OPERATION CROSSFIRE

Part 1 - The Kidnap... Rape... Torture

ఉదయం 5 గంటల సమయం... హైదరాబాద్... BHEL క్రాస్ రోడ్స్... మామూలుగా ఆ సమయంలో అంత పెద్దగా జనసంచారం ఉండదు. కానీ... ఆ రోజు ఆ సమయంలో ఊహించని విధం గా కోలాహలంగా ఉంది. ఆ ఏరియా లో ఉన్న బస్సు స్టాప్ లో దాదాపు 25 మంది స్టూడెంట్స్ కిట్స్ తో రెడీ గా ఉన్నారు. వాళ్లంతా గాంధీ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్... ఆ రోజు వాళ్ళు హైదరాబాద్ కి దగ్గర లోని ఒక పల్లెటూరు లో ఒక వారం రోజులు మెడికల్ క్యాంపు కి వెళ్ళడానికి రెడీ గా ఉన్నారు. వాళ్ళ ని తీసుకెళ్లడానికి రావాల్సిన కాలేజీ బస్సు ఇంకా రాలేదు... వాళ్లలో మగ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉండడంతో ఆ ఏరియా అంత కోలాహలం గా ఉంది. ఇంతలో ఒక కుర్రోడు... " బస్సు రావడానికి ఇంకా టైం ఉంది... పదండి వెళ్లి టీ తాగుదాం" అని అన్నాడు. అక్కడ గుమికూడిన చాలా మంది స్టూడెంట్స్ పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గరికి వెళ్లారు... కొంత మంది ఆడవాళ్ళు కిట్స్ కి కాపలాగా ఉన్నారు... ఇంకా సూర్యోదయం కాలేదు... కొంచం చీకటిగానే ఉంది...

సరిగ్గా అప్పుడే ఒక బ్లాక్ కలర్ ఇన్నోవా చాలా రాష్ గా వచ్చి ఆ బస్సు స్టాప్ కి ఒక 100 మీటర్లు దూరం లో రోడ్డు మధ్యలో ఆగింది. ఆ వాన్ వెనక డోర్ తీసుకొని ఒక వ్యక్తి దిగాడు. అతను ఆ బస్సు స్టాప్ లో ఉన్న లేడీ స్టూడెంట్స్ ని గాని... అక్కడికి దగ్గరలో టీ షాప్ లో ఉన్న స్టూడెంట్స్ ని గాని గమనించలేదు. కొంచం తూలుతున్నాడు. అతను వాన్ దిగడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంతలో వాన్ కి రెండో వైపు నుండి ఇంకో వ్యక్తి కూడా దిగాడు. అతను కూడా తాగి ఉండడం తో చుట్టూ పక్కల పరిసరాలని గమనించే స్థితిలో లేరు. వాళ్లిద్దరూ కలసి వాన్ వెనక సీట్లోంచి ఒక అమ్మాయిని బయటకి లాగి రోడ్డు మీద పడేసారు... అది చూసిన బస్సు స్టాప్ లోని లేడీ మెడికల్ స్టూడెంట్స్ గట్టిగా అరుస్తూ కేకలు పెట్టడం తో ఆ వాన్ లోంచి దిగిన వాళ్ళు ఖంగారుపడి వెంటనే వాన్ ఎక్కి స్టార్ట్ చేసి కుక్కటపల్లి వైపు దారి తీశారు. ఇదంతా గమనించిన మగ స్టూడెంట్స్ ఆ వాన్ కి అడ్డు పడడంతో ఆ వాన్ డ్రైవర్ పూర్తిగా ఖంగారుపడి వాన్ ని ఒక్కసారిగా స్పీడ్ గా పోనిచ్చాడు... అదే సమయంలో ఒక పాల వాన్ రాంగ్ రూట్ లో రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఆగివున్న ఒక బస్సు ని గుద్దేసి ఆగిపోయింది. ఆ వాన్ ని వెంబడించిన మగవాళ్ళు ఆ వాన్ చుట్టూ చేరి అందులోంచి ఎవరూ పారిపోకుండా వాన్ డోర్స్ కి అడ్డంగా నుంచున్నారు...

ఆ వాన్ లో వచ్చిన వాళ్లు పడేసిన అమ్మాయి చుట్టూ లేడీ మెడికల్ స్టూడెంట్స్ గుమి గూడారు... ఆ అమ్మాయి వొళ్లంతా గాయాలతో ఉంది... బాగా రక్తం కారుతోంది... గ్యాంగ్ రేప్ కి గురిఅయిందని తెలుస్తోంది... ముందుగా ఆమె పల్స్ ని చెక్ చేశారు... చాలా వీక్ గా కొట్టుకుంటోంది... వెంటనే ఆ అమ్మాయిని ఆ బస్టాప్ లోకి తీసుకెళ్లి బెంచిమీద పడుకోపెట్టి బీపి చెక్ చేశారు... బాగా ఎక్కువగావుంది... ఇంతలో ఒక స్టూడెంట్ 101 కి ఫోన్ చేసి అంబులెన్సు పిలిపించింది. ఇంకో స్టూడెంట్ 100 కి ఫోన్ చేసి సిట్యుయేషన్ చెప్పి వెంటనే పోలీస్ వాళ్ళని పిలిపించారు... లేడీ స్టూడెంట్స్ లో కొంత మంది రేప్ కి గురయిన అమ్మాయి పరిస్థితి చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు... చాలా దారుణంగా రేప్ చేశారు. ఆమె వొళ్ళంతా దెబ్బలతో కందిపోయి... కమిలిపోయి ఉంది... వొంటి మీద నూలు పోగు లేకుండా చేశారు... ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ ఆ రేప్ విక్టిమ్ ని చూసి వాంతి చేసుకున్నారు. ఇంతలో ఒక స్టూడెంట్ ఆ రేప్ విక్టిమ్ మోచేతి దగ్గర చర్మం ఒక నీడిల్ తో పంక్చర్ చేసినట్లు గమనించింది... అంటే ఆమె కి డ్రగ్స్ ఎక్కించి రేప్ చేశారని తెలుస్తోంది... ఆమె మొహమంతా పంటి గాయాలతో నిండి ఉంది... ఆమె ఛాతీ ని గట్టిగా కొరికినట్లు గాయాలు చెప్తున్నాయి... ఆమె ప్రైవేట్ పార్ట్శ్ లో విపరీతంగా బ్లీడింగ్ కనిపిచింది... వాళ్లంతా మెడికల్ స్టూడెంట్స్ కావడంతో ఇది ఒక మెడికో లీగల్ కేసు అని అర్ధమయ్యింది... ఒక స్టూడెంట్ ఆమెకి సెలైన్ పెట్టింది... ఇంకో స్టూడెంట్ ఆమెకి CPR ఇచ్చి రివైవ్ చేసింది... గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది... ఆ సమయంలో ఆ స్టూడెంట్స్ చేసిన ఫస్ట్ ఎయిడ్ వల్లనే అంబులెన్సు వచ్చేసరికి ఆమె ఇంకా ప్రాణాలతో ఉంది...

స్టూడెంట్స్ ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చెయ్యడం లో చాలా బిజీ గా ఉన్న సమయంలో ఒక వ్యక్తి అక్కడికి రావడం... తన మొబైల్ ఫోన్ తో అదంతా వీడియో తియ్యడం ఎవరూ గమనించలేదు... అతను స్టూడెంట్స్ గమనించే లోపల వీడియో తియ్యడం పూర్తి చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చిన వాన్ దగ్గరికి వెళ్ళాడు... దారి పొడుగూతా వీడియో తీస్తూనే ఉన్నాడు... వాన్ కి ఎలా ఆక్సిడెంట్ అయ్యింది... అందులో వున్న వాళ్లను చాలా క్లియర్ గా వీడియో తీసాడు... అప్పటి బాగా వెలుతురు వచ్చింది... పాల వాళ్ళు, పేపర్ వాళ్ళు, పల్లెటూర్లనుండి కూరలు తీసుకొని వచ్చిన వాళ్ళతో ఆ ఏరియా అంతా నిండి పోయింది... అక్కడ గుమి గూడిన వాళ్ళు కొంత మంది ఆ వాన్ లో వున్న వాళ్ళని గుర్తు పట్టేశారు... వాళ్ళు కైలాష్ గౌడ్ మనుషులు... వీడియో తీస్తున్న వ్యక్తి ఆ క్రైమ్ సీన్ మొత్తాన్ని కవర్ చేసేసాడు... అదే సమయానికి అంబులెన్సు... దాని వెనకాలే పోలీస్ పట్రోల్ వాన్ రావడంతో అతను నెమ్మదిగా అక్కడనుండి జారుకుని తన కోసం ఆదుర్దాగా ఒక మోటార్ సైకిల్ మీద ఎదురుచూస్తున్న ఇంకో వ్యక్తి దగ్గరకి చేరుకొని ఆ మోటార్ సైకిల్ ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్ళిపోయాడు... అతని పేరు విక్రాంత్... మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి పేరు గణేష్. వీళ్ళిద్దరూ జర్నలిస్ట్స్.

అంబులెన్సు అక్కడే చేరుకునేటప్పటికీ ఆ రేప్ విక్టిమ్ కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంది... వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమెని అంబులెన్సు లోకి ఎక్కించి వెంటనే వెళ్లిపోయారు... ఆమె తో పాటుఫస్ట్ ఎయిడ్ చేసిన స్టూడెంట్స్ కూడా వెళ్లారు... ఆమె ఎవరో... ఎవరికి తెలియదు. ఆ సమయం లో ఆ మెడికల్ స్టూడెంట్స్ చేసిన ఫస్ట్ ఎయిడ్ వల్లనే ఆమె ఇంకా ప్రాణాలతో ఉంది... ఆమె ని రోడ్ మీద పడెయ్యడం ఎవరూ చూడకపోయినట్లయితే ఆమె ఇంకో అరగంట లో మరణించేది.

ఆ ఆక్సిడెంట్ స్పాట్ లో గుమిగూడిన జనాలకి అక్కడ ఏమి జరిగిందో అర్ధమయ్యింది... వాళ్లంతా తమ మొబైల్ ఫోన్స్ తో ఆ వాన్ లో ఉన్న కైలాష్ గౌడ్ మనుషుల ఫోటోలు తీసి ఆ ఆక్సిడెంట్ గురించి తమకి తెలిసిన డీటెయిల్స్, ఊహించుకొని కల్పించిన డీటెయిల్స్, అన్నింటిని ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో తమ ఫ్రండ్స్ షేర్ చేసేసారు... ఇంకొంతమంది #anothernirbhaya... #hyderabadnirbhaya అని ట్విట్టర్ హ్యాండిల్స్ తో డిస్కషన్ త్రేడ్స్ ని స్టార్ట్ చేశారు... ఒక 30 నిమిషాలలో ఈ వార్త ప్రపంచం అంతటా వ్యాపించింది... అదే సమయానికి న్యూస్ ఛానెల్స్ వాళ్ళు కూడా చేరుకున్నారు... పోలీస్ వాళ్ళకి వీళ్లందరినీ కంట్రోల్ చెయ్యడం చాలా కష్టంగా ఉంది... అందరూ ఫొటోలో తీసుకుంటున్నారు... వీడియోస్ తో ఆ ఏరియా అంతా కవర్ చేస్తున్నారు... మీడియా వాళ్ళు బస్సు స్టాప్ లో వున్నా మెడికల్ స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ పేరుతో చాలా ఇబ్బంది పెడుతున్నారు... ఆ స్టూడెంట్స్ లో కొంత మంది ఇంకా ఏడుస్తున్నారు... మీడియా వాళ్ళు ఇదేమి పట్టించుకోకుండా తమకి కావాల్సిన న్యూస్ ఐటెం కోసం తెగ ఆరాట పడుతున్నారు.

అక్కడ గుమి గూడిన వాళ్ళు అప్పటిదాకా తాము చూసింది... అర్ధం చేసుకుంది అంతా న్యూస్ చానెల్స్ వాళ్ళకి చెప్తున్నారు... ఇంతలో కైలాష్ గౌడ్ మనుషుల గురించి టీవీ న్యూస్ లో వచ్చేసింది... వాళ్ళని పోలిస్ అరెస్ట్ చేసి వాన్ ఎక్కించడం ప్రపంచమంతా చూసేసింది... పోలీస్ వాళ్ళు కైలాష్ గౌడ్ మనుషులు వాడిన వాన్ లోపల దొరికిన వస్తువులన్నిటిని తీసుకొని వెళ్లిపోయారు... ఒక పోలీస్ ఆ వాన్ ని డ్రైవ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు... తెల్లవారేలోపల హైదరాబాద్ లో రేప్ విక్టిమ్ గురించి అన్ని న్యూస్ చానెల్స్ లో కవరేజ్ వచ్చేసింది. కైలాష్ గౌడ్ మనుషులు ఒక అమ్మాయిని రేప్ చేసి రోడ్ మీద పడేసి వెళ్తూ ఒక ఆక్సిడెంట్ చెయ్యడంతో దొరికిపోయారని... వాళ్ళని సైబరాబాద్ పోలీస్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారని... వాళ్లకి దొరికిన వీడియో... యూట్యూబ్... సోషల్ మీడియా లో దొరికిన ఇన్ఫర్మేషన్ అంతా టీవీ లో చూపించేసారు.


విక్రాంత్ నేరుగా అదే ఏరియా లో ఉంటున్న ACP అవినాష్ ఇంటికి వెళ్ళాడు... అప్పటికే అవినాష్ కి రేప్ విక్టిమ్ గురించి, పట్టుపడిన కైలాష్ గౌడ్ మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ తెలియడం తో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు.

విక్రాంత్: గుడ్మార్నింగ్ సర్... మీతో కొంచం అర్జెంటు గా మాట్లాడాలి...

అవినాష్: గుడ్ మార్నింగ్ అవినాష్... కొంచం బిజీ గా వున్నాను... ఒక క్రైమ్ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి వెళుతున్నాను... మే బి లేటర్...

విక్రాంత్ (తన మొబైల్ ఫోన్ చూపిస్తూ): సర్... మీకు ఇవ్వాళా ఉదయం జరిగిన ఆ రేప్ విక్టిమ్ గురించి ఇన్ఫర్మేషన్ అంది ఉంటుందని తెలుసు. మా దగ్గర ఆ రేప్ కేసు కి సంబంధించి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ / ఎవిడెన్స్ ఉంది. అది మీకు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము...

అవినాష్(ఆశ్చర్యంగా): రియల్లీ... అయితే మీరు నా ఆఫీసు కి వెళ్లి వెయిట్ చెయ్యండి. నా పని అవ్వగానే అక్కడికి వచ్చి మీతో మాట్లాడతాను.

అవినాష్ డిపార్టుమెంటు వెహికల్ ఎక్కి వెళ్ళిపోయాడు. విక్రాంత్... గణేష్... ఇద్దరూ తమ మోటార్ సైకిల్ మీద ఆయన ఆఫీస్ కి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్ వాళ్ళని అవినాష్ ఆఫీస్ రూమ్ లో కూర్చో పెట్టారు. అవినాష్ నేరుగా కైలాష్ గౌడ్ మనుషులని ఉంచిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వాళ్ళు ఇంకా ఆల్కహాల్ మత్తులోంచి పూర్తిగా తేరుకోలేదు. వాళ్ళ మీద నీళ్లు కొట్టి ఈ లోకంలోకి తీసుకొస్తున్నారు. ఇంకా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవ్వలేదు. అవినాష్ రాగానే పూర్తి డీటెయిల్స్ చెప్పారు. వాళ్ళని వెంటనే FIR తయారుచెయ్యమని చెప్పాడు. దొరికిన ఎవిడెన్స్ తో కేసు ఫైల్ చెయ్యమన్నాడు... క్రైమ్ స్పాట్ లో పట్టుపడ్డ కైలాష్ గౌడ్ మనుషుల మీద కేసు రిజిస్టర్ చేశారు.వాళ్ళు వాడిన వాన్ లో ఆ రేప్ విక్టిమ్ కి సంబంధించిన బట్టలు దొరికాయి... అవి బాగా నెత్తురుతో తడిసి ఉన్నాయి. వాటిని ఎవిడెన్స్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. అవినాష్ వెంటనే డాక్టర్ ప్రభావతి కి ఫోన్ చేసి రేప్ డీటెయిల్స్ చెప్పి... ఆమెని ఈ కేసు కి సంబంధించిన ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చెయ్యమని చెప్పాడు. ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ కి దొరికిన ఎవిడెన్స్ ని తన లాబ్ పంపమని చెప్పింది. వెంటనే అవినాష్ ఆఫీషియల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఎవిడెన్స్ ని డాక్టర్ ప్రభావతి కి పంపాడు. అదే సమయం లో విక్రాంత్ చెపింది గుర్తుకొచ్చి... అక్కడే ఉన్న DSP శేఖర్ ని తన ఆఫీస్ కెళ్ళి విక్రాంత్ దగ్గరున్న ఎవిడెన్స్ ని చెక్ చేసి అవసరమైతే దాన్ని కూడా FIR కలపమని చెప్పి తాను కమిషనర్ బ్రీఫ్ చెయ్యడానికి వెళ్ళాడు.

శేఖర్ వెళ్లి విక్రాంత్ ని కలిసాడు. " ACP గారు మీ దగ్గరేదో ఎవిడెన్స్ వున్నదని చెప్పారు... ఆది నాకిస్తే దాన్ని కేసు రిజిస్టర్ చెయ్యడానికి వాడుకుంటాము " అని అన్నాడు. విక్రాంత్ వెంటనే తన మొబైల్ ఫోన్... తన ఫ్రెండ్ గణేష్ మొబైల్ ఫోన్ శేఖర్ కి ఇచ్చాడు. శేఖర్ ఆ మొబైల్ ఫోన్స్ తీసుకోని తన రూమ్ లోకి కెళ్ళి వాటి ని తన కంప్యూటర్ లో కి ఎక్కించి ఫొటోస్ ... వీడియోస్ చెక్ చేసాడు... ఆ ఎవిడెన్స్ చూసిన శేఖర్ కి కళ్ళు తిరిగినంత పనయ్యింది. వాళ్ళని అక్కడే కూర్చోమని చెప్పి బయటకివెళ్ళి ACP అవినాష్ తో "సర్... నేను ఆ జర్నలిస్ట్స్ దగ్గరున్న ఎవిడెన్స్ చెక్ చేసాను. మీతో చాలా అర్జెంటు గా మాట్లాడాలి... వెరీ సీరియస్" అని అన్నాడు... అవినాష్ వెంటనే తన ఆఫీస్ కి వచ్చి శేఖర్ రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ శేఖర్ ఆ మొబైల్ ఫోన్ లోని ఫొటోస్... వీడియోస్ ని తన కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసి అవినాష్ కి చూపించాడు... అవన్నీ చూడడానికి అవినాష్ కి దాదాపు గంట పైన టైం పట్టింది... ఇద్దరూ నమ్మలేక పోయారు. వాటిని చూస్తున్న అవినాష్ మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చెయ్యసాగింది...

DSP శేఖర్: సర్... ఈ జర్నలిస్ట్స్ ని వెంటనే అరెస్ట్ చేసి కస్టడీ లోకి తీసుకోమంటారా...

అవినాష్: వొద్దు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.

DSP శేఖర్: అదేమిటీ... ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉంది. వీళ్ళిద్దరిని అకంప్లీస్ కింద అరెస్ట్ చేద్దాం...

అవినాష్: వీళ్ళని అరెస్ట్ చేస్తే, మనం ఈ ఎవిడెన్స్ ని FIR తో పాటు కలిపి కేసు ఫైల్ చేయాల్సివస్తుంది. దాని వాళ్ళ పెద్దప్రయోజనం ఉండదు. అసలు ఈ ఎవిడెన్స్ ఉన్నదన్న సంగతి మీకు... నాకు... ఆఇద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. మనం దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి.

DSP శేఖర్: అంటే వీళ్ళని వొదిలేద్దామంటారా...

అవినాష్: NO... కైలాష్ గౌడ్ చాలా పెద్ద క్రిమినల్. వాడికి మన హోమ్ మినిస్టర్ చిన్ననాటి ఫ్రెండ్. ఆ అండ చూసుకొని వాడు ఇంత వరకు ఏ కేసు లోనూ మనకి దొరకలేదు. మనం కస్టపడి ఏదైనా ఎవిడెన్స్ సంపాదించి కేసు ఫైల్ చేస్తే... ఆ ఎవిడెన్స్ ని మన హోమ్ మినిస్టర్ వెంటనే లాగేసుకొని అసలు కేసు ఫైల్ కాకుండా చూసేవాడు. ఇప్పుడు మనం ఈ ఎవిడెన్స్ ని బయటపెడితే... వెంటనే వాళ్ళు లాగేసుకుంటారు. పైగా ఈ జర్నలిస్ట్స్ ని చంపేసినా నేను ఆశ్చర్యపోను. మనం ఎప్పటికి ఆ కైలాష్ గౌడ్ ని పట్టుకోలేము. ప్రస్తుతానికి మనం ఈ ఎవిడెన్స్ బయటకి రాకుండా జాగ్రత్త పడాలి. మీరు నాతో కోఆపరేట్ చేస్తే ఈ కైలాష్ ని కోలుకోలేని దెబ్బ కొట్టవచ్చు. ప్రస్తుతానికి FIR తయారు చేసి కేసు ఫైల్ చెయ్యడం జరిగింది. ఇప్పుడు ఆ కైలాష్ ఎలా రియాక్ట్ అవుతాడో జాగ్రత్తగా గమనించి మనం నెక్స్ట్ స్టెప్స్ వేద్దాం...

DSP శేఖర్: మరి వీళ్ళ సంగతి...?

అవినాష్: మనకి వీళ్ళు ఇచ్చిన ఫొటోస్... వీడియోస్ తప్ప... అసలు ఇవి వీళ్ళకి ఎలా దొరికాయి మనకి తెలియదు. ముందు అది కనుక్కోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరు వాళ్ళని పిలవండి.

DSP శేఖర్ బయటకి వెళ్లి విక్రాంత్... గణేష్ లని తీసుకొని ACP అవినాష్ రూమ్ లోకి వచ్చాడు. వాళ్ళని తన ముందున్న కుర్చీలలో కూర్చోమనట్లు సైగ చేసాడు.

అవినాష్(మొబైల్ ఫోన్ చూపిస్తూ): ఈ ఫొటోస్... వీడియోస్ మీకు ఎక్కడ దొరికాయి...

విక్రాంత్: అవి మేమే షూట్ చేసాము...

అవినాష్(అర్ధంకానట్లు): మీరెందుకు షూట్ చేశారు? అసలేమి జరిగింది... మొత్తం చెప్పండి...

విక్రాంత్ చెప్పడం మొదలెట్టాడు... దాదాపు ఒక గంట సేపు జరిగిందంతా చెప్పాడు. అది వింటున్న అవినాష్, శేఖర్ లు బుర్రలు తిరిగిపోయాయి. వాళ్లకు విన్నది నమ్మలేక పోయారు. ఇద్దరూ వాళ్ళని చాలా ప్రశ్నలు వేశారు... విక్రాంత్ వాటన్నిటికీ తడుముకోకుండా జవాబు చెప్పాడు. అవినాష్ కి అర్ధమయ్యింది. విక్రాంత్ నిజమే చెప్తున్నాడని... ఒక ఐదునిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. చివరికి...

అవినాష్: You both are under arrest. You believe you both are accomplice to this crime. Our DSP... Mr. Sekhar will take official statement. Please Cooperate with him.

విక్రాంత్... గణేష్... ఇద్దరూ నిర్ఘాంతపోయారు...

విక్రాంత్: ఇందులో మా తప్పేమీలేదండి... మీకు హెల్ప్ చెయ్యాలని ప్రయత్నిస్తే... మీరు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?

అవినాష్ వాళ్ళకి చాలా వివరంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాడు... అది విన్న ఆ జర్నలిస్ట్స్ ఇద్దరూ మాట్లాడలేక పోయారు...

అవినాష్: OK. మీరు నేను చెప్పినట్లు చేస్తానంటే... మీకు... ఈ కేసు కి ఎటువంటి సంభంధం లేకుండా చేస్తాను.

విక్రాంత్: ఏమి చెయ్యాలో చెప్పండి...

అవినాష్ వాళ్ళకి ఒక 15 నిమిషాల పాటు వీళ్ళిద్దరూ ఏమి చెయ్యాలో చెప్పాడు. వాళ్ళతో పాటు DSP శేఖర్ కూడా చాలా కుతూహలంగా విన్నాడు... అవినాష్ చెప్పింది విన్న తరువాత DSP శేఖర్ కి పూర్తిగా అర్ధమయ్యింది... ఈసారి కైలాష్ గౌడ్ తప్పించుకోలేడు. విక్రాంత్... గణేష్ ఇద్దరూ చాలా సేపు ఆలోచించారు. వాళ్లకి వేరే మార్గం కనిపించలేదు. మౌనంగా తలూపారు.

అవినాష్: DSP శేఖర్ గారు మీ దగ్గరనుండి డిటైల్డ్ స్టేటుమెంట్ తీసుకుంటారు... దాన్ని మీరు చదివి సంతకం చెయ్యండి. ప్రస్తుతానికి మిమ్మల్ని వొదిలేస్తాము... మేము ఇప్పుడే మీ మీద కేసు ఫైల్ చెయ్యం. మీరు మాకు కోఆపరేట్ చెయ్యండి. సరైన సమయం చూసి ఈ రోజు మీరు సంతకం చెయ్యబోయే స్టేటుమెంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తాను.

గణేష్: సర్... మాకు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు కదా...

అవినాష్: మీకు నా మీద నమ్మకం ఉందా?

ఇద్దరూ వెంటనే... "మీరంటే మాకు బాగా నమ్మకం వుంది. అందుకే మీ దగ్గరకి వచ్చాము" అని అన్నారు...

అవినాష్: మాకు మీ సహకారం కావాలి. మేము ఆ కైలాష్ గౌడ్ ని ఆఫీషియల్ గా పట్టుకోలేక పోతున్నాము... మీ హెల్ప్ కావాలి.

విక్రాంత్: సర్... అటువంటప్పుడు ఈ స్టేటుమెంట్ అవసరం లేదుకదా...

అవినాష్: This is my insurance policy. మీకేమి భయం లేదు. శేఖర్ గారికి మీరు జరిగిందంతా చెప్పండి..,

DSP శేఖర్ వాళ్ళని తీసుకొని తన రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆ వెళ్తున్నవాళ్ళని చూస్తూ అవినాష్ "JUST... ONE PHONE CALL WOULD HAVE AVOIDED THIS SITUATION" అనుకున్నాడు.

అదేసమయానికి ఇంకో చోట... ఇంకో వ్యక్తి కూడా సరిగ్గా ఇదే అనుకున్నాడు.... అతని పేరు కైలాష్ గౌడ్.


కైలాష్ గౌడ్... దాదాపు యాభై ఏళ్ళ వయసు ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కి చెందినవాడు. పెద్దగా చదువుకోలేదు. చిన్నప్పటినుండి క్రిమినల్ ఆక్టివిటీస్ చేస్తూవుండేవాడు. కైలాష్ కి బాగా నమ్మకమైన చిన్ననాటి ఫ్రెండ్ ధనంజయ... ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్నకారు రైతు కొడుకు. అదృష్టం బాగుండి రాజకీయాల్లో బాగా పైకి వచ్చాడు. ప్రస్తుతానికి రాష్ట్ర హోమ్ మినిస్టర్ గావున్నాడు. కైలాష్ కి ధనంజయ అంటే చాలా ఇష్టం. ధనంజయ ఇల్లీగల్ పనులన్నీ చేస్తూవుంటాడు. కైలాష్ కి సిటీ లో పెద్ద కన్స్ట్రక్షన్ బిజినెస్ వుంది. రెసిడెన్షియల్... కమర్షియల్ అపార్టుమెంట్స్ కడుతూ ఉంటాడు. డ్రగ్స్ బిజినెస్ కూడా వుంది... రకరకాల మత్తుపదార్ధాలు సప్లై చేస్తూవుంటాడు. చాలా పెద్ద నెటవర్క్ ని మైంటైన్ చేస్తున్నాడు. గోవా... చెన్నై... బెంగళూరు... ముంబై ... చాలా సిటీస్ కి డ్రగ్స్ సప్లై చేస్తాడు. హవాలా బిజినెస్ కూడా ఉంది . ఒక్క మాటలో చెప్పాలంటే... కైలాష్ చెయ్యని బిజినెస్ లేదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా దైవ భక్తి చాలా వుంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకి లేస్తాడు. ఒక గంట పైగా యోగా చేస్తాడు... తరువాత స్నానంచేసి... పవిత్రంగా దేవుడి ముందు నుంచొని తనకి వచ్చిన శ్లోకాలు... పద్యాలు... అన్నింటిని చదువుతూ దాదాపు ఒక గంట సేపు పూజ చేస్తాడు. అప్పటిదాకా ఎవరు పిలిచినా మాట్లాడాడు. అసలు కైలాష్ ని కదిలించే సాహసం ఎవరూ చెయ్యరు. ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ చేసి టీ తాగి ఆరోజు ఏమేమిచెయ్యాలో అలోచించి పని మొదలెడతాడు. కానీ... ఆ రోజు అతని రొటీన్ కి గండిపడింది.

యోగా చేసి బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న కైలాష్ కి అతని భార్య మొబైల్ ఫోన్ అందించి "పోలీస్ స్టేషన్ నుంచి... చాలా అర్జెంటు అని చెప్పారు" అని అన్నది. స్నానాన్ని సగం లో ఆపి ఫోన్ లో మాట్లాడాడు. అవతల వ్యక్తి చెప్పింది మొదట అర్ధం కాలేదు... అర్ధమైన వెంటనే... హడావిడిగా స్నానం పూర్తిచేసి బట్టలేసుకుని వాన్ ఎక్కి తన మనుషులని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు... దారి పొడుగూతా ఆలోచిస్తునేవున్నాడు... అసలేమిజరిగింది? తన మనుషులని ఎందుకు అరెస్ట్ చేశారు? నిన్న తను చెప్పిన ఏమైంది? ఇంతలో కార్ డ్రైవర్ "అన్నా.... మనోళ్లు ఎవరో అమ్మాయిని రేప్ చేసి రోడ్ మీద పడేశారని... వాళ్ళని పోలీయేలు అరెస్టు చేశారని వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది" అని అన్నాడు... కైలాష్ కి పూర్తిగా మతిపోయింది. ఇంతలో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.

కైలాష్ ని చూడగానే ఒక పోలీస్ ఆఫీసర్ సిట్యుయేషన్ ని వివరించాడు. "నేను మా వాళ్ళతో ఒంటరిగా మాట్లాడాలి" అని అన్నాడు. నార్మల్ గా అయితే అనుమతించారు. కానీ... కైలాష్ బ్యాక్ గ్రౌండ్ తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకున్నారు. కైలాష్ లాక్ అప్ లోకి వెళ్ళాడు. అతను రావడం చూసి అక్కడే ఉన్న కాన్స్టేబుల్ బయటకి వెళ్ళిపోయాడు. కైలాష్ ని చూడగానే అతని మనుషులు విపరీతమైన భయం తో ఏడుస్తూ అతని కాళ్ళనిపట్టుకొని ఏడవసాగారు. వాళ్లంతా కారుడు గట్టిన నేరస్తులు. ఇద్దరు ప్రస్తుతం పెరోల్ మీద బయటకి వచ్చారు. ఇంకా ఇద్దరు రకరకాల కేసుల విషయం లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష పడవచ్చు. కైలాష్ వాళ్ళని ఒదార్చి " ఏమి జరిగిందిరా?" అని అడిగాడు.

వాళ్లలో ఒకడు చెప్పడం మొదలెట్టాడు... వాడుచెప్పింది విన్న కైలాష్ కి వొళ్ళు జలదరించింది.

కైలాష్: నేను మీకు చెప్పింది యేమిటీ? మీరు చేసింది ఏమిటీ?

సైదులు: అన్నా... బాంచాను... కాల్మొక్కుతా ... తప్పైపోనాది... కాపాడు...

కైలాష్: ఒరే... ఆవులే... ఇది ఎవరి పనో తెలుసా...

సైదులు: ఎవరిది అన్నా...

కైలాష్: మహేంద్ర సారూ చెప్పిన పని... నేను మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ముంచేశారు. ఇప్పుడు నేను ఆయనకీ ఏమి చెప్పాలి?

వాళ్లంతా వొణికిపోయారు. ఇప్పుడు వాళ్ళకి చావు కనిపిస్తోంది. కైలాష్ కి ఏమిచేయాలో అర్ధం కాలేదు. అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు కాబట్టి బయటకి వచ్చి తనమనిషి కి డబ్బులిచ్చి " మా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో... ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు?" అని అడిగాడు. "ACP అవినాష్ స్వయంగా చూసుకుంటున్నాడు" అని చెప్పాడు. ఇది విన్న కైలాష్ కి నీరసం వచ్చింది. వాన్ ఎక్కపోతుండగా ఏదోఅనుమానం వచ్చి "ఈ కేసు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఎవరికైన ఇచ్చారా?" అని అడిగాడు. " Dr. ప్రభావతి" అని సమాధానమిచ్చి ఆ పోలీస్ వెళ్ళిపోయాడు. ఇది ఇంకో పెద్ద ప్రాబ్లెమ్ అని అనుకుంటూ "ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు" అని అనుకుంటూ వాన్ ఎక్కి బయలుదేరాడు...


Part - 2 - The Confusion

కైలాష్ గౌడ్ నేరుగా జూబ్లీ హిల్స్ లో ఉన్న తన లాయర్ కాంతారావు దగ్గరికెళ్లి అప్పటిదాకా జరిగిన విశేషాలు చెప్పాడు. అది విన్న లాయర్ గుడ్లు తేలేసాడు. పరిస్థితి అసలు అర్ధం కాలేదు. ఇప్పటిదాకా కైలాష్ గౌడ్ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిలో ఇరుక్కోలేదు. ఎటువంటి పనైనా లాయర్ సలహా తీసుకొని మరీ చేస్తాడు. నిన్నకూడా అలాగే కాంతారావు కి చెప్పి... అయన సలహా తీసుకొని ముందుకెళ్లాడు. ఆ పని అవ్వలేదు... పైగా కైలాష్ గౌడ్ మనుషులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.

కాంతారావు: పట్టుపడ్డ ఆ నలుగురిలో... సైదులు... యాదగిరి... వీళ్ళిద్దరూ రకరకాల కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు. త్వరలోనే వీళ్ళకి జైలు శిక్ష పడుతుంది. ఆ మిగతా ఇద్దరూ... జిలాని... కిషన్... వీళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ రీసెంట్ గా బెయిల్ మీద బయటకి వచ్చారు. ఇప్పుడు ఈ కేసు తో వీళ్ళు మళ్ళీ కొత్త కేసు లో ఇరుక్కున్నారు. చాలా కష్టం.

కైలాష్ గౌడ్: వీళ్ళు ఇప్పుడు ఏ ఏ కేసుల్లో ఇరుక్కుంటారు?

కాంతారావు: కిడ్నప్... రేప్... టార్చర్... అటెంప్ట్ టు మర్డర్... బాగా కాంప్లికేట్ కేసు. పైగా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఏముంటుందో చూడాలి... ఆ రిపోర్ట్ ఆధారంగా కేసు ఫైల్ అవుతుంది. ముందు నిన్న వాడిన SUV ని ఎవరికంట పడకుండా ఊరి బయటకి తీసుకెళ్లి తగలపెట్టండి. మీ వివేక్ ని పోలీస్ స్టేషన్ కెళ్ళి ఆ SUV ని ఎవరో దొంగతనం చేశారని పోలీస్ స్టేషన్ లో నిన్నటి డేట్ వేసి కంప్లయింట్ ఇవ్వమని చెప్పు. కొంత కాలం వివేక్... అతని ఫ్రెండ్స్ ని జాగ్రత్త ఉండమని చెప్పు.

కైలాష్ గౌడ్ తన కొడుకు వివేక్ ఫోన్ చేసాడు. వివేక్ నిన్న రాత్రి తాగిన డ్రింక్స్, తీసుకున్న డ్రగ్స్ మత్తులోంచి పూర్తిగా బయటపడలేదు. ఆ మత్తులోనే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తగానే కైలాష్ ఆవేశం ఆపుకోలేక కొడుకుని బండ బూతులు తిట్టడం మొదలెట్టాడు. దాంతో కాంతారావు ఫోన్ లాక్కొని మాట్లాడాడు.

కాంతారావు: నిన్న నువ్వు... మీ ఫ్రెండ్స్ ఏమి చేశారు?

వివేక్: ఏమి లేదు అంకుల్... జస్ట్ చిన్న పార్టీ...

కాంతారావు: మరి ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసింది ఎవరు?

వివేక్: ఏ అమ్మాయి? రేప్ ఏమిటీ? ఏమి జరిగింది?

కాంతారావు: ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో మీ DNA సాంపిల్స్ బయటపడి... నువ్వు నీ ఫ్రెండ్స్ అరెస్ట్ అయితే... నా దగ్గరకు రాకండి. సరిగ్గా అబధం కూడా చెప్పడం చేతకాని వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద కేసు లో ఎందుకు ఇన్వొల్వె అవ్వడం? నిన్న నువ్వు... నీ ఫ్రెండ్స్ చేసిన పనికి మీ నాన్న ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది.

వివేక్(భయపడిపోయి): సారీ అంకుల్... పొరపాటు జరిగింది.

కాంతారావు(చాలా కోపంగా): పొరపాటా... ఆ అమ్మాయి పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ తెలుసా? మీరు రేప్ చేసిన తరువాత అసలు ఏమి జరిగిందో తెలుసా? నువ్వు అర్జెంటు గా మీ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిన్న నువ్వు వాడిన SUV... మొన్నటినుండి కనబడడంలేదని... అర్జెంటు గా కంప్లయింట్ ఇవ్వు... ఇంకో ఇంపార్టెంట్ విషయం ఆ SUV ని ఎవరికంట పడకుండా ఊరి బయటకి తీసుకెళ్లి ఒక్క చిన్న ఆధారం కూడా దొరకకుండా తగలపెట్టామని మీ వాళ్లకి చెప్పు. ఇందులో ఎటువంటి మిస్టేక్ జరగడానికి వీలు లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా... నువ్వు... నీ ఫ్రండ్స్... అందరూ ఉరికంభం ఎక్కాల్సివస్తుంది. బె కెరేఫుల్...

వివేక్(పూర్తిగా భయపడిపోయి): అలాగే అంకుల్... ఇప్పుడే వెళ్లి పోలీస్ కంప్లయింట్ ఇస్తాను...

కాంతారావు: నువ్వు... నీ ఫ్రండ్స్... ఒకసారి నా దగ్గరికి రండి. అసలు నిన్న ఎవరెవరు కలసి ఈ పని చేశారు?

వివేక్ సైలెంట్ అయిపోయాడు. మాట్లాడలేదు. కాంతారావు కి అనుమానం వచ్చింది. రెట్టించి అడిగాడు.

వివేక్: నేను, కిరణ్, రాకేష్, సంజీవ్

కాంతారావు కి గుండె ఆగినంత పనైయ్యింది... కిరణ్... మహేంద్ర మేనల్లుడు... రాకేష్ తన కొడుకు... సంజీవ్ హోమ్ మినిస్టర్ ధనంజయ్ కొడుకు... ఏమి మాట్లాడాలో తెలియలేదు. "నువ్వు వెంటనే ఆ SUV సంగతి చూడు" అని ఫోన్ పెట్టేసి కైలాష్ గౌడ్ వైపు చూస్తూ

కాంతారావు(భయపడిపోతూ): ఎంత సింపుల్ గా అవ్వాల్సిన పని... ఏమిటీ? ఇలా అయ్యింది? అసలుపని కాలేదు. ఇప్పుడు ఇంకో పెద్ద సమస్య వచ్చింది.

కైలాష్ గౌడ్(ఖంగారుగా చూస్తూ): ఏమైంది?

ఆ రేప్ చేసింది ఎవరెవరో చెప్పాడు. అంతే... కైలాష్ గౌడ్ కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. కైలాష్ చాలా పెద్ద మాఫియా లీడర్. అయినా... ఆ క్షణంలో నిస్సహాయస్థితిలోకి వెళ్ళిపోయాడు. నిన్న రాత్రి పిల్లలు చేసిన పనికి రాష్ట్రం లో పెద్ద పెద్ద వాళ్లందరికీ చాలా పెద్ద ప్రాబ్లెమ్ అయ్యింది. ఇంతలో కాంతారావు ఫోన్ మోగింది. హోమ్ మినిస్టర్ ధనంజయ... ఒణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తాడు... అవతలి వైపునుంచి వీలయినంత ప్రశాంతంగా

ధనంజయ: ఏమయ్యింది? నాకు ఏదేదో ఇన్ఫర్మేషన్ వస్తోంది.

కాంతారావు: ఫోన్ లో కాదు. నేను... కైలాష్ నీ దగ్గరికి వచ్చి చెప్తాము.


వివేక్ ఫోన్ పెట్టేసిన తరువాత కుర్చీలో కూర్చొని ఒక అయిదు నిమిషాలు ఆలోచించాడు. గత రాత్రి జరిగిన విషయం కళ్ళ ముందు సినిమా లాగా కనిపించింది. లాయర్ కాంతరావు చెప్పింది గుర్తుకొచ్చి తన SUV కీస్ తీసుకొని కిందకొచ్చి 'ఓపియం' సుభాష్ ని పిలిచి "నా కార్ తీసుకొని వూరికి దూరంగా తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా దాచెయ్యి" అని అన్నాడు. "మన ఫార్మ్ హౌస్ లో పెట్టమంటారా" అని అడిగాడు సుభాష్. "గుడ్ ఐడియా... ఆ ప్లేస్ ఎవరికి తెలియదు. అక్కడికి తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా దాచేసెయ్యి" అని చెప్పి ఆ SUV లో GPS Tracking System ని పూర్తిగా disable చేసేసాడు. ఆ SUV ని తీసుకొని సుభాష్ వెళ్ళిపోయాడు. వివేక్ ఇంకో కారెక్కి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన Mercedes Benz ML 350 వెహికల్ గత రేండు రోజులక్రితం తప్పిపోయినట్లు కంప్లయింట్ ఇచ్చాడు. వివేక్ ఎవరో వాళ్ళకి బాగా తెలియయడంతో పెద్దగా ప్రశ్నలు వెయ్యకుండా ఆ కంప్లయింట్ రెండు రోజుల క్రితం ఇచ్చినట్లు వ్రాసుకొని "ఎవరైనా అడిగితే మీ కార్ బషీరాబాగ్ లో పార్క్ చేసినప్పుడు పోయిందని చెప్పండి" అని వివేక్ కి చెప్పారు. వివేక్ అక్కడనుండి వెళ్ళిపోయాడు.

వివేక్ రెండు తప్పులు చేసాడు. 1. లాయర్ కాంతారావు "SUV ని ఎవరికంట పడకుండా ఊరి బయటకి తీసుకెళ్లి తగలపెట్టండి" అని చెప్పాడు. కానీ... వివేక్ గత రాత్రి డ్రింక్స్ మత్తులో అది సరిగ్గా వినలేదు. వెహికల్ ని తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా దాచెయ్యమని చెప్పాడు. 2. SUV లో GPS Tracking System ని disable చెయ్యడం పెద్ద మిస్టేక్... వివేక్ SUV కి GPS Tracking System వుంది. దీనివల్ల వెహికల్ ఎక్కడున్నా కనుక్కోవచ్చు. ఆ సిస్టం ని disable చెయ్యాలంటే దానికి లాగిన్ కోడ్ వాడాలి. ఆ కోడ్ లేకుండా ఎవరూ GPS Tracking System ని disable చెయ్యలేరు. ఆ కోడ్ వెహికల్ ఓనర్ దగ్గర ఉంటుంది. వివేక్ చేసిన పనులు లాయర్ కాంతారావు... కైలాష్ గౌడ్ లకి కూడా తెలీదు. వాళ్ళకి తెలిస్తే సిట్యుయేషన్ ఇంకో రకంగా ఉండేది. ఈ రెండు మిస్టేక్స్ వల్ల జరిగిన పరిణామాల తో చాలా మంది ప్రాణాలు పోయాయి.


లాయర్ కాంతారావు... కైలాష్ గౌడ్... ఇద్దరూ భయపడుతూ హోమ్ మినిస్టర్ ధనంజయ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ధనంజయ తన ఆఫీస్ రూమ్ లో బాగా అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తూ వీళ్ళిద్దరికోసం ఎదురు చూస్తున్నాడు.

ధనంజయ: వచ్చారా... అసలు ఏమి జరిగింది? నాకు రకరకాల సమాచారం వస్తోంది. BHEL దగ్గర ఎవరో రేప్ విక్టిమ్ దొరికిందని... కైలాష్ మనుషులని అరెస్ట్ చేశారని... ఆ రేప్ విక్టిమ్ కి నీ మనుషులకి సంభంధం ఏమిటీ?

కైలాష్ గౌడ్ గత 24 గంటలుగా జరిగిన సంఘటనలన్నీ వివరంగా ధనంజయ కి వివరించాడు... అది విన్న ధనంజయ కోపంతో ఊగిపోయి గట్టిగా కేకలేస్తూ "ఎక్కడ... సంజీవ్... ఎక్కడున్నాడు... పిలవండి" అంటూ కేకలేశాడు. పనిమనిషి ఒకడు హడావిడిగా వచ్చి "చిన్న బాబుగారు ఇంకా లేవలేదండి" అని చెప్పాడు... అది విన్న ధనంజయ "వాడిని లేపి ఇక్కడికి తీసుకొని రా..." అని రంకెలేశాడు. దాదాపు ఒక పావుగంట తరువాత సంజీవ్ తూలుకుంటూ వచ్చాడు. ధనంజయ కోపంతో తన ఆఫీస్ టేబుల్ మీదున్న వాటర్ జగ్ తీసుకొని అందులోని నీళ్ళని సంజీవ్ మొహం కేసి బలంగా కొట్టాడు. దాంతో సంజీవ్ ఈ లోకంలోకి వచ్చాడు...

ధనంజయ: నిన్న రాత్రి ఎక్కడున్నావు?

సంజీవ్: ఫ్రెండ్స్ తో కలసి చిన్న పార్టీ

ధనంజయ: ఆ పార్టీ లో ఎవరెవరున్నారు?

సంజీవ్: నేను, వివేక్, రాకేష్, కిరణ్.

ధనంజయ: అంతేనా... ఇంకెవరూ లేరా...

సంజీవ్(కొంచం అనుమానంగా): ఏమి... ఎందుకలా అడుగుతున్నారు?

ధనంజయ(కోపంగా అరుస్తూ): ఆ అమ్మాయిని ఎందుకురా అలా రేప్ చేశారు? ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో తెలుసా? మీరు రేప్ చేసిన తరువాత ఆమెని మన కైలాష్ మనుషులు రోడ్ మీద పడేసారు. అది చూసిన జనాలు ఆమె ని హాస్పిటల్ కి తరలించారు. ఇప్పుడు ఆ అమ్మాయి కనుక స్పృహలోకివచ్చి మిమ్మల్ని గుర్తుపడితే... మీ నలుగురి జీవితాలు సర్వ నాశనం అవుతాయి... అసలు మీరు రేప్ ఎందుకు చేసారు? టీవీ ఛానల్ వాళ్ళు... సోషల్ మీడియా... ఈ ఇన్సిడెంట్ కి పూర్తి కవరేజ్ ఇస్తోంది. మీ పేర్లు బయటకి వస్తే నేను నా పదవికి రాజీనామా చెయ్యాల్సి వస్తుంది. మా పార్టీ లో చాలా మంది నా సీట్ కోసం ఎదురుచూస్తున్నారు.

సంజీవ్ మౌనంగా ఉండిపోయాడు. గత రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఇలా అవుతుందని అసలు ఊహించలేదు.

ధనంజయ: పో... నాకు చెప్పకుండా ఇంట్లోంచి కదలకు.

సంజీవ్ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ధనంజయ(కైలాష్ వైపుచూస్తూ): ఈ సంగతి ఇప్పుడు మహేంద్ర కి ఎలా చెప్పాలి? అసలు పని కాలేదు... పైగా ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. అంతా పక్కాగా ప్లాన్ చేసాము కదా... ఎక్కడ తేడా వచ్చింది?

కైలాష్ గౌడ్: అదే అర్ధం కావడంలేదు. నేను బాగా నమ్మకమైన వాళ్ళని పంపాను. ఇలా అవుతుందని ఊహించలేదు.సింపుల్ గా అవ్వాల్సిన పని... ఇందులో మన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని బయటకి లాగాలి. లేకపోతే మనమంతా ఇరుక్కుపోతాము.

ధనంజయ(కాంతారావు తో): ఇప్పుడు ఏమి చెయ్యాలి?

కాంతారావు: మన పిల్లల్ని బయటకి లాగాలంటే... DNA సాంపిల్స్ ని మార్చెయ్యాలి... ఎవిడెన్స్ ని తారుమారు చెయ్యాలి. అంత ఈజీ కాదు.

ధనంజయ: ఏమి? ఎందుకని?

కాంతారావు: ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ని డాక్టర్ ప్రభావతి చూస్తోంది. చాలా స్ట్రిక్ట్. దేనికి లొంగదు. ఇప్పుడు మనం కల్పించుకుంటే... అందరూ మనల్ని సందేహిస్తారు. ప్రస్తుతం కైలాష్ మనుషులు లోపలున్నారు. ముందు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రానివ్వండి. టైం చూసుకొని కైలాష్ మనుషుల DNA సాంపిల్స్ తో ఒరిజినల్ రిపోర్ట్ ని మారుదాం. ప్రస్తుతానికి మన పిల్లల మీద ఎవరికి అనుమానం లేదు. ఈ కేసు ని జాగ్రత్తగా మానిటర్ చేసి మన పిల్లల మీదకి రాకుండా చూడాలి. దానికోసం కైలాష్ మనుషులని బలి చేద్దాం.

ధనంజయ: ఇదంతా ఎక్కడ జరిగింది?

కాంతారావు: వివేక్ SUV లో జరిగింది. మేము దాన్ని తగలబెట్టడానికి ఏర్పాట్లు చేసాము.

అదే సమయంలో కైలాష్ కి ఫోన్ వచ్చింది... మహేంద్ర... కైలాష్ స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ధనంజయ టేబుల్ మీద పెట్టాడు.

మహేంద్ర: గుడ్ మార్నింగ్ కైలాష్... పని అయ్యిందా...

కైలాష్ గౌడ్(చాలా వినయంగా... కొంచం భయపడుతూ): సర్... అది... కొంచం ప్రాబ్లెమ్ వచ్చింది... పని అవ్వలేదండి...

మహేంద్ర: ఏమైంది? ఎందుకని కాలేదు? నీకు తెలుసుగా... పని కాకపోతే అది నాకు ఎంత రిస్క్ అవుతుందో... ఇప్పుడే టీవీ న్యూస్ లో చూసాను. నీ మనుషులు ఎవరో ఆడపిల్లని రేప్ చేసి రోడ్ మీద పడేశారని... నిజమేనా... ఇది నాకు ఏదైనా ప్రాబ్లెమ్ అవుతుందా... నీ మీద నమ్మకం తో ఈ పనికి ఒప్పుకున్నాను...

ధనంజయ: మహేంద్ర... గుడ్ మార్నింగ్... ఇందులో కైలాష్ మనుషుల తప్పు లేదు. This is very embarrassing... ఆ రేప్ చేసింది మన పిల్లలు... వివేక్... రాకేష్... సంజీవ్... కిరణ్.

మహేంద్ర: వాట్... కిరణ్... ఎవరూ... నా మేనల్లుడు... కిరణ్?

ధనంజయ: ఎస్... ఇప్పుడే నాకు తెలిసింది.

మహేంద్ర: అసలు వాళ్ళు ఇందులో ఎలా ఇన్వొల్వె అయ్యారు?

ధనంజయ: అదో పెద్ద కథ... నేను నీకు తీరిగ్గా చెప్తాను... ఫోన్ లో చెప్పేది కాదు...

మహేంద్ర: Are you sure... Kiran is involved in this?

ధనంజయ: ఎస్... పాజిటివ్... కావాలంటే నువ్వు అడిగి చూడు... ఫోన్ లో మాత్రం అడగకు.

మహేంద్ర: అసలు ఈ కేసు ని ఇంకో రకంగా డీల్ చేసినట్లయితే బాగుండేది. అనవసరంగా ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఈ ఇష్యూ ని ఎప్పుడో క్లోజ్ చేసెయ్యాల్సింది. పొరపాటయ్యింది.

ధనంజయ: మనమెవరం ఇలా అవుతుందని అనుకోలేదు... ఇది ఇప్పుడు నీ ఒక్కడి సమస్య కాదు. ఇది మన నలుగురికి సంభందించినది. మేము దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేస్తాము. నన్ను నమ్ము... నా పొజిషన్ వాడి దీన్ని మన మీదకి రాకుండా చూస్తాను.

మహేంద్ర: అన్ని రకాలుగా ఆలోచించండి. ఆ రేప్ విక్టిమ్ డీటెయిల్స్ ఏవి కూడా నాకు లింక్ కాకుండా చూసుకోవాలి. పైగా వచ్చే నెలలో నా పేరు రాజ్యసభ కి నామినేట్ అవబోతోంది.

ధనంజయ: అవును. ఇది ఆ లోపలే సాల్వ్ అయ్యేట్లు చూస్తాను.

మహేంద్ర ఫోన్ పెట్టేసాడు.

ధనంజయ: ఆ ప్రభావతి ని మనవైపు తిప్పుకోలేమా...

కైలాష్: నీకు ఆమె గురించి బాగా తెలుసు. ఇంత వరకు ఎప్పుడూ ఎటువంటి ప్రెషర్ కి లొంగలేదు. చాలా నిక్కచ్చిగా డ్యూటీచేస్తుంది...

ధనంజయ: మనం హై లెవెల్లో కాకుండా కొంచం కింద లెవెల్లో ట్రై చేద్దాం... ఎవరిని అడుగుదాం...

కైలాష్: ఈ కేసు డీల్ చేస్తున్న CI సుధీర్ ని కలుస్తాను. పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటాను.

ఇప్పుడు అందరి మదిలో పోలీస్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ Dr. ప్రభావతి గురించే ఆలోచిస్తున్నారు...


ప్రభావతి... పోలీస్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. ఆమె దగ్గరికి అనాలిసిస్ కోసం ఏదైనా ఎవిడెన్స్ వస్తే దాన్ని పక్కాగా ఇన్వెస్టిగేట్ చేసి 100% కరెక్ట్ రిపోర్ట్ ఇస్తుంది. ఎవరు ఎంత చెప్పినా తన రిపోర్ట్ ని మార్చి ఇవ్వదు. కావాలనుంటే కోర్ట్ కెళ్ళి సాక్ష్యం కూడా చెప్తుంది... ఆమెకి డిపార్టుమెంటు లో చాలా పలుకుబడి వుంది. ఆమె అంటే అందరికి గౌరవం... మర్యాద ఉన్నాయి. ప్రత్యేకించి ఆమె దగ్గరికి ఏదైనా రేప్ విక్టిమ్ ఎవిడెన్స్ వస్తే ఆమె ఇంకా శ్రద్ధగా... జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. క్రిమినల్ ని జైలు కి పంపేదాకా నిద్ర పోదు.

ఆమె మెడిసిన్ చేస్తున్న రోజుల్లో... అంటే... 1978 లో ఒక రేప్ కేసు రాష్ట్రం మొత్తం కుదిపేసింది... హైదరాబాద్ లోని నల్లకుంట పోలీస్ స్టేషన్ లో రమీజా బీ అనే ముస్లిం మహిళని నలుగురు పోలీస్ డీపార్టుమెంట్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో రేప్ చెయ్యడం జరిగింది. ఆ సంఘటన తో చెలరేగిన గొడవలు అదుపు చేయడానికి ఒకే రోజులో హైదరాబాద్ లో 11 చోట్ల పోలీస్ ఫైరింగ్ చెయ్యాల్సి వచ్చింది. తరువాత దాదాపు 50 రోజులపాటు సిటీ మొత్తం కర్ఫ్యూ పెట్టడం జరిగింది... అప్పటినుండి... ప్రభావతి కి రేప్ కేసు అన్నా... రేపిస్ట్స్ అన్నా... చాలా కసి. తన ఇన్వెస్టిగేషన్ లో సరైన క్రిమినల్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన శిక్ష పడే దాకా ఆమె కి మనశాంతి ఉండదు... ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరికి తెలుసు. ప్రస్తుతం జరిగిన రేప్ కేసు ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ని ఆమె చూస్తోంది. కైలాష్ గౌడ్ కి ఆమె గురించి చాలా బాగా తెలుసు. అందుకే చాలా ఖంగారు పడుతున్నాడు.

Dr. ప్రభావతి నేరుగా రేప్ విక్టిమ్ ని ఉంచి హాస్పిటల్ కి వెళ్ళింది... రేప్ విక్టిమ్ కండిషన్ చూడగానే ఆమె కి ఏడుపొచ్చింది. దాదాపు 30 నిమిషాల తరువాత కానీ నార్మల్ మనిషి కాలేక పోయింది. అక్కడ డ్యూటీ డాక్టర్ సహాయంతో ఆ శరీరం నుండి DNA సాంపిల్స్ ని కలెక్ట్ చేసుకొని వెళ్లబోయే ముందు ఇంకోసారి ఆ రేప్ విక్టిమ్ ని పరీక్షగా చూసి మనసులో "నువ్వెరివో నాకు తెలీదు... నువ్వు బతుకుతావో లేదో కూడా తెలీదు... కానీ... నీ ఈ స్థితికి కారమైన వాళ్ళు మాత్రం ఊరి కంభం ఎక్కేదాకా నేను నిద్రపోను" అని మనసులో అనుకుంది.


Part - 3 - The Story Behind the Crime

విక్రాంత్ ఆరోజు రాత్రి ఏమి జరిగిందో... వాళ్లిద్దరూ ఆ సమయంలో అక్కడెందుకున్నారో... వివరంగా చెప్పసాగాడు...

రాత్రి సమయం 8 గంటలు. స్థలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.

విక్రాంత్... తన ఫ్రెండ్ గణేష్ తో కలసి రైల్వేస్టేషన్ కి పక్కనే ఉన్న ఒక ఇరానీ కేఫ్ లో కూర్చొని ఉన్నారు. ఇద్దరూ జనలిస్ట్స్... ఒకప్పుడు "సూర్యోదయం" అనే ఒక TV ఛానల్ లో పనిచేసేవాళ్ళు. ఆ TV ఛానల్ ఓనర్ కైలాష్ గౌడ్. వాళ్లిద్దరూ స్టింగ్ ఆపరేషన్ చెయ్యడం లో సిద్ధహస్తులు. ఒకసారి వాళ్ళు ఢిల్లీ లో డిఫెన్స్ మినిస్ట్రీ లో పనిచేసే ఒక ప్రిన్సిపాల్ సెక్రటరీ దగ్గరకి కస్టమర్స్ లాగా వెళ్లి రెండు కోట్ల రూపాయలకి ఒక డీల్ కుదుర్చుకొని... డబ్బులు ఇవ్వడాన్ని మొత్తం వీడియో తీసి TV ఛానల్ కి ఇచ్చారు. ఈ న్యూస్ TV లో వస్తే వాళ్ళు కి బాగా పేరు వస్తుందని కలలు కన్నారు. కానీ... కైలాష్ ఆ వీడియో ని అడ్డం పెట్టుకొని ఆ ప్రిన్సిపాల్ సెక్రటరీ ని బ్లాక్ మెయిల్ చేసి ఒక పెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్ సంపాదించుకొని ఆ వీడియో ని వెనక్కి ఇచ్చేసాడు. దాంతో విక్రాంత్ కోపంగా వెళ్లి ఆ TV ఛానల్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ వీడియో ని టెలికాస్ట్ చెయ్యకపోతే వేరే ఛానల్ వాళ్ళని కలుస్తానని బెదిరించడం తో కైలాష్ గౌడ్ మనుషులు విక్రాంత్ ని... అతని ఫ్రెండ్ గణేష్ ని కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించాడు. వాళ్ళు చాలా కష్టం మీద ఆ కేసు లోంచి బయట పడ్డారు. ఆ తరువాత కైలాష్ గౌడ్ కి భయపడి హైదరాబాద్ లో ఏ న్యూస్ పేపర్... TV ఛానల్ వాళ్ళిద్దరికీ జాబ్ ఇవ్వలేదు. ప్రస్తుతం వాళ్ళు ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తూ న్యూస్ ఐటమ్స్ కలెక్ట్ చేసి తమ ఫ్రెండ్ ద్వారా వేరే టీవీ ఛానల్ లో వేయించి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ రోజు కూడా వాళ్ళు ఒక న్యూస్ ఐటెం కోసం ఆ ఇరానీ కేఫ్ లో టీ తాగుతూ ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు.

సరిగ్గా అదే సమయం లో ఒక బ్లాక్ కలర్ ఇన్నోవా వచ్చి ఆ ఇరానీ కేఫ్ కి ఎదురుగా ఆగింది. అందులోంచి యాదగిరి దిగి సిగరెట్ వెలిగించి తన మొబైల్ ఫోన్ చెక్ చేసుకున్నాడు. కాల్స్ ఏమి రాలేదు.

యాదగిరి కార్ దిగడం గణేష్ చూసి ఆశ్చర్యపోతూ మౌనంగా విక్రాంత్ కి సైగ చేసాడు. విక్రాంత్ కార్ దగ్గర సిగరెట్ కాలుస్తున్న యాదగిరి ని చూసాడు. 'వీడేమిటీ .. ఇక్కడున్నాడు?' అని మనసులో అనుకున్నాడు. యాదగిరి బయట ఎక్కువగా తిరగడు. ఏదైనా చాలా ముఖ్యమైన పని ఉంటేనే కైలాష్ గౌడ్ వాడిని పంపిస్తాడు. విక్రాంత్ ఆ కార్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారో పరిశీలించి చూసాడు. డ్రైవర్ సీట్ లో సైదులు... వెనక సీట్ లో కిషన్... జిలాని కనిపించారు.

విక్రాంత్ (గణేష్ తో):ఈ జిలాని... కిషన్ ఇక్కడున్నారేమిటీ? వీళ్ళు జైలు నుంచి బయటికి ఎప్పుడు వచ్చారు?

గణేష్: ఈ మధ్య నే బెయిల్ మీద బయటకి వచ్చారు.

విక్రాంత్: యాదగిరి... సైదులు... కిషన్... జిలాని... ఈ నలుగురు కలసి ఉన్నరంటే... ఏదో పెద్ద గొడవ జరగబోతోదన్నమాట...

గణేష్: అవును. ఏదైనా పెద్ద క్రైమ్ చెయ్యాలంటే వీళ్ళు నలుగురు కలసి బయటకి వస్తారు.

విక్రాంత్ : మన వాడు ఇంకా రాలేదేమిటీ... ఫోన్ చేసి కనుక్కో వాడు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో...

>

గణేష్ తన ఇన్ఫోర్మాంట్ కి ఫోన్ చేసాడు... వాడు చిక్కడపల్లి లో ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్నాడు... రావడానికి కనీసం ఇంకో 30 నిమిషాలు పడుతుందని చెప్పాడు. విక్రాంత్ కి ఒక ఐడియా వచ్చింది. తమకి టైం 30 నిమిషాల టైం వుంది కాబట్టి... యాదగిరి & గ్యాంగ్ ని అబ్సర్వ్ చెయ్యాలని నిర్ణయించుకొని... " గణేష్... బ్యాగ్ లోంచి మన "త్రినేత్ర" బయటకి తియ్యి" అని అన్నాడు... గణేష్ వెంటనే తన బ్యాక్ ప్యాక్ లోంచి ఒక డబ్బా తీసాడు. ఆ డబ్బా మీద " Hasselblad " అని చాలా నీట్ గా embose చేసివుంది. విక్రాంత్ దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసాడు. లోపల చాలా ఆర్డినరీ గా కనిపిస్తున్న కళ్ళజోడు ఉంది. ఆ కళ్ళజోడు సామాన్యమైనది కాదు. ఆ కళ్ళజోడు ఫ్రేమ్ లో కుడి... ఎడమ... వైపు రెండు పవర్ఫుల్ 20 మెగా పిక్సెల్ సూపర్ మైక్రో కెమెరాలు ఉన్నాయి. వాటిని తయారుచేసింది స్వీడన్ కి చెందిన "Hasselblad" అనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కంపెని. చాలా పవర్ఫుల్ ఇన్ఫ్రారెడ్... నైట్ విజన్... బ్లూత్ టూత్... టెక్నాలజీ లతో తయారుచేసిన గాగుల్స్. ఇమేజ్ స్టెబిలైజషన్... 4K రికార్డింగ్ దాని స్పెషలిటీ. పగలు... రాత్రి... అనే తేడా లేకుండా రికార్డు చెయ్యగలదు. దాని షూటింగ్ రేంజ్ 250 మీటర్లు. వీడియోస్ చాలా క్లియర్ గా వస్తాయి. ఆ గాగుల్స్ ని ఐఫోన్ లో ఒక ఆప్ కి సింక్ చేస్తారు. వీడియోస్ డైరెక్ట్ గా ఐఫోన్ లో రికార్డు అవుతాయి. ఆ గాగుల్స్ ని విక్రాంత్ ఫ్రెండ్ అమెరికా నుంచి తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. దానికి విక్రాంత్ "త్రినేత్ర" అని ముద్దుగా పిలుస్తాడు.

విక్రాంత్ త్రినేత్ర ని పెట్టుకొని ఆన్ చేసి తన ఐఫోన్ కి సింక్ చేసాడు. వీడియో చాల క్లియర్ గా స్ట్రీమ్ అవ్వసాగింది. రికార్డు బటన్ ఆన్ చేసి తన ద్రుష్టి యాదగిరి & గ్యాంగ్ మీద పెట్టాడు. గణేష్ ఐఫోన్ లో రికార్డు అవుతున్న వీడియో ని చెక్ చేసాడు. రాత్రి పూట తక్కువ లైటింగ్ లో కూడా వీడియో చాల క్లియర్ గా రికార్డు అవుతోంది. అప్పుడే యాదగిరి ఫోన్ రింగ్ అయింది. కాలుస్తున సిగరెట్ విసిరికొట్టి ఫోన్ లో ఒక 30 సెకండ్స్ మాట్లాడి, సైదులుకి ఏదో చెప్పి కదిలాడు.

విక్రమ్ వెంటనే లేచి యాదగిరి వెనకనే ఒక 100 మీటర్లు దూరం లో వెంబడించసాడు. గణేష్ ఇరానీ కేఫ్ లో నే ఉండి ఐఫోన్ లో రికార్డు అవుతున్న వీడియో చూడసాగాడు.

యాదగిరి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాడు. అతని వెనకాలే విక్రాంత్ కూడా వెళ్ళాడు. యాదగిరి నేరుగా బ్రిడ్జి ఎక్కి platform నెంబర్ 6 చేరుకున్నాడు. ఆ platfarm ఆ సమయం లో ఇద్దరు మనుషులు తప్ప ఎవరూ లేరు. యాదగిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. విక్రాంత్ వారిని పరీక్షగా చూసాడు. ఒక ముసలి వ్యక్తి. తెల్లటి ధోతి... లాల్చీ వేసుకొని ఉన్నాడు. దాదాపు 70 ఏళ్ళు ఉండవచ్చు. ఆయన పక్కనే ఒక యువతి 20 లేదా 22 ఏళ్ళు ఉంటాయి. తెల్లగా... చాలా అందంగా ఉంది. సల్వార్ డ్రెస్ వేసుకొని ఉంది. యాదగిరి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఆ యువతి ఏదో అడుగుతోంది... యాదగిరి వినయంగా తలాడిస్తూ జవాబులు ఇస్తున్నాడు. ఇంతలో ఆ యువతి తన బాగ్ లోంచి మొబైల్ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది. కాల్ కనెక్ట్ అవ్వలేదు. రెండు... మూడు సార్లు ట్రై చేసింది... ఫలితం లేదు. అదే సమయంలో యాదగిరి తన ఫోన్ ఆమెకి ఇచ్చాడు. ఆమె యాదగిరి ఫోన్ లోంచి ఒక నెంబర్ డయల్ చేసింది. కనెక్ట్ అయింది... ఆమె ఒక రెండు నిమిషాలు ఫోన్ లో మాట్లాడి యాదగిరి కి ఇచ్చింది. యాదగిరి కూడా ఒక 15 సెకండ్స్ మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆమె సూటుకేసు... బాగ్ తీసుకొని బయలు దేరాడు. యాదగిరి వెనకాలే ఆ ముసలి వ్యక్తి తన బాగ్ భుజాన వేసుకొని బయలుదేరాడు. ఆ యువతి తన హ్యాండ్ బాగ్ తీసుకొని ఆ ముసలి వ్యక్తి వెనకాలే నడవసాగింది...

విక్రాంత్ వాళ్ళని తన గాగుల్స్ కెమెరా ఫ్రేమ్ లో క్లియర్ గా వచ్చేట్లు చూసుకుంటూ తన ఫోన్ లో గణేష్ కాల్ చేసి "వీడియో బాగా వస్తోందా?" అని అడిగాడు... "100% క్లియర్ పిక్చర్" అని గణేష్ అన్నాడు.

యాదగిరి బ్రిడ్జి మెట్లు ఎక్కసాగాడు... విక్రాంత్ ఎదురుగా నుంచొని ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ వాళ్ళ వైపే చూడసాగాడు. ముందు యాదగిరి ఎక్కాడు... అతని వెనకాలే ముసలి వ్యక్తి వచ్చాడు... ఆయన వెనక ఆ యువతి వచ్చింది... ఆమె అందం చూసి విక్రాంత్ మతి పోయింది. చాలా తెల్లగా వుంది. సినిమా హీరోయిన్ ఎవరూ ఆమెకి సాటి రారు. ఆ ముగ్గురూ ఎగ్జిట్ గేట్ వైపు వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే విక్రాంత్ కూడా బయలుదేరాడు.

యాదగిరి స్టేషన్ బయటికి రాగానే సైదులు కి ఫోన్ చేసి కార్ తెమ్మని చెప్పాడు. సైదులు వెంటనే కార్ స్టార్ట్ చేసి స్టేషన్ వైపు వెళ్ళాడు. అది చూసి వీడియో రికార్డింగ్ చూస్తున్న గణేష్ కూడా టీ కి డబ్బులు ఇచ్చేసి తన మోటార్ సైకిల్ ఎక్కి సైదులు కార్ వెనకాలే వెళ్ళాడు. సైదులు కార్ ని యాదగిరి దగ్గర ఆపాడు. యాదగిరి లగ్గేజ్ ని కార్ వెనక డోర్ తీసి పెట్టాడు. కిషన్ ... జిలాని వెనక సీల్ లో కూర్చున్నారు. మధ్య సీట్ లో ఆ యువతి... ముసలి వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. ముందు సీట్ లో యాదగిరి ఎక్కాడు. సైదులు కార్ నడుపుతున్నాడు. కార్ స్టేషన్ లోంచి బయటకి వచ్చింది. ఆ కార్ వెనకాలే మోటార్ సైకిల్ మీద విక్రాంత్... గణేష్ కదిలారు. విక్రాంత్ మోటార్ సైకిల్ నడుపుతున్నాడు. అతని గాగుల్స్ కెమెరా రేంజ్ లో యాదగిరి కార్ ఉండేలా చూసుకుంటూ నడుపుతున్నాడు. సైదులు కార్ ని హైటెక్ సిటీ వైపు నడిపిస్తున్నాడు. ఇన్నోవా ఒక ఫ్లైఓవర్ మీదకి ఎక్కింది. వాళ్ళ వెనకాలే విక్రాంత్... గణేష్ కూడా వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయం లో ఒక Mercedez Benz SUV కూడా ఆ ఫ్లై ఓవర్ ఎక్కింది. ముందు వెళ్తున్న ఇన్నోవా ని చూసి దాని పక్కనే నెమ్మదిగా కదలసాగింది. మోటార్ సైకిల్ మీద వెనక సీట్ మీద కూర్చున్న గణేష్ " ఆ బెంజ్ కార్ కైలాష్ గౌడ్ కొడుకు వివేక్ నడుపుతాడు" అని విక్రమ్ కి చెప్పాడు. విక్రమ్ తెలుసన్నట్లు తలూపాడు. అతని ద్రుష్టి అంతా ముందు వెళ్తున్న ఇన్నోవా మీద వుంది. ఆ బెంజ్ కార్ ఎందుకు యాదగిరి ఇన్నోవా పక్కనే అంత నెమ్మదిగా వెళ్తోందో అర్ధం కాలేదు. అదే సమయంలో బెంజ్ కార్ కొంచం స్పీడ్ పెంచి ముందుకెళ్లింది... ఇన్నోవా ఆ బెంజ్ కార్ వెనకాలే వేళ్ళ సాగింది. దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణం చేసాక బెంజ్ కార్ హై వే లో ఒక పెట్రోల్ బంక్ లో ఆగింది. ఆ బెంజ్ కార్ పక్కనే ఇన్నోవా కూడా ఆగింది. ఆ పెట్రోల్ బంక్ పేరు "కైలాష్ సర్వీస్ స్టేషన్"

ఆ పెట్రోల్ బంక్ కి 150 మీటర్లు దూరం లో విక్రాంత్ మోటార్ సైకిల్ ఆపాడు. పెట్రోల్ బంక్ లో బెంజ్ కార్... పక్కనే ఇన్నోవా క్లియర్ గా కనిపిస్తున్నాయి. బెంజ్ కార్ డ్రైవర్ సీట్ లోంచి వివేక్ దిగాడు. డ్రైవ్ ప్రక్క సీట్ లోంచి కిరణ్ దిగాడు. వాళ్లిద్దరూ యాదగిరి తో మాట్లాడుతున్నారు. కిరణ్ ఎదో అడుగుతున్నాడు... యాదగిరి తడబడుతున్నాడు... వివేక్... కిరణ్ ఎదో సర్దిచెప్తున్నారు... చివరికి యాదగిరి తలూపాడు. కిరణ్ బెంజ్ కార్ లో వెనక సీట్ లో కూర్చున్న వాళ్ళతో ఎదో చెప్పాడు... వెనక డోర్ తీసుకొని ఒక కుర్రోడు కిందకి దిగాడు. అతని పేరు సంజీవ్... రాష్ట్ర హోమ్ మోనిస్టర్ కొడుకు.. బెంజ్ కార్ వెనక డోర్ తీసి పట్టుకున్నాడు.

