లాంటి స్లాట్స్ లో పెట్టి అక్కడి టోకెన్ ని భక్తులకి ఇస్తున్నాడు... పంకజ్ ని చూడగానే కౌంటర్ లోని వ్యక్తి లేచి నుంచుని చిరునవ్వుతో దణ్ణం పెట్టి పంకజ్ ఫోన్ ని తీసుకొని ఒక టోకెన్ ఇచ్చాడు... పంకజ్ ఆ టోకెన్ తీసుకొని మాత మందిర్ లోకి వెళ్ళగానే... ఆ కౌంటర్ లో వ్యక్తి ఆ ఫోన్ ని తన పక్కనున్న వ్యక్తి కి ఇచ్చాడు... ఆ వ్యక్తి ఆ ఫోన్ తీసుకొని కౌంటర్ కి ఆనుకొని ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు... ఇది గమనించిన నరసింహం "సం థింగ్ రాంగ్... కౌంటర్ లో వ్యక్తి ఆ ఫోన్ ని అందరి ఫోన్స్ లాగా స్లాట్స్ లో పెట్టకుండా తన పక్కన ఉన్న ఇంకో వ్యక్తి కి ఎందుకు ఇచ్చాడు? అతను ఆ ఫోన్ ని కౌంటర్ కి ఆనుకొని ఉన్న ఆ రూమ్ లోకి ఎందుకు తీసుకొని వెళ్ళాడు? పైగా పంకజ్ ఆ ఫోన్ ని ఆ కౌంటర్ లోని వ్యక్తి ఇచ్చేముందు ఆఫ్ చేసినట్లు లేదు..." అని అనుకున్నాడు... పంకజ్ ఒక అరగంట తరువాత మందిర్ లోంచి బయటకు వచ్చాడు... అదే సమయం లో కౌంటర్ వెనుక రూమ్ లోకి ఫోన్ తీసుకొని వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చి పంకజ్ కి ఫోన్ వెనక్కి ఇచ్చాడు. పంకజ్ ఆ ఫోన్ తీసుకొని ఆఫీస్ చేరుకున్నాడు. ఇదంతా గమనించిన నరసింహం "ఏదో జరుగుతోంది... కనిపెట్టాలి" అని అనుకున్నాడు... అదే రోజు రాత్రి మాతా మందిర్ మూసేసాక నరసింహం ఏర్పాటు చేసిన వ్యక్తులు మందిర్ లోని మొబైల్ ఫోన్ కౌంటర్ లో పనిచేసే ఆ ఇద్దరి ని ఫాలో అయ్యారు... కౌంటర్ లో పనిచేసే ఇద్దరు సిటీ బస్ ఎక్కి ఈస్ట్ ఢిల్లీ లోని లక్ష్మీ నగర్ చేరుకున్నారు... సరైన సమయం చూసి నరసింహం మనుషులు వాళ్ళిద్దరిని వెనకనుంచి ఎటాక్ చేసి వాళ్ళని క్లోరోఫామ్ తో స్పృహ తప్పించి వాన్ లో ఎక్కించుకొని నరసింహం దగ్గరకి తీసుకొని వెళ్లారు... మందిర్ ఎంప్లాయిస్ కి స్పృహ రాగానే... నరసింహం "మీరు మాకు సహకరిస్తే మీ ఇద్దరికీ చెరో లక్ష రూపాయలు ఇస్తాను... లేదంటే... మీ ఇద్దరినీ ఇక్కడే చంపేసి వెళ్ళిపోతాము... ఆలోచించుకోండి..." అని అన్నాడు... ఆ ఇద్దరూ నరసింహం చేతిలోని రివాల్వర్ చూసి భయపడిపోయారు... వాళ్లలో ఒకడు...

మందిర్ ఎంప్లాయ్ 1 : మీరు ఎవరు? మీకు ఏమి కావాలి? మేము మాతా మందిర్ లో పని చేస్తాము... మీరు పొరపాటున ఎవరినో తీసుకొని రాబోయి... మమ్మల్ని తెచ్చారు...

నరసింహం : మేము సరైన వాళ్లనే తెచ్చాము... ప్రతి బుధవారం మీ మందిర్ కి పంకజ్ గుప్త వస్తాడు... మీకు తన మొబైల్ ఫోన్ ఇస్తాడు...

మందిర్ ఎంప్లాయ్ 2 : అది మందిర్ రూల్... భక్తులు తమ మొబైల్ ఫోన్స్ ని కౌంటర్ లో జమ చేసి టోకెన్ తీసుకోవాలి...

నరసింహం : నిజమే... కానీ... పంకజ్ మీకు ఇచ్చిన ఫోన్ కి మీరు టోకెన్ ఇవ్వకుండా ఆ ఫోన్ ని కౌంటర్ వెనక రూమ్ లోకి తీసుకొని వెళ్లారు... అరగంట తరువాత ఆ ఫోన్ ని మీరు పంకజ్ కి ఇచ్చారు... ఆ రూమ్ లో మీరు ఈ 30 నిమిషాల్లో ఆ ఫోన్ తో ఏమి చేశారు?

మందిర్ ఎంప్లాయిస్ ఇద్దరూ మౌనం వహించారు...

నరసింహం (అసహనంగా) : చెప్తారా... చంపెయ్యమంటారా?

మందిర్ ఎంప్లాయ్ 2 : అది మీకు చెప్పకూడదు...

నరసింహం కోపంతో గాల్లో మూడు సార్లు కాల్పులు జరిపాడు... దాంతో ఆ మందిర్ ఎంప్లాయిస్ ఇద్దరూ భయపడిపోయారు...

నరసింహం : చెప్తారా... చస్తారా... చెప్తే డబ్బులు ఇస్తాను...

మందిర్ ఎంప్లాయ్ 1 : ప్రతి బుధవారం పంకజ్ సర్ మందిర్ కి వచ్చి మాకు తన ఫోన్ ని ఇస్తాడు... మేము ఆ ఫోన్ ని మా కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ... ఫోన్ లోని గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసిన ఫైల్స్ ని మేము ఇమెయిల్ ద్వారా పంపిస్తాము... ఆ తరువాత ఆ ఫోన్ ని మేము పంకజ్ సర్ కి ఇచ్చేస్తాము... అంతే... ఇంతకు మించి ఏమీ లేదు...

నరసింహం : ఆ ఇమెయిల్ అడ్రస్ ఎవరిదీ?

మందిర్ ఎంప్లాయ్ 2 : మాకు తెలీదు... పంకజ్ సర్ మాకు ఒక ఇమెయిల్ ID ఇచ్చాడు... మేము ఫోన్ లోని డాక్యూమెంట్స్ ని ఆ ఇమెయిల్ ID పంపడమే మా పని...

నరసింహం : ఆ పని చేస్తే మీకు పంకజ్ గుప్త ఎంత ఇస్తాడు?

మందిర్ ఎంప్లాయ్ 1 : ప్రతి నెల 10,000 ఇస్తాడు...

నరసింహం : నేను మీకు ప్రతి బుధవారం ఇద్దరికీ చెరో 10,000 ఇస్తాను... నేను మీకు ఒక ఇమెయిల్ ID ఇస్తాను... ఆ ఫైల్స్ ని నాకు కూడా పంపాలి...

మందిర్ ఎంప్లాయ్ 2 : ఆమ్మో... పంకజ్ సర్ కి తెలిస్తే ప్రాబ్లెమ్ అవుతుంది...

నరసింహం : ఎవరు చెప్తారు?? నేను చెప్పను... మీరు కూడా నోరు మూసుకుంటే... మీకు ప్రతి నెలా పంకజ్ మీకు ఇచ్చే చేరి 5,000 తో పాటు నేను ఇచ్చే 40,000 దొరుకుతాయి...

మందిర్ ఎంప్లాయిస్ ఇద్దరూ మౌనం వహించారు...

నరసింహం : ఆలోచించుకోండి... మీకు ప్రతి నెల మందిర్ ఇచ్చే జీతం కాకుండా ఇద్దరికి చెరో 45,000 దొరుకుతాయి... లేదంటే మీ గురించి నేను పోలీసులకి చెప్పి మీతో పాటు పంకజ్ గుప్తా ని కూడా అరెస్ట్ చేయిస్తాను... అప్పుడు ఎవరికీ ప్రయోజనం ఉండదు...

దాదాపు ఒక గంట తరువాత మందిర్ ఎంప్లాయిస్ ఇద్దరూ నరసింహం ఇచ్చిన ప్రపోసల్ కి ఒప్పుకున్నారు... నరసింహం వెంటనే వాళ్లకి తన ఇమెయిల్ ID ఇచ్చి... "వచ్చే బుధవారం నాకు ఇమెయిల్ రాగానే మీకు చెరో పది వేలు దొరుకుతాయి" అని చెప్పి వాళ్ళని వొదిలేసాడు...

మరుసటి బుధవారం మామూలుగానే పంకజ్ మందిర్ కి వెళ్ళాడు... తన మొబైల్ ఫోన్ ని కౌంటర్ ఇచ్చి మందిర్ లోపలికి వెళ్ళాడు... మందిర్ ఎంప్లాయ్ ఆ ఫోన్ ని కౌంటర్ వెనక రూమ్ లోకి తీసుకొని వెళ్లి కంప్యూటర్ కి కనెక్ట్ చేసి మొబైల్ ఫోన్ లోని గూగుల్ డ్రైవ్ ని ఓపెన్ చేసి అందులోని ఫైల్స్ ని కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసి... జిమెయిల్ ఓపెన్ చేసి... పంకజ్ ఇచ్చిన ఇమెయిల్ ID కి ఆ ఫైల్స్ ని పంపాడు... ఆ తరువాత ఆ ఫైల్స్ ని ఇంకో ఇమెయిల్ లో నరసింహం ఇచ్చిన ఇమెయిల్ ID కూడా పంపారు... ఆ ఇమెయిల్ నరసింహం కి చేరింది... వెంటనే మాతా మందిర్ దగ్గర ఉన్న తన మనిషి కి ఫోన్ చేసి "కాంటర్ లో వ్యక్తి కి 20,000 ఇవ్వు..." అని అన్నాడు... నరసింహం మనిషి వెంటనే మందిర్ కౌంటర్ దగ్గరకి వెళ్లి "ఇక్కడ రాకేష్ బన్సల్ ఎవరు?" అని అడిగాడు... దానికి బదులుగా కౌంటర్ లో ని వ్యక్తి "నేనే... ఎం కావాలి?" అని అడిగాడు... నరసింహం మనిషి మౌనంగా అతని కి ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

నరసింహం తనకు వచ్చిన ఇమెయిల్ ఓపెన్ చేసాడు... అందులో చాలా ఫైల్స్ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయబోతే పాస్ వర్డ్ అడిగింది... నరసింహం తన దగ్గర పనిచేసే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పిలిచి "ఈ పాస్ వర్డ్ ని బ్రేక్ చేసి ఫైల్స్ ని ఓపెన్ చెయ్యి" అని అన్నాడు... ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒక 3 గంటలు కష్టపడి ఆ ఫైల్స్ ని ఓపెన్ చేసాడు... వాటిని చూసిన నరసింహం ముఖం వికసించింది... "ప్రతి వారం 20,000 దండగ కాదు" అని అనుకున్నాడు...

నరసింహం రకరకాల మార్గాలలో ఎన్నో మినిస్ట్రీస్... గవర్నమెంట్ డిపార్టుమెంట్స్ నుంచి సమాచారాన్ని సంపాదించసాగాడు... అలా సంపాదించిన సమాచారాన్ని డైరెక్ట్ గా గంగూలీ కి పంపకుండా... అతుల్ మాథుర్ కి పంపిస్తాడు... అతుల్ మాథుర్ ఆ డాక్యూమెంట్స్ ని మైక్రో డాట్స్ రూపంలోకి మార్చి వా మైక్రో డాట్స్ ని ఓల్డ్ బుక్స్ లో పొందుపరచి... సక్సేనా కి ఇస్తాడు... సక్సేనా ఆ బుక్ ని గురుగ్రామ్ తీసుకొని వెళ్లి ప్రవీణ్ బుక్ స్టోర్ లో ఇస్తాడు... అక్కడనుంచి రాజేంద్ర యాదవ్ ఆ బుక్ ని రాజీవ్ వర్మ సెక్రటరీ నటాషా కి ఇస్తాడు... నటాషా ఆ బుక్ ని ఓరియన్ గ్రూప్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేత ఆ మైక్రో డాట్స్ ని STEGANO IMAGES గా మార్చి... నటాషా కి పంపిస్తాడు... నటాషా ఆ ఫైల్ ని రాజీవ్ వర్మ కి పంపిస్తుంది... రాజీవ్ ఆ ఫైల్ ని గంగూలీ కి పంపిస్తాడు... గంగూలీ ఆ ఫైల్ ని డీకోడ్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సరసమైన ధరకి మార్కెట్లో అమ్ముతాడు... నరసింహం ఇంత పెద్ద నెటవర్క్ ని తయారు చేయడానికి పెద్ద కారణం ఉంది... అతుల్ మధుర్ కి ఇమెయిల్ ఎవరు పంపుతారో తెలీదు... జస్ట్ ఇమెయిల్ వస్తుంది... ఈ చైన్ అఫ్ నెట్వర్క్ లో ఎవరైనా పట్టుబడితే... మిగతావాళ్లు ఈజీ గా తప్పిచుకుంటారు...

నరసింహం ఏర్పాటు చేసిన చైన్ అఫ్ నెట్వర్క్ చాలా కాలం గా చాలా బాగా నడిచింది... ఇన్ఫర్మేషన్ ని అమ్ముకుంటూ చాలా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు... కొంత కాలం తరువాత న్యూ ఢిల్లీ లోని "పెద్ద మనుషుల సహాయ... సహకారాలతో" ఓరియన్ గ్రూప్ అఫ్ కంపెనీస్ స్టార్ట్ చేసాడు. దేశం లో పెద్ద పెద్ద వాళ్ళని పార్టనర్స్ గా చేర్చుకున్నాడు... ఒకరోజు... నరసింహానికి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ దొరికింది... అదేమిటంటే... భారత ప్రభుత్వం దేశం లో బాగా వెనక పడిన ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు... దాని ప్రకారం... నరసింహం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం లో ఒక పెద్ద పెట్రోకెమికల్ ప్లాంట్... ఇంకో నేచురల్ గ్యాస్ ప్లాంట్... వాటిని సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్... ఒక కొత్త సీ పోర్ట్... ని ప్లాన్ చేసింది... ఈ డెవలప్మెంట్ మొత్తం గౌతమ్ సొంత గ్రామమైన సింహపురి కి 20 కిలోమీటర్ల దూరం లో జరగబోతోంది... నరసింహం ఈ వార్త వినగానే ఎగిరి గంతేశాడు... ఒక్కసారిగా కొన్ని వేల కోట్లు సంపాదించుకునే అవకాశం దొరికింది... "ఈ దెబ్బతో నా నియోజకవర్గం నా ఫామిలీ సొంతం కాబోతోంది... ఈ డెవలప్మెంట్ చూపించి... రాబోయే 100 ఏళ్ల పాటు ఆ నియోజకవర్గం నా ఫామిలీ సొంతం చేసుకుంటాను" అని అనుకున్నాడు...

నరసింహం చాలా సీక్రెట్ గా తన నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున సర్వే చేయించాడు... ఆ సర్వే రిపోర్ట్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించాడు... సింహపురి చాలా చిన్న పట్టణం... చాలా పాత పట్నం... ఆ ఊరు మొత్తానికి ఒకటే పెద్ద రోడ్... ఒకప్పుడు ఆ రోడ్ మీద పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి... కాల క్రమేణా ఆ ఇళ్ళు స్ఠానం లో కొన్ని దుకాణాలు వెలిశాయి... ఇప్పుడు ఆ రోడ్ లో అతి తక్కువ ఇళ్ళు ఉన్నాయి... వీటిలో గౌతమ్ తాత గారు అతనికి ఇచ్చిన ఇల్లు కూడా ఉంది. పైగా ఆ రోడ్ లో గౌతమ్ ఇల్లే అన్నింటికన్నా బాగా పెద్దది... దాదాపు 2 ఎకరాల్లో ఉంటుంది... ఇంటి ముందు ఖాళీ స్థలం... ఇంటి వెనక పెరట్లో పశువుల కొట్టం ఉంటాయి... విశాలమైన ఇల్లు...

నరసింహం సింహపురి మెయిన్ రోడ్ లో ఒక పెద్ద షాపింగ్ సెంటర్... మల్టీప్లెక్స్ సినిమా కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించుకున్నాడు... ఆ వూరికి దగ్గర్లో రాబోయే సీ పోర్ట్ కి దగ్గర్లో వేర్ హౌసెస్ కట్టడానికి సరైన స్థలం ఎంచుకున్నాడు... ముందుగా లోకల్ MLA ని తన దగ్గరకి పిలిచి... "మన నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతోంది... నాతో చేతులు కలిపితే... నీకు వందల కోట్లలో లాభం ఉంటుంది... సింహపురి మెయిన్ రోడ్ లో వీలైనన్ని షాప్స్... ఇళ్ళు మన బినామీ పేరు మీద వీలైనంత తక్కువ ధరకి కొనాలి... గవర్నమెంట్ మన ఏరియా లో డెవలప్మెంట్ ప్లాన్ అనౌన్స్ చెయ్యగానే మనం సింహపురి లో పెద్ద షాపింగ్ సెంటర్... మల్టీప్లెక్స్ సినిమా హాల్స్ కట్టడం మొదలెడదాము... త్వరలో మన ఊరి పక్కన రాబోయే పోర్ట్ కి దగ్గరలో పొలాలు కొనండి... అక్కడ వేర్ హౌసెస్... కంటైనెర్స్ పార్క్ కడదాం... కొన్ని ఎయిర్ కండిషన్డ్ వేర్ హౌసెస్ కూడా కడదాం... విపరీతంగా లాభం ఉంటుంది... నీకు మంచి షేర్ ఇస్తాను... చాలా సీక్రెట్ గా పని మొదలుపెట్టు..." అని చెప్పాడు... లోకల్ MLA ఆనందంగా వెళ్ళాడు...

రెండు నెలలు కష్టపడి లోకల్ MLA నరసింహానికి కావాల్సిన డీటైల్స్ అన్ని తయారు చేసాడు... సింహపురి మెయిడ్ రోడ్ లో చాలా మంది షాప్ ఓనర్స్... ఇంటి ఓనర్స్... తమ ప్రాపర్టీస్ అమ్మడానికి రెడీ అయ్యారు... MLA గౌతమ్ సవతి తమ్ముళ్ళని పిలిచి వాళ్ళు ఉంటున్న ఇంటి ని... వాళ్ళ 15 ఎకరాల పొలాలు... రైస్ మిల్ అమ్మమని చెప్పాడు... వాళ్ళు "సరైన ధర వస్తే అమ్మేస్తాము...కానీ... ఆ ఇల్లు మా సవతి అన్న గౌతమ్ పేరు మీద ఉంది" అని అన్నారు... గౌతమ్... అతని బ్యాక్ గ్రౌండ్ గురించి అస్సలు తెలియని ఆ లోకల్ MLA "మీరు గౌతమ్ ని ఒప్పించి మీ ఆస్తి మొత్తం మాకు అమ్మితే... మీకు మంచి ధర ఇవ్వడమే కాకుండా... మేము కట్టబోయే షాపింగ్ సెంటర్ లో వాటా కూడా ఇస్తాము..." అని ఆశ పెట్టాడు...దాంతో గౌతమ్ సవతి తమ్ముళ్లు గౌతమ్ ని ఎలా మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టెయ్యలో ప్లాన్ వెయ్యసాగారు... ఆసమయంలో వాళ్ళు తమ సొంత స్వార్ధ ప్రయోజనానికి వేస్తున్న ప్లాన్ ఎంత పెద్ద అనర్ధాన్ని తెచ్చి పెట్ట

PART - 10 - THE DEAL

రియల్ ఎస్టేట్ బిజినెస్... ఒకప్పుడు ఈ బిజినెస్ ఎక్కువగా పెద్ద పెద్ద సిటీస్ కి మాత్రమే పరిమితం అయ్యింది... వ్యాపారం చాలా మందకొడిగా ఉండేది. భూముల ధరలు మధ్యతరగతి వాళ్లకి అందుబాటులో ఉండేవి... 200 చదరపు గజాలు... 270... 300... 400... చదరపు గజాల స్థలాలు మధ్య తరగతి కుటుంబాలకి వూరికి కొంచం దూరం లో దొరికేవి... తెలుగు రాష్ట్రాల్లో 1995 తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. హైదరాబాద్ లో కొత్తగా హై టెక్ సిటీ కట్టడం... సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ రావడం... శంషాబాద్ లో కొత్త ఎయిర్పోర్ట్... ఈ డెవలప్మెంట్స్ హైదరాబాద్ పరిసరప్రాతాలలో భూములకు ధరలు పెంచేసాయి. ఒకప్పుడు మెహదీపట్నం దగ్గర ఒక బోర్డు ఉండేది... "యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ - 17 కిలోమీటర్స్" ... ఆ రోజుల్లో మెహదీపట్నం - గచ్చిబౌలి INDIAN IMMUNOLOGICALS INSTITUTE మధ్యలో అన్ని కొండలు... గుట్టలు... రాళ్లు... రప్పలు... ఉండేవి... ఆ 17 కిలోమీటర్స్ సింగల్ రోడ్ మీద అన్ని రకాల వాహనాలు తిరిగేవి... రాత్రి 7 గంటల తరువాత ఆ రోడ్ లో ఎవరూ వెళ్ళడానికి సాహసించేవారు కాదు... ఇప్పుడు ఆ ఏరియా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది... దీనికి తోడుగా ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ మొదలయ్యిందో... హైదరాబాద్ చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాలలో భూముల ధరలకు రెక్కలు వచ్చి ఎకరం ధర కోట్లలో పలక సాగింది... నెమ్మదిగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద నగరాల నుంచి చిన్న నగరాలు... టౌన్... పల్లెటూర్లకు పోయింది... ధరలు విపరీతంగా పెరగడం తో కొంత మంది రైతులు సంవత్సరానికి రెండు లేదా మూడు పంటలు పండే భూములని అమ్మేసి పెద్ద నగరాలకు వెళ్ళసాగారు... ఒకసారి న్యూ ఢిల్లీ దగ్గరలోని గురుగ్రం లో ఒక రైతు నేషనల్ హై వే కి పక్కనున్న తన 4 ఎకరాల పొలాన్ని ఒక డెవలపర్ కి అమ్మడు... ఆ డెవలపర్ పెద్ద పెద్ద బస్తాల్లో Rs. 1000 కట్టలు తెచ్చి ఆ రైతు ముందు పెట్టాడు... ఆ రోజుతో ఆ రైతు కుటుంబ తలరాత మారిపోయింది...

డెవలప్మెంట్ పేరుతో రాజకీయనాయకుల దోపిడీ మొదలయ్యింది... అప్పటిదాకా రాజకీయ నాయకులు పరోక్షంగా వ్యాపారాలు చేసేవారు... ముఖ్యంగా తమ ఫామిలీ మెంబెర్స్... రెలెటివ్స్... ఫ్రెండ్స్... తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు ని బినామీలు గా పెట్టుకుని వ్యాపారం చేసేవారు... అందులో కొన్ని సమస్యలు వచ్చాయి... కొంత మంది బినామీలు ఎదురుతిరగడంతో రాజకీయనాయకులు సంపాదించిన ఆస్తి మొత్తం పర హస్త గతమయ్యింది... ఇది గమనించిన రాజకీయ నాయకులు తామే డైరెక్ట్ గా అన్ని రకాల వ్యాపారాల్లో దూరసాగారు... ప్రస్తుతం కొంత మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించసాగారు... కొంత మంది నేరుగా MLA... లోకసభ MP గా పోటీచెయ్యసాగారు... బాగా ధనవంతులు కొంత మంది రాజ్యసభ MP పదవులు కొనుక్కున్నారు... 2004 సంవత్సరం తరువాత రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాజకీయ నాయకుల ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది... చిన్న చిన్న పట్టణాలలో కూడా పెద్ద పెద్ద అపార్టుమెంట్ కాంప్లెక్స్ కట్టడం మొదలెట్టారు... MLA ... MP లు మంత్రులు... తాము సంపాదించిన నల్ల ధనాన్ని దాచుకోవడానికి... లేదా నల్ల ధనాన్ని తెలుపుగా మార్చుకోవడానికి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా ఉపయోగపడింది... ఒక రకంగా చెప్పాలంటే బిల్డర్ మాఫియా పుట్టింది. భూముల ధరలు నిర్ణయించడం... క్రయ... విక్రయాలు నియంత్రించడం... వివిధ పద్ధతుల్లో ప్రజల ఆస్తులు వశపరచుకోవడం... నల్ల ధనం తయారుచేయడం... మొదలయ్యింది... దేశంలో నల్లధనం గంగా నది ప్రవాహానికి పోటీ పడసాగింది... సింహపురిలో జరగబోయే డెవలప్మెంట్ గురించి బయటకు పొక్కకుండా నరసింహం చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముందుగా సింహపురి MLA ని ఢిల్లీ పిలిపించాడు.

నరసింహం: ప్రస్తుతం నీ ఆస్తి విలువ ఎంత?

MLA : నీకు తెలియంది ఏముంది అన్నా... మొన్న జరిగిన ఎలక్షన్స్ లో Rs.50 కోట్లు ఖర్చు పెట్టాను... గెలిచాను... ఎవరో పెద్దమనిషి అన్నట్లు... "ఎలక్షన్స్ లో ఓడిపోయిన వాడు తాను ఎలక్షన్ పెట్టిన ఖర్చు తలచుకొని కౌంటింగ్ సెంటర్ దగ్గర ఏడుస్తాడు... అదే ఎలక్షన్ లో గెలిచిన వాడు... పెట్టిన ఖర్చు రాబోయే 5 ఏళ్లలో వెనక్కి వస్తుందో లేదో తెలియక ఇంటికెళ్లి ఎవరూ చూడకుండా ఏడుస్తాడు..." నా పరిస్థితి అయోమయంగా ఉంది... ఎలక్షన్స్ లో గెలిచి ఏడాది దాటింది. ఇప్పటిదాకా మినిస్టర్ పదవి కాదు కదా... ఏ కార్పొరేషన్ చైర్మన్ పొజిషన్ కూడా దక్కలేదు... అప్పులిచ్చిన వాళ్ళు అడగడం మొదలెట్టారు... ఖర్చు పెట్టిన Rs.50 కోట్ల తో పాటు ఇంకో నాలుగేళ్లలో రాబోయే ఎన్నికల కోసం ఇంకో Rs.50 కోట్లు సంపాదించాలి... లేకపోతే MLA గా గెలిచి ప్రయోజనం ఉండదు...

నరసింహం: నీకు నేను వెంటనే నీ అప్పులన్నీ తీరుస్తాను... అంతే కాదు... మళ్ళీ ఎలక్షన్స్ లో నీకు అయ్యే ఖర్చు మొత్తం నేనే పెడతాను... నువ్వు గెలిచేలా చేస్తాను... అంతేకాదు... నీకు దాదాపు ఒక Rs.200 కోట్లు సంపాదించే మార్గం చెప్తాను... కుదిరితే నీకు ఒక మంత్రి పదవి కూడా ఇప్పిస్తాను... నేను చెప్పినట్లు చేస్తావా...

MLA (కుర్చీలోంచి లేచి నరసింహం కాళ్ళ మీద సాష్టాంగపడి): అన్నా... నువ్వు నాకు ఇంత సహాయం చేస్తానంటే... ఇదిగో... జీవితాంతం ఇలాగే నీకాళ్ళ దగ్గర పడివుంటాను.

నరసింహం: నీ నియోజకవర్గం గురించి నీకు ఎంత తెలుసు?

MLA : బాగా తెలుసు అన్నా... ప్రతి గ్రామ పంచాయితి లో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న క్షణాలమీద తెప్పించగలను...

నరసింహం: ఇప్పుడు నేను నీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను... ఇది నువ్వు ఎవ్వరికీ తెలియనివ్వకూడదు... రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గవర్నమెంట్ ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతోంది... ఆ బిల్లు పాస్ అయితే... మన దేశంలో దాదాపు 100 చిన్న... పెద్ద పట్టణాలు స్మార్ట్ సిటీస్... శాటిలైట్ సిటీలు గా మార్చే ప్రోగ్రాం వచ్చే ఏప్రిల్ నుంచి మొదలవుతుంది... శీతాకాల సమావేశాలకు ఇంకో 6 నెలల సమయం ఉంది... నాకు దొరికిన సమాచారం ప్రకారం... నీ నియోజకవర్గంలో సింహపురి సముద్ర తీరాన ఒక పోర్ట్... ఆ పోర్ట్ కి దగ్గరలో ఒక పెట్రో కెమికల్ ఇండస్ట్రీ రాబోతోంది... నువ్వు నాతో చెయ్యి కలిపితే... నీ జీవితమే మారిపోతుంది...

MLA : అన్నా... నువ్వు ఏమి చెయ్యమంటే అని చేస్తాను...

నరసింహం : సింహపురి మెయిన్ రోడ్ లో ఉన్న ఇళ్ళు... షాప్స్... మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉన్నాయో... తెలుసా?

MLA : దాదాపు 200 ఎకరాల ఏరియా లో ఉంటాయి... మొత్తం రెండు వీధులు... చాలా పాత ఇళ్ళు...

నరసింహం : చాలా జాగ్రత్తగా ఆ రెండు వీధులు మొత్తం మనం కొనెయ్యాలి... నాకు అర్జెంటు గా కొన్ని విషయాలు తెలియాలి...

MLA : చెప్పన్నా... నీకు ఏ వివరాలు కావాలంటే ఆ వివరాలు వెంటనే కనుక్కొని చెప్తాను... నరసింహం చాలా సేపు సింహపురి MLA కి బాగా అర్థమయ్యేలాగా తనకి ఏ ఏ డీటెయిల్స్ కావాలో చెప్పాడు... అది విన్న MLA కి బుర్ర తిరిగిపోయింది... "నీకు నెల రోజులు టైం ఇస్తున్న... ఈ డీటెయిల్స్ ఎవ్వరికీ అనుమానం రాకుండా తీసుకొని రా..." అని ఆర్డర్ వేశాడు. MLA సింహపురి చేరుకొని నరసింహం చెప్పిన పని మొదలుపెట్టాడు... అది అంత సులువైన పని కాదు... చాలా కష్టపడ్డాడు... ఒక నెల రోజుల పాటు నిద్ర ఆహారాలు మానేసి నరసింహం చెప్పిన పని పూర్తి చేసి న్యూ ఢిల్లీ చేరుకున్నాడు... MLA తీసుకొని వచ్చిన డీటెయిల్స్ ని నరసింహం చాలా జాగ్రత్త గా పరిశీలించాడు... సింహపురి... ఆ ఊరి చుట్టుపక్కల గ్రామాలని సర్వే నంబర్స్ ప్రకారం చాలా డిటైల్డ్ గా ఉన్నాయి... సింహపురి మ్యాప్ లో రెసిడెన్షియల్... కమర్షియల్ ప్రాపర్టీస్ ని చాలా క్లియర్ గా ఉన్నాయి. రిజిస్ట్రార్ అఫ్ ప్రాపర్టీస్ ఆఫీస్ లో దొరికిన డీటెయిల్స్ ప్రకారం... చివరిసారిగా జరిగిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ప్రకారం ప్రతి ఏరియా రియల్ ఎస్టేట్ సర్కిల్ రేట్స్ ని నిర్ణయించారు... ముఖ్యంగా సింహపురి మెయిన్ రోడ్ లో ప్రాపర్టీస్ మొత్తం 265 ఎకరాల్లో వుంది... చాలా వరకు కమర్షియల్ ప్రాపర్టీస్... జనరల్ స్టోర్స్... బుక్ షాప్స్... మెడికల్ షాప్స్... హార్డువేర్ షాప్స్... కొన్ని బ్యాంక్స్... కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు... ప్రతి ప్రాపర్టీ ఓనర్ పేరు... ఆ ఓనర్ ఆర్ధిక పరిస్థితి... ప్రాపర్టీ ఎంతమంది పేరు మీద ఉంది... అమ్మడానికి ఎంత మంది రెడీ గా ఉన్నారు... పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి... సింహపురి ఊరి బయట ఉన్న పొలాలు... పోరంబోకు స్థలాలు... గవర్నమెంట్ అసైన్డ్ భూములు... వాటి సర్వేనెంబర్ వాటి ప్రస్తుత విలువ... పూర్తి వివరాలు ఉన్నాయి.

నరసింహం: మెయిన్ రోడ్ లో ఎంత మందికి బ్యాంకు లోన్స్ వున్నాయి?

MLA : దాదాపు అన్ని షాప్స్ వాళ్లకి ఎదో ఒక లోన్ నడుస్తోంది...

నరసింహం: పెద్ద అమౌంట్ లో లోన్ ఎంతమందికి వుంది?

MLA : కనుక్కొని చెప్తాను...

నరసింహం: వెంటనే కనుక్కో... లోన్ అమౌంట్ పెద్దదైతే... నేను నా పలుకుబడి ఉపయోగించి బ్యాంకు ద్వారా ఆ షాప్ ఓనర్స్ కి డిమాండ్ నోటీసు పంపించే ఏర్పాటు చేస్తాను... దాంతో ఆ షాప్స్ ఓనర్స్ డబ్బులు అవసరమయి వాళ్ళు మనం చెప్పిన ధరకి అమ్మడానికి సిద్ధమవుతారు. బయట మార్కెట్ నుంచి ఎవరైనా అప్పులు తీసుకొని ఉంటే చెప్పు... ఆ ఏరియా లో నో మనీ లెండర్లు అందరూ నాకు బాగా తెలుసు. నేను వాళ్లకి ఫోన్ చేసి షాప్ ఓనర్స్ మీద అటువైపునుంచి కూడా ప్రెషర్ పెడతాను... ఎలాగైనా మనం మెయిన్ రోడ్ మొత్తం కొనెయ్యాలి... అప్పుడే అందరికి లాభం ఉంటుంది... ఎవరికి అనుమానం రాకుండా ఊరి బయట పోరంబోకు స్థలాలు... గవర్నమెంట్ అసైన్డ్ భూములు మన ఆధీనంలో కి తీసుకోవాలి... ఇవి కాకుండా ఊరిబయట సముద్రానికి దగ్గరలో కనీసం ఇంకో 500 ఎకరాలు కావాలి... మనం ఏ సర్వే నంబర్స్ లో భూములు మనకి అనుకూలమో చూడు... మెయిన్ రోడ్ మీద స్థలం కొనాలంటే ఎకరాకు 3 కోట్లు చొప్పున Rs.1000 కోట్ల దాకా కావాలి... ఊరిబయట పంటపొలాలు కొనాలంటే ఇంకో Rs.1200... కోట్ల రూపాలు రకరకాల ఖర్చులకి ఇంకో Rs.200 కోట్లు అనుకున్నా... మనకి దాదాపు Rs.2500 కోట్ల రూపాలు అవసరం... ఇందులో వైట్ మనీ సగం... బ్లాక్ మనీ సగం రెడీ చేసుకోవాలి...

ఆ అంకె వినగానే MLA కి గొంతు తడి ఆరిపోయింది... 'ఆమ్మో...Rs.2500 కోట్లు... అంత డబ్బు కాళ్ళ చూడాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి?' అని మనసులో అనుకున్నాడు... ఆ రోజు నుంచి మూడు నెలల పాటు నరసింహం చాలా కస్టపడి Rs.1500 కోట్ల రూపాయల నల్లధనాన్ని పోగేసాడు... ఆ డబ్బు మొత్తాన్ని ఒక పెద్ద కంటైనర్ లో భద్రపరచి ఒక రహస్య ప్రదేశంలో దాచి పెట్టాడు... ఎప్పుడు కావాలంటే అప్పుడు సింహపురి కి పంపిస్తాడు... బ్లాక్ లో ఇవ్వడానికి డబ్బులు రెడీ అయ్యాయి... వెంటనే ఓరియన్ డెవెలపర్స్ అని ఒక కొత్త కంపెనీ ని స్థాపించాడు... తన ఓరియన్ గ్రూప్ లోంచి ఆ కంపెనీ కి Rs.500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసాడు... సింహపురి మెయిన్ రోడ్ లో ప్రాపర్టీస్ కొన్న తరువాత వాటిని బ్యాంకు లో తనఖా పెట్టి తనకి కావాల్సినంత లోన్ వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు... ఈ విధంగా డబ్బులు రెడీ అయ్యాయి... ఇదంతా చాలా సీక్రెట్ గా జరిగిపోయింది... ముందుగా... నరసింహం తన పలుకుబడి ఉపయోగించి సింహపురి మెయిన్ రోడ్ వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా నోటీసులు వెళ్లేలా చేసాడు... ఆ వ్యాపారస్తులు కంగారుపడి బ్యాంకు కి వెళ్లారు... వాళ్ళకి ఆ బ్యాంకు మేనేజర్ "మీ లోన్స్ అమౌంట్స్ పెరిగిపోతున్నాయి... మీరు కనీసం 50% లోన్ అమౌంట్ కట్టెయ్యండి... కావాలంటే ఇంకో మూడు నెలల తరువాత మళ్ళీ టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు" అని బ్యాంకు మేనేజర్ చెప్పాడు... ఇది చాలదన్నట్లు మనీ లెండర్లు కూడా తమ దగ్గర తీసుకున్న లోన్స్ క్లియర్ చెయ్యమని ఫోన్స్ చేయసాగారు... దీంతో మెయిన్ రోడ్ వ్యాపారస్తులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి ఆయారు... ఏమి చెయ్యాలో తెలియాలేదు... ఒకేసారి అన్ని రకాల లోన్స్ తీర్చాలంటే సరిపోయే డబ్బు ఎవరి దగ్గర లేదు... ఇది కాకుండా సింహపురి వాసులకి "మూలిగే నక్క మీద తాటిపండు పడడం" అంటే ఏమిటో తెలిసింది... ఆ రోజు నవంబర్ నెల... 8వ తారీఖు... మంగళవారం రాత్రి... ఎనిమిది గంటల సమయం... ముందస్తు అనౌన్సమెంట్ ఏమి లేకుండా ఒకేసారి అన్ని న్యూస్ చానెల్స్ లో దేశ ప్రధానమంత్రి దర్శనమిచ్చి "మిత్రులారా... ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ₹1000 మరియు ₹500 నోట్లు చెలామణి అవ్వవు..." అని సెలవిచ్చాడు... దీనిని DEMONETIZATION అని అంటారు... దీనివల్ల భారత దేశ ఆర్ధిక వ్యవస్థ లో నల్లధనం మటుమాయమవుతుంది... ఎలక్ట్రానిక్ ట్రాన్సక్షన్స్ పెరుగుతాయని... దొంగనోట్ల చలామణి ఆగిపోతుంది... ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు... అయితే ఈ DEMONETIZATION అనుకున్న ఫలితాలు ఇవ్వలేదని నిపుణులు... ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు...

ఈ వార్త విన్న దేశ ప్రజలకు ముందుగా DEMONETIZATION అంటే ఏమిటో అర్ధం కాలేదు... దేశంలో నల్లధనం పోగేసుకున్న వాళ్లకు ఆ డబ్బు ఏమి చేయాలో తెలియలేదు... కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు దిక్కుతోచక న్యూ ఢిల్లీ లో ఒక పెద్దమనిషికి ఫోన్ చేశారు... ఆయన "DEMONETIZATION అమలులో రావడానికి ఇంకా 4 గంటల టైం వుంది... ఈ లోపల మీరు వీలైనంత గా మీ నల్ల ధనాన్ని బంగారలోకి మార్చుకోండి" అని ఒక సలహా ఇచ్చాడు... అంతే... చాలా మంది ఆ రాత్రికి రాత్రే తమ డబ్బుని బంగారం లోకి మార్చేసుకున్నారు... మరుసటి రోజు నుంచి ఎవరూ కూడా పెద్ద మొత్తం బ్యాంకు లో డిపాజిట్ చెయ్యలేరు... సోర్స్ అఫ్ ఇన్కమ్ చూపించాలి... టీవీ లో ఈ న్యూస్ చూసిన వెంటనే నరసింహం స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో పనిచేస్తున్న పళణివేలు కి ఫోన్ చేసాడు... "నా దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉంది... నోట్లు అన్ని... ₹1000 & ₹500... ఇప్పుడు అర్జెంటు గా వీటిని కొత్త నోట్లుగా ఎలా మార్చాలి?" అని అడిగాడు. దానికి బదులుగా పళణివేలు "నాకు కొంచం టైం ఇవ్వండి... ఒక గంటలో ఫోన్ చేస్తాను" అని అన్నాడు. నరసింహం ఎంతో మంది కి ఫోన్ చేసాడు... ఎవ్వరికీ అర్ధం కాలేదు... దాదాపు 11 గంటల సమయంలో పళణివేలు స్వయంగా నరసింహం ఇంటికి వచ్చాడు...

పళణివేలు : మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది?

నరసింహం : Rs.1500 కోట్లు... అర్జెంటు గా ఈ అమౌంట్ ని కొత్త నోట్లలోకి మార్చాలి... లేకపోతే నేను పూర్తిగా మునిగిపోతాను...

పళణివేలు: సోమవారం నుంచి బ్యాంకు లో జనాలు తమ దగ్గరున్న పాత నోట్లు బ్యాంకు లో మార్చుకోవొచ్చు... అయితే... మీ దగ్గరున్న అమౌంట్ ని మార్చాలంటే... డైరెక్ట్ రూట్ లో కుదరదు... మీ డబ్బులు ఎక్కడున్నాయి...

నరసింహం : ఆంధ్ర ప్రదేశ్ లో జాగ్రత్తగా ఉంచాను...

పళణివేలు: గవర్నమెంట్ కొత్త నోట్లని దేశం లోనే అన్ని బ్యాంకు బ్రాంచెస్ కి పంపిస్తుంది... మీకు ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతమంది బ్యాంకు మేనేజర్స్ తెలుసు?

నరసింహం: చాలా మంది...

పళణివేలు : మీరు ఆ బ్రాంచ్ మేనేజర్స్ తో డీల్ మాట్లాడుకోండి... ప్రతి కోటి రూపాయలకి 5% అంటే... 5 లక్షలు ఇస్తానని చెప్పండి... వాళ్ళు మీ పాత నోట్లు తీసుకొని దొంగ దారిన కొత్త నోట్లు ఇస్తారు... ఇంతకు మించి మంచి ప్లాన్ లేదు...

నరసింహం వెంటనే సింహపురి MLA కి ఫోన్ చేసి శ్రీకాకుళం... విజయనగరం... విశాఖపట్నం... ఉభయ గోదావరి జిల్లాల్లో వీలైనంత మంది బ్యాంకు మేనేజర్స్ ని కాంటాక్ట్ చేసి పాత నోట్లని కొత్త నోట్లలోకి మార్చడానికి డీల్ మాట్లాడమని చెప్పాడు... MLA ఆ రోజు రాత్రి దాదాపు 20 మంది పెద్ద బ్యాంక్స్ కి చెందిన బ్రాంచ్ మేనేజర్స్ ని కాంటాక్ట్ చేసి డీల్ చెప్పాడు... కొంతమంది 5% తీసుకొని కొత్త నోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు... ఇంకొంత మంది 10% అడిగారు... ఈ విషయాన్ని నరసింహానికి ఫోన్ చేసి చెప్పాడు... ఇది విన్న నరసింహం " అందరికి 10% ఇస్తానని చెప్పు... పని వెంటనే అవ్వాలి... మన దగ్గరున్న 1500 కోట్ల పాత నోట్లు దొంగ దారిన బ్యాంకు లోకి చేరాలి... మన దగ్గరకి కొత్త నోట్లు చేరాలి..." అని చెప్పాడు... MLA చాలా కష్టపడ్డాడు... అంత ఈజీ గా పని కాలేదు... కంటైనర్ లో దాచిన డబ్బులు లెక్క ప్రకారం బయటకి తియ్యడం... బాగా నమ్మకస్తుడికి అప్పగించడం... వాడు డైరెక్ట్ గా బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు ని మార్చి కొత్త నోట్లు తీసుకొని వచ్చేలా చూడడం... కొత్త నోట్లు ఇంకో చోట చాలా జాగ్రత్తగా దాచడం... అంత లెక్క ప్రకారం జరిగేలా చూసుకోవడం... పగలు... రాత్రి... నిద్రపోకుండా చాలా కష్టపడ్డాడు... డిమోనిటైజేషన్ నరసింహానికి చాలా బాగా ఉపయోగపడింది... వెంటనే రంగంలోకి దిగాడు...సింహపురి లోని మెయిన్ రోడ్ వ్యాపారస్తుల అసోసియేషన్ మెంబెర్స్ ని కలిసాడు...

నరసింహం ; డిమోనిటైజేషన్ వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా?

మెంబెర్ 1 : చాలా కష్టం గా ఉందండి... ఇది వరకు జనాలు డబ్బులు ఇచ్చి సరుకులు కొనేవాళ్ళు... ఇప్పుడు అందరూ గూగుల్ పే... ఫోన్ పే... PAYTM... వాడుతున్నారు... దీంతో మా కాష్ రొటేషన్ ఆగిపోయింది. మేము బయట మార్కెట్ లోంచి లోన్స్ తీసుకున్నాము... వాళ్లకి కాష్ లోనే పేమెంట్ ఇవ్వాలి... చెక్ కుదరదు... మా దగ్గర కొత్త నోట్లు రావడం లేదు... పాత్ నోట్లు పోవడం లేదు... మెంబెర్ 2: ఇది కాకుండా మా దగ్గర బ్లాక్ మనీ ఉంది... బ్యాంకు లో డిపాజిట్ చెయ్యలేని పరిస్థితి...

నరసింహం: మీ బ్లాక్ మనీ ని నేను మారుస్తాను... 20% ఖర్చు అవుతుంది... మీకు ఇష్టమైతే నేను చూసుకుంటాను.

మెంబెర్ 3: మాకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి... లోన్ రి పేమెంట్ చేయమంటున్నారు... బిజినెస్ సరిగ్గా నడవడం లేదు... ప్రతి రోజూ బ్యాంకు దగ్గర లైన్ నుంచొని పాత నోట్లు మార్చుకుంటున్నాము... టైం బాగా వేస్ట్ అవుతోంది...

నరసింహం: సింహపురి లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని అనుకుంటున్నాను... మెయిన్ రోడ్ లోని మీ షాప్స్ నాకు అమ్మితే... మీకు డబ్బులు ఇవ్వడమే కాకుండా... నేను కట్టబోయే షాపింగ్ సెంటర్ లో మీరు బిజినెస్ చేసుకోవడానికి షాప్స్ ని ఉచితంగా ఇస్తాను... ఇప్పుడు మీ షాప్స్ కి అంత విలువ లేదు... అదే మీరు షాపింగ్ సెంటర్ లో షాప్ పెట్టుకుంటే... బిసినెస్ బాగుంటుంది... ఇక్కడ చుట్టూ పక్కల 20 ఊళ్లలో ఎక్కడా పెద్ద సైజు షాపింగ్ మాల్... మల్టీప్లెక్స్ సినిమా లేకపోవడం తో అందరూ ఇక్కడికే వస్తారు... ఆలోచించండి... మీరు ప్రస్తుతం బ్యాంకు లో లోన్ అమౌంట్ కట్టాలంటే డబ్బులు కావాలి... మీ లో కొంతమంది మార్కెట్ నుంచి ఎక్కువ రేట్ లో లోన్స్ తీసుకున్నారు... నేను మీకు ఇచ్చే డబ్బులతో మీ లోన్స్ తీర్చుకోండి... రెండేళ్లలో మీకు షాప్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను... ఆలోచించుకొని చెప్పండి...

నరసింహం వాళ్లకి మెయిన్ రోడ్ లో ప్రతి ఎకరానికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పాడు... వైట్ లో ఎంత అమౌంట్... బ్లాక్ లో ఎంత అమౌంట్ ఇస్తాడో కూడా చెప్పేసాడు... ఆ డీల్ చాలా మందికి నచ్చింది... కొంత మంది ఎక్కువ అమౌంట్ అడిగారు... బేరసారాలు జరిగాయి... చివరికి వ్యాపారస్తులు తమ ప్రాపర్టీ ని అమ్మడానికి ఒప్పుకున్నారు... అయితే... షాప్స్ మధ్య లో కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి... కొంత మంది అమ్మడానికి ఒప్పుకున్నారు... 12 మంది ఒప్పుకోలేదు... నరసింహం వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడాడు... నచ్చచెప్పాడు... అందరికి షాపింగ్ సెంటర్ లో షాప్స్ కూడా ఇస్తానని చెప్పాడు... కొందరు 8 మంది ఒప్పుకున్నారు... ముగ్గురు ఎదురు తిరిగారు... నరసింహానికి సహనం నశించింది... ఆ మూడు ఫామిలీస్ మీద అటాక్స్ చేయించాడు... రోడ్ మీద మోటార్ బైక్ కి యాక్సిడెంట్స్... ఊరి బయట కార్ ని లారీ గుద్దడం... మార్కెట్ లో కూరలు కొనుక్కోవడానికి వెళ్లిన వాళ్ల మీద అలగాజనం అసభ్యంగా ప్రవర్తించడం... ఆడవాళ్ళని ఏడిపించడం... రకరకాలుగా హింసించాడు... ఆ మూడు ఫామిలీస్ కి నెమ్మదిగా అర్ధమయ్యింది... వాళ్ళు దారిలోకి వచ్చారు... నరసింహం పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకున్నారు... చివరికి మిగిలింది గౌతమ్ సవతి తల్లి... సవతి తమ్ముళ్లు... నరసింహం సింహపురి లో వున్నప్పుడు వాళ్ళు ఊళ్ళో లేరు... నరసింహం సింహపురి MLA ని పిలిచి "ఆ గోపాలరావు ఫామిలీ విషయం ముక్కు చోసుకో... ఒక 20 రోజుల్లో మెయిన్ రోడ్ ప్రాపర్టీస్ కి సంభందించిన రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా చూసుకోవాలి... త్వరలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతాయి... అంతకు ముందే మెయిన్ రోడ్ మన సొంతం కావాలి... పైగా పొలాలు కూడా కొనాలి... నేను మళ్ళీ ఇంకో వారం రోజుల్లో వస్తాను... అప్పుడు పొలాల సంగతి చూడాలి. పార్లమెంట్ లో బిల్ ప్రవేశ పెట్టె ముందు కాబినెట్ అప్రూవల్ కి వస్తుంది... దానికి ముందే మనం అన్ని పనులు పూర్తి చెయ్యాలి..." MLA గౌతమ్ సవతి తమ్ముళ్ళని పిలిచి...

MLA : మీకు తెలిసే ఉంటుంది... మెయిన్ రోడ్ లో అందరూ తమ ప్రాపర్టీస్ అమ్మడానికి ఒప్పుకున్నారు... నరసింహం గారు డబ్బులు... షాపింగ్ కాంప్లెక్స్ లో షాప్స్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నారు... మీరు కూడా మీ ఇల్లు అమ్మితే... అందరితో పాటు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం...

గౌతమ్ సవతి తమ్ముడు : ఆ ఇల్లు మేము అమ్మలేము...

MLA : మీరు కూడా అమ్మి తీరాలి... అందరూ అమ్మడానికి రెడీ అయ్యాక మీరు కుదరదంటే ఎలా? పైగా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడ్వాన్స్ తీసుకున్నారు... మీ ఒక్క ఇల్లు మిగిలిపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం కుదరదు కదా... ఏదో ఒక రేట్ మాట్లాడుకుందాం...

గౌతమ్ సవతి తమ్ముడు: మీరు అందరికి ఇచ్చిన డీల్ మాకు ఓకే... కానీ అమ్మడం కుదరదు...

MLA (కోపంగా): ఎందుకని?

గౌతమ్ సవతి తమ్ముడు : ఆ ఇల్లు మాది కాదు... మా నాన్న మొదటి కొడుకు గౌతమ్ కి అతని తల్లి ద్వారా సంక్రమించింది... మేము అమ్మితే చెల్లదు...

MLA తలపట్టుకున్నాడు... ఇప్పుడు ఆ గౌతమ్ అనే వాడిని ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియడం లేదు. వెంటనే నరసింహానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు... "ఆ గౌతమ్ అనే వాడు ఎవరు? ఎక్కడుంటాడు? ఏమి చేస్తాడో... వివరంగా కనుక్కో... నేను డీల్ చేస్తాను" అని అన్నాడు... MLA నేరుగా గౌతమ్ సవితి తమ్ముళ్ల దగ్గరకి వెళ్లి గౌతమ్ డీటెయిల్స్ అడిగాడు... "గౌతమ్ ఆర్మీ లో పనిచేస్తాడు... ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు... ఈ వూరు వొదిలేసి చాలా కాలం అయ్యింది... మొన్న మా నాన్న గారు చనిపోయినప్పుడు వచ్చాడు... ఆ తరువాత ఇప్పటిదాకా ఈ వూరు రాలేదు... వస్తాడో... రాడో... మాకు తెలీదు... మేము మాత్రం మా ఆస్తులన్నీ మంచి డీల్ దొరికితే అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని చెప్పారు... ఈ విషయాన్ని ఆ MLA నరసింహానికి తెలియచేసాడు... నరసింహం డిఫెన్సె మినిస్ట్రీ లో తనకి బాగా తెలిసిన కొంత మంది తో గౌతమ్ గురించి ఎంక్వయిరీ చేసాడు... ఇక్కడే నరసింహం ఒక పెద్ద పొరపాటు చేసాడు... గౌతమ్ సవితి తమ్ముళ్ళకి ఆర్మీ లో గౌతమ్ ర్యాంక్... PLACE OF DUTY... గౌతమ్ ఎటువంటి పనులు చేస్తాడో అస్సలు తెలియదు... పైగా ఆర్మీ లో గౌతమ్ SPECIAL FORCES కి ట్రాన్స్ఫర్ అయినా తరువాత అతని DUTY RECORDS అన్నింటిని CLASSIFIED DOCUMENTS గా మార్చేశారు... మామూలు డేటా బేస్ లో గౌతమ్ గురించి తెలుసుకోవడం చాలా కష్టం... మినిస్ట్రీ అఫ్ డిఫెన్సె లో పనిచేసే వ్యక్తి "పూర్తి డీటెయిల్స్ తెలియకుండా మీరు అడిగిన వ్యక్తి గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు... నా ఉద్దేశ్యం ప్రకారం ఆ గౌతమ్ కుమార్ అనేవాడు ఇండియా బోర్డర్ లో ఎక్కడో డ్యూటీ చేస్తూ ఉండాలి... నేను CAPTAIN ర్యాంక్ నుంచి ఆ పైన పనిచేసే అన్ని ర్యాంక్స్ ఆఫీసర్స్ పేర్లు చెక్ చేసాను... గౌతమ్ కుమార్ పేరు ఎక్కడా లేదు... ఆర్మీలో సోల్జర్ గా పనిచేస్తున్నాడేమో... " అని అన్నాడు... ఇది వినగానే నరసింహం గౌతమ్ కుమార్ గురించి బాగా లైట్ తీసుకున్నాడు... ముందు గౌతమ్ ఇల్లు కూడా స్వాధీనం చేసుకొని ఆ తరువాత ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే చూసుకుందామని డిసైడ్ అయ్యాడు... ఒక్కోసారి కొందరు వ్యక్తులు తాము తీసుకునే నిర్ణయాలకు ఫలితాలు చాలా ఆలస్యంగా తెలుస్తాయి... అదే విధంగా ఆ క్షణాన నరసింహానికి తాను తీసుకున్న ఆ నిర్ణయం వల్ల దేశం లో పెద్ద ఎత్తున రాజకీయ... వ్యాపార... సునామి రాబోతోందని... దాని ప్రభావానికి తనతో పాటు కొన్ని వందల రాజకీయ నాయకులు సర్వ నాశనం కాబోతున్నారని ఊహించలేదు...


PART - 11 - THE DEAL

గౌతమ్ సవతి తమ్ముడు చెప్పింది విన్న MLA... "మీరు గౌతమ్ ని ఒప్పించండి... మీకు కావాలంటే కమిషన్ ఇప్పిస్తాను." దానికి బదులుగా గౌతమ్ సవతి తమ్ముడు "కుదరదండి... మా నాన్న పోయినప్పుడు మాకు గొడవయ్యింది... ఆస్తి పంపకాలు సరిగ్గా జరగలేదని మా అభిప్రాయం. గౌతమ్ ఆర్మీ లో ఉంటాడు... మీరు ఈ ఇంటి గురించి గౌతమ్ తో డైరెక్ట్ గా మాట్లాడండి... పొలాలు... రైస్ మిల్ గురించి అందరం కలసి నిర్ణయించుకుంటాము... ఇంకో రెండు రోజుల్లో గౌతమ్ వస్తున్నాడని తెలిసింది... మా నాన్న ఫ్రెండ్ వెంకటరావు ఇంట్లో ఉంటాడు." అని అన్నాడు.

గౌతమ్ ఊర్లోకి రాగానే MLA కలిసాడు. కుశల ప్రశ్నలు అయ్యిన తర్వాత అసలు విషయాన్ని చల్లగా బయట పెట్టాడు...

MLA : మన ఊరి ని బాగు చేయడానికి మన నియోజకవర్గం ఎంపీ నరసింహం గారు ఒక మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశారు. దీనిలో భాగంగా సింహపురి మెయిన్ రోడ్ లో ఒక పెద్ద షాపింగ్ సెంటర్... మల్టీప్లెక్స్ సినిమా హాల్... కన్వెన్షన్ సెంటర్ ని కట్టాలని ప్లాన్ రెడీ చేశారు. మెయిన్ రోడ్ లోని వ్యాపారస్తులు... గృహస్తులు... అందరూ తమ ప్రాపర్టీ ని అమ్మకానికి రెడీ గా ఉన్నారు. మీరు కూడా మీ ఇంటిని అమ్మితే... మన ఊరి స్వరూపం మారిపోతుంది.

గౌతమ్: ఇది నా స్వగ్రామం... ఈ ఇల్లు నాకు మిగిలిన మా అమ్మ ఏకైక జ్ఞాపకం... నాకు ఈ ఇంట్లో చాలా అనుబంధం ఉంది... ఈ మధ్యనే నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. సింహపురి వచ్చి సెటిల్ అవ్వాలని నా ఉద్దేశ్యం... మా నాన్న నాకు వ్రాసి ఇచ్చిన పొలం ని సాగుచేసుకుంటూ... మా రైస్ మిల్ ని బాగు చేసి మళ్ళీ మిల్ బిజినెస్ ని పునఃప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నాను... నాకు వారసత్వంగా వచ్చిన ఇల్లు అమ్మే ప్రసక్తే లేదు... నేను ఆ ఇంటిని బాగు చేయించుకొని ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను...

MLA : అంత మాట అనకండి... అందరూ రెడీ అయ్యాక మీరు కాదంటే... నరసింహం గారి మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుంది. మీరు ఆ మాస్టర్ ప్లాన్ కనుక చూస్తే మీకు అర్ధమవుతుంది... మన సింహపురి ఒక్కసారిగా చాల పెద్ద సిటీ గా మారిపోయే ఛాన్స్ ఉంది... కాలానుగుణంగా మనం కూడా మారిపోవాలి... మీరు ఆ పాత ఇంటిని ఎంత బాగు చేయించినా పెద్ద గా లాభం ఉండదు... అదే మీరు ఆ ఇంటిని అమ్మేస్తే... మీకు చాలా పెద్ద అమౌంట్ దొరికే ఛాన్స్ ఉంది... ఆ అమౌంట్ ని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవొచ్చు...

గౌతమ్: అది నా ప్రాబ్లెమ్ కాదు. మీ ప్లాన్స్  మీకున్నట్లే... నాకు కూడా పర్సనల్ ప్లాన్స్ ఉన్నాయి... అయినా నా ఆస్తిని మీరు బలవంతం గా అమ్మమని అడగడం బాగాలేదు... ఇష్టమున్న వాళ్ళు అమ్ముకుంటారు... ఇష్టంలేని వాళ్ళమీద ప్రెషర్ పెట్టడం మంచిది కాదు...

MLA : మీకు కావాలంటే అందరికి ఇస్తున్నదానికంటే ఇంకో 25% ఎక్కువ వచ్చేలా చూస్తాను.

గౌతమ్: నాకు అమ్మే ఉద్దేశం లేదని చెప్తున్నా... మీరు ఎక్కువ ఇస్తామనడం ఏమి బాగాలేదు. నేను ఎక్కువ డబ్బుల కోసం బెట్టు చెయ్యడం లేదు... నాకు నిజం గా ఇష్టం లేదు... ఈ వూరు... ఆ ఇంట్లో... నాకు చిన్ననాటి జ్ఞాపకాలు చాలు ఉన్నాయి... ఆ ఇల్లు అమ్మేస్తే... ఆ ఇంటితో నాకు బంధం తెగిపోతుంది... అది నాకు ఇష్టం లేదు... ఇది నా స్వగ్రామం... ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది... నేను ఆ ఇంట్లో పెర్మనెంట్ గా ఉండాలన్నది నాకోరిక... ఇందులో పెద్ద గా మార్పు ఉండదు...

MLA కి అర్ధమయ్యింది. గౌతమ్ కి నచ్చ చెప్పటం తనవల్ల కాదు... ఆ MLA వెంటనే నరసింహానికి ఫోన్ చేసి కొత్త ప్రాబ్లెమ్ గురించి చెప్పాడు... "ఈ ఒక్క ఇంటి వాళ్ళ మన మాస్టర్ ప్లాన్ చెడిపోవడం నాకు ఇష్టం లేదు. గౌతమ్ కి అందరికి ఇస్తున్న దానికన్నా రెట్టింపు ఇస్తానని చెప్పు... అప్పటికీ ఒప్పుకోకపోతే... ఇంకోరకంగా దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం" అని అన్నాడు... అది నరసింహం చేసిన పెద్ద పొరపాటు...

మరుసటి రోజు MLA కొత్త ఆఫర్ గురించి గౌతమ్ కి చెప్పాడు... "మన MP గారు మీ ఇంటికి అందరికి ఇచ్చిన ధర కన్నా డబల్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు" అని చెప్పాడు... గౌతమ్ కి డౌట్ వచ్చింది... '24 గంటల గడవకముందే రేట్ ని డబల్ చేశారంటే... వీళ్ళకి సింహపురి మెయిన్ రోడ్ లో షాపింగ్ సెంటర్ కట్టడం చాలా ఇంపార్టెంట్ లాగా ఉంది... జాగ్రత్తగా ఆలోచించాలి' అని మనసులో అనుకోని "నాకు 5 రోజుల టైం ఇవ్వండి నా ఫైనల్ డెసిషన్ మీకు చెప్తాను" అని అన్నాడు. గౌతమ్ మనసులో ఏమున్నదో అర్థంకాని ఆ MLA ఆనందంగా ఫోన్ చేసి "అన్నా... ఇంకో 5 రోజుల్లో గౌతమ్ ఇల్లు మన సొంతం అవుతుంది... ఆలోచిస్తున్నాడు..." అని చెప్పాడు. నరసింహం ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు...

MLA వెళ్ళగానే గౌతమ్ ఆలోచించడం మొదలెట్టాడు... "సడన్ గా సింహపురి లాంటి చిన్న ఊళ్ళో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్... మల్టీప్లెక్స్ థియేటర్స్... కన్వెన్షన్ సెంటర్... ఎందుకు కడుతున్నారు? అంత అవసరమేముంది? రాజకీయ నాయకులు ఏ పనైనా తమకు లాభం ఉంటేనే చేస్తారు... ప్రజాసేవ చెయ్యరు. ఇప్పుడు సింహపురి డెవలప్ చెయ్యడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? ఆ ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలి"

గౌతమ్ ఆ క్షణంనుంచి సింహపురి గురించి ఆలోచించసాగాడు... 1. సింహపురి గోదావరి జిల్లాలో ఒక చిన్న ఊరు... 2. ఒకవైపు సముద్రం... మిగతా మూడు వైపులా భూమి... సింహపురి పక్కనుంచి గోదావరి నది ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. 3. ప్రధానంగా వ్యవసాయ ఆధార ప్రాంతం. వరి ఎక్కువగా పండుతుంది... కూరలు కూడా పండిస్తారు... అగ్రికల్చర్... హార్టికల్చర్... నాట్లు వెయ్యడానికి కావాల్సిన నర్సరీలు ఉన్నాయి... 4. సముద్రం ద్వారా చేపలు... రొయ్యల వ్యాపారం జరుగుతుంది. 5. సింహపురి కి చుట్టూ చిన్న చిన్న ఊళ్ళు... పెద్దగా జనసాంద్రత ఉండదు. అందరూ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాళ్లు... పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్లరు. 6. సహజ వనరులు... నేచురల్ గ్యాస్... పెట్రోలియం... డిపాజిట్స్ ఉన్నాయని ONGC వాళ్ళు చాలా కాలం క్రితం కనుగొన్నారు... సడన్ గా గౌతమ్ కి ఎదో గుర్తుకొచ్చింది... ఒక సంవత్సరం క్రితం  ఢిల్లీ లోని ఎర్రకోట మీద ప్రధాన మంత్రి ఇచ్చిన ఆగస్టు 15 ఉపన్యాసం లో "....మన దేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది... నేచురల్ గ్యాస్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి... థర్మల్ విద్యుత్ ని తగ్గించి... నేచురల్ గ్యాస్ తో పనిచేసే విద్యుత్ కేంద్రాలు స్థాపించడం... నేచురల్ గ్యాస్ ని విదేశాలకు ఎగుమతి చెయ్యడానికి కావాల్సిన కొత్త పోర్ట్స్ ని కట్టడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది... కొత్తగా స్మార్ట్ సిటీస్ ని కూడా కట్టాలని ఆలోచిస్తోంది..." అని చెప్పడం గుర్తుకొచ్చింది. 'అంటే... కేంద్ర ప్రభుత్వం సింహపురి ని స్మార్ట్ సిటీ గా మార్చబోతుందా? వూరికి దగ్గరలో ఏదైనా పోర్ట్ రాబోతోందా?? గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్స్ రాబోతున్నాయా??? ఆయిల్ ONGC వాళ్ళు ఏదైనా మొదలుపెట్టబోతున్నారా???? ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న నరసింహం ఊరంతా చీప్ గా కొనేసి... షాపింగ్ సెంటర్... మల్టీప్లెక్స్... కన్వెన్షన్ సెంటర్... హౌసింగ్ కాంప్లెక్స్ కట్టేసి విపరీతమైన లాభానికి అమ్ముకోబోతున్నాడా???? అదే అయ్యి ఉంటుంది... లేకపోతే 24 గంటల్లో ప్రాపర్టీ రేట్ డబల్ ఎందుకు చేస్తారు... దీని గురించి ఎంక్వయిరీ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.

మరుసటి రోజు గౌతమ్ తన తండ్రి మిత్రుడు వెంకట్రావు గారి స్కూటర్ తీసుకొని సింహపురి కి మొత్తం తిరిగి వచ్చాడు... వూరు చాలా మారింది... ఇది వరకు ఊళ్ళో చాలా చెట్లు... తోటలు ఉండేవి... ఇప్పుడు వాటి స్థానంలో కొత్తగా కాలనీలు వెలిశాయి... ఆ చిన్న ఊళ్ళో రెండు రెసిడెన్షియల్ కాలేజెస్  కూడా వెలిశాయి... వాటిలో స్టూడెంట్స్ కి 8వ తరగతి నుంచి IIT...EAMCET... మెడిసిన్... LAW... Bed... ఎంట్రన్స్ ఎక్సమినేషన్స్ కి కోచింగ్ ఇవ్వడానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు... ఊరికి  ఇంకో చివర ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వెలసింది... ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీ కూడా వెలసింది... త్వరలో ఆ వూరికి ఒక మెడికల్ కాలేజీ కూడా రాబోతోంది అని టాక్ నడుస్తోంది... ఊళ్ళో కలియతిరిగారు... ఊళ్ళో చాలా మార్పులు వచ్చాయి... తనతో పాటు ఎలిమెంటరీ స్కూల్ లో చదివిన ఫ్రెండ్ ఒకడు ఆ ఊళ్ళో AC సినిమా హాల్ కూడా కట్టాడు... ఊరంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఛాయలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి... రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన DEMONETIZATION ప్రభావం పెద్దగా కనిపించడం లేదు... ఇదివరకు ₹1000 నోట్ల లో బ్లాక్ మనీ ని దాచుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా ₹2000 నోట్లలో దాచుకుంటున్నారు... అంతే తేడా... సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన DEMONETIZATION గోల్ నెరవేరినట్లు కనిపించడం లేదు...

రెండు రోజుల పాటు గౌతమ్ సింహపురి కి ఉత్తరం వైపు ఒక 30 కిలోమీటర్స్... దక్షిణం వైపు 30 కిలోమీటర్స్ ప్రయాణించి ఆ ఏరియాలో పరిస్థితులు అవగాహన చేసుకున్నాడు... ఒక విషయం బాగా అర్ధమయ్యింది... ఈ నరసింహానికి ఎదో INSIDE INFORMATION వుండు ఉండాలి... ఈ మారుమూల ప్రాంతం తో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాడు? ఎదో పెద్ద ప్లాన్ వేసాడు... ఆ ప్లాన్ కోసం జనాలకి డబ్బులు ఇస్తున్నాడు... దారికి రాణి వాళ్ళని బెదిరిస్తున్నాడు...

గౌతమ్ న్యూ ఢిల్లీ లో తనకి బాగా తెలిసిన ఒక తెలుగు IAS ఆఫీసర్ కి ఫోన్ చేసి

గౌతమ్: మా వూరికి చుట్టు పక్కల ఏదైనా కొత్త డెవలప్మెంట్ రాబోతోందా?

IAS ఆఫీసర్: మీకు ఆ డౌట్ ఎందుకొచ్చింది?

గౌతమ్: ఇక్కడ లోకల్ MLA... MP మా ఊర్లో రియల్ ఎస్టేట్ ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. రకరకాల అనుమానాలకు తావిస్తోంది.

IAS ఆఫీసర్: పొలిటిషన్స్ అలా కొనడం పెద్ద విషయం కాదు... అప్పుడప్పుడూ ఏవో రూమర్స్ వినిపిస్తాయి... వాటిని ఆధారం చేసుకొని ఈ రాజకీయ నాయకులు ఏవో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు.

గౌతమ్: ఆ విషయం నాకు తెలుసు. నేను నా ప్రాపర్టీ అమ్మనని చెప్పాను... వెంటనే వాళ్ళు నాకు డబల్ అమౌంట్ ఆఫర్ చేశారు. వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు.

IAS ఆఫీసర్: ఏమాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా?

గౌతమ్: నా అంచనా ప్రకారం కనీసం 2500 కోట్ల కి పైగా చేతులు మారుతున్నాయి.

IAS ఆఫీసర్: That is serious investment... అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారంటే... వాళ్ళ దగ్గర ఎదో సీరియస్ inside information తెలిసి ఉండాలి. నువ్వు నాకు రెండు రోజుల టైం ఇవ్వు. నేను ఇక్కడ ఎంక్వయిరీ చేస్తాను. నాకు ఏదైనా తెలిస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను.

గౌతమ్ కి మూడు రోజుల తరువాత ఫోన్ వచ్చింది... "నీ అనుమానం నిజమే... సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్ ప్లాన్ లో భాగంగా దేశం లో 100 స్మార్ట్ సిటీస్... 200 శాటిలైట్ సిటీస్... సాగర తీరాన కొత్త గా SEA PORTS  పెట్రోలియం... నేచురల్ గ్యాస్ ప్లాంట్స్... కొత్త గా రెన్యూవల్ ఎనర్జీ ప్లాంట్స్... పెట్టబోతున్నారు... మీ సింహపురి ఏరియా లో ఒక పోర్ట్... నేచురల్ గ్యాస్ ప్లాంట్... రకరకాల బేసిక్ హెవీ ఇండస్ట్రీస్... వాటికి కావాల్సిన అన్సెల్లరీ ఇండస్ట్రీస్... వచ్చే అవకాశం ఉంది... రాబోయే శీతాకాల సమావేశాల్లో ఒక బిల్ ప్రవేశపెట్టబోతున్నారు... అది పాస్ అయితే... వచ్చే వార్షిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ రిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి..." అని చెప్పాడు...

సరిగ్గా 5 రోజుల తరువాత MLA గౌతమ్ ని కలిసాడు...

MLA : డిసైడ్ చేసుకున్నారా? రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం?

గౌతమ్: నేను వచ్చే సంవత్సరం దాకా ఆగుదామని డిసైడ్ చేసుకున్నాను... నాకు న్యూఢిల్లీ లో కొన్ని పనులున్నాయి... వెళ్ళాలి

MLA : ప్రస్తుతానికి సేల్ డీడ్ రాసుకుందాము. మీరు వెనక్కి వచ్చాక రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము...

గౌతమ్: అన్ని నేను వెనక్కి వచ్చాక చూసుకుందాము... ఈ లోగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా పూర్తి అవుతాయి...

MLA (ఖంగారుగా): పార్లమెంట్ సమావేశాలు ఏమిటి??

గౌతమ్ : నాకు తెలిసిన సమాచారం ప్రకారం పార్లమెంట్ లో కొత్త బిల్ పాస్ అవుతోంది... సింహపురి స్మార్ట్ సిటీ గా డిక్లేర్ అవుతుంది. ఒక పోర్ట్... గ్యాస్ పెట్రోకెమికల్స్ ప్లాంట్... వస్తాయి... అప్పుడు రియల్ ఎస్టేట్ రేట్స్ బాగా పెరుగుతాయి... నా ఇల్లు మొత్తం 10000 చదరపు గజాల్లో ఉంది... మొత్తం పడగొట్టేసి అపార్టుమెంట్స్ కడతాను. ఒక అపార్టుమెంట్ లో నేను ఉండి... మిగతా వాటిలో కొన్ని అమ్ముతాను... కొన్ని అద్దెకు ఇస్తాను..అపార్టుమెంట్స్ అమ్మగా వచ్చిన డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను...

MLA నోట మాట పడిపోయింది... గౌతమ్ కి ఈ సమాచారం ఎలా తెలుసు? వెంటనే ఫోన్ చేసి నరసింహానికి చెప్పాడు... MLA చెప్పింది వినగానే నరసింహానికి చెమటలు పట్టాయి... సెంట్రల్ గవర్నమెంట్ గ్రాండ్ ప్లాన్ చాలా పెద్ద సీక్రెట్... ఇంతకాలం స్మార్ట్ సిటీస్ ప్లాన్ తనకి ఒక్కడికే తెలుసనీ అనుకున్నాడు... గౌతమ్ ఎలా తెలిసింది? ఇంకా ఎవరెవరికి తెలుసు? ఈ విషయం సింహపురి ప్రజలకి తెలిస్తే? గొడవ అవుతుంది. అందరూ ఎక్కువ డబ్బులు అడుగుతారు... అసలుకే మోసం వస్తుంది... వెంటనే ఈ విషయాన్ని సెటిల్ చెయ్యాలి... లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి... గౌతమ్ కి ఫోన్ చేసాడు...

నరసింహం: నమస్తే... నా పేరు నరసింహం... ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాను...

గౌతమ్: నమస్తే... బాగున్నారా?

నరసింహం: నేను బాగున్నాను... మన MLA మీతో మీ ఇల్లు అమ్మకం గురించి చెప్పాడు కదా... ఏమి డిసైడ్ చేశారు...

గౌతమ్: నేను MLA గారికి నా ప్లాన్ మొత్తం వివరంగా చెప్పాను... నేనే సొంతగా డెవలప్ చెయ్యాలని అనుకుంటున్నాను.

నరసింహం: నేను ఆ ఏరియా లో చాలా పెద్ద బిజినెస్ సెంటర్ కట్టాలని అనుకుంటున్నాను... మీ ఇల్లు కూడా అమ్మితే... నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు మీ ఇల్లు అమ్మడం ఇష్టం లేకపోతే... దాన్ని మాకు డెవలప్మెంట్ కి ఇవ్వండి... మేము మీకు కొంత అమౌంట్ ఇస్తాము... ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక కొంత OFFICE SPACE కూడా మీకు వచ్చేలా చేస్తాను... మీరు దాన్ని ఏదైనా CORPORATE OFFICEకి లీజ్ కి ఇచ్చుకోవొచ్చు... లేదా మీరు మాకు ఆ OFFICE SPACEని మార్కెట్ రేట్ ప్రకారం అమ్మండి... మేము కొనుక్కుంటాము... మీకు ఈ పాటికే అర్ధమయ్యుంటుంది... ఈ డీల్ నాకు చాలా ఇంపార్టెంట్... ఇది నా చెయ్యిజారిపోకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను... అర్ధం చేసుకోండి...

గౌతమ్: నాకు అమ్మడానికి పెద్ద ప్రాబ్లెమ్ లేదు... కానీ... మీరు చెప్తున్న రేట్ కి అమ్మలేను.

నరసింహం: అందరికి ఇస్తున్న దానికన్నా మీకు రెట్టింపు ఇస్తున్నాను...

గౌతమ్: అది చాలా తక్కువ... నేను సొంతగా డెవలప్ చేసుకుంటే... నాకు చాలా మిగులుతుంది. నేను మీకు వివరంగా ఒక ఇమెయిల్ వ్రాస్తాను... అది చూసి మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి.

నరసింహం: మీరు మీ ప్రపోసల్ వెంటనే పంపండి...

గౌతమ్ అదే రోజు ఒక డిటైల్డ్ ఇమెయిల్ వ్రాసాడు... అందులో 10000 చదరపు గజాల ఇంటి స్థలం... తండ్రి వ్రాసిన వీలునామా ప్రకారం తనకి చెందాల్సిన పొలాలలో వాటా... రైస్ మిల్లులో వాటా... అన్నింటిని చాలా క్లియర్ గా వివరించాడు. ఆ ఇమెయిల్ చదివిన నరసింహానికి స్పృహ తప్పినంత పని అయ్యింది... ఆ ఇమెయిల్ ప్రకారం  ఒక్క గౌతమ్ కే ₹100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది... గౌతమ్ సొంతగా డెవలప్ చేసుకుంటే...గౌతమ్ కి అన్ని ఖర్చులు మినహాయించుకున్నాక కనీసం ₹100 కోట్ల రూపాయల లాభం వస్తుంది... గౌతమ్ కి అంత డబ్బు ఇవ్వడం నరసింహానికి ఇష్టం లేదు... MLA కి ఫోన్ చేసి గౌతమ్ తో బేరం చెయ్యమని చెప్పాడు... MLA విపరీతంగా కష్టపడ్డాడు... గౌతమ్ ని కన్విన్స్ చెయ్యలేకపోయాడు... గౌతమ్ లాజిక్ ముందు MLA నిలపడలేకపోయాడు... చాలా తొందరగానే చేతులెత్తేశాడు... ఇక లాభం లేదని  నరసింహం డైరెక్ట్ గా రంగం లోకి దిగాడు... ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ ఇల్లు కావాలి... గౌతమ్ అమ్మడు... ఎలా... నెక్స్ట్ స్టెప్ ఏమిటీ?? బెదిరించడం... ఆర్మీ వాడి ని బెదిరించడం కష్టం... ప్రాబ్లమ్స్ వస్తాయి... బలవంతంగా సంతకాలు తీసుకుంటే?? కుదరకపోవొచ్చు... ఆ ఇంటికి గౌతమ్ ఒక్కడే వారసుడు... ఒకవేళ గౌతమ్ చనిపోతే... ఆ ఇల్లు గౌతమ్ తమ్ముళ్ళకి దక్కే ఛాన్స్ ఉంది... వాళ్ళ దగ్గరనుంచి అందరికి ఇస్తున్న రేటుకే కొనొచ్చు... గౌతమ్ కి ప్రామిస్ చేసిన డబల్ రేట్ ఇవ్వాల్సిన పని ఉండదు... గౌతమ్ ని చంపేసాక ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే... లోకల్ గా MLA చూసుకుంటాడు...

MLA వెంటనే లోకల్ పోలీసులని పిలిచి చెయ్యాల్సిన పని చెప్పాడు... ప్లాన్#1. ఏదో ఒక కారణం చెప్పి గౌతమ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని రావాలి... నయానో... భయానో... ఒప్పించి డాక్యుమెంట్స్ మీద సంతకాలు తీసుకొని... వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి గౌతమ్ ని వొదిలెయ్యాలి... ప్లాన్#2. గౌతమ్ ని చంపేసి ఆ ఇల్లు అతని సవతి తమ్ముళ్ళకి చెందేలా చేసి... వాళ్ళ దగ్గరనుండి కొనెయ్యాలి... ఈ ప్లాన్స్ విన్న పోలీస్ ఆఫీసర్ " మొదటి ప్లాన్ చాలా రిస్క్... గౌతమ్ ని బెదిరించి... హింసించి... బలవంతగా సంతకాలు తీసుకొని వదిలేస్తే... ఎప్పటికైనా ప్రాబ్లెమ్ వస్తుంది... రెండో ప్లాన్ బెస్ట్... గౌతమ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి కొట్టి... హింసించి... చంపేసి నదిలో పడేద్దాం... శవం కొట్టుకొని సముద్రం లోకి పోవడానికి పెద్ద సమయం పట్టదు. మీరు వెంటనే గౌతమ్ చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ పుట్టించండి... ఆ సర్టిఫికెట్ చూపించి ఇల్లు అతని సవతి తమ్ముళ్ళకి చెందేలా చూసుకోవొచ్చు.."

MLA పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పిన ప్లాన్ ని నరసింహానికి చెప్పాడు... "ఒక్కసారిగా ఆర్మీ ఆఫీసర్ మాయమయ్యాడంటే అందరికీ అనుమానం వస్తుంది... ఒక పని చెయ్యండి... గౌతమ్ ని చంపేసి నదిలో పడెయ్యండి... ఆ తరువాత ఎదో ఒక అనాధ శవాన్ని వాడి కార్ లో పెట్టి... ఊరి బయట లారీ తో గుద్దించి రోడ్ ఆక్సిడెంట్ లో పోయాడని అందరిని నమ్మించండి... అప్పుడు డెత్ సర్టిఫికెట్ పుట్టించడం పెద్ద ప్రాబ్లెమ్ కాదు... వాడి సవతి తమ్ముళ్లు ఎలాగూ మనం చెప్పినట్లు వినడానికి రెడీ గా ఉన్నారు... కాబట్టి ఇల్లు కొనడం లో ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు"

నరసింహం చెప్పిన ప్రకారం ముందుగా ఆ ఊరి MLA గౌతమ్ సవతి తమ్ముళ్ళని పిలిచి తాము చెయ్యబోయే పని చెప్పాడు... గౌతమ్ చనిపోతే ఆస్తి మొత్తం వాళ్ళ ఇద్దరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఆనందంగా సహకరించడానికి ఒప్పుకున్నారు. అప్పటి నుంచి పోలీసులు గౌతమ్ మూమెంట్స్ ని చాల జాగ్రత్తగా గమనించసాగారు... వాళ్ళు ఎదురు చూసిన సమయం వచ్చింది... ఒక రోజు గౌతమ్ పని మీద పక్క వూరు వెళ్ళాడు... అంతే... పోలీసులు వెంటనే రంగంలోకి దూకారు... గౌతమ్ కార్ వెనకాలే ఒక అంబులెన్సు లో గౌతమ్ పర్సనాలిటీ కి సూట్ అయ్యే ఒక శవాన్ని తీసుకొని బయలుదేరారు...

వానాకాలం... కోస్త జిల్లాల్లో విపరీతముగా వానలు పడుతున్నాయి... ఆ రోజు వాతావరణం సడన్ గా మారింది... బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడం తో భారీ ఎత్తున వానలు కురువ సాగాయి... రాష్ట్రం లోని అన్ని డామ్స్ కి చెందిన రిజర్వాయర్లు వరద నీటితో నిండి పోయాయి... డాం గేట్స్ అన్నింటిని ఎత్తేసారు... వరద నీరు విపరీతంగా గోదావరి నది లోకి వచ్చి చేరింది... నది ఉధృతంగా ప్రవహిస్తోంది... గౌతమ్ ప్రయాణిస్తున్న కార్ వూరు దాటి మెయిన్ రోడ్ ఎక్కే లోపల పోలీసులు దారికి అడ్డంగా పోలీస్ చెక్ పోస్ట్ అడ్డంగా పెట్టి గౌతమ్ కార్ ని ఆపారు... గౌతమ్ కార్ ని పక్కకి తీసి పార్క్ చేసి... డ్రైవర్ సైడ్ డోర్ విండో ని కిందకి దించాడు... ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి గౌతమ్ ని చూసి సెల్యూట్ కొట్టాడు... గౌతమ్ కూడా తిరిగి సెల్యూట్ కొట్టాడు... ఆ ఇన్స్పెక్టర్ చాలా మర్యాదగా "ఒక్కసారి కార్ దిగి ఇటు వస్తారా... మీతో చిన్న పని వుంది... " అని అన్నాడు... గౌతమ్ పెద్దగా అనుమానించలేదు... వెంటనే కార్ దిగి లాక్ చేసి... ఆ ఇన్స్పెక్టర్ వెనకాలే వెళ్ళాడు... ఇంతలో గౌతమ్ కి తన వెనకాల ఎవరో కదిలినట్లు అనిపించింది... వెనక్కి తిరిగి చూద్దామనుకునే లోపలే... ఊహించని విధం గా వెనక నుంచి ఒక పోలీస్ గౌతమ్ తలమీద ఒక పెద్ద ఐరన్ రాడ్ తో చాలా బలంగా కొట్టాడు... అంతే... గౌతమ్ మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు... అయినా స్పృహ తప్పలేదు... వెంటనే లేచి నుంచోవడానికి ప్రయత్నించాడు... అదే సమయంలో తలా మీద ఇంకో దెబ్బ పడింది... దాంతో గౌతమ్ కి పూర్తిగా స్పృహతప్పింది... పోలీసులు వెంటనే అంబులెన్సు లోని శవాన్ని తీసుకొచ్చి గౌతమ్ కార్ డ్రైవర్ సీట్లో కూర్చోపెట్టి తలుపు వేసి... దూరంగా ఆగివున్న లారీ కి సిగ్నల్ ఇచ్చారు... వాడు వెంటనే మితి మీరిన వేగం తో దూసుకు వచ్చి రోడ్ మీద ఆగివున్న గౌతమ్ కార్ ని చాలా బలంగా గుద్దేసాడు... కార్ లోపల పోలీసులు పెట్టిన శవం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది... నరసింహం అనుకున్న పని అయింది...

పోలీసులు గౌతమ్ శరీరాన్ని తీసుకొని దగ్గరలోని గోదావరి నది ఒడ్డుకి తీసుకొని వెళ్లారు... అక్కడ ఒక పడవ రెడీ గా ఉంది. గౌతమ్ బాడీ ని ఆ పడవలోకి ఎక్కించి గోదావరి నది మధ్య కి తీసుకొని వెళ్లి నీళ్లలో పడేసారు...  గౌతమ్ శరీరం నీటి ఉధృతి లో సముద్రం వైపు కొట్టుకొని పోయింది...


PART - 12 - THE RESCUE

ఆకాశం గర్జించింది... ఉరుములు... మెరుపులు... పిడుగులతో దద్దరిల్లిపోతోంది... సింహపురి మొత్తం కుండపోత వర్షం తో తడిసి ముద్దయింది... సింహపురి పక్కనుండి ప్రవహిస్తున్న గోదావరి నదికి వరద పోటెత్తింది... దగ్గరలోని రిజర్వాయర్ నిండిపోయింది... డాం గేట్లు ఎత్తేశారు... నది ఉధృతంగా ప్రవహిస్తోంది... నదిలో పడిన గౌతమ్ ఆ ప్రవాహానికి అతి వేగంగా కొట్టుకెళ్ళి బంగాళాఖాతం లో చేరాడు... సముద్ర ఆటు... పోట్లతో భయంకరంగా ఉంది. గౌతమ్ స్పృహలో లేడు... అతని శరీరం అతి వేగంగా సముద్రంలో అలల తాకిడికి ఎగిరెగిరి పడుతోంది... గౌతమ్ కి దాదాపు ఒక అర కిలోమీటర్ దూరం లో ఒక చేపలు పట్టే ట్రాలర్ వెళ్తోంది... ఆ ట్రాలర్ ఓనర్ గురవయ్య తన టీం తో సముద్రంలో చేపలు పట్టుకోవడానికి వచ్చాడు... వాతావరణం సడన్ గా మారిపోవడంతో వెనక్కి తిరిగి సింహపురికి 10 కిలోమీటర్ల దూరంలోని తమ బెస్త పాలెం కి వెళ్తున్నారు... వాళ్ళ ట్రాలర్ కూడా సముద్రం అలల తాకిడికి అల్లాడుతోంది... బాగా ఊగిపోతోంది... ట్రాలర్ లోకి సముద్రం నీరు చేరింది... గురవయ్య టీం ట్రాలర్ లోకి చేరిన ఆ నీటిని బక్కెట్ల తో నింపి సముద్రంలోకి పోస్తున్నారు... సముద్రంలో తుఫాను ఉదృత నిమిష నిమిషానికి పెరుగుతోంది... ఇంతలో ఆ ట్రాలర్ ఇంజిన్ ఆగిపోయింది. సముద్రం అలల మీద ఆ ట్రాలర్ విపరీతంగా ఊగిపోతోంది... గురవయ్య ఆ ట్రాలర్ సముద్రంలోకి కొట్టుకుపోకుండా చాలా కష్టపడుతున్నాడు...

ట్రాలర్ లోని నీటిని బకెట్ తో తోడి సముద్రంలోకి పోస్తున్న ఒక కుర్రోడికి కొంచం దూరంలో అలలమీద ఏదో ఒక ఆకారం ఎగిసిపడటం గమనించాడు... ముందు పెద్దగా పట్టించుకోలేదు... ఇంతలో ఆ ఆకారం అలలమీద తేలుతూ ట్రాలర్ దగ్గరకి వచ్చి... అతను చూస్తుండగానే మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది... వెంటనే అతను గట్టిగా అరుస్తూ గురవయ్య ని పిలిచాడు... "ఏమయిందిరా... అలా అరిచావు.." అంటూ గురవయ్య ట్రాలర్ వెనక భాగానికి చేరుకున్నాడు... నీళ్లు తోడి పోస్తున్న కుర్రోడు... "అన్నా... అటుచూడు... అలలమీద ఎవరో ఉన్నారు... " అని అన్నాడు... గురవయ్య అటువైపు చూసాడు... ముందు ఆ చీకట్లో ఏమి కనిపించలేదు... టార్చిలైట్ వేసి చూసాడు... లీలగా ఎదో ఆకారం అలల మీద కనిపిచింది... అదే సమయానికి ట్రాలర్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది... దాంతో ఆ ట్రాలర్ లో లైట్స్ వెలిగాయి... ఆ లైట్స్ వెలుగులో అలలమీద తేలియాడుతున్న ఆకారం కనిపిచింది... ఆ ఆకారం ట్రాలర్ దగ్గరకి వచ్చినట్లే వచ్చి... అలల తాకిడికి వెనక్కి కదిలిపోతోంది... "అరేయ్... ఆ పెద్ద వల పట్టుకురా..." అని అరిచాడు... వెంటనే ఇద్దరు కుర్రోళ్ళు ట్రాలర్ లోపలి వెళ్లి పెద్ద వలని తీసుకొని వచ్చారు... గురవయ్య ఆ వల ని అతి లాఘవంగా గాల్లో తిప్పుతూ అలలమీద తేలుతున్న ఆకారమీద పడేలా వేసాడు... ఆ ఆకారం ఆ వలలో చిక్కుకుంది... గురవయ్య తో పాటు ట్రాలర్ లోని వాళ్ళు వల ని లాగారు... 80 కిలోల వ్యక్తిని నీళ్లలోంచి ట్రాలర్ లోకి చేర్చడానికి కొంచం కష్టపడ్డారు... గురవయ్య ఆ వ్యక్తి చేతి మణికట్టు ని పట్టుకొని నాడి కొట్టుకుంటున్నది... లేనిది చెక్ చేసాడు... పల్స్ దొరికింది... చాలా వీక్ గా కొట్టుకుంటోంది... వెంటనే ఆ వ్యక్తిని ట్రాలర్ లోపలి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేశారు... ఆ వ్యక్తి స్పృహలో లేదు... తల మీద పెద్ద గాయం కనిపిచింది... వెంటనే తలకి కట్టుకట్టారు...

సముద్రం లో వాతావరణం మారుతోంది... తుఫాన్ నెమ్మదిగా సర్దుకుంటోంది... కానీ వాన మాత్రం తగ్గలేదు... గురవయ్య తన ట్రాలర్ ని అతి కష్టం మీద బెస్త పాలెం వైపు నడిపించసాగాడు... వాళ్ళు ఉన్న ప్రదేశానికి బెస్త పాలెం 6 కిలోమీటర్లు ఉంటుంది... మామూలుగా ఆ దూరాన్ని ఒక గంట లోపల దాటెయ్యగలరు... కానీ... ఆ రోజు రాత్రి ఆ ఆరు కిలోమీటర్ల దూరం దాటడానికి వాళ్ళకి అయిదు గంటల సమయం పట్టింది... అలల మీద ట్రాలర్ విపరీతం ఊగిపోతోంది... రెండు మీటర్లు ముందుకు వెళ్తూంటే... సముద్రలోని అలల తాకిడి ఆ ట్రాలర్ మూడు మీటర్లు వెనక్కి నెట్టేస్తోంది... అతి కష్టం మీద గురవయ్య ట్రాలర్ ఉదయం ఆరు గంటలకు బెస్త పాలెం చేరుకుంది... గురవయ్య కుర్రోళ్లో తీరం చేరగానే ఆ సముద్రంలో ఆ రాత్రి వాళ్లకి దొరికిన వ్యక్తిని తీసుకొని బెస్త పాలెం లో ఉన్న ఏకైక డాక్టర్ ఇంటికి తీసుకొని వెళ్లారు... డాక్టర్ ఇంకా లేవలేదు... రాత్రి బాగా మందు కొట్టి పడుకున్నాడు. గురవయ్య కుర్రోళ్ళు డాక్టర్ ఇంటి తలుపులు గట్టిగా కొట్టారు... దాదాపు ఒక 10 నిమిషాల తరువాత డాక్టర్ తూలుకుంటూ వచ్చి తలుపు తీసాడు... గురవయ్య కుర్రోళ్ళు స్పృహలోలేని ఆ వ్యక్తి లోపలి తీసుకెళ్లి క్లినిక్ లో పడుకోపెట్టి "సముద్రం లో దొరికాడు... తలకి బాగా పెద్ద గాయం అయింది... బతికే ఉన్నాడు... ఫస్ట్ ఎయిడ్ చేసాము... మీరు చూడండి" అని చెప్పి వెళ్లిపోయారు...

డాక్టర్ తన క్లినిక్ లో పడుకోబెట్టిన వ్యక్తి ని తేరిపార చూసాడు... ఇంతలో డాక్టర్ దగ్గర పనిచేస్తున్న కాంపౌండర్ వచ్చాడు... "అతని బట్టలు విప్పి వొళ్ళంతా వేడి నీళ్లలో డెట్టాల్ వేసి స్పాంజ్ బాత్ ఇవ్వు... పల్స్ వీక్ గా ఉంది... సెలైన్ పెట్టు... టెంపరేచర్ ఉంది... పారాసెటమాల్ వెయ్యి... నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి బాత్రూమ్ లో దూరాడు... కాంపౌండర్ డాక్టర్ చెప్పినవన్నీ చెయ్యడానికి 30 నిమిషాలు పట్టింది... అప్పటికి డాక్టర్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. చేతులకి గ్లోవ్స్ వేసుకొని ఆ వ్యక్తి తల కి కట్టిన బ్యాండేజ్ ని విప్పాడు... సరిగ్గా నడి నెత్తి మీద పెద్ద గాయం కనిపిచింది. ముందుగా BETADINE లోషన్ తో క్లీన్ చేసాడు... తల మీద ఒత్తుగా జుట్టు ఉండడం తో తల మీద గాయం సరిగ్గా క్లీన్ చేయలేకపోయాడు... తన కాంపౌండర్ తో "అతని తల మీద జుట్టు మొత్తాన్ని గొరిగెయ్యి... జుట్టు ఉంటే ఊండ్ ని సరిగ్గా క్లీన్ చెయ్యడం కుదరదు" అని చెప్పి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అతని బట్టలు చెక్ చేసాడు... ఆవ్యక్తి ప్యాంటు జేబులో అతని వాలెట్ దొరికింది... సముద్రం నీటిలో పూర్తిగా తడిసిపోయింది. ఆ వాలెట్ లో ₹5000 రూపాయలు ఉన్నాయి... కొన్ని క్రెడిట్ / డెబిట్ కార్డ్స్ కనిపించాయి... ఆ వాలెట్ లో ఒక సీక్రెట్ పాకెట్ కనిపిచింది... దాన్ని ఓపెన్ చేసాడు... అందులో డాక్టర్ కి ఆ వ్యక్తికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్... ఆధార్ కార్డు... దొరికాయి... వాటితో పాటు ఆర్మీ కి చెందిన ID దొరికింది... ఆ కార్డు మీద... గౌతమ్ కుమార్ - కల్నల్ - 3RD INFANTRY DIVISION - LEH, LADAKH అని వ్రాసి ఉంది... అది చూడగానే డాక్టర్ కి వెన్ను వొణికింది... చేతులు కంపించాయి... సరిగ్గా అదేసమయంలో కాంపౌండర్ గౌతమ్ తల మీద జుట్టుని పూర్తిగా తీసేసాడు... శుభ్రంగా డెట్టాల్ నీళ్లతో శుభ్రం చేసాడు... ఎదో అనుమానం వచ్చి గౌతమ్ తలని పరీక్షగా చూసాడు... కాంపౌండర్ గొంతు తడి ఆరిపోయింది... కాళ్ళు వణికాయి... గొంతు పెగుల్చుకొని "డా ... క్ట్ ... ర్ ... ఇది చూడండి" అంటూ అరిచాడు...

ఆ కేక విన్న డాక్టర్ తన చేతిలోని గౌతమ్ ఆర్మీ ID కార్డు జాగ్రత్తగా వాలెట్ లో పెట్టి... క్లినిక్ లోని టేబుల్ దగ్గరకి వెళ్ళాడు... అక్కడ కాంపౌండర్ ఎదో దయ్యాన్ని చూసినట్లు వొణికిపోతూ గౌతమ్ తలవైపు చూపించాడు... డాక్టర్ కి ఏమి అర్ధం కాలేదు... కాంపౌండర్ సహాయంతో గౌతమ్ ని బోర్లా పడుకోపెట్టాడు... అప్పుడు గౌతమ్ తల చాలా క్లియర్ కనిపిచింది... ముందు ఏమి అర్ధం కాలేదు... తలా నిండా ఏవో సింబల్స్ కనిపించాయి... ఏమి అర్ధం కాలేదు... కాంపౌండర్ తో "హెడ్ మిర్రర్... మైక్రోస్కోప్ ఇవ్వు" అని అడిగాడు... కాంపౌండర్ వాటి తెచ్చి డాక్టర్ కి ఇచ్చాడు... హెడ్ మిర్రర్ ని తలకి అటాచ్ చేసుకొని మైక్రోస్కోప్ తో గౌతమ్ తలని క్లోజ్ గా పరిశీలించాడు... గౌతమ్ తలమీద సింబల్స్ బాగా పెద్దవిగా కనిపించాయి... వాటిని చూడగానే... ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యింది... మనసులో "క్రిప్టో సింబల్స్..." అని అనుకున్నాడు... గౌతమ్ SKULL SKIN మొత్తం రకరకాల క్రిప్టో సింబల్స్ తో నిండి ఉంది... "మై గాడ్... ఇది మిలిటరీ ఇంటలిజెన్స్ కోడ్ మెసేజ్" అని మనసులో అనుకున్నాడు...

అతి జాగ్రత్తగా గౌతమ్ తల మీద వేసిన సింబల్స్ దెబ్బతినకుండా... జాగ్రత్తగా తలా మీద గాయాన్ని రకరకాల లోషన్స్ ని క్లీన్ చేసి... మెడిసిన్ వేసి దాదాపు 14 కుట్లు వేసాడు... దాని పైన తల మొత్తం కవర్ అయ్యేలా పెద్ద బ్యాండేజ్ కట్టి... ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి... ఒకసారి బీపి చెక్ చేసి గౌతమ్ ని కాంపౌండర్ సహాయంతో జాగ్రత్తగా బెడ్ మీద చేర్చాడు... స్టెతస్కోప్ తో గౌతమ్ గుండెని చెక్ చేసాడు... కొంచం వేగంగా కొట్టుకుంటోంది... కాంపౌండర్ తో "ప్రతి గంటకి పల్స్... హార్ట్ బీట్... టెంపరేచర్... బీపీ చెక్ చెయ్యి... నేను ఊర్లోకి వెళ్లి కొన్ని మందులు తెస్తాను... ఇంకో సంగతి... నువ్వు ఈ రోజు చూసినదంతా నీ మనసులోనే ఉంచుకో... ఎవరికి చెప్పవొద్దు... ఇది ఎదో మిలిటరీ గొడవ లాగా ఉంది... ఈ గౌతమ్ కి స్పృహ లోకి వచ్చాక ఏమి జరిగిందో తెలుసులుకోవాలి... అప్పటిదాకా ఇది చాలా సీక్రెట్ గా ఉంచాలి. " అని చెప్పి సైకిల్ ఎక్కి వెళ్తూ ఆలోచించసాగాడు... డాక్టర్ మెడికల్ కాలేజీ లో ఉన్నప్పుడు చదివిన బుక్స్ గుర్తుకొచ్చాయి... పురాతన కాలం నాలుగో శతాబ్దం లో గ్రీస్ చక్రవర్తి హెరోడోటస్ ఒక రహస్య సమాచారం పంపడానికి తనకి బాగా నమ్మకమైన సేవకుడి తల మీద జుట్టుని తీయించి తల మీద ఒక రహస్య సమాచారాన్ని సింబల్స్ రూపంలో పచ్చ బొట్టు వేయించి... ఆ సేవకుడికి జుట్టు మొలిచాక తన స్నేహితుడి దగ్గరకి పంపాడు... ఆ స్నేహితుడు ఆ సేవకుడి తల మీద వెంట్రుకలు తీయించి ఆ సేవకుడు తెచ్చిన రహస్య సమాచారాన్ని చదువుకున్నాడు... ఈ విధానంగా రహస్య సందేశాల్ని సింబల్స్ రూపంలో పంపడం మొదలయ్యింది... ఆ కళకి స్టెగనోగ్రఫీ అని పేరు పెట్టారు... డాక్టర్ ఈ విషయాన్ని పుస్తకాల్లో చదివాడు... ఈ రోజున ప్రత్యక్షంగా చూసాడు...

పదిహేను రోజుల పాటు రాత్రి... పగలు... చాలా జాగ్రత్తగా గౌతమ్ కి సేవలు చేశారు... తలమీద గాయం నెమ్మదిగా తగ్గసాగింది... ప్రతిరోజూ తలకి బ్యాండేజ్ తీసి గాయాన్ని క్లీన్ చేసి కొత్త మందు వేసి కట్టు కట్టారు... పదిహేనో రోజున తలకి వేసిన కుట్లు విప్పదీసాడు... పదహారో రోజున గౌతమ్ కళ్ళు తెరిచాడు. జ్వరం పూర్తిగా తగ్గింది... తల మీద గాయం కూడా మానడం మొదలయ్యింది. గౌతమ్ కళ్ళు తెరవగానే కాంపౌండర్ వెళ్లి డాక్టర్ కి చెప్పాడు... డాక్టర్ పరిగెత్తుకొని వచ్చి గౌతమ్ ని చూసి " హలో... నా పేరు డాక్టర్ నంబూద్రి... యు ఆర్ లక్కీ టు సర్వైవ్..." అని అన్నాడు... అది విని గౌతమ్ మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు... గౌతమ్ మళ్ళీ కళ్ళు తెరవడానికి 24 గంటలు పట్టింది... చుట్టూ చీకటి... ఆ రూమ్ లో చిన్న బెడ్ లైట్ వెలుగుతోంది... లేచి మంచం మీద కూర్చున్నాడు... తనను పరిశీలించి చూసుకున్నాడు... వొంటి మీద హాస్పిటల్ గౌన్... ఎడమ చేతికి సెలైన్ డ్రిప్... టైం ఎంతో తెలుసుకోవడానికి రూమ్ లో ఏదైనా గడియారం ఉందేమో చూసాడు... ఎక్కడా కనిపించలేదు. మంచం మీద పడుకొని ఆలోచించసాగాడు... పక్క వూరు వెళ్ళడానికి కార్ లో బయలుదేరాడు... దారి మధ్యలో పోలీసులు కార్ ఆపి కిందకి దిగమన్నారు... తాను దిగాడు... అప్పుడే ఎవరో వెనక నుంచి ఐరన్ రాడ్ తో చాలా బలంగా కొట్టారు... స్పృహ తప్పడం... ఆ తరువాత ఏమయ్యింది? తనని హాస్పిటల్ కి ఎవరు తీసుకొచ్చారు? ఎన్నాళ్ళు గడిచాయి? చేతులు కాళ్ళు కదిలించాడు... అవి బాగానే ఉన్నాయి... ఎక్కడా నొప్పి లేదు... చేసేది ఏమి లేక కళ్ళు మూసుకున్నాడు... తిరిగి మెలుకువ వచ్చేటప్పటికి తెల్లారింది... నెమ్మదిగా లేచి మంచం మీద కూర్చొని... " డాక్టర్... డాక్టర్..." అని గట్టిగా పిలిచాడు... గౌతమ్ అరుపులు విన్న వెంటనే ముందుగా కాంపౌండర్ వచ్చాడు... అతని వెనకాలే డాక్టర్ కూడా వచ్చాడు...

డాక్టర్:హౌ అర్ యు ఫీలింగ్? ఎక్కడైనా నొప్పిగా ఉందా?

గౌతమ్: గుడ్... తలంతా బాగా నొప్పిగా ఉంది.

డాక్టర్: అది నార్మల్... మీ తల మీద బలమైన దెబ్బ తగిలింది. 14 కుట్లు పడ్డాయి... కుట్లు వెయ్యడానికి మీ తల మీద జుట్టు మొత్తం తీసేసాము...

గౌతమ్(కొంచం ఖంగారుగా... తలని తడుముకుంటూ): మొత్తం షేవ్ షేవ్ చేసారా?

డాక్టర్: డోంట్ వర్రీ... మీ తలమీద వేసిన టాటూ లు ఎవరికి కనపడకుండా బ్యాండేజ్ వేసాము... నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను...

గౌతమ్: అడగండి...

డాక్టర్: మీపేరు...

గౌతమ్: గౌతమ్ కుమార్

డాక్టర్: మీ వృత్తి...

గౌతమ్: నేను ఇండియన్ ఆర్మీ లో కల్నల్ గా రిటైర్ అయ్యాను...

డాక్టర్: మీ తలకి దెబ్బ ఎలా తగిలింది? ఎవరు కొట్టారు?

గౌతమ్: ఇవ్వాళ డేట్ ఏమిటీ?

డాక్టర్: అక్టోబర్ 20...

గౌతమ్: అంటే... నేను గత 15 రోజులుగా స్పృహలో లేనా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇది ఏ ఊరు?

డాక్టర్: ఇది బెస్త పాలం...

గౌతమ్: అంటే... ఇది సింహపురి కి 20 కిలోమీటర్స్ దూరంలోని బెస్త పాలెం... కదా

డాక్టర్: అవును... పాలెం బెస్తగాళ్ళకి నువ్వు సముద్రంలో దొరికావు... నిన్ను తీసుకొచ్చి నా హాస్పిటల్ లో చేర్చారు...

గౌతమ్: సముద్రం లో దొరికానా... అంటే... నా తల మీద కొట్టినవాళ్ళు నన్ను నదిలో పడివుంటారు... సముద్రంలోకి కొట్టుకొచ్చానా?

డాక్టర్: అయి ఉంటుంది. మీకు ఇంకో నెల రోజుల రెస్ట్ కావాలి... అప్పుడే మీ తల మీద దెబ్బ పూర్తిగా తగ్గుతుంది... మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?

గౌతమ్: ఆర్మీ వాడిని... శత్రువులకు భయపడను... దొంగ దెబ్బ తీశారు... వెనకనుంచి కొట్టారు...

గౌతమ్ తాను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి సింహపురి కి వచ్చినప్పటి నుంచి... తన తలమీద ఐరన్ రాడ్ తో కొట్టడం దాకా జరిగిందంతా డాక్టర్ కి చెప్పాడు...

డాక్టర్: మీరు రెస్ట్ తీసుకోండి... నేను సాయంత్రం వచ్చి చెక్ చేస్తాను.

గౌతమ్ మంచం మీద పడుకొని 'డాక్టర్ కాకుండా వేరే ఎవరైనా క్రిప్టో సింబల్స్ చూసారా?' అని ఆలోచిస్తూ పడుకున్నాడు... ఇంకో వారం రోజులు గౌతమ్ ని హాస్పిటల్ లో వాళ్ళు చాలా జాగ్రతగా చూసుకున్నారు... హాస్పిటల్ అంత పెద్దది కాదు... ఒక డాక్టర్... ఒక లేడీ కాంపౌండర్... ఒక మేల్ కాంపౌండర్... హాస్పిటల్ మొత్తం లో మూడు బెడ్స్ మాత్రమే ఉన్నాయి. డాక్టర్ దగ్గరకి ఎక్కువగా బెస్తపాలెం ప్రజలు వస్తారు. గౌతమ్ లాంటి వ్యక్తి హాస్పిటల్ కి రావడం ఇదే మొదటిసారి... గౌతమ్ లేచి తిరగసాగాడు... మొట్టమొదటిసారి హాస్పిటల్ నుంచి బయటకి వచ్చాడు... దూరంగా గుడిసెలు కనిపించాయి... నెమ్మదిగా నడుచుకుంటూ బెస్తపాలెం వైపు వెళ్ళాడు... గౌతమ్ ని చూడగానే పాలెం లోని ప్రజలు చుట్టూ చేరారు. వాళ్ళని చూసి... "నన్ను సముద్రంలో రక్షించింది ఎవరు?" అని అడిగాడు... అందరూ గురవయ్య గుడిసె వైపు చూపించారు... గౌతమ్ అటువైపు వెళ్తూండగా... గుడిసె లోంచి గురవయ్య బయటకి వచ్చాడు... అతడిని చూడగానే అతడిని గట్టిగా కౌగలించుకొని "థాంక్ యు వెరీ మచ్... నన్ను కాపాడినందుకు" అని అన్నాడు... గురవయ్య ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం గౌతమ్ కి చెప్పాడు... గురవయ్యతో చాలా సేపు మాట్లాడి వెనక్కి హాస్పిటల్ కి వెళ్తూ మనసులో "గురవయ్య... నువ్వు నన్ను రక్షించి మూడవ జన్మని ప్రసాదించావు... మొదటి జన్మ నాకు తల్లితండ్రుల వల్ల కలిగింది... పునర్జన్మ ని మాధవ్ ఇచ్చాడు... ఈ మూడవ జన్మ కి కారణం గురవయ్య..." అని అనుకున్నాడు...

రోజులు గడుస్తున్నాయి... గౌతమ్ నెమ్మదిగా మామూలు మనిషి అయ్యాడు... ప్రతి రోజూ సముద్రం ఒడ్డున రన్నింగ్... యోగ... చెయ్యడం మొదలు పెట్టాడు... పూర్తి స్థాయి లో స్టామినా ఇంకా రాలేదు... బాగా కష్టపడుతున్నాడు... ఒకరోజు డాక్టర్ పనికట్టుకొని సింహపురి వెళ్ళాడు. అక్కడ గౌతమ్ ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు.... ఆ ఇంటికి తాళం వేసి ఉంది... చుట్టూ పక్కల గౌతమ్ గురించి ఎంక్వయిరీ చేసాడు...

పక్కింటి ఆసామి : గౌతమ్ నెల క్రితం ఒక కార్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు...

డాక్టర్ ఇల్లు తాళం వేసివుంది... గౌతమ్ తల్లి తండ్రులు... అన్న తమ్ముళ్లు... అక్క చెల్లెల్లు లేరా...

పక్కింటి ఆసామి: గౌతమ్ కి ఎవరూ లేరండి... తల్లి చనిపోతే గౌతమ్ తండ్రి మారు మనువు చేసుకున్నాడు... గౌతమ్ కి ఇద్దరు సవితి తమ్ముళ్లు... సవతి తల్లి తప్ప వేరే ఎవరూ లేరు...

డాక్టర్: వాళ్ళు వూళ్ళో లేరా...

పక్కింటి ఆసామి: గౌతమ్ చనిపోయిన తరువాత... గౌతమ్ కి రావాల్సిన ఆస్తి మొత్తం వాళ్ళు సొంతం చేసుకొని ఇల్లు అమ్మేశారు... ఈ ఊళ్ళోనే వేరే ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్లిపోయారు... బాగా సొమ్ము చేసుకున్నారు...

డాక్టర్ వెనక్కి బెస్త పాలెం చేరుకొని తాను తెలుసుకున్న వివరాలు గౌతమ్ కి చెప్పాడు...

డాక్టర్: ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

గౌతమ్: ఏమి చెయ్యలేని పరిస్థితి...

డాక్టర్: అదేమిటీ? మీరు సింహపురి వెళ్లి మీరు సజీవంగా ఉన్నారని చెప్పి మీ ఆస్తిని మీరు వెనక్కి తీసుకోవొచ్చుగా??

గౌతమ్: అంత ఈజీ కాదు... గవర్నమెంట్ రికార్డ్స్ లో ఒక వ్యక్తి చనిపోయినట్లు నమోదు అయ్యి... డెత్ సర్టిఫికెట్ కూడా జారీ అయితే... మళ్ళీ ఆ వ్యక్తి బతికే ఉన్నట్లు గుర్తించడం అంత తేలిక కాదు... దానికి చాలా పెద్ద లీగల్ ప్రాసెస్ ఉంటుంది... మీకు తెలుసో లేదో... 1975వ సంవత్సరంలో... ఉత్తరప్రదేశ్ లోని అజంఘడ్ జిల్లాలో లాల్ బిహారి అనే వ్యక్తి బ్రతికి ఉండగా అతని బంధువులు అతను చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ పుట్టించి అతని ఆస్తిని స్వాధీనం చేసుకొని అమ్ముకున్నారు... ఆ తరువాత అతను తానూ చనిపోలేదని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు... లీగల్ ఎంతో ట్రై చేసాడు... కుదరలేదు... 19 సంవత్సరాలు కోర్టులు... గవర్నమెంట్ ఆఫీసులు... ఎంతో మంది రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాడు... ఎటువంటి ఫలితం లేకపోయింది... ఉత్తరప్రదేశ్ ఒక్క లాల్ బిహారి విషయమే కాదు... ఆ రాష్ట్రం లో ఇటువంటి సంఘటలు చాలా జరిగాయి... జనాలు బ్రతికి ఉండగానే... వాళ్ళు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్స్ సృష్టించడం చాలా సాధానమైన విషయం... ఆ లాల్ బిహారి చివరికి చేసేది ఏమి లేక... తన పేరు చివర మృతక్అని చేర్చుకొని లాల్ బిహారి మృతక్ అని కొత్త అవతారం ఎత్తాడు... మన దేశం లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి...లాల్ బిహారి మృతక్... చివరికి మృతక్ సంఘ్ అని ఒక సంఘాన్ని స్థాపించి ప్రజల తరఫున పోరాటం మొదలెట్టాడు... 1994 లో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అతడు బ్రతికే ఉన్నట్లు ధ్రువీకరించింది... 2004వ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికలలో లాల్ గంజ్ నియోజకవర్గం తరఫున ఎన్నికలలో పోటీ కూడా చేసాడు...

డాక్టర్: మీరు కూడా అలాంటిది చేయొచ్చుగా...

గౌతమ్: దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు... నేను పేరు మార్చుకుని కొత్త బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకున్నా... నాకు నా ఆస్తి నాకు దక్కదు... ఆ ఆస్తి గౌతమ్ కుమార్ పేరు మీద ఉంది... కోర్ట్ లో కేసు వేసినా... అది తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలీదు... మన దేశం లో 50 ఏళ్ళు గా కోర్ట్ లో నలుగుతున్న సివిల్ కేసులు చాలా ఉన్నాయి... ఈ లోపల MP నరసింహం వూరికే కూర్చోడు... ఆ ఇల్లు పడగొట్టేస్తాడు... లాల్ బిహారి కి తన అస్థిత్వవాన్ని నిరూపించుకోవడానికి 19 ఏళ్ళు పట్టింది... నాకు అంత టైం పట్టక పోవొచ్చు... కనీసం 3 నుంచి 6 నెలల టైం పడుతుంది... ఈ లోగా నరసింహం నన్ను మళ్ళీ చంపడని గారంటీ ఏమిటీ?

డాక్టర్: అయితే... మీరు ఈ విషయాన్ని మర్చిపోతారా?

గౌతమ్: ఇది చాలా కంప్లికేటెడ్ సిట్యుయేషన్... మా వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి కూడా ఇన్ఫోర్మ్ చేసే ఉంటారు... చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి... ఇప్పుడు నేను నా అస్తిత్వం కోసం పోరాడడం వేస్ట్... నరసింహం తానంతట తానే... నేను బ్రతికి ఉన్నట్లు చెప్పించాలి... దానికోసం ఏదైనా మార్గాన్ని ఆలోచించాలి... ప్రతి ప్రాబ్లెమ్ ఐస్ ఒక సొల్యూషన్ ఉంటుంది... ఈ ప్రాబ్లెమ్ కి ఎటువంటి సొల్యూషన్ దొరుకుతుందో చూడాలి... వొదిలేది లేదు... నాకు రావాల్సిన డబ్బులు నరసింహం దగ్గరనుంచి తీసుకుంటాను... నన్ను చంపడానికి ప్రయత్నించినందుకు నరసింహం మర్చిపోలేని దెబ్బ కొడతాను.

గౌతమ్ పూర్తిగా కోలుకున్నాడు... ఒక రోజు రాత్రి డాక్టర్... గౌతమ్ ఇద్దరూ విస్కీ తాగుతూ మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా... " మీ గురించి తెలుసుకోవొచ్చా" అని డాక్టర్ అడిగాడు. గౌతమ్ ఏమి దాచుకోకుండా తన గురుంచి మొత్తం చెప్పేసాడు... బాల్యం... తల్లిని కోల్పోవడం... తండ్రి ద్వితీయ వివాహం... ఇంట్లో గొడవలు... సైనిక్ స్కూల్... ఇంజనీరింగ్... ఆర్మీ లో చేరడం... షెఫాలీ తో ప్రేమ... మాధవ్ తో పరిచయం... అంతా చెప్పాడు... ఆర్మీ లో తానుచేసిన పని గురించి చెప్పలేదు... అంతా విన్నాక... చివరిగా డాక్టర్.. "మీ తలమీద ఆ క్రిప్టో కోడ్ ఎలా వచ్చింది" అని అడిగాడు...దానికి బదులుగా గౌతమ్ ఒక చిరునవ్వు నవ్వి "గుడ్ నైట్ డాక్టర్..." అని చెప్పి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు డాక్టర్ లేచి గౌతమ్ ని చెక్ చెయ్యడానికి వెళ్ళాడు... అక్కడ బెడ్ చాలా నీట్ గా సర్ది ఉంది... పిల్లో మీద ఒక లెటర్ ఉంది... అది చేతిలోకి తీసుకొని చదివాడు... " డియర్ డాక్టర్...థాంక్ యు వెరీ మచ్ ఫర్ సేవింగ్ మై లైఫ్... ఐ విల్ నెవెర్ ఫర్గెట్ యు... రైట్ నౌ ఐ హవె టు గో... వెరీ సూన్ ఐ విల్ కాల్ యు... ఒన్స్ అగైన్... థాంక్ యు వెరీ మచ్ సేవింగ్ మై లైఫ్... గౌతమ్" అని వ్రాసి ఉంది...


PART - 13 - THE HIDEOUT

రాత్రి... సమయం... రెండు గంటలు... హాస్పిటల్ లోపల గౌతమ్ మంచం లేచి కూర్చున్నాడు. ఒక నిమిషం చుట్టూ పరిసరాలను జాగ్రత్త గా చెక్ చేసాడు. డాక్టర్ మందుకొట్టి పడుకొని ఉన్నాడు. హాస్పిటల్ ముందు గదిలో మగ కాంపౌండర్ పడుకొని నిద్ర పోతూ పెద్దగా గురక పెడుతున్నాడు. గౌతమ్ నెమ్మదిగా మంచం దిగి ఆ గదిలో బీరువా తెరిచాడు... అందులో తన బట్టలు నీట్ గా ఇస్త్రీ చేసి ఉన్నాయి... బట్టల మీద తన వాలెట్ కనిపిచింది... దాన్ని తెరచి చూసాడు... అందులో నీటిలో తడిసి ఆరి... ఇస్త్రీ చెయ్యబడ్డ ₹5000 రూపాయల నోట్లు... ID కార్డ్స్... డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ కనిపించాయి... గౌతమ్ హాస్పిటల్ గౌన్ విప్పేసి తన బట్టలు వేసుకున్నాడు... బీరువా పక్కనే గౌతమ్ కి షూస్ కనిపించాయి వాటిని వేసుకొని బీరువా కి ఉన్న అద్దం లో తన ప్రతిబింబం చూసుకున్నాడు... తల మీద జుట్టు... గడ్డం బాగా ఒత్తుగా పెరిగాయి... ఆ గదిలోంచి బయటకి వచ్చి హాస్పిటల్ మెయిన్ డోర్ ని శబ్దం కాకుండా తెరుచుకొని బయటకి వచ్చి తలుపులు దగ్గరగా వేసి బయలుదేరాడు... గేట్ దాకా వెళ్లి... ఒకసారి వెనక్కి తిరిగి హాస్పిటల్ వైపు చూసి... "థాంక్ యు వెరీ మచ్" అని మనసులో అనుకోని వడివడిగా అడుగులు వేస్తూ బెస్త పాలం కి 3 కిలోమీటర్లు దూరంలోని హై వే చేరుకున్నాడు... సింహపురి వైపు వెళ్తున్న ప్రతి వాహనాన్ని లిఫ్ట్ అడగసాగాడు... దాదాపు ఒక గంట సేపు ఎవరూ వెహికిల్స్ ఆపలేదు... చివరికి ఒక పాల వాడు మోటార్ సైకిల్ ఆపాడు... గౌతమ్ దాని మీద ఎక్కి సింహపురి చేరుకున్నాడు... నేరుగా మెయిన్ రోడ్ కి వెళ్లి అక్కడ ఒక బ్యాంకు ATM లో తన డెబిట్ కార్డు ని వాడి ₹20,000 డ్రా చేసి... నెమ్మదిగా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళాడు... ఇంటికి బయట నుంచి తాళం పెట్టి ఉంది...

గౌతమ్ చిన్నప్పుడు తరచుగా ఇల్లుదాటి మెయిన్ రోడ్ మీదకి వెళ్తూవుండేవాడు... అతడిని ఆపడానికి గౌతమ్ తల్లి గేట్ కి తాళం పెట్టేది... అయినా సరే... గౌతమ్ ఆ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి బయటకి దూకి వెళ్ళేవాడు... అది గుర్తుకొచ్చి నవ్వుకుంటూ చివరిసారిగా తన సొంత ఇంటి లోకి గోడ దూకి వెళ్ళాడు... విశాలమైన కాంపౌండ్... ఒక పక్కన ధాన్యం నిలువ చేయడానికి రెండు పెద్ద పెద్ద గాదెలు... చిన్నప్పుడు వాటి చుట్టూ తిరుగుతూ ఆదుకునేవాడు... ఇంటి వైపు నడిచాడు... పెద్ద పెద్ద ఎత్తు అరుగుల పెంకుటిల్లు... పెద్ద సింహద్వారం... ఆ సింహద్వారానికి తాళం లేదు... గడియ మాత్రం పెట్టి ఉంది... గడియ తీసుకుని లోపలి వెళ్ళాడు... ఇల్లంతా చిమ్మ చీకటి... లైట్స్ వెయ్యకుండా ఇల్లంతా కలియ తిరిగాడు... ఆ ఇంట్లో ప్రతి గది... ప్రతి గోడ... గౌతమ్ కి బాగా తెలుసు... చివరిసారిగా ఇల్లంతా కలియ తిరిగి గోడలు అన్ని తనివితీరా తడిమాడు... మెయిన్ హాల్... దానికి ఆనుకుని ఒకవైపు పూజా రూమ్... ఆ పూజా రూమ్ కి పక్కనే పెద్ద కిచెన్... స్టోర్ రూమ్... మెయిన్ హాల్ కి రెండో వైపు బెడ్ రూమ్స్... ప్రతి రూమ్ లోకి వెళ్ళాడు... ప్రతి గదిలో ఎదో ఒక జ్ఞాపకం... ఒక గదిలో పెద్ద భోషాణం పెట్టె ఉండేది... ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీదికి ఎక్కేవాడు... ఆఖరున పెరట్లోకి వెళ్ళాడు... ఒక మూల పెద్ద బావి... దాని పక్కనే బాత్ రూమ్స్... ఇంటికి కొంచం దూరం గా లెట్రిన్స్... పెరడంతా కూరగాయల మొక్కలు... పళ్ళ చెట్లు... గౌతమ్ తనకి బాగా ఇష్టమైన జామ చెట్టు నుంచి ఒక కాయ కోసుకొని తిన్నాడు... తలుపులన్నీ భద్రంగా వేసి బయటకు వచ్చి సింహద్వారాన్ని కూడా మూసి గడియ పెట్టి అక్కడే అరుగు మీద వెల్లికిలా పడుకొని కొంచం సేపు అటూ ఇటూ దొర్లాడు... ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక ఇంటికి వచ్చి... ఇల్లు బాగుచేయించుకొని... నివసించాలని కళలు కన్నాడు... తానొకటి తలిస్తే... దైవం ఇంకొకటి తలచింది... అప్పటికి తెల్లవారింది... వెలుతురు వచ్చింది... గౌతమ్ నెమ్మదిగా అరుగు దిగి గేట్ వైపు వెళ్తూ ఎదో గుర్తుకొచ్చి నవ్వుకుంటూ వెనక్కి వెళ్లి అరుగు దగ్గర ఆగి వెనక్కి తిరిగి కాంపౌండ్ వాల్ వైపు చూసాడు... చిన్నప్పుడు అరుగు దగ్గర నుంచి వేగంగా పరిగెత్తుకెళ్లి గోడ దూకే వాడు... అది గుర్తుకొచ్చి గౌతమ్ చిన్న పిల్లవాడి లాగా పరిగెత్తుకొని వెళ్లి తన ఇంటి కాంపౌండ్ వాల్ మీద చేతులు వేసి సునాయాసంగా గాల్లోకి లేచి చాలా స్టైల్ గా గోడ దూకి మెయిన్ రోడ్ మీద చేరుకున్నాడు. కళ్ళలోంచి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా సింహపురి బస్సు స్టాప్ కి వెళ్లి అప్పుడే బయలుదేరడానికి రెడీ గా బస్సు ఎక్కి రాజమండ్రి చేరుకున్నాడు... అక్కడనుండి ట్రైన్ లో హైదరాబాద్ చేరుకొని... నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి న్యూ ఢిల్లీ కి చేరుకోవడానికి విమానం ఎక్కి కళ్ళు మూసుకున్నాడు... ఆలోచనలు గతం లోకి మళ్ళాయి...

(గౌతమ్ కి చెందిన రెండో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభం)

"కొత్త ఆపరేషన్ కి రెడీ నా?" అని గౌతమ్ ని అడిగాడు మాధవ్... గౌతమ్ దానికి బదులుగా నవ్వుతూ "I AM ALWAYS READY" అని అన్నాడు గౌతమ్... "గుడ్ రెడీ గా వుండు... రాత్రి ఒంటి గంటకు మనం ఒక ఆపరేషన్ మీద వెళ్ళబోతున్నాము... ... ఈరోజు రాత్రి ఒంటిగంటకు మన ఇద్దరం ఒక మిషన్ మీద పక్క దేశం వెళ్ళబోతున్నాం... ఇక్కడి నుంచి ముంబయి వెళ్లి... అక్కడనుంచి బోట్ లో సముద్రాన్ని క్రాస్ చేసి పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తాం... ముంబయి నుంచి కరాచీ 477 నాటికల్ మైల్స్ ... కరాచీ సిటీ లో మన అండర్ కవర్ ఆపరేటివ్ సాజిద్ కలుస్తాడు. సాజిద్ గత 5 ఏళ్లుగా పాకిస్తాన్ లో అండర్ కవర్ ఏజెంట్ గా భారత దేశం కోసం పనిచేశాడు. ఈ మధ్యనే పాకిస్తాన్ ISI వాళ్లకి సాజిద్ ఆచూకీ తెలిసింది. సాజిద్ ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు.కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. మన సహాయం అవసరం... మనం అతడిని జాగ్రత్తగా ఇండియా తీసుకొని రావాలి... రెడీ నా..." అని అడిగాడు... దానికి బదులుగా గౌతమ్ " ఐ యామ్ ఆల్వేస్ రెడీ..." అని అన్నాడు...

అదే రోజు రాత్రి ఇద్దరూ ముంబయి చేరుకొని బొంబాయి డాక్ యార్డ్ చేరుకున్నారు... బొంబాయి డాక్ యార్డ్ కి ఇంకో పేరు కూడా ఉంది... నావెల్ డాక్ యార్డ్... అక్కడ ఒక నావెల్ కమాండింగ్ ఆఫీసర్ వాళ్ళ కోసం రెడీ గా ఉన్నాడు... "మీరు ఇక్కడ నుంచి నేవీ రాఫ్ట్ బోట్ లో ఇంటర్నేషనల్ వాటర్స్ దాకా వెళ్తారు... అక్కడ నుంచి మీరు సేఫ్ గా కరాచీ చేరుకోవడానికి వేరే ఏర్పాట్లు చేసాము..." అని అన్నాడు... మాధవ్... గౌతమ్ ఇద్దరూ ఆ నావెల్ డాక్ యార్డ్ లో ఒక రాఫ్ట్ బోట్ ఎక్కి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ప్రవేశించారు... అక్కడ ఇండియన్ ఫిషర్ మన్ కి చెందిన ఒక ట్రాలర్ వాళ్ళ కోసం ఎదురుచూస్తోంది... మాధవ్... గౌతమ్ ఆ ఫిషింగ్ ట్రాలర్ ఎక్కగానే అది పాకిస్తాన్ వైపు ప్రయాణించసాగింది... దాదాపు ఒక 250 నాటికల్ మైల్స్ దూరాన్ని పూర్తిచేశాక... అక్కడ పాకిస్తాన్ కి చెందిన ఇంకో ఫిషింగ్ ట్రాలర్ వీళ్లకోసమే ఎదురుచూస్తోంది... మాధవ్... గౌతమ్ ఇద్దరూ ఆ బోట్ లోకి ఎక్కారు... మాధవ్ ఆ బోట్ ఓనర్ కి పాకిస్తానీ కరెన్సీ లో 5,00,000 లు ఇచ్చాడు... ఆ బోట్ ఓనర్ వాళ్లకి పాకిస్తాన్ లో కుట్టిన కుర్తా పైజామాలు ఇచ్చాడు. తల మీద పెట్టుకోవడానికి కాశ్మీరీ ప్రజలు వాడే "పకోల్" టోపీ ఇచ్చాడు... మాధవ్ ఆ బోట్ ఓనర్ తో పాకిస్తానీ యాసలో ఉర్దూ భాషలో మాట్లాడసాగాడు. వాళ్ళు ఎక్కిన బోట్ గంటకి 12 నాట్స్ స్పీడ్ తో కదలసాగింది... వాతావరణం బాగుంది. ఎటువంటి ప్రాబ్లెమ్ రాలేదు... జర్నీ చాలా స్మూత్ గా సాగింది. మరుసటి రోజు రాత్రి రెండు గంటల సమయంలో కరాచీ ఫిషింగ్ హార్బర్ చేరుకున్నారు... బోట్ ఆగగానే ముందుగా మాధవ్ కిందికి దిగి అటూ ఇటూ జాగ్రత్తగా పరికించి చూసాడు... అంత నార్మల్ గా కనిపిస్తోంది... రాత్రి కావడంతో అక్కడక్కడ కరాచీ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్స్ గస్తీ కాస్తూ కనిపించారు... ఫిషింగ్ హార్బర్ కావడంతో పెద్దగా హడావుడి లేదు... ఆ బోట్ లో వచ్చిన వాళ్లతో కలసి హార్బర్ బయటకు చేరుకొని షేర్ ఆటో ఎక్కి కరాచీలోని అక్బర్ మార్కెట్ చేరుకున్నారు... అక్బర్ మార్కెట్ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ కి ప్రసిద్ధి... ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి న్యూస్ పేపర్ వాళ్ళ సందడి మొదలవుతుంది. మాధవ్ ఒక వయస్సు పైబడిన న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి "పాకిస్తాన్ అబ్జర్వర్ న్యూస్ పేపర్ ఏజెంట్ ఎక్కడ దొరుకుతాడు?" అని అడిగాడు... ఆ వ్యక్తి మాధవ్ ని పైనుంచి కిందదాకా తేరిపారా చూసి... "పక్క గల్లీ లో వెతకండి" అని చెప్పి తన పని చూసుకో సాగాడు... ఆ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ కి సాజిద్ ఎక్కడ ఉంటాడో తెలుసు... మాధవ్ కరాచీ వచ్చిన సంగతి సాజిద్ కి ఫోన్ చేసి చెప్పాడు... సాజిద్ కి మెసేజ్ చేరింది... మాధవ్ ఆ వ్యక్తి కి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి బయలుదేరి మార్కెట్ లో ఒక చిన్న సైజు లాడ్జి చేరుకొని రెండు రూమ్స్ తీసుకొని ఇద్దరూ నిద్ర పోయారు...

ఉదయం 9 గంటల సమయంలో నిద్రలేచి డైలీ రొటీన్ పూర్తి చేసుకొని... ఉదయం 10 గంటల సమయంలో కరాచీ లోని మెయిన్ మార్కెట్ చేరుకున్నారు... మార్కెట్ చాలా రద్దీగా ఉంది... జనాలతో కిటకిటలాడుతోంది... మాధవ్ ముందు నడుస్తున్నాడు... వెనకాలే ఒక అయిదు అడుగుల దూరంలో గౌతమ్ వెళ్తున్నాడు... దాదాపు రెండు గంటల సేపు మార్కెట్ మొత్తం నడిచి చివరికి మార్కెట్ మధ్య కి చేరుకున్నాడు... అప్పుడు సడన్ ఒక వ్యక్తి మాధవ్ దగ్గరకు వచ్చి ముస్లిం పద్ధతిలో ఆలింగనం చేసుకొని మాధవ్ చెవిలో "నీ వెనక వస్తోంది ఎవరు?" అని అడిగాడు... "అతను మనవాడే... నీ కోసమే ఇద్దరం వచ్చాము.." అని అన్నాడు... ఆ ఇద్దరూ గౌతమ్ ని పట్టించుకోకుండా మార్కెట్ కి ఒక మూలగా ఉన్న ఒక రెస్టారెంట్ లోకి వెళ్లి కూర్చొని లంచ్ ఆర్డర్ ఇచ్చి మాట్లాడుకోసాగారు... ఒక పావుగంట తరువాత గౌతమ్ కూడా అదే రెస్టారెంట్ లోకి వెళ్లి వేరే చోట కూర్చున్నాడు...

మాధవ్: నువ్వు రెడీ గా ఉంటే... నిన్ను ఇప్పుడే తీసుకొని వెళ్తాము...

సాజిద్: లేదు... నేను వెంటనే కదలలేను... నా మీద ISI వాళ్ళ నిఘా ఉంది... అతి కష్టం మీద తప్పించుకొని తిరుగుతున్నాను... ఒకరోజు పడుకున్న చోట ఇంకో రోజు పడుకోవడం లేదు. ISI ఏజెంట్స్ తో సైఫుద్దీన్ ఊరంతా గాలిస్తున్నాడు... నేను వూరు దాటడం చాలా కష్టం... మీరు నాతో ఉంటే మీకు కూడా ప్రమాదం... ఇక్కడ నుండి ఇండియా బోర్డర్ దాకా నిఘా ఉంది. వేరే ఏదైనా రూట్ ట్రై చెయ్యాలి...

మాధవ్: ఇండియన్ ఎంబసీ కి వెళ్ళడానికి ట్రై చేసావా?

సాజిద్: ఇస్లామాబాద్ వెళ్లి ట్రై చేసాను... ఎంబసీ చుట్టుపక్కల పాకిస్తాన్ పోలీసులు కాపలా కాస్తున్నారు... అటు వెళితే నన్ను చూడగానే వెంటనే అరెస్ట్ చేస్తారు... లేదా... కుదరకపోతే షూట్ చేస్తారు... నన్ను ఎంబసీ లో కి వెళ్లనివ్వరు...

మాధవ్: నువ్వు ఈపాటికి ఎస్కేప్ రూట్ ప్లాన్ చేసుకొని ఉంటావు కదా...

సాజిద్: చేసాను... ISI ఏజెంట్స్ కి ఆ రూట్స్ తెలిసిపోయాయి... నేను ఇక్కడ కరాచీ లో ఇరుక్కుపోయాను... సైప్ఫుద్దీన్ నన్ను ప్రాణాలతో పట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు... నేను దొరికితే నన్ను విపరీతంగా హింసించి నేను సంపాదించిన HUMINT ని రాబట్టి దారుణంగా చంపుతాడు...

మాధవ్: నేను నిన్ను ఇక్కడ నుంచి ఫిషింగ్ బోట్ ఎక్కి ఇంటర్నేషనల్ వాటర్స్ చేరుకుంటే చాలు అక్కడ మన ఇండియన్ ఫిషర్ మన్ ట్రాలర్ రెడీ గా ఉంది. అది ఎక్కితే మనం 24 గంటల్లో ముంబయి చేరుకుంటాము...

సాజిద్: అంత సులభం కాదు... నా దగ్గర ఒక ఫోల్డర్ ఉంది... నేను చాలా కాలంగా సంపాదించిన సమాచారం అందులో వుంది... అది ఒక లిస్ట్... ఆ లిస్ట్ లో ఇండియా లో పనిచేస్తున్న పాకిస్తానీ నాన్ అఫిషియల్ కోవర్ట్ ఆపరేటివ్స్ లిస్ట్ (NOC LIST)... వాళ్ళ ఒరిజినల్ నేమ్స్... కోడ్ నేమ్స్... వాళ్ళ లొకేషన్స్ కి సంభందించిన డీటెయిల్స్ ఒక ఫోల్డర్ లో ఉన్నాయి. ఆ లిస్ట్ ని నేను ఒక చోట భద్రం గా దాచాను... వెళ్లే ముందు ఆ ఫోల్డర్ ని కూడా తీసుకొని వెళ్ళాలి.

మాధవ్: ఇక్కడ మనం ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు... రేపు ఇదే సమయానికి అక్బర్ మార్కెట్ దగ్గర మేము ఒక కార్ లో వెయిట్ చేస్తాను... నిన్ను సేఫ్ గా తీసుకెళ్లడం నా రెస్పాన్సిబిలిటీ...

సాజిద్: ఓకే... మనం వెళ్లే ముందు ఒక చోట ఆగాలి...

మాధవ్: ఎక్క్డడ?

సాజిద్: యూనివర్సిటీ అఫ్ కరాచీ... ఆ యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ లో ఆ ఫోల్డర్ ని దాచాను... అది చాలా ఇం పార్టెంట్... దాన్ని తీసుకొని వెళ్ళాలి...

మాధవ్: ఓకే... రేపు ఇదే సమయానికి అక్బర్ మార్కెట్ చేరుకో... మిగతా విషయాలు నేను చూసుకుంటాను...

ఇద్దరూ లంచ్ చేశారు. ముందుగా సాజిద్ రెస్టారెంట్ నుంచి బయటకి వెళ్ళాడు... సాజిద్ వెళ్లిన 5 నిమిషాలకు మాధవ్ బిల్ పే చేసి బయటకు వచ్చాడు... అప్పటికే గౌతమ్ బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. మాధవ్ తన దగ్గరున్న పాకిస్తానీ ప్రీపెయిడ్ బర్నర్ మొబైల్ ఫోన్ లో ఒక నెంబర్ కి ఫోన్ చేసి ఒక కార్ కావాలని అడిగాడు... ఒక 10 నిమిషాల తరువాత ఒక ఫోన్ కాల్ వచ్చింది... మాధవ్ కి కార్ డీటెయిల్స్ ని ఇచ్చాడు... మాధవ్ వెంటనే తన బర్నర్ మొబైల్ ఫోన్ లోని SIM కార్డు తీసేసి దాన్ని పక్కనే వున్న మురికి కాలువలో పడేసి... ఆ బర్నర్ మొబైల్ ఫోన్ ని నేల మీద పడేసి కాలితో తొక్కి నాశనం చేసాడు...

మరుసటి రోజు మాధవ్... గౌతమ్ ఇద్దరు బయలుదేరి నడుచుకుంటూ 5 కిలోమీటర్ల దూరంలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్లారు... అక్కడ లిఫ్ట్ ఎక్కి నేరుగా బేస్మెంట్ చేరుకున్నారు... అక్కడ చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మాధవ్ ప్రతి కార్ ని చెక్ చేసుకుంటూ వెళ్లి... ఒక పాత టొయోటా కార్ దగ్గర ఆగి అటూ ఇటూ చెక్ చేసాడు... ఎవరూ లేరని నిర్ధారించుకొని కార్ డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ లో కూర్చొని గ్లోవ్ కంపార్టుమెంట్ ఓపెన్ చేసాడు... అందులో... కార్ రిజిస్ట్రేషన్... కార్ ఇన్సూరెన్స్ పేపర్స్ తో పాటు కార్ కీస్ కూడా ఉన్నాయి. గౌతమ్ ని ఎక్కించుకొని డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చి ఏ మాత్రం హడావుడి పడకుండా నడుపుతూ అక్బర్ మార్కెట్ వైపు వెళ్లి అక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తున్న సాజిద్ ని ఎక్కించుకొని కరాచీ యూనివర్సిటీ వైపు వెళ్ళసాగాడు... దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణం... వాళ్ళు ప్రయాణిస్తున్న కారు సాధారణమైనది... ఇందులో ఎటువంటి మోడరన్ ఫెసిలిటీస్ లేవు... GPS లేకపోవడం తో ఆ కార్ ని ఎవరూ ట్రాక్ చెయ్యలేరు... యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ కి కొంచం దూరం లో ఆపాడు...

సాజిద్ కార్ దిగి నడుచుకుంటూ లైబ్రరీ లోకి వెళ్ళాడు... చాలా పెద్ద బిల్డింగ్... కొన్ని వేల కొద్ది పుస్తకాల తో నిండి ఉంది. సాజిద్ నేరుగా పాత రెలిజియస్ పుస్తకాలు ఉన్న రూం లోకి వెళ్ళాడు... ఆ రూమ్ లో పాత... పురాతన పుస్తకాలు భద్రపరిచారు... ఆ రూమ్ లో ఒక పెద్ద టేబుల్ ఉంది ఆ టేబుల్ చుట్టూ స్టూడెంట్స్... స్కాలర్లు కూర్చొని బుక్స్ చదువుకుంటున్నారు... వాళ్ళు సాజిద్ ఆ రూమ్ లోకి రావడం... ఒక అల్మరా దగ్గరికి వెళ్ళడం... దాని ఓపెన్ చేసి ఒక ఫోల్డర్ ని తీసుకొని సైలెంట్ గా బయటకు వెళ్లడం ఎవ్వరూ గమనించలేదు... సాజిద్ ఆ ఫోల్డర్ ని తీసుకొని నేరుగా దూరంగా తన కోసం వెయిట్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ కొలీగ్స్ దగ్గరకి నడవసాగాడు... మాధవ్ నడుపుతున్న కార్ ఇంకో 400 మీటర్ల దూరంలో ఉన్నదనగా సడన్ గా సాజిద్ కి కుడి వైపు నుంచి సైఫుద్దీన్ టీం తనవైపు పరిగెత్తుకుని రావడం గమనించాడు... అంతే... సాజిద్ తన కోసం వెయిట్ చేస్తున్న కార్ వైపు పరిగెత్తసాగాడు... ఇది గమనించిన మాధవ్ కార్ ని స్టార్ట్ చేసి సాజిద్ వైపు వేగంగా నడిపాడు... గౌతమ్ కార్ వెనక డోర్ ని తీసి సాజిద్ ఎక్కడానికి అనుకూలంగా పట్టుకున్నాడు... సాజిద్ వైపు కార్ రావడం గమనించి సైఫుద్దీన్ టీం సాజిద్ మీద కాల్పులు జరిపారు... బుల్లెట్స్ ని తప్పించుకుంటూ సాజిద్ మాధవ్ నడుపుతున్న కార్ వైపు వేగంగా పరిగెత్తి సాగాడు... సరిగ్గా అదే సమయం లో సాజిద్ వీపు మీద ఒక బులెట్ తగిలింది... సాజిద్ అక్కడికక్కడే కుప్పకూలాడు... అప్పటికే మాధవ్ నడుపుతున్న కార్ సాజిద్ కి 10 మీటర్ల దూరంలో ఉంది... తన పని అయిపోయిందని గ్రహించిన సాజిద్ తన చేతిలోని ఫోల్డర్ ని తన శక్తి మొత్తం ఉపయోగించి కార్ వైపు విసిరేసాడు... సరిగ్గా అదే సమయానికి సాజిద్ కి తలకి ఇంకో బులెట్ తగిలింది... సాజిద్ విసిరేసిన ఫోల్డర్ కార్ కి రెండు అడుగుల దూరం లో పడింది... అది చూసిన గౌతమ్ కార్ లోంచి బయటకి దూకి అతి లాఘవంగా నెల మీద పడ్డ ఫోల్డర్ ని తీసుకొని అతి చాకచక్యంగా కార్ వెనక సీట్ లో చేరాడు... అప్పటికే కార్ కి చాలా బుల్లెట్స్ తగిలాయి... గౌతమ్ కార్ లోకి ఫోల్డర్ తో సహా రావడం చూసిన మాధవ్ కార్ యాక్సిలేటర్ గట్టిగా నొక్కి పెట్టి వేగంగా కార్ ని ముందుకు పోనిచ్చాడు... ఇది గమనించిన సైఫుద్దీన్ టీం కార్ అడ్డంగా నిలబడి ఆపడానికి ప్రయత్నించారు... మాధవ్ ఏ మాత్రం కనికరం చూపకుండా కార్ తో సైఫుద్దీన్ టీం ని గుద్దుకుంటూ దూసుకెళ్లాడు...

యూనివర్సిటీ ఆఫ్ కరాచీ క్యాంపస్ నుంచి వేగంగా కార్ నడుపుతూ మెయిన్ రోడ్ కి చేరుకొని దూసుకెళ్ళసాగాడు... ఒక మూడు కిలోమీటర్లు దూరం వెళ్ళాక.. మాధవ్ కార్ వేగాన్ని సడన్ గా తగ్గించి మెయిన్ రోడ్ పక్కనే కనిపించిన సినిమా హాల్ లోకి పోనించి కార్ ని పార్కింగ్ ప్లేస్ లో పెట్టాడు... కార్ పార్కింగ్ అటెండెంట్ ఇచ్చిన టోకెన్ తీసుకొని అతడిని "పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఎక్కడుంది?" అని అడిగాడు... "సినిమా హాల్ బయట కూల్ డ్రింక్ షాప్ లో ఉంది" అని అన్నాడు ఆ కార్ పార్కింగ్ అటెండెంట్... మాధవ్ సినిమా హాల్ నుండి బయటకు వచ్చాడు... గౌతమ్ కూడా సాజిద్ దగ్గరనుంచి సంపాదించిన ఫోల్డర్ తీసుకొని మాధవ్ ని ఫాలో అయ్యాడు... సరిగ్గా అప్పుడే సినిమా హాల్ ముందు నుంచి సైఫుద్దీన్ టీం 4 కార్లు వేగంగా దూసుకెళ్లడం గమనించారు... మాధవ్ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి వెళ్లి ఒక ఫోన్ కాల్ చేసాడు... అవతల ఫోన్ ఎత్తగానే మాధవ్ ఒకే ఒక్క మాట అన్నాడు "కట్టి పతంగ్" ఆ కోడ్ వర్డ్ అర్థం ఏమిటంటే... "డేంజర్ లో వున్నాము... సేఫ్ హౌస్ కి వస్తున్నాము..." మాధవ్ అవతల వ్యక్తి చెప్పింది చాలా జాగ్రత్తగా విని ఫోన్ పెట్టేసి కూల్ డ్రింక్ షాప్ వాడికి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి గౌతమ్ తో పాటు ఆటో ఎక్కి తను వెళ్లాల్సిన ఏరియా పేరు చెప్పాడు... దాదాపు ఒక 40 నిమిషాలు ఆటో లో ప్రయాణించిన తరువాత కరాచీ పోర్ట్ కి దగ్గరలోని ఒక కాలనీ చేరుకున్నారు. ఆ ఏరియా పేరు గుల్ మొహర్ కాలనీ... అది కరాచీలో అప్పర్ మిడిల్ క్లాస్... హయ్యర్ మిడిల్ క్లాస్ జనాలు నివసించే ప్రాంతం... మాధవ్... గౌతమ్... ఇద్దరూ ఆ ఏరియా లో దిగిపోయి... ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసి కాలి నడకన దాదాపు ఒక 30 నిమిషాలు ఆ కాలనీ లోని మార్కెట్ లో కలియతిరిగారు... చివరికి మాధవ్ తమని ఎవరూ ఫాలో అవ్వడం లేదు అని నమ్మకం కలిగిన తరువాత ఆ కాలనీ లో ఒక పెద్ద ఇంటి గేట్ తీసుకొని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు... దాదాపు 65 ఏళ్ళు ఉన్న వ్యక్తి తలుపు తీసి ఇద్దరు లోపలి వచ్చాక తలుపు వేసి గడియ పెట్టి లోపలి దారి తీసాడు... మాధవ్.. గౌతమ్ ఆ వ్యక్తిని అనుసరించారు... "మీరిద్దరూ ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేసాను... " అని చెప్తూ ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు... ఆ రూమ్ లో రెండు బెడ్స్ కనిపించాయి... వాటి మీద బెడ్ షీట్స్ నీట్ గా పరచి ఉన్నాయి... బెడ్ పక్కనే ఒక ల్యాండ్ లైన్ టెలిఫోన్ ఉంది... అది జస్ట్ ఇంటర్ కామ్ లాగా పనిచేస్తుంది... బయట కి ఫోన్ చెయ్యలేరు... "బయట హడావిడి తగ్గేదాకా ఇక్కడే ఉండండి... నేను ప్రతి రెండు గంటలకు వచ్చి మీకు బయట జరుగుతున్న విషయాలు చెపుతాను... మీరు రెస్ట్ తీసుకోండి" అని చెప్పి ఆ రూమ్ ని బయట నుంచి లాక్ చేసాడు...


PART - 14 - THE SEARCH PARTY & CODE

సేఫ్ హౌస్ కేర్ టేకర్ పేరు గౌస్ మియా... భారతీయ పౌరుడు... పాకిస్తాన్ లో వ్యాపారం చేసుకుంటూ పాకిస్తానీ సిటిజెన్ షిప్ తీసుకున్నాడు... అయినా పుట్టిన దేశం మీద మమకారం చావలేదు.. అందుకే భారతీయులకి ఆశ్రయం ఇస్తూ ఉంటాడు... దానికోసం భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఆ డబ్బులు ఎవరికీ అనుమానం రాకుండా దుబాయ్ లో ఒక బ్యాంకు అకౌంట్ లో అమెరికన్ డాలర్స్ రూపం లో ట్రాన్స్ఫర్ అడుగుతాడు. మాధవ్ గతంలో రెండు సార్లు గౌస్ ఇంట్లో ఉన్నాడు. గౌస్ కి పాకిస్తాన్ పోలీస్ డిపార్టుమెట్ లో కొంత మంది ఇన్ఫోర్మాంట్స్ ఉన్నారు. వాళ్లకి డబ్బులు ఇస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు... పోలీసులు ఎవరి కోసం వెతుకుతున్నారు... వాళ్ళు దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందొ కనుకుంటున్నాడు...

సైఫుద్దీన్ ముందుగా సాజిద్ కి హెల్ప్ చేస్తున్న వాళ్ళు వాడిన వెహికల్ కోసం వెతుకుతున్నాడు... సైఫుద్దీన్ కి ఆ వెహికల్ ని నడిపింది మాధవ్ అని తెలియదు... ఒకవేళ తెలిసుంటే... ఊరంతా కర్ఫ్యూ పెట్టి హౌస్ టు హౌస్ సెర్చ్ చేసేవాడు... మాధవ్ ISI MOST WANTED LIST లో ఉన్నాడు. మాధవ్ ని ప్రాణాలతో పట్టుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు... కుదరకపోతే మాధవ్ ని చంపేసి శవాన్ని ఇంటర్నేషనల్ ప్రెస్ ముందు పెట్టి... భారతదేశం... పాకిస్తాన్ లో R&AW ఏజెంట్స్ తో అరాచకం సృష్టిస్తోందని చెప్తారు... ప్రస్తుతం సైఫుద్దీన్ దృష్టిలో ఎవరో ఇద్దరు సాజిద్ కి సహాయం చేస్తున్నారు... ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి... ముందుగా కరాచీ సిటీ లో ఉన్న బ్లూ కలర్ టొయోటా కార్ కోసం వెతకసాగాడు... పెద్దగా కష్టపడకుండానే దొరికింది... మాధవ్ తాను వాడిన కార్ ని సినిమా హాల్ లో పార్క్ చేసి వెళ్ళిపోయాడు... దాన్ని తీసుకొని వెళ్ళడానికి ఎవరూ రాలేదు... ఆ సినిమా హాల్ ఓనర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు... సైఫుద్దీన్ టీం సినిమా హాల్ దగ్గర ఎంక్వయిరీ చేశారు... సినిమా హాల్ దగ్గర సీసీటీవీ లేకపోవడంతో కార్ ని ఎవరు పార్క్ చేశారో తెలియలేదు... సినిమా హాల్ లో కార్ ని మధ్యాన్నం 1:00 ప్రాంతం లో పార్క్ చేశారు... సినిమా హాల్ పక్కనే ఆటో స్టాండ్ ఉంది. ఆటో వాళ్ళని ఎంక్వయిరీ చెయ్యగా... 1:00PM నుంచి 1:15PM మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి గుల్ మొహర్ కాలనీ లో దిగారని తెలిసింది.. పోలీసులు వెంటనే అదే ఆటో ఎక్కి ఆ ఇద్దరు వ్యక్తులు గుల్ మొహర్ కాలనీ లో దిగిన చోటికి వెళ్లారు. అదిచాలా బిజీ రోడ్. గుల్ మొహర్ కాలనీ షాపింగ్ సెంటర్ రోడ్... అక్కడ దిగినవాళ్లు ఎక్కడికైనా వెళ్ళగలరు... గుల్ మొహర్ కాలనీ బాగా పెద్ద కాలనీ... రకరకాల మనుషులు నివసిస్తూ ఉంటారు... మధ్య తరగతి... గవర్నమెంట్ ఎంప్లాయిస్... చిన్న సైజు బిజినెస్ కమ్యూనిటీ కి చెందిన వ్యక్తులు కనిపిస్తారు... కానీ చాలా బిజీ గా ఉంటుంది... పోలీసుల ఎంక్వయిరీ చాలా మందకొడిగా సాగుతోంది... అయితే సిటీ లో ఉన్న అన్ని చెక్ పోస్ట్ ల దగ్గర చాల గట్టి బందోబస్తు పెట్టారు... కరాచీ నుంచి బయటకు వెళ్తున్న ప్రతి వాహనాన్ని ఆపి... సాజిద్ సంపాదించిన ఫోల్డర్ కోసం వెతుకుతున్నారు...

కరాచీ పోలీసులు సినిమా హాల్ పార్కింగ్ అసిస్టెంట్ ని ఎంక్వయిరీ చేశారు...

పోలీస్: కార్ పార్క్ చేసిన వాళ్ళని సరిగ్గా చూసావా?

పార్కింగ్ అసిస్టెంట్: చూసాను...

పోలీస్: వాళ్ళ ఎత్తు... పర్సనాలిటీ ఎలా ఉన్నాయి ?

పార్కింగ్ అసిస్టెంట్: ఆరడగుల పొడుగున ఉన్నారు... బలంగా కనిపించారు...

పోలీస్ : ఇంకా ఏదైనా చెప్పగలవా... వాళ్ళ కళ్ళు... నుదురు... ముక్కు ఎలా ఉన్నాయి?

పార్కింగ్ అసిస్టెంట్: బానే ఉన్నాయి...

పోలీస్: మా స్కెచ్ ఆర్టిస్ట్ కి హెల్ప్ చెయ్యి వాళ్ళ బొమ్మలు వేస్తాడు...

పార్కింగ్ అసిస్టెంట్: అలాగే సర్... హా... ఒకటి చెప్పడం మర్చి పోయాను... వాళ్లలో ఒక్కడే మాట్లాడాడు... ఉర్దూ లో మాట్లాడాడు... కానీ... పాకిస్తానీ లా లేదు... కాశ్మీరీ యాస కనిపిచింది... నన్ను పబ్లిక్ టెలిఫోన్ గురించి అడిగారు... సినిమా హాల్ పక్కన కూల్ డ్రింక్స్ షాప్ లో ఉందని చెప్పను...

పోలీసులు కూల్ డ్రింక్ షాప్ లో కూడా ఎంక్వయిరీ చేశారు... షాప్ ఓనర్ కూడా సినిమా హాల్ పార్కింగ్ అసిస్టెంట్ చెప్పిందే చెప్పాడు... చివరిగా ఆటో డ్రైవర్ ని ఎంక్వయిరీ చేశారు...

పోలీస్: వాళ్ళని నువ్వు సరిగ్గా చూసావా?

ఆటో డ్రైవర్ : చూసాను...

పోలీస్: మా స్కెచ్ ఆర్టిస్ట్ కి హెల్ప్ చెయ్యి వాళ్ళ బొమ్మలు గీస్తాడు... నీకు వాళ్లలో ఏదైనా వింత గా అనిపించిందా?

ఆటో డ్రైవర్: వాళ్ళు కాశ్మీరీ భాషలో మాట్లాడుకున్నారు... నాకు కాశ్మీరీ భాష వచ్చు... వాళ్ళు ఎక్కడనుంచి వచ్చారని అడిగాను... దానికి వాళ్ళు "బారాముల్లా నుంచి వచ్చాం" అని చెప్పారు... నాకు ఎటువంటి అనుమానం కలగలేదు...

పోలీస్: వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారు?

ఆటో డ్రైవర్: ఎదో బిజినెస్ పని మీద వచ్చినట్లు ఉన్నారు... త్వరలో ఇస్లామాబాద్ వెళ్లి జెహాంగీర్ ని కలవాలని మాట్లాడుకున్నారు... వాళ్లలో ఒక్కడే ఎక్కువ గా మాట్లాడాడు... రెండోవాడు పెద్దగా మాట్లాడలేదు...


గౌస్ మియా ఈ డీటైల్స్ అన్నింటిని మాధవ్ కి చెప్పాడు... "మీరు ఇప్పుడు కరాచీ దాటి బయటకి వెళ్ళలేరు... చెక్ పోస్ట్ దగ్గర హడావిడి తగ్గేదాకా ఇంట్లోంచి బయటకి వెళ్లడం కుదరదు" అని చెప్పాడు... గౌస్ మియా ఇంట్లో ఒక ల్యాండ్ లైన్... ఒక మొబైల్ ఫోన్ ఉన్నాయి... ఆ రెండింటిని మాధవ్ వాడుకోవడానికి లేదు. ఆ ఇంట్లో గౌస్ మియా... ఆయన భార్య ఫాతిమా తప్ప ఎవరూ ఉండరు... గౌస్ మియా కి ఇద్దరు పిల్లలు... ఒక అమ్మాయి... ఒక అబ్బాయి... అమ్మాయి కి పెళ్లి అయ్యింది... వాళ్ళు రియాద్ లో ఉంటారు... కొడుకు ఇంగ్లాడ్ లో చదువుకుంటున్నాడు... పిల్లలు ప్రతి రోజూ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడతారు... గౌస్ కి కంప్యూటర్ నాలెడ్జి లేదు... అందువల్ల గౌస్ మియా ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్... ఫాక్స్ మెషిన్... లేదు. గుల్ మొహర్ కాలనీ లో ఒక జనరల్ స్టోర్స్ నడుపుతూ ఉంటాడు...

గౌతమ్ ఫోల్డర్ ని తెరచి అందులోని పేపర్స్ ని బాగా స్టడీ చేసాడు... మొత్తం 72 మంది నాన్ ఆఫిషియల్ కోవర్ట్ ఆపరేటివ్స్ లిస్ట్ (NOC LIST)... వాళ్ళ ఒరిజినల్ నేమ్స్... కోడ్ నేమ్స్... వాళ్ళ లొకేషన్... వాళ్ళు ఇండియా లో ఎవరిని కలవడానికి వచ్చారు... డీటెయిల్స్ ఉన్నాయి... కానీ... వాళ్ళు ఇండియా లో ఏమి చేయబోతున్నారో ఆ పేపర్స్ లో లేదు. గౌతమ్ ఆ పేపర్స్ లో వ్రాసిన ఇండియన్ పేర్లు చదివాడు. వాటిని చదువుతూంటే గౌతమ్ కి ఎదో డౌట్ వచ్చింది... ఆ ఇండియన్ పేర్లని ఒక పేపర్ మీద వ్రాసి మాధవ్ కి ఇచ్చాడు... మాధవ్ కూడా ఆ లిస్ట్ చదివి...

మాధవ్: మై గాడ్... వీళ్ళలో కొంత మంది ఇండియా లో రాజకీయ నాయకులు... వ్యాపారవేత్తలు... బ్యూరోక్రాట్స్... మిగతా వాళ్ళు ఎవరో కనుక్కోవాలి... ఈ లిస్ట్ లో 72 మంది ఏజెంట్స్... ఒరిజినల్ నేమ్స్... కోడ్ నేమ్స్... అంటే 144 పేర్లు... వాళ్ళ లొకేషన్స్... పైగా మన ఇండియన్ నేమ్స్ 42 ఉన్నాయి... అంటే 186 పేర్లు... 72 లొకేషన్స్... This is huge... అందుకే సాజిద్ ఇక్కడనుంచి కదలలేకపోయాడు... ఈ లిస్ట్ కోసం ISI... ముఖ్యంగా సైఫుద్దీన్ ప్రాణాలు ఇవ్వడానికి... లేదా ప్రాణాలు తియ్యడానికి వెనుకాడడు... మనం ఈ డీటెయిల్స్ ని ఎలా ఇండియా చేర్చాలి? గౌస్ మియా ఇంట్లో ఇంటర్నెట్... ఫాక్స్ మెషిన్ లేదు... ఫోన్ కూడా వాడలేము... ఏదైనా సెక్యూర్ ఛానల్ లో ఈ డీటెయిల్స్ ని ఇండియా పంపించాలి... నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా?

గౌతమ్: ఇక్కడ కరాచీ లో మనకి నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీరు కార్ కోసం ఎవరికో ఫోన్ చేశారు... అతను నమ్మకస్తుడేనా?...

మాధవ్: మనకి కార్ ఏర్పాటు చేసింది గౌస్ మియా... గౌస్ చాలా జాగ్రత్తపడతాడు... కరాచీ పోలీస్... ISI... మిలిటరీ... గవర్నమెంట్... ఎవరికి డౌట్ రానివ్వడు.

గౌతమ్: ఈ ఫోల్డర్ ఎవరి దగ్గర ఉంటే... వాళ్లకి ప్రాబ్లెమ్... ఈ డీటైల్స్ మాత్రం ఎంత త్వరగా ఇండియా చేరితే అంత మంచిది... గౌస్ తో మాట్లాడితే ఏదైనా ఐడియా ఇస్తాడా...

మాధవ్: అడుగుతాను...


కరాచీ పోలీసులు విడివిడిగా సినిమా హాల్ పార్కింగ్ అసిస్టెంట్... కూల్ డ్రింక్ షాప్ ఓనర్... ఆటో డ్రైవర్ ని పిలిచి స్కెచ్ ఆర్టిస్ట్ తో మాధవ్... గౌతమ్... బొమ్మలు గీయించారు... ఆ ముగ్గురూ ఇచ్చిన డిస్క్రిప్షన్ తో గీసిన ఇద్దరి బొమ్మలు చాలా బాగా వచ్చాయి... వాటిని కరాచీ లోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి సర్క్యూలేట్ చేశారు... ISI వాళ్లకి కూడా ఆ స్కెచెస్ ని పంపారు... సైఫుద్దీన్ చాలా బిజీ గా ఉండడం తో ఆ స్కెచెస్ ని వెంటనే చూడలేదు. చూసివుంటే కరాచీ లో ఆ రోజే కర్ఫ్యూ విధించి డోర్ టు డోర్ సెర్చ్ మొదలెట్టేవాడు.


అదే రోజు రాత్రి డిన్నర్ తీసుకొని వచ్చిన గౌస్ తో మాధవ్

మాధవ్: నీ హెల్ప్ కావాలి... మా దగ్గర వున్నా ఇన్ఫర్మేషన్ ని ఇన్స్టాల్మెంట్ లో ఇండియా కి వెంటనే పంపాలి... నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా?

గౌస్ మియా: ఆ ఇన్ఫర్మేషన్ ఏమిటీ?

మాధవ్: ఇండియా లో తిరుగుతున్న పాకిస్తానీ ISI ఏజెంట్స్... వాళ్ళ కోడ్ నేమ్స్... వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్... ఇవే కాకుండా భారతదేశం లో కొంత మంది పేర్లు...

గౌస్ మియా: చాలా కష్టం... ఎలా పంపాలి? మీకు రూల్స్ తెలుసు... నా ఇంట్లో ఫోన్ వాడడానికి వీలు లేదు... ఏదైనా కొత్త ఆలోచన వెతకాలి... మీకు గుర్తుందా... 9/11 ప్లాన్ ని ఎవరికి తెలియకుండా ఎలా అమలు చేశారో? పాలన్ వివరాలు ఫోన్, ఫాక్స్, ఇమెయిల్, మెసేజ్... ఇలా ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ని వాడకుండా... ఇన్ఫర్మేషన్ ని పర్సనల్ గా ఒకరి నుంచి ఇంకొకరికి చేరవేశారు... అందువల్లనే CIA, FBI వాళ్ళకి ముందస్తు ఇన్ఫర్మేషన్ దొరకలేదు... ఎటువంటి ఎలక్ట్రానిక్ ఫుట్ ప్రింట్ దొరకకుండా జాగ్రత్త పడ్డారు... మనం కూడా ఇలాంటిదేదో ఆలోచించాలి...

మాధవ్: మనకి ఇప్పటికిప్పుడు నమ్మకమైన పావురం దొరుకుతుందా?

గౌస్ మియా: దొరకడం కష్టం... నేను కనుక్కొని చెప్తాను...

మాధవ్: వెంటనే కనుక్కోవాలి... ఈ లోపల మేము మెసేజ్ తయారు చేస్తాము...

గౌస్ మియా: రెండు రోజుల్లో చెప్తాను...


గౌతమ్ ఆ లిస్ట్ ని నాలుగు భాగాలుగా విభజించాడు... 1. NOC LIST లోని ఒరిజినల్ నేమ్స్... కోడ్ నేమ్స్... 2. లొకేషన్ డీటెయిల్స్ 3. పొలిటికల్ లీడర్స్ నేమ్స్... 4. బ్యూరోక్రాట్స్ నేమ్స్... దీనికోసం ఒక క్రిప్టో కోడ్ ని తయారుచెయ్యాలని నిర్ణయించుకున్నాడు...

గౌతమ్ రకరకాలుగా ఆలోచించాడు... తన దగ్గర ఉన్న లిస్ట్ ని ఎలా ఎన్క్రిప్ట్ చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చాడు... మెసేజ్ ని సీక్రెట్ కోడ్ లో ఒక చోట నుండి ఇంకో చోటికి పంపడం చాలా పురాతనమైన పద్ధతి... ఎన్నో రకాల పద్ధతులు వాడుకలోకి వచ్చాయి... ఒక నార్మల్ మెసేజ్ ని కోడ్ లో వ్రాయడాన్ని ఎన్క్రిప్టింగ్ అంటారు... ఇలా ఎన్క్రిప్టింగ్ చెయ్యడానికి వాడే కోడ్ ని KEY అంటారు... ఎన్క్రిప్టు చేసిన మెసేజ్ ని డీకోడ్ చేయడానికి ఈ KEY ఎంతో అవసరం. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ తో పాటు ఈ KEY ని కూడా పంపిస్తారు... తనకి దొరికిన పేర్లు సేఫ్ గా ఇండియా పంపడానికి గౌతమ్ ఒక కొత్త KEY ని తయారు చేసాడు... ఉదాహరణకి

MEET ME AFTER PARTY

అన్న నార్మల్ మెసేజ్ ని ఒక కోడ్ లో పంపాలి అంటే... రకరకాల పద్ధతులు ఉన్నాయి... అందులో ఒక పద్ధతి

NORMAL TEXT ----------------------------------- CODED TEXT

1 2 3 4 5 6 ----------------------------------- 4 2 1 6 3 5

M E E T M E ----------------------------------- T E M E E M

A F T E R P ----------------------------------- E F A P T R

A R T Y Y R ----------------------------------- A 0 T 0

NORMAL MESSAGE ---------------- > MEET ME AFTER PARTY

ENCRIPTED MESSAGE ------------- > TEMEEMEFAPTRYRA0T0

ENCRYPTION KEY -------------------- > 421635

పైన వివరించిన విధంగా ఒక నార్మల్ మెసేజ్ పంపాలంటే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ తో పాటు ఎన్క్రిప్షన్ కీ ని తప్పకుండా పంపాలి... లేకపోతే ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ని డీకోడ్ చెయ్యడం కుదరదు... అది ఒక అర్థం.పర్ధం లేని అక్షర సమూహం గా కనిపిస్తుంది... అందుకే ఎన్క్రిప్షన్ కీ అనేది చాలా ముఖ్యం... పైన వివరించిన ఉదాహరణలో నార్మల్ మెసేజ్ మూడో లైన్ లో రెండు (5,6) స్థానాల్లో ఖాళీలు ఉన్నాయి... అటువంటప్పుడు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ లో జీరో వాడతారు... అందుకే నార్మల్ మెసేజ్ 16 అక్షరాలు ఉంటే... ఎన్క్రిప్టెడ్ మెసేజ్ లో 18 అక్షరాలు ఉన్నాయి... ఎన్క్రిప్షన్ కీ లో ఎన్ని డిజిట్స్ ఉంటే... మెసేజ్ ని డీకోడ్ చెయ్యడం అంత కష్టం... అందుకే గౌతమ్ 9 డిజిట్స్ తో ఎన్క్రిప్షన్ కీ ని తయారు చేసాడు... ఆ KEY ని వాడి ముందు బ్యూరోక్రాట్స్ పేర్లు ఎన్క్రిప్ట్ చేసాడు... ఉదాహరణకి SWAMINATHAN అనే పేరుని ఎన్క్రిప్టు చెయ్యగా TASHAIWNM00A000N గా మారిపోతుంది... దీనికోసం స్పెషల్ గా తయారు చేసిన 9 అంకెల ఎన్క్రిప్షన్ కీ 871935264... గౌతమ్ ఈ స్పెషల్ కీ ని వాడి NOC LIST లోని బ్యూరోక్రాట్స్ పేర్లు ఎన్క్రిప్ట్ చేసి మాధవ్ కి ఇచ్చాడు... "బ్యూటిఫుల్... చాలా బాగుంది... ఈ మెసేజ్ ని డీకోడ్ చెయ్యడం అంత ఈజీ కాదు... అయితే... మీ మెసేజ్ తో పాటు ఎన్క్రిప్షన్ కీ ని ఎలా పంపుతావు?" అని అడిగాడు... దానికి బదులుగా గౌతమ్ చెప్పిన సమాధానం విని మాధవ్ నివ్వెరపోయారు.... "ఎక్సలెంట్... నువ్వు ఫైనల్ మెసేజ్ పూర్తి చేసి రెడీ గా వుంచు... మనకి పావురం దొరకగానే వింగ్ (R&AW ని ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ లో "WING" అని పిలుస్తారు) కి పంపిస్తాను..." అని అన్నాడు. గౌతమ్ "నాకు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి" అంటూ గౌతమ్ ఒక లిస్ట్ ని మాధవ్ కి ఇచ్చాడు... మాధవ్ ఆ లిస్ట్ ని గౌస్ మియా కి ఇచ్చాడు...

మరుసటి రోజు గౌస్ మియా మాధవ్ ఇచ్చిన లిస్ట్ లో ని అన్ని ఐటమ్స్ మీ తెప్పించాడు... 1. స్పెషల్ బాండ్ పేపర్... 2. బాండ్ పేపర్ నీళ్లలో పడితే తడవకుండా ఉండటానికి కొన్ని కెమికల్స్... 3. క్రిప్టో మెసేజ్ రాయడానికి కావాల్సిన రకరకాల ఇంక్స్... 4. ఇన్విజిబుల్ ఇంక్... 5. కెమికల్ ని కలవడానికి ప్లాస్టిక్ ట్రే లు... 6. సర్జికల్ మరియు... కెమికల్స్ లో ముంచినా కూడా చేతులు దెబ్బ తినకుండా ఉండడానికి స్పెషల్ గ్లోవ్స్... బూట్స్ 6. బాండ్ పేపర్ ని ఆరబెట్టడానికి ప్లాస్టిక్ రోప్... క్లిప్స్... 7. కెమికల్స్ తో పని చేసేటప్పుడు వాడే మాస్క్... గాగుల్స్... 8. కెమికల్స్ వాడేటప్పుడు వేసుకునే ఎప్రాన్... బూట్స్... 9. PPE సూట్స్... 10. ఇతర చిన్న చిన్న ఐటమ్స్ కూడా తెప్పించాడు...

ముందుగా PPE సూట్ వేసుకొని స్పెషల్ బూట్లు వేసుకొని... చేతికి స్పెషల్ గ్లోవ్స్ వేసుకున్నాడు... ఆ తరువాత స్పెషల్ ఎప్రాన్ తొడుకున్నాడు... కెమికల్ మాస్క్ వేసుకొని... గాగుల్స్ పెట్టుకున్నాడు... గౌస్ మియా తెచ్చిన కెమికల్ క్యాన్స్ ఒక్కోటిగా ఓపెన్ చేసాడు... కెమికల్స్ భయంకరంగా వాసన వేస్తున్నాయి... ఒక్కో కెమికల్ ని ఒక్కో ప్లాస్టిక్ ట్రే లో చాలా జాగ్రత్తగా నేల మీద పడకుండా పోసాడు... ఆ తరువాత స్పెషల్ బాండ్ పేపర్స్ ప్యాకెట్ ని ఓపెన్ చేసాడు... దాదాపు 1000 బాండ్ పేపర్స్ ఉన్నాయి... వాటిని తీసుకొని ఒక కెమికల్ ముంచాడు... ఒక 20 నిమిషాల తరువాత ఆ పేపర్స్ ని ఇంకో కెమికల్ లో 30 నిమిషాలు ముంచాడు... అలా దాదాపు 8 రకాల కెమికల్స్ లో సాయంత్రం దాకా నానా పెట్టి బయటకు తీసాడు... వాటిని చాలా జాగ్రత్తగా కెమికల్స్ నేలమీద పడకుండా... ఆ రూమ్ లోనే బట్టలు ఆరేయడానికి వాడే ప్లాస్టిక్ రోప్ కి క్లిప్స్ పెట్టి ఆరేసాడు... తెల్లవారే టప్పటికి ఆ కాగితాలు ఆరిపోయాయి... మళ్ళీ ఆరిపోయిన కాగితాలను కెమికల్స్ ముంచి తీసాడు... అలా 5 రోజులు చేయడంతో ఆ కాగితాలు ఒక 50 ఏళ్ళ క్రితం తయారు చేసిన పాత కాగితాలు గా తయారయ్యాయి...

గౌతమ్ ఆ కాగితాలని బయట ఎండలో 3 రోజుల పాటు పడేసాడు... దాంతో ఆ కాగితాలకి అంటుకున్న కెమికల్ వాసన పూర్తిగా పోయింది... వాటి లోంచి ఒక 500 కాగితాలు చాలా జాగత్తగా సెలెక్ట్ చేసుకున్నాడు... అదృష్టవశాత్తు గౌస్ మియా దగ్గర రెండో ప్రపంచ కాలం లో ఇంగ్లాండ్ లో తయారుచేయబడ్డ రెమింగ్టన్ టైపురైటర్ ఉంది... ఆ టైపురైటర్ తో తానూ స్పెషల్ గా తయారుచేసుకున్న కాగితాల మీద 50 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం అప్లైడ్ మ్యాథమెటిక్స్ మీద థీసిస్ టైపు చేసాడు... ఆ థీసిస్ పేపర్స్ మధ్య అక్కడక్కడా బ్యూరో క్రాట్స్ పేర్లని క్రిప్టోగ్రఫీ లో తయారుచేసిన వాటిని పొందుపరిచాడు... ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ఏ రకంగా అయితే రీసెర్చ్ థీసిస్ తయారుచేస్తారు... అచ్చం అలాగే తయారుచేసాడు... ఆ థీసిస్ కి ఎకనాలెడ్జిమెంట్స్ లో ఒక కోడ్ ని పొందుపరిచాడు... ఆ కోడ్ లో R&AW ఎక్కడెక్కడ క్రిప్టో మెసేజ్ కోసం చూడాలో వ్రాసాడు... మొత్తం తయారయ్యాక ఆ పేపర్స్ ని గౌస్ మియా కి ఇచ్చి పాత బుక్ బైండర్ చేత పుస్తక రూపం తెప్పించాడు... ఆ తరువాత ఇన్విజిబుల్ ఇన్క్ తో అక్కడక్కడా రిఫరెన్స్ కోడ్స్ ని వ్రాసాడు... ఇప్పుడు ఇండియా పంపడానికి పుస్తకం రెడీ అయ్యింది... ఆ పుస్తకాన్ని చూసి మాధవ్ స్టన్ అయ్యాడు... అది చూడటానికి యూనివర్సిటీ లైబ్రరీ లో కనిపించే పాత పుస్తకం లాగా ఉంది...

మాధవ్: అద్భుతం... నీ దగ్గర ఇలాంటి కళ ఉందని నాకు తెలియదు... ఇది మనవాళ్ళకి చేరితే వాళ్లకి ఇందులో మెసేజ్... బ్యూరోక్రాట్స్ పేర్లు ఎలా తెలుస్తాయి...

గౌతమ్: నేను పుస్తకం మొదట్లో అక్నాలెడ్జ్మెంట్ లో ఒక కోడ్ వ్రాసాను ఆ కోడ్ మనవాళ్ళకి ఈజీ గా అర్ధమవుతుంది... ఆ కోడ్ లో కొన్ని పేజీల నంబర్స్ వ్రాసాను... ఆ పేజీలలో నేను ఇన్విజిబుల్ ఇంకు తో కొన్ని చోట్ల ఎన్క్రిప్షన్ కీ ని వ్రాసాను... మన వాళ్ళు ఆ పేజీల కింద అగ్గిపుల్ల కాల్చి పెడితే ఇన్విజిబుల్ ఇంకు తో వ్రాసిన ఎన్క్రిప్షన్ కీ తెలుస్తుంది... ఆ కీ దొరికితే నేను పంపిన బ్యూరోక్రాట్స్ పేర్ల లిస్ట్ వాళ్లకి దొరుకుతుంది... ఇంకో సంగతి... నేను ఈ పుస్తకం లో ఒక మెసేజ్ కూడా పెట్టాను... ఈ పుస్తకం మనవాళ్ళకి అందినది... లేనిది వాళ్ళు మనకి ఇన్ఫోర్మ్ చేస్తారు...

మాధవ్: మనకెలా ఇన్ఫోర్మ్ చేస్తారు...

ఆ పుస్తకం RAW కి దొరకగానే... వాళ్ళు ముందుగా ఎన్క్రిప్టెడ్ కీ కోసం వెతుకుతారు... అది దొరకగానే... వాళ్లకి ఏ ఏ పేజెస్ లో ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఉందొ తెలుస్తుంది... ఆ వివరాలు తెలియగానే మాధవ్... గౌతమ్ కి ఇన్ఫోర్మ్ చేస్తారు... ఎలా ఇన్ఫోర్మ్ చేస్తారో చెప్పగానే మాధవ్ పెదాలమీద చిరునవ్వు వెలసింది...

మాధవ్: AMAZING... నీలాంటి వాడు నాకు దొరకడం నా అదృష్టం... మన ఇప్పుడు మన వాళ్ళు ఇన్ఫోర్మ్ చేసేదాకా మన ఇక్కడ నుంచి కదల కూడదు...

గౌతమ్: అవును... ఈలోపల నేను ఇంకో బుక్ తయారు చేస్తాను... ఆ బుక్ లో రాజకీయ నాయకుల పేర్లు ని ఎన్క్రిప్టు చేస్తాను... మనకి RAW నుంచి మొదటి పుస్తకం అందిన ఇన్ఫర్మేషన్ రాగానే రెండో పుస్తకం పంపుదాము...

మాధవ్: గుడ్ ఐడియా...

గౌతమ్ తయారుచేసిన పుస్తకాన్ని గౌస్ కి ఇచ్చాడు... గౌస్ ఆ పుస్తకాన్ని తనకి బాగా నమ్మకమైన ఒక KABOOTAR (పావురం) కి ఇచ్చి న్యూఢిల్లీ లో ఎవరికి చేర్చాలో చెప్పాడు... ఆ పావురం ఆ పుస్తకాన్ని తీసుకొని అదే రోజు రాత్రి విమానం ఎక్కి న్యూఢిల్లీ చేరుకొని R&AW లో ఒక ఆఫీసర్ కి ఆ పుస్తకాన్ని ఇచ్చి వెనక్కి వచ్చేసాడు.

R&AW వాళ్లకి మొదట్లో ఆ పుస్తకం ఏమిటో అర్థం కాలేదు... దాన్ని ఎన్క్రిప్షన్ డిపార్ట్మెంట్ కి పంపారు... ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక సీనియర్ ఆఫీసర్ చదవడం మొదలు పెట్టాడు... పుస్తకం మొదట్లో రాసిన అక్నాలెడ్జ్మెంట్ చదవగానే అందులో కోడ్ అర్ధమయ్యింది... ఆ కోడ్ లో పొందు పరచిన కొన్ని నంబర్స్ ని గమనించాడు... ఆ పుస్తకం లో ఆ పేజెస్ వెతికాడు... ఏమి తెలియలేదు... ఎదో అనుమానం వచ్చి ఆ పేజీల కింద సిగరెట్ లైటర్ ని వెలిగించి చెక్ చేసాడు... అంతే... ఆయనకు ఎన్క్రిప్షన్ కీ దొరికింది... వెంటనే తన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న క్రిప్టోగ్రఫర్స్ అందరిని పిలిచి ఆ పుస్తకాన్ని నిలువునా చించి... అందరికి తలా 20 పేజెస్ ఇచ్చి... "ఈ పేజెస్ లో ఏ మెసేజ్ ఉందొ... నాకు ఇంకో రెండు గంటలలో తెలియాలి... ఆ మెసేజ్ ని డీకోడ్ చేయడానికి కావాల్సిన ఎన్క్రిప్షన్ కీ కూడా ఇందులో ఉంది" అంటూ వాళ్ళు ఎక్కడ సిగరెట్ లైటర్ తో చెక్ చెయ్యాలో చెప్పారు...

ఒక అయిదు గంటల తరువాత ఆ టీం... ఒక లిస్ట్ ని ఆ సీనియర్ ఆఫీసర్ కి ఇచ్చింది... అందులో చాలా పేర్లు ఉన్నాయి... ఆ పేర్ల తో పాటు కొన్ని మెసేజెస్ ఉన్నాయి... 1. ఆ లిస్ట్ లోని బ్యూరోక్రాట్స్ పేర్లు పాకిస్తాన్ లో సాజిద్ సంపాదించిన NOC LIST లో దొరికాయి... వాళ్ళ మీద నిఘా పెట్టాలి... 2. ఆ NOC LIST లో కొంత మంది ఇండియన్ పొలిటిషన్స్ పేర్లు కూడా దొరికాయి... ఆ పేర్లని రెండో పుస్తకం లో వ్రాసి పంపిస్తాము... 3. సాజిద్ ఇచ్చిన NOC LIST లో కొంతమంది ISI ఏజెంట్స్ పేర్లు ఉన్నాయి... వాటి ని పరిశీలిస్తున్నాము... 4. ఈ పుస్తకం లోని డీటెయిల్స్ మీకు అందితే...వరుసగా 3 రోజులు ప్రతిరోజూ రాత్రి సరిగ్గా ఇండియా టైం 9:15 నిమిషాలకి NDTV న్యూస్ మధ్యలో వాషింగ్ పౌడర్ నిర్మా పాత యాడ్ ని వెంట వెంటనే మూడు సార్లు చూపించండి... మీకు ఈ పుస్తకం అందిన విషయం మాకు తెలుస్తుంది... అప్పుడు మేము వెంటనే మీకు రెండో పుస్తకం పంపిస్తాము...

ఇది వినగానే ఆ సీనియర్ RAW ఆఫీసర్ అరగంట సేపు పడీపడీ నవ్వాడు... "NDTV కి ఇన్ఫోర్మ్ చెయ్యండి... ఇవ్వాల్టి నుంచి ప్రతి రోజూ రాత్రి సరిగ్గా 9:15 కి పాత నిర్మా యాడ్ ని మూడు రోజుల పాటు వెంట వెంటనే మూడు సార్లు వెయ్యమని చెప్పండి... వాళ్ళు ఒప్పుకోకపోతే... NDTV TRANSPONDER స్విచ్ ఆఫ్ చేస్తామని మర్యాదగా సర్దిచెప్పండి " అని అన్నాడు... R&AW భాషలో మర్యాదగా సర్ది చెప్పడమంటే... బెదిరించడం అని అర్థం...

ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తూ NDTV లో న్యూస్ చూస్తున్న మాధవ్ & గౌతమ్ కి సరిగ్గా 9:15 నిమిషాలకి వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ వెంట వెంటనే 3 సార్లు కనిపిచింది... ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు... " రెండో బుక్ ఎప్పుడు రెడీ అవుతుంది" అని అడిగాడు మాధవ్... "బైండింగ్ కి పంపాను... రాగానే చెక్ చేసి పంపుదాం... " అని గౌతమ్ అన్నాడు...

మరుసటి రోజు గౌస్ మియా రెండో పుస్తకాన్ని బైండర్ దగ్గరనుండి తీసుకొని వచ్చాడు... గౌతమ్ దాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసి ఇన్విజిబుల్ ఇంకు తో ఎన్క్రిప్షన్ కీ ని వేసి గౌస్ మియా కి ఇచ్చాడు. ఆ రోజు రాత్రి పావురం ఇంకోసారి గాల్లోకి ఎగిరింది... న్యూఢిల్లీ చేరుకొని ఇది వరకు మాదిరిగానే పుస్తకాన్ని R&AW ఆఫీసర్ కి ఇచ్చాడు...

R&AW టీం రెండో పుస్తకాన్ని మూడు గంటల్లో డీకోడ్ చేసి పూర్తి లిస్ట్ ని సీనియర్ ఆఫీసర్ కి ఇచ్చారు... ఆ లిస్ట్ లోని పేర్లని చూసి ఆ సీనియర్ ఆఫీసర్ ఖంగారు పడ్డాడు... ఆ లిస్ట్ లో సెంట్రల్ మరియు స్టేట్ లెవెల్లో ... రూలింగ్ మరియు అప్పోజిషన్ పార్టీలో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి... వెంటనే ఆ లిస్ట్ ని RAW డైరెక్టర్ కౌంటర్ ఇంటలిజెన్స్ కి చూపించాడు. డైరెక్టర్ ఆ లిస్ట్ ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసి...

డైరెక్టర్: లిస్ట్ గురించి ఎంతమందికి తెలుసు?"

సీనియర్ ఆఫీసర్: నాకు... నా టీం కి... దీన్ని పంపిన ఏజెంట్ కి తెలుసు...

డైరెక్టర్: మీ టీం లో అందరికి చెప్పండి... ఈ లిస్ట్ ని మీరు గాని... మీ టీం మెంబెర్స్ గాని ఈ జన్మలో చూడలేదు... THIS LIST DOES NOT EXIST ఈ లిస్ట్ ని నా దగ్గర వొదిలేయండి...ఈ లిస్ట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది?

సీనియర్ ఆఫీసర్: మన ఏజెంట్ సాజిద్ చాలా కాలంగా పాకిస్తాన్ లో అండర్ కవర్ లో పని చేస్తున్నాడు... అతని చేతికి ISI కి చెందిన ఏజెంట్స్ ఇండియా లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ సంపాదించాడు... సాజిద్ ని ఇండియా తేవడానికి ఆర్మీ నుంచి ఇద్దరు ఏజెంట్స్ వెళ్లారు... చనిపోయేముందు సాజిద్ ఈ లిస్ట్ ని మనవాళ్ళకి ఇచ్చాడు.

డైరెక్టర్: ఈ లిస్ట్ లో పేరు ఉన్నంత మాత్రాన మనం ప్రతి బ్యూరోక్రాట్... పొలిటిషన్ ని ఆబ్సెర్వేషన్ లో పెట్టలేము... పాకిస్తాన్ వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు మన పొలిటిషన్... బ్యూరోక్రాట్ పేర్లు ఈ లిస్ట్ లో పెట్టలేదని ఏమిటీ నమ్మకం? వాళ్ళని కన్ఫ్యూజ్ చెయ్యడానికి మనం కూడా ఇలాంటి పనులు చాలా చేసాము... కాబట్టి... ఈ లిస్ట్ ని అంత సీరియస్ గా తీసుకోవొద్దు... ఒక పని చెయ్యండి... ఈ లిస్ట్ ని IB కి ఇవ్వండి... వాళ్ళు ఎప్పుడూ మనం ఇంటలిజెన్స్ షేర్ చెయ్యమని మన మీద పడి ఏడుస్తారు... చూద్దాం వాళ్ళు ఈ లిస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తారో...

సీనియర్ ఆఫీసర్: OK సర్... నేను ఈ రెండు లిస్ట్స్ IB పంపిస్తాను... ఈ రాత్రి మన వాళ్లకి కన్ఫర్మేషన్ పంపిస్తాను...

డైరెక్టర్: ఈ మధ్య మీరు NDTV ని వాడుకున్నారని విన్నాను... నిజమేనా...

సీనియర్ ఆఫీసర్ : అవును... పాకిస్తాన్ లో మనవాళ్ళకి ఈ లిస్ట్స్ మనకి చేరాయని కన్ఫర్మేషన్ పంపడానికి NDTV ని వాడుకున్నాము...

డైరెక్టర్: DON'T SEND ANY MORE CONFIRMATIONS... THAT IS NOT OUR DUTY. DON'T USE MEDIA UNNECESSARILY...

సీనియర్ ఆఫీసర్ : OK సర్...


కరాచీ లో మాధవ్... గౌతమ్ ప్రతి రోజూ రాత్రి NDTV న్యూస్ చూడసాగారు... ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు... ఇద్దరికీ అనుమానం వచ్చింది... 1. గౌతమ్ పంపిన బుక్ R&AW కి అందలేదు... 2. R&AW కి బుక్ అందింది... వాళ్ళు కావాలని కన్ఫర్మేషన్ ఇవ్వలేదు...

గౌతమ్: ఇప్పుడు ఏమి చేద్దాం? మూడో బుక్ రెడీ గా ఉంది...

మాధవ్: నాకు ఏదో అనుమానం గా వుంది. ఎందుకైనా మంచిది... మూడో బుక్ పంపొద్దు...


ఇస్లామాబాద్ లో సైఫుద్దీన్ చాలా బిజీ గా ఉన్నాడు... ఒక రోజు రాత్రి తన డెస్క్ మీదున్న పేపర్లు చెక్ చేయ్యసాగాడు... వాటిలో కరాచీ పోలీసులు పంపిన మాధవ్... గౌతమ్ ల స్కెచెస్ ఉన్నాయి... ఏదో యధాలాపంగా వాటిని చూసి పక్కన పడేసి... ఇంటికి వెళ్లడానికి ఆఫీస్ లోంచి బయటికి వచ్చి కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు... గేర్ వేసి ముందుకు నడపబోతూ సడన్ గా బుర్రలో ఎదో ఫ్లాష్ రావడం తో కార్ కి బ్రేక్ వేసి ఇంజిన్ ఆఫ్ చేసి... డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగి... కార్ డోర్ వెయ్యకుండానే ఆఫీస్ లోకి పరిగెత్తుకుని వెళ్లి... కరాచీ పోలీసులు పంపిన స్కెచెస్ ని పరిశీలనగా చూసాడు... సైఫుద్దీన్ కళ్ళు పెద్దవయ్యాయి... చేతులు వణికాయి... ఒక్కసారిగా " OH... MY ... GOD..." అంటూ గట్టిగా అరుస్తూ తన టీం ని పిలిచి "ఈ స్కెచెస్ మనదగ్గరకి వచ్చి ఎన్నాళ్ళయింది?" అని గర్జించాడు... దానికి బదులుగా అతని టీం భయపడుతూ "చాలా రోజులయ్యింది..." అని అన్నారు... "వెంటనే మనం కరాచీ వెళ్ళాలి... బయలుదేరండి..." అంటూ ఇంటికి ఫోన్ చేసి "నేను పని మీద వెళ్తున్నాను... ఎప్పుడొస్తానో తెలియదు..." అని ఫోన్ పెట్టేసి తన టీం తీసుకొని ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు... దారిలో ఎవరికో ఫోన్ చేసి "JACKAL IS IN KARACHI... I NEED ADDITIONAL SUPPORT" అని చెప్పాడు... సైఫుద్దీన్ తన టీం తో ఎయిర్పోర్ట్ కి చేరేసరికి అక్కడ ఒక మిలిటరీ విమానం రెడీ గా ఉంది... అందరూ ఆ విమానం ఎక్కారు... విమానం గాల్లోకి లేవగానే సైఫుద్దీన్ మనసులో శపధం చేసుకున్నాడు... "ఈసారి నేను ఇస్లామాబాద్ కి జాకాల్ ని ప్రాణాలతో పట్టుకొని... లేదా చంపిగాని రాను"

కరాచీ చేరుకొని మరుసటి ఉదయం తన ఆఫీస్ కి సినిమా హాల్ పార్కింగ్ అసిస్టెంట్... కూల్ డ్రింక్ షాప్ ఓనర్... ఆటో డ్రైవర్ ని పిలిపించాడు... ముందుగా సినిమా హాల్ పార్కింగ్ అసిస్టెంట్ కి దాదాపు 20 ఫొటోస్ చూపించి "వీటిలో ఆ రోజు కార్ ని మీ సినిమా హాల్ లో పార్క్ చేసినవాడు ఉన్నాడా?" అని అడిగాడు... వాడు దాదాపు ఒక అరగంట సేపు ఆ ఫొటోస్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించి... ఒక ఫోటో చూపించి... "ఈ వ్యక్తి కి సంభందించిన ఫుల్ సైజు ఫోటో ఉందా??" అని అడిగాడు... సైఫుద్దీన్ ఆ వ్యక్తి కి సంభందించి తమ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ ని లాప్ టాప్ లో చూపించాడు... వాడు ఒక ఫోటో ని గుర్తు పట్టాడు... "ఆ రోజు కార్ పార్క్ చేసింది ఇతనే" అంటూ ఒక ఫోటో చూపించాడు... వాడిని పంపించి నెక్స్ట్ కూల్ డ్రింక్ షో ఓనర్ ని పిలిచాడు... వాడు కూడా ఒక ఫోటో ని చూపించాడు... చివరిగా ఆటో డ్రైవర్ ని పిలిచి ఫొటోస్ చూపించాడు... వాడు వెంటనే ఒక ఫోటో చూపించి "ఆరోజు నా ఆటో ఇద్దరు ఎక్కారు... వాళ్లలో ఒకడు వీడే" అంటూ ఒక ఫోటో చూపించాడు... సైఫుద్దీన్ వాళ్ళందరిని పంపించేశాడు... వాళ్ళు గుర్తు పట్టిన వ్యక్తి ఫోటో ని తన చేతిలోకి తీసుకొని... పళ్ళు కొరుకుతూ "మాధవ్... ఈసారి నువ్వు పాకిస్తాన్ నుంచి ప్రాణాలతో వెనక్కి పోలేవు" అని మనసులో అనుకున్నాడు... ఆ సమయంలో సైఫుద్దీన్ కి ఒక విషయం తెలియదు... ఈ సారి కూడా మాధవ్ ని పట్టుకోవడం లో అతి దారుణాతి దారుణంగా ఫెయిల్ కాబోతున్నాడు...


PART - 15 - THE SCRIPT

సైఫుద్దీన్ తన ఆఫీస్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు... 'మాధవ్ కరాచీ వచ్చాడు... మాధవ్ తో వచ్చింది ఎవరు? కొత్త ఏజెంట్ అయివుంటాడు... వాళ్ళు సాజిద్ కోసం వచ్చారా? సాజిద్ దగ్గర ఉన్న NOC ఫోల్డర్ మాధవ్ చేతికి చిక్కిందా? ఒకవేళ ఆ ఫోల్డర్ మాధవ్ చేతికి దొరికిందా? చేతికి NOC లిస్ట్ అందితే... ఇంకా కరాచీలో ఉంటాడా? ఈ పాటికి ఇండియా వెళ్ళిపోయి ఉంటాడు... ఒకవేళ ఇక్కడే ఉండి ఉంటే... దానికి ఎదో పెద్ద కారణం ఉండే ఉంటుంది... కరాచీ నుంచి బయట పడలేని పరిస్థితిలో ఉన్నాడా? మాధవ్... లేదా అతని తో పాటు వచ్చిన వాడికి ఏదైనా బలమైన గాయం అయ్యిందా? సాజిద్ చనిపోయి 20 రోజులయ్యింది... ఒకవేళ ఫోల్డర్ మాధవ్ కి చేరివుంటే... ఈ పాటికి ఇండియా లో ISI కి సహాయం చేస్తున్న బ్యూరోక్రాట్స్... పొలిటిషన్స్ ని అరెస్ట్ చేసి ఉండడమో... లేక సర్వైలన్సు లో పెట్టడమో జరిగేది... ప్రస్తుతానికి అలా ఏమి జరగలేదు. NOC లిస్ట్ లో ని ఏజెంట్స్ ని కాంటాక్ట్ చెయ్యడం కుదరదు... వాళ్ళంతట వాళ్ళే కాంటాక్ట్ చెయ్యాలి... ఏం జరిగి ఉంటుంది? మాధవ్ తన ఫ్రెండ్ తో కరాచీ లో ఉండి ఉంటే... ఎక్కడున్నారు? కరాచీ లాంటి పెద్ద నగరంలో ఎక్కడున్నాడని వెతకాలి? ఆయువు వాడు వాళ్ళని గుల్ మొహర్ కాలనీ లో డ్రాప్ చేసాడు... వాళ్ళు ఆ కాలనీ లోనే ఇన్నాళ్లు ఉన్నారని నమ్మకం ఏమిటీ? వాళ్ళ ప్లేస్ లో నేనుంటే... ఒకరోజు గడిపిన చోట ఇంకో రోజు ఉండను... మాధవ్ కూడా ఇదే పని చేస్తాడు... ఇంకోసారి ఆటో డ్రైవర్ తో మాట్లాడాలి' అని అనుకోని వెంటనే ఆ ఆటో డ్రైవర్ ని పిలిచి "ఆరోజు నువ్వు గుల్ మొహర్ కాలనీ లో డ్రాప్ చేసినప్పుడు... వాళ్ళ పరిస్థితి ఎలావుందీ? ఇద్దరూ ఆరోగ్యం గా ఉన్నారా... లేక ఆ ఇద్దరిలో ఎవరికైనా దెబ్బలు తగిలినట్లు కనిపించారా?" అని అడిగాడు... దానికి బదులుగా ఆ ఆటో డ్రైవర్ "ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు... ఆటో దిగి మామూలుగానే నడుచుకుంటూ వెళ్లారు... వాళ్లకి ఎటువంటి దెబ్బలు తగలలేదు... పైగా ఆటో లో వాళ్ళు ఇద్దరూ కాశ్మీరీ భాషలో మామూలుగా మాట్లాడుతూ... వాళ్లలో ఒకడు 'త్వరలో ఇస్లామాబాద్ వెళ్లి జెహాంగీర్ ని కలవాలి' అని అంటుండగా విన్నాను...." అని అన్నాడు... సైఫుద్దీన్ వాడిని పంపి ఆలోచించసాగాడు...

"మాధవ్ ఆటో లో కావాలనే ఇస్లామాబాద్... జెహాంగీర్ ని కలవాలని అన్నాడా?? మాధవ్ కి తెలుసు పోలీసులు తప్పకుండా ఆటో డ్రైవర్ ని క్వశ్చన్ చేస్తారని... ఆటో డ్రైవర్ చెప్పింది విని అందరూ ఇస్లామాబాద్ వెళ్లేలా ఒక DECOY ని సృష్టించి ఉంటాడు... ఆటో లో కావాలనే కాశ్మీరీ భాషలో మాట్లాడాడా? మాధవ్ ని నమ్మడానికి లేదు... వాడు గుండెలు తీసిన బంటు... ఇప్పుడు ఏమి చెయ్యాలి?" అని మధన పడసాగాడు... సైఫుద్దీన్ కి మాధవ్ గురించి బాగా తెలుసు... ఒకసారి ఢిల్లీ లో చాలా కస్టపడి మాధవ్ మొబైల్ ఫోన్ ని టాప్ చేసాడు... అలా చెయ్యడం వల్ల పెద్ద ప్రయోజనం లేకపోగా... చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ అయ్యింది...

మాధవ్ తన మొబైల్ ఫోన్ ని ఇంకో మూడు హ్యాండ్ సెట్స్ తో క్లోన్ చేసాడు... ఆ మొబైల్ ఫోన్స్ ని ఒక్కోదాన్ని ఒక్కోచోట పెట్టాడు... ఆ ఫోన్స్ ని పాడ్డింగ్ ఉన్న ఇన్వెలోప్స్ లో పెట్టి మూడు లొకేషన్స్ కి కొరియర్ చేసాడు... ఎవరైనా తన ఫోన్ ని హాక్ చేస్తే... వాళ్లకి మూడు లొకేషన్స్ కనిపిస్తాయి... మాధవ్ మొబైల్ ని హాక్ చేసిన సైఫుద్దీన్ కి మూడు లొకేషన్స్ కనిపించాయి... లొకేషన్ నెంబర్#1... ముంబయి... లొకేషన్ నెంబర్ 2#... లద్హఖ్ లొకేషన్ నెంబర్ 3#... లాహోర్... మాధవ్ చాలా తెలివైన వాడు... అందుకే ఎవరికీ దొరకకుండా తప్పించుకుంటున్నారు... ఇప్పుడు ఎక్కడున్నారు? ఎలా పట్టుకోవాలి? ఏది ముఖ్యం? మాధవ్ ని ప్రాణాలతో పట్టుకోవడం? లేక చంపడమా?? చంపితే పెద్దగా ప్రయోజనం ఉండదు... తాను ఎంతో మందిని చంపాడు... వాళ్లలో మాధవ్ ఒకరు అవుతాడు. ... ప్రాణాలతో పట్టుకుంటే ISI లో తాను ఒక పెద్ద హీరో అవుతాడు... మాధవ్ ని విపరీతంగా హింసించే అవకాశం దొరుకుతుంది... సైఫుద్దీన్ చివరికి మాధవ్... అతని ఫ్రెండ్ ని ప్రాణాలతో పట్టుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో తీసుకున్న ఆ నిర్ణయమే సైఫుద్దీన్ కి పెద్ద తలకాయ నొప్పి తెచ్చి పెడుతుందని తెలియదు...

సైఫుద్దీన్ ముందుగా ఇండియా లో పనిచేస్తున్న ISI ఫీల్డ్ ఆపరేటివ్ ని కాంటాక్ట్ చేసి తమకి సహకరిస్తున్న పొలిటిషన్స్... బ్యూరోక్రాట్స్ ని జాగ్రత్తగా ఉండమని... ఏదైనా డౌట్ వస్తే వెంటనే తమకు ఇన్ఫోర్మ్ చేయమని చెప్పారు...


సరిగ్గా అదే సమయానికి మాధవ్ కూడా తన పోసిషన్ ని అంచనా వేసుకుంటున్నాడు... 'సైఫ్ దగ్గర వెతకడానికి చాలా మంది ఉన్నారు అది వాడి STRENGTH... నేను కరాచీ లో ఫ్రీ గా కదలలేను... అది నా WEAKNESS... నా దగ్గర NOC లిస్ట్ ఉంది... అది నా STRENGTH... ఆ లిస్ట్ చేతికి దొరికే దాకా సైఫ్ తనని చంపలేడు... అది వాడి WEAKNESS... NOC లిస్ట్ ని చాలా జాగ్రతగా దాచాలి... ఇండియన్ ఎంబసీ కి వెళ్లడం కుదరదు... అక్కడ చాలా మంది పోలీసులు కాపలా కాస్తూ ఉంటారు... చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం... ఎంబసీ బయట అందరూ చూస్తుండగా నిర్దాక్షిణ్యంగా కాల్చేసి NOC లిస్ట్ తీసుకొని వెళ్ళగలరు... పైగా ఇండియా కి పంపిన రెండో బుక్ అందిందో లేదో కన్ఫర్మేషన్ రాలేదు... మూడో బుక్ పంపాలా... వొద్దా... సైఫ్ కి తాను ఎలావుంటాడో తెలుసు... గౌతమ్ ఎవరు? ఎలా ఉంటాడో తెలియదు... దీన్ని ఎలా వాడుకోవాలి...' అని మనసులో ఆలోచించసాగాడు...

గౌతమ్: ఏమీ ఆలోచిస్తున్నారు? మన నెక్స్ట్ ఆక్షన్ ప్లాన్ ఏమిటీ? ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి?

మాధవ్: అదే కన్ఫ్యూజ్ గా ఉంది... రెండో బుక్ కి కన్ఫర్మేషన్ రాలేదు... సైఫ్ ఊరంతా కార్డాన్ ఆఫ్ చేసేసాడు... ఈ ఫోల్డర్ కోసం వాడు ఏమైనా చెయ్యగలడు... ఈ ఫోల్డర్ మనకి చాలా అవసరం... దీన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఎలా ఇండియా తీసుకొని వెళ్ళాలి?

గౌతమ్: ఫోల్డర్ లో మొత్తం 575 పేజెస్ ఉన్నాయి... ఫీల్డ్ ఆపరేటివ్స్ రియల్ నేమ్స్... కోడ్ నేమ్స్... లొకేషన్స్... వాళ్ళగురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి... వీళ్ళలో ఎక్కువ భాగం అంటే దాదాపు 67% ఆపరేటివ్స్ ముంబాయి... ఢిల్లీ... కలకత్తా... పూణే... బెంగళూర్... హైదరాబాద్... ఉత్తరప్రదేశ్... లో ఉన్నారు... మనం వీళ్ళని బాగా స్టడీ చెయ్యాలి... అంటే దాదాపు 50 మంది మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలి... వీళ్ళ బయో డేటా పూర్తిగా స్టడీ చేదాం... వాళ్ళ గురించి ఫోల్డర్ ఏ ఏ డీటెయిల్స్ ఉన్నాయో బాగా కఠస్తం చేదాం... ఆ తరువాత ఈ ఫోల్డర్ ని ఎక్కడైనా సేఫ్ దాచేసి ఇండియా వెళ్ళిపోదాం...

మాధవ్: ఈ ఐడియా బాగుంది... నువ్వు ఒక 25 మంది డీటెయిల్స్ బాగా స్టడీ చెయ్యి... నేను ఇంకో 25 మంది ని స్టడీ చేస్తాను... మెమొరీ రిటెన్షన్ చెక్ చేసుకుందాం... ముందుగా బయట వాతావరణం ఎలా ఉందొ గౌస్ మియా ని చెక్ చెయ్యమని చెప్తాను...

గౌస్ మియా తన కాంటాక్ట్స్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏమి జరుగుతుంది కనుక్కున్నాడు... వాతావరణం చాలా గంభీరంగా ఉంది... గుల్ మొహర్ కాలనీ లో హౌస్ టు హౌస్ సెర్చ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు... పాకిస్తాన్ ఓటర్ లిస్ట్... రేషన్ కార్డు డేటా ని స్టడీ చేస్తున్నారు... పెద్ద పెద్ద కాలనీ లో వెతకాలని డిసైడ్ అయ్యారు...

మాధవ్: మనకి ఎక్కువు టైం లేదు... వేరే సేఫ్ హౌస్ కి వెళ్ళాలి... మనం అంత తొందరగా ఇక్కడనుంచి బయటపడలేము...

గౌతమ్: ఇంచు మించు ఎంత కాలం ఉండాలి?

మాధవ్: కనీసం ఇంకో రెండు నెలలు...

గౌతమ్: వెరీ గుడ్... అదే మనకి కావాలి... నా దగ్గర ఒక ప్లాన్ ఉంది...

గౌతమ్ తన మనసులో వున్నా ప్లాన్ ని చాలా డిటైల్డ్ గా మాధవ్ కి చెప్పాడు... అది విన్న వెంటనే మాధవ్ ముందు ఖంగారు పడ్డాడు... ఆ తరువాత తేరుకొని బాగా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యి " కమాన్... లెట్స్ డో ఇట్... నీలాంటి వాడు నాకు దొరకడం నా అదృష్టం... నేను ఇలాంటిది ఇప్పటిదాకా ఎక్కడా వినలేదు... ఆ ఫోల్డర్ లో ఉన్న డేటా ని సేఫ్ గా ఇండియా తీసుకెళ్లడానికి ఇదే సరైన మార్గం... నీకు ఏమేమి కావాలో చెప్పు వెంటనే తెప్పిస్తాను... " అని అన్నాడు... గౌతమ్ వెంటనే ఒక లిస్ట్ మాధవ్ చేతిలో పెట్టాడు... మాధవ్ ఆ లిస్ట్ ని చదివాడు... సగం అర్ధమయ్యింది... మిగతా ఐటమ్స్ గురించి ఎప్పుడూ వినలేదు... ఆ లిస్ట్ ని గౌస్ మియా కి ఇచ్చాడు... గౌస్ మియా ఆ లిస్ట్ ని చాలా జాగ్రత్తగా చదువుకొని... నవ్వుకుంటూ... "ఇవన్నీ ఆరెంజ్ చెయ్యడానికి ఒక వారం పడుతుంది... కొన్ని ఐటమ్స్ దుబాయ్... అబూ దాబి నుంచి తెప్పించాలి... కరాచీ లో దొరకకపోవొచ్చు... " అని అన్నాడు...

ఆ వారం రోజులు మాధవ్... గౌతమ్... ఫోల్డర్ ని పూర్తిగా స్టడీ చేశారు... ఆ ఫోల్డర్ ని ఆరు భాగాలుగా విభజించారు... 1.పొలిటిషన్స్ 2. బ్యూరోక్రాట్స్... 3. NOC ఆపరేటివ్స్... 4. లొకేషన్స్... 5. లోకల్ పోలీస్ డీటెయిల్స్... 6. NOC ఆపరేటివ్స్ గురించిన సెన్సిటివ్ ఇన్ఫోర్మేషన్... పొలిటిషన్స్... బ్యూరోక్రాట్ డేటా RAW కి చేరిందని తెలిసింది... ఆ రెండిటిని పక్కన పెట్టేసారు... NOC ఆపరేటివ్స్ లో 50 మందికి చెందిన డేటా ని చెరో 25 మందిని పంచుకొని బాగా బట్టి కొట్టారు... చిన్న పిల్లలు స్కూల్ లో పాఠాన్ని ఒకరికొకరు అప్పచెప్పుకున్నట్లు మాధవ్... గౌతమ్... తాము స్టడీ చేసిన డేటా ని ఒకరినొకరు ప్రశ్నలు వేసుకొని చెక్ చేసుకున్నారు.

ఒకరోజు గౌతమ్... మాధవ్ తో "ఈ డీటెయిల్స్ చూస్తూంటే... హైదరాబాద్... ముంబాయి... ఢిల్లీ... కలకత్తా లో ఎదో జరగబోతోందని అనుమానంగా వుంది... ఈ NOC లిస్ట్ లోని ఆపరేటివ్స్ అందరూ వెపన్స్... IED లు (IMPROVISED EXPLOSIVE DEVICES) తయారుచేసి వాడడం లో ఎక్స్పర్ట్స్ లాగా ఉన్నారు... అందరూ బాగా చదువుకున్న వాళ్ళు... వీళ్ళకి లోకల్ సపోర్ట్ కూడా ఉంది... మనం ఎంత తొందరగా ఇండియా చేరుకుంటే అంత మంచిది..." అని అన్నాడు... మాధవ్ మౌనంగా తలూపాడు... గౌతమ్ ఇచ్చిన లిస్ట్ లోని ఐటమ్స్ ని ఆరెంజ్ చెయ్యడానికి గౌస్ మియా కి 15 రోజులు పట్టింది... గౌతమ్ వాటిని చాలా జాగ్రత్తగా చెక్ చేసాడు... చాలా మటుకు రకరకాల ఇంకులు... బాగా పదునైన రకరకాల పెన్నులు... కాలిగ్రఫీ కి పనికి వచ్చే పెన్నులు... వాటికి సరిపోయే పాళీలు... చాలా పదునైన స్ట్రెయిట్ ఎడ్జ్ షేవింగ్ బ్లెడ్స్... షేవింగ్ క్రీమ్స్... అంటి సెప్టిక్ లోషన్స్... బ్యాండేజ్ గాజ్... కాటన్ బాల్స్... అప్పటికే గౌతమ్ రెండు లిస్ట్స్ తయారుచేసాడు... 1. NOC లిస్ట్ లోని ఏజెంట్స్ రియల్ నేమ్స్... కోడ్ నేమ్స్ -- వీటిని ఒక స్పెషల్ CRYPTOCODE తయారుచేసి 72 మంది REAL NAMES... వాళ్ళ కోడ్ నేమ్స్ ని కోడ్ చేసాడు... మొత్తం 144 కోడ్స్ రెడీ అయ్యాయి... 2. ఇండియా లో లొకేషన్ కోఆర్డినెట్స్ ని కూడా స్పెషల్ కోడ్ లో ఎన్క్రిప్టు చేసాడు... ఉదాహరణకి...

హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా లొకేషన్ కోఆర్డినెట్స్ ----> 17.4097 78.4486

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లొకేషన్ --------------- > 17.4279 78.3392

న్యూ ఢిల్లీ లో కనౌట్ సర్కస్ లొకేషన్ --------------------- > 28.6444 77.2197

ముంబాయి లోని గేట్ వే అఫ్ ఇండియా లొకేషన్ ------> 18.9239 72.8334

ఈ లొకేషన్ కోడ్ లో మొదటి భాగాన్ని లాటిట్యూడ్ అంటారు... రెండో భాగాన్ని లాంగిట్యూడ్ అంటారు... లాటిట్యూడ్ గ్రీన్విచ్ లోని ప్రైమ్ మెరిడియన్ ఆధారం లెక్కిస్తుంది... లాటిట్యూడ్ భూమధ్య రేఖ ఆధారం చేసుకొని పనిచేస్తుంది... భూమధ్య రేఖ పైనున్న ఏరియా ని నార్తర్న్ హెంస్పెయర్ అంటారు... భూమధ్య రేఖ కి దిగువ భాగాన్ని సథరన్ హెంస్పెయర్ అంటారు... భూమి మీద ప్రతి అడ్రస్ కి ఒక జియో లొకేషన్ ఉంటుంది... గౌతమ్ తనకి దొరికిన NOC లిస్ట్ లోని ఆపరేటివ్ అడ్రసులని ముందుగా గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేసి వాళ్ళ కరెక్ట్ జియో లొకేషన్ ని గుర్తించాడు... ఆ తరువాత ఆ జియో లొకేషన్ ని క్రిప్టోగ్రఫీ వాడి ఎన్క్రిప్టు చేసాడు... మొత్తం 72 మంది అడ్రసులు ఎన్క్రిప్టు చేసాడు...

గౌతమ్ ఒకరోజు ఉదయం లేచి ముందుగా గౌస్ మియా తెచ్చిన రకరకాల ఇంకులు చాలా జాగ్రత్తగా కలిపి... వాటికి కొన్ని కెమికల్స్ ని కూడా జతకలిపి ఒక కొత్త రకమైన ఇంకుని తయారుచేసాడు... ఆ తరువాత మాధవ్ ని ఒక స్టూల్ మీద కూర్చోపెట్టి... అతని తలమీద వెంట్రుకలని పూర్తిగా తీసేసి చాలా నున్నగా గుండు చేసాడు... ఆ తరువాత కెమికల్స్ ని చాలా జాగ్రతగా ఒక ప్లాస్టిక్ బ్రష్ వాడి మాధవ్ గుండుకి పట్టించాడు... ఆ కెమికల్ ఆరగానే... కాలిగ్రఫీ పెన్ను తీసుకొని మాధవ్ గుండు మీద NOC లిస్ట్ లో దొరికిన ఆపరేటివ్స్ రియల్ నేమ్స్... కోడ్ నేమ్స్ ని చాలా జాగ్రత్తగా ఎక్కడా తప్పులు లేకుండా కాలిగ్రఫీ పెన్ కి పదునైన పాళీ ని అమర్చి దాదాపు 4 గంటల సేపు కష్టపడి ప్రతిఒక్క పేరు ని వ్రాసాడు... ఆ తరువాత గౌతమ్ ని అదే స్టూల్ మీద కూర్చోపెట్టి మాధవ్ అతని కి తల మీదవెంట్రుకలు పూర్తిగా తీసేసి గౌతమ్ ఏవిధంగానైతే మాధవ్ తలమీద ఆపరేటివ్స్ పేర్లు వ్రాశాడో... అదే విధం మాధవ్ కూడా గౌతమ్ తలమీద ఆపరేటివ్స్ కి సంభందించిన ఎన్క్రిప్టు చెయ్యబడిన జియో కోఆర్డినెట్స్ ని తప్పులు లేకుండా వ్రాసాడు...

మాధవ్: ఈ ఇంకు ఆరడానికి ఎంత సమయం పడుతుంది...

గౌతమ్: దాదాపు 6 గంటలు పడుతుంది... బాగా ఆరిపోయిన తరువాత గుండు మీద వ్రాసిన కెమికల్స్ వల్ల మనకి చెమట పట్టినా... లేదా మనం తల మీద షాంపూ వేసి స్నానం చేసినా మన తల మీద రాసిన కోడ్ చెరిగిపోదు... కనీసం 3 సంవత్సరాలు ఆ ఇంకు చెక్కుచెదరకుండా ఉంటుంది... మన తలమీద జుట్టు పెరిగితే మనం వ్రాసుకున్న ఈ కోడ్స్ ఎవరికి కనిపించవు... ఇది నేను స్పెషల్ కనిపెట్టలేదు... క్రీస్తు పూర్వం గ్రీస్ లో ఒక రాజు ఉండేవాడు... ఆయన పేరు హేరోడోటస్... ఆయన రహస్య సందేశాలు పంపడానికి తన సైనికుడి ఇలాగే గూడు గీసి ఆ గుండు మీద పచ్చ బొట్టు తో మెసేజ్ వ్రాసి... ఆ సైనికుడికి జుట్టు పెరిగాక ఆ మెసేజ్ ని డెలివరీ చెయ్యడానికి పంపేవాడు... ఆ సైనికుడు చేరవలసిన చోటికి చేరగానే అక్కడ వాళ్ళు ఆ సైనికుడికి మళ్ళీ గుండు గీసి అతని తల మీదున్న మెసేజ్ చదువుకునేవాళ్ళు... ఇలా చెయ్యడం వల్ల రహస్య సందేశాలు చాలా జాగ్రతగా చేరాల్సిన చోటుకి చేరేవి... మనం తల మీద జుట్టు మొలిచే దాకా జాగ్రత్తగా ఉండాలి...

మాధవ్: అవును... ఇప్పుడు మనం ఆ ఫోల్డర్ ని ఇక్కడే పాకిస్తాన్ లో జాగ్రత్తగా దాచేసి వెళ్ళాలి...

గౌతమ్: ఆ ఫోల్డర్ ని దాచడానికి సరైన ప్లేస్ ఏదైనా ఐడియా ఉందా...

మాధవ్: ఒక ప్లేస్ ఉంది...

గౌతమ్: ఎక్కడా?

మాధవ్: కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రికార్డు రూమ్... అక్కడ రికార్డు రూమ్ ఇంచార్జి నాకు బాగా తెలుసు... వాడికి డబ్బులు ఇచ్చి ఈ ఫోల్డర్ ని పాత రికార్డ్స్ తో పాటు జాగ్రత్తగా పెట్టమని చెప్తాను... వాడు ఎక్కడ దాచింది డీటెయిల్స్ నాకు ఇస్తాడు... మనకి కావలసి వచ్చినప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి ఆ ఫోల్డర్ ని తీసుకోవొచ్చు... సైఫుద్దీన్ ఆ ఫోల్డర్ కోసం దేశమంతా జల్లెడ పడతాడు... పోలీస్ రికార్డు రూమ్ ని వెతకాలని ఐడియా రాదు...

గౌతమ్: ఒకవేళ సైఫ్ కి కాకుండా వేరే వాళ్లకి ఆ ఫోల్డర్ దొరికితే??

మాధవ్: నో ప్రాబ్లెమ్... ఆ ఫోల్డర్ లోని ఇన్ఫర్మేషన్ నీదగ్గర... నాదగ్గర... RAW... దగ్గర ఆల్రెడీ ఉంది కదా... ఆ ఫోల్డర్ ని మనం చేతితో పట్టుకొని తిరగాల్సిన పనిలేదు... నాకు ఆ ఫోల్డర్ ని తగల పెట్టడం ఇష్టం లేదు... చాలా ఇన్ఫర్మేషన్ వుంది... ఎదో ఒక రోజు ఆ ఫోల్డర్ ని వెనక్కి తీసుకుందాం...

వారం రోజులు గడిచాయి... ఒక రోజు గౌస్ మియా హడావిడిగా షాప్ నుంచి వచ్చి "పోలీస్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వ్యక్తి త్వరలో గుల్ మొహర్ కాలనీ తో పాటు ఇంకో 3 చోట్ల హౌస్ టు హౌస్ సెర్చ్ చేయబోతున్నారు... మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు... వేరే చోటుకి వెళ్ళండి... లేకపోతే నాకు కూడా ప్రాబ్లెమ్ అవుతుంది." అని అన్నాడు..

మాధవ్ వెంటనే బయటకి వెళ్లి పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఒక ఫోన్ కాల్ చేసి "మై ముసాఫిర్ హూన్... రహానే కేలియే జాగా చాహియే" అని అన్నాడు... అవతలి వ్యక్తి "ముష్కిల్ హై... జాగా నహి" అని అన్నాడు... మాధవ్ ఫోన్ పెట్టేసి... వేరే పబ్లిక్ బూత్ కెళ్ళి ఇంకో ఫోన్ చేసాడు... అక్కడ కూడా ఖాళీలు లేవని జవాబు వచ్చింది... "ఖాళీ లేదు" అంటే... వాళ్ళ మీద పోలీస్ నిఘా ఉన్నదని అర్ధం. మాధవ్ ఒక టీ స్టాల్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచించాడు... ఎదో ప్రాబ్లెమ్ వచ్చింది... సైఫుద్దీన్ కరాచీ మొత్తాన్ని అష్టదిగ్భందనం చేస్తున్నాడు... ఎక్కడ ఉండాలి? తల మీద ఒత్తుగా జుట్టు పెరగడానికి కనీసం ఇంకో 3 వారాలు టైం కావాలి... లేకపోతే బయట ఫ్రీ గా తిరగడం కుదరదు... ఈ మూడు వారాలు ఎలా గడపాలి? కరాచీ ఫిషింగ్ డాక్స్ కి చేరుకుంటే చాలు... అక్కడ నుంచి ముంబాయి కి చేరుకోవచ్చు... కానీ... అక్కడి దాకా ఎలా వెళ్ళాలి? దూరం పెద్దగా లేకపోయినా ఫిషింగ్ డాక్స్ చేరుకోవడం ఎలా? ఆలోచిస్తూ గౌస్ మియా ఇంటికి చేరుకున్నాడు... గౌస్ మియా ఇల్లు ఇంకో 100 మీటర్స్ ఉండగా మాధవ్ కి ఒక ఐడియా వచ్చింది... వెంటనే వెనక్కి మార్కెట్ కి వెళ్లి ముందుగా ఫిషరీస్ డాక్స్ లో బోట్ ఓనర్ కి ఫోన్ చేసాడు... రెండో ఫోన్ కరాచీ పోలీస్ డిపార్ట్మెంట్ లో రికార్డు రూమ్ ఇంచార్జి కి ఫోన్ చేసి ఇంటికి వెళ్తూ 'ఈ ప్లాన్ బాగుంది... ఇండియా సేఫ్ గా చేరుకోవొచ్చు...' అని అనుకుంటూ ఇంటికి చేరుకొని గౌస్ మియా తో "గుల్ మొహర్ కాలనీ లో రైడ్ ఎప్పుడు జరగ బోతోందో కనుక్కోండి... అదే రోజు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము... నీకేమి ప్రాబ్లెమ్ రాదు." అని అన్నాడు...

అప్పటినుంచి నుంచి ప్రతి క్షణం మాధవ్... గౌతమ్ ఇద్దరు కరాచీ సిటీ మ్యాప్ ని క్షుణ్ణంగా స్టడీ చేశారు... గుల్ మొహర్ కాలనీ నుంచి ఫిషరీస్ డాక్స్ కి చేరుకోవడానికి షార్ట్ కట్ దారులన్నీ వెతికారు... చివరికి రెండు రూట్స్ ఫైనలైజ్ చేశారు... ఒక రోజు రాత్రి గౌస్ మియా షాప్ నుంచి వచ్చి "రేపు ఈ కాలనీ లో రైడ్ జరగబోతోంది... " అని అన్నాడు. ఆ క్షణం నుంచి మాధవ్... గౌతమ్ ఇద్దరూ కలసి ఆ వాళ్ళు ఇన్నాళ్లు ఉన్న రూమ్ ని పూర్తిగా క్లీన్ చేశారు... వాళ్ళు అక్కడున్న ఆనవాళ్లు ఒక్కటి కూడా లేకుండా చూసుకున్నారు... ఆ రోజు రానే వచ్చింది... ఆ రోజు ఉదయం మాధవ్ " గౌతమ్... నీకు చెప్పింది గుర్తుందిగా... మిస్టేక్ జరగడానికి వీలు లేదు... మన డెస్టినేషన్ ఫిషరీస్ డాక్స్... ఇవ్వాళా మధ్యాన్నం 3 గంటలకి ఫిషింగ్ ట్రాలర్ బయలుదేరుతుంది... అది ఎక్కి మనం వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాలి... బీ కేర్ఫుల్..." అని అన్నాడు...

మరుసటి రోజు ఉదయాన్నే హౌస్ టు హౌస్ సెర్చ్ మొదలయ్యింది... సరిగ్గా ఉదయం 11 గంటల సమయం లో ముందుగా గౌతమ్ గౌస్ మియా కి థాంక్స్ చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు... దానికో కారణం ఉంది... సైఫుద్దీన్ టీం కి మాధవ్ ఎలా ఉంటాడో తెలుసు... గౌతమ్ ఎలా ఉంటాడో తెలియదు... అందుకే ఇద్దరూ కలసి వెళ్లకుండా విడి విడిగా వేరు వేరు మార్గాలలో కరాచీ ఫిషరీస్ డాక్స్ చేరుకోవాలని ప్లాన్ చేశారు. గౌతమ్ వెళ్లిన 10 నిమిషాలకి మాధవ్ చివరిసారిగా గౌస్ మియా కి గుడ్ బాయ్ చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు... అప్పటికే గౌతమ్ పోలీసులు ఏర్పాటు చేసిన పికెట్ దాటుకొని మెయిన్ రోడ్ చేరుకొని కనిపించిన సిటీ బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు...

మాధవ్ నెమ్మదిగా నడుచుకుంటూ పోలీస్ పికెట్ చేరుకున్నాడు... అక్కడ సైఫుద్దీన్ ఒక కార్ ముందు సీట్ లో కూర్చొని వచ్చే పోయే వాళ్ళని జాగ్రత్తగా అబ్సర్వ్ చేస్తున్నాడు... మాధవ్ కావాలనే ఆ కార్ ముందు ఆగి చేతిలోని ఫోల్డర్ ని సైఫుద్దీన్ కి కనిపించేలా గాల్లో ఊపి ఒక్క ఉదుటున పరిగెత్తాడు... అది గమనించిన సైఫుద్దీన్ గట్టిగా అరుస్తూ కార్ దిగి తన టీం కి మాధవ్ వెళ్లిన దారి చూపిస్తూ "మాధవ్ మెయిన్ రోడ్ వైపు పరిగెత్తాడు... వాడిని ఫాలో అవ్వండి... ఎట్టి పరిస్థితిలో వొదలకండి... ప్రాణాలతో పట్టుకోండి" అని అన్నాడు... కొంత మంది పరిగెత్తారు... సైఫుద్దీన్ కొంత మందిని తీసుకొని వెహికిల్స్ లో వెళ్ళాడు...

మాధవ్ వెనకాల పరిగెత్తిన వాళ్లకి మాధవ్ మెయిన్ రోడ్ కి చేరడం... అక్కడ రోడ్ మధ్యలో ఉన్న 5 అడుగుల రోడ్ డివైడర్ ని అవలీలగా దూకి రోడ్ కి అవతలివైపు అప్పుడే బయలుదేరిన సిటీ బస్సు వెనకాల పరిగెత్తడం గమనించారు... అదే సమయానికి సైఫుద్దీన్ మెయిన్ రోడ్ చేరుకున్నాడు... మాధవ్ ని ఛేజ్ చేసిన పోలీసులు ఖంగారుగా "వాడు రోడ్ అవతల కి వెళ్లి అటుగా వెళ్తున్న సిటీ బస్సు ఎక్కాడు..." అని అన్నారు... అంతే... ముందు వెనక ఆలోచించకుండా సైఫుద్దీన్ తన వెహికల్ ని రాంగ్ రూట్ లో పరిగెత్తిస్తూ అప్పటికే ఒక కిలోమీటర్ వెళ్లిన సిటీ బస్సు ని ఛేజ్ చెయ్యసాగాడు... సైఫుద్దీన్ మైండ్ పనిచెయ్యడం లేదు... అతని ద్రుష్టి అంతా ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్న బస్సు మీద ఉన్నది...

కరాచీ పోలీసులకి మాధవ్ రోడ్ డివైడర్ ని దూకి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్న బస్సు వెనకాల పరిగెత్తడం మాత్రమే చూసారు... కానీ... మాధవ్ బస్సు వెనకాల 200 మీటర్స్ పరిగెత్తి బస్సు ఎక్కకుండా రోడ్ కి అటుపక్కనున్న ఒక టీ షాప్ లోకి వెళ్లడం ఎవరూ చూడలేదు... అప్పటికే పోలీస్ రికార్డ్స్ రూమ్ ఇంచార్జి వచ్చి మాధవ్ కోసం వెయిట్ చేస్తున్నాడు... మాధవ్ వెళ్లి అతని ముందు కూర్చొని తన చేతిలోని ఫోల్డర్ అతని కి ఇచ్చి... "నీకు డబ్బులు అందాయి కదా... ఈ ఫోల్డర్ ని బాగా పాత రికార్డ్స్ లో భద్రం గా పెట్టు... నీకు ఒక వారం రోజుల తరువాత ఒక ఫోన్ కాల్ వస్తుంది... ఈ ఫోల్డర్ ని ఎక్కడ పెట్టావో ఆ డీటెయిల్స్ ని నీకు ఫోన్ చేసినవాడికి ఇవ్వు" అని చెప్పి రికార్డు రూమ్ ఇంచార్జి రిప్లై కోసం వెయిట్ చెయ్యకుండా ఆ టీ షాప్ వెనక డోర్ నుంచి బయటకి వచ్చి... సందులు దాటుకుంటూ వెళ్ళసాగాడు...

పోలీస్ రికార్డ్స్ రూమ్ ఇంచార్జి మాధవ్ ఇచ్చిన ఫోల్డర్ ని తనతో పాటు తెచ్చుకున్న బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని టీ నెమ్మదిగా తాగి... బయటకి వచ్చి... స్కూటర్ ఎక్కి తన ఆఫీస్ కి వెళ్ళాడు...

సైఫుద్దీన్ రెండు కిలోమీటర్స్ వెళ్లి తన వెహికల్ ని ఆ సిటీ బస్సు ముందు ఆపాడు... సరిగ్గా అదేసమయానికి అతను టీం కూడా అక్కడికి చేరి సిటీ బస్సు ని చుట్టూ ముట్టి బస్సు లోంచి ఎవరూ దిగకుండా కవర్ చేశారు... సైఫుద్దీన్ బస్సు ఫ్రంట్ డోర్ దగ్గర నుంచొని బస్సు కండక్టర్ తో " బస్సు లోంచి ఒక్కొక్కలని కిందకి పంపు" అన్నాడు... బస్సు నిండా జనాలు ఉన్నారు... ఒక్కొక్కళ్ళుగా కిందకి వస్తున్న వాళ్ళని సైఫుద్దీన్ చెక్ చేయ్యసాగాడు... దాదాపు గంట తరువాత నెమ్మదిగా బస్సు మొత్తం ఖాళి అయ్యింది... మాధవ్ జాడ కనిపించలేదు... సైఫుద్దీన్ స్టన్ అయ్యాడు... మాధవ్ ఎక్కడ? తన టీం వాడు ఈ బస్సు ఎక్కడని చెప్పారు... మాధవ్ బస్సు లో లేడు... సైఫుద్దీన్ తన టీం బండ బూతులు తిట్టి తన వెహికల్ దగ్గరకి వెళ్లి బస్సు స్టాండ్... రైల్వే స్టేషన్... ఎయిర్పోర్ట్... హర్బోర్... మొత్తాన్ని క్లోజ్ చెయ్యమని ఆర్డర్స్ ఇచ్చాడు... సరిగ్గా అదే సమయానికి గౌతమ్ క్షేమంగా ఫిషరీస్ డాక్స్ చేరుకున్నాడు... ఇంకో గంట తరువాత మాధవ్ కూడా ట్రాలర్ చేరుకున్నాడు... ఫిషరీస్ డాక్స్ కి సైఫుద్దీన్ ఇచ్చిన ఆర్డర్ చేరే లోపల ట్రాలర్ కదిలింది...


THE DEBRIEFING

మాధవ్... గౌతమ్ సేఫ్ గా ముంబై చేరడానికి అయిదు రోజులు పట్టింది. మధ్యలో ఒక రోజు వాతావరణం బాగాలేక పోవడంతో వాళ్ళు ముంబై చేరుకోవడానికి ఇంకో రోజు ఎక్కువ పట్టింది... వాళ్ళు నేరుగా గేట్ వే అఫ్ ఇండియా కి చేరుకున్నారు... అప్పుడు సమయం రాత్రి 8 గంటలు అయ్యింది... గేట్ వే అఫ్ ఇండియా చూడగానే గౌతమ్ కి తెలియకుండా కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి... ఎదో తెలియని ఉద్వేగానికి గురి అయ్యాడు... బోట్ దిగే ముందు ఇద్దరు పాకిస్తాన్ లో కొన్న బట్టలు విప్పేసి... జీన్స్ ప్యాంటు... టీ షర్ట్ వేసుకొని తల మీద బేస్ బాల్ కాప్ పెట్టుకొని ముంబై లోకి ప్రవేశించారు... దారుణమైన విషయం ఏమిటంటే... ముంబై నడి బొడ్డున బోట్ దిగిన వాళ్ళని ఎవరూ చెక్ చేయలేదు... అక్కడ... ముంబై పోలీస్... ఇమ్మిగ్రేషన్... లేదా కోస్ట్ గార్డ్ ఎవరూ లేరు... గౌతమ్... మాధవ్ ఇద్దరూ చాలా ఈజీ గా దేశంలో కి వచ్చారు... 26 నవంబర్ 2008 న కూడా కసబ్... ఇంకో పదిమంది ఇదే రకంగా కరాచీ నుంచి బయలుదేరి సముద్రం మధ్యలో ఒక ఇండియన్ ఫిషింగ్ బోట్ ని ఆపి... అందులో ఉన్న వాళ్ళందరిని దారుణంగా చంపేసి సముద్రంలో పడేసి... ఆ బోట్ లోనే ముంబై మహా నగరం చేరుకొని దారుణ... మారణకాండ కి కారణమయ్యారు... గౌతమ్... మాధవ్... ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ రోడ్ మీదకి వచ్చి హోటల్ తాజ్ ముందున్న PJ రాంచందాని రోడ్ లోకి వచ్చారు... తాపీగా నడుచుకుంటూ నేరుగా హెన్రీ రోడ్ చేరుకున్నారు... ఆ రోడ్ లో కొంచం దూరం ప్రయాణించి షాహిద్ భగత్ సింగ్ రోడ్ లో ప్రవేశించారు... ఆ రోడ్ లో ఒక పాత బిల్డింగ్ లోకి వెళ్లారు... బయటనుంచి చూస్తే అది ఒక పాత బిల్డింగ్ లాగా కనిపిస్తుంది... ఆ బిల్డింగ్ ముందు ఎటువంటి అలికిడి లేదు... చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది... బిల్డింగ్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు ఆర్మీ జవాన్లు వాళ్లకి అడ్డంగా నుంచున్నారు... మాధవ్ వాళ్ళతో ఎదో చెప్పాడు...జవాన్లు మాధవ్... గౌతమ్... ఇద్దరినీ పైనుంచి కిందదాకా తడిమి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకొని వాళ్ళని బిల్డింగ్ మెయిన్ డోర్ దగ్గరకి తీసుకొని వెళ్లారు... అక్కడ టేబుల్ మీద ఒక టెలిఫోన్ ఉంది. మాధవ్ ఆ ఫోన్ లో ఒక నెంబర్ డయల్ చేసాడు... ఆ బిల్డింగ్ లో ఒక రూమ్ లో ఫోన్ మోగింది... అవతల ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి తో మాధవ్ రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి అక్కడే నిలబడ్డాడు...

అయిదు నిమిషాలు కూడా గడవక ముందే ఆ బిల్డింగ్ మెయిన్ డోర్ తెరుచుకుంది... ఫుల్ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆర్మీ కల్నల్ బయటకు వచ్చి మాధవ్ ని చూసి గట్టిగా కౌగలించుకొని "హౌ ఆర్ యు మై సోల్జర్?" అంటూ పలకరించి ఇద్దరినీ తీసుకొని బిల్డింగ్ లోకి వెళ్ళాడు... లోపల ఇంకో డోర్ వుంది... ఆ డోర్ కి ఒక బయో మెట్రిక్ పాడ్ అటాచ్ చేయబడి ఉంది... ముందుగా గౌతమ్ తన రెండు చేతులని ఒకే సారి బయో మెట్రిక్ పానెల్ మీద పెట్టాడు... అయిదు సెకండ్స్ కూడా గడవక ముందే ఆ పానెల్ మీదున్న ఒక చిన్న డోర్ ఓపెన్ అయ్యింది... అందులోంచి ఒక రెటీనా స్కానర్ బయటకు వచ్చింది... గౌతమ్ ఆ స్కానర్ లో తన కళ్ళ లోని ఐరిస్ ని స్కాన్ చేసాడు... ఇంకో అయిదు సెకండ్స్ తరువాత రెటీనా స్కానర్ లోపలి వెళ్ళిపోయి వాయిస్ రికగ్నిషన్ మెషిన్ బయటకు వచ్చింది... గౌతమ్ ఆ మెషిన్ మైక్ కి దగ్గరగా జరిగి అందులో తన పేరు... ఆర్మీ లో తన ర్యాంక్... ఒక స్పెషల్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ ని చెప్పాడు... అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ అయ్యింది... గౌతమ్ లోపలి వెళ్ళాడు... అతని వెనకాలే మాధవ్ కూడా తన బయో మెట్రిక్... రెటినాల్ స్కాన్... వాయిస్ రికగ్నిషన్ పూర్తి చేసి తాను కూడా బిల్డింగ్ లోకి వెళ్ళాడు... వాళ్ళ వెనకాల వచ్చిన ఆర్మీ కల్నల్ విజయ్ సుర్వే వాళ్ళ ని ఒక లిఫ్ట్ లోకి ఎక్కించుకుని ఆఫీసర్ క్వార్టర్స్ కి తీసుకొని వెళ్లి వాళ్లకి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ చూపించాడు. ఆ రూమ్ లో రెండు బెడ్స్ ఉన్నాయి... అల్మరా లో ఆర్మీ కాజువల్ డ్రెస్ లు వున్నాయి... ఇద్దరూ స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకొని కిందకి వెళ్లి మెస్ లో భోజనం చేసి రూమ్ కి వెళ్లి పడుకున్నారు...

మరుసటి ఉదయం సరిగ్గా 5 గంటలకు ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి... కల్నల్ విజయ్ సుర్వే వచ్చాడు... అతని తో పాటు అరడజను సోల్డర్స్ కూడా వచ్చారు... గౌతమ్... మాధవ్ ఇద్దరూ అప్పటికే లేచి రెడీ గా ఉన్నారు... కల్నల్ సుర్వే వాళ్ళిద్దరిని తీసుకొని ఆ బిల్డింగ్ బయట ఆగివున్న ఒక వాన్ లోకి ఎక్కించుకుని శాంతా క్రూజ్ ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళాడు... అక్కడ ఒక మిలటరీ విమానం రెడీ గా ఉంది... గౌతమ్... మాధవ్ ఇద్దరూ ఆ విమానం ఎక్కిన వెంటనే ఆ విమానం గాల్లోకి లేచింది... మూడు గంటల ప్రయాణం తరువాత ఆ విమానం జమ్మూ కాశ్మీర్ లో ఒక క్లాసిఫైడ్ లొకేషన్ లో ల్యాండ్ దిగింది... అక్కడ ఒక ఆర్మీ జీప్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తోంది... ఇద్దరూ ఆ జీప్ ఎక్కి కూర్చున్నారు... దాదాపు రెండు గంటలు పాటు ఘాట్ రోడ్ లో ప్రయాణించి ఒక ఆర్మీ క్యాంపు చేరుకుంది... వాళ్ళు ఆ క్యాంపు చేరగానే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ఆర్మీ జవాన్స్ ఆ ఇద్దరినీ చెరో వైపు తీసుకొని వెళ్లారు... ఇప్పుడు ఆ ఇద్దరికీ Debriefing జరుగుతుంది.

ఏదైనా మిషన్ లేదా ఆపరేషన్ మీద వెళ్లిన సోల్జర్స్ వెనక్కి రాగానే వాళ్ళకి debfiefing ప్రాసెస్ జరుగుతుంది. అది మిలిటరీ ఆచారం... ఇందులో భాగంగా వాళ్ళు వెళ్లిన మిషన్ ఎలా జరిగింది... ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా... ఏవైనా అనుకోని సంఘటనలు ఎదురయ్యాయా... ఆ సంఘటనల వాళ్ళు సోల్డర్స్ కి ఎటువంటి సైకలాజికల్... ఫిజికల్ సమస్యలు వచ్చాయా... ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్స్ - PTSD ఎదురయ్యాయా... ఆ మిషన్ నుంచి వాళ్ళు నేర్చుకున్న కొత్త విషయాలు ఏమిటీ? భవిషత్తులో జరగబోయే మిషన్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలకి సంభందించిన అంశాలని తెలుసుకొని జాగ్రత్తగా రికార్డు చేసి వాటిని సోల్జర్స్ సర్వీస్ రికార్డు లో వ్రాస్తారు... దాదాపు వారం రోజుల పాటు రకరకాల టీమ్స్ ఆ ఇద్దరినీ సెపరేట్ గా అనేక రకాలుగా ఇంటర్వ్యూ చేశారు... వాళ్లిద్దరూ ఎప్పడు బయలుదేరారు? వాళ్ళ మిషన్ ఆబ్జెక్టివ్ ఏమిటీ? ఏ రూట్ లో వెళ్లారు? ఎవరిని కలిశారు? ఏమేమి మాట్లాడారు? ఎటువంటి కస్టాలు ఎదుర్కొన్నారు? ఆ కష్టాలని ఎలా అధిగమించారు? ఆ సందర్భంలో వాళ్ళ మానసిక... శారీరక స్థితి ఎలా వుంది? వాళ్లకి శారీరకంగా గాయాలు ఏమైనా అయ్యాయా? ఇలా చాలా అంశాల మీద వాళ్ళని రకరకాలుగా ప్రశ్నలు వేశారు... ఆ ఇంటర్వూస్ లో గౌతమ్... మాధవ్ చెప్పిన విషయాలు వినగానే వాళ్ళ వెన్ను వొణికింది... ముఖ్యంగా ఆ ఇద్దరి తలల మీద కోడెడ్ మెసేజెస్ ఉన్నాయని తెలియాగానే వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని న్యూ ఢిల్లీలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ తెలియచేసారు... ఇప్పటిదాకా ఆర్మీ ఇంటెలిజెన్స్ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు... ఏదైనా మిషన్ మీద వెళ్లిన వాళ్ళు ఎదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తారు... నార్మల్ గా ఇన్ఫర్మేషన్ పేపర్... మైక్రో ఫిలిం... కంప్యూటర్ పెన్ డ్రైవ్... ఫొటోస్... రూపంలో ఉంటాయి... కానీ... ఇంతవరకు ఎవరూ ఇలా తల మీద స్టెగనోగ్రఫిక్  రూపంలో మెసేజెస్ ని తీసుకొని రాలేదు... ఇండియన్ ఆర్మీ లో ఇదే మొదటిసారి... ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్మీ ఇంటలిజెన్స్ నుంచి ఒక పెద్ద టీం న్యూ ఢిల్లీ నుంచి తెల్లవారాక మునుపే కాశ్మీర్ లోని ఆ క్లాసిఫైడ్ లొకేషన్ కి చేరుకున్నారు...

తెల్లారింది... ఉదయం అయిదు గంటలకి గౌతమ్... మాధవ్... ఇద్దరినీ నిద్ర లేపారు... వాళ్ళని ముందుగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లారు... అక్కడ డాక్టర్ వాళ్లకి రకరకాల పరీక్షలు చేసి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సర్టిఫై చేసాక... ఇద్దరికీ బ్రేక్ ఫాస్ట్ పెట్టారు... ఆ తరువాత ఇద్దరినీ బాత్ రూమ్ కి తీసుకొని వెళ్లి Hose pipe తో శుభ్రంగా కడిగారు... ఆ తరువాత వాళ్ళని ఒక రూమ్ లోకి తీసుకొని వెళ్లారు..... అక్కడ అప్పటికే భారీగా ఏర్పాట్లు జరిగాయి... ఆ రూమ్ లో రెండు స్టూల్స్  ఉన్నాయి... ఆ ఇద్దరినీ ఆ స్టూల్స్ మీద కూర్చోపెట్టారు... ఆ ఇద్దరి చుటూ ఎనిమిది ఫ్లాష్ ఫోటోగ్రాఫిక్ లైట్స్ వెలుగుతున్నాయి... ఆరు వీడియో కెమెరాలు వివిధ యాంగిల్స్ లో అక్కడ జరగబోయే తతంగాన్ని రికార్డ్ చేయడానికి రెడీ గా ఉన్నారు... ముందుగా ఆర్మీ బార్బర్ చాలా నెమ్మదిగా ఒక ఆర్మీ కల్నల్ పర్యవేక్షణలో వాళ్ళ ఇద్దరికీ ఒకరి తరువాత ఒకరికి తల మీద జుట్టుని పూర్తిగా తీసివేసి నున్నగా గుండు చేసాడు... అప్పుడు ఆ ఇద్దరి తలల మీద కనిపించిన కోడెడ్ మెసేజెస్ చూసి ఆ రూమ్ లో వాళ్లంతా అవాక్కయ్యారు... తమ జీవితం లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు... అతి జాగ్రత్తగా వీడియో కెమెరాలతో గౌతమ్... మాధవ్ ల తలల మీద కోడెడ్ మెస్సగెస్ ని వీడియో తీశారు... ఆ తరువాత స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ కోడెడ్ మెసేజెస్ ని ఒక పద్దతి ప్రకారం హై రెసొల్యూషన్ ఫొటోస్ తీసాడు... ఆ తరువాత ఆ ఇద్దరినీ బాత్ రూమ్ కి పంపారు... ఇద్దరూ శుభ్రంగా స్నానం చేసి వేరే బట్టలు కట్టుకొని రాగానే ఆ రూమ్ లోని స్టాఫ్ ఒక్కసారిగా అటెంషన్ లోకి వచ్చి స్టిఫ్ గా నుంచొని ఇద్దరికీ సెల్యూట్ చేసి... "Welcome home Soldiers... We are proud of you" అని అంటూ చప్పట్లు కొట్టారు... మాధవ్... గౌతమ్ కూడా వాళ్ళకి రిటర్న్ సెల్యూట్ కొట్టారు...

ఆ తరువాత ఒక 10 రోజుల పాటు గౌతమ్... మాధవ్ తెచ్చిన మెసేజెస్ ఒక పద్దతి ప్రకారం డీకోడ్ చేశారు... దానితో పాటు సాజిద్ వాళ్లకి కరాచీ లో ఇచ్చిన ఫోల్డర్ లోని డీటెయిల్స్ ని కూడా ఒక పద్దతి ప్రకారం Reconstruct చేశారు... ఆ డీటెయిల్స్ అన్నింటిని కవర్ చేస్తూ ఒక పెద్ద రిపోర్ట్ తయారుచేసి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి పంపారు... దాంతో ఆర్మీ debriefing ప్రాసెస్ ముగిసింది... వెంటనే మాధవ్... గౌతమ్ న్యూ ఢిల్లీ చేరుకున్నారు... ఆర్మీ లో ఒక ట్రెడిషన్ వుంది. ఆర్మీ లో పనిచేస్తున్న సోల్జర్స్ ఎవరైనా డ్యూటీ చేస్తూ చనిపోతే... వారి మరణ వార్త ని అతని క