OPERATION BOOMERANG

PART 1 - THE BEGINNING OF THE CRIME

హైదరాబాద్..... గచ్చిబౌలి క్రాస్ రోడ్స్.... ఒక టొయోట ఇన్నోవా, దాని వెనకాల జీప్ ప్రయాణం చేస్తున్నాయి. ఆ రెండు వాహనాలు అప్పుడే నెహ్రు ఔటర్ రింగ్ రోడ్ లో కి ప్రవేశించాయి. ఇన్నోవా లో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ .... పేరు శివ, పక్కనే ఇంకో వ్యక్తి శరత్. చూడడానికి ఇద్దరు చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు... కానీ... వాళ్లిద్దరూ highly qualified... highly paid... వ్యక్తులన్న సంగతి ఎవరికీ తెలీదు. ఇన్నోవా లో రెండు సీట్స్ మాత్రమే వున్నాయి. వెనక ఉండాల్సిన మిడిల్ రో లేదు. పూర్తిగా ఖాళి... ఇన్నోవా వెనుక భాగంలో...

1. IBM COMPUTER

2. SAT COM Navigation Systems & Antenna --- Military Grade

3. Geo Satellite Communication Systems - Very Compact & Highly Sophisticated

4. Heavy Duty Batteries - For Power Supply.

ఈ equipment మామూలు గా మార్కెట్ లో దొరకదు. వాటిని India లో import చేసుకోవాలంటే Government Of India పర్మిషన్ కావాలి. ప్రస్తుతం ఆ equipment ఇండియా లో 1. RESEARCH AND ANALISYS WING(R&AW), INTELLIGENCE BUREAU 2. Indian Military దగ్గరమాత్రమే వున్నాయి.

శివ(తన పక్కన కూర్చున్న శరత్ తో): మనం OUTER RING ROAD మీద వున్నాము.

శరత్: గ్రేట్... కార్ ని 50 KM కన్నా వేగం గా పోనివ్వవొద్దు.

శివ: Sure.

శివ(Walkie Talkie లో వెనక వొస్తున్న జీప్ డ్రైవర్ ప్రసాద్ తో) : Maintain 50 KM speed and safe distance.

ప్రసాద్: Copy That

ప్రసాద్ పక్కన కూర్చున్న వెంకట్ చాలా సీరియస్ గా వున్నాడు.

శరత్ చాలా వేగంగా తన Mac Book లో టైపు చేస్తూ... తన మొబైల్ ఫోన్ లో ఒక కాల్ చేసాడు...

శరత్: Hey... Charlie... Are You Ready?

చార్లీ(Langley, Virginia, USA లో): Yup... Just waiting for your call

శరత్: Go ahead... Give me the codes

చార్లీ: One moment...

చార్లీ ఇస్తున్న కోడ్స్ ని శరత్ తన కంప్యూటర్ లో టైపు చెయ్యడం మొదలెట్టాడు. 3 నిమిషాల తరువాత...

శరత్(చార్లీ తో):Thank you very dear friend... your help much appreciated...

చార్లీ: Aytime... Good Luck

చార్లీ ఇచ్చిన కోడ్స్ తో శరత్ INDIAN COMMUNICATIONS SATELLITE ని HACK చేసాడు.

శరత్(వెనక వొస్తున్న జీప్ లో వున్నా వెంకట్ తో): రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కెమెరా నెటవర్క్ లోకి ప్రవేశించాను. ఇప్పుడు వాళ్ళ మొత్తం సెక్యూరిటీ కెమెరా నెటవర్క్ నా ఆధీనంలో వుంది. మన వాళ్ళ ఫ్లైట్ స్టేటస్ ఏమిటీ?

వెంకట్ :SNOW WHITE just landed about to exit the aircraft. EAGLE is still flying.

అప్పుడే శరత్ మొబైల్ ఫోన్ లో SNOW WHITE దగ్గరనుండి ఒక మెసేజ్ వొచ్చింది. "EXITING THE AIRCRAFT"

శరత్ తన కంప్యూటర్ లోంచి SNOW WHITE ఏ దారిలో వొస్తోందో అందులో వున్నా అన్ని కెమెరా లని తన కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకదాని వెంట ఒకటిగా చెక్ చేస్తూ వాటి లైవ్ ఫీడ్ ని NEW DELHI INDIRA GANDHI AIRPORT సెక్యూరిటీ కెమెరా ఫీడ్ తో రీప్లేస్ చేయ్యసాగాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కేమెరా ఫీడ్ ఎవరైనా చెక్ చేస్తే వాళ్ళకి SNOW WHITE కానీ, EAGLE కానీ హైదరాబాద్ వొచ్చిన డిజిటల్ రికార్డు ఉండదు.

SNOW WHITE అసలు పేరు Dr.రేవతి MD - జనరల్ సర్జన్. ఆమెకి దాదాపు 45 ఏళ్ళు ఉంటాయి. రేవతి బయటకి వొచ్చి కాఫీ తాగుతూ కూర్చుంది.

ఇంతలో వెంకట్ Walkie Talkie లో శరత్ తో "EAGLE IS JUST LANDED ABOUT TO EXITING THE AIRCRAFT... BE READY" అని అన్నాడు.

అదే సమయంలో శరత్ మొబైల్ కి మెసేజ్ వొచింది. శరత్ EAGLE వొస్తున్న దారిలోని అన్ని సెక్యూరిటీ కెమెరా లోని లైవ్ ఫీడ్ ని KOLKATA NETAJI SUBHASH CHANDRABOSE INTERNATIONAL AIRPORT లైవ్ ఫీడ్ తో నింపేసాడు.

EAGLE అసలు పేరు మాధవ్. ఆరు అడుగుల పొడుగు చాలా బలమైన శరీరం. దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి. కానీ, అలా కనపడడు. అతని నడక రిథమిక్ గా వుంది. అతని కళ్ళు చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. ఇంగ్లీష్ లో వాటిని PENETRATIVE EYES అని అంటారు (People who have penetrating eyes or a penetrating gaze/stare/look make you feel uncomfortable by looking at you in a way that makes you feel that they know what you are thinking)

మాధవ్ బయటకి రావడం చూసి శివ ఇన్నోవా ని వేగం గా ఎయిర్పోర్ట్ అరైవల్స్ గేట్ దగ్గరకి పోనిచ్చాడు. వాళ్ళ వెనకే వొస్తున్న జీప్ కూడా అక్కడికి చేరుకుంది. మాధవ్ కామ్ గా వొచ్చి జీప్ వెనక సీట్లో ఎక్కాడు. అతని వెనకే రేవతి కూడా జీప్ ఎక్కింది. ఎవ్వరు మాట్లాడుకోలేదు. వెంటనే అక్కడ నుండి ఆ రెండు వాహనాలు బయలుదేరాయి.

ఎయిర్పోర్ట్ దాటగానే శరత్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కెమెరా ని హాక్ చెయ్యడం ఆపేసాడు. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కెమెరాలు నార్మల్ గానే పని చేయడం మొదలెట్టాయి. మాధవ్, రేవతి హైదరాబాద్ కి వొచ్చిన సంగతి సెక్యూరిటీ కెమెరాలో రికార్డు అవ్వలేదు.

వెంకట్ (వెనక కూర్చున్న రేవతి, మాధవ్ తో) : మీరు అడిగిన సప్లైస్ అన్ని మీ వెనుక లగేజ్ బూట్ లో వున్నాయి. Check them out...

మాధవ్ వెనక వున్నా బాగ్స్ తీసాడు. మొదటి బాగ్ లో అన్ని మెడికల్ ఐటమ్స్ వున్నాయి. ఆ బాగ్ ని రేవతి కి ఇచ్చాడు. రెండో బాగ్ లో...

a. SAP GLOVES

b. Walther PPK

c. 6 Magazines

d. Catridge Boxes - 5

e. Silencer Kit for Walther PPK

మాధవ్ Magazines లోకి బుల్లెట్స్ ఎంతో అనుభవం వున్నవాడిలాగా ఎక్కించసాగాడు. 4 నిమిషాలలో 6 Magazines రెడీ చేసాడు. గన్ కి సైలెన్సర్ అమర్చాడు. రేవతి తన అడిగిన మెడికల్ సప్లైస్ అన్ని సరిగా ఉన్నాయో లేదో చెక్ చెయ్యసాగింది.

ఇంతలో వెంకట్ మాధవ్ కి మొబైల్ ఫోన్ లో ఒక ఫోటో చూపిస్తూ "వీడి పేరు నర్సింగ్ యాదవ్. ఇక్కడే సాగర్ హిల్స్ లో ఉంటాడు. 15th ఫ్లోర్ లో వాడి అపార్ట్మెంట్ 15D. He is your first target. Go get that son of a bitch. Make sure he suffers before breathing last"

ముందు వెళుతున్న ఇన్నోవా లో కూర్చున్న శరత్ ఇప్పుడు Cyberabad Police Department City Surveillance System లోకి లాగ్ ఇన్ అయ్యాడు. సిటీ లో వున్న అన్ని ట్రాఫిక్ కెమెరాలు తన కంట్రోల్ లో వున్నాయి. వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనాల కదలికలు సిస్టమాటిక్ గా పోలీస్ డేటా బేస్ లోంచి చెరిపేస్తున్నాడు.

ముందుగా ఇన్నోవా సాగర్ హిల్స్ లో నర్సింగ్ యాదవ్ ఉంటున్న అపార్ట్మెంట్ ముందునుంచి వెళుతూ వాళ్ళ CCTV నెట్వర్క్ ని హాక్ చేసి శివ కి సిగ్నల్ ఇచ్చాడు. శివ Walkie Talkie లో "All Clear ... Good to go" అని అన్నాడు.

మాధవ్ వెంటనే జీప్ దిగి అపార్ట్మెంట్స్ లోకి ప్రవేశించి లిఫ్ట్ లో 15వ అంతస్తుకి వెళ్ళాడు. చేతులకి SAP GLOVES వేసుకున్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా పడకుండా ముందు జాగ్రత్త.

15D అపార్ట్మెంట్ లోపల...

నర్సింగ్ యాదవ్ భార్య సుగుణ కాఫీ కప్ చేతికి అందిస్తూ "నేను స్నానానికి వెళుతున్నాను" అని చెప్పి లోపలి వెళ్ళింది.

నర్సింగ్ కాఫీ తాగుతూ బాల్కనీ లోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు. ఇంట్లో సిగరెట్ తాగడం కుదరదు. నర్సింగ్ ఒక పెద్ద గూండా... ఆరడుగుల రెండుఅంగుళాల ఎత్తు... దాదాపు 110 కిలోల బరువు. బలంగానే ఉంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.

సిగరెట్ అక్కడే వొదిలి వొచ్చింది ఎవరో చూడడానికి వెళ్ళాడు. ముందు Peep Hole లోంచి చూసాడు. ఎవరో కొత్త వ్యక్తి. తలుపు తీసాడు... అంతే...

మాధవ్ ఒక్కసారిగా తన కుడి కాలు పైకెత్తి తలుపుని ఒక్క తన్ను తన్నాడు. దాంతో నర్సింగ్ మొహం మీద తలుపు గట్టిగ తగలడం తో ముక్కు పగిలి నెత్తురు కారడం మొదలెట్టింది. నర్సింగ్ తేరుకునే లోపల మాధవ్ తన బలమైన చేతులతో అతని కుడి, ఎడమ RIB CAGE ఎముకలు విరిగిపోయేలా... ఒక బాక్సర్ పంచ్ బాగ్ పగిలిపోయేలా ఎలాగైతే గుద్దుతాడో అలా గుద్దడం మొదలెట్టాడు. నర్సింగ్ కి RIB CAGE ఎముకలు విరిగిపోయి internal bleeding మొదలయ్యింది. నర్సింగ్ కి నోట్లోంచి మాట రావడం లేదు. అరవలేక పోతున్నాడు. మాధవ్ వెంటవెంటనే నర్సింగ్ రెండు కాళ్ళు విరిగిపోయేలా తన్నాడు. నర్సింగ్ అరవపోతే అతని నోరు నొక్కేసాడు. నర్సింగ్ ని అమాంత ఎత్తుకొని బాల్కనీ లోంచి కిందకి విసిరేసాడు. దాదాపు 110 కిలోలు బరువున్న నర్సింగ్ అతివేగంగా వెళ్లి కింద పార్క్ చేసివున్న TATA Sumo మీద పడ్డాడు. ఒక్కసారిగా అంత బరువైన వ్యక్తి పడడంతో TATA సుమో రూఫ్ అంతా అణిగిపోయి నర్సింగ్ వీపులో దిగపడడంతో ప్రాణం వెంటనే పోయింది. ఇదంతా ఒక 6 నిమిషాల్లో జరిగిపోయింది.

అక్కడే బట్టలు ఐరన్ చేస్తున్న చాకలి పైనించి TATA Sumo మీద నర్సింగ్ పడడం చూసి స్పృహ తప్పాడు. ఒక్క సారిగా జనాలు అక్కడ గుమికూడారు. కానీ, వాళ్లలో ఒక్కరుకూడా పక్కనుండి కామ్ గా వెళ్లిపోతున్నా మాధవ్ ని ఎవరు గమనించలేదు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ 15D కి ఫోన్ చేసి సుగుణకి నర్సింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అనిచెప్పాడు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ కూడా చేసాడు.

మాధవ్ తాపీగా వెళ్లి జీప్ ఎక్కాడు. రెండు వెహికల్స్ అక్కడనుండి బయలుదేరి రెండో అడ్రస్ కి వెళ్లాయి. అక్కడ వెంకట్... మాధవ్ కి మొబైల్ ఫోన్ లో రెండు ఫొటోస్ చూపించాడు. గణేష్, మల్లేష్... ఇద్దరూ అన్నదమ్ములు. ఒకే ఇంట్లో వుంటారు. వాళ్ళది ఒక పాత ఇల్లు. ఆ ఇంటిని వాళ్ళు ఒక స్కూల్ టీచర్ దగ్గరనుండి లాక్కున్నారు. ఆ స్కూల్ టీచర్ కి ఆ ఇల్లు వారసత్వం గా దక్కింది. అన్న దమ్ములు ఆ స్కూల్ టీచర్ ని బెదిరించి ఇంట్లోంచి వెళ్ల కొట్టి ఆ ఇంటిని ఆక్రమించుకున్నారు. మాధవ్ ఎవరూ చూడకుండా గోడదూకి వాళ్ళ ఇంట్లో కి వెళ్లి కిటికీ ఊచలు విరిచేసి లోపలి దూరాడు. ఇల్లు పాతది. కొంచం పెద్దదే... అన్ని గదులూ వెతుకుతూ వెళ్ళాడు. ఒక గదిలో గణేష్ పడుకొని వున్నాడు. వెళ్లి నడుము వెన్నుముక విరిగేలా ఒక్క తన్ను తన్నాడు. నిద్రలో వున్నా గణేష్ ఒక్కసారి ఉలిక్కిపడిలేచి నెప్పితో గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని మల్లేష్ ఆ గదిలోకి వొచ్చాడు. మల్లేష్ కి లోపల ఏమి జరుగుతోందో అర్ధమయ్యేలోపల మాధవ్ మల్లేష్ మీద పడి విపరీతమైన కసితో కుమ్మెయ్యసాగాడు. "ఎవడ్రా నువ్వు...???" అని గణేష్ అరిచాడు. వెంటనే మాధవ్ మల్లేష్ ని అమాంత ఎత్తేసి గణేష్ మీద పడేసాడు. దాంతో గణేష్ కి స్పృహ తప్పింది. మాధవ్ మల్లేశు ని చావబాది వొంట్లోఎముకలు విరిగేలా కొట్టాడు. ఒకరితరువాత ఒకరిని ఎత్తుకొని వంట గదిలోకి తీసుకెళ్లి ఎత్తి పడేసాడు. వాళ్ళ మీద నీళ్లు పోసి స్పృహాతెప్పించాడు. వాళ్ళకి తమ ఒంటికి తగిలిన దెబ్బల నెప్పులు తెలిసి విపరీతగా అరవడం మొదలెట్టారు. మాధవ్ వంట ఇంట్లో వున్న గ్యాస్ సీలిండెర్స్ ఓపెన్ చేసి అక్కడే వున్న బ్రెడ్ టోస్టర్ లో న్యూస్ పేపర్ కుక్కి దాన్ని ఆన్ చేసి బయటకి వెళ్ళిపోయాడు.

మాధవ్ వెళ్లి జీప్ ఎక్కే లోపలే గ్యాస్ సీలిండెర్స్ పేలిపోయి ఇల్లంతా తగలపడడం మొదలెట్టింది. ఆ రెండు వాహనాలు అక్కడనుంచి మూడవ టార్గెట్ దగ్గరకి వెళ్లారు.

మాధవ్ వేసుకున్న T Shirt చిరిగిపోయింది. తాను తెచ్చుకున్న బాగ్ లోంచి ఒక ఫార్మల్ షర్ట్ తీసి వేసుకున్నాడు. ఇంతలో వాళ్ళ జీప్ ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ లోని బేసెమెంట్ లోకి ప్రవేశించింది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళ కార్ బూట్, under the car చెక్ చేసి access card swipe చేసాక లోపలి వెళ్లనిచ్చారు. ఇలా చెకింగ్ ఉంటుంది కాబట్టే ఇన్నోవా మాత్రం ఆ ఆఫీస్ వెనకాల ఎవరికి అనుమానం రాకుండా పార్క్ చేసుకొని ఆ ఆఫీస్ బిల్డింగ్ లోని security console ని హాక్ చేసి తమ కంట్రోల్ లోకి తెచ్చుకొని మాధవ్ కి గ్రీ సిగ్నల్ ఇచ్చారు. మాధవ్ జీప్ దిగి బిల్డింగ్ లోకి తన దగ్గరవున్న access card సహాయంతో ప్రవేశించి లిఫ్ట్ లో ఎక్కి 24వ అంతస్తులోకి వెళ్ళాడు. అది ఒక soft ware కంపెనీ. తన access card సహాయంతో ఆఫీస్ లోకి వెళ్లి సెక్యూరిటీ కెమెరా కి భయపడకుండా ఒక కార్నర్ లో వున్న CEO రూమ్ లోకి వెళ్ళి అక్కడ సీట్ లో కూర్చున్న అభిలాష్ ని చూసి "I need to talk to you urgently" అని అన్నాడు. అభిలాష్ మాధవ్ వైపు కోపంగా చూసి " Who the fuck are you? who let you in?" అని అరుస్తూ ఇంటర్ కామ్ లో సెక్యూరిటీ ని పిలవబోతే మాధవ్ ఒక్కఉదుటున అభిలాష్ ని చేరుకొని అతని కుడిచెయ్యిపట్టుకొని గట్టిగా నలుపుతూ మెలితిప్పడు. అంతే... అభిలాష్ మణికట్టు విరిగిపోయింది. అరవబోతున్న అభిలాష్ నోరు గట్టిగా నొక్కేసి సౌండ్ బయటకి రాకుండా చేసాడు. చేతిని కత్తిలాగా చేసి అభిలాష్ గొంతుమీద గట్టిగా కొట్టాడు. దాంతో అభిలాష్ ఊపిరాడక కొట్టుకున్నాడు. మాధవ్ ఒక్క ఊపులో అభిలాష్ ని పైకిఎత్తేసి మోకాలి విసిరేసాడు. అభిలాష్ పైకిలేచి ఛాన్స్ ఇవ్వకుండా దాదాపు ఒక 5 నిమిషాలు కళ్ళతో ఫుట్ బాల ఆడేశాడు. ఎప్పుడు ప్రాణం పోయిందో కానీ అభిలాష్ కదలడం మానేసాడు. అతను చచ్చిపోయాడని ధృవీకరించుకొని ఆ రూమ్ లోంచి బయటకి వొస్తూ డోర్ నాబ్ ని విరగకొట్టేసాడు. ఇక ఆ తలుపు తియ్యాలంటే 1. విరగకొట్టాలి 2. locksmith ని పిలిపించాలి. వేరే మార్గం లేదు. వొచ్చిన పని అవ్వడంతో నేరుగా లిఫ్ట్ ఎక్కి బేసెమెంట్ చేరుకొని జీప్ ఎక్కాడు.

ఇదంతా లాప్ టాప్ లో చూస్తున్న శరత్ "Well done... మాధవ్... let's go to నెక్స్ట్ టార్గెట్" అని అన్నాడు.

వాళ్ళ వెహికల్స్ మళ్ళీ రోడ్ మీదకి రాగానే వెంకట్ తన ipad లో ఇంకో ఫోటో చూపెట్టాడు. అది ఒక government employee ఫోటో. "వీడి పేరు రాజారావు. Registrar of Properties. హార్ట్ పేషెంట్. ఒకసారి బైపాస్ కూడా అయ్యింది. ఎక్కువగా ఇబ్బంది పెట్టకు" అని అన్నాడు.

జీప్ ఒక మిడిల్ క్లాస్ కాలనీ లో ఆగింది. "Fifth house on right side" అని అన్నాడు వెంకట్.

మాధవ్ జీప్ దిగి ఆ ఇంట్లో కి వెళ్లబోతుండగా రాజారావు బయటికి వొస్తూ కనిపించాడు. మాధవ్ అటూ ఇటూ చూసాడు. ఎవరూ లేరు. "రాజారావు గారంటే మీరేనా" అని మర్యాదగా అడిగాడు. రాజారావు ఎగాదిగా చూస్తూ "అవును..." అని అన్నాడు. అంతే.... మాధవ్ పిడికిలి మూసి అతివేగంగా రాజారావు గుండెకి గురిచూసి కొట్టాడు. దాంతో రాజారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. RIB CAGE విరిగిపోయి ఎముకలు గుచ్చుకోవడంతో వెంటనే ప్రాణం పోయింది.

మాధవ్ వొచ్చి జీప్ ఎక్కాడు. Walkie Talkie లో శరత్ "Guys... we need to hurry up... నర్సింగ్, గణేష్, మల్లేష్ cases TV లో cover చేస్తున్నారు. We don't have much time" ఇది విని వెంకట్ "One more massacre.... that would complete phase one"

వెంకటేష్ ipad మాధవ్ కి ఇచ్చి ఇందులో 17 మంది ఫొటోస్ వున్నాయి. అందరిని ఒక్కసారిగా చంపెయ్యాలి .... వీళ్లంతా ఇక్కడికి దగ్గరలోనే ఒక కోఠీ లో వుంటారు. Go crazy" అని అన్నాడు.

మాధవ్ ఆ ఫోటోలు ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసి అందరిని గుర్తుపెట్టుకొని "BASH ON RUTHLESS" అని తన గన్, మ్యాగజైన్స్, బుల్లెట్స్ చెక్ చేసుకున్నాడు. కోఠీ రాగానే, దిగిపోయి గేట్ తీసుకొని లోపలి వెళ్ళగానే ఒకడు "కౌన్ హై తు" అంటూ ఒకడు అడ్డంగా వొచ్చాడు. మాధవ్ గన్ తీసి షూట్ చేసేసాడు... టప్... టప్... DOUBLE TAP murder .... బిల్డింగ్ లోకి పరిగెత్తుకుంటూ వెళుతూ కనిపిచ్చినవాడినల్లా చంప సాగాడు. మాధవ్ చాలా high precision తో టప్... టప్... మంటూ కాల్చసాగాడు. మాధవ్ ధాటికి గ్యాంగ్ మొత్తం చెల్లా చెదురుగా పారిపోసాగారు. ఒక్కడిని కూడా వొదలకుండా ముందునుంచి వెనకనుండి అని చూడకుండా కాల్చేశాడు. ఎవరైనా మిగిలారేమోనని బిల్డింగ్ అంతా జాగ్రత్తగా వెతికాడు. మొత్తం 14 మంది చచ్చిపోయారు. మాధవ్ కి రెండు బుల్లెట్స్ తగిలాయి. ఒకటి తొడ మీద, రెండోది ఎడమ వైపు పొట్టలోంచి బులెట్ దూసుకొని బయటకి వెళ్ళింది. రక్తం బాగా కారుతోంది.

ఫోన్ చేసి వెంకట్ ని ipad తీసుకొని రమ్మన్నాడు. వెంకట్ రాగానే శవాలని tally చేసుకొని ఎవరెవరు తప్పిచుకున్నారో చూసుకున్నారు. ఇంకా ఆరుగురు మిగిలారు. ఇంతలో పోలీస్ రావడం చూసి అక్కడనుంచి అతి కష్టం మీద గోడదూకి పారిపోయారు. జీప్ ఎక్కి ఆలోచించసాగారు. మిగిలిపోయిన వాళ్ళు... రసూల్, కిషన్, బైరెడ్డి, రంగ, తంగం, గిరి. గ్యాంగ్ లో 14 మంది చావడం తో మిగిలిన వాళ్ళు ప్రస్తుతానికి జాగ్రత్త పడతారు. కాబట్టి phase one ముగించాలి అని నిర్ణయించుకున్నారు.

జీప్ లోకి ఎక్కంగానే మాధవ్ తన బట్టలు విప్పేసాడు. రేవతి తన మెడికల్ కిట్ ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా తొడలో ని బులెట్ తీసేసి కుట్లు వేసి బ్యాండేజ్ చేసింది. లెఫ్ట్ సైడ్ దూసుకెళ్లిన బులెట్ వాళ్ళ అక్కడ చిల్లి పడడంతో ప్రస్తుతానికి బ్లడ్ కారడం కట్టడి చేసి సేఫ్ హౌస్ కి వెళ్ళాక పూర్తి స్థాయి లో ట్రీట్మెంట్ చెయ్యాలి అని డిసైడ్ చేశారు. ప్లాన్ ప్రకారం ముందు శరత్ ని ఒక షాపింగ్ మాల్ దగ్గర డ్రాప్ చేశారు. తరువాత మాధవ్ ని, రేవతి ని సేఫ్ హౌస్ దగ్గర దింపాక... శివ ఇన్నోవాని, ప్రసాద్ జీప్ ని నడపగా... వెంకట్ వేరే కార్ ఎక్కి వాళ్ళని ఫాలో అయ్యాడు. వాళ్ళు వూరికి దూరంగా వున్నా నిర్మానుష్యమైన ఒక ఫార్మ్ హౌస్ లోకి వెళ్లారు.

శివ, ప్రసాద్, వెంకట్ ముందుగా తెచ్చి పెట్టుకున్న కెమికల్స్ కలిపిన పెట్రోల్ క్యాన్స్ తెచ్చి ఇన్నోవా, జీప్ ల మీద లోపల బాగా పోసి నిప్పుపెట్టారు. అవి బాగా కాలి బూడిద అయ్యాక వెంకట్ తీసుకొచ్చిన కార్ లో రిటర్న్ వెళ్లారు. శరత్ ని పిక్ అప్ చేసుకోవాలి...

ఎప్పుడూ ఏది ప్లాన్ ప్రకారం జరగదు...

షాపింగ్ మాల్ దగ్గర దిగిన శరత్ నేరుగా బేసెమెంట్ లోకి వెళ్లి ముందుగా ఏర్పాటు చేసుకున్న ఒక డొక్కు మారుతి కార్ లో కూర్చొని ఆ రోజు తను కంప్యూటర్ తో చేసినదంతా erase చేసి ఎటువంటి digital footprint దొరకకుండా జాగ్రత్త పడసాగాడు. టైం రాత్రి రెండుగంటలు దాటింది. ఇంతలో వెంకట్ నుండి ఫోన్ వొచ్చింది. "పని అయిపొయింది. దారిలో వున్నాము. ఇంకో 15 నిమిషాల్లో అక్కడవుంటాము" అని చెప్పాడు. శరత్ కి కూడా ఆ మాత్రం టైం పడుతుంది. మొత్తం డిజిటల్ ఫుట్ ప్రింట్ చెరిపేసాడు. ఇంక మాక్ బుక్ మొత్తం ఫార్మాట్ చేసి ఎందుకూ పనికి రాకుండా చెయ్యాలి అని తను డెవలప్ చేసుకున్న స్పెషల్ ప్రోగ్రాం రన్ చేసాడు. అది ఒక 10 నిమిషాల్లో ఆ లాప్ టాప్ ఎందుకూ పనికి రాకుండా చేస్తుంది. ఇంతలో...

ఆ షాపింగ్ మాల్లో ఒక పబ్ వుంది. ఆ రోజు ఫ్రైడే కావడం తో బాగా బిజీ గా వుంది. కుర్రకారు బాగా తాగి జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ బేసెమెంట్ పార్కింగ్ లోకి వొచ్చి BMW 5 ఎక్కి తాగిన మత్తులో డ్రైవ్ మోడ్ లో నడపాల్సింది రివర్స్ మోడ్ లో పెట్టి బలంగా ఆక్సిలేటర్ తొక్కడం తో ముందుకు వెళ్ళవలసిన కార్ అతి వేగంగా రివర్స్ లో వెళ్లి ఆగివున్న ఒక పాత మారుతి కార్ ని వెనకనుండి గుద్దేసింది. కంగారులో బ్రేక్ వెయ్యబోయి ఆక్సిలేటర్ గట్టిగా నొక్కడంతో BMW పూర్తిగా మారుతి కార్ ఎక్కింది. BMW నడుపుతున్న కుర్రోడు భయపడి కార్ దిగి పారిపోయాడు.

ఈ ఆక్సిడెంట్ చూసి అంతా అక్కడ గుమి కూడారు. పోలీస్, అంబులెన్సు కి ఫోన్ చేశారు. పోలీస్ ముందుగా వొచ్చి BMW ని ముందుకి లాగి మారుతి కార్ లో ఎవరైనా ఉన్నారేమో అని చూసారు. ఆ కార్ బ్యాక్ సీట్ లో ఒక వ్యక్తి కూర్చొని వున్నాడు. అతని వొళ్ళో ఒక లాప్ టాప్ వుంది. BMW వెనకనుండి గుద్దడంతో ఆ లాప్ టాప్ అతని గుండెల్లో గుచ్చుకొని అతను అక్కడికక్కడే మరణించాడు. అతని పేరు DR. Sharath phd... Tenured Professor MIT, Cambridge, Massachusetts, USA - Aged 54, survived by wife, sun and daughter - REST IN PEACE.

పోలీస్ క్రైమ్ సీన్ ఫొటోస్ తీసుకొని శరత్ డెడ్ బాడీ ని హాస్పిటల్ కి తరలించారు. ఇదంతా అక్కడికి చేరుకున్న వెంకట్, శివ, ప్రసాద్ stun అయ్యి చూస్తూ ఉండిపోయారు. ఇంతలో శరత్ డెడ్ బాడీ ని చూసి శివ స్పృహ తప్పాడు. చుట్టూ వున్నా జనం శివ శవాన్ని చూసి పడిపోయాడు అని అనుకున్నారు... కానీ వాళ్లకు తెలియని నిజం 36 ఏళ్ళ అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది.

వెంకట్, ప్రసాద్ కలసి శివ ని తీసుకొని బయటకి వొచ్చారు. శివ స్పృహలోకి వొచ్చాక ఏడవడం మొదలెట్టాడు. ప్రసాద్, వెంకట్ లు చూస్తూ వుంది పోయారు కానీ వాళ్ళకి శివ ని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ప్రసాద్ వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. వాళ్ళ అందరి లో మాధవ్ ఒక్కడే బాగా ధైర్యం వున్నవాడు. వాళ్ళ ముగ్గురిని సేఫ్ హౌస్ కి వెంటనే రమ్మని ఇప్పుడు ఏమి చెయ్యాలో ఆలోచించడం మొదలెట్టాడు.


PART - 2 - THE VISITOR

హైదరాబాద్... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఆఫీస్...

సిటీ కమిషనర్ రవీంద్ర, IG తో సహా ముఖ్యమైన వాళ్ళు అంతా వున్నారు. ఏమి అర్థం కావడం లేదు. సిటీ లో ఒకే ఒక్క రోజులో 20 మంది చనిపోయారు. 17 మంది రౌడీ షీటర్లు, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ CEO, ఒక గవర్నమెంట్ ఉద్యోగి.... ఒక గుర్తు తెలియని వ్యక్తి.

DGP : ఆ గుర్తు తెలియని బాడీ ని పోస్ట్ మార్టం కి పంపారా?

రవీంద్ర : ఎస్, సర్

DGP : అభిలాష్ ఎవరో తెలుసా?

రవీంద్ర : ఎస్, సర్.... మన హోమ్ మినిస్టర్ గారి అల్లుడు.

DGP : వెరీ సీరియస్ మేటర్... ఈ హత్యలకు ఏదైనా లింక్ ఉందా?

రవీంద్ర : ఇప్పుడు చెప్పడం కష్టం సార్.

సరిగ్గా అదేసమయంలో హోమ్ మినిస్టర్ ప్రభాకరరావు హడావిడిగా DGP ఆఫీస్ లోకి వచ్చాడు. వస్తూనే.... "నా అల్లుడిని ని చంపింది ఎవరు కనుక్కున్నారా?" అని ఏడుస్తూ అడిగాడు.

DGP : ఇంకా లేదండి. ఎంక్వయిరీ మొదలెట్టాము. మా వాళ్ళు మీ అల్లుడి గారి ఆఫీస్ CCTV footage పరిశీలిస్తున్నారు. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమోనని. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ టీం అక్కడే వుంది. It is too early to say anything.

అదే టైం కి ఒక పోలీస్ ఆఫీసర్ లోపలి వచ్చి "సర్... CCTV footage ని ఎవరో tamper చేశారు. దాదాపు 40 నిమిషాల రికార్డింగ్ దొరకడం లేదు. వారం రోజుల కిందటి రికార్డింగ్ మళ్ళీ ఇవ్వాళా కనిపిస్తోంది. అభిలాష్ గారి గది లోకి హత్య సమయంలో ఎవరు వచ్చి వెళ్ళింది తెలియదు. ఆఫీస్ లో వాళ్ళని inquire చేస్తున్నాము. కొత్త వాళ్ళు ఎవరైనా ఆఫీస్ లోకి పర్మిషన్ లేకుండా వొచ్చారేమోనని కనుకుంటున్నాము"

హోమ్ మినిస్టర్ ప్రభాకరరావు అందరి వైపు చూస్తూ "మీరంతా బయటకు వెళ్ళండి. నేను DGP తో ఒంటరిగా మాట్లాడాలి" అని అన్నాడు.

అందరూ బయటకు వెళ్లారు. సిటీ కమిషనర్ రవీంద్ర బయటకు వెళ్తూ 'ఒక్క రోజులో ఒక పెద్ద గ్యాంగ్ లో సగానికి పైగా లేపేశారు. వీళ్ళు ఎవరో కానీ... ఒక్క నెల రోజులు వదిలేస్తే రాష్ట్రం మొత్తం క్లీన్ చేసేస్తారు' అని మనసులో అనుకున్నాడు.

హోమ్ మినిస్టర్ ప్రభాకరరావు... DGP ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు.

ప్రభాకరరావు : ఈ రోజు.... నర్సింగ్, గణేష్, మల్లేష్, రాజారావు, రసూల్ గ్యాంగ్ లో చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. ఇప్పుడప్పుడే బయటకు రారు. మనిద్దరికీ తెలుసు వీళ్ళంతా కలిసి చేసిన పని. రాజారావు కూడా చనిపోవడంతో నాకు ఇది ఆ రామచంద్రయ్య ఫార్మ్ హౌస్ గొడవ అని నా అనుమానం. వాళ్ళ వాళ్ళు ఏమైనా తిరగపడ్డారా?

DGP : Doubtful ...... ఆ ఫామిలీ లో అంతా చనిపోయారు. ఎవరూ మిగలలేదు. అందరిని లెక్క చూసి మరీ చంపారు కదా.... పగ తీర్చుకోవడానికి ఆ ఫామిలీ లో ఎవరున్నారు? చిన్న పిల్లలు సైతం చనిపోయారు. You don't worry. మేము అన్ని కోణాల్లో inquire చేస్తాము. ఎవ్వరిని వదిలేది లేదు. మాకు కొంచెం టైం ఇవ్వండి.

ప్రభాకరరావు (ఏడుస్తూ): నా కూతురు పెళ్లి జరిగి రెండు ఏళ్ళు కూడా కాలేదు. ఇప్పుడు తనకు ఆరో నెల. నాకు ఏమి చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఎందుకిలా జరిగింది? ఎవరు చేశారు? వాళ్ళు ఎవరైనా సరే... నేను వదలను. నరికేస్తా. మీరు ఇన్వెస్టిగేషన్ గట్టిగా చెయ్యండి. నా అల్లుడిని చంపిన వాళ్ళు ఈ వూరు దాటాక ముందే పట్టుకోండి.

>DGP :మీరేమి వర్రీ అవకండి. నేను, సిటీ కమిషనర్ రవీంద్ర పర్సనల్ గా డీల్ చేస్తాము.

ఈ కేసు సిటీ కమిషనర్ రవీంద్ర కి పెద్ద తలకాయ నొప్పి గా తయారయ్యింది. ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ఆ గుర్తు తెలియని శవాన్ని పోస్ట్ మార్టం తర్వాత మార్చురీ కి పంపారు. పేపర్ లో గుర్తు తెలియని వ్యక్తి అని ప్రకటన కూడా ఇచ్చారు. అతని లాప్ టాప్ ని టెక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే వాళ్ళు చెక్ చేసి అది ఎందుకూ పనికి రాదు అని తేల్చేశారు. అతని ఫింగర్ ప్రింట్ ఏ పాత క్రిమినల్ తో మ్యాచ్ కావడం లేదు. అతని కి ఆధార్ కార్డు కూడా లేదని తెలిసింది. తెలిసిందల్లా... అతను వేసుకున్న బట్టలు చాలా ఖరీదైన అమెరికన్ బ్రాండ్... అంతకు మించి వేరే ఏమీ తెలీదు మూడు నెలలు గడిచినా ఎవరు ఆ డెడ్ బాడీ ని క్లెయిమ్ చేయలేదు...

నర్సింగ్, గణేష్, మల్లేష్, రాజారావు, అభిలాష్ ల డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెప్పిన డీటెయిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చనిపోయిన ఈ ఐదుగురికి ఒక పోలిక వుంది. వాళ్ళ అందరికి RIBCAGES విరిగిపోయి ఎముకలు ఊపిరితిత్తుల్లోకి గుచ్చుకున్నాయి. రాజారావు కి మాత్రం ఎడమ RIBCAGE ఎముకలు డైరెక్ట్ గా హార్ట్ లో కి వెళ్లడం తో ప్రాణం వెంటనే పోయింది. కానీ, మిగతా నలుగురికి మాత్రం రెండు వైపులా ఎముకలు విరిగి ఊపిరి తిత్తుల్లోకి చొచ్చుకు పోయాయి. ఇది చాలా రేర్ గా వుంది. నలుగురికి వెన్నుపూస కంప్లీట్ గా చెల్లా చెదురయ్యింది... కొట్టిన వాళ్ళు ఎవరో కానీ చనిపోయిన వాళ్ళ మీద చాలా కసి  తెలుస్తోంది. ఈ అయిదుగురిని బాగా హింస పెట్టి మరీ చంపడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది... నర్సింగ్, మల్లేష్, అభిలాష్ లకు కుడి తొడ ఎముక కూడా విరిగింది. మానవ శరీరంలో తొడ ఎముక చాలా బలంగా, పొడుగ్గా ఉంటుంది. దాన్ని విరగ కొట్టడం చాలా కష్టం. ఒక తొడ ఎముక విరగాలంటే దాదాపు 4000 న్యూటన్స్ ఫోర్స్ కావాలి. అంటే ఎవరైనా బలంగా తంతే దాదాపు 400 కిలోల బరువుతో ఆ దెబ్బ పడాలి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ "నేను గత 22 ఏళ్లుగా పోస్ట్ మార్టం లు చేస్తున్నాను. ఇంత వరకు విరిగిన తొడ ఎముక ని చూడలేదు. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు తొడ ఎముకలు విరగడం చూసాను.... అది కూడా ఒకే రోజు..... " అంత బలం సామాన్య మానవుడికి ఉండదు. కొట్టిన వ్యక్తి మాత్రం చాలా బలవంతుడు మాత్రమే కాదు, వాళ్ళ మీద చాలా కోపం, కసి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజారావు ఒక్క దెబ్బకే చనిపోయాడు.

ఈ కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. హోమ్ మినిస్టర్ ప్రభాకరరావు రోజుకి 10 సార్లు ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు. తన  సొంత మనుషుల తో కూడా ఎంక్వయిరీ చేయిస్తున్నాడు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. చాలా వింత గా వుంది. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎక్కడ కూడా CCTV footage లేదు. ఇన్వెస్టిగేట్ చెయ్యగా పోలీస్ surveillance కెమెరా ఫీడ్ ని కూడా హ్యాక్ చేసి మానిప్యులేట్ చేశారు. బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు మాత్రమే చేయగలరు. హైదరాబాద్ లో వున్న ఎథికల్ హకెర్స్ అందరి ని పిలిచి ఇంటరాగేట్ చెయ్యడం జరిగింది. వాళ్ళు ఎవరూ చేయలేదు. పైగా వాళ్ళు కి కూడా పోలీస్ surveillance కెమెరా ఫీడ్ ని ఎవరు, ఎలా హ్యాక్ చేసి రీప్లేస్ చేశారు కూడా అర్థం కాలేదు. అందరూ "ఇది చేసినవాళ్లు ఎవరో కానీ, వాళ్ళకి సుపీరియర్ టెక్నికల్ నాలెడ్జ్ వుంది." అని అన్నారు. ఈ కేసు వివరాలు తెలుసుకున్న CENTRAL BUREAU OF INVESTIGATION కూడా రంగంలోకి దిగింది. వాళ్ళు చెప్పిన విశేషాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ హత్యలు జరిగిన రోజు ఎవరో ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ని హాక్ చేసి, ఇండియా లో వున్నా అన్ని ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ కెమెరా లైవ్ ఫీడ్ ని, ట్రాఫిక్ ఫీడ్ ని కూడా మానిప్యులేట్ చేశారని చెప్పారు. ఈ హత్యలు ఎక్కడెక్కడ జరిగాయో ఆయా ప్రాంతాల్లో CCTV లు అన్ని హాక్ చేయబడ్డాయి. ప్రస్తుతం ఈ కేసు ని లోకల్ పోలీస్, CENTRAL BUREAU OF INVESTIGATION, INTELLIGENCE BUREAU లు ఒక జాయింట్ యాక్షన్ టీం ని ఏర్పాటు చేశారు. దానికి సిటీ కమిషనర్ రవీంద్ర ని చీఫ్ గా నియమించారు. భారీ ఎత్తున కంప్యూటర్ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఎక్సపెర్ట్స్ ని రంగంలోకి దింపారు.

ఇది ఇలా జరుగుతుండగా... ఒక రోజు... ఆదివారం... 2:00 PM... సిటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర లంచ్ చేసి కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ఆ సమయంలో మొబైల్ ఫోన్ మోగింది. రవీంద్ర క్లోజ్ ఫ్రెండ్ సుధాకర్... "నీతో చాలా అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి .... మీ ఇంటికి ఇప్పుడు వొస్తున్నాను.... నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ని కూడా తీసుకొని వస్తున్నాను. This is a very serious matter. You just cannot believe it. Don't go anywhere" ఒక 10 నిమిషాల తరువాత సుధాకర్ ఇంకో వ్యక్తి తో వచ్చాడు. అతడి ని రవీంద్ర ఎప్పుడూ చూడలేదు. సుధాకర్ ఆ వ్యక్తి ని రవీంద్ర కి పరిచయం చేస్తూ

సుధాకర్: Ravi.... Please meet Mr. Srinivas. Tenure Professor of Stanford University. He is visiting his family. He has got something to tell you. That might help your police work.

రవీంద్ర కి అర్ధం కాలేదు. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కి హైదరాబాద్ పోలీస్ తో ఏమి పని?

రవీంద్ర : వెరీ నైస్ టు మీట్ యు  ప్రొఫెసర్.... హౌ కెన్ ఐ హెల్ప్ యు?

శ్రీనివాస్ (షర్ట్ పాకెట్ లోంచి ఒక పేపర్ కటింగ్ తీసి రవీంద్ర కి ఇస్తూ): ఇది మీరు ఇచ్చిన advertisement కదా...

రవీంద్ర ఆ పేపర్ కటింగ్ చూసాడు. అది షాపింగ్ మాల్ ల్లో కార్ ఆక్సిడెంట్ లో చనిపోయిన గుర్తు తెలియని వ్యకి గురించి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ ఇచ్చిన పేపర్ advertisement.

రవీంద్ర(శ్రీనివాస్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక): అవును.

శ్రీనివాస్: ఈ ఫోటో ఎవరిదో మీకు తెలుసా?

రవీంద్ర: తెలీదు. అందుకే మేము పేపర్ లో ప్రకటించాము. ఇంత వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. అతను ఎవరో మీకు తెలుసా?

శ్రీనివాస్: చాలా బాగా తెలుసు.

రవీంద్ర (ఆత్రంగా): ఎవరు...

శ్రీనివాస్: ఆయన పేరు Dr. శరత్. ఆయన MASSACHUSETTS INSTITUTE OF TECHNOLOGY లో ప్రొఫెసర్. నాకు ఆయన, ఆయన భార్య కవిత వాళ్ళ పిల్లలు బాగా తెలుసు. మీకు ఆయన ఫోటో ఎలా దొరికింది? ఎందుకు పేపర్ లో వేశారు?

రవీంద్ర: ఈ వ్యక్తి మూడు నెలల కిందట ఒక షాపింగ్ మాల్ లో కార్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. మాకు ఎలాంటి ID దొరకలేదు. అందుకే మేము పేపర్ లో ప్రకటించాము.

శ్రీనివాస్: THAT IS IMPOSSIBLE. Dr. శరత్ మూడు నెలల క్రితం వాళ్ళ ఇంట్లో లాప్ టాప్ పట్టుకొని మెట్లు దిగుతూ జారి పడ్డాడు. అలా పడటంతో ఆ లాప్ టాప్ బలంగా ఆయన గుండెల్లో గుచ్చుకుంటే అక్కడికక్కడే మరణించారు. నేను ఆయన cremation కి వెళ్ళాను. తర్వాత MIT వాళ్ళు ఏర్పాటు చేసిన మెమోరియల్ సర్వీస్ ని కూడా చూసాను. నా భార్య కవిత గారికి మంచి ఫ్రెండ్.

రవీంద్ర మైండ్ బ్లాక్ అయ్యింది.

రవీంద్ర: NO... ఈ వ్యక్తి ఇక్కడ హైదరాబాద్ లో కార్ ఆక్సిడెంట్ లో లాప్ టాప్ గుండెల్లో గుచుకోవడం తో మరణించాడు. ఇక్కడ చనిపోయిన వ్యక్తి కి అమెరికా లో ఎలా కర్మ కాండలు జరుగుతాయి? ఆ శవం ఇంకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ లో వుంది. మీరు ఏదో పొరపడినట్లున్నారు.

శ్రీనివాస్ (కొంచెం అయోమయంగా) : ఇక్కడ ఎలా మరణిస్తాడు? ఆయన ఉండేది కేంబ్రిడ్జి.... అక్కడ మరణించిన వ్యక్తి శవం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ లో ఎలా ఉంటుంది? అక్కడ దహనకాండ జరిగాయి. అసలు ఏమి జరిగింది?

రవీంద్ర వివరంగా హైదరాబాద్ షాపింగ్ మాల్ లో జరిగిన ఆక్సిడెంట్ గురించి చెప్పాడు. ఆక్సిడెంట్ జరిగినప్పుడు తీసిన ఫొటోస్ శ్రీనివాస్ కి చూపించాడు. వాటిని చూసిన శ్రీనివాస్ నోట మాట రాలేదు. అవి ప్రొఫెసర్ శరత్ ఫోటోలు..... ఆయన కళ్ళజోడు ని గుర్తు పట్టాడు. ప్రతి ఫోటో చాలా జాగ్రత్త గా చూసి ...

శ్రీనివాస్ : Something is wrong... ఇవి శరత్ ఫొటోలే... మీరు చెప్పిన ప్రకారం శరత్ ఇక్కడ హైదరాబాద్ లో కార్ ఆక్సిడెంట్ లో లాప్ టాప్ గుండెల్లో గుచుకోవడం తో మరణించాడు. కానీ, నాకు తెలిసి ఇదే శరత్ కేంబ్రిడ్జి లో అలాగే లాప్ టాప్ గుండెల్లో గుచుకోవడం తో మరణించాడు. అది ఎలా సాధ్యం? రెండు చోట్లా cause of death ఒక్కటే... మరణించిన శరత్ శవం ఇక్కడ మార్చురీ లో ఉంటే మరి... అక్కడ ఎవరికి దహన సంస్కారాలు జరిపారు?

రవీంద్ర: మీ ప్రొఫెసర్ శరత్ చనిపోయినప్పుడు అక్కడ అమెరికా లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా?

శ్రీనివాస్: YES. శరత్ మేడ మెట్ల మీద జారి పడిన వెంటనే లాప్ టాప్ గుండెల్లో గుచుకోవడం తో బాగా రక్తం పోయింది. వాళ్ళ అబ్బాయి అంబులెన్స్ కి ఫోన్ చేసాడు. వాళ్ళు పోలీస్ తో సహా వొచ్చి శరత్ డెడ్ బాడీ ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి శవాన్ని ఫ్యామిలీ కి ఇచ్చారు. ఆ తర్వాత దహనకాండ జరిగాయి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది.

రవీంద్ర(అయోమయంగా): అక్కడ శరత్ ఏ రోజు చనిపోయాడు?

శ్రీనివాస్: పోయిన December 12 వ తారీఖున ...

రవీంద్ర: NOWAY... షాపింగ్ మాల్ లో ఆక్సిడెంట్ అయింది December 9. ఇక్కడ చనిపోయి మార్చురీ లో వున్న వ్యక్తి మళ్ళీ మూడు రోజుల తర్వాత అమెరికాలో అదే కారణంతో ఎలా చనిపోయాడు?

ఒక 5 నిమిషాలు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది.

శ్రీనివాస్: మీరు ఏమి అనుకోకపోతే... నేను ఒకసారి ఇక్కడ వున్నా శవాన్ని చూడవచ్చా...

రవీంద్ర: SURE .....అమెరికా లో ఏదో పెద్ద క్రైమ్ జరిగింది. పైగా మీరు ఇక్కడ వున్నా శవాన్ని గుర్తు పడితే మేము ఫార్మాలిటీస్ పూర్తి చేసి మీకు అప్పగిస్తాను.

ముగ్గురూ కలిసి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ కి బయలుదేరారు. దారిలో రవీంద్ర ఆఫీస్ కి ఫోన్ చేసి కొంత ఏమండీ ఆఫీసర్స్ ని ఈ కేసు కి సంబంధించిన ఫైల్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కి రమ్మన్నాడు. వాళ్ళు ముగ్గురూ అక్కడికి చేరే లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి చేరుకొని వెయిట్ చేస్తున్నారు. అంతా కలిసి మార్చురీ లోకి వెళ్లి ఆ గుర్తు తెలియని శవం దాచి పెట్టిన సెల్ ఓపెన్ చేశారు... అందులో... శరత్ శవం బదులు ఎవరో ఒక ముసలి వ్యక్తి శవం వుంది. అది చూసి శ్రీనివాస్ " ఇది Dr. శరత్ డెడ్ బాడీ కాదు" అని అన్నాడు. ఆ మాటలు ఎవరి చెవులను పడలేదు. వాళ్ళంతా ఒక రకమైన షాక్ లోకి వెళ్ళిపోయారు. శ్రీనివాస్ చెప్పినట్లు ఇక్కడ హైదరాబాద్ లో చనిపోయిన వ్యక్తి అమెరికా కి చెందిన ప్రొఫెసర్ శరత్ అయినట్లయితే... మరి పోస్ట్ మార్టం చేసి మార్చురీ లో పెట్టిన శవం మాయమయ్యి అమెరికా ఎలా చేరింది?


PART - 3 - CLUELESS

సిటీ పోలీస్ కమిషనర్ రవీంద్ర, ఆయన డిపార్టుమెంటు ఆఫీసర్స్, గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ స్టాఫ్, సుధాకర్, శ్రీనివాస్... వీళ్ళందరికీ అక్కడ ఏమి జరిగిందో, జరుగుతోందో అన్న సంగతి అస్సలు అర్ధం కాలేదు. ఒక అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్... హైదరాబాద్ లో ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. మళ్ళీ మూడు రోజుల తరువాత అదే వ్యక్తి అమెరికాలో చనిపోయాడు. ఎలా సాధ్యం? శవం హైదరాబాద్ లో మాయమయ్యి అమెరికా ఎలా చేరింది? ఎవరు తీసుకెళ్లారు? అసలు ఈ ప్రొఫెసర్ హైదరాబాద్ లో ఒక షాపింగ్ మాల్ బేసెమెంట్ కార్ పార్కింగ్ లో ఒక డొక్కు మారుతి కార్ లో కూర్చొని లాప్ టాప్ లో ఏమి ఏమిచేస్తున్నాడు?

రవీంద్ర అందరికన్నా ముందు తేరుకొని తన డిపార్ట్మెంట్ వాళ్ళతో "ఇక్కడ శవం మాయమైన సంగతి ఎవరికి తెలియనియ్యకండి. సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చెయ్యండి. శవాన్ని ఎవరు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఎక్కడి కి తీసుకెళ్లారు... అన్ని డీటెయిల్స్ నాకు 24 గంటలలో తెలియాలి" అని చెప్పి సుధాకర్, శ్రీనివాస్ లని తీసుకొని తనకు ఆఫీస్ కి వెళ్ళాడు.

శ్రీనివాస్ "నేను శరత్ పర్సనల్ ఐటమ్స్ చూడవొచ్చా?" అని అడిగాడు. రవీంద్ర సరే అని ఎవిడెన్స్ దాచే రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక కార్డు బోర్డు బాక్స్ మీద కేసు డీటెయిల్స్ వ్రాసి వున్నాయి. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసాడు... ఖాళీగా వుంది. అందులో ఉండాల్సిన శరత్ బట్టలు, షూస్, సాక్స్, కళ్ల జోడు, లాప్ టాప్, మొబైల్ ఫోన్, బ్లూ టూత్ డివైస్... అన్ని మాయమయ్యాయి. రవీంద్ర కి కళ్లు తిరిగిపోయాయి. ఎలా మాయమయ్యాయి?

శ్రీనివాస్ నెమ్మదిగా "నేను శరత్ మరణానికి కారణమైన లాప్ టాప్ ని వాళ్ళ ఇంట్లో చూసాను" అని అన్నాడు.

రవీంద్ర కి నిజం గా పిచ్చిఎక్కేలావుంది. ఎవరు ఈ శరత్? ఇక్కడ ఏమి చేస్తున్నాడు? అతనికి సంభంధించిన వస్తువుల్లన్ని... శవంతో సహా... ఒక్కసారిగా ఎలా మాయమయ్యాయి? రవీంద్ర కి జీవితం లో మొదటిసారి భయమంటే ఏమిటో తెలిసింది. మనుషులు సాధారణంగా వాళ్ళ జీవితాలలో ఏదైనా థ్రెట్ ఉంటే భయమేస్తుంది. కానీ... రవీంద్రకి ఏమి జరుగుతోందో తెలియక భయం వేసింది.

రవీంద్ర (శ్రీనివాస్ వైపు చూస్తూ): మీకు శరత్ గురించి ఏమి తెలుసో అంతా నాకు చెప్తారా?

శ్రీనివాస్ : తప్పకుండా... శరత్ ఒక జీనియస్. కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాల్లో చాలా నాలెడ్జి వుంది. ఢిల్లీ IIT లో గోల్డ్ మెడలిస్ట్. తరువాత ఫుల్ scholarship మీద MIT లో మాస్టర్స్ డిగ్రీ చేసి అక్కడే రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందాడు. కొంత కాలం అక్కడే టీచింగ్ చేసాడు. తరువాత US గవర్నమెంట్ ఆయనను ఏదో ఒక సీక్రెట్ పనిమీద Langley, Virginia పంపించింది. అక్కడ దాదాపు 10 ఏళ్ళు రకరకాల సీక్రెట్ ప్రాజెక్ట్స్ లో పని చేసాడు. ఆ ప్రాజెక్ట్స్ పూర్తికాగానే ఆయనకు Tenure Professor గా ప్రమోట్ చేసి MIT కి పంపారు. శరత్ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ కి consultant గా కూడా పనిచేశాడు. Boston Police Department వాళ్ళకి ఉచితంగా వాళ్ళ Traffic Surveillance System మొత్తాన్ని upgrade చేసాడు... ఎంతో మంది స్టూడెంట్స్ కి ఉచితంగా ట్యూషన్స్ చెప్పేవాడు. కేంబ్రిడ్జి కమ్యూనిటీ లో చాలా ఆక్టివ్ మెంబెర్. హార్వర్డ్, యేల్, Princeton, Stanford, Berkley లో గెస్ట్ లెక్చర్స్ చాలా ఇచ్చాడు.

శ్రీనివాస్ చెప్తున్నదంతా వింటున్న రవీంద్ర "Boston Police Department... Traffic Surveillance System... ఉచితంగా upgrade" అన్న మాటల దగ్గరే ఆగిపోయాడు... మిగతాది చెవికిఎక్కలేదు.

రవీంద్ర (నమ్మశక్యం కాని... ఆశ్చర్యం కలబోసిన చూపుతో): శరత్ Boston Police Department Traffic Surveillance System ని ఉచితంగా upgrade చేశాడా...

శ్రీనివాస్: అవును. One of the best in the world

రవీంద్ర నోటమాట రాలేదు. శ్రీనివాస్, సుధాకర్... వీళ్లిద్దరికీ December 9 న హైదరాబాద్ లో జరిగిన విషయాలు ఏవి తెలియక పోవడంతో రవీంద్ర ఏ యాంగిల్ లో అడుగుతున్నాడో వాళ్ళకి తెలీదు. ఇప్పుడిప్పుడే ఎక్కడో లింక్ / క్లూ డెవలప్ అవుతోంది. జాగ్రత్త వివరాలు రాబట్టాలి అని అనుకున్నాడు.

రవీంద్ర: శరత్ కి ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?

శ్రీనివాస్: తెలీదు... శరత్... అతని భార్య కవిత ఎప్పుడూ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి పెద్దగా మాట్లాడగా నేను వినలేదు. ఒకసారి మాటల్లో తాను గోదావరి జిల్లా లో ఒక పల్లెటూరు కి చెందినట్లు చెప్పాడు. అంతే... అతని ఫామిలీ గురించి విశేషాలు అసలు తెలియవు. నేను కేంబ్రిడ్జి లో పనిచేసినన్నాళ్లు నాకు తెలిసి శరత్, కవిత వాళ్ళ పిల్లలు ఇండియా ఎప్పుడూ రాలేదు. తరువాత నేను స్టాన్ఫోర్డ్ లో జాబ్ రావడం తో అక్కడి కి వెళ్ళాను. శరత్ ఫామిలీ తో కలసి గవర్నమెంట్ పనిమీద Langley వెళ్ళాడు. మేము రెగ్యులర్ గా ఇమెయిల్ రాసుకునేవాళ్ళము.

రవీంద్ర: శరత్ మీతో ఎప్పుడూ తను అమెరికన్ గవర్నమెంట్ కి ఏ ప్రాజెక్ట్స్ లో చేసాడో చెప్పలేదా...

శ్రీనివాస్: లేదు. అన్ని Top Secret & Classified ప్రాజెక్ట్స్...

రవీంద్ర (సన్నగా నవ్వుతూ): ఎంత టాప్ సీక్రెట్ అయినా మీకు ఎంతో కొంత చెప్పేఉంటాడు. చెప్పండి ఫరవాలేదు... ఇప్పుడు శరత్ కూడా లేదు. కాబట్టి ఆయన కి ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు.

శ్రీనివాస్ మౌనంగా వుండిపోయాడు. రవీంద్రకి అర్ధమయ్యింది. శ్రీనివాస్ కి చాలా విషయాలు తెలుసు. చెప్పడానికి తటపటాయిస్తున్నాడు. ఒక పది నిమిషాలు పాటు రవీంద్ర, సుధాకర్, శ్రీనివాస్ నిశ్శబ్దంగా ఉండిపోయారు. రవీంద్ర అందరికి టీ తెప్పించాడు. ముగ్గురూ మౌనంగా టీ తాగారు.

శ్రీనివాస్: with your permission... can I smoke a cigarette?

రవీంద్ర: No problem... please feel free

ఇద్దరూ సిగరెట్ వెలిగించారు.

శ్రీనివాస్: నేను మీకు చెప్పబోయేది చాలా సీక్రెట్. మీరు పొరపాటున కూడా ఎవరికి చెప్పకూడదు. ఆలా అని మీరు ప్రామిస్ చేస్తే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను.

రవీంద్ర (అదిరే గుండెలతో): తప్పకుండా... ఎవరికి చెప్పను.

శ్రీనివాస్: శరత్ MIT లోప్రోఫెసర్ మాత్రమే కాదు. అమెరికన్ గవర్నమెంట్ కి బాగా కావలసిన వ్యక్తి. ఆయన Langley వున్నప్పుడు. New Generation American National Reconnaissance Spy Satellite ని డిజైన్ చేసే టీం లో పనిచేశాడు.

ఇది విన్న రవీంద్ర కి నిజంగానే గుండె ఆగినంత పనిఅయ్యింది. శరత్... ఒక టాప్ అమెరికన్ సైంటిస్ట్ / ఇంజనీర్... హైదరాబాద్ వున్నాడు... అదే రోజు ఇండియన్ కమ్యూనికేషన్స్ సాటిలైట్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హాక్ చేశారు. అదే రోజు హైదరాబాద్ సిటీ లో ట్రాఫిక్ CCTV ఏది కూడా సరిగ్గా పనిచేయలేదు. అదే రోజు ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నిట్లోనూ సెక్యూరిటీ కెమెరా footage పూర్తిగా మానిప్యులేట్ అయ్యింది. సిటీ లో దాదాపు 20 హత్యలు జరిగాయి. తాను కూడా మరణించాడు. మళ్ళీ మూడు రోజుల తరువాత అమెరికాలో మరణించాడు. అసలు ఏమి జరిగింది? ఏమి జరుగుతోంది?? ఏమి జరగబోతోంది??? అన్ని ఇప్పుడే తెలియాలి...

రవీంద్ర: మీకు ఇంకా ఏమి తెలుసు?

శ్రీనివాస్: ఇంత వరకే తెలుసు... తాను ఎప్పుడూ కూడా నాకు డైరెక్ట్ గా ఏమి చెప్పలేదు... కానీ నేనే మాటల్లో ఈ విషయాలు గ్రహించాను. నాకు తెలియకుండా శరత్ ఇంకా చాలా చేసివుండవొచ్చు.

రవీంద్ర: మీకు శరత్ సొంత వూరు ఎదో తెలుసా?

శ్రీనివాస్: లేదండి. గోదావరి జిల్లా లో ఏదో పల్లెటూరు అని చెప్పాడు. ఊరి పేరు గుర్తు లేదు.

రవీంద్ర: ఆయన భార్యది ఏవూరు?

శ్రీనివాస్: తెలీదు.

రవీంద్ర: వీలయితే తెలుసుకొని చెప్పగలరా...

శ్రీనివాస్: ట్రై చేస్తాను. వాళ్ళు చాలా భాధ లో వున్నారు. ఇప్పుడప్పుడే కనుక్కోవడం కుదరదు...

రవీంద్ర: నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు.

శ్రీనివాస్: ఏ విషయం లో?

రవీంద్ర: శరత్ అమెరికాలో మరణించడం, అక్కడ పోలీస్ మళ్ళీ పోస్ట్ మార్టం చెయ్యడం... దహన సంస్కారాలు... మెమోరియల్ సర్వీస్... ఇవన్నీ నమ్మదగ్గవిగా లేవు.

శ్రీనివాస్: మీకు అంతగా డౌట్ గా ఉంటే చెప్పండి... నేను మీకు ప్రూవ్ చేస్తాను...

రవీంద్ర: ఎలా?

శ్రీనివాస్: మీ కంప్యూటర్ ని కొంచం వాడుకోవొచ్చా?

రవీంద్ర: సరే.

శ్రీనివాస్ పోలీస్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ లో లాగ్ ఇన్ అయ్యి తన పర్సనల్ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో చాలా కాలంగా సేవ్ చేసి పట్టుకున్న ఫోటో ఆల్బం ఓపెన్ చేసి రవీంద్ర కి చూపించాడు. అందులో శరత్, అయన ఫామిలీ ఫొటోస్, హాలిడే ఫొటోస్, ఫంక్షన్ ఫొటోస్... చివరికి శరత్ మెమోరియల్ సర్వీస్ ఫొటోస్ వున్నాయి. ఆ ఫొటోస్ చూస్తుంటే రవీంద్ర కి అర్ధమయ్యింది. శరత్ ఆర్డినరీ పర్సన్ కాదు. చాలా పెద్ద లెవల్లో కనెక్షన్స్ వున్న వ్యక్తి లాగా వున్నాడు. చాలా జాగ్రత్త డీల్ చెయ్యాలి. రవీంద్ర ఆ ఫొటోస్ వున్నవాళ్లందరి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాడు. ఎందుకైనా మంచిదని మెమోరియల్ సర్వీస్ ఫొటోస్ అన్ని తన లోకల్ హార్డ్ డ్రైవ్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు.

రవీంద్ర: మీరు ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళు వుంటారు?

శ్రీనివాస్: నా మేనకోడలు పెళ్లి కి వొచ్చాను. ఇంకో 10 రోజుల్లో వెళతాను.

రవీంద్ర: మీరు స్టాన్ఫోర్డ్ లో ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు?

శ్రీనివాస్ మౌనం వహించాడు. జవ్వాబు ఇవ్వలేదు.

రవీంద్ర కి ఎందుకో డౌట్ వొచ్చింది...

రవీంద్ర: మీరు నిజం గానే స్టాన్ఫోర్డ్ లో పనిచేస్తారా?

శ్రీనివాస్ 5 నిమిషాల తరువాత నెమ్మదిగా...

శ్రీనివాస్: I never worked at Stanford. I am a scientist at NASA...

దాదాపు ఒక 20 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు అందరికి అర్ద్మయ్యింది నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో...

శ్రీనివాస్: ఇక నేను వెళతాను...

రవీంద్ర: మీకు శరత్ గురించి వేరే ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఇది నా విసిటింగ్ కార్డు.

శ్రీనివాస్: సరే...

శ్రీనివాస్, సుధాకర్ వెళ్లిపోయారు. రవీంద్ర కూడా ఇంటికి వెళ్ళాడు. స్తానం చేసి డ్రెస్స్ చేంజ్ చేసుకొని విస్కీ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ ఆ కేసు డీటెయిల్స్ ఒకటి ఒకటిగా మనసులో రివైజ్ చేసుకున్నాడు. అంతా అర్ధమయినట్లే వుంది. మళ్ళీ చాలా కన్ఫ్యూషన్ గా వుంది. డిన్నర్ చేసి నిద్రపోయాడు.


PART - 4 - THE FLIGHT OF THE DEAD BODY

రవీంద్ర మరుసటి రోజు ఉదయం లేచిన వెంటనే మార్చురీ లో ఎంక్వయిరీ చేస్తున్న DSP కి ఫోన్ చేసాడు.

DSP: గుడ్ మార్నింగ్ సర్

రవీంద్ర: గుడ్ మార్నింగ్... ఏమైనా వివరాలు తెలిసాయా

DSP: లేదు సర్. ఎవరూ సరిగ్గా చెప్పలేక పోతున్నారు. ఎక్కడా సరైన లీడ్ దొరకడం లేదు. ఇక్కడ పని చేసేవారిని కస్టడీ లోకి తీసుకొని విచారిస్తే ఏదైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అరెస్ట్ చెయ్యమంటారా...

రవీంద్ర: వొద్దు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీడియా కి తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానినికి సీక్రెట్ గా ఉంచండి. శవం మాయమైన విషయం బయటకి పొక్కకుండా చూడండి. ఎవరినైనా అరెస్ట్ చెయ్యాలి అంటే నేనే చెప్తాను. అప్పటిదాకా ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి అక్కడ కార్గో డివిజన్ లో కానీ, కమర్షియల్ ఫ్లైట్ డివిజన్ లో గాని ఆరోజు ఏదైనా కాఫిన్ అమెరికా వెళ్లిందా అని కనుక్కోండి. అలాగే మన దేశం లో వున్న అన్ని చిన్న, పెద్ద ఎయిర్పోర్ట్స్ లో కూడా లాస్ట్ ఇయర్ December 9 - December 12 మధ్య ఇండియా నుండి ఏదైనా కాఫిన్ అమెరికా కి వెళ్ళిందేమో చెక్ చెయ్యండి. కొంచం లో ప్రొఫైల్ మైంటైన్ చెయ్యండి. హడావిడి చేస్తే ప్రెస్, మీడియా కి తెలిసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త...

SP: అలాగే సర్...

రెండో ఫోన్ కాల్ DGP కి చేసాడు...

రవీంద్ర: సర్... గుడ్ మార్నింగ్...

DGP : గుడ్ మార్నింగ్... ఏదైనా డెవలప్మెంట్ ఉందా? HOME MINISTER గంటకోసారి ఫోన్ చేసి బూతులు తిడుతున్నాడు...

రవీంద్ర: వుంది సర్. నేను ఇప్పుడే బయలుదేరి మీఇంటికి వొస్తున్నాను. మీతో పర్సనల్ గా కలిసి అప్డేట్ చేస్తాను.

DGP: Sure. Come over for breakfast...

రవీంద్ర బ్రేక్ ఫాస్ట్ చేస్తూ చెప్పిన విషయాలు విన్న DGP కి మతిపోయింది... 1. ఆ అనాథ శవం పేరు Dr. శరత్ 2. ఆ శవం మాయమయింది. 3. 10000 మైల్స్ ప్రయాణం చేసి అమెరికా చేరుకుంది. 4. అక్కడ,ఇక్కడ పోలీస్ రిపోర్ట్ ప్రకారం కూడా కాజ్ అఫ్ డెత్ ఒక్కటే...

DGP: How come it is possible?

రవీంద్ర: I don't know. We are checking at airports all over India to find out if any coffin was booked in cargo or commercial flights between last December 9th to 12th. I am hoping for some lead...

DGP: Why don't we book that Scientist guy from USA

రవీంద్ర: Prof. Srinivas? On what grounds?

DGP: Arrest him and try to get where abouts of Sarath on these dates...

రవీంద్ర: I don't think that is good idea. Had he not approached us, we would't have known the name of the dead person and missing of the dead body. In a way he did a favor. He is going to stay in India for another 10 days. I know his address. If required I will arrest him before his departure to USA. I will ask someone to tail him...

DGP: Alright... I will update home Minister. But he is not gonna like it. We need to wrap up this case at the earliest...

రవీంద్ర: One more thing sir..... Team that was investigating Mr. Abhilash's death found that there was a secret safe in his office. It was wide open and contents of the safe are gone. Can you please ask Home Minister whether he could shed some details of the contents of safe? I believe the person who killed him must have emptied the safe. We need to know the contents...

DGP: I will ask him. Please find out how come that dead body is missing from mortuary... and where the hell it ended up. It is getting complicated day by day...

రవీంద్ర అక్కడినుంచి బయలుదేరి తన ఆఫీస్ కి వొచ్చాడు. తను IPS ట్రైనింగ్ లో వున్నప్పుడు ఒక సీనియర్ ఆఫీస్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. "ప్రతి పోలీస్ ఉద్యోగి సర్వీస్ లో కొన్ని వేల కేసులు సాల్వ్ చెయ్యవొచ్చు. వాటి అన్నిటిని గుర్తుపెట్టుకోలేడు. కానీ, ఎప్పుడోఒకప్పుడు ఏదో ఒక ఇంటరెస్టింగ్ కేసు వొస్తుంది. దాన్ని ఆ ఉద్యోగి జీవిత కాలమంతా మరిచిపోలేడు"... నా జీవితంలో ఆ కేసు ఇదేనా... అని అనుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. కేసు ముందుకు వెళ్లడం లేదు. దేశం లో వున్న అన్ని ఎయిర్పోర్ట్స్ నుండి రిపోర్ట్స్ వొచ్చాయి. డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 12 మధ్య వివిధ ప్రాంతాలకి వెళ్లిన కాఫిన్ బాక్స్ అన్ని లెక్క సరిపోయాయి. ఎటువంటి సందేహం లేదు. అవన్నీ genuine కేసుల్ని తేలాయి...

ఒక రోజు... మార్చురీ లో శవం మాయమైన విషయాన్ని ఎంక్వయిరీ చేస్తున్న DSP హడావిడిగా వొచ్చి... "ఒక క్లూ దొరికింది సర్" అని అన్నాడు. అతని తో పాటు ఇంకో వ్యక్తి వున్నాడు.

రవీంద్ర : రియల్లీ!!! ఏమిటది?

DSP: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డిసెంబర్ 10వ తారిఖ్ రాత్రి ఒక సంఘటన జరిగింది. నేను అక్కడ పని చేసే ఎంప్లాయ్ ని తీసుకొచ్చాను...

రవీంద్ర: ఇతనేనా ఆ ఎంప్లాయ్...

DSP: అవును సర్... నువ్వు నాతో చెప్పినదంతా సార్ కి చెప్పు...

ఎంప్లాయ్ : నేను ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ రీ ఫ్యూయల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నా పని ల్యాండ్ అయినా విమానాలలో అవసరమైన ఫ్యూయల్ నింపడం. నేను ఫ్యూయల్ టాంకర్ తో పటు వెళతాను. డిసెంబర్ 10 రాత్రి రెండుగంటలకు మా supervisor నాతో ఎయిర్పోర్ట్ లో దూరంగా వుండే Personal / Corporate jets ఆగే చోటికి వెళ్లి ఒక విమానంలో ఫ్యూయల్ నింపి రమ్మన్నాడు. నేను ఫ్యూయల్ టాంకర్ డ్రైవర్ తో కలసి ఆ Corporate Jet ఆగి వున్న చోటికి వెళ్ళాము. అది నార్మల్ గా కమర్షియల్ జెట్స్ ఆగే చోటు కన్నా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ వున్న హంగేర్ లో ఒక కార్పొరేట్ జెట్ అప్పుడే వొచ్చి ఆగింది. అందులోంచి ఒక అమెరికన్ దిగాడు. అప్పటికే అక్కడ చాలా మంది అమెరికన్స్ వున్నారు. కొన్ని కార్స్ కూడా ఆగి వున్నాయి. చాలా పెద్దవాళ్ళ లాగా వున్నారు. వాళ్ళతో పాటు కొంచం దూరం గా ఒక అయిదుగురు నిలబడివున్నారు. వాళ్ళు మన ఇండియన్స్. అందులో ఒక ఆడ ఆమె కూడా వుంది. ఆమె తన పక్కనే వున్న ఒక మగాడిని పట్టుకొని విపరీతం గా ఏడుస్తోంది. అతను ఆమె ని ఓదారుస్తున్నాడు... అతను కాకుండా ఇంకో ముగ్గురు మగాళ్లు కూడా వున్నారు. వాళ్ళు కూడా మౌనంగానే రోదిస్తున్నారు. ఆ ఆడదాన్ని ఓదారుస్తున్న వ్యక్తి మాత్రం చాలా గంభీరంగా వున్నాడు. అతను ఏడవడం లేదు...

రవీంద్ర: నువ్వు వాళ్ళని గుర్తు పట్టగలవా...

ఎంప్లాయ్: ఎవరూ.... మన ఇండియన్స్ నా.... గుర్తు పెట్టగలను. అమెరికన్స్ చాలా మంది వున్నారు వాళ్ళని గుర్తు పట్టడం కష్టం.

రవీంద్ర: తరువాత ఏమైంది?

ఎంప్లాయ్: ఆ విమానంలోంచి దిగిన అమెరికన్ మన ఇండియన్స్ దగ్గరికి వెళ్లి చాలా సేపు మాట్లాడాడు. ఆ ఏడుస్తూన్న ఆమెని కొంచం సేపు ఓదార్చాడు. ఇంతలో ఆ అమెరికన్ అందరూ కార్స్ ఎక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ మన ఇండియన్స్ మరియూ ఆ విమానం క్రూ మాత్రమే వున్నారు. మేము ఫ్యూయల్ నింపి విమానాన్ని సర్వీస్ చేసి బయలుదేరాము. ఆడే టైం లో ఆ అయిదుగురు విమానం ఎక్కారు. మేము బయలుదేరాము. కొందాం దూరం వొచ్చాక నేను వెనక్కి తిరిగి చూసాను. అప్పుడు ఏదో పెద్ద పెట్టె ఆ విమానం కార్గో లోకి ఎక్కించడం నాకు కనిపిచింది.

రవీంద్ర(ఆత్రంగా) : ఆ పెద్ద పెట్టె కాఫినా

ఎంప్లాయ్ : అది నాకు క్లియర్ గా కనిపించలేదు సార్... కానీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో విమానం కార్గో కంపార్ట్మెంట్ లో ఏదీ పెద్ద పెట్టె ఎక్కిచడం అనుమానాన్ని కలిగించింది.

రవీంద్ర: ఏమిటీ ఆ అనుమానం.

ఎంప్లాయ్: నార్మల్ గా ఏ విమానం లోఅయినా కార్గో లోడ్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్ కార్గో డివిజన్ ఎంప్లాయిస్ వుంటారు. కానీ, ఆ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఎవరూ లేరు. అక్కడ వున్నది ఆమెరికాన్స్, మన అయిదుగురు ఇండియన్స్, నేను ఫ్యూయల్ టాంకర్ డ్రైవర్. మేము తప్ప అక్కడ ఎయిర్పోర్ట్ కార్గో డివిజన్ స్టాఫ్ ఎవరూ లేరు. కార్గో డివిజన్ స్టాఫ్ లేకుండా ఎప్పుడూ కార్గో లోడ్ అవ్వదు. వాళ్ళు సరైన కార్గో... సరైన విమానం లో లోడ్ అయింది లేనిది చూడటం వాళ్ళ భాద్యత.

రవీంద్ర (సీరియస్ గా చూస్తూ): తరువాత ఏమైంది?

ఎంప్లాయ్ : వాళ్ళు ఆ పెద్ద పెట్టె లోడ్ చేసేసి వేరే కార్ ఎక్కి వెళ్లిపోవడం కనిపిచింది. నేను ఎయిర్పోర్ట్ టెర్మినల్ కి వొచ్చి కార్గో డివిజన్ లో నాకు తెలిసిన ఎంప్లాయ్ ని కలిసి ఈ విషయం చెప్పను. వాడు రికార్డ్స్ చెక్ చేసి ఆ రోజు ఆ కార్పొరేట్ జెట్ లో ఏవిధమైన కార్గో లోడింగ్ రిక్వెస్ట్ రాలేదని చెప్పాడు. నేను వాడికి ఈ విషయం చెప్పలేదు.

రవీంద్ర: ఎందుకని?

ఎంప్లాయ్ : రికార్డ్స్ లో లేని కార్గో కార్పొరేట్ జెట్ లో లోడ్ అయ్యిందంటే ఏదో జరగరానిదేదో జరిగిందని అర్ధమయ్యింది. పైగా అప్పటికే ఆ విమానం వెళ్ళిపోయింది. అందుకే ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు.

రవీంద్ర: నీకు ఆ విమానం ఎక్కడికెళ్లిందో తెలుసా?

ఎంప్లాయ్ : లేదండి.

రవీంద్ర: ఆ విమానం ఎవరిదో తెలుసా?

ఎంప్లాయ్ : లేదండి... కానీ ఆ విమానం నెంబర్, టైల్ నెంబర్ మాత్రం అమెరికా కి చెందినది...

రవీంద్ర: ఎలా చెప్పగలవు?

ఎంప్లాయ్ : ఆ కార్పొరేట్ జెట్ టైల్ నెంబర్ N తో స్టార్ట్ అవుతుంది. N అంటే అమెరికన్ లో రిజిస్టర్ అయిన విమానం అని అర్ధం. అదీ కాక ఆ విమానం మీద APPLEBY TECHNOLOGIES INC., అని రాసి వుంది.

రవీంద్ర: నువ్వు ఆ రోజు అక్కడ వున్న ఆ అయిదుగురిని నువ్వు గుర్తు పట్టగలవా?

ఎంప్లాయ్: గుర్తుపట్టగలను.

రవీంద్ర: కానీ, ఆ రోజు అక్కడ బాగా చీకటిగా ఉండి ఉంటుంది కదా... ఎలా గుర్తుపట్టగలవు.

ఎంప్లాయ్: లేదండి. అక్కడ హాంగర్ లో లైటింగ్ బాగా వుంది. వాళ్ళ మొహాలు క్లియర్ గా కనిపించాయి. గుర్తు పట్టగలను.

రవీంద్ర (DSP వైపు చూస్తూ) : ఇతన్ని తీసుకెళ్లి మన స్కెచ్ ఆర్టిస్ట్ చేత డ్రాయింగ్ వేయించు.

రవీంద్ర(ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ వైపు చూస్తూ) : నువ్వు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. నీతో చాలా పనివుంది. అవును ఇంకోసంగతి..... నువ్వు డిసెంబర్ 10వ తారిఖ్ రాత్రి రెండుగంటలికి అని అన్నావు కదా...

ఎంప్లాయ్: అవును సర్.

రవీంద్ర: అంటే technically అది డిసెంబర్ 11 తారిఖ్ అవుతుంది కదా...

ఎంప్లాయ్ : కరెక్టే సర్... డిసెంబర్ 10వ తారిఖ్ రాత్రి రెండు గంటలు అంటే డేటు మారుతుంది కాబట్టి ఆరోజు డిసెంబర్ 11 అవుతుంది...

రవీంద్ర: సరే మీరు వెళ్ళండి.

DSP ఆ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ ని తీసుకొని స్కెచ్ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాడు.

రవీంద్ర తన కంప్యూటర్ లో APPLEBY TECHNOLOGIES INC., ని గూగుల్ చేసాడు. అది ఒక అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీస్ కంపెనీ. చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఫాల్స్ చర్చి, వర్జీనియా లో వుంది. అమెరికా దేశంలోని వర్జీనియా రాష్ట్రం లో చాలా డిఫెన్స్ కంపెనీస్ వున్నాయి. ఈ కంపెనీ లో 12000 మంది పనిచేస్తున్నారు. టర్నోవర్ బిల్లియన్స్ వుంది. వాళ్ళ మెయిన్ క్లయింట్ అమెరికన్ గవర్నమెంట్. అంటే... వీళ్లు అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టర్స్... వీళ్ళ విమానం హైదరాబాద్ లో ఎందుకు దిగింది? అందులోంచి ఎవరు దిగారు? ఎవరు ఎక్కారు? ఇదంతూ చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ లాగా వుంది.

రవీంద్ర వెంటనే తన ఫ్రెండ్ సుధాకర్ కి ఫోన్ చేసి ప్రొఫెసర్ శ్రీనివాస్ అమెరికా లోని టెలిఫోన్ నెంబర్ తీసుకొని శ్రీనివాస్ కి ఫోన్ చేసాడు. ఇప్పుడు కాలిఫోర్నియా లో ఉదయం 4 గంటలు. అయినా సరే ఒక్క రింగ్ లోనే శ్రీనివాస్ ఫోన్ ఎత్తాడు.

రవీంద్ర: శ్రీనివాస్ గారు ఉన్నారా?

శ్రీనివాస్: నేను శ్రీనివాస్ నే మాట్లాడుతున్నాను.

రవీంద్ర: సారీ టు ట్రబుల్ యు ఎట్ 4 am ... నెను హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ రవీంద్ర ని.

శ్రీనివాస్: హౌ అర్ యు?

రవీంద్ర : ఐ అమ్ ఫైన్. ఐ నీడ్ యువర్ హెల్ప్.

శ్రీనివాస్: షూర్.

రవీంద్ర: ప్రొఫెసర్ శరత్ MIT కి రాకముందు ఎక్కడ చదివాడో చెక్ చేసి చెప్పగలరా?

శ్రీనివాస్: చెక్ చెయ్యాల్సిన పని లేదు. అతను న్యూ ఢిల్లీ IIT లో చదివాడు. 1989 లో పాస్ అయ్యాడు. 1990 ఫిబ్రవరి లో ఇక్కడి కి వొచ్చాడు.

రవీంద్ర: అర్ యు షూర్?

శ్రీనివాస్: 100%. ఐ నో అబౌట్ హిస్ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్.

రవీంద్ర: Thank You very much sir...

శ్రీనివాస్: యు అర్ వెల్కమ్.

రవీంద్ర ఈ విషయాలు వెంటనే DGP కి చెప్పాడు. ఈ డెవలప్మెంట్స్ వింటున్న DGP కి రోజురోజుకి BP పెరిగిపోతున్నది.

DGP: ఇప్పుడు ఏమి చేస్తావు?

రవీంద్ర: ఇది మన హోమ్ మినిస్టర్ అల్లుడి హత్యకి సంబంధించిన విషయం కాబట్టి... వేరే వాళ్ళు కాకుండా... నేనే స్వయంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాను... నేను ఢిల్లీ వెళ్లి IIT క్యాంపస్ నుంచి నా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాను... ఏదైనా క్లూ దొరుకుతుందేమో...

DGP : డు వాట్ ఎవర్ యు వాంట్. జస్ట్ సాల్వ్ ది కేసు.

ఇంత లో DSP ఒక 5 స్కెచ్ డ్రాయింగ్స్ పట్టుకొని వొచ్చాడు. చాలా క్లియర్ గ వున్నాయి. నలుగురు మగాళ్లు. ఒక ఆడది. అందులో ఒక స్కెచ్ చూడగానే ఆ మొహాన్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఆలోచించసాగాడు. మెదడులో ఫ్లాష్ అయ్యింది. శ్రీనివాస్ చూపించిన శరత్ మెమోరియల్ సర్వీస్ ఫొటోల్లో చూసిన గుర్తు. వెంటనే తన కంప్యూటర్ లో ఆ ఫోటో ఆల్బం ఓపెన్ చేసాడు. ఒక్కొక్క ఫోటో నెమ్మదిగా చూడసాగాడు. ముందుగా శరత్ భార్య పక్కన ఏడుస్తున్న ఒకామె ఫోటో ఇందులోని ఆడ దాని ఫోటో తో మ్యాచ్ అవుతోంది. రవీంద్ర కి గుండెలు అదురుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆర్టిస్ట్ గీసిన 5 స్కెచెస్ ఆ ఫొటోల్లో వున్న భారతీయ వ్యక్తులతో ఇంచు మించుగా మ్యాచ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ చెప్పిన గంభీరమైన వ్యక్తి స్కెచ్ బాగా మ్యాచ్ అవుతోంది.

రవీంద్ర(DSP తో): ఆ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ ఇంకా ఇక్కడే ఉన్నడా?

DSP : వున్నాడు సర్... తీసుకురంనంటారా

రవీంద్ర తలవూపాడు. DSP గబగబ బయటకి వెళ్లి ఒక 3 నిమిషాల్లో ఆ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ ని తీసుకొచ్చాడు.

రవీంద్ర: నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. నువ్వు ఆ రోజు చూసినవాళ్లు వీటిలో ఉన్నారేమో గుర్తుపట్టగలవా

ఎంప్లాయ్: తప్పకుండా సర్

రవీంద్ర కంప్యూటర్ మానిటర్ ఆ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ వైపు తిప్పి "వీటిని చూసి చెప్పు" అని అన్నాడు.

ఆ ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ మొహం వెలిగిపోయింది. "వీళ్ళే సార్... ఆ అయిదుగురు ఇందులో వున్నారు" అని వాళ్ళని గుర్తు పట్టాడు.

రవీంద్ర: సరే... ఇంక నువ్వు వెళ్ళు. మళ్ళీ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడే రావాలి.

రవీంద్ర(DSP తో): గుడ్ జాబ్. వెల్ డన్. ఇతని డీటెయిల్స్ తీసుకొని పంపెయ్యి.

రవీంద్ర ఆరోజే న్యూ ఢిల్లీ కి బయలుదేరాడు.


PART - 5 - THE IDENTITY

రవీంద్ర బయలుదేరేముందు తన కంప్యూటర్ లో డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోస్, స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన డ్రాయింగ్స్ అన్ని తన ఆఫిషియల్ ipad లోకి ఎక్కిచుకున్నాడు. ఢిల్లీ వెళ్లే విమానం లో కూర్చొని ఆ ఫొటోస్ అన్నింటిని చాలా జాగ్రత్త గా చూడడం మొదలెట్టాడు. శరత్ ఫునెరల్ సర్వీస్ ఫొటోస్ లో ఫ్రెండ్స్, కొలీగ్స్, స్టూడెంట్స్, పోలీస్ ఆఫీసర్స్, మన ఇండియన్స్ చాలా మంది వున్నారు. ఒక ఫోటో లో ఒక పెద్ద మనిషి శరత్ భార్య కవిత తో మాట్లాడుతున్నాడు. అతని వెనుక ముగ్గురు వ్యక్తులు డార్క్ రే బాన్ గ్లాస్సెస్ పెట్టుకొని చెవిలో ఇయర్ పీస్ తో నుంచొని వున్నారు. ఎవరు వాళ్ళు? FBI, CIA or Secret Service. ఒక వేళ వాళ్ళు ఈ మూడింటిలో దేనికైనా చెందివాళ్ళు అయితే వాళ్ళకి ఒక సైంటిస్ట్ ఫునెరల్ సర్వీస్ లో పని ఏమిటీ? ఇంకో ఫోటో లో అదే వ్యక్తి శరత్ భార్య కి Folded USA Flag అందిస్తున్నాడు. శరత్ భార్య వెనకాల నుంచున్న ఒక ఆడ ఆమె పక్కకి తిరిగి తన కళ్ళ నీళ్ళని ఆపుకుంటోంది. ఇంకో ఫోటో లో ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ గుర్తించిన నలుగురు మగాళ్లు శరత్ భార్య వెనకాల నుంచొని వున్నారు. అందులో ముగ్గురు తమ భాదని ఆపుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. నాలుగో వ్యక్తి మొహం లో మాత్రం ఎటువంటి ఫీలింగ్స్ కనిపించడం లేదు. చాలా కామ్ గా, కంపోస్డ్ గా వున్నాడు. కొన్ని ఫొటోస్ లో ప్రొఫెసర్ శ్రీనివాస్ అక్కడికి వోచిన వాళ్ళతో మాట్లాడుతూ కనిపించాడు. మిగతా ఫోటీలో లన్ని అక్కడకి వొచ్చిన వ్యక్తులతో నిండి వున్నాయి. కానీ ఒక ఫోటో లో మాత్రం ఒక డిఫరెన్స్ కనిపిచింది. రవీంద్ర ఆ ఫోటో ని చాలా కేర్ ఫుల్ చూసాడు. రవీంద్ర మొహం లో ఒక చిరునవ్వు కనిపిచింది. "GOT IT..." అని అనుకున్నాడు.

ఆ ఫోటో లో ఒక వైపు బోస్టన్ పోలీస్ ఆఫీసర్స్ సెల్యూట్ చేస్తున్నారు. రెండో వైపు మన ఇండియన్స్ అందరూ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తున్నారు. శరత్ భార్య ఆమె పక్కన వున్న ఆవిడ ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ వెనుక నుంచొని వున్న ఒక్క వ్యక్తి మాత్రం సెల్యూట్ చేస్తున్నాడు. ఆ సెల్యూట్... బోస్టన్ పోలీస్ ఆఫీసర్స్ చేస్తున్న సెల్యూట్ స్టైల్ కి ఇతను చేస్తున్న సెల్యూట్ స్టైల్ కి తేడా వుంది. అమెరికా లో పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ సెల్యూట్ చెయ్యాలియాంటే... చేతిని స్టిఫ్ గా పెట్టి అరచెయ్యి కిందకి ఉంచి కణతలు దగ్గర ఏటవాలుగా ఉంచి నుంచుంటారు... దాన్ని PALM DOWN సెల్యూట్ అని అంటారు. కానీ... ఈ ఫోటో లో వున్నా ఇండియన్ చేతున్న సెల్యూట్ మాత్రం డిఫరెంట్ గా వుంది. అది అచ్చం మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ చేసే సెల్యూట్ ని పోలి వుంది. దాన్ని PALM OUT సెల్యూట్ అని అంటారు. చేతిని స్టిఫ్ గా పెట్టి అరచెయ్యి బయటకి కనిపించేలాగా ఉంచి కణతలు దగ్గర పెట్టి ఆటెంషన్ లో నుంచుంటారు. REGIMENTAL SALUTE... అంటే ఈ వ్యక్తి ఇండియన్ ఆర్మీ కి చెందిన వాడు. ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఆ ఐదుగురిలో ఒకరు ఆర్మీ కి లో పని చేస్తున్నాడు. అందరూ సెల్యూట్ చెయ్యడం చూసి తనుకూడా తనకి అలవాటైన పద్దతిలో సెల్యూట్ చేసాడు.

మిగతా ఫొటోస్ అన్నింటిని చాలా జాగ్రత్త గా చూస్తుండగా పైలట్ లాండింగ్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ipad మూసేసి హ్యాండ్ బాగ్ లో పెట్టేసాడు.

మరుసటి రోజు ఉదయం రెడీ అయ్యి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాడు. అక్కడ తనకి బాగా తెలిసిన IG సమర్ పాల్ సింగ్ ని కలిసాడు.

రవీంద్ర: నాకు నీ హెల్ప్ కావాలి.

సమర్ : చెప్పు. ఏదైనా చేస్తాను

రవీంద్ర: నేను ఒక కేసు పనిమీద వచ్చాను. నీకు ఢిల్లీ IIT ఎవరైనా తెలుసా?

సమర్ : హా. అక్కడ డీన్ ఒకడు నాకుబాగా తెలుసు. పేరు ప్రొఫసర్ వినోద్ శర్మ. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ / రోబోటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్.

రవీంద్ర: నువ్వు అతనికి ఫోన్ చేసి THE HINDHU న్యూస్ పేపర్ కరెస్పాండంట్ వొచ్చి కలుస్తాడు. కొంచం హెల్ప్ చెయ్యమని చెప్తావా?

>సమర్ : అంటే నువ్వు ఈ రోజు న్యూస్ పేపర్ కరెస్పాండంట్ అన్న మాట... అల్లాగే చెప్తాను.

సమర్ వెంటనే రవీంద్ర ముందే ఫోన్ చేసి ప్రొఫెసర్ వినోద్ శర్మ తో మాట్లాడాడు. ఆయన హెల్ప్ చేస్తాను న్యూ కరెస్పాండంట్ ని పంపించామని అన్నాడు.

రవీంద్ర: One more help... నాతో పాటు ఒక ఇన్స్పెక్టర్ ని పంపిస్తావా... కొంచం పని వుంది...

సమర్ : Sure...

రవీంద్ర సమర్ పంపిన ఇన్స్పెక్టర్ తో కలసి ఢిల్లీ IIT చేరుకున్నాడు. ప్రొఫెసర్ వినోద్ శర్మ ఆఫీస్ లోనే వున్నాడు.

రవీంద్ర: నా పేరు రవీంద్ర. సమర్ పాల్ సింగ్ పంపాడు. నేను THE HINDHU న్యూస్ పేపర్ కరెస్పాండంట్ ని. మీ హెల్ప్ కావాలి.

వినోద్: సమర్ చెప్పాడు. మీకు సమర్ ఎలా తెలుసు.

రవీంద్ర: ప్రెస్ పని మీద చాలాసార్లు కలిసాను.

వినోద్: చెప్పండి... మీ ఎలా సహాయం చెయ్యగలను?

రవీంద్ర: మాకు ఈ మధ్య ఒక న్యూస్ అయిటమ్ తెలిసింది. ప్రొఫసర్ శరత్ అని ఒకాయన బోస్టన్ లో ఈ మధ్య చనిపోయాడు. ఆయన మీద ఒక ఆర్టికల్ వ్రాస్తున్నాను. ఆయన ఇక్కడ ఢిల్లీ IIT చదువుకున్నాడు అని తెలిసి కవర్ చెయ్యడానికి వొచ్చాను. మీకు అయన గురించి ఏమైనా తెలుసా?

వినోద్: తెలుసా... మేమిద్దరం 1984 లో ఒకే రోజు జాయిన్ అయ్యాము. అదేరోజు పరిచయం అయ్యాడు. డిఫరెంట్ బ్రాంచెస్... కానీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇద్దరం బాగా ఐడియాస్ ఎక్స్చేంజి చేసుకునేవాళ్లం. శరత్ ఒక జీనియస్. తాను జీవితం లో ఏదో సాధించాలి అని చాలా కష్టపడేవాడు. దానికి తగ్గట్టుగానేకృషి చేసాడు. అతను MIT వెళ్ళాక కూడా టచ్ లో ఉండేవాడు. తాను ఆశించినట్లే చాలా పెద్ద పేరు సంపాదించాడు. లాస్ట్ ఇయర్ నేను ఒక టెక్ కన్వెన్షన్ కి న్యూ యార్క్ వెళ్ళినప్పుడు కేంబ్రిడ్జి వెళ్లి కలిసి వొచ్చాను. అదే లాస్ట్ టైం నేను శరత్ కి చూసింది.

రవీంద్ర: ఆయన చేసిన వర్క్ గురించి మీకేమైనా తెలుసా?

వినోద్: శరత్ సాటిలైట్ కమ్యూనికేషన్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్, Reconnaissance & Spy network లాంటి మిలిటరీ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా పనిచేశాడు. నాకు తెలిసి చాలా కాలం US గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఉండేవాడు. దానికోసం శరత్ చాలా కాలం Langley లో వున్నాడు. Langley అంటే మీకు అర్థమయ్యివుంటుంది.

రవీంద్ర(ఏమి తెలియనట్లు): లేదండి.

వినోద్: ఆశ్చర్యంగా వుంది. మీ ప్రెస్ వాళ్ళకి తెలియక పోవడం... Langley అంటే CIA అని అర్ధం. తను చాలా పవర్ఫుల్ వ్యక్తులతో కలసి పనిచేశాడు. మంచి పలుకుబడి వున్నవాడు.

వినోద్ శర్మ తనకి తెలిసిన విషయాలన్నీ దాదాపు 2 గంటల పాటు రవీంద్ర కి చెప్పాడు. అవన్నీ అకాడమిక్ అచివ్మెంట్స్ గురించి న డీటెయిల్స్. రవీంద్ర ఇన్వెస్టిగేషన్ కి ఎటువంటి ఉపయోగం లేదు.

రవీంద్ర: శరత్ కి ఇక్కడ బాగా ఫ్రెండ్స్ వుండేవాళ్లా?

వినోద్: అంతగా పెద్ద సర్కిల్ లేదు. తను నాతోనే ఎక్కువగా గడిపేవాడు. 1992 లో అతని ఊరి నుండి శివ వొచ్చాడు. మేము ముగ్గురం బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళం.

రవీంద్ర: ఇప్పుడు శివ ఎక్కడున్నాడు?

వినోద్: శివ కూడా శరత్ తో నే కేంబ్రిడ్జ్ లో పనిచేస్తున్నాడు. వాళ్లిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేరు. మంచి ఫ్రెండ్స్. శరత్ కి శివ జూనియర్. ముందు శరత్ MIT కి వెళ్ళాడు. ఇంకో మూడు సంవత్సరాల తరువాత శివకి కూడా అక్కడ మాస్టర్స్ చెయ్యడానికి హెల్ప్ చేసాడు. ఇద్దరూ వేరే డిపార్ట్మెంట్స్ అయినా బాగా క్లోజ్ ఫ్రెండ్స్.

రవీంద్ర: మీరు శరత్ కలసి వున్న ఫోటో ఏదైనా ఉందా?

వినోద్: చాలా వున్నాయి. నేను లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ నా ఫోన్ లోనే వున్నాయి. జస్ట్ ఏ మినిట్...

వినోద్ తన మొబైల్ ఫోన్ లో వున్న ఫొటోస్ చూపించాడు. చాలా వున్నాయి. ఒక ఫోటో లో వినోద్, శరత్ ల తో పాటు ఇంకో వ్యక్తి కూడా వున్నాడు. ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ గుర్తుపట్టిన వ్యక్తుల్లో ఇతను ఒకడు.

రవీంద్ర(వినోద్ కి చూపిస్తూ): ఈ ఫోటో లో మీ ఇద్దరితో పాటు వున్న వ్యక్తి ఎవరు?

వినోద్: అతనే... శివ... శరత్ కి బెస్ట్ ఫ్రెండ్. వాళ్లిద్దరూ ఒకే ఊరి వాళ్ళు...

ఇంతలో వినోద్ శర్మ కి ఫోన్ వొచ్చింది. ఆయన పక్కకి వెళ్లి మాట్లాడ సాగాడు.

ఆ టైం లో రవీంద్ర బయటకి వెళ్లి తనతో పాటు వచ్చిన ఇన్స్పెక్టర్ ని పిలిచి ఒక పేపర్ మీద శరత్, శివ డీటెయిల్స్ రాసి ఇచ్చి...

రవీంద్ర: నాకు ఈ ఇద్దరి అడ్మిషన్ కార్డు డీటెయిల్స్ కావాలి. వీళ్ళు ఇక్కడ IIT లో చేరినప్పుడు ఏ ఏ సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్, డాకుమెంట్స్, TC సబ్మిట్ చేశారో వాటి ఫోటో కాపీస్ కావాలి. తీసుకురాగలవా?

ఇన్స్పెక్టర్: తప్పకుండా సర్... తెస్తాను. అడ్మిషన్స్ బ్లాక్ కి వెళ్లి కనుక్కుంటాను.

రవీంద్ర: గుడ్. నేను ఇంకా కాసేపట్లో ఇక్కడినుండి బయలుదేరి హెడ్ క్వార్టర్స్ కి అక్కడినుండి ఎయిర్పోర్ట్ కి వొస్తాను. నా ఫ్లైట్ రాత్రి 8 గంటలకి. 6 గంటలకల్లా అక్కడ వుంటాను. నువ్వు ఆ ఫోటో కాపీస్ ని ఎయిర్పోర్ట్ కి తీసుకొని రాగలవా?

ఇన్స్పెక్టర్: అలాగే తెస్తా సర్...

రవీంద్ర మళ్లి లోపలి వెళ్లి కూర్చున్నాడు. వినోద్ ఇంకా ఫోన్ లోనే మాట్లాడుతున్నాడు. ఒక 10 నిమిషాల తరువాత వొచ్చి...

వినోద్: వెరీ సారీ... నాకు కొంచం అర్జెంటు పని వుంది. వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకపోతే మనం మళ్ళీ కలుద్దామా?

రవీంద్ర: Sure... మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను మీకు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి అప్పోయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాను...

వినోద్ దగ్గరనుండి ఫోన్ నెంబర్ తీసుకొని తన మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకొని అక్కడనుండి బయలుదేరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి చేరుకొని. సమర్ కి థాంక్స్ చెప్పి... కలవాల్సిన ఇంకో ఫ్రెండ్ ని కూడా కలిసి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాడు.

అక్కడ అప్పటికే ఇన్స్పెక్టర్ వొచ్చి రవీంద్ర కోసం వెయిట్ చేస్తున్నాడు. రవీంద్ర రాగానే తను తీసుకొచ్చిన డాకుమెంట్స్ ఇన్వెలోప్ ఇచ్చాడు. అది తీసుకొని రవీంద్ర ఆ ఇన్స్పెక్టర్ కి థాంక్స్ చెప్పి తాను చెక్ ఇన్ అవ్వడానికి ఎయిర్పోర్ట్ లోపలి వెళ్ళాడు. చెక్ ఇన్ అయ్యి బోర్డింగ్ పాస్ తీసుకొని, సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని లోపల వున్న STARBUCKS కూర్చొని కాఫీ తాగుతూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన డాకుమెంట్స్ ని పరిశీలించసాగాడు.

శరత్ 10th క్లాస్ లో 95% మర్క్స్ వొచ్చాయి. ఇంటర్ లో 98% వొచ్చాయి. అతని జూనియర్ కాలేజీ TC రాజమండ్రి లో ఒక డిగ్రీ కాలేజీ కి చెందినది. అడ్మిషన్ ఫారం లో అతని పర్సనల్ డీటెయిల్స్ పెద్దగా ఏమి లేవు. ఫాదర్, మదర్ పేర్లు వ్రాసే కాలం లో Late. సదాశివ రావు Late. విజయ లక్ష్మి అని వున్నాయి. కానీ... సంరక్షకుడు / గార్డియన్ అన్న కాలం లో శ్రీ.రాజుపాలేపు రామచంద్రయ్య అని వ్రాసి వుంది. 10th క్లాస్ చదివింది రాజమండ్రి కి దగ్గరలో వున్న సీతాపురం పల్లెటూరు.

శివ ఆడిషన్ ఫారం లో ఫాదర్ పేరు శ్రీ. నీలకంఠ శాస్త్రి మదర్ పేరు శ్రీమతి. శకుంతల అని వ్రాసి వుంది. అతను కూడా సీతాపురం లోనే 10th క్లాస్ చదివాడు. ఇంటర్ కూడా శరత్ చదివిన కాలేజీ లోనే చదివాడు.

ఇప్పటివరకు తెలిసిన డీటెయిల్స్ ని పరిశీలిస్తే... 1. ప్రొఫెసర్ శరత్ 2.శివకుమార్ శాస్త్రి 3. గుర్తు తెలియని వ్యక్తి ఒక ఆర్మీ వాడుగా తెలుస్తోంది. కానీ, ఇంకా ముగ్గురి వివరాలు తెలియాలి. పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఎవరినైనా రాజమండ్రి, సీతాపురం పంపి డీటెయిల్స్ సేకరిస్తే? వెళ్లిన వ్యక్తి సరిగ్గా వివరాలు తీసుకొని రాకపోతే టైం వేస్ట్ కావడం తో పాటు ఇన్ఫర్మేషన్ పూర్తిగా దొరక్క పోవొచ్చు. రవీంద్ర తానే పర్సనల్ గా వెళ్లి డీటెయిల్స్ కనుక్కోవడానికి డిసైడ్ అయ్యాడు...

ముందుగా మొదటి ఫోన్ కాల్ DGP చేసి పూర్తి అప్డేట్ ఇచ్చి తను హైదరాబాద్ రిపోర్ట్ నుండి నేరుగా రాజమండ్రి, సీతాపురం వెళుతున్న సంగతి చెప్పాడు. DGP సరే అన్నాడు. రెండో ఫోన్ కాల్ తన సబార్డినేట్ కి ఫోన్ చేసి తన టూర్ ప్లాన్ చెప్పి, తాను రాజమండ్రి, సీతాపురం వెళుతున్న సంగతి అక్కడ లోకల్ పోలీస్ కి చెప్పా వొద్దు అని అన్నాడు. మూడో ఫోన్ కాల్ ఇంటికి ఫోన్ చేసి తన వైఫ్ కి 4 జతల బట్టలు తన కార్ డ్రైవర్ కి ఇచ్చి ఎయిర్పోర్ట్ కి పంపామన్నారు. నాలుగో ఫోన్ కాల్ తన డ్రైవర్ కి చేసి తన టూర్ ప్లాన్ చెప్పి కార్ లో పెట్రోల్ ఫుల్ గా పోయించుకొని తన బట్టలు తీసుకొని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి హైదరాబాద్ వెళ్లి విమానం డిపార్చర్ గేట్ వైపు నడవసాగాడు. రవీంద్ర కి ఏదో డౌట్ గా వుంది... ఏదో క్లూ దొరికినట్లు దొరికి చెయ్యి జారిపోతున్నట్టుగా వుంది. ఏమిటది... ఎందుకో డౌట్ వచ్చి డిపార్చర్ గేట్ దగ్గర వున్న కుర్చీలో కూర్చొని తనకి ఢిల్లీ ఇన్స్పెక్టర్ ఇచ్చిన అడ్మిషన్ డాకుమెంట్స్ ని మళ్ళీ చాలా కారేఫుల్ గా పరిశీలించాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. ఇంతలో బోర్డింగ్ అన్నౌసుమెంట్ వొచ్చింది. దాన్ని పట్టించుకోకుండా హడావిడిగా తన మొబైల్ ఫోన్ తీసి తన సబార్డినేట్ కి ఫోన్ చేసి "ఆ ఫార్మ్ హౌస్ మర్డర్స్ లో మెయిన్ విక్టిమ్ పేరు ఏమిటీ?" అని అడిగాడు. తన సబార్డినేట్ చెప్పిన పేరు వినగానే కుర్చీలో కుప్పకూలిపోయాడు. బోర్డింగ్ అనౌన్స్మెంట్ జరుగుతోంది. రవీంద్ర నెమ్మదిగా తేరుకొని తన సబార్డినేట్ తో "ఆయన సొంత వూరు పేరు ఏమిటీ?" అని అడిగాడు. ఆ ప్రశ్న కి జవాబు రవీంద్ర కి చూచాయగా తెలుసు. సబార్డినేట్ "సీతాపురం, తూర్పు గోదావరి జిల్లా" అని చెప్పాడు. రవీంద్రకి వొంట్లో రక్తమంతా కారిపోతే ఎంత నీరసం వొస్తుందో అలా అనిపించింది. ఎలాగో శక్తి తెచ్చుకొని విమానం ఎక్కాడు.


PART - 6 - THE DECORATED SOLDIER

రవీంద్ర విమానం ఎక్కి కూర్చొని టేక్ ఆఫ్ కి ముందు తన సబార్డినేట్ కి ఫోన్ చేసి ఫార్మ్ హౌస్ మర్డర్స్ కేసు కి సంబంధించిన సినాప్సిస్ ని ఒక సీల్డ్ కవర్ లో పెట్టి తన డ్రైవర్ కిచ్చి పంపమన్నాడు. తన సబార్డినేట్ చెప్పిన విషయం విన్న తరువాత రవీంద్ర కి చాలా నీరసంగా వుంది. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన స్నాక్ తిని కాఫీ తాగి పడుకున్నాడు. విమానం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేటప్పటికి కొంచం ఓపిక వొచింది. బయటకి రాగానే అక్కడ తన డ్రైవర్ కార్ తీసుకొచ్చాడు. రవీంద్ర కార్ ఎక్కగానే డ్రైవర్ అప్పలరాజు ఒక కవర్ ఇచ్చాడు. "మనం నేరుగా రాజమండ్రి వెళ్ళాలి" అని అన్నాడు రవీంద్ర. కార్ బయలుదేరింది. రవీంద్ర ఆ కవర్ లో వున్న డాకుమెంట్స్ బయటకి తీసి చదవడం మొదలెట్టాడు. అది ఒక మాస్ మర్డర్ కేసు సమ్మరీ. ఒక ఫార్మ్ హౌస్ లో బందిపోటు ముఠా చొరబడి అందరిని చంపేసి, కొంత మంది ఆడ పిల్లల్ని రేప్ చేసి వాళ్ళ వొంటి మీద నగలు, బేసెమెంట్ లో వున్న 3 పెద్ద లోకెర్స్ ని పగలకొట్టి వాటిలోని నగలు,డబ్బు తీసుకొని పారిపోయారు. ఆ కేసు ఇంత వరకు సాల్వ్ కాలేదు. ఒక్క క్లూ కూడా దొరకలేదు.

రవీంద్ర కి బాగా గుర్తుంది. హైదరాబాద్ లో ఈ సంఘటన జరిగినప్పుడు తను న్యూ ఢిల్లీ లో డిప్యూటీ కమిషనేర్ గా క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ ఫార్మ్ హౌస్ లో చనిపోయిన మెయిన్ విక్టిమ్ పేరు రాజుపాళెపు రామచంద్రయ్య. ఆయనది తూర్పు గోదావరి జిల్లా లో వున్న సీతాపురం. 84 ఏళ్ళ వయసు. చాలా పెద్ద మనిషి. మంచివాడు. ఆ జిల్లా లోనే కాదు... ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో ఆయనకు చాలా పలుకుబడి వుంది. ఆ ఫార్మ్ హౌస్ హత్యల విషయం ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీస్ దద్ధరిల్లిపోయాయి. న్యూ ఢిల్లీ పార్లమెంట్ లో కూడా ఉభయ సభలలో 2 నిమిహాసాలు మౌనం పాటించించారు. ఆ కేసుని వెంటనే సిబిఐ కి అప్పగ్గించారు. విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇది జరిగి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అయ్యింది.

ఇప్పుడు రవీంద్ర వాళ్ళ ఇంటికే వెళ్లి ప్రస్తుత కేసు కి సంభందించి ఏదైనా లీడ్ దొరుకుతుందేమో ఎంక్వయిరీ చెయ్యాలి. బాగా అలసి పోయాడు. "అప్పలరాజు... దారిలో ఏదైనా మంచి డాబా ఉంటే ఆపు. డిన్నర్ చేదాం" అని అన్నాడు. డ్రైవర్ సరే అని అన్నాడు. అప్పలరాజు ఒక మంచి దాబా ముందు ఆపాడు. ఇద్దరూ డిన్నర్ చేస్తున్నారు.

రవీంద్ర: మనం రాజమండ్రి ఎన్నింటికి చేరతాము?

అప్పలరాజు: పొద్దున్న 8 గంటలకల్లా చేరతామండి...

రవీంద్ర: నీకు రాజమండ్రి దగ్గరున్న సీతాపురం తెలుసా...

అప్పలరాజు: తెలుసండీ. 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఎందుకు సర్...

రవీంద్ర: మనం అక్కడికెళ్ళాలి...

అప్పలరాజు అర్ధం కానట్లు మొహం పెట్టాడు.

రవీంద్ర: నీకు ఆ వూళ్ళో రామచంద్రయ్య తెలుసా...

అప్పలరాజు: ఆ ఫార్మ్ హౌస్ లో చనిపోయిన ఆయనే కదండీ...

రవీంద్ర: అవును...

అప్పలరాజు: తెలుసండి. పాపం మొత్తం వంశం మొత్తం అంతమయ్యింది...

రవీంద్ర: నీకు ఈ కేసు గురించి ఏమి తెలుసు?

>అప్పలరాజు: అందరూ బందిపోట్లు వాళ్ళని చంపేసి డబ్బులు, నగలు తీసుకెళ్లారు అని అంటున్నారు. కానీ, ఏ ఊళ్ళో అయినా బందిపోట్లు కానీ, లేదంటే ప్రమాదమైన గ్యాంగ్స్ సంచారం ఉంటే మనకి ఏదో ఒక సమాచారం ఎదో ఒక రూపం లో అందేది. FIR లో వ్రాసినట్లు బీహార్, UP నుంచి ఏదైనా ముఠా కనుక మన రాష్ట్రం లో కానీ, పక్క రాష్టాలలో కానీ మూమెంట్ ఉంటే తెలంగాణ, ఆంధ్ర CID టీం కి PUKKA గా తెలుస్తుంది. వాళ్ళు హెడ్ క్వార్టర్స్ కి ఇంటిమేట్ చేస్తారు. కానీ, హైదరాబాద్ లో ఈ సంఘటన జరిగినప్పుడు అటువంటి INTEL ఏదీ లేదండి. ఈ కేసు విషయం లో చాలా అనుమానాలు వున్నాయి. కానీ వేటికీ సరైన ఆధారాలు దొరకడం లేదు. చాలా పకడ్బందీ గా జరిగింది. ఇంకో సంగతి ఏమిటంటే... ఆ క్రైమ్ సీన్ లో ఒక్క వేలిముద్ర కూడా దొరకలేదు. అక్కడ దొరికిన వేలుముద్రలన్నీ ఆ ఇంటి వాళ్ళవే. అవి మన డేటా బేస్ లో ఎవరితోనూ మ్యాచ్ అవ్వడం లేదు అని తెలిసింది. మన డిపార్ట్మెంట్ లో చాలా మంది ఇది ప్లాన్డ్ క్రైమ్ సాల్వ్ అవ్వడం చాలా కష్టం అని అనుకుంటున్నారు.

రవీంద్ర: నీకు రామచంద్రయ్య గురించి ఏమి తెలుసు?

అప్పలరాజు: ప్రజలలో ఆయనకి చాలా మంచి పేరు ఉందండి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఆయనను తమ పార్టీ లోకి రమ్మని అడిగాయి. కానీ, ఆయన ఎప్పుడూ ఆక్టివ్ పాలిటిక్స్ లోకి రాలేదు. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళే ఆ జిల్లాలో గెలుస్తారు. మిగతా పార్టీస్ ఎంత కష్ట పడినా పెద్దగా ప్రయోజనం వుండదండి. మన రెండు రాష్ట్రాలలో ఆయనకీ మంచి పలుకుబడి వుంది. ఆయన రెండుసార్లు రాజ్యసభ సీట్ ని వొద్దన్నాడు. ప్రజలకి తాను ఎంత సేవ చేయగలడో అంతా చేసాడు. వాళ్ళ నాన్న గారు స్వాతంత్ర సమర యోధులు...

అప్పలరాజు తనకి తెలిసిందంతా రవీంద్రకి చెప్పాడు. వాళ్ళు డిన్నర్ చేసి బయలుదేరారు. అనుకున్నట్టు గానే 8 గంటలకల్లా రాజమండ్రి చేరారు. అక్కడ ఒక లాడ్జి లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి సీతాపురం చేరారు. అక్కడ రామచంద్రయ్య గారి ఇల్లు చాలా సులభంగా చేరారు. రవీంద్ర వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి అప్పలరాజుతో "నేను THE HINDU పేపర్ కి న్యూస్ కరెస్పాండంట్ ని. ఇక్కడ ఎవరు అడిగినా అలాచెప్పు. మనం డిపార్ట్మెంట్ నుంచి వొచ్చామన్న సంగతి తెలిస్తే మన పని అవ్వదు" అని చెప్పి ఆ ఇంట్లో కి అడుగు పెట్టాడు.

చాలా పెద్ద ఇల్లు. కింద, పైన కట్టారు. దాదాపు ఒక 100 సంవత్సరాల కి ముందు కట్టిన ఇల్లు లాగా వుంది. ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం. అందులో వరుసగా వరి పంట దాచడానికి పెద్ద పెద్ద గాదెలున్నాయి. మూడు ట్రాక్టర్లు కూడా వున్నాయి. ఒక పక్కన కార్ షెడ్ కట్టారు. అందులో 8 కార్లు వున్నాయి. అందులో Mercedes Benz, BMW కార్లు కూడా వున్నాయి. ఒక మూడు మోటార్ సైకిల్స్ వున్నాయి. ఇంటి నిండా పని వాళ్ళు వున్నారు. రవీంద్ర ఆ ఇంటి కాంపౌండ్ లోకి అడుగు పెట్టగానే అతనిచుట్టూ చేరి "ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎందుకొచ్చారు?" అని ప్రశ్నల వర్షం కురిపించారు. అందరి కళ్ళలో భయం, అనుమానం, కోపం, కసి కనిపిస్తున్నాయి. "నాపేరు రవీంద్ర. నేను పేపర్ రిపోర్టర్ ని. శరత్ గురించి పేపర్ లో ఆర్టికల్ వ్రాస్తున్నాను. దానిగురించి ఈ వూళ్ళో పెద్ద వాళ్ళని కలసి సమాచారం తెలుకుందామని వచ్చాను" అని అన్నాడు. అప్పటికే ఇంటి బయట చాలా మంది గుమికూడారు. కొంత మంది రవీంద్ర వేసుకొచ్చిన కార్ ని అనుమానంగా చూడ సాగారు. కార్ తుడుస్తున్న అప్పలరాజు మీద ప్రశ్నల వర్షం కురిపించసాగారు. ఫార్మ్ హౌస్ మర్డర్స్ జరిగిన తరువాత సీతాపురం లోకి ఎవరు వొచ్చినా ఆ ఊరి వాళ్ళు అనుమానంగా నే చూస్తున్నారు. ఇంటి బయట జరుగుతున్న హడావిడి చూసి ఎవరో పెద్ద మనిషి ఇంట్లోంచి బయటకి వొచ్చాడు. చేతిలో గన్ వుంది. రవీంద్ర ఆయనని చూసి "నా పేరు రవీంద్ర. నేను న్యూస్ కరెస్పాండంట్ ని. శరత్ గారి గురించి ఆర్టికల్ వ్రాస్తున్నాను. డీటెయిల్స్ కోసం వచ్చాను" అని అన్నాడు. ఆయన రవీంద్ర ని ఎగా దిగా చూసి "ఇలా రండి" అని లోపలికి దారి తీసాడు. లోపల ఇల్లు చాలా నీట్ గా వుంది. ఒక పక్కన రామచంద్రయ్య, ఆయన భార్య కలసి వున్న లైఫ్ సైజు ఫోటో వుంది. రవీంద్ర ని అక్కడ వున్నా సోఫాలో కూర్చోపెట్టి "నా పేరు రఘురాం. రామచంద్రయ్య గారికి బంధువుని. ప్రస్తుతం ఈ ఇంటి భాద్యతలు చూస్తునాను" అని అన్నాడు. ఇంతలో లోపలనుండి ఒకామె వొచ్చి ఇద్దరికీ మంచి నీళ్లు ఇచ్చి వెళ్ళింది.

రవీంద్ర: మేము శరత్ గారి మీద ఒక ఆర్టికల్ వ్రాస్తున్నాము. ఇది శరత్ గారి సొంత వూరు అని తెలిసి ఇక్కడి వచ్చాను. ఆయనకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి సమాచారం సేకరించాలి...

రఘురాం: శరత్ కి ఎవరూ లేరు. ఒక అనాధ. వాళ్ళ నాన్న సదాశివరావు పక్కనే వున్న వూళ్ళో గవర్నమెంట్ వుద్యోగం చేసేవాడు. ఒక రోజు సదాశివరావు తన కుటుంబంతో కలసి తెలిసిన వాళ్ళ పెళ్లి కి ఇక్కడే వున్న లంక గ్రామానికి పడవలో వెళుతుండగా అది తిరగపడి చాలా మంది పోయారు. వారిలో శరత్ తల్లి తండ్రులు కూడా వున్నారు. శరత్ బతికి బయటపడ్డాడు. అనాధ అయిన ఆ పిల్లాడిని రామచంద్రయ్య గారు పెంచి పెద్ద చేశారు. అతను బాగా చదువుకొని IIT చేసి అమెరికా వెళ్లి చాలా పెద్ద పోసిషన్ లోకి వచ్చాడు. కానీ, దురదృష్టం అర్ధాంతరంగా పోయాడు. మీకు ఏ డీటెయిల్స్ కావాలి?

రవీంద్ర: పెద్దగా ఏమి లేదండి. నేను ఢిల్లీ IIT లో కొంతమంది ని కలవడం జరిగింది. వాళ్ళు శరత్ అక్కడ వున్నప్పుడు ఎలా ఉండేవారు అని చెప్పారు. ఇక్కడ ఆయన బాల్యం గురించి తెలుసుకుందామని వచ్చాను. శరత్ గారు ఎలాంటి వ్యక్తి? అతని ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?

రఘురాం: శరత్ చాలా మెతక మనిషి. బాగా తెలివైన వాడు. ఎప్పుడు చూసినా పుస్తకాలు తప్ప వేరే ధ్యాస వుండేది కాదు. శరత్ కి పెద్దగా స్నేహితులు లేరు. అంతా క్లాస్మేట్స్ మాత్రమే. కానీ, తనకి మా మాధవ్, పూజారి గారి అబ్బాయి శివ అంటే చాలా ఇష్టం. వీళ్ళ ముగ్గురు కలసి తిరుగుతూ వుండేవాళ్ళు. శరత్, శివ కొంచం మెతక వాళ్ళు. కానీ మా మాధవ్ మాత్రం చాలా తుంటరి వాడు. అల్లరి బాగా చేసేవాడు...

రవీంద్ర: శివ గురించి ఢిల్లీ IIT లో తెలిసింది. మాధవ్ అంటే మీ అబ్బాయా?

రఘురాం: లేదండి. మాధవ్ ది కూడా ఒక పెద్ద విషాద గాథ. మాధవ్ వాళ్ళ నాన్న సుబ్బడు ఈ ఇంటి పాలేరండి. మాధవ్ ఈ ఇంటి పెరట్లోనే పుట్టడండి. వాడి తల్లి పురుడప్పుడు జబ్బు చేసి చనిపోయింది. అప్పటినుండి రామచంద్రయ్య గారి భార్య అన్నపూర్ణమ్మ వాడిని గారాబంగా పెంచింది. వాడికి ఆ పేరు కూడా ఆమె పెట్టింది. వాడికి పదేళ్ల వయసప్పుడు వాడి నాన్న పొలం లో పంట కొస్తునప్పుడు పాముకాటేసి చనిపోయాడు...

రవీంద్ర: శరత్ గురించి చెప్పండి...

రఘురాం: శరత్ చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడు చూసిన చదువు యావే... ప్రతి క్లాస్ లోనూ ఫస్ట్ వచ్చేవాడు. 10th, ఇంటర్ ల లో స్టేట్ ఫస్ట్. ఎటువంటి కోచింగ్ లేకుండా IIT లో సీట్ సంపాదించాడు. మా వూళ్ళో శివాలయం పూజారి కొడుకు శివ కి శరత్ అంటే ప్రాణం. శివ వయసులో శరత్ కన్నా కొంచం చిన్నవాడైన వాళ్లిద్దరూ, మాధవ్ కలసి తిరిగే వాళ్ళు...

రఘురాం శరత్ గురించి చాలా విషయాలు చెప్పాడు. ఇంతలో రఘురాం భార్య వొచ్చి "భోజనానికి టైం అయ్యింది. రండి వడ్డిస్తున్నాను" అని అన్నది. రవీంద్ర కాళ్లు చేతులు కడుక్కొని భోజనానికి లోపలికెళ్ళాడు. పెద్ద డైనింగ్ హాల్. ఆ రూమ్ లో వున్న గోడల నిండా ఫొటోస్ వున్నాయి. భోజనాలు అయ్యాక రవీంద్ర ఆ ఫొటోస్ చూడడం మొదలెట్టాడు. అందులో రామచంద్రయ్య గారు ఆయన పిల్లల పెళ్లి, ఇతర ఫంక్షన్ల ఫోటొస్ ఒక ఫోటో లో నలుగురు వ్యక్తుల వున్నారు. రవీంద్ర అందరిని గుర్తు పట్టాడు. కానీ ఇద్దరి పేర్లు మాత్రమే తెలుసు. రఘురాం ని అడిగాడు "ఈ ఫోటో లో శరత్ తో పాటు వున్నది ఎవరండీ?" రఘురాం ఆ ఫోటో చూసి "ఇందులో వీడు శరత్, వీడు శివ, ఇదిగో వీడే మాధవ్, వాడి పక్కనున్నది ప్రసాద్"

రవీంద్ర: ప్రసాద్ కూడా అనాధేనా...

రఘురాం(నవ్వుతూ): లేదండి. ప్రసాద్ ఇక్కడే పక్క వూళ్ళో వుండే ప్రకాశం గారి అబ్బాయి. ఆయన పెద్ద మోతుబరి అండి. ఆయనకు నలుగురు పిల్లలు ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు. మిగతా ముగ్గురు బాగానే పైకి వచ్చారు. కానీ, ప్రసాద్ మాత్రం 10th తరువాత చదవడం మానేసి చిల్లరగా తిరుగుతూ సిగరెట్స్, డ్రింక్స్ మొదలెట్టాడు. ప్రకాశం గారు మా రామచంద్రయ్య కి చెప్పుకొని భాధ పడ్డారు. దాంతో రామచంద్రయ్య గారు ప్రసాద్ ని తనతో అమెరికా తీసుకెళ్లి శరత్ కి అప్పచెప్పారు. అంతే, శరత్ ప్రసాద్ ని అక్కడ మళ్ళీ స్కూల్ లో చేర్చి చదివించాడు. ప్రసాద్ తెలివైన వాడే కానీ, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడు. ప్రసాద్ చివరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA చేసాడు. ఇదిగో... ఈ ఫోటో చూడండి...

రఘురాం చూపించిన ఫోటో లో ఒక పెద్దాయన శరత్ కాళ్ళకి దణ్ణం పెడుతున్నాడు. "ప్రసాద్ హార్వర్డ్ గ్రాడ్యుయేషన్ రోజున అక్కడికి వెళ్లిన ప్రకాశం గారు ఆనందంతో ఎవ్వరూ ఊహించని విధం గా శరత్ కాళ్ళకి దణ్ణం పెట్టారు"

రవీంద్ర: ఇప్పుడు ప్రసాద్ ఏమి చేస్తున్నాడు?

రఘురాం: ప్రసాద్ న్యూ యార్క్ లో ఉంటున్నాడు. Merrill Lynch లో Vice President - Investment Banking...

అక్కడ చాలా ఆల్బమ్స్ వున్నాయి. రవీంద్ర "మీకు అభ్యంతరం లేకపోతే నేను ఈ ఫొటోస్ చూడవొచ్చా?" అని అడిగాడు. దానికి రఘురాం "అయ్యో.... అదేమీ భాగ్యం." అంటూ ఒక పని వాడిని పిలిచి అక్కడ వున్నా ఆల్బమ్స్ అన్ని తీసుకొని హాల్లోకి తెమ్మన్నాడు.

రవీంద్ర ఒక్కో ఆల్బం జాగ్రత్తగా చూడ సాగాడు. చాలా మటుకు రామచంద్రయ్య కుటుంబానికి చెందినవి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ ఇలా చాలా వున్నాయి. ఒక ఫోటో లో శరత్, మాధవ్ పెట్టెలు పట్టుకొని నుంచోని వున్నారు. అదిచూసి రఘురాం "ఒకే రోజు శరత్ IIT లో చేరడానికి ఢిల్లీ , మాధవ్ NDA లో చేరడానికి Khadakwasla వెళ్ళేటప్పుడు తీసినది" అన్నాడు.

ఇంకో ఫోటో శరత్ పెళ్లి అప్పుడు తీసినది. "ఇది శరత్ మావూరి కామందు గారి అమ్మాయి ని పెళ్లి చేసుకున్నప్పుడు తీసింది" అన్నాడు రఘురాం. అందులో శరత్, కవిత ల తో పాటు శివ, ప్రసాద్ లే కాక, మాధవ్ ఆర్మీ కెప్టెన్ యూనిఫామ్ లో వున్నాడు. అతని పక్కనే ఇంకో అమ్మాయి వుంది. రవీంద్ర "ఈమె ఎవరు? " అని అడిగాడు. "ఆమె పేరు రేవతి... ప్రసాద్ వాళ్ళు వూరే ఆమెది. ఇప్పుడు ఆమె వాషింగ్టన్ లో జనరల్ సర్జన్ గా పనిచేస్తోంది" అని అన్నాడు రఘురాం.

రవీంద్ర కి ఇప్పుడు అయిదుగురి పేర్లు తెలిసాయి. శరత్, శివ, మాధవ్, ప్రసాద్, రేవతి... ఇంకొక్క పేరు తెలియాలి...

వేరే ఫోటో లో మాధవ్ పెళ్లి అప్పుడు తీసిన ఫోటో వుంది. అందులో ఒక సర్దార్ ఆర్మీ కల్నల్ యూనిఫామ్ లో వున్నాడు. ఆ ఫోటో చూసి రఘురాం "మాధవ్ ఆర్మీ కల్నల్ పర్గత్ సింగ్ గారి అమ్మాయి కవలీన్ ని పెళ్లి చేసుకున్నాడు"

రవీంద్ర: ఇప్పుడు మాధవ్ ఎక్కడ వున్నాడు?

రఘురాం: మాధవ్ ఎప్పుడు తన క్యాంపు డీటెయిల్స్ చెప్పలేదండి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడో ఉంటున్నాడు. మూడేళ్ళ క్రితం తాను కూడా ఆర్మీ కల్నల్ అయ్యాడు...

రవీంద్ర: మాధవ్ మామగారు రిటైర్ అయ్యివుంటాడు కదా...

రఘురాం: అవునండి చాలా కాలం క్రితమే మేజర్ జనరల్ గా రిటైర్ అయ్యాడు...

ఇది వింటున్న రవీంద్ర కి నీరసం వస్తోంది. ఆర్మీ కల్నల్... మారీడ్ టు... మేజర్ జనరల్ డాటర్...

రవీంద్ర: మీకు అభ్యంతరం లేకపోతే రామచంద్రయ్య గారి గురించి అడగవొచ్చా...

రామచంద్రయ్య గురించి అడగగానే... రఘురాం ఒక్కసారిగా ఏడవడం మొదలెట్టాడు... రవీంద్ర ఏమి మాట్లాడలేదు. ఒక 10 నిమిషాల తరువాత "నేను బయలుదేరతానండి" అని అన్నాడు.

రఘురాం(అప్పటికి తేరుకొని): సారీ... రామచంద్రయ్య గారి పేరు ఎత్తగానే నాకు దుఃఖం ఆగలేదు...

రవీంద్ర: మీకు అయన ఏమి అవుతాడు?

రఘురాం: నాకు మేనమామ. మా అమ్మ ఆయన కి చిన్న చెల్లెలు...

రవీంద్ర: మీకు అభ్యంతరం లేకపోతే ఆ రోజు ఏమి జరిగిందో అడగ వొచ్చునా?

రఘురాం(కళ్లు మూసుకొని): నేను ఆ రోజు అక్కడ లేను. వున్నట్లైతే నన్ను కూడా చంపేసేవారే. నేను మూడురోజులతరువాత ఫంక్షన్ కి ఒక రోజు ముందు చేరాలి...

రవీంద్ర: ఏ ఫంక్షన్ జరగాలి అక్కడ?

రఘురాం: ఇది మా ఫామిలీ కి వున్న అలవాటు. అది చెప్పాలంటే మీకు చాలా చెప్పాలి. ఒక వ్యక్తి పుట్టగానే బాలసార చేసి పేరు పెడతారు. ఆడపిల్ల అయితే తరువాతే చేసే పెద్ద ఫంక్షన్ పిల్ల పెద్ద మనిషి అయినప్పుడు. మగ పిల్లవాడు అయితే కులాన్ని బట్టి ఉపనయనాలు చేస్తారు. బ్రాహ్మణులూ, వైస్యులు, క్షత్రియులు ఉపనయనాలు చేసుకుంటారు. మేము క్షత్రియులం. తరువాత జరిగే శుభకార్యం పెళ్లి. ఆ తరువాత వాళ్ళ పిల్లలికి కూడా ఇదే వరుసలో అన్ని శుభకార్యాలు జరుగుతాయి. మగవాడికి 60 ఏళ్ళ వయస్సు వొస్తే షష్ఠి పూర్తి చేస్తారు. ఇంతవరకు ఈ ఫంక్షన్స్ గురించి అందరికి తెలుసు... కానీ, ఎక్కువమంది కి తెలియని ఇంకో సాంప్రదాయం కూడా వుంది. అది ఏమిటంటే... ఆడవారు, మగవారు ఎవరైనా 83 సంవత్సరాల 4 నెలలు గనుక బ్రతికివుంటే వారిని "సహస్ర మాస వృద్ధుడు లేదా సహస్ర మాస వృద్ధురాలు" అని పిలుస్తారు. అంటే వాళ్ళు పుట్టి 1000 నెలలు పూర్తి అయ్యాయి అని అర్ధం. ఎవరి కుటుంబంలోనైనా అటువంటి వృద్ధుడు కానీ వృద్ధు రాలు కానీ ఉంటే, ఒక మంచి రోజున ఆయన లేదా ఆమె సంతని అంతా కలసి చిన్న పండుగ చేసుకుంటారు. ఆ సంతతి అంతా వారి ఆశీర్వాదం తీసుకొని తాము కూడా 1000 నెలలు బ్రతకాలని, ఇటువంటి సంబరం తాము కూడా తామసంతతి జరుపుకోవాలని కోరుకుంటారు. ఆ తరువాత జరిగే సంబరం ఏమిటంటే, ఎవరైనా 100 సంవత్సరాలు బ్రతికి ఉంటే అప్పుడు "శత వర్ష సంబరాలు" చేసుకుంటారు. ఇది వరుకు కాలం లో చాలా మంది 80 / 90 / 100 ఏళ్ళు బ్రతికిన వారు ఎక్కువకాగా మనకి కనిపించేవాళ్ళు. సంతతి అంతా దగ్గర దగ్గర ఊళ్లలోనే వుండేవాళ్ళు కాబట్టి ఎటువంటి ఫంక్షన్ చెయ్యాలన్న... చాలా ఈజీగా ఉండేది. కాలక్రమేణా ఈ సహస్రమాస వృద్ధుడు ఫంక్షన్ ఎవరూ పెద్దగా జరుపుకోవడం లేదు. ఈ రోజుల్లో ఎవరూ అంత కాలం బ్రతికి ఉండడం లేదు. పైగా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకే చాలా మందికి ఈ సహస్రమాస వృద్ధుడు సాంప్రదాయం తెలియదు. మా మామయ్య కి ఈ 1000 నెలలు నిండిన సందర్భం గా అందరం కలసి ఆయనకు మా అత్తయ్యకు ఈ ఫంక్షన్ చెయ్యాలని నిర్ణయించుకొని అందరికి ఒక సంవత్సరం ముందుగానే తెలిపి పెద్ద ఎత్తున ప్లాన్ చేసాము. రామచంద్రయ్య గారికి హైదరాబాద్ లో పెద్ద ఫార్మ్ హౌస్ వుంది. 75 ఎకరాల ఉంటుంది. అందులో అన్ని మోడరన్ ఫెసిలిటీస్ తో కూడిన ఒక పెద్ద ఇల్లు వుంది. అక్కడ అయితే అందరికి రావడానికి సౌకర్యం గా ఉంటుంది అని అక్కడ జరపాలని ప్లాన్ చేసాము. అంతా బాగానే జరిగింది. కానీ, అసలు ఫంక్షన్ కి 3 రోజుల ముందు బందిపోటు ముఠా విరుచుకుపడి ఆ రోజు ఇంట్లో వున్న వాళ్ళందరిని చంపేసి, వాళ్ళ వొంటి మీద వున్న నగలు, బేసెమెంట్ లో వున్న 3 పెద్ద ఐరన్ సేఫ్ లు విరగకొట్టి డబ్బులు, తరతరాలుగా వొస్తున్న నగలు, బంగారం అంతా దోచుకొని వెళ్లారు. ఇంత వరకు పోలీస్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ కూడా చెయ్యలేదు. రామచంద్రయ్య అంత పెద్దమనిషి ని కుటుంబంతో సహా నిలువునా నరికేస్తే పోలీస్, పొలిటికల్ లీడర్స్ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అది మాకు చాలా బాధగావుంది. హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి నేను హోమ్ మినిస్టర్ ని కలసి ఎంక్వయిరీ చేస్తూనే వుంటాను. ఆయన "నేను దగ్గర ఉండి చూసుకుంటున్నా" అని అంటాడు కానీ, కేసు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోవడం లేదు...

రవీంద్ర: ఐ అం వెరీ సారీ...

ఇలా మాట్లాడుకుంటూ ఉండాగానే ఎవరో ఒక వ్యక్తి వొచ్చాడు. ఆరడుగుల పైనే ఉంటాడు. పల్లెటూర్లో పొలం పని చేసుకునే రైతు లాగా వున్నాడు.

రఘురాం: ఏరా... సింహాద్రి... ఇలా వచ్చావు?

సింహాద్రి: దండాలు సామి... నా పొలం పక్కన వున్నా 2 ఎకరాల చెక్క బేరానికి వచ్చిందయ్యా... అది కొనాలనుకుంటున్నాను... మీ సలహా తీసుకుందామని వచ్చాను...

రఘురాం: ఇప్పుడు నేను కొంచం బిజీ గా వున్నాను. రేపు రా మాట్లాడుకుందాం (అని అంటూ... రవీంద్రవైపు చూసి... నవ్వుతూ) వీడు మా మాధవ్ కి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్

సింహాద్రి (కోపంగా... ఉక్రోషంగా): వాడు నా ఫ్రెండ్ కాదండి... నా బద్ధ శత్రువు...

రఘురాం (పగల పడి నవ్వుతూ): నీకు ఇంకా కోపం పోలేదన్న మాట...

సింహాద్రి: ఈ కోపం ఈ జన్మలో పోదండి...

రవీంద్ర(క్యూరియస్ గా చూస్తూ) : ఏమిటి కథ?

సింహాద్రి: అదో పెద్ద కథ సారూ... వాడికి నాకు చిన్నపటినుండి గొడవండి. ఇద్దరం 1వ తరగతి నుండి 10 దాకా కలసి చదువుకున్నామండీ. వాడు నేను మా పొలం పక్కనే వున్న చెరువులో ఈతలు కొట్టే వాళ్ళం, అక్కడే వున్న కుస్తీ గోదాం లో కుస్తీ నేర్చుకున్నాం. వాడు ఎప్పుడూ తొండి చేసేవాడండి. రూల్స్ ప్రకారం ఆడడు. రోజుకో కొత్త రూల్ పెడతాడు. వాడే గెలవాలి. వేరే వాళ్ళు గెలిస్తే ఊరుకోడు. మీద పడి కొట్టేస్తాడు. కుస్తీ పోటీలో తనకి తోచినట్లు ఎత్తెత్తి పడేస్తాడు. ఒక పద్దతి పాడు వుండదండి. ఎవరైనా ఆడితే మీద పడి కొడతాడండీ. మాధవ్ గాడు ఎవరినైనా వెనక నుండి గట్టిగా పట్టుకుంటే చాలండి... పక్కటెముకలు విరిగిపోవాల్సిందే... మీద పడితే వెన్నుపూస వొంకర పోవాల్సిందే... మహా మొండోడండి. ఈత కొట్టేటప్పుడు కూడా ఎవరైనా తనకంటే ముందెళ్ళిపోతే వాళ్ళని పట్టుకొని ముంచేసేవాడండి. మాధవ్ నీటి లోపల చాలా ఉండగలడండి... వాడు తనకన్నా బాగా ఈత కొట్టేవాళ్ళని లోతుగా తీసుకెళ్లి ముంచేసేవాడండి. అంతా తొండి... ఒక సారి మా వూళ్ళో కుస్తీ పోటీ జరిగిందండి... పక్క ఊరి నుండి ఒక కుర్రోడు ఈ వూళ్ళో వున్న వాళ్ళ మేనమామ గారింటికి వొచ్చాడు. మాధవ్ ఆ రోజు ఓడిపోతే వాడు నవ్వాడండి... అది చూసిని మాధవ్ తట్టుకోలేక వాడిని గోదా లోకి లాగేసి కుమ్మేసాడండి. దాంతో ఆ కుర్రాడు మాధవ్ వూళ్ళో ఉన్నన్నాళ్ళు ఈ వూళ్ళో అడుగుపెట్టలేదండి. మీరు ఈ మధ్య వచ్చిన "సుల్తాన్" "దంగల్" అనే హిందీ సినిమాస్ చూసే వుంటారు. మా మాధవ్ గాడు మాకు ఆ రెండు సినిమాలు మాకు చిన్నప్పుడే చూపించేసాడు. క్రికెట్ ఆడిన అదే గొడవ. అవుట్ అయితే చాలు బాట్, కర్రలు పట్టుకొని వెళ్లిపోయేవాడు. వాడి బౌలింగ్ లో ఎవరైనా 4 కొట్టినా, అవుట్ కాకపోయినా ఉక్రోషం ఆపుకోలేక కొట్టేవాదండి. చాలా తొండి చేసేవాడండి. కానీ... ఏమాటకామాటే నండి... మిలిటరీ లో చేరాక బాగా మారాడు. పెద్దమనిషి లాగా మారాడు. మర్యాద నేర్చుకున్నాడు. అందరితో బాగా మాట్లాడేవాడు కానీ... నాతో మాత్రం షరా మామూలేనేనండీ... ఒక 10 ఏళ్ళ కిందట అనుకుంటానండి ఒక సారి మాధవ్ వూరొచ్చినప్పుడు నాకోసం మా పొలం దగ్గరికొచ్చాడు. బాగా మాట్లాడాడు అప్పుడు నేను వాడిని "వొస్తావా ఈత కొడదాం అన్నానండి" దానికి వాడు "ఇప్పుడొద్దులే ఇంకోసారి చూదాం అన్నాడండి." అది విన్న నేను ఊరుకోకుండా "ఏం భయంగా ఉందా?" అని అన్నానండి. అంతే .... వాడు ముందుగా ప్యాంటు విప్పేసాడు. తరువాత చొక్కా విప్పేసి చెరువులో దూకి నన్ను పట్టుకొని చెరువు మధ్యలోకి తీసుకెళ్లి ముంచేసాడండి. నాకు భయమేసింది. అప్పుడు వాడేమన్నాడో తెలుసాండీ "ఆర్మీ వాడిని ఎప్పుడూ రెచ్చకొట్టకూడదు" అని నన్ను ఒడ్డుకు తీసుకొచ్చాడండి. నేను తేరుకొని వాడి వైపు చూసానండి. అంతే.... నాకు ఏడుపు ఆగలేదండి. వాటి వొంటి నిండా తుపాకీ గుండు బొక్కలండి. వీపంతా పెద్ద పెద్ద బొక్కలు. వొంటి నిండా కట్టి గాట్లు. లెక్కెట్టానండి... 16 తుపాకీ గుండు బొక్కలనుండి... 12 కత్తి గాట్లనుండి. అప్పటివరకు వాడంటే వున్న కోపం అంతా పోయిందండి. జాలేసింది. దేశం కోసం మనోడు తిన్న దెబ్బలు చూడగానే వాడంటే ప్రేమ, అభిమానం కలిగిందండి. వాడిని అడిగానండి. ఎప్పుడు ఈ దెబ్బలు తగిలా యి అని... వాడు జవాబు చెప్పకుండా చిన్న నవ్వు నవ్వాడు. మాధవ్ సరిహద్దులో దాదాపు ఒక 300 మంది ని పైగా లేపేసుంటాడండి...

రవీంద్ర: నీకు చెప్పాడా?

సింహాద్రి: ఎంత అడిగినా చెప్పలేదండి...

రవీంద్ర: మరి నీకెట్లా తెలుసు?

సింహాద్రి: అలా తెలిసిపోతాయండి... ఎవరైనా మనోడిని ఆటలో ఓడిస్తేనే వాడి అంతుచూసేదాకా నిద్రపోడు. అటువంటిది ఎవరైనా తుపాకీ తో కాలిస్తే, కత్తి తో పొడిస్తే ఊరుకుంటాడా... ఒక్కో తూటా దెబ్బకి 10 మందిని లేపేసుంటాడండి... మనోడు ఒంటిమీద దెబ్బ పడితే ఊరుకోడండి. అవతలోడి అంతు చూడకుండా నిద్రపోడు. చిన్నప్పటినుండి నాకు బాగా తెలుసండి...

రవీంద్ర: మరి... మాధవ్ దేశం కోసం అంత త్యాగం చేస్తున్నాడు కదా... మరి నువ్వు ఇంకా అతడిని శత్రువులాగా ఎందుకు చూస్తున్నావు?

సింహాద్రి: మనోడు చేస్తున్న త్యాగానికి మెచ్చుకుంటానండి... కానీ... నన్ను చిన్నప్పటినుండి బాగాహింస పెట్టాడండి... అది మర్చి పోలేను...

రవీంద్ర: మాధవ్ సెలవు మీద వచ్చినప్పుడు నీకు ఏమి తెచ్చి ఇవ్వలేదా...

సింహాద్రి: ఇచ్చాడండి... చలికాలం లో వేసుకోవడానికి ఊలు బట్టలు తెచ్చాడండి. చాలా బాగున్నాయి...

రవీంద్ర: అయినా కూడా మాధవ్ నీకు శత్రువైనా?

సింహాద్రి: తమ్ముడు... తమ్ముడే... పేకాట... పేకాటేనండి... ఊరోళ్లం ఏది మర్చిపోము...

రఘురాం(నవ్వుతూ): సర్లెరా... మీరు... మీ శత్రుత్వం... అది తీరేది కాదు... నువ్వు రేపు రా... మనం పొలం గురించి మాట్లాడుకుందాం...

సింహాద్రి అందరికి దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

రవీంద్ర: నేను ఇంక బయలుదేరుతానండి. మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా వుంది. మీ పోలీస్ కేసు త్వరలోనే ఒక కొలిక్కి వొస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను...

రఘురాం(నవ్వుతూ): మా శరత్ గురించి కొంచం బాగా రాయండి...

రవీంద్ర: తప్పకుండా...

రవీంద్ర అక్కడనుండి బయలుదేరాడు. దారిలో DGP కి ఒక ఫోన్ కాల్ చేసాడు.

రవీంద్ర: గుడ్ ఈవెనింగ్ సర్... ఇప్పుడే నేను సీతాపురం నుండి బయలుదేరాను. ఆ ఫోటో వున్న అయిదుగురి పేర్లు వాళ్ళు చేస్తున్న జాబ్స్ తెలిసాయి...

DGP : డీటెయిల్స్ చెప్పు...

రవీంద్ర అందరి డీటెయిల్స్ చెప్పాడు

DGP: When will you be in office?

రవీంద్ర: Tomorrow morning sir...

DGP : OK. See me first thing in the morning...

రవీంద్ర: Sure...

DGP ఫోన్ పెట్టేసి ఒక 5 నిమిషాలు రవీంద్ర ఇచ్చిన డీటెయిల్స్ పరిశీలించి హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి "మీరు ఫ్రీ గా ఉంటే కొంచం అర్జెంటు గా మాట్లాడాలి. ఇది అర్జెంటు" అని అన్నాడు. ఇంట్లోనే వున్నాను వెంటనే రమ్మన్నాడు. DGP వెంటనే బయలుదేరి హోమ్ మినిస్టర్ ఇంటికి చేరి లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పాడు.

Home Minister: మరి వెంటనే ఆ మాధవ్ ని అరెస్ట్ చెయ్యండి...

>DGP(అయోమయంగా): ఏ కారణం చెప్పి అరెస్ట్ చెయ్యమంటారు?

Home Minister: మా అల్లుడి, మిగతా వాళ్ళ అందరి మర్డర్ కేసు లలో A1 గా అరెస్ట్ చెయ్యండి...

DGP : మనకి వాళ్ళ మీద వున్నది ఓకే డౌట్ మాత్రమే... మాధవ్ ఈ మర్డర్స్ చేసాడని మనకి కంఫర్మ్ గా తెలియదు...

Home Minister : నాకు అదేమీ తెలీదు. వాణ్ణి అరెస్ట్ చేసి కుళ్లబొడిస్తే వాడే ఒప్పుకుంటాడు...

DGP : మనకి వాడి పేరు మాత్రమే తెలుసు. వాడు ఎక్కడ ఉండేది తెలీదు. ఎంక్వయిరీ చెయ్యాలి...

Home Minister: అది నాకు వొదిలెయ్యి. నాకు డిఫెన్స్ మినిస్ట్రీ లో బాగా తెలిసినవాళ్ళు వున్నారు. ఫోన్ చేస్తే ఒక్క గంటలో వాడి జాతకం మొత్తం మనముందు ఉంటుంది...

Home Minister ప్రభాకర్ రావు ఢిల్లీ లో తనకి బాగా తెలిసిన ఒక IAS ఆఫీసర్ కి ఫోన్ చేసి తనకి ఏమి కావాలో చెప్పి... "ఒక్క గంటలో డీటెయిల్స్ కావాలి" అని అన్నాడు.

Home Minister: మీరు ఇక్కడే వుండండి. కాసేపట్లో డీటెయిల్స్ వొస్తాయి...

హోమ్ మినిస్టర్ చెప్పినట్లు పెద్దగా టైం పట్టలేడు. తాను ఫోన్ పెట్టెయ్యగానే ఢిల్లీ ఆ IAS ఆఫీసర్ వెంటనే ఫోన్ చేసి డిఫెన్స్ మినిస్ట్రీ లో బాగా పరిచయమున్న వ్యక్తి ని అడిగాడు. ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి కి ఫోన్ చేసాడు... అలా ఒకరితరువాత ఒకరి కి ఫోన్ కాల్స్ వెళ్లాయి. చివరి 10 నిమిషాలలో ఆ ఫోన్ కాల్ ఆర్మీ చీఫ్ కి చేరింది. ఆయన తనకి చెప్పిందంతా చాలా జాగ్రత్త విని డీటెయిల్స్ అన్ని వ్రాసుకొని ఫోన్ పెట్టేసి వేరే ఇంకొకరికి ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు మాట్లాడాడు. ఆ తరువాత ఇంకో ఫోన్ కాల్ చేసి అవతల వున్న వ్యక్తి తో చాలా సీరియస్ డిస్కస్ చేసాడు. హోమ్ మినిస్టర్ చెప్పినట్లు తొందరగానే ఢిల్లీ నుండి ఫోన్ కాల్ వొచ్చింది... సరిగ్గా 40 నిమిషాల తరువాత...

Home Minister ఫోన్ స్పీకర్ఆన్ చేసాడు...

Home Minister : హలో...

డిఫెన్స్ సెక్రటరీ: My name is Vijay Rawat. I am Secretary of Defense. Am I speaking to Mr. Prabhakar Rao - Home Minister?

Home Minister: Yes... tell me sir... do you have the details I asked?

>Defense Secretary: That's what I am about to inquire. Why are are you making inquiries about serving officer?

Home Minister: He is murder suspect here in Hyderabad...

Defense Secretary: Give me the details...

Home Minister: Our DGP is available. he will provide all the details...

DGP: We are suspecting Col. Madhav's involvement in a murder case here in Hyderabad...

Defense Secretary: Who was the victim? When did the crime took place? What is the evidence you got against Col. Madhav?

DGP: Our Home Minister's son in law got murdered. We are suspecting Col. Madhav. We do not have any hard evidence against him as yet. But we wanna arrest him and interragate him...

Defense Secretary: How can you arrest Serving Officer without prior permission from Indian Army? You do not have any evidence. You cannot arrest Army officer just because you have some doubt. Further,in case if any serving officer commits any crime, you need Central Government permission before arresting the officer. You cannot take him to civil court. He will be arrested by Military Police and Military Tribunal / Military Court will hear the case. If proven guilty, that officer will face court martial. Once again I am asking you... Do you have any hard evidence that Col. Madhav commited this murder?

DGP: No... We need to arrest him and interrogate...

Defense Secretary: First you need to provide solid proof of evidence. Only then Central Government will grant permission. Then he will be arrested by Military Police and will go to military jail if proven guilty...

DGP: At the moment we do not have any evidence incriminating Col. Madhav...

Defense Secretary: Then don't waste our time. First get the evidence. I believe you are about to retire... Am I correct?

DGP(worriedly): Yes Sir...

Defense Secretary: Good Luck...

DGP కి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

డీజీపీ: ఆ మాధవ్ ని అరెస్ట్ చెయ్యడం కుదరదు...

>Home Minister : వాడు నా అల్లుడిని చంపాడు...

డీజీపీ: అది మన డౌట్ మాత్రమే... ఆర్మీ వాడిని అరెస్ట్ చెయ్యాలంటే ముందు ఎవిడెన్స్ చూపించాలి...

Home Minister: ఎలాగైనా ఆ ఎవిడెన్స్ సంపాదించు...

డీజీపీ అక్కడ నుండి బయలుదేరాడు. రేపు రవీంద్ర ఆఫీస్ కి వచ్చాక ఆలోచించాలి అని నిర్ణయించుకున్నాడు.

రవీంద్ర హైదరాబాద్ చేరుకునేసరికి రాత్రి 3 గంటలు అయ్యింది. బాగా అలసిపోవడం తో వెంటనే నిద్ర పట్టింది. ఉదయం 7 గంటలకి లేచి బ్రష్ చేసుకొని వచ్చాడు. అతని భార్య ఇచ్చిన కాఫీ కప్ తీసుకొని The Hindu న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకొని ఫ్రంట్ పేజీ లోని వార్తా చదివాడు. అంతే... భూకంపంపం వచ్చినట్లు ఊగి పోయాడు... వొళ్ళంతా జలదరించింది... చేతులు, కాళ్ళు వణకి పోయాయి. చేతిలోంచి కాఫీ కప్ కింద పడి పగిలిపోయింది. సంభాళించుకొని మళ్ళీ ఆ న్యూ ఐటెం చదివాడు...

ఆ రోజు న్యూస్ పేపర్ మొదటి పేజీ లో పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి వుంది "PARAM VEER CHAKRA AWARDED TO TELUGU SOLDIER" పక్కనే ఆర్మీ యూనిఫామ్ లో బ్రిగేడియర్ మాధవ్ రావు ఫోటో వుంది...


PART - 7 - THERE IS A CLUE... FINALLY...

రవీంద్ర ఆఫీస్ కి వెళుతూ The Hindu పేపర్ లో బ్రిగేడియర్ మాధవ్ కి వచ్చిన పరమవీర చక్ర అవార్డు గురించి చదువుతున్నాడు.

"Brigadier Madhav Rao has been awarded Param Veer Chakra as part of India's Independence Day Celebrations. This award was given to Brigadier Madhav for audacious courage, leadership and bravery in protecting the country from enemies during his career in Indian Army. He is the 22nd person to be awarded with PVC. Last time this award was given during Cargill War in 1999. A total of 14 awards were given posthumously. He is the 8th service officer, 2nd South Indian soldier and first person from Andhra Pradesh to receive PVC. Government of Andhra Pradesh awarded a cash prize of Rs. 10 lacks."

ఈ కేసు లో మాధవ్ పాత్ర ఉందొ లేదో ఇంకా నిర్ధారణ కాలేదు. ఒకవేళ వున్నా... ఏమి చెయ్యలేని పరిస్థితి. ఇప్పుడు మాధవ్ పర్సన్ అఫ్ హై ఇంటరెస్ట్. ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చెయ్యలేదు. ఆర్మీ కి ఇన్ఫోర్మ్ చెయ్యాలి. ముందు ఈ కేసు ని పూర్తిగా స్టడీ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఆఫీస్ కి చేరగానే DGP ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే వెళ్లి కలిసాడు.

DGP : నిన్న నేను హోమ్ మిస్టర్ తో చాలా సేపు డిస్కస్ చేసాను. మనం ఎలాగైనా ఈ మాధవ్ అనే వాడిని పట్టుకోవాలి...

రవీంద్ర(టేబుల్ మీద వున్న పేపర్ తీసి DGP కి ఇస్తూ): మీరు ఈ రోజు పేపర్ చదివినట్లు లేరు. మనం వెతుకుతున్న మాధవ్ ఇతనే ( అంటూ పేపర్ లో మాధవ్ ఫోటో చూపించాడు)

DGP : What... PVC awardee is the person we are searching? Are you sure?

రవీంద్ర : 100%... We need compelling evidence to proceed...

DGP(మునుపటి రోజు డిఫెన్స్ సెక్రటరీ తో జరిగిన ఫోన్ కాల్ గుర్తు చేసుకుంటూ) :Yes. Further, we need permission from Central Government as well...

రవీంద్ర: I personally go though this case and see how best we can proceed further...

రవీంద్ర తన ఆఫీస్ కి వొచ్చి ఫార్మ్ హౌస్ మర్డర్స్ కి సంబంధించిన కేసు ఫైల్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఇతర డాకుమెంట్స్ అన్ని తెప్పిచుకొని తన రూమ్ లోకి ఎవరిని రావద్దని, డిస్టర్బ్ చెయ్యవొద్దని స్ట్రిక్ట్ ఇంస్ట్రుక్షన్స్ ఇచ్చి చదవడం మొదలెట్టాడు.

15 జులై 2016... పోలీస్ కంట్రోల్ రూమ్ కి గంగరాజు అనే అతని ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో వున్న అన్నపూర్ణ ఫార్మ్ హౌస్ లో మర్డర్ జరిగింది వెంటనే రమ్మని. పోలీస్ కంట్రోల్ రూమ్ ఆఫీసర్ డీటెయిల్స్ తీసుకొని ఆ ఫార్మ్ హౌస్ కి దగ్గర లో వున్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ ని వెళ్లి చూడమన్నాడు. ఒక అరగంట తరువాత ఆ ఇన్స్పెక్టర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఖంగారుగా ఫోన్ చేసి అక్కడ దాదాపు 40 మంది కి పైగా చనిపోయారని, ఆ ఫార్మ్ హౌస్ రామచంద్రయ్య గారిది చెప్పాడు. దాంతో పోలీస్ కంట్రోల్ వాళ్లంతా బాగా అట్టెంటివ్ అయ్యి వెంటనే సిటీ కమిషనేర్, ఇన్స్పెక్టర్ జనరల్, DGP ఇన్ఫోర్మ్ చేశారు. గంగరాజు ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకల్లా వాన్ లో ఆ ఇంటికి కావలిసిన పాలు, బ్రెడ్, ఎగ్స్ తీసుకొని వొస్తాడు. అతను ఇంటిముందు సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయివుండడం చూసి వెంటనే పోలీస్ కి ఫోన్ చేసాడు. ఈ విషయం ప్రెస్ మీడియా కి పొక్కకుండా జాగ్రత్త తీసుకొని ఆ ఫార్మ్ హౌస్ చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ దాకా కార్డాన్ ఆఫ్ చేసేసారు. ఎవ్వరిని రానియ్యలేదు. ముందుగా అక్కడికి ఫోరెన్సిక్ టీం చేరింది. వెంటనే దాదాపు 40 అంబులెన్సుస్ చేరాయి. చాలా పెద్ద ఫార్మ్ హౌస్. CCTV కవరేజ్ కూడా వుంది. కానీ ఆ టైం లో వాటి కనెక్షన్స్ పీకేసివున్నాయి. లోపలంతా చాలా ఘోరంగా వుంది. ఎక్కడ చూసినా శవాలు. రెండేళ్ల పిల్లల దగ్గరనుండి 85 ఏళ్ళ రామచంద్రయ్య గారి వరకు ఎవ్వరిని వొదలలేదు. ఒకే ఒకామె కోన ఊపిరితో వుంది. ఆమె గర్భవతి కూడా... నెలలు నిండినాయి. డాక్టర్స్ వెంటనే ఆమెని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆమె దారిలోనే పాపని కని మరణించింది. అప్పటికే రామచంద్రయ్య గారి మరణ వార్త, ఫార్మ్ హౌస్ లో జరిగిన మర్డర్స్ గురించి TV News చానల్స్ కి తెలిసిపోయింది. దాంతో ఆ వూళ్ళో రామచంద్రయ్య అంటే తెలిసిన ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. పోలీస్ కి కంట్రోల్ చెయ్యడం చాలా కష్టమయ్యింది.

ఆ ఫార్మ్ హౌస్ చాలా పెద్దది. 75 ఎకరాలు ఉంటుంది. మూడు పెద్ద గార్డెన్ వుంది. మధ్యలో ఇల్లు. వెనుక చాలా పెద్ద తోట వుంది. అందులో అన్ని రకాల పళ్ళ చెట్లు వున్నాయి. చాలా శ్రద్ధ తీసుకొని ఎన్నో ఏళ్లుగా ప్రేమతో పెంచుకుంటున్న తోట. ఆ ఫ్రేమ్ హౌస్ మధ్య లో పెద్ద ఇల్లు వుంది. 20 బెడ్ రూమ్స్ ఉంటాయి. చాలా పోష్ గా ఉంటుంది. అన్ని మోడరన్ ఫెసిలిటీస్ అందులో వున్నాయి. ఖరీదయిన ఫర్నిచర్, గోడలకి రవివర్మ, మోనే, క్యారవాజియో పెయింటింగ్స్ వున్నాయి. నేలంతా పర్షియన్ తివాచీలు వున్నాయి. ఇప్పుడు అవన్నీ రక్తం తో తడిసి వున్నాయి. పోలీస్ ఇల్లంతా గాలించారు. ఎవరూ ప్రాణాలతో లేరు. అందరూ చనిపోయారు. రామచంద్రయ్య గారు, ఆయన కుటుంబం, పని వాళ్ళు, డైవర్స్, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ చనిపోయారు. ఫార్మ్ హౌస్ అంతా రక్తం తో తడిసిపోయింది. ప్రతి గదిలోనూ శవం కనిపిచింది. అది దారుణం గా చంపబడ్డారు. ఫార్మ్ హౌస్ బయట వున్న సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్ ని తుపాకీ తో కాల్చి చంపారు. సైలెన్సర్ వాడినట్లు వున్నారు. బయట కాల్పులు జరిగితే లోపల వాళ్ళకి సౌండ్ తెలియలేదు. పైగా... ఇల్లంతా సెంట్రల్లి ఎయిర్ కండిషన్డ్ చేసివుంది. లోపలి వచ్చినవారు ముందుగా సెక్యూరిటీ కెమెరా ల కనెక్షన్ కట్ చేసి బయట కాపలాగా వున్నా గార్డ్స్ ని చంపేశారు. లోపలి వచ్చి అక్కడే వున్న కార్ డ్రైవర్స్, పని వాళ్ళని చంపేశారు. తరువాత లోపలి వచ్చి మాస్ మర్డర్స్ చేశారు. ఆ హత్యలన్నీ తెల్లవాయారు ఝాముకి ముందుగానే జరిగివుంటాయని ప్రిలిమనరీ ఎంక్వైరీ లో తేలింది. అక్కడ చనిపోయినవారి ఒంటిమీద ఒక్క నగ లేదు. కనీసం ఆడవాళ్ళ మెడలలో మంగళసూత్రం కూడా లేదు. అంటే... ఈ హత్యలు చేసి వాళ్ళ వొంటి మీద వున్న నగలు దొంగతనం చేశారు. పోలీస్ ప్రతి రూమ్ చెక్ చేశారు.

సడన్ గా... ఆ ఇల్లంతా ఫోన్స్ మోగడం మొదలెట్టాయి. ఆ ఇంట్లో వున్న ప్రతి మొబైల్ ఫోన్, ల్యాండ్ లైన్ ఆగకుండా మోగడం మొదలెట్టాయి. అక్క వున్న పోలీస్ వాళ్ళకి ఆ ఫోన్ రింగుఅవుతున్న శబ్దాలతో పిచ్చెక్కిపోయింది. పోలీస్ వాళ్ళు ఇల్లంతా వెతికి దొరికిన ప్రతి మొబైల్ ఫోన్ తీసుకొని దానిని సైలెంట్ మోడ్ లో పెట్టారు. దాదాపు 100 కి పైగా మొబైల్ ఫోన్స్ దొరికాయి. వాటన్నిటిని ఒక సోఫాలో పరిచారు. అన్ని కంపెనీల, అన్ని మోడళ్ల ఫోన్స్ వున్నాయి. ఒక్కటి కూడా ఆగకుండా రింగ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ టీం చాలా సీరియస్ గా క్లూస్, ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. దాదాపు ఒక 10 అంది ఫోటోగ్రాఫర్స్ ఆగకుండా క్రైమ్ సీన్ అంతా ఫొటోస్ తీసి కవర్ చేస్తున్నారు. ఇద్దరు వీడియో కూడా తీస్తున్నారు. ఇంతలో సిటీ పోలీస్ కమిషనర్, IG , DGP, లోకల్ MLA, మినిస్టర్... ఇలా అందరూ వచ్చేసారు. అక్కడ జరిగింది చూడగానే వారికి పరిస్థితి ఎంత గంభీరమైందో అర్ధమయ్యింది. వెంటనే ఈ వార్త చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయింది. వెంటనే రిజర్వు పోలీస్ దళాలని రంగంలోకి దింపారు. సెంటర్ కి ఫోన్ చేసి CBI ని కూడా మొదటినుంచి involve చేశారు. ఇంతలో పోలీస్ వాళ్ళు బేసెమెంట్ లోకి వెళ్లి చూసారు. అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా వుంది. అక్కడ ఫర్నిచర్ అంతా చిందరవందర చేసివుంది. నేలంతా చిరిగిపోయిన దస్తావేజులు తో నిండిపోయివుంది. అక్కడ కొన్ని గోద్రెజ్ బీరువాలు కూడా వున్నాయి వాటి తలుపులు కూడా పగలకొట్టి వున్నాయి. వాటిలోని డాకుమెంట్స్ అన్ని నేలమీద కుప్పలుగా పడివున్నాయి. ఒక పక్క గోడకి 3 పెద్ద ఐరన్ సేఫ్ లు వున్నాయి. అవి ఇల్లు కట్టేటప్పుడే గోడలో పెట్టారు. వాటి తలుపులు పగిలి వున్నాయి. లోపల అంతా ఖాళీ గాఉంది. వచ్చినవాళ్లు ఇంట్లో వాళ్ళని చంపేసి ఇల్లంతా దోచుకొని వెళ్లరు. ప్రతి బెడ్ రూమ్ లో, ప్రతి కప్ బోర్డు కాలీగా వుంది. వాటిలోని వస్తువులన్నీ మంచాల మీద, నేల మీదా వున్నాయి. అన్ని బాగా ఖరీదైన చీరలు, బట్టలు.

రోజు గడుస్తున్నకొద్దీ ఆ ఫార్మ్ హౌస్ వచ్చే వాళ్ళ సంఖ్య వందలు దాటుతోంది. నిమిష నిమిషానికి ఆ సంఖ్య పెరుగుతోంది. అందరూ ఫ్రెండ్స్, బంధువులే... అంతా హైదరాబాద్ లో లోకల్ గా వున్నవాళ్లు. ఇంకా రామచంద్రయ్య గారి ఊరి నుంచి బయలుదేరిన జనాలు ఇంకా అక్కడికి చేరుకోలేదు. పోలీస్ ఎవరిని ఇంట్లోకి రానివ్వడం లేదు. కొంత మంది రాష్ట్ర మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ ఇళ్ళకి వెళ్లారు. వాళ్ళకి ఎవరూ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఏమి జరిగిందన్న సంగతి ఎవరికి తెలియడం లేదు. అందరికి బాగా టెన్షన్ గా వుంది. దాదాపు సాయంత్రం 6 గంటలకి అన్ని శవాలు హాస్పిటల్ కి చేరాయి. ఫార్మ్ హౌస్ మొత్తం పోలీస్ ల ఆధీనంలోకి వచ్చేసింది. రెండు కంపెనీల రిజర్వు పోలీస్ (270 మంది constables) కూడా అక్కడే వున్నారు. ఇంకో రెండు కంపెనీస్ కోసం రిక్వెస్ట్ చేశారు. తెల్లారేలోగా వాళ్ళు కూడా వోచేస్తారు.

రాత్రి 9 గంటలకి TV లో DGP గత రాత్రి ఆ ఫార్మ్ హౌస్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ఇంట్లో వాళ్ళందరిని చంపేసి నగలు, డబ్బు దోచుకొని పోయినట్లు చెప్పాడు. ఇది ఒక బందిపోటు ముఠా చేసిన పనిగా అనుమానిస్తున్నామన్నారు. రామచంద్రయ్య గారి బంధువులని పిలిపించామని, వాళ్ళు రాగానే అక్కడ చపిపోయినవాళ్లందరి ఐడెంటిఫై చేయిస్తున్నామని చెప్పారు. వీలయినంత త్వరలో పోస్ట్ మార్టం పూర్తిచేసి డెడ్ బాడీస్ బంధువులకి అప్పగిస్తామని చెప్పారు. ఈ కేసు ని స్టేట్ పోలీస్, CBI కలసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని, త్వరలోనే కేసు సాల్వ్ చేస్తామని చెప్పాడు. అంతే... రాష్ట్రమంతా ఒక్క దెబ్బతో భయాందోళనలతో నిండిపోయింది. ఎవరెవరు చనిపోయారు? ఎవరు చంపారు? ఎందుకని చంపారు అని ఊహాగానాలు చెలరేగాయి.

పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక డెకాయిటీ, రాబరీ, హోమిసైడ్ అని ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలెట్టారు. పోస్ట్ మార్టం చేసి డెడ్ బాడీస్ ని వాళ్ళ బంధువులకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాటిని వాళ్ళ వూరికి తీసుకెళ్లి దహనసంస్కారాలు చేశారు. మీడియా కధనాల ప్రకారం దాదాపు 10 లక్షలమంది దాకా ఆరోజు దహనసంస్కారాలకి హాజరయ్యారని తెలిసింది. ఒక TV ప్రోగ్రాం ప్రకారం ఒక రాత్రి లో ఒక వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. రామచంద్రయ్య గారి మృతితో ఒక శకం ముగిసిందని భావించారు.

పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం బయట వున్నా సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్, పనివాళ్లని తుపాకీతో కాల్చి చంపారని తెలిసింది. చనిపోయిన ప్రతి ఒక్కరి బాడీ లో 3 / 4 బుల్లెట్స్ దొరికాయి. ఎక్కువగా గుండెలోన, తలమీద కాల్చారు. ఇంటి లోపల దొరికిన శవాల ని పరీక్ష చేస్తే... ప్రతి వారిని ముందుగా కత్తి తో బలంగా గాయపరచి చివరికి తుపాకీతో కాల్చి చంపినట్లు గా తేలింది. ప్రతి వక్కరిని చంపే ముందు బాగా హింస పెట్టి మరీ చంపారని తేలింది. ఫోరెన్సిక్ టీం రిపోర్ట్ ప్రకారం Glock, Smith & Wessan, Colt, Beretta లాంటి తుపాకులు వాడినట్లు తెలిసింది. ఇవి కాకుండా బాగా పదునైన కత్తులు కూడా వాడినట్లు తెలిసింది. బేసెమెంట్ లోని ఐరన్ సేఫ్ లని తెరవడానికి పేలుడు పదార్ధాలు వాడారు. అక్కడ వున్న బీరువాలని గునపాలతో తెరిచారు. ఆ చుట్టు పక్కల పరిశీలిస్తే దాదాపు 12 నుంచి 16 దాకా పెద్ద SUV లు తిరిగాయని తేలింది. వాటి టైర్ గుర్తులు దగ్గరలో వున్న మెయిన్ రోడ్ దగ్గర ఆగిపోయాయి. ఒక్కసారి మెయిన్ రోడ్ ఎక్కితే వెహికల్ ఎటు వెళ్లినా పట్టుకోవడం చాలా కష్టం. ఆ చుట్టు పక్కల రోడ్స్ మీద సెక్యూరిటీ కెమెరాలు లేవు. కాబట్టి వాహనాల కదలికలు తెలుసుకోవడం చాలా కష్టం. కానీ... ఇల్లంతా వెతికినా ఒక్క బులెట్ షెల్ కూడా దొరకలేదు. ఆ క్రైమ్ సీన్ అంతా ఎవరో బాగా క్లీన్ చేసినట్లు వుంది. డెడ్ బాడీస్ లోనూ, ఇంట్లోనూ చాలా బుల్లెట్స్ దొరికాయి. ఒక్క వేలి ముద్ర కూడా దొరకలేదు. అక్కడ దొరికిన వేలిముద్రలన్నీ ఆ ఇంటివాళ్ల వేలిముద్రలతో టాలీ అయ్యాయి. అవి క్రిమినల్స్ డేటాబేస్ లో ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు. దొంగిలించబడిన నగలు ఎక్కడా అమ్మినట్లు సమాచారం లేదు. ఆ ఐరన్ సేఫ్ లలో ఏమేమి ఉన్నాయో లిస్ట్ కూడా లేదు. ఒకవేళ డబ్బు ఉండి ఉంటే ఎంత వున్నది తేలలేదు. చెప్పడానికి ఆ కుటుంబంలో ఎవరూ బతికి లేరు. బంధువులెవరికి నగలు, డబ్బు లాంటి విషయాలు తెలియవు. రామచంద్రయ్య గారు బాగా డబ్బు వున్నవాడు. కేసు ముందుకి వెళ్లడం లేదు. ఒక్క సస్పెక్ట్ కూడా లేడు.

డెడ్ బాడీస్ లో దొరికిన బుల్లెట్స్ ని స్టడీ చేసిన టీం రిపోర్ట్ ప్రకారం... ఆ బుల్లెట్స్ మీద దొరికిన మార్కింగ్స్ నేషనల్ ఫోరెన్సిక్ డేటా బేస్ లోని ఏ గన్ తోనూ మ్యాచ్ అవ్వలేదు. ఈ క్రైమ్ లో వాడిన తుపాకులు వేరే ఏ క్రైమ్ లోనూ వాడలేదు. కొత్తవి కా వొచ్చు. ఆ తుపాకులు దొరికితే కానీ హంతకుడు దొరకదు. తుపాకీ పేల్చగా బయటకి వచ్చిన ప్రతి బులెట్ మీద మార్కింగ్స్ ఉంటాయి. తుపాకీ తయారు చేసేటప్పుడు గన్ బారెల్ లోపల మార్కింగ్స్ వేస్తారు. గన్ లోంచి వెలువడిన ప్రతి బులెట్ మీద ఈ మార్కింగ్స్ పడతాయి. ఈ మార్కింగ్స్ ప్రతి గన్ కి డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్ల బులెట్ ని పరీక్షించినప్పుడు ఆ బులెట్ మీద మార్కింగ్స్ ని బట్టి ఆ బులెట్ ఏ గన్ పేల్చగా బయటకి వచ్చిందో ఖచ్చితంగా తెలుస్తుంది. క్రైమ్ సీన్ లో దొరికిన బులెట్ మార్కింగ్స్ నేషనల్ ఫోరెన్సిక్ డేటాబేస్ లో పెడతారు. అందుకే ఎవరైనా గన్ లోని బులెట్ వాళ్ళ చనిపోతే ఆ హత్య ఆయుధం గన్ కోసం వెతుకుతారు. అది దొరకనంత వరకు హంతకుడిని గుర్తించడం కష్టం. ఈ కేసు లో అదే జరిగింది. ఫార్మ్ హౌస్ లో చాలా గన్స్, కత్తులు వాడారు. దాంతో కేసు చాలా కాప్లికేట్ అవుతోంది. ఫోరెన్సిక్ టీం రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా వుంది ఫార్మ్ హౌస్ లో వాడిన కత్తులు చాలా లేటెస్ట్ వి చాలా పదునైనవిగా తెలిసింది.

క్రైమ్ సీన్ లో ఒక్క వేలిముద్ర కానీ, బులెట్ షెల్ గాని దొరకక పోవడం... చాలా వింతగా వుంది. ఇంత వరకు ఇలా జరగలేదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా కూడా ఏదో ఒక తప్పు చేస్తాడు. ఇక్కడ ఒక్క తప్పు కూడా దొరకలేదు. ఈ రిపోర్ట్ పూర్తిగా చదివిన రవీంద్ర కి ఒక అనుమానం వచ్చింది. క్రైమ్ సీన్ ఇంత క్లీన్ గా వుంది అంటే... అక్కడ రెండు టీమ్స్ పనిచేశాయా? ఒక టీం క్రైమ్ చేస్తే... రెండో టీం క్లీన్ చేసిందా? ఒకవేళ అలాగే జరిగివుంటే ఆ క్లీన్ చేసిన వారు ఎవరు? ఒకవేళ పోలీస్ వాళ్లే క్లీన్ చేశారా? ఒక్క పోలీస్ వాళ్ళకే తెలుస్తుంది. క్రైమ్ సీన్ లో ఎలాంటి క్లూస్ ఉంటాయి... వాటిని పోలీస్ ఎలా గుర్తిస్తారు... ఎలా కలెక్ట్ చేస్తారు? ఎలా అనలైజ్ చేస్తారు... ఆ అనాలిసిస్ ని ఎవిడెన్స్ లాగా ఎలా వాడతారు... ఈ విషయాలు ఒక్క అనుభవం వున్న పోలీస్ వాళ్లకే తెలుస్తాయి. రవీంద్ర ఢిల్లీ లో DCP Crime Branch లో పనిచేసినప్పుడు 6 నెలల పాటు Scotland Yard కి వెళ్లి చాలా విషయాలు తెలుసుకున్నాడు. అక్కడ పరిచయం అయిన Paul Armitage అనే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చెప్పినదాని బట్టి... క్రైమ్ చేసింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందినవ్యక్తి అయినా లేదా పోలీస్ పర్యవేక్షణలో క్రైమ్ జరిగినా... క్రిమినల్స్ దొరకడం అనేది చాలా కష్టం. ప్రపంచం లో సాల్వ్ కానీ కేసులు చాలా వున్నాయి. వాటికి కారణం, క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ మొత్తం చెరిపెయ్యడం... Paul Armitage ఇంకో విషయం కూడా చెప్పాడు. క్రైమ్ సీన్ ఫొటోస్ ని చూసి క్రైమ్ ఎలా జరిగిందో వూహించుకోగలిగితే ఏదో ఒక క్లూ దొరుకుతుంది. ఒకవేళ క్రైమ్ సీన్ లో ఏదైనా లింక్ మిస్సయినట్లున్నా.. లేదా క్రైమ్ సీన్ ని అన్ని యాంగిల్స్ లో ఫొటోస్ తియ్యడం కుదరక పోతే... అంటే ఏదైనా అడ్డం ఉండడం వల్ల ఆ యాంగిల్ లో ఫొటోస్ లేకపోతే... 8 out of 10 టైమ్స్... వైటల్ ఎవిడెన్స్ అక్కడే దొరికే ఛాన్సెస్ ఉంటాయి... రవీంద్ర ఆ క్రైమ్ సీన్ ఫొటోస్ ని దాదాపు 4 రోజుల పాటు చాలా క్లోజ్ గా పరిశీలించాడు. క్రైమ్ సీన్ మొత్తం అతని మెదడులో స్టోర్ అయిపొయింది. Paul Armitage చెప్పింది కరెక్ట్... ఇప్పుడు తనకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఇంటిలో ఎక్కడెక్కడ వెతికితే తాను ఎదురుచూస్తున్న ఎవిడెన్స్ దొరుకుతుందో ఆయా పాయింట్స్ ని బాగా గుర్తుపెట్టుకున్నాడు...

రవీంద్ర నేషనల్ క్రైమ్స్ డేటాబేస్ లో ఇండియా లో జరిగిన డెకాయిటీ, సిరీస్ క్రైమ్స్ ని స్టడీ చేసాడు. ముఖ్యంగా... డెకాయిటీ కేసులు అన్ని బాగా స్టడీ చేసాడు. అందులో అర్ధమయ్యింది ఏమిటంటే... బందిపోటు ముఠాలు నార్మల్ గా లోకల్ గా తయారైన గన్స్, రైఫిల్స్ వాడతారు. వాళ్ళకి లేటెస్ట్ ఇంపోర్టెడ్ గన్స్ కొనుక్కునే అంత స్తోమత ఉండదు. ఉత్తర భారతదేశం లో ఎక్కువగా కట్టా వాడతారు... అంటే... కంట్రీ గన్... ఆ గన్ లోంచి వచ్చిన బుల్లెట్స్ కి స్టాండర్డ్ మార్కింగ్స్ వుండవు. పైగా... వాళ్ళు వాడే కత్తులు కూడా చాలా క్రూడ్ గా ఉంటాయి. అవి ఎక్కువగా గ్రామాల్లో తయారు అవుతాయి. ఇక్కడ ఫార్మ్ హౌస్ లో వాడిన గన్స్, బుల్లెట్స్ అన్ని బాగా హై క్వాలిటీ, స్టాండర్డ్ వున్నవి. బుల్లెట్స్ మీద మార్కింగ్స్ చాలా క్లియర్ గా యూనిఫామ్ గా వున్నాయి. కత్తులు కూడా మంచి పదునైనవి గా వున్నాయి. ఈ కేసు సాల్వ్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం హత్య ఆయుధాలు దొరకక పోవడమే... ఒకవేళ వాటన్నిటిని ఏదైనా ఐరన్ ఫౌండ్రి లో వేసి కరిగించేసారేమో... అలా చేస్తే... అనుమానితులని దోషులుగా నిరూపించడం చాలా కష్టం. అప్పుడు అర్ద్మయ్యింది... రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క అరెస్ట్ కూడా ఎందుకు చెయ్యలేక పోయారో...

మరుసటి రోజు ఉదయం ఒక టీం ని తీసుకొని ఫార్మ్ హౌస్ కి వెళ్ళాడు. ఆ ఫార్మ్ ఇంకా పోలీస్ ఆధీనంలోనే వుంది. వెహికల్ గేట్ బయటే ఆపేసాడు. ఏరియా పెరిమేటర్ అంతా చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. తానే ఒక క్రిమినల్ అయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాడో ఆలోచించసాగాడు. ఆ ఫార్మ్ హౌస్ ముందు అంతా ఖాళీ స్థలాలు. ఎలాంటి ఇళ్ళు లేవు. ఫార్మ్ హౌస్ లోకి ఎవరు వచ్చినా వెళ్లినా రాత్రిపూట గుర్తుపట్టడం కష్టం. మెయిన్ రోడ్ కూడా ఒక కిలోమీటర్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి ఫార్మ్ హౌస్ వరకు మట్టి రోడ్ వుంది. మెయిన్ గేట్ కి సీల్ వేసి వుంది. 75 ఎకరాల ఫార్మ్ హౌస్ కి కాంపౌండ్ వాల్ కట్టి వుంది. తనతో పాటు తెచ్చిన డ్రోన్ కెమెరాని ఆకాశం లోకి పంపి కాంపౌండ్ వాల్ పక్కనుండి నడుపుతూ ఫార్మ్ హౌస్ ని ఎరియల్ వ్యూ తో రికార్డు చేస్తూ క్రిమినల్స్ ఎక్కడెక్కడి నుండి ఆ ఫార్మ్ హౌస్ లోకి వచ్చి వుంటారో ఆయా పాజిబుల్ ఎంట్రీ పాయింట్స్ ని మార్క్ చేసాడు. డ్రోన్ కెమెరా పూర్తిగా చుట్టి రావడానికి బాగా టైం పట్టింది. రవీంద్ర చేతికి గ్లోవ్స్ వేసుకొని గోడ ఎక్కి లోపల ఎక్కడ దూకడం కుదురుతుందో చూసుకొని దిగాడు. అక్కడ నుండి ఫార్మ్ హౌస్ ఏరియా పరిశీలించాడు. చాలా బాగా మైంటైన్ చేసిన గార్డెన్... ఆ సంఘటన తరువాత ఎవరు లోపలి రాకపోవడం తో చాలా చెత్తగా వుంది. రిపోర్ట్స్ ప్రకారం సెక్యూరిటీ గార్డ్స్ ని 100 - 150 మీటర్స్ రేంజ్ లోనూ, డ్రైవర్స్ ని 10 - 20 మీటర్స్ రేంజ్ లో కాల్చబడ్డారు. ఆ రోజున 8 సెక్యూరిటీ గార్డ్స్, 6 డ్రైవర్స్ వున్నారు. అంటే దాదాపు 15 మంది ఫార్మ్ హౌస్ కి పడమర వైపు నుండి ఎంటర్ అయ్యారన్నమాట. ముందుకు వెళ్ళాడు ఇల్లు చాలా పెద్దది. చాలా బాగుంది. పెద్ద డ్రైవ్ వే... అందులో ఒక Mercedes Benz S క్లాస్ ఆగివుంది. బాగా మట్టి కొట్టుకొని వుంది. రవీంద్ర ఇంటి చుట్టూ తిరిగిగాడు. వెనక వైపు, కిటికీ ఊచలువిరిగి వున్నాయి. దానికి అడ్డంగా పోలీస్ టేప్ వుంది. అది ఒక ఎంట్రీ పాయింట్. అలా మొత్తం 5 ఎంట్రీ పాయింట్స్ కనిపించాయి. ఇది డెఫినిట్ గా డెకాయిట్ పని కాదు. డెకాయిట్స్ కి ఇంత డిటైల్డ్ గా ఇంటి గురించి తెలుసుకొని ప్లాన్ వేసుకొని రావాలంటే చాలాకష్టం. ఇది లోకల్ గ్యాంగ్ పనే...

రవీంద్ర మెయిన్ డోర్ తాళం తీసి లోపలి వెళ్ళాడు. చాలా మంచి టేస్ట్ తో కట్టిన ఇల్లు. ఇల్లంతా కలయ తిరిగాడు. ఆఖరున బేసెమెంట్ లోకి వెళ్ళాడు. మిగతా వాళ్ళని పైనే ఉండమని చెప్పాడు. కిందకి దిగుతూ తాను ఫొటోస్ లో చూసిన క్రైమ్ సీన్ మొత్తం ఒక్కసారి గుర్తుతెచ్చుకున్నాడు. అంతా అలాగేఉంది. ఏవి కదల్చలేదు. ముందుగా ఐరన్ సేఫ్ లు వున్న గోడ దగ్గరికి వెళ్ళాడు. ఐరన్ సేఫ్ తలుపు పూర్తిగా ఊడిపోయి వుంది. ఆ తలుపుకి రెండు హింజెస్ వున్నాయి. ఆ రెండూ పూర్తిగా విరిగి పోయాయి. ఆ మూడు ఐరన్ సేఫ్ హింజెస్ ని వాసన చూసాడు. ఒక రకమైన కెమికల్ వాసన... ఒకే రకంగా వుంది... తన పాకెట్ లోంచి ఒక చిన్న జిప్ లాక్ కవర్లు 3 తీసి పెన్ నైఫ్ తో ఆ హింజ్స్ మీద గీకి వొచ్చిన కెమికల్ ని జాగ్రత్తగా ఆ బాగ్ లో వేసి లాక్ చేసాడు. ఒక పని అయ్యింది. ఇప్పుడు లేచి బీరువాలు వున్న గోడకి అభిముఖంగా నుంచున్నాడు. ఆ బీరువాల లాక్ ని తుపాకీతో కాల్చి గునపాలతో పొడిచి తెరిచారు. రెండు బీరువాలని ఇష్టం వచ్చినట్లు ఒకదానిమీద ఒకటి పడేసారు. రవీంద్ర జాగ్రత్తగా కింద పడిన ఆ రెండు బీరువాలు పక్కన పాకుతూ వెళ్లని మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వేసి పరిశీలించాడు. రవీంద్ర మొహం మీద చిరునవ్వు వచ్చింది... అక్కడ రెండు బులెట్ షెల్స్ పడి వున్నాయి. చాలా కేర్ ఫుల్ గా వాటిని తీసి వేరొక జిప్ లాక్ కవర్ లో వేసి సీల్ చేసాడు. ఆ షెల్స్ అక్కడ పడడానికి కారణం... క్రిమినల్స్ ఆ బీరువాల లాక్స్ ని గన్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారు... బీరువాలు ఖాళీ చేసాక వాటిని ఒకద్దని మీద ఒకటిగా పడేసారు. అప్పుడు ఈ బులెట్ షెల్స్ వాటి కిందకి వెళ్లాయి. క్రైమ్ సీన్ క్లీన్ చేసేటప్పుడు అవి ఎవరికి కనబడలేదు. ఫోరెన్సిక్ టీం కి కూడా బాగా కిందకి వున్న ఆ రెండు షెల్స్ కనబడలేదు. రవీంద్ర క్రైమ్ సీన్ ఫొటోస్ చూసినప్పుడు ఆ కింద పడ్డ బీరువాలు ఫొటోస్ ముందునుంచి మాత్రమే వున్నాయి. పక్క నుండి, వెనుకనుండి ఫొటోస్ తియ్యలేక పోయారు. కాబట్టి అక్కడ ఎవరూ చెక్ చేసే ఆస్కారం పెద్ద గా ఉండదు. క్రైమ్ చేసింది... ఆ క్రైమ్ సీన్ క్లీన్ చేసింది వేరే వేరే టీమ్స్ అయినట్లయితే... అక్కడ ఎవరూ క్లీన్ చేసే ఆస్కారం ఉండదు. అందుకే రవీంద్ర అక్కడే ఏదైనా క్లూ దొరక వచ్చేమోనని ఒక ఆశ తో వచ్చాడు. ఇంటి నుండి బయటకి వస్తూ "Thank You Mr. Paul Armitage... I owe you one" అని మనసులో అనుకున్నాడు. "పని అయ్యిందా సర్..." అని అడిగాడు టీం లో ఒకడు. రవీంద్ర మొహం నిరాశగా పెట్టి... "No Luck" అని అన్నాడు. ఎవిడెన్స్ సేకరించిన సంగతి ఎవరికి చెప్పలేదు.

అదే రోజు రాత్రి ఆ ఎవిడెన్స్ కవర్లు తీసుకొని ఢిల్లీ చేరాడు.


PART - 8 - THE CULPRIT

రవీంద్ర ఢిల్లీ లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి సమర్ పాల్ సింగ్ ని కలిసాడు.

రవీంద్ర: నాకు ఒక ఫేవర్ కావాలి...

సమర్ : ఏమి కావాలో చెప్పు చేస్తాను...

రవీంద్ర: నా దగ్గర క్రైమ్ సీన్ ఎవిడెన్స్ వుంది. దాన్ని నువ్వు కొంచం కాన్ఫిడెన్షియల్ గా అనలైజ్ చేయించాలి. నేను ఒక పెద్ద హోమిసైడ్ కేసు ని పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యిందేమోనని అనుమానంగా వుంది. కేసు గత రెండేళ్లుగా ముందుకు వెళ్లడం లేదు. నేను ఇలా క్రైమ్ సీన్ ఎవిడెన్స్ ని ఇక్కడికి తెచ్చినట్లు ఎవరికి తెలీదు. ఇందులో ఏదైనా లీడ్ దొరికితే దానిని నేను సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాను...

సమర్ : తప్పకుండా... పద నేనే నిన్ను ఇంటలిజెన్స్ బ్యూరో లో నాకు బాగా తెలిసిన అతని దగ్గరకి తీసుకెళతాను...

ఇద్దరూ కలసి IB లో ఒక ఆఫీసర్ ని కలిసి రవీంద్ర తెచ్చిన ఎవిడెన్స్ ని ఆయనకిచ్చి వీలయినంత త్వరగా గా రిజల్ట్స్ ఇప్పించమని రిక్వెస్ట్ చేశారు. ఆయన "I will do my best" అని అన్నాడు...

మరుసటి రోజు రిజల్ట్స్ వచ్చాయి. IB ఆఫీసర్ రవీంద్ర ని అర్జెంటు గా వాళ్ళ ఆఫీస్ కి రమ్మన్నాడు. రవీంద్ర తో పాటు సమర్ కూడా హడావిడిగా IB ఆఫీస్ చేరుకున్నారు.

IB ఆఫీసర్: మీకు ఈ ఎక్సప్లోజివ్ సాంపిల్స్ ఎక్కడివి?

రవీంద్ర: హైదరాబాద్ లో ఒక క్రైమ్ సీన్ లోంచి సేకరించాము.

IB ఆఫీసర్ 2 నిమిషాలపాటు మౌనంగా వుండిపోయాడు.

IB ఆఫీసర్: మీకు ఈ ఎక్సప్లోజివ్ మెటీరియల్ గురించి ఏమైనా ఐడియా ఉందా?

రవీంద్ర: లేదండి.

IB ఆఫీసర్: ఇది చాలా ఖరీదైన మెటీరియల్. ఈజీ గా దొరకదు. ఎక్కువగా వాడరు. ఇండియా లో ఎవరైనా ఇది వాడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి లైసెన్స్ ఉండాలి. ఇది RDX (Research Department Explosive) లాంటిదే... దీనికి రకరకాల పేర్లు వున్నాయి... కెమికల్ కంపొజిషన్ బట్టి... RDX, Semtex, C4, ప్లాస్టిక్ ఎక్సప్లోజివ్ అని చాలా పేర్లు వున్నాయి. చాలా పవర్ఫుల్ మెటీరియల్. బేస్ కంపోనెంట్ మాత్రం ప్లాస్టిక్ ఎక్సప్లోజివ్ తయారుచేయడానికి ఎక్కువగా వాడతారు. ఇక్కడ వాడిన మెటీరియల్ చాలా డిఫరెంట్ గా వుంది. బేస్ మెటీరియల్ తీసుకొని వాళ్ళ టార్గెట్ ని బ్లాస్ట్ చెయ్యడానికి ఎంత కావాలో... వాటిలో ఏమేమి కలిపితే వాళ్ళ ఆబ్జెక్టివ్ నెరవేరుతుందో... పైగా ఎక్సప్లోషన్ బాగా పెద్దదిగా ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా అక్కడ చుట్టుపక్కల దాదాపు 50 నుంచి 80 మీటర్స్ రేడియస్ లో సివియర్ డామేజ్ అయ్యివుండేది. పెద్ద గుంట కూడా పడివుండేది. ఈ క్రైమ్ సీన్ ఫొటోస్ లో అదేమీ లేదు... అంటే దీనిని వాడిన వాళ్ళు మంచి ఎక్సపెర్ట్స్. దీనిని చాలా తక్కువ క్వాంటిటీ లో వాడడంతో ఎక్కువ డామేజ్ జరగలేదు. ఈ పని బాంబు మేకర్స్, లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో అడ్వాన్స్ డిగ్రీ ఉన్నవాళ్లే చేసివుండాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. Your suspect is highly trained criminal. Extremely dangerous...

రవీంద్ర తనతో పాటు తెచ్చిన క్రైమ్ సీన్ ఫొటోస్ చూపించాడు. అవి చూసిన వెంటనే ఆ IB ఆఫీసర్... "ఇదిగో చూసారా... ఐరన్ సేఫ్ హింజెస్ పూర్తిగా నాశనమయ్యాయి... ఇదే కనుక కొంచం ఎక్కువ మోతాదు లో ఈ కెమికల్ వాడినట్లైతే ఐరన్ సేఫ్ మొత్తం పేలిపోయేది. ఈ గోడ పగిలిపోయి ఉండేది. ఈ ఐరన్ సేఫ్ వున్నా చోట పెద్ద గుంట ఉండేది... అలాంటిదేమి జరగలేదు. I am sure... ఈ మెటీరియల్ వాడిన వాళ్లకు తప్పకుండా కెమికల్స్ మీద చాలా మంచి నాలెడ్జి వుంది" అని అన్నాడు.

రవీంద్ర: ఆ బులెట్ షెల్స్ రిజల్ట్స్ ఎలా వున్నాయి...

IB ఆఫీసర్: Yes... అవి కూడా రెడీ గా వున్నాయి. ఆ రెండు బులెట్ షెల్స్ మీద ఒకరి వేలిముద్రలు వున్నాయి. అవి చాలా క్లియర్ గా వున్నాయి. వాటిని ఆధారంగా మేము నేషనల్ ఫోరెన్సిక్ డేటాబేస్ లో చెక్ చేసాము. అది ఒక క్రిమినల్ కి సంభందిచినవి. ఆ క్రిమినల్ ఇప్పుడు హైదరాబాద్ చర్లపల్లి జైలు లో వున్నాడు. వాడికి ఒక మర్డర్ కేసు లో 7 యేళ్ళు జైల్ శిక్ష పడింది. ఇంకో రెండేళ్ల శిక్ష పెండింగ్ వుంది...

రవీంద్ర: ఆ క్రిమినల్ పేరు?

IB ఆఫీసర్(ఫైల్ చెక్ చేసి) : జితేందర్

రవీంద్ర జితేందర్ కేసు వివరాలు, వాడి ఫోటో, ఎక్సప్లోజివ్ టెస్ట్ రిజల్ట్స్ అన్ని తీసుకొని వాళ్ళకి థాంక్స్ చెప్పి హైదరాబాద్ రావడానికి ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. ఇంతలో సమర్ ఒక ఇమెయిల్ పంపాడు. అది జితేందర్ కి సంబంధించిన కేసులన్నిటి పూర్తి చరిత్ర. జితేందర్ ఆదిలాబాద్ జిల్లా లో ఒక చిన్న తండాకి చెందిన వ్యక్తి. పెద్దగా చదువుకోలేదు. చిన్నపటినుండే నేరాలు చేసేవాడు. తండా వాళ్ళు అడవుల్లోకి వెళ్లి అమూల్యమైన ఓషధాలు తెస్తూ వుంటారు. జితేందర్ వాటిని దొంగతనం చేసి ఆదిలాబాద్ తీసుకెళ్లి అమ్మేస్తూ ఉండేవాడు. ఇది తెలిసిన తండా వాళ్ళు వాడిని తండా లోంచి తన్ని తరిమేశారు. కొంత కాలం పిక్ పాకెట్ చేసి బతికాడు. కానీ... ఎప్పుడూ అరెస్ట్ కాలేదు. కొంత కాలానికి హైదరాబాద్ చేరుకొని రసూల్ గ్యాంగ్ లో చేరాడు. అప్పటినుండి సీరియస్ క్రిమినల్ గా ఎదిగాడు. చాలా మర్డర్ కేసుల్లో నిందితుడిగా వున్నాడు... అయితే సరైన ఎవిడెన్స్ లేనందువల్ల తప్పించుకునేవాడు. చివరకి ఒక కేసు లో 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇప్పుడు చర్లపల్లి జైల్లో వున్నాడు. జైల్లో వున్నవాళ్లు unofficial గా బయటి కి వచ్చి క్రైమ్ చేసి లోపలి వెళ్లడం కొత్త విషయం ఏమి కాదు. ఈ కేసు లో కూడా అదే విధంగా జరిగివుండవచ్చు.

రవీంద్రకి ఒక విషయం చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఈ కేసు కి జితేందర్ చాలా ముఖ్యమైన లింక్. చాలా డెలికేట్ గా హేండిల్ చెయ్యాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా కేసు తారుమారు అయ్యే ఛాన్సెస్ వున్నాయి. మొదటి నుండి ఈ కేసు లో బాగా పెద్ద వాళ్ళు పాత్ర కనిపిస్తోంది. వాళ్ళ వివరాలు డైరెక్ట్ గా తెలియక పోయినా... క్లియర్ గా వాళ్ళ involvement కనిపిస్తోంది. కేసు ముందుకి వెళ్ళకపోవడం. క్రైమ్ సీన్ మొత్తం క్లీన్ చెయ్యడం... ఇవన్నీ చిన్న వ్యక్తులవల్ల కాదు. జితేందర్ ని ఎలా హేండిల్ చెయ్యాలి? పోలీస్ డిపార్టుమెంటు లో ఎవరు సరైన వ్యక్తి? ఈ జితేందర్ పాత్ర వున్నదని తెలియకుండా సీక్రెట్ గా హేండిల్ చెయ్యాలి. అందుకోసం ఒక నమ్మకమైన, ఈ కేసు లో ఎటువంటి ఇన్వొల్వెమెంట్ లేని, కంప్లీట్ గా బయటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కి చర్లపల్లి జైల్లో పనిచేసేవాళ్ళతో మంచి వర్కింగ్ రిలేషన్ ఉండి ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. హైదరాబాద్ వచ్చాక ఎయిర్ హోస్టెస్ నిద్ర లేపింది. కార్ లో ఇంటి వెళుతుండగా గుర్తుకొచ్చింది... CI కరుణాకర్... చాలా మంచి వాడు. ఒక ఫంక్షన్ లో కలిసాడు. చాలా కాలంగా చర్లపల్లి జైలు లో డ్యూటీ చేస్తున్నాను... సిటీ క్రైమ్ డిపార్ట్మెంట్ కి కానీ, ట్రాఫిక్ కి కానీ ట్రాన్స్ఫర్ చెయ్యించమని చాలా రిక్వెస్ట్ చేసాడు. రవీంద్ర DGP Prisons తో మాట్లాడి CI కరుణాకర్ కి సిటీ క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్సఫర్ అయ్యేట్లు చూసాడు. అది జరిగి కూడా దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. 1. CI కరుణాకర్ కి ఈ కేసు తో సంభంధం లేదు. 2. చర్లపల్లి జైలు లో పనిచేసేసాడు. 3. సెంట్రల్ జైల్లో దాదాపు 8 ఏళ్ళు పనిచేయడంతో అక్కడ ప్రొసీజర్స్ అన్ని తెలిసి ఉంటాయి. 4. జితేందర్ ఆ జైల్లో గత అయిదేళ్లగా వున్నాడు కాబట్టి కరుణాకర్ కి తెలిసే అవకాశం వుండే ఉంటుంది. 5. డిపార్ట్మెంట్ లో కరుణాకర్ మీద ఎటువంటి కంప్లయింట్ లేదు... అది చాలా ముఖ్యం. వెంటనే ఫోన్ చేసి కరుణాకర్ ని తన ఇంటికి రమ్మన్నాడు.

రాత్రి 11:30 కి కరుణాకర్ వచ్చాడు.

రవీంద్ర: ఇప్పుడు నీతో డిస్కస్ చెయ్యబోయే విషయం చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్. మన ఇద్దరి మధ్యనే ఉండాలి. బయటకి పొక్కితే చాలా ప్రాబ్లెమ్స్ వస్తాయి. కాబట్టి... బి కేర్ ఫుల్...

కరుణాకర్: తప్పకుండా సర్... ఎవరితోనూ డిస్కస్ చెయ్యను...

రవీంద్ర: నీకు చర్లపల్లి జైలు లో జితేందర్ అనే క్రిమినల్ తెలుసా?

కరుణాకర్: తెలుసు సర్... చాలా పెద్ద క్రిమినల్...

రవీంద్ర: నేను ఒక కేసు లో వాడి involvement వున్నదని నా అనుమానం...

కరుణాకర్: అయితే వెంటనే ఇంటరాగేషన్ కి తీసుకు రమ్మంటారా...

రవీంద్ర: దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ క్రైమ్ జరిగినప్పుడు వాడు లాక్ అప్ లో వున్నాడు...

కరుణాకర్(confuse గా చూస్తూ) : అర్ధం కాలేదు. లాక్ అప్ లో వున్నప్పుడు క్రైమ్ సస్పెక్ట్ ఎలా అవుతాడు?... (ఈ మాట అన్న వెంటనే కరుణాకర్ కి బుర్రలో బల్బ్ వెలిగింది)... అంటే... మీ అనుమానం ప్రకారం జితేందర్ బయటికి వచ్చి క్రైమ్ చేసి మళ్ళీ లోపలి వెళ్లాడా?

రవీంద్ర: అదే నా అనుమానం. క్రైమ్ సీన్ లో దొరికిన బులెట్ షెల్స్ మీద జితేందర్ ఫింగర్ ప్రింట్స్ వున్నాయి. కానీ... ఆ రోజు వాడు చర్లపల్లి జైలు లో వున్నాడు. Something wrong... can you please help me ? I need an expert opinion... ఆఫీషియల్ గా proceed అయితే వాడు 'జైలు రికార్డ్స్ ప్రకారం ఆ రోజు జైల్లో వున్న నాకు బయట జరిగిన క్రైమ్స్ కి ఎలాంటి సంభంధం లేదు' అని అంటే మనం ఏమి చేయలేము. అందుకే స్ట్రాంగ్ ఎవిడెన్స్ సంపాదించడం కోసం నీ హెల్ప్ కావాలి. I am sorry... నిన్న ఇంత రాత్రి పూట పిలిచి ఇబ్బందిపెడుతున్నందుకు. నాకు వేరే మార్గం లేక నిన్ను పిలవాల్సివచ్చింది...

కరుణాకర్: సర్... నేను చాలా కాలంగా ప్రిపేర్ అవుతున్నాను. ఏదో ఒక రోజు డిపార్టుమెంటు నన్ను జితేందర్ విషయంలో ఎంక్వైరీ కి పిలుస్తారని నాకుతెలుసు... దానికి కారణం... వాడి గురించి నాకు బాగా తెలుసు. అయిదేళ్ల క్రితం వాడిని చర్లపల్లి జైలుకి తీసుకొచ్చినప్పుడు వాడి కేసు ఫైల్ పూర్తిగా స్టడీ చేసాను. వాడు రసూల్ గ్యాంగ్ లో ఇంపార్టెంట్ మెంబెర్. వాడు చాలా క్రైమ్స్ చేసాడు. కాకపోతే స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరకక వాడు ప్రతిసారి తప్పించుకునేవాడు. దాంతో వాడికి బయట శత్రువులు చాలా పెరిగిపోయారు. వాళ్లందరినుండి తప్పించుకోవడానికి వాడు ఒక హత్య కేసు లో రెడ్ హాండెడ్ దొరికిపోయేలా ప్లాన్ చేసి, నేరం వొప్పుకొని, జైలు కి వచ్చాడు. వాడికి భార్య, కొడుకు వున్నారు. చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా వున్నారు. జైల్లో వాడికి చాలా స్పెషల్ ట్రీట్మెంట్... వాడి కోసం వచ్చే వాళ్ళ ఎంట్రీ, ఎగ్జిట్... రికార్డ్స్ దొరకవు. వాడు నెలలో కనీసం 2 సార్లయినా బయటకి వెళ్లి వస్తూ ఉంటాడు. వాడి మూమెంట్స్ అందరికి తెలియవు. వెళ్ళేది... వచ్చేది... అంతా చాలా సీక్రెట్ గా జరుగుతుంది. వాడి గురించి ఎవరు ఎంక్వైరీ చేసినా పెద్ద పెద్ద వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది. వాడి దగ్గర పెద్దవాళ్ల రహస్యాలు చాల వున్నాయి. వాడు నోరు విప్పితే ఎంతో మంది జైలు కి వెళ్ళవలసి వస్తుంది. అందుకని వాడిని పెద్ద వాళ్లంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మీకో విషయం తెలుసా... వాడి కొడుకుని డెహ్రాడూన్ లో DOON ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివిస్తున్నాడు... వాడికి ఇండియా లో వున్న పెద్ద పెద్ద పొలిటిషన్స్ తో కాంటాక్ట్స్ వున్నాయి. వాళ్ల అవసరం రసూల్ గ్యాంగ్ కి... వీళ్ళ అవసరం వాళ్లకి బాగా వుంది. మీకు ఏ కేసు లో... ఏ ఎవిడెన్స్... ఎలా దొరికిందో... నాకైతే తెలీదు కానీ... మీరు కనుక వాడి ఇన్వొల్వెమెంట్ ని ప్రూవ్ చెయ్యగలిగితే... మీకు ఫస్ట్ సెల్యూట్ నాదే సర్... వాడిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ అంతా చాలా కష్టపడింది. వాడికి వెనకాల ఎవరెవరున్నారో కానీ... వాడు మాకు దొరకలేదు. చివరికి వాడంతట వాడే మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేలా ప్లాన్ చేసుకొని క్రైమ్ చేయడంవల్ల వాడు ఈరోజున లోపలున్నాడు... మీరు కనుక వాడిని వురి తీయించినా... లేదా జీవితాంతం "అండ (EGG SHAPED PRISON CELL FOR SOLITARY CONFINEMENT)" లో ఉండేలా చేసినా చాలు... హైదరాబాద్ లో కొంత క్రైమ్ రేట్ పడిపోతుంది. వాడిని చూసుకొని చాలా మంది రెచ్చిపోతున్నారు...

రవీంద్ర: నువ్వు కాంఫిడెంటిల్ గా వుంచుతానంటే నీకు కేసు డిటైల్స్ చెప్తాను. నువ్వు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో వెంటనే జాయిన్ అవ్వు...

రవీంద్ర అంత వరకు ఫార్మ్ హౌస్ మర్డర్స్ కేసు లో వున్న ప్రోగ్రెస్ కరుణాకర్ కి చెప్పాడు. శరత్ మరియు అతని ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఏమి చెప్పలేదు. ఎవిడెన్స్ ని ఎలా సేకరించాడు... ఎక్కడ అనలైజ్ చేయించాడు... దాని డీటెయిల్స్ ఏమిటో... అవి మాత్రమే చెప్పాడు.

కరుణాకర్: సర్... జితేందర్ కి జైలు లో మొబైల్ ఫోన్, రివాల్వర్ వుంటాయని అందరూ అనుకుంటారు. వాడు రెగ్యులర్ గా బయటకి వెళ్లి వస్తూ ఉంటాడు కాబట్టి ఈ క్రైమ్ లో వాడి ఇన్వొల్వెమెంట్ ని సస్పెక్ట్ చెయ్యవచ్చు. ఇప్పుడు మనకి కావలసినది... ఈ క్రైమ్ జరిగిన రోజు వాడు ఎక్కడ వున్నాడు అన్న డీటెయిల్స్... ఒకవేళ వాడు ఆరోజు బయటవున్నాడు అని తెలిసినా... వాడు కూడా ఈ క్రైమ్ లో involve అయ్యాడని నిరూపించాలి... ఓకే... ఫస్ట్ థింగ్స్ ఫస్ట్... ఆరోజు వాడి "వేర్ ఎబౌట్స్" తెలుసుకుందాం... అది తెలియాలి అంటే మనకి "నైట్ డ్యూటీ సత్యం" హెల్ప్ కావాలి...

రవీంద్ర: "నైట్ డ్యూటీ సత్యం?"

కరుణాకర్: ఎస్ సర్... పూర్తి పేరు సత్యనారాయణ... హెడ్ కాన్స్టేబుల్... చర్లపల్లి జైలు లో డ్యూటీ చేస్తాడు. వాడు ఎప్పుడూ నైట్ డ్యూటీ నే ప్రిఫర్ చేస్తాడు... ఎందుకంటె... ఆ టైం లో ఇల్లీగల్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. లోపలి వచ్చే వాళ్ళు... వెళ్లే వాళ్ళు... సరకు రవాణా కూడా ఆ టైం లోనే అవుతుంది. వాడికి సారధి అనే కొడుకు వున్నాడు. వాడు డ్రగ్ పుషర్... జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ లో జరిగే RAVE పార్టీస్ లో వాడి మూమెంట్ ఉంటుంది. సారధి జైలు లో బాగా పలుకుబడి వున్న వాళ్ళకి "పౌడర్" "బాటిల్స్" సప్లై చేస్తూ ఉంటాడు. సత్యం కి ఈ ఇల్లీగల్ మూమెంట్స్ బాగా తెలుస్తూ ఉంటాయి... మనకి వాడి హెల్ప్ కావాలి... వెరీ ఈజీ... రేపు మార్నింగ్ 11 కల్లా సత్యం మీముందు ఉంటాడు...

రవీంద్ర: ఏం చేస్తావ్?

కరుణాకర్(నవ్వుతూ): అది నాకు వొదిలెయ్యండి... నేను చూసుకుంటాను...

రవీంద్ర: Please tell me... I am curious...

కరుణాకర్: Nothing by book... బ్లాక్ మెయిల్ చేస్తాను... సారధి ని ఇప్పుడే పిక్ అప్ చేయిస్తాను... కేసు ఫైల్ చెయ్యకుండా లోపలేస్తాను. రేపు సత్యం నా దగ్గరికి వస్తాడు... అప్పుడు నేను 'కమిషనర్ గారు ఛార్జ్ షీట్ ఓపెన్ చేయమంటున్నారు... పైగా నువ్వు డిపార్ట్మెంట్ మనిషి వి కావడంతో ఆయన చాలా కోపంగా వున్నారు... ఏదైనా మాట్లాడుకోవాలంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళు... అప్పటిదాకా నేను కేసు ఫైల్ చెయ్యను...' అని చెప్తాను... సత్యం మీ దగ్గరకి రాగానే ఇక మీ ఇష్టం...

రవీంద్ర: You are very dangerous...

కరుణాకర్: Sometimes, I have to behave dangerous and ruthless... only then I can get things done... Good Night Sir...

కరుణాకర్ చెప్పిన విధం గానే ఉదయం 4 గంటల టైం లో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సారథి ని, అతని తో పాటు ఇంకో ఆరుగురిని కూడా డ్రగ్స్ తో సహా అరెస్ట్ చేశారు. సారథి తో పాటు అరెస్ట్ అయినా వాళ్లలో ఒక ప్రముఖ సినిమా నటుడి కొడుకు... ఒక పెద్ద సినిమా ప్రొడ్యూసర్ కూతురు కూడా వున్నారు. అప్పుడు సారథి దగ్గర దాదాపు 150 గ్రాముల పౌడర్ దొరికింది. లోపల వేశారు. కేసు ఫైల్ చెయ్యలేదు. కరుణాకర్ కి ఫోన్ చేసి అప్ డేట్ ఇచ్చారు. కరుణాకర్ వెంటనే ఒక TV NEWS ఛానెల్ కి "ఆకాశరామన్న" ఫోన్ కాల్ చేసి హీరో కొడుకు... ప్రొడ్యూసర్ కూతురు అరెస్ట్ గురించి చెప్పాడు. అంతే... 30 నిమిషాల్లో ఆ పోలీస్ స్టేషన్ ముందు రాష్టంలో వున్న అన్ని న్యూస్ చానెల్స్ వాన్స్ వచ్చేసాయి... ఇపుడు ఫోకస్ మొత్తం వాళ్లిదరిమీద ఉంటుంది. సారథి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసాడు. అప్పుడే నైట్ డ్యూటీ పూర్తిచేసుకొని ఇంటికి వెళుతున్నాడు. ఈ వార్తా వినగానే సారథి ని ఉంచిన పోలీస్ స్టేషన్ SI కి ఫోన్ చేసాడు. "మేటర్ కొంచం సీరియస్ గా వుంది... నువ్వు CI కరుణాకర్ ని కలవు... ఏదైనా హెల్ప్ దొరక వచ్చు... మీ వాడి దగ్గర చాలా స్టఫ్ దొరికింది..." అని అన్నాడు. సత్యం హుటాహుటిగా ఇంటికెళ్లి స్నానం చేసి మఫ్టీ లో సారథి ని ఉంచిన పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అదే టైం కి CI కరుణాకర్ కూడా వచ్చాడు... పోలీస్ స్టేషన్ బయట గుమికూడిన మీడియా వాళ్ళని చూసి నవ్వుకుంటూ మనసులో "I LOVE MY JOB" అని అనుకున్నాడు.

సత్యం: గుడ్ మార్నింగ్ సర్...

కరుణాకర్: గుడ్ మార్నింగ్... ఎలా వున్నావు?

సత్యం: ఫరవాలేదు సర్... మా అబ్బాయిని తీసుకొచ్చారని తెలిసింది...

కరుణాకర్: అవును... నిన్న రైడింగ్ లో దొరికాడు. చాలా స్టఫ్ ఉన్నట్లు తెలిసింది. ఇది రెండో సారి ఇలా దొరకడం. ఈ సారి కొంచం కష్టమే... నా చేతిలో ఏమీ లేదు. కమిషనర్ గారు చాలా కోపంగా వున్నారు. పైగా నువ్వు డిపార్టుమెంటు వ్యక్తివి... ఈ విషయం బయటికి పొక్కితే... నీ ఉద్యోగానికి కూడా ప్రాబ్లెమ్ వస్తుంది. చర్లపల్లి జైలు లో నీ ఆక్టివిటీస్ అన్ని బయటకి వస్తాయి... దాంతో నువ్వూ... సారథి ఆ జైల్లోనే ఒకే సెల్ లో ఉండాల్సి వస్తుంది...

ఇది విన్న సత్యం కి కరుణాకర్ ఇచ్చిన మెసేజ్ పూర్తిగా అర్ధమయ్యింది. మెసేజ్ లోని పాయింట్స్:

1. కమిషనర్ కి కోపంగా వుంది...

2. ఈ వార్త బయట వున్న మీడియా కి తెలియచేస్తాం...

3. నీ ఇల్లీగల్ ఆక్టివిటీస్ బయట పెడతాం...

4. నీ ఉద్యోగం ఊడుతుంది...

5. నిన్ను అరెస్ట్ చేస్తాం...

6. తండ్రి, కొడుకులు ఇద్దరినీ ఒకే సెల్ లో పెడతాం...

అంటే... కమిషనర్ కి "ఏదో" కావాలి. అది తన దగ్గర వుంది. కమిషనర్ చెప్పిన మాట వింటే ప్రాబ్లెమ్ ఉండదు... ప్రస్తుతం ఎదురుతిరిగే టైం కూడా లేదు. కొడుకు పోలీస్ స్టేషన్ లోపల... న్యూ ఛానెల్స్ వాళ్ళు బయట... కరుణాకర్ గేమ్ బాగానే ఆడాడు...

సత్యం: సరే సర్... నేను ఇప్పుడే వెళ్లి కమిషనర్ గారిని కలుస్తాను... కొంచం మీరు పెద్ద మనసు చేసుకొని సహాయం చెయ్యండి. మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను...

కరుణాకర్: నీ ఇష్టం... మేమంతా నీ క్షేమం కోరుకునేవాళ్ళం... ఆ సంగతి నీకు బాగా తెలుసు. సారథి ఇక్కడ క్షేమంగా ఉంటాడు... వెళ్లి రండి... జాగ్రత్త...

సత్యం కి రెండో మెసేజ్ కూడా అర్ధమయ్యింది...

1. నీ కొడుకు ఇక్కడే ఉంటాడు...

2. నీ క్షేమం, వాడి క్షేమం... నీ చేతుల్లోనే వుంది...

3. జాగ్రత్త గా వ్యవహరించు...

సత్యం పోలీస్ స్టేషన్ లోంచి బయటకి వస్తూ అక్కడ TV ఛానెల్ రిపోర్టర్ చదువుతున్న వార్తలు వినసాగాడు...

"నిన్న రాత్రి నగరం లో డ్రగ్స్ ముఠాల మీద పెద్ద ఎత్తున రైడ్స్ జరిగాయి. అందులో దాదాపు 25 మందిని అరెస్ట్ చేశారు... అందులో డ్రగ్స్ తీసుకునే వారు... అమ్మేవాళ్ళు... వున్నారు. పట్టుపడ్డ వాళ్లలో ప్రముఖ సినిమా నటుడు కొడుకు... ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ కూతురు ఉండడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ నటుడి కొడుకు ఇంత క ముందు కూడా చాలా సార్లు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు... ప్రస్తుతం ఈ నటుడి కొడుకు ఆ ప్రొడ్యూసర్ కూతురి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల భోగట్టా... వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం అందరికీ తెలిసిన విషయమే... విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీళ్లిద్దరికీ ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయిందని... డెస్టినేషన్ వెడ్డింగ్ కి తయారు అవుతున్నారని సినీ ప్రపంచం అంతా కోడై కూస్తోంది. ఈ తరుణం లో వీళ్ళిద్దరూ డ్రగ్స్ కేసు లో అరెస్ట్ కావడంతో వీరి ఎంగేజ్మెంట్ రద్దు అయ్యిందన్న సమాచారం మాకు అందింది. ఈ రెండు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి... ఏ క్షణానైనా వీరి తల్లిదండ్రులు వారి లాయర్స్ తో ఇక్కడి చేరుకోవచ్చు... కెమరామెన్ పవన్ తో న్యూ రీడర్ సంధ్య..."

ఇది విన్న సత్యం మనసులో బూతులు తిట్టుకుంటూ కమిషనర్ ఆఫీస్ కి బయలుదేరాడు.


PART - 9 - WALKING INTO LION'S DEN

నైట్ డ్యూటీ సత్యం ఇంత వరకు తన 28 ఏళ్ళ పోలీస్ జీవితం లో ఎప్పుడూ కమిషనర్ అఫ్ పోలీస్ ఆఫీస్ లోకి అడుగుపెట్టలేదు. పైగా భయపడుతూ ఏ అధికారి గదిలోకి వెళ్ళలేదు. ఈ రోజు మాత్రం లోపలి వెళితే క్షేమంగా బయటకి వస్తాడన్న నమ్మకం లేదు. పోలీస్ లాక్ అప్ లో కొడుకు... వాడిని రక్షించాలి... తనగురించి కమిషనర్ కి ఏమేమి తెలుసో... CI కరుణాకర్ ఏమేమి చెప్పాడో... ఇలా ఆలోచిస్తూ కమిషనర్ గారి ఆఫీస్ లోకి వెళ్లి ఆయన పర్సనల్ సెక్రటరీ కి రిపోర్ట్ చేసి అక్కడే వున్న ఒక చైర్ లో కూర్చున్నాడు. సెక్రటరీ intercom లో సత్యం వచ్చిన సంగతి కమిషనర్ కి చెప్పింది. ఆయన వెయిట్ చెయ్యమని చెప్పాడు. ఒక 10 నిమిషాల తరువాత... సెక్రటరీ లోపలి కి పంపించింది...

సత్యం లోపలివెళ్ళగానే అటెంషన్ లో నుంచొని సెల్యూట్ కొట్టాడు... రవీంద్ర కూడా చాలా కాజువల్ చెయ్యి ఊపాడు. లోపల AC బాగా రన్ అవుతున్నా... సత్యం చాలా uneasy గా ఫీల్ అవ్వసాగాడు...

రవీంద్ర(తన టేబుల్ ముందున్న కుర్చీ చూపుతూ): Have a seat...

సత్యం కుర్చీ చివరికి అటెంషన్ లో భయంతో కూర్చున్నాడు. రవీంద్ర ఏదో ఫైల్ స్టడీ చేస్తున్నాడు.

రవీంద్ర: మీరు సర్వీస్ లో చేరి ఎన్నేళ్లయింది?

సత్యం: సర్... 28 ఏళ్ళు సర్...

రవీంద్ర: జైల్స్ డిపార్ట్మెంట్ లో ఎన్నేళ్లుగా వున్నారు?

సత్యం: సర్... 22 ఏళ్ళు సర్...

రవీంద్ర: మీరు ఎక్కువకాలం నైట్ డ్యూటీ లో గడిపారు... ఎందుకని?

సత్యం: సర్... నైట్ డ్యూటీ ఎవరో ఒకరు చెయ్యాలి కదా... సర్...

రవీంద్ర: కరెక్ట్... కానీ... మీరే ఎందుకు చాలా ఎక్కువ కాలం చేశారు? దాదాపు 80% మీరు నైట్ డ్యూటీ లోనే వున్నారు. అదికూడా... సీరియస్ క్రైమ్స్ చేసిన వాళ్ళ బ్లాక్... కాపిటల్ పనిష్మెంట్ అనుభవిస్తున్న వాళ్ళ బ్లాక్, బాగా పలుకుబడి ఉన్నవాళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న బ్లాక్... వీటిలోనే ఎక్కువకాలం డ్యూటీ చేశారు. నార్మల్ రోస్టర్ ప్రకారమైతే ఇంత రెగ్యులర్ గా మీకు నైట్ డ్యూటీ లు పడేవికావు... అందులోనూ ఈ మూడు బ్లాక్ లో తప్ప వేరే ఎక్కడా డ్యూటీ చేసినట్లు లేదు. అది ఎలా జరిగింది?

సత్యం ఏమి మాట్లాడలేకపోయాడు. రెండే రెండు నిమిషాలలో ఇంత డిటైల్డ్ గా తన నైట్ డ్యూటీ రోస్టర్ ని చదివేస్తాడని అస్సలు ఊహించలేదు. ఈయనకి ఏమికావాలి? దాని గురించి అడగడంలేదు. తనని బాగా కార్నర్ చేసేస్తున్నాడు... తన వచ్చిందేమో కొడుకు ని విడిపించుకోవాలని... ఇక్కడ చూస్తే... డిపార్టుమెంటు పరంగా తానే ఇర్రుక్కు పోయేలా వున్నాడు...

రవీంద్ర: నేరుగా పాయింట్ కి వస్తాను... మీ ద్వారా మీ అబ్బాయి సారథి జైలు inmates కి ఇల్లీగల్ గా మెటీరియల్ సప్లై చేస్తున్నారని, మీరు కొంత మంది inmates ని unofficial గా బయటకి వెళ్ళడానికి... మళ్ళీ సేఫ్ గా లోపలి రావడానికి మీరు సహాయం చేస్తున్నారని మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. Of Course... మాకు దొరికిన ఆధారాలన్నిటిని మేము జాగ్రత్తగా... డిటైల్డ్ గా వెరిఫై చెయ్యాలి. ఆ తరువాతే డిపార్టుమెంటు ఒక కంక్లూషన్ కి వస్తుంది...

ఒక్క దెబ్బతో రవీంద్ర అటు సారథి ని... ఇటు సత్యాన్ని... ఇరుకునపెట్టేసాడు... ఇప్పుడు సత్యం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రవీంద్ర చెప్పిన దాంట్లో 100% నిజముంది...

డిపార్ట్మెంట్ కి అనుమానం వచ్చింది. ఇక తన పని అయిపొయింది. తనకి చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలున్నాయి. వాళ్లకి ఎన్నో సార్లు ఎన్నో సహాయాలు చేసాడు. వాళ్ళు కూడా తనకి బాగానే డబ్బులిచ్చారు. ఇప్పుడు తనమీద డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ వచ్చిందని తెలిస్తే వాళ్లలో ఒక్కడు కూడా సహాయం చెయ్యడు. తనకి సహాయం చేయబోయి వాళ్ళు కూడా ఇరుక్కుపోతే... అది ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది. అందుకని వాళ్లంతా దూరంగా వుంటారు. ఇప్పుడు తను ఏకాకి. కమిషనర్ రవీంద్ర తప్ప వేరే ఎవరూ కాపాడలేరు... ఈయనకి ఏమి కావాలో ఎలా అడగాలి?

రవీంద్ర: నా దగ్గర మీరు ఎవరెవరికి unofficial గా in & out మూమెంట్స్ కి హెల్ప్ చేశారో... ఆ లిస్ట్ ఇక్కడ వుంది. నేను వరుసగా పేర్లు చదువుతాను... మీరు వారికి ఎలా... ఎప్పుడెప్పుడు... ఎందుకు హెల్ప్ చేశారో కంఫర్మ్ చెయ్యండి...

రవీంద్ర చాలా తెలివిగా ఒక లిస్ట్ తయారుచేసాడు. చర్లపల్లి జైలు లో 5 సంవత్సరాలు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారి పేర్లన్నీ ఒక లిస్ట్ గా రాసుకున్నాడు. సత్యం inmates కి హెల్ప్ చేసాడని ఒక అనుమానం మాత్రమే... ఎటువంటి ఆధారాలు లేవు. ఎవరూ కూడా ఎటువంటి ఎంక్వయిరీ ఇప్పటిదాకా చెయ్యలేదు. పైగా సత్యం కి డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ అంటే ఏమిటీ? ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? ఇలాంటి డీటెయిల్స్ సరిగ్గా తెలియవు... ఇంత వరకు పై ఆఫీసర్స్ ఏమిచెప్పినా YES, SIR అంటూ చెప్పింది చేస్తూ ఉండడంతో అసలు డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ ఎప్పుడూ ఫేస్ చెయ్యలేదు... ఎంక్వయిరీ ఎప్పుడూ పోలీస్ కమిషనర్ రాంక్ ఆఫీసర్స్ మొదలుపెట్టరు... దానికి వేరే టీం ఉంటుంది. రవీంద్ర ఇప్పుడు ఆ లిస్ట్ లో వున్నా పేర్లు రాండమ్ గా... సత్యం ఆలోచించుకోవడానికి పెద్దగా టైం ఇవ్వకుండా గబగబా చదవసాగాడు... ఆ పేర్లు వింటూంటే సత్యం కి BP రైజ్ అవ్వసాగింది... మెదడు మొద్దుబారి పనిచేయడం ఆగిపోయింది... అందులో చాలా వాళ్ళకి సత్యం ఏదో ఒక సహాయం చేసాడు... ఇంతలో రవీంద్ర... సత్యం కి అసలు పరిచయం లేని, ఎప్పుడూ వినని, తన ముందున్న ఫైల్ లో కూడా లేని కొన్ని పేర్లు గట్టిగా చదివాడు... అంతే... ఆ పేర్లు విన్న సత్యం "వాళ్లెవరో నాకు తెలీదు... నేను వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చెయ్యలేదు..." అని అంటూ నాలికకారుచుకున్నాడు... చాలా సింపుల్ గా దొరికిపోయాడు... ఓల్డ్ టెక్నిక్ కి పడిపోయాడు... పోలీస్ లు ఇంటరాగేషన్ చేసేటప్పుడు కొన్ని నిజాలు... అబద్దాలు కలిపి ముద్దాయిని confuse చేస్తారు... ఖంగారులో ఒక్కోసారి క్రిమినల్స్ డైరెక్ట్ గాని... ఇండైరెక్ట్ గా కానీ కమిట్ అవుతారు... సత్యం విషయం లో సరిగ్గా అదే జరిగింది. ఉదయం సారథి అరెస్ట్ అయ్యినప్పటినుంచి... ఇప్పటిదాకా... సత్యం కి తీరిగ్గా కూర్చొని ఏమి చెయ్యాలో ఆలోచించే టైం ఇవ్వకుండా డెవలప్మెంట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి...

రవీంద్ర తన చేతిలో వున్న ఫైల్ ని టేబుల్ మీద పడేసి... కుర్చీలో వెనక్కి రిలాక్సడ్ గా జరుగుతూ... సత్యం వైపు ఒకరకమైన చిరునవ్వుతో చూసాడు... Mischievous Smile... దాని అర్ధం... YOU ARE BOOKED...

రవీంద్ర: ఇప్పుడు చెప్పండి... ఇప్పటిదాకా మీరు ఎవరెవరికి హెల్ప్ చేశారు? మేము ఇప్పుడు మీ జైలర్ కి ఫోన్ చేసి మీరు చేసిన తప్పులు, In Principle, ఒప్పుకున్నారని... డీటైల్డ్ ఎంక్వయిరీ మొదలుపెడుతున్నామని... అప్పటిదాకా మీ సర్వీస్ సస్పెన్షన్ లో ఉంచమని రికమండ్ చెయ్యదలుచుకున్నాను... దీనికి మీరేమంటారు?

సత్యం మొహం లో కత్తి వేటుకి నెత్తురు చుక్కలేదు... ఇంత ఈజీ గా కమిట్ అవుతాడని... అతనికే తెలియదు. కళ్ళెంబడి నీళ్లు వచేసాయి. అక్కడేకూర్చొని నిశబ్దం గా ఏడవసాగాడు... తన పని అయిపొయింది. రవీంద్ర ఫోన్ చేసి CI కరుణాకర్ ని వెంటనే రమ్మని చెప్పి కుర్చీలోంచి లేచి ఒక గ్లాస్ లో మంచి నీళ్లు పోసి తీసుకొచ్చి సత్యం కి ఇచ్చి అతని పక్కనే వున్న చైర్ లో కూర్చున్నాడు. సత్యం మౌనంగా మంచి నీళ్లు తాగాడు. రవీంద్ర ఫోన్ చేసి రెండు TEA, బిస్కట్స్ తెప్పించాడు. సత్యం వాటిని తిని tea తాగాడు. ఇంతలో కరుణాకర్ వచ్చాడు... రవీంద్ర లేచి తన సీట్ లో కూర్చొని కరుణాకర్ కి సత్యం పక్కనే వున్న చైర్ లో కూర్చోమని సైగ చేసాడు.

రవీంద్ర(కరుణాకర్ వైపు చూస్తూ): గుడ్ న్యూస్... సత్యం గారు మనకి హెల్ప్ చెయ్యడానికి ఒప్పుకున్నారు...

కరుణాకర్ కి ఏమి అర్ధం కాలేదు... రవీంద్రకి అక్కడ ఏమి జరిగిందో చెప్పడం ఇష్టంలేదు...

రవీంద్ర(సత్యం తో): మీరు మాకు కావలిసిన హెల్ప్ చేస్తే... మేము మీకు సహాయంగా ఉంటాము. అప్పటిదాకా మీ అబ్బాయి కరుణాకర్ దగ్గరే ఉంటాడు...

సత్యం ప్రాణాలు లేచి వచ్చాయి... కమిషనర్ కి హెల్ప్ చేస్తే తనకి ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు.

సత్యం: తప్పకుండా సర్... చెప్పండి ఏమి చెయ్యాలో... చేస్తాను...

రవీంద్ర: నేను మీతో డిస్కస్ చేసేది మన ముగ్గురి మధ్యనే ఉండాలి. ఇంకో వ్యక్తి తెలిస్తే consequences చాలా దారుణంగా ఉంటాయి... మీకు ఈపాటికే అర్థమయ్యివుంటుంది...

సత్యం మౌనంగా తలూపాడు... కరుణాకర్ ఏమి మాట్లాడడంలేదు...

రవీంద్ర: మీరు జితేందర్ కి ఎన్నిసార్లు unofficial గా బయటికి వెళ్లి రావడానికి హెల్ప్ చేశారు?

సత్యం కి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది... రవీంద్ర కి ఏమి కావాలో... ఇది చాలా సీరియస్ మేటర్...

సత్యం: నేను ఎప్పుడూ డైరెక్ట్ గా ఎవరికి హెల్ప్ చెయ్యలేదండి... చెయ్యలేను కూడా... నాకు పైనించి ఆర్డర్స్ వస్తాయి.... నేను వాటిని ఫాలో అవుతాను. జితేందర్ ఎప్పుడు బయటికి వెళ్లాలన్నా ఆ రోజు రాత్రి 8 గంటల వరుకు ఎవరికి తెలియదండి. నాకు జైలర్ గారు పర్సనల్ గా పిలిచి చెప్తారు. నేను రాత్రి 12 గంటలకి జితేందర్ ని సెల్ లోంచి బయటకి రప్పించి... వెంట పెట్టుకొని జైలు కి వెస్ట్ పక్కనున్న ఒక గేట్ తెరచి బయటకి పంపిస్తాను. ఆ తరువాత జితేందర్ ఏరోజు... ఎన్నింటికి వచ్చేద... ఆ డీటెయిల్స్ మళ్ళీ జైలర్ గారు చెప్పాక... అదే గేట్ దగ్గరికి వెళ్లి తలుపు తీసి జితేందర్ ని లోపలి తీసుకొచ్చి సెల్ లో పెడతానండి...

రవీంద్ర: ఎంత సేపు బయట ఉంటాడు?

సత్యం: చెప్పలేమండీ... ఒక్కోసారి 4 - 5 గంటలలో వచ్చేస్తాడు... ఒక్కోసారి 2 /3 రోజులు బయటే ఉంటాడు...

రవీంద్ర: ఇప్పటిదాకా ఎన్ని సార్లు బయటకి వెళ్లి వచ్చాడు?

సత్యం: నెలలో కనీసం 2/3 సార్లు బయటకి వెళ్తూ ఉంటాడు... ఈ ఐదేళ్లలో దాదాపు 150 సార్లు వెళ్లి ఉంటాడు...

రవీంద్ర(నమ్మలేక): 150 సార్లా...

సత్యం: ఉంటుందండి... నేనే ప్రతిసారి తీసుకెళ్లి వదలి... మళ్ళీ తీసుకొచ్చానండి...

రవీంద్ర: ఎక్కడికెళ్లేవాడు?

సత్యం(కొంచం ఇబ్బందిగా చూస్తూ): చెప్పడం కష్టమండి... బయట ఏమైనా చెయ్యవచ్చు...

రవీంద్ర: క్రైమ్స్ ఏమైనా చేసేవాడా?

సత్యం ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా మౌనంగా వుండిపోయాడు. రవీంద్ర కూడా మళ్ళీ అడగలేదు.

రవీంద్ర: నువ్వు జితేందర్ ని గేట్ బయట కి పంపాక వాడు అక్కడినుండి ఎలా వెళ్ళేవాడు...

సత్యం: జితేందర్ తీసుకెళ్లడానికి శంకరం వచ్చేవాడు. వాడే తీసుకెళ్లి... మళ్ళీ తీసుకొచ్చేవాడు... తీసుకొచ్చేముందు నాకు ఫోన్ చేసి చెప్తాడు. నేను ఆ టైం కి అక్కడ వెయిట్ చేస్తాను...

రవీంద్ర: ఆ శంకరం ఫోన్ నెంబర్ ఉందా?

సత్యం వెంటనే తన మొబైల్ లోంచి ఒక నెంబర్ ఇస్తే కరుణాకర్ దానికి నోట్ చేసుకొని బయటకి వెళ్లి సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఆ మొబైల్ నెంబర్ ని వెంటనే surveillance లో పెట్టించాడు. ఆ మొబైల్ కి చెందిన పూర్తి కాల్ డేటా కూడా సెల్ ఆపరేటర్ నుండి అర్జెంటు గా తెప్పించామన్నాడు. కరుణాకర్ లోపలి వచ్చేదాకా రవీంద్ర సత్యం ని వేరే ఏ ప్రశ్నలు వెయ్యలేదు.

రవీంద్ర: ఈ శంకరం ఎవరు?

సత్యం: శంకరం జితేందర్ కి బాగా నమ్మకస్తుడు. జితేందర్ డబ్బు వ్యవహారాలన్నీ వాడే చూసుకుంటాడు. వాడంటే జితేందర్ కి గుడ్డి నమ్మకం. జితేందర్ ఎప్పుడు బయటకి వెళ్లినా వాడి కార్ లోనే వెళతాడు. మళ్ళీ అదే కారులో వస్తాడు...

రవీంద్ర: శంకరం కార్ నెంబర్?

సత్యం కార్ నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఆ కార్ కూడా surveillance లోకి వచ్చేసింది. అది ఎక్కడెక్కడి వెళ్లినా పోలీస్ డిపార్టుమెంటు ట్రాక్ చేస్తూ ఉంటుంది.

రవీంద్ర: ఈ మధ్య జితేందర్ ఎప్పుడు బయటకి వెళ్ళాడు?

సత్యం (లెక్కలువేసి) : ఒక 15 రోజులయ్యింది...

రవీంద్ర చాలా సేపు సత్యం ని రకరకాలుగా ప్రశ్నలు వేసాడు. మధ్యలో కరుణాకర్ కూడా చాలా ప్రశ్నలు అడిగాడు. జితేందర్ పూర్తి జీవిత చరిత్ర... వాడు చేసిన క్రైమ్స్... వాడి వెనకాలున్న పెద్దమనుషుల జాబితా... జితేందర్ శత్రువుల లిస్ట్... సత్యం ఇంకా ఎవరెవరికి ఎలాంటి హెల్ప్ చేసాడు... సత్యం కొడుకు సారథి ఇప్పటిదాకా చేసిన ఇల్లీగల్ పనులు... దాదాపు 5 గంటల సేపు ప్రశ్నల వర్షం కురిపించారు. సత్యం కి ఇద్దరినీ ఒకేసారి ఫేస్ చెయ్యలేక మధ్య మధ్య లో ఎడ్చేసాడు. సత్యం కి ఇంతకన్నా ఇంకేమి తెలీదు అన్న నమ్మకం కలిగాక...

రవీంద్ర: Alright... నువ్వు ఇప్పటినుంచి కరుణాకర్ తో డైలీ టచ్ లో వుండు. ఏదైనా డెవలప్మెంట్ ఉంటే వెంటనే తెలియచేయాలి. ఏమాత్రం తేడా వచ్చిందో consequences చాలా దారుణంగా ఉంటాయి. అప్పటిదాకా మీ అబ్బాయి కరుణాకర్ దగ్గర సేఫ్ గా ఉంటాడు. ఇంక మీరు వెళ్ళండి. ఇక్కడ జరిగిన conversation ఎవరికి తెలియకూడదు...

సత్యం లేచి నుంచొని ఇద్దరికీ సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు.

రవీంద్ర: సత్యం చెప్పిందంతా నువ్వు నమ్ముతావా... ఇప్పుడు మనకి సహాయం చేస్తాడంటావా?

కరుణాకర్: Yes సర్... నమ్ముతానండి... సారధి కూడా మన దగ్గర వున్నాడు. మిమ్మల్ని ఎదిరించలేడు...

రవీంద్ర: నువ్వు TAIL టీమ్స్ ని రెడీ గావుంచు. ఒక్కో టీం లో 2 / 3 మెంబెర్స్ దాకా ఉండేలా చూడు..... అందరూ బాగా నమ్మకస్తులుగా ఉండాలి. ఒక 4 /5 టీమ్స్ కావాలి. ఎక్కువగా మోటార్ సైకిల్స్ వాడండి. ఒకటి... లేదా రెండు పెద్ద వాన్స్ ని రెడీ గా ఉంచండి. మోటార్ సైకిల్ టీం ఫాలో అవ్వడానికి... వాన్ వాళ్ళు వీళ్ళిద్దరిని పిక్ అప్ చెయ్యడానికి వాడండి. ఇందాక సత్యం... జితేందర్ ని జైలు వెస్ట్ గేట్ లోంచి బయటకి పంపుతానని చెప్పాడు కదా... ఈ రోజు రాత్రి 10 గంటల నుండి అక్కడ ఒక టీం ఉండేలా చూడు. ఇంకో టీం ఆ శంకరం ని 24 గంటలు ఫాలో అవ్వమని చెప్పు. వాడికి అనుమానం రాకుండా వాడి మూవ్మెంట్స్ ని జాగ్రత్తగా అబ్సర్వ్ చెయ్యండి... జనరల్ గా సత్యం కి రాత్రి 8 గంటలకి జితేందర్ మూమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వొస్తుందని చెప్పాడు. ఈ సారి జితేందర్ బయటకి వస్తే... లోపలి కి వెళ్లలేకుండా చెయ్యాలి... వొదలకూడదు... ఈ శంకరం గురించి కంప్లీట్ డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యండి. Time to act...

శంకరం గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాలేదు. సత్యం ఇచ్చిన మొబైల్ నెంబర్ Sankaram & Co --- Chartered Accountants & Income Tax Consultants అన్న ఒక చిన్న ఆడిట్ కంపెనీ కి చెందినది. ఆ అడ్రస్ పట్టుకొని కరుణాకర్ స్వయంగా వెళ్ళాడు. అది సికింద్రాబాద్ జనరల్ బజార్ లో వుంది. చాలా పాత బిల్డింగ్ లో మొదటి అంతస్తులో రెండు గదుల ఆఫీస్. అందులో నలుగురు పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా ఆ చుట్టూ వున్న షాప్స్ వాళ్ళ income tax calculate చేయడం.... టాక్స్ రిటర్న్స్ ఫైల్ చెయ్యడం లాంటివి చేస్తూ వుంటారు. దాదాపు ఒక 10 దుకాణాలకు ఆడిటర్ గా పని చేస్తున్నాడు. VERY LOW PROFILE TAX FIRM... శంకరం కి దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి... పెళ్లి కాలేదు. మల్కాజిగిరి లో సొంత యిల్లు వుంది. ఒక్కడే ఉంటాడు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకల్లా ఆఫీస్ కి వొస్తాడు. రాత్రి 8 గంటలకి పక్కెనే వున్న మెస్ లో డిన్నర్ చేసి ఇంటికి వెళతాడు... పెద్దగా పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. శంకరం ఫ్రెండ్స్ అందరూ జనరల్ బజార్ లో వున్న షాప్ కీపర్లు మాత్రమే... శంకరం మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్ వెరిఫై చెయ్యగా... ఆ లిస్ట్ లో ఎక్కువగా ఆ చుట్టూ వున్న షాప్ కీపర్లు ఫోన్ నంబర్స్ వున్నాయి... సత్యం కి చాలా సార్లు ఫోన్స్ చేసాడు... ఆ ఫోన్ కాల్ దాదాపు రాత్రి 11:30 తరువాతే వుంది... అంటే జితేందర్ ని డ్రాప్ చేసేముందు చేసే ఫోన్ కాల్... ఇంకా వేరే స్టేట్ ఫోన్ నంబర్స్ దొరికాయి... అవి ఎక్కువగా బ్యాంకు బ్రాంచెస్ కి చెందినవో... లేక అందులో పనిచేసే ఎంప్లాయిస్ కి చెందినవి. కొన్ని నంబర్స్ ఇండియా లో వున్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి చెందినవి. DLF... Kailash Builders... Lodha... TATA Housing... ఇలా చాలా కంపెనీస్ ఫోన్ నంబర్స్ కూడా వున్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా నంబర్స్ కి ఫోన్ కాల్స్ వెళ్లాయి... వచ్చాయి... వాటి ఓనర్స్ డిటైల్స్ కనుక్కోవడానికి చాలా టైం పడుతోంది. ఆ నంబర్స్ కి సంబంధించిన SIM కార్డ్స్ కొనేటప్పుడు ఇచ్చిన అడ్రస్ లు దేశమంతటా వున్నాయి... కొన్ని నంబర్స్ ఒక్క సారి మాత్రమే వాడారు. చాలా suspicious వుంది... వన్ టైం కాలర్స్... వెరీ డేంజరస్...

కరుణాకర్ ఈ డీటెయిల్స్ అన్ని రవీంద్రకి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే వున్నాడు. " సర్... నేను శంకరం ఇల్లు... ఆఫీస్... రైడ్ చేస్తాను... ఏదైనా ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ వుంది" అని అన్నాడు. దానికి రవీంద్ర "నో... డోంట్ టచ్ శంకరం... శంకరం కి డౌట్ వస్తే వెంటనే జితేందర్ కి చెప్పే ఛాన్స్ ఉంటుంది... ముందు జితేందర్ ని బయటకి రానివ్వు. ఇద్దరినీ మన కస్టడీ లోకి తీసుకున్న తరువాత నువ్వు శంకరం ఇల్లు... ఆఫీస్ ని ఒకేసారి రైడ్ చెయ్యవచ్చు... అప్పటిదాకా మనవాళ్ళు శంకరం ని జస్ట్ ఫాలో మాత్రమే చేస్తారు" అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాడు...

ఆ రోజు రానే వచ్చింది... సత్యం ఫోన్ చేసి కరుణాకర్ కి "రెడీ గా వుండండి... నా పేరు మాత్రం బయటకి రాకుండా చూడండి" అని ప్రాధేయపడ్డాడు... కరుణాకర్ ఏమి ఫరవాలేదు అని అభయం ఇచ్చాడు... కరుణాకర్ వెంటనే ఈ విషయాన్ని రవీంద్ర కి చెప్పాడు...

వెంటనే ప్లాన్ రెడీ అయ్యింది...

టీం వన్ - ఇద్దరు: రాత్రి 8 గంటలకే జైలు వెస్ట్ గేట్ దగ్గర కాచుకొని వుంటారు. జితేందర్ బయటకి వచ్చి శంకరం కార్ ఎక్కగానే కరుణాకర్ కి ఫోన్ చేసి ఆ కార్ ని అనుమానం రాకుండా ఫాలో చేస్తారు.

టీం 2 - ఇద్దరు : టీం వన్ కి బ్యాక్ అప్ గా వ్యవహరిస్తారు.

టీం 3 & టీం 4 : వాన్స్ లో వుంటారు. ఒక్కో వాన్ ముగ్గురుండాలి... మొత్తం 10 మంది... టార్గెట్ 2 వ్యక్తులు... టీం 1, టీం 2... ఆ కార్ కి 300 మీటర్స్ దూరం లో మోటార్ సైకిల్స్ మీద హెడ్ లైట్స్ ఆఫ్ చేసి కార్ ని ఫాలో అవుతారు. వీరికి 500 మీటర్స్ దూరం లో రెండు వాన్స్ హెడ్ లైట్స్ ఆఫ్ చేసి మోటార్ సైకిల్స్ ని ఫాలో అవ్వాలి... శంకరం కార్... చర్లపల్లి దాటి... సిటీ లిమిట్స్ లోకి వచ్చేలోపల ఎక్కడైనా కొంచం ట్రాఫిక్ లేనిచోట టీం 4 శంకరం కార్ ని ఓవర్ టేక్ చేసి దాని ముందే ఉండాలి. అప్పుడు టీం 1 మోటార్ సైకిల్ వెనక కూర్చున్న రైడర్ తుపాకీ కి సైలెన్సర్ పెట్టి శంకరం కార్ బ్యాక్ టైర్ ని షూట్ చెయ్యాలి. వెంటనే టీం 2, టీం 3 కార్ ని చేరుకొని ఇద్దరినీ బయటకి లాగి జితేందర్ ని ఒక వాన్ లో... శంకరం ని రెండో వాన్ లో ఎక్కించుకొని... ఎక్కడా ఆగకుండా సేఫ్ హౌస్ కి చేరుకోవాలి. చర్లపల్లి జైలు నుండి సిటీ లిమిట్స్ దాకా రోడ్స్ అన్నింటిని బాగా స్టడీ చేశారు... ఎక్కడ కార్ టైర్ షూట్ చెయ్యాలి... ఇద్దరినీ పిక్ అప్ చెయ్యాలి అన్నది చాలా క్లియర్ గా డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు పిక్ చెయ్యాలి అనుకున్న ఏరియా లో దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ లో స్ట్రీట్ లైట్స్ వెలగకుండా ముందుగానే వాటిని తుపాకీ తో షూట్ చేసేసారు. అంది వాళ్ళ BLIND SPOT... అందరూ మొహాలు కనపడకుండా మంకీ కాప్స్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు...

రాత్రి 10 గంటలల్ల అందరూ వారి వారి ప్లేసెస్ లో వున్నారు. రాత్రి దాదాపు 12 గంటలు దాటాక ఒక హ్యుందాయ్ శాంత్రో కార్ వచ్చి జైలు వెస్ట్ గేట్ దగ్గర ఆగింది. ఆ కారులో ఒక్కడే వున్నాడు. ఒక 10 నిమిషాల తరువాత గేట్ తెరుచుకుంది. ఒకవ్యక్తి బయటకి వచ్చాడు. అటూఇటూ చూడకుండా అక్కడ ఆగి వున్న శాంత్రో కేర్ ఎక్కాడు. ఆ కార్ వెంటనే బయలుదేరింది. ప్లాన్ ప్రకారం ముందుగా హెడ్ లైట్స్ ఆఫ్ చేసి మోటార్ సైకిల్స్ బయలుదేరాయి. వెంటనే వాన్ లో వున్న వ్యక్తి కరుణాకర్ కి ఫోన్ చేసి చెప్పాడు. అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ఆ కార్ ని ఫాలో చేస్తున్నారు. ఎప్పుడైతే BLIND స్పాట్ లోకి కార్ ఎంటర్ అవ్వగానే టీం 4 వాన్ శంకరం కార్ ని ఓవర్ టేక్ చేసింది. వెంటనే టీం 1 మోటార్ సైకిల్ రైడర్ ఒకే ఒక్క షాట్ లో కార్ బ్యాక్ టైర్ షూట్ చేసాడు. కార్ ఆగిపోగానే ముందు ఆగిన వాన్ లోంచి మనుషులు దిగి కార్ లోంచి శంకరం, జితేందర్ ని బయటకి లాగేసారు. వాళ్ళకి అర్ధమయ్యేలోపల ఇద్దరిని రెండు వాన్స్ ఎక్కించి వెంటనే వేగంగా వెళ్లిపోయారు. వాన్ లోపల ఇద్దరినుంచి వాళ మొబైల్ ఫోన్స్ లాగేసుకున్నారు. ఇదంతా 30 సెకండ్స్ లో జరిగిపోయింది. ఈ విషయాన్ని మోటార్ సైకిల్ మీద వస్తున్న టీం కరుణాకర్ చెప్పారు. కరుణాకర్ వెంటనే బయలుదేరి రవీంద్ర ఇంటికి వెళ్లి పిక్ అప్ చేసుకొని సేఫ్ హౌస్ కి చేరుకున్నారు. దారిలో కరుణాకర్ శంకరం కార్ ఆగిపోయిన ఏరియా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వాలని అక్కడికి పంపి టైర్ చేంజ్ చేసి తన ఇంటికి తీసుకొచ్చి పార్క్ చేసి ఇంట్లో కీస్ ఇవ్వమని చెప్పాడు.

రవీంద్ర... కరుణాకర్ సేఫ్ హౌస్ కి చేరుకున్నారు. అప్పటికే వాన్స్ అక్కడకి చేరుకున్నాయి. ఇద్దరినీ రెండు వేరు వేరు రూమ్స్ లో కుర్చీలో కూర్చోపెట్టి గట్టిగా డక్ టేప్ తో కట్టేశారు... వాళ్ళ నోటికి కూడా ప్లాస్టర్స్ వేసి వున్నాయి. రవీంద్ర ఇద్దరినీ తన ఫైల్ లో వున్న ఫొటోస్ తో ఐడెంటిఫై చేసుకున్నాడు. జితేందర్ వేలిముద్రలు తీసుకొని ఫింగర్ ప్రింట్స్ డేటా బేస్ లో చెక్ చెయ్యమని చెప్పాడు. డీటెయిల్స్ వచ్చాయి... రాత్రి పోలీస్ ఎత్తుకొచ్చింది నటోరియస్ క్రిమినల్ జితేందర్... అతని ఫ్రెండ్ శంకరం గా కంఫర్మ్ అవ్వగానే... కరుణాకర్ కి శంకరం ఇల్లు... ఆఫీస్ ని రైడ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు...

రవీంద్ర ముందుగా జితేందర్ వున్న గది లోకి వెళ్లి అతని ముందు వున్న కుర్చీలో కూర్చొని... " MR. JITENDER... I AM RAVINDRA... COMMISSIONER OF POLICE... WE NEED TO TALK" అని అన్నాడు.


PART - 10 - THE INTERVIEW

రవీంద్ర తన ముందు కూర్చున్న జితేందర్ ని పరిశీలనగా చూసాడు. జితేందర్ 5అడుగులా 8 అంగుళాల ఎత్తు... 75 కిలోల బరువు... పెద్ద బలవంతుడు కూడా కాదు. బయట ఎవరైనా జితేందర్ చూస్తే... ఒక బ్యాంకు మేనేజర్... లేదా... ఏదో ప్రైవేట్ కంపెనీ లో ఎగ్జిక్యూటివ్ లాగా... చాలా సింపుల్ గా కనిపిస్తాడు... అదే వ్యక్తి జనారణ్యంలో సంచరిస్తున్న ఒక మానవ మృగం అని ఎవరికి అనుమానం రాదు. జితేందర్ చాలా కాలం గా పోలీస్ లకు పట్టుపడక పోవటానికి అదే పెద్ద కారణం. చూడంగానే ఒక కరుడు కట్టిన క్రిమినల్ లాగా కనిపించకపోవడమే అతను ఫ్రీగా జనంమద్య సంచరించడానికి పెద్దకారణం. జితేందర్... శంకరం... ఈ ఇద్దరినీ ని పిక్ అప్ చేసిన తరువాత... వాన్ లోనే వారి దగ్గరనుండి నాలుగు మొబైల్ ఫోన్స్... ఐఫోన్స్, ఒక GLOCK రివాల్వర్... Fully Loaded... రెండు వాల్లెట్స్... లాగేసుకొని... వారిద్దరూ వేసుకున్న... ప్యాంటు... షర్ట్... అండర్ వేర్... సాక్స్... షూస్... అన్నిన్నిటిని లాగేసి... వీలుకాకపోతే కత్తెరతో కట్ చేసి తీసేసి... బలవంతంగా ఒక షార్ట్స్... T షర్ట్ వేసి సేఫ్ హౌస్ తీసుకొచ్చారు... దారి మధ్యలో ఆ ఇద్దరి బట్టలు... షూస్... 4 ఐఫోన్స్... వాల్లెట్స్... అన్నింటిని ఒక బాగ్ లో పెట్టుకొని ఒక ఆఫీసర్ మధ్య లో దిగిపోయి వేరే కార్ ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఢిల్లీ వెళుతున్న విమానం లో చెక్ ఇన్ అయ్యాడు... జితేందర్... శంకరం... ఇద్దరినీ సేఫ్ హౌస్ లో కి తీసుకురాగానే వీల్ చైర్స్ లో కూర్చోపెట్టి డక్ టేప్ తో గట్టిగా కట్టేశారు... నోటికి కూడా ప్లాస్టర్ వేశారు...

రవీంద్ర(జితేందర్ నోటికున్న టేప్ ని లాగేస్తూ): MR. JITENDER... I AM RAVINDRA... COMMISSIONER OF POLICE... WE NEED TO TALK...

జితేందర్(చాలా కామ్ గా... ఒకరకమైన గర్వముతో): నేను నా జీవితం లో చాలా హత్యలు చేసాను... కానీ... ఎప్పుడూ ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపలేదు... ఆ అవసరం కూడా రాలేదు... ఇప్పుడు మీతో మొదలెట్ట బోతున్నాను... మీరే నేను చంపబోయే మొదటి పోలీస్ ఆఫీసర్...

రవీంద్ర: అంత నమ్మకంగా ఎలా చెప్పగలరు?

జితేందర్(చాలా కాన్ఫిడెంట్ గా... నవ్వుతూ) : ఇంకాసేపట్లో మీ చావు ఖాయం... అదీ నాచేతుల్లో...

రవీంద్ర: ఎలా చంపగలరు? మీరు ఒక కుర్చీ కి కట్టెయ్యబడి వున్నారు. ఇక్కడ 8 మంది ఆఫీసర్స్ వున్నారు. వాళ్ళ దగ్గర లోడెడ్ గన్స్ వున్నాయి... అవసరమైతే వాళ్ళు వాడతారు...

జితేందర్(గట్టిగా నవ్వుతూ): ఇక్కడ 8 మంది వున్నా... 100 మంది వున్నా... ఇంకాసేపట్లో మీరందరూ చావడం ఖాయం...

రవీంద్ర: అదే ఎలా?

జితేందర్: కొంచం వెయిట్ చెయ్యండి... మీకే తెలుస్తుంది...

రవీంద్ర: ఎంతసేపు?

జితేందర్: ఒక అరగంట...

రవీంద్ర: ఆల్రైట్... 30 మినిట్స్ తరువాత వస్తా... అప్పుడు మన డిస్కషన్ కంటిన్యూ చేదాం( అంటూ లేచి వెళ్ళిపోయాడు)

జితేందర్(గట్టిగా నవ్వుతూ (వికటాట్టహాసాము)): పారిపోతున్నావా ఆఫీసర్... నువ్వెవరో నాకు తెలుసు... నిన్ను వొదిలేది లేదు...

రవీంద్ర ఖచ్చితం గా 30 నిమిషాల తరువాత ఒక కాఫీ కప్ తో ఆ రూమ్ లోకి వచ్చి జితేందర్ ముందు కూర్చొని...

రవీంద్ర: షల్ వి స్టార్ట్? చాలా అడగాలి... టైం లేదు... నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎంత తొదరగా జవాబు ఇస్తే... అంత తొందరగా నెక్ట్ స్టెప్ కి వెళతాను...

జితేందర్(అనుమానంగా చూస్తూ): కొంచం ఆగు మావాళ్లు వస్తారు...

రవీంద్ర(ఏదో గుర్తుకొచ్చినట్లు): అవును కదా... ఇందాకటినుంచి మీరు ఎవరికోసం అయితే ఎదురు చూస్తున్నారో... వాళ్ళు రారు...

జితేందర్(నమ్మునట్లు చూస్తూ): నువ్వు అబధం చెప్తున్నావు...

రవీంద్ర:OK... Let me explain... మీరు జైలు నుండి బయటకి వచ్చిన ప్రతిసారి... మళ్ళీ లోపలికివెళ్ళేదాకా మీ వెనకాల ఒక షాడో పార్టీ ఉంటుందని మాకు తెలుసు... వాళ్ళు మీ వెనకాలే ఒక SUV లో 5/6 మంది మీవెంటే తిరుగుతూ వుంటారు. నిన్న రాత్రి మీరు జైలు లోంచి బయటకి రాగానే మా వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యారు... మా వాళ్ళ వెనక రెగ్యులర్ గా వచ్చే మీ వాళ్ళు కూడా బయలుదేరారు... ఇక్కడే మీకు తెలియని ఇంకో విషయం ఏమిటంటే... మమ్మల్ని ఫాలో అవుతున్న మీ వాళ్ళని మా బ్యాక్ అప్ టీం ఫాలో అవ్వడం వాళ్ళకి తెలియదు... మిమ్మల్ని పిక్ అప్ చేయక ముందే మా బ్యాక్ అప్ టీం మిమ్మల్ని రెగ్యులర్ ఫాలో అయ్యే SUV వెంబడించి... వాళ్ళ వాన్ అద్దాలు తుపాకీ తో కాల్చి ఆ వాన్ లోకి Tear Gas షెల్స్ పడేసి... వాళ్ళు వాన్ దిగగానే... మా వాళ్ళు వాళ్ళని చుట్టూ ముట్టి... వాళ్ళదగ్గరనుండి ఆయుధాలు... మొబైల్ ఫోన్స్... వాల్లెట్స్... అన్ని లాగేసుకొని వాళ్ళని పక్కనే వున్న పొలాల్లోకి తీసుకెళ్లి... ఇదిగో... మిమ్మల్ని కట్టేసినట్లే వాళ్ళని కూడా గట్టిగా కట్టేసి వచ్చారు... పాపం వాళ్ళకి మేము మిమ్మల్ని పిక్ అప్ చేసిన సంగతి తెలియదు... ఆ తరువాత మావాళ్లు మీరిద్దరూ ఎక్కిన వాన్స్ ని ఊరంతా తిప్పి... ఎవ్వరూ ఫాలో అవ్వడంలేదు అని నిర్ధారించున్నతరవాతే ఇక్కడికి తీసుకొచ్చారు... కాబట్టి మీ వాళ్ళకి మీరెక్కడున్నది తెలిసే ఛాన్స్ లేదు... వాళ్ళు రారు... So... మనం కంటిన్యూ చేద్దామా...

జితేందర్( అనుమానంగా): నువ్వు అబద్ధం చెప్తున్నావు... మా వాళ్ళు వస్తారు... నువ్వు ఆ వాన్ లో వాళ్ళని కట్టేసినా వేరే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు... కొంచం సేపు ఆగు నీకే తెలుస్తుంది...

రవీంద్ర: మీకు ఇంకో సంగతి చెప్పడం మర్చేపోయాను... మీ దగ్గర వున్నా ఐఫోన్ లో రెండు రకాల ట్రాకర్లు వుంటాయని మాకు తెలుసు. ఒకటి iOS ఆపరేటింగ్ సిస్టం లో ఉంటుంది... అది Apple కంపెనీ వాళ్ళు స్టాండర్డ్ గా ప్రతి ఫోన్ లో ఇంస్టాల్ చేస్తారు... ఫోన్ ఆన్ చేసినప్పుడు అది ఎక్కడుందో ట్రాక్ చెయ్యడం ఈజీ గా ఉంటుంది... అదికాక మీ దగ్గర వున్న ఐఫోన్స్ లో సెపరేట్ గా ఇంకో app కూడా ఉంది.... ఆ app మీరు ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసినాకూడా మీరు ఎక్కడెక్కడివెళ్ళారో రికార్డ్ చేసి మీ కరెంటు లొకేషన్ ని చూపిస్తుంది... అందుకే మేము మీ బట్టలు... ఫోన్స్... వాల్లెట్స్... అన్నింటిని న్యూ ఢిల్లీ పంపించాము... ఇప్పుడు ఆ ఫోన్స్ అక్కడ ఆక్టివ్ గా వున్నాయి... వాటిని ట్రేస్ చేసే మీ వాళ్ళకి వాటి కరెంటు లొకేషన్ న్యూ ఢిల్లీ అని చూపిస్తుంది. PHYSICALLY YOU ARE HERE... BUT DIGITALLY... YOU ARE IN NEW DELHI... అక్కడ మా టీం మీ ఫోన్ డేటా... కాల్ డేటా... అంతా అనలైజ్ చేస్తున్నారు ... ఇప్పుడు... మమ్మల్ని చంపడానికి.... మిమ్మల్లి రక్షించడానికి ఎవరూ రారు. ఈ లొకేషన్ మా డిపార్టుమెంటు లో ఎవరికి తెలీదు. మా పని అయ్యే వరకు మేము ఎవ్వరికీ చెప్పం...

పోలీస్ లకి పట్టుపడ్డప్పటినుంచి జితేందర్ కి ఒక ప్రగాఢ నమ్మకముంది... తన మనుషులు వచ్చి విడిపించుకుపోతారని.... మొదటిసారి ఆ నమ్మకం కొద్దగా సడలుతోంది... అయినా కూడా అతని అహంకారం ఏమాత్రం తగ్గలేదు...

జితేందర్: వాళ్ళు రాకపోతేనేమి... నేను బయటకి వచ్చానన్న సంగతి చాలా మందికి తెలుసు. వాళ్ళు మిమ్మల్ని వొదలరు...

రవీంద్ర: మీకు చాలా మంది తో సంబంధాలు ఉన్నాయన్న సంగతి మాకు కూడా తెలుసు... కానీ వాళ్ళు ఎవరు? ఏ రకమైన సంబంధ భాంధవ్యాలున్నాయని మాకు తెలియదు... మీరు చెపితే తెలుసుకొని మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో డిసైడ్ చేసుకుంటాము... Let's start... చెప్పండి... మీ వెనక ఎవరెవరున్నారు?

జితేందర్ జీవితం లో మొదటిసారి నోటమాటా పెగలలేదు... ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఇటువంటి ప్రశ్న వెయ్యలేదు... వాళ్లందరికీ తాను ఎవరూ... తన ఏ గ్యాంగ్ కి చెందినవాడో... తన వెనక ఉన్నదెవరూ... బాగా తెలుసు కనుక వాళ్ళెపుడూ ఇటువంటి ప్రశ్నలు ఎవరూ వెయ్యలేదు... తాను కూడా జవాబు చెప్పాల్సిన ఆ అవసరం రాలేదు... ఇప్పుడు రవీంద్ర చాలా సూటిగా నీ వెనక ఎవరెవమున్నది చెప్పు వ్రాసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని అంటున్నాడు... వీడికి అన్ని తెలిసే తనని కమిట్ చేయించాలని చూస్తున్నాడు... నోరు విప్పకూడని డిసైడ్ అయ్యాడు... జితేందర్ కి ఇంకో డౌట్ కూడా వచ్చింది... ఒకవేళ రవీంద్ర కి అన్ని తెలిసి ఉంటే? ఇప్పుడు తను ఏమి చెప్పకపోయినా చెప్పానని వ్రాసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోడని నమ్మకమేమిటీ?

రవీంద్ర: చెప్పండి... మీ వెనకు వున్న "పెద్దమనుషులు" ఎవ్వరు? వారితో మీకు ఎలా పరిచయం అయ్యింది? ఎవరు పరిచయం చేశారు? ఎప్పుడు పరిచయం చేశారు? ఎక్కడ పరిచయం చేశారు? వాళ్ళకి మీరేమేమి పనులు చేసి పెట్టారు... ఎన్ని సార్లు చేశారు... వాళ్ళు మీకేమి ఇచ్చారు? మీరు ఈ డీటెయిల్స్ ఇస్తే మేము further గా proceed అవుతాము. అంతగా టైం లేదు...

జితేందర్: ఆ పెద్ద మనుషులకి నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని తెలిస్తే... ముందు నువ్వు డేంజర్ లో పడతావు... నన్నెందుకు కిడ్నాప్ చేసావని వాళ్ళు అడుగుతారు...

రవీంద్ర: ఇది అఫీషియల్ గా చేసిన పని కాదు.... మేము పోలీస్ రికార్డ్స్ లో ఎక్కడా దీనిని మెన్షన్ చెయ్యం. మీరు నాదగ్గరున్నారని వాళ్లకి తెలీదు. నేను చెప్పను...

జితేందర్(బెదిరింపుగా): నేను కనుక రేపు తెల్లవారేలోగా జైల్లో లేకపోతే చాలా మంది ఉద్యోగాలు పోతాయి...

రవీంద్ర: ఎస్... మీకు ఇంతకాలం హెల్ప్ చేసినందుకు చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అవుతారు... వాళ్ళ మీద డిపార్టుమెంటల్ ఎంక్వయిరీ మొదలవుతుంది. వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చు... కానీ... దానికన్నా పెద్ద డేంజర్ ఒకటి వుంది...

జితేందర్(అనుమానంగా): ఏమిటది?

రవీంద్ర: మీరు FUGITIVE... జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... నిన్న రాత్రి మీరు జైలు నుండి పారిపోయారు... మీరు నిన్న జైల్లోంచి బయటకి రాగానే మేము మిమ్మల్ని పిక్ అప్ చేసాము... మీరు మీ వాళ్ళతో అవుట్ అఫ్ కాంటాక్ట్ అవడంతో... వాళ్ళు మీరు ఎక్కడున్నారో... ఏమైందో తెలియక వాళ్ళ మనుషులని పంపించి ముందుగా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు... కానీ వాళ్లకి ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్స్ న్యూ ఢిల్లీ లో Intelligence Bureau ఆఫీస్ లో ఉన్నాయని తెలుస్తుందో... అప్పుడు వాళ్ళు మనుషులని మిమ్మల్ని చంపడానికి పంపించారని ఏమిటీ నమ్మకం?

జితేందర్(చాలా నమ్మకంగా): అలా ఎప్పటికి జరగదు...

రవీంద్ర: ఎందుకు జరగదు?

జితేందర్: నా దగ్గర వాళ్ళ రహస్యాలు చాలా వున్నాయి... నేను నోరు విప్పితే చాలా మంది లోపలి వెళతారు... పొలిటికల్ స్టార్మ్ మొదలవుతుంది...

రవీంద్ర: Exactly... మీరు నోరు విప్పితే వాళ్ళకి పెద్ద ప్రాబ్లెమ్ కాబట్టి మిమ్మల్ని చంపరని గారంటీ ఏమిటీ? మీ దగ్గర చాలా పెద్దమనుషుల జాతకాలు వున్నాయి. అది మీ STRENGTH... వాళ్ళ WEAKNESS... మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనేది మీకు ఒక OPPORTUNITY... అది వాళ్ళకి చాలా పెద్ద THREAT... ఇప్పుడు ఈ పరిస్థితి లో వాళ్లకి మీరు ప్రాణాలతో ఉండడం అనేది చాలా పెద్ద రిస్క్... కాబట్టి వాళ్ళు మనుషులని పంపేది మిమ్మల్ని రక్షించడానికి కాదు... చంపెయ్యడానికి... కొంచం జాగ్రత్తగా ఆలోచించండి... మేము పొలాల్లో కట్టి పడేసిన వాళ్ళని అక్కడ ఎవరో ఒకరు రక్షిస్తారు... వాళ్ళు వెంటనే ఎవరెవరి కి ఇంఫార్మ్ చెయ్యాలో వాళ్లందరికీ ఫోన్ చేసి చెప్తారు. ఈ పాటికి జైలు authorities కి, మీ వెనక వున్న పెద్ద మనుషులకి, మిమ్మల్ని ఏపనిమీద బయటకి రప్పించారో వారందరికీ మీరు అవుట్ అఫ్ కాంటాక్ట్ అని తెలిసిపోయివుంటుంది... That's not good news for them... ముందు వాళ్ళు మీరెక్కడున్నారో అన్న విషయం తెలుసుకోవడానికి మీ ఐఫోన్స్ ట్రాక్ చేస్తారు. వాళ్ళకి ఢిల్లీ లో IB ఆఫీస్ ఉన్నట్లు తెలుస్తుంది... అప్పుడు వెంటనే మీ వెనకు వున్న పెద్ద మనుషులంతా జాగ్రత్త పడిపోతారు. మీకు సహాయం చెయ్యడానికి భయపడతారు. ముందుకు రారు... వీలైతే మిమ్మల్ని చంపెయ్యడానికి ప్రయత్నిస్తారు... మీ ఫోన్ లో వున్న కాంటాక్ట్ లిస్ట్... మీరు చేసిన... మీకు వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్ అంతా అనలైజ్ చేస్తున్నారు... మీతో మాట్లాడిన వాళ్ళందరూ చాలా జాగ్రత్త పడిపోతారు. మీరు రేపు ఉదయానికల్లా మీరు జైలు లోపల లేకపోతే ఏమవుతుందో చెప్తాను వినండి.... రేపు ఉదయం జైలు అథారిటీస్ మిమ్మల్ని జైలు బ్రేక్ చేసి పారిపోయిన ఖైదీ గా డిక్లేర్ చేస్తారు. వెంటనే దేశం లో వున్న అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అందరికి ఇన్ఫోర్మ్ చేస్తారు... సిటీ అండ్ స్టేట్ బోర్డర్స్ సీల్ చేసేస్తారు... బస్సు... ట్రైన్... ప్లేన్... రోడ్... అన్నిచోట్లా నిఘా పెడతారు... మీరు ఈ ఊళ్ళోంచి బయటకి పోకుండా చూసుకుంటారు... ఆంధ్ర... మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, చత్తిస్గడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్... అన్ని బోర్డర్స్ లో చెక్ పోస్ట్ లని అలెర్ట్ చేస్తారు... మీరు WANTED PERSON అవుతారు... దేశం లో వున్న ప్రతి పోలీస్ స్టేషన్ కి మీ కేసు హిస్టరీ అంతా పంపిస్తారు. మీ ఫోటో ని TV లో చూపిస్తారు... న్యూస్ పేపర్లు వేస్తారు... మీకు 3 రకాలుగా త్రెట్ వుంది... 1. పోలీస్ డిపార్టుమెంటు... మీరు పారిపోయిన ఖైదీ కాబట్టి వాళ్ళు మీకోసం జల్లెడ పడతారు... పైగా జైల్లోంచి పారిపోవడంతో... మిమ్మల్ని వీలయినంత త్వరగా పట్టుకొని లోపల పెట్టాలని చూస్తారు... మీరు ఆల్రెడీ పోలీస్ కస్టడీ లో వున్నారు కాబట్టి... మా పని అయిపోగానే మేమే మిమ్మల్ని కష్టపడి పట్టుకున్నట్లు డ్రామా ఆడి జైలు కి పంపుతాము... అప్పుడు మీ శిక్షాకాలం పెరుగుతుంది... 2. మీ వెనక వున్న పెద్ద మనుషులు... ఇన్నాళ్లు మీరు వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా మీకు చాలా ఫేవర్స్ చేశారు... ఇప్పుడు మీరు ఫుజిటివ్ కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి వేరే వాళ్ళని వెతుక్కుంటారు... మీరు వాళ్ళ రహస్యాలన్నీ బయట పెట్టకుండా జాగ్రత్తపడతారు... ఒకవేళ మీరు వాళ్ళకి మిమ్మల్ని పిక్ అప్ చేసింది పోలీస్ డిపార్టుమెంటు అని... ఇన్నాళ్లు మీరు వాళ్ళ కస్టడీ లో వున్నారని చెప్తే... మీరు మాకేమి చెప్పక పోయినా... వాళ్ళు మీరు మాకేదో చెప్పారన్న అనుమానంతో మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంటుంది... ఎందుకంటే ఇప్పుడు మీరు బతికి ఉండడం కన్నా చనిపోతే నే వాళ్ళు హ్యాపీ గా ఉండగలరు. 3.వెరీ ఇంపార్టెంట్ యాంగిల్... ఇంతవరకు మీరు చంపినా వాళ్ళ తాలూకు మనుషులు... చాలా పెద్ద లిస్ట్ వుంది... వరంగల్ లో... పైడితల్లి... కరీముల్లా... బెంగళూరు లో పట్వర్ధన్... రామేశ్వరం లో తంగదురై... మధురై లో సెల్వమణి... గోవా లో కెన్నెత్ జార్జ్... ముంబై లో చాలా పెద్ద లిస్ట్ వుంది... దేశపాండే... పడుల్కర్... మీర్ అలీ... ఫిలిప్ జాన్... జోలీ భాయ్... ఫైజల్ ఖాన్... ఇంకా చాలా మంది వున్నారు... చెన్నై లో... వడివేలు... సెంథిల్... మన్నార్... స్వామినాథన్... ఇళంగోవన్... ఢిల్లీ లో కోహ్లీ బ్రదర్స్... కపూర్ సన్స్... కలకత్తా లో గంగూలీ... ఛటర్జీ... బందోపాధ్యాయ... పఠాన్కోట్ లో కర్తార్ సింగ్... ఇలా చాలా మంది వున్నారు... ఇవి కాకుండా హైదరాబాద్ లో వాళ్ళ లిస్ట్ ఇంకా పెద్దది... ఇన్నాళ్లు వాళ్ళ దృష్టిలో మీరు జైల్లో వున్నారు... ఇప్పుడు మీరు జైల్లోంచి పరారయ్యారని తెలిస్తే వాళ్లంతా మీకోసం వెతుకుతారు... వీళ్ళుకాకుండా మీకు వేరే కొత్త శత్రువులు కూడా వున్నారు... వాళ్ళ విషయం తరువాత మాట్లాడుకుందాం...

రవీంద్ర చెప్పిందంతా విన్న జితేందర్ కి వొళ్ళంతా భయం తో నిండి పోయింది... రవీంద్ర చెప్పినట్లు ఇప్పుడు తాను భయపడాల్సింది పెద్ద మనుషుల గురించి కాదు... రవీంద్ర చదివిన లిస్ట్ లో వున్నా వాళ్ళ గురించి తలుచుకుంటే వొణుకుపుడుతోంది... దేశపాండే... తంగదురై... ఇళంగోవన్... కోహ్లీ బ్రదర్స్... ముఖ్యం గా కర్తార్ సింగ్... వీళ్ళలో ఎవరికి దొరికినా ముందు చిత్రహింస పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకొని ఆ తరువాత దారుణంగా చంపుతారు... జితేందర్ కి ఒక విషయం బాగా అర్ధమయ్యింది... తనని రక్షించడానికి ఎవరూ రారు... ఎవరు వచ్చిన తనని చంపుతారు... ముందు ఎలాగైనా జైల్లోకి వెళ్ళాలి... తనకి అక్కడే సేఫ్... ఇప్పుడు తను పెద్ద మనుషుల పనిమీద బయటకి వచ్చానని చెపితే ఎవరూ నమ్మక పోగా... ఆ పని ఏమిటని అడుగుతారు... అది పెద్ద రిస్క్... తనంత తానే పారిపోయానని చెప్తే శిక్ష కాలం పెంచేస్తారు... ఒకరకంగా అది తనకి మంచిది... కొంత కాలం జైల్లో సేఫ్ గా ఉండవచ్చు... ఆ టైం లో అందరికి జరిగిన విషయం డిటైల్డ్ గా చెప్పవచ్చు... కానీ... ఇప్పుడు ఇక్కడినుంచి జైలు కి ఎలా వెళ్ళాలి? వీళ్లంతట వీళ్ళు పంపరు... అసలా వీళ్ళకి ఏమి కావాలి? పట్టుపడ్డప్పటినుంచి ఇప్పటిదాకా రవీంద్ర తో చాలా రూడ్ గా మాట్లాడుతున్న జితేందర్ మొదటిసారి

జితేందర్ (మర్యాద తో కూడిన స్వరంతో): సర్... మీకేమి కావాలి?

ఇంతలో కరుణాకర్ హడావిడిగా వచ్చి రవీంద్రని పక్కకి తీసుకేళి లాప్ టాప్ లో ఏదో చూపించి ఎక్సప్లయిన్ చేయ్యసాగాడు... రవీంద్ర వెంటనే ఆ రూమ్ లోంచి బయటకి వెళ్ళిపోయాడు... ఒక పోలీస్ వచ్చి జితేందర్ చేతి కట్లు మాత్రమే విప్పి లంచ్ పెట్టాడు. జితేందర్ లంచ్ చేస్తున్నంత సేపు ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ రివాల్వర్లు అతని వైపు గురిపెట్టివుంచారు... జితేందర్ లంచ్ చెయ్యడం పూర్తి కాగానే మళ్ళీ చేతులు గట్టిగా కట్టేసి కాపలాకాయసాగారు. దాదాపు సాయంత్రం 5 గంటల ప్రాంతం లో కరుణాకర్ వచ్చి TV ఆన్ చేసి జితేందర్ ని చూడమని చెప్పి వెళ్ళిపోయాడు.... TV లో న్యూస్ రీడర్...

"ఇప్పుడే అందిన వార్త... నిన్న రాత్రి 2 గంటల ప్రాంతం లో చర్లపల్లి జైల్లో కఠినకారాగార శిక్షని అనుభవిస్తున్న ఖైదీ పరారుఅయ్యాడు... ఆ ఖైదీ పేరు జితేందర్. ఆదిలాబాద్ లో ఒక తండాకు చెందినవాడిగా గుర్తించారు. జితేందర్ చాలా నేరాల్లో నిందితుడు. ప్రస్తుతం ఒక హత్య కేసులో 7 ఏళ్ళ కఠిన కారాగార శిక్షని అనుభవిస్తున్నాడు. రాత్రి జైలు నుండి ఎలా పరారయింది అన్న విషయం జైలు అధికారులు నిర్ధారించలేదు. మాకు అందిన విశ్వనియ్యవర్గాల సమాచారం బట్టి నిన్న రాత్రి పాల వాన్ లో కానీ, కూరల వాన్ లో కానీ ఏక్కి పారిపోయివుండొచ్చని అనుమానిస్తున్నారు..."


PART - 11 - THE SEARCH AND SEIZER

శంకరం ఇల్లు, ఆఫీస్ ని అనఫిషియల్ గా సెర్చ్ చెయ్యడానికి రవీంద్ర నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే కరుణాకర్ తన దగ్గరవున్న వాళ్ళని రెండు టీమ్స్ గా విడదీసాడు. ఒక టీం ని "ఆ ఆఫీసులో వున్న అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు మాత్రమే తీసుకొని రండి. డెస్క్ టాప్ కంప్యూటర్స్, లాప్ టాప్స్, పెన్ డ్రైవ్స్, ఎక్సటర్నల్ స్టోరింగ్ డివైసెస్... ఇలాంటివి మాత్రమే తీసుకొని రండి" అని చెప్పి శంకరం ఆఫీస్ కి పంపాడు. రెండో టీం ని తీసుకొని తనే స్వయంగా శంకరం ఇంటికి వెళ్ళాడు... దారిలో ఒక ఫోన్ కాల్ చేసాడు... ఆ ఫోన్ కాల్ సంభాషణ విన్న డ్రైవర్...

డ్రైవర్: సర్... ఇప్పుడు ఆ సైదులు సహాయం మనకి అవసరమా...

కరుణాకర్: తప్పదు... మన దగ్గర ఎక్కువ టైం లేదు. వాడుకూడా ఉంటే మన పని తొందరగా అవుతుంది. నీకు దొంగతనంగా ఇంటి తాళాలు తీసి... లోపలికెళ్ళి ఎక్కెడెక్కడ యేమేమున్నాయో 10 నిమిషాలలో తెలుసుకోగలవా?

డ్రైవర్: లేదండి... నా వల్ల కాదు...

కరుణాకర్: సైదులు ఒక దొంగ... వాడి స్పెషలిటీ ఎటువంటి తాళానైనా ఒక్క నిమిషం లో తీయగలడు. వాడు ఏ ఇంటిలోకి వెళ్లినా 5 నిమిషాల్లో విలువైన వస్తువులు ఎక్కడెక్కడ వుంటాయో... సీక్రెట్ సేఫ్... అరలు... ఎక్కడెక్కడున్నాయో కనిపెట్టడం వాడి స్పెషలిటీ.... మనం శంకరం ఇంటికి అనఫీషియల్ గా వెళుతున్నాము. ఎక్కువ టైం లేదు... వీలైనంత తొందరగా బయటకి రావాలి... దానికి సైదులు లాంటి స్పెషలిస్ట్ దొంగ సహాయం అవసరం...

సైదులు ఒక చెయ్యి తిరిగిన దొంగ... చాలా ఇళ్ళని దోచుకున్నాడు... ఎటువంటి తాళానైనా తియ్యగలడు... చాలా తక్కువటైం లో ఇల్లంతా సర్వే చేసి ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి దోచుకోగల సత్త వున్నవాడు... వాడిమీద ఎన్ని అనుమానాలు వున్నా ఇంతవరకు పోలీస్ లకి ఆధారాలతో దొరకలేదు... కరుణాకర్ టీం శంకరం ఇంటికి చేరేటప్పటికి సైదులు ఆల్రెడీ తన కిట్ తో వెయిట్ చేస్తున్నాడు. సైదులు చేతికి గ్లోవ్స్ వున్నాయి... కరుణాకర్ తన టీం తో దిగగానే ఆ వాన్ వెళ్ళిపోయింది... వాళ్లంతా ఇంటి గేట్ తీసుకొని లోపలి వెళ్లారు... చిన్న ఇల్లు... ముందు వరండా... గ్రిల్ డోర్ వుంది... దానికి గోద్రెజ్ తాళం వేసివుంది... రెండే నిమిషాలు... సైదులు తాళం తీసేసాడు... రెండో తాళం మెయిన్ డోర్ కి వుంది... అది కూడా గోద్రెజ్ తాళమే... కొంచం పెద్దది... ఇంకో రెండు నిమిషాలలో దాన్ని కూడా తీసేసాడు... ఇప్పుడు అంతా ఆ ఇంటి మెయిన్ హాల్లో వున్నారు.

సైదులు ఆ రూమ్ ని సర్వే చేసాడు. చాలా చిన్నది. 10X10 రూమ్... నాలుగు కుర్చీలు ఒక సెంటర్ టేబుల్... గోడకి LED టీవీ... అంతే... పెద్దగా ఫర్నిచర్ ఏమి లేదు... రెండు బెడ్ రూమ్స్... ఒక కిచెన్... ఒక 2 ఇన్ 1 బాత్రూం... సైదులు ముందుగా మాస్టర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు... ఏది ముట్టుకోకుండా రూమంతా కలయచూసాడు... ఒక వైపు మంచం... రెండో వైపు పెద్ద షెల్ఫ్... వున్నాయి... జాగ్రత్తగా షెల్ఫ్ ఓపెన్ చేసాడు... 4 అరలున్నాయి... అన్నింటిలోనూ కొత్తవి... పాతవి... బట్టలున్నాయి... చాలా జాగ్రత్తగా వాటి మడతలు నలగకుండా ఆ నాలుగు అరలు చక చక చెక్ చేసేసాడు... ఆ అరలలో ఎటువంటి విలువైన వస్తువులు, డాకుమెంట్స్ లేవు... రెండో బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు... ఎదో పాత సామాన్లు వున్నాయి... పాత ట్రంక్ పెట్టెలు, చెక్క తో చేసిన బుక్ షెల్ఫ్, పాత చెక్క బీరువా వున్నాయి. వాటిలో కూడా పెద్దగా ఏమి లేవు. అదే రూమ్ లో ఒక స్టెప్ లాడర్ కూడా వుంది. కిచెన్ లోకి వెళ్లి చూసాడు. సీక్రెట్ షెల్ఫ్ లు ఏమి కనపడలేదు... చివరకు బాత్ రూమ్ లోకి వెళ్లి గోడలన్నింటిని తట్టి చూసాడు. ఎటువంటి డొల్ల కనిపించలేదు... ఇల్లంతా కలియ తిరిగాడు... ఎక్కడా ఏమిదొరకలేదు... ఇంతలో సైదులు సడన్ ఏదో గుర్తుకొచ్చినట్లు అయిపోయాడు... గబగబా రెండో బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు... స్టెప్ లాడర్... మౌల్డెడ్ మోడరన్ లాడర్... చాలా ఖరీదైనది... ఆ ఇంటిలో ఎటువంటి విలువైన వస్తులు లేవు. కానీ... బాగా ఖరీదైన కొత్త మోడల్ స్టెప్ లాడర్ వుంది... ఎందుకు? సైదులు మొహం లో నవ్వు వెలిసింది... వెంటనే బాత్ రూమ్ లోకి వెళ్లి బూజు దులిపే కర్ర తీసుకొని వచ్చి ఖాళీగా వున్న రెండో బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆ రూమ్ సీలింగ్ ని కర్రతో పొడవసాగాడు... వాడి అనుమానం కరెక్ట్... ఆ రూమ్ లో ఒక మూల గా సీలింగ్ లో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ వున్నది... కర్రతో కొట్టినప్పుడు ఒక చోట డొల్లగా సౌండ్ వచ్చింది... అప్పుడు అందరికి అర్ద్మయ్యింది... ఆ స్టెప్ లాడర్ అక్కడెందుకుందో... లాడర్ ని ఎక్కి డొల్ల గా వున్న ప్రాంతమంతా చేతితో తడిమాడు... అతని చేతికి పెద్ద సైజు సెలెఫిన్ టేప్ తగిలింది... దానిని లాగేసాడు... అది నాలుగు పక్కల ఒక దీర్ఘచతురస్రాకారంలో వేసి వుంది... ఆ టేప్ కనపడకుండా దానిమీద తెల్లటి పెయింట్ వేశారు... ఆ ఏరియా లో ఒక లాక్ కనిపిచింది... అది ఆ సీక్రెట్ కంపార్ట్మెంట్ కి డోర్... ఒక 10 నిమిషాలలో ఆ లాక్ కూడా ఊడిపోయింది... అప్పుడు... ఆ సీలింగ్ లోంచి ఒక అర... విమానం లో హ్యాండ్ లగ్గేజ్ పెట్టుకునే ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ తెరుచుకున్నట్లు... ఓపెన్ అయ్యింది... అందులో చాలా వస్తువున్నాయి... సైదులు ఒకటొకటిగా వాటిని తీసి కరుణాకర్ కి ఇచ్చాడు... కరెన్సీ కట్టలు... 500... 2000... డినామినేషన్ లో వున్నాయి... చాలా పెద్ద సైజు మంచి క్వాలిటీ నోట్ బుక్స్ చాలా దొరికాయి... దాదాపు 30 దాకా వున్నాయి... వాటన్నిటిని భద్రంగా తీసి ఇచ్చాడు... ఇవే కాకుండా 4 చిన్న సైజు లెదర్ బాగ్స్ ఒక కూడా దొరికాయి... ఆ కంపార్ట్మెంట్ అంతా ఖాళీ అయ్యాక వెంటనే వాళ్లంతా ఆ ఇంట్లోంచి బయటకి వచ్చేసారు... కరుణాకర్ ఎవరూ చూడకుండా ఒక 2000 రూపాయల కట్టని సైదులు కి ఇచ్చాడు... వాడు దాన్ని తన ప్యాంటు జేబులో కుక్కుకొని... కరుణాకర్ దణ్ణం పెట్టి తన కిట్ భుజాన వేసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు... కరుణాకర్ తన టీం తో రైడింగ్ లో దొరికిన వాటిని తీసుకొని సేఫ్ హౌస్ చేరుకున్నాడు...

అక్కడ... అప్పటికే శంకరం ఆఫీస్ కి వెళ్లిన వాళ్ళు వచ్చేసారు... రెండు డెస్క్ టాప్ కంప్యూటర్స్... ఒక లాప్ టాప్... 2 ఎక్సటర్నల్ స్టోరేజ్ డ్రైవ్స్... తీసుకొచ్చారు... వాటిని పోలీస్ టెక్ సపోర్ట్ వాళ్ళు బ్రేక్ చేసి లాగ్ ఇన్ అయ్యి డ్రైవ్ కంటెంట్స్ చూడసాగారు...

ఒక ఇంజనీర్ లాప్ టాప్ లోకి లాగ్ ఇన్ అయ్యిన వెంటనే... ఒక పెన్ డ్రైవ్ అటాచ్ చేసి దాంట్లో వున్న అప్లికేషన్ ని రన్ చేసాడు... ఆ అప్లికేషన్ కంప్యూటర్ లో డిలీట్ చేసిన ఫైల్స్... వెబ్ బ్రౌసర్ హిస్టరీ ని రికవర్ చేస్తుంది... ఒక యూసర్ వెబ్ బ్రౌసర్ ని వాడి వెబ్ సైట్స్ ని సెర్చ్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని బ్రౌసర్ హిస్టరీ లో స్టోర్ అవుతాయి... కొంత మంది రెగ్యులర్ గా వెబ్ బ్రౌసర్ హిస్టరీని మాన్యువల్ గా డిలీట్ చేస్తూ వుంటారు... కానీ... వెబ్ బ్రౌసర్ లో ఇంకో ఫెసిలిటీ కూడా వుంది... ఎప్పుడైనా యూసర్ వెబ్ బ్రౌసర్ ని వాడి క్లోజ్ చెయ్యగానే ఆటోమేటిక్ గా కూడా బ్రౌసింగ్ హిస్టరీ డిలీట్ అయిపోతుంది... అందరికి ఒక అపోహవుంది. కంప్యూటర్ లోంచి ఏదైనా డిలీట్ చేసేస్తే అది మళ్ళీ రిస్టోర్ అవ్వడం చాలా కష్టం అని అనుకుంటారు... అది నిజం కాదు... Nothing is ever deleted on a computer. Even though delete functions exist the data still remains somewhere in the computer, whether on the hard drive or in obscure files tucked away deep in the operating system. కంప్యూటర్ ప్రోగ్రామర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్లికేషన్స్ తయారుచేసి డిలీట్ అయినా డేటా ని రిస్టోర్ చేస్తూ వుంటారు. ప్రస్తుతం పోలీస్ టెక్ సపోర్ట్ ఇంజనీర్ అలంటి ప్రోగ్రాం నే శంకరం ఆఫీస్ నుండి తెచ్చిన లాప్ టాప్ లో రన్ చేసాడు... ఆ ప్రోగ్రాం... డిలీట్ అయిన వెబ్ బ్రౌసర్ హిస్టరీ అంతటిని రిట్రీవ్ చేసి వేరే హార్డ్ డ్రైవ్ లో స్టోర్ చేసింది... ఆ హిస్టరీ మొత్తాన్ని ప్రైమరీ లెవెల్లో ఫార్మాట్ చెయ్యగా ఆ IP అడ్రస్ వాడిన యూసర్ గత 12 ఏళ్లుగా ఏ ఏ వెబ్ సైట్ ని ఎన్ని సార్లు విసిట్ చేసాడో హై లెవెల్ రిపోర్ట్ ఇచ్చింది... దానితో పాటు ఇంకో పవర్ పాయింట్ ఫైల్ ని కూడా రిస్టోర్ అయ్యింది... ఆ రిపోర్ట్, పవర్ పాయింట్ ఫైల్ డీటెయిల్స్ చూడగానే కరుణాకర్ వెంటనే ఆ లాప్ టాప్ ని తీసుకొని రవీంద్ర దగ్గరకెళ్ళాడు...

రవీంద్ర ఆ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఫైల్ లో డీటెయిల్స్ ని జాగ్రత్త గా స్టడీ చేసాడు... ఆ ఫైల్ లో చాలా స్లైడ్స్ వున్నాయి...

1. దేశం లో ఎన్ని బ్యాంక్స్ వున్నాయి... పబ్లిక్ సెక్టార్ & ప్రైవేట్ సెక్టార్, కోఆపరేటివ్ బ్యాంక్స్...

2. ప్రతి బ్యాంకు కి ఎన్ని బ్రాంచెస్ వున్నాయి... అర్బన్ బ్రాంచెస్ & రూరల్ బ్రాంచెస్...

3. ప్రతి బ్రాంచ్ లో ఎన్నెన్ని సేవింగ్స్ అకౌంట్స్, కరెంటు అకౌంట్స్ వున్నాయి...

4. సేవింగ్స్ బ్యాంకు అకౌంట్స్ లో ఎన్ని రెగ్యులర్ ఆపరేట్ చేస్తున్నారు... Dormant అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి...

5. స్మాల్ అండ్ మీడియం ట్రేడర్స్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి...

6. స్మాల్ అండ్ మీడియం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అకౌంట్స్...

7. ఇప్పటిదాకా శంకరం & కంపెనీ ఎన్నింటిని ఫండ్ ట్రాన్స్ఫర్ కోసం వాడుకుంది.

8. ఇంకా ఎన్ని అకౌంట్స్ ని వాడుకోవొచ్చు...

9. కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్స్ డీటెయిల్స్...

10. కొత్తగా ఓపెన్ చేసిన కంపెనీస్ డీటెయిల్స్...

11. PAN & ఆధార్ కార్డు డీటెయిల్స్...

ఇంకా చాలా రకాల Actionable Analytical డేటా... మనీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్... ఫ్యూచర్ ప్లాన్స్... గురించిన డీటెయిల్స్ ఆ ఫైల్ లో దొరికాయి...

ఇంకో ఫైల్ లో ఒక ఫైనాన్స్ కంపెనీ కి సంభందించిన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ వున్నాయి... ఆ కంపెనీ స్టాక్ మార్కెట్ లో కొన్న ఈక్విటీ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్ పొజిషన్స్ వివరాలు వున్నాయి... వాటి విలువ కోట్లలో వుంది. ఇది కాక శంకరం చాలా కాలం గా ఏ ఏ బ్యాంకు వెబ్ సైట్స్ లోకి రెగ్యులర్ వెళ్ళాడో ఒక రిపోర్ట్ వుంది... చాలా బ్యాంకులతో డీల్ చేసాడు... కానీ... ఆ బ్యాంక్స్ లో ఏ అకౌంట్స్ ఆపరేట్ చేసాడో తెలీదు... రవీంద్ర టెక్ సపోర్ట్ ఇంజనీర్ ని పిలిచాడు...

రవీంద్ర: This report is good. But I need more details... నాకు అకౌంట్ నంబర్స్ కావాలి... ఆ అకౌంట్స్ లో జరిగిన లావాదేవి వివరాలు కావాలి... ఆ అకౌంట్స్ లోకి ఫండ్స్ ఎక్కడినుంచి వచ్చాయి... ఎక్కడికెళ్ళాయి... ఆ డీటెయిల్స్ ఇవ్వగలవా?

ఇంజనీర్: కుదురుతుంది... చాలా టైం పడుతుంది... ఆ లెవెల్లో డీటెయిల్స్ ని రిస్టోర్ చెయ్యాలంటే సెపరేట్ ప్రోగ్రాం రన్ చెయ్యాలి... డ్రిల్ల్ డౌన్ కి టైం పడుతుంది...

రవీంద్ర: ఎంత టైం కావాలి?

ఇంజనీర్: సర్... ఇప్పటిదాకా మేము అలంటి డేటా రిస్టోర్ చేసే పని చేయలేదు. ఖచ్చితంగా ఐడియా లేదు...

రవీంద్ర అతడిని పంపేసి కరుణాకర్ శంకరం ఇంటినుండి తెచ్చిన ఐటమ్స్ ని స్టడీ చేయ్యసాగాడు... కరెన్సీ కట్టలు... 98 లక్షలు... నోట్ బుక్స్... లెదర్ బాగ్స్...

ముందుగా లెదర్ బాగ్స్ ఓపెన్ చేసాడు... ఒక దానిలో కీ చైన్స్ వున్నాయి. మొత్తం 16 కీ చైన్స్. ప్రతి కీ చైన్ కి 3 కీస్ వున్నాయి... ఒరిజినల్... డూప్లికేట్... ట్రిప్లికేట్... ఏదో అపార్టుమెంట్ కీస్ లాగా వున్నాయి... రెండో లెదర్ బాగ్ లో ఆధార్ కార్డ్స్... PAN కార్డ్స్... చాలా వున్నాయి... 3 పాసుపోర్ట్స్ కూడా వున్నాయి... వాటిని చూసాడు... మొదటిది జితేందర్... రెండోది ఆడవాళ్లది... డీటెయిల్స్ చెక్ చెయ్యగా అది సత్యవతి W/O జితేందర్ అని తేలింది మూడో పాస్ పోర్ట్ శంకరం కి చెందినది... ఆ పాసుపోర్టు డీటెయిల్స్ చెక్ చేసి మూసేస్తుండగా ఏదో డౌట్ వచ్చింది... శంకరం పాసుపోర్టు ని సత్యవతి పాసుపోర్టు తో కంపేర్ చేసాడు... ఆ రెండింటిలో తల్లి తండ్రులపేర్లు ఒక్కటే... డేట్ అఫ్ బర్త్ చెక్ చెయ్యగా... సత్యవతి... శంకరానికి చెల్లెలు అని నిర్ధారణ అయ్యింది... శంకరం... జితేందర్... ఇద్దరూ బావ మరుదులు...

తన ముందున్న నోట్ బుక్స్ లో ఒకదాని తీసుకొని చెక్ చేయడం మొదలెట్టాడు... ఒక పుస్తకం లో కొన్ని అపార్టుమెంట్ అడ్రస్ లు వున్నాయి... అవి ఢిల్లీ... గూర్గావ్... ముంబై... బెంగళూరు... చెన్నై... గోవా... ఇలా చాలా సిటీస్ లో వున్నాయి... వాటి కింద ఒక నెంబర్ కూడా వుంది... రవీంద్ర కి అర్ధమయ్యింది... అది తను ఇప్పుడే చూసిన అపార్టుమెంట్ కీస్ నెంబర్... ఇంకో నోట్ బుక్ తీసాడు... అందులో... బ్యాంకు పేరు... అడ్రస్... అకౌంట్ నెంబర్... దాని పక్కనే ఒక 3 అంకెల సంఖ్య... రకరకాల ఫండ్ ట్రాన్సఫర్ డీటెయిల్స్... చాలా కంపెనీస్ పేర్లు... వాటి అడ్రస్... ఇలా చాలా డిటైల్స్ దొరికాయ్... అన్ని నోట్ బుక్స్ ని పైపైన చెక్ చేసాడు... చాలా టైం పట్టింది... ఇప్పుడు రవీంద్రకి ఒక విషయం బాగా అర్ధమయ్యింది... SANKARAM IS NOT ONLY A CHARTERED ACCOUNTANT & TAX CONSULTANT... HE IS ALSO A BOOK KEEPER... MONEY LAUNDERER... CREATIVE MIND BEHIND MAJOR FINANCE SCAM... HE KNOWS HOW TO START A SUITCASE COMPANY... HOW TO OPERATE IT... FUNDS IN AND OUT FLOW...

రవీంద్ర కి తెలియని విషయాలు చాలా వున్నాయి... తన చేతిలోవున్న నోట్ బుక్స్ త్వరలో ఒక పొలిటికల్ సునామి ని సృష్టించబోతున్నాయని... దేశం లోనే అతిపెద్ద ఫైనాన్సియల్ స్కాం బయటికి రాబోతుందని... శంకరం తయారుచేసిన Ationable Analytical Data తో హోమ్ మినిస్టర్ అల్లుడు అభిలాష్ తను నడుపుతున్న సాఫ్ట్ వేర్ కంపెనీ ద్వారా సైబర్ క్రైమ్స్ చేస్తున్నాడని... దేశం లో వున్న బ్యాంక్స్ అన్నింటిలో తమకి ఉపయోగబడే బ్యాంకు అకౌంట్స్ ద్వారా ఎవరికి అనుమానం రాకుండా మనీ లాండరింగ్ చేస్తూ తాము అక్రమంగా ఆర్జించిన ధనాన్ని వాటిలో దాచుకుంటున్నారని... వీటిలో జితేందర్, శంకరం లకి చిన్న percentage లో కమిషన్ లభిస్తోందని తెలీదు...

ఇప్పుడు రవీంద్ర జితేందర్... శంకరం... ఇద్దరినీ కలిపి ఇంటరాగేట్ చెయ్యడానికి నిర్ణయించుకున్నాడు... కరుణాకర్ ని పిలిచి శంకరాన్ని జితేందర్ వున్నా రూమ్ లోకి తీసుకొని రమ్మని చెప్పాడు...

రవీంద్ర కొన్ని నోట్ బుక్స్, లెదర్ బాగ్స్, లాప్ టాప్ తీసుకొచ్చి జితేందర్, శంకరం ల ముందు వున్న టేబుల్ మీద పెడుతూ వాళ్ళ మోహంలో ఎక్సప్రెషన్స్ ని చాలా జాగ్రత్తగా గమనించాడు... వాటిని చూడగానే వాళిద్దరి నోళ్లు తెరుచుకున్నాయి... మొహాల్లో కొట్టొచ్చినట్లు ఖంగారు... భయం కనిపించింది... రవీంద్ర కి కావాల్సింది అదే...

రవీంద్ర(జితేందర్ తో): TV లో న్యూస్ చూసారా? నేను అనుకున్న దానికంటే మా వాళ్ళుకొంచం ముందుగా అనౌన్స్ చేసేసారు... ఈ పాటికి దేశంలో వున్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి మీ డీటెయిల్స్, ఫోటో వెళ్లిపోయాయి... (కరుణాకర్ వైపు చూస్తూ) మనం వీళ్ళని ఇంక కట్టేయాల్సిన పనిలేదు... వీళ్ళు తప్పిచుకొని ఎక్కడికీ పోలేరు... ఆ కట్లు తీసెయ్యండి...

శంకరం చూపంతా రవీంద్ర తీసుకొచ్చిన ఐటమ్స్ మీదే వున్నది... మొహం లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది...

రవీంద్ర(శంకరం తో): ఇవన్నీ మీ ఇంట్లో సీలింగ్ లో వున్న సీక్రెట్ అరలోంచి తెచ్చినవే... వీటిలో చాలా ఇన్ఫర్మేషన్ వుంది... మేము ఇంకా అన్ని ఫైల్స్ చెక్ చెయ్యలేదు... కొన్ని చూసాము... మీరు తయారు చేసిన Actionable Analytical Data చాలా బాగుంది... ఈ బుక్స్ లో దొరికిన బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ని చెక్ చెయ్యిస్తున్నాము... టైం పడుతుంది... మీరు సహాయంచేస్తే పని తొందరగా అవుతుంది... నేను మిమ్మల్ని చాలా అడగాలి... OK... Let's start with these apartment keys... మేము మావాళ్లని పంపించి ఈ అపార్టుమెంట్స్ అన్నింటిని చెక్ చేసి అవసరమైతే సీల్ చేసేస్తాము... నా అనుమానం ప్రకారం ఈ నోట్ బుక్స్ లో మీ Financial Transactions డీటెయిల్స్ వుంది ఉంటాయి... మేము ఈ బుక్స్ ని Income Tax, Enforcement Directorate, CBI... వీళ్లందరి కి పంపిస్తాము... వాళ్ళు వీటిని ఇన్వెస్టిగేట్ చేసి అవసమైతే ఈ అకౌంట్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసేస్తారు... వీటిని ఇందాకటినుంచి స్టడీ చెయ్యడంతో నాకు అర్ధమయ్యిందేమిటంటే... మీరు ఒక పెద్ద ఫైనాన్సియల్ స్కాం ని నడుపుతున్నారు... ఇందులో మీతో పాటు ఇంకా చాలా మంది వున్నారు... వాళ్లంతా ఇరుక్కుపోతారు... జితేందర్ తో పాటు మీరు కూడా అరెస్ట్ అయిన సంగతి మీ వెనకున్న "పెద్ద మనుషులు" ఈ పాటికే పసికట్టేసివుంటారు... ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్ చాలా డేంజర్ లో వున్నాయి...

శంకరం(భయంతో వణికిపోతూ): ఈ నోట్ బుక్స్ మీ దగ్గరున్నాయని వాళ్ళకి తెలిస్తే మాతో పాటు మీక్కూడా డేంజర్... వాటిని వెంటనే తగలెట్టెయ్యండి...

రవీంద్ర: నాకు వచ్చిన డేంజర్ ఏమి లేదు. నేను ఈ నోట్ బుక్స్ తో పాటు మిమ్మల్ని CBI, ED, IT వాళ్ళకి అప్పగిస్తాను... ఇది నాకుసంభందించిన కేసు కాదు... ఇది Serious Economic Crimes కిందకొస్తుంది... నేను వాళ్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇప్పటినుంచి ఇది వాళ్ళ తలకాయనొప్పి... కాకపొతే నాకు కొన్ని సందేహాలున్నాయి...

జితేందర్ కి పూర్తిగా అర్ధమయ్యింది... తను క్రైమ్స్ చేసి సంపాదించిందంతా మాయమవుతుంది... బ్యాంకు లో వున్న డబ్బులు... కొనుకున్న అపార్టుమెంట్స్... అన్ని ఒక్క దెబ్బతో గవర్నమెంట్ పరమయిపోతున్నాయి... ఇప్పుడు రవీంద్ర తో డీల్ మాట్లాడుకోవాలి... ఎలా...

జితేందర్(ఏడుస్తూ): సర్... మమల్ని కాపాడండి... మీకేమి కావాలంటే అది ఇస్తాము... ప్లీజ్ మమ్మల్ని కాపాడండి...

రవీంద్ర: ఇవ్వాళ ఉదయం నేను మీ చేతుల్లో చావబోయే మొదటి పోలీస్ ఆఫీసర్ అని అన్నట్లు జ్ఞాపకం... నేను మీకెలా హెల్ప్ చెయ్యగలను?

జితేందర్(గట్టిగా ఏడుస్తూ): పొరపాటయ్యింది... క్షమించండి... ఉదయం బాగా బలుపు గా మాట్లాడాను... ఇప్పుడు మీ చేతుల్లో నా జాతకం, జీవితం మొత్తం వుంది... నా కొడుకు పెద్ధ కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు... వాదిచదువు ఆగిపోతుంది... నేను చనిపోయినా ఫరవాలేదు... శంకరం ని... నా భార్యని కాపాడండి... మీరేమిచెప్పినా చేస్తాను... ప్లీజ్ కాపాడండి...

రవీంద్ర: నిన్ను కాపాడడం నా చేతుల్లో లేదు...

జితేందర్(ఏడుపుఆపకుండా): అలా అనకండి... ప్లీజ్... మమల్ని కాపాడండి...

శంకరం కూడా జరగబోయేది తలచుకొని సైలెంట్ గా ఏడుస్తున్నాడు...

Breaking Point...

రవీంద్ర(శంకరం తో): నేను మిమల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను... డైరెక్ట్ గా సమాధానమిస్తారా?

శంకరం మౌనంగా తలూపాడు...

రవీంద్ర(నోట్ బుక్స్ చేత్తో పట్టుకొని): ఈ బుక్స్ లో మీ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయా?

శంకరం: వున్నాయి...

రవీంద్ర: మీకు సంభందించిన డబ్బు ఈ అకౌంట్స్ లో ఎంత వుంది...

శంకరం(తడుముకోకుండా): 200 పైనే...

రవీంద్ర(నమ్మకం కలగక): అంటే 200 Crores?

శంకరం తలూపాడు... ఆ రూమ్ లో అందరూ స్టన్ అయ్యారు...

రవీంద్ర: ఇంత డబ్బు ఎలా బ్యాంకు అకౌంట్స్ లో వేశారు?

శంకరం: అది చెప్పాలంటే మీకు మా ఫైనాన్సియల్ నెట్ వర్క్ మొత్తం చెప్పాలి.... అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్... మేము రెగ్యులర్ గా దేశం లో వున్న అన్ని బ్యాంక్స్ లో పెద్దగా ట్రాన్సక్షన్స్ జరగని genuine అకౌంట్స్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాము... ఉదాహరణకి మన జనరల్ బజార్ లో చాలా షాప్స్ వున్నాయి... వాటిలో కొన్ని షాప్ ఓనర్స్ చేత మేము ఒక కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయిస్తాము. వాటిలో ఆ కొట్టు ద్వారా మా డబ్బుని ఆ అకౌంట్ లో రెగ్యులర్ గా వేస్తాము... ఆ అకౌంట్ ని మేము ఇంటర్నెట్ ద్వారా కంట్రోల్ చేస్తాము... మాకు కావాలినప్పుడు మేము ఆ డబ్బుని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి మారుస్తూ ఉంటాము... ఇలా మాకు దేశం మొత్తం కొన్ని వేల అకౌంట్స్ వున్నాయి... నేను ఒక అనలిస్ట్ ని. డేటా కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాను... వాళ్ళు ఈ అకౌంట్స్ ఓపెనింగ్... ఆపరేటింగ్... చేస్తూ వుంటారు...

రవీంద్ర: మీరు అనలిటికల్ డేటా ని ఎవరికిస్తారు?

శంకరం జవాబు చెప్పకుండా జితేందర్ వైపు చూసాడు... జితేందర్ తల వంచుకొని కూర్చొని వున్నాడు. రవీంద్ర తన ప్రశ్నని మళ్ళీ అడిగాడు...

శంకరం: అభిలాష్... హోమ్ మినిస్టర్ గారి అల్లుడికి ఇచ్చేవాడిని...

రవీంద్ర కి బుర్ర తిరిగిపోయింది... ఇప్పుడు పూర్తిగా అర్ధమవుతోంది... ఇది చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న ఫైనాన్సియల్ నెట్ వర్క్... దీంట్లో చాలా పెద్ద వాళ్ళు వున్నారు... ఒక రకంగా వాళ్ళ జాతకాలు తన చేతిలోవున్నాయి... చాలా సింపుల్ గా కనిపిస్తున్న శంకరం ఒక హర్షద్ మెహతా ని మించినవాడు...

రవీంద్ర: మీ నెట్ వర్క్ సైజు ఎంత?

శంకరం(అర్ధంకాక): అంటే?

రవీంద్ర: ఈ నెట్ వర్క్ లో దాదాపు ఎంత డబ్బు రొటేట్ అవుతోంది?

శంకరం: 50

రవీంద్ర: 50?

శంకరం: 50,000 కోట్లు.

రవీంద్ర నోట మాట పడిపోయింది... ఇప్పుడేంచేయ్యాలో తెలియడం లేదు... ఈ కేసు ఎక్కడ మొదలయ్యి ఎక్కడికెళుతోందో... తను జితేందర్ ని తీసుకొచ్చిన purpose కి... ప్రస్తుతం జరుగుతున్నదానికి అసలు సంభంధం లేదు. రవీంద్ర జాగ్రత్తగా ఆలోచించాడు... ప్రస్తుతానికి శంకరం ని అడ్డుపెట్టుకొని జితేందర్ నుండి డీటెయిల్స్ రాబట్టాలి... జితేందర్ కి ఎలాంటి డీల్ ఇస్తే నోరువిప్పుతాడు? జితేందర్ ప్రాణానికి రక్షణ కల్పిస్తానని గారంటీ ఇస్తేనే వాడు మాట్లాడతాడు... శంకరం ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలి...

>రవీంద్ర: ఒక ప్రశ్న వేస్తాను... నాకు సూటిగా సమాధానం కావాలి... (అపార్టుమెంట్ కీస్ వున్న లెదర్ బాగ్ చూపిస్తూ) ఈ అపార్ట్మెంట్స్ లో ఏముంది?

జితేందర్: బంగారం, నగలు, డబ్బులు...

రవీంద్ర: అవి ఎవరివి?

జితేందర్: హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రావు...

రవీంద్ర: మీరు ప్రాణాలతో బతికి ఉండాలంటే నాకు హెల్ప్ చెయ్యాలి... నేను మిమ్మల్ని సేఫ్ గా తీహార్ జైలు కి మారుస్తాను... నేను మిమ్మల్ని తీసుకొచ్చిందే ఒక కేసు విషయం లో interrogate చెయ్యడానికి... కానీ... ఇదిగో శంకరం గారికి కేసు డీటైల్స్ బయటకి రావడంతో తో కొంచం డైవర్ట్ అయ్యాను... ప్రస్తుతానికి శంకరం గారిని పక్కనపెడదాం... 15 జులై 2016 న మీరెక్కడున్నారు?

జితేందర్ (పూర్తిగా అర్ధమయ్యింది రవీంద్ర కి ఏమి కావాలో... కానీ అమాయకంగా): సర్ నేను గత 5 ఏళ్లుగా చర్లపల్లి జైల్లోనే వున్నాను...

రవీంద్ర: మీరు జైల్లోనే వున్నా నెలలో 2 / 3 సార్లు బయటకి వచ్చి వెళుతూ వుంటారు కదా... ఆ రోజు ఎక్కడున్నారో చెప్పండి...

జితేందర్: చాలా కష్టం సర్... రెండేళ్లు అయ్యింది... గుర్తులేదు...

రవీంద్ర: ఆ రోజు హైదరాబాద్ లోని ఒక ఫార్మ్ హౌస్ ఒక పెద్ద మనిషి కుటుంబం మొత్తం హత్యకి గురయ్యారు... మీకు తెలీదా...

జితేందర్ (అప్పుడే గుర్తుకొచ్చినట్లు నటిస్తూ): అవును సర్... గుర్తొచ్చింది... పేపర్ లో చదివాను...

రవీంద్ర: ఇప్పుడు చెప్పండి... ఆ హత్యలుజరిగిన రోజు మీరెక్కడున్నారు?

జితేందర్: జైల్లోనే వున్నానండి...

రవీంద్ర: లేదు... ఆ హత్యలు మీరుచేశారని మాదగ్గర ఆధారాలు దొరికాయి... అందుకే మిమ్మల్ని ప్రశ్నించడానికి తీసుకొచ్చాము...

జితేందర్ చాలా వేగం గా ఆలోచించసాగాడు... పోలీస్ డిపార్టుమెంటు కి ఆధారాలు దొరికితే వెంటనే జైలు కోచి ప్రశ్నించవచ్చుగా... ఇలా ఎత్తుకురావలసిన పనేముంది? రవీంద్ర అబద్ధం చెప్తున్నాడు... వీడి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు... ఆ రోజు ఒక్క ఆధారం కూడా దొరకకుండా జాగ్రత్త తీసుకున్నారు...

జితేందర్: ఆ హత్యలకి నాకు ఎటువంటి సంభంధం లేదండి.

రవీంద్ర: వుంది... అక్కడ మాకు దొరికిన బులెట్ షెల్స్ మీద మీ వేలిముద్రలు దొరికాయి... వాటిని బట్టే మేము ఈ హత్యలకు మీకు కనెక్షన్ వున్నదని అర్ధమయ్యింది...

జితేందర్(ఖంగారుగా): బులెట్ షెల్స్... ఎక్కడా బేసెమెంట్ లోనా(అని అంటూ నాలిక కరుచుకున్నాడు)

రవీంద్ర: నెను బేసెమెంట్ లో దొరికాయని మీకు చెప్పలేదు... మీకెలా తెలుసు ఆ బులెట్ షెల్స్ మాకు అక్కడ దొరికాయని?

జితేందర్ కి అర్ధమయ్యింది... తాను పూర్తిగా ఇరుక్కుపోయానని... కొంచం సేపటి తరువాత...

రవీంద్ర: ఆ రోజు ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియాలి... నాకు ఎటువంటి డౌట్ వచ్చినా మీకు తెలుసు నేనేమి చేస్తానో... మీరు నాకు కావలిసింది ఇవ్వండి... నేను మీరు క్షేమంగా ఉండడానికి ఏమి చెయ్యాలో ఆలోచిస్తాను... నేనేమి ప్రామిస్ చెయ్యడం లేదు... మీరు బతికి ఉండడం అనేది మీరు ఇచ్చే సహకారం మీద ఆధారపడివుంటుంది... చెప్పండి... మీకు ఆ కేసు కి వున్న సంభంధం ఏమిటీ?


PART - 12 - THE MASSACARE

జితేందర్ చెప్పడం మొదలెట్టాడు.... "ఇప్పుడు నేను చెప్పబోయేది 100% నిజం... నేను దగ్గరుండి చూసిన సంఘటనలు, తెలుసుకున్న సమాచారాన్ని ఆధారం గా చెప్తున్నాను... ముందుగా ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి... అయన పేరు ప్రభాకర్ రావు... ఒక మధ్య తరగతి కుటుంబం లో జన్మించాడు... చిన్నప్పటినుంచి పైకి రావడానికి ఏమేమి చెయ్యాలి అన్ని చేసిన వ్యక్తి... తన 10 ఏళ్ళ వయసులోనే తాను ఒక రాజకీయ నాయకుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా కాలేజీ లో చేరగానే స్టూడెంట్ పాలిటిక్స్ లో చాలా ఆక్టివ్ గా వున్నాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో వున్నప్పుడు కాలేజీ స్టూడెంట్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యాలనిఅనుకున్నాడు... కానీ... స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వేరే వాడి పేరు ఖరారు చేశారు. నామినేషన్ వెయ్యడానికి ఒక రోజు ముందు ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యాల్సిన వ్యక్తి కి ఆక్సిడెంట్ లో చనిపోవడం తో యూనియన్ వాళ్ళకి వేరే మార్గం లేక ప్రభాకర్ ని నుంచో పెట్టారు... ప్రభాకర్ గెలిచాడు. అప్పటినుండి జాతీయ స్థాయి లో మంచి గుర్తింపువున్న ఒక రాజకీయ పార్టీ కి చెందిన యూత్ వింగ్ లో చేరాడు. రెండేళ్లలోనే ఆ యూత్ వింగ్ కి స్టేట్ లెవెల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యాడు. అలా అంచెలంచలు గా పార్టీలో ఎదగ సాగాడు. తాను ఎదగడానికి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. తన ఎదుగుదలకి అడ్డు వచ్చిన వాళ్లందరికీ ఏదో రకమైన ఆక్సిడెంట్ అవ్వడమో... లేక చనిపోవడంతో జరిగేది.

MLA గా గెలిచినప్పటినుంచి ప్రభాకర్ రావు కి తిరుగులేదు. ఆ రోజుల్లో విజయవాడ లో ఒక పెద్ద సినిమా హాల్ ఉండేది. సడన్ గా ప్రభాకర్ ఆ హాల్ కి ఓనర్ అయ్యాడు... ఇక్కడ ఎటువంటి హింస జరగలేదు... ఆ సినిమా హాల్ ఓనర్ కూతురు సావిత్రి ని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలానికి ఒక పాప... కావ్య... పుట్టింది. ప్రభాకర్ తన జీవితం లో ఎప్పుడూ ఎలాంటి ఎలక్షన్ ఓడిపోలేదు. తన పార్టీ అధికారంలో వున్నా లేకపోయినా తాను మాత్రం MLA గా గెలిచేవాడు. రెండో సారి MLA గా గెలిచాక ఒక చిన్న మినిస్టర్ పదవి లభించింది... అప్పుడే ప్రభాకర్ కి Political Power అంటే ఏమిటో పూర్తిగా అర్ధమయ్యింది... ఒక మినిస్టర్ గా ఏమేమి చేయవచ్చో తెలుసుకున్నాడు... ముందుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దూరాడు... బాగా సంపాదించాడు... తరువాత సినిమా ఫీల్డ్ లో ఫైనాన్సియర్ గా కొత్త అవతారం ఎత్తాడు... సినిమాలకి ఫైనాన్స్ చేసాడు... లాభాలు వచ్చాయి... తరువాత ఒక బినామీ ని అడ్డుపెట్టుకొని సినిమాలు తీసాడు... అదృష్టం బాగుంది... ఆ సినిమాలన్నీ బాగా ఆడాయి... డబ్బులు బాగా వచ్చాయి... తన రాజకీయ పలుకుబడి వుపయోగించి ఒక పెద్ద ఇండస్ట్రీ మొదలెట్టాడు... అది కూడా బాగా నడుస్తోంది... అందులో ఒక భాగస్వామి పేరు సదానంద... ప్రభాకర్ రావు కి ఒక పెద్ద బినామీ...

ఇంతలో వాళ్ళ పార్టీ ఒక టర్మ్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షం లో కూర్చుంది... ఆ టైం ని ప్రభాకర్ రావు బాగా వాడుకున్నాడు... పక్క రాష్టాలలో తన పార్టీ లో బాగా పలుకుబడి వున్న వాళ్ళతో నెట్ వర్క్ పెంచుకున్నాడు. తమిళనాడు... కర్ణాటక... కేరళ... గోవా... ఒరిస్సా... మహారాష్ట్ర... ఇలా చాలా చోట్ల మిత్రులని సంపాదించుకున్నాడు. వాళ్ళతో కలసి మనీ లాండరింగ్ బిజినెస్ లోకి దిగాడు... అందరికి లాభాలు వచ్చాయి... నల్ల ధనం బాగా పోగయ్యింది... పార్టీ లో బాగా గుర్తింపు వచ్చింది. తరువాత వచ్చిన ఎలక్షన్స్ లో తన పార్టీ గెలవడానికి తన సొంత డబ్బుని బాగా వాడాడు... తమ పార్టీ నెగ్గి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రభాకర్ రావు కి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు... అంతే... ఒక్క 5 ఏళ్లలో వ్యక్తిగతంగా బాగా పైకి వచ్చాడు... దేశం లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు పెరిగాయి. కేంద్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది... తమ పార్టీ కి జాతీయ స్థాయి లో కోశాధికారిగా కూడా భాద్యతలు నిర్వర్తించాడు... ఆ టైం లోనే డబ్బుని దేశం దాటించడం ఎలా అన్నది నేర్చుకున్నాడు. దేశం లో నల్లధనాన్ని ఎలా సమకూర్చాలి? దాన్ని హవాలా ట్రేడింగ్ ద్వారా ఎలా బయటకి పంపాలి? మళ్ళీ ఆ డబ్బుని "ఫారిన్ ఇన్వెస్టుమెంట్" రూపంలో దేశంలోకి ఎలా తేవాలి ? అన్న విషయాలు బాగా నేర్చుకున్నాడు. డబ్బు బాగా వచ్చి చేరింది... దాంతోపాటే శత్రువులు కూడా తయారయ్యారు... వాళ్ళని అడ్డుతొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడు... అందులో ఒకటి... రసూల్ గ్యాంగ్ ని చేరదీయటం...

రసూల్ గ్యాంగ్ ని వాడుకొని తన శత్రువులను చాలా మందిని అడ్డుతొలగించుకున్నాడు. అది ఒక క్రూరమైన అలవాటు గా మారిపోయింది. తనమాట కి ఎవరైనా ఎదురుచెప్పినా... తన అనుకున్నది సాధించేటప్పుడు ఎవరైనా ఎదురుతిగినా వాళ్ళని చంపించేసేవాడు... ఆ గ్యాంగ్ లో జితేందర్ అంటే ప్రభాకర్ రావు కి ఎందుకో బాగా ఇష్టం. తన సొంత పనులకి జితేందర్ ని బాగా వాడుకున్నాడు. జితేందర్ ద్వారా శంకరం కూడా ప్రభాకర్ రావు కి దగ్గరయ్యాడు... శంకరం తెలివితేటలు ప్రభాకర్ రావు కి ఫైనాన్స్ ఫీల్డ్ లో బాగా ఉపయోగ పడ్డాయి... శంకరం ద్వారా చాలా Shell Companies (A non-trading company used as a vehicle for various financial maneuvers or kept dormant for future use in some other capacity.) Suitcase Companies (They are set up with the ill-gotten money ; they are fictitious in their character; they are set up with the sole aim of transferring the ill-gotten money from one company to another in a chain system finally to a destined company.) ని స్థాపించాడు... ఈ కంపెనీస్ ద్వారా తన బ్లాక్ మనీ ఆపరేషన్స్ కి బాగా వాడుకొని విపరీతం గా సంపాదించాడు...

ప్రస్తుతం ప్రభాకర్ రావు రాష్టానికి హోమ్ మినిస్టర్ గా వున్నాడు... వచ్చే టర్మ్ లో కూడా వాళ్ళ పార్టీ కనుక నెగ్గి గవర్నమెంట్ ఫామ్ చేస్తే... ప్రభాకర్ రావు కి చీఫ్ మినిస్టర్ పదవి దక్కినా ఆశ్చర్యం లేదు... దానికోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రభాకర్ రావు కి పరిచయం అయిన వాళ్లలో రామచంద్రయ్య అనే వ్యక్తి కూడా వున్నాడు... 80 ఏళ్ళ పైపడ్డ వ్యక్తి... పెద్ద ఆసామి... గోదావరి జిల్లాల్లో ఒక పెద్ద లంక గ్రామానికి చెందినవాడు... బాగా డబ్బు, పంట పొలాలు వున్నవాడు. తరతరాలుగా వచ్చిన ఆస్తిని చక్కగా కాపాడుకొని బాగా వృద్ధి చేసాడు. ఆయనకి చాలా వ్యాపారాలు వున్నాయి... వాటిని అయన ఇద్దరు కుమారులు, ముగ్గురు అల్లుళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళది ఒక పెద్ద Hindu Undivided Family... అంతా కలసి మెలసి వుంటారు. అందరూ ఆయన స్వగ్రామానికి చుట్టు పక్కలే వుంటారు. ఆయనకు రాష్ట్రంలోనే కాక దేశం లోనే మంచి పేరు వుంది. చాలా రాజకీయ పార్టీస్ లో ఆయనకు చాలా మంచి మిత్రులున్నారు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీ లో చేరలేదు... కానీ... అయన సపోర్ట్ చేసిన పార్టీ తప్పకుండా గెలుస్తుందని అందరూ నమ్ముతారు. అది నిజం కూడా...

ఆయనకి హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ వుంది. 75 ఎకరాలు ఉంటుంది. దాని ఆయన 50 ఏళ్ళ కిందట కొన్నాడు. దాన్ని కాలక్రమేణా బాగా అభివృద్ధి చేసాడు. అందులో అన్నిరకాల పళ్ళ చెట్లు, కాయగూరల చెట్లు పెంచాడు... వాటిని ఆయన స్వయంగా కడియం అనే గ్రామం నుంచి తెచ్చి తన స్వహస్తాలతో నాటాడు. ఎంతో ప్రేమ తో పెంచుకున్నాడు. ఆ చెట్లు బాగా పెరిగి కాయలు కాస్తున్నాయి. ఆయన ఆ చెట్ల ఫలాలని ఎప్పుడూ అమ్ముకోలేదు... ఆయన ఫార్మ్ హౌస్ పండిన కూరలు, పళ్ళు అన్నిటిని తన కుటుంబ సభ్యులకి, మిత్రులకి, ఆ ఫార్మ్ హౌస్ లో పనిచేసేవారికి పంచి పెట్టేవాడు... ఆ వూళ్ళో తన స్నేహితుల ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయన ఫార్మ్ హౌస్ నుండి కూరలు, పళ్ళు వస్తాయి... ఎవరూ అడగవలసిన అవసరం లేదు... ఒకసారి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇంట్లో పెళ్లి జరిగితే... ఒక వారం రోజుల పాటు వాళ్ళు బయటనుండి కూరలు కొనలేదు... అన్నిటిని రామచంద్రయ్య గారే దగ్గరుండి పంపారు... చాలా పెద్ద మనిషి... ఆయన తన మనవరాలి పెళ్లి కూడా ఆ ఫార్మ్ హౌస్ లొనే చేసాడు... అప్పుడు దేశం లో వున్న పెద్ద వాళ్లంతా వచ్చారు. ప్రభాకర్ రావు కూడా వచ్చాడు.

ప్రభాకర్ రావు కి అదే మొదటిసారి ఆ ఫార్మ్ హౌస్ లోకి అడుగుపెట్టడం... ఆ వైభవం చూసి నోట మాట రాలేదు... 75 ఎకరాల మధ్యలో ఒక పెద్ద ఇల్లు... ఆ ఇంటి ముందు అద్భుతమైన గార్డెన్... రకరకాల పూల చెట్లు... ఎన్నో ఏళ్ళు కష్టపడి శ్రద్ధతో పెంచుకున్న తోట... ఆరోజు ప్రభాకర్ రావు తన ఫామిలీ తో సహా వచ్చాడు... భార్య... కూతురు... అందరికి ఆ ఫార్మ్ హౌస్ మొదటి చూపులోనే నచ్చేసింది... ప్రభాకర్ రావు కూతురు కావ్య కి ఆ ఫార్మ్ హౌస్ వదలి వెళ్ళడానికి మనసు రాలేదు... ఆ రోజు పెళ్లి కూతురు వేసుకున్న నగలు... ఆమె కట్టుకున్న చీర చూస్తే ఆమె కళ్లు కుట్టుకున్నాయి... ఆమె కూడా ఐశ్వర్యం లో పెరిగింది... తనకి కూడా చాలా నగలు వున్నాయి... కానీ... ఆ రోజు రామచంద్రయ్య గారి మనవరాలు వేసుకున్న నగలకున్న GRACE... తన నగలకు లేదు... చాలా అద్భుతంగా వుంది... ఆ రోజు ప్రభాకర్ రావు తన కుటుంబం తో అక్కడికి రావడానికి ఇంకో కారణం వుంది... ఆ పెళ్ళికి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ రంగ రావు తన కుటుంబంతో అక్కడికి వచ్చాడు... ఆయనకి ఒక కొడుకు వున్నాడు... అభిలాష్... అమెరికా లో Computer Sciences లో MS చేసాడు... ప్రస్తుతం హైదరాబాద్ లో సొంతగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నాడు... అతనకి తన కూతురు కావ్య ని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాడు... ఆ రోజు కావ్య, అభిలాష్ లు మొదటిసారిగా ఒకరినొకరు చూసుకున్నారు... ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆ ఫార్మ్ హౌస్ పార్క్ లో తిరిగారు... ఒకరికొకరు బాగా నచ్చారు... ఇద్దరూ ఆ ఫార్మ్ హౌస్ మొత్తం కలియతిరిగారు... ఇద్దరికీ ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది... రంగ రావు కి ఆ టైం లో మంచి Political Support కావాలి... తన ఇండస్ట్రీ ని ఎక్సపాండ్ చెయ్యడానికి లైసెన్స్... బ్యాంకు లోన్స్... ఇండస్ట్రీ పెంచుకోవడానికి గవర్నమెంట్ ల్యాండ్, ఇండస్ట్రియల్ కన్సెషన్స్... ఇలా చాలా కావాలి... అవి ప్రభాకర్ రావు సమకూర్చగలడు... అదే రకంగా ప్రభాకర్ రావు కి ఒక మంచి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అవసరం వుంది... తన ఫైనాన్స్ ఆపరేషన్స్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లడానికి... పైగా అభిలాష్... కావ్య... ఇద్దరూ ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డారు... వాళ్ళ పెళ్లి చెయ్యాలని ఆ ఫార్మ్ హౌస్ లోనే డెసిషన్ తీసుకోవడం జరిగిపోయింది...

ఆ రోజు ప్రభాకర్ రావు ఫామిలీ రామచంద్రయ్య గారి ఇంట్లో ఫంక్షన్ తరువాత కార్ లో ఇంటికి వెళ్తున్నంతసేపు ఆ ముగ్గురు... ప్రభాకర్ రావు, సావిత్రి, కావ్య... ఆ ఫర్మ్ హౌస్ గురించే మాట్లాడుకున్నారు. దాన్ని మర్చిపోలేకపోతున్నారు... ఆ ఫార్మ్ హౌస్ వాళ్ళ కళ్ళముందు కదులుతోంది... అంత అందమైన ఫార్మ్ హౌస్ ని వాళ్ళు ఎప్పుడూ చూడలేదు... ఒక వారం లోపల అభిలాష్, కావ్య ల నిశ్చితార్ధం జరిగిపోయింది... కట్న కానుకలు అన్ని ఘనంగా ఇవ్వడానికి ప్రభాకర్ రావు కి ఎటువంటి అభ్యంతరం లేదు... ఒక నెల లోపు రంగ రావు కి కావలసిన ఇండస్ట్రీ లైసెన్స్, బ్యాంకు లోన్స్ అన్ని దొరికాయి... పెళ్లి ముందు రోజు... ప్రభాకర్ రావు తన కూతురు కొంచం డల్ గా ఉండడం చూసి ఏమైందని అడిగాడు... "నాన్న... నా పెళ్లి కానుకగా ఆ రామచంద్రయ్య గారి ఫార్మ్ హౌస్ ఇపిస్తావా... అది నాకు, అభిలాష్ కి బాగా నచ్చింది... పైగా మేమిద్దరం మొదటిసారిగా కలుసుకున్న ప్లేస్... ఒకరకమైన అనుబంధం ఏర్పడింది. మేమిద్దరం జీవితాంతం అక్కడే వుండాలని నాకోరిక" అని అన్నది... ప్రభాకర్ రావు కి కూడా మనసులో అదే కోరిక వుంది... ఆ ఫార్మ్ హౌస్ ని కూతురికి కట్నం గా ఇవ్వాలని... "తప్పకుండా ఇస్తా తల్లి... ఎంత ఖర్చైనా సరే... కొనేస్తాను" అని ఆవేశంగా వాగ్ధానం చేసాడు... ఆ సమయం లో... ఆ వాగ్ధానం ఎంత అనర్ధాని తెచ్చి పెట్టబోతోందో... కొంత మంది పెద్ద మనుషులు ప్రాణాలు కోల్పోతారని... కొన్ని కుటుంబాలు నాశనమవుతాయని... అధికమొత్తం లో ధన నష్టం జరుగుతుందని... ఒక పెద్ద రాజకీయ సంక్షోభం రాబోతున్నదని... ఎంతో మంది ధనికులు రోడ్డుమీదకు వొస్తారని... చాలా మంది రాజకీయ నాయకులకి భవిష్యత్తు నాశమవుతుందని... ఎవరికి తెలీదు... కూతురి పెళ్లి అయ్యింది. అత్తారింటికి పంపేటప్పుడు కూతురికి, అల్లుడికి వాగ్దానం చేసాడు... కొంచం లేట్ అయినా ఆ ఫార్మ్ హౌస్ వాళ్ళకి దక్కేలాగా చూస్తానన్నాడు.

కూతురికి మాట ఇచ్చిన తరువాత ప్రభాకర్ రావు తనకి బాగా తెలిసిన ఒక పెద్ద లాయర్ ని పిలిపించాడు... అయన తనకి మంచి ఫ్రెండ్ కూడా... చాలా విషయాల్లో ఎన్నోసార్లు హెల్ప్ చేసాడు... ఆయన తలచుకుంటే ఏదైనా జరిగిపోతుంది... మంచి బుర్ర... ఐడియాస్ బాగా ఇవ్వగలడు...

ప్రభార్ రావు: నాకు మీ సలహా... సహాయం కావాలి...

లాయర్: ఏమిటో చెప్పు... ఆలోచిద్దాం...

ప్రభాకర్ రావు: నీకు రామచంద్రయ్య తెలుసుకదా...

లాయర్: ఎస్... బాగా తెలుసు...

ప్రభాకర్ రావు : ఆయనకీ హైదరాబాద్ లో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ వుంది. అది నాకు కావాలి...

లాయర్: కావాలి అంటే?

ప్రభాకర్ రావు : మా అమ్మాయి పెళ్ళికి కట్నంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను...

లాయర్(పెద్దగా నవ్వుతూ): అది జరిగే పని కాదు...

ప్రభాకర్ రావు : ఏం? ఎందుకని?

లాయర్: ఆయన అమ్మడు...

ప్రభాకర్ రావు : అమ్మేలాగా చేదాం... కావాలంటే చీఫ్ మినిస్టర్ లేదా సెంట్రల్ లెవెల్లో ప్రెషర్ పెడదాం... ఎట్టి పరిస్థితుల్లో అది నాకు కావాలి...

లాయర్: ఇంపాసిబుల్... నువ్వు దాన్ని గురించి మర్చిపో... అది కుదిరేపని కాదు... రామచంద్రయ్య అంటే ఎవరనుకున్నావు? బెదిరించి లాకోవడానికి ఆయన ఏదో ఆర్డినరీ పర్సన్ అన్నట్లు మాటలాడుతున్నావు... రామచంద్రయ్య... ఈ దేశం లో నీకెంత పలుకుబడి ఉందొ... ఆయనకు అంత కన్నా ఎక్కువ పలుకుబడి వుంది... మీ పార్టీ చీఫ్ కి మాత్రమే కాదు... దేశం లో వున్న రాజకీయ పార్టీస్ అన్నింటిలోనూ ఆయనకి మంచి ఫ్రెండ్స్ వున్నారు... ఆయనకీ ఏదైనా కొనడమేకాని... అమ్మడం తెలియదు... ఆ ఫార్మ్ హౌస్ ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు... కావాలంటే నువ్వు నీ కూతురికి ఇంకో 100 ఎకరాల ఫార్మ్ హౌస్ కొనిపెట్టు... అంతే కానీ రామచంద్రయ్య మీద ప్రెషర్ పెట్టడమనే ఆలోచన మానుకో...

ప్రభాకర్ రావు : నా కూతురు ఎంతో ఇష్టపడుతోంది... దాని కోరిక తీర్చడం నా భాద్యత...

లాయర్: ఇదేమి ఆషామాషీ వ్యవహారం కాదు... నువ్వు నీ జీవితంలో ఎంతోమందిని అదిలించి... బెదిరించి... లేపేసి... వాళ్ళ ఆస్తులని సొంతం చేసుకున్నావు... ఆ పద్దతి ప్రతిచోటా పనిచేయదు... ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది... అయన తనంతట అమ్మితే తప్ప ఆ ఫార్మ్ హౌస్ నీకు దక్కదు... ఆయన కి అమ్మాల్సిన అవసరం లేదు... నువ్వు పవర్ లో వున్నావు కాబట్టి ఏదైనా చెయ్యగలవనుకుంటే అది foolishness అవుతుంది... ఈ దేశం లో నువ్వు ఒక్కడివే పెద్ద వాడివి కాదు... నీలాంటి వాళ్ళుచాలా మంది వున్నారు... రామచంద్రయ్య నీకంటే చాలా పెద్ద వాడు... ఆయన జోలికి వెళ్ళవద్దు... నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా... ఆయనని టచ్ చేస్తే నాశనమవుతావు. నీకూతురికి నచ్చచెప్పుకో... వేరే ఏదైనా ఏర్పాటు చేసుకో...

ప్రభాకర్ రావు : నువ్వు నాకేదో మంచి సలహా ఇస్తావనుకుంటే... నన్నే భయపెట్టాలని చూస్తున్నావు... నేను వేరే వాళ్ళతో ట్రై చేస్తాను...

లాయర్: నామాట విను... ఆయన జోలికే వెళ్ళవొద్దు... అది పెద్ద డేంజర్...

ప్రభాకర్ రావు తన లాయర్ ఫ్రెండ్ పంపేసి... తన రియల్ ఎస్టేట్ బినామీ... సుధాకర్ ని పిలిచాడు...

ప్రభాకర్ రావు : నీకు రామచంద్రయ్య తెలుసుకదా...

సుధాకర్: తెలుసు...

ప్రభాకర్ రావు : ఆయనకి హైద్రాబాద్ లో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ వుంది... అది నాకు కావాలి...

సుధాకర్: అది చాలా కాస్ట్ ఉంటుంది... ఆ ఏరియా లో వున్నా రేట్ ప్రకారం కనీసం ఆ 75 ఎకరాల ఫార్మ్ హౌస్ విలువ దాదాపు 2000 crores పైనే ఉంటుంది...

ప్రభాకర్ రావు : ఎంతైనా సరే... ఆ ఫార్మ్ హౌస్ నాకు కావాలి... నా కూతురు పెళ్ళికి కట్నంగా ఇవ్వాలి...

సుధాకర్: ఎవరైనా ఒక పెద్ద మనిషిని మధ్యవర్తిత్వం చెయ్యమనండి... ఇది పెద్ద మనుషులతో వ్యవహారం... ఆయన ఎవరు అడిగితే... NO... చెప్పలేడో అలంటి వాళ్ళని పంపండి...

ప్రభాకర్ రావు కి ఈ ఐడియా బాగా నచ్చింది... లాయర్ కి... ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్... వీరిద్దరి మధ్య వున్న తేడా... లాయర్ కేసు గెలవగలమా లేదా అని ఆలోచిస్తాడు... రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎలా పని పూర్తిచేసుకోవాలో చూస్తాడు...

ప్రభాకర్ రావు తన కాబినెట్ కొలీగ్ కేశవరావు ని మధ్యవర్తిగా రామచంద్రయ్య వద్దకి పంపాడు... రామచంద్రయ్య ఆ ఫార్మ్ హౌస్ అమ్మకానికి లేదు... అది తన ఫామిలీ వాళ్ళకి చెందినది... ఎవరికి అమ్మడం జరగదని చాలా గట్టిగా చెప్పేసాడు... కేశవరావు "మీకెంత కావాలో చెప్పండి... నేనిప్పిస్తాను" అని అన్నాడు... దానికి రామచంద్రయ్య చిరునవ్వుతో "దేవుడు దయ వల్ల నా దగ్గర డబ్బు చాలా వుంది.ఆ ఫార్మ్ హౌస్ అమ్మకానికి లేదు. అది మా ఫామిలీ మెంబెర్స్ జాయింట్ ప్రాపర్టీ... వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడవున్నా... అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి అందరిని కలుసుకోవడానికి ఒక సెంటర్ పాయింట్" అని అన్నాడు... కేశవరావు వెనక్కి వచ్చి "నీకు ఆ ఫార్మ్ హౌస్ కావాలంటే... వేరే మార్గం లో ట్రై చెయ్యి... నేరుగా వెళితే పనికాదు" అని అన్నాడు...

ప్రభాకర్ రావు, రంగ రావు, సుధాకర్... ముగ్గురూ కలసి ఆలోచించసాగారు...

రంగారావు : మీకు కూడా కుదరడంలేదంటే... ఇదిచాలా కష్టం...

ప్రభాకర్ రావు : అలాని వొదలలేము... సాధించాలి... సుధాకర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి డీటెయిల్స్ తెచ్చాడు... చెప్తాడు వినండి...

సుధాకర్: ఈ ఫార్మ్ హౌస్ ల్యాండ్ ని రామచంద్రయ్య 50 ఏళ్ళ కిందట కొన్నాడు. అపుడు 25 ఎకరాలు తన పేరు మీద, ఇంకో 25 ఎకరాలు తన భార్య అన్నపూర్ణమ్మ పేరు మీద, మిగతా 25 ఎకరాలు... ఒక్కొక్కరికి 5 ఎకరాల చొప్పున తన అయిదుగురి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు... కాల క్రమేణా... రాంచంద్రయ్య, అన్న పూర్ణమ్మ వాళ్ళ వాటా 50 ఎకరాలని, పిల్లల పెళ్లప్పుడు... మనవలు... మనవరాళ్లు పుట్టినప్పుడు... వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు... ముని మనుమలు... ముని మనవరాళ్లు పుట్టినప్పుడు వ్రాసి ఇచ్చారు... ప్రస్తుతం రామచంద్రయ్య, ఆయన భార్య పేరు మీద రెండేసి ఎకరాలు మాత్రమే వున్నాయి... ఈ రోజున ఆ ఫార్మ్ హౌస్ కి చాలా మంది ఓనర్స్ వున్నారు... లీగల్ గా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే... వీళ్లందరి సంతకాలు... వేలిముద్రలు కావాలి... ఇంకో పెద్ద ప్రాబ్లెమ్ ఏమిటంటే... రామచంద్రయ్య పెద్ద కొడుకు ఇండియా లో ఉంటాడు... రెండో కొడుకు ఇంగ్లాండ్ లో ఉంటాడు... పెద్ద కూతురు కాలిఫోర్నియా లో ఉంటుంది... రెండో కూతురు టెక్సాస్ లో ఉంటుంది... మూడో కూతురు ఆస్ట్రేలియా లో ఉంటుంది... వీళ్ళ పిల్లలు రకరకాల చోట్ల వుంటారు... ఇప్పుడు కొంతమంది మునిమనవలు... మనవరాళ్లు కూడా వున్నారు... వాళ్లంతా ప్రస్తుతానికి మైనర్స్... అయినాకూడా చాలా మంది సంతకాలు పెట్టాలి... మనం వేరే పేరుమీద డాకుమెంట్స్ సృష్టిచలేము... అది చాలా పెద్ద రిస్క్... రామచంద్రయ్య గురించి రాష్ట్రంలో వున్న పెద్ద వాళ్ళనందరికి తెలుసు... దీనికి ఒక మార్గం వుంది... చాలా గట్టిగా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది... కానీ... చాలా పెద్ద క్రైమ్ చేయాల్సి ఉంటుంది... ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావాలంటే ఎవరెవరు సంతకాలు పెట్టాలో నా దగ్గర లిస్ట్ వుంది... నా ఎంక్వయిరీ లో వాళ్లంతా ఇంకో 15 రోజుల్లో వాళ్ళింట్లో ఒక పెళ్ళికి వొస్తున్నారు... వాళ్లంతా హైదరాబాద్ లో వున్నప్పుడే మనం డాకుమెంట్స్ తయారు చేసి ఎలాగైనా వాళ్ళతో సంతకాలు తీసుకోవాలి... అది ఒక్కటే మార్గం... వాళ్ళుండేది చాలా కొద్ది రోజులు మాత్రమే...

ప్రభాకర్ రావు: ఆ విషయం నాకు కూడా తెలుసు... ఆ టైం లో వాళ్ళఇంట్లో చాలా మంది వుంటారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు చాలా మంది వుంటారు... ఆటైం లో మనం వాళ్ళింటికి వెళ్లి వాళ్ళతో బలవంతం గా సంతకాలు తీసుకోవడం... ఇంపాసిబుల్... కుదరదు... నా దగ్గర ఒక ప్లాన్ వుంది... మనం ఒకేసారి అన్నిపనులు చేయలేము... 1. ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ కి ఎవరెవరు కావాలో వాళ్లంతా హైదరాబాద్ లోఉండాలి... 2. వాళ్ళందరిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి తీసుకెళ్లి సంతకాలు చేయించాలి... ఇది కుదిరేపని కాదు...

సుధాకర్: మనం వాళ్ళింట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి సంతకం చెయ్యమని బెదిరిస్తే?

ప్రభాకర్ రావు: వాళ్ళ ఫార్మ్ హౌస్ లో సెక్యూరిటీ చూసావా? మొన్న ఆయన మనవరాలి పెళ్లి కి ఈ వూళ్ళో వున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే వుంది... కిడ్నాప్ కుదరదు... రామచంద్రయ్య కి రాష్ట్రంలో చాలా పలుకుబడి వుంది... వాళ్ళని బెదిరించి పని పూర్తి చేసుకోవాలంటే అవ్వదు... వేరే రకంగా ఆలోచించాలి... ఆ ఫార్మ్ హౌస్ మనకి దక్కాలంటే, దాని వారసులెవ్వరు బతికి వుండకూడదు... ఒక్కడు బతికి వున్నా మనమందరం చస్తాము... వాళ్లంతా వచ్చేనెల హైదరాబాద్ పెళ్లి కి వచ్చినప్పుడు మనం పక్కాగా డాకుమెంట్స్ తయారు చేసి గవర్నమెంట్స్ రికార్డ్స్ లో ఫార్మ్ హౌస్ ఓనర్ షిప్ మార్చెయ్యాలి... ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ నీపేరు పేరు మీద, సదానంద్ పేరుమీద జరిగేలా చూసుకోవాలి... దాంతో అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం ఆ ఫార్మ్ హౌస్ మనదవుతుంది... ఇదంతా రిజిస్ట్రేషన్ కి కావలసిన వాళ్ళందరూ ఏరోజునైతే హైదరాబాద్ లో వుంటారో... ఆరోజున జరిగిపోవాలి... ఏ ఒక్కడు లేకపోయినా మన రిజిస్ట్రేషన్ పనికిరాదు... అందరూ ఇక్కడ ఉండటం అనేది చాలా ముఖ్యం. వాళ్లంతా ఈ పెళ్లి వస్తే వెంటనే మనం రంగంలోకి దిగి గవర్నమెంట్ రికార్డ్స్ మారేలాగా చూసుకోవాలి... ఆ తరువాత డాక్యూమెంట్స్ మీద, గవర్నమెంట్ రిజిస్టర్ లో సంతకాలు, వేలి ముద్రలు ఇంకోసారి తీసుకోవాలి. రెండు పనులు ఒకేసారి జరగవు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం వాళింట్లో రామచంద్రయ్య కి సహస్రమాస వృద్దుడు ఫంక్షన్ జరగబోతోంది... దానికి ఇప్పటినుంచే వాళ్ళు తమ ఫామిలీ లో అందరికి ఇంఫార్మ్ చేసి వాళ్లంతా ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు... కాబట్టి... మనం వచ్చే నెల ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ కి కావలసిన వాళ్లంతా హైదరాబాద్ వస్తే... ముందు మనం గవర్నమెంట్ రికార్డ్స్ మార్చెయ్యాలి... ఆ తరువాత వచ్చే సంవత్సరం వాళ్ళు ఇక్కడున్నపుడు డాకుమెంట్స్ మీద, అఫీషియల్ రికార్డ్స్ లోనూ వాళ్ళ సంతకాలు, వేలి ముద్రలు సంపాదించుదాం... ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్... వాళ్ళ చావులు ఒకే టైం లో జరిగితే అందరి అనుమానం మన మీదకొస్తుంది... కాబట్టి ఒక సంవత్సరం ముందు ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ అవ్వగొట్టి... ఒక సంవత్సరం తరువాత వాళ్ళ సంతకాలు, వేలి ముద్రలు తీసుకుంటే ఎవరికి అనుమానం రాదు. ఒకవేళ ఎవరైనా ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ గురించి అడిగితే... దాన్ని మనం ఒక సంవత్సరం కిందటే డబ్బిచ్చి కొన్నట్లు డాక్యూమెంట్స్ చూపించవచ్చు... ఇదంతా ప్లాన్ చేసుకోవడానికి మనకి కూడా టైం కావాలి...

మరుసటి నెల రామచంద్రయ్య గారింట్లో పెళ్ళికి తన పిల్లలు, మనవలు, మనవరాళ్లు వచ్చారు... ఆ టైం లో ప్రభాకర్ రావు మనుషులు ఆ పెళ్ళికి వెళ్లి అందరిని లెక్కించి... రిజిస్ట్రేషన్ కి కావలసిన వాళ్లంతా వూళ్ళో ఉన్నట్లు కంఫర్మ్ చెయ్యగానే...

1. రామచంద్రయ్య కి 150 కోట్ల రూపాయలు కాష్ రూపం లో 10 దఫాలుగా ఇచ్చినట్లు బ్యాక్ డేట్ తో డాక్యూమెంట్స్ తయారుచేశారు...

2. ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి కావలసిన డాకుమెంట్స్ అన్ని పకడ్బందీగా తయారుచేశారు. ఎటువంటి loophole లేకుండా లాయర్ ఫ్రెండ్ దగ్గరుండి చూసుకున్నాడు... ఆ డాకుమెంట్స్ లో రామచంద్రయ్య ఆ ఫార్మ్ హౌస్ ని రిజిస్ట్రేషన్ తరువాత కూడా తన ఆధీనంలోనే ఉంచుకొని ఒక సంవత్సరం తరువాత తమ ఫామిలీ ఫంక్షన్ పూర్తిఅయ్యాక జులై 2016 చివరికి హ్యాండోవర్ చేస్తానన్నాడని, ఈ సంవత్సరానికి తగిన రెంట్ కూడా ఇస్తానన్నాడని వ్రాసుకున్నారు... ఇది ప్రభాకర్ రావు లాయర్ బుర్రలోంచి పుట్టిన ప్లాన్... రిజిస్ట్రేషన్ అయినాకూడా ఫార్మ్ హౌస్ ఒక సంవత్సరం పాటు రామచంద్రయ్య ఆధీనంలో ఎందుకుందని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి ఈ పాయింట్ ని డాక్యూమెంట్ లో చేర్చారు...

3. రామచంద్రయ్య కుటుంబసభ్యులందరూ హైదరాబాద్ లో వున్న రోజున గవర్నమెంట్ రికార్డ్స్ లో ఫార్మ్ హౌస్ ownership మార్చేశారు...

ఇంక వాళ్ళందరి సంతకాలు వచ్చే సంవత్సరం వాళ్ళు ఇక్కడ 10 రోజులపాటు వున్నప్పుడు సేకరించాలి అని నిర్ణయించుకున్నారు... ఈ పనంతా హింస లేకుండా జరగదని వాళ్లందరికీ తెలుసు. ఖచ్చితమైన ప్లాన్నింగ్ చేసుకోవడానికే ఒక సంవత్సరం టైం వాడుకున్నారు... ఈ సంవత్సర కాలం లో వాళ్ళు చాలా ప్లాన్స్ వేశారు... కానీ ఏది కూడా నచ్చలేదు... అప్పుడు రసూల్ గ్యాంగ్ ని రంగంలో లోకి దింపారు... రసూల్ తనకి తెలిసిన వాళ్ళని ఆ ఫార్మ్ హౌస్ కి తోటలో పనివాళ్ల లాగా కొన్ని నెలల పాటు పంపి ఆ ఇంటి ప్లాన్స్, ఇంట్లో ఎప్పుడెప్పుడు ఎవరెవరుంటారు? ఆ ఫంక్షన్ టైం లో ఎంత మంది వుండే ఛాన్స్ వుంది? ఆ ఇంట్లోకి వెళ్లాలంటే అనువైన మార్గాలేవి? ఇలా చాలా డీటెయిల్స్ కనుక్కున్నారు... ఆ సమయం లోనే ఆ ఇంట్లో ఒక పెద్ద బేసెమెంట్ ఉందని... అందులో పెద్ద పెద్ద ఐరన్ సేఫ్, ఇతర బీరువాలు ఉన్నాయని... వాటిలో విలువైన వస్తువులు చాలా ఉంటాయన్న సమాచారం దొరికింది... అంతే రసూల్ పెద్ద ప్లాన్ వేసాడు... ముందుగా ఆ ఇంట్లో కి వెళ్లి ఆ ఇంట్లో వాళ్ళందరి సంతకాలు తీసుకొని... వాళ్ళందరి ని చంపేసి... ఆ ఇంట్లో వున్న ఐరన్ సేఫ్ లని పగలకొట్టి, అందులోవున్న వస్తువులు, ఇంట్లో వున్న వాళ్ళ ఒంటిమీద నగలు, ఇంకా ఆ ఇంట్లో దొరికే విలువైన వస్తువులు దోచుకొని... ఇదంతా ఒక బందిపోటు ముఠా డబ్బులు, నగలకు చేసిన పనిలాగా చిత్రీకరించి... ఫార్మ్ హౌస్ రిజిస్ట్రేషన్ విషయం అసలు బయటకి రాకుండా కాపాడుకొని... కొంత కాలం తరువాత ఆ బినామీ పేరుమీదున్న ఫార్మ్ హౌస్ ని కావ్య పేరుమీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోవాలని ప్లాన్ చేశారు...

ప్లాన్ ప్రకారం రసూల్ ఎంత మంది కావాలో రెడీ చేసుకున్నాడు... జితేందర్ కి చెప్పి జైల్లో ఈ పనికి కావాల్సిన వాళ్ళ లిస్ట్ తీసుకున్నాడు. ఆ లిస్ట్ ని ప్రభార్ రావు కి ఇచ్చాడు... ప్రభాకర్ రావు తన పలుకుబడి... అధికారం ఉపయోగించి చర్లపల్లి జైలునుండి ఆ రోజు రాత్రికోసం 17 మంది బయటకి వచ్చేలా ఏర్పాటు చేసాడు...

ఆ రోజు రానే వచ్చింది... రామచంద్రయ్య గారి సహస్రమాస వృద్ధుడు ఫంక్షన్ కి అందరూ వచ్చేసారు... ఇల్లంతా కిటకిటలాడుతోంది... ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ ఫార్మ్ హౌస్ లోనే వున్నారు... చాలామంది బంధువులు హైదరాబాద్ లో హోటల్స్ లోనూ... ఫ్రెండ్స్ ఇళ్లల్లో వున్నారు... ఇంకా చాలా మంది ఆ ఫంక్షన్ రోజుకొచ్చేలా ప్లాన్ చేసుకున్నారు... ఫార్మ్ హౌస్ అంతా లైట్స్ తో కళకళలాడుతోంది... సెక్యూరిటీ కూడా చాలా గట్టిగా వుంది... ఇంట్లో పనివాళ్ళు చాలా మంది వున్నారు... బయట ఊళ్ళ నుండి వంటవాళ్లు కూడా వచ్చారు...

ఆ దుర్ఘడియాలు రానే వచ్చాయి... అర్ధరాత్రి... 11 గంటల సమయం... ఇంట్లో అందరూ మెయిన్ హలో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు...

రసూల్ టీం లో చాలా మంది ఆ రోజు 8 గంటలకే వచ్చేసి ఫార్మ్ హౌస్ లో వెనకపక్క వున్న తోటలో బ్లాక్ కలర్ బట్టలు వేసుకొని మొహానికి మాస్క్ వేసుకొని మాటేసి కూర్చున్నారు... ఖచ్చితం గా 11 గంటలకి అందరూ ఇంటి వెనక నుంచి ఎటాక్ చెయ్యడానికి సిద్ధమయ్యారు. ముందుగా 20 మంది ఇల్లు చుట్టూ తిరిగి ముందు వైపు వచ్చి చీకట్లోంచే సైలెన్సర్ వున్న రివాల్వర్లు తో ఒక్క షాట్ లో ఇంటి ముందు వున్న సెక్యూటిరీ గార్డ్స్ ని ఆ ఇంటికి పెట్టిన లైటింగ్ సహాయంతో చంపేశారు... వెంటనే పక్కనే వున్న కార్ డ్రైవర్స్ ని క్లీనర్లు ని చంపేశారు... ఎప్పటికప్పుడు ఎంత మంది చనిపోయింది లెక్కచూసుకోసాగారు... దాంతో ఇంటి ముందు అంతా క్లియర్ అయ్యింది... మెయిన్ గేట్ ఓపెన్ చెయ్యడంతో దాదాపు 15 SUVs నిశ్శబ్దంగా హెడ్ లైట్స్ ఆఫ్ చేసుకొని లోపలి వచ్చాయి... అందులోంచి ఆగంతకులు దిగగానే ఇంటివెనకాల... పక్కల వెయిట్ చేస్తున్న వాళ్ళకి సిగ్నల్ ఇచ్చారు... వాళ్ళు చాలా చాకచక్యంగా తలుపులని చిన్న చిన్న బాంబులతో పేల్చేసి లోపలి వచ్చేసి ఇల్లంతా కమ్మేసారు... అదే టైం కి మెయిన్ డోర్ ని కూడా ఒక బాంబు తో పేల్చేసి ఇంట్లోకి చొరబడ్డారు... దాదాపు 100 మంది దాకా వున్నారు... వీళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు కేకలు పెట్టారు... వచ్చిన వాళ్ళు తుపాకులు బయటకి తీసి గాల్లోకి వార్నింగ్ షాట్స్ పేల్చడం మొదలెట్టేసరికి వాళ్లంతా కామ్ గా ఉండిపోయారు... ఒక టీం సైలెంట్ గా బేసెమెంట్ లోకి వెళ్ళింది... జితేందర్ ఆ టీం లోనే వున్నాడు... అక్కడ పని అంతా జితేందర్ supervision లోనే జరిగింది... జితేందర్ అవసరాన్ని బట్టి పైకి కిందకి తిరుగుతున్నాడు...

ఒక్కనిమిషంకూడా వేస్ట్ చేయకుండా ఇంట్లో వున్న వాళ్ళందరిని వెతికి మెయిన్ హలో కి తీసుకొచ్చారు... ఒకడు రామచంద్రయ్య దగ్గరకెళ్ళి "ఈ డాకుమెంట్స్ మీద, ఆ రిజిస్టర్ లోనూ సంతకాలు చెయ్యండి" అని అన్నాడు... దానికి ఆయన వప్పుకోలేదు... వాళ్ళు పెద్దగా ఆలోచించకుండా అందరికన్నా చిన్న పిల్లని పట్టుకొని ఆమె గొంతు కోసేశారు... అది చూసి కొంతమంది స్పృహ తప్పారు... అయినాకూడా ఆగంతకులు ఆగకుండా చిన్న చిన్న పిల్లల్ని చంపసాగారు... ఇది చూసి తట్టుకోలేక రామచంద్రయ్య... అన్నపూర్ణమ్మ... వాళ్ళ పిల్లలు అందరూ డాకుమెంట్స్ మీద, రిజిస్టర్ లోనూ సంతకాలు చేసి వేలిముద్రలు వేసేసారు... అప్పటిదాకా ఆ ఆగంతకులు చిన్న పిల్లల్లని చంపుతూనే వున్నారు. అన్ని సరిగ్గా ఉన్నాయని తృప్తి పడ్డ వెంటనే ఆ ఆగంతకులు ఆ ఇంట్లో వాళ్ళందరిని తుపాకులతో నిర్దాక్షిణ్యం గా చిన్న పెద్ద అని చూడకుండా చంపేశారు... చివరిగా రామచంద్రయ్య ని చంపారు... ఆయన కళ్ళ ముందే ఆయన వంశం మొత్తం రాలిపోయింది. ఆ తరువాత ఆ ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి ఎవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యాక ఆ ఇల్లంతా దోచుకున్నారు... చనిపోయినవాళ్ల వంటిమీద బంగారు నగలన్నీ వలిచేశారు... వాటన్నిటిని పెద్ద పెద్ద బాగ్స్ లో నింపేశారు... ప్రతి గది వెతికి దొరికిన కాష్, నగలు, బంగారం బాగ్స్ లో నింపేశారు... అలా నిండి పోయిన బాగ్స్ తీసుకొని కొంత మంది SUV ఎక్కి వెళ్లిపోయారు... మిగిలినవాళ్లు ఇంట్లోనూ... బయట... అంతా ఒక్క అంగుళం కూడా వొదలకుండా ఎవరూ ప్రాణాలతో లేరని నిర్ధారించుకున్నారు... ఇంతలో బేసెమెంట్ లోకెళ్లిన వాళ్ళు ముందుగా ఐరన్ సేఫ్ ల హింగెస్ కి ఎక్సప్లోజివ్ మెటీరియల్ అతికించి ఐరన్ సేఫ్ డోర్స్ ఊడిపోయేలాగా పేల్చేశారు... ఆ ఐరన్ సేఫ్ ల నిండా బంగారం, నగలు, డబ్బులు వున్నాయి... వాటిని తమ వెంట తెచ్చుకున్న బాగ్స్ లో నింపేశారు... అక్కడే వున్న బీరువాల లాక్స్ ని తుపాకుల తో పేల్చేసి... గునపాల తో పొడిచి తలుపులు తెరిచారు... వాటన్నిటిలో డాకుమెంట్స్ వున్నాయి... బంగారం కానీ... డబ్బులు కానీ లేవు... దాంతో వాళ్ళు ఆ బీరువాలని ఇష్టం వచ్చినట్లు అటూ ఇటూ పడేసి వాటిలో వున్న డాక్యూమెంట్స్ కొన్నింటిని చింపేసి మిగతా వాటిని బేసెమెంట్ అంతా ఇష్టం వచ్చినట్లు విసిరేసి వెళ్లిపోయారు... ఆ ఆగంతుకులు వెళ్ళగానే ఇంకో 30 మంది టీం వచ్చి ఆ ఇల్లంతా గాలించి ఎటువంటి క్రైమ్ సీన్ ఎవిడెన్స్ లేకుండా... తుపాకీ బులెట్ షెల్స్, కాట్రిడ్జిస్, ఇతర క్రైమ్ ఆర్టికల్స్ అన్నింటిని తీసుకొని... పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి ఆధారాలు దొరక్కుండా చేసి వెళ్లిపోయారు... ఇదంతా ఒక 4 గంటలలో జరిపోయింది... ఒక వంశం మొత్తం తుడుచుపెట్టుకుపోయింది... ప్రపంచానికి ఇదో బందిపోటు ముఠా చేసిన పనిలాగా కనిపిస్తుంది... ఈ క్రైమ్ లోనే ఇంకో క్రైమ్ కూడా జరిగిందని ఎవరికి తెలిసే అవకాశం లేదు... ప్రభాకర్ రావు అందుకు కావలిసిన పొలిటికల్ పవర్, పోలీస్ డిపార్టుమెంటు రిసోర్సెస్ ని పూర్తిగా వాడుకున్నాడు...

చర్లపల్లి జైలు నుండి వచ్చిన వాళ్లంతా తెల్లారేలోపల మళ్ళీ జైల్లోకి వెళ్లిపోయారు... అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనుకున్నారు... కానీ... వాళ్ళు తుపాకులతో కాల్చేటప్పటికే ఒకామె స్పృహతప్పి పడిపోయింది... ఆమె నిండు గర్భవతి. ఆమెని కూడా వాళ్ళు కాల్చారు... అయితే ఆమె వెంటనే చనిపోలేదు... పోలీస్ వాళ్ళు వచ్చినతరువాత ఆమెని అంబులెన్సు లో హాస్పిటల్ కి తరలించారు... ఆమె దారిలో ఒక పాపని కని మరణించింది... ఇప్పుడు ఆ వంశంలో ఒక వారసురాలు కొత్తగా పుట్టుకొచ్చింది... ఆ పిల్లని పంజాబ్ లో వున్నవాళ్ళ బంధువులెవరో పెంచుకుంటున్నారు... ప్రభాకర్ రావు ఆ పిల్ల గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడు... కానీ... ఇప్పటిదాకా ఆ పాప డీటెయిల్స్ దొరకలేదు... శత్రు శేషం... రుణ శేషం వుండకూడదంటారు...

ఇది వింటున్న రవీంద్ర, అతని తో పాటున్న పోలీస్ ఆఫీసర్లు అందరూ నిర్ఘాంతపోయారు... అహంకారి అయిన ఒక రాజకీయ నాయకుడు తలచుకుంటే ఏమేమి చేయగలడో అర్ధమయ్యింది... ఒకరి అత్యాశ కి ఇంకొకరి వంశమంతా బలైపోయింది... చాలా సేపు ఎవ్వరూ మాట్లాడలేదు... అందరూ సైలెంట్ గా ఉండిపోయారు... అందరికి వాళ్ళు విన్నది మైండ్ లో రిజిస్టర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది...

రవీంద్ర: ఆ క్రైమ్ సీన్ ని క్లీన్ చేసింది ఎవరు?

జితేందర్: మేము వెళ్ళాక ఇంకో టీం వచ్చింది. అందులో కొంతమంది పోలీస్ డిపార్టుమెంటు వాళ్ళుకూడా వున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవరికి ఒక్క ఎవిడెన్స్ కూడా దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు... అక్కడ పడ్డ బులెట్ షెల్స్, కాట్రిడ్జిస్ ఇతర మెటీరియల్ అంతా క్లీన్ చేశారు... ఇంటి బయటకూడా పెద్ద పెద్ద లైట్స్ వేసుకొని మరీ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేశారు... అందుకే ఆ తరువాత వచ్చిన పోలీస్, CBI టీమ్స్ కి ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ దొరకలేదు... పైగా రిపోర్ట్స్ లో ఇది ఒక బందిపోటు ముఠా పని అన్నట్లు ఉండడంతో అందరూ ఆ యాంగిల్ లో ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేశారు... రాజకీయ పలుకుబడితో ఈ కేసు అసలు ముందుకెళ్ళకుండా ప్రభాకర్ రావు జాగ్రత్త పడ్డాడు... మీరు ఇందాక బులెట్ షెల్స్ దొరికాయంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది...

రవీంద్ర: మీ క్రైమ్ వెపన్స్ ని ఏం చేశారు?

జితేందర్: రసూల్ గ్యాంగ్ రివాల్వర్లు, కత్తులు గునపాలు, ఇతర ఆయుధాలన్నింటినీ తీసుకెళ్లి ఒక ఫౌండ్రి లో వాటన్నిటిని కరిగించేసారు... పోలీస్ డిపార్టుమెంటు కి వెపన్ కానీ... బులెట్ షెల్స్ కానీ దొరక్కుండా జాగ్రత్తపడ్డారు...

రవీంద్ర: ఆ ఇంట్లో దోచుకున్న డబ్బు, నగలు, బంగారం ఎక్కడ ఉంచారు?

జితేందర్: అపార్టుమెంట్స్ లో... వాటి తాళాలు మీ దగ్గరున్నాయి...

రవీంద్ర: ఆ రోజు నీతో పాటు జైల్లోంచి బయటకి వచ్చిన వాళ్ళ పేర్లు?

జితేందర్ వాళ్ళ పేర్లు చెప్పాడు... కరుణాకర్ ఆ డీటెయిల్స్ నోట్ చేసుకున్నాడు...

రవీంద్ర: వీళ్లంతా ఇంకా జైల్లోనే ఉన్నారా?

జితేందర్: నలుగురు రిలీజ్ అయ్యారు...(అంటూ వాళ్ళ పేర్లు చెప్పాడు)

రవీంద్ర(కరుణాకర్ తో):వీళ్ల గురించి ఎంక్వయిరీ చేసి... నిఘా పెట్టండి... వీళ్ళు మన దృష్టినుండి తప్పించుకుపోకూడదు... ఎప్పుడు కావాలంటే అప్పుడు పిక్ అప్ చెయ్యడానికి రెడీ గా ఉండండి...

రవీంద్ర(జితేందర్ తో): ఆ తరువాత ఏమైంది?

జితేందర్: ఆ ఫార్మ్ హౌస్ ఇంకా పోలీస్ ఆధీనంలోనే వుంది... అందువల్ల రామచంద్రయ్య గారి మనుషులు ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు... ప్రభాకర్ రావు గారి బినామీలు కూడా కామ్ గా వున్నారు... ఎప్పుడైతే ఆ ఫార్మ్ హౌస్ పోలీస్ డిపార్టుమెంటు రిలీజ్ చేస్తుందో అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది... అది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఎప్పుడో అమ్ముడు పోయిందన్నవిషయం... అప్పుడు ఏదైనా గొడవ జరిగితే చూసుకోవడానికి ప్రభాకర్ రావు పెద్ద ప్లాన్ తో రెడీ గా వున్నాడు...

రవీంద్ర: ఏమిటా ప్లాన్?

జితేందర్: అది నాకు తెలీదు... కానీ ప్లాన్ మాత్రం రెడీ గా వుంది...

రవీంద్ర: ఆ ఫార్మ్ హౌస్ ఎవరెవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది?

జితేందర్: సుధాకర్ - ప్రభాకర్ రావు రియల్ ఎస్టేట్ బిజినెస్ కి బినామీ గా ఉంటాడు... సదానంద్ --- ప్రభాకర్ రావు ఇండస్ట్రీస్ మేనేజ్ చేస్తూ ఉంటాడు... ఇద్దరూ చాలా పెద్ద మనుషులు... సొసైటీ లో బాగా పేరు,పలుకుబడి వున్నవాళ్లు.

రవీంద్ర: ఆల్రైట్... ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం... మళ్ళీ మాట్లాడుకుందాం...


PART - 13 - THE PIECES FALLING IN THE PLACE

రవీంద్ర ఒక వారం రోజులుగా జితేందర్ ని ఇంటరాగేషన్ చేసాడు... చాలా విషయాలు తెలిసాయి... ఒకరోజు ఉదయం ఆరు గంటలప్పుడు ఫోన్ వచ్చింద... DGP ఫోన్ చేసాడు "ఇవ్వాళ మార్నింగ్ 7:30 కి హోమ్ మినిస్టర్ గారింట్లో మీటింగ్ వుంది... నువ్వు కూడా జాయిన్ అవ్వు..." అని అన్నాడు...

DGP హోమ్ మినిస్టర్ ఇంటికి 7 గంటలకే వచ్చేసాడు...

DGP : గుడ్ మార్నింగ్ సర్

ప్రభాకరరావు: గుడ్ మార్నింగ్... ఆ జితేందర్ గురించి ఏమైనా తెలిసిందా? వాడు ఎక్కడున్న వెతికి పట్టుకొని ముందుగా నా దగ్గరకి తీసుకొని రండి...

DGP : తప్పకుండా సర్... ఎక్కడా లీడ్స్ దొరకడం లేదు... వాళ్ళు వాడిన కార్ ని మా డిపార్టుమెంటు వాళ్ళు తీసుకొచ్చి ఆఫీస్ లో పెట్టారు... టైర్ ని గన్ తో షూట్ చెయ్యడం తో కార్ ఆగింది... ఇది తప్పకుండా కిడ్నాప్ కేసు... ఎవరో ఎత్తుకొని వెళ్లారు... జితేందర్ తో చాలా మందికి అవసరముంది...

ప్రభాకరరావు : పోలీస్ డిపార్టుమెంటు వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేశారేమో?

DGP : మా వాళ్ళకేమి అవసరముంటుంది?

ప్రభాకరరావు: ఏదైనా కేసు లో ఇంటరాగేట్ చెయ్యడానికి తీసుకెళ్లారేమో?

DGP : జితేందర్ జైల్లో వున్నాడు... వాడిని ఇంటరాగేట్ చెయ్యాలంటే నేరుగా జైలు కెళ్తారు కానీ... అర్ధరాత్రి వాడు జైల్లోంచి బయటకి వచ్చాక ఎందుకు కిడ్నాప్ చెయ్యడం?

ప్రభాకరరావు : పోలీస్ లు నేరుగా జైలు కెళ్ళి ఇంటరాగేట్ చేస్తే... మనందరికీ తెలిసిపోతుంది కదా... జితేందర్ ని ఎవరు ఏ కేసు లో ఇంటరాగేట్ చేసినా నాకేమి అభ్యంతరం లేదు... పోలీస్ కనుక ఆ రామచంద్రయ్య కేసు లో వాడిదగ్గరికి వెళితే మాత్రం చాలా ప్రమాదం... వాడు ఎట్టి పరిస్థితిలో నోరు విప్పడు... నాకా నమ్మకం వుంది... కానీ... పోలీస్ డిపార్టుమెంటు కి ఆ రామచంద్రయ్య కేసు లో వాడి పాత్ర కూడా ఉన్నదన్న డౌట్ వస్తే మాత్రం చాలా కష్టం...

DGP : మీరేమి ఖంగారు పడకండి... నా ఉద్దేశం ప్రకారం జితేందర్ ని ఎవరైనా తన శత్రువులు ఎత్తుకొని వెళ్లి ఉండొచ్చుకదా...

ప్రభాకరరావు: మా వాళ్ళు ఆ యాంగిల్ లో కూడా ఎంక్వయిరీ చేస్తున్నారు... కొంచం టైం పడుతుంది... ఇంతలో వాడు కనుక దొరికితే వెంటనే నా దగ్గరికి తీసుకొని రావాలి... ఒకవేళ రవీంద్ర ఏమైనా తీసుకెళ్ళడా?

DGP : మీకెందుకు ఆ డౌట్ వచ్చింది?

ప్రభాకరరావు: రవీంద్ర ఆ ఫార్మ్ హౌస్ కేసు హేండిల్ చేస్తున్నాడు... వాడు ఫార్మ్ హౌస్ కెళ్ళి క్రైమ్ సీన్ అంతా చెక్ చేసాడని తెలిసింది. ఆ తరువాత జితేందర్ బయటకి రాగానే మాయమయ్యాడు... ఒకవేళ రవీంద్రకి ఆ ఫార్మ్ హౌస్ లో ఏదైనా క్లూ దొరికిందా అని ఒక అనుమానం... ఎందుకో వాడిని నమ్మ బుద్ధి కావడం లేదు... ఇప్పుడు నాకు అందరిమీద డౌట్స్ వస్తున్నాయి... నువ్వన్నట్లు జితేందర్ ని వాడి శత్రువులో, నా శత్రువులో తీసుకెళ్ళినట్లైతే... ఈ పాటికి వాడిని చంపెయ్యడమో... లేదా నాకు ఫోన్ కాల్ రావడమో జరిగేది... పైగా శంకరం కూడా మిస్సింగ్... అదే నా వర్రీ... జితేందర్ భార్య... కొడుకు సేఫ్ కదా...

DGP : జితేందర్ వైఫ్, కిడ్... ఇద్దరూ సేఫ్... జితేందర్ మిస్ అవ్వగానే అతని వైఫ్ కి ఇంఫార్మ్ చేసి జాగ్రత్తగా వుందామన్నాము. కొడుకు డూన్ స్కూల్ లో సేఫ్ గా వున్నాడు... పిల్లాడిని కాపలా కాస్తున్నవాళ్ళని అలెర్ట్ చేసాము... ఆ ఫార్మ్ హౌస్ లో మా వాళ్ళు, మీ వాళ్ళు కలసి క్రైమ్ సీన్ అంతా ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా క్లీన్ చేసేసారు... క్లూ దొరికే ఛాన్స్ లేదు. ఇన్నాళ్ల తరువాత రవీంద్రకి వేరే క్లూ దొరుకుతుందని నేను అనుకోను. ఒకవేళ ఏదైనా దొరికినట్లైతే డిపార్టుమెంటు కి ఇంఫార్మ్ చేసి వెంటనే యాక్షన్ కూడా తీసుకునేవాడు... ఆ కేసు లో జెన్యూన్ గానే ఎటువంటి డెవలప్మెంట్ లేదు...

ప్రభాకరరావు: గుడ్. జితేందర్ తో పాటు వాడి ఫామిలీ కూడా మిస్ అయితే అది ఇంకో పెద్ద ప్రాబ్లెమ్... జితేంద్ర ని చూపించి అతని భార్యని... ఫామిలీ ని చూపించి జితేందర్ ని టార్చర్ పెడతారు. నాకు ఇంకో పెద్ద ప్రాబ్లెమ్ వచ్చింది... అభిలాష్ కి తన ఆఫీస్ లో ఒక సేఫ్ వుంది. అందులో చాలా కాన్ఫిడెన్షియల్ & సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వుంది... మొన్న అభిలాష్ హత్య జరిగిన తరువాత ఆ సేఫ్ ఖాళీ గా కనిపించిందని రవీంద్ర చెప్పాడు... ఆ తరువాత అభిలాష్ కంపెనీ లో పనిచేసే CFO అరవింద్ ఆ సేఫ్ లోంచి ఏమేమి పోయాయో చెప్పాడు...

DGP : ఆ సేఫ్ లో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చా...

ప్రభాకరరావు: 6 లాప్ టాప్స్, 54 మొబైల్ ఫోన్స్, దాదాపు 300 కి పైగా USA గవర్నమెంట్ ఇష్యూ చేసిన సోషల్ సెక్యూరిటీ నంబర్స్ కి చెందిన డాక్యూమెంట్స్... వేరే ఇతర దేశాల ఆఫీషియల్ సిటిజెన్ షిప్ డాకుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్సుస్, 500 కి పైగా క్రెడిట్ కార్డ్స్, ఫైనాన్సియల్ ఇంస్ట్రుమెంట్స్, అమెరికన్ ఎక్సప్రెస్ ట్రావెల్లెర్స్ చెక్స్, యురొ బాండ్స్, దాదాపు 60 కి పైగా USA లోఉన్న బ్యాంకు అకౌంట్స్ డీటెయిల్స్... కేమెన్ ఐలాండ్స్... సెయింట్ కిట్స్... వర్జిన్ ఐలాండ్స్... బెల్జియం... బహామా... జార్జియా... స్పెయిన్... ఉక్రెయిన్... మలేసియా... తైవాన్... సింగపూర్... ఇలా చాలా కంట్రీస్ లో వున్న బ్యాంకు అకౌంట్స్ కి సంభందించిన డాక్యూమెంట్స్... ఇంకా చాలా ప్రాపర్టీస్ డీటెయిల్స్ వున్నాయి... కొంత ఫారిన్ ఎక్స్చేంజి కూడా వుంది... దాదాపు 15 పాస్ పోర్ట్స్ కూడా వున్నాయి...

DGP : ఇవన్నీ మీకు సంభంధించినవేనా...

ప్రభాకరరావు: అన్నీ కాదు... వీటిలో 75% నా ఫ్రండ్స్, బిజినెస్ పార్టనర్స్, పొలిటికల్ కొలీగ్స్... వాళ్లకి చెందినవి... అభిలాష్ మా అందరి ఫైనాన్సియల్ అఫైర్స్ ని జాగ్రత్త గా డీల్ చేసేవాడు. ఇంత వరకు నా ఫ్రెండ్స్ కి ఎవరికి ఈ డాక్యూమెంట్స్ మిస్ అయినట్లు తెలీదు...

DGP : ఆ డాక్యూమెంట్స్ మీద మీ ఫ్రెండ్స్ పేర్లు, అడ్రస్... ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయా...

ప్రభాకరరావు: నో... అవన్నీ వేరేవాళ్ళ పేరు మీద వున్నాయి... కానీ... ఆ అకౌంట్స్ అన్నింటిని అభిలాష్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆపరేట్ చేస్తాడు. USA లో బ్యాంకు అకౌంట్స్ ఆపరేట్ చెయ్యాలి అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్స్ చాలా అవసరం... అవి లేకుండా పని జరగదు...

DGP : ఇంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కి తప్పకుండా బ్యాక్ అప్ వుండే ఉంటుంది...

ప్రభాకరరావు: వుంది... ట్విన్ బ్యాక్ అప్ సిస్టం... లాప్ టాప్స్ లో స్టోర్ చేసాడు... క్లౌడ్ లో కూడా వుంది. ఆ లాప్ టాప్స్ కూడా ఆ సేఫ్ లాకర్ లోనే వున్నాయి. అవి కూడా పోయాయి...

DGP : నార్మల్ గా... సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ తమ కంప్యూటర్స్ ని Encrypt చేస్తూ వుంటారు... వాటి లోకి లాగ్ ఇన్ అవ్వడం ఎవరికి కుదరదు... కాబట్టి వాటిలోని ఇన్ఫర్మేషన్ సేఫ్ గానే ఉంటుంది... పైగా ఆ డేటా క్లౌడ్ లోకూడా సేవ్ అయ్యింది కాబట్టి ప్రాబ్లెమ్ ఏమి ఉండదు. మీ వాళ్ళని రిట్రీవ్ చేయమనండి...

ప్రభాకరరావు: ఆ లాప్ టాప్స్ కి ఒక సెక్యూరిటీ ఫీచర్ వుంది... అందులోకి లోకి ఎవరైనా లాగ్ ఇన్ అయితే... వెంటనే ఒక ప్రోగ్రాం ఆక్టివేట్ అయ్యి... ఆ లాప్ టాప్ ఫిజికల్ లొకేషన్ ని మాకు తెలియచేయడమే కాకుండా... ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? వారి IP అడ్రస్, వాళ్ళు ఏ ఏ ఫైల్స్ ని ఓపెన్ చేశారు? ఏమేమి చేశారు? ఇలా అన్ని డీటెయిల్స్ ని ఒక సిస్టం ఆడిట్ ట్రయిల్ మాకు వెంటనే వచ్చేలాగా ఏర్పాటు వుంది... ఎవరో కానీ ఆ ఆరు లాప్ టాప్స్ ని ఓపెన్ చేసేసారు... మాకు రావలసిన వాళ్ళ IP అడ్రస్, ఫిజికల్ లొకేషన్ డీటెయిల్స్ రాలేదు... అభిలాష్ ఆఫీస్ లో TELE PRESENSE రూమ్ వుంది. దాన్ని జనరల్ గా ఓవర్సీస్ క్లయంట్స్ తో వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవడానికి కి వాడతారు... అందులో 70 ఇంచెస్ LED స్క్రీన్ వుంది... ఆ లాప్ టాప్ ఓపెన్ చేసినవాళ్లు ఆ కంపెనీ CTO, COO, CFO లకి ఒక SMS పంపారు... "GET YOUR ASSES INTO TELE PRESENCE ROOM" వాళ్లంతా ఆ రూమ్ లోకి వెళ్లేసరికి... వాళ్ళు ఎవరో కానీ... వీళ్ళు చూస్తూ ఉండగానే ఆ లాప్ టాప్స్ ని ఓపెన్ చేసి... అన్ని రకాల సిస్టం ప్రొటొకాల్స్ ని breach చేసి... లోకల్ డ్రైవ్ లో పాస్ వర్డ్ తో ప్రొటెక్ట్ చేసిన అన్ని ఫైల్స్... ఒకేసారి ఓపెన్ చేసేసి వాటిని బ్యాక్ అప్ తీసుకున్నారు... తరువాత వాళ్ళు అందరూ చూస్తూ ఉండగానే క్లౌడ్ అకౌంట్ ఓపెన్ చేసి... అందులో ఎంతో కాలంగా ఉన్న డేటా మొత్తం HIGH SPEED FTP వాడి... వేరే చోటికి నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసేసారు... దాదాపు 12 PETA bytes (అంటే 12,000 Tera Bytes) డేటా... అదంతా ట్రాన్స్ఫర్ అవ్వగానే క్లౌడ్ అకౌంట్స్ లో ఉన్న డేటా మొత్తం Erase చేసేసి.. ఆ క్లౌడ్ అకౌంట్స్ ని డెలీట్ కూడా చేసేసారు. చివరిగా ఒక మెసేజ్ కూడా పెట్టారు "HAVE A NICE DAY" ఆ మెసేజ్ 70 ఇంచెస్ స్క్రీన్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిచింది... ఒక రకంగా చెప్పాలంటే... అభిలాష్ కంపెనీ వర్క్ డీటైల్స్ అన్ని వాళ్ళ దగ్గరున్నాయి... ఆ కంపెనీ ఆ డీటెయిల్స్ లేకుండా క్లయింట్స్ తో డీల్ చెయ్యడం చాలా కష్టం... వాళ్ళు ఎవరో... ఎక్కడుంటారో... తెలీదు... భయమేస్తోంది... ఈ సిట్యుయేషన్ ని ఎలా డీల్ చెయ్యాలో చెప్పగలరా?

DGP : మా సైబర్ క్రైమ్స్ డిపార్టుమెంటు ని వెంటనే రంగం లోకి దింపుతాను... వాళ్ళు ట్రేస్ చేస్తారు... దాని రిజల్ట్స్ ముందుగా మీకే ఇస్తారు... మీరు ఎలా చెపితే అలా ప్రొసీడ్ అవుతాం... మీ అల్లుడి గారి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ని ఒక్కసారి నా దగ్గరకి పంపండి... మా సైబర్ క్రైమ్స్ డిపార్టుమెంటు వాళ్ళని పరిచయం చేస్తాను... వాళ్లంతా కలసి పనిచేసేలా చూసుకుంటాను. ఈ విషయం లో మనం లేట్ చెయ్యకూడదు... రవీంద్ర ని పర్సనల్ గా హేండిల్ చెయ్యమంటాను...

ప్రభాకరరావు: రవీంద్ర వొద్దు... నువ్వు... లేదా వేరే ఎవరికైన ఈ పని అప్పచెప్పు...

DGP : మనం ఈ విషయాన్ని డిపార్టుమెంటు లో హై లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సీక్రెట్ గా ఉంచలేము... వాళ్ళకి ఏదో రకంగా తెలిసిపోతుంది... మనం రవీంద్ర ని కూడా ఇన్వాల్వ్ చెయ్యడం మంచిది...

ప్రభాకరరావు: నాకు ఎందుకో రవీంద్ర నీకు అన్ని విషయాలు చెప్పడం లేదని నా అనుమానం...

DGP : మీకా డౌట్ ఎందుకొచ్చింది?

ప్రభాకరరావు: ఈ మధ్య రవీంద్ర తరచుగా న్యూ ఢిల్లీ వెళుతున్నాడు... అక్కడ సమర్ పాల్ సింగ్ అనే ఆఫీసర్ తో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నాడు... ఈ మధ్య వాళ్లిద్దరూ కలసి IB ఆఫీసర్ ని కలిసారని తెలిసింది... ఇది మీకు తెలుసా?

DGP : తెలుసు... తన టూర్ రిపోర్ట్ లో ఈ విషయం వ్రాసాడు. రవీంద్ర ఆ ఫార్మ్ హౌస్ కేసు ని డీల్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కి చీఫ్... కాబట్టి అఫీషియల్ కెపాసిటీ లో చాలా మందిని చాలా కేసులు గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు...

ప్రభాకరరావు: రీసెంట్ గా IB వాళ్ళ చేత యేవో సాంపిల్స్ ని అనలైజ్ చేయించాడని తెలిసింది...

DGP : అది నార్మల్... మేము రెగ్యులర్ గా IB వాళ్ళకి సాంపిల్స్ పంపి రిపోర్ట్స్ తెప్పిచుకుంటాము...

ప్రభాకరరావు: రవీంద్ర ఫార్మ్ హౌస్ లో క్రైమ్ సీన్ సెర్చ్ చేసిన రోజు రాత్రి న్యూ ఢిల్లీ వెళ్లి సమర్ పాల్ సింగ్ తో కలసి పర్సనల్ గా IB లో ఫోరెన్సిక్ డిపార్టుమెంటు వాళ్ళనికలసి యేవో సాంపిల్స్ ఇచ్చి సీక్రెట్ గా అనలైజ్ చేయించాడని నాకు తెలిసింది... ఇది ఆఫీషియల్ ఛానల్ లో జరగలేదు... IB ఆఫీస్ లో పనిచేస్తున్న నా మనిషి ఒకడు ఈ విషయం చెప్పాడు... ఆ రోజు ఫోరెన్సిక్ డిపార్టుమెంటు హెడ్ కి రవీంద్ర తో కానీ, సమర్ పాల్ సింగ్ తో కానీ ఎటువంటి ఆఫీషియల్ అపాయింటుమెంట్ లేదు. వాళ్ళ సాంపిల్స్ ని అనలైజ్ చేసిన డీటెయిల్స్ ఆఫీషియల్ రికార్డ్స్ లో లేదు. ఆ తరువాత వెంటనే ఇక్కడ సారథి అనే ఒక డ్రగ్ డీలర్ ని అరెస్ట్ చెయ్యడం... ఎటువంటి కేసు పెట్టకపోవడం... నైట్ డ్యూటీ సత్యం అనే వాడు రవీంద్ర ని కలవడం... ఆ తరువాత ఎప్పుడైతే జితేందర్ బయటకి వచ్చాడో వెంటనే మాయమయ్యాడు... రెండు రోజుల క్రితం సారథి పోలీస్ కస్టడీ లోంచి బయటకి వచ్చాడు... మీకు ఈ విషయాలు తెలుసా?

DGP(తెల్లమొహం వేసి) : ఈ విషయాలు నాకు తెలియవండి... వెంటనే రవీంద్ర ని కనుక్కుంటాను...

ప్రభాకరరావు: వొద్దు... అడిగితే వాడికి అనుమానం వచ్చి అలెర్ట్ అవుతాడు... నాకు వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని... సర్వీస్ నుండి సస్పెండ్ చెయ్యాలని కోరికగా వుంది...

ప్రభాకర్ రావు తన అల్లుడి సహాయంతో చాలా సైబర్ క్రైమ్స్ చేసాడు... ఇప్పుడు వాళ్లెవరో చేసిన పనికి వొణికిపోతున్నాడు...వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా హోమ్ మినిస్టర్ సెక్రటరీ వచ్చి కమిషనర్ రవీంద్ర వచ్చాడని చెప్పాడు... ప్రభాకర్ రావు అతడిని లోపలి పంపమన్నాడు...

రవీంద్ర: గుడ్ మార్నింగ్ (అంటూ ఇద్దరికీ విష్ చేసాడు)

ప్రభాకరరావు: Have a seat... ఎక్కడిదాకా వచ్చింది ఆ ఫార్మ్ హౌస్ మర్డర్స్ కేసు?

రవీంద్ర: చాలా కష్టం గా వుండండి... అన్ని అనుమానలేకాని... కాంక్రెట్ గా ఏవిధమైన ఎవిడెన్స్ దొరకడం లేదు... నా అనుమానం ప్రకారం ఇది బందిపోటు ముఠా పని లాగా లేదు...

ఈ మాట అంటూ హోమ్ మినిస్టర్ రియాక్షన్ ని చాలా జాగ్రత్తగా అబ్సర్వ్ చేసాడు...

ప్రభాకరరావు( సీట్లో అనీజీ గా కదులుతూ.. కొంచం నెర్వస్ గా): మీకా డౌట్ ఎందుకొచ్చింది?

రవీంద్ర: ఈ హత్యలన్నీ చాలా సాఫిస్టికేటెడ్ గన్స్ తో చేసినవి... GLOCK, Smith & Wesson, Colt లాంటి వి వాడారు. నార్మల్ గా అయితే బందిపోటు ముఠా కి ఇలాంటి కాస్టలీ వెపన్స్ కొనే స్తోమత ఉండదు. వాళ్ళు ఎక్కువగా Katta... Country Revolver వాడతారు. అందుకనే ఇది బందిపోటు ముఠా పని కాదేమోనని ఒక డౌట్... పూర్తిగా కంఫర్మ్ చెయ్యలేను... నేను పర్సనల్ గా ఆ క్రైమ్ సీన్ చెక్ చేసాను... క్రిమినల్స్ ఎటువంటి క్లూస్ వదల్లేదు... నా కెందుకో పోలీస్ లు కూడా ఇన్వొల్వె అయ్యారేమోనని నా అనుమానం...

DGP : This is a very serious allegation... do you have any proof of department's involvement?

రవీంద్ర: No Sir... That's not what I mean... సెర్వింగ్ ఆఫీసర్స్ అని కాదు నా ఉద్దేశ్యం... మన రాష్ట్రం లో, దేశం లో చాలా మంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వున్నారు... ఈ క్రిమినల్స్ వాళ్ళ హెల్ప్ ఏమైనా తీసుకొని ఉండవచ్చని నా అనుమానం... I am not suspecting any of my colleagues... ఆ క్రైమ్ సీన్ అంతా చాలా క్లీన్ గా వుంది... ఇది ఒక్క క్రిమినల్స్ పనిలాగాలేదు... ఇంకో సంగతి ఏమిటంటే... పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చాలా వేగ్ గా వున్నాయి... అన్ని డెడ్ బాడీస్ ని చాలా త్వరగా క్లియర్ చేసేసి బంధువులకి అప్పగించారు... పోస్ట్ మార్టం సరిగ్గా జరగలేదోమోనని ఒక అనుమానం... ఎటువంటి ఆధారం లేదు... ఎందుకైనా మంచిదని అనఫీషియల్ గా నేను కూడా ఆ క్రైమ్ సీన్ లోంచి కొన్ని సాంపిల్స్ తీసుకొని IB వాళ్ల చేత అనలైజ్ చేయించాను... పాత రిపోర్ట్స్ కి లేటెస్ట్ రిపోర్ట్స్ కి పెద్ద తేడా ఏమి లేదు. ఈ కేసు లో చాలా డౌట్స్ వున్నాయి... కానీ ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ దొరకడం లేదు...

DGP : రామచంద్రయ్య చాలా పెద్ద మనిషి... ఆ టైం లో మాకు అన్ని చోట్ల నుంచి చాలా ప్రెషర్ వచ్చింది... ప్రయారిటీ మీద క్లియర్ చేసి బాడీస్ ని హ్యాండోవర్ చేసాము...

ప్రభాకరరావు(కొంచం గంభీరంగా): ఆల్రైట్... మీరు మీ స్టైల్ లో ఇన్వెస్టిగేట్ చెయ్యండి... నాకు పైనుండి చాలా ప్రెషర్ వస్తోంది... పైగా అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంకో 7 నెలల్లోనే... ఈ లోపున ఈ కేసు క్లోజ్ అవ్వగలిగితే నాకు అదో తృప్తి... రామచంద్రయ్య నాకు బాగా తెలిసిన వ్యక్తి... వాళ్ళ బంధువులు నన్ను రెగ్యులర్ గా అప్ డేట్ అడుగుతూ వుంటారు...

రవీంద్ర: Sure sir... I will do my best...

ప్రభాకరరావు: ఈ జితేందర్ అనే వాడు జైలునుండి తప్పించుకున్నాడు... వాడి మూమెంట్స్ ఏమైనా తెలిసాయా...

రవీంద్ర: ఇంకా లేదండి... 3 లెవెల్స్ లో BOLO ఆర్డర్స్ ఇష్యూ చేసాము... ఇంకా ఎక్కడా సర్ఫేస్ అవ్వలేదు...

ప్రభాకరరావు:BOLO... అంటే?

రవీంద్ర: BE ON LOOK OUT... 3 లెవెల్స్ లో వెతుకుతున్నాము... 1. సిటీ లెవెల్... 2. డిస్ట్రిక్ట్ లెవెల్... 3.స్టేట్ లెవెల్... ఈ జితేందర్ అనే వాడు జైలు బ్రేక్ ఎలా చేసాడో తెలియలేదు. ఎంక్వయిరీ నడుస్తోంది...

ప్రభాకరరావు: మరి శంకరం సంగతి?

రవీంద్ర(కొంచం confuse అయినట్లు నటిస్తూ.... ఇద్దరివైపూ చూస్తూ ): శంకరం? వీడెవడు?

ప్రభాకరరావు, DGP ఏమి మాట్లాడలేదు. రవీంద్ర కూడా మళ్ళీ అడగలేదు... ప్రభాకర్ రావు కి అంతా అయోమయంగా వుంది... రవీంద్ర కి నిజం గా శంకరం గురించి తెలీదా... లేక నాటకమాడుతున్నాడా... ఒకవేళ నిజం గానే జితేందర్ వీడి దగ్గర లేడా ??? ఇంకా ఏదైనా అడిగితే రవీంద్రకి అనుమానం వచ్చే ఛాన్స్ ఉందని వెంటనే టాపిక్ మార్చేసాడు...

ప్రభాకరరావు: మీరు వచ్చేవారం లో అమెరికా వెళుతున్నారని తెలిసింది... మీ ట్రిప్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా?

రవీంద్ర: అవును సర్... మా అమ్మాయి Princeton లో MBA పూర్తిచేసుకుంది... Graduation Ceremony కి వెళుతున్నాను... జస్ట్ 4 డేస్ మాత్రమే.. ఇవ్వళ నైట్ నేను ఢిల్లీ వెళతాను... రేపు సండే... నాకు కొంచం పర్సనల్ పనివుంది... Monday & Tuesday... ఢిల్లీ లో యూనియన్ హోమ్ మిస్టర్, హోమ్ సెక్రటరీ తో రెండు రోజుల ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ వుంది... Tuesday నైట్ ఢిల్లీ నుండి New York వెళ్లి... మళ్ళీ అక్కడ Saturday మార్నింగ్ బయలుదేరి Sunday నైట్ హైదరాబాద్ వస్తాను...

ప్రభాకరరావు: మీరు ఒక్కరే వెళుతున్నానురా? మీ వైఫ్ వెళ్లడం లేదా?

రవీంద్ర(నవ్వుతూ): ఆమె ఆల్రెడీ అక్కడేవుంది... 4 మంత్స్ అయ్యింది వెళ్లి...

ప్రభాకరరావు (నవ్వుతూ): ఓకే. గుడ్ లక్... హవె నైస్ ట్రిప్...

రవీంద్ర ఇద్దరికీ సెల్యూట్ కొట్టి బయటకి వచ్చేసాడు...

ప్రభాకరరావు: ఇప్పుడు వీడు చెపిందంతా నువ్వు నమ్ముతావా...

DGP : ఎస్... పూర్తిగా... ఈ సంగతులన్నీ నాకు ముందే చెప్పాడు...

ప్రభాకరరావు: ఎందుకైనా మంచిది... వీడి వెనుక ఒకడిని పంపించండి... వీడెక్కడెక్కడి వెళతాడు... ఎవరెవరి కలుస్తాడా నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి... ఇవ్వాళ రాత్రి నుండి... మళ్ళీ నెక్ట్ ఆదివారం హైదరాబాద్ వచ్చేదాకా రవీంద్ర కి తెలియకుండా ఒకడిని పంపండి...

DGP(కొంచం ఖంగారుగా): డిపార్టుమెంటు వాడు వొద్దు సర్... రవీంద్ర వెంటనే గుర్తుపడతాడు... పెద్దగా ఉపయోగం ఉండదు... ప్లీజ్ మీ వాళ్ళనెవరినైనా పంపండి...

ప్రభాకరరావు: That's good idea... మావాణ్ని పంపుతాను...

DGP అక్కడినుండి బయలుదేరాడు... కార్ లో వెళుతూ మనసులో "ఒక పోలీస్ కమిషనర్ ని షాడో చేయడం చాలా పెద్ద బాడ్ ఐడియా... పైగా రవీంద్ర ని ఫాలో అవ్వడం అంటే కొరివితో తలా గోక్కోవడం లాంటిది... తనని ఎవరు ఫాలో అయ్యినా రెండు నిమిషాల్లో కనిపెటేస్తాడు... అక్కడనుండి... వాడిని నరకం చూపిస్తాడు..." ఎవడు వెళతాడో కానీ వాడు తిరిగిరాడు... ఈ వారం రోజుల్లో వాడు ఆత్మహత్య చేసుకోవడం గారంటీ... అందుకే డిపార్టుమెంటు వాడిని బలిచేయ్యడం ఇష్టం లేక వేరే వాడిని పంపమన్నాడు... ప్రభార్ రావు కి ఈ విషయంతెలీదు...

రవీంద్ర ఒక మూడు రోజుల ముందు సీతాపురం లో రఘురాం కి కరుణాకర్ చేత ఫోన్ చేయించాడు... "నా పేరు కరుణాకర్ నేను పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో CI గా పనిచేస్తునాను. కమిషనర్ గారు మిమ్మల్నిరామచంద్రయ్య గారి కేసు విషయం లో ఉన్న డెవలప్మెంట్ ని మీతో సీక్రెట్ కలసి మాట్లాడాలనుకుంటున్నారు... మీరు వచ్చే ఆదివారం న్యూ ఢిల్లీ రాగలరా? అక్కడైతే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది... ఇక్కడ హైదరాబాద్ లో కలిస్తే చాలా మందికి తెలిసే అవకాశముందని ఈ మీటింగ్ ఢిల్లీ లో ఏర్పాటు చేసాము. ఇది కొంచం అర్జెంటు... ఈ కేసు సాల్వ్ చెయ్యడానికి మీ సహాయం చాలా అవసరం... మీరు ప్రస్తుతానికి వంటరిగా రండి... మీకు అడ్రస్ పంపిస్తాను" వెంటనే న్యూ ఢిల్లీ లో లోధి కాలనీ లో ఒక అడ్రస్ SMS చేసాడు...

రఘురాం వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి కాల్ డీటెయిల్స్ చెప్పి వచ్చిన SMS ని మాధవ్ కి ఫార్వర్డ్ చేసాడు... రఘురాం ఢిల్లీ లో వెళ్ళవలసిన అడ్రస్ ని మాధవ్ ఎంక్వయిరీ చేసాడు... అది ఒక గవర్నమెంట్ క్వార్టర్స్... అందులో Foreign Ministry లో పనిచేస్తున్న ఒక IFS Officer ఉంటాడు... ఆయన భార్య గాయత్రీ AIIMS లో Cardiovascular Surgeon గా పనిచేస్తోంది... ఆమె రవీంద్ర చెల్లెలు... ఒక గంట తరువాత మాధవ్ రఘురాం కి ఫోన్ చేసి భయమేమీ లేదు... న్యూ ఢిల్లీ వెళ్లి కమిషనర్ ని కలవమన్నాడు...

రవీంద్ర శనివారం రాత్రి హైదరాబాద్ రిపోర్ట్ కి బయలుదేరాడు... ORR ఎక్కేలోపల తన కార్ ని ఎవరో ఫాలో చేస్తున్నారన్న డౌట్ వచ్చింది... ఒక రెండు నిమిషాల్లో అది కంఫర్మ్ అయ్యింది... ఎయిర్పోర్ట్ చేరగానే తనని ఫాలో అవుతన్న కార్ లోంచి దిగిన వ్యక్తిని 3 సెకండ్స్ పాటు చూసాడు... అయిదు అడుగులా 9 అంగుళాల ఎత్తు.. మీడియం బిల్ట్... జీన్స్ ప్యాంటు... టీ షర్ట్... స్పోర్ట్స్ షూస్... ఓన్లీ హ్యాండ్ లగ్గేజ్... ఇలా అన్ని డీటెయిల్స్ గమనించేసాడు... వాడు తన వెనకాలే బోర్డింగ్ పాస్ తీసుకోవడం... తన డిపార్చర్ గేట్ కి కొంచం దూరం లో కూర్చోవడం... వాడు డిపార్టుమెంటు వాడు కాదు... బహుశా ప్రభాకర్ రావు పంపివుంటాడని అనుకున్నాడు... ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాడు...

రవీంద్ర మరుసటి రోజు ఉదయం లోధీ కాలనీ లో ఒక హై క్లాస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్... టైపు 8... లో కాఫీ తాగుతూ బయటకి చూసాడు... నిన్న హైదరాబాద్ నుండి వెంబడిస్తున్నవాడు కనిపించాడు... నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి లోధీ కాలనీ దాకా ఫాలో చెయ్యడానికి వాడిన కార్ నే ఇప్పుడు కూడా వాడుతున్నాడు... " కనీసం కార్ ని కూడా మార్చాలని తెలియని వాడిని పంపించారు... వీడితో ఆడుకోవడం అంటే ఒక పెద్ద ప్రొఫెషనల్ ఇన్సల్ట్..." అని గొనుకుంటూ టైం చూసుకున్నాడు.... రఘురామ్ రావడానికి ఇంకో గంట టైం వుంది... ఈ లోపల ఈ తోక ని వదిలించుకోవాలి... రఘురాం రావడం వీడు చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది. తన చెల్లెలు కార్ తీసుకొని వాడికి కనపడేటట్లు కార్ విండో ఓపెన్ చేసుకొని అక్కడికి దగ్గరలోనే ఉన్న సమర్ పాల్ ఇంటికి వెళ్ళాడు... కార్ దిగి లోపలి వెళుతూ చెక్ చేసాడు... తోక తన వెనకాలే వచ్చాడు... ఇంట్లో కి వెళ్లి సమర్ తో "నా వెనకాల ఎవడో వున్నాడు. వాడిని మీ ఇంటి ముందు వదలి వెళతాను. ఒక 5 గంటల పాటు వాడు ఎక్కడికి వెళ్లకుండా చూస్తావా..." అని సమర్ వాళ్ళింటి బ్యాక్ సైడ్ నుండి బయటకి వచ్చి సందుల్లోంచి మెయిన్ రోడ్ చేరుకొని ఆటో ఎక్కాడు... రఘురాం కి ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి... ప్రిపేర్ అవ్వసాగాడు...

అదే సమయంలో రఘురాం లోధీ కాలనీ లో రవీంద్ర పంపిన అడ్రస్ చేరుకొని బయట ఉన్న గార్డ్ కి తన పేరు చెప్పగానే లోపలి పంపాడు... బ్రిటిషర్లు కట్టిన ఇండిపెండెంట్ క్వార్టర్స్... పెద్ద పెద్ద సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ కి మాత్రమే ఇస్తారు... వరండా లోకి వెళ్ళగానే ఒకామె వచ్చి "ప్లీజ్ కం ఇన్... నా పేరు గాయత్రి... రవీంద్ర మా అన్నయ్య... ఇప్పుడే వచ్చేస్తాడు... మీరు ఇలా కూర్చోండి.." అంటూ సోఫా చూపించింది... ఇంతలోనే రవీంద్ర కూడా వచ్చేసాడు... వస్తూనే "ఐ యామ్ సారీ.. లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కారణాలవల్ల నేను న్యూస్ పేపర్ కరెస్పాండంట్ అని చెప్పాను " అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ రఘురాం ముందు కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో గాయత్రీ ఇద్దరికీ కాఫీ తెచ్చింది... కాఫీ తాగాక...

రవీంద్ర: ఫార్మ్ హౌస్ మర్డర్స్ కేసు లు కొంత డెవలప్మెంట్ జరిగింది. ఆడిటైల్స్ మీ చెప్పాలని పిలిచాను. ఈ కేసు లో చాలా పెద్ద వాళ్ళు ఇంవోల్వ్ అయ్యారని నా గట్టి నమ్మకం. వాళ్ళ కారణం వల్లే ఈ కేసు ఇన్నాళ్లు అసలు ముందుకు వెళ్ళలేదు. నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. వాటిని డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని విషయాలు తెలిసాయి... ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసి మీ హెల్ప్ తీసుకోవాలని ఇక్కడికి పిలిపించాను. హైదరాబాద్ లో అయితే అందరికి తెలిసే ప్రమాదం ఉందని జాగ్రత్త పడుతున్నాను... మీకు ఈ కేసు గురించి ఏమేమి తెలుసో చెప్పగలరా?

రఘురాం: పెద్దగా ఏమి తెలియదు... మేము హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రావు గారిని, DGP గారిని చాలా సార్లు కలసి హెల్ప్ చెయ్యమని అడిగాము... వాళ్ళు మాకు ప్రతిసారి హామీ ఇస్తారు కానీ, ఈ కేసు విషయం లో ఇంతవరకు ఎవరిని కనీసం అరెస్ట్ కూడా చెయ్యలేదు...

రవీంద్ర: OK... నా ఇన్వెస్టిగేషన్ లో కొన్ని విషయాలు తెలిసాయి... అవి మీకు చెప్తాను... జాగ్రత్తగా వినండి... మనం ఇప్పుడు డిస్కస్ చేసిన సంగతులు ఎవరికి తెలియకూడదు... తెలిస్తే ఈ కేసు అసలు ఎప్పటికి సాల్వ్ కాదు. ఎవ్వరు అరెస్ట్ అవ్వరు... కాబట్టి మీ మన మీటింగ్ ని కాన్ఫిడెన్షియల్ ఉంచండి...

రవీంద్ర చెప్పడం మొదలెట్టాడు... హైదరాబాద్ లో మర్డర్స్... శరత్ ఆక్సిడెంట్... పేపర్ లో ప్రకటన... ప్రొఫెసర్ శ్రీనివాస్ తో మీటింగ్... శరత్ డెడ్ బాడీ మిస్సింగ్... ఎయిర్పోర్ట్ లో శరత్ బాడీ ని ప్రైవేట్ ఏరోప్లేన్ లో అమెరికా తీసుకెళ్లడం... బోస్టన్ లో శరత్ ఫునెరల్ ఫొటోస్... ఎయిర్పోర్ట్ ఎంప్లాయ్ శరత్... మాధవ్... రేవతి... శివ... ప్రసాద్... లను గుర్తుపట్టడం... ఢిల్లీ IIT... సీతాపురం లో ఎంక్వయిరీ చెయ్యడం... కేసు ఫైల్ ని పూర్తిగా స్టడీ చెయ్యడం... ఫార్మ్ హౌస్ ని సెర్చ్ చెయ్యడం... దొరికిన క్లూస్... వాటిని అనలైజ్ చేయడం... (జితేందర్, శంకరం ల పేర్లు బయట పెట్టలేదు)... ఇన్వెస్టిగేట్ చెయ్యడం... ఫార్మ్ హౌస్ మీద దుండగుల ఎటాక్... డాక్యూమెంట్స్ మీద, రిజిస్టర్ లో సంతకాలు పెట్టించడం... వాళ్ళందరిని చంపెయ్యడం... ఇల్లంతా దోచుకోవడం... బందిపోటు ముఠా చేసినట్లు పోలీస్ కంప్లయింట్ రాసుకోవడం... అన్ని డీటెయిల్స్ చెప్పాడు...

రవీంద్ర: ఇప్పటికిప్పుడు మేము ఎవరినైనా అరెస్ట్ చెయ్యాలంటే మా దగ్గర ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేదు... కనీసం మీకు కేసు పురోగతి గురించి చెప్పడం నా భాద్యత... మీకు నేను ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా షాకింగ్ గా ఉంటుంది... నా అనుమానం ప్రకారం ఈ హత్యలన్నింటికీ ప్రధాన కారణం ఫార్మ్ హౌస్... దాని కోసం కొంత మంది ఒక వంశం మొత్తాన్ని నాశనం చెయ్యడానికి కూడా వెనకాడలేదని నా నమ్మకం. అయితే... ఎవరిని అరెస్ట్ చెయ్యాలన్న ఎవిడెన్స్ కావాలి... ప్రస్తుతం అది మా దగ్గర లేదు... కానీ... నేను త్వరలోనే సరైన ఆధారాలు సంపాదించగలమని నా నమ్మకం... ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని ఇంత దూరం రప్పించాను... ఐ యాం సారీ...

రఘురాం చాలా సేపు మాట్లాడలేదు. నెమ్మదిగా తేరుకొని...

రఘురాం: మాకు ఈ కేసు సాల్వ్ అవుతుందని నమ్మకం ఎప్పుడో పోయింది. మీరు ఈ కేసు ని ఇంత దూరం తీసుకొని రావడమే చాలా పెద్ద విషయం. ఆ హత్యలన్నీ ప్రాపర్టీ కోసమే జరిగాయని మాకు ఆరోజే తెలుసు...

రవీంద్ర(షాక్ అయ్యి): నిజమా... మీకు ఎలా తెలిసింది?

రఘురాం: మీరు నాతో ఇంత ఆనెస్ట్ గా అన్ని విషయాలు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను... ఆరోజు ఉదయం 7:30 నిమిషాలకి నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఫార్మ్ హౌస్ లో జరిగిన విషయం చెప్పాడు. నమ్మలేక పోయాను... నేను వెంటనే బయలుదేరి సాయంత్రం కల్లా హైదరాబాద్ చేరుకున్నాను... అప్పటికే హైదరాబాద్ లో ఉంటున్న మావాడు ఒకడు అక్కడికి చేరుకున్నాడు... వాడు సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా పెద్ద పోసిషన్ లో వున్నాడు. తన పలుకుబడి వుపయోగించి వాడు కూడా క్రైమ్ సీన్ ని చెక్ చేసాడు... మా వాడు తన కెమెరా తో ఆ క్రైమ్ సీన్ ని పూర్తిగా ఫొటోస్ తీసాడు... ఇల్లంతా తిరిగి ప్రతి అంగుళం కవర్ చేసేసాడు... బేసెమెంట్ ని కూడా కవర్ చేసేసాడు... అక్కడ మాకు రెండు పెద్ద క్లూస్ దొరికాయి... 1. రామచంద్రయ్య గారి చేతి బొటన వేలికి గవర్నమెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు వాడే స్ టాంప్ పాడ్ ఇంకు వుంది... అది ఆయన ఒక్కడి చేతికే కాదు... ఆయన ఫామిలీ మెంబెర్స్ చాలా మంది చేతి బొటన వేళ్ళకి వుంది... మావాడు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తగా అందరి చేతి వేళ్ళని చెక్ చేసి వాటి ఫొటోస్ తీసాడు... 2. రామచంద్రయ్య గారి వొంటి మీద, ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారి ఒంటిమీద EXIT WOUNDS (బులెట్ ఒక మనిషి కి తగిలి అది బాడీ లోనే ఉండిపోతే అయ్యే గాయాన్ని Bullet Wound అని అంటారు. ఆ బులెట్ మనిషి శరీరం లో ప్రవేశించినప్పుడు Entrance wound కలుగుతుంది. అదే బులెట్ కనుక ఒకవైపు నుంచి మనిషి బాడీ లోకి ప్రవేశించి ఇంకో వైపు నుండి బయటకి వెళ్ళిపోతే అయ్యే గాయాన్ని Exit Wound అని అంటారు) వున్నాయి... మీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లోకాని... లేదా కేసు ఫైల్ లో కానీ వీటి గురించి అసలు ప్రస్తావించలేదు. నేను ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ని గవెర్నమెంట్ హాస్పిటల్ కి తరలించేసారు. మావాడు అప్పుడే నాకు జరిగింది చెప్పాడు. నేను ఇంగ్లాండ్ లో ఇన్నర్ టెంపుల్ లా స్కూల్ లో చదివాను. I am a Barrister. ఇంత వరకు ఎక్కడా ప్రాక్టీస్ చెయ్యవలసిన అవసరం రాలేదు. నాకు సివిల్ అండ్ క్రిమినల్ లా లో ఎక్స్పర్ట్ నాలెడ్జి వుంది. మా మామయ్యా కి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాపర్టీస్ వున్నయ్యో వాటి లిస్ట్ నా దగ్గరున్నది... ఆ ప్రాపర్టీస్ కి తరచు title మారిపోతూ ఉంటుంది. ఏ ప్రాపర్టీ ని అమ్మితే ఎవరెవరి సంతకాలు, వేలిముద్రలు కావాలో లేటెస్ట్ లిస్ట్ ఎప్పుడూ నాదగ్గర రెడీ గా ఉంటుంది. మావాడు చెప్పినదాన్ని బట్టి ఏ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి వీళ్ళ వేలిముద్రలు కావాలో తెలుసుకోవడానికి అంతగా టైం పట్టలేదు... వెంటనే మేము హైదరాబాద్ లో రిజిస్ట్రార్ ఆఫీస్ లో చెక్ చేసాము... ఆ రోజున కానీ, ఆ తరువాత ఇప్పటివరకు కానీ ఆ ఫార్మ్ హౌస్ కి చెందిన ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగలేదు... ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది. అలా ఇంత వరకు జరగలేదు. Something Wrong... నాకు ఇంకో అనుమానం వచ్చింది... నేను ఒక క్రిమినల్ లాగా ఆలోచించాను... అప్పుడు ఒక సందేహం వచ్చింది... ఒకవేళ గవర్నమెంట్ రికార్డ్స్ ఆల్రెడీ మార్చేసి... ఇప్పుడు జస్ట్ డాక్యూమెంట్స్, అఫిషియల్ రికార్డ్స్ మీద సంతకాలు, వేలిముద్రలు తీసుకొని ఉంటే? ఆ యాంగిల్ లో ఆలోచించాను... ఫార్మ్ హౌస్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావాలంటే... రామచంద్రయ్య ఫ్యామిలీ లో ఎవరెవరు కావాలి? వాళ్లంతా హైదరాబాద్ లో ఏ ఏ తారీకుల్లో వున్నారో చెక్ చేసాము... ఇక్కడే నాకు ఇంకో డౌట్ వచ్చింది... ఒక రోజు రాష్ట్ర మంత్రి కేశవరావు మా మామయ్యా దగ్గరికి వచ్చి ఆ ఫార్మ్ హౌస్ ని హోమ్ మినిస్టర్ ప్రభాకర్ రావు కొనాలనుకుంటున్నాడు. మీకెంత కావాలో చెపితే అంత ఇప్పిస్తానన్నాడు... మా మామయ్యా ఆ ఫార్మ్ హౌస్ అమ్మకానికి లేదని గట్టిగా చెప్పేసాడు... ఆ రోజు నెను అక్కడే ఉన్నాను... ఇది ఆ హోమ్ మినిస్టర్ చేరిన పనేమోనని అనుమానం వచ్చి... ఆ రోజు తరువాత ఎప్పుడెప్పుడు... ఏ ఏ సందర్భాల్లో రామచంద్రయ్య గారి ఫ్యామిలీ మెంబెర్స్ అంతా హైదరాబాద్ లో ఉన్నారో చెక్ చేసాము... రామచంద్రయ్య గారు తన మనవరాలి పెళ్లి ఆ ఫార్మ్ హౌస్ లో చేసాడు... ఆ రోజు ఆయన ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారు... ఆ తరువాత మళ్ళీ వాళ్ళు మా మామయ్యా ఫంక్షన్ కోసం వచ్చారు... ఆయన పిల్లలు ముగ్గురు ఫారిన్ లో వుంటారు. ఆయన పిల్లందరూ ఒక్కచోట ఉండాలంటే అది ఒక పెద్ద ఫంక్షన్ అవ్వాలి... మా మామయ్య మనవరాలి పెళ్లి రోజున రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరిగిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సంపాదించడానికి చాలా కష్టపడ్డాము... అదే రోజున గవర్నమెంట్ రికార్డ్స్ మార్చేశారు... తరువాత సంతకాలు, వేలిముద్రలు తీసుకొని ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళందరిని చంపేసి అదో బందిపోటు ముఠా పనిగా చిత్రీకరించారు... కానీ, వాళ్ళు చేసిందంతా వృథా... ఆ ఫార్మ్ హౌస్ ఎప్పటికి వాళ్ళు సొంతం చేసుకోలేరు...

రవీంద్ర: ఏమి? ఎందుకని?? వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసుకొని డాక్యూమెంట్స్ అన్ని పక్కాగా తయారుచేసుకున్నారు... పైగా డబ్బులు కూడా దక్కినట్లు రామచంద్రయ్య గారు స్వయంగా సంతకం చేసిన రిసీట్ కూడా వాళ్ళ దగ్గరుంది...

రఘురాం(సన్నగా నవ్వుతూ): I know that... but in that process they committed blunders... మా దగ్గర ప్రూఫ్ వుంది...

రవీంద్ర: మీరు కూడా ఒక లాయర్... మీకు బాగా తెలిసుంటుంది... కోర్ట్ లో సివిల్ కేసు తేలాలంటే దాదాపు 25 ఏళ్ళు పడుతుంది...

రఘురాం: ఈ కేసు కోర్ట్ దాకా వెళ్ళదు... 5 నిమిషాల్లో తేలిపోతుంది... ప్రస్తుతం ఆ ఫార్మ్ హౌస్ మీ డిపార్టుమెంటు ఆధీనం లో వుంది... మీరు దాని ఎవరో ఒకరికి అప్పగించాలి... ఆ రోజున ఆ ఫార్మ్ హౌస్ మళ్ళీ మాకే దక్కుతుంది... of that I am confident... జస్ట్ ఫైవ్ మినిట్స్... వాళ్ళ లాయర్ కి మా దగ్గరున్న ఆధారాలు చూపిస్తే... ఆ ఫార్మ్ హౌస్ ప్రస్తుతం ఎవరిపేరుమీద వుందో... వాళ్ళు మీద మేము... చీటింగ్... మాస్ మర్డర్స్ కేసు ని ఫైల్ చేసి లోపలి పంపుతాము... తరువాత వాళ్ళ వెనుక ఉన్నవాళ్ళ సంగతి చూస్తాము...

రవీంద్ర: మీ దగ్గరున్న ఆధారాలు నేను చూడవచ్చా...

రఘురాం: No... I will not divulge that information...

రవీంద్ర: మీరు ఇందాక ఎగ్జిట్ ఊండ్స్ గురించి చెప్పారు... మా రికార్డ్స్ లో అలా లేదు... ఆ డెడ్ బాడీస్ కి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి... అక్కడ నిజం గా ఎగ్జిట్ ఊండ్స్ ఉన్నాయో లేదో ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది?

రఘురాం ఒక నిమిషం అలోచించి తనతో పాటు తెచ్చుకున్న ipad లో ఉన్న ఫొటోస్ చూపిస్తూ...

రఘురాం: ఇవి మీకు నేను అనాఫిషల్ గా చూపిస్తున్నాను... మీకు ఎటువంటి కాపీ ఇవ్వను... These pictures are FOR YOUR EYES ONLY

రవీంద్ర ఆ ipad తీసుకొని ఒక్కో ఫోటో ని చాలా జాగ్రత్తగా చూసాడు... అవి చాలా క్లియర్ గా ఉన్నాయి... ఒక ప్రొఫెషనల్ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ తీసిన ఫొటోస్ లాగా ఉన్నాయి.. రామచంద్రయ్య ఒక చాలా ఖరీదైన కస్టమ్ మేడ్ రెక్లయినర్ లో కూర్చొని వున్నాడు... ఆయన వంటి మీద చాలా బుల్లెట్స్ గాయాలున్నాయి... ఇది చూసిన వెంటనే ఆ ipad ని పక్కన పెట్టి వెళ్లి తన ఆఫీస్ లాప్ టాప్ తీసుకొని వచ్చి అందులో రామచంద్రయ్య గారి పోస్టుమార్టం రిపోర్ట్ ఓపెన్ చేసి చూసాడు... ఆ రిపోర్ట్ ప్రకారం మూడు బుల్లెట్స్ గుండెకి తగలడం తో మరణించినట్లు వ్రాసి వుంది... రఘురాం చూపించిన ఫొటోస్ లో దాదాపు 12 బులెట్ వూడ్స్ కనిపిస్తున్నాయి... రవీంద్ర ipad ఫొటోస్ ని pinch zoom చేసి జాగ్రత్తగా చూసాడు... అదే రకంగా అన్నపూర్ణమ్మ గారి ఫొటోస్ కూడా పరిశీలించి చూడగా అర్ధమయ్యింది... ఆ ఎగ్జిట్ వూడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో... రవీంద్ర ipad తిరిగి రఘురాం కి ఇచ్చేసి ఆయన వైపు చూసి...

రవీంద్ర(సూటిగా రఘురాం వైపు చూస్తూ): రామచంద్రయ్య గారి కాలర్ బోన్ పైన ఉన్న కండ కి తగిలిన బులెట్.... ఆయన ఎడమ చేతి కింద ప్రాంతంలో కండకి తగిలిన బుల్లెట్స్ వల్ల ఈ ఎగ్జిట్ ఊండ్స్ కలిగాయి... ఆ బుల్లెట్స్ శరీరం లోంచి దూసుకెళ్లి వాళ్ళు కూర్చున్న రిక్లైనర్ లో దూరాయి... ఆ రిక్లైనర్స్ మంచి హై క్వాలిటీ కుషన్ తో చేసినవి కావడంతో ఆ బుల్లెట్స్ చెక్కు చెదరకుండా ఉండి ఉంటాయి... ఆ ఆగంతుకులు హత్యలు చేసి వెళ్ళినతరువాత వచ్చిన క్లీనింగ్ టీం కి ఈ బుల్లెట్స్ సంగతి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ బుల్లెట్స్ ని తియ్యలేదు... పోస్టుమార్టం కూడా హడావిడిగా జరపడంతో ఈ సంగతి ఎక్కడా రికార్డు కాలేదు... కొన్నాళ్ల తరువాత "మీవాడు" వెళ్లి ఆ బుల్లెట్స్ ని వెలికితీసి తన పరపతి ఉపయోంచి వాటికి ఫోరెన్సిక్ టెస్ట్స్ చేయించాడు. ఆ బుల్లెట్స్ "Pristine Condition" లో ఉండి ఉంటాయి... దాంతో వాటి మీద వేలి ముద్రలు... బులెట్ సిగ్నేచర్ దొరికింది... దాని నేషనల్ క్రైమ్స్ డేటా బేస్ లో చెక్ చేస్తే ఏదో ఒక పాత క్రిమినల్ పేరు, వాడు చేసిన పాత నేరాలు... ఆ నేరాల్లో వాడు వాడిన గన్, బుల్లెట్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని మీకు తెలిసాయి... అప్పుడు "మీవాడు" ఆ క్రిమినల్ పట్టుకొని "గట్టిగా" అడగడంతో వాడు కొన్ని పేర్లు బయట పెట్టడం జరిగింది... వాటిని బాగా చెక్ చేసుకొని "మీవాడు" చెయ్యాల్సిన పని చేసేసాడు... ఇప్పుడు అర్ధమయ్యింది... రామచంద్రయ్య గారు దగ్గరకి తీసిన ఆనాధలు వాళ్ళ ప్రాణాలకి తెగించి... మా పోలీస్ డిపార్టుమెంట్ surveillance network ....airport security camera network ని హాక్ చేస