యాదగిరి ఇన్నోవా దగ్గరికి వెళ్లి వెనక సీట్ లో కూర్చున్న ఆ యువతి తో చాలా మర్యాదగా ఏదో చెప్పాడు. ఆమె కిందకి దిగింది. ఆమె ని చూడగానే కిరణ్ ఆమె చెయ్యి పట్టుకొని బెంజ్ కార్ వెనక సీట్ వైపు తోసాడు. సంజీవ్ ఆమెని కార్ లోకి నెట్టాడు... ఆమె తూలి బెంజ్ కార్ వెనక సీట్ లో పడబోయి వెనక్కి జరిగింది. కానీ... ఆమె వెనక నుంచున్న సంజీవ్ ఆమెని లోపలి బలవంతంగా తోసాడు. అప్పటికే లోపల కూర్చున్న ఇంకో కుర్రాడు రాకేష్... లాయర్ కాంతారావు కొడుకు ఆమెని పట్టుకొని లోపలి లాగేసాడు. ఆమెని లోపలి తోసి వెనకాలే సంజీవ్ కూడా ఎక్కాడు. అప్పటికే కిరణ్ కార్ ఎక్కేసాడు. సంజీవ్ కార్ ఎక్కి తలుపు వెయ్యగానే వివేక్ కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టం స్విచ్ ఆన్ చేసి వేగంగా ఆ పెట్రోల్ బంక్ లోంచి వెళ్ళిపోయాడు. ఆ యువతి తో పాటు వచ్చిన ముసలి వ్యక్తి ఇది గమనించి ఇన్నోవా కార్ డోర్ తీసుకొని అరుస్తూ బెంజ్ కార్ కి అడ్డు వెళ్ళబోతూంటే జిలాని ఒక ఐరన్ రాడ్ పెట్టి ఆ ముసలి వ్యక్తి ని గట్టిగా కొట్టాడు... ఆయన మొదలు నరికిన చెట్టులా కూలపడిపోయాడు. సైదులు... యాదగిరి ఆ ముసలాయనను ఎత్తుకొని ఇన్నోవా వెనక లగ్గేజ్ తో పాటు పడేసారు. జిలాని ఆ ఐరన్ రాడ్ ని కూడా ఆ ముసలివ్యక్తి తో పాటు లగ్గేజ్ మీద పడేసి వెనక డోర్ వేసి ఇన్నోవా వెనక సీట్ లో కూర్చున్నాడు. ఇన్నోవా కూడా పెట్రోల్ బంక్ లోంచి బయటకి వచ్చింది.

ఇదంతా చూస్తున్న విక్రమ్... గణేష్ మతిపోయి చూడసాగారు. నెమ్మదిగా తేరుకొని ఇన్నోవా ని వెంబడించసాగారు... వాళ్ళ బుర్ర తిరిగి పోతోంది... కళ్ళముందే ఒక ఆడపిల్లని ఎత్తుకొని పోయారు... ఒక ముసలి వ్యక్తి హత్య కి గురి అయ్యాడు. గణేష్ వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసాడు... ఆ ఏరియా లో మొబైల్ నెటవర్క్ లేదు... కాల్ కనెక్ట్ కాలేదు. విక్రాంత్ ఇన్నోవా ని తన ద్రుష్టి నుంచి తప్పించుకోకుండా ఫాలో అవ్వసాగాడు. ఏమి చెయ్యాలో తెలియడం లేదు... ఇంతలో సడన్ గా ఇన్నోవా వేగం పెంచి దూసుకొని వెళ్ళిపోయింది... విక్రాంత్ తాను కూడా వేగం పెంచి ఇన్నోవా ని వెంబడించసాగాడు. కానీ... ఇన్నోవా చాలా వేగం గా దూసుకొని ఎటూ వెళ్ళిపోయింది.

విక్రమ్ కి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఇన్నోవా ఎటు వెళ్లిందో తెలియడం లేదు...

గణేష్ (విక్రమ్ తో) : ఆ అమ్మాయిని వాళ్ళు పాడు చేస్తారు... ఎలాగైనా కాపాడాలి...

విక్రమ్: పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చెయ్యి...

గణేష్ 100 కి రింగ్ చేసాడు... మొబైల్ నెటవర్క్ లేదు... కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. విక్రమ్ ఆలోచించాడు... వెంటనే హత్య జరిగిన పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తూ ఆలోచించసాగాడు... బెంజ్ కార్ ఎటు వెళ్లి ఉంటుందో... ఒక ఆడ పిల్లని కిడ్నప్ చేసి తీసుకెళ్లారు... రేప్ చెయ్యాలంటే ఏదైనా నిర్మానుష్య ప్రాంతం కావాలి... విక్రమ్... గణేష్... వాళ్లకి అనుమానం వచ్చిన ప్రాంతాలన్నీ ఆ రాత్రంతా కలియ తిరిగారు... ఎక్కడా బెంజ్ కార్ జాడ తెలియలేదు... చివరికి తెల్లవారు ఝామున హైదరాబాద్ వైపు వెళ్తూంటే... సడన్ గా యాదగిరి ఇన్నోవా వాళ్ళ ని దాటుకుంటూ BHEL క్రాస్ రోడ్స్ వైపు వెళ్ళసాగింది... అంతే... విక్రమ్ శరవేగంతో దాన్ని వెంబడించసాగాడు... చాలా ఆవేశంగా... ఉక్రోషంతో మోటార్ సైకిల్ నడపసాగాడు... ఇంతలో ఇన్నోవా సడన్ గా BHEL క్రాస్ రోడ్స్ దగ్గర ఆగిపోయింది... యాదగిరి తూలుకుంటూ కార్ దిగాడు... అతని పాటే సైదులు కూడా రెండో వైపు నుంచి దిగాడు. యాదగిరి వెనక సీట్ డోర్ ఓపెన్ చేసాడు. లోపల నుంచి కిషన్ ఆ యువతి ని బయటకి తోసాడు... యాదగిరి ఆమెని పట్టుకొని బయటకి లాగేసి రోడ్ మీద పడేసాడు... ఇంతలో జనాలు గట్టిగా అరుస్తూ ఇన్నోవా వైపు రావడం గమనించి తాగిన మత్తులోంచి బయట పడి వెంటనే కార్ ఎక్కేసాడు. సైదులు కార్ స్టార్ట్ చేసి ముందుకు పోగానే ఎవరో కుర్రాళ్ళు కార్ కి అడ్డంగా రావడంతో ఖంగారుపడి కార్ ని అటూ ఇటూ పోనిస్తూ కూకట్ పల్లి వైపు వెళ్ళసాగాడు. అదే సమయం లో ఒక పాల వన్ రాంగ్ రూట్ లో రావడం చూసి దాన్ని తప్పించుకోబోయి రోడ్ పక్కెనే ఆగివున్న బస్ కి డాష్ కొట్టేసాడు. అప్పటికే చాలా మంది కుర్రోళ్ళు ఇన్నోవా చుట్టూ చేరారు.


ఇదంతా వింటున్న DSP శేఖర్ బుర్రతిరిగి పోయింది... అవినాష్ ఏమి మాట్లాడలేదు. ఇద్దరూ విక్రాంత్ చెప్పింది అర్ధం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. శేఖర్ అప్పటికే విక్రమ్ మొబైల్ ఫోన్ లోని వీడియో ని పోలీస్ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసాడు. అవినాష్ ఆ వీడియో ని చూడసాగాడు. విక్రాంత్ చెప్పింది... ఆ వీడియో లో రికార్డు అయ్యింది... దాదాపు మ్యాచ్ అవుతోంది... ఆ వీడియో లో డేట్ అండ్ టైం స్టాంప్ ఉంది... ఎన్నింటికి రికార్డింగ్ మొదలయ్యింది... ఎప్పుడు ఆగిపోయింది క్లియర్ తెలుస్తోంది... ఆ వీడియో ని మొదటినుంచి చూస్తూ...

అవినాష్ (విక్రమ్ తో) : నువ్వు ఎన్నింటికి యాదగిరిని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర చూసావు?

విక్రమ్ : దాదాపు 8 దాటాక...

అవినాష్: యాదగిరి ఎంత సేపు ఆ ఇరానీ కేఫ్ ముందు వెయిట్ చేసాడు...

విక్రమ్: ఒక 5 - 10 నిమిషాలు

అవినాష్( వీడియో చూస్తూ) : యాదగిరి కి ఫోన్ వచ్చింది కదా... ఎంత సేపు ఫోన్ లో మాట్లాడాడు?

విక్రమ్: చాలా చిన్న కాల్... ఒక 30 సెకండ్స్ ఉండొచ్చు...

అవినాష్: సికింద్రాబాద్ స్టేషన్ లో ఏ platfarm మీదకి వెళ్ళాడు?

విక్రమ్: 6 నెంబర్ platfarm

అవినాష్: ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది?

విక్రమ్: సల్వార్... కుర్తా...

అవినాష్: ఏ కలర్?

విక్రమ్: లైట్ బ్లూ కలర్...

అవినాష్ చాలా ప్రశ్నలు వేసాడు... విక్రాంత్ ఇచ్చిన సమాధానాలు సరిగ్గా సరిపోయాయి... అవినాష్ కుర్చీలోంచి లేచి తనతో పాటు శేఖర్ ని కూడా తీసుకొని బయటకి వెళ్లి... "ఒక పోలీస్ ని సివిల్ డ్రెస్ లో ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి నీకు ఫోన్ చెయ్యమని చెప్పు... అక్కడ నిజం మొబైల్ నెటవర్క్ ఉందొ లేదో తెలుస్తుంది. వీళ్ళ తో ఫార్మల్ గా స్టేటుమెంట్ మీద సంతకం తీసుకో... డేట్ వెయ్యవొద్దు... ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ రోజు డేట్ వేసి స్టేటుమెంట్ ఫైల్ చేసి వీళ్ళని అవసరమైతే అరెస్ట్ చేద్దాం... ఆ బెంజ్ కార్ ఏమయ్యిందో తెలుసుకోవాలి. నా అనుమానం నిజమైతే... ఈ పాటికి ఆ SUV ని కాల్చేసి ఉంటారు . ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గరవున్న వీడియో గురించి ఎవరికి తెలియకూడదు. ఆ వీడియో ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. డిపార్టుమెంట్ లో కైలాష్ గౌడ్ మనుషులు చాలా మంది ఉన్నారు. చాలా కాలంగా కైలాష్ గౌడ్ ని అరెస్ట్ చెయ్యాలని చూస్తున్నాను... ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది." అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి... "మీరు ఇద్దరూ ప్రతి రోజూ స్టేషన్ కి వచ్చి శేఖర్ కి కనిపించి వెళ్ళాలి. సంతకం పెట్టాల్సిన పని లేదు. ఏ ఒక్క రోజు రాకపోయినా... మీ ఇద్దరినీ అరెస్ట్ చేస్తాను" అని చెప్పాడు... అదే సమయం లో ఒక పోలీస్ వచ్చి "సార్.... ఆ ఇన్నోవా లో దొరికిన వస్తువులు అన్నింటిని కేటలాగ్ చేసాము... మీరు ఒకసారి చూస్తే వాటిని మేము ల్యాబ్ కి పంపిస్తాము అని అన్నాడు.


Part - 4 - The Mercedez Benz

కైలాష్ గౌడ్ ఫోన్ చేసి CI సుధీర్ ని లాయర్ కాంతారావు ఇంటికి రమ్మని చెప్పాడు. సుధీర్ రాగానే...

కైలాష్ : కేసు పరిస్థితి ఏమిటీ? ఛార్జ్ షీట్ తయారు చేశారా?

సుధీర్ : ఇంకా లేదు. ప్రస్తుతానికి FIR తయారవుతోంది. ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యడానికి కనీసం 90 రోజుల టైం వుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ మొదలుకాలేదు. టఫ్ గా ఉంది. ఆ పిల్లని రోడ్ మీద పడెయ్యడం చాలా మంది చూసారు. వాళ్ళు ఈ నలుగురిని ఐడెంటిఫై చెయ్యడం... సోషల్ మీడియా లో వాళ్ళ ఫొటోస్ తో పాటు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ కూడా సర్క్యూలేట్ అవుతున్నాయి. సోషల్ మీడియా లో బాగా కవరేజ్ రావడం తో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పూర్తి పబ్లిసిటీ ఇస్తోంది.

కైలాష్ : ఈ కేసు లో మా వాళ్ళు బయట పడే ఛాన్స్ ఏమాత్రం లేదంటావా?

సుదీర్: చాలా కష్టం. అందరికి తెలిసిపోయింది. ప్రస్తుతం కిడ్నప్... రేప్ & టార్చర్, హత్యాయత్నం చార్జెస్ మీద కేసు తయారు చెయ్యాలని ఆలోచిస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తరువాతే ఛార్జ్ షీట్ లో ఏ ఏ సెక్షన్స్ మీద కేసు పెట్టాలని డిసైడ్ చేస్తాము. వీళ్ళు బయటపడడం చాలా కష్టం. పైగా యాదగిరి, సైదులు, జిలాని, కిషన్... వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. జిలాని... కిషన్... ఈ మధ్యనే బెయిల్ మీద బయటకి వచ్చారు. వీళ్ళకి తప్పకుండా లైఫ్ పడుతుంది.

కైలాష్ : ఒకవేళ రేప్ చేసింది వీళ్ళు కాదని తేలితే?

సుధీర్(అయోమయంగా) : నాకు అర్ధం కాలేదు. వీళ్ళే కదా ఆ అమ్మాయిని రోడ్ మీద పడేసి పారిపోబోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా వీళ్ళే రేప్ చేశారని ఎవిడెన్స్ దొరుకుతుంది. కేసు చాలా బలంగా ఉంది. వీళ్ళు తప్పించుకోవడం చాలా కష్టం.

కైలాష్ మౌనంగా ఉండి పోయాడు. అప్పటిదాకా వాళ్ళ సంభాషణ వింటున్న కాంతారావు మాట్లాడాం మొదలు పెట్టాడు.

కాంతారావు : ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పటిలోగా వస్తుంది?

సుధీర్ : రెండు... మూడు రోజుల్లో వచ్చేస్తుంది... కొన్ని కల్చర్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టొచ్చు. కేసు ఫైల్ చెయ్యడానికి సరిపోయే ఎవిడెన్స్ దొరుకుతుంది.

కాంతారావు: ఫోరెన్సిక్ రిపోర్ట్ లో రేప్ చేసింది... ఈ నలుగురు కాదని తేలితే?

సుదీర్ (అయోమయంగా) : ఒకవేళ రేప్ చేసింది వీళ్ళు కాదని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలితే... అప్పుడు ఈ నలుగురిని ఇంటరాగేట్ చేసి రేప్ చేసింది ఎవరో కనుక్కోవాలి... ఇంకో సంగతి ఏమిటంటే ఈ అమ్మాయి ఎవరో... ఆమె ఐడెంటిటీ తెలీదు. స్టేట్ లో అన్ని పోలీస్ స్టేషన్స్ కి మిస్సింగ్ పర్సన్స్ డీటెయిల్స్ తెప్పిస్తున్నాము. ప్రస్తుతం ఈ కేసు లో డైరెక్ట్ లింక్ ఈ నలుగురికే ఉంది. ఇంకా వేరే ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ ని కూడా బయటికి లాగాలి.

కైలాష్ గౌడ్... కాంతారావు సైలెంట్ గా ఉండి పోయారు. సుధీర్ కి అనుమానం వచ్చింది. ' ఒకవేళ ఈ కేసు కి సంబంధించి పోలీస్ డిపార్టుమెంటు కి తెలియని డిటైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఎందుకైనా మంచింది జాగ్రత్తగా ఉండాలి' అని అనుకున్నాడు.

కాంతారావు : చాలా థాంక్స్... ఈ కేసు ని నేనే హేండిల్ చేస్తున్నాను... మీ సహకారం మాకు చాలా అవసరం. కైలాష్ మీతో టచ్ లో ఉంటాడు. ప్లీజ్ కొంచం హెల్ప్ చెయ్యండి.

తప్పకుండా హెల్ప్ చేస్తానని చెప్పి సుధీర్ బయలుదేరాడు. అతని మనసులో చాలా సందేహాలు... " వీళ్ళ కింద పనిచేస్తున్న వాళ్ళు క్రైమ్ చేస్తే.. వీళ్ళు ఎందుకు ఇంత ఖంగారు పడుతున్నారు? రేప్ చేసింది లాక్ అప్ లో వున్నవాళ్లు కాదని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో తేలబోతోందా? రేప్ చేసింది వాళ్ళు కాక పోతే.... మరి ఎవరు చేశారు? రేప్ చేసింది ఎవరో వీళ్ళకి తెలుసా... కొంపదీసి రేప్ చేసింది వీళ్ళ పిల్లలా? అదే అయ్యి ఉంటుంది. అందుకే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో రేప్ చేసింది లాక్ అప్ లో వున్నవాళ్లు కాదని తేలితే... అని అన్నారా... వీళ్ళు నానుంచి ఎటువంటి హెల్ప్ ఆశిస్తున్నారు? కావాలంటే వీళ్ళకి చాల హై లెవెల్ లో పలుకుబడి ఉంది. తను లో లెవెల్ ఎంప్లాయ్... తానేమి సహాయం చెయ్యగలడు???? " అని ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.


అవినాష్ ఇన్నోవా లో దొరికిన ఐటమ్స్ ని పరిశీలిస్తున్నాడు. అన్నింటిని చాలా జాగ్రత్తగా కేటలాగ్ చేశారు... అన్నిన్నిటిని ప్లాస్టిక్ బాగ్స్ లో భద్రం గా ఉంచి లేబెల్స్ అతికిస్తున్నారు. ఒక చోట రక్తం మరకలతో నిండిన సల్వార్ డ్రెస్ ఉంది. ఒక ఐరన్ రాడ్ కూడా వుంది. దాని మీద రక్తపు మరకలు ఎండిపోయాయి. దాన్ని చూడగానే అవినాష్ కి వీడియో లో జిలాని ఆ ముసలివ్యక్తి ని తలమీద కొట్టిన దృశ్యం గుర్తుకొచ్చింది. వాటి పక్కనే ప్లాస్టిక్ బాగ్స్ లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవినాష్ కి ఎదో గుర్తుకొచ్చి వెంటనే తన చేతులకి గ్లోవ్స్ వేసుకొని ఆ మొబైల్ ఫోన్ బాగ్స్ ని పరిశీలించసాగాడు... ఒక ప్లాస్టిక్ బాగ్ మీద యాదగిరి పేరు ఉంది. ఆ బాగ్ ఓపెన్ చేసి లోపలనుంచి మొబైల్ ఫోన్ తీసుకొని ఆన్ చేసాడు. పాస్ కోడ్ కావాలి... అక్కడేవున్న ఒక పోలీస్ ని " ఆ యాదగిరి ఎక్కడున్నాడు?" అని అడిగాడు. అతను యాదగిరి ని డిటైన్ చేసిన రూమ్ ని చూపించాడు. అవినాష్ ఆ ఫోన్ తీసుకొని ఆ రూమ్ లోకి వెళ్లి యాదగిరి తో "ఈ ఫోన్ ఓపెన్ చెయ్యి" అని అన్నాడు. యాదగిరి ఏమి మాట్లాడలేదు ... "నీ అంతట నువ్వు సహకరిస్తే నీకే మంచిది... మాకు దీన్ని ఎలా ఓపెన్ చెయ్యాలో తెలుసు. నువ్వు కోడ్ ఇస్తే టైం కలిసొస్తుంది. నీ ఇష్టం " అని అన్నాడు. యాదగిరి " 763421" అని అన్నాడు. ఫోన్ ఓపెన్ అయ్యింది. అవినాష్ ఫోన్ కాల్ లిస్ట్ చూడసాగాడు. వీడియో లో రాత్రి 8 గంటల ప్రాంతం లో ఒక incoming కాల్ KAILASH BHAI ... ఆ తరువాత రైల్వే platform మీద ఆ యువతి చేసిన outgoing కాల్ నెంబర్ (పేరు లేదు) ని చెక్ చేసాడు... ఆ రెండూ డిఫరెంట్ నంబర్స్. ఆ నంబర్స్ ని నోట్ చేసుకొని దాన్ని ప్లాస్టిక్ బాగ్ లో పెట్టి సీల్ చేసి టేబుల్ మీద పెట్టి... "ఈ మొబైల్ ఫోన్ పాస్ కోడ్స్ ఆ నలుగురి నుంచి తీసుకొని మన టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి పంపించి కాల్ డేటా ని అనలిస్ ని తయారు చేయమనండి" అని అన్నాడు.

ఇన్నోవా లో దొరికిన వస్తువులన్నీ చెక్ చేసాడు... వాటిలో ఆ యువతి సూటుకేసు... బ్యాగ్... ఆ ముసలివ్యక్తి బ్యాగ్ ... లేవు. 'అంటే ... వాటిని వీళ్ళు డిస్ట్రాయ్ చేసి వుంటారు' అని మనసులో అనుకోని అక్కడి నుంచి తన ఆఫీస్ చేరుకొని యాదగిరి ఫోన్ లోంచి తీసుకున్న రెండు ఫోన్ నంబర్స్ ని శేఖర్ కి ఇచ్చి "ఈ నంబర్స్ ఎవరివో కనుక్కో... I need the names immediately " అని అన్నాడు.

ఒక పది నిమిషాల తరువాత శేఖర్ రూమ్ లోకి వచ్చి...

శేఖర్ : ఆ నంబర్స్ లో ఒకటి కైలాష్ గౌడ్... రెండోది కళాధర్... వీడు మహేష్ భూపతి కి పర్సనల్ అసిస్టెంట్...

అవినాష్ : మహేష్ భూపతి పర్సనల్ అసిస్టెంట్???

శేఖర్ : అవును సర్... వాడి పేరు మీద రిజిస్టర్ అయింది.

అవినాష్ : ఆ యువతి... ఆ రాత్రి... ఆ టైం లో కళాధర్ కి ఎందుకు ఫోన్ చేసింది???? ఆ వీడియో ఒకసారి ప్లే చెయ్యి...

శేఖర్ కంప్యూటర్ లో వీడియో ప్లే చేసాడు... 8:07 PM యాదగిరి మొబైల్ కి incoming కాల్... కైలాష్ గౌడ్ చేసాడు... 8:19 PM ఆ యువతి యాదగిరి మొబైల్ నుంచి ఒక కాల్ చేసింది... అది కళాధర్ నెంబర్... ఆ యువతి కి కళాధర్ నెంబర్ ఎలా దొరికింది? ఆ టైం లో ఎందుకు ఫోన్ చేసింది? ముందుగా తాను మాట్లాడి ఆ తరువాత ఫోన్ యాదగిరి కి ఇచ్చింది... యాదగిరి 10 సెకండ్స్ మాట్లాడి పెట్టేసాడు. యాదగిరి కళాధర్ తో ఏమి మాట్లాడాడు? యాదగిరి ని ఇన్వెస్టిగేట్ చెయ్యాలి...

అవినాష్ : DR ప్రభావతి గారికి ఆ ఇన్నోవా లో దొరికిన ఐటమ్స్ ని పంపించండి. ఆ ఐరన్ రాడ్ మీద ఫింగర్ ప్రింట్స్ ని జిలాని ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చెయ్యమనండి . డెఫినిట్ గా మ్యాచ్ అవుతాయి.

శేఖర్ : అవును సర్... ఆ వీడియో ని ఎప్పుడు బయట పెడదాం?

అవినాష్ : ఇప్పుడప్పుడే వొద్దు... అసలా ఆ వీడియో మన దగ్గర ఉన్నట్లు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ వీడియో ని ఒక పెన్ డ్రైవ్ లో కాపీ చేసి నా ఇవ్వు...

శేఖర్ : సరే సర్...

అవినాష్ : ఆ వీడియో లో వివేక్... కైలాష్ గౌడ్ కొడుకు... కిరణ్... మహేంద్ర భూపతి మేనల్లుడు... సంజీవ్... హోమ్ మినిస్టర్ ధనంజయ కొడుకు... రాకేష్... లాయర్ కాంతారావు కొడుకు... ఉన్నారు... వీళ్ళే ఆ యువతి ని రేప్ చేశారనుకుందాం... ఆ లాయర్ వీళ్ళని కాపాడడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ధనంజయ హోమ్ మినిస్టర్ కాబట్టి పోలీస్ రికార్డ్స్ ని తారు మారు చెయ్యగలరు. వాళ్లకి ఈ వీడియో గురించి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఆ బెంజ్ కార్ గురించి ఎంక్వయిరీ చెయ్యండి...

శేఖర్ : మీకో సంగతి చెప్పడం మర్చిపోయా... ఇవ్వాళా ఉదయం వివేక్... కైలాష్ గౌడ్ కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బెంజ్ కార్ రెండు రోజుల క్రితం దొంగిలించబడిందని రిపోర్ట్ చేసాడు.

అవినాష్ : నాకు అర్జెంటు గా ఆ రిపోర్ట్ కాపీ కావాలి... మీరు వెంటనే ఆ కార్ నెంబర్ ని RTA రికార్డ్స్ లో పూర్తి డీటెయిల్స్ సంపాదించండి... 1. ఇంజిన్ నెంబర్... 2. చాసిస్ నెంబర్ 3. ఎప్పుడు రిజిస్టర్ అయింది... 4. కార్ అమ్మిన డీలర్ పేరు... అడ్రస్... ఎంత త్వరగా దొరికితే అంత మంచిది...

శేఖర్ : ఇప్పుడే సంపాదిస్తాను...

దాదాపు ఒక గంట తరువాత పూర్తి డీటెయిల్స్ తీసుకొని వచ్చాడు... Mercedez Benz ML 350... హైదరాబాద్ లో డీలర్ దగ్గర కొన్నారు... అవినాష్ వెంటనే ఆ డీలర్ దగ్గరికి వెళ్ళాడు... యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని చూడగానే బెంజ్ డీలర్ సాదరంగా ఆహ్వానించాడు...

డీలర్ : Welcome to Mercedez Benz ... How can I help you? [ బెంజ్ కంపెనీ కి స్వాగతం... మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలము?]

అవినాష్ (వివేక్ కార్ నెంబర్ చూపించి) : I need to know everything about this vehicle [ ఈ కార్ గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి... మీరు ఇవ్వగలరా?]

డీలర్ : Sure... I belive this car belongs to Mr. Vivek Gaud... [తప్పకుండా... నాకు తెలిసి ఈ వెహికల్ Mr. వివేక్ గౌడ్ గారికి చెందినది]

అవినాష్ : Yes... it is... [అవును... ఇది వివేక్ గౌడ్ కార్]

డీలర్ : What do you want to know about this model... [ మీకు ఈ కార్ గురించి ఏ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ?]

అవినాష్ : Everthing... [ ప్రతిఒక్క విషయం]

డీలర్ : OK... ML 350 is one of the top end SUVs of Mercedez Benz. This particular car has been directly imported from Stuttgart, Baden - Watermark, Germany. Mr. Vivek paid the money directly to MB Germany. We just got this car registered locally in his name. We take care off periodical maintenance of this vehicle. In case of comphrehnesinve service, we have to call specialist from Mumbai. [తప్పకుండా... ఈ కార్ మోడల్ ML350... చాలా పెద్ద మోడల్... ఈ కార్ ని నేరుగా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు... వివేక్ గారు డబ్బులు కూడా డైరెక్ట్ గా మా జర్మనీ ఆఫీస్ లో కట్టారు. మేము ఈ కార్ ఇండియా వచ్చాక... రిజిస్ట్రేషన్ చెయ్యించి వివేక్ గారికి డెలివర్ చేసాము... ఈ కార్ కి సర్వీస్ చెయ్యాలంటే మా ముంబై ఆఫీస్ నుంచి స్పెషల్ మెకానికల్ టీమ్ వస్తుంది.]

అవినాష్ : What are the features of this car. [ ఈ కార్ స్పెషల్ ఫీచర్స్ ఏమిటీ?]

డీలర్ : This is very top end model. Fully loaded... with all bells and whistles... it has got everthing you need... fully automatic... MB Intelligent Drive Assistance System... MBUX Multi Media System... Advanced GPS System. [ ఈ కార్ ఫుల్ గా ఆటోమేటిక్... కంప్యూటర్ సహాయంతో పనిచేస్తుంది. ఇందులో అడ్వాన్సుడ్ GPS  సిస్టం తో ఈ కార్ ఎక్కడున్నా బెంజ్ కంపెనీ కి తెలిసిపోతుంది... మ్యూజిక్ సిస్టం కూడా చాలా అడ్వాన్సుడ్... మొబైల్ ఫోన్ తో సింక్ చేసి లైవ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవోచు...]

అవినాష్ : What about Seucurity System... [ ఈ కార్ సెక్యూరిటీ సిస్టం గురించి చెప్పండి...]

డీలర్ : The best in the class... World class security system money can buy. [ ప్రపంచంలోనే బెస్ట్ సెక్యూరిటీ సిస్టం... చాలా ఖరీదైనది]

అవినాష్ : What happens if someone steals the car... [ ఈ కార్ ని ఎవరైనా దొంతనం చెయ్యాలంటే..?]

డీలర్ : That is out of question... no body can steal this model... this is vehicle is fitted with immobilizer... not possible to start this car with key. [ అది జరిగేపని కాదు... ఈ కార్ ని ఎవ్వరూ దొంగిలించలేరు... ఈ కార్ లో ఒక కొత్త సిస్టం ఉంది... దాన్ని " ఇమ్మొబిలైజర్" అంటారు... సినిమా లో చూపించినట్లు వైర్లు కట్ చేసి కార్ ని స్టార్ట్ చెయ్యడం కుదరదు... కీ తప్పకుండా కావాలి... ]

అవినాష్ : We have reason to belive that this car can be stolen without key... [ మాకు ఒక రిపోర్ట్ వచ్చింది... ఆ రిపోర్ట్ ప్రకారం... ఈ కార్ ని ఎవరో తాళాలు లేకుండానే దొంగతనం చేశారు]

డీలర్ : Impossible... [ అసంభవం... ]

అవినాష్ : Mr. Vivek lodged a complaint with police that his vehicle was stolen 2 days back. [ వివేక్ గౌడ్ గారు పోలీస్ స్టేషన్ లో ఈ కార్ రెండు రోజుల క్రితం దొంగతనం జరిగినట్లు కంప్లయింట్ ఇచ్చాడు]

డీలర్ : Impossible... Impossible... there must be some mistake... This model vehicle has got GPS system... Mr. Vivek can track his car with his mobile phone. It has got MB App... that app can track the where abouts of the car ... Mr. Vivek knows it... [ అసంభవం... ఎక్కడో పొరపాటు జరిగింది... ఈ మోడల్ కార్ కి అడ్వాన్సుడ్ GPS సిస్టం ఉంది... వివేక్ గారు తన మొబైల్ ఫోన్ లోని బెంజ్ కంపెనీ APP ద్వారా... ఈ కార్ ఎక్కడుందో తెలుసుకోగలడు... ఈ విషయం వివేక్ గారికి తెలుసు]

అవినాష్ : The vehicle has been stolen... you said this vehicle has got GPS System? Can you guys track the where abouts of this car? [ ఈ వెహికల్ దొంగిలించబడింది... ఈ కార్ లో అడ్వాన్సుడ్ GPS సిస్టం ఉందని అన్నారు కదా... మీరు మీ సిస్టం లో ఈ కార్ ఎక్కడుందో చెక్ చేసి చెప్పగలరా?]

డీలర్ : Technically... we can... But we cannot track any vechicle without porper authorisezation of the customer... [ మేము మా సిస్టం లో ఈ కార్ ని ట్రాక్ చెయ్యాలంటే... వివేక్ గారి పర్మిషన్ లేకుండా మేము ఏమి చేయలేము]

అవినాష్ : I have the copy of the police complaint lodged by My. Vivek... you check with him... [ మా దగ్గర వివేక్ ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ కాపీ ఉంది... అది చాలక పోతే మీరు వివేక్ కిఫోన్ చేసి కనుక్కోండి]

కార్ డీలర్ బయటికి బయటికి వెళ్లి వివేక్ తో 10 నిమిషాలు మాట్లాడి వచ్చాడు...

డీలర్ : I cannot understand... how come it is possible... Mercedez Benz reputaion is at stake... ? [ ఇది ఎలా జరిగిందో అర్ధంకావడం లేదు... ఇది కంపెనీ పరువు... మర్యాదలకి సంభందించింది... ]

అవినాష్ : Can you please track the vechicle? If you want I can get written authorisation from DGP... [ ఈ కార్ ఎక్కడుందో ట్రాక్ చేసి చెప్పండి... లేదంటే... మా DGP గారు ఇక్కడికి వస్తారు]

డీలర్ : Not required... please give me the copy of police report... that shoud be sufficient... [ అక్కరలేదండి... పోలీస్ కంప్లయింట్ కాపీ ని మాకు ఇవ్వండి... అది చాలు]

డీలర్ తన కంప్యూటర్ లో వివేక్ కి అలాట్ చేసిన ఒక యూనిక్ కస్టమర్ id వేసి అతని కార్ ట్రాక్ చేసాడు... సిస్టం లో వివేక్ కార్ కనిపించలేదు... డీలర్ బాగా ఖంగారు పడ్డాడు... కార్ ఎలా మాయమయ్యిందో ఒక్క క్షణం అర్ధం కాలేదు... ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు...

డీలర్ : We have a problem... the GPS system of the vehicle has been turned off... only Mr.Vivek or we at MB can swith off the GPS System... We have not done it... As per the system, at around 8:30AM today, the GPS system has been swith off... Mr. Vivek disabled the system. That is why we are not able to find the where about of this vehicle... [ పెద్ద చిక్కొచ్చి పడింది... ఈ కార్ లోని GPS సిస్టం ని ఆఫ్ చేశారు... వివేక్ గారు... లేదా బెంజ్ కంపెనీ వాళ్ళు తప్పా ఈ GPS సిస్టం ని ఆఫ్ చెయ్యలేరు. మేము దీన్ని ముట్టుకోలేదు. మా రికార్డ్స్ ప్రకారం... ఈ కార్ లోని GPS సిస్టం ఈరోజు ఉదయం 8:30 సమయంలో స్విచ్ ఆఫ్ చేయబడింది... వివేక్ గౌడ్ గారు తన మొబైల్ ఫోన్ ద్వారా GPS  ని ఆఫ్ చేశారు. ఈ కారణం వల్లనే ఈ కార్ ఎక్కడుందో తెలియయడం లేదు.]

అవినాష్ ఆ డీలర్ కి థాంక్స్ చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు...

డీలర్ ఫోన్ చేసినప్పుడు వివేక్ కార్ కీ పోయింది అని చెప్పాడు... కానీ... GPS System స్విచ్ ఆఫ్ చేసిన సంగతి చెప్పలేదు... పెద్ద పొరపాటు... డీలర్ ఆ విషయాన్ని ఈజీ గా కనుక్కోగలరని ఉహిచలేకపోయాడు.


Part - 5 - The Identities

రోజులు గడుస్తున్నాయి... రేప్ కి గురైన ఆ యువతి కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ ఏడవని రోజంటూ లేదు. చాలా దారుణంగా రేప్ చేశారు. ఆమె వొంటి మీద పంటి గాయాలు చాలా ఉన్నాయి. హాస్పిటల్ బయట స్టూడెంట్స్ ధర్నా చేయసాగారు... గవర్నమెంట్ కి చాలా పెద్ద తలకాయ నొప్పిగా తయారు అయ్యారు.

రేప్ గురిఅయింది ఒక గుర్తుతెలియని యువతి కావడం... ఆమెని కొన ఊపిరితో ఉండగా ఫస్ట్ ఎయిడ్ చేసింది మెడికల్ స్టూడెంట్స్ కావడం తో రాష్ట్రం లో అన్ని కాలేజీ స్టూడెంట్స్ గవర్నమెంట్ మీద విరుచుకుపడుతున్నారు. భౌతికంగా హాస్పిటల్ ముందు పెద్ద ధర్నా చెయ్యడం... టీవీ లో ఇంటర్వూస్ ఇవ్వడం... సోషల్ మీడియా లో విపరీతంగా సింపతీ సంపాదించడం లో సక్సెస్ అయ్యారు. పైగా ఆ యువతి దీన పరిస్థిలో వున్నప్పటి ఫొటోస్ సోషల్ మీడియా లో రావడం తో స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం గా వుంది. సగం పోలీస్ ఫోర్స్ 24 గంటలు స్టూడెంట్స్ తో నే వుంటున్నారు. ప్రజలలో అసహనం పెరిగిపోతోంది. మీడియా వాళ్ళు హాస్పిటల్ స్టాఫ్ కి విపరీతం గా డబ్బులు ఇచ్చి లోపల ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీడియా వాళ్ళ ఆత్రుత ని గమనించిన కొంత మంది హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళ దగ్గరనుండి విపరీతం గా డబ్బులు గుంజి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వసాగారు...

ఒక టీవీ ఛానెల్ ఆ యువతి నెల్లూరు వాస్తవ్యురాలని... ఆమెని తన ప్రియుడు పెళ్లి చేయుకుంటానని హైదరాబాద్ తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ తో కలసి రేప్ చేసాడని చెప్పడంతో రెండు రోజుల పాటు పెద్ద డిబేట్ నడిచింది. ఆమె గురించి ఎటువంటి డీటెయిల్స్ బయటకి తెలియడం లేదు. మీడియా లో చాలా అసహనం పెరిగిపోయి వాళ్ళు ఇష్టమొచ్చినట్లు మొరగసాగారు. ఒక ప్రోగ్రాం లో ఒక ప్రతిపక్ష రాజకీయ నాయకుడు ప్రస్తుత గవర్నమెంట్ గురించి చాలా అసభ్యంగా వ్యాఖ్యానించడం తో అసెంబ్లీ మొత్తం దద్దరిల్లి పోయింది. హెల్త్ మినిస్టర్ మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్ష MLA ఏదో అన్నాడని సహించలేని ఒక రూలింగ్ పార్టీ MLA బూతులు తిట్టాడు. దాంతో రెచ్చిపోయిన ప్రతిపక్ష MLA తిట్టిన రూలింగ్ పార్టీ MLA మీదకి దూకి కొట్టాడు... అంతే... అసెంబ్లీ లో పెద్ద గొడవజరిగింది. ఎవరిని ఎవరు... ఎందుకు కొడుతున్నారో అర్ధంకాలేదు... ఒక 20 నిమిషాల పాటు టీవీ లో దేశ ప్రజలంతా రాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన గొడవ ని డైరెక్ట్ టెలికాస్ట్ లో చూసారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి టీవీ లో కనిపించి ఆ రోజు అసెంబ్లీ లో జరిగిన గొడవని ఖండించి... రేప్ గురైన ఆ యువతి బ్రతికేవుందని... హాస్పిటల్ స్టాఫ్ ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని... ఇకనుంచి ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకి ఆమె హెల్త్ బులెటిన్ టీవీ లో ప్రకటిస్తామని చెప్పడంతో సిటీ లో కొంచం ప్రశాంత వాతావరణం వచ్చింది.

పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసు లో ఎటువంటి పురోగతి సాధించలేదు. పోలీస్ కస్టడీ లో ఉన్న ఆ నలుగురు నోరు విప్పడం లేదు. థర్డ్ డిగ్రీ కూడా పని చేయలేదు. బాగా కరుడు కట్టిన నేరస్తులు కావడం తో పోలీస్ టార్చర్ పని చెయ్యడం లేదు. వాళ్ళు నోరు విప్పక పోవడానికి ముఖ్య కారణం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ CI సుధీర్ కావడం. సుధీర్ వాళ్ళని సరిగ్గా విచారించడం లేదు. వాళ్ళు కూడా నోరు విప్పడం లేదు. హోమ్ మినిస్టర్ దగ్గరనుండి అనధికారంగా వచ్చిన ఆదేశాల ప్రకారం... ఈ కేసు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు... ఆ యువతి ని హాస్పిటల్ లోనే కోమా లో ఉండగా చంపేయాలని ప్లాన్ తయారయ్యింది. బయట స్టూడెంట్స్ హడావిడి కొంచం తగ్గిన తరువాత ఆ యువతి ని చంపేయాలని హై లెవెల్ లో డిసైడ్ అయ్యారు.

అవినాష్ కి ఈ కేసు చాలా పెద్ద ఛాలెంజ్ గా మారింది... ఆ యువతి ఎవరో తెలియదు... ఆమెతో పాటు ఉన్న ఆ ముసలి వ్యక్తి ఎవరు? జిలాని ఆయనని చంపేసిన తరువాత బాడీ ని ఎక్కడైనా కాల్చేశారా... లేక పాతి పెట్టారా... అఫిషియల్ గా ఆ ముసలాయన గురించి ఎంక్వయిరీ చెయ్యడం కుదరదు. ఆ వీడియో బయట కి తీసుకొని రావాలి. ఎలా?? సరిగ్గా అదే సమయం లో విక్రాంత్ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు... అతడిని చూడాగానే అవినాష్ కి ఒక ఐడియా వచ్చింది...

అవినాష్ : ఆ ముసలాయన ని చివరిసారిగా చూసింది మీ ఇద్దరే కదా...

విక్రాంత్ : అవును సర్...

అవినాష్ : ఆ కుర్రోళ్ళు ఆ యువతిని కార్ లో తీసుకొని ఎటు వెళ్లారో గుర్తుందా...

విక్రాంత్ : ఆ యువతి కార్ ఎక్కగానే చాలా స్పీడ్ గా వెళ్ళిపోయింది... ఎటు వెళ్ళింది గమనించలేదు.

అవినాష్ : వాళ్ళు ఆ యువతి ని కిడ్నప్ చూసేటప్పటికి టైం ఎంత అయ్యింది...

విక్రాంత్ : రాత్రి 9 గంటలు

అవినాష్ : మీకు మళ్ళీ యాదగిరి ఇన్నోవా ఎప్పడు కనిపిచింది?

విక్రాంత్ : ఉదయం 4 - 4: 30 మధ్య లో

అవినాష్ : మీరు రాత్రి 9 నుంచి ఉదయం 4 దాకా ఎక్కడెక్కడ వెతికారు?

విక్రాంత్ : ఆ చుట్టు పక్కల చిన్న చిన్న ఊళ్ళు... పొలాలు... చిన్న సైజు అడవి ఉన్నాయి... మేము ఆ ఏరియా మొత్తం వెతికాము. ఎక్కడా కనిపించలేదు. చివరికి హైదరాబాద్ వైపు వస్తున్నప్పుడు సడన్ గా యాదగిరి కార్ కనిపిచింది.

>అవినాష్ : ఆ కుర్రోళ్ళు ఆమెని తీసుకెళ్లి రేప్ చేసి... యాదగిరి గ్యాంగ్ కి అప్పగించి వెళ్లిపోయారని అనుకుందాం... అంటే రాత్రి 9 నుంచి ఉదయం 4 లోపల రేప్ రేప్ జరిగిందని అనుకున్నా... యాదగిరి గ్యాంగ్ పోలీసులకి దొరికినప్పుడు ఇన్నోవా లో ఆ ముసలాయన శవం... ఆయన లగ్గేజ్... ఆ యువతి లగ్గేజ్ లేదు... అంటే... ఆ 7 గంటల లోపల యాదగిరి మనుషులు ఆ ముసలాయన శవాన్ని... లగ్గేజ్ ని వొదిలించుకొని... రేప్ జరిగిన స్థలానికి వెళ్లి ఆ యువతి ని తీసుకొని బయలుదేరారని అనుకుందాం... అసలు ఆ కుర్రోళ్ళు రేప్ చేసిన తరువాత ఆమె ని ఎక్కడైనా వొదిలెయ్యక కార్ లో పెట్టుకొని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు?

శేఖర్( విక్రాంత్ తో ) : యాదగిరి కార్ మీకు ఉదయం ఎక్కడ కనిపిచింది? సరిగ్గా ఎక్కడ ? ఖచ్చితమైన లొకేషన్... బాగా గుర్తు తెచ్చుకో...

విక్రాంత్ : మేము యాదగిరి కార్ ని కనీసం ఒక 40 నిమిషాలు వెంబడించాము... బాగా స్పీడ్ గా బైక్ నడిపాము... 70 -80 KMPH స్పీడ్... అంటే... వాళ్ళు మాకు BHEL క్రాస్ రోడ్స్ కి ఒక 40 - 45 కిలోమీటర్స్ దూరం లో కనిపించారు...

శేఖర్ స్టేట్ మ్యాప్ తీసుకొని విక్రాంత్ చెప్పిన లొకేషన్ ని మార్క్ చేసాడు... ఆ చుట్టు పక్కల చాలా చిన్న పల్లెటూర్లు ఉన్నాయి... అక్కడ రేప్ జరిగే ఛాన్స్ లేదు...

శేఖర్ : నా అనుమానం నిజమైతే... రేప్ ఇక్కడ జరగలేదు... కానీ... ఆ కుర్రోళ్ళు ఆమెని రేప్ చేసి యాదగిరి గ్యాంగ్ కి ఈ ఏరియాలో అప్పగించి ఉంటారు. అదే నిజమైతే... యాదగిరి గ్యాంగ్ ఆ టైం లో అక్కడ ఎందుకున్నారు? ఆ కుర్రోళ్ళు వాళ్ళని అక్కడికి రమ్మన్నారా? రాత్రి 9 నుంచి ఉదయం 3 - 3:30 దాకా యాదగిరి గ్యాంగ్ ఏమి చేశారు?

అవినాష్ : యాదగిరి మొబైల్ ఫోన్ ఏ బ్రాండ్?

శేఖర్ : శాంసంగ్... లేటెస్ట్ మోడల్...

అవినాష్ : ఆ ఫోన్ లో వాళ్ళు ఎక్కెడెక్కడికి వెళ్లారో టైం లైన్ డీటెయిల్స్ దొరుకుతాయి కదా...

శేఖర్ : బ్రిలియంట్ ఐడియా... ఆ ఫోన్ ఎక్కెడెక్కడికి ట్రావెల్ చేసిందో తెలియచేసే టైం లైన్ దొరుకుతుంది...

అవినాష్ : మన డిపార్టుమెంటు ఎవిడెన్స్ రూమ్ లోంచి అందరి మొబైల్ ఫోన్స్ ఎవరికీ తెలియకుండా తీసుకొని మా ఇంటికి వస్తే... నేను వాళ్ళ లొకేషన్ హిస్టరీ డీటెయిల్స్ మీకు ఇస్తాను...

శేఖర్ తనకి బాగా నమ్మకమైన ఒక SI ని పంపించి ఆ ఎవిడెన్స్ రూమ్ లోంచి యాదగిరి గ్యాంగ్ కి చెందిన మొబైల్ ఫోన్స్ ని అవినాష్ ఇంటికి తెప్పించాడు. ఆ సమయంలో అవినాష్ ఇంట్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు... అతని పేరు తెలీదు... శేఖర్ అతడిని ఎప్పుడూ చూడలేదు... ఆ వ్యక్తి కొంచం వెరైటీ గా ఉన్నాడు. జీన్స్ ప్యాంటు... ఖాదీ కుర్తా... రిం లెస్ గ్లాస్సెస్... భుజాల దాకా పెరిగిన జుట్టు... జుట్టు కి బాగా నూనె రాసి వెనక రబ్బర్ బ్యాండ్ తో పిలక... గడ్డాలు ... మీసాలు... అవినాష్ ఆ మొబైల్ ఫోన్స్ అతడికి ఇచ్చాడు... అతను ఆ మొబైల్ ఫోన్స్ ఒక దాని తరువాత ఒకటి ని తన లాప్ టాప్ కి కనెక్ట్ చేసి ఏదో సాఫ్ట్ వేర్ రన్ చేసాడు... ఒక 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చింది...

ఆ రాత్రి ఆ ఫోన్స్ అన్ని ఒకే రూట్ లో ప్రయాణించాయి... దాదాపు రాత్రి 10:30 సమయంలో ఒక చోట దాదాపు 2:30 గంటల సేపు కదలకుండా అక్కడే ఉన్నాయి. ఆ తరువాత మళ్ళీ ఆ ఫోన్స్ కదలడం మొదలు పెట్టాయి... ఒక రెండు గంటలు ప్రయాణం చేసాక... ఒక 10 నిమిషాలు ఎక్కడో ఆగాయి... ఆ తరువాత మళ్ళీ కదలడం మొదలు పెట్టి ఉదయం 5 గంటల సమయం లో ఆగి పోయాయి...

అవినాష్ : రాత్రి 10:30 నుంచి 1:00 am దాకా ఎక్కడున్నారో ఖచ్చితమైన లొకేషన్... ఆ తరువాత మళ్ళీ ఆ 10 నిమిషాలు ఎక్కడ ఆగారో... ఈ రెండు లొకేషన్ కోఆర్డినెట్స్ కావాలి... ఆ డీటెయిల్స్ శేఖర్ ఫోన్ కి పంపించు... యాదగిరి ఫోన్ కి ఆ రాత్రి ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చాయో చూడు...

ఆ రాత్రి 3:48 కి ఒక కాల్ వచ్చింది. ఆ నెంబర్ ని ఆ వ్యక్తి అవినాష్ కి చూపించాడు. అవినాష్ ఆ నెంబర్ శేఖర్ కి ఇచ్చి... "ఎవరిదో కనుక్కో... నా అనుమానం అది వివేక్ ఫోన్ నెంబర్..."

అవినాష్ : నా లెక్క ప్రకారం వాళ్ళు ఆ రాత్రి 10:30 నుంచి 1:00 లోపల ఆ ముసలాయన డెడ్ బాడీ ని, వాళ్ళ లగ్గేజ్ ని వొదిలించుకొనివుంటారు... ఆ లొకేషన్ కి వెళ్లి ఎంక్వయిరీ చెయ్యండి.

ఆ వ్యక్తి రెండు లొకేషన్ కోఆర్డినెట్స్ శేఖర్ ఫోన్ కి పంపించి... వెంటనే లాప్ టాప్ షట్ డౌన్ చేసి తన బాగ్ లో పట్టుకొని లేచి నుంచొని... అవినాష్ వైపు చెయ్యి చాచి అదోలా చూసాడు...

అవినాష్ నవ్వుతూ తన పర్స్ తీసి 4,000 రూపాయలు అతనికి ఇచ్చాడు... అతను ఆ డబ్బులు తీసుకొని అవినాష్ వైపు అదోలా చూసాడు... అవినాష్ మళ్ళీ పర్స్ లోంచి ఇంకో 2000 రూపాయల నోట్ తీసి ఇస్తూ "నా దగ్గర ఇంతే ఉంది" అన్నాడు... ఆ వ్యక్తి మొహం లో ఎటువంటి ఎక్సప్రెషన్ లేదు... ఆ 2000 కూడా దాచుకొని మళ్ళీ చెయ్యి చాచాడు... అవినాష్ గట్టిగా నవ్వుకుంటూ లోపలి వెళ్లి ఒక "JOHNNY WALKER - DOUBLE BLACK" బాటిల్ తెచ్చి ఇస్తూ "నా దగ్గర ఇంకేమి లేదు... దీంతో సరిపెట్టుకో..." అని అన్నాడు... మొట్టమొదటిసారి నోరు తెరచి "కనీసం నాకోసమైన లంచాలు తీసుకోవడం మొదలుపెట్టు..." అని చెప్పి వెళ్ళిపోయాడు...

ఇదంతా చూస్తున్న శేఖర్ "ఎవరు సర్... ఈ వింత వ్యక్తి ?" అని అడిగాడు... దానికి బదులుగా అవినాష్ "ONE OF THE MOST INTELLIGENT MINDS IN THIS WORLD" అని అన్నాడు


మరుసటి రోజు శేఖర్... విక్రాంత్ ని తీసుకొని అవినాష్ ఫ్రెండ్ షేర్ చేసిన లొకేషన్ లింక్ ని ఆన్ చేసి మోటార్ బైక్ మీద బయలు దేరారు. విక్రాంత్ గూగుల్ మ్యాప్ లో డైరెక్షన్ ఫాలో అవుతూ బైక్ నడుపుతున్నాడు. హైదరాబాద్ సిటీ లిమిట్స్ దాటారు... ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాక మెయిన్ రోడ్ నుంచి లోపలికి మలుపు తిరిగారు...  రోడ్ సరిగ్గా లేదు... బాగా గతుకులు... దారికి రెండు వైపులా పొలాలు... పోరంబోకు స్థలాలు... చిన్న చిన్న గ్రామాలు... మెయిన్ రోడ్ నుంచి కనీసం 20 కిలోమీటర్లు పైగా ప్రయాణించిన తరువాత వాళ్ళు అడవి ప్రాంతం చేరారు. విక్రాంత్ బైక్ ఆపి శేఖర్ తో "మనం కరెక్ట్ రూట్ లో వెళ్తున్న మంటారా..." అని అడిగాడు. శేఖర్... "మ్యాప్ లో చూస్తే మనం సరైన దారిలోనే వెళ్తున్నాము...  నేరుగా ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి" అని అన్నాడు. విక్రాంత్ బైక్ స్టార్ట్ చేసి మొబైల్ ఫోన్ లో డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఇంకో రెండు కిలోమీటర్స్ ప్రయాణించాక మొబైల్ ఫోన్ లో "YOU HAVE REACHED YOUR DESTINATION. YOUR DESTINATION IS ON THE LEFT SIDE" అని వాయిస్ మెసేజ్ వినిపించింది. విక్రాంత్ బైక్ ఆపాడు. ఇద్దరూ తమ ఎడవైపు చూసారు... మొదట్లో వాళ్లకి ఏమి అర్ధం కాలేదు... ఆ ఏరియా ని జాగ్రత్తగా పరిశీలించారు. అప్పుడు కనిపిచింది... శ్మశానం.

ఒక 200 మీటర్స్ దూరం లో చితి మంటలు కనిపించాయి. ఇద్దరికీ అప్పుడు అర్ధమయ్యింది... వాళ్ళు సరైన ప్రదేశానికి చేరారని. నెమ్మదిగా ఆ పరిసరాలను గమనిస్తూ ఇద్దరూ అటువైపు వెళ్లారు. వాళ్ళకి అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. దాదాపు 45 ఏళ్ళు ఉంటాయి. సన్నగా ఉన్నాడు. ఒక చెట్టు కింద కూర్చొని బీడీ తాగుతున్నాడు... ఈ ఇద్దరిని చూసి "ఏమి కావాలి" అని అడిగాడు. శేఖర్ వాడికి తన మొబైల్ ఫోన్ లో యాదగిరి ఫోటో చూపించి "ఎవరో తెలుసా?" అని అడిగాడు...  అంతే... ఆ వ్యక్తి ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాడు... వాడు ఒక 50 మీటర్స్ కూడా వెళ్లి ఉండడు... వాడికి పెద్ద శబ్దం వినిపించింది... శేఖర్ తన సర్వీస్ రివాల్వర్ ని గాల్లో కాల్చిన శబ్దం... అది వినగానే ఆ వ్యక్తి అక్కడే ఆగిపోయి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు... శేఖర్ వాడిని వెనక్కి రమ్మని సైగచేసాడు...  వాడు శేఖర్ చేతిలోని రివాల్వర్డు వైపు భయంగా చూస్తూ వచ్చాడు. దగ్గరికి రాగానే... " నీ పేరు?" వాడు ఏదో గొడిగాడు... శేఖర్ కి అర్ధం కాలేదు...  పెద్దగా పట్టించుకోకుండా "నువ్వు ఇక్కడ ఎందుకున్నావు?" అని అడిగాడు... దానికి ఆ వ్యక్తి... "నేను కాటికాపరి" అని అన్నాడు.

శేఖర్(యాదగిరి ఫోటో చూపిస్తూ) : ఎవరో తెలుసా?

కాటికాపరి : తెలుసు... యాదగిరి...

శేఖర్ : ఈ మధ్య ఎప్పుడు చూసావు ?

కాటికాపరి : పోయిన నెల వచ్చాడు...

శేఖర్ : ఎందుకు?

కాటికాపరి ఏమి మాట్లాడలేదు... శేఖర్ గద్దించి అడిగాడు...

కాటికాపరి : యాదగిరి అప్పుడప్పుడు శవాలని తెస్తాడు... ఇక్కడ నిప్పెడతాము...

శేఖర్ : శవాన్ని తెచ్చేముందు నీకు చెప్తాడా...

కాటికాపరి : అవును. ఫోన్ చేస్తాడు. నేను ఏర్పాట్లు చేస్తాను.

శేఖర్ : పోయిన నెల శవాన్ని తెచ్చాడా?

కాటికాపరి : అవును... ఒక ముసలి వాడి శవాన్ని తెచ్చాడు... ఫోన్ చేసినప్పుడు రెండు శవాలకు భారీగా ఏర్పాట్లు చెయ్యమన్నాడు... కానీ ఒక శవాన్ని మాత్రమే తెచ్చాడు...

శేఖర్ : భారీగా అంటే?

కాటికాపరి : పెద్ద చితి... ఒక్కోసారి శవంతో పాటు వాళ్ళ కి సంభందించిన వస్తువులు కూడా తగలెడతారు.

శేఖర్ : ఆ రోజు ఏమి జరిగింది... వివరంగా చెప్పు...

కాటికాపరి : పోయిన నెల ఒక రోజు ఫోన్ చేసి... రెండు భారీ ఏర్పాట్లు చెయ్యమన్నాడు... నేను ఏర్పాటు చేసాను... రాత్రి వచ్చాడు... ఒక ముసలివాడి శవాన్ని తెచ్చాడు... ఒక చితి లో ముందుగా బట్టలు... కాగితాలు... ఇంకా ఏవేవో వస్తువులు వేసి వాటి మీద ఆ ముసలోడిని పెట్టి... పైన భారీగా కట్టెలు పెట్టి నిప్పెటారు... వెళ్తూ... ఇంకాసేపట్లో ఇంకో శవాన్ని తెస్తామని చెప్పి వెళ్లారు...

శేఖర్ : మళ్ళీ ఎప్పడు వచ్చారు...

కాటికాపరి : రాలేదు... వస్తామని చెప్పారు... రాలేదు... నేను సూరీడు రాగానే ఇంటికి వెళ్ళిపోయాను.

శేఖర్ : నీకు ఆ తరువాత ఫోన్ చేశాడా?

కాటికాపరి : లేదు.

శేఖర్ : యాదగిరి నెలకి ఎన్నిసార్లు వస్తాడు?

కాటికాపరి : చెప్పలేము... ఒక్కోసారి వారానికి ఒకటి... రెండు సార్లు వస్తాడు... లేదంటే నెలల తరబడి కనిపించడు.

శేఖర్ : ఇప్పటిదాకా ఎన్నిసార్లు వచ్చాడు...

కాటికాపరి : చాలా సార్లు...

శేఖర్ : నీ ఫోన్ ఇవ్వు...

కాటికాపరి : ఎందుకండీ?

శేఖర్ (రివాల్వర్ చూపిస్తూ) : అడగంగానే ఇవ్వు...

కాటికాపరి మౌనంగా తన మొబైల్ ఫోన్ ఇచ్చాడు... చాలా పాత నోకియా ఫోన్. శేఖర్ అక్కడి నుంచి కొంచం దూరం గా వెళ్లి వాడి ఫోన్ తో తన కింద పని చేసే SI ఖాదిర్ కి కాల్ చేసి... "ఈ నెంబర్ కి సంభందించిన పూర్తి కాల్ డీటెయిల్స్ కావాలి... ఇప్పటినుంచి ఈ నెంబర్ ని ట్రాకింగ్ లో పెట్టండి. ప్రతి కాల్ ని ట్రాక్ చెయ్యండి" అని చెప్పి వెంటనే అవుట్ గోయింగ్ కాల్ హిస్టరీ లోంచి ఆ నెంబర్ ని డిలీట్  చేసి ఫోన్ వాడికి ఇచ్చేసాడు. ఇంక వాడిని అడగాల్సింది ఏమి లేదని నిర్ధారించుకొని ఇద్దరూ అక్కడనించి వెనక్కి బయలు దేరారు... ఆ కాటికాపరి వచ్చింది ఎవరో... వాళ్ళ పేర్లు ఏమిటో తెలీదు... వాడికి శేఖర్ చేతిలో రివాల్వర్ తప్ప ఇంకేమి గుర్తులేదు... విక్రాంత్ ని అసలు సరిగ్గా కూడా చూడలేదు.

శేఖర్ ఆ రోజు రాత్రి యాదగిరి ఆ ముసలాయనని చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేసి... ఆ యువతి తీసుకొని రావడానికి వెళ్ళాడు... కానీ... ఎందుకని రాలేదు? డైరెక్ట్ గా హైదరాబాద్ ఎందుకెళ్ళాడు?? అక్కడినుంచి వాళ్ళు రెండో లొకేషన్ లింక్ ని ఆక్టివేట్ చేసి గూగుల్ మప్స్ లో డైరెక్షన్స్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్లారు... ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాకా వాళ్ళు ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు... చుట్టూ ఒక్క చెట్టు కూడా లేదు... పూర్తిగా పోరంబోకు స్థలాలు... చుట్టూ ఎక్కడా కనుచూపు మేరలో ఒక్క మనిషి  కూడా కనిపించడం లేదు...

విక్రమ్ : మనం సరైన లొకేషన్ కి వచ్చామో లేదో అర్ధం కావడం లేదు... ఇక్కడ ఏమి లేదు...

శేఖర్ : Something Wrong... ఒకవేళ ఆ కుర్రోళ్ళు ఆ యువతి ని రేప్ చేసి యాదగిరి గ్యాంగ్ కి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశారా?

విక్రమ్ : అదే నిజమైతే... యాదగిరి ఆ యువతి ని డైరెక్ట్ గా ఆ శ్మశానానికి కాకుండా హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్లాడు?

శేఖర్ : అవును... యాదగిరి ఆ కాటికాపరి రెండు చితులు ఏర్పాటు చెయ్యమని చెప్పి... ఒక శవాన్ని మాత్రమే ఎందుకు డిస్పోజ్ చేసాడు? ఇక్కడ మనం చేసేది ఏమి లేదు... వెళదాం పద...

అక్కడ్నుంచి ఇద్దరూ బయలుదేరారు... దారంతా అదే విషయాన్నీ ఆలోచిస్తూ వెళ్తున్నారు... అది హై వే కావడం తో వాళ్ళ జర్నీ స్మూత్ గా ఉంది... ఆ ఇద్దరూ గమనించే లోపల వాళ్ళు హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోకి వచ్చేసారు... శేఖర్ కి సడన్ అర్ధమయ్యింది... "విక్రాంత్..... Reverse the vehicle .... let's go back to the second location .... I think I know what happened ..." అని అన్నాడు... విక్రాంత్ అర్ధంకాలేదు... ఏమి అడగకుండా రెవెర్స్ చేసి వెనక్కి వెళ్ళాడు... అక్కడ నుంచి ఫస్ట్ లొకేషన్ లింక్ ఆన్ చేసి బయలుదేరారు...  "కొంచం నెమ్మదిగా నడుపు... ఇందాక నువ్వు చాలా స్పీడ్ గా వెళ్ళావు..." అని విక్రాంత్ తో అన్నాడు. వాళ్ళు ఒక చోటికి వచ్చాక శేఖర్ బైక్ ఆపమన్నాడు... శేఖర్ బైక్ దిగి హై వే మీదనుంచి ఫస్ట్ లొకేషన్ కి వెళ్లే దారి ని చూడసాగాడు... విక్రమ్ కి ఏమి అర్ధం కావడం లేదు...

శేఖర్ : నువ్వు నువ్వు గమనించావా... ఫస్ట్ లొకేషన్... హై వే నుంచి బాగా లోపలి ఉంది... మనం హైదరాబాద్ నుంచి వస్తూంటే అది లెఫ్ట్ సైడ్ ఉంటుంది... మనం సెకండ్ లొకేషన్ నుంచి హైదరాబాద్ వెళ్తూంటే... ఫస్ట్ లొకేషన్ రైట్ సైడ్ వస్తుంది... ఇక్కడి నుంచి ఫస్ట్ లొకేషన్ కి వెళ్లాలంటే కుదరదు... రోడ్ డివైడర్ వుంది... ముందుకెళ్లి U Turn తీసుకొని రావాలి... యాదగిరి గ్యాంగ్ ఆ రోజు రాత్రి బాగా తాగి ఉండడంతో వాళ్ళు ఆ U Turn మిస్ అయ్యి... ముందుకెళ్ళిపోయారు. ఆ రోజు ఉదయం నీకు ఈ హై వే మీద ఆ ఇన్నోవా ఎక్కడ కనిపించిందో గుర్తుందా???

విక్రాంత్ : బాగా గుర్తుంది...

శేఖర్ : అక్కడికి పోనివ్వ... నెమ్మదిగా నడుపు...

విక్రాంత్ బైక్ నెమ్మదిగా నడపసాగాడు...  దాదాపు 3 కిలోమీటర్స్ వెళ్ళాక వాళ్లకి U Turn కనిపిచింది... అది గమనించిన శేఖర్... "చూసావా... వాళ్ళు ఈ U Turn మిస్ అయ్యిఉంటారు... ఇక్కడినుంచి కొంచం ముందుకు వెళితే... హై వే రెండుగా చీలిపోతుంది... హైదరాబాద్ వెళ్ళేదాకా two way ట్రాఫిక్ ఉండదు... వాళ్ళు ఆ రోజు రాత్రి తాగి ఉండడంతో ఈ U Turn మిస్ అయ్యి డైరెక్ట్ హైదరాబాద్ దాకా వెళ్ళేదాకా వాళ్ళు గమనించలేదు... అప్పుడు ఇంక సమయం లేక ఖంగారులో ఆ యువతి చనిపోయిందని అనుకొని వెంటనే వొదిలించుకోవాలని రోడ్ మీద పడేసారు...  నార్మల్ గా ఆ టైం లో ఆ ఏరియా లో జనసంచారం ఉండదు...  ఆ రోజు వాళ్ళ బాడ్ లక్... ఆ మెడికల్ స్టూడెంట్స్ అక్కడవుండడం వాళ్ళు గమనించలేదు... ఆ యువతి ని బయటకి నెట్టెయ్యడం వాళ్ళు చూడడంతో ఖంగారు పడి పారిపోబోయి బస్సు ని గుద్దేసి దొరికి పోయారు..."

శేఖర్ చెప్పిన ఆ లాజిక్ విన్న విక్రాంత్ కి బుర్ర తిరిగిపోయింది... పోలీస్ డిపార్టుమెంటు ఎటువంటి కేసునైన ఎలా సాల్వ్ చేస్తారో ఆ సమయం లో బాగా అర్ధమయ్యింది... శేఖర్ మీద గౌరవం పెరిగింది... వాళ్ళు వెంటనే ఆఫీస్ కి వెళ్లి అవినాష్ కి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు...

అవినాష్ : Makes Sense... అయినా ఈ విషయం యాదగిరి గ్యాంగ్ confess చేసేదాకా మనం ఏమి చేయలేము... next step ఏమిటీ?

శేఖర్ : నేను సికింద్రాబాద్ స్టేషన్ platform #6 CCTV తెప్పిచాను... ఆ రోజు రాత్రి 8:30 ముందు వీడియో రికార్డింగ్ చెక్ చేసి ఆ యువతి... ముసలాయన ఏ ట్రైన్ లో ఇక్కడికి వచ్చారో కనుక్కుంటాను...

అవినాష్ : వెరీ గుడ్...

శేఖర్ తన ఆఫీస్ లో platform #6 footage చూడసాగాడు... చాలా టైం పట్టింది... ఆ రోజు చాలా ట్రైన్స్ వచ్చాయి... చివరిగా... ఆ రోజు రాత్రి 7:40 కి ముంబై ఎక్సప్రెస్ platform #6 మీదకి వచ్చింది... చాలా జాగ్రత్తగా ఒక్కో ఫ్రేమ్ కదిలిస్తూ ఆ యువతి... ముసలాయన ఏ కంపార్ట్మెంట్ లోంచి దిగారో కనిపెట్టడానికి చాలా టైం పట్టింది... వాళ్ళ కంపార్ట్మెంట్ నెంబర్ కనుక్కోవడానికి ఆ వీడియో ని ముందుకి... వెనక్కి... కదిలిస్తూ చివరికి ట్రైన్ ఇంజిన్ నుంచి 7వ కంపార్ట్మెంట్ గా గుర్తించాడు. ఆ ట్రైన్ లోంచి దిగిన పాసెంజర్స్ అందరూ వెళ్ళిపోయాక ఈ ఇద్దరు మాత్రం ఆ platform మీద మిగిలారు... వీడియో లో ఆ యువతి ఒక ఫోన్ కాల్ చెయ్యడం కనిపిచింది... ఆ టైం చూసాడు... 8:02PM... ఆ తరువాత కొంచం సేపటికి యాదగిరి రావడం... వాళ్ళని తీసుకొని వెళ్లడం కనిపిచింది... శేఖర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఆ ట్రైన్ ఇంజిన్ నుంచి 7వ నెంబర్ బోగీ రిజర్వేషన్ ఛార్ట్ సంపాదించి పాసెంజర్ పేర్లు చెక్ చెయ్యాలి... SI ఖాదిర్ ని పిలిచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి ఆ ట్రైన్ కి సంబంధించిన రిజర్వేషన్ ఛార్ట్స్ అన్నింటిని తెమ్మని చెప్పాడు...

రిజర్వేషన్ ఛార్ట్స్ వచ్చేటప్పటికి రాత్రి 10 అయ్యింది... శేఖర్ ఇంటికి వెళ్లకుండా ఖాదిర్ కోసం ఎదురు చూడసాగాడు... ఖాదిర్ తెచ్చిన రిజర్వేషన్ ఛార్ట్స్ వరుసగా చెక్ చేయ్యసాగాడు... ఆ రోజు ముంబై ఎక్సప్రెస్ 7వ బోగి ఒక 3AC కంపార్టుమెంట్... ఆత్రం గా రిజర్వేషన్ లిస్ట్ ని చెక్ చేసాడు... ఆ కంపార్ట్మెంట్ మొత్తం 72 మంది పేర్లు ఉన్నాయి ... అన్నింటిని చాలా జాగ్రత్తగా చెక్ చేసాడు... సీట్ నెంబర్ 23 & 24... ఒక 22 ఏళ్ళ అమ్మాయి... 72 ఏళ్ళ ముసలాయన కి అలాట్ చేసి ఉంది... ఆ ఇద్దరూ ముంబై నుంచి సికింద్రాబాద్ కి వచ్చారు. వాళ్ళ పేర్లు... స్పందన -- 22 ఇయర్స్ ... పట్టాభి -- 72 ఇయర్స్.


Part - 6 - New Twist

రేప్ విక్టిమ్ పేరు స్పందన... ఆ చనిపోయిన ముసలాయన పేరు పట్టాభి... ఈ డీటెయిల్స్ తప్ప వాళ్ళ గురించి వేరే ఏమి తెలియదు. రైల్వే స్టేషన్ నుంచి వీడియో ఫీడ్ తెచ్చిన విషయం కూడా అవినాష్... శేఖర్ కి తప్ప వేరే ఎవరికి తెలియదు. ఈ డీటెయిల్స్ ని వాళ్ళు బయటపెట్టలేని పరిస్థితి. యాదగిరి గ్యాంగ్ కి డిపార్ట్మెంట్ లో చాలా సపోర్ట్... సింపతీ ఉంది. వాళ్ళని టచ్ చెయ్య వద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి... యాదగిరి గ్యాంగ్ ని కోర్టులో ప్రవేశ పెట్టి 21 రోజుల రిమాండ్ మాత్రం సంపాదించగలిగారు.

శేఖర్ : మనం ఏమి చేయలేమా?

అవినాష్ : ఏమి చెయ్యగలం?? వాళ్ళని టచ్ చెయ్య వొద్దని పైనించి ఆర్డర్స్. స్పందన ప్రస్తుతం కోమా లో ఉంది. ఏదో ఒక రోజు ఆమెని చంపేస్తారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఈ నలుగురి DNA తో మ్యాచ్ అవ్వదు. వీళ్ళు నోరు విప్పరు. మహా అయితే వీళ్ళ మీద కిడ్నప్... టార్చర్ కేసులు పెడతారు. ఎవరు రేప్ చేశారో వీళ్ళు చెప్పరు. వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి... జైలు కూడా వెళ్లి వచ్చారు... మహా అయితే ఇంకో 7 ఏళ్ళు... లేదంటే 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఒకవేళ వురి శిక్ష పడినా దానిని అమలు చెయ్యడానికి ఏళ్ళు పడుతుంది. హై కోర్ట్... సుప్రీమ్ కోర్ట్... అప్పీల్... రివ్యూ... మెర్సీ పిటేషన్.... హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ గొడవ.... ఇప్పుడు ఆ రేప్ విక్టిమ్ ని సపోర్ట్రి చేస్తారు... ఆ తరువాత ఉరిశిక్ష వేస్తె... దాన్ని అమలు కాకుండా ధర్నా చేస్తారు. చివరికి వురి శిక్ష ని లైఫ్ సెంటెన్స్ లోకి మార్చేస్తారు.... యాదగిరి గ్యాంగ్ ని కొన్నాళ్ళకి సత్ప్రవర్తన మీద వొదిలేస్తారు... లేదంటే... యాదగిరి గ్యాంగ్ పోలీస్ కస్టడీ లోంచి నాటకీయంగా తప్పించుకొని అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతారు. వాళ్లకి పెద్ద వాళ్ళ సపోర్ట్ ఎటూ ఉంది. మధ్య లో పోలీసులు వెధవలు అవుతారు.

శేఖర్ : మన దగ్గర వీడియో వుంది కదా... దాన్ని సోషల్ మీడియా లో పెడితే...

అవినాష్ : ఎలా పెడతారు?

శేఖర్ : మనమే ఒక ఫేక్ id క్రియేట్ చేసి ఫేస్ బుక్, వాట్సాఅప్ లో పెడదాం...

అవినాష్ : వేస్ట్... మన సైబర్ క్రైమ్ డివిజన్ వాళ్ళు ఈజీ గా కనిపెట్టేస్తారు... పైగా... ఈ వీడియో లో పెద్ద వాళ్ళ పిల్లలు ఉన్నారు.. గవర్నమెంట్ తల్చుకుంటే... చాలా ఈజీ గా ఆ పోస్ట్ ని సోషల్ మీడియా లోంచి తీయించగలరు. అమెరికా లో ఒక సిస్టమ్ వుంది... అదేమిటంటే... సోషల్ మీడియా పోస్ట్ లో బాంబ్... ప్రెసిడెంట్... కిల్... హైజాక్... వగైరా... వగైరా... పదాలు ఉంటే... ఫేస్ బుక్ వెంటనే ఆ పోస్ట్ ని బ్లాక్ చేసేసి... లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి రిపోర్ట్ చేస్తుంది. వాళ్ళు వెంటనే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు... ఇంకోసంగతి... ఈ వీడియో చాలా పెద్దది... లెంగ్త్ ఎక్కువగా వున్నా వీడియోస్ ని అన్ని సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా చెక్ చేస్తారు... మన వీడియో లో జిలాని పట్టాభి ని చంపడం వుంది... సోషల్ మీడియా వెంటనే బ్లాక్ చెయ్యడమే కాకుండా... ఆ వీడియో ఎన్నిసార్లు ఎన్ని సోషల్ మీడియా platforms లో షేర్ / రి ట్వీట్ జరిగినా వాటిని పూర్తిగా లేపేస్తారు...

శేఖర్ : పాపం సర్... ఆ అమ్మయిని చాలా దారుణంగా రేప్ చేశారు... ఇంకో సంగతి... ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి డ్రగ్స్ ఎక్కించినట్లు తెలిసింది... ఆమె బ్లడ్ సాంపిల్స్ టాక్సికాలజీ డిపార్ట్మెంట్ కి పంపారు. ఆ రిపోర్ట్ రావడానికి చాలా టైం పడుతుంది... ఈ మధ్య Dr. ప్రభావతి కి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆమె పోలీస్ రిపోర్ట్ చేసింది... ఆమెని వెంటనే తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోపోతే ఆమె ఫామిలీ ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మన వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆమెకి ప్రొటెక్షన్ ఇచ్చారు...

అవినాష్ : ఈ కేసు ని మనం అఫీషియల్ గా ఏమి చేయలేము. ఏదైనా అనఫిషియల్ గానే చెయ్యాలి... వొదిలేది లేదు... రేప్ చేసిన ఆ నలుగురు... సహాయం చేసిన ఈ నలుగురు ఉరి కంభం ఎక్కి తీరాలి... కైలాష్ గౌడ్ ని లోపల వెయ్యడమే నా గోల్... ఇప్పుడు వాడి కొడుకు వివేక్ ని అడ్డు పెట్టుకొని కైలాష్ ని కూడా లేపెయ్యాలి... కైలాష్ గౌడ్ పెద్ద డ్రగ్స్ డీలర్... వాడి బిజినెస్ ని దెబ్బ తియ్యాలి... ఆ అమ్మాయి ఎవరు? రైల్వే చార్ట్ ప్రకారం ఆమె వయసు 22... పట్టాభి 72... వాళ్ళ మధ్య రిలేషన్ ఏమిటీ? ముందు ఆమె ఎవరో కనుక్కోవాలి... ఒక ఐడియా ఉంది... కానీ... విశ్వామిత్ర ని హెల్ప్ అడగాలి... అది పెద్ద తలకాయ నొప్పి...

శేఖర్ : విశ్వామిత్ర ఎవరు సర్...

అవినాష్ : ఆ రోజు మా ఇంట్లో చూసావుగా వింత మనిషి... ఆయన పేరు విశ్వామిత్ర...

శేఖర్ : అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ ?

అవినాష్ : వొద్దు... విశ్వామిత్ర గురించి నీకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది... మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్... అటువంటి వ్యక్తి తో పరిచయం కలగడం నా అదృష్టం. నేను ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసుకుంటాను.


సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో ఇంకో మూల ఒక సంఘటన జరిగింది...

హైదరాబాద్ హై కోర్ట్ కి దగ్గర ఉన్న ఒక ఇరానీ కేఫ్... సమయం ఉదయం 11 గంటలు... ఆ ఇరానీ కేఫ్ చాలా బిజీ గా ఉంది... మెయిన్ రోడ్ మీద ఉండడం తో కస్టమర్స్ తో చాలా బిజీ గా ఉంది. రోడ్ మీద వచ్చే పోయే వాహనాల రద్దీ... ఆ వాహనాలు చేసే శబ్దాలతో చాలా హడావిడిగా ఉంది. ఆ ఇరానీ కేఫ్ లోపల ఒక పక్క స్పీకర్స్ లో హిందీ సినిమా పాటలు... కస్టమర్స్ గట్టిగా మాట్లాడుకోవడం... నవ్వడం... అరవడం... చాలా కోలాహలం గా ఉంది... అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా... ఒక వ్యక్తి ఆ ఇరానీ కేఫ్ లో అడుగు పెట్టాడు... వొంటి మీద బాగా మాసిపోయిన... చిరిగిన బట్టలు... కాళ్ళకు చెప్పులు కూడా లేవు... బాగా పెరిగిన జుట్టు... గడ్డం... స్నానం చేసి కనీసం ఒక నెల పైనే అయివుంటుంది... బాగా కంపు కొడుతున్నాడు... వాడిని చూడగానే గల్లా పెట్టె దగ్గర కూర్చున్న ఇరానీ కేఫ్ ఓనర్... " అరే... ఇస్ బికారికి కో భగావ్...." అని తన సర్వర్ కి చెప్పాడు... ఆ కుర్రోడు గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తి దగ్గరి వచ్చాడు... అప్పుడు... ఎవరూ ఊహించని విధంగా... ఆ వ్యక్తి గట్టిగా.... పిచ్చిగా అరుస్తూ ఆ సర్వర్ ని వెనక్కి నెట్టేసి కేఫ్ లోపలి దూసుకెళ్లి ఒక టేబుల్ మీదెక్కి తన ప్యాంటు జేబులోంచి తుపాకీ తీసి రెండు సార్లు గాల్లో కాల్చాడు... అప్పటిదాకా బాగా కోలాహలంగా... హడావిడిగా ఉన్న ఆ ఇరానీ కేఫ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.... స్పీకర్ లోచి వస్తున్న హిందీ పాటలు తప్ప ఇంకో శబ్దం వినపడలేదు.... ఆ ఆగంతకుడు గట్టిగా అరుస్తూ... కేకలేస్తూ... తుపాకీతో కస్టమర్స్ ని కాల్చసాగాడు... అక్కడికక్కడే ఇద్దరు కస్టమర్స్ చనిపోయారు... ఇంకో కస్టమర్ గుండె ఆగి చనిపోయాడు... ఆ ఆగంతకుడు ఆగకుండా కస్టమర్స్ ని షూట్ చేయ్యసాగాడు...

ఇరానీ కేఫ్ లో షూటింగ్ గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఎవరో ఫోన్ చెయ్యడం తో పోలీస్ వాన్ వచ్చింది... వాళ్ళు లోపలి వెళ్ళబోతూంటే లోపలినుంచి కాల్పులు వినిపించాయి... దాంతో వాళ్ళు బయటే ఆగిపోయారు... ఏం చెయ్యాలో తెలియడం లేదు... రోడ్ మీద వెళ్తున్న వాళ్ళు కూడా లోపల జరుగుతున్న హడావిడి గమనించి అక్కడికి చేరారు... పోలీసులకి వాళ్ళని కంట్రోల్ చెయ్యాలో... లోపలి వెళ్ళాలో అర్ధం కాక సతమతం అవుతున్నారు... అప్పుడే ఇరానీ కేఫ్ లో ఇంకో రౌండ్ కాల్పులు జరిగాయి... బయట జనాలు కకావికలముగా పరిగెత్తారు...

పోలీసులు లోపలి దూసుకొని వెళ్లరు... అంతే... ఇంకో రౌండ్ కాల్పులు జరిగాయి... ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడు... దాంతో పోలీసులు వెనక్కి వచ్చేసారు... అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు జనంలోంచి లోపలి వెళ్ళడానికి ప్రయత్నించారు... పోలీసులు వాళ్ళని వెనక్కి లాగేసారు... కానీ... వాళ్లిద్దరూ మళ్ళీ దూసుకెళ్లడానికి ప్రయత్నించారు... అప్పుడే లోపలినించి మళ్ళీ కాల్పులు జరిగాయి... ఈ సారి కొంచం ఎక్కువసేపు కాల్పులు జరిగాయి... లోపలనించి అరుపులు... ఆర్తనాదాలు... సడన్ గా లోపలనుంచి ఒక కుర్రోడు బయటకి వచ్చాడు... వాడి చొక్కా అంతా రక్తం తో తడిసి ఉంది... ఆ కుర్రోడు బయట నుంచున్న పోలీసులని చూసి " ఆయియే... ఉస్కో హంనే పకడలియా '' అంటూ అరిచాడు... పోలీసులు లోపలి దూసుకెళ్లారు... వాళ్ళతో పాటు ఇంకో ఆరుగురు కూడా లోపలి వెళ్లారు... ఆ హడావిడి లో ఎవరూ వాళ్ళని పట్టించుకోలేదు...

ఒక 10 నిమిషాల తరువాత పోలీసులు ఆ అగంతకుడిని వాన్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు... అక్కడికి పోలీసులు ఆ ఏరియా ని పూరిగా సీల్ చేసేసారు... క్లూస్ కలెక్ట్ చేసుకోవడానికి... క్రైమ్ సీన్ ఫొటోస్ తియ్యడానికి వేరే టీం వచ్చింది... దాదాపు ఒక ఆరు గంటల తరువాత అక్కడ ఉన్న డెడ్ బాడీస్ ని బాడీ బాగ్స్ లో ఎక్కించి తీసుకెళ్లారు...


అదే రోజు సాయంత్రం అవినాష్ ఇంటికి విశ్వామిత్ర వెళ్ళాడు... అవినాష్ అతనికి రేప్ కేసు లో అప్పటిదాకా జరిగిన సంగతులు ఏమి దాచి పెట్టకుండా చెప్పాడు...

అవినాష్ : నీతో నాకు చాలా పని ఉంది... అఫిషియల్ గా నేను చెయ్యలేని పని నువ్వు చెయ్యాలి

విశ్వామిత్ర : నా పాలసీ నీకు తెలుసు... జైలు కెళ్లే పని నేను చెయ్యను...

అవినాష్(నవ్వుతూ) : నీకా భయం లేదు... నేనున్నాగా... మై హూ నా

విశ్వామిత్ర : అదే నా భయం... ఇప్పుడు మై హూ నా... అంటావు... తరువాత మధ్య లో ముంచేస్తావు...

అవినాష్ : ఏదో ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని ఎప్పుడూ అలా జరుగుతుందా...

విశ్వామిత్ర : ఒక్కసారా... ఇప్పటికి ఎనిమిది సార్లు ఇరకపెట్టావు... ఈసారి ఎలా ఇరకపెట్టాలని ప్లాన్ చేసావ్?

అవినాష్ తనకి ఏమి కావాలో చెప్పాడు... అదివిన్న విశ్వామిత్ర " ఓరి నాయనో..." అని అన్నాడు...

అవినాష్ : ప్లీజ్... నువ్వు తప్ప ఇంకెవరూ చెయ్యలేరు... నేను ఎవరినీ నమ్మనని నీకుకూడా తెలుసు...

విశ్వామిత్ర : చాలా ఖర్చు అవుతుంది... ఒక కొత్త లాప్ టాప్... కొత్త WIFI DONGLE... ఇది కాక నా ఫీజు... మొత్తం కలిపి ఒక 5 లక్షలు ఇవ్వు...

అవినాష్ లోపలి వెళ్లి ఒక " JOHNNY WALKER - DOUBLE BLACK " బాటిల్ తెచ్చి ఇచ్చి... "కొత్త లాప్ టాప్... wifi dongle... ఆ రూమ్ లో ఉన్నాయి... నీ ఫీజు కింద ఇది ఉంచుకో..." అని అన్నాడు

విశ్వామిత్ర : నువ్వు కూడా అందరిలా లంచాలు తినొచ్చుగా...

పక్క రూమ్ లోకి వెళ్లి కొత్త లాప్ టాప్ ని ఓపెన్ చేసి పూర్తిగా ఫార్మాట్ చేసి... విండోస్ ఆపరేటింగ్ సిస్టం తీసేసి... UNIX OS లోడ్ చేసాడు... ఆ తరువాత ఒక కొత్త వెబ్ బ్రౌసర్ - konqueror ని ఇంస్టాల్ చేసాడు. konqueror వెబ్ బ్రౌసర్ UNIX OS కి బాగా పనిచేస్తుంది... విశ్వామిత్ర తయారుచేసుకున్న సొంత సాఫ్ట్ వేర్ కి బాగా సపోర్ట్ చేస్తుంది... ఇదంతా చెయ్యడానికి 5 గంటల టైం పట్టింది... చివరిగా wifi dongle కూడా ఇంస్టాల్ చేసి... ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యాడు...

ఆ తరువాత "ఇప్పుడు చెప్పు నీకు ఏమి కావాలి?" అని అవినాష్ ని అడిగాడు...

స్పందన... పట్టాభి... ముంబయి నుంచి సికింద్రాబాద్ కి ప్రయాణం చేశారు... వాళ్ళ రిజర్వేషన్ స్లిప్ కావాలి...

"అంటే ఇప్పుడు నేను IRCTC వెబ్ సైట్ ని హాక్ చెయ్యాలి...."

విశ్వామిత్ర తన కొత్త లాప్ టాప్ లో విపరీతమైన వేగం తో టైప్ చేయ్యసాగాడు... ఒక కొత్త ప్రోగ్రాం రాసాడు... అవినాష్ చూస్తూండగానే IRCTC వెబ్ సైట్ లోకి వెళ్ళిపోయాడు... అందులోంచి ముంబయి పోర్టల్ లోకి దూరాడు... చక చక టైప్ చేస్తూ రకరకాల కొర్రీస్ వాడుతూ డేటా ని extract చేయ్యసాగాడు... దాదాపు ఒక గంట తరువాత "Got it... spandana.98717@gmail.com.... ఓహ్... అమ్మాయి డేట్ అఫ్ బర్త్... 17 జులై 98... అన్న మాట.... దొరికింది... ఆమె SBI Bank Account లోంచి online banking లో పే చేసింది... జస్ట్ ఆ మినిట్..." మళ్ళీ ఎదో ప్రోగ్రాం రన్ చేసాడు... "ఎస్... ఆమె బాంక్ అకౌంట్ నెంబర్... ఓకే... ఇప్పుడు SBI వెబ్ సైట్ లోకి వెళ్ళాలి..." అంటూ మళ్ళీ బిజీగా కంప్యూటర్ లో ఏదో ప్రోగ్రాం వ్రాయసాడు... ఇంకో రెండుగంటల తర్వాత... "ఇదిగో...ఆమె అడ్రస్... స్పందన... women's హాస్టల్... బొంబాయి IIT... వెళ్లి వెతుక్కో..." అని అన్నాడు... వెంటనే WIFI Dongle disconnect చేసేసి... కంప్యూటర్ లో వేరే ఇంకో ప్రోగ్రాం రన్ చేసాడు... అంతే... ఆ కంప్యూటర్ పూర్తిగా క్రాష్ అయింది... దాని అవినాష్ కి ఇచ్చి... "తీసుకెళ్లి ఏదైనా రైల్ కింద పెట్టు" అని చెప్పి విస్కీ బాటిల్ తీసుకొని "గుడ్ నైట్" చెప్పి వెళ్లి పోయాడు...


ఆ మరుసటి రోజు కమిషనర్ ఆఫీస్ నుంచి వెంటనే రమ్మని కాల్ వచ్చింది... "నువ్వు అర్జెంటు గా ఇవ్వాళా ఈవెనింగ్ ఫ్లైట్ కి న్యూ ఢిల్లీ వెళ్ళాలి... నిన్ను పంపించమని హోమ్ మినిస్ట్రీ నుంచి మెయిల్ వచ్చింది... కాన్ఫిడెన్షియల్ మేటర్... ప్లీజ్ గో" అని చెప్పాడు.

అవినాష్ ఈవెనింగ్ ఫ్లైట్ ఎక్కి న్యూ ఢిల్లీ చేరాడు... ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ గెస్ట్ హౌస్ కి చేరుకునేటప్పటికీ రాత్రి 8:30 అయ్యింది... బాగా అలిసిపోయాడు... స్నానం చేసి వచ్చేటప్పటికి డిన్నర్ రెడీ గా ఉంది... తినేసి మొబైల్ ఫోన్ లో ఉదయం 5:30 కి అలారమ్ పెట్టుకొని పడుకోవడానికి... రూమ్ లో లైట్ తీసేసి మంచం మీద చేరాడు... "టక్... టక్... టక్..." అంటూ తలుపు మీద శబ్దం అయ్యింది... లేచి లైట్ వేసుకొని తలుపు తీసి బయట నుంచున్న వ్యక్తిని చూసి స్టన్ అయ్యాడు.

ఆ వ్యక్తి "May I come in?" అంటూ చాలా పొలిట్ గా అడిగాడు... అవినాష్ తడబడుతూ... "ఎస్... ప్లీజ్ కం ఇన్" అంటూ ఆ వ్యక్తి లోపలి రావడానికి దారి ఇచ్చాడు.

ఆ వ్యక్తి లోపలి కి వస్తూ "Do you know who am I?" అని అడిగాడు

అవినాష్ స్టిఫ్ గా నుంచొని సెల్యూట్ కొడుతూ "Yes... Sir... You are Director Intelligence Bureau... Mr. Ravindra" అని అన్నాడు.

"You have ten minutes to dress up... wear something comfortable... we have to go somewhere ..."


Part - 7 - The Meeting

రవీంద్ర... అవినాష్ పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి బయటకి వచ్చి సెంట్రల్ ఢిల్లీ లో పండర రోడ్ వైపు నడవసాగారు... పండర రోడ్ రెస్టారెంట్స్ కి బాగా ప్రసిద్ధి. రాత్రి బాగా బిజీ గా వుండే ఏరియా. అక్కడ పార్క్ చేసిన కార్ ఎక్కి రిడ్జ్ రోడ్ వైపు వెళ్ళసాగారు... ఆ రోడ్ అంతా చిమ్మ చీకటిగా ఉంది... చుట్టూ అడవి... ఢిల్లీ నగర నడి బొడ్డున అంత పెద్ద అడవి ఉందన్న సంగతి చాలా మంది గమనించరు. అందరూ బిజీగా రోజంతా సిటీ కి అన్నివైపులా నుంచి సెంట్రల్ ఢిల్లీ కి వచ్చి వెళ్తూ ఉంటారు. రిడ్జ్ రోడ్ లో ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాక రవీంద్ర సడన్ గా కార్ ని ఎడమవైపు తిప్పాడు... అది అంతా అడవి ప్రదేశం... స్ట్రీట్ లైట్స్ లేవు... సరైన రోడ్ లేదు... పగలు కూడా ఎవరికి ఆ కచ్చా రోడ్ కనిపించే అవకాశం లేదు... ఆ రోడ్ లో ఒక 100 మీటర్స్ ప్రయాణించిన తరువాత రవీంద్ర కార్ హెడ్ లైట్స్ ఆఫ్ చేసాడు... చీకట్లో నడపసాగాడు... రవీంద్ర పక్కనే కూర్చున్న అవినాష్ కి ముందు రోడ్ మీద ఏముందో తెలియడం లేదు... అసలు రోడ్ ఉందొ లేదో అన్న అనుమానం వచ్చింది... రవీంద్ర మాత్రం కార్ ని చాలా కాన్ఫిడెంట్ గా చీకట్లో నడుపుతున్నాడు... ఇంకో 300 మీటర్స్ వెళ్ళాక రవీంద్ర కార్ డిప్పర్ లైట్స్ చాలా వేగం గా ఆన్... ఆఫ్ చేయ్యసాగాడు... టక్... టాకా... టక్... టక్... టాకా... అవినాష్ కి అర్ధమయ్యింది..... రవీంద్ర డిప్పర్ లైట్స్ సహాయంతో మోర్స్ కోడ్ లో ఎవరికో మెసేజ్ పంపుతున్నాడు... ఆ చీకట్లో కార్ ఆగడం లేదు... సడన్ గా ఒక గేట్ కనిపిచింది. రవీంద్ర కార్ ఆపాడు... ఆ చీకట్లోంచి ఇద్దరు గన్ మెన్ ప్రత్యక్షమయ్యారు... కార్ లో రవీంద్ర ని చూసి సెల్యూట్ కొట్టి గేట్ ఓపెన్ చేశారు... కార్ లోపలి వెళ్ళింది... అప్పుడు కనిపిచింది... ఒక పెద్ద బిల్డింగ్... పూర్తిగా మిలిటరీ కెమోఫ్లాజ్ పెయింట్ వేసి ఉంది... బయట లైట్స్ కూడా లేవు... కార్ దిగారు... అవినాష్ అప్పుడు గమనించాడు.. అక్కడ ఒక మెయిన్ డోర్ ఉంది... దానిని ఇరువైపులా ఇద్దరు సోల్డర్స్ కెమోఫ్లాజ్ యూనిఫామ్, ఫేస్ పెయింట్ వేసుకొని ఉన్నారు... అది ఒక సెక్యూర్డ్ మిలిటరీ ఫెసిలిటీ... వాళ్ళు రవీంద్ర ని చూసి సెల్యూట్ కొట్టారు... రవీంద్ర తన యాక్సిస్ కార్డు తో మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు... లోపల లోపల ఇంకో డోర్ కనిపిచింది... ఆ డోర్ కి పక్కనే ఒక పెద్ద కీ పాడ్ వుంది... రవీంద్ర తన 8 డిజిట్స్ పాస్ కోడ్ వేసాడు... ఆ కీ పాడ్ పైన ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది... లోపలనుండి ఐరిస్ స్కాన్ మెషిన్ బయటకి వచ్చింది... రవీంద్ర తన రెండు కళ్ళ ఐరిస్ స్కాన్ చేసాడు... డోర్ ఓపెన్ అయ్యింది... లోపలికి వెళ్లారు. అక్కడ...

ఒక అద్భుతమైన మోడరన్ ఫెసిలిటీస్ కలిగిన ఆఫీస్... గ్రౌండ్ ఫ్లోర్... ఫస్ట్ ఫ్లోర్... మొత్తం స్టేట్ అఫ్ ఆర్ట్ డేటా సెంటర్... ఫస్ట్ ఫ్లోర్ నిండా పెద్ద పెద్ద IBM సర్వర్స్ తో నిండి ఉంది... గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వైర్లు... కేబుల్స్... కనెక్ట్ చేసి ఉన్నాయి... గ్రౌండ్ ఫ్లోర్ లో చాలా మంది కంప్యూటర్స్ ముందు కూర్చొని చాలా బిజీ గా ప్రోగ్రామ్స్ వ్రాస్తున్నారు... వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లోంచి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని యాక్సిస్ చేస్తారు... రవీంద్ర... అవినాష్ రావడం వాళ్ళు గమనించలేదు... ఒక వేళ గమనించినా పట్టించుకోరు... ఎందుకంటే... అబిల్డింగ్ లో కి ఎవరు పడితే వాళ్ళు రాలేరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. చాలా పెద్ద ఆఫీస్... రవీంద్ర ముందు నడుస్తున్నాడు... వెనకే అవినాష్... ఆ రూమ్ కి చివర ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి మెట్లు వున్నాయి... ఆ మెట్ల వెనక ఆ బిల్డింగ్ కింద ఉన్న బేస్మెంట్ లోకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి... ఇద్దరూ ఆ మెట్ల ద్వారా... బేస్మెంట్ లో కి వెళ్లారు... అక్కడ...

రూమ్ కి మధ్య లో ఒక పెద్ద టేబుల్ ఉంది... ఆ టేబుల్ కుడి పక్క గోడ కి పెద్ద పెద్ద టీవీ స్క్రీన్స్ ఫిట్ చేసి ఉన్నాయి ... ఆ స్క్రీన్స్ మీద భారత్ దేశం లో ఉన్న పెద్ద పెద్ద నగరాల రోడ్స్ బిల్డింగ్స్... ట్రాఫిక్... ముంబయి... చెన్నై... కొలకత్తా... బెంగళూరు... హైదరాబాద్... పూణే... తిరువనంతపురం... అన్ని ముఖ్య నగరాల నుంచి స్ట్రీట్ ట్రాఫిక్ రియల్ టైం బేసిస్ లో స్ట్రీమ్ అవుతోంది... ఆ టేబుల్ ఎడమ పక్క గోడకి కూడా పెద్ద పెద్ద టీవీ స్క్రీన్స్ ఉన్నాయి... ఆ స్క్రీన్స్ మీద ప్రపంచం లో పెద్ద నగరాల స్ట్రీట్ ట్రాఫిక్ ఫీడ్ అవుతోంది... లండన్... పారిస్... బెర్లిన్... ఫ్రాంక్ఫర్ట్... రోమ్... మిలన్... అబూ దాబి... దుబాయ్... సిడ్నీ... న్యూ యార్క్... చికాగో... లాస్ ఏంజెల్స్... టోక్యో...

మధ్యలో ఉన్న టేబుల్ మీద చాలా ఫైల్స్... బుక్స్ పేపర్స్... ఉన్నాయి... ఆ టేబుల్ కి ఒక 15 అడుగుల దూరం లో గోడకి దగ్గరగా ఇంకో టేబుల్ ఉంది... ఆ టేబుల్ వెనకాల ఉన్న కుర్చీలోంచి లేచి "Welcome to Op Center" అని అన్నాడు... బ్రిగేడియర్ మాధవ్... అవినాష్ కి ఇదంతా ఒక హాలీవుడ్ సినిమా సెట్టింగ్ లా కనిపిచింది. ఇదంతా నిజమా... కలో తెలియడం లేదు. న్యూ ఢిల్లీ నది బొడ్డున ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద సెక్యూర్డ్ మిలిటరీ ఫెసిలిటీ ఉంటుందని అనుకోలేదు. ముగ్గురూ ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు.

మాధవ్ : నా పేరు మాధవ్... ఈ Op Center కి ఇంచార్జి...

అవినాష్ : నైస్ టు మీట్ యు...

మాధవ్ : మీతో చాలా మాట్లాడాలి... టైం వేస్ట్ చెయ్యను... మిమ్మల్ని ఇక్కడకి ఎందుకు పిలిపించానంటే... మీకు మహేంద్ర భూపతి తెలుసా...

అవినాష్ : తెలుసు... హైదరాబాద్ లో చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్... బిజినెస్ మాన్... పొలిటిషన్... వెరీ రిచ్ పర్సన్ ఇన్ ది కంట్రీ.

మాధవ్ : అవును... ఈ విషయాలు అందరికి తెలిసినవే... తెలియని విషయాలు ఏమిటంటే... మహేంద్ర ఒక దేశ ద్రోహి... డ్రగ్ లార్డ్... మాఫియా కింగ్... మనీ లాండరింగ్ నెటవర్క్... కాంట్రాక్టు కిల్లింగ్స్... ఒకటేమిటి... అన్ని రకాలుగా ఆరితేరిన పెద్ద క్రిమినల్... చాలా కాలంగా నిఘా పెట్టాము... ఎక్కడా చిక్కడం లేదు. చాలా జాగ్రత్త గా వ్యవహరిస్తాడు... కొంత కాలం క్రితం డిఫెన్స్ మినిస్ట్రీ లో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు... ఆ వీడియో ని అడ్డుపెట్టుకొని చాలా పెద్ద డిఫెన్సె కాంట్రాక్టు సంపాదించడమే కాకుండా డిఫెన్సె మినిస్ట్రీ కి సంబంధించిన రహస్యాలు చాలా తెలుసుకున్నాడు...

అవినాష్ : ఆ స్టింగ్ ఆపరేషన్ చేసింది "సూర్యోదయం" టీవీ ఛానెల్ వాళ్ళు కదా...

మాధవ్ (ఆశ్చర్యం గా): మీకెలా తెలుసు? ఆ స్టింగ్ ఆపరేషన్ గురించి బయటికి రాలేదు. చాలా సీక్రెట్ గా ఉంచారు... ఆ వీడియో ఉన్న సంగతి బయట ఎవరికి తెలియదు.

అవినాష్ : ఈ మధ్య నే ఒక కేసు ని ఇన్వెస్టిగేట్ చేస్తూంటే ఈ స్టింగ్ ఆపరేషన్ గురించి తెలిసింది. ఆ స్టింగ్ ఆపరేషన్ చేసింది ఎవరో నాకు తెలుసు. అతని పేరు విక్రాంత్... ఒకప్పుడు సూర్యోదయం టీవీ లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ గా పనిచేశాడు.

మాధవ్ : ఇంప్రెసివ్... హైదరాబాద్ DRDO లోంచి సీక్రెట్స్ బయట దేశాలకి వెళ్లిపోతున్నాయి... DRDO కి మన దేశం లో చాలా చోట్ల లాబ్స్... ఆఫీస్... రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి... మన డిఫెన్సె కి సంభందించి చాలా సీక్రెట్స్ ప్రపంచ మార్కెట్ లో హైయెస్ట్ బిడ్దర్ కి అమ్మారని తెలిసి... మేము ఆ సీక్రెట్స్ కొన్న వాళ్ళ ని వెతికి పట్టుకున్నాము... మన రహస్యాలు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే మాకు మహేంద్ర భూపతి పేరు తెలిసింది... మహేంద్ర కి సీక్రెట్స్ ఎలా చేరుతున్నాయో తెలియడం లేదు. మన స్పై ఒకడు... పేరు సిద్దికీ... దుబాయ్ లో ఒక Arms Dealer దగ్గర అండర్ కవర్ లో పనిచేస్తున్నప్పుడు ఒక పేరు తెలిసింది... ఖుర్రమ్... అది వ్యక్తిపేరో... లేక కోడ్ నేమ్... అనేది తెలియలేదు... సిద్దికీ గత సంవత్సరంగా హైదరాబాద్... దుబాయ్... లండన్ లో చాలా కస్టపడి ఒక కాంటాక్ట్ ని సంపాదించాడు. మీకు గుర్తుందా... ఈ మధ్య హైదరాబాద్ లో హై కోర్ట్ కి దగ్గర ఇరానీ కేఫ్ లో ఒక షూట్ అవుట్ జరిగింది?

అవినాష్ : ఎస్... ఒక పిచ్చోడు గన్ తీసుకొని ఇరానీ కేఫ్ లో కెళ్ళి ఇష్టమొచ్చినట్లు కాల్పులు జరిపాడు...

మాధవ్: అవును... నిజం చెప్పాలంటే... వాడు మా మిలిటరీ సరవైలన్స్ ఆపరేషన్ ని పాడు చేసాడు...

అవినాష్ : వాట్... నాకు అర్ధం కాలేదు...

మాధవ్ : మొత్తం చెప్తాను...


సిద్దికీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో అండర్ కవర్ లో ఉండేవాడు. అతి కష్టం మీద ఒక కాంటాక్ట్ ని సంపాదించాడు. ఆ వ్యక్తి ఎవరో... ఎలా ఉంటాడో... ఎవరికి తెలియదు. డార్క్ వెబ్ లో ఒక చాట్ రూమ్ లో కలుస్తాడు... ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్న సరసమైన ధరకి అమ్ముతాడు... సిద్దికీ వాడితో చాలా సార్లు చాట్ చేసాడు... వాడితో పరిచయం బాగా పెంచుకున్నాడు. వాడి చాట్ రూమ్ పేరు "ఖుర్రమ్"... వాడు సిద్దికీ ని నమ్మసాగాడు... వాడికి సిద్దికీ తాను పాకిస్తాన్ ISI ఏజెంట్ అని చెప్పాడు... వాడు వెంటనే నమ్మలేదు... చాలా రకాలుగా టెస్ట్స్ పెట్టాడు... వాడిని నమ్మించడానికి Op Center సిద్దికీ కి పాకిస్తాన్ ISI గురించి వాళ్లకి తెలిసిన చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయం లో మాధవ్ ఒక ప్లాన్ వేసాడు... అదేమిటంటే...

Op Center డార్క్ వెబ్ లో కి వెళ్లి ఖుర్రమ్ తో చాట్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలని అడిగేది. ఖుర్రమ్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి సిద్దికీ ని అడిగేవాడు... Op Center ఆ ఇన్ఫర్మేషన్ ని సిద్దికీ కి ఇచ్చేది... సిద్దికీ దాన్ని ఖుర్రమ్ కి అమ్మేవాడు... ఖుర్రమ్ దుబాయ్ లో ఉన్న సిద్దికీ బ్యాంకు అకౌంట్ (ఆ అకౌంట్ Op Center ఆపరేట్ చేస్తుంది) కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఎప్పుడైతే ఫండ్స్ ట్రాన్సఫర్ జరిగిందో... వెంటనే Op Center ఆ డబ్బులు ఏ అకౌంట్ లోంచి వచ్చాయో కనుక్కుంది... ఆ అకౌంట్ ఒక షిప్పింగ్ కంపెనీ పేరు మీద ఉంది... ఆ షిప్పింగ్ కంపెనీ ఓనర్ టర్కీ కి చెందిన వాడు... వాడి కి చాలా షిప్పింగ్ లైన్స్ తో బిజినెస్ వుంది. వాడి మీద Op Center నిఘా పెట్టింది...

కొంత కాలానికి సిద్దికీ అంటే ఖుర్రమ్ కి మంచి నమ్మకం ఏర్పడింది... ప్రతి రోజూ వాళ్ళు గంటల తరబడి చాట్ చేసేవాళ్ళు... అలా చాట్ చేస్తూంటే మహేంద్ర భూపతి పేరు తెలిసింది. ఒక రోజు సిద్దికీ ఖుర్రమ్ కి ఒక ప్రపోసల్ పెట్టాడు... అదేమిటంటే... తనకి DRDO లో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కి సంభందించిన ఇన్ఫర్మేషన్ కావాలని అన్నాడు... ఎంత ఖర్చైనా పర్వాలేదు... అని చెప్పాడు... ఖుర్రమ్ కొంచం టైం కావాలని చెప్పి మాయమయ్యాడు... సిద్దికీ వాడి కోసం ప్రతి రోజూ చాట్ రూమ్ లో వెయిట్ చేసేవాడు... చాలా రోజులు ఖుర్రమ్ రాలేదు... చివరికి సడన్ గా ఒక రోజు ఖుర్రమ్ చాట్ రూమ్ కలిసాడు... "రేపు ఉదయం 11 గంటలకి హైదరాబాద్ హై కోర్ట్ దగ్గరున్న స్టార్ ఇరానీ కేఫ్ లో కలవగలవా?" అని అడిగాడు... సిద్దికీ వెంటనే కలవడానికి ఒప్పుకున్నాడు... "ఆ స్టార్ ఇరానీ కేఫ్ లో నువ్వు రేపు ఉదయం 11 గంటలకి 4 సమోసాలు... 6 ఉస్మానియా బిస్కెట్స్... 3 టీ కప్పులు పెట్టుకొని కూర్చో... నేను వచ్చి కలుస్తాను... నేను నిన్ను ఇండియా లో ఇస్లామాబాద్ ఎక్కడుంది అంది అడుగుతాను... నువ్వు కాశ్మీర్ లో అనంతనాగ్ అని చెప్పు... ఇంపార్టెంట్... ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ తెలిసింది... చాలా కాస్టలీ... ఎక్కువ డబ్బులు కావాలి..." అని అన్నాడు... సిద్దికీ అన్నింటికీ ఒప్పుకున్నాడు...

సిద్దికీ ఈ విషయాన్నీ వెంటనే Op Center కి తెలియచేసాడు...

మాధవ్ : ఇన్నాళ్లు తన ఐడెంటిటీ ఎవరికి తెలియనీకుండా జాగ్రత్త పడ్డవాడు... ఇప్పుడు సడన్ గా నిన్ను కలవాలని అనుకున్నదంటే... ఇదేదో ట్రాప్ లాగా ఉంది...

సిద్దికీ: కావొచ్చు... మనం రిస్క్ చెయ్యాలి... ఒక్కసారి ఈ ఖుర్రమ్ ఎవరో తెలిస్తే... మనకి బాగా హెల్ప్ చేస్తుంది...

మాధవ్ : నీ లైఫ్ కి రిస్క్... వాడెవడో మనకి తెలియడం కాదు... నువ్వెవరో వాడికి తెలిసిపోతుంది... వాడు ఒంటరిగా వస్తాడని నేను అనుకోవడం లేదు... ఆ ఖుర్రమ్ ISI వాడు కాదని నమ్మకం ఏమిటీ?

సిద్దికీ: ఆ రిస్క్ తీసుకుంటాను... రేపు కలుస్తాను...

మాధవ్ : నీకు ఆ స్టార్ ఇరానీ కేఫ్ ఎక్కడుందో తెలుసా...

సిద్దికీ: లేదు... ఇపుడే చెక్ చేస్తాను...

మాధవ్ : వొద్దు... నువ్వు వెళ్లొద్దు... నా అనుమానం ప్రకారం వాళ్లకి నువ్వెవరో తెలిసే ఉంటుంది... నేను మన వాళ్ళని పంపించి సైట్ సర్వే చేయిస్తాను... నేను చెప్పేదాకా నువ్వు ఇంట్లోంచి కదలకు...

మాధవ్ వెంటనే రవీంద్ర కి చెప్పాడు... రవీంద్ర హైదరాబాద్ లో IB కి ఫోన్ చేసి నలుగురు ఏజెంట్స్ ని రెండు టీమ్స్ గా ఆ ఇరానీ కేఫ్ కి పంపించి సర్వే చెయ్యమని చెప్పాడు. ఒక మూడు గంటల తరువాత వాళ్ళు రిపోర్ట్ తో వెనక్కి వచ్చారు...

రవీంద్ర : ఫిజికల్ లొకేషన్ ఏమిటీ?

IBTeam : హై కోర్ట్ కి దగ్గ గా వుంది... మెయిన్ రోడ్ కాదు... పాత బిల్డింగ్... కార్ వెళ్ళదు... సైకిల్... స్కూటర్ మాత్రమే వెళ్ళగలవు...

రవీంద్ర : ఆపోజిట్ లొకేషన్ ఎలా వుంది?

IBTeam : పాత బిల్డింగ్... కింద గ్రౌండ్ ఫ్లోర్ లో షాప్స్... పైన ఆఫీస్...

రవీంద్ర: అన్ని షాప్స్... ఆఫీసులు ఓపెన్ గా ఉన్నాయా... ఏదైనా క్లోస్డ్ ఫెసిలిటీ ఉందా...

IBTeam : లేదు... అన్ని ఓపెన్

రవీంద్ర : ఇరానీ కేఫ్ లోపల ఎలా వుంది?

IBTeam : చాలా చిన్నది... 9 టేబుల్స్ ఉన్నాయి...

రవీంద్ర : సీసీటీవీ?

IBTeam : సీసీటీవీ లేదు... ఇరానీ కేఫ్ పైన అందులో పనిచేసే కుర్రోళ్ళు ఉంటారు

రవీంద్ర : ఆ ఇరానీ కేఫ్ కి వెనకాల ఏదైనా సందు ఉన్నదా...

IBTeam : ఉంది... చాలా సన్నటి సందు... బాగా రద్దీ గా ఉంటుంది.

రవీంద్ర : మనం సర్వైలన్సు టీం ని పెట్టాలంటే ఎలా ? మొత్తం కవర్ చెయ్యాలంటే కుదురుతుందా...

IBTeam : చాలా కష్టం... ఎదురు బిల్డింగ్ మేడ మీద ఒక కెమెరా పెట్టొచ్చు... ఎక్కువమంది ఉంటే జనాలకి అనుమానం వస్తుంది.

రవీంద్ర : కేఫ్ లోపల స్పై కెమెరా పెట్టొచ్చా...

IBTeam : చాలా కష్టం... కేఫ్ మొత్తం కవర్ అయ్యేలా కెమెరా పెట్టాలంటే... ఆ ఓనర్ కి చెప్పాలి... లేదా ఎవరూ లేనప్పుడు కెమెరా పెట్టాలి... ఆ కేఫ్ రాత్రి 12 దాకా ఓపెన్ ఉంటుంది... మళ్ళీ ఉదయం 8 కల్లా తెరుస్తారు... అందరూ నిద్ర పోయాక ట్రై చెయ్యాలి.

రవీంద్ర : ట్రై చెయ్యడం కాదు... ఆ కేఫ్ మొత్తం కవర్ అయ్యేలా ఎక్కడ స్పై కెమెరా పెట్టాలో డిసైడ్ చేసి రేపు ఉదయం కేఫ్ ఓపెన్ అయ్యేలోపల అక్కడ కెమెరా పెట్టే భాద్యత మీదే... రాత్రి లోపల మీకు ఢిల్లీ నుంచి ఒక ఏజెంట్ స్పై కెమెరా తీసుకొని వస్తాడు. ఎదురుగా బిల్డింగ్ మేడ మీద రెండు కెమెరాలు పెట్టాలి... ఒకటి ఉదయం నుంచి మేము చెప్పేదాకా రన్ అయ్యేలా చూడండి. రెండో కెమెరా... DSLR... ఆ కేఫ్ లోకి వెళ్లే వాళ్ళు బయటకి వచ్చే ప్రతి వాడిని రకరకాల యాంగిల్స్ లో ఉదయం నుంచి ఫొటోస్ తీస్తూనే ఉండాలి... అక్కడనుంచి కదలకూడదు... ఎవరికి అనుమానం రాకూడదు... రోడ్ మీద మన వాళ్ళు కనీసం 20 మంది ఉండాలి... ఎవరికి అనుమానం రాకుండా ఉదయం నుంచి మేము చెప్పేదాకా కవర్ చెయ్యాలి... ఆ రోడ్ మొదట్లో ఒక వాన్ పార్క్ చెయ్యడానికి ప్లేస్ ని రిజర్వు చేసి ఉంచండి... వెరీ ఇంపార్టెంట్... అందరి దగ్గరా వెపన్స్ ఉండాలి... ప్రతి ఒక్కడిదగ్గర కనీసం 5 ఎక్సట్రా మ్యాగజైన్స్ ఉండేలా చూసుకోవాలి... ఇంకో సంగతి... ఆ ఇరానీ కేఫ్ ఓనర్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చెయ్యండి... కంప్లీట్ రిపోర్ట్ వెంటనే పంపించండి.

అప్పటినుంచి హైదరాబాద్ IB రంగం లోకి దిగింది... ఒక టీం మళ్ళీ ఆ ఇరానీ కేఫ్ కి వెళ్లి మొత్తం జాగ్రత్తగా సర్వే చేసి స్పై కెమెరా ఎక్కడ పెడితే మొత్తం కవర్ అవుతుందో చూసుకున్నారు... ఒక ఏజెంట్ టీ తాగి కేఫ్ లోపల్కి వెళ్ళాడు... అక్కడ పని చేస్తున్న వాళ్ళు "క్యా చాహియే..." అని అడిగారు... "టాయిలెట్ కహా హాయ్?" అని అడిగాడు... "యహా టాయిలెట్ నహి హై జావ్" అని కసురుకున్నాడు... ఆ ఏజెంట్ వచ్చిన పని అయింది... రాత్రి వచ్చి ఆ కేఫ్ వెనక డోర్ ఎలా ఓపెన్ చేసి లోపలి వెళ్లాలో చూసుకున్నాడు. ఇంకో టీం ఎదురుగా ఉన్న బిల్డింగ్ మీదికి వెళ్లి కెమెరా పెట్టాల్సిన ప్లేస్ చూసుకున్నారు. ఆ రోడ్ మీద ఎక్కడెక్కడ IB టీం ని పెట్టెలో చూసుకున్నారు... రోడ్ మొదట్లో వాన్ కోసం మంచి స్పాట్ కూడా డిసైడ్ చేశారు. అప్పటికే సాయంత్రం 7 అయ్యింది...

రవీంద్ర కి ఆ ఇరానీ కేఫ్ ఓనర్ బ్యాక్ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది... పెద్దగా అనుమానించాల్సింది ఏమి లేదు. రాత్రి 9 గంటలప్పుడు ఢిల్లీ నుంచి ఒక ఏజెంట్ వచ్చాడు. తన తో పాటు ఒక స్పై కెమెరా తెచ్చాడు. దాన్ని ఆ కేఫ్ లోపల అమర్చడం అతని డ్యూటీ. అతన్ని తమ తో పాటు స్టార్ ఇరానీ కేఫ్ కి తీసుకెళ్లారు... స్పై కెమెరా పెట్టాల్సిన స్పాట్ ఫైనలైజ్ చేశారు... ఉదయం నుంచి ఆ కేఫ్ లో ఒకసారి వెళ్లిన ఏజెంట్ మళ్ళీ వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు.

రాత్రి 11 అయింది... ఆ రోడ్ లో అన్ని షాప్స్ మూసేసారు... రోడ్ అంతా నిర్మానుష్యంగా వుంది... స్టార్ ఇరానీ కేఫ్ ఇంకా తెరిచేవుంది... గల్లా పెట్టె మీద ఓనర్ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. కేఫ్ లో పనిచేసే కుర్రోళ్ళు కేఫ్ లో కుర్చీలు తీసి టేబుల్ మీద పెట్టి... కేఫ్ మొత్తం నీళ్లు పోసి కడగసాగారు... తరువాత నీళ్లు అన్ని పోయేలా తుడిచి మెయిన్ డోర్ షట్టర్ వేసేటప్పటికీ రాత్రి రెండు అయ్యింది... ఓనర్ ఇంటికి వెళ్ళిపోయాడు... పని వాళ్ళు కేఫ్ మీద మీద రూమ్ లోకి వెళ్లి లైట్ తీసి పడుకున్నారు... అప్పుడు టైం 2:40 అయ్యింది... ఉదయం 4 గంటలప్పుడు నలుగురు IB ఏజెంట్స్ కేఫ్ కిఎదురుగా ఉన్న బిల్డింగ్ మీద మీద చేరారు... ఇంకో ఇద్దరు ఏజెంట్స్ కేఫ్ వెనక సందులోకి వెళ్లి వెనక డోర్ ని చాలా కస్టపడి ఓపెన్ చేసి లోపలి వెళ్లారు... ముందుగా డిసైడ్ చేసుకున్న స్పాట్ లో కెమెరా పెట్టారు... అది చూడడానికి ఒక పెద్ద బల్లి లాగ ఉంది... ఎవరైనా చూస్తే అది బల్లి అనుకుంటారు... కెమెరా అని అనుమానం రాదు. వెంటనే ఫోన్ చేసి Op Center ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు... వాళ్ళు దాన్ని ఆన్ చేసి సరిగ్గా పనిచేస్తోందో లేదో చెక్ చేశారు... ఆ కెమెరా లో ఇన్ఫ్రా రెడ్... నైట్ విజన్ టెక్నాలజీ ఉండడం తో... చీకట్లో కూడా ఆ కెమెరా పెట్టిన ఏజెంట్ పేస్ చాల క్లియర్ గా కనిపిచింది... ముందుకి... వెనక్కి జూమ్ చేసి కేఫ్ మొత్తం వాల్ టు వాల్ కవర్ అవుతోందో లేదో చెక్ చేశారు... బానే పనిచేస్తోందని డిసైడ్ అయ్యాక వాళ్ళని అక్కడ నుంచి వెళ్లి పొమ్మన్నారు...

తెల్ల వారింది... ఉదయం 6 గంటలు... కేఫ్ మీద మీద పడుకొని ఉన్న పని వాళ్ళు లేచారు... కిందకి వచ్చి కేఫ్ షట్టర్ తీశారు... అప్పటికే కేఫ్ ఎదురు బిల్డింగ్ మీద కెమెరాలతో ఏజెంట్స్ సిద్ధం గా ఉన్నారు... మూవీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేశారు... ఫీడ్ మొత్తం డైరెక్ట్ గా Op Center సర్వర్స్ కి చేరుతోంది... షట్టర్ తీసిన వాడి మొహం క్లియర్ గా వచ్చేలా జూమ్ చేసి ఫొటోస్ తీసాడు... ఆ కేఫ్ లోకి వెళ్లే వాళ్ళని... బయటకి వచ్చేవాళ్ళని... ఫొటోస్ తీస్తున్నారు... కేఫ్ లో పనివాళ్ళు తమ పనులు చేసుకుంటున్నారు...

ఉదయం 8 గంటలు... మొదటి కస్టమర్ వచ్చాడు.


Part - 8 - The Shoot-out

ఉదయం మాధవ్ సిద్దికీ కి ఫోన్ చేసాడు. పక్కనే రవీంద్ర కూడా ఉన్నాడు... అప్పటిదాకా చేసిన ఏర్పాట్లను వివరంగా చెప్పాడు... ఇరానీ కేఫ్ లో స్పై కెమెరా ఎక్కడ పెట్టింది చెప్పారు...

మాధవ్ : ఇప్పడు కూడా మించి పోలేదు... మీటింగ్ ని కాన్సల్ చేద్దాం... చాలా రిస్క్... ఆ ఇరానీ కేఫ్ చాలా చిన్నది... బయట మనవాళ్ళు ఒక 20 మంది ఉన్నారు... మేము ఆ కేఫ్ లో జరిగేది రియల్ టైం బేసిస్ లో ఇక్కడ నుండి మోనిటర్ చేస్తున్నాము...

సిద్దికీ : నేను వెళ్తాను... మనకి దొరికిన ఒకే ఒక్క ఛాన్స్... రిస్క్ చేస్తాను... ఒకవేళ వాడు resourceful పర్సన్ అయితే మనకి చాలా లాభం. ప్రస్తుతం వాడు నేను ISI అని అనుకుంటున్నాడు...

మాధవ్ : ఆ విషయం లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి... ఈ ఖుర్రమ్ ISI ఏజెంట్ కాదని ఏమిటీ నమ్మకం?

రవీంద్ర : సిద్దికీ... నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి... నీకు మేము ఒక ఓ ఫోటో పంపాము చూసావా?

సిద్దికీ: ఎస్. ఇప్పుడే చూసాను... ఇది ఆ ఇరానీ కేఫ్ లోపల తీసిన ఫోటో కదా...

రవీంద్ర : అవును... ఈ ఫోటో మేము అక్కడ పెట్టిన స్పై కెమెరా తో తీసాము... నువ్వు లోపలి వెళ్లి ఆ ఇరానీ కేఫ్ ఓనర్ ని ఫేస్ చేస్తూ కూర్చో... అప్పుడు నీ బ్యాక్ సైడ్ స్పై కెమెరా ని ఫేస్ చేస్తుంది... ఆ ఖుర్రమ్ నీ ముందు కూర్చుంటే... వాడి ఫేస్ క్లియర్ గా స్పై కెమెరా లో కనిపించేలా జాగ్రత్త తీసుకో...

సిద్దికీ : నేను అక్కడికి వెళ్లే టైం కి ఆ టేబుల్ ఖాళీగా లేకపోతే?

రవీంద్ర : ఆ ప్రాబ్లెమ్ లేదు... నీ ఫోటో ని మన టీం కి పంపాము... వాళ్లలో నలుగురు నువ్వు ఆ కేఫ్ లోకి వచ్చే దాకా ఆ టేబుల్ దగ్గర కూర్చుంటారు... ఆ టేబుల్ కి కింద భాగం లో ఒక మైక్రో ఫోన్ పెడతారు... మీ సంభాషణ మాకు క్లియర్ గా వినిపించాలి... ఆ కేఫ్ లో కస్టమర్స్ మాట్లాడుకోవడం... స్పీకర్స్ లో హిందీ పాటలు... ఈ గొడవలో మీ మాటలు మాకు క్లియర్ గా వినిపించాలని ఈ ఏర్పాటు చేసాము. నువ్వు రాగేనే వాళ్ళు ఆ టేబుల్ ఖాళీ చేస్తారు... ఒక టీం ని లోపల కూడా ఉంచుతాము...

సిద్దికీ : వొద్దు... ఖుర్రమ్ ఆ కేఫ్ లో ఉన్నప్పుడు లోపల మన వాళ్ళు ఉండకూడదు... ఖుర్రమ్ కి డౌట్ వస్తే వెళ్లిపోయే ప్రమాదం ఉంది... ఖుర్రమ్ ని ఫాలో అవ్వడం... లేదా అరెస్ట్ చెయ్యడం జరగకూడదు...

రవీంద్ర : ఆల్రైట్... నువ్వు చెప్పినట్లే చేస్తాము... కానీ... మాకు ఏదైనా ప్రాబ్లెమ్ అనిపిస్తే... వెంటనే మన వాళ్లకి సిగ్నల్ ఇస్తాం... వాళ్ళు లోపలి వచ్చేస్తారు... బి కేర్ఫుల్... అండ్ గుడ్ లక్.

మాధవ్ : వన్ మోర్ థింగ్... ఎక్కువగా ఖుర్రమ్ మాట్లాడేలా చూడు... వాడి వాయిస్ శాంపిల్ మనకి చాలా అవసరం... వీలయితే వాడు తాగిన టీ కప్ తీసుకొని రా... బయో మెట్రిక్ డేటా కి పనికి వస్తుంది.. నో ప్రెషర్...

సిద్దికీ : ఐ విల్ ట్రై...

మాధవ్ : ఓకే... గో అండ్ మీట్ ఖుర్రమ్...

స్టార్ ఇరానీ కేఫ్ లో హడావిడి మొదలయ్యింది... కస్టమర్స్ తో నిండి పోయింది... వచ్చే... పోయే... వాళ్ళని ఎదురు బిల్డింగ్ మేడ మీద నుంచి ఫోటోలు తీస్తున్నారు... ఏ ఒక్కరిని వొదలకుండా చూసుకుంటున్నారు. ఇది కాకుండా వీడియో రికార్డింగ్ కూడా జరుగుతోంది... డైరెక్ట్ ఫీడ్ Op Center కి చేరుతోంది... రవీంద్ర... మాధవ్... స్క్రీన్ ముందు కూర్చొని రెప్ప వాల్చకుండా హైదరాబాద్ లో జరిగేది చూస్తున్నారు...

సమయం 10:30AM... ప్లాన్ ప్రకారం నలుగురు ఏజెంట్స్ ఇరానీ కేఫ్ లోకి వెళ్లి ముందుగా డిసైడ్ చేసుకున్న టేబుల్ ని ఆక్రమించుకున్నారు... టీ లకి ఆర్డర్ ఇచ్చి మామూలు కస్టమర్స్ లాగా ప్రవర్తించసారు... బయట ఉన్న ఏజెంట్స్ చాలా అలెర్ట్ గా ఉన్నారు... వాళ్ళందరి దగ్గర సిద్దికీ ఫోటో ఉంది... అతడిని సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే వాళ్ళ డ్యూటీ... ఆవరమైతే ఎవరినైనా షూట్ చెయ్యడానికి వెనకాడ వొద్దని ఆర్డర్ ఉన్నాయి...

టైం 10:50AM... సిద్దికీ ఆ రోడ్ లో అడుగు పెట్టాడు... రవీంద్ర అందరికి మెసేజ్ పంపాడు... "White Fox arraived... Stay Alert" సిద్దికీ స్టార్ ఇరానీ కేఫ్ లోకి అడుగు పెట్టాడు... అతడు రావడం చూసిన ఏజెంట్స్ వెంటనే ఆ టేబుల్ ఖాళి చేసి టీ డబ్బులు ఇచ్చేసి బయటకి వెళ్లి పోయారు... సిద్దికీ ఒక వెయిటర్ ని పిలిచి "చార్ సమోసా... ఛే ఉస్మానియా బిస్కట్స్... తీన్ ఛాయ్ లావ్..." అంటూ ఆర్డర్ ఇచ్చాడు...

సరిగ్గా అదే సమయం లో ఒక వ్యక్తి ఆ ఇరానీ కేఫ్ లో అడుగు పెట్టాడు... వొంటి మీద బాగా మాసిపోయిన... చిరిగిన... బట్టలు... కాళ్ళకు చెప్పులు కూడా లేవు... బాగా పెరిగిన జుట్టు... గడ్డం... స్నానం చేసి కనీసం ఒక నెల పైనే అయివుంటుంది... బాగా కంపు కొడుతున్నాడు... వాడిని చూడగానే గల్లా పెట్టె దగ్గర కూర్చున్న ఇరానీ కేఫ్ ఓనర్... "అరే... ఇస్ బికారికి కో భగావ్..." అని తన సర్వర్ కి చెప్పాడు... ఆ కుర్రోడు గట్టిగా అరుస్తూ ఆ వ్యక్తి దగ్గరి వచ్చాడు... అప్పుడు... ఎవరూ ఊహించని విధంగా... ఆ వ్యక్తి కేఫ్ వెయిటర్ ని వెనక్కి నెట్టేసి లోపలి దూసుకెళ్లి... తన ప్యాంటు జేబులోంచి ఒక తుపాకీ తీసి గాల్లో రెండు సార్లు కాలుస్తూ సిద్దికీ కూర్చున్న టేబుల్ మీదెక్కి అటూ ఇటూ కాల్చాడు... కస్టమర్స్ కి బుల్లెట్స్ తగిలి వెంటనే మరణించారు... ఆ చనిపోయిన వాళ్లలో సిద్దికీ కూడా ఉన్నాడు... ఇది చూసిన జనాలు... భయంతో కేకలు వేశారు... బయటకి వెళ్ళడానికి ప్రయత్నించారు...

ఇరానీ కేఫ్ లో కాల్పులు వినిపించి బయట ఏజెంట్స్ అలెర్ట్ అయ్యారు... వాళ్లకి రవీంద్ర నుంచి మెసేజ్ వచ్చింది... 'వైట్ ఫాక్స్ డౌన్... గెట్ ఇన్ సైడ్'... అంతే... అందరు IB ఏజెంట్స్ అటువైపు పరిగెత్తారు... అప్పుడే వాళ్ళు ఊహించని విధంగా ఒక పోలీస్ వాన్ వచ్చి రోడ్ మొదట్లో ఆగింది... దాంట్లోంచి పోలీసులు హడావిడిగా దిగి ఇరానీ కేఫ్ ఎంట్రన్స్ ని బ్లాక్ చేసేసారు... IB ఏజెంట్స్ ఇద్దరు లోపలి వెళ్ళడానికి ట్రై చేస్తే వాళ్ళని పోలీసులు వెనక్కి నెట్టేశారు... ఇదంతా రవీంద్ర... మాధవ్... స్క్రీన్ మీద చూస్తున్నారు... వాళ్ళ కళ్ళ ముందే సిద్దికీ చనిపోయాడు...

అదే సమయం లో కేఫ్ లోంచి బయటకి రావడానికి ప్రయత్నించిన కస్టమర్స్ మీద ఆ ఆగంతకుడు కాల్పులు జరిపాడు... దాంతో బయటికి వెళ్ళాలన్న వాళ్ళు ఆగిపోయారు... అప్పుడే పోలీసులు లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు... లోపలనించి మళ్ళీ కాల్పులు... దాంతో పోలీసులు వెనక్కి తగ్గారు...

రవీంద్ర ఇంకో మెసేజ్ పంపాడు... "బ్యాక్ డోర్ లోంచి లోపలి వెళ్ళండి" వెంటనే ఒక 10 మంది IB ఏజెంట్స్ కేఫ్ వెనక సందులోకి దూరారు... కానీ... ఆ సందులో అప్పటికే చాలా మంది పోలీసులు వున్నారు... ఏజెంట్స్ రావడం చూసి వాళ్ళని ఆపేసారు... సరిగ్గా అదే సమయం లో కేఫ్ లోపల మళ్ళీ కాల్పులు జరిగాయి... ఈ సారి ఆగకుండా కాల్చడం వినిపించింది... ఎక్కడివాళ్ళు అక్కడ ఆగిపోయారు... అంతా నిశ్శబ్దం... సడన్ గా బయట నుంచున్న పోలీసులకి లోపల్నించి ఒక వెయిటర్ రావడం కనిపిచింది... వాడి చొక్కా రక్తం తో తడిసింది... వాడు "ఆయియే... ఉస్కో హంనే పకడలియా" అని అరిచాడు... దాంతో పోలీసులు లోపలి దూసుకెళ్లారు... వాళ్లతోపాటు ఆరుగురు IB ఏజెంట్స్ కూడా వెళ్లారు...

Op Center స్క్రీన్ మీద ఇదంతా చూస్తున్న రవీంద్ర... ఒక మెసేజ్ పంపాడు "Back off... don't reveal your identity to police... let them do their duty" దాంతో IB ఏజెంట్స్ అంతా బయటకి వచ్చేసారు...

రవీంద్ర ఎదురు బిల్డింగ్ మీద మీదున్న ఫోటోగ్రాఫర్ కి ఫోన్ చేసి... "బయటకి వచ్చే ప్రతి ఒక్కరి ఫోటో క్లియర్ గా వచ్చేలా చూడు..." అని చెప్పాడు...

కేఫ్ లోపల... సీన్ భయంకరం గా ఉంది... సిద్దికీ కి నుదుట బులెట్ తగలడం తో వెంటనే చనిపోయాడు... అతని తో పాటు ఇంకో ఏడుగురు చనిపోయారు..... కేఫ్ వైటర్స్ ఆ అగంతకుడిని కిందపడేసి... కదలకుండా గట్టిగా పట్టుకున్నారు... పోలీసులు ముందుగా ఆ ఆగంతకుడి బేడీలు వేసి బయటకి తీసుకొచ్చి వాన్ ఎక్కించారు... ఆతరువాత ఆ కేఫ్ లో బతికి ఉన్నవాళ్ళ వివరాలు... పేరు... వూరు... అడ్రెస్స్... ఫోన్ నెంబర్... వాళ్ళు అప్పుడు అక్కడ ఎందుకున్నారు? అన్ని డీటెయిల్స్ తీసుకొని ఒక్కరిగా బయటకి పంపారు... మేడ మీదున్న ఏజెంట్ బయటకి వచ్చేవాళ్ళని ఫొటోస్ తీసాడు... ఇప్పుడు లోపల 8 డెడ్ బాడీస్... పోలీసులు తప్ప వేరే ఎవరూ లేరు. అదే సమయానికి ఇంకో పోలీస్ టీం వచ్చింది... వాళ్ళు క్లూస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు... పోలీస్ ఫోటో గ్రాఫర్ ఆ క్రైమ్ సీన్ మొత్తం ఫొటోస్ తీసాడు...

చివరికి అంబులెన్సులు వచ్చి డెడ్ బాడీస్ ని మార్చురీ కి తీసుకెళ్లారు... ఆ ఇరానీ కేఫ్ ని పోలీసులు సీల్ చేసేసారు... స్పై కెమెరా లోంచి Op Center లో అందరూ చూసారు...

రవీంద్ర బయట ఉన్న ఏజెంట్స్ అందరిని వెళ్లిపొమ్మని చెప్పి... ఆ టీం లీడర్ వాసన్ తో

రవీంద్ర : సిద్దికీ కి పోస్ట్ మార్టం కాగానే బాడీ ని లక్నో ఎయిర్పోర్ట్ కి పంపండి... మేము సిద్దికీ ఫామిలీ కి అప్పగిస్తాము

వాసన్ : అలాగే సర్... వెరీ సారీ... మన ఏజెంట్ ని కాపాడుకోలేక పోయాము...

రవీంద్ర : ఐ కెన్ అండర్ స్టాండ్... ఒక విషయం చెప్పు... ఆ ఇరానీ కేఫ్ కి దగ్గరలోని పోలీస్ స్టేషన్ ఎంత దూరం?

వాసన్ : ఇక్కడే... ఒక కిలోమీటర్ దూరం లో ఉంటుంది... ఎందుకు సర్...

రవీంద్ర : నెవెర్ మైండ్... మీరు వెళ్లిపోండి...

మాధవ్ సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు...

రవీంద్ర (మాధవ్ తో): something wrong...

మాధవ్ : ఏమిటీ?

రవీంద్ర : సిద్దికీ ఆ కేఫ్ కి 10:50AM వచ్చాడు... టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చొని వెయిటర్ కి ఆర్డర్ ఇచ్చాడు... అదే టైం లో ఆ ఆగంతకుడు కేఫ్ లోకి ఎంటర్ అయ్యాడు... ప్యాంటు జేబులోంచి గన్ తీసి గాల్లో రెండు సార్లు కాల్చాడు... వెంటనే సిద్దికీ కూర్చున్న టేబుల్ మీదెక్కి రాండమ్ గా రెండుసార్లు కాల్చాడు... సిద్దికీ తో పాటు ఇంకో కస్టమర్ కూడా చనిపోయాడు... exactly అదే సమయానికి కేఫ్ బయట పోలీసులు వచ్చేసారు... వాళ్లకి ఎవరు ఫోన్ చేశారు? అక్కడికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ ఒక కిలోమీటర్ దూరం లో ఉంది... ఆ టైంలో... ఆ రోడ్ ట్రాఫిక్ లో... అంత మంది పోలీసులు.. అక్కడికి అంత స్పీడ్ గా ఎలా రాగలిగారు

మాధవ్ వెంటనే ఇంటర్ కామ్ లో సర్వర్ టీం కి ఫోన్ చేసి... "సిద్దికీ ఆ కేఫ్ లో అడుగుపెట్టినప్పటినుంచి స్పై కెమెరా ఫీడ్ ని ఒక స్క్రీన్ మీద... దాని పక్కనే కేఫ్ బయట మన వాళ్ళు పంపిన కెమెరా ఫీడ్ ఒకేసారి స్ట్రీమ్ చెయ్యండి" అని అన్నాడు.

ఫీడ్ స్ట్రీమ్ అవ్వసాగింది... 10:50AM కి సిద్దికీ కేఫ్ లోకి వచ్చాడు... 10:58AM కి ఆ ఆగంతకుడు వచ్చాడు... రెండుసార్లు గాల్లో కాల్పులు చేసాడు... టేబుల్ మీదెక్కాడు... అటూ ఇటూ షూట్ చేసాడు... అప్పుడు సరిగ్గా టైం 11:04AM... బయట పోలీసులు వచ్చేటప్పటికి సమయం 11:06AM... మొత్తం 8 నిమిషాలు... ఎవరు ఫోన్ చేస్తే... పోలీసులు ఇంత త్వరగా ఎలా రాగలిగారు?

మరుసటి సాయంత్రం హైదరాబాద్ పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు... Op Center లో మాధవ్ చూస్తున్నడు... డీజీపీ అంతకు ముందు జరిగిన సంఘటన ప్రెస్ కి వివరిస్తున్నాడు...

"నిన్న ఉదయం ఓల్డ్ సిటీ కి దగ్గరలో ఉన్న సిటీ ఇరానీ కేఫ్ లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడు... ఆ కాల్పుల్లో 8 మంది చనిపోయారు... వాళ్లకి పోస్ట్ మార్టం జరిపి వాళ్ళ వాళ్ళకి డెడ్ బాడీస్ అప్పగించాము... ఆ వ్యక్తి ని ఇవ్వాళా కోర్ట్ లో ప్రవేశపెట్టాము.... అతని మానసిక పరిస్థితి సరిగ్గాలేకపోవడం తో... కోర్ట్ అతని సైకియాట్రిక్ ఎవాల్యూయేషన్ చేయించామన్నారు. మేము అతడిని ఎర్రగడ్డ గవర్నమెంట్ మెంటల్ హాస్పిటల్ కి పంపాము... రిపోర్ట్ వచ్చాక కోర్ట్ లో సబ్మిట్ చేస్తాము..."

రిపోర్టర్ : అతను ఎక్కడినుంచి వచ్చాడో తెలుసా?

డీజీపీ : తెలీదు... అతను పిచ్చివాడని మా అనుమానం. మేము ఏమి అడిగానా పిచ్చి పిచ్చి గా ఏదో మాట్లాడాడు...

రిపోర్టర్ : అతని కి తుపాకీ ఎక్కడ దొరికిందో తెలుసా?

డీజీపీ : నో ఐడియా... మా ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం లేదు...

రిపోర్టర్ : అతను వాడిన తుపాకీ మీకు దొరికిందా?

డీజీపీ(ఒక రివాల్వర్ చూపిస్తూ): ఎస్... అతను వాడిన రివాల్వర్ ఇదే...

ఈ ఇంటర్వ్యూ ని Op Center లో చూస్తున్న మాధవ్... IB ఆఫీస్ లో చూస్తున్న రవీంద్ర ఒకేసారి ఉలిక్కి పడ్డారు... వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి...

రవీంద్ర : హైదరాబాద్ లో పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నావా?

మాధవ్ : చూస్తున్న... Are you thinking what I am thinking?

రవీంద్ర : Yes... Hyderabad police involvement cannot be ruled out in yesterday's shoot out

మాధవ్ : అంటే... సిద్దికీ గురించి మహేంద్ర కి తెలిసిందా? ఖుర్రమ్ వాడి మనిషా ?

రవీంద్ర : చెప్పలేం... anything is possible

మాధవ్ : we need local help... Do you know someone we trust?

రవీంద్ర : Yes... ACP Avinash

మాధవ్ : Let's meet him...


అంతా విన్న అవినాష్ "హైదరాబాద్ పోలీస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీకు వచ్చిన డౌట్ ఏమిటీ"? దానికి బదులుగా రవీంద్ర "డీజీపీ ప్రెస్ రిపోర్టర్స్ ఒక రివాల్వర్ చూపించాడు... Beretta 92... 15 రౌండ్స్ రివాల్వర్... ఆ ఇరానీ కేఫ్ షూట్ అవుట్ లో వాడింది Walther P99 16 రౌండ్స్ రివాల్వర్..."

అవినాష్ : మీరు చెప్పేది నమ్మలేక పోతున్నా... నా అనుమానం ప్రకారం కింద లెవెల్ ఆఫీసర్లు డీజీపీ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిఉండాలి... ఇరానీ కేఫ్ దగ్గర టీం లీడ్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరు?

రవీంద్ర : CI చక్రవర్తి...

అవినాష్ : క్రైమ్ సీన్ లోకి ఫస్ట్ వెళ్ళింది CI చక్రవర్తి... కాబట్టి ఆ రివాల్వర్ ని తన కస్టడీ లోకి తీసుకొని ఉంటాడు... చక్రవర్తి ఆ రివాల్వర్ ని మార్చేసి డిపార్ట్మెంట్ కి బెరెట్టా సబ్మిట్ చేసి ఉండాలి... అక్కడికి పోలీసులు అంత త్వరగా రావడమే చాలా ఆశ్చర్యంగా ఉంది... వాళ్లకి ముందే ఇక్కడ జరగబోయే షూట్ అవుట్ గురించి తెలిసి ఉండాలి... క్లూస్ టీం కూడా వీళ్ళతో కలిసిపోయిందా?

రవీంద్ర : ఎస్... క్లూస్ టీం కూడా ఇందులో భాగస్వామి అని మా నమ్మకం... వాళ్ళు ఆ క్రైమ్ సీన్ నుంచి 15 బుల్లెట్స్... వాటి షెల్స్ ని రికవర్ చేసినట్లు రిపోర్ట్ లో వ్రాసారు... నిజానికి వాళ్ళు ఆ రోజు అక్కడ 16 షెల్స్ ని రికవర్ చేశారు... పోలీసులు ఆ కేఫ్ ని సీల్ చేసి వెళ్ళాక... మేము పెట్టిన స్పై కెమెరా ఫీడ్ ని జాగ్రత్త చెక్ చేసాము... క్లూస్ టీం అక్కడినుంచి 16 షెల్స్ ని రికవర్ చెయ్యడం మేము గమనించాము. కానీ... వాళ్లకి 15 బుల్లెట్స్ కి మాత్రమే లెక్క దొరికింది... ఒక బులెట్ వాళ్ళకి ఎంత వెతికినా దొరకలేదు... అక్కడ షూటింగ్ చాలా క్లోజ్ రేంజ్ లో జరగడంతో... ప్రతి బులెట్ అక్కడి కస్టమర్స్ కి తగిలి బయటకి వెళ్లిపోయాయి... ఏ ఒక్కరి బాడీ లో బులెట్ దొరకలేదు... వాళ్ళు చాలా సేపు 16 బులెట్ కోసం వెతికారు... దొరకలేదు... మేము వీడియో ని చాలా సార్లు చూసి ఆ క్రైమ్ సీన్ ని ఇక్కడ క్రియేట్ చేసాము... ఆ ఆగంతకుడు ఏ ఏ యాంగిల్స్ లో కాల్చాడు... వాటి ట్రాజెక్టరీ... ఆ బులెట్ కస్టమర్ శరీరం లో ఎక్కడ ప్రవేశించి... ఎక్కడ నుంచి బయటకి వెళ్లిందో... గమనించాము... క్లూస్ టీం కి దొరకని బులెట్ ఆ రూమ్ లో లేదు.... ఆ రూమ్ పక్కనే ఉన్న కిచెన్ లో కూరగాయాల బస్తాలు ఉన్నాయి... అందులో ఒక క్యాబేజీ లో ఆ బులెట్ దొరికింది... ఆ రాత్రి మా వాళ్ళు వెళ్లి ఆ స్పై కెమెరా ని తీసుకొని వస్తూ ఆ క్యాబేజీ లో ఉన్న బులెట్ ని కూడా తీసుకొని వచ్చారు... ముఖ్యమైన సంగతి... ఆ కస్టమర్స్ అందరూ వైటల్ ఆర్గాన్స్ కి బులెట్ తగలడం తో చనిపోయారు... అంటే... బుల్లెట్స్ తలకి... గుండెకి... నెక్... పొట్టలో తగలడం తో చనిపోయారు... తలకి తగిలి నలుగురు... గుండెకి తగిలి ఇద్దరూ... నెక్ కి తగిలి ఒకరు... పొట్టలో తగిలి ఒకరు చనిపోయారు... ఆ ఆగంతకుడు తుపాకీ గురిపెట్టిన పద్దతి... బులెట్ దూసుకెళ్లిన యాంగిల్... గమనిస్తే... ఇది ఫొఫెషనల్ హిట్... ఒక సాధారణ పిచ్చోడు ఇంత ప్రిసెషన్ కాల్చడం అసంభవం... వాడు పిచ్చోడు కాదు.

అవినాష్ : లోకల్ పోలీసులు అన్ని మార్చేశారు... ఆ అగంతకుడిని పిచ్చోడని అందరిని నమ్మించారు... గవర్నమెంట్ డాక్టర్ వాడికి పిచ్చోడని సర్టిఫికెట్ ఇస్తాడు... అందరూ ఈ కేసు గురించి మర్చేపోతారు...

రవీంద్ర : ఎస్... మేము లోకల్ పోలీస్ సహాయంతో మహేంద్ర ని అరెస్ట్ కూడా చెయ్యలేము... మాతో కోవర్ట్ గా పనిచేసే వాళ్ళ కోసం మేము వెతుకుతూండగా... మీరు రీసెంట్ గా జరిగిన రేప్ కేసు ని మీ పై అధికారుల పర్మిషన్ లేకపోయినా ఇన్వెస్టిగేట్ చెయ్యడం ఆపలేదని మాకు తెలిసింది. మీరు DSP శేఖర్ గారితో కలసి కేసుని ముందుకు తీసుకొని వెళ్తున్నారని మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది... అందుకే మీరు మాకు హెల్ప్ చేయగలరని మిమ్మల్ని ఢిల్లీ వచ్చేలా హోమ్ మినిస్ట్రీ నుంచి లెటర్ పంపించాము...

అవినాష్ : నేను ఢిల్లీ IIT లో చదువుకునేటప్పుడు నా సీనియర్ సుప్రతిక్ బెనర్జీ డ్రగ్స్ వాళ్ళ చనిపోయాడు... సుప్రతిక్ చాలా తెలివైన వాడు.. ఎంతో పైకి వస్తాడని అందరం ఆశించాము... డ్రగ్స్ అలవాటు పడ్డాడు... అది తెలుసుకున్న మేము అతనికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నాడో కనుక్కొని వాడిని చితకబాదాము... వాడిని IIT దరిదాపుల్లోకి రానివ్వకుండా చేసాము... కానీ... సుప్రతిక్... దగ్గరలోని JNU క్యాంపస్ కి వెళ్లి డ్రగ్స్ కొనడం మొదలెట్టాడు... అది మేము ఊహించలేదు... ఒక రోజు డ్రగ్ ఓవర్ డోస్ వాళ్ళ సుప్రతిక్ చనిపోయాడు... అప్పటినుంచి నాకు డ్రగ్స్ అంటే అసహ్యం... ప్రస్తుతం హైదరాబాద్ లో డ్రగ్స్ చాలా పెద్ద ప్రాబ్లెమ్ గా వుంది. చాలా మంది... చిన్నపిల్లలు... హై స్కూల్... కాలేజీ స్టూడెంట్స్... సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్... BPO ఎంప్లాయిస్... సినిమా యాక్టర్స్... బిజినెస్ మెన్... హౌస్ వైఫ్స్... అందరూ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. హైదరాబాద్ లో కైలాష్ గౌడ్ పెద్ద డ్రగ్ సిండికేట్ నడుపుతున్నాడు... ఎలాగైనా ఆ సిండికేట్ ని దెబ్బ తియ్యాలని గోల్ పెట్టుకున్నాను... ఎంత ప్రయత్నించినా ఎటువంటి లీడ్ దొరకలేదు... చివరికి ఈ రేప్ కేసు లో ఒక బ్రేక్ లభించింది...

రవీంద్ర : May I Know the break?

అవినాష్ : ఎస్... ఆ రేప్ చేసింది... కైలాష్ గౌడ్ కొడుకు. వివేక్... మహేంద్ర భూపతి మేనల్లుడు కిరణ్... క్రిమినల్ లాయర్ కొడుకు రాకేష్... స్టేట్ హోమ్ మినిస్టర్ కొడుకు సంజీవ్...

మాధవ్ : వాట్... మీకెలా తెలుసు?

అవినాష్ అప్పటిదాకా జరిగింది అంతా వాళ్లకి చెప్పాడు... యాదగిరి గ్యాంగ్ ఆ యువతిని... ఒక ముసలాయనని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రిసీవ్ చేసుకొని తమ ఇన్నోవా లో ఎక్కించుకొని వెళ్లడం... వాళ్ళని విక్రమ్... గణేష్ ఫాలో అవడం... రోడ్ మధ్యలో వివేక్ ఇన్నోవాని చూడడం... వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గర ఆగడం... జిలాని ఆ ముసలాయన్ని చంపడం... ఆ యువతిని బలవంతంగా వివేక్ తన ఫ్రెండ్స్ తో కలసి తన కార్ లో తీసుకొని వెళ్లడం... యాదగిరి గ్యాంగ్ఆ ఆ ముసలాయనని ఒక పల్లెటూరికి తీసుకెళ్లి దహనం చెయ్యడం... వివేక్... వాడి ఫ్రెండ్స్ ఆ యువతి ని దారుణంగా రేప్ చేసి యాదగిరి గ్యాంగ్ కి అప్పగించడం... వాళ్ళు ఆమెని BHEL క్రాస్ రోడ్స్ దగ్గర పడెయ్యడం... యాదగిరి గ్యాంగ్ అరెస్ట్ అయ్యి రిమాండ్ కి వెళ్లడం... విక్రాంత్ తీసిన వీడియో తనకి ఇవ్వడం...

మాధవ్ : నిజమా... మీరు ఆ వీడియో ని డిపార్ట్మెంట్ కి ఇవ్వలేదా...

అవినాష్ : లేదు... కేసు నడుస్తున్న తీరు చూస్తే... ఆ వీడియో ని మా డిపార్ట్మెంట్ వాళ్ళే మాయం చేస్తారని ఇవ్వలేదు. సరైన సమయం చూసి వాడాలని జాగ్రత్త గా ఉంచాము...

మాధవ్ : ఆ వీడియో మాకు కావాలి...

అవినాష్ వెంటనే శేఖర్ కి ఫోన్ చేసి అర్జెంటు గా ఆఫీస్ కి వెళ్లి ఫోన్ చెయ్యమని చెప్పాడు... ఒక 30 నిమిషాల తరువాత శేఖర్ దగ్గరనుండి ఫోన్ వచ్చింది...

అవినాష్ : మన ఆఫీస్ కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసి దాని IP అడ్రస్ ఇవ్వండి...

శేఖర్ IP అడ్రస్ ఇచ్చాడు... Op Center టీం ఆ IP అడ్రస్ తో ఆ కంప్యూటర్ ని రిమోట్ గా యాక్సిస్ చేసి హార్డ్ డ్రైవ్ లో ఉన్న వీడియో ని కాపీ చేసుకొని మాధవ్ ఆఫీస్ లోని స్క్రీన్ మీద చూపించారు... రవీంద్ర... మాధవ్ ఆ వీడియో చూసి స్టన్ అయ్యారు...

రవీంద్ర:ఈ వీడియో తీసింది ఎవరు?

అవినాష్ : అతని పేరు విక్రాంత్... ఒకప్పుడు సూర్యోదయం టీవీ ఛానల్ తరుఫున డిఫెన్స్ మినిస్ట్రీ లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మీద స్టింగ్ ఆపరేషన్ చేసింది కూడా ఇతనే... ఈ వీడియో ని ఎలా వాడాలో తెలియడం లేదు... డిపార్ట్మెంట్ కి తెలిస్తే... వీడియో ని మాయం చేసే అవకాశం ఉంది... విక్రమ్... గణేష్ ల ప్రాణాలకి హాని కూడా ఉంది... సోషల్ మీడియా లో పెడితే... సైబర్ క్రైమ్ వాళ్ళు ఈజీ గా కనిపెట్టేస్తారు... పెద్దగా ప్రయోజనం ఉండదు... సరైన సమయం చూసి దీన్ని వాడాలని అనుకుంటున్నాము... ఈ వీడియో ఒక్కదాని వల్ల పెద్దగా ప్రయాజనం ఉండదు... కోర్ట్ లో ప్రవేశపెడితే... ఇది మొర్ఫెడ్ వీడియో అని కొట్టేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది... ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఆ యువతి శరీరం లోంచి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళని అరెస్ట్ చెయ్యడం కష్టం అయ్యే ఛాన్స్ వుంది... వివేక్ తన కార్ ని మాయం చేసేసాడు... ఆ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు పోయిందని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు... నాకు తెలిసి వాళ్ళు ఆ కార్ఆ ని తగలపెట్టి ఉంటారు... కార్ లో ఈ కుర్రోళ్ళు రేప్ చేశారు కాబట్టి ఎవిడెన్స్ దొరికేది...

అంతా విన్నాక... రవీంద్ర... మాధవ్ చాలా సేపు మౌనంగా వుంది పోయారు... చివరికి...

మాధవ్ : మీకు మేము ఈ కేసు ని సాల్వ్ అయ్యే దారి చూపిస్తే మీరు మాకు మహేంద్ర ని అరెస్ట్ చెయ్యడానికి కావాల్సిన ఆధారాలు సంపాదించడం లో మాకు హెల్ప్ చేస్తారా?

అవినాష్ : తప్పకుండా... ఈ రేప్ కేసు సాల్వ్ అయితే... యాదగిరి గ్యాంగ్ లో నలుగురిని... ఆ రేప్ చేసిన నలుగురు కుర్రోళ్ళకి ఉరి శిక్ష పడేలా చూస్తాము... ఇది కైలాష్... మహేంద్ర... కాంతారావు... హోమ్ మినిస్టర్ ధనంజయ అందరికి పెద్ద దెబ్బ... దీనికి తోడు డ్రగ్స్ సిండికేట్ ని కూడా నాశనం చెయ్యగలిగితే... యాదగిరి గ్యాంగ్... ఆ నలుగురు కుర్రోళ్ళు... వాళ్ళ పెద్ద వాళ్ళు అందరూ శాశ్వతం గా జైలు కి వెళ్తారు...

మాధవ్ : మీకో గుడ్ న్యూస్... ఆ కార్... Mercedez Benz ML 350... ఎక్కడుందో మాకు తెలుసు...

అవినాష్ (కుర్చీలోంచి దిగ్గున లేచి... ఆదుర్దాగా) : ఎక్కడుంది?

మాధవ్ : రిలాక్స్... ఆ యువతి ని BHEL క్రాస్ రోడ్స్ దగ్గర పడేసి... యాదగిరి గ్యాంగ్ పోలీసులకి దొరకడం మాకు వెంటనే తెలిసింది... యాదగిరి గ్యాంగ్ కి కైలాష్ బాస్ అని తెలిసింది... దాంతో మేము కైలాష్ ఇంటి మీద సరవైలన్స్ పెట్టాము... వివేక్ ఆ కార్ ని తన దగ్గర పైని చేసే వాడికి ఇచ్చి పంపడం మేము గమనించాము... ఆ కార్ ని మా వాళ్ళు ఫాలో అయ్యారు... కైలాష్ మనిషి దాన్ని పూణే కి దగ్గరలో ఒక ఫార్మ్ హౌస్ లో ఉంచడం గమనించాము... అప్పటినుంచి మేము ఆ ఫార్మ్ హౌస్ మీద నిఘా పెట్టాము... ఆ కార్ అక్కడనుంచి కదిలితే మాకు వెంటనే తెలుస్తుంది...

అవినాష్: ఆ కార్ దొరికితే దాన్ని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి పంపి సాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని... ఆయువతి వొంటి మీద దొరికిన DNA సాంపిల్స్ తో మ్యాచ్ చేస్తే... ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యొచ్చు... అప్పుడు ఈ వీడియో బయట పెడితే... కేసు బలంగా ఉంటుంది... వాళ్ళు తప్పించుకోలేరు...

రవీంద్ర : అందుకే... మిమ్మల్ని ఇక్కడికి పిలిచాము... మేము మీకు సహాయం చేస్తాము... మీరు మాకు సహాయం చేస్తే వాళ్ళని పర్మనెంట్ గా లోపలి పంపొచ్చు...

మాధవ్ : ఇదంతా ఇంకో 3 నెలల లోపల జరగాలి...

అవినాష్ : ఏదైనా బలమైన కారణం ఉందా?

మాధవ్ : ఉంది... డిఫెన్సె మినిస్ట్రీ లో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ని వాళ్ళు బ్లాక్ మెయిల్ చెయ్యడం తో వాళ్లకి మన డిఫెన్స్ సీక్రెట్స్ చాలా తెలిసాయి... ఈ విషయం యూనియన్ కాబినెట్ కి తెలిసింది... వాళ్ళు పొలిటికల్ గా ఈ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చెయ్యాలని ప్రయత్నించారు... మహేంద్ర తో మాట్లాడారు... మహీధర భూపతి వాళ్ళతో ఒక డీల్ మాట్లాడాడు... అదేమిటంటే... తనకి రాజ్య సభ సభ్యత్వం ఇచ్చి యూనియన్ కాబినెట్ లో హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఇవ్వమని అడిగాడు. వాళ్లకి వేరే దారి లేక ఈ ప్రపోసల్ కి ఒప్పుకున్నారు... కానీ... వాళ్లకి కి మహేంద్ర కి రాజ్య సభ లో సీట్ ఇవ్వడం... కాబినెట్ బెర్త్ ఇవ్వడం ఇష్టం లేదు... ఇంకో మూడు నెలల దాకా రాజ్య సభ లో ఖాళీలు రావు... కాబినెట్ సెక్రటరీ మాకు ఈ పని అప్పగించి ఈ మూడు నెలల లోపల మహేంద్ర ని ఎలాగైనా ఎదో ఒక కేసు లో ఇరికించామని ఆర్డర్స్ వేశారు... We need to find strong evidence increminating him... We know he is a traitor... but we need strong proof...

అవినాష్ : దొరుకుతుంది సర్... ఆ కేఫ్ లో చనిపోయిన మిగతా ఏడుగురి డీటెయిల్స్ కావాలి... వాళ్లలో ఇద్దరు గుండెకి తగిలి చనిపోయారు... నలుగురికి హెడ్ షాట్స్... ఒకరికి నెక్ షాట్... ఒకరికి అబ్దామిన్ ఊండ్... లివర్ కి తగిలిందా... ఇది నార్మల్ రాండమ్ షూటింగ్ లాగా లేదు...క్లియర్ గా ముల్టీపుల్ అసాసినేషన్స్... ఈ ఎనిమిది మందికి ఏదైనా కనెక్షన్ ఉందా...

మాధవ్ : లేదు... అంతా రాండమ్... సిద్దికీ మనవాడు... ముగ్గురు ఆ ఏరియా లో షాప్స్ లో పనిచేసేవాళ్ళు... రెగ్యులర్ గా ఆ కేఫ్ కి వస్తూ ఉంటారు... ఒకడు స్టూడెంట్... ఒకడు పక్కనే ఉన్న గవర్నమెంట్ ఆఫీస్ లో ఎంప్లాయ్... ఇంకొకరు లేబర్ లేడీ... ఇంకొకరు ఒక ఓల్డ్ మాన్... హైదరాబాద్ వాడు కాదు... ఏదో పని మీద వచ్చాడు... హై కోర్ట్ లో పనిచేస్తున్న కొడుకుని కలవడానికి వచ్చాడు... కొడుకు ఆయన్ని ఇక్కడ వెయిట్ చెయ్యమన్నాడు...

అవినాష్ : ఆ ఖుర్రమ్ గురించి తెలిసిందా...

మాధవ్ : లేదు... చాలా ట్రై చేసాము... మన దేశం లో కొంత మంది టెక్నోక్రాట్స్ ఫ్రీలాన్స్ వర్క్ చేస్తూ ఉంటారు... వాళ్ళని ఎథికల్ హకెర్స్ అని కూడా అంటారు... వాళ్లలో 9 మంది కి చాలా మంచి అనుభవం... పేరు వుంది... అందులో ఎనిమిది మంది సహాయం తీసుకున్నాము... అయినా ప్రయోజనం లేదు.... ఇంకో వ్యక్తి ని కనిపెట్టడానికి చాలా టైం పట్టింది... అతను పూర్తిగా ఐసొలేషన్ లో పనిచేస్తాడు. ఎవరితోనూ కాంటాక్ట్స్ లేవు...

అవినాష్ : ఎవరతను...

మాధవ్ : మీ ఫ్రెండ్ గిరీశం... also known as విశ్వామిత్ర.

అవినాష్ : విశ్వామిత్ర నా ఫ్రెండ్ అని మీకెలా తెలుసు...?

మాధవ్ : మేము గిరీశం కోసం ఎంక్వయిరీ చేసినప్పుడు అతను మీ ఫ్రెండ్ విశ్వామిత్ర అని తెలిసింది... మీరు అతని హెల్ప్ తో ఖుర్రమ్ ఎవరో కనిపెట్టగలిగితే గ్రేట్... ఈ ప్రాజెక్ట్ కి మేము Operation Cross Fire అని పేరు పెట్టాము... మిమ్మల్ని పిలిచిన పని అయ్యింది... మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాతో కాంటాక్ట్ చెయ్యండి... ఇది టైం బౌండ్ ప్రాజెక్ట్... ఎంత తొందరగా పూర్తి చెయ్యగలిగితే అంత మంచిది.

అవినాష్ : ఒక రిక్వెస్ట్...

మాధవ్ :టెల్ మి...

అవినాష్ : పూణే లో వున్నా ఆ కార్ ని మీరు ఢిల్లీ తీసుకొచ్చి మీ ఫోరెన్సిక్ టీం తో రిపోర్ట్ రెడీ చేయించగలరా? ఆ కార్ ని అక్కడ ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదు.

మాధవ్ : డన్... వి విల్ డు ఇట్...

అవినాష్ ని రవీంద్ర తన కార్ లో పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర దింపి వెళ్ళబోతూ... "మీకో స్మాల్ గిఫ్ట్ ..." అంటూ ఒక పెద్ద ఎన్వలప్ ఇచ్చాడు...

అవినాష్ తన రూమ్ కి వెళ్లి ఆ ఎన్వలప్ ని ఓపెన్ చేసాడు... లోపల... రేప్ గురైన యువతి స్పందన ఫోటో... ఆమెకి సంభందించిన డీటెయిల్స్ ఉన్నాయి.. ఆమె డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్... టెన్త్ క్లాస్ సర్టిఫికెట్... ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్... IIT ముంబయి అడ్మిషన్ స్లిప్... చివరిగా ఒక లెటర్... ఆ లెటర్ చదవగానే అవినాష్ కి తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. ఆ లెటర్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు స్పందనకి MBA లో సీట్ కంఫర్మ్ అయినట్లు తెలియ చేస్తూ వ్రాసినది... అవినాష్ మనసులో " లం... కొడకల్లారా... ఒక చదువుల తల్లి జీవితాన్ని నాశనం చేశారు... మిమ్మల్ని వదిలేది లేదు... " అని అనుకున్నాడు...


Part - 9 - Meet Mr.Gireesam

అవినాష్ ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన వెంటనే విశ్వామిత్ర కి ఫోన్ చేసి వచ్చి కలవమన్నాడు... అక్కడ జరిగిన మీటింగ్ గురించి చెప్పి వాళ్ళు అతన్ని Op Center కి వచ్చి కలవమన్నారని చెప్పాడు... అది వినం వెంటనే...

విశ్వామిత్ర :నో... నో... నో... కుదరదు... నేను గవర్నమెంట్ ఏజెన్సీస్ తో కలసి పని చెయ్యను... వాళ్ళకి నాగురించి ఎందుకు చెప్పావు?

అవినాష్ : నేనేమి చెప్పలేదు... వాళ్ళు గిరిశం గురించి వెతుకుతూంటే విశ్వామిత్ర దొరికాడు...

విశ్వామిత్ర : వాళ్లకి నా గురించి ఎలా ఎలా తెలిసింది... ?? నెను చాలా జాగ్రత్త ఉన్నాను...

అవినాష్ : వాళ్ళు మన దేశం లో ఉన్న బెస్ట్ ఎథికల్ హకెర్స్ ని వెతుకుతున్నప్పుడు నీ పేరు వినిపించింది... నీ అసలు పేరు గిరీశం అని నాకు అప్పటిదాకా తెలియదు. నేను చాలా ఆశ్చర్య పోయాను... నువ్వు నీ పేరు ఎందుకు మార్చుకున్నావు?

విశ్వామిత్ర : అదో పెద్ద కథ...

అవినాష్ : నీకు Op Center గురించి తెలుసా?

విశ్వామిత్ర(చిరునవ్వుతో) : I know everything...

అవినాష్ : నువ్వు వెంటనే వెళ్లి వాళ్ళని కలవు... నీతో వాళ్లకి చాలా అవసరం ఉంది... నువ్వు వెళ్లకపోతే... వాళ్ళే వచ్చి కలుస్తారు...

విశ్వామిత్ర : నేనే వెళ్తాను... Op Center కి ఇంఫార్మ్ చెయ్యి... నా ఐడెంటిటీ ని గత 12 ఏళ్లుగా కాపాడుకున్నాను... ఇంక ఈ అజ్ఞాతవాసం నుంచి బయటకి వస్తాను... రేపు ఉదయం ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తాను...


1978... రాజమండ్రి... రామశర్మ... వనజమ్మల ఏకైక సంతానం... రామశర్మ కి గురజాడ అప్పారావు గారు వ్రాసిన "కన్యాశుల్కం" నాటిక అంటే చాలా ఇష్టం. అందుకే తన కొడుక్కు గిరీశం అనే పేరు పెట్టుకున్నాడు... గిరీశం చాలా చురుకైన వాడు... ప్రతి క్లాస్ లో ఫస్ట్ వచ్చేవాడు... రామశర్మ హై స్కూల్ లో లెక్కల మాస్టర్... తన కొడుక్కి రెండు సబ్జక్ట్స్ బాగా చిన్నప్పటినుంచి బాగా నేర్పాడు... 1. సంస్కృతం... 2. వేద గణితం... గిరీశం 6వ తరగతికి వచ్చేటప్పటికే అలీజీబ్రా... కలిక్కులస్... జామెట్రీ... లో విపరీతమైన నాలెడ్జి సంపాదించాడు... 10 క్లాస్ పాస్ అయ్యేటప్పటికి అడ్వాన్సుడ్ మ్యాథమెటిక్స్... ఫిజిక్స్ కెమిస్ట్రీ లో మంచి నాలెడ్జి సంపాదించాడు... దీనితో పాటు మాథ్స్ ని వాడి ఒక కోడ్ లాంగ్వేజ్ ని కూడా తయారుచేసాడు... తన ఫ్రెండ్స్ తో ఆ కోడ్ లాంగ్వేజ్ లో లెటర్స్ వ్రాసుకునేవాడు... ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ లో పాస్ అవ్వడమేకాకుండా IIT ఖరగపూర్ లో కంప్యూటర్ సైన్స్ లో సీట్ సంపాదించాడు... అది గిరీశం జీవితం లో మొదటి మలుపు.

ఖరగపూర్ లో తన రూమ్ మాటే బిబేక్ బసు తో పరిచయం అయ్యింది... బిబేక్ కి గిరీశం తయారుచేసిన కోడ్ లాంగ్వేజ్ గురించి తెలిసింది... చాలా ఆశ్చర్యపోయాడు... " నువ్వు క్రిప్టోగ్రఫీ నేర్చుకో " అని చెప్పాడు... గిరీశం "క్రిప్టోగ్రఫీ" అనే పదాన్ని మొదటిసారి బిబేక్ చెప్తేనే తెలిసింది... ఆ మరుసటి రోజు కాలేజీ లైబ్రరీ లో క్రిప్టాలజీ... క్రిప్టోగ్రఫీ బుక్స్ తెచ్చుకొని చదవసాగాడు... ఒక్క సంవత్సరం లో క్రిప్టోగ్రఫీ లో ఎక్స్పర్ట్ అయ్యాడు... సొంతగా కోడ్ వ్రాయడం... సైఫీర్ తయారు చేసాడు... పైగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కావడం తో క్రిప్టోగ్రఫీ ప్రోగ్రామ్స్ వ్రాయడం మొదలుపెట్టాడు... IIT తరువాత గిరీశం కి కేంబ్రిడ్జి లో ట్రినిటీ కాలేజీ లో పీజీ చెయయడానికి సీట్ దొరికింది... అది గిరీశం జీవితం లో రెండో మలుపు...

కేంబ్రిడ్జి లో గిరీశం జీవితం పూర్తిగా మారిపోయింది... ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టాడు... Alan Turing కూడా అదే కాలేజీ లో చదివాడు... గిరీశం Turing Machine గురించి విపరీతం గా స్టడీ చేసాడు... మాస్టర్స్ డిగ్రీ పూర్తిఅయ్యాక... రీసెర్చ్ లో జాయిన్ అయ్యాడు... అప్పుడే ప్రొఫెసర్ ఎజ్రా లెవిన్సన్ దగ్గర పనిచెయ్యడం మొదలుపెట్టాడు... ఎజ్రా కి గిరీశం... అతని నాలెడ్జి బాగా నచ్చింది... తన సొంత కొడుకులా చూసుకున్నాడు... గిరీశం కి రీసెర్చ్ లో బాగా సహాయం చేసాడు... ఎజ్రా ప్రతి రోజూ గిరీశం కి ఏదో ఒక కొత్త ప్రాబ్లెమ్ ఇచ్చి సాల్వ్ చెయ్యమనేవాడు... గిరీశం కి ఎన్క్రిప్షన్ గురించి చాలా విషయాలు చెప్పాడు... కంప్యూటర్స్ వాడి సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానెల్స్ తయారుచెయ్యడం వాటిని వాడడం... కొత్త కొత్త కంప్యూటర్ అప్లికేషన్స్ తయారు చేయించాడు... వాటి మీద పేపర్స్ వ్రాయించి జర్నల్స్ లో పబ్లిష్ చేయించాడు... దాంతో గిరీశం కి చాలా మంచి పేరు వచ్చింది... గిరీశం కేంబ్రిడ్జి లో ఫేమస్ అవ్వసాగాడు...

గిరీశం ని ఎజ్రా ఒక రోజు తన ఇంటికి రమ్మన్నాడు... గిరీశం వెళ్ళేటప్పటికి ఎజ్రా ఇల్లంతా మనుషులతో నిండి ఉంది... ఎజ్రా లెవిన్సన్ కి పెళ్లి కాలేదు... ఆ ఇంటికి గిరీశం చాలా సార్లు వెళ్ళాడు. ఎజ్రా ఒక్కడే ఉంటాడు. కానీ... ఆ రోజు ఆయన ఇల్లంతా జనాలతో నిండివుంది... గిరీశం ఎజ్రా కి ఇష్టమైన వైన్ బాటిల్ తీసుకెళ్లాడు... ఆ రోజు ఎజ్రా ఇంట్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో పనిచేసే లెక్చరర్స్... ప్రొఫెసర్స్... కొంత మంది బిజినెస్ మన్ ఉన్నారు... వాళ్లకి గిరీశం ని పరిచయం చేసాడు... అప్పుడే మిరియం హాలేవీ పరిచయం అయ్యింది... మిరియం చాలా అందంగా ఉంటుంది.... 23 ఏళ్ళు ఉంటాయి... సన్నగా... మృదువుగా ఉంటుంది... ఆమె నవ్వితే చాలా అందగా ఉంటుంది... వెంటనే ప్రేమలో పడిపోయాడు... ఆ రోజంతా ఆమెతో మాట్లాడుతూ గడిపాడు... ఆమెకి ఇంగ్లీష్ అంత బాగా రాదు... ఆమె రీసెంట్ గా ఇజ్రాయెల్ నుంచి వచ్చింది... ఆమె సొంత వూరు టెల్ అవివ్. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చెయ్యడానికి కేంబ్రిడ్జి వచ్చింది. ప్రొఫెసర్ ఎజ్రా... మిరియం ఫాదర్... ఇద్దరూ ఇజ్రాయెల్ లో చిన్ననాటి స్నేహితులు... మిరియం ఫాదర్ కి టెల్ అవివ్ లో ఒక చిన్న కంప్యూటర్ సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కంపెనీ వుంది. వాళ్ళు రకరకాల కంప్యూటర్ అప్లికేషన్స్ తయారు చేస్తూ ఉంటారు... ఆ రోజు గిరీశం ఆమెకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి... ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు...

మిరియం ఫోన్ నెంబర్ తీసుకొని ఒక వారం అయ్యింది... ఫోన్ చెయ్యాలో వొద్దో అర్ధం కావడం లేదు. ఫోన్ చేస్తే ఏమి మాట్లాడాలి? చాలా సతమతం అవ్వసాగాడు... ఆమెని కలవాలని కోరికగా ఉంది... ఏ కారణం తో ఫోన్ చెయ్యాలో తెలియడం లేదు... గిరీశం ప్రేమకి బాగా కొత్త... అప్పటిదాకా ఎవరితోనూ ప్రేమలో పడలేదు... కేంబ్రిడ్జి వచ్చాక ఒక లేడీ తో కొంత కాలం లివ్ ఇన్ రేలషన్ లో ఉన్నాడు... అంతే... ప్రేమలో పడలేదు... మిరియం ని చూసినప్పటినుండి గిరీశం మనసు వశం తప్పుతోంది... ఎలా ఫోన్ చెయ్యాలి? ఒక రోజు సాయంత్రం ఇలా ఆలోచనలతో సతమతమవుతూ సైకిల్ ఎక్కి ఇంటికి వెళ్తూండగా... దారిలో కనిపిచింది... మిరియం... గిరీశం గుండె లయ తప్పింది... వేగంగా కొట్టుకోసాగింది... ఆమెనిచూడగానే తన సైకిల్ ఆటోమాటిక్ గా ఆగిపోయింది... అదే సమయం కి మిరియం కూడా గిరీశం ని చూసి చేయి ఊపింది... ఇద్దరూ మాట్లాడుకుంటూ నడవసాగారు... గిరీశం మొదటిసారి ఆమెని ఇంటిదాకా దిగబెట్టాడు... పరిచయం కొంచం పెరిగింది... అది గిరీశం జీవితం లో మూడో మలుపు....

నెమ్మదిగా గిరీశం... మిరియం ప్రేమలో పడ్డారు... ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరారు... ఆమె కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కావడం తో వారి రేలషన్ బాగా పెరిగింది... ప్రొఫెసర్ ఎజ్రా గిరీశం కి ఎన్క్రిప్షన్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం... వాటిని గిరీశం సాల్వ్ చెయ్యడం చాలా ఇంటరెస్టింగ్ గా అబ్సర్వ్ చేసేది... తాను కూడా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యసాగింది... ఇద్దరూ ఎన్క్రిప్షన్ ఫీల్డ్ లో మంచి అనుభవం సంపాదించారు... దాంతో మిరియం కూడా అతనికి ప్రాబ్లమ్స్ ఇవ్వసాగింది... వాళ్ళ మధ్య రిలేషన్ బాగా గట్టిపడింది... ఒకసారి క్రిస్మస్ సమయంలో ... "ఈ సెలవలకి మనం మా ఇంటికి వెల్దామా... నిన్ను మావాళ్లకి పరిచయం చేస్తాను..." అని అన్నది... గిరీశం ఒప్పుకున్నాడు... మొదటిసారి గిరీశం తన జీవితం లో ఇజ్రాయెల్ లో అడుగుపెట్టాడు... అది గిరీశం జీవితం లో నాలుగో మలుపు...

బెన్ గ్యురియాన్ ఎయిర్ పోర్ట్... మిరియం తండ్రి ఎలిజా... తల్లి జొహన్నా... అన్న జాకబ్ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు... అందరికి గిరీశం బాగా నచ్చాడు... వాళ్ళ ఇంట్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది... సెలవలు బాగా గడుస్తున్నాయి... మిరియం తన పూర్వీకుల గ్రామానికి గిరీశం ని తీసుకొని వెళ్ళింది... మిరియం అమ్మమ... తాతయ్యల ని కలిశారు... గిరీశం ఒక నిర్ణయానికి వచ్చేసాడు... మరుసటి రోజు ఉదయం ఆ గ్రామం లో ఉన్న ఒక పురాతన సినోగాగ్ ని దర్శించుకున్నారు... అక్కడ సడన్ గా గిరీశం మోకాళ్ళ మీద కూర్చొని తాను అప్పటికే కొనిపెట్టుకున్న ఉంగరాన్ని చూపిస్తూ మిరియం తో "Will you marry me?" అని ప్రపోస్ చేసాడు... మిరియం అవాక్కయింది... ఆమె కి ఏమి చెప్పాలో తెలియక ఏడ్చేసింది... రెండు నిమిషాల తరువాత తేరుకొని "Yes... I will marry you" అంటూ కౌగలించుకుంది... అక్కడ ఉన్న టూరిస్ట్స్ అందరూ చప్పట్లుకొట్టి కొత్త గా ఎంగేజ్ అయిన జంటని దీవించారు...

గిరీశం... మిరియం... టెల్ అవివ్ చేరుకొనేటప్పటికీ వాళ్ళ ఇంట్లో వాతావరణం చాలా వేడి గా ఉంది... మిరియం అన్న జాకబ్ నడుపుతున్న సాఫ్ట్ వేర్ కంపెనీ కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది... అప్లికేషన్ తయారుచేశారు... కానీ... ఎన్క్రిప్షన్ సిస్టం సరిగ్గా పనిచెయ్యడం లేదు... డెడ్ లైన్ వచ్చేసింది... ఎలిజా... జాకబ్... వాడి వేడిగా వాదించుకుంటున్నారు... వాళ్ళ వాదన విన్న గిరీశం కి ప్రాబ్లెమ్ అర్ధమయ్యింది... "మీకేమి అభ్యంతరం లేకపోతే నేను ఆ ఎన్క్రిప్షన్ సిస్టం సరిచేస్తాను" అని అన్నాడు... ఎలిజా "వొద్దు... నువ్వు ఇక్కడికి ఎంజాయ్ చెయ్యడానికి వచ్చావు.... ఈ ప్రాబ్లెమ్ మేము చూసుకుంటాము " అని అన్నాడు... అప్పుడే మిరియం తన పేరెంట్స్ కి వాళ్ళ ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది... అంతే... ఆమె పేరెంట్స్... అన్న... విపరీతంగా సంతోషించారు... మిరియం తల్లి "మీరు కలసి వచ్చినప్పుడే ఇలా జరుగుతుందని ఊహించాను" అని అన్నది... ఆ రోజు వాళింట్లో పండగ వాతావరణం నెలకొంది... ఎలిజా "మీ పేరెంట్స్ కి చెప్పవా?" అని అడిగాడు... దానికి బదులుగా "నా పేరెంట్స్ లేరు... పోయారు... నేను ఈ ప్రపంచం లో ఏకాకిని" అని బాధ పడ్డాడు... " ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రి... మామ..." అని అన్నాడు ఎలిజా.

గిరీశం రెండు రోజులు రాత్రి... పగలు కస్టపడి జాకబ్ తయారుచేసిన అప్లికేషన్ ఎన్క్రిప్షన్ సిస్టం ని కరెక్ట్ చేసాడు... జాకబ్ దాన్ని తన కస్టమర్ కి చూపించాడు... వాళ్లకి అది బాగా నచ్చింది... ఇంకో పెద్ద కాంట్రాక్టు ఇచ్చారు. ఎలిజా తన కూతురి ఎంగేజ్మెంట్ పార్టీ ఆరెంజ్ చేసాడు... వాళ్ళ బంధువులందరికి ఫోన్ చేసి పార్టీ కి పిలిచారు... పార్టీ రోజు సాయంత్రం గిరీశం కి ఒక ఐడియా వచ్చింది... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎలిజా... జొహన్నా కి బాగా ఇష్టమైన... బాగా ఖరీదైన వైన్ బాటిల్ కొనుక్కొని రావడానికి షాపింగ్ సెంటర్ కి వెళ్ళాడు... మంచి వైన్ బాటిల్ కొనుక్కొని బయటకి వచ్చాడు... సరిగ్గా అప్పుడే గిరీశం ముందు ఒక వన్ వచ్చి ఆగింది... తలుపు తెరుచుకుంది... అతని కి అర్ధమయ్యేలోపల వెనకనుంచి ఎవరో ముందుకు తోశారు... వాన్ లోపల వున్నవాళ్లు గిరీశం ని లోపలి లాగేసి నోటికి ప్లాస్టర్ అతికించి... చేతులు కట్టేసి మొహం మీద ముసుగు వేశారు.... వాన్ కదిలింది... చాలా వేగంగా వెళ్తోంది... దాదాపు ఒక 2 గంటల సేపు ప్రయాణం చేశారు... చివరికి ఒక చోట ఆగింది... వాన్ డోర్ ఓపెన్ చేశారు... గిరీశం ని ఒక ఇంట్లో కి తీసుకొని వెళ్లి ఒక కుర్చీలో కూర్చోపెట్టి కట్టేశారు... మొహం మీద ముసుగు అలాగే ఉంది...

గిరీశం కి గుండె వేగం గా కొట్టుకుంటోంది... మనసులో 'ఎవరు వీళ్ళు? ఎందుకు కిడ్నప్ చేశారు? పాపం మిరియం ఖంగారు పడుతూ ఉంటుంది. చెప్పకుండా వచ్చాను... వీళ్ళు పాలిస్తీనియ వాళ్ళా? ఇజ్రాయెల్... పాలస్తీనా మధ్య గొడవలు ఉన్నాయి... ఎవరినో కిడ్నప్ చేయబోయి వీళ్ళు పొరబాటున నన్ను తీసుకొని వచ్చినట్లు ఉన్నారు... ఇప్పుడు ఏమి చేస్తారు?" ఇలా ఆలోచిస్తూండగా... ఆ గదిలోకి ఎవరో వచ్చినట్లు శబ్దం అయింది. గిరీశం మొహం మీద ముసుగు లాగేసారు... మొత్తం నలుగురు ఉన్నారు... ఒకడు గిరీశం ముందు కూర్చున్నాడు... ఇద్దరు గిరీశం వెనక నుంచొని ఉన్నారు... ఇంకొకడు కూచున్నవాడి వెనక నుంచున్నాడు... గిరీశం ముందు కూర్చున్న వాడి చేతిలో ఒక లాప్ టాప్ ఉంది... వాడు దాన్ని ఓపెన్ చేసి గిరీశం కి చూపిస్తూ...

ఆ వ్యక్తి (జాకబ్ కంపెనీ సాఫ్ట్ వేర్ చూపిస్తూ ) : ఈ ప్రోగ్రాం ని ఎన్క్రిప్టు చేసింది నువ్వేనా?

గిరీశం : అవును... ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది... ఇది జాకబ్ ఫర్మ్ తయారుచేసింది...

ఆ వ్యక్తి : ఈ ప్రోగ్రాం KEY మాకు కావాలి.

గిరీశం : నో... నేను ఇవ్వను.

ఆ వ్యక్తి(తుపాకీ గురిపెట్టి) : ఇవ్వకపోతే నిన్ను చంపేస్తాం... మాకు హెల్ప్ చేస్తే నిన్ను సేఫ్ గా కేంబ్రిడ్జి లో వదిలేస్తాము... ఆ ఫామిలీ కోసం నువ్వెందుకు నీ ప్రాణాలు పణంగా పెడతావు...

గిరీశం(ఆవేశంగా ) : వాళ్లంతా నా ఫామిలీ... వాళ్ళని మోసం చెయ్యలేను...

ఆ వ్యక్తి : నీ ఫామిలీ? వాళ్ళు జ్యూయిష్... నువ్వు ఇండియన్... వాళ్ళు నీ ఫామిలీ ఎలా అవుతారు?

గిరీశం : నేను... మిరియం... ఎంగేజ్ అయ్యాము... ఇవ్వాళా మా ఎంగేజ్మెంట్ పార్టీ... నేను వైన్ కొనడానికి బయటకి వచ్చాను... మీరు కిడ్నప్ చేశారు...

ఆ నలుగురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని... ఒక్కసారిగా నవ్వడం మొదలెట్టారు... ఒక అయిదు నిమిషాల తరువాత...

ఆ వ్యక్తి : అసలు వాళ్ళు ఎవరో నీకు తెలుసా?

గిరీశం : ఎలిజా... జాకబ్... సాఫ్ట్ వేర్ బిజినెస్... జొహన్నా హౌస్ వైఫ్...

ఆ వ్యక్తి (ఆశ్చర్యంగా చూస్తూ): నీకు నిజం గా వాళ్లెవరో తెలియదా?

గిరీశం : నాకు అర్ధం కాలేదు...

ఆ వ్యక్తి : కేంబ్రిడ్జి లో ఎజ్రా లెవిన్సన్... ఇక్కడ ఎలిజా హాలేవీ... జాకబ్ హాలేవీ... మిరియం హాలేవీ... ఎవరో నీకు నిజం గా తెలియదా?

గిరీశం : ఎజ్రా... కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్... ఎలిజా అయన చైల్డ్ హుడ్ ఫ్రెండ్...

ఆ వ్యక్తి : వాళ్ళు MOSSAD ఏజెంట్స్... వాళ్ళు చాలా కాలంగా నీచేత ఎన్క్రిప్షన్ సాఫ్ట్ వేర్ తయారు చేయిస్తున్నారు... నీకు వాళ్ళు మొదటినుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చి నీకు తెలియకుండానే నీ చేత పెద్ద ఎన్క్రిప్షన్ సాఫ్ట్ వేర్ తయారు చేశారు... దాని వాళ్ళు ఇజ్రాయెల్ ఆర్మీ కి ఇచ్చారు... మేము దాన్ని సంపాదించాము... ఇప్పుడు నువ్వు దీని ఎన్క్రిప్షన్ కీ ఇస్తావా లేక నిన్ను చంపెయ్యమంటావా?

సరిగా అదే సమయం లో ఆ ఇంటి బయట పెద్ద ఎత్తున కాల్పులు వినిపించాయి... ఒక వ్యక్తి లోపలి వచ్చి అరబిక్ భాష లో ఏదో అరిచాడు... అప్పుడే ఆ రూమ్ లో తుపాకీ పేలింది... " టాప్... టాప్... టాప్... టాప్..." అంటూ నాలుగు సార్లు పేలింది... అక్కడ నాలుగు శవాలు తేలాయి... ఇంకో వ్యక్తి చేతులెత్తేసి నిలబడ్డాడు... గిరీశం ఆ తుపాకీ కాల్చిన వ్యక్తి వైపు చూసాడు... మిరియం... ఆమె చేతిలో రివాల్వర్... అది ఇంకో సారి పేలింది... చేతులెత్తి నుంచున్న వాడు చనిపోయాడు... ఆమె గిరీశం కట్లు విప్పి కింద పడిఉన్న లాప్ టాప్ తీసుకొని "పద వెళదాం" అని అన్నది.. గిరీశం మాట్లాడ కుండా ఆమె వెనకాలే వెళ్ళాడు... బయట జాకబ్ ఒక అస్సల్ట్ రైఫిల్ పట్టుకొని వున్నాడు... ఎలిజా కార్ లో కూర్చొని వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు..... అందరూ కార్ ఎక్కారు... మిరియం తో "నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు?" అని అడిగాడు గిరీశం... "నీ మొబైల్ ఫోన్ లో మేము ఒక ట్రాకింగ్ డివైస్ పెట్టాము... అసలు మాకు చెప్పకుండా బయటకి ఎందుకు వెళ్ళావు?" అని అన్నది... "మీకు ఒక వైన్ బాటిల్ తేవడానికి వెళ్ళాను... మీరు నిజంగా MOSSAD ఏజెంట్స్?" అని అడిగాడు... దానికి ఎవరూ బదులు చెప్పలేదు. దారి పొడుగూతా ఎవరూ మాట్లాడలేదు... మరుసటి రోజు గిరీశం ఒక్కడే కేంబ్రిడ్జి వచ్చేసాడు...

ఒక పది రోజుల పాటు ఎవరిని కలవలేదు... ఎవరు ఫోన్ చేసినా ఆన్సర్ చెయ్యలేదు... చివరికి ఒక రోజు ఎజ్రా లెవిన్సన్ గిరీశం ఇంటికి వచ్చాడు...

ఎజ్రా : టెల్ అవివ్ లో జరిగింది తెలుసుకున్నాను... ఇందులో నీ తప్పు లేదు... క్రిప్టోగ్రఫీ... ఎన్క్రిప్షన్ లో నీ నాలెడ్జి చూసి నేను నమ్మ లేక పోయాను... నువ్వు చాలా అడ్వాన్స్... నీ గురించి నేను ఎలిజా కి చెప్పాను... వాడికి నేను ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ డీక్రిప్టు చేసి ఇస్త్తూ ఉంటాను... నువ్వు పరిచయం అయ్యాక ఆ మెసేజెస్ ని నీచేత డెక్రిప్టు చేయించసాగాను... నువ్వు చాలా ఫాస్ట్ గా... చాలా accurate గా డెక్రిప్టు చేసేవాడివి... నెమ్మదిగా నీచేత చాలా పని చేయించాను... అవును... నేను నిన్ను వాడుకున్నాను... నీవల్ల ఇజ్రాయెల్ కి చాలా లాభం చేకూరింది... నీకు నచ్చినా నచ్చక పోయినా ఇజ్రాయెల్ గవర్నమెంట్ నీకు 3 మిలియన్ పౌండ్స్ ని బార్క్లేస్ బ్యాంకు లో జమ చేసింది... ఇదిగో ఆ అకౌంట్ నెంబర్... ఆన్ లైన్ id... పాస్ వర్డ్... నీకు ఇష్టముంటే ఈ డబ్బులు వాడుకో... లేదంటే దాన ధర్మాలు చెయ్యి... చివరిగా ఒక సలహా... నీ దగ్గర ఒక కళ ఉంది... దాని వృధా పోనివ్వకు" అని చెప్పి బ్యాంకు పాస్ బుక్ ఆన్ లైన్ id... పాస్ వర్డ్ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు... గిరీశం తన జీవితం లో మళ్ళీ మిరియం ని కలవలేదు.

ఇదంతా జరిగిన తరువాత గిరీశం కేంబ్రిడ్జి వొదిలేశాడు... లండన్ వెళ్ళిపోయాడు. బ్యాంకు లో ఉన్న 3 మిలియన్ పౌండ్స్ ని వాడలేదు. అలాగే ఉంచేసాడు... బ్రిటిష్ టెలికాం కంపెనీ లో ఉద్యోగం సంపాదించాడు... వాళ్ళ ఎన్క్రిప్షన్... డేటా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచెయ్యసాగాడు... ఆరు నెలలు బానే గడిచాయి... ప్రతి రోజూ ఆఫీస్ కి వెళ్లడం... 12 గంటలు పనిచెయ్యడం... ఇంటికి రావడం... పడుకోవడం... ఒక రోజు లోకల్ ట్రైన్ ప్లాటుఫామ్ మీద రైల్ కోసం ఎదురుచూస్తునానప్పుడు... ఎందుకో అనుమానం వచ్చి పక్కకి తిరిగి చూసాడు... అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు... అతడిని తాను ప్రతి రోజూ చూస్తున్నాడు... ఎక్కడికి వెళ్తే అక్కడి కి వస్తాడు... వెంట పడుతున్నాడేమో అని అనుమానం వచ్చి ట్రైన్ రాగానే జనాల్లో కలిసిపోయి ట్రైన్ ఎక్కకుండా ఆగిపోయాడు... అది గమనించని ఆ వ్యక్తి ట్రైన్ ఎక్కి గిరీశం కోసం వెతికాడు... గిరీశం లోపల లేడు... అతనికి అనుమానం వచ్చి ట్రైన్ బయటకి చూసాడు... అప్పటికే ట్రైన్ డోర్స్ మూసుకున్నాయి... గిరీశం ప్లాటుఫారం మీద ఒంటరిగా నుంచొని ఉన్నాడు. రైల్ వెళ్ళిపోయింది.... తరువాతి రైల్ కోసం వెయిట్ ఎదురుచూస్తూ ఉండగా... ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి జేబులోంచి తన ID తీసిచూపిస్తూ "My name is David Frost... MI6 agent... please come with me" అని అన్నాడు... అది గిరీశం జీవితం లో అయిదవ మలుపు తిరిగిన రోజు.


Part - 10 - The Spy... The Techie... and Gadgets

డేవిడ్ ఫ్రాస్ట్ కార్ నడుపుతున్నాడు... గిరీశం పక్కనే కూర్చొని ఉన్నాడు... ఇద్దరూ ఏమి మాట్లాడడం లేదు... గిరీశం కి అర్ధమయ్యింది... MI6 వాళ్ళు తనని ఎందుకు ఫాలో అవుతున్నారో... ఇప్పుడు తనని ఎందుకు తీసుకొని వెళ్తున్నారో... ఎదో సాధిచాలని ఇంగ్లాడ్ వచ్చాడు... తనకి కి తెలియకుండానే స్పై లో నెటవర్క్ ఇరుక్కున్నాడు... ఇప్పుడు బ్రిటిష్ ఇంటలిజెన్స్ వాళ్ళ ద్రుష్టి తన మీద ఉంది. వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా తనకి తెలిసింది అంతా చెప్పేసి వాళ్లకి సహకరించడం తప్ప తనకి వేరే మార్గం లేదు... కార్ లండన్ లోని వాక్సహాల్ క్రాస్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ లోకి ప్రవేశించింది... అది బ్రిటిష్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ బిల్డింగ్... దానికే ఇంకో పేరు కూడా ఉంది... MI6... మిలిటరీ ఇంటలిజెన్స్ - సెక్షన్ 6... ఈ డిపార్ట్మెంట్ 1909 లో మొదలయ్యింది... రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో చాలా బాగా పనిచెయ్యడం వల్లనే హిట్లర్ సైన్యాన్ని ఆపగలిగారు... ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వాళ్ళు వాడిన "ఎనిగ్మా" అనే సిస్టం పంపే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ని విజయవంతగా డీకోడ్ చేశారు... దాంతో హిట్లర్ వార్ సీక్రెట్స్ ని కనిపెట్టి... ఇంపీరియల్ జర్మన్ ని ఆపగలిగారు... ఆ తరువాత ఈ డిపార్ట్మెంట్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరు వచ్చింది... సినిమాల్లో చూపించే జేమ్స్ బాండ్ 007 పనిచేసేది ఈ డిపార్ట్మెంట్ లోనే...

కార్ బిల్డింగ్ లోని బేసెమెంట్ లోకి ప్రవేశించింది... అక్కడ లిఫ్ట్ ఎక్కి వాళ్ళు బేసెమెంట్ కి రెండు అంతస్తుల కిందకి వెళ్లారు... అక్కడ ఒక పెద్ద ఆఫీస్... అందులోనే క్రిప్టోఅనాలిసిస్ డిపార్ట్మెంట్ ఉంది... ఆ డిపార్టుమెంటు హెడ్ -- డేవిడ్ ఫ్రాస్ట్...

డేవిడ్ : మీరు ఎంతకాలం MOSSAD మెసేజెస్ డీకోడ్ చేశారు...

గిరీశం : చాలా కాలం... ఇక్కడ మీకో విషయం చెప్పాలి... నాకు తెలిసి నేను ఎప్పుడూ MOSSAD తో పనిచెయ్యలేదు... ప్రొఫెసర్ ఎజ్రా లెవిన్సన్ నాకు ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ఇచ్చి డీకోడ్ చెయ్యమని వాడు... నేను అది ఒక అకాడమిక్ టెస్ట్ అనుకున్నాను... ఆయన MOSSAD ఏజెంట్ అని తెలియదు.

డేవిడ్ : మీరు ఎలాంటి మెసేజెస్ డీకోడ్ చేశారు గుర్తుందా?

గిరీశం : లేదు. అన్ని రాండమ్ గా ఉండేవి... సిటీ పేర్లు... బిల్డింగ్ లొకేషన్స్... కొన్ని డేట్స్... ఇలా చాలా రాండమ్ గా వుండేది...

డేవిడ్ : ఇంగ్లాండ్ లో ఏదైనా లొకేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయా...

గిరీశం : ఉన్నాయి... ఆక్సఫర్డ్... కేంబ్రిడ్జి... ఎడింబర... ఇలా చాలా ఉన్నాయి...

డేవిడ్ : ఏదైనా డేట్స్... ఈవెంట్స్... గుర్తున్నాయా?

గిరీశం : లేదు... అంత ఇంపార్టెంట్ గా ఏమి అనిపించలేదు... కానీ.. ఒకటి మాత్రం బాగా గుర్తుంది... RAF వడ్డింగ్టన్ పేరు మాత్రం గుర్తుంది...

డేవిడ్(ఆదుర్దా గా ) : డేట్స్ ఏమన్నా గుర్తున్నాయా?

గిరీశం : లేదు...

డేవిడ్ : బాగా గుర్తుచేసుకో...

గిరీశం : ఒక 4 ఏళ్ళ క్రితం అనుకుంటా...

డేవిడ్(పేపర్ మీద ఒక డేట్ వ్రాసి చూపిస్తూ) : ఇదేనా????

గిరీశం : అనుకుంటా... ఖచ్చితంగా గుర్తులేదు...

డేవిడ్ సీట్ లోంచి లేచి బూతులు తిట్టుకుంటూ రూమ్ లోంచి బయటకి వెళ్ళాడు... ఒక 15 నిమిషాల తరువాత ఇంకో వ్యక్తిని వెంటపెట్టుకొని వచ్చాడు... ఆ వ్యక్తి తన పేరు చెప్పలేదు... గిరీశం కూడా అడగలేదు... ఇద్దరూ కలసి గిరీశం ని దాదాపు 5 గంటల పాటు చాలా సీరియస్ గా ప్రశ్నించారు... గ్లాస్ మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు... చివరి ఆ ఇద్దరూ లేచి ఆ రూమ్ లోంచి వెళ్లిపోయారు... గిరీశం బాగా అలసిపోయాడు... ఒక వ్యక్తి వచ్చి... ఒక సాండ్ విచ్... టీ ఇచ్చాడు... గిరీశం సాండ్ విచ్ తిని టీ తాగి... ఆ రూమ్ లోనే కొంచం సేపు అటూ ఇటూ తిరిగాడు... వెళ్లి కుర్చీలో కూర్చొని నిద్ర పోయాడు... ఎంత సేపు అయ్యిందో తెలియదు... డేవిడ్ వచ్చి లేపాడు...

డేవిడ్ : మీరు ప్రొఫెసర్ ఎజ్రా లెవిన్సన్ తో పనిచేసేటప్పుడు మీకు ఒక్క రోజు కూడా అనుమానం రాలేదా?

గిరీశం : లేదు... అంతా అకాడమిక్ రొటీన్ అనుకున్నా...

డేవిడ్ : మిరియం తో పరిచయం అయ్యాక కూడా మీకు డౌట్ రాలేదా?

గిరీశం : నన్ను ఇజ్రాయెల్ లో పాలస్తీనియన్స్ కిడ్నప్ చేసే దాకా నాకు తెలియదు...

డేవిడ్ : మీరు మిరియం ని అడిగారా?

గిరీశం : అడిగాను... ఆమె... తన తండ్రి... అన్న... ఎవరూ చెప్పలేదు... నేను నెక్ట్ డే కేంబ్రిడ్జి కి వచ్చేసాను... అప్పటినుంచి నేను మిరియం... ఆమె ఫామిలీ తో కాంటాక్ట్ లో లేను...

డేవిడ్ : ఎలిజా... ఆమె తండ్రి కాదు... జొహన్నా ఆమె తల్లి కాదు... జాకబ్... మిరియం తో పనిచేసే ఇంకో ఏజెంట్... వాళ్ళు ఫామిలీ లాగా నీతో నటించారు...

గిరీశం : మిరియం... ఇది ఆమె నిజంగా ఆమె పేరేనా...

డేవిడ్ (చిరునవ్వుతో) : గుడ్ క్వశ్చన్... నో... అది ఆమె అసలు పేరు కాదు... మిరియం హాలేవీ కి చాలా పేర్లు ఉన్నాయి... వాటిలో ఆమె ఒరిజినల్ పేరు ఎదో ఎవరికీ తెలియదు.  మీకు ఒక ఆప్షన్ ఇస్తాను... మీరు మాతో పని చెయ్యండి... మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము... మీకు తెలుసో లేదో ఇంటర్నేషనల్ స్పై నెటవర్క్ మీ పేరు మారుమోగుతోంది... ఇంటెర్పోల్... CIA... మిమ్మల్ని కిడ్నప్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు... అది తెలిసి మేము మా మనిషిని మీకు తెలియకుండా ఫాలో అవ్వమన్నాము... చివరికి మీరు కనిపెట్టెయ్యడం తో మిమ్మల్ని తీసుకొని వచ్చాము... మీరు ఇప్పుడు ఎదో ఒక స్పై ఏజెన్సీ కి పనిచెయ్యాలి... మీకు ఆప్షన్ లేదు... అది బ్రిటిష్ ఇంటలిజెన్స్??? లేదా వేరే ఏదైనా ఏజెన్సీ... మీ ఇష్టం... మీరు మాతో పనిచెయ్యకపోతే... మీ బార్క్లేస్ బ్యాంకు అకౌంట్ లో 3 మిలియన్ పౌండ్స్ ఎక్కడనుంచి వచ్చాయో... మా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్పాల్సి వస్తుంది...

గిరీశం : అది ఎజ్య్రా లెవిన్సన్ డిపాజిట్ చేసాడు...

డేవిడ్ : కాదు... ఆ అమౌంట్ ఇజ్రాయెల్ లో ఎలిజా కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ నుంచి ట్రాన్సఫర్ అయ్యిది... మీరు MOSSAD ఏజెంట్ అని చెప్పి అరెస్ట్ చెయ్యగలం... ఆలోచించుకోండి... మీరు ఇక్కడినించి మీ ఇంటికి వెళ్తారా... లేక HRH Prison కి వెళ్తారా ? మీరు మాతో పనిచేస్తే... మేము ఆ అమౌంట్ గురించి అడగం... మీరే ఉంచుకోవొచ్చు... ప్రస్తుతం ఆ అకౌంట్ ని మేము ఫ్రీజ్ చేస్తాము... మీ మీద నమ్మకం కలిగాక వొదిలేస్తాము... అప్పుడు ఆ డబ్బులు మీరే వాడుకోవొచ్చు...

గిరీశం పెద్దగా ఆలోచించలేదు... వెంటనే ఒప్పుకున్నాడు... ఆ రోజు నుంచి అసలు స్పై నెటవర్క్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాడు... చాలా విషయాలు తెలుసుకున్నాడు... రష్యా... జర్మనీ... ఇండియా... అమెరికా... ఫ్రాన్స్... చాలా దేశాలు తిరిగాడు... సైబర్ క్రైం... సైబర్ ఎటాక్... అన్నింటిలో బాగా ఎక్స్పర్ట్ అయ్యాడు... గిరీశం కి ఒక ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్ పరిచయం అయ్యాడు... ఎప్పుడైతే తన బ్యాంకు అకౌంట్ ని అన్ ఫ్రీజ్ చెయ్యగానే... అమౌంట్ ని ఆ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ట్ కి ఇచ్చాడు... వాడు ఆ అమౌంట్ ముందు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేసాడు... బాగా లాభం వచ్చింది... ఆ తరువాత ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్ సహాయం తో ఆ అమౌంట్ ని Untracebale route లో Cyprus కి చేర్చాడు... అక్కడ ఒక షిప్పింగ్ కంపెనీ ని ఓపెన్ చేసాడు... ఎలాగైనా స్పై నెటవర్క్ లోంచి బయటపడాలని ఎదురుచూడసాగాడు... ఆ సమయం వచ్చింది...

జులై 7 2005... ఆ రోజు లండన్ లో 4 చోట్ల టెర్రరిస్ట్ ఎటాక్ జరిగింది... పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మీద బాంబులు పేలాయి... లండన్ అండర్ గ్రౌండ్ ట్రయిన్స్ మీద మూడు చోట్ల ఒకేసారి బాంబులు పేలాయి... గిరీశం ప్రతిరోజూ బస్సు ఎక్కి ఆఫీస్ కి వెళ్తాడు... ఆ రోజు నాలుగో బాంబు గిరీశం ఎక్కే  లండన్ డబల్ డెక్కర్ బస్సు లో పేలింది... దేవుడు దయవల్ల ఆ రోజు గిరీశం ఆ బస్సు ఎక్కలేదు... ఎప్పుడైతే ఆ బాంబులు పేలాగానే... చురుగ్గా అలోచించి చనిపోయిన వాళ్లలో తన పేరు కూడా వచ్చేలా చూసుకున్నాడు... బ్రిటిష్ ఇంటలిజెన్స్ వాళ్ళు తన చావు ని నమ్మారని పూర్తిగా కంఫర్మ్ అయ్యాయేదాకా అండర్ గౌండ్ లోకి వెళ్ళిపోయాడు... దాదాపు ఒక ఆరు నెలల తరువాత ఇంగ్లాండ్ నుంచి పారిపోయి దొంగ దారిన ఇండియా చేరుకున్నాడు... తన ఊరు వెళ్లకుండా న్యూ ఢిల్లీ లో ఒక డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేసుకొని అందులో ఒక అమెరికన్... ఒక కెనడియన్... ఒక ఇండియన్ పాస్ పోర్ట్... అమెరికన్... ఇండియన్ కరెన్సీ... ఇండియన్ Income Tax PAN కార్డు... Election కార్డు... దాచుకొని... నేరుగా రుషికేశ్... హరిద్వార్... వెళ్ళిపోయి ఒక ఆశ్రమం లో చేరి తన పేరు విశ్వామిత్ర గా మార్చుకున్నాడు... మూడు సంవత్సరాలు గడ్డలు... మీసాలు పెంచేసుకొని... సన్యాసి లా గడపసాగాడు... సంసృతం తెలియడం తో వేదాలు... ఉపనిషత్తులు చదివాడు... బాగా నాలెడ్జి సంపాదించుకున్నాడు. అంతా బానే ఉంది.

ఒక రోజు... 26 నవంబర్ 2008... ముంబయి లో టెర్రర్ అట్టాక్ జరిగింది... చాలా మంది చని పోయారు... చాలా బాధ పడ్డాడు... ఆ తరువాత ఒక రోజు టీవీ లో డిబేట్ చూస్తున్నప్పుడు ఒక పాకిస్తానీ చేసిన కామెంట్ విన్నాడు "మీరు భారతీయులు అసమర్ధులు... మా వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి మీకు 4 రోజులు పట్టింది..." అని ఎగతాళిగా మాట్లాడం చూసి బాగా కోపం వచ్చింది... వెంటనే అక్కడినుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నాడు... తన డ్రాప్ బాక్స్ లో దాచుకున్న డాకుమెంట్స్ తీసుకొని పహాడ్ గంజ్ లో ఒక హోటల్ లో రూమ్ తీసుకొని కొంత కంప్యూటర్ కొనుకొని దాడి మొదలెట్టాడు... చాలా డామేజ్ చేసాడు... నెమ్మదిగా తన ఐడెంటిటీ బయటి కి రాకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాద్ లో ఒక సేఫ్ ప్లేస్ ఏర్పాటు చేసుకొని డార్క్ నెట్... డార్క్ వెబ్ లో సంచరించసాగాడు... ఎన్నో దేశాల సీక్రెట్స్ తో ఒక డేటా బేస్ తయారు చేయగలిగాడు... ముఖ్యంగా పాకిస్తాన్ గురించి బాగా స్టడీ చేస్తూ వాళ్లకి బానే నష్టం కలిగించాడు... గత 12 ఏళ్లుగా అజ్ఞాతవాసం చెయ్యగలిగాడు... చివరికి ఇండియన్ RAW... IB వాళ్ళు కనిపెట్టారు... ఇక్కడ అవినాష్ కి కూడా తెలియని విషయం ఒకటి ఉంది... అతనికి గిరీశం ఒక ఎథికల్ హకెర్ అని మాత్రమే తెలుసు... గిరీశం రియల్ ఐడెంటిటీ మాధవ్... రవీంద్ర కి మాత్రమే తెలుసు... వాళ్ళు అవినాష్ ద్వారా తనకి మెసేజ్ పంపారు... "నువ్వు ఎవరో... ఎక్కడున్నావో... మాకు తెలుసు..." అందుకే విశ్వామిత్ర వెంటనే Op Center వెళ్ళడానికి తయారయ్యాడు.

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

1980... న్యూ ఢిల్లీ... చాణక్య సినిమా హాల్... James Bond 007... సినిమా నడుస్తోంది... రోజర్ మూర్ వీరోచితంగా పిరమిడ్స్ దగ్గర శత్రువులతో పోరాడుతున్నాడు... బాల్కనీ లో జుబేదా చాలా సీరియస్ ఆ సినిమా చూస్తోంది... ఆమెకి జేమ్స్ బాండ్ సినిమా అంటే చాలా ఇష్టం... ప్రతి జేమ్స్ బాండ్ సినిమా ని 7 సార్లు చూడాలని ఒట్టు పెట్టుకుంది... కాలేజీ లో వున్నప్పుడు తెగ చూసేది... పెళ్లి అయినా తరువాత వచ్చిన మొదటి జేమ్స్ బాండ్ సినిమా... అప్పటికే ఆ సినిమా ని 4 సార్లు చూసింది... ఆమె పక్క సీట్లో భర్త ఇర్ఫాన్ ఖాన్ గురక పెట్టి నిద్ర పోతున్నాడు... ఆమె కడుపుతోవుంది... 9 నెల... ఇంకో వారం లో డెలివరీ డేట్... ఇంతలోనే ఆమెకి నొప్పులు వచ్చాయి... భర్తని లేపింది... వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు... మగ పిల్లోడు పుట్టాడు... ఇమ్రాన్ ఖాన్ అని పేరు పెట్టారు...

ఇర్ఫాన్ ఖాన్ ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డు లో ఇంజనీర్ గా పనిచేస్తాడు... అతని తండ్రి ఇంతియాజ్ ఖాన్ కి చాందిని చౌక్ లో వాచ్ & రేడియో రిపేరింగ్ షాప్ ఉంది... ఇమ్రాన్ చిన్నప్పటినుండి చాలా చిలిపిగా ఉండేవాడు... బాగా అల్లరి చేసేవాడు... ఒక్క తాత ఇంతియాజ్ మాట తప్ప వేరే వాళ్ళని ఖాతరు చేసేవాడు కాదు... స్కూల్ లో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు... స్కూల్ తరువాత తాత షాప్ కెళ్ళి కూర్చునేవాడు... వాచ్ & రేడియో సర్వీసింగ్... రిపేరింగ్ బాగా అబ్సర్వ్ చేసేవాడు... ఇంతియాజ్ పూర్వీకులు ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చారు... ఇంతియాజ్ కి పష్తో... పెర్షియన్ భాషలు బాగా తెలుసు... జుబేదా కి అరబిక్ లాంగ్వేజ్ తెలుసు... ఇర్ఫాన్ కి ఉర్దూ మీద మంచి పట్టు వుంది... ఇమ్రాన్ చిన్నపటినుంచి ఈ భాషలు బాగా నేర్చుకున్నాడు... పది సంవత్సరాల వయస్సులో ఒక రోజు ఒక వాచ్ ని ఊడదీసి బిగించాడు... ఇంతియాజ్ చాల ఇంప్రెస్ అయ్యి ఇమ్రాన్ కి చిన్న వస్తువులు రిపేర్ చెయ్యడం... తయారు చెయ్యడం నేర్పసాగాడు... రేడియో... ట్రాన్సిస్టర్ ఎలా పని చేస్తుందో కూడా వివరంగా చెప్పాడు... ఇమ్రాన్ కి 12 ఏళ్ళ వయసప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి... 1. జుబేదా తో కలిసి మొదటిసారి జేమ్స్ బాండ్ సినిమా Licence to Kill చూసాడు... జుబేదా జేమ్స్ బాండ్ ని చూస్తూంటే... ఇమ్రాన్ కి బాండ్ పక్కనే వుండే Q బాగా నచ్చాడు... ఆ ముసలోడు తయారు చేసే గాడ్జెట్స్... ముఖ్యం గా బాండ్ వాడే వాచ్... కార్... బాగా నచ్చాయి... అప్పుడే డిసైడ్ అయ్యాడు... పెద్ద అయ్యాక తాను Q అవ్వాలని... 2. తన తాత షాప్ లోని వస్తువులతో ఇమ్రాన్ సొంతగా Ham Radio తయారు చేసాడు... దాని విపరీతం గా వాడసాగాడు... ఒక రోజు పోలీస్ ఫ్రీక్వెన్సీ లో వెళ్లి వాళ్ళతో మాట్లాడాడు... అంతే... ఒక అరగంట లో వాళ్ళ ఇంటి ముందు పోలీస్ వాన్ ఆగింది... పోలీస్ ఆఫీసర్ పంకజ్ శర్మ... ఇమ్రాన్ ని... వాడు తయారుచేసిన Ham Radio తీసుకొని స్టేషన్ కి వెళ్ళాడు... వాళ్ళకి ఆ Ham Radio బాగా నచ్చింది... మామూలుగా అయితే లైసెన్స్ లేకుండా అలా Ham Radio వాడితే కేసు పెట్టాలి... కానీ పంకజ్ కి ఆ రేడియో తయారు చేసింది ఇమ్రాన్ అని తెలిసి ముందు నమ్మలేదు... వెంటనే Ham Radio పార్ట్శ్ తెప్పించి థన్ ముందు తయారు చెయ్యమన్నాడు... ఇమ్రాన్ చక చక తయారు చేసాడు... ఇది చూసి పంకజ్ శర్మ బాగా ఇంప్రెస్ అయి ఒక వార్నింగ్ ఇచ్చి వొదిలేసాడు... 3. ఇమ్రాన్ ఇంటి దగ్గర ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీస్ ఉంటాడు... దీపావళి సమయంలో ఆయన తన ఇంటి దగ్గర పార్క్ లో ఇమ్రాన్ దూరం గా నిలబడి దీపావళి బాంబు కాల్చడం చూసాడు... క్యూరియాసిటీ ఆపుకోలేక దగ్గరికి వెళ్లి చూసాడు... ఇమ్రాన్ ఆ టపాకాయలని ఒక టైమర్ పెట్టి కాలుస్తున్నాడు... 1 2 3 4 5 అంటూ లెక్క పెట్టి ట్రిగ్గర్ నొక్కి కాల్చసాగాడు... అది చూసి ఆ మిలిటరీ ఆఫీసర్ ఠారెత్తి పోయి పోలీస్ కి ఫోన్ చేసాడు... మళ్ళీ పంకజ్ శర్మ వచ్చాడు... ఆ టైమర్ ఎక్కడిదని అడిగాడు... ఇమ్రాన్ 'నేనే తయారు చేశానని చెప్పాడు...' పంకజ్ శర్మ నమ్మాడు... ఎలా తయారు చేసావో చేసి చూపించమన్నాడు... ఇమ్రాన్ వాళ్ళ ముందు రేడియో టైమర్ ని తయారు చేసి చూపించాడు... పంకజ్ శర్మ వాడికి రెండో వార్నింగ్ ఇచ్చాడు... ఇమ్రాన్ టాలెంట్ చూసి 'పెద అయ్యాక నువ్వు ఏమవుతావని అడిగాడు'... 'జేమ్స్ బాండ్ సినిమా లో Q అవుతానని చెప్పాడు..'

అప్పటినుంచి పంకజ్ శర్మ ఆ కుర్రోడిని చాలా క్లోజ్ గా అబ్సర్వ్ చేయ్యసాగాడు... చెడుసావాసాలు పట్టకుండా చూడసాగాడు... 10 తరగతి లో ఇమ్రాన్ ఖాన్ తన పేరు మార్చుకున్నాడు... IMRAN KHAN అని వ్రాయడం మానేసి IMRAN QHAN అని వ్రాసుకోసాగాడు... చదువులో బాగా పైకి వచ్చాడు... 10 క్లాస్ లో ఢిల్లీ స్టేట్ ఫస్ట్... ఇంటర్ లో CBSE టాపర్... వెంటనే ఢిల్లీ IIT లో Electronics & Instrumentation లో చేరాడు... అక్కడ తన ప్రొఫెసర్స్ అందరిని బాగా పీడించాడు... కొత్త కొంత ఇన్స్ట్రమెంట్స్ చేయ్యసాగాడు... వాడి ఇంటరెస్ట్ చూసి వాడిని Artificial Intelligence లో కూడా బాగా కోచింగ్ ఇచ్చారు... ఇమ్రాన్ చివరికి ఇండియన్ ఆర్మీ EME డివిజన్ లో చేరాడు... అక్కడ అందరికి తన తెలివి తేటలతో చుక్కలు చూపించసాగాడు... మన ఆర్మీ వాళ్లకి దూరంగా వున్నా పాకిస్తాన్ కన్నా... పక్కనే ఉన్న ఇమ్రాన్ ఖాన్ అంటే భయం వేసేది...

23 అక్టోబర్ 2001... ఇమ్రాన్ జీవితం లో పెద్ద మార్పు వచ్చిన రోజు... ఆ రోజు అమెరికా లో Apple Corporation iPod రిలీజ్ చేసింది... గ్రామఫోన్... స్పూల్ టేప్ రికార్డర్... క్యాసెట్ టేప్ రికార్డర్... CD ప్లేయర్... డిస్క్ man... DVD ప్లేయర్... అన్నింటినీ సమాధి చేస్తూ స్టీవ్ జాబ్స్ తయారు చేసిన iPod చూడ గానే ఎలాగైనా తాను ఏదో ఒకటి ఆవిషరించాలని కంకణం కట్టుకున్నాడు... Apple Corporation తమ ప్రొడక్ట్స్ అన్నింటికీ 'i" తో మొదలుపెడుతుంది... ఒకసారి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి సమధానంగా స్టీవ్ జాబ్స్ 'i' stands for internet అని అన్నాడు... అంటే iPhone అంటే ఇంటర్నెట్ ఫోన్ అని అర్ధం వచ్చేలా పెట్టారు. అప్పటినుంచి IMRAN KHAN తన పేరు ని iQHAN గా మార్చుకున్నాడు.

iQhan తన మాట నిలపెట్టు కున్నాడు... మినియేచర్ సర్వైలన్సు డివైసెస్ తయారు చేయ్యసాగాడు... iQhan మొదటి ఆవిష్కరణ... ఒక పిచ్చుక రూపం లో వుండే స్పై కెమెరా... చూడడానికి పిచ్చుక లాగే ఉంటుంది... పిచ్చుక లాగే ఎగురుతుంది... చూసేవాళ్ళకి ఎటువంటి అనుమానం రాదు... ఆ పిచ్చుకకి ముద్దుగా "చిడియా" అని పేరు పెట్టాడు... దాని కళ్ళకి మినియేచర్ కెమెరాలు ఉంటాయి... రెక్కలకి సోలార్ పానెల్స్ అమర్చాడు... చిడియా పొట్టలో ఒక మదర్ బోర్డు ఉంటుంది... బ్లూత్ టూత్... GPS ... వీడియో రికార్డింగ్... ట్రాన్స్మిషన్... చెయ్యగలదు... దాని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేస్తాడు... "చిడియా" దాదాపు 150 మీటర్స్ ఎత్తులో ఎగరగలదు.... ఒక టార్గెట్ ని లాక్ చేస్తే దాని వెనకాలే వెళ్తుంది... కంట్రోలింగ్ రేంజ్ 1 కిలోమీటర్ కానీ... ఎక్కువసేపు ఎగరలేదు... అందుకోసం... రెండో ఆవిష్కరణ... ఈగల్... గద్ద... ఇది కూడా అదే టెక్నాలజీ తో పనిచేస్తుంది... ఎక్కువ ఎత్తులో ఎగరగలదు... ఎక్కువదూరం వెళ్లగలదు ... దాని కంట్రోలింగ్ రేంజ్ 3 కిలోమీటర్స్... ఇవి కాకుండా ఇంకో చిన్నది తయారు చేసాడు... దాని పేరు "కీడా" అంటే పురుగు... అది చాలా చిన్నది... ఒక తేనెటీగ సైజు లో ఉంటుంది... ఎక్కడికైనా ఈజీ గా దూసుకెళ్లగలదు... దాని రేంజ్ ఒక 50 మీటర్స్ మాత్రమే...

iQhan ఇవి కాకుండా బాంబులు తయారు చెయ్యడం లో కూడా మంచి ఎక్స్పర్ట్... ఒక ఆపరేషన్ కోసం iQhan ని టర్కీ పంపారు... అక్కడ అంకార లో మాధవ్ పరిచయం అయ్యాడు... iQhan తెలివితేటలూ... పనితనం బాగా నచ్చాయి... వాళ్లిద్దరూ చాలా సార్లు వేరే దేశాల్లో ఎన్నో మిషన్స్ విజయవంతం గా పూర్తి చేశారు...

మాధవ్ Op Center కి చీఫ్ అయ్యాక... తనకి కావాల్సిన వాళ్ళని చాలా జాగ్రత్త గా సెలెక్ట్ చేసుకున్నాడు... వాళ్లలో ముఖ్యమైన వాడు... iQhan... ఇన్నోవేషన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి డైరెక్టర్ ని చేసాడు... చివరికి ఇమ్రాన్ ఖాన్ కి Q అయ్యాడు...

ఆ రోజు iQhan హైదరాబాద్ నుంచి వస్తున్న విశ్వామిత్ర ని రిసీవ్ చేసుకోవడానికి... న్యూ ఢిల్లీ లో ని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్... టెర్మినల్ 3... అరైవల్ లౌంజ్ లో iQhan బోర్డు పట్టుకొని నుంచున్నాడు... iQhan చూడడానికి చాలా స్మార్ట్ గా... స్టైలిష్ గా...  అందంగా ఉంటాడు..   ప్రతి రోజూ వర్క్ ఔట్స్ చేస్తాడు.. చాలా ఫిట్ గా ఉంటాడు..  మాధవ్ ని కలిసిన తరువాత ఫీల్డ్ ఆపరేటివ్స్ అంటే చాలా గౌరవ మర్యాదలు పెరిగాయి... మాధవ్ గిరీశం గురించి చాలా చెప్పాడు... 'నువ్వు కలవబోయే వ్యక్తి నీలాగే చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్... మీరు ఇద్దరూ కలసి పనిచేస్తే మన ఆర్గనైజేషన్ కి చాలా లాభం కలుగుతుంది... అందుకే నిన్ను పర్సనల్ గా వెళ్లి రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది' అని చెప్పాడు... 

హైదరాబాద్ నుంచి రావాల్సిన విమానం వచ్చింది... పాసెంజర్స్ బయటకి రావడం మొదలెట్టారు... iQHAN చాలా ఆత్రం గా చూడసాగాడు... 'వచ్చే ఆ గిరీశం ఎలా ఉంటాడు? నాలాగే అందంగా ఉంటాడా? ఎత్తుగా... ఫిట్ గా ఉంటాడా?' అని మనసులో అనుకుంటుండగా ఒక వ్యక్తి అతని దగ్గరకి వచ్చి... "అర్ యు iQHAN ?" అని అడిగాడు... iQHAN అయోమయంగా తలూపాడు... "ఐ యాం గిరీశం... షల్ వి గో?" అని అన్నాడు... 

ఇద్దరూ ఎయిర్ పోర్ట్ నుంచి ఆర్ లో బయలుదేరారు... iQHAN మనసులో 'మాధవ్ ఎంత పొగిడాడు... అది విని వచ్చేవాడు BRAD PITT లాగా ఉంటాడనుకుంటే... వీడెవడండీ బాబు... ఉత్తరాఖండ్ లో సంచరించే సన్యాసి లాగా ఉన్నాడు? వీడు... వీడి గడ్డం... కుర్తా... జీన్స్ ప్యాంటు... భుజం మీద జోలె... వీడా మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్??'  అని అనుకుంటూ కార్ నడప సాగాడు... ఇద్దరూ Op Center చేరుకున్నారు. 

మాధవ్ RAW ఫీల్డ్ ఏజెంట్... రవీంద్ర ఒక ఇంటలిజెన్స్ చీఫ్... విశ్వామిత్ర ఒక సర్వైలన్సు ఎక్సపెర్ట్... అవినాష్... రూల్స్ ని పాటించని పోలీస్... వీళ్ళకి తోడుగా... iQhan... ఇప్పుడు ఈ అయిదుగురు కలసి పనిచేయాలి... God bless enimies...


Part - 11 - The Meeting at Op Center

విశ్వామిత్ర Op Center లో అడుగు పెట్టాడు... మాధవ్ ని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న...

విశ్వామిత్ర : నాకు ఫస్ట్ ఫ్లోర్ యాక్సిస్ ఎప్పుడిస్తారు?

మాధవ్(నవ్వుతూ) : At the appropriate juncture... in the fullness of time... when the moment is right

విశ్వామిత్ర(నవ్వుతూ) : Of course

మాధవ్ : Finally we got chance to meet you

విశ్వామిత్ర: నిజం చెప్పాలంటే... ఇది మన రెండో మీటింగ్... మొదటిసారి 15 సంవత్సరాల క్రితం మనం మాస్కో లో కలిసాము... ఇద్దరం ఎదురుపడ్డాము... మాస్కో లో గోర్కీ పార్క్ ఇన్సిడెంట్ గుర్తుందా... మీరు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ ఆస్మాన్ పని మీద అక్కడికి వచ్చారు... ఆ రోజు గోర్కీ పార్క్ లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను... మిమ్మల్ని మొదటిసారి చూసింది అప్పుడే... ఇంకో సంగతి ఏమిటంటే... నాకు అదే లాస్ట్ అసైన్మెంట్... ఆ తరువాత లండన్ బాంబింగ్స్ లో చనిపోయిన వాళ్లలో నా పేరు కూడా చేర్చి పారిపోయాను... అప్పటినుండి నేను ఒక GHOST

మాధవ్ (ఆశ్చర్యంగా): అప్పుడు నాగురించి మీకెలా తెలుసు? ఆపరేషన్ ఆస్మాన్ ??? దాని గురించి మీకెలా తెలుసు?

విశ్వామిత్ర : MI6 కి లండన్ లోని ఇండియన్ ఎంబసీ లో ఒక అసెట్ ఉన్నాడు... ఆపరేషన్ ఆస్మాన్ మొదలయ్యింది కూడా లండన్ లోనే కదా... మీరు లండన్ రావడం అక్కడినుండి హెల్సింకి వెళ్లడం... హెల్సింకి నుంచి మాస్కో చేరుకోవడం... MI6 కి ఆ అసెట్ ఇన్ఫోర్మ్ చేసాడు... MI6 లో మీ నిక్ నేమ్ ఏమిటో తెలుసా???

మాధవ్ : తెలుసు... Mad Maddy... MI6 కి మీరు బతికేవున్నట్లు తెలిసింది...

విశ్వామిత్ర : అవును... ఎంత జాగ్రత్త ఉన్నా... 5 ఏళ్ళ క్రితం డార్క్ వెబ్ లో నాతో పనిచేసిన వాడు ఒకడు కనిపెట్టేసాడు... డిజిటల్ ఫుట్ ప్రింట్... చాట్ లో పాటర్న్ గుర్తుపట్టాడు... వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు... Once an Operative is always an operative... వొదిలించుకోవడం చాలా కష్టం... నాగురించి మీకు ఎలాతెలుసు?

మాధవ్ : MI6 లో మన భారతీయుడు ఉన్నాడని... అతను MOSSAD ఏజెంట్ అని తెలిసింది...

విశ్వామిత్ర : నా ప్రమేయం లేకుండా నేను MOSSAD కోడ్ బ్రేకర్ గా పనిచేసాను...

మాధవ్ : మీ స్పెషలిటీ ఏమిటీ తెలుసుకోవచ్చా?

విశ్వామిత్ర : SIGINT... ఎక్కువగా డిజిటల్ స్పెక్ట్రమ్ లో ఉండేవాడిని... ఒక్కోసారి ఫీల్డ్ కి కూడా వెళ్ళేవాడిని... HUMINT కూడా చేసాను... చాలా తక్కువ... ఆ రోజు గోర్కీ పార్క్ లో నేను HUMINT సంపాదించడానికి వచ్చాను... అప్పుడు మీరు మీ ఆపరేషన్ మధ్య లో ఉన్నారు...

Intelligence Gathering చాల సైన్టిఫిక్ ప్రాసెస్... అన్ని దేశాల స్పై ఏజెన్సీస్ ముఖ్యం గా 3 రకాల పద్దతులలో ఇన్ఫర్మేషన్ సంపాదిస్తారు... 1. HUMINT అంటే Human Intelligence ఒక వ్యక్తి తో మాట్లాడడం ద్వారా సంపాదించిన ఇన్ఫర్మేషన్... 2. SIGINT అంటే Signals Intelligence... ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడి పంపే ఇన్ఫోర్మషన్ ని మధ్యలో intercept చేసి సంపాదించేది... ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ని డీకోడ్ చేయ్యడం చాలా ముఖ్యమైన ఆక్టివిటీ. 3. IMINT... Imagery Intelligence... ఉదాహరణకి సాటిలైట్ తీసిన ఫొటోస్ ని అనలైజ్ చేయడంవల్ల సంపాదించిన ఇన్ఫర్మేషన్... ఇంకా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి... ఎక్కువగా ఈ మూడింటిని వాడతారు...

మాధవ్ : మీరు ఎప్పుడైనా ఖుర్రమ్ అనే పేరు విన్నారా?

విశ్వామిత్ర : ఖుర్రమ్??? ఎప్పుడూ వినలేదు...

మాధవ్ : మీ SIGINT లో ఎప్పుడూ ఈ పేరు వినలేదా...

విశ్వామిత్ర : లేదు... ఏమి?

మాధవ్ : మాకు కొంతకాలంగా ఒక వ్యక్తి కాంటాక్ట్ లో కి వచ్చాడు... కోడ్ నేమ్ ఖుర్రమ్... మా ఏజెంట్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాడు... చాలా ఇన్ఫోర్మషన్ ఇచ్చాడు... సడన్ గా ఒక రోజు మా ఏజెంట్ ని కలవమన్నాడు... మా ఏజెంట్ వెళ్ళాడు... మీకు ఈ మధ్య హైదరాబాద్ లో ఇరానీ కేఫ్ లో కాల్పులు జరిగిన సంగతి తెలుసుకదా...

విశ్వామిత్ర : ఎస్... ఎవరో పిచ్చోడు గన్ తీసుకొని ఎనిమిది మందిని చంపాడని పోలీస్ స్టేటుమెంట్ ఇచ్చారు...

మాధవ్ : ఆ చనిపోయిన వాళ్లలో మా ఏజెంట్ కూడా ఉన్నాడు... మీకు IMINT లో అనుభవం ఉందా???

విశ్వామిత్ర : ఉంది... నేను ఎక్సపర్ట్ కాదు... కానీ... అనుభవం ఉంది...

మాధవ్ : మీకు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను... వాటిని చూసి మీ ఒపీనియన్ చెప్పండి...

మాధవ్ తన రూమ్ లో స్క్రీన్ మీద ఒకటొకటి గా ఆ కేఫ్ లో చనిపోయిన వాళ్ళ ఫొటోస్ చూపించాడు... అవి రకరకాల యాంగిల్స్ లో ఉన్నాయి... వాటిని చాలా సేపు స్టడీ చేసాడు... అప్పుడే రవీంద్ర కూడా వచ్చి తనని పరిచయం చేసుకొని వాళ్ళ మీటింగ్ లో చేరాడు...

విశ్వామిత్ర : ఈ ఫొటోస్ చూసాక నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే... ఇది రాండమ్ కిల్లింగ్ కాదు... వీళ్ళని చంపిన వాడు పిచ్చోడు కాదు... ప్రొఫెషనల్ కిల్లర్...

రవీంద్ర: ఎలా చెప్పగలరు???

విశ్వామిత్ర : ఈ ఇద్దరి ఫొటోస్ చూడండి... బుల్లెట్స్ గుండెకి తగలడం తో చనిపోయారు... క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తే... బులెట్ గుండె లోకి ఎంటర్ అయిన ట్రాజెక్టరీ... ఈ ఇద్దరి కి ఒకటే... ఈ ఇద్దరూ ఒకే చోట కూర్చొని లేరు... రెండు డిఫరెంట్ ప్లేసెస్ కూర్చున్న వ్యక్తులని ఇంత క్లీన్ గా చంపడం అంటే... కిల్లర్ మంచి షార్ప్ షూటర్ అయి ఉండాలి... ఈ నలుగురి ఫొటోస్ చూడండీ... ఇంజ్యూరిస్ టు హెడ్... నలుగురికి బుల్లెట్ సరిగ్గా నుదిటిమీద బొట్టు పెట్టినట్లు తగిలినిది... ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్ హిట్...

మాధవ్ : ఇది ఖుర్రమ్ చేసాడని మాకు వచ్చిన డౌట్...

విశ్వామిత్ర : కాదనిపిస్తోంది... ఎవరూ తమ కాంటాక్ట్ ని చంపాలని అనుకోరు... కాంటాక్ట్ ని చంపితే ఇన్ఫర్మేషన్ ఫ్లో ఆగిపోతుంది... మళ్ళీ ఇంకో కాంటాక్ట్ ని వెతుక్కోవాలి... చాలా టైం పడుతుంది... అంత సాహసం చెయ్యరు... కలవడానికి రమ్మని చంపితే ఈజీ టార్గెట్ అవుతాడు... ఎవరూ ఇష్టపడరు... ఆ కాంటాక్ట్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు కదా...

మాధవ్ : అవును

విశ్వామిత్ర : మీ చనిపోయిన ఏజెంట్ కి బ్యాక్ అప్ ఎవరు?

మాధవ్ : రంజిత్ సింగ్... ఆ చనిపోయిన ఏజెంట్ కి బ్యాక్ అప్ గా ఉండేవాడు...

విశ్వామిత్ర : అతని కి చెప్పండి... ఆ చాట్ ఛానల్ ఓపెన్ గా ఉంచమనండి... ఏదో ఒక రోజు కాంటాక్ట్ పింగ్ చేస్తాడు... టైం పట్టొచ్చు... మీరు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవచ్చా...

మాధవ్ : మీకు హైదరాబాద్ లో మహేంద్ర భూపతి తెలుసా?

విశ్వామిత్ర : తెలుసు... పైకి పెద్ద ఇండస్ట్రియలిస్ట్... పొలిటిషన్... బిగ్ షాట్... లోపల చాలా షెడి క్యారెక్టర్ ... డ్రగ్స్... మనీ లాండరింగ్... వెరీ బాడ్ పర్సన్...

మాధవ్ : మహేంద్ర మీద కేసు పెట్టి లోపల వెయ్యాలి... దానికి మీ సహాయాం కావాలి...

విశ్వామిత్ర : చాలా కష్టం... మహేంద్ర సింగల్ పర్సన్ కాదు... డ్రగ్ లార్డ్... మాఫియా కింగ్ పిన్... పొలిటికల్ గా బాగా కనెక్టెడ్... మీరు కేసు పెడితే తన పొలిటికల్ పరపతి వాడుకొని ఈజీ గా బయట పడతాడు... ఢిల్లీ లో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది...

మాధవ్ : ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మహేంద్ర ని లోపల వెయ్యమని అన్ అఫీషియల్ గా ఆర్డర్స్ ఇచ్చారు... మేము బలంగా కేసు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ దూరంగా ఉంటుంది.

విశ్వామిత్ర : ఏ కేసు పెట్టాలని చూస్తున్నారు...

మాధవ్ : ఇక్కడే మీ సహాయం కావాలి... మహేంద్ర డిఫెన్స్ మినిస్ట్రీ కి సంభందించిన రహాస్యాలు చాలా సంపాదించాడు... వాటిని డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టాడని తెలిసింది... మహేంద్ర వాటిని అమ్మే లోపల మనం వెనక్కి సంపాదించాలి. మీకు క్రిప్టోగ్రఫీ లో చాలా అనుభవం ఉందికదా... దాన్ని ఉపయోగించి ఆ సీక్రెట్ డాకుమెంట్స్ బయటికి రాకుండా ఆపాలి... అతని డ్రగ్ సిండికేట్ ని కూడా నాశనం చెయ్యాలి... హైదరాబాద్ లో అతని డ్రగ్ బిజినెస్ జారకుండా చేయాలి... అతని కి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారో కనుక్కొని ఆ సప్లై కూడా ఆపాలి...

విశ్వామిత్ర : డ్రగ్స్ విషయం లో మహేంద్ర కి సప్లయర్ ఎవరూ లేరు... ఎందుకంటే... వాటిని స్వయంగా మహేంద్ర తయారు చేస్తున్నాడు... పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్నాయని ఒక టాక్ ఉంది... అవి ఎక్కడున్నది తెలియదు... డ్రగ్స్ విషయం లో మహీంద్ర ఎస్కోబార్ ని మించి పోయాడు... మీకు జీరో జీరో జీరో... అంటే తెలుసుగా...

మాధవ్ : తెలుసు... Purest form of Drugs...

విశ్వామిత్ర : మహీంద్ర జీరో జీరో జీరో క్వాలిటీ డ్రగ్స్ తయారు చేస్తున్నాడు... చాలా దేశాలకి ఎక్సపోర్ట్ చేస్తాడు... మంగళూరు... కొచ్చిన్ పోర్ట్స్ నుంచి బయటకి పంపుతాడని అంటారు... చాలా పెద్ద నెటవర్క్ మైంటైన్ చేస్తున్నాడు... హైదరాబాద్ లో ఒక పెద్ద కమాండ్ సెంటర్ ని కూడా నడుపుతున్నాడని తెలిసింది... దాని లొకేషన్ తెలిస్తే చాలా విషయాలు బయటకి వస్తాయి... అది కనుక్కోవాలంటే సర్వైలన్సు ఎక్విప్మెంట్... పెద్ద టీం కావాలి... ఒక్కడి వల్ల కాదు...

మాధవ్ కుర్చీలోంచి లేచి "నా తో రండి..." అంటూ బయటకి నడిచాడు... అతని వెనకే రవీంద్ర... విశ్వామిత్ర వెళ్లారు... మాధవ్ వాళ్ళని డైరెక్ట్ గా iQhan ల్యాబ్ కి తీసుకెళ్లాడు. ఆ ల్యాబ్ చూసి విశ్వామిత్ర చాలా ఇంప్రెస్ అయ్యాడు... అంతా స్టేట్ అఫ్ ఆర్ట్ టెక్నాలజీ... అక్కడ iQhan తయారు చేసిన కీడా... చిడియా... ఈగల్... చూపించాడు... విశ్వామిత్ర కి మతిపోయింది... అవి అచ్చం చిడియా... ఈగిల్ అచ్చం పక్షుల్లాగా ఉన్నాయి...

విశ్వామిత్ర : ఏ మెటీరియల్?

iQhan : కార్బన్ ఫైబర్... నానో టెక్నాలజీ... ఇన్ఫ్రా రెడ్... నైట్ విషన్... 40MP కెమెరా... GPS టెక్నాలజీ... బ్లూ టూత్... సోలార్ పవర్... రిమోట్ కంట్రోల్డ్...

విశ్వామిత్ర : కంప్యూటర్... మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చెయ్యొచ్చా...

iQhan : ఎస్... మొబైల్ అప్ కి ఆప్టిమైజ్ చేసాము...

విశ్వామిత్ర : వీడియో రికార్డింగ్ అవుతుందా... లేక స్ట్రీమ్ చేస్తుందా...

iQhan : స్ట్రీమింగ్ మాత్రమే... రికార్డింగ్ ఫెసిలిటీ లేదు...

విశ్వామిత్ర కి ఆ మూడు బాగా నచ్చాయి... వాటిని అవినాష్ కి పంపమని చెప్పి "నేను ఒక వారం రోజుల్లో మీకు ఒక ఆక్షన్ ప్లాన్ తయారుచేసి పంపుతాను" అన్నాడు...

మాధవ్ : మీరు అవినాష్ తో రెగ్యులర్ గా టచ్ లో వుండండి. మీకు ఏదైనా కావాలంటే అడగండి... ఈ పని మాత్రం అవ్వాలి... మహేంద్ర అరెస్ట్ కావాలి.


Part - 12 - THE STAKE-OUT

విశ్వామిత్ర హైదరాబాద్ వచ్చి అవినాష్ ని కలిసాడు...

అవినాష్ : హైదరాబాద్ లో జరుగుతున్న డ్రగ్స్ బిజినెస్ వెనక ఉంది మహింద్ర అని నీకెలా తెలుసు?

విశ్వామిత్ర : మహీంద్ర కంపనీ లో పనిచేసిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజన్ పరిచయం అయ్యాడు. చాలా మంచి వాడు. కానీ... పెద్ద డ్రగ్ అడిక్ట్. అతని వైఫ్ ఛాయా చాలా భాధ పడేది. రిహాబిలిటేషన్ లో పెట్టినా కూడా పెద్దగా ఫలితం కనిపించలేదు. అప్పుడే తెలిసింది. హైదరాబాద్ లో డ్రగ్ బిజినెస్ అంతా మహీంద్ర కను సన్నలలో నడుస్తుందని... కైలాష్ గౌడ్ దాన్ని దగ్గరుండి నడిపిస్తాడని... కైలాష్ కుడి భుజం ఓపియం సుభాష్ కి అన్ని తెలుసనీ... ఈ బిజినెస్ ని నడిపించడానికి ఒక పెద్ద కమాండ్ సెంటర్ కూడా ఉందని... తెలిసింది. రాజన్ చనిపోయాడు. ఇక్కడ నాకు అర్ధం కాని విషయం ఒకటి ఉంది... 14 ఏళ్ళ కుర్రోడి దగ్గరనుంచి... యువతీ యువకులు... ఎంప్లాయిస్... ఇంటి గృహిణిలు... క్రీడాకారులు... సినిమా ఆక్టర్స్... వీళ్ళందరికీ డ్రగ్ డీలర్స్ ఎవరు.. వాడిదగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయి... వాటి విలువ ఎంత...  ఎలావుంటారు... ఈ డ్రగ్ డీలర్స్ ఏ టైం లో ఎక్కడుండేది చాల క్లియర్ గా తెలుస్తోంది...  కానీ.. ఎంతో ట్రైనింగ్ పొందిన పోలీసులకి ఈ డ్రగ్ డీలర్స్ ఎవరో తెలియడం లేదు... ఇది చాలా దురదృష్టకరం...

అవినాష్ : నువ్వు చెప్పిన ఆ ఓపియం సుభాష్ కి మా పోలీస్ డిపార్టుమెంటు లో చాలా మంది సపోర్ట్ ఉంది. డబ్బులు బాగా వెదజల్లుతారని కూడా తెలుసు. అందుకే వాడిని పట్టుకోవడం కుదరడం లేదు. రెండేళ్ల క్రితం సెంట్రల్ నార్కటిక్స్ బ్యూరో ఒక సీక్రెట్ ఆపరేషన్ కండక్ట్ చేసింది. వాళ్ళు హైదరాబాద్ లో చాలా చోట్ల ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించారు. ఏమి దొరకలేదు. మహింద్ర కి అన్ని డిపార్టుమెంట్స్ లో మనుషులు ఉన్నారు. ముందుగానే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సుభాష్ కి సిటీ లో చాలా ఇళ్ళు ఉన్నాయి. ఎప్పుడు... ఎక్కడుంటాడో... తెలుసుకోవడం చాలా కష్టం.

విశ్వామిత్ర : నీకు సుభాష్ కి ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయో నీకు తెలుసా?

అవినాష్ : ఎందుకు?

విశ్వామిత్ర : స్టేక్ అవుట్ ప్లాన్ చేద్దాం...

అవినాష్ : వేస్ట్. సుభాష్ కి కూకట్ పల్లి దగ్గర ఉన్న ఒక బస్తి లో ఇల్లు ఉంది. అక్కడ కొత్తవాళ్లు ఎవరు అడుగుపెట్టిన అక్కడ ఉన్న వాళ్లకు తెలిసిపోతుంది. ఒక్కడు కూడా సహకరించడు. ఒకసారి నేను ఆ ఏరియా ఎలా ఉంటుందో తెలుసుకుందామని మా వాళ్ళని మఫ్టీ లో ఆ బస్తి కి పంపాను... అక్కడ చిన్న పిల్లల దగ్గరనుంచి ముసలి వాళ్ళ దాకా పోలీసులని ఎలా గుర్తుపట్టాలో బాగా తెలుసు... మావాళ్లని చూడగానే ఆ బస్తి పిల్లలు 'మీది ఏ పోలీసుస్టేషన్... ఇక్కడికి ఎందుకొచ్చారు... ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు?'' అని అడగడం మొదలెట్టారు... ఇంకొసారి ఆ బస్తి ని ఏరియల్ సర్వే చేయడానికి ఒక డ్రోన్ కెమెరా ని పంపాము. దాన్ని కనిపెట్టిన లోకల్ కుర్రోళ్ళు రాయి పెట్టి కొట్టారు. ఆ డ్రోన్ కెమెరా అక్కడ పడిపోయింది. చాలా కష్టం. ఆ ఏరియా వాడి స్ట్రాంగ్ హోల్డ్.

విశ్వామిత్ర : ఒక ఐడియా ఉంది. నేను Op సెంటర్ లో ఇన్నోవేషన్ రీసెర్చ్ & డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసిన స్పై కెమెరాలు చూసాను. వెరీ ఇంటరెస్టింగ్. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. ఆ ఏరియా ని ఈజీ గా సర్వే చెయ్యవొచ్చు... ఏరియల్ స్టేక్ అవుట్ ప్లాన్ చెయ్యవొచ్చు... 

విశ్వామిత్ర తాను ఢిల్లీ లో చూసిన... కీడా... చిడియా .... ఈగల్... గురించి చాలా డిటైల్డ్ గా అవినాష్ వివరించాడు.

అవినాష్ : ఈ మధ్య వచ్చిన ఒక ఇంగ్లీష్ సినిమా లో చూసినట్లు గుర్తు...

విశ్వామిత్ర : Eye in the Sky... ఆ సినిమా పేరు. మన వాళ్ళు ఆ సినిమా లో చూపించిన గాడ్జెట్స్ కన్నా బాగా అడ్వాన్సుడ్ వెర్షన్స్ తయారు చేశారు. మనం వాటిని వాడుదాం. ఏదైనా క్లూ దొరుకుంతుందేమో...

అవినాష్ Op Center కి ఫోన్ చేసి తమ ప్లాన్ చెప్పి ఏమేమి కావాలో చెప్పారు. మాధవ్ వెంటనే తమ Op Center పనిచేస్తున్న సందీప్ 'శాండీ' శర్మ ని పంపాడు. శాండీ కి ఆ ఇంస్ట్రుమెంట్స్ ని ఆపరేట్ చెయ్యడం బాగా తెలుసు. శాండీ ఒక పెద్ద పెట్టె తీసుకొని వచ్చాడు. అందులో కీడా... చిడియా ... ఈగిల్... ఉన్నాయి. వాటి నడపడానికి కావాల్సిన రిమోట్ కంట్రోల్స్... ఆ గాడ్జెట్స్ పంపే సిగ్నల్స్ ని స్టోర్ చెయ్యడానికి కావాల్సిన కంప్యూటర్... ఇమేజెస్... డేటా... ని రియల్ టైం బేసిస్ లో Op Center కి ట్రాన్స్మిట్ చెయ్యడానికి కావాల్సిన పరికరాలు తీసుకొని వచ్చాడు.

అతనికి చెయ్యాల్సిన పని చెప్పారు. శాండీ ముందుగా ఈగిల్ ని తీసుకొని కూకట్ పల్లి లో సుభాష్ ఉండే బస్తీ కి వెళ్ళాడు. ఉదయం 11 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నాడు. దానికి ఒక కారణం వుంది. ఉదయం సూర్యుడు పైకి ఎగ బాకుతాడు. అప్పుడు నీడ తూర్పు నుంచి పడమరకు వ్యాపిస్తుంది. మధ్యాన్నం 1 గంట నుండి సాయంత్రం 5 వరకు సూర్యుడు కిందకి దిగుతాడు. అప్పుడు నీడ పడమర నుంచి తూర్పుకి వ్యాపిస్తుంది. అది ఏరియల్ ఫోటోగ్రఫీ కి అంత అనువైన సమయం కాదు. అందుకే ఏరియల్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు ఉదయం 11:30 నుంచి 12:30 మధ్యలో... ఒక గంట లోపల పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయం లో సూరీడు నడి నెత్తిమీద ఉంటాడు. ఏరియల్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు అబ్జాక్ట్ నీడ కనిపించదు. ఏరియల్ ఇమేజెస్ చాలా క్లియర్ గా వస్తాయి. ఇళ్ల మధ్య ఖాళీలు క్లియర్ గా కనిపిస్తాయి. నీడ అడ్డం రాదు. ఇంటి ముందు వుండే రోడ్ మీద కూడా మనుషుల నీడ వాళ్ళ కింద ఉండడం తో రికార్డింగ్ చాలా బాగా వస్తుంది. శాండీ బాగ్ ప్లాన్ చేసుకున్నాడు... ఏరియల్ ఫోటోగ్రఫీ ని రెండు భాగాలుగా విభజించాడు... ఒకటి... ఈగల్ ని బస్తి కి 25 మీటర్స్ ఎత్తులో ఎగరవేసి బస్తీ  మొత్తాన్ని ఏరియల్ సర్వే చెయ్యాలి... రెండోది ఈగల్ ని వీలైనంత కిందకి  ఎగరవేసి... స్ట్రీట్ వ్యూ వచ్చేలా చూడాలి... ఈ రెండు పనులు చేయడానికి ఒక గంట సరిపోదు... కాబట్టి రెండో రోజు కూడా ఈగల్ తో బస్తి మొత్తాన్ని షూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు... 

శాండీ కార్ లో కూర్చొని దాని రూఫ్ టాప్ ఓపెన్ చేసి ఈగిల్ ని గాల్లోకి వదిలాడు. ఈగిల్ అతి వేగంగా 250 మీటర్స్ ఎత్తుకి ఎగిరింది. శాండీ కంప్యూటర్ లో ఈగిల్ కేమేరాని స్టార్ట్ చేసాడు. ఈగిల్ కళ్ళలో ఉన్న మినియేచర్ కెమెరాలు ఇమేజెస్ ట్రాన్స్మిట్ చేయసాగాయి. మొదట్లో ఇమేజెస్ కొంచం బ్లర్ గా ఉన్నాయి. శాండీ ఈగిల్ కళ్ళలో అమర్చిన 40MP కెమెరా డెప్త్ అఫ్ ఫీల్డ్... షట్టర్ స్పీడ్ కంప్యూటర్ తో అడ్జస్ట్ చేసాడు. ఇమేజెస్ చాలా క్లియర్ రావడం మొదలెట్టాయి. 4K రెసొల్యూషన్ కి అడ్జస్ట్ చేసాడు. దాంతో పాటే ఈగిల్ ప్రయాణం చేసే స్పీడ్ కి అడ్జస్ట్ చేసాడు. విశ్వామిత్ర కార్ నడపసాగాడు. ఈగిల్ డేటా, ఇమేజెస్ ట్రాన్స్మిట్టింగ్ రేంజ్ 3 కిలోమీటర్స్ కావడం తో ఆ బస్తీ మొత్తం బాగా కవర్ చెయ్యగలదు. ఈగిల్ ని తమ రేంజ్ లోంచి బయటకి పోకుండా జాగ్రత్త పడుతూ కార్ ని నెమ్మదిగా నడుపుతున్నాడు.

శాండీ వెనక సీట్లో కూర్చొని ఈగిల్ ని కంట్రోల్ చేయ్యసాగాడు. బస్తీ మీద ఎగురుతోంది. సన్నటి సందులు. రక రకాల సైజుల్లో ఇల్లు. ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు ఉన్నాయి. చాలా తక్కువగా గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఇళ్లు కూడా కనిపించాయి. చాలా మటుకు ఇళ్ల మీద సన్ టీవీ డిష్ ఆంటెన్నాలు కనిపించాయి. అది పూర్తిగా లేబర్ బస్తీ. ఎక్కువ గా కంస్ట్రక్షన్ కి సంభందించిన కూలీలు... మేస్త్రీలు... ఉండే ప్రాంతం. చాలా పెద్ద బస్తీ. చాలా ఇల్లు ఉన్నాయి. అందులో సుభాష్ ఇల్లు ఏదో ఎలా తెలుస్తుంది? దాదాపు గంట పాటు ఆ బస్తీ మొత్తాన్ని రికార్డు చేసి వచ్చారు. ఆ గంట రికార్డింగ్ ని Op Center కి అప్లోడ్ చేసాడు. మరుసటి రోజు బస్తీ స్ట్రీట్ వ్యూ ని కూడా షూట్ చేసి Op Center కి అప్లోడ్ చేసాడు.

హైదరాబాద్ లో అవినాష్, విశ్వామిత్ర, శాండీ... ఢిల్లీ లో Op Center స్టాఫ్ ఆ వీడియో ఇమేజెస్ బాగా స్టడీ చేశారు. ఆ బస్తీ లో కి వెళ్ళడానికి కొన్నిదారులు కనిపించాయి. రెండు రోడ్స్ కొంచం వెడల్పుగా ఉన్నాయి. వాటి మీద ఒక కార్ గాని... లేదా SUV గాని ఈజీ గా ప్రయాణించగలదు. మిగతా రోడ్స్ సన్నగా ఉన్నాయి. సైకిల్, మోటార్ బైక్, స్కూటర్... రిక్షా... తోపుడు బళ్ళు తప్ప వేరే ఏమి తిరగలేవు. ఆ ఏరియా మొత్తం సర్వైలన్సు లోపెట్టాలంటే కనీసం 14 చిడియా లు కావాలని అంచనా వేశారు. ఇక్కడే ఒక ప్రాబ్లెమ్... చిడియా ట్రాన్స్మిట్టింగ్ రేంజ్ 1 కిలోమీటర్ కావడం తో బస్తీలోకి వెళ్లకుండా సిగ్నల్స్ క్యాచ్ చెయ్యాలంటే చాలా కష్టం. దానికి విశ్వామిత్ర ఒక సొల్యూషన్ ఇచ్చాడు. అదేమిటంటే... ఆ 14 చిడియాల ని కవర్ చేస్తూ ఒక కనెక్టింగ్ డివైస్ ని ఒక సెంట్రల్ పాయింట్ లో పెట్టి... ఆ డివైస్ నుంచి ఫీడ్ డైరెక్ట్ గా కంప్యూటర్ కి వచ్చేలా సెట్ చెయ్యాలి... ఆ బస్తీ  మొత్తం చాలా జాగ్రత్తగా సర్వే ఒక సెంట్రల్ పాయింట్ ని కనిపెట్టారు... అది ఒక ఇల్లు. ఆ ఇంటి మీద మీద ఒక సన్ టీవీ ఆంటిన్నా వుంది... ఆ ఆంటిన్నా కి దగ్గరలో సిగ్నల్ రిసీవింగ్ డివైస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు... ఇక్కడ ఇంకో ప్రాబ్లెమ్ వచ్చింది... ఆ ఇంటి మేడ మీదకి ఎలా వెళ్ళాలి?  ఆ ఇంటి మేడ మీదకి వెళ్లాలంటే ఏదైనా బలమైన కారణం కావాలి.

అవినాష్ ఒక ఐడియా చెప్పాడు. ఆ ఇంటి మేడ మీద సన్ టీవీ డిష్ ఆంటిన్నా ఉంది. రాత్రి పూట ఎవరికి తెలియకుండా శేఖర్ కి బాగా నమ్మకమైన వ్యక్తిని పంపించి ఆ డిష్ కనెక్షన్ ఊడదీయించాడు. భారత దేశం ప్రతి గృహిణి ప్రతి రోజూ టీవీ సీరియల్స్ చూస్తుంది... వాటికి అంతరాయం కలిగితే సహించదు... ఆ మరుసటి రోజు ఆ ఇంటి ఓనర్ పెళ్ళాం తన డైలీ సీరియల్స్ వచ్చే సమయం లో టీవీ పనిచేయక పోవడం తో సన్ టీవీ ఆఫీస్ కి ఫోన్ చేసింది. ఆ కాల్ ని ఆ ఆఫిస్ లో శేఖర్ మనిషి రిసీవ్ చేసుకొని శేఖర్ కి చెప్పాడు. ఒక అరగంట లోపల శేఖర్ మనిషి సన్ టీవీ కంపెనీ యూనిఫామ్ వేసుకొని ఆ ఇంటికి వెళ్లి మేడ మీద రిపేర్ చేస్తున్నట్లు నటిస్తూ ఎవరికి కనిపించని ప్రదేశం లో చిడియా సిగ్నల్స్ రిసీవింగ్ డివైస్ ని సెట్ చేసి ఆన్ చేసాడు. ఆ సిగ్నల్ రిసీవింగ్ డివైస్ పంపిన టెస్ట్ సిగ్నల్స్ శాండీ రిసీవ్ చేసుకున్నాడు. శేఖర్ పంపిన వ్యక్తి పనిలోపనిగా ఆ సన్ టీవీ డిష్ ఆంటిన్నా కనెక్షన్ ని కూడా సరిచేసి కిందకి వెళ్లి ఇంట్లో టీవీ సరిగ్గా పనిచేస్తోందో లేదో చెక్ చేసాడు. అన్ని చానెల్స్ బాగానే వస్తున్నాయి. ఆ ఇంటి ఓనర్ భార్య చాలా ఆనందించి శేఖర్ మనిషి చూపించిన చోట సంతకం పెట్టింది.

శాండీ ఆ రాత్రి కార్ లో ఆ బస్తీ కి వెళ్ళాడు. కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసి ఒకేసారి 14 చిడియాలని గాల్లోకి ఒదిలాడు. అవి గాల్లో నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ముందుగా వాటికి ఫీడ్ చేసిన కోఆర్డినెట్స్ ప్రకారం వెళ్లి తమ తమ స్థానాల్లో సెటిల్ అయ్యాయి. శాండీ వాటిని రిమోట్ గా స్విచ్ ఆన్ చేసాడు. కెమెరాలు ఫీడ్స్ ని పంపసాగాయి. అన్ని చిడియాల కెమెరా యాంగిల్స్ అన్ని సరిగ్గా సెట్ చేసాడు. ఫీడ్ సెంట్రల్ డివైస్ కి చేరుతోంది. సెంట్రల్ డివైస్ నుంచి శాండీ కంప్యూటర్ కి ఫీడ్ అందసాగింది. అన్ని చిడియాలు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకొని అక్కడి నుండి వెళ్లిపోయారు.

రాత్రి పగలు తేడా లేకుండా చిడియాలు పనిచేస్తున్నాయి. ఉదయం 6 గంటల సమయం లో లేబర్ పనులకి బయలుదేరతారు. కొంత మంది సైకిల్స్ మీద వెళ్తున్నారు. కొంత మంది ముఖ్యం గా ఆడవాళ్లు నడుచుకుంటూ బస్తి బయటకి వెళ్లి అక్కడ లేబర్ కాంట్రాక్టర్ ఆరెంజ్ చేసిన లారీలు ఎక్కి పనులకి వెళ్తున్నారు. ఆ తరువాత 7 గంటల ప్రాంతం లో పిల్లలు స్కూల్ కి వెళ్లారు. 8 గంటల ప్రాంతం లో ఆఫీస్ లకి వెళ్ళేవాళ్ళు స్కూటర్లు... బైక్ ల మీద వెళ్లడం కనిపించింది. 10 గంటల తరువాత కూరల బళ్ళు... సామాళ్ళు అమ్మేవాళ్లు రావడం పోవడం కనిపిచింది. మధ్యాన్నం 3 గంటల నుండి స్కూల్కి వెళ్ళాను పిల్ల రావడం... వాళ్ళ వెనకే లేబర్ రావడం... ఆ తరువాత ఆఫీస్ కెళ్ళిన జనాలు ఇంటికి చేరడం కనిపించింది. రాత్రి 8 గంటల కి రోడ్ల మీద జన సంచారం పల్చబడింది. రాత్రి 9 తరువాత నిర్మానుష్యం అయింది. ఆ తరువాత రోడ్డ మీద... సందుల్లో వీధి కుక్కలు ... పిల్లులు తప్ప వేరే సంచారం లేదు...

నాలుగు రోజులు గడిచాయి. బస్తి జనాల రొటీన్ లో మార్పు లేదు. అనుమానాస్పదం గా ఏమి తెలియలేదు. ఐదవ రోజు రాత్రి రెండు గంటల సమయం లో బ్రేక్ దొరికింది... ఆ బస్తీ లోకి వచ్చే మెయిన్ రోడ్ లోకి ఒక చిన్న సైజు డెలివరీ ట్రక్ ప్రవేశించింది. డ్రైవర్ ఆ ట్రక్ ని చాలా జాగ్రత్త గా నడుపుతున్నాడు... కొంచం లోపలికి వచ్చాక ఆగి పోయింది. హెడ్ లైట్స్ కూడా ఆపేసాడు. అప్పుడే ఒక బొలెరో SUV ఆ రోడ్ లో ప్రవేశించి ఆ ట్రక్ వెనకాలే ఆగింది. ఆ ఆక్టివిటీ ని గమనించిన శాండీ అవినాష్ కి ఫోన్ చేసి చెప్పాడు. అవినాష్ వెంటనే శాండీ దగ్గరకి వచ్చాడు. కంప్యూటర్ లో వస్తున్న ఇమేజెస్ జాగ్రత్తగా గమనించాడు. ఓపియం సుభాష్ కనిపించాడు. బొలెరో SUV ముందున్న ట్రక్ వెనక భాగం లో నుంచొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇంతలో డ్రైవర్ ఆ ట్రక్ వెంక భాగం డోర్ ఓపెన్ చేసాడు. లోపల ట్రక్ నిండా బస్తాలు ఉన్నాయి. వాటిని బొలెరో లో సుభాష్ తో పారు వచ్చిన వ్యక్తులు తీసుకొని సందుల్లోంచి నడుచుకుంటూ వెళ్లి ఒక ఇంటి దగ్గర ఆగి ఆ బస్తాని కిందకి దింపి తమ ప్యాంటు జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి ఒక కాల్ చేసి 10 సెకండ్స్ మాట్లాడాడు. ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఆ వ్యక్తి ఆ బస్తాని ఎత్తుకొని ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఇలా 20 బస్తాలు ఆ ఇంటి లో కి చేర్చారు... ఆ తరువాత ముందు బొలెరో రివర్స్ లో ఆ బస్తిలోనుంచి బయటకి వెళ్ళింది. ఆ తరువాత ట్రక్ కూడా రివర్స్ లో వెళ్ళిపోయింది. సుభాష్ సిగరెట్ కాలుస్తూ నడుచుకుంటూ బస్తీలో ఇంకో వైపుకి నడుచుకుంటూ వెళ్లి తన ఇంటికి చేరాడు.

అవినాష్ & టీం కి సుభాష్ ఇల్లు ఎదో తెలిసింది. శాండీ ఆ బస్తాలు దాచిన ఇంటిని... సుభాష్ ఇంటిని మార్క్ చేసాడు. అవినాష్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 8 చిడియాలు ఆ బస్తాలు దాచిన ఇంటి దగ్గరకి చేర్చాడు. మిగిలిన 6 చిడియాలు సుభాష్ ఇంటి చుట్టూ చేరి 24 గంటలు కాపు కాస్తున్నాయి.


Part - 13 - THE MULES

తెల్లారింది... బస్తీలో జనసంచారం మొదలయ్యింది... లేబర్ పనికి వెళ్లారు. పిల్లలు స్కూల్ కి... పెద్దలు ఆఫీస్ కి వెళ్లడం జరిగింది. సుభాష్ ఇంటి దగ్గర... ఆ డ్రగ్స్ పెట్టిన ఇంటి దగ్గర ఎటువంటి సంచారం లేదు. ఆ డ్రగ్స్ పెట్టిన ఇంటి గేట్ కి ఒక బోర్డు ఉంది. "ఇక్కడ ట్యూషన్స్ చెప్పబడును. సాయంత్రం 4 నుంచి 6 వరకు. 8,9 మరియు 10 క్లాసులకి మ్యాథ్స్ చెప్పబడును" అని వ్రాసి ఉంది.

అవినాష్ : ఏమి చేదాం? రైడ్ చేద్దామా?

రవీంద్ర : వెయిట్ చెయ్యాలి. ఆ ఇంట్లో పెట్టింది నిజంగా డ్రగ్స్ కాకపోతే ప్రాబ్లమ్. అనవసరంగా సుభాష్ ని అలెర్ట్ చేసినవాళ్ళం అవుతాము. అందరూ జాగ్రత్త పడిపోతారు. వాళ్ల సప్లై చైన్ ఏమిటో తెలుసుకోవాలి. ఎక్కడనుండి వస్తున్నాయి... ఎక్కడికి వెళ్తున్నాయి... ఇంకా ఇలాంటి ప్లేసెస్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. సుభాష్ ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్. వాడి ఇంట్లోకి కీడా ని పంపి చూడండి.

అవినాష్ : కీడా ని పంపాలంటే మనం ఆ బస్తి లో కి వెళ్ళాలి. బయటనుంచి పంపడానికి రేంజ్ సరిపోదు. మేము ఎదో ఒక ప్లాన్ వేస్తాము. ప్రస్తుతానికి చిడియాలు ఇమేజెస్ పంపిస్తున్నాయి.

రవీంద్ర : ఎట్టి పరిస్థిలో సుభాష్ చెయ్యి జారిపోకుండా చూసుకోండి. చాలా కాలానికి దొరికిన లీడ్. వొదలకూడదు.

అవినాష్ : తప్పకుండా... మేము కొత్త ప్లాన్ ఆలోచిస్తాము.

అవినాష్ (శాండీ తో) : దూరం నించి కీడా ని కంట్రోల్ చేయలేమా?

శాండీ : కష్టం. కీడా ఎగరాలంటే ఆ ఇంటి కి దగ్గర గా వెళ్లి ఆన్ చెయ్యాలి. అదే సమయంలో మనం ఈగిల్ ని ఆ ఇంటి మీద వాలెలా చేసి... ఈగిల్ ద్వారా ఆ కీడా ని ఆపరేట్ చెయ్యాలి. కీడా పంపే ఇమేజెస్ ని అక్కడవున్న చిడియా ద్వారా సెంట్రల్ డేటా డివైస్ కి వచ్చేలా ప్రోగ్రాం చేస్తే సెంట్రల్ డివైస్ నుంచి మనం రిసీవ్ చేసుకోవొచ్చు. ఎవరో ఒకరు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ కీడా ని ఆన్ చేస్తే ఇదంతా చెయ్యగలం. ఇక్కడినుంచి కీడాని పంపలేము.

అవినాష్ వెంటనే శేఖర్ కి ఫోన్ చేసి ఒక నమ్మకమైన వ్యక్తి కావాలని చెప్పాడు... శేఖర్ ఒక అరగంటలో ఒక లేడీ పోలీస్ ని పంపాడు. ఆమె పేరు కవిత. వయసు 30 ఏళ్ళు ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. ఆమె ఆ బస్తీలోకి వెళితే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. శాండీ ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధమయ్యేలా చెప్పి... కీడా ని ఎలా ఆన్ చెయ్యాలో చూపించాడు. ఆమెకి మ్యాప్ లో ఎక్కడికి వెళ్లాలో చూపించి... ఆమె మొబైల్ ఫోన్ కి రెండు లొకేషన్ డీటెయిల్స్ పంపాడు. ఒకటి ఆ ట్యూషన్ సెంటర్... రెండోది సుభాష్ ఇల్లు. కవితని తనతో పాటు కార్ లో ఎక్కించుకొని బస్తీ దగ్గరికి తీసుకొని వెళ్ళి లోపలికియేలా వెళ్లాలో చెప్పాడు...

కవిత కార్ దిగి నెమ్మదిగా చుట్టూ చూసుకొని బస్తీలోకి అడుగుపెట్టింది. తన మొబైల్ లో మొదటి లొకేషన్ లింక్ ని ఆన్ చేసి డైరెక్షన్స్ ఫాలో అవుతూ ఆ ట్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళింది. ఆ సమయంలో ఆ రోడ్ మీద ఎవరూ లేరు. అప్పటికే ఒక ఈగిల్ ఆ ఇంటిమీద వాలి వుంది. కవిత తన పర్సు లోంచి ఒక కీడా ని తీసి ఆన్ చేసింది ఈగిల్ వెంటనే కీడా పంపిన సిగ్నల్ ని ఈగిల్ క్యాచ్ చేసి సెంట్రల్ డివైస్ ద్వారా శాండీ కంప్యూటర్ కి చేరింది. శాండీ వెంటనే ఆ కీడా ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని గాల్లోకి ఎగిరేలా చేసాడు. కవిత అక్కడి నుంచి కదిలింది. తన మొబైల్ లో రెండో లొకేషన్ లింక్ ఆన్ చేసి సుభాష్ ఇంటికి చేరుకుంది. అక్కడ కూడా ఇంకో కీడా ని ఆన్ చేసింది. వెంటనే శాండీ దాన్ని కూడా తన కంట్రోల్ లోకి తీసుకుని రెండు కీడాలని ఆపరేట్ చేయ్యసాగాడు.

మొదటి కీడా గాల్లో ఎగురుతూ ట్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళింది. ట్యూషన్ సెంటర్ మెయిన్ డోర్ మూసి ఉండడంతో లోపలి వెళ్ళడానికి వేరే ఏదైనా మార్గం కోసం ఇంటి చుట్టూ తిరగసాగింది. ఒక చోట ఒక బాత్ రూమ్ వెంటిలేటర్ కనిపిచింది. శాండీ ఆ వెంటిలేటర్ ద్వారా ట్యూషన్ సెంటర్ లోకి కీడాని ప్రవేశించేలా చేసాడు. బాత్ రూమ్ లోంచి ఇంట్లోకి వచ్చింది... పెద్ద లివింగ్ రూమ్. ఒక పక్క బ్లాక్ బోర్డు ఉంది. అంటే... అక్కడే ట్యూషన్స్ చెప్తారన్నమాట. ఆ లివింగ్ రూమ్ కి ఆనుకొని 3 గదులు ఉన్నాయి. శాండీ ఒక రూమ్ లోకి కీడా ని ప్రవేశపెట్టాడు. అది కిచెన్. ఒక పెద్ద గట్టు ఉంది. దాని మీద గ్యాస్ స్టవ్ ఉంది. పక్కనే కూల్ డ్రింక్స్... బిస్కేట్స్... వాటర్ కూలర్ ఉన్నాయి. అంతకు మించి ఆ రూమ్ లో ఏమి లేవు. అక్కడినించి పక్క రూంలోకి కీడా ని పంపాడు. ఆ రూమ్ లో పెద్ద పెద్ద బస్తాలు ఉన్నాయి. శాండీ లెక్క పెట్టాడు. 20 ఉన్నాయి. అది చూసిన అవినాష్ లెక్క వేసాడు. ఒక్కో బస్తా లో 50 కిలోలు ఉన్నాయనుకున్నా... ఆ 20 బస్తాల్లో దాదాపు 1000 కిలోల డ్రగ్స్ వుండే ఛాన్స్ ఉంది. అవినాష్ "ఆ కీడా ని ఆ రూమ్ లో వదిలేస్తే... మనకి ఇమేజెస్ వస్తూనే ఉంటాయా..." అని అడిగాడు. దానికి బదులుగా శాండీ " ఇమేజెస్ వస్తూనే ఉంటాయి. కీడా రెక్కలమీద సోలార్ పానెల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మినిమం టెంపరేచర్ కనీసం 20 డిగ్రీస్ ఉంటుంది. కీడా సోలార్ పానెల్స్ కి 15 డిగ్రీస్ టెంపరేచర్ చాలు ఆగకుండా పనిచేయడానికి." అని అన్నాడు. "అయితే... ఆ కీడాని ఆ రూమ్ లో ఎక్కడ పెడితే రూమంతా కవర్ అవుతుందో ఆ ప్లేస్ లో వొదిలెయ్యగలవా?" అని అడిగాడు. శాండీ ఆ కీడాని రూమంతా కలియ తిప్పాడు. రూమ్ లో ఎక్కడా షెల్ఫ్ లేదు. నాలుగు గోడలు బోసిగా ఉన్నాయి. ఆ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ తప్ప ఇంకేమి లేవు. ఆ సీలింగ్ ఫ్యాన్ రాడ్ మీ వాలెలా చేసాడు. అక్కడ్నుంచి ఆ రూమ్ లోకి ఎవరు వచ్చి వెళ్లినా క్లియర్ గా కనిపిస్తుంది. అది చాలు...

రెండో కీడాని కూడా అదే రకంగా వెంటిలేటర్ లోంచి సుభాష్ ఇంటిలోకి ప్రవేశపెట్టాడు. చాలా చిన్న ఇల్లు. రెండు గదులు మాత్రమే ఉన్నాయి. మెయిన్ రూమ్. కిచెన్. బాత్రూం. మెయిన్ రూమ్ లో మంచం మీద సుభాష్ గురక పెట్టి నిద్రపోతున్నాడు దిండు పక్కనే ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఇంట్లో ఇంకేమి సామాన్లు లేవు. ఆ మెయిన్ రూమ్ కిటికీ లో ఆ కీడా ని పెట్టాడు. ఇల్లంతా కవర్ అయ్యేలా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు కీడాలు ఎన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు అక్కడనుంచి ఇమేజెస్ ని పంపగలవు.

సమయం మధ్యాన్నం రెండుగంటలు... సుభాష్ మొబైల్ ఫోన్ లో అలారం మోగింది. సుభాష్ నిద్రలోంచి లేచి బద్దకంగా వొళ్ళు విరుచుకుంటూ అలారం ఆపేసి... ఎవరికో ఫోన్ కాల్ చేసి లంచ్ తీసుకొని రమ్మని చెప్పి... బాత్ రూంలోకెళ్ళి వచ్చాడు. లంచ్ వచ్చింది. తినేసి ఇంట్లోంచి బయటకి వచ్చి తాళం వేసి... నడుస్తూ ట్యూషన్ సెంటర్ కి వెళ్లి తాళం తీసుకొని లోపలి వెళ్లి తలుపు వేసుకొని బస్తాలు పెట్టిన రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ సీలింగ్ ఫ్యాన్ మీదున్న కీడా చాలా క్లియర్ ఇమేజెస్ ని పంపసాగింది. సుభాష్ ఒక బస్తా విప్పాడు. లోపల పాకెట్స్ ఉన్నాయి. వాటిని బయటకి తీసి లెక్క పెట్టసాగాడు. ఒక్కో బస్తాలో 50 పాకెట్స్ ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ కనీసం ఒక కిలో బరువు ఉంటుంది. అప్పుడు సమయం మధ్యాన్నం 3:20 అయింది. సుభాష్ మొబైల్ ఫోన్ మోగింది. ఫోన్ లో మాట్లాడి ఆ రూమ్ లోంచి బయటకి వచ్చి ఆ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసాడు. ఒక లేడీ లోపలి వచ్చింది. ఆమె ట్యూషన్స్ చెప్పే టీచర్. ఆమె పేరు వసంత.

వసంత ఇంట్లోకి రాగానే... మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఆమె ని తీసుకొని డ్రగ్స్ ఉంచిన రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు.

సుభాష్ : నిన్న 20 బాగ్స్ తెచ్చాము. నాలుగు రోజుల తరువాత ఇంకో 20 బాగ్స్ తెస్తాను. ఈ లోపల ఈ పాకెట్స్ ని మన డిస్ట్రిబ్యూటర్ కి చేరేలా చూడు.

వసంత : అలాగే... నువ్వు వెళ్ళు. పిల్లలు వచ్చే టైం అయింది.

సుభాష్ ఆ ఇంటిలోంచి బయటకి వచ్చాడు. ఆ ట్యూషన్ సెంటర్ దగ్గర ఉన్న 8 చిడియాలలో ఒకటి సుభాష్ ని ఫాలో అవ్వసాగింది. గాల్లో 50 మీటర్లు ఎత్తులో ఎగురుతోంది. సుభాష్ బస్తి లోంచి బయటకి వచ్చాడు. ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు... సరిగ్గా అదేసమయంలో చిడియా వచ్చి ఆ ఆటో రూఫ్ మీద వాలింది. సుభాష్ ఎక్కడికి వెళ్తే ఆ చిడియా అతడిని ఫాలో అవుతూనే ఉంటుంది. ఆ ఆటో కి ఒక 200 మీటర్స్ దూరం లో కవిత వేరే ఆటో ఎక్కి ఫాలో అవసాగింది. ఆమె దగ్గర కూడా చిడియా కంట్రోలింగ్ డివైస్ ఉంది. చిడియా ని కంట్రోలింగ్ రేంజ్ లోంచి బయటకి పోకుండా చూసుకుంటోంది. సుభాష్ నేరుగా కైలాష్ ఇంటికి వెళ్ళాడు. అవినాష్ ఆమెకి ఫోన్ చేసి చిడియా ని తీసుకొని బస్తి దగ్గరకి రమ్మని చెప్పాడు.

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

సమయం 3:45 నిమిషాలు... ట్యూషన్ సెంటర్ కి 12 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్లలో మగవాళ్ళు 8 మంది. ఆడ పిల్లలు నలుగురు ఉన్నారు. వాళ్లకి 15 ఏళ్ళకి మించి వయస్సు ఉండదు. అందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. వాళ్ళు లోపలికి రాగానే మెయిన్ డోర్ మూసేసి వాళ్ళని డ్రగ్స్ దాచిన రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఆ 12 మంది స్టూడెంట్స్ బ్యాక్ పాక్స్ తెచ్చుకున్నారు. ఆ రూమ్ లోకి రాగానే వాళ్ళు తమ బ్యాక్ ప్యాక్ లోంచి బుక్స్ బయటకి తీసేసి... ఒక్కొక్కళ్ళు 5 డ్రగ్ పాకెట్స్ ని ముందు తమ బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని వాటి మీద తమ స్కూల్ బుక్స్ పెట్టుకొని వాటిని భుజాన వేసుకొని బయలు దేరారు. మగ పిల్లలు సైకిల్స్ మీద బయలుదేరారు. ఆడ పిల్లలు బస్తీ బయట దాకా నడుచుకుంటూ వెళ్లి షేర్ ఆటో ఎక్కారు. ఒక చిడియా ఆ షేర్ ఆటో టాప్ మీద చేరింది. ఆ ఎనిమిది మంది మగ పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. ఇదంతా చూసి హైదరాబాద్ లో అవినాష్... విశ్వామిత్ర... శేఖర్... సుభాష్ ని ఫాలో అవుతున్న శాండీ.... ఢిల్లీ లో Op Center లో రవీంద్ర... మాధవ్... అందరికి మతి పోయింది.

సుభాష్ స్కూల్ పిల్లల్ని MULES (MULES అంటే... సరుకులు మోసే పశువులు... ఉదాహరణకి చాకలి వాళ్ళ దగ్గరుండే గాడిదలు. డ్రగ్స్ ని ఎవరికి తెలియకుండా ఒకచోట నుంచి ఇంకోచోట కు తరలించడానికి వాడే మనుషులని కూడా MULES అని అంటారు.) లాగా వాడుతున్నాడు. వాళ్ళని ఎవరూ సందేహించరు. చూడడానికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళ భుజాన ఉన్న బాగ్ లో బుక్స్ ఉన్నాయనుకుంటారుకాని... వాటి తో ఆ పిల్లలు డ్రగ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని ఎవరికి అనుమానం రాదు. ఆ ఆడపిల్లలు ఎక్కడికివెళ్తున్నారో తెలుసుకునే లోపల చిడియా ట్రాన్స్మిట్టింగ్ రేంజ్ లోంచి బయటకి వెళ్లిపోవడం తో GPS లొకేషన్ ఫీడ్ ఆగిపోయింది. దాని వల్ల పెద్ద ప్రాబ్లెమ్ ఏమి లేదు. చిడియా పనిచేస్తూనే ఉంటుంది. ఏ రూట్ లో ప్రయాణిస్తుందో మొత్తం రికార్డు అవుతుంది. మళ్ళీ ట్రాన్స్మిట్టింగ్ రేంజ్ లోకి రాగానే సిగ్నల్స్ అంది... కంట్రోల్ లోకి వస్తుంది.

సమయం సాయంత్రం 6 గంటలవుతోంది. ఆటో మీదెక్కి వెళ్లిన చిడియా మళ్ళీ కంట్రోలింగ్ రేంజ్ లోకి వచ్చింది.బస్తి బయట కార్ లో కూర్చున్న శాండీ ఆ చిడియా వెంటనే తన కార్ లోకి రప్పిచుకొని దాన్ని తన లాప్ టాప్ కి కనెక్ట్ చేసి ఎక్కడెక్కడికి వెళ్లి వచ్చిందో GPS డేటా ని డౌన్ లోడ్ చేసుకొని మళ్ళీ గాల్లోకి ఎగరేసాడు. ఆ చిడియా వెళ్లి ట్యూషన్ సెంటర్ దగ్గర వాలింది.

సరిగ్గా అదే సమయం లో అంతకు ముందు డ్రగ్స్ తీసుకొని వెళ్లిన మగపిల్లలు సైకిల్స్ మీద వెనక్కి వచ్చారు. ట్యూషన్ సెంటర్ లోకి వెళ్లి ఒక 10 నిమిషాల తరువాత మళ్ళీ బయటకి వచ్చి సైకిల్స్ ఎక్కి వెళ్లిపోయారు. అంటే... రెండో రౌండ్ డెలివరీ జరిగింది. అలా మగ పిల్లలు వెళ్ళగానే నలుగురు ఆడ పిల్లలు కూడా రెండో రౌండ్ డెలివరీ కి కావాల్సిన పాకెట్స్ తీసుకొని వెళ్లారు. ఈ సారి ఆ ఆడపిల్లలు ఎక్కిన షేర్ ఆటో వెనక కవిత ఇంకో ఆటో ఎక్కి ఫాలో అవ్వసాగింది. ఒక చిడియా ఆ షేర్ ఆటో మీదకి చేరింది. కవిత చేతిలో కంట్రోలింగ్ డివైస్ ఉండడం వల్ల ఈ సారి చిడియా అవుట్ అఫ్ రేంజ్ వెళ్లే ప్రమాదం లేదు. షేర్ ఆటో దాదాపు ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణం చేసాక ఒక చిన్నసైజ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకి వెళ్లి ఒక మిల్ ముందు ఆగింది. ఆ మిల్ పేరు కైలాష్ లంబార్ మిల్స్... ఆ ఆడ పిల్లలు ఆటో దిగి మిల్ లోపలికి వెళ్లి ఒక 10 నిమిషాల తరువాత వెనక్కి వచ్చి ఆ షేర్ ఆటో ఎక్కకుండా మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ వెళ్లి సిటీ బస్సు ఎక్కారు...

ఆ ఆడ పిల్లలు వెళ్లిన ఒక 10 నిమిషాలకి ఎనిమిది మంది మగపిల్లలు సైకిల్స్ మీద అదే మిల్ లోపలి వెళ్లి ఒక 10 నిమిషాల తరువాత బయటకి వచ్చి సైకిల్స్ ఎక్కి తలో దిక్కు వెళ్లిపోయారు. ఇదంతా గమనించిన అవినాష్ లెక్కలు వేసాడు. పన్నెడు మంది పిల్లలు... ఒక్కొక్కళ్ళు 5 కిలోల డ్రగ్స్... రెండు ట్రిప్స్... అంటే... రెండు గంటల లోపల 120 కిలోల డ్రగ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎవరికి అనుమానం రాకుండా... పోలీసుల కంట పడకుండా... రవాణా జరిగాయి.


Part - 14 - Drones... Drones... Drones...

అవినాష్ : 120 కిలోల డ్రగ్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇంత ఈజీ గా ట్రాన్స్పోర్ట్ చెయ్యవొచ్చని నాకుఈ రోజే తెలిసింది.

శేఖర్ : NCB చెపుదామా...

అవినాష్ : NCB లో మహేంద్ర మనుషులు లేరని నమ్మకం ఏమిటీ. మనకి అతి కష్టం మీద రెండు అడ్రసులు దొరికాయి. ఒకటి ట్యూషన్ సెంటర్... రెండోది లంబర్ మిల్... వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సప్లై చైన్ తెలుసుకుంటే... కైలాష్ మాత్రమే కాదు... వాళ్ళు ఇంకా ఎవరెవరికి సప్లై చేస్తున్నారో తెలుస్తుంది. ఆ సప్లయర్ ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడో కూడా తెలుసుకోవాలి.

శేఖర్ : దానికి టైం పట్టొచ్చు. ఈ లోపల చాలా డ్రగ్స్ మార్కెట్ లోకి వచ్చేస్తాయి.

అవినాష్ : నిజమే... ఇదే మొదలు కాదు కదా... ఆ డ్రగ్స్ మన అజాగ్రత్త వల్ల మార్కెట్ లోకి రావడం లేదు. ఈ రోజు మనకి ఆ సప్లై చైన్ లో రెండు అడ్రసులు దొరికాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ ఈ లంబర్ మిల్ నుంచి ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోవాలి.

విశ్వామిత్ర : కైలాష్ కి సప్లై చేసేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు ఎక్కడినుంచి ఇంపోర్ట్ చేసుకోరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళే డ్రగ్స్ తయారుచేసి మార్కెట్ లోకి వదులుతున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ ని నడుపుతున్నారు. మీకు "జీరో జీరో జీరో" అంటే తెలుసా?

అవినాష్ : లేదు. ఎప్పుడూ వినలేదు.

శేఖర్ : నో ఐడియా...

విశ్వామిత్ర : కొకెయిన్ క్వాలిటీ... "జీరో జీరో జీరో" అంటే Purest Form of Cocaine... డ్రగ్ కార్టెల్ దీన్ని కోడ్ లాగా వాడతారు. "జీరో జీరో జీరో" క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా పెద్ద సెట్ అప్ అవసరం. మహేంద్ర కొకెయిన్... ఓపియం... భారీ ఎత్తున మార్కెట్ లోకి వదులుతాడని మార్కెట్ లో పెద్ద టాక్ ఉంది. ఇది చిన్న విషయం కాదు. నిన్న రాత్రి మీరే చూసారు... సుభాష్ దాదాపు 1000 కిలోల డ్రగ్స్ తెచ్చాడు. ఇవ్వాళ మన కళ్ళముందే 100 కిలోలకి పైగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి చేరాయి.

అవినాష్ : డిస్ట్రిబ్యూషన్ సెంటర్?

విశ్వామిత్ర : డ్రగ్ బిజినెస్ సిస్టం చాలా కాంప్లెక్స్... అర్ధం చేసుకోవడం చాలా కష్టం. సింపుల్ గా చెప్పాలంటే... 1. ప్రొడ్యూసర్స్... అంటే వీళ్ళు తయారు చేస్తారు... 2. ఏజెంట్స్... వీళ్ళు ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్యలో ఉంటారు. వీళ్ళు చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ బిజినెస్ మొత్తం వీళ్ళ మీద ఆధారపడివుంటుంది. వీళ్ళు మెయిన్ గా బిజినెస్ ఎక్కడెక్కడ ఉందొ కనుక్కొని... వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని... ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి... ప్రోడక్ట్ వాళ్లకి చేరేలా చేస్తారు. డెలివరీ కాగానే బాలన్స్ అమౌంట్ తీసుకొని వాళ్ళ కమిషన్ మినహాహించుకొని ప్రొడ్యూసర్స్ కి ఇవ్వాల్సింది ఇస్తారు. వీళ్ళకి చాలా దేశాల్లో కస్టమర్స్ వుంటారు... వీళ్ళకి షిప్పింగ్ కంపెనీస్... బ్యాంక్స్... చాలా కనెక్షన్స్ ఉంటాయి. మీరు నమ్ముతారో లేదో... ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రేడర్స్ కి ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్ తో లింక్స్ ఉంటాయి. వీళ్ళ డ్రగ్ మనీ ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ద్వారా హెడ్జ్ ఫండ్స్ లో పెడతారు. 3.కొరియర్స్... వీళ్ళు ప్రోడక్ట్ ని ఒకచోటి నించి ఇంకో చోటికి తీసుకొని వెళ్తారు. వీళ్ళని MULES అని కూడా అంటారు. ఆ ట్యూషన్ సెంటర్ నుంచి ప్రోడక్ట్ తీసుకొని వెళ్లిన ఆ స్టూడెంట్స్ ని MULES అని అంటారు. 4. డిస్ట్రిబ్యూటర్స్... వీళ్ళు ప్రోడక్ట్ ని యూజర్స్ దగ్గరికి చేరవేస్తారు. మీకో సంగతి తెలుసా... ఈ ప్రపంచం లో ప్రతి కంపెనీ తయారుచేసే ప్రొడక్ట్స్ కి కస్టమర్స్ ఉంటారు. ఉదాహరణకు... కార్ కంపెనీ కి కస్టమర్స్ ఉంటారు... బ్యాంక్స్ కి కస్టమర్స్ ఉంటారు... ఇలా ప్రతి కంపెనీ కి కస్టమర్స్ ఉన్నారు. కానీ... రెండే రెండు వ్యాపారాల కస్టమర్స్ ని USERS అంటారు... ఆ రెండు వ్యాపారాలు... 1. డ్రగ్స్ బిజినెస్ 2. సాఫ్ట్ వేర్ బిజినెస్...

అవినాష్ : ఇంత డిటైల్డ్ గా ఎలా తెలుసు?

విశ్వామిత్ర : నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. పేరు రాజన్. మహింద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ లో పనిచేసేవాడు. డ్రగ్ ఎడిక్ట్. చనిపోయాడు. అతను చెప్పాడు. మహింద్ర కి డ్రగ్ కార్టెల్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయని... డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తాడని. పెద్ద నెటవర్క్ మేనేజ్ చెయ్యడానికి ఒక కమాండ్ సెంటర్ కూడా ఉందని చెప్పాడు. ఇదంతా చూస్తోంటే నిజంలాగానే ఉంది.

శేఖర్ : కైలాష్ గౌడ్ ఎవరికి తెలియకుండా సొంతగా మేనేజ్ చేస్తున్నాడేమో...

విశ్వామిత్ర : వాడికంత సీన్ లేదు. ప్రోడక్ట్ ని ఎవరికంట పడకుండా ట్రాన్స్పోర్ట్ చెయ్యడానికి... అమ్మడానికి మాత్రమే వాడిని వాడుకొంటారు. ప్రొడక్షన్... డిస్ట్రిబ్యూషన్... బ్యాంకింగ్... ఇదంతా చెయ్యడానికి పెద్ద బుర్ర కావాలి. బాగా హై లెవెల్ లో పొలిటికల్... బ్యూరోక్రాటిక్ కనెక్షన్స్ కావాలి. అది కైలాష్ వల్లకాదు. పెద్ద హ్యాండ్ కావాలి.

అవినాష్ : మనం ఇప్పుడు ఆ లంబర్ మిల్ లో స్టాక్ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చెయ్యాలి.

శాండీ : నేను ఆల్రెడీ ఒక ఈగిల్... 5 కీడాలని అక్కడ పెట్టాను. ట్రాక్ చేస్తున్నాను. చాలా మూమెంట్ కనిపిస్తోంది. కొంత మంది లేడీస్ ఆ మిల్ లోకి వెళ్లడం చూసి వాళ్ళ వెనకే ఒక కీడా ని పంపాను. ఆ మిల్ కి ఒక అండర్ గ్రౌండ్ ఉంది. వాళ్ళు అందులోకి వెళ్లారు. ఇమేజ్ వస్తున్నాయి. చూడండి...

లాప్ టాప్ ని టెలివిషన్ కి సింక్ చేసి ఇమేజెస్ చూపించసాగాడు. అండర్ గ్రౌండ్ లో పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్ లో మధ్యలో పొడుగ్గా ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద ఆ ట్యూషన్ సెంటర్ స్టూడెంట్స్ తెచ్చిన ప్రోడక్ట్ వుంది. ఆ టేబుల్ కి రెండువైపులా ఆడవాళ్లు నుంచుని... ఆ పాకెట్స్ జాగ్రత్తగా ఓపెన్ చేసి అందులోని డ్రగ్ ని చిన్న చిన్న పాకెట్స్ లోకి తూచి పోస్తున్నారు. కొంత మంది ఆడవాళ్లు వాటిని సీల్ చేస్తున్నారు. అక్కడ కైలాష్ గౌడ్ మనుషులు పనిచేస్తున్న ఆడవాళ్ళని చాలా నిశితం గా పరీక్షిస్తున్నారు. ఎటువంటి గడబిడ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళంతా కైలాష్ గౌడ్ కి బాగా నమ్మకమైన వ్యక్తులు. అయినా ఎటువంటి రిస్క్ తీసుకోడు. ఇంకో లేడీ ఆ పాకెట్స్ ని ఒక ప్లాస్టిక్ టబ్ లో వేసుకొని పైకి తీసుకొని వెళ్తోంది. ఆమె వెనకాలే ఒక వ్యక్తి వెళ్ళాడు. వాడి వెనకాలే కీడా వెళ్ళింది. ఆమె గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్ కి మెట్లు ఎక్కి వెళ్ళింది.

అక్కడ రూమ్ లో... ఒక పెద్ద టేబుల్ ఉంది. దాని మీద నల్ల రంగులో మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్ ఉన్నాయి. దాదాపు ఒక వందకి పైగా ఉన్నాయి. ఆ లేడీ తెచ్చిన పాకెట్స్ ని ఒక వ్యక్తి చాలా జాగ్రత్త గా తూచి వెయిట్ నిర్ధారించుకొని వాటిని ఒక మోస్తరు సైజు ప్లాస్టిక్ బాక్స్ లోకి లోడ్ చేస్తున్నాడు. ఆ బాక్స్ నిండా ఆ డ్రగ్ పాకెట్స్ ని నింపి బాక్స్ తూకం వేసి బరువు ఎంతుందో చూసి డీటెయిల్స్ కంప్యూటర్ లో ఎంటర్ చేసి ఒక లేబిల్ ప్రింట్ చేసాడు. ఆ లేబిల్ మీద ఒక QR కోడ్ ఉంది. ఆ లేబిల్ ని ఆ ప్లాస్టిక్ బాక్స్ మీద అంటించి మూసాడు. ప్లాస్టిక్ డబ్బా డోర్ కి ఒక కీ పాడ్ ఉంది. తరువాత ఆ ప్లాస్టిక్ డబ్బాని ఒక డ్రోన్ కి అమర్చి ఆ డ్రోన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఎదో డేటా లోడ్ చేసి దాన్ని తీసుకొని వేరే టేబుల్ మీద పెట్టాడు.

ఇదే ప్రాసెస్ చాలా సేపు జరిగింది. ఆ లేడీ కిందకి వెళ్లి ప్లాస్టిక్ టబ్ లో డ్రగ్స్ పాకెట్స్ నింపి ఆ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ లోకి తేవడం... అక్కడ ఉన్న వ్యక్తి వాటిని ప్లాస్టిక్ బాక్సస్ లోకి లోడ్ చేసి డ్రోన్స్ కి అమర్చడం... దాదాపు 6 గంటల సేపు ఆగకుండా ప్రాసెస్ నడిచింది. మధ్య రాత్రి తరువాత లేడీస్ అందరూ వెళ్లిపోయారు. ఆ లంబర్ మిల్ లో ఇప్పుడు ఒక 10 మంది మగాళ్లు మాత్రమే మిగిలారు.

సమయం రాత్రి 2 గంటలు... ఆ లంబర్ మిల్ లో ఉన్న ఆ పది మంది నెమ్మదిగా ఆ డ్రోన్స్ ని మేడ మీదకి తీసుకొని వచ్చారు. వాటిని చాలా జాగ్రత్తగా నేల మీద పెట్టారు. డ్రోన్స్ మధ్య స్పేస్ బాగా ఉండేలా చూసుకున్నారు. ఆ మేడంత డ్రోన్స్ తో నిండి పోయింది. వాటిని తీసుకొని వచ్చిన వాళ్లంతా కిందకి వెళ్లిపోయారు. చివరిగా కంప్యూటర్ ఆపరేటర్ మేడ మీదకి వెళ్ళాడు. ఒక్కో డ్రోన్ ని జాగ్రత్త చెక్ చేసి వాటిని ఆన్ చేసాడు. ఇదంతా పూర్తి అయ్యేటప్పటికి రాత్రి 3:00 అయ్యింది. ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఆ డ్రోన్స్ కి దూరంగా నుంచొని తన మొబైల్ ఫోన్ లో ఒక కాల్ చేసాడు. మాట్లాడడం పూర్తి అయ్యాక మేడ మీద నుంచి రెండు మెట్లు కిందకి దిగి అక్కడే నుంచున్నాడు...

ఇదంతా చూస్తున్న అవినాష్ కి ఫోన్ కాల్ వచ్చింది. Op Center నుంచి రవీంద్ర..... "ఫోన్ ని స్పీకర్ మీద పెట్టు.... అందరూ జాగ్రత్త గా వినండి.... ఒక ఈగిల్ ని రెడీ గా ఉంచండి. మీరు కార్ లో ఆ ఈగిల్ అవుట్ అఫ్ రేంజ్ కాకుండా ఫాలో అవ్వండి..."

సరిగ్గా అదే సమయం లో లంబర్ మిల్ మేడ మీద ఒక అద్భుతం జరిగింది. ఒకటి తరువాత ఒకటిగా... ఆ డ్రోన్స్ స్టార్ట్ అయ్యాయి... వాటి రోటర్స్ వేగంగా తిరగడం మొదలెట్టాయి. క్రమంగా ఆ రోటర్స్ ఫుల్ స్పీడ్ అందుకున్నాయి... అన్ని డ్రోన్స్ ఒకేసారి పనిచేస్తున్న సౌండ్ ఏమాత్రం చెయ్యడం లేదు. చాలా సైలెంట్ గా పనిచేస్తున్నాయి. నెమ్మదిగా డ్రోన్స్ గాల్లోకి లేచాయి... వర్టికల్ గా టేక్ ఆఫ్ అయ్యి దాదాపు 150 మీటర్లు గాల్లోకి లేచాయి. నెమ్మదిగా స్పీడ్ పెంచుకొని ముందుకు కదలసాగాయి. వాటికి దాదాపు 200 మీటర్స్ దూరం లో ఈగిల్ ప్రయాణించసాగింది. రోడ్ మీద శాండీ కార్ లో ఈగిల్ ని ఫాలో అవుతున్నాడు...

Op Center లో స్టాఫ్ మొత్తం గోడ మీదున్న బిగ్ స్క్రీన్ మీద స్STAR WARS మూవీ చూసినంత శ్రద్ధగా చూడసాగారు. డ్రోన్స్ హైదరాబాద్ సిటీ వైపు దూసుకొని వెళ్తున్నాయి. సడన్ గా ఆ డ్రోన్స్ అన్ని తలో దిక్కుకు మళ్ళాయి. ఈగిల్ ని కంట్రోల్ చేస్తున్న శాండీ కి ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఇది గమనించి అవినాష్ ఫోన్ లో "జస్ట్ ఫాలో వన్ అఫ్ ది డ్రోన్స్..." అని అన్నాడు. వెంటనే శాండీ తన స్క్రీన్ లో కనిపిస్తున్న ఒక డ్రోన్ ని లాక్ చేసాడు. ఆ డ్రోన్ వెనకాలే ఈగిల్ ప్రయాణించసాగింది. ఆ డ్రోన్ హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో ఒక బస్తీ లోకి ప్రవేశించింది. ఈగిల్ కూడా దానివెనకాలే వుంది. బస్తీ అంతా చీకటిగా ఉంది. స్ట్రీట్ లైట్స్ లేవు. ఆ డ్రోన్ సందులు... గొందులు... తిరుగుతూ ఒక ఇంటిముందు 6 అడుగుల ఎత్తులో ఆగింది. ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఒక ఆడది బయటకి వచ్చింది. ఆ డ్రోన్ కి వేళ్ళాడుతున్న బాక్స్ డోర్ మీదున్న కీ పాడ్ మీద ఎదో 6 అంకెల కోడ్ వేసింది. ఆ బాక్స్ డోర్ తెరుచుకుంది. ఆమె తొందరగా ఆ బాక్స్ లో ఉన్న ప్రోడక్ట్ ని బయటకి తీసేసి... బాక్స్ లోపల ఏమి లేదని నిర్ధారించుకొని డోర్ వేసేసింది. అంతే.... ఆ డ్రోన్ వెంటనే గాల్లోకి లేచింది. వచ్చిన దారినే వేగంగా ఎగురుకుంటూ లంబర్ మిల్ చేరుకుంది. ఆ మిల్ మేడ మీద కంప్యూటర్ ఆపరేటర్ రెడీ గా ఉన్నాడు. వచ్చిన డ్రోన్ గాల్లోనే పట్టుకొని స్విచ్ ఆఫ్ చేసి నేల మీద భద్రం గా పెట్టాడు. దాదాపు ఒక 40 నిమిషాల పాటు డ్రోన్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని స్విచ్ అఫ్ చేసేసి వసరుసగా పేర్చాడు. ఫోన్ చేసి అన్ని వెనక్కి వచ్చాయని రిపోర్ట్ చేసి కింద కూర్చొని ఉన్న మనుషులని పైకి పిలిచాడు. వాళ్ళు మేడ మీదకి వచ్చి ఆ డ్రోన్స్ ని చాలా జాగ్రత్త గా పట్టుకొని కిందకి తీసుకొని వెళ్లి భద్రం గా గదిలో పెట్టారు. కంప్యూటర్ ఆపరేటర్ కిందకి వచ్చి ఇంకోసారి ఆ డ్రోన్స్ అన్ని ఇంకోసారి జాగ్రత్తగా లెక్క పెట్టుకొని ఆ రూమ్ కి తాళం వేసి మోటార్ సైకిల్ ఎక్కి మిల్ లోంచి వెళ్ళిపోయాడు. వాడి వెనకాలే ఈగిల్ కూడా ప్రయాణించింది. కంప్యూటర్ ఆపరేటర్ నేరుగా గాంధీ నగర్ లో ఒక ఇంటికి చేరాడు. ఈగిల్ ఆ ఇంటి నెంబర్ ని ఫోటో తీసి వెనక్కి వచ్చేసింది.

Op Center లో స్టాఫ్... హైదరాబాద్ లో అవినాష్, విశ్వామిత్ర, శేఖర్... అందరూ నిశ్శబ్దం గా ఉండిపోయారు. అందరికన్నా ముందు మాట్లాడింది... విశ్వామిత్ర.

విశ్వామిత్ర : ఆ డ్రోన్స్ ఇజ్రాయెల్ లో ఒక కంపెనీ తయారుచేసింది. దాన్ని వీళ్ళు కొంచం modify చేసి వాడుతున్నారు.

అవినాష్ : ఆ బాక్స్ కిందపడితే ప్రమాదం కదా...

విశ్వామిత్ర : కాదు... అది టైటానియం తో తయారుచేసిన బాక్స్. కింద పడితే పగలదు. ఆ బాక్స్ ని ఎవరూ ఓపెన్ చెయ్యలేరు. బాక్స్ డోర్ మీద ఒక కీ పాడ్ ఉంది. కోడ్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. చాలా సేఫ్...

రవీంద్ర : ఎక్కడో అమెరికాలో ఇలా డ్రోన్స్ వాడుతున్నారని తెలుసు.

విశ్వామిత్ర : కాలిఫోర్నియా లో అమెజాన్ వాళ్ళు ఇలా ఎక్సపెరిమెంట్ చేశారు. డ్రోన్ ని వాడి చిన్న చిన్న వస్తువులని డెలివరీ చేశారు. ఇంకా డెవలప్మెంట్ స్టేజెస్ లోనే ఉంది. ఒక సారి ముంబై లో ఒక పిజ్జా షాప్ వాడు ఇలాగే డ్రోన్ వాడి ఒక పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ లో పిజ్జా డెలివరీ చేసాడు. ముంబై పోలీసులు దాన్ని పసికట్టి వాడిని వార్నింగ్ ఇచ్చారు. డ్రోన్ సిగ్నల్స్ పోలీస్ ఫ్రీక్వెన్సీ తో క్లాష్ అయ్యాయి. పైగా ఆలా డెలివరీ చెయ్యాలంటే లైసెన్స్... పర్మిషన్... కావాలి. అదేమీ లేకుండా వాడడం కుదరదు.

రవీంద్ర : ఢిల్లీలో కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డ్రోన్ ఎగరవెయ్యడానికి పర్మిషన్ లేదు. రీసెంట్ గా చాలా మంది సివిలియన్స్ డ్రోన్ కి కెమెరా అమర్చి సెన్సిటివ్ ఏరియాలో ఫోటోగ్రఫీ చేస్తూంటే మేము పట్టుకొని వార్నింగ్ ఇచ్చాము. రీసెంట్ గా నేను టీవీ లో ఒక యాడ్ చూసాను. అందులో డ్రోన్ సాఫ్ట్ డ్రింక్స్ ని డెలివరీ చెయ్యడం.

విశ్వామిత్ర : ఇది మాడిఫైడ్ టెక్నాలజీ. ఈ డ్రోన్స్ అన్నింటిని వీళ్ళు ప్రొటోటైప్ టెక్నాలజీ వాడారు. ఇది మార్కెట్ లో లేదు. చాలా అడ్వాన్సుడ్. ఈ లెవెల్లో మోడిఫై చెయ్యాలంటే... ఎవరో ఒక పెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళు హెల్ప్ చేసి ఉండాలి. ఇవి సెల్ఫ్ డ్రివెన్ వెహికల్స్ కావు. ఎవరో వీటిని రిమోట్ గా ఆపరేట్ చేస్తున్నారు. మీరు గమనించారా... ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఈ డ్రోన్స్ ఒక్కోదాన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి ఏదో డేటా లోడ్ చేసాడు? అది డెలివరీ లొకేషన్ కోఆర్డినెట్స్. అందుకే అవి అంత ప్రెసిషన్ తో డెలివరీ చేసి వెనక్కి రాగలిగాయి.

మాధవ్ : మీరు అన్నట్లు మహేంద్ర స్టాఫ్ ఈ డ్రోన్స్ ని కమాండ్ సెంటర్ లోంచి చేస్తున్నారా?

విశ్వామిత్ర : ఖచ్చితంగా... వాళ్ళు లొకేషన్ కోఆర్డినెట్స్ ఫీడ్ చేసి సిస్టం ద్వారా అది సరిగ్గా డెలివరీ చేస్తోందో లేదో... మానిటర్ చేస్తున్నారు. ఇంకో విషయం... డెలివరీ చేసాక ఆ బాక్స్ డోర్ మూసినవెంటనే రిటర్న్ జర్నీ ప్రోగ్రాం ఆక్టివేట్ అయ్యింది. వెరీ క్లవర్...

మాధవ్ : ఆ కమాండ్ సెంటర్ ని కనుక్కోవడం ఎలా?

విశ్వామిత్ర : ఆ విషయం నాకు వొదిలెయ్యండి. నేను ఒక ప్రోగ్రాం వ్రాస్తాను. నెక్స్ట్ టైం ఆ డ్రోన్స్ గాల్లోకి లేవగానే అవి రిసీవ్ చేసుకుంటున్న సిగ్నల్స్ ని నేను టాప్ చేస్తాను. దాంతో... ముందుగానే ఆ డ్రోన్ ఎక్కడ డెలివరీ చెయ్యబోతోందో... మనకి తెలుస్తుంది. వాటికి వచ్చే సిగ్నల్స్ తో ఆ కమాండ్ సెంటర్ లొకేషన్ కూడా కనిపెడతాను.

మాధవ్ : మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు... ఆ సుభాష్ మన సర్వైలన్సు నుంచి తప్పించుకోకూడదు. ఇప్పటినుంచి 24 * 7 వాడి మూమెంట్స్ ని ట్రాక్ చెయ్యండి. ప్రతి రోజూ రిపోర్ట్ కావాలి. వాడు ఎక్కడికెళ్తున్నాడు... ఎవరిని కలుస్తున్నాడు... ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు... వాడికి ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉన్నాయి.... వాటి కాల్ హిస్టరీ వెంటనే Op Center కి పంపండి...

అప్పటిదాకా వాళ్ళు మాట్లాడుకున్నది సైలెంట్ గా వింటున్న శాండీ మనసులో 'హైదరాబాద్ ని సైబరాబాద్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్ధమయ్యింది' అని అనుకున్నాడు.


Part - 15 - MACHATE... TELCHAT ... CHAPORI

అవినాష్(శాండీ తో): సుభాష్ ఎక్కడున్నాడో తెలుసా?

శాండీ : తెలుసు. వాడు కూకట్ పల్లి బస్తీలో ఉన్నాడు. ఇంట్లో పడుకొని ఉన్నాడు.

అవినాష్ : వాడి మీద కనేసి ఉంచు. వాడి వెంట కీడా... చిడియా... ఈగిల్... అన్ని వాడిని కనిపెట్టుకొని ఉండేలా చూడండి. వాడు కార్ ఎక్కితే వాడి వెంట మనవాళ్ళు ఉండాలి. బాగా నమ్మకమైన వాళ్ళు కావాలి.

శేఖర్ : ఉన్నారు. ఎంత మంది కావాలి?

అవినాష్ : కనీసం అయిదు మంది కావాలి. వాళ్ళు ఒక కార్ లో సుభాష్ ఎక్కడికెళ్లినా మన సర్వైలన్సు లోంచి తప్పించుకోకుండా చూడాలి.

శాండీ : మన ఈగిల్ కంట్రోలింగ్ రేంజ్ 3 కిలోమీటర్స్. సిటీ లిమిట్స్ లో ఈ రేంజ్ బానే పనిచేస్తుంది. టార్గెట్ వెనక రెండు లేదా మూడు కిలోమీటర్లు దూరం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. చుట్టూ చాలా వెహికల్స్ ఉంటాయి. ఈజీ గా ఆ వెహికల్స్ తో కలిసిపోయి టార్గెట్ ని చేజ్ చెయ్యవచ్చు. సుభాష్ హై వే లో వెళితే మాత్రం ఒక్కోసారి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ చాలదు. కనీసం 5 కిలోమీటర్లు దూరం మెయింటైన్ చెయ్యాలి. మనకు సుభాష్ కార్ మీద ఒక చిడియా ఉండాలి. ఆ చిడియా పంపే సిగ్నల్స్ ని రెండు కిలోమీటర్స్ దూరం లో ఎగురుతున్న ఒక ఈగిల్ రిసీవ్ చేసుకుని వెనకాలే వస్తున్న రెండో ఈగిల్ కి ట్రాన్స్మిట్ చేసేలా రీ ప్రోగ్రాం చేస్తాను. ఆ రెండో ఈగిల్ నుంచి సిగ్నల్స్ డైరెక్ట్ గా కార్ లో ఉన్న మన టీం రిసీవ్ చేసుకునేలాగా చేద్దాం. ఇలా చేస్తే మనం సుభాష్ కార్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా చాలా క్లియర్ గా ఇమేజెస్... డేటా... కలెక్ట్ చేసుకోవచ్చు.

అవినాష్ : సుభాష్ కార్ లో కూర్చొని చేసే ఫోన్ కాల్స్ మనం వినే ఏర్పాటు చేయగలవా?

విశ్వామిత్ర : దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. సుభాష్ ఫోన్ నెంబర్ మనకి తెలిస్తే... దానికి ఒక ఫోన్ కాల్ చేసి టాప్ చెయ్యగలను. నా దగ్గర ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది. 30 సెకండ్స్ ఫోన్ కాల్ తో వాడి మొబైల్ ఫోన్ లో నేను ఒక స్పై అప్ ని ఇంస్టాల్ చెయ్యగలను. దాంతో వాడి ఫోన్ మన సొంతం అవుతుంది. వాడు కాల్ చేసినా... మెసేజ్ పంపినా... మనకి తెలుస్తుంది. అంతే కాదు వాడి కాంటాక్ట్ లిస్ట్... కాల్ లిస్ట్... ఇప్పటిదాకా ఆ ఫోన్ నుంచి పంపిన మెసేజెస్... అవి ప్రస్తతం ఆ ఫోన్ ఉన్నా... లేక డిలీట్ అయ్యినా... మనం తెలుసుకోవచ్చు. వాడి జీవితం మొత్తం మన చేతుల్లోకి వస్తుంది. ఆ ట్యూషన్ సెంటర్ బోర్డు మీద ఒక ఫోన్ నెంబర్ ఉంది. అది ఆ టీచర్ నెంబర్ అని అందరికి తెలుసు. ఆమె దగ్గర అన్ని కిలోల ప్రోడక్ట్ పెట్టాడంటే... ఆమె అంటే సుభాష్ కి బాగా నమ్మకం ఉంది. నా లెక్క ప్రకారం... ఆమె కి ఇంకో ఫోన్ నెంబర్ వుండే ఉంటుంది. ఆమె అందరికి తెలిసిన ఫోన్ నెంబర్ నుంచి సుభాష్ ని కాంటాక్ట్ చేస్తుందని అనుకోను. రెండో ఫోన్ నెంబర్ మనం తెల్సుకోవాలి.

అవినాష్ : వసంత టీచర్ కి రెండో నెంబర్ ఉంటే దాన్ని నేను కనుక్కుంటాను...

అవినాష్ వెంటనే కవిత ని పిలిచి ఏమి చెయ్యాలో చాలా వివరంగా చెప్పాడు... అప్పటికే తెల్లవారింది... కవిత వెంటనే కూకట్ పల్లి బస్తీ కి వెళ్ళింది. అప్పటికే ఆ బస్తి లో జన సంచారం మొదలయ్యింది. కవిత బస్తీ చేరే లోపల శాండీ ట్యూషన్ సెంటర్ బోర్డు మీదున్న వసంత ఫోన్ నెంబర్ ని అవుట్ సర్వీస్ చేసేసాడు. కవిత నేరుగా ట్యూషన్ సెంటర్ కి ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. ఒకామె తలుపు తీసింది...

కవిత : నా పేరు కవిత. నేను చందా నగర్ నుంచి వస్తున్నాను. ఈ ట్యూషన్ సెంటర్ టీచర్ ఫోన్ నెంబర్ మీకు తెలుసా?

ఎదురింటి ఆమె : ఆ బోర్డ్ మీద నెంబర్ ఉంది.

కవిత : నేను ఆ నెంబర్ కి కాల్ చేసాను. సర్వీస్ లో లేదు అని మెసేజ్ వచ్చింది. ఆమెకి వేరే ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా?

ఎదురింటి ఆమె : మాకు తెలియదండి... ప్రతి రోజూ సాయంత్రం ఆమె 4 నుంచి 7 దాకా ఇక్కడే ఉంటుంది. అప్పడు వచ్చి ఆమె ని కలవండి.

కవిత : నేను సికింద్రాబాద్ లో పని చేస్తున్నాను. అక్కడి నుండి నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది. మా అమ్మాయి ని ట్యూషన్ లో చేర్చడానికి ఆమెతో మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఇక్కడ ఉండదా?

ఎదురింటి ఆవిడ : లేదండి... వేరే చోట ఉంటుంది. ఇక్కడ కి రోజూ ట్యూషన్స్ చెప్పడానికి వస్తుంది. మీరు పక్క వీధిలో సుబ్బరావు గారి అమ్మాయి తో మాట్లాడండి. ఆ పిల్ల కి టీచర్ బాగా తెలుసు. ట్యూషన్ సెంటర్ తాళాలు కూడా ఆ అమ్మాయి దగ్గర ఉంటాయి.

కవిత : సుబ్బారావ్ గారి అమ్మాయి పేరు?

ఎదురింటి ఆవిడ : పావని. 10 తరగతి ట్యూషన్ కి వస్తుంది.

కవిత పక్క వీధి లో సుబ్బారావు ఇంటికి మెయిన్ డోర్ తట్టింది. తలుపు తీసుకొని సుబ్బారావు బయటికి వచ్చాడు.

కవిత : పావని ఉందాండి?

సుబ్బారావు : మీరెవరండి?

కవిత : నా పేరు కవిత. నేను చందా నగర్ లో ఉంటాను. ట్యూషన్ సెంటర్ వసంత గారి ఫోన్ నెంబర్ కావాలి. మీ అమ్మాయి పావని కి తెలుసని ట్యూషన్ సెంటర్ ఎదురింటి ఆంటీ చెప్పారు.

సుబ్బారావు : అక్కడ బోర్డ్ మీద ఫోన్ నెంబర్ వుంది కదా...

కవిత : ఉంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తే అవుట్ అఫ్ సర్వీస్ అని మెసేజ్ వస్తోంది. వసంత గారికి వేరే నెంబర్ ఉందని ఆంటీ చెప్పారు. మీ పావని దగ్గర దొరుకుతుందని తెలిసింది. మీ అమ్మాయి ఉందా?

సుబ్బారావు తన కూతురిని పిలిచాడు. పావని బయటకి వచ్చింది.

కవిత : వసంత గారి ఫోన్ నెంబర్ కావాలి.

పావని(అనుమానం గా చూస్తూ): టీచర్ గారి ఫోన్ నెంబర్ ట్యూషన్ సెంటర్ బోర్డు మీద వుంది.

కవిత : ఉంది. కాల్ చేస్తే అవుట్ అఫ్ సర్వీస్ అని వస్తోంది... టీచర్ గారికి వేరే ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే ఇస్తావా? మా అమ్మాయిని ట్యూషన్ లో చేర్చాలి.

పావని : ఆమె పర్సనల్ ఫోన్ ఫోన్ నెంబర్ నేను ఎవ్వరికి ఇవ్వను. మీరు మీ ఫోన్ నెంబర్ నాకివ్వండి... నేను టీచర్ కి ఇచ్చి మీకు ఫోన్ చెయ్యమని చెప్తాను.

కవిత తన ఫోన్ నెంబర్ పావని కి ఇచ్చి "వీలైతే వెంటనే ఫోన్ చెయ్యమని చెప్పు... ఆఫీస్ లోపల ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవు...

పావని : ఒక పది నిమిషాల్లో టీచర్ గారు మీకు ఫోన్ చేస్తుంది...

పావని వెంటనే వసంత కి ఫోన్ చేసి కవిత గురించి చెప్పి ఆమె కి కవిత ఫోన్ నెంబర్ ఇచ్చింది. వసంత తన ట్యూషన్ సెంటర్ నెంబర్ తో కవిత కి ఫోన్ చేసింది. వసంత ఫోన్ లో కనెక్షన్ లేదు... కాల్ వెళ్లడం లేదు. హ్యాండ్ సెట్ ని స్విచ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు ఆగి స్విచ్ ఆన్ చేసి మళ్ళీ కవిత నెంబర్ ని ట్రై చేసింది. కాల్ వెళ్లడం లేదు. సిగ్నల్ కూడా లేదు... వసంత కి అర్ధం కాలేదు. తన రెండో ఫోన్ తో కవిత కి ఫోన్ చేసింది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు ఆ ఒక్క ఫోన్ కాల్ చాలా మంది చావుకు కారణం అయ్యింది. చాలా మంది జైలు కి వెళ్లారు.

వసంత : మీ పేరు కవిత?

కవిత : అవునండి... మీరు?

వసంత : నా పేరు వసంత. ట్యూషన్ సెంటర్ టీచర్... పావని మీ ఫోన్ నెంబర్ ఇచ్చింది.

కవిత : అవునండి... నేను మీ ట్యూషన్ సెంటర్ బోర్డు మీదున్న నెంబర్ కి కాల్ చేసాను... అవుట్ అఫ్ ఆర్డర్ మెసేజ్ వచ్చింది.

వసంత : చెప్పండి...

కవిత : మా అమ్మయి 9 చదువుతోంది. ట్యూషన్ కి పంపాలి.

వసంత : నేను నెలకి 500 తీసుకుంటాను. మాథ్స్... సైన్స్ మాత్రమే ట్యూషన్ చెప్తాను... మీకు ఇష్టముంటే సాయంత్రం మీ అమ్మాయిని పంపండి... మీ పాప పేరు?

కవిత : అంజలి... సాయంత్రం 4 కి పంపిస్తాను...

కవిత వెంటనే ఫోన్ చేసి వసంత ఫోన్ నెంబర్ అవినాష్ కి ఇచ్చింది. అవినాష్ ఆ నెంబర్ ని శాండీ కి ఇచ్చి వెరిఫై చెయ్యమన్నాడు. శాండీ ఆ ఫోన్ నెంబర్ ని అన్ని రకాల గవర్నమెంట్ డేటాబేస్ లు చెక్ చేసాడు. ముందుగా ఆధార్ డేటా బేస్ లో ఆ నెంబర్ దొరికింది. వసంత ఆధార్ నెంబర్ దొరికింది. నెక్స్ట్ ఓటర్ id దొరికింది... ఆ తరువాత HDFC బ్యాంకు లో ఒక సేవింగ్స్ అకౌంట్ నెంబర్ దొరికింది. శాండీ HDFC బ్యాంకు డేటా బేస్ యాక్సిస్ చేసి ఆ అకౌంట్ ని చెక్ చేసాడు... అందులో 17,000 బాలన్స్ ఉంది. మొత్తం అకౌంట్ చెక్ చేసాడు. చాలా పాత ఆకౌంట్. పెద్ద అమౌంట్ ట్రాన్సక్షన్స్ ఏమి దొరకలేదు. ఇది గమనించిన అవినాష్ ఎదో అనుమానం వచ్చింది... "వసంత... సుభాష్ ఈ ఇద్దరి మధ్య సంభంధం ఏమిటీ? వసంత ట్యూషన్ సెంటర్ ఫ్రంట్ ఫర్ డ్రగ్ స్టోరేజ్... ఆమె ఏ ప్రతిఫలం ఆశించకుండా సుభాష్ కి హెల్ప్ చేస్తోందా? లేదా ఆమెకి వేరే బ్యాంకు అకౌంట్ ఉందా?? శాండీ... ఆ ఆధార్ నెంబర్ ని అన్ని బ్యాంకు డేటా బేస్ లు చెక్ చెయ్యి..." అని అన్నాడు. శాండీ ఆ ఆధార్ నెంబర్ ని అన్ని బ్యాంకు డేటా బేసుల్లో క్రాస్ చెక్ చేసాడు... అంతే... 4 వేరే బ్యాంకుల్లో అకౌంట్స్ బయట పడ్డాయి... వాటిని చెక్ చేస్తే కళ్ళు తిరిగే అమౌంట్స్ దొరికాయి... ఆ అకౌంట్స్ అన్ని వసంత రెండో ఫోన్ నెంబర్ కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ నాలుగు బ్యాంకు అకౌంట్స్ లో ఒకటి CITI Bank అకౌంట్...

విశ్వామిత్ర వెంటనే వసంత రెండో ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసాడు...

వసంత : హలో...

విశ్వామిత్ర : My name is Kenneth... i am calling from CITI bank Investment Banking Division in Mumbai. This is service call regarding your account with us. Is this good time to connect with you?

వసంత : Yes. Tell me what can I do for you?

విశ్వామిత్ర : We have noticed hugh amout of deposits in your account. Would you be interested in investing in emerging markets fund?

వసంత : No. I am not interested. Don't call me again.

విశ్వామిత్ర : Apologies.... We will keep your account in DO NOT CALL LIST.

విశ్వామిత్ర ఫోన్ పెట్టేసాడు. జస్ట్ ఆ ఫోన్ కాల్ పూర్తి అయ్యేలోపల వసంత మొబైల్ ఫోన్ లో ఒక స్పై అప్ ని ఇంస్టాల్ చేసాడు. ఆ అప్ ద్వారా వసంత కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసాడు. సుభాష్ ఫోన్ నెంబర్ దొరికింది. ఆ నెంబర్ ని వసంత ఫోన్ లో ఇంస్టాల్ చేసిన అప్ లో ఆడ్ చేసాడు. సుభాష్ ఆమెతో చాలా రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉన్నాడు. ఇకనుండి వసంత ఆ ఫోన్ కి వచ్చే ఇన్ కమింగ్... అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని Op Center కి చేరుతుంది. విశ్వామిత్ర ఇప్పుడు వసంత ఎప్పుడెప్పుడు సుభాష్ కి కాల్ చేస్తుందో అని ఎదురు చూడసాగాడు. వసంత ఒక్క ఫోన్ కాల్ సుభాష్ చేస్తే చాలు... వసంత ఫోన్ లో ఉన్న స్పై అప్ ఆటోమేటిక్ గా సుభాష్ ఫోన్ లో కూడా ఇంస్టాల్ అవుతుంది.

విశ్వామిత్ర ఎక్కువసేపు వెయిట్ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఒక అరగంట తరువాత సుభాష్ కి కాల్ చేసింది... వెంటనే శాండీ లాప్ టాప్ లో రింగ్ వినిపించింది.

వసంత : ఇవ్వాళ వెళ్తున్నావా...

సుభాష్ : వెళ్తున్నాను. రేపు రాత్రి వచ్చేముందు నీకు ఫోన్ చేస్తాను. సరుకు మొత్తం నెమ్మదిగా మిల్ కి పంపించు.

వసంత : చాలా సరుకు ఉంది. రోజుకి రెండు ట్రిప్స్ చాలవు.

సుభాష్ : ఇంకో రెండు ట్రిప్స్ పంపించు. అంత కు మించి ఒద్దు.

వసంత : అలాగే. వచ్చేముందు ఫోన్ చెయ్యి.

సుభాష్ మొబైల్ హ్యాండ్ సెట్ లో కూడా స్పై అప్ ఇంస్టాల్ అయింది. శాండీ వెంటనే సుభాష్ కాల్ లిస్ట్ ఓపెన్ చేసాడు. చాలా కాల్స్ చేసాడు. కాంటాక్ట్ లిస్ట్ లో దాదాపు 800 ఫోన్ నంబర్స్ దొరికాయి. వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసాడు. చాలా మందితో చాట్ చేస్తున్నాడు. వాటిలో ఇంపార్టెంట్ కాంటాక్ట్ ఎవరో ఎలా తెలుస్తుంది?

విశ్వామిత్ర : గో టు సెట్టింగ్స్ ఇన్ వాట్సాప్... ఓపెన్ స్టోరేజ్ అండ్ డేటా... థెన్ ఓపెన్ మేనేజ్ స్టోరేజ్... ఇక్కడ సుభాష్ ఎవరెవరితో ఎక్కువ గా చాట్ చేస్తున్నాడో తెలుస్తుంది. అదిగో... ఆ ఫస్ట్ నేమ్... అప్పలకొండ... వాడి తో చాట్ అకౌంట్ దాదాపు 400 MB ముందు దాన్ని చెక్ చెయ్యి.

అప్పలకొండ అకౌంట్ లో యేవో డేట్స్... కోడ్స్... నంబర్స్ కనిపించాయి. రెండో పెద్ద అకౌంట్ డిసౌజా... మూడో అకౌంట్ నాయక్... ఇలా చాలా అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి అకౌంట్ లో ఏవో కోడ్స్... నంబర్స్... డేట్స్...

Op Center లో వాళ్ళు సుభాష్ కాంటాక్ట్ లిస్ట్ లోని ప్రతి ఒక్క ఫోన్ నెంబర్ ని సర్వైలన్సు పెట్టారు. వాట్సాప్ అకౌంట్ లోని మెసేజెస్ మొత్తం డౌన్ లోడ్ చేసి ఒక స్పెషల్ ప్రోగ్రాం రన్ చేశారు. మెసేజెస్ లో ఏదైనా ట్రెండ్ / పాటర్న్ దొరుకుతుందేమో వెతకసాగారు. చాలా డేటా దొరికింది. సర్వర్స్ రకరకాలుగా అవుట్ పుట్ ఇవ్వసాగాయి... డేటా మోడల్స్... డేటా మైనింగ్... అనలిటికల్ ఇన్ఫర్మేషన్... స్టాటిస్టికల్ ఎనాలిసిస్... సుభాష్ ఫోన్ కాంటాక్ట్స్ కి సంభందించిన వాట్సాప్ డేటా కూడా సంపాదించారు. అన్నింటిని క్రాస్ చెక్ చెయ్యసాగారు. నెమ్మదిగా ఒక ట్రెండ్ కనిపిచింది.

కోడ్స్.... MACHATE... TELCHAT ... CHAPORI.... ఈ మూడు కోడ్స్ ఎక్కువగా కనిపించాయి... నంబర్స్ చాలా ఈజీ గా అర్ధమయ్యాయి... 100, 200, 500, 1000 ఎక్కువగా కనిపించాయి. అవి డ్రగ్స్ క్వాంటిటీ అని అర్ధమయింది. డేట్స్... డేట్ అఫ్ డెలివరీ ... ఇప్పుడు జరగబోయే ట్రాన్సాక్షన్స్ గురించి తెలియాలి...

విశ్వామిత్ర చాలా బిజీ గా ఎదో కొత్త ప్రోగ్రాం వ్రాస్తున్నాడు. రాత్రి మిల్ లో డ్రోన్స్ పైకి లేచే లోపల అంత రెడీ అవ్వాలి. డ్రోన్స్ గాల్లో ఉండగానే ఆ కమాండ్ సెంటర్ ఖచ్చితమైన లొకేషన్ కనిపెట్టాలని చాలా పట్టుదలతో ఉన్నాడు.

శేఖర్ తనతో పాటు ఒక ఐదుగురు పోలీస్ స్టాఫ్ ని తీసుకొని వచ్చాడు. SI శ్రీధర్, ASI రాఘవ, కానిస్టేబుల్స్ గోపి, వాసు, రాము... డిపార్టుమెంటు లో నమ్మకమైన వ్యక్తులు. శేఖర్ అంటే మంచి అభిమానం ఉన్నవారు. చాలా సార్లు అందరూ కలసి పనిచేశారు. ప్రస్తుతం వాళ్లంతా వేరే వేరే డిపార్టుమెంట్స్ ఉన్నారు. ఈ పనికోసం వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించాడు. అవినాష్ వాళ్లకి చెయ్యాల్సిన పని చాలా క్లియర్ గా చెప్పాడు. "మీరు సుభాష్ కి 4 - 5 కిలోమీటర్లు దూరం లో ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థిలో వాడు మీ ద్రుష్టి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా... వెంటనే ఫోన్ చెయ్యండి. 24 * 7 మీ కోసం ఇక్కడ ఉంటాము. గన్స్ తీసుకొని వెళ్ళండి. అందరూ ఎక్సట్రా మ్యాగజైన్స్ తీసుకెళ్లండి. అవసరమైతే కాల్చడానికి ఏమాత్రం వెనకాడ వద్దు. మీ సేఫ్టీ ఫస్ట్. వాళ్లంతా క్రిమినల్స్... చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యండి. వాళ్ళు సర్వైవ్ కావడానికి మిమ్మల్ని కాల్చడానికి వెనుకాడరు. కాబట్టి... మీరు కూడా మిమ్మల్ని కాపాడుకోవడానికి వెనకాడ వొద్దు... ప్రతి 30 నిమిషాలకి ఫోన్ చెయ్యండి. మేము సుభాష్ ఫోన్ ని క్లోన్ చేసాము. వాడు ఫోన్ చేసినా... మెసేజ్ పంపినా... మాకు రియల్ టైం బేసిస్ లో తెలిసి పోతుంది. మేము మీకు వెంటనే అప్డేట్ చేస్తాము. సుభాష్ ఇవ్వాళ బయలుదేరి వెళ్తాడు. ఎక్కడికి వేళ్తాడో తెలియదు. మాకు అందిన సమాచారం ప్రకారం... రేపు అర్ధరాత్రి దాటాక కూకట్ పల్లి బస్తీకి చేరుకుంటాడు. డ్రగ్స్ తీసుకొని రావడానికి వెళ్తున్నాడు. మీరు వాడు ఆ డ్రగ్స్ ని ఏ లొకేషన్ లో కలెక్ట్ చేసుకుంటాడు... ఎవరు హ్యాండ్ ఓవర్ చేస్తారు... పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది షాడో మిషన్. మీకు ఒక లాప్ టాప్ ఇస్తాము దాంతో మీరు ఈగిల్ ని ఎలా కంట్రోల్ చెయ్యాలి... డేటా... ఇమేజెస్ ఎలా కలెక్ట్ చెయ్యాలో శాండీ చెప్తాడు" అంటూ శాండీ ని పిలిచి వాళ్లకి పరిచయం చేసాడు.

శాండీ వాళ్లకి తన గాడ్జెట్స్ ని చూపించాడు. వాటిని చూసి వాసు "ఇంగ్లీష్ సినిమా లో చూసినట్టు గుర్తు" అని అన్నాడు. వాళ్లకి ఆ గాడ్జెట్స్ ఎలా పని చేస్తాయి... వాటిని ఎలా ఆపరేట్ చెయ్యాలి... అన్ని వివరంగా చెప్పాడు. వాళ్లకి లాప్ టాప్ ఇచ్చి కీడా... చిడియా... ఈగిల్ ని కంట్రోల్ చెయ్యడం ప్రాక్టీస్ చేయించాడు. చిన్న పిల్లలాగా వాళ్ళు వాటితో చాల సేపు ఆడుకున్నారు.

రాత్రి పది గంటల సమయంలో సుభాష్ ఇంటి నుండి బయటకి వచ్చాడు. అతని వెనకాలే చిడియా బయలుదేరింది. ఈ విషయం శాండీ షాడో టీం లాప్ టాప్ లో చూపించాడు. "వాడే సుభాష్. మీ టార్గెట్. డోంట్ మిస్" అని అన్నాడు. ఆ ఐదుగురు రెండు SUV లలో రెడీ గా ఉన్నారు. మొదటి SUV లో SI శ్రీధర్, కానిస్టేబుల్స్ గోపి, వాసు ఎక్కరు. గోపి వెనక సీట్ లో కూర్చొని లాప్ టాప్ తో ఈగిల్స్ ని ఆపరేట్ చేస్తున్నాడు. వెనక రెండో SUV లో ASI రాఘవ, రాము బయలుదేరారు. సుభాష్ బస్తీ బయట తన కోసం ఆగి ఉన్న వాన్ ఎక్కాడు. శాండీ చిడియా ని ఆ SUV టాప్ మీద లగ్గేజ్ పెట్టడానికి గ్రిల్ ఉంది. ఆ గ్రిల్ రైలింగ్ ని గట్టిగా పట్టుకొని సెటిల్ అయ్యింది. చిడియా కాలి వేళ్ళకి మాగ్నటిక్ గ్రిప్ ఉండడం తో ఆ గ్రిల్ ని కరచిపట్టుకొని కూర్చుంది. గాల్లో రెండు ఈగిల్స్ దూర దూరంగా ఎగురుతున్నాయి. వాటిని ఫాలో అవుతూ పోలీస్ స్టాఫ్ SUV లు కూడా కదిలాయి.


Part - 16 - THE SURVILLANCE

విశ్వామిత్ర వాచ్ చూసుకున్నాడు... సమయం రాత్రి 12 గంటలవుతోంది. పెద్దగా సమయం లేదు ఇంకో గంటలో మిల్ లో కైలాష్ గౌడ్ మనుషులు డ్రోన్స్ ని మేడ మీదకి చేర్చడం మొదలెడతారు. అప్పటిలోగా డ్రోన్ ని టాప్ చేసే సాఫ్ట్ వేర్ రెడీ అవ్వాలి. వేగంగా కోడ్ రాస్తున్నాడు. విశ్వామిత్ర బుర్ర శర వేగంగా పనిచేస్తోంది.

హై వే మీద సుభాష్ కార్ దూసుకొని పోతోంది. దాని వెనకే దూరంగా పోలీస్ స్టాఫ్ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సుభాష్ కార్ వెళ్తున్న రూట్ ని శాండీ మ్యాప్ లో మార్క్ చేస్తున్నాడు. పోలీస్ స్టాఫ్ చాలా అలెర్ట్ గా ఫాలో అవుతున్నారు.


సరిగ్గా అదే సమయంలో CI సుధీర్ కి కైలాష్ గౌడ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లాయర్ కాంతారావు ఇంటికి రమ్మన్నాడు. సుధీర్ వెళ్లి కలిసాడు. లాయర్ ఆఫీస్ రూమ్ లో కాంతారావు, కైలాష్ గౌడ్ కూర్చొని ఉన్నారు.

కైలాష్ : మన వాళ్ళు లాక్ అప్ లో ఎలా ఉన్నారు?

సుధీర్ : సేఫ్ సర్... వాళ్లకి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటున్నాను. వాళ్ళ రిమాండ్ పూర్తి అవ్వబోతోంది. మేము మళ్ళీ ఇంకో 21 డేస్ ఎక్సటెన్షన్ అడుగుతాం. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రెడీ అయ్యింది. ఆ రిపోర్ట్ కి ఈ నలుగురి DNA మ్యాచ్ అవ్వగానే ఎలా ముందుకి వెళ్లాలో డిసైడ్ చేస్తాము.

కైలాష్ : రిపోర్ట్ లో ఏముందో తెలుసా?

సుధీర్ : లేదు. కనుక్కో గలను. ఒక రిపోర్ట్ ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. అది కూడా వచ్చాక ఛార్జ్ షీట్ వేస్తాము.

కైలాష్ : ఎవరి మీద ఛార్జ్ షీట్ వేస్తారు? ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈ నలుగురి DNA రిపోర్ట్ తో మ్యాచ్ కాకపోతే?

సుధీర్ : ఎందుకు కాదు? ఆ నేరం చేసింది వీళ్ళే అని మా అనుమానం. మీరు ఏమి అనుకోకపోతే ఒకటి అడగనా? ఈ కేసు విషయం లో మా డిపార్టుమెంటు కి తెలియని విషయం ఏదైనా మీకు తెలుసా? ఇది వరకు నేను మిమ్మల్ని కలిసినప్పుడు కూడా మీరు ఆ నేరం చేసింది ఈ నలుగురు కాకపోతే అని అన్నారు. మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం అడిగానా?

కాంతారావు: ఫ్రీ గా మాట్లాడండి. మీరు ఏమి చెప్పినా ఈ నాలుగు గోడల మధ్యనే ఉంటుంది. మాకు మీ సహాయం కావాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాము.

సుధీర్ : నా అనుమానం ప్రకారం... ఆ రేప్ చేసింది వేరే వాళ్ళు. యాదగిరి గ్యాంగ్ ACCESSORY TO CRIME అని నా అనుమానం.

కాంతారావు : ఆ రేప్ ఎవరు చేసివుంటారని మీ అనుమానం.

సుధీర్ : మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఈ కేసు లో ఇరుక్కున్నారని నా అనుమానం.

కాంతారావు అప్పటిదాకా జరిగిందంతా సుధీర్ కి చెప్పాడు.

కాంతారావు : అందరూ ఈ కేసు లోంచి బయటపడాలి. ఒక్కళ్ళు కూడా జైలు కి వెళ్ళకూడదు. మా కుర్రోళ్ళ పేర్లు అస్సలు బయటకి రాకూడదు.

సుధీర్ : మీరు ఏదైనా ప్లాన్ ఆలోచించారా?

కాంతారావు : నెక్స్ట్ టైం మీరు యాదగిరి గ్యాంగ్ ని మీరు కోర్ట్ కి తీసుకొని వెళ్ళినపుడు ఆ నలుగురు మీ కస్టడీ నుంచి పారిపోయేలా ఏర్పాటు చేయగలరా?

సుధీర్ : గట్టిగా ప్లాన్ చేస్తే కుదురుతుంది. కానీ... వాళ్ళు పోలీస్ కస్టడీ లోంచి తప్పించుకుంటే... పెద్దగా ప్రయోజనం ఉండదు. వాళ్ళు అండర్ గ్రౌండ్ కి వెళ్తారు. ఈ కేసు ని CBI కి అప్పగించినా ఆశ్చర్య పడనవసరం లేదు. అప్పుడు కేసు మన చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. ఏదైనా మన చేతుల్లో ఉన్నప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. నా దగ్గర ఒక ప్లాన్ వుంది.

కాంతారావు : ఏమిటది?

సుధీర్ : కోర్ట్ వాళ్ళ రిమాండ్ ఎక్సటెండ్ చెయ్యగానే... నేను వాళ్ళని క్రైమ్ సీన్ కి తీసుకొని వెళ్తాను. మీకు BLOOD SPALTTER బుల్లెట్స్ అంటే తెలుసా?

కాంతారావు : తెలీదు.

సుధీర్ : అవి చూడడానికి రియల్ బుల్లెట్స్ లాగానే ఉంటాయి. కానీ... వాటిని వాడితే మనిషికి తగలగానే బ్లడ్ మాత్రం వెదజల్లుతాయి. మనిషి చావడు. మహా అయితే ఒక చిన్న దెబ్బ తగులుతుంది. రబ్బర్ బుల్లెట్స్ తగిలితే అంతకంటే పెద్ద దెబ్బ తగులుతుంది.

కాంతారావు : దానివల్ల ప్రయోజనం ఏమిటీ ?

సుధీర్ : పూర్తిగా చెప్తాను. ఇంకో రకమైన బుల్లెట్స్ ఉన్నాయి. వాటిని Tranquilizing Bullets అవి తగిలితే మనిషి స్పృహ తప్పుతాడు. నాకు తెలిసిన వ్యక్తి ఒకడున్నాడు... Blood Splatter బుల్లెట్స్... Tranquilizing Bullets ని కలిపి కొత్త రకం బుల్లెట్స్ తయారుచేయవొచ్చు. వాటిని వాడితే మనిషి వెంటనే స్పృహతప్పుతాడు. కనీసం 5 / 6 గంటల వరకు వాళ్ళు కదలకుండా పడి ఉంటారు.

కైలాష్(అసహనంగా) : మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారో అర్ధం కావడం లేదు.

కాంతారావు : ఆయనను చెప్పేది పూర్తిగా విందాం.

సుధీర్ : నాకు బాగా నమ్మకమైన వాళ్ళతో ఒక టీం తయారుచేస్తాను. యాదగిరి గ్యాంగ్ దగ్గరనుంచి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుంటాను... ఆ అమ్మాయిని కిడ్నప్ చెయ్యడమేకాకుండా ఆమెని రేప్ చేసి టార్చర్ చేశారని వాళ్ళ చేత ఒప్పిస్తాను.  ఆ తరువాత యాదగిరి గ్యాంగ్ ని సీన్ అఫ్ క్రైమ్ కి తీసుకొని వెళ్తాము... మాతో పాటు జర్నలిస్ట్స్... టీవీ చానెల్స్ వాళ్ళని కూడా తీసుకొని వెళ్తాము. సీన్ అఫ్ క్రైమ్ చేరాకా అందరూ చూస్తుండగా యాదగిరి గ్యాంగ్ మా మీద రాళ్లతో ఎటాక్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పోలీసులు ముందుగా రియల్ బుల్లెట్స్ ని గాల్లో కాల్చి వాళ్లకి వార్నింగ్ ఇస్తాము. వాళ్ళు ఆ వార్నింగ్ పట్టించుకోకుండా రాళ్ళూ విసురుతూనే ఉంటారు. పోలీసులు సెల్ఫ్ డిఫెన్స్ కింద వాళ్ళని స్పెషల్ బుల్లెట్స్ తో కాలుస్తారు. దాంతో వాళ్ళు స్పృహతప్పి పడిపోతారు. కనీసం 5 / 6 గంటలు లేవరు. వాళ్ళ వొంటి మీద బుల్లెట్స్ తగిలితే ఎలా బ్లడ్ వస్తుందో అలాగే ఉంటుంది. ఇదంతా ప్రెస్ చూస్తుండగానే జరుగుతుంది. వాళ్ళు వెంటనే అన్ని న్యూస్ చానెల్స్ లో ఆ రేప్ చేసిన యాదగిరి గ్యాంగ్ సీన్ అఫ్ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారని చెప్తారు. అంబులెన్సు వచ్చాక వాళ్ళ బాడీస్ ని మేము మార్చురీ కి తీసుకొని వెళతాము. అక్కడ ఆల్రెడీ చనిపోయిన వేరే వాళ్ళ డెడ్ బాడీస్ పెట్టి... యాదగిరి గ్యాంగ్ కి స్పృహ రాగానే వెనక దారినుంచి పంపిస్తాము. డెడ్ బాడీస్ ని యాదగిరి గ్యాంగ్ ఫామిలీస్ అప్పగిస్తాము. వాళ్ళు వెంటనే ఆ డెడ్ బాడీస్ ని డిస్పోజ్ చేసేస్తారు. దాంతో ప్రపంచానికి రేప్ చేసిన క్రిమినల్స్ మరణిస్తారు. కానీ... ఇదంతా ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద ఆధారపడివుంటుంది. దాన్ని మీరు మానిప్యులేట్ చెయ్యగలిగితే... మీ వాళ్ళ పేర్లు ఎప్పటికి బయటకి రావు. మీరు చెప్పినట్లు రేప్ కోసం వాడిన SUV ని మీరు ఇప్పటికే తగలపెట్టేసారు. ఒక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రమే మిగిలింది. మీరు దాని సంగతి చూసుకోండి. నేను యాదగిరి గ్యాంగ్ చేత కన్ఫెషన్ తీసుకొని మిగతా పని పూర్తి చేస్తాను.

ఇది వినగానే కైలాష్ లేచి గంతేశాడు... కుర్రోళ్ళు తప్పకుండా కేసు నుంచి బయటపడతారని నమ్మకం ఏర్పడింది.

కాంతారావు : మీరు చెప్పినట్లు ఏ ప్రాబ్లెమ్ లేకుండా మా వాళ్ళు బయటపడితే... మీకు... మీ టీం కి 10 కోట్ల రూపాయలు ఎలా కావాలంటే అలా ఇస్తాము. ఏ బ్యాంకు అకౌంట్ లో వెయ్యమంటే ఆ బ్యాంకు అకౌంట్ లో వేస్తాము. మీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాము.

సుధీర్ మహా ఆనందపడ్డాడు. అన్ని సరిగ్గా జరిగితే తన జీవితమే మారిపోతుంది. అన్ని సరిగ్గా జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి వెళ్ళాడు.ఆ సమయం లో CI సుధీర్ కి తెలియని విషయం ఒకటి వుంది... ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా... సరిగ్గా అమలు అవుతుందని గారంటీ లేదు...


అదే రోజు రాత్రి... లంబర్ మిల్ లో ఆక్టివిటీ మొదలయ్యింది. కైలాష్ గౌడ్ మనుషులు నెమ్మదిగా డ్రోన్స్ ని జాగ్రత్త తీసుకొని మేడ మీద పెట్టసాగారు. వాళ్ళ పనిని ఆ మిల్ లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ పర్యవేక్షిస్తున్నాడు. ఒక్కో డ్రోన్ కి మధ్య లో ఖాళీస్థలం ఉండేలా సర్దుతున్నాడు. అన్ని డ్రోన్స్ ని మేడ మీదకి చేర్చేసరికి చాలా సమయం పట్టింది. సరిగ్గా అప్పుడే విశ్వామిత్ర వ్రాస్తున్న ప్రోగ్రాం కూడా రెడీ అయ్యింది.

మేడ మీద కంప్యూటర్ ఆపరేటర్ ఒక్కొక్కటిగా డ్రోన్స్ ని ఆన్ చేయ్యసాగాడు. దానికోసమే వెయిట్ చేస్తున్న విశ్వామిత్ర అక్కడే ఉన్న ఈగిల్ ద్వారా ఒక డ్రోన్ బ్లూ టూత్ డివైస్ కోసం స్కాన్ చేసాడు. ఆన్ చేసిన అన్ని డ్రోన్స్ కి బ్లూ టూత్ డివైస్ ఆక్టివేట్ అయ్యాయి. విశ్వామిత్ర ఒక డ్రోన్ ని కాప్చర్ చేయబోతే బ్లూ టూత్ పాస్ వర్డ్ అడిగింది. విశ్వామిత్ర ఈ ప్రాబ్లెమ్ ముందుగానే ఊహించాడు. వేరే ఇంకో సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ని రన్ చేసాడు. దాదాపు 6 నిమిషాల తరువాత పాస్ వర్డ్ ని కనుక్కున్నాడు. ఆ పాస్ వర్డ్ తో ఆ డ్రోన్ ని కాప్చర్ చేసాడు.

విశ్వామిత్ర తన స్పెషల్ ప్రోగ్రాం తో ఆ డ్రోన్ హార్డ్ వేర్ ఆర్కిటెక్చర్ ని పరిశీలించాడు. మదర్ బోర్డు.. ప్రాసెసర్... మెయిన్ హార్డ్ వేర్ మొత్తం ఇజ్రాయెల్ లో తయారయ్యింది. దానికి కొన్ని మోడిఫికేషన్స్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ అన్ని డ్రోన్స్ ని ఆన్ చేసేటప్పటికీ విశ్వామిత్ర 12 డ్రోన్స్ ని హాక్ చేయగలిగాడు. సమయం వచ్చింది. డ్రోన్స్ అన్ని సిగ్నల్స్ అందుకోసాగాయి... విశ్వామిత్ర కూడా ఆ సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్నాడు. వెంటనే అనలైజ్ చేయసాగాడు. అవి GPS సిగ్నల్స్... దగ్గరలోని మొబైల్ టవర్స్ నుంచి వస్తున్నాయి. డ్రోన్స్ నెమ్మదిగా గాల్లోకి లేవసాగాయి... వాటికి వస్తున్న సిగ్నల్స్ ని ఫాలో అవుతూ స్పీడ్ ని పెంచుకోసాగాయి. దాదాపు 200 మీటర్స్ పైకి లేచాక ముందుకు వెళ్ళసాగాయి. ఆ డ్రోన్స్ కి సిగ్నల్స్ రకరకాల మొబైల్ టవర్స్ నించి వస్తున్నాయి.

విశ్వామిత్ర లాప్ టాప్ స్క్రీన్ మీద 12 డ్రోన్స్ కి సంభందించిన డెలివరీ అడ్రస్ కంపించింది. వాటి లొకేషన్ కోఆర్డినెట్స్ కూడా చాలా స్పష్టం గా తెలుస్తోంది. విశ్వామిత్ర సిగ్నల్ సోర్స్ ని వెతకసాగాడు. సిగ్నల్స్ చాలా మొబైల్ టవర్స్ ని దాటుకుంటూ డ్రోన్స్ కి చేరుతున్నాయి. చివరికి సిగ్నల్స్ ఎక్కడినించి వస్తున్నాయో తెలిసింది... కోఆర్డినెట్స్ దొరికాయి... వాటిని గూగుల్ మ్యాప్స్ వెతికాడు. అది మహేంద్ర భూపతి గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్... గచ్చిబౌలి లో ఉంది. 20 అంతస్తుల భవనం. ఆ బిల్డింగ్ టెర్రస్ మీదున్న శాటిలైట్ డిష్ ఆంటిన్నా నుంచి ఆ డ్రోన్స్ కి సిగ్నల్స్ వస్తున్నాయి.... కమాండ్ సెంటర్ లొకేషన్ దొరికింది. వెంటనే ఈ విషయాన్ని అవినాష్... Op Center కి తెలియచేసాడు.


మహారాష్ట్ర కి వెళ్లే హై వే మీద సుభాష్ కార్ చాలా వేగంగా వెళ్తున్నాడు. అప్పటికి వాళ్ళు హైదరాబాద్ దాటి 5 గంటలు అయ్యింది. ఇంకాసేపట్లో తెల్లారి పోతుంది. వాళ్లకి దూరంగా పోలీస్ టీం కూడా ప్రయాణిస్తోంది. వరంగల్ దాటి చాలాసేపయ్యింది. మెయిన్ రోడ్ వదిలి సన్నటి గ్రామ పంచాయితీ రోడ్ మీదైకి వచ్చారు. అక్కడ వెహికల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వీలయినంత దూరాన్ని మైంటైన్ చేస్తూ వెంబడిస్తున్నారు. చివరికి ఆ గ్రామపంచాయతి రోడ్ కూడా వొదిలేసి ఏదో అడవి మార్గం పట్టారు. మధ్యలో ఒక పెట్రోల్ బంక్ లో ఆగి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరారు. అడవిలో చాలా దూరం వెళ్ళాక సుభాష్ SUV ఆగిపోయింది. దానికి 4 కిలోమీటర్స్ దూరం లో పోలీస్ టీం వాన్స్ కూడా ఆగిపోయాయి. సుభాష్ SUV ని గాల్లో ఫాలో అవుతున్న రెండు ఈగిల్స్ సుభాష్ SUV కి 10 మీటర్స్ దూరంలో ఒక చెట్టుమీద వాలాయి. ఉదయం 5 గంటలు అయ్యింది. సూర్యుడు ఉదయించాడు. అదే సమయంలో ఒక మినీ లారీ కూడా వచ్చి సుభాష్ SUV దగ్గర ఆగింది. సుభాష్ తన మొబైల్ లో టైం చూసుకుంటున్నాడు. దాదాపు ఒక అరగంట తరువాత దూరంగా ఎదో శబ్దాలు వినిపించాయి.

పోలీస్ టీం లో లాప్ టాప్ ని ఆపరేట్ చేస్తున్న గోపి కి స్క్రీన్ మీద దూరంగా ఎదో మూమెంట్ కనిపిచింది. ఒక ఈగిల్ ని అటువైపు ఫోకస్ చేసి జూమ్ చేసి చూసాడు. ఆదివాసి జనాలు తండోపతండాలుగా గాడిదలని తోలుకుంటూ సుభాష్ దగ్గరికి వస్తున్నారు. ఇదంతా లాప్ టాప్ లో చూస్తున్న పోలీస్ టీం ఏమి అర్ధంకాలేదు. ఆ టైం లో ఆదివాసీ జనాలు సుభాష్ ని ఎందుకు కలవాలని వస్తున్నారు? ఆదివాసీలు వచ్చి సుభాష్ దగ్గర ఆగారు. వాళ్లలో ఒకడు సుభాష్ దగ్గరకి వచ్చి ఎదో మాట్లాడి తనతో పాటు వచ్చిన వాళ్లకి చెయ్యి ఊపుతూ ఎదో అన్నాడు. ఆ ఆదివాసి జనాలు ఒక్కొక్కళ్ళుగా తమతోపాటు వచ్చిన గాడిదలకు తగిలించిన గొనె సంచుల్లోంచి డ్రగ్స్ పాకెట్స్ తీసి జాగ్రత్త తీసుకొని వచ్చి అక్కడ ఆగివున్న లారీ డ్రైవర్ కి అందించసాగారు. వాడు అందుకొని వేగంగా వాటిని లారీలో పేర్చసాగాడు. దాదాపు ఒక గంట పాటు డ్రగ్స్ పాకెట్స్ లారీ లోకి లోడ్ అయ్యాయి. అక్కడ సుభాష్ ని ఫాలో అవుతున్న పోలీస్ టీం... హైదరాబాద్ లో శాండీ... అవినాష్... విశ్వామిత్ర... Op Center లో టీం అందరూ తెలంగాణ లో ఒక రిమోట్ ఏజెన్సీ ఏరియాలో లోడ్ అవుతున్న డ్రగ్స్ ని క్లియర్ గా చూసారు. అంత చిక్కటి అడవిలో ఆ సమయంలో ఆ ఆదివాసులకి అంత పెద్ద మొత్తం లో డ్రగ్స్ ఎక్కడ దొరికాయి?

ఒక గంటలో పని అయ్యింది. ముందు సుభాష్ SUV బయలుదేరింది. దాని వెనకాలే డ్రగ్స్ తో నిండిన లారీ నెమ్మదిగా కదిలింది. ఆ లారీ ని ఫాలో అవుతూ రెండు ఈగిల్స్ కూడా కదిలాయి. వాళ్లకి ఒక 4 కిలోమీటర్స్ దూరం లో వాళ్ళకి అనుమానం రాకుండా పోలీస్ టీం కూడా అక్కడినుంచి బయలుదేరింది.


Part - 17 - The Reconnaissance.

1991 సంవత్సరం లో శ్రీ P.V.నరసింహ రావు గారు భారత దేశానికి ప్రధానమంత్రి అయిన సమయానికి భారత్ దేశ ఆర్ధిక పరిస్థితి అంత గొప్పగా లేదు. ఆయన తన మంత్రి వర్గం లో Dr.మన్మోహన్ సింగ్ గారి ని తీసుకోవడం... ఆయనకీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వడం... దానితో పాటు Dr మన్మోహన్ సింగ్ గారికి కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చి భారత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచమని ఒక పెద్ద బాధ్యతని అప్పగించారు. Dr మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్ట్రీ లో మొదటి రోజు నిర్వహించిన సమీక్ష లో ఆయనికి తెలిసిన విషయాలు...

1. భారత దేశ Fiscal Deficit దాదాపు మన దేశ Gross Domestic Production లో 8.5%...

2. Balance of Payments Deficit చాలా ఎక్కువగా ఉంది.

3. Curent Account Deficit మన Gross Domestic Product లో 3.5%

4. FOREX Reserves ఒక బిలియన్ డాలర్స్ కూడా లేవు... ఇంకో రకం గా చెప్పాలంటే ఆ రోజున ఉన్న FOREX Reserves రెండు వారాలకి మించి సరిపోవు...

ఆనాటి ఆర్థిక పరిస్థితిని ప్రధాన మంత్రి కి వివరించి... అప్పటి Licence Raj విధానాన్ని రద్దు చేయించి... మన ఎకానమీ ని ప్రపంచానికి ఓపెన్ చేశారు. Foreign Direct Investment... Privatisation of Public Sector... ఇలాంటి initiatives ప్రపంచం లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇండియా లో తమ ఆఫీసెస్ పెట్టడానికి ముందుకు వచ్చాయి... వాటిలో ముఖ్యమైనవి... Shared Services Centers... Call Centers... Data Centers... Knowledge Centers ఓపెన్ చేశాయి... వేల కొద్దీ సాఫ్ట్ వేర్... కన్సల్టింగ్ ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి...

హైదరాబాద్ లో Microsoft... Google... Facebook... Deloitte... PriceWaterhouseCoopers... Thomson Reuters... Wells Fargo... Cap Gemini... etc. కంపెనీలు వెలిశాయి. హైదరాబాద్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు మెహదీపట్నం దాటి BHEL వెళ్తూంటే... ఒక బోర్డు కనిపించేది దాని మీద "Hyderabad Central University - 17 Kilometers" వ్రాసి ఉండేది. అక్కడ నించి Indian Immunologicals Limited దాకా ఎటువంటి జన సంచారం ఉండేది కాదు... మధ్యలో CMC Ltd వాళ్ళ ఆఫీస్ కనిపించేది. రోడ్ కి అటూ ఇటూ పూర్తిగా రాళ్లు రప్పలు తప్ప ఏమి ఉండేవి కాదు. ప్రస్తుతం మెహదీపట్నం నుంచి Hyderabad Central University మధ్యలో ఒక పెద్ద నగరమే వెలిసింది.

ఉదయం 11 గంటల సమయం... Financial District... గచ్చిబౌలి... విశ్వామిత్ర Commercial Hub కి చేరుకున్నాడు. అక్కడ చాలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. చాలా కోలాహాలం గా ఉంది. కాఫీ షాప్స్... రెస్టారెంట్స్... ఫుడ్ కోర్ట్స్... అవుట్ సైడ్ ఈటరీస్... పబ్స్... హోటల్స్... అన్ని చోట్లా జనాలతో నిండి ఉంది. విశ్వామిత్ర ఒక కాఫీ షాప్ బయట ఉన్న కుర్చీలో కూర్చొని మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ని పరిశీలించసాగాడు. లోపలి వెళ్ళడానికి గ్లాస్ డోర్స్ ఉన్నాయి... ఎంప్లొయీస్ లోపలి... బయటికి కదలడం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. 20 అంతస్తుల భవనం. చాలా మోడరన్ గా ఉంది. పైనించి కిందా దాకా మొత్తం గ్లాస్ తో కవర్ చేశారు. టాప్ ఫ్లోర్ లో చైర్మన్ చాంబర్స్ ఉన్నాయి. ఆ తర్వాత నాలుగు ఫ్లోర్ లో గ్రూప్ ప్రెసిడెంట్స్ ఆఫీసెస్ ఉన్నాయి... ఆ తరువాత 5 ఫ్లోర్స్ లో కంప్యూటర్ డేటా సెంటర్ ఉంది... ఆ తరువాతి భాగం లో ఎంప్లాయిస్ పనిచేయడానికి వర్క్ స్టేషన్స్... కాన్ఫరెన్స్ రూమ్స్... కాపీయింగ్ సెంటర్స్... డాక్యుమెంట్ స్టోరేజ్ గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్యూరిటీ కాన్సోల్... విజిటర్స్ వెయిటింగ్ అండ్ మీటింగ్ రూమ్స్... కెఫెటేరియా ఉన్నాయి. బిల్డింగ్ వెనక భాగం లో సర్వీస్ ఎంట్రెన్స్ వుంది. గూడ్స్ లోడింగ్... unloading జరుగుతూ ఉంటాయి.

గత రాత్రి ఆ కంపెనీ సిస్టమ్స్ హాక్ చెయ్యడానికి ట్రై చేసాడు. ఫైర్ వాల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొంచం కష్టపడితే ఆ ఫైర్ వాల్ ని breach చెయ్యడం పెద్ద కష్టం కాదు. బాగా టైం పడుతుంది. చాలా సార్లు ఫైర్ వాల్ breach చేసాడు. ఎన్నో గవర్నమెంట్... ప్రైవేట్ నెట్వర్క్ ని హాక్ చేసాడు. ఈ సారి వెరైటీగా లోపలనుంచి యాక్సెస్ చేయడానికి మార్గం వెతుకుతున్నాడు. కాఫీ తాగడం పూర్తిచేసి "Let's convert everything into pig's breakfast from inside" అని మనసులో అనుకుంటూ... మహేంద్ర ఆఫీస్ వైపు అడుగులు వేసాడు.


CI శ్రీధర్ తన కి బాగా నమ్మకమైన ఒక 10 మంది పోలీసులని తన ఇంటికి పిలిచాడు. వాళ్ళతో "ఒక పెద్ద అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉంది. మీకు ఇష్టముంటే డీటెయిల్స్ చెప్తాను. ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తాను. మనం చేయబోయేది పూర్తిగా ఇల్లీగల్. మీరు చేస్తానంటే నా ప్లాన్ చెప్తాను." అని అన్నాడు. "మీరు ప్లాన్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. మాకు నమ్మకం ఉంది. చేస్తాము." అని ముక్తకంఠం తో అన్నారు.

సుధీర్ చెయ్యాల్సిన పని చెప్పాడు. వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. ఆ ప్లాన్ ఎలా అమలు చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వాళ్లకి చెప్పాడు. ఎవరెవరికి ఏ ఏ భాద్యతలు అప్పగించాలో నిర్ణయించుకున్నారు. వాళ్లలో ఒకడు "మనం ఒక రిహార్సల్ చేస్తే బాగుంటుంది. యాదగిరి గ్యాంగ్ ని బయటకి తీసుకెళ్లి Blood Splatter Tranquilizing Bullets ఎలా తగులుతాయి.... వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. వాళ్ళు 5/ 6 గంటల సేపు కదలకుండా ఎలా ఉండాలో ఒక ప్రాక్టీస్ సెషన్ పెట్టాలి. అక్కడ ప్రెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్లకి ఎటువంటి అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చెయ్యాలో వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే ప్లాన్ మొత్తం ప్లాప్ అవుతుంది. అంబులెన్సు స్టాఫ్ కూడా మన వాళ్ళే ఉండేలా చూసుకోవాలి. మార్చురీ లో శవాలని మేనేజ్ చెయ్యాలి. అటాప్సీ చేసే డాక్టర్ ని కూడా మేనేజ్ చెయ్యాలి.... చాలా పనులున్నాయి"

అప్పటికప్పుడు వాళ్ళందరూ కలసి అన్ని విషయాలు చాలా డిటైల్డ్ గా డిస్కస్ చేసుకొని చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కొంచం ఎక్కువ కావాలని అడిగారు. "ఒక్కొక్కళ్ళకి ఎంత కావాలి?" 50 లక్షలు కావాలని అడిగారు. ఇస్తానని చెప్పాడు.

CI శ్రీధర్ ఆ రోజు రాత్రి కాంతారావు ని కలిసి తమ ప్లాన్ మొత్తం చెప్పాడు. కాంతారావు చాలా ఇంప్రెస్ అయ్యాడు. " సర్... కాకపోతే... కొంచం బాగా ఖర్చు అయ్యేలా ఉంది... అంబులెన్సు స్టాఫ్... మార్చురీ స్టాఫ్... అటాప్సీ చేసే డాక్టర్.... చాలా ఖర్చు అవుతుంది. ఒక 15 కోట్ల దాకా అవుతుంది..." అని చెప్పాడు. దానికి బదులుగా "డబ్బు ప్రాబ్లెమ్ కాదు. ఎంత కావాలంటే అంత ఇస్తాము... మా పేర్లు... మా పిల్లల పేర్లు ఎప్పటికి బయటకి రాకుండా ఉండేలా ప్లాన్ చెయ్యండి" అని అన్నాడు.

CI సుధీర్ కాంతారావు ఆఫీస్ నుంచి బయటకి వస్తూ మనసులో "సంవత్సరానికి ఇలాంటి కేసులు రెండు తగిలితే చాలు అయిదేళ్లలో పోలీస్ వుద్యోగం మానేసి ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకొని బ్రతకవచ్చు..." అని అనుకున్నాడు. 


గ్రామ పంచాయితీ గేటుకు రోడ్ మీద సుభాష్ SUV నెమ్మదిగా కదులుతోంది. దాని వెనకాలే లారీ వెళ్తోంది. వాటి మీద ఆకాశం లో ఈగిల్స్ ప్రయాణిస్తున్నాయి. వీటికి 4 కిలోమీటర్స్ దూరంగా పోలీస్ టీం వెహికల్స్ వస్తున్నాయి. చాలా కస్టపడి ఒక మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. దానిమీద ఒక 50 కిలోమీటర్స్ ప్రయాణం చేసిన తరువాత సుభాష్ SUV మళ్ళి గ్రామా పంచాయితీ రోడ్ మీదకి వచ్చి ఒక గ్రామం లోకి ప్రవేశించింది. ఆ గ్రామం మెయిన్ రోడ్ కి 3 కిలోమీటర్స్ దూరం గా ఉంది. మెయిన్ రోడ్ మీదనుంచి ఆ గ్రామం కనిపించదు. మెయిన్ రోడ్ నుంచి ఆ గ్రామం దాకా చిట్టడివి ఉంది. సుభాష్ SUV ఒక చోట ఆగిపోయింది. పోలీస్ టీం అడవి కి దగ్గర మెయిన్ రోడ్ మీదే ఆగిపోయారు. ఒక ఈగిల్ వెళ్లి సుభాష్ వాళ్ళు ఆగిన ఇంటిమీద వాలింది. సుభాష్ SUV... దానితో పాటే వచ్చిన లారీ కనిపించేలా గోపి ఈగిల్ ని ఎడ్జెస్ట్ చేసాడు. ఆ ఇంటి యజమాని వాళ్లకి తినడానికి ఏర్పాట్లు చేసాడు.

ఒక గంట తరువాత ఒక మినీ ట్రక్ ఆ గ్రామం లో ప్రవేశించి సుభాష్ తెచ్చిన లారీ పక్కన ఆగింది. దాంట్లోంచి ఇద్దరు దిగారు. ఒకడు సుభాష్ దగ్గరికి వచ్చి తన మొబైల్ ఫోన్ లో ఎదో చూపించాడు. లాప్ టాప్ లో సరిగ్గా కనిపించలేదు. సుభాష్ తన మొబైల్ ఫోన్ తో ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ ని స్కాన్ చేసాడు. ఆ స్కాన్ డీటెయిల్స్ కంప్యూటర్ లో కనిపించాయి. అది ఒక పేమెంట్ స్లిప్ డీటెయిల్స్. అందులో 500 కిలోల డ్రగ్స్ డెలివర్ ఆర్డర్. సుభాష్ స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ ని కమాండ్ సెంటర్ కి పంపాడు. వాళ్ళ దగ్గరనుంచి authenticated మెసేజ్ వచ్చింది. సుభాష్ తన వాళ్లకి 500 కిలోలు డెలివర్ చెయ్యమని చెప్పాడు. వాళ్ళు లారీ లోంచి డ్రగ్స్ ని ఆ మినీ ట్రక్ లోకి చేర్చారు. ఆ మినీ ట్రక్ వెంటనే వెళ్ళిపోయింది.

ఇంకో అరగంట తరువాత ఇంకో మినీ ట్రక్ వచ్చింది. మళ్ళీ అదే ప్రొసీజర్... ట్రక్ లో వచ్చిన వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో ఒక డెలివరీ నోట్ చూపించడం... సుభాష్ దాన్ని స్కాన్ చేసి కమాండ్ సెంటర్ కి పంపడం... రిప్లై వచ్చాక వాళ్లకి డెలివరీ ఇవ్వడం. ఇలా దాదాపు సాయంత్రం 6 దాకా నడిచింది. చివరికి ఆ లారీ లో మిగిలిన డ్రగ్స్ ని వేరే మినీ ట్రక్ లోకి లోడ్ చేశారు. ఆ ఖాళీ లారీ ని ఆ ఇంట్లో నే వొదిలేసి ఆ లారీ డ్రైవర్ మినీ ట్రక్ ఎక్కాడు. ముందు ట్రక్... దాని వెనకాలే సుభాష్ SUV తిరిగి హైదరాబాద్ కి బయలుదేరాయి. వాటి వెనకాలే పోలీస్ టీం కూడా బయలుదేరింది. దారిలో 3 చోట్ల చెక్ పోస్ట్స్ తగిలాయి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర సుభాష్ ఒక్కడే కిందకి దిగి అక్కడి చెక్ పోస్ట్ ఆఫీసర్ ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడి రెండు నిమిషాల తరువాత వచ్చి SUV ఎక్కేవాడు. వాళ్లకి ఎక్కడా ఆటంకం కలగలేదు. రాత్రి దాదాపు 3 గంటల ప్రాంతం లో కూకట్ పల్లి బస్తీలోని ట్యూషన్ సెంటర్ లో డ్రగ్స్ ని పెట్టి వెళ్లిపోయారు.

విశ్వామిత్ర చాలా కాన్ఫిడెంట్ గా మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ లోకి అడుగుపెట్టాడు. డోర్ తీసుకొని లోపలి అడుగు పెట్టగానే... అక్కడే నుంచొని ఉన్న సెక్యూరిటీ గార్డ్ విశ్వామిత్ర ని పైకి కిందకి తేరిపారా చూసాడు. యాక్సిస్ కార్డు కనిపించలేదు. " ఏమి కావాలి... " అని అడిగాడు. "మీ కంపెనీ లో పనిచేసే విక్రమ్ శుక్ల... సీనియర్ డేటా అనలిస్ట్... ప్రొక్యూర్మెంట్ డివిషన్... నన్ను రమ్మన్నాడు... మీటింగ్ ఉంది" అని అన్నాడు. "ఎంక్వయిరీ డెస్క్ దగ్గరికి వెళ్ళండి" అని అన్నాడు. కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు పక్క టేబుల్ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ మాటల ప్రకారం ఒకడి పేరు విక్రమ్ శుక్ల... వాడికి ఆ రోజు మధ్యాన్నం 12 గంటలనుండి 2 దాకా ఒక Mandatory Training ప్రోగ్రాం ఉందని... ఆ ట్రైనింగ్ రూమ్ లోకి మొబైల్ ఫోన్స్ కూడా అల్లో చెయ్యరని... తెలుసుకున్నాడు. వాడి ఆక్సిస్ఎం కార్డు ని తన మొబైల్ ఫోన్ తో ఫోటో తీసుకున్నాడు. ఎంక్వయిరీ డెస్క్ దగ్గర "నాపేరు రవి కుమార్... నేను బీటా టెక్నాలజీస్ నుంచి వచ్చాను... నాకు ప్రొక్యూమెంట్ డిపార్టుమెంటు లో సీనియర్ మేనేజర్ విక్రమ్ శుక్ల తో మీటింగ్ ఉంది" అని అన్నాడు. " జస్ట్ ఆ మినిట్..." అంటూ తన కంప్యూటర్ లో విక్రమ్ శుక్ల పేరు సెర్చ్ చేసి అతని వర్క్ స్టేషన్ కి ఫోన్ చేసింది. రింగ్ అయ్యింది... రెస్పాన్స్ లేదు. వాయిస్ మెయిల్ మెసేజ్ వస్తోంది. మళ్ళీ ట్రై చేసింది... అదే రెస్పాన్స్... " నో రెస్పాన్స్... సీట్ లో లేనట్లున్నాడు." అని అన్నది. " అతని మొబైల్ ఫోన్ కి ట్రై చెయ్యండి" అని అన్నాడు విశ్వామిత్ర. ఆమె తన డేటాబేస్ లో మొబైల్ నెంబర్ కి కాల్ చేసింది. విక్రమ్ ఆ ఫోన్ ని సైలెంట్ మోడ్ లో డెస్క్ లో పెట్టి లాక్ చేసి ట్రైనింగ్ కి వెళ్ళాడు.

ఎంక్వయిరీ డెస్క్ లేడీ విక్రమ్ కి ఫోన్ చేస్తున్న సమయంలో విశ్వామిత్ర ఆ ఎంక్వయిరీ డెస్క్ చుట్టు పక్కల పరిసరాల్ని చెక్ చేసాడు. ఆ ఎంక్వయిరీ డెస్క్ కి ఆనుకొని 10 టర్న్ స్టైల్స్ ... వాటి తరువాత ఒక ఫ్లాప్ బారియర్ ఉన్నాయి. ప్రతి టర్న్ స్టైల్ కి ఒక RFID రీడర్... ఉంది. ఆఫీస్ లోకి వెళ్తున్న ప్రతి ఎంప్లాయ్ టర్న్ స్టైల్ దగ్గర తన ఆక్సిస్ కార్డు ని RFID రీడర్ మీద టాప్ చేస్తే టర్న్ స్టైల్ ఓపెన్ అవుతుంది. అప్పుడే ఆ ఎంప్లాయ్ లోపలి వెళ్లగలడు. ఇదంతా ఒక్క సెకండ్ లో జరిగిపోతోంది. విశ్వామిత్ర ఎంక్వయిరీ కౌంటర్ దగ్గర అటూ ఇటూ కదులుతూ ఆ టర్న్ స్టైల్ కి 3 అడుగుల దూరం చేరాడు. విశ్వామిత్ర ప్యాంటు పాకెట్ లో ఒక హై ఫ్రీక్వెన్సీ యాంటెన్నా... క్లోనింగ్ డివైస్... ఉన్నాయి... టర్న్ స్టైల్ దగ్గర RFID రీడర్ మీద ఎంప్లాయ్ ఆక్సిస్ కార్డు ని టాప్ చేసినప్పుడల్లా ఒక బీప్ సౌండ్ వినిపిస్తుంది. విశ్వామిత్ర ప్యాంటు పాకెట్ లోని హై ఫ్రీక్వెన్సీ యాంటెన్నా ఆ బీప్ సౌండ్ వచ్చినప్పుడు RFID రీడర్ ని హాక్ చేసి యాక్సిస్ కార్డు లోని ఎంప్లాయ్ డీటెయిల్స్ ని క్లోనింగ్ డివైస్ కి పంపుతోంది. ప్రతి ఆక్సిస్ కార్డు లో హెక్స డెసిమల్ స్ట్రింగ్ ఉంటుంది. అందులో ఆ ఎంప్లాయ్ కి సంభందించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ తో ఆక్సిస్ కార్డు ని చాలా ఈజీ గా క్లోన్ చేసుకోవొచ్చు. ఎంక్వయిరీ డెస్క్ వెనకాల సెక్యూరిటీ కన్సోల్ ఉంది. అక్కడే ఆక్సిస్ కార్డ్స్ తయారు చేస్తారు. ఎంప్లాయ్ డేటా బేస్ ని కూడా మైంటైన్ చేస్తారు. విశ్వామిత్ర తన మొబైల్ ని చెక్ చేసుకున్నాడు. 78 మంది ఎంప్లాయిస్ ఆక్సిస్ కార్డు డీటెయిల్స్ తన ప్యాంటు పాకెట్ లోని క్లోనింగ్ డివైస్ లో కి చేరాయి.

ఎంక్వయిరీ డెస్క్ లేడీ "విక్రమ్ ట్రయినింగ్ రూమ్ లో ఉన్నాడు. అక్కడ మొబైల్ ఫోన్స్ ని అల్లో చెయ్యరు. అందుకే రెస్పాన్స్ ఇవ్వడం లేదు" అని అన్నది. "ఆ ట్రైనింగ్ ఎన్నింటికి దాకా ఉంది?" అని ఆడిగాడు విశ్వామిత్ర. "తెలీదు... " అని అన్నది ఆ ఎంక్వయిరీ డెస్క్ లేడీ. "ఆల్రైట్... నేను విక్రమ్ తో మాట్లాడి మీటింగ్ రీ షెడ్యూల్ చేసుకుంటాను. థాంక్ యు వెరీ మచ్" అని చెప్పి ఆ ఆఫీస్ లోంచి బయటపడ్డాడు. ఆ ఎంక్వయిరీ డెస్క్ లేడీ ఆ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. విక్రమ్ కి కూడా ఆ రవి కుమార్ వచ్చిన సంగతి చెప్పలేదు.

విశ్వామిత్ర నేరుగా అవినాష్ ఆఫీస్ కి చేరుకొని తాను చేసిన పని చెప్పాడు.

అవినాష్ : నాకు ముందుగా ఎనుదుకు చెప్పలేదు?

విశ్వామిత్ర : ఆ లొకేషన్ చూడడానికి వెళ్ళాను. నా దగ్గర హై ఫ్రీక్వెన్సీ యాంటెన్నా క్లోనింగ్ డివైస్ రెడీ గా వున్నాయి. ఆలస్యం ఎందుకని వెంటనే ఆ ఆఫీస్ లాబీ లో కి వెళ్లి డేటా కాప్చర్ చేసాను.

అవినాష్ : ఇప్పుడు ఆ డేటా తో నువ్వు ID క్లోన్ చేస్తావా?

విశ్వామిత్ర : ముందు ఈ డేటా ని అనలైజ్ చేస్తాను. పనికి వస్తుందనిపిస్తే వాడదాం... లేదంటే డిస్కార్డ్ చేసేస్తాను.

అవినాష్ : ఇక నుంచి నువ్వు ఏదైనా నాకు చెప్పి చెయ్యి. ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకోవాలి. ఈ డ్రగ్స్ విషయం లో మనకి చాలా పెద్ద బ్రేక్ దొరికింది. సుభాష్ ని ఫాలో అవుతూ వెళ్లిన టీం వెనక్కి వచ్చింది. వాళ్ళు చెప్పింది వింటూంటే మతి పోతోంది. వాళ్ళ కళ్ళ ముందు కనీసం 2 లేదా 3 వేల కిలోల డ్రగ్స్ చిన్న చిన్న ట్రక్స్ లో ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి. ఆ రిమోట్ ప్రాంతం లో ఆదివాసులకి అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎలా దొరికాయి?

విశ్వామిత్ర : నేను చెప్పగా... వాళ్ళు డ్రగ్స్ ని తయారుచేస్తున్నారు... వేల కిలోల్లో డ్రగ్స్ తయారుచెయ్యాలంటే చాలా పెద్ద సెట్ అప్ కావాలి. నా అనుమానం ఆ రిమోట్ ఏరియా లో ఎక్కడో ఉండి ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి డ్రగ్స్ ని ఆ ఆదివాసులు గాడిదలమీద తీసుకొస్తున్నారని నా అనుమానం.

అవినాష్ : ఆ ఆదివాసులు డ్రగ్స్ డెలివర్ చేసిన ప్లేస్ చాలా రిమోట్ ఏరియా... ఏజెన్సీ ఏరియా... అక్కడికి ఛత్తీస్గఢ్ స్టేట్ బోర్డర్ చాలా దగ్గర...

విశ్వామిత్ర : A Perfect Place to manufacture the drugs... అక్కడికి జనాలు ఎవ్వరూ వెళ్ళరు. ఆ చుట్టుపక్కల పెద్దగా గ్రామాలు కూడా లేవు. నీకు తెలుసో లేదో... మెక్సికో... కొలంబియా... దేశాల్లో డ్రగ్స్ లార్డ్స్ అడవుల్లో ఎవరికీ అనుమానం కలగకుండా డ్రగ్స్ తయారు చేస్తారు. మహీంద్ర కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఎస్కోబార్ డైలీ 300 కిలోల కొకెయిన్ సప్లై చేసేవాడు. దాంతో పోల్చుకుంటే ఇదేమి పెద్ద విషయం కాదు. మహీంద్ర ఎక్కువగా ఎక్సపోర్ట్స్ మీద ద్రుష్టి పెడతాడని టాక్... నెక్స్ట్ పిక్ అప్ ఎప్పుడో తెలుసా...

అవినాష్ : లేదు. రెడీ గా ఉండాలి. ఈ సారి సోర్స్ ని కనిపెట్టాలి. ఇంకో సంగతి... ఇవ్వాళ నేను Op Center తో మాట్లాడాను. వాళ్ళు ఈ డెవలప్మెంట్ కి చాలా ఆనందించారు. వాళ్ళు సుభాష్ ఫోన్ లో వాట్సాప్ డేటా ని అనలైజ్ చేస్తూంటే... వాళ్ళకి MACHATE... TELCHAT ... CHAPORI ఈ కోడ్స్ రిపీటెడ్ గా కనిపించాయి. వాళ్ళు ఎన్ని రకాలుగా రీ ఆరెంజ్ చేసినా ఏమి క్లూ దొరకడం లేదని చెప్పారు. నా లెక్క ప్రకారం... సుభాష్ సోర్స్ నుంచి డ్రగ్స్ ని ఒక పాయింట్ దాకా తీసుకొని వస్తాడు. అంతే... ఆ తరువాత వేరేవాళ్లు హేండిల్ చేస్తారు.

విశ్వామిత్ర : మనం ఎంత త్వరగా మహేంద్ర ఆఫీస్ లోకి వెళితే అంత మంచిది. ముందు నేను తెచ్చిన డేటా ని అనలైజ్ చేసి చూద్దాం. మనకి పనికొస్తుందంటే వాడదాం... లేదంటే వేరే మార్గం వెతుకుదాం.

విశ్వామిత్ర తన ప్యాంటు పాకెట్ లోంచి ఒక డివైస్ తీసాడు... చాలా చిన్నది. ఒక మొబైల్ ఫోన్ సైజు లో ఉంది. ఆ డివైస్ కి ఒక డిస్క్ లాంటి డివైస్ ఒకటి కేబుల్ తో అటాచ్ చేసి ఉంది. ఆ రెండింటిని అవినాష్ టేబుల్ మీద పెట్టాడు. అవినాష్ కి వాటిని చూడగానే అర్ధమయింది. ఆ డిస్క్ లాంటి డివైస్ యాంటెన్నా... మొబైల్ ఫోన్ లాగా కనిపిస్తున్నది క్లోనింగ్ డివైస్. యాంటెన్నా RFID id రీడర్స్... లేదా... ఆక్సిస్ కార్డ్స్ ని రీడ్ చేసి డీటెయిల్స్ ని క్లోనింగ్ డివైస్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. విశ్వామిత్ర ఆ క్లోనింగ్ డివైస్ ని తన లాప్ టాప్ కి అటాచ్ చేసి క్లోనింగ్ ప్రోగ్రాం రన్ చేసి ఆ డివైస్ లోని డేటా ని చెక్ చేయ్యసాగాడు. 78 id కార్డ్స్ డీటెయిల్స్ దొరికాయి... కంపెనీ లో పనిచేసే అందరి ఎంప్లాయిస్ కి బిల్డింగ్ మొత్తం ఆక్సిస్ ఉండదు. నార్మల్ గా ఒక ఎంప్లాయ్ ఏ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడో ఆ డిపార్ట్మెంట్ ఫ్లోర్ యాక్సిస్... గ్రౌండ్ ఫ్లోర్ లో కెఫెటేరియా... బేసెమెంట్ లో కార్ పార్కింగ్ అక్సిస్ మాత్రమే ఉంటుంది. కొంత మంది కి మాత్రం మల్టీ ఫ్లోర్... మల్టీ డిపార్ట్మెంట్ యాక్సిస్ ఉంటుంది. చాలా కొద్దిమందికి మాత్రమే బిల్డింగ్ మొత్తం తిరిగే ఆక్సిస్ ఉంటుంది. విశ్వామిత్ర అటువంటి ఎంప్లాయిస్ కోసం చూడసాగాడు.

అందరి id కార్డు డీటెయిల్స్ చాలా జాగ్రత్త చూసాక నలుగురు ఎంప్లాయిస్ డీటెయిల్స్ బాగా నచ్చాయి... వాటిని అవినాష్ కి చూపించాడు.

1. బిస్వాస్ మజుందార్ - సాఫ్ట్ వేర్ ఇంజనీర్ - హెడ్ అఫ్ ది డిపార్టుమెంటు - డేటా అడ్మినిస్ట్రేషన్. బిల్డింగ్గ్ ఆక్సిస్డ్ కంట్రోల్ - గ్రౌండ్ ఫ్లోర్, సర్వర్ ఫ్లోర్స్, కార్ పార్క్, ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్స్,

2. హరీష్ కోహ్లీ - HR Director - బిల్డింగ్ ఆక్సిస్ కంట్రోల్ - గ్రౌండ్ ఫ్లోర్, కార్ పార్క్, HR Department ఫ్లోర్, ట్రైనింగ్గ్ డిపార్టుమెంటు ఫ్లోర్, ఎగ్జిక్యూటివ్ ఫ్లోర్స్.

3. జార్జ్ కురియన్ - Head of Security Console - ఆక్సిస్ కంట్రోల్ - మొత్తం బిల్డింగ్.

4. నర్సింగ్ యాదవ్ - జానిటర్ - గ్రౌండ్ ఫ్లోర్, కెఫెటేరియా

అవినాష్ : వీళ్ళలో ఎవరి id క్లోన్ చెయ్యాలనుకుంటున్నావు.

విశ్వామిత్ర : అందరివి.

అవినాష్ : అందరివీ ఎందుకు? ఎదో ఒక్కడి id క్లోన్ చేస్తే చాలదా?

విశ్వామిత్ర : No. నర్సింగ్ యాదవ్ id రాత్రి 9 నుంచి ఉదయం 5 దాకా మాత్రమే పనిచేస్తుంది. మిగతా వాళ్ళవి 24 గంటలు పనిచేస్తాయి. నర్సింగ్ యాదవ్ id ఒక్క లోడింగ్ డాక్ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే పనిచేస్తుంది. నర్సింగ్ యాదవ్ ఆక్సిస్ కార్డు తో వెనకనుండి ఎవరికి అనుమానం రాకుండా బిల్డింగ్ లోకి వెళ్ళాలి. జార్జ్ కురియన్ ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. అది మెయిన్ సెక్యూరిటీ కన్సోల్ కి పక్కనే ఉంటుంది. జార్జ్ id తో ఆ ఆఫీస్ లోకి వెళ్ళగలం. ఆ రూమ్ లో టేబుల్ మీద కంప్యూటర్ ఉంది. అది ఆపరేట్ చెయ్యాలంటే జార్జ్ కురియన్ id కార్డు స్వైప్ చెయ్యాలి. ఒకసారి సెక్యూరిటీ డేటా బేస్ లోకి ఎంటర్ అయితే... ప్రతి రోజూ ఆ బిల్డింగ్ లోకి రోజంతా ఎవరెవరు వస్తున్నారో.. వెళ్తున్నారో... తెలుస్తుంది. ఎన్ని ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి... ఎక్కెడెక్కడ ఉన్నాయి... క్లియర్ గా తెలుస్తుంది. ఆ కంప్యూటర్ ని హాక్ చేస్తే చాలు... మనం ఇక్కడ కూర్చొని ఆ బిల్డింగ్ లో ప్రతి ఫ్లోర్ లో ఆక్సిస్ పాయింట్స్ ని కంట్రోల్ చెయ్యగలం. హరీష్ కోహ్లీ id కార్డు తో ఎంప్లాయ్ రికార్డ్స్ మొత్తం మన చేతుల్లో ఉంటాయి. మజుందార్ id కార్డు తో మనం సర్వర్ ఫ్లోర్ కి వెళ్ళగలం. ఒక్కసారి ఆ సర్వర్స్ యాక్సిస్ దొరికితే... మహేంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ డేటా మొత్తం మన చేతుల్లో ఉంటుంది. పని అవ్వగానే మళ్ళీ నర్సింగ్ యాదవ్ కార్డు వాడి బయటకి వచ్చేయాలి.

అవినాష్ : ఆ ఆఫీస్ కి ఎప్పుడు వెళదామని ప్లాన్ చేస్తున్నావ్?

విశ్వామిత్ర : ఆలస్యం ఎందుకు? ఇవ్వాళ రాత్రే వెళ్తాను.

అవినాష్ : వొద్దు. నేను చెప్పేదాకా కదలొద్దు. Op Center కి ఇంఫార్మ్ చేసి వాళ్ళ కాంకర్రన్స్ తీసుకున్న తరువాతే నువ్వు ఆ ఆఫీస్ లో అడుగుపెట్టాలి.

విశ్వామిత్ర : ఆల్రైట్... ఒక హెల్ప్ కావాలి... SS Enterprises అని జనిటోరియల్ సర్వీసెస్ కంపెనీ వుంది. నాకు వాళ్ళ యూనిఫామ్ ఒకటి కావాలి. ప్లీజ్... కొంచం ఏర్పాటు చేస్తావా?

అవినాష్ (కొంచం కోపంగా) : I AM AN ASSISTANT COMMISSIONER OF POLICE - CRIME BRANCH...

విశ్వామిత్ర (నవ్వుతూ) : Then it should not be problem for you to arrange it at short notice. Thank you very much.


విశ్వామిత్ర వెళ్లిన తరువాత DSP శేఖర్ SI శ్రీధర్ ని వెంట పెట్టుకొని అవినాష్ ఆఫీస్ కి వచ్చాడు. వాళ్ళని చూడగానే అవినాష్ తన సీట్ లోంచి లేచి ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమన్నాడు. ఫోన్ చేసి శాండీ కూడా వచ్చి మీటింగ్ లో జాయిన్ అవ్వమని చెప్పాడు.

అవినాష్ (శ్రీధర్ తో) : వెల్ డన్... ఎక్సలెంట్... బాగా కష్టపడినట్టున్నారు.

శ్రీధర్ : అదేమీ లేదు సర్... వాళ్ళని ఫాలో అవుతున్నంతసేపు ఎప్పుడెప్పుడు వాళ్ళని intercept చేసి అరెస్ట్ చేద్దామా అని బాగా టెంప్ట్ అయ్యాము.

అవినాష్(నవ్వుతూ) : థాంక్ గాడ్... ఆ పని చెయ్యనందుకు... మీకో ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ అప్పగించాలని పిలిచాను. మీరు మీ టీం తో ఆ ఆదివాసులు డ్రగ్స్ సుభాష్ కి హ్యాండ్ ఓవర్ చేసిన ప్లేస్ కి వెళ్లి స్టేక్ అవుట్ చెయ్యాలి. ఆదివాసులకు ఆ డ్రగ్స్ ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకోవాలి.

శ్రీధర్ : తప్పకుండా సర్... వి విల్ డు ఇట్.

అవినాష్ : మీరు ఆ డెలివరీ పాయింట్ దగ్గర ఎంతసేపు ఉన్నారు?

శ్రీధర్ : అక్కడ ఎక్కువసేపు లేము... మేము అక్కడికి చేరిన 30 నిమిషాల్లో ఆదివాసులు వచ్చారు... మొత్తం లోడ్ అవ్వడానికి ఒక గంట పైనే పట్టింది... అంత 2 గంటల లోపల జరిగిపోయింది.

అవినాష్ : ఆ ఏరియా చూస్తే మీకేమనిపిచింది?

శ్రీధర్ : మేము ఎక్కడైతే ఆగామో... అక్కడనుంచి అడవి మొదలవుతుంది. ఆదివాసులు డెలివరీ అవ్వగానే వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. అక్కడికి చత్తిస్గడ్ స్టేట్ బోర్డర్ చాలా దగ్గర... ఆ ఆదివాసులు తెలంగాణ వాళ్ళా... లేక పాక రాష్ట్రం వాళ్ళో తెలీదు. ఆ అడవి రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. స్టేట్ బౌండరీస్ గుర్తించడం కష్టం.

అవినాష్ : సుభాష్ ప్రతి 4 రోజులకు ఒకసారి డ్రగ్స్ ని హైదరాబాద్ కి తీసుకొని వస్తాడు. ఈసారి వాళ్ళు ఆ డెలివరీ పాయింట్ కి చేరే లోపల మీరు అక్కడికి వెళ్లి డెలివరీ పూర్తికాగానే మీరు ఆ ఆదివాసులని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కనిపెట్టాలి. ఇది జస్ట్ Observe and Report అసైన్మెంట్. వాళ్లకి ఎట్టిపరిస్థితిలో అనుమానం రాకుండా ఫాలో అవ్వాలి. ఇంకో సంగతి... మీతో పాటు ఇంకో అయిదుగురు ఇండియన్ ఆర్మీ జవాన్స్ కూడా వస్తారు. మీకు మిలిటరీ వెపన్స్... శాటిలైట్ కమ్యూనికేషన్... కామోఫ్లాజ్ యూనిఫామ్... అస్సాల్ట్ రైఫిల్స్... నైట్ విజన్ గాగుల్స్ కనీసం 4 లేదా 5 రోజుల కి ప్రిపేర్ అవ్వండి. ఇంకో సంగతి... మీరు డేంజర్ లో ఉంటే మీకు బ్యాక్ అప్ హెల్ప్ రావడానికి టైం పట్టొచ్చు. కనీసం 60 నిమిషాలు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి రెడీ గా ఉండండి. అక్కడ హెవీ ఫైరింగ్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరు వెళ్తున్నది ఒక ల్యాండ్ మైన్ ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇవ్వాళ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి వెళ్ళండి. అక్కడ మీకు బ్రిగేడియర్ మాధవ్ రావు స్వయంగా అన్ని విషయాలు మీకు బ్రీఫ్ చేస్తారు. శాండీ మీకు సర్వైలన్సు ఎక్విప్మెంట్ గురించి చెప్తాడు.

శాండీ : ఈ మిషన్ కి మేము కీడా... చిడియా... ఈగిల్... కాకుండా వెరీ అడ్వాన్సుడ్ మిలిటరీ డ్రోన్ వాడబోతున్నాము. అమెరికన్ మేడ్ MQ9 Reaper. దీన్ని ఎక్కువగా బాంబ్స్ వెయ్యడానికి ఎక్కువగా వాడతారు. దీన్ని సర్వైలన్సు కి కూడా వాడవొచ్చు. దానికి వెరీ పవర్ఫుల్ కెమెరా వుంది. దాదాపు 5 కిలోమీటర్స్ రేడియాస్ లో UHD ఫొటోస్... వీడియోస్ రికార్డు చేసి రియల్ టైం లో Op Center కి అప్లోడ్ చేస్తుంది. సాటిలైట్ ద్వారా కంట్రోల్ చేస్తాము. మీకు మిలిటరీ గ్రేడ్ సాటిలైట్ ఫోన్ ఇస్తాము. ఆ MQ9 Raeper ఆ ఫోన్ సిగ్నల్స్ ని ఫాలో అవుతుంది. మీకు బ్యాక్ అప్ గా నాలుగు ఈగిల్స్ ని కూడా ఇస్తాము. అవసరమైతే పనికి వస్తుంది.

ఆ రోజు సాయంత్రం SI శ్రీధర్ తన టీం ని తీసుకొని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి వెళ్ళాడు. అక్కడ బ్రిగేడియర్ మాధవ్ వాళ్లకి ఏమేమి చెయ్యాలో... ఎలా చెయ్యాలో... చాలా వివరంగా చెప్పి ఇండియన్ ఆర్మీ టీం ని వాళ్లకి పరిచయం చేసాడు. "మీ పది మంది ఒక పెద్ద ఆపరేషన్ మీద వెళ్తున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం లేదు. మీరు వెళ్తున్నది. డొమెస్టిక్ టెర్రర్ గ్రూప్ స్థావరాన్ని కనిపెట్టడానికి. అక్కడ వాళ్ళు డ్రగ్స్ భారీ ఎత్తున తయారుచేసి మన దేశం లో అమ్మడమే కాకుండా విదేశాలకి కూడా ఎగుమతి చేస్తున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు వెళ్తున్నది జంగిల్ ఏరియా. ఇండియన్ ఆర్మీ కి జంగిల్ వార్ఫేర్ కొత్తకాదు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ పోలీస్ ని కూడా కాపాడాలి. హైదరాబాద్ పోలీస్ ఈ మిషన్ లో చాలా కస్టపడి ఒక దశ దాకా తీసుకొని వచ్చారు. వాళ్ళని కూడా మనం భాగస్వామిగా చేసుకోవడం మనకి అవసరం. ఎనిమి టెర్రిటరీ లోకి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర హెవీ అమ్మునియేషన్ ఉంటుంది. లాంగ్ రేంజ్ రైఫిల్స్... Sniper ఎటాక్ కూడా ఉండవచ్చు. ఎలివేటెడ్ పొజిషన్స్ ని జాగ్రత్తగా గమనిస్తూ కదలండి. మీకు ఏరియల్ సర్వైలన్సు ఏర్పాటు చేసాము. మీకు ప్రమాదం లో పడితే... మాకు సిగ్నల్ ఇవ్వండి. 60 నిమిషాల్లో మేము మీ దగ్గర ఉంటాము. నేనే స్వయంగా టీం ని తీసుకొని వస్తాను. సికింద్రాబాద్ లో ఒక టీం... వరంగల్ లో ఇంకో టీం రెడీ గా ఉంటాయి. మేము వెంటనే బయలుదేరతాము. అప్పటిదాకా మీరు మిమ్మల్ని కాపాడుకుంటే చాలు. మాకు కన్ఫర్మేషన్ రాగానే మిమ్మల్ని మేము మిలిటరీ హెలీకాఫ్టర్స్ లో రండేవ్ కి తీసుకొని వెళ్తాము. Gentleman... remember we took an oath to protect our motherland from the enemies across the border as well as enemies within... This is an act of terror on the sovereign territory of India. We must eliminate every emeny. Good Luck... make us proud..."

అందరూ ఎదురు చూస్తున్న రోజు వచ్చింది... ఆ రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో యధావిధిగా సుభాష్ consignment తీసుకొని రావడానికి బయలుదేరాడు.... అదే రోజు రాత్రి 1 గంట సమయంలో విశ్వామిత్ర SS Enterprises యూనిఫామ్ వేసుకొని ఒక బ్యాక్ ప్యాక్ భుజాన వేసుకొని మహీంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ని కిందా మీద చెయ్యడానికి బయలుదేరాడు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో బ్రిగేడియర్ మాధవ్ రావు నాయకత్వం లో రెండు హెలీకాఫ్టర్స్ లో 10 మంది టీం ని రండేవ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసి... "please be careful... message me the coordinates of extraction point... we will be there immediately" అని అన్నాడు.


Part - 18 - The Discovery

సుభాష్ SUV హై వే మీద వెళ్తోంది. వాళ్ళని ఎవరూ ఫాలో అవ్వడం లేదు. దారి మధ్య లో అతనికి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. MACHATE కంప్లీట్. CHAPORI సాయంత్రానికి పూర్తి అవుతుంది. TELCHAT సప్లైస్ దారి లో ఉన్నాయి. వాటిని ఇవ్వాళ బేస్ కి చేర్చాలి. సుభాష్ ఈ విషయాన్ని వెంటనే మహీంద్ర పర్సనల్ సెక్రటరీ కళాధర్ కి తెలియచేసాడు. అదే సమయంలో వసంత కూడా ఒక మెసేజ్ పంపింది. స్టాక్ మొత్తం మిల్ కి చేరింది. Op Center వాళ్ళకి ఈ మెసేజెస్ రియల్ టైం లో వెళ్లిపోయాయి.


అవినాష్ బుర్రలో ఎంత వొద్దనుకున్నా MACHATE... TELCHAT... CHAPORI... ఈ మూడు పదాలే తిరుగుగుతున్నాయి. ఏదో లింక్ ఉంది. లేకపోతే ఈ పదాలని రిపీటెడ్ గా ఎందుకు వాడతారు? డెఫినిట్ గా అవి కోడ్ వర్డ్స్. ఎలా బ్రేక్ చెయ్యాలి? MACHATE అంటే స్పానిష్ భాషలో ఒక పెద్ద పట్టా కత్తి... లేదా పెద్ద సుత్తి అని అర్ధం. పైగా స్పెల్లింగ్ కూడా తప్పుగా ఉంది. MACHETE అనేది స్పానిష్ పదం. ఇక్కడ MACHATE అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదాలని రకరకాలుగా ఆరెంజ్ చేసి చూసాడు.... ఎక్కడా లింక్ దొరకడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కోడ్ బ్రేకింగ్ సాఫ్ట్ వేర్ ఉంది. ఈ మూడు పదాలని ఆ సాఫ్ట్ వేర్ లో లోడ్ చేసాడు. సెవెన్ లెటర్ వర్డ్ కి 720 కాబినేషన్స్ వచ్చాయి. మూడు పదాలకి కలిపి దాదాపు 2200 వివిధ పదాలని చూపించింది. దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కంప్యూటర్ మూసేసి వెళ్లిపడుకున్నాడు.


రాత్రి ఒంటిగంట సమయం... విశ్వామిత్ర నర్సింగ్ యాదవ్ యూనిఫామ్ వేసుకొని మహీంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ వెనక భాగానున్న లోడింగ్ డాక్ చేరుకున్నాడు. తలమీద బేస్ బాల్ కాప్ పెట్టుకోవడం తో మొహం సరిగ్గా కనిపించడం లేదు. ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర నర్సింగ్ యాదవ్ id కార్డు ని స్వైప్ చేసి బిల్డింగ్ లోకి అడుగుపెట్టాడు. ఆ సమయం లో రకరకాల సరుకులు లారీ లోంచి ఆఫీస్ లోకి తీసుకెళ్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో SUBWAY... COSTA COFFEE... DOMINO'S PIZZA... CHUTNEY'S... ఒక చైనీస్ రెస్టారంట్... ఒక నార్త్ ఇండియన్ రెస్టారంట్... STARBUCKS కాఫీ షాప్... ఇంకా చాలా ఉన్నాయి. వాటికి కావాల్సిన సరుకులు రాత్రి సమయం లో ఆఫీస్ లో ఎంప్లాయిస్ లేనప్పుడు తీసుకొని వస్తారు. అదే రకంగా కార్పెట్ క్లీనింగ్... డస్ట్ బిన్ ఎంప్టీ చేయడం... ఆఫీస్ లో అన్ని ఫ్లోర్స్ క్లీన్ చెయ్యడం... టాయిలెట్స్ లో టిష్యూ పేపర్స్... సోప్స్... లోషన్స్ ని రీఫిల్ చెయ్యడం... ఫ్లోర్ క్లీనింగ్... ప్రతి ఫ్లోర్ లో బ్రేక్ అవుట్ ఏరియా క్లీన్ చెయ్యడం... ఈ పనులన్నీ రాత్రి 9 తరువాత మొదలవుతాయి.

విశ్వామిత్ర ఒక వాక్యుమ్ క్లీనర్ ని తీసుకొని సెక్యూరిటీ కన్సోల్ వైపు వెళ్ళాడు. ఆ సమయం లో అక్కడ పెద్దగా స్టాఫ్ లేరు. పెద్ద రూమ్ లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. విశ్వామిత్ర ఆ రూమ్ డోర్ మీద తట్టాడు ఒక సెక్యూరిటీ ఎంప్లాయ్ డోర్ ఓపెన్ చేసి విశ్వామిత్ర ని లోపలికి రానిచ్చాడు. విశ్వామిత్ర దాదాపు ఒక 30 నిమిషాల పాటు ఆ రూమంతా వాక్యుమ్ క్లీన్ చేసాడు. సెక్యూరిటీ కన్సోల్ లో కంప్యూటర్స్ అన్ని Apple iMAC మెషీన్స్... ఆ రూమ్ లో స్టాఫ్ చాలా బిజీ గా కంప్యూటర్స్ మీద పనిచేసుకుంటున్నారు. విశ్వామిత్ర చేస్తున్నది వాళ్ళు పట్టించుకోలేదు. విశ్వామిత్ర తనతో పాటు తెచ్చుకున్న పెన్ డ్రైవ్స్ ని ఆ రూమ్ లోని కంప్యూటర్స్ కి అటాచ్ చేసాడు. ఆ కంప్యూటర్స్ ఆన్ చెయ్యగానే ఆ పెన్ డ్రైవ్స్ లో ఉన్న స్పై వేర్ ఆ కంప్యూటర్స్ లో ఇంస్టాల్ అయ్యి Op Center కి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ కన్సోల్ కంప్లీట్ ఆక్సిస్ దొరుకుతుంది. ఆ రూమ్ లో పని కాగానే... అక్కడి ఎంప్లాయ్ ని "సర్... ఆ పక్క రూమ్ ఓపెన్ చేస్తారా... అక్కడ కూడా వాక్యుమ్ చెయ్యాలి" అని అన్నాడు. వెంటనే ఒక ఎంప్లాయ్ పక్క రూమ్ ఓపెన్ చేసి విశ్వామిత్ర ని లోపలి పంపించాడు. ఆ రూమ్ సెక్యూరిటీ హెడ్ జార్జ్ కురియన్ ఆఫీస్.

విశ్వామిత్ర కురియన్ రూమ్ లో పెద్దగా టైం వేస్ట్ చెయ్యలేదు. రూమ్ లోకి వెళ్ళగానే తన దగ్గరున్న కురియన్ యాక్సిస్ కార్డు తో ఆ రూమ్ లోని కంప్యూటర్ ని ఆన్ చేసాడు. కురియన్ కి ఆ బిల్డింగ్ పూర్తి ఆక్సిస్ ఉంది. ఆ కంప్యూటర్ లో కూడా స్పై వేర్ ఇంస్టాల్ చేసి డేటా సెంటర్ సర్వర్స్ ఉన్న అయిదు ఫ్లోర్స్ లో ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసాడు. ఎవరూ లేరు. వెంటనే ఆ ఫ్లోర్స్ ఉన్న అన్ని సెక్యూరిటీ కెమెరాలలో లైవ్ ఫీడ్ రికార్డు కాకుండా చేసి పాత ఫీడ్ తో నింపేసి... వెంటనే కంప్యూటర్ లాగ్ అవుట్ చేసేసి రూమ్ లోంచి బయటకి వచ్చి లిఫ్ట్ ఎక్కి డేటా సెంటర్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసాడు. ఆ బిల్డింగ్ లో డేటా సెంటర్ 5 ఫ్లోర్స్ లో ఉంది. మహింద్ర కంపెనీ డేటా మైనింగ్... డేటా వేర్ హోసింగ్... సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్... సిస్టమ్స్ మైంటెనెన్సు... క్లౌడ్ సర్వీసెస్... గ్రూప్ కంపెనీస్ అకౌంటింగ్... ఆడిటింగ్... రిపోర్టింగ్... అన్ని రకాల ఆక్టివిటీస్ ఆ డేటా సెంటర్ లో రికార్డు అవుతాయి. వాటితో పాటు డ్రగ్స్ బిజినెస్ కి సంభందించిన కమాండ్ సెంటర్ సర్వర్స్ కూడా ఈ డేటా సెంటర్ లోనే ఉన్నాయి. డేటా సెంటర్ మొదటి ఫ్లోర్ లో లిఫ్ట్ ఆగింది.

అక్కడ బిస్వాస్ మజుందార్ ఆక్సిస్ కార్డు వాడి లోపలి అడుగుపెట్టాడు. ఆ ఫ్లోర్ అంతా సర్వర్స్ లో నిండి ఉంది. విశ్వామిత్ర అక్కడి హార్డ్ వేర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. చాలా ఖరీదైన... స్టేట్ అఫ్ ఆర్ట్ సిస్టమ్స్... ఆ ఫ్లోర్ నుంచి ఫై ఫ్లోర్ కి వైర్లు... కేబుల్స్... వెళ్ళడానికి పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి... అంటే... ఈ సర్వర్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యివున్నాయి. So that they can talk to each other... ఒక సర్వర్ కి పెన్ డ్రైవ్ అట్టాచ్ చేసాడు. వెంటనే స్పై వేర్ అందులోకి డౌన్ లోడ్ అయ్యింది. విశ్వామిత్ర వచ్చిన పని అయ్యింది. కానీ... మిగతా డేటా సెంటర్ సర్వర్స్ ని కూడా ఒకసారి చెక్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ లో కాకుండా మెట్లు ఎక్కి ఫై ఫ్లోర్ కి వెళ్ళాడు. అక్కడ అంతా కింద ఫ్లోర్ లాగానే రకరకాల సర్వర్స్ తో నిండి ఉంది. అక్కడ కూడా వైర్లు... కేబుల్స్... ఆ పైనున్న ఫ్లోర్ కి వెళ్ళడానికి పెద్ద పెద్ద రంధ్రాలున్నాయి. అన్ని ఫ్లోర్స్ లో సర్వర్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి... ఇది కంఫర్మ్ అయ్యాక అక్కడ కూడా ఒక సర్వర్ లో తన స్పై వేర్ ఇంస్టాల్ చేసి ఇంకో ఫ్లోర్ కి వెళ్ళాడు.

ఆ ఫ్లోర్ లో... ఒక చోట గోడకి దగ్గర పెద్ద టేబుల్ ఉంది... ఆ టేబుల్ మీద 25 మైక్రోవేవ్ ఓవెన్స్ వరసగా ఉన్నాయి. వాటిని చూడగానే విశ్వామిత్ర పెదాలమీద చిరునవ్వు వచ్చింది... YES... ఈ సెట్ అప్ కోసమే వెతుకుతున్నాడు. కింద రెండు ఫ్లోర్స్ లో మైక్రోవేవ్ ఓవెన్స్ కనిపించలేదు. ఆ టేబుల్ సొరుగుని వెతికాడు... ఊహించినట్లే ఆ సొరుగుల్లో ఐరన్ హమ్మర్స్ కనిపించాయి. సర్వర్ రూమ్స్ లో మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నదంటే... అక్కడ ఇల్లీగల్ పని జరుగుతోందని సిగ్నల్. ఉదాహరణకు ఆ ఆఫీస్ మీద Income Tax లేదా వేరే ఏదైనా గవర్నమెంట్ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు రైడ్ చేసినప్పుడు సర్వర్ లోని డేటా వాళ్లకి దొరక్కుండా ఆ సర్వర్ హార్డ్ డిస్క్ లని బయటకి లాగేసి వాటిని సుత్తి తో హార్డ్ డిస్క్ ప్లాటర్స్ నాశనమయ్యేలా గట్టిగా కొట్టి ఆ హార్డ్ డిస్క్ ని మైక్రోవేవ్ ఓవెన్ లో ఒక 5 సెకండ్స్ వేడి చేస్తే చాలు ఆ హార్డ్ డిస్క్ ఎందుకూ పనికి రాకుండా నాశనం అవుతాయి.

విశ్వామిత్ర చాలా జాగ్రత్త గా ఆ ఫ్లోర్ లోని సర్వర్స్ ని చెక్ చేసాడు. అన్ని సర్వర్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి... కానీ ఒక్క సర్వర్ మాత్రం ఆ ఫ్లోర్ లో వేరే ఏ సర్వర్ కి కనెక్ట్ కాకుండా ఇండిపెండెంట్ గా ఉంది. దాని కేబుల్స్ ఫై ఫ్లోర్స్ ... కింద ఫ్లోర్స్... కనెక్ట్ అవ్వలేదు. STAND ALONE SERVER... ఆ సర్వర్ ని జాగ్రత్తగా చెక్ చేసాడు. చాలా హార్డ్ డ్రైవ్స్ ఉన్నాయి. ఆ సర్వర్ కి దగ్గరలోనే మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా ఉన్నాయి. అంటే... ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే ఆ సర్వర్ లోంచి హార్డ్ డ్రైవ్స్ ని వెంటనే లాగేసి సుత్తులతో కొట్టి మైక్రోవేవ్ లో పడెయ్యడానికి అనువుగా వుంది. విశ్వామిత్ర ఒకసారి ఆ ఫ్లోర్ అంతా చెక్ చేసి ఎవరూ లేరని నిర్ధారణ అయ్యాక తన బ్యాక్ ప్యాక్ లోంచి లాప్ టాప్ తీసి ఒక ఈతెర్నెట్ కేబుల్ తో ఆ సర్వర్ కి కనెక్ట్ చేసి తన స్పై వేర్ ని ఇంస్టాల్ చేసి ఆ సర్వర్ లోని డేటా ని చెక్ చేసాడు. ఆ సర్వర్ డేటా ని తన లాప్ టాప్ లోకి డౌన్ లోడ్ చేసాడు. వచ్చిన పని పూర్తి కాగానే లాప్ టాప్ ని తన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని వెంటనే లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ చేరుకొని బిల్డింగ్ వెనకున్న లోడింగ్ డాక్ ఏరియా డోర్ లోంచి నర్సింగ్ యాదవ్ కార్డు ని వాడి బయటకి వచ్చేసాడు. అప్పటికి టైం ఉదయం 4:30...


సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా... హెలిపాడ్ దగ్గర టీం రెడీ గా ఉంది. హెలికాఫ్టర్ లో అయిదుగురు హైదరాబాద్ పోలీసులు... అయిదుగురు ఇండియన్ ఆర్మీ జవాన్స్... వాళ్ళతో పాటు బ్రిగేడియర్ మాధవ్ కూడా ఉన్నాడు. సరిగ్గా ఉదయం 4:30 నిమిషాలకి హెలికాఫ్టర్ నిశ్శబ్దం గా గాల్లోకి లేచింది. హెలికాఫ్టర్ లో అందరూ కామోఫ్లాజ్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. అందరి దగ్గరా అస్సౌల్త్ రైఫిల్స్... నైట్ విషన్ గాగుల్స్... మొహం మీద వార్ పెయింట్ వేసుకొని ఉన్నారు. ఇద్దరు ఆర్మీ జవాన్స్ దగ్గర సాటిలైట్ కమ్యూనికేషన్స్ సెట్స్ ఉన్నాయి. ఎవరూ మాట్లాడకుండా కూర్చొని ఉన్నారు. ఇంతలో హెలికాఫ్టర్ పైలట్ "Five Minutes to drop zone" అని అన్నాడు. అదివిన్న మాధవ్ "మిమ్మల్ని డ్రాప్ చేసిన తరువాత మీకు ఇచ్చిన ఇంస్ట్రక్షన్స్ జాగ్రత్త గా ఫాలో అవండి. గ్రౌండ్ మీదకి చేరగానే సాటిలైట్ కమ్యూనికేషన్స్ ని ఆన్ చెయ్యండి. ఆ ఆదివాసులు రండేవ్ కి రాగానే మాకు సిగ్నల్ పంపండి. మేము వెంటనే Reaper ని పంపిస్తాము. అది మీరు ఎక్కడికి వెళ్లినా మీతోనే ఉంటుంది. please be careful.... message me the coordinates of extraction point... we will be there immediately" అని అన్నాడు. హెలికాప్టర్ డ్రాప్ జోన్ లో ల్యాండ్ అయింది. ఒకే ఒక్క నిమిషం లో పది మంది కిందికి దిగారు. వెంటనే హెలికాఫ్టర్ గాల్లోకి లేచి సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోయింది. అంతా చిమ్మ చీకటి. ఇంకా తెల్లవారలేదు. నైట్ విషన్ గాగుల్స్ పెట్టుకొని సేఫ్ ప్లేస్ కోసం వెతికారు. పోలీసులు ఆ ఏరియా లో సుభాష్ SUV ఎటునుంచి వస్తుంది.... ఆది వాసులు ఎటునించి వస్తారో... ఆర్మీ జవాన్స్ కి చెప్పారు. అందరూ కనిపించేలా దాక్కోవడానికి మంచి ప్లేస్ కోసం వెతికారు. ఒక చోట బాగా పొదలు కనిపించాయి. ఆ పొదల వెనకాల కూర్చొని సుభాష్... ఆదివాసుల కోసం ఎదురు చూడసాగారు.

సూర్యోదయం అయ్యింది. ఒక వైపునుంచి సుభాష్ SUV... దాని వెనకాలే లారీ కూడా వచ్చాయి. ఒక 15 నిమిషాల తరువాత ఇంకో వైపునుంచి ఆదివాసులు కూడా వచ్చారు. వాళ్ళని చూడగానే ఆర్మీ జవాన్స్ సికింద్రాబాద్ ఆర్మీ బేస్ కి మెసేజ్ పంపారు. అప్పటికే ఆర్మీ బేస్ చేరుకున్న బ్రిగేడియర్ మాధవ్ ఢిల్లీ లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి Reaper పంపమని చెప్పాడు.ఢిల్లీ లో పాలం అనే పల్లెటూరులో ఆర్మీ / ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి. ఆర్మీ బేస్ ఎయిర్పోర్ట్ లో రెడీ గావున్న Reaper టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇచ్చారు. Reaper కంట్రోల్ రూమ్ నుంచి రిమోట్ గా దాన్ని ఆపరేట్ చేస్తూ దాన్ని రన్ వే మీదకి తీసుకొచ్చారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి టేక్ ఆఫ్ సిగ్నల్ రాగానే 30 సెకండ్స్ లో Reaper గాల్లోకి లేచింది. ఆ Reaper కి ఆర్మీ జవాన్ సాటిలైట్ కమ్యూనికేషన్స్ సెట్ ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్స్ ని సింక్ చేశారు. ఇప్పుడు ఆ Reaper ఆ సిగ్నల్ టెర్మినేట్ అయ్యేదాకా ఆ ఆర్మీ జవాన్ ని ఫాలో ఆవుతూనే ఉంటుంది.

డ్రాప్ జోన్ దగ్గర సుభాష్ ఆ ఆదివాసులతో ఏదో మాట్లాడాడు. ముందుగా లారీ లోంచి ఏవో క్యాన్స్ ని కిందకి దించారు. వాటి నిండా ఏవో కెమికల్స్ ఉన్నాయి. లారీ ఖాళీ కాగానే ఆ ఆదివాసులు తెచ్చిన డ్రగ్స్ ని లారీ లోకి ఎక్కించారు. లోడింగ్ అవ్వగానే లారీ బయలుదేరింది. దాని వెనకాలే సుభాష్ కూడా బయలుదేరాడు. ఆ ఆదివాసులు ఆ లారీ లోంచి దింపిన కెమికల్స్ క్యాన్స్ ని గాడిదలమీద గట్టిగా కట్టేసి అడివి లోకి దారి తీశారు.

ఒక పది నిమిషాల తరువాత ముందు ఆర్మీ జవాన్స్ బయలుదేరారు. వాళ్లకి ఓ 10 అడుగుల దూరం లో పోలీస్ టీం కదిలింది. ఆర్మీ పోలీస్ టీం కి స్ట్రిక్ట్ గా చెప్పింది. "మీరు ఆర్మీ జవాన్స్ వెనకాలే ఉండాలి. పొరపాటున కూడా వాళ్ళ ముందు నడవడానికి ప్రయత్నించకండి. ఒకవేళ ఎనిమి ఫైరింగ్ చేస్తే ముందుగా బులెట్ ని ఎలా ఫేస్ చెయ్యాలో ఆర్మీజవాన్ కి బాగా తెలుసు. వాళ్ళు ఏమి చెప్తే అది మీరు ఫాలో అవ్వాలి"

ఆదివాసులు చాలా వేగంగా కదలసాగారు. వాళ్లకి ఆ రూట్ బాగా అలవాటుకాబట్టి చాలా వేగంగా కదలసాగారు. వాళ్ళని ఒక 200 మీటర్స్ దూరం లో ఆర్మీ జవాన్స్... వాళ్లకి 10 అడుగుల దూరం లో పోలీస్ టీం కదిలారు. ఒక అరగంట లో వాళ్ళు చిట్టడివిలోకి చేరారు. దారి చాలా కష్టం గా వుంది. ఆర్మీ వాళ్ళు కి అలంటి ట్రాక్ లో నడవడం అలవాటు కాబట్టి వాళ్ళు బానే నడుస్తున్నారు. వాళ్ళ వెనక వస్తున్నా పోలీస్ టీం మాత్రం చాలా కష్టపడుతోంది. వాళ్ళు జీవితం లో ఎప్పుడూ సిటీ వొదిలి బయటికి వెళ్ళలేదు. మహా అయితే హైదరాబాద్ లో ఇందిరా పార్క్... KBR పార్క్ కి జాగింగ్ చెయ్యడానికి వెళ్ళుంటారు. వాళ్ళ కష్టం చూసి ఆర్మీ జవాన్స్ తమ టీం ఫార్మషన్ మార్చారు. అప్పటిదాకా ముందు ఆర్మీ జవాన్స్ ఐదుగురూ పక్క పక్కనే నడిస్తే... వాళ్ళ వెనక పోలీస్ టీం ఒక్కో జవాన్ వెనక ఒక పోలీస్ నడిచారు. ఇప్పుడు ముందు ఒక ఆర్మీ జవాన్ వెళ్తున్నాడు. అతని వెనక ఇద్దరు ఆర్మీ జవాన్స్ వెళ్తున్నారు వాళ్ళ వెనక అయిదుగురు పోలీసులు వాళ్ళ వెనక ఇంకో ఇద్దరు ఆర్మీ జవాన్స్ నడవసాగారు. వాళ్లకి నెట్టి మీద 10,000 అడుగుల ఎత్తులో Reaper వేళ్ళని ఫాలో అవుతూ ఆ ఏరియా మొత్తాన్ని ఫోటోగ్రఫీ చేస్తోంది. ఆ ఇమేజెస్ Op Center లో గోడమీద స్క్రీన్ లో కనిపిస్తున్నాయి.


ఉదయం 8 గంటలు... అవినాష్ నిద్రలేచి ఆఫీస్ కి తయారవుతున్నాడు. యూనిఫార్ వేసుకుంటూ ఆ మూడు కోడ్స్ గురించి ఆలోచించసాగాడు. ఎక్కడో కన్సెషన్ దొరికినట్లు అనిపిస్తోంది... వెంటనే ఎదో అనుమానం. అన్యమనస్కంగా బ్రేక్ ఫాస్ట్ చేసి కాఫీ తాగుతూంటే మొబైల్ ఫోన్ మోగింది. శాండీ కాల్ చేసాడు... "జంగిల్ నుంచి ఇమేజెస్ రావడం మొదలయ్యింది... Just thought of informing you..." అని అన్నాడు... అవినాష్ కాఫీ తాగుతూ శాండీ తో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అతని ద్రుష్టి డ్రాయింగ్ రూమ్ లోని బుక్ షెల్ఫ్ మీద పడింది. అవినాష్ కి నొవెల్స్ చదవడం అలవాటు. బాగా నచ్చిన బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ బుక్స్ వైపు చూస్తూ కాఫీ తాగడం పూర్తిచేసి ఆఫీస్ కి వెళ్ళడానికి బయటికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న కార్ ఎక్కాడు. కార్ కదిలింది... ఇంటి గేట్ దాగా వచ్చింది... అప్పుడే అవినాష్ బుర్రలో బల్బ్ వెలిగింది... "Stop the car" అని గట్టిగా అరిచాడు. డ్రైవర్ భయపడి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసాడు. అవినాష్ కార్ లోంచి దిగి ఇంట్లోకి పరిగెత్తి డ్రాయింగ్ రూమ్ లో బుక్ షెల్ఫ్ దగ్గర కెళ్ళి అందులోంచి ఒక ఇంగ్లీష్ నవల తీసి దాన్ని గట్టిగా ముద్దు పెట్టుకొని.... " Yes... I got it..." అని ఆనందంతో గట్టిగా అరుస్తూ వెళ్లి కార్ ఎక్కి ఆఫీస్ కి వెళ్ళాడు.


అడవిలో ఆదివాసులు చక చక అడుగులు వేస్తూ కదులుతున్నారు. వాళ్ళ వెనకాలే ఆర్మీ... పోలీస్ టీమ్స్ చాలా జాగ్రత్తగా వాళ్లకి అనుమానం రాకుండా చెట్ల చాటునుంచి ఫాలో అవుతున్నారు. సడన్ గా వాళ్ళ ముందు ఒక పెద్ద కొండ ప్రత్యక్షం అయింది. ఆదివాసులు ఆ కొండ ఎక్కసాగారు. వాళ్ళ వెనకాలే జాయింట్ ఫోర్స్ కూడా ఎక్కసాగింది. చాలా పెద్ద కొండ. దాన్ని ఎక్కడానికి పోలీస్ టీం బాగా కష్టపడుతోంది. ఆదివాసులు వేగంగా కదులుతున్నారు. ఇది గమనించి... ఒక ఆర్మీ జవాన్.... "ఇద్దరం వాళ్ళ వెంట వెళ్తాము... మా వెనకాలే ముగ్గురు ఆర్మీ జవాన్స్ వస్తారు... మీరు క ొంచం నెమ్మదిగా రండి..." అని పోలీస్ టీం కి చెప్పి ఇద్దరు జవాన్స్ వేగంగా కొండ ఎక్కసాగారు... వాళ్ళ వెనకాలే ముగ్గురు ఆర్మీ జవాన్స్... వాళ్ళ వెనకాల కొంచం దూరం లో పోలీస్ టీం కదిలారు. దాదాపు 3 గంటల సేపు ఎక్కిన తరువాత ముందు గా వెళ్లిన ఆర్మీ జవాన్స్ కొండా పైభాగాన్ని చేరుకున్నారు. వాళ్లకి కొంచం దూరం లో ఆదివాసులు కొండా దిగుతూ కనిపించారు. జవాన్స్ గబగబా పరిగెత్తుకుని వెళ్లారు... ఒక్కసారిగా బ్రేక్అ వేసినట్లు ఆగిపోయారు. అక్కడ వాళ్లకి ముందుగా కొండ దిగుతున్న ఆదివాసులు కనిపించారు... కొండ కింద గుడిసెలు కనిపించాయి. వాళ్ళు బైనాక్యూలర్స్ లో ఆ ఏరియా ని పరిశీలించారు... అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్లకి నోట మాట రాలేదు. మిగిలిన టీం వచ్చి వాళ్ళని చేరింది. వాళ్ళు కూడా బైనాక్యూలర్స్ లో కొండ కిందకి చూడసాగారు. వాళ్లలో ఒకడి నోటి వెంట "దీనమ్మ జీవితం...." అని వెలువడింది. ఆ మాట Op Center లో Reaper పంపిస్తున్న ఇమేజెస్ గోడమీద స్క్రీన్ లో చూస్తున్న రవీంద్ర... సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న మాధవ్ విని నవ్వుకున్నారు.


Part - 19 - The Code Breaker

అవినాష్ ఆఫీస్ లోకి అడుగు పెడుతూనే శాండీ ని తన రూమ్ కి రమ్మన్నాడు. తన సెక్రటరీ కి తన మొబైల్ ఫోన్ ఇస్తూ "ఒక్క సీనియర్ ఆఫీసర్స్ తప్ప... వేరే ఎవరు ఫోన్ చేసినా నా నేను బిజీ గా ఉన్నానని చెప్పు... Do not disturb me" అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. శాండీ తన రూమ్ లోకి రాగానే "Close the door and observe. Do not disturb my thought process" అని అంటూ రూమ్ లోని వైట్ బోర్డ్ మీద...

MACHATE ---------------------------- TELCHAT ---------------------------- CHAPORI

ఈ పదాలని దూర దూరంగా వ్రాసాడు. ఈ మూడు పాదాలలోంచి కామన్ లెటర్స్ ని కింద రాసాడు.

CHATE ---------------------------- CHAT ---------------------------- CHA

మళ్ళీ వీటిలోంచి కామన్ లెటర్స్ ని వాటి కింద వ్రాసాడు.

CHA ---------------------------- CHA ---------------------------- CHA

ఇప్పుడు మొదట వ్రాసిన పదంలో మిగిలిన అక్షరాలని వ్రాసాడు.

MA TE ---------------------------- TEL ---------------------------- PORI

వాటి కింద విడదీసిన పదాలని వరుసక్రమం లో వ్రాసాడు...

(MA ----- CHA ----- TE) ----- (TEL CHAT) ----- (CHA PORI)

అవినాష్ పెద్దల మీద చిరునవ్వు వెలసింది... "Cunning bastards..." అని మనసులో అనుకుంటూ... శాండీ "Can you make anything out these ?" అని అడిగాడు. శాండీ confused గా మొహం పెట్టి తలా అడ్డంగా ఊపాడు.

అవినాష్ బోర్డు మీద ... MA -- MAHARASHTRA... CHA -- CHATTISGHARGH... TEL -- TELAGANA ... అని వ్రాసాడు. సంధి అది చూసి.... "మరి CHA PORI అంటే?" అని అడిగాడు. దానికి అవినాష్ నవ్వుతూ "Guess it" అని అన్నాడు... శాండీ ఒక అయిదు నిమిషాలు ఆలోచించాడు. ఏమి తెలియలేదు. అప్పుడు అవినాష్ బోర్డు మీద వ్రాసాడు...

MA - MAHARASHTRA ----- CH - CHATTISGHARGH... TEL - TELANGANA ----- AP - ANDHRA PRADESH ----- ORI - ORISSA

అవినాష్ : నిన్న సుభాష్ మొబైల్ కి వచ్చిన మెసేజ్ గుర్తుందా? MACHATE కంప్లీట్... CHAPORI సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది. TELCHAT సప్లైస్ దారిలోవున్నాయి... సుభాష్ రండేవ్ కి చేరేటప్పటికి లారీ లో కెమికల్స్ అక్కడికి చేరాయి. SI శ్రీధర్నీ చెప్పింది నీకు గుర్తుందా? ఆ రండేవ్ పాయింట్ ఛత్తీస్ ఘడ్ బోర్డర్ కి దగ్గరగా వున్నదని చెప్పాడు. ఆ మెసేజ్ లోని సప్లైస్ అంటే ఆ కెమికల్ కేన్స్... TELCHAT అంటే తెలంగాణ... ఛత్తీస్ ఘడ్ బోర్డర్...

శాండీ : అంటే... మీ లెక్క ప్రకారం... ఇంకో రెండు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయంటారా ?

అవినాష్ : పాజిబుల్. మహారాష్ట్ర... ఛత్తీస్ ఘడ్... తెలంగాణ బోర్డర్స్ కలిసే చోట... ఛత్తీస్ ఘడ్... ఆంధ్ర ప్రదేశ్... ఒరిస్సా బోర్డర్స్ కలిసే చోట డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయని నా అనుమానం.

శాండీ : OH... MY... GOD... ఇది ఎస్కోబార్ సెటప్ ని మించిపోయింది.

అవినాష్ : మహారాష్ట్ర... ఛత్తీస్ ఘడ్... తెలంగాణ బోర్డర్స్ కలిసే చోట అంతా ఏజెన్సీ ఏరియా... అదే విధంగా ఛత్తీస్ ఘడ్... తెలంగాణ బోర్డర్... ఆంధ్ర.. ఛత్తీస్ ఘడ్... ఒరిస్సా బోర్డర్స్ అడవులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఎవరికి తెలియకుండా డ్రగ్స్ తయారు చెయ్యడానికి అనువైన ప్రదేశం.

శాండీ : మీ అనుమానం నిజం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. Reaper పంపిస్తున్న ఇమేజెస్ చూస్తే మీకే అర్ధమవుతుంది.

శాండీ తన లాప్ టాప్ ని ఓపెన్ చేసి అప్పటిదాకా Reaper పంపిన ఇమేజెస్ చూపించసాగాడు.


కొండ మీదున్న జాయింట్ ఫోర్స్ టీం బైనాక్యూలర్స్ లో కనిపించిన దృశ్యం...

కొండ కింద పెద్ద ఎత్తున గుడిసెలు ఉన్నాయి. కొన్ని ట్రీ హౌసెస్ కూడా కనిపించాయి. కొంచం దూరం లో చెక్క తో కట్టిన కాటేజెస్ కూడా ఉన్నాయి. రెండో వైపు దూరం లో ఇంకో కొండ ఉంది. ఈ రెండు కొండల మధ్య లోయ ప్రాంత అంత చదును గా ఉంది. రెండో కొండ కింద చెక్కలతో కట్టిన పెద్ద కర్మాగారం లాంటిది ఉంది. దాని చిమ్ని లోంచి సన్నగా పొగ వస్తోంది. ఆ కర్మాగారం దగ్గర చాలా మంది అస్సల్ట్ రైఫిల్స్ పట్టుకొని కాపలా కాస్తున్నారు. ఈ రెండు కొండల మధ్య విశాలమైన భూభాగమంతా పొలాలతో నిండి ఉంది. వాటిలో ఎదో పంట పండిస్తున్నారు. SI శ్రీధర్ తన బైనాక్యూలర్స్ ని అడ్జస్ట్ చేసి బాగా జూమ్ చేసి చూసాడు. అక్కడ వాళ్ళు పండిస్తున్నది... గసగసాలు... POPPY SEEDS... ఓపియం తయారుచేయడానికి కావాల్సిన ముడి పదార్ధం. కొన్ని వేల ఎకరాల్లో గసగసాలు పండిస్తున్నారు. తెలంగాణ... ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్ని కూడా వేళ్ళు చెరిపేసి వ్యవసాయం చేస్తున్నారు. రెండు రాష్టాల భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు.

ఆ గసగసాలకి కొన్ని కెమికల్స్ కలిపి ఓపియం తయారుచేసి... డ్రగ్స్ ని ఆదివాసులకు ఇచ్చి రండేవ్ పాయింట్ కి పంపిస్తున్నారు. అక్కడి నుంచి ఆ డ్రగ్స్ వివిధ ప్రాంతాలకి సరఫరా అవుతున్నాయి. విదేశాలకి కూడా ఎగుమతి చేస్తున్నారు.

SI శ్రీధర్ సాటిలైట్ ఫోన్ లో అవినాష్ కి ఫోన్ చేసాడు.

శ్రీధర్ : సర్... ఇక్కడ చాలా పెద్ద సెటప్ ఉంది. వీళ్ళు వేల ఎకరాల అడవి భూమిని ఆక్రమించుకొని గసగసాలు పండిస్తున్నారు.

అవినాష్ : ఓపియం తయారుచేయడానికి కావాల్సిన రా మెటీరియల్...

శ్రీధర్ : అవును సర్... ఇవ్వాళ ఆ ఆదివాసులు డ్రగ్స్ ని డెలివర్ చేసిన తరువాత యేవో కెమికల్ క్యాన్స్ ని గాడిదల మీద మోసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు.

అవినాష్ : ఆ అడవి ప్రాంతం లో వెహికల్స్ వెళ్లవు కాబట్టి... ట్రెడిషనల్ ట్రాన్స్పోర్ట్ ని వాడుకుంటున్నారు.

శ్రీధర్ : అవును సర్.

అవినాష్ : మీరు వెళ్ళినపని అయ్యింది. జాగ్రత్తగా వెనక్కి రండి... గుడ్ జాబ్... వెల్డన్

శ్రీధర్ : మన ఆర్మీ జవాన్స్ కి వెనక్కి రావడానికి ఆర్డర్స్ ఇంకా రాలేదు.

అవినాష్ : నేను మాధవ్ తో మాట్లాడి మీకు చెప్తాను. అప్పటిదాకా మీరు జాగ్రత్తగా ఉండండి.

అవినాష్ వెంటనే మాధవ్ కి ఫోన్ చేసాడు...

అవినాష్ : మీరు Reaper ఇమేజెస్ చూజి ఉంటారు...

మాధవ్ : ఎస్... నమ్మలేక పోతున్నా... ఎవరికి తెలియకుండా... మారు మూల ప్రాంతం లో ఇంత పెద్ద సెటప్... వేలాది ఎకరాల పాపి సీడ్స్ పంట... రిఫైనరీ... మాసివ్ ప్రొడక్షన్... డిస్ట్రిబ్యూషన్... ఎక్సపోర్ట్...

అవినాష్ : ప్లాన్ అఫ్ ఆక్షన్ ఏమిటీ?

మాధవ్ : ఇదంతా డిస్ట్రాయ్ చెయ్యాలంటే... చాలా పెద్ద ఫోర్స్ కావాలి. ఇది పోలీస్ డిపార్టుమెంటు ఒక్కటే చెయ్యలేదు. ఆర్మీ ని దింపాల్సి వస్తుంది. ఇది అంత తేలిగ్గా అయ్యే పని కాదు. మనకి సప్లై ఎలా జరుగుతోందో తెలుసు కాబట్టి... ముందు మనం ఆదివాసులని ఎటాక్ చేసి... వాళ్ళ దగ్గరనుండి డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చేస్తే... సోర్స్ అఫ్ సప్లై ని ఆపగలం. దాంతో పాటే వాళ్లకి సప్లైస్ ని ఆపగలం. వాళ్ళు వేరే అల్తర్నేటివ్ వెతుక్కునే లోపల ప్రొడక్షన్ మీద పెద్ద దెబ్బ పడుతుంది.

అవినాష్ : వాళ్ళకి అల్తర్నేటివ్ ఆల్రెడీ వుంది ఉంటే?

మాధవ్ : అర్ధంకాలేదు.

అవినాష్ : మనం ఇక్కడ ఆదివాసులని ఆపితే... ఇన్ అండ్ అవుట్ మూవెమెంట్ కి దెబ్బ తగులుతుంది. కానీ... వాళ్ళు ఇది ముందుగానే ఊహించి వేరే బ్యాక్ అప్ ఏర్పాటు చేసుకొనివుంటే... వాళ్ళ బిజినెస్ కి అంతరాయం కలగదు. నా అనుమానం ప్రకారం ఇలాంటి డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇంకో రెండు ఉన్నయి.

మాధవ్ : వాట్ డో యు మీన్?

అవినాష్ : ఎస్... ఇంకో రెండు చోట్ల కూడా వాళ్ళు డ్రగ్స్ తయారుచేస్తున్నారు.

అవినాష్ MACHATE... TELCHAT... CHAPORI... వీటి మీద తన అనాలిసిస్ చెప్పాడు. అది విన్న మాధవ్ కొంచం సేపు మాట్లాడలేదు.

మాధవ్ : మీ అనుమానం నిజమైతే... మనం ఇప్పుడు ఇంకో రెండు లొకేషన్స్ ని కనుక్కోవాలి.

అవినాష్ : ఎస్. కనీసం మన డౌట్ క్లియర్ అవ్వాలి. ఎవరు కూడా అనవసరంగా కోడ్స్ వాడరు. మనంతట మనం ఆ లొకేషన్స్ ని సెర్చ్ చెయ్యాలి... లేదంటే... సుభాష్ ని ఎత్తుకొచ్చి గట్టిగా అడగాలి.

మాధవ్ : సుభాష్ ఒక్క రోజు కనపడక పోయినా వాళ్లకి డౌట్ వస్తుంది. మనమే ఈ లొకేషన్స్ ఉన్నాయో లేవో చెక్ చెయ్యాలి. ఒక పని చేదాం... Reaper ని మహారాష్ట్ర... తెలంగాణ...ఛత్తీస్ ఘడ్... ఆంధ్ర... ఒరిస్సా బోర్డర్స్ ని ఏరియల్ సర్వే చేయించాలి... అది డే టైం మాత్రమే చెయ్యాలి... నేను Reaper ఇంకో 3 days వాడుకోవడానికి పర్మిషన్ తీసుకుంటాను. రేపు... ఎల్లుండి... Day Break కాగానే East Coast నుంచి Reaper బయలుదేరి West Coast దాకా ఏరియల్ సర్వే చేయిస్తాను.

అవినాష్ : మనం ఏది చేసినా... ఇంకో రెండు రోజుల్లో పూర్తి చేసి మన డౌట్ క్లియర్ చేసుకోవాలి. మనకి ఇంకో రెండు లొకేషన్స్ దొరుకుతాయో లేదో చూడాలి.

మాధవ్ : నువ్వు ఈ కోడ్స్ ని ఎలా బ్రేక్ చేసావు?

అవినాష్ : The Day of The Jackal... ఈ నావెల్ లో Frederick Forsyth ఒక చోట వ్రాస్తాడు... ఫ్రెంచ్ వర్డ్ CHACAL అంటే ఇంగ్లీష్ లో JACKAL... CHACAL అనే పదం CHARLES CALTHROP అనే పేరులో ఫస్ట్ నేమ్ లో మూడు అక్షరాలు... CHA సెకండ్ నేమ్ లో మొదటి మూడు అక్షరాలు CAL కలిపితే ఫ్రెంచ్ వర్డ్ CHACAL... ఇదే లాజిక్ ని ఇక్కడ వాడాను. మనకి దొరికిన మూడు acronyms వన్ బై వన్ బ్రేక్ చేసి చూసాను. నిన్న రాత్రి నుంచి ఆలోచిస్తూంటే... ఇవ్వాళ మార్నింగ్ ఆఫీస్ కి బయలుదేరే ముందు బుర్రలో ఐడియా ఫ్లాష్ అయ్యింది.

మాధవ్ : Unbelievable... విశ్వామిత్ర ఒక అద్భుతం చేసాడు. ఇప్పుడు మహింద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ డేటా సెంటర్ కి టోటల్ ఆక్సిస్ మా దగ్గర ఉంది. మా వాళ్ళు overtime కస్టపడి ఆ సర్వర్స్ లో ప్రోగ్రామ్స్... అప్లికేషన్స్... ప్యాకెజీస్... డేటా... అనలైజ్ చేస్తున్నారు. చాలా టైం పట్టేలాఉంది.

అవినాష్ : విశ్వామిత్ర ఎదో ఒక షార్ట్ కట్ వెతుకుతాడు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ త్వరలోనే దొరుకుతుంది.

ఫోన్ కాల్ అవ్వగానే మాధవ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ కి ఫోన్ చేసి రాత్రి 10 గంటలకల్లా డ్రాప్ జోన్ కి చేరుకోమని చెప్పాడు. వాళ్ళని వెనక్కి తీసుకొని రావడానికి హెలికాఫ్టర్ ని రెడీ చేసుకున్నాడు. జాయింట్ టాస్క్ ఫోర్స్ టీం నెమ్మదిగా ఆ కొండ దిగడం మొదలుపెట్టింది. రండేవ్ చేరడానికి వాళ్లకి చాలా టైం ఉంది.


అదేరోజు మధ్యాన్నం శేఖర్ తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అవినాష్ కి పరిచయం చేసాడు. "ఇతను శ్రీకాంత్... హెడ్ కానిస్టేబుల్. CI సుధీర్ దగ్గర పనిచేస్తున్నాడు. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాడు" అంటూ శ్రీకాంత్ ని పరిచయం చేసాడు. శ్రీకాంత్ సెల్యూట్ కొట్టి సుధీర్ వేసిన మొత్తం ప్లాన్... యాదగిరి గ్యాంగ్ చేత కన్ఫెషన్ స్టేటుమెంట్ తీసుకొని... వాళ్ళని సీన్ అఫ్ క్రైమ్ కి తీసుకెళ్లి డమ్మి ట్రాంక్విలిసింగ్ బుల్లెట్స్ తో వాళ్ళకి స్పృహతప్పేలాచేసి... వాళ్ళని మార్చురీ కి తీసుకెళ్లి వాళ్ళ ప్లేస్ లో వేరే డెడ్ బాడీస్ పెట్టి యాదగిరి గ్యాంగ్ ని వెనక డోర్ లోంచి బయటకి పంపాలనికోవడం... మొత్తం అవినాష్ కి చెప్పాడు. ఇదే కాకుండా సుధీర్ సహాయంతో DR ప్రభావతి ని బెదిరించి... వీలయితే ప్రభావతి పిల్లల్ని కిడ్నప్ చేసైనా ఆమె తన రిపోర్ట్ మార్చి యాదగిరి గ్యాంగ్ DNA తో తప్పుడు రిపోర్ట్ ఇవ్వమని బెదిరించాలని అనుకుంటున్న విషయం కూడా చెప్పాడు. ఇదంతా విన్న అవినాష్ కి విపరీతమైన కోపం వచ్చింది. "ఈ ప్లాన్ నాకు తెలుసన్న విషయం ఎవరికి తెలియకుండా చూసుకోండి... నేను ఏమి చెయ్యాలో ఆలోచిస్తాను" అని వాళ్ళని పంపేసి రవీంద్ర కి ఫోన్ చేసి లోకల్ పోలీసులు కైలాష్ గౌడ్ తో కలసి వేసిన ప్లాన్ చెప్పాడు.

రవీంద్ర ముంబై లో తన కొలీగ్ నింబాల్కర్ కి ఫోన్ చేసి చెయ్యాల్సింది చెప్పాడు. తరువాత ఇంకో ఫోన్ హైదరాబాద్ లో కరుణాకర్ కి ఫోన్ చేసి DR. ప్రభావతి కి ప్రొటెక్షన్ ఏర్పాటు చెయ్యమని చెప్పి... "ఒక వేళ కైలాష్ గ్యాంగ్ ప్రభావతి పిల్లల్ని కిడ్నప్ చేస్తే... వాళ్ళని చంపైనా పిల్లల్ని సేఫ్ గా వెనక్కి తీసుకొచ్చి ప్రభావతి కి అప్పగించాలి. నువ్వు ACP అవినాష్ ని కాంటాక్ట్ చెయ్యి. నీకు కావాల్సిన హెల్ప్ చేస్తాడు" అని చెప్పాడు.

నింబాల్కర్ వెంటనే పూణే ఇంటలిజెన్స్ బ్యూరో డిపార్టుమెంటు కి ఫోన్ చేసి వాళ్లకి పూణే ఫార్మ్ హౌస్ లో Mercedez Benz SUV ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిని ఫోరెన్సిక్ టీం కి అప్పగించి వెంటనే పూర్తి అనాలిసిస్ రెడీ చేయించామని చెప్పి తాను వెంటనే పూణే బయలుదేరాడు.

పూణే IB టీం నింబాల్కర్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి అక్కడ గ్యారేజ్ లో పార్క్ చేసిన బెంజ్ SUV తమ కస్టడీ లో కి తీసుకున్నారు. బెంజ్ కంపెనీ టెక్నీషియన్ ని పిలిపించి ఆ SUV ని ఓపెన్ చెయ్యించారు. ముందుగా ఫోటోగ్రాఫిక్ టీం ఆ SUV ని బయటనుంచి... లోపలనుంచి మొత్తం ఫొటోస్ తో పాటు వీడియో కూడా తీశారు. ఆ SUV లోపల చాలా భయంకరం గా ఉంది. వెనక సీట్ లో రక్తం మరకలు. కింద కార్పెట్ మీద డ్రగ్స్ పాకెట్స్... చిరిగిపోయిన ఒక సల్వార్... కుర్తా... ఉన్నాయి. ముందు సీట్స్ లో సిగరెట్ ముక్కలు... లిక్కర్ బాటిల్స్... వెనక సీట్లో రేప్ జరిగిందని వాళ్లందరికీ వెంటనే అర్ధమయ్యింది.

క్లూస్ టీం రంగం లోకి దిగి ప్రతిచిన్న వస్తువుని జాగ్రత్తగా కలెక్ట్ చేశారు. ఆ కార్ లోపల రక రకాల ఫింగర్ ప్రింట్స్ ని కూడా కలెక్ట్ చేశారు. రక్తం మరకలు... వివిధ DNA సాంపిల్స్ కలెక్ట్ చెయయడానికి చాలా టైం పట్టింది. అక్కడ పని కాగానే ఆ SUV ని వాళ్ళు ఒక ట్రక్ లోకి ఎక్కించి ముంబై తీసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో పూర్తి రిపోర్ట్ తయారయ్యింది.

CI సుధీర్ తన ప్లాన్ ప్రకారం అందరిని సెట్ చేసాడు... టీం రెడీ గా ఉంది. మార్చురీ స్టాఫ్... అంబులెన్సు స్టాఫ్ కి ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. తనకి... తన టీం కి రావాల్సిన అమౌంట్ ని బ్యాంకు అకౌంట్స్ కి ట్రాన్సఫర్ చేయించాడు. ప్లాన్ ని అమలుచేయాల్సిన రోజు వచ్చేసింది... ఆ రోజు ఉదయం ముందుగా తన మనుషులతో పాటు కైలాష్ మనుషులని కూడా కలిపి DR. ప్రభావతి పిల్లల్ని కిడ్నప్ చెయ్యడానికి పంపించాడు.


Part - 20 - The Predicament

ఉదయం 11 గంటల సమయం. Dr ప్రభావతి తన ఆఫీస్ లో బిజీ గా పని చేసుకుంటున్న సమయంలో ఆమె టేబుల్ మీద ల్యాండ్ లైన్ మోగింది. ఆమె ఫోన్ ఎత్తి "హలో..." అనగానే... అవతలినుంచి "మేము నీ కూతురు... కొడుకుని కిడ్నప్ చేసాము. నువ్వు ఆ రేప్ కేసు ఫోరెన్సిక్ రిపోర్ట్ మేము చెప్పినట్లు వ్రాస్తే నీ పిల్లల్ని వొదిలేస్తాము. నువ్వు పోలీస్ కి రిపోర్ట్ చేసినా... వేరే ఎవరితోనైనా ఈ విషయాన్ని డిస్కస్ చేస్తే... నీ పిల్లలు నీకు దక్కరు." అని ఫోన్ పెట్టేసారు. ప్రభావతి ఖంగారుగా తన కూతురి మొబైల్ కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అయ్యింది... ఎవరూ ఎత్తలేదు. కొడుకు మొబైల్ ఫోన్ కి కాల్ చేసింది. అది కూడా ఎవరూ ఎత్తలేదు. ఆమె ఇద్దరికీ మార్చి మార్చి ఫోన్ కాల్స్ చెయ్యసాగింది. రెస్పాన్స్ లేదు. అప్పుడు ప్రభావతి ఆఫీస్ ల్యాండ్ లైన్ మోగింది. వెంటనే ఆమె ఆన్సర్ చేసింది. "ఏమిటీ? కూతురు... కొడుకు... ఫోన్ తియ్యడం లేదా? ఆ రెండు ఫోన్స్ మాదగ్గరే ఉన్నాయి. కావాలంటే వాటినుంచి ఫోన్ చేయమంటావా?" అంటూ ఫోన్ కట్ చేసాడు.

ఒక 30 సెకండ్స్ Dr ప్రభావతి మొబైల్ ఫోన్ కి ఆమె కూతురు మొబైల్ ఫోన్ నుంచి కాల్ వచ్చింది... ఆమె ఖంగారుగా ఫోన్ ఎత్తింది "చెప్పగా... నీ పిల్లల ఇద్దరి మొబైల్ ఫోన్స్ మాదగ్గరే ఉన్నాయి. వాళ్లతో మాటాడు..." అన్నాడు. ఒక 10 సెకండ్స్ తరువాత ప్రభావతి కూతురు లైన్ లోకి వచ్చింది. "హలో... అమ్మ... వీళ్ళు ఎవరో మమ్మల్ని కిడ్నప్ చేశారు..." అని మాత్రమే వినిపించింది. లైన్ కట్ అయింది. వెంటనే ఆమె ల్యాండ్ లైన్ మోగింది "విన్నావుగా... నీ కూతురు... కొడుకు... క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ఆ రేప్ కేసు రిపోర్ట్ మేము చెప్పినట్లు రాయి... అప్పుడు వొదిలేస్తాము... ఇంకాసేపట్లో మావాడు నీ దగ్గరికి వస్తాడు. వాడు చెప్పినట్లు నువ్వు చేస్తే... నీ పిల్లల్ని వెంటనే నీ ఆఫీస్ ముందు వొదిలేస్తాము. లేదంటే... వాళ్ళ డెడ్ బాడీస్ నీ ఆఫీస్ ముందు పడేస్తాము. అప్పుడు తీరిగ్గా నువ్వే వాళ్ళ రిపోర్ట్ తయారు చేసుకోవొచ్చు" అని ప్రభావతి రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసాడు. ప్రభావతి తల పట్టుకొని కూర్చుంది.

ప్రభావతి అప్పటికే పోలీస్ కి థ్రెట్ కాల్స్ వస్తున్నాయని రిపోర్ట్ చేసివుంది. పోలీస్ డిపార్టుమెంటు తనకి ప్రొటెక్షన్ ఇచ్చింది. వీళ్లెవరో పిల్లల్ని కిడ్నప్ చేశారు... ఏమి చెయ్యాలో తెలియలేదు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఆమె ఆఫీస్ లోకి వచ్చాడు. చూడడానికి బాగా రఫ్ గా ఉన్నాడు... అతని నేరుగా వచ్చి ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చొని "ఫోన్ వచ్చిందిగా... మేము చెప్పినట్లు రిపోర్ట్ తయారుచెయ్యి... నీ పిల్లలు వెంటనే వచ్చేస్తారు. ఎందుకు అనవసరంగా రిస్క్ చేస్తావు?" అని అంటూండగానే... ఆమె గదిలోకి నలుగురు మనుషులు వచ్చి ప్రభావతి ఎదురుగా కూచున్న అతడి షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి గుంజారు. అతను బాలన్స్ తప్పి వెనక్కి పడ్డాడు. వాళ్లలో ఒకరు "ఖంగారు పడకండి డాక్టర్.... మేము క్రైమ్ బ్రాంచ్ పోలీస్... మీ పిల్లలు సేఫ్..." అని అంటూండగానే ప్రభావతి మొబైల్ ఫోన్ కి కాల్ వచ్చింది. ప్రభావతి కూతురు "మామ్... వి అర్ సేఫ్... పోలీస్ మమల్ని సేవ్ చేశారు... ఇప్పుడు మేము మీ ఆఫీస్ కి వస్తున్నాం" అని అన్నది.

అప్పటికే పోలీసులు ప్రభావతి ఆఫీస్ కి వచ్చిన వాడికి బేడీలు వేసి తీసుకొని వెళ్లారు. వాళ్లలో ఒక పోలీస్ ఆ రోజు జరిగింది Dr ప్రభావతి కి జరిగింది చెప్పాడు...


ఆరోజు ఉదయం... కరుణాకర్ మూడు టీమ్స్ ని రెడీ చేసాడు. ఒక టీం Dr ప్రభావతి ని ఫాలో అవుతూ ఆమె ఆఫీస్ కి చేరుకొని కాపలా కాయసాగారు. రెండో టీం ప్రభావతి కూతురు వెనకాలే ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజీ ముందు కాపలాకాయసాగారు. మూడో టీం ప్రభావతి కొడుకు చదువుతున్న లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజీ ముందు కాపలాగా ఉన్నారు. కరుణాకర్ అప్పటికే ప్రభావతి... ఆమె పిల్లల మొబైల్ ఫోన్స్ ని ట్రాకింగ్ లో పెట్టాడు. పోలీస్ డిపార్టుమెంటు ఊహించినట్లే కైలాష్ గౌడ్ మనుషులు ప్రభావతి పిల్లల్ని వాళ్ళ స్కూల్... కాలేజీ నుంచి కిడ్నప్ చేసి ఘట్కేసర్ లోని ఇండస్ట్రియల్ ఏరియా లో ఒక ఫ్యాక్టరీ లో ఉంచి ప్రభావతి కి ఫోన్ చేశారు. ;వాళ్ళని ఫాలో అయిన పోలీసులు ఆ ఫ్యాక్టరీ లోకి వెళ్లి పిల్లల్ని కిడ్నప్ చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకొని పిల్లల్ని ప్రభావతి ఆఫీస్ దగ్గరికి తీసుకొని వచ్చారు. కైలాష్ మనుషులు పట్టుపడ్డ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

>

"మీరేమి ఖంగారు పడకండి... ఇవ్వాళ్టితో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. మీరు ఇవ్వాళ మధ్యాన్నం 2 గంటలకి NDTV ఛానల్ లో న్యూస్ చూడండి.. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాబోతోంది. ఈ విషయం ఎవరికి తెలియనీకండి." అని అన్నాడు కరుణాకర్.

CI సుధీర్ పోలీస్ స్టేషన్ లో యాదగిరి గ్యాంగ్ దగ్గరనుండి కన్ఫెషన్ స్టేటుమెంట్ తీసుకుంటున్నాడు. అందులో వాళ్ళు ఆమెని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చూశామని... తాను ఒక టాక్సీ డ్రైవర్ ని అని చెప్పి ఆమెని తమ ఇన్నోవా ఎక్కించుకొని ఊరి బయటకి తీసుకెళ్లి రేప్ చేసి ఎక్కడ వొదిలించుకోవాలో తెలియక ఖంగారులో BHEL క్రాస్ రోడ్స్ దగ్గర పడేసి పారిపోతూంటే జరిగిన ఆక్సిడెంట్ వల్ల పోలీసులకి దొరికిపోయామని... స్టేటుమెంట్ ఇచ్చారు.

వాళ్ళ స్టేటుమెంట్ తన దగ్గరే ఉంచుకొని... వాళ్ళని సీన్ అఫ్ క్రైమ్ కి వెళ్ళడానికి రెడీ గా ఉండమని చెప్పి తన రూమ్ కి వెళ్లి మీడియా కి ఫోన్ కాల్స్ చేద్దమని అనుకుంటుండగా... తన టీం లోని ఒక కానిస్టేబుల్ శ్రీకాంత్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి "సర్... ఇంగ్లీష్ న్యూస్ చూడండి... కొంప మునిగింది" అని అంటూ సుధీర్ రూమ్ లో ని టీవీ ఛానల్ మార్చాడు. టీవీ లో NDTV ఇంగ్లీష్ న్యూస్ వస్తోంది. ముంబై సిటీ పోలీస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ చేస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్ నింబాల్కర్ ప్రెస్ తో " రెండు రోజుల క్రితం మాకు ఒక కాంఫిడెంటిల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము దాన్ని బేస్ చేసుకొని పూణే లో ఒక ఫార్మ్ హౌస్ ని రైడ్ చేసాము. అక్కడ మాకు భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి. వాటితో పాటు అనుమానాస్పదం గా ఒక SUV కూడా దొరికింది మేము దానిని ఫోరెన్సిక్ టీం తో చెక్ చేయించగా ఆ SUV లో ఒక రేప్ జరిగిందని నిర్ధారణకు వచ్చాము. ఆ వెహికల్ నుంచి DNA సాంపిల్స్, విక్టిమ్ కి సంబంధించిన బట్టలు సంపాదించాము. ఆ వెహికల్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ని నేషనల్ క్రిమినల్ డేటా బేస్ లో చెక్ చేసాము. ఎటువంటి మ్యాచ్ దొరకలేదు. మేము ఆధార్... డేటా బేస్ ని కూడా చెక్ చేసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ హైదరాబాద్ కి చెందిన వివేక్ గౌడ్... కిరణ్... రాకేష్... సంజీవ్... అనే యువకులవని తెలిసింది. మేము స్వాధీనం చేసుకున్న SUV కూడా వివేక్ గౌడ్ కి చెందినది. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన రేప్ కేసు కి సంబంధిన ఫోరెన్సిక్ రిపోర్ట్ తో కంపేర్ చెయ్యమని హైదరాబాద్ పోలీస్ డిపార్టుమెంటు ని కోరడం జరిగింది. త్వరలో మేము స్వాధీనం చేసుకున్న SUV ని హైదరాబాద్ పంపిస్తాము... " అని చెప్తూ వాళ్ళు కాన్ఫిస్కేట్ చేసిన డ్రగ్స్ ని... కస్టడీ లోకి తీసుకున్న బెంజ్ SUV ని... మీడియా కి చూపించారు.

టీవీ లో ఈ న్యూస్ బ్రేక్ చూసిన సుధీర్ వెంటనే కైలాష్ కి ఫోన్ చేసాడు. అప్పటికే కైలాష్ కి ఈ విషయం తెలిసి లాయర్ కాంతారావు దగ్గరికి వెళ్ళాడు. కాంతారావు ఫోన్ లో "నీ ప్రోగ్రాం క్యాన్సల్ చేసుకో... ఇప్పుడు యాదగిరి గ్యాంగ్ ని సీన్ అఫ్ క్రైమ్ కి తీసుకెళ్లి ప్రయోజనం లేదు. అనవసరంగా ప్రాబ్లెమ్ ని కంప్లికేట్ చేసినట్లు అవుతుంది" అని సుధీర్ కి చెప్పాడు.

కైలాష్ వివేక్ కి ఫోన్ చేసాడు. ఆ సమయం లో వివేక్... కిరణ్... రాకేష్... సంజీవ్ తమ ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్యారిస్ వెళ్లారు.

కాంతారావు : వివేక్... నువ్వు ఆ SUV ని ఏమి చేసావు?

వివేక్ : మీరు చెప్పినట్లు దాన్ని ఎవరికి కనపడకుండా దాచేసాను.

కాంతారావు : దాచేసావా? నేను ఆ SUV ని ఎవరికి కనపడకుండా కాల్చెయ్యమని చెప్పాను. డ్రగ్స్ మత్తులో నువ్వు కాల్చెయ్యడానికి బదులు దాచేసావు. ఆ SUV ఇప్పుడు పోలీసులకి చిక్కింది. ఆ వెహికల్ లో DNA... సాంపిల్స్... ఫింగర్ ప్రింట్స్ ని వాళ్ళు కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ అనాలిసిస్ చేయించి ఆధార్ డేటా బేస్ తో మీ ఐడెంటిటీ కనుక్కొని టీవీ లో అందరికి చెప్పేసారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు?

వివేక్ : ప్యారిస్. ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాము.

కాంతారావు : నీ ఫ్రెండ్ పెళ్లి ఎప్పుడు?

వివేక్ : ఎల్లుండి.

కాంతారావు : పెళ్లి కాగానే మీరు ఇక్కడికి రావొద్దు. వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళండి. మేము చెప్పేదాకా అక్కడనుంచి కదలొద్దు. ఇప్పుడు నేను నీకు ఏమి చెప్పానో... నీకు ఏమి అర్ధమయ్యిందో చెప్పు?

వివేక్ : పోలీసులకి బెంజ్ SUV దొరికింది. వాళ్ళకి మా ఐడెంటిటీ తెలిసింది. మేము హైదరాబాద్ వస్తే ప్రాబ్లెమ్. ఫ్రెండ్ పెళ్లి కాగానే మేము ఇంగ్లాండ్ వెళ్లి మీరు చెప్పేదాకా అక్కడనుంచి కదలం.

కాంతారావు : గుడ్. మాకు మీరు ఫోన్ చెయ్యొద్దు. మేమే మీకు మాంచెస్టర్ లో నా ఫ్రెండ్ శ్యాంసుందర్ ద్వారా కాంటాక్ట్ చేస్తాము. మీరు డైలీ ఆయనతో టచ్ లో ఉండండి. అక్కడున్నాళ్ళు ఎటువంటి వెధవేషాలు వెయ్యకుండా జాగ్రత్త గా ఏడవండి. మీరు అక్కడేమన్నా చేస్తే కాపాడడం మా వాళ్ళ కాదు.

వివేక్ : అంకుల్... అలా అనొద్దు ప్లీజ్... భయమేస్తోంది...

కాంతారావు : గుడ్. అలా కొన్నాళ్లు భయంతో ఉండండి. ఏం చెయ్యాలో అలోచించి చెప్పేదాకా అక్కడినుంచి కదలొద్దు. ఈ ఒక్కసారి నెను చెప్పింది వినండి.

ఇదంతా విన్న కైలాష్ గౌడ్ ఒక్కసారిగా కాంతారావు కాళ్ళమీద సాష్టాంగపడి "అన్నా... మనోళ్ళని కాపాడండి" అంటూ ఏడ్చేశాడు. నిజం చెప్పాలంటే కాంతారావు కి ఆ సమయం లో ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. ఈ కేసు ని ఇప్పటిదాకా వాళ్లకి అనుగుణంగా మలచుకొని వచ్చారు. ఒక్కసారిగా పిల్లల ఐడెంటిటీ బయటపడింది. పేరెంట్స్ ఐడెంటిటీ బయటకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. సరిగ్గా అదే సమయం లో హోమ్ మినిస్టర్ ధనంజయ ఫోన్ వచ్చింది.

ధనంజయ : అరే లాయరూ... ఏందిరా... ఇలా జరిగింది? కుర్రోళ్ళ పేర్లు బయటకి వచ్చాయి. నువ్వు అంతా చూసుకుంటానని చెప్పావుగా...

కాంతారావు : కుర్రోళ్ళకి SUV కాల్చెయ్యమంటే... వాళ్ళు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టారు. పోలీసులు దాన్ని కనుక్కొని ఫోరెన్సిక్ అనాలిసిస్ కి పంపారు.

ధనంజయ : మనం ఇక్కడ లోకల్ గా పోలీస్ రిపోర్ట్ ని తారుమారు చేస్తే పనిఅవుతుందా...

కాంతారావు (ఖంగారుగా) : ఆ పని మాత్రం చెయ్యకు. ఇప్పటిదాకా మనం డైరెక్ట్ గా ఇంవోల్వ్ కాకుండా మేనేజ్ చేసాము. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే... సరిదిద్దుకోవడం కుదరదు.

ధనంజయ : నేను పోలీస్ చీఫ్ తో మాట్లాడినా...

కాంతారావు : పర్సనల్ గా మాట్లాడు. నాకు చెప్పకుండా ఏమి చెయ్యకండి.

ధనంజయ వెంటనే DGP తన ఆఫీస్ కి పిలిపించాడు.

ధనంజయ : టీవీ లో న్యూస్ చూసారా?

DGP : ఎస్.... న్యూస్ లో వాళ్ళు ఒక కుర్రోడి పేరు సంజీవ్ అని చెప్పారు. బై ఛాన్స్... అది మీ అబ్బాయి కాదుగా?

ధనంజయ : మా వాడే... మిగతా ముగ్గురు కైలాష్ గౌడ్ కొడుకు వివేక్... క్రిమినల్ లాయర్ కాంతారావు కొడుకు రాకేష్... ఆ నాలుగో వాడు మహింద్ర మేనల్లుడు కిరణ్.

DGP : OH MY GOD...

ధనంజయ : వాళ్ళని బయటకి తెచ్చే ఐడియా ఏదైనా ఉందా...

DGP : టీవీ లో న్యూస్ రాగానే నేను ముంబై లో DGP తో మాట్లాడాను. వాళ్లకి ఆ కుర్రాళ్ళ బ్యాక్ గ్రౌండ్ నిజంగా తెలియదు. అందుకే వాళ్ళు ఆధార్ డేటా బేస్ లో కనిపించిన పేర్లు బయటకి చెప్పేసారు. అది మేనేజ్ చెయ్యడం పెద్ద కష్టం కాదు. కానీ... ఆ SUV... అది డైరెక్ట్ గా కైలాష్ గౌడ్ కొడుకు వివేక్ ని ఐడెంటిఫై చేస్తోంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది... మీకు కైలాష్ గౌడ్ ఎంత ఇంపార్టెంట్?

ధనంజయ(అర్ధంకానట్లు చూస్తూ) : అలా ఎందుకు అడిగారు.

DGP : ఆ SUV వివేక్ పేరు మీద ఉంది... కాబట్టి ఈ కేసులో అతడిని A1 గా పెట్టి... మిగతా ముగ్గురు కుర్రోళ్ళ ఐడెంటిటీ మార్చడానికి ట్రై చేస్తాము. ముంబై పోలీసులు చెప్పిన మిగతా ముగ్గురి పేర్లు మార్చడానికి ప్రయత్నిస్తాము.

ధనంజయ (ఆత్రంగా) : ఎలా?

DGP : ముంబై పోలీసులు మిగతా ముగ్గురి పేర్ల విషయం లో పొరపాటు పడ్డారని... వాళ్ళ అసలు పేర్లు... రాకేష్ బదులుగా ఏ రాజేష్... రమేష్... కిరణ్ పేరు కి బదులుగా ఏ కిషన్ అనే పేరు... సంజీవ్ కి బదులుగా ఏ సంజయ్ అని మేనేజ్ చెయ్యడానికి ట్రై చేస్తాను. ఒక విషయం నేను ఫ్రాంక్ గా చెప్తున్నా... వివేక్ మాత్రం తప్పించుకోలేడు... ఆ బెంజ్ SUV అతడిదని చాలా మందికి తెలుసు. వెహికల్ రిజిస్ట్రేషన్ అతని పేరు మీద వుంది కాబట్టి అతడిని బలి చేయాలి. అందుకే నేను మీకు కైలాష్ గౌడ్ ఎంత ఇంపార్టెంట్ అని అడిగాను.

ధనంజయ : ఇది చాలా కష్టమైన ఛాయస్... కైలాష్ మాకు చాలా ఇంపార్టెంట్... పార్టీ లో మంచి పలుకుబడి ఉంది. నేను ఆలోచించుకొని చెప్తాను.

DGP : తొందరగా ఆలోచించండి... మీకు గంట... లేదా.. రెండు గంటలకి మించి సమయం లేదు. నేషనల్ మీడియా లో పిల్లల పేర్లు వచ్చాయి. లోకల్ మీడియా లో డిస్కషన్స్ మొదలయ్యేలోపల మీరు ఏమి చెయ్యాలో డిసైడ్ చేసుకోండి... ఇంకో ముఖ్యమైన విషయం... మీరు ప్రస్తుతం హోమ్ మినిస్టర్... మీరు ఆ పోస్ట్ లో కంటిన్యూ అవ్వాలంటే... ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి. లేట్ అయితే మీ పార్టీ అధిష్టానం మిమ్మల్ని ఈ కేసు క్లోజ్ అయ్యేదాకా పదవి వదలమంటే... ఆలోచించుకోండి...

ధనంజయ గొంతులో పచ్చి వెల్లకాయ పడినట్లు అయ్యింది.

కాంతారావు ఆఫీస్ లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు... సరిగ్గా అప్పుడే ధనంజయ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "నువ్వు ఒక్కడివే రా... కైలాష్ ని తీసుకొని రావొద్దు." అంటూ చాలా స్పష్టంగా చెప్పడంతోకాంతారావు ఒంటరిగా బయలుదేరి ధనంజయ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ DGP తో ధనంజయ చాలా సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడు. వాళ్ళతో పాటు CI సుధీర్ కూడా ఉన్నాడు.

ధనుంజయ : రా... లాయరూ... DGP పెద్ద బాంబు పేల్చాడు.

కాంతారావు : ఏమిటది?

DGP : మనం వివేక్ ని స్కేప్ గోట్ ని చెయ్యాలి. ఆ SUV అతని పేరు మీద రిజిస్టర్ అయింది. అతడిని ఇరికించి మిగతా ముగ్గురి పేర్ల విషయం లో ముంబై పోలీసులు పొరపాటు పడ్డారని మేనేజ్ చెయ్యాలి.

కాంతారావు : కష్టం... వివేక్ ఆ SUV ఈ రేప్ జరగడానికి రెండు రోజుల ముందే ఎవరో దొంగతనం చేశారని పోలీస్ కంప్లైంట్ చేసాడు. పైగా ఈ నలుగురు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ నలుగురు ఢిల్లీ లో ఉన్నట్లు అలీబి కూడా సృష్టించాము. కైలాష్ తన కొడుకుని బలి చెయ్యడానికి ఎందుకు ఒప్పుకుంటాడు?

DGP : మనకి టైం లేదు. నేషనల్ న్యూస్ లో వచ్చింది. అప్పుడే లోకల్ చానెల్స్ స్క్రోలింగ్... బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి. వాళ్లకి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియదు. సాయంత్రానికల్లా వాళ్ళు స్టోరీస్ చెప్పఁడం మొదలెడతారు. మనం అప్పటిలోగా ఎదో ఒకటి చెయ్యాలి. లేకపోతే పరిస్థితి చెయ్యి దాటి పోతుంది.

కాంతారావు : ముంబై పోలీసులకి ఈ SUV సంగతి ఎలా తెలిసింది?

DGP : వాళ్ళ కధనం ప్రకారం... డ్రగ్స్ కోసం రైడింగ్ కి వెళ్తే అక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ తో బెంజ్ SUV కనిపిచింది. అనుమానం కలిగి దాన్ని వాళ్ళు ఫోరెన్సిక్ టీం కి అప్పగించామని చెప్పారు. కానీ... ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... పూణే పోలీసులు డ్రగ్ బస్ట్ కోసం వెళ్తూ MERCEDEZ BENZ షోరూం నుంచి ఒక టెక్నిషియన్ ని కూడా వెంట తీసుకొని వెళ్ళారంట. సం థింగ్ రాంగ్... పూణే పోలీసులకి అక్కడ బెంజ్ SUV ఉందని ముందే తెలుసా? ఎవరు చెప్పి ఉంటారు? ఆ SUV అక్కడ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

కాంతారావు: వివేక్ కి మాత్రమే తెలుసు. కీస్ సుభాష్ కి ఇచ్చి పూణే లో దాచెయ్యమని పంపాడు. సుభాష్ వెంటనే బయలుదేరాడు. ఎవ్వరికీ చెప్పే అవకాశం... సమయం లేదు. కావాలంటే నేను సుభాష్ ని కనుక్కుంటాను.

ధనంజయ : వివేక్ ని A1 గా పెట్టి... మిగతా ముగ్గురి పేర్లు మార్చి వేరే వాళ్ళ పేర్లు ఇరికిస్తే... కనీసం ముగ్గురు బయటపడే ఛాన్స్ ఉందని DGP గారు అంటున్నారు.

కాంతారావు : ఎవరి పేర్లు?

DGP : SUV దొంగతనం జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఉందికాబట్టి మనం ఎవరిపేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు వ్రాయొచ్చు. ముంబై పోలీసులు ముగ్గురిని సరిగ్గా ఐడెంటిఫై చెయ్యలేదని చెప్పాలి. ముందు ముంబై పోలీసులని మేనేజ్ చెయ్యాలి. HM గారు తమ పలుకుబడి వాడాలి.

అప్పటిదాకా సైలెంట్ గా అందరి మాటలు వింటున్న సి సుధీర్...

సుధీర్: నాకు ఐడియా వచ్చింది...

అందరూ అతడి వైపు చూసారు...

సుధీర్ : SUV రేప్ జరగడానికి రెండు రోజుల ముందే దొంగతనానికి గురిఅయింది... అప్పుడు ఈ నలుగురు కుర్రోళ్ళు హైదరాబాద్ లో లేరు. వివేక్ హైదరాబాద్ రాగానే తన SUV కనబడక పోవడం తో వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ముంబై పోలీసులు ఆ SUV లో నలుగురి ఫింగర్ ప్రింట్స్ దొరికాయని చెబుతున్నారు. అవి వాళ్ళవే అని మనం ఒప్పుకుందాం...

ధనంజయ : ఆలా ఒప్పుకుంటే వాళ్లకి వురి పడుతుంది...

సుధీర్ : నేను చెప్పేది పూర్తిగా వినండి. మనం ఈ నలుగురు కుర్రోళ్ళ చేత ఆ SUV లో ఫింగర్ ప్రింట్స్ తమవే అని చెప్పిదం... ఆ నలుగురు రెగ్యులర్ గా ఆ SUV లో తిరిగేవాళ్ళని అందరికి తెలుసు. కానీ... ఆ రేప్ కి... వాళ్ళకి సంభంధం లేదు... ఆ SUV ని దొంగిలించినవాళ్లు ఆమె ని ఆ SUV లో రేప్ చేసివుంటారని. చెప్తారు. SUV లో దొరికిన DNA సాంపిల్స్ వేరే వాళ్ళ సాంపిల్స్ తో మార్చెయ్యాలి. దీనికి ముంబై పోలీసుల సహకారం అవసరం. ఎవరి DNA సాంపిల్స్ అక్కడ ప్లాంట్ చేస్తామో... అదే DNA సాంపిల్స్ తో ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు కావాలి. అప్పుడే హైదరాబాద్ పోలీస్ రిపోర్ట్... ముంబై పోలీస్ రిపోర్ట్ టాలీ అవుతాయి. దాంతో మీ కుర్రోళ్ళు నలుగురు బయటకి వస్తారు.

ధనంజయ : ఎవరి DNA సాంపిల్స్ తో SUV లో దొరికిన సాంపిల్స్ ని మార్చాలి?

సుధీర్ : సింపుల్... వివేక్ తన ఫ్రెండ్స్ తో ఢిల్లీ వెళ్లేముందు యాదగిరి కి తన కీస్ ఇచ్చి సర్వీస్ చేయించామని చెప్పాడు. కానీ... యాదగిరి ఆ SUV తన ఫ్రెండ్స్ తో కలసి ఊరంతా తిరగడానికి వాడుకొని ఆ అమ్మాయిని కిడ్నప్ చేసి ఊరి బయటకి తీసుకెళ్లి రేప్ చేసి BHEL క్రాస్ రోడ్స్ దగ్గర పడేసి పారిపోతూ ఒక ఆక్సిడెంట్ జరగడం తో పోలీసులకి చిక్కారు. నేను ఆల్రెడీ యాదగిరి గ్యాంగ్ దగ్గర కన్ఫెషన్ స్టేటుమెంట్ తీసుకున్నాను. యాదగిరి గ్యాంగ్ DNA తో ఆ SUV లో దొరికిన DNA ని మార్చేసి ముంబై... హైదరాబాద్... రెండు చోట్ల ఒకే రిపోర్ట్ తయారుచేస్తే... మీ కుర్రోళ్ళు తప్పకుండా బయట పడతారు.

ధనంజయ : యాదగిరి గ్యాంగ్ దీనికి ఒప్పుకుంటారా?

కాంతారావు : దానికి సుధీర్ దగ్గర వేరే ప్లాన్ ఉంది.

సుధీర్ : మీరు రెండు చోట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ని మేనేజ్ చెయ్యండి. నా దగ్గర యాదగిరి గ్యాంగ్ కన్ఫెషన్ రిపోర్ట్ ఉంది. నేను వాళ్ళని సీన్ అఫ్ క్రైమ్ కి వాళ్ళని తీసుకొని వెళ్తాను. అక్కడ టీవీ మీడియా చూస్తుండగా యాదగిరి గ్యాంగ్ మా పోలీసుల మీద రాళ్లతో దాడి చేస్తారు. పోలీసులు వాళ్ళని ఆపడానికి మీడియా చూస్తుండగా ముందు మూడు రౌండ్స్ గాల్లో కాల్పులు జరుపుతాము. యాదగిరి గ్యాంగ్ దానికి భయపడకుండా పోలీసుల మీద రాళ్ల దాడి కంటిన్యూ చేస్తారు. పోలీసులు వేరే గత్యంతరం లేక... వాళ్ళని షూట్ చేసి చంపుతారు.

DGP : OH MY GOD... కుర్రోళ్లని కాపాడడానికి యాదగిరి గ్యాంగ్ ని లేపేస్తావా?

సుధీర్ : నో సర్... మేము రియల్ బుల్లెట్స్ కి బదులుగా ట్రాంక్విలైసింగ్ బుల్లెట్స్ వాడతాము. అవి వాళ్ళకి తగలగానే వాళ్ళు స్పృహ తప్పడమే కాకుండా... వాళ్ళ ఒంటిమీద బ్లడ్ స్టేయిన్స్ కూడా ఏర్పడతాయి. దాంతో వాళ్ళు కనీసం 5 / 6 గంటలు స్పృహ లేకుండా పడిపోతారు. వాళ్ళని మీడియా చూస్తుండగానే మనం ఏర్పాటు చేసుకున్న అంబులెన్సు స్టాఫ్ తో వాళ్ళని మార్చురీ కి తరలిస్తాము... అక్కడ వాళ్లకి బదులుగా నాలుగు అనాథ శవాలని పోస్ట్ మార్టం చేసి ప్యాక్ చేసి యాదగిరి గ్యాంగ్ ఫామిలీస్ కి అప్పగిస్తాము. వాళ్ళు వాటిని వెంటనే దహనం చేస్తారు. పోలీస్ రికార్డ్స్ ప్రకారం... యాదగిరి గ్యాంగ్ వివేక్ SUV దొంగతనం చేసి... ఆ అమ్మాయిని కిడ్నప్ చేసి... ఊరి బయటకి తీసుకెళ్లి రేప్ చేశారు. పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేసారాని ఉంటుంది. కేసు క్లోజ్ అవుతుంది. కుర్రోళ్ళు నలుగురు నిర్దోషులుగా బయటకి వస్తారు. యాదగిరి గ్యాంగ్ పర్మనెంట్ గా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతుంది.

సుధీర్ చెప్పింది వినగానే DGP కి నోటమాట రాలేదు... తన డిపార్టుమెంటు లో ఇంత క్రిమినల్ మైండెడ్ ఆఫీసర్స్ ఉన్నారని అప్పుడే తెలుసుకున్నాడు. మనసులో "వీడిని మనం జాగ్రత్త గా వాడుకోవాలి" అని అనుకున్నాడు.

ధనంజయ ఆనందం తో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు....

సుధీర్ : అన్నిటికన్నా ముందు... ఆ నలుగురి కుర్రోళ్ళ చేత ఒక రికార్డెడ్ వీడియో మెసేజ్ ని రిలీజ్ చెయ్యాలి.

ధనంజయ : వాళ్ళ చేత ఏమి చెప్పించాలి?

సుధీర్ తన ప్లాన్ స్టెప్ బై స్టెప్ వాళ్లకి చెప్పాడు. ధనంజయ వెంటనే వివేక్ కి ఫోన్ చేసి వాళ్ళు చెయ్యబోయే పని చెప్పాడు. కాంతారావు చాలా జాగ్రత్త గా ఒక స్టేటుమెంట్ ప్రిపేర్ చేసి ఆ నలుగురికి పంపాడు. సుధీర్ ఒక గంట సేపు కస్టపడి ఆ నలుగురి చేత ఒక మెసేజ్ ని రికార్డు చేసాడు. ఆ మెసేజ్ ని వాళ్ళు వెంటనే అన్ని న్యూస్ చానెల్స్ కి పంపారు. ఆ వీడియో రికార్డెడ్ మెసేజ్ ని వాళ్ళు టెలికాస్ట్ చేశారు.

"ఇవ్వాళ ఇంగ్లీష్ మీడియా లో మా నలుగురి గురించి వచ్చిన న్యూస్ ఐటెం ని చూసాక మేము నలుగురం కలసి ఒక జాయింట్ స్టేటుమెంట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాము. టీవీ లో ముంబై పోలీసులు చూపించిన MERCEDEZ BENZ SUV... నాదే... అయితే... ఆ రేప్ కి... మా నలుగురికి ఎటువంటి సంభంధం లేదు. హైదరాబాద్ లో ఆ అభాగ్యురాలు రేప్ కి గురియైన రోజున నేను... నా స్నేహితులు... రాకేష్... కిరణ్... సంజీవ్... మేమంతా న్యూ ఢిల్లీ లో ఉన్నాము. నేను ఢిల్లీ వెళ్లేముందు నా వెహికల్ ని సర్వీస్ చేయించమని మా దగ్గర పనిచేసే యాదగిరి కి ఇచ్చాను. నేను ఢిల్లీ నుంచి వచ్చాక యాదగిరి ఆ SUV దొంగిలించబడిందని చెప్పాడు. నేను వెంటనే పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను. ముంబై పోలీసులకి ఆ SUV లో దొరికిన ఫింగ్ ప్రింట్స్ మావే... ఆ DNA మాది కాదు. మేము ప్రస్తుతం ఇండియా లో లేము. హైదరాబాద్ రాగానే పోలీసులకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా సహకరించి... మా పేర్లని క్లియర్ చేసుకుంటాము"

ఈ వీడియో మెసేజ్ టెలికాస్ట్ కాగానే... కైలాష్ ముందుగా ఏర్పాటు చేసిన గూండాలు యాదగిరి గ్యాంగ్ ని ఉంచిన పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ధర్నా చేశారు. చాలా మంది స్టూడెంట్స్... జనాలు కూడా వాళ్ళతో చేరారు. అదను చూసుకొని యాదగిరి మనుషులు పోలీస్ స్టేషన్ మీద... పోలీసుల మీద రాళ్లు రువ్వారు... దాంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పెద్ద గొడవ అయ్యింది. పోలీసులకి... జనాలకి మధ్య పెద్ద గొడవ మొదలవ్వగానే కైలాష్ మనుషులు అక్కడినుంచి తప్పుకున్నారు. మీడియా అక్కడికి చేరుకుంది. అప్పటికే లాఠీచార్జి లో చాలామందికి దెబ్బలు తగిలి రక్తం కారింది. టీవీ వాళ్ళు ఆ ఇమేజెస్ ని ప్రపంచమంతా చూపించారు. సోషల్ మీడియా లో పోలీసులకి వ్యతిరేకంగా పెద్ద క్యాంపైన్ మొదలుపెట్టారు. ఆ రాత్రి ప్రతి టీవీ ఛానల్ లో వివేక్ పంపిన రికార్డెడ్ మెసేజ్... పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన లాఠీచార్జి లో గాయపడిన జనాల ఇంటర్వూస్ తో దద్దరిల్లిపోయింది. కైలాష్ తన ధన బలాన్ని వుపయోగించి మీడియా ని మానిప్యులేట్ చేయ్యసాగాడు. వివేక్ వీడియో మెసేజ్ మీద పెద్దగా డిబేట్ జరగకుండా చాలా జాగ్రత తీసుకున్నాడు.

మరుసటి రోజు కైలాష్ గౌడ్ మనుషులు పెద్ద ఎత్తున ధర్నాకి దిగారు. వాళ్ళతో పాటు కాలేజీ స్టూడెంట్స్ ని కలుపుకున్నారు. మీడియా ని ముందుగా ఇంఫార్మ్ చేశారు. కైలాష్ మనుషులు మీడియా కవరేజ్ లో కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మీడియా స్టూడెంట్స్ ని... ప్రజలని మాత్రమే కవర్ చేసేలా జాగ్రత్త పడ్డారు. పోలీస్ స్టేషన్ ముందు... ఆ అమ్మాయి ని ట్రీట్ చేస్తున్న హాస్పిటల్ ముందూ... చాలా పెద్ద గొడవ చేశారు. అక్కడ దాదాపు 20 వేలమంది జనాలు గుమిగూడారు. సడన్ గా ఒక గొడవ మొదలయ్యింది. ఆ గొడవ ఎందుకు మొదలయ్యిందో... ఎవరు మొదలెట్టారో తెలుసుకునే లోపల ఆ గొడవ పెద్ద కొట్లాట గా మారింది. దాన్ని కంట్రోల్ చెయ్యడానికి జనాల్లోకి దూరిన పోలీసులని ఎవరో చితక బాదారు. దాంతో పోలీసులు ముందుగా లాఠీ ఛార్జ్ చేశారు. అయినా ఆ గొడవ ఆగలేదు. దాంతో రిజర్వు పోలీస్ ని రంగంలోకి దింపారు. సెక్షన్ 144 పెట్టారు. మీడియా లో అందరూ ఈ గొడవని గురించే మాట్లాడుకోసాగారు... రెండు రోజుల్లో ప్రజలంతా వివేక్ వీడియో మెసేజ్ గురించి మర్చిపోయారు. పోలీసుల లాఠీచార్జి... హాస్పిటల్ దగ్గర 144 సెక్షన్ గురించి మాట్లాడసాగారు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ లోపలనుంచి ఆ రేప్ కి గురైన అమ్మాయి ఆరోగ్యం క్షీణించిందని... చావడానికి సిద్ధం గా ఉందని టాక్ బయటకి వచ్చింది. దాంతో ప్రజలు బాగా రెచ్చిపోయి పెద్ద ఎత్తున రాస్తా రోకోకి దిగారు. హై వే మీద ట్రాఫిక్ ని ఆపేసారు... రైళ్లు రద్దుఅయ్యాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో ఎవరికి తెలియని ఒక అయోమయ స్థితి ఏర్పడింది.

సికింద్రాబాద్ లో ఒక కుర్రోడు ఒంటిమీద కిరోసిన్ పోసుకొని అంటిచుకున్నాడు... అది పెద్ద న్యూస్ అయ్యింది. ఒక నాలుగు రోజుల్లో స్టేట్ మొత్తం పోలీసులు... ప్రజల మధ్య ఘర్షణలు... వొంటి నిండా గాయాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆ కుర్రోడి న్యూస్ బాగా డామినేట్ చేసింది. అందరూ ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు? అతని డైలీ హెల్త్ రిపోర్ట్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వసాగారు. ఇదే అదనుగా రేప్ కి గురైన ఆ అమ్మయిని మెరుగైన ట్రీట్మెంట్ కోసం న్యూ ఢిల్లీ లోని AIIMS కి ఎయిర్ అంబులెన్సు లో పంపారు. దాంతో ప్రజలు ఆ అమ్మాయి గురించి పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు ప్రజల ద్రుష్టి వొంటి నిండా థర్డ్ డిగ్రీ బర్న్స్ తో గాంధీ హాస్పిటల్ లో చేరిన కుర్రోడి మీదకి మళ్లింది.

ధనంజయ తన పలుకుబడి ఉపయోగించి ముంబై పోలీస్ రిపోర్ట్ లో యాదగిరి గ్యాంగ్ DNA చేర్చి కొత్త రిపోర్ట్స్ తయారు చేయించారు. ఒక రోజు రాత్రి తన మనుషులని Dr ప్రభావతి ఇంటికి పంపించాడు. వాళ్ళు ఎలాగైనా ఆమె చేత వాళ్ళు తయారుచేసిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద సంతకం చేయించి... ఆమె ఆఫీషియల్ రబ్బర్ స్టాంప్ వేయించుకొని గాని వెనక్కిరారు.

అవినాష్ అదే సమయంలో తన ఇంట్లో ఒక కొత్త ఆపిల్ ఐఫోన్ ని బయటికి తీసాడు. అందులో UAE చెందిన ETISALAT మొబైల్ ఫోన్ కంపెనీ SIM కార్డు వేసాడు. ఆ ఫోన్ ని తన లాప్ టాప్ కి అటాచ్ చేసి ఒక వీడియో ని కాంతారావు... కైలాష్ గౌడ్... ధనంజయ... మహీంద్ర పర్సనల్ మొబైల్ ఫోన్ నంబర్స్ కి పంపించాడు. అవి వాళ్లకి చేరగానే ఆ ఆపిల్ ఐఫోన్ లోంచి SIM కార్డు తీసి జాగ్రత్త గా పక్కన పెట్టి... ఆ ఫోన్ ని ఒక ప్లాస్టిక్ బాగ్ లో వేసి ఒక పెద్ద సుత్తి తో ముక్కలుముక్కలు చేసాడు. ఆ తరువాత ఆ ఫోన్ ముక్కల్ని... SIM కార్డు ని బొగ్గుల కుంపటిలో వేసి తగల పెట్టాడు.

ముందుగా ఆ వీడియో ని కాంతారావు చూసాడు... ఒక్కసారి గుండె పగిలింది... వెంటనే ఫోన్ చేసి ధనంజయ కి చెప్పాడు... ధనంజయ తన ఫోన్ చెక్ చేసాడు... ఒక వీడియో మెసేజ్ వచ్చింది... చూసాడు... ముందు అర్ధం కాలేదు... రెండో సారి చూసాడు... వొళ్ళంతా కంపించింది... వెంటనే ఫోన్ చేసి ప్రభావతి ఇంటికి వెళ్లిన తన మనుషులతో "ఎక్కడున్నారు?" అని అడిగాడు. "డాక్టర్ ఇంటికి దగ్గర్లో ఉన్నాము. పని కాగానే మీకు ఫోన్ చేస్తాం" అని చెప్పారు. "వొద్దు... వెంటనే వెనక్కి రండి... ఆ ప్రభావతి ని ఏమి చెయ్యకండి" అని గట్టిగా అరిచి చెప్పాడు.

కైలాష్ గౌడ్... మహీంద్ర... ఇద్దరూ తమ ఫోన్స్ వచ్చిన వీడియో ని చూసారు. ఆ వీడియో లో --

కైలాష్ పెట్రోల్ బంక్ లో బెంజ్ కార్... పక్కనే ఇన్నోవా క్లియర్ గా కనిపిస్తున్నాయి. బెంజ్ కార్ డ్రైవర్ సీట్ లోంచి వివేక్ దిగాడు. డ్రైవర్ ప్రక్క సీట్ లోంచి కిరణ్ దిగాడు. వాళ్లిద్దరూ యాదగిరి తో మాట్లాడుతున్నారు. కిరణ్ ఎదో అడుగుతున్నాడు.... యాదగిరి తడబడుతున్నాడు.... వివేక్... కిరణ్ ఎదో సర్దిచెప్తున్నారు.. చివరికి యాదగిరి తలూపాడు. కిరణ్ బెంజ్ కార్ లో వెనక సీట్ లో కూర్చున్న వాళ్ళతో ఎదో చెప్పాడు.... వెనక డోర్ తీసుకొని ఒక కుర్రోడు కిందకి దిగాడు. అతని పేరు సంజీవ్. ... రాష్ట్ర హోమ్ మోనిస్టర్ కొడుకు.. బెంజ్ కార్ వెనక డోర్ తీసి పట్టుకున్నాడు. యాదగిరి ఇన్నోవా దగ్గరికి వెళ్లి వెనక సీట్ లో కూర్చున్న ఆ యువతి తో చాలా మర్యాదగా ఏదో చెప్పాడు. ఆమె కిందకి దిగింది. ఆమె ని చూడగానే కిరణ్ ఆమె చెయ్యి పట్టుకొని బెంజ్ కార్ వెనక సీట్ వైపు తోసాడు. సంజీవ్ ఆమెని కార్ లోకి నెట్టాడు.... ఆమె తూలి బెంజ్ కార్ వెనక సీట్ లో పడబోయి వెనక్కి జరిగింది. కానీ... ఆమె వెనక నుంచున్న సంజీవ్ ఆమెని లోపలి బలవంతంగా తోసాడు. అప్పటికే లోపల కూర్చున్న ఇంకో కుర్రాడు రాకేష్... లాయర్ కాంతారావు కొడుకు ఆమెని పట్టుకొని లోపలి లాగేసాడు. ఆమెని లోపలి తోసి వెనకాలే సంజీవ్ కూడా ఎక్కాడు. అప్పటికే కిరణ్ కార్ ఎక్కేసాడు. సంజీవ్ కార్ ఎక్కి తలుపు వెయ్యగానే వివేక్ కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టం స్విచ్ ఆన్ చేసి వేగంగా ఆ పెట్రోల్ బంక్ లోంచి వెళ్ళిపోయాడు. ఆ యువతి తో పాటు వచ్చిన ముసలి వ్యక్తి ఇది గమనించి ఇన్నోవా కార్ డోర్ తీసుకొని అరుస్తూ బెంజ్ కార్ కి అడ్డు వెళ్ళబోతూంటే జిలాని ఒక ఐరన్ రాడ్ పెట్టి ఆ ముసలి వ్యక్తి ని గట్టిగా కొట్టాడు... ఆయన మొదలు నరికిన చెట్టులా కూలపడిపోయాడు. సైదులు... యాదగిరి ఆ ముసలాయనను ఎత్తుకొని ఇన్నోవా వెనక లగ్గేజ్ తో పాటు పడేసారు. జిలాని ఆ ఐరన్ రాడ్ ని కూడా ఆ ముసలివ్యక్తి తో పాటు లగ్గేజ్ మీద పడేసి వెనక డోర్ వేసి ఇన్నోవా వెనక సీట్ లో కూర్చున్నాడు. ఇన్నోవా కూడా పెట్రోల్ బంక్ లోంచి బయటకి వచ్చింది.


Part - 21 - Drug Route

వరుసగా మూడు రోజుల పాటు సూర్యోదయానికి 10 నిమిషాల ముందే ఆర్మీ Reaper వైజాగ్ నేవీ బేస్ లోంచి గాల్లోకి లేచేది. సూర్యుణ్ణి అనుసరిస్తూ పడమర దిశగా ఆంధ్ర... ఒరిస్సా... ఛత్తీస్ ఘడ్... తెలంగాణ... మహారాష్ట్ర... బోర్డర్ ఏరియాస్ మొత్తం తక్కువ ఎత్తులో... తక్కువ స్పీడ్ తో ప్రయాణించింది. చాలా క్లియర్ వీడియోస్ ని తియ్యగలిగింది. రాష్ట్రాల సరిహద్దుల పొడుగూతా పెద్ద అడవులు... నేషనల్ పార్క్స్... అరకు వాలీ... అన్నిన్నిటిని వీడియో తీసింది. ప్రతి రోజూ కనీసం 8 గంటల సేపు రాష్ట్ర సరిహద్దుల మీద ప్రయాణం చేసింది. ఒక్కోరోజు ఒక్కో యాంగిల్ లో వీడియో తీసింది. ఆ వీడియో ఫుటేజ్ మొత్తం రియల్ టైం బేసిస్ లో Op Center కి చేరింది. ఆ ఫుటేజ్ ని చూస్తే ఏమి అర్ధం కాలేదు. మాధవ్ జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా కి చెందిన ఎక్స్పర్ట్స్ ని పిలిపించి ఆ ఫుటేజ్ చూపించాడు. వాళ్ళు దాన్ని చాలా సేపు పరిశీలించి... తమ దగ్గరున్న పాత డేటా తో కంపేర్ చేశారు. చాలా డిఫరెన్స్ కనిపిచింది. రెండు చోట్ల అడవి మొత్తం మాయమయింది. 10 ఏళ్ళ క్రితం దాకా రికార్డ్స్ లో కనిపించిన చిట్టడవి లో రెండు ప్రాంతాలు ఇప్పుడు మాయమయ్యాయి. ఒకప్పుడు అక్కడంతా చెట్లతో దట్టంగా ఉండేది. ప్రస్తుతం కొన్ని వేల ఎకరాల ప్రాంతం చదునుగా కనిపిస్తోంది. వాళ్ళకి ఆ ప్రాంతం లో అడవి ఎలా మాయమయ్యిందో అర్ధం కాలేదు. "మేము దీన్ని వెంటనే Survey of India, Ministry Environment and Forestry కి తెలపాలి... ఇటువంటి Forest Erosion మేము ఇప్పటిదాకా చూడలేదు. దీనికి గల కారణాలు మేము వెంటనే కనుక్కోవాలి" అని అన్నారు. మాధవ్ వాళ్లకి అసలు కారణం చెప్పలేదు.

ఫారెస్ట్ ఏరోషన్... డిఫారెస్టేషన్... చాలా పెద్ద సమస్య. అది మన ఈకోసిస్టమ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అడవులని ఇష్టం వచ్చినట్లు కొట్టేయడం వల్ల వానలు విపరీతంగా కురిసినప్పుడు నీటి ప్రవాహ ఉధృతానికి నదులకి గండి పడడం... ఆ వరద నీరు పల్లెలు... పట్టణాలలోకి రావడం జరగవచ్చు. చాలా పెద్ద ఎత్తున డామేజ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అడవులని కొట్టెయ్యడంవల్ల క్రూరమృగాలు జన జీవనస్రవంతి లో కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం రైన్ ఫారెస్ట్ కన్జర్వేషన్... డెవలప్మెంట్ మీద ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నారు. కానీ... మన దేశం లో అడవులని నిర్ధాక్షిణ్యంగా నరికేస్తున్నారు.

మళ్ళీ Reaper ని Survey of India వాళ్ళు గుర్తించిన రెండు ప్రాంతాల మీదకి పంపాడు. ఈసారి Reaper 1000 అడుగుల ఎత్తులో ప్రయాణించింది. చాలా నెమ్మదిగా గాల్లో చక్కర్లు కొట్టింది.3D ఇమేజెస్ సంపాదించడం తో ఆ ఏరియా లో ఎత్తు పల్లాలు... పొదలు... నదుల డీటెయిల్స్ బాగా తెలిసాయి. ఆ ఏరియా లో పెద్ద సంఖ్యలో గుడిసెలు... కాటేజెస్... ఒక హాస్పిటల్... దూరంగా పెద్ద పెద్ద కర్మాగారాలు... ఆ ప్రదేశం లో వందల సంఖ్యలో జన సంచారం కనిపిచింది. వేల కొద్దీ ఎకరాల్లో జనాలు వ్యవసాయం చేస్తూ కనిపించారు.

ఆ రెండు లొకేషన్స్ Geo Coordinates కి ఇండియన్ ఆర్మీ జవాన్స్ ని పంపించాడు. వెంటనే రెండు టీమ్స్ ని తయారు చేశారు. ఒక్కో టీం లో 10 మంది. ఒక రోజు రాత్రి రెండుగంటల ప్రాంతం లో పూణే ఆర్మీ బేస్ నుంచి ఒక హెలికాఫ్టర్ MACHATE కి బయలుదేరింది. ఇంకో హెలికాఫ్టర్ వైజాగ్ నేవీ బేస్ నుంచి CHAPORI కి రీజియన్ కి బయలుదేరింది. ఆ రెండు టీమ్స్ ని లొకేషన్ కి 15 కిలోమీటర్స్ దూరంలో డ్రాప్ చేశారు. ఆ చిమ్మ చీకట్లో ఆర్మీ జవాన్స్ చాలా జాగ్రత్తగా ఆ ఏరియాస్ ని చేరుకున్నారు. సూర్యోదయానికి ముందే ఒక ఇద్దరు జవాన్స్ ఆ పొలం లోకి వెళ్లి కొన్ని చెట్లని పీకి తీసుకొని వచ్చారు. తెల్లవారగానే ముఖ్యం గా ఫ్యాక్టరీస్ వున్నా ఏరియా బాగా కవర్ అయ్యేలా ఫొటోస్ తీశారు. ఆ ఫ్యాక్టరీస్ దగ్గర కనీసం ఒక వంద కి పైగా సెక్యూరిటీ గార్డ్స్ లేటెస్ట్ మోడల్ అసాల్ట్ రైఫిల్స్ తో కాపలా కాస్తున్నారు. వాళ్లకి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. "మీరు ఎట్టి పరిస్థిలో వాళ్ళ మీద ముందుగా మీరు కాల్పులు చెయ్యొద్దు... సెల్ఫ్ డిఫెన్స్ లో నే మీరు మీ వెపన్స్ వాడండి" అని చెప్పారు. వచ్చిన పని కాగానే వాళ్ళు ఎక్సట్రాక్షన్ పాయింట్ వెళ్లి బేస్ కి సిగ్నల్ పంపారు. హెలీకాఫ్టర్స్ వచ్చి వాళ్ళని బేస్ కి తీసుకొని వచ్చారు. వాళ్ళు తెచ్చిన మొక్కలని న్యూ ఢిల్లీ పంపారు.

MACHATE రీజియన్ లో పెంచుతున్న మొక్కల నుంచి కొకెయిన్.... CHAPORI రీజియన్ లోని మొక్కలతో కన్నబిస్ TELCHAT రీజియన్ లో ఓపియం భారీ ఎత్తున తయారవుతున్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆధారాలని తీసుకొని మాధవ్... రవీంద్ర... కాబినెట్ సెక్రటరీ ని కలిశారు.

కాబినెట్ సెక్రటరి : వెరీ సీరియస్ మేటర్... నెక్స్ట్ ఆక్షన్ ప్లాన్ ఏమిటీ?

రవీంద్ర : ఆ మూడు ఫెసిలిటీస్ ని ఒకేసారి నాశనం చెయ్యాలి... దాంతో ఒక్కసారిగా ప్రొడక్షన్ ఆగిపోతుంది. మళ్ళీ ప్రొడక్షన్ మొదలు పెట్టి మార్కెట్ లోకి తేవడానికి చాలా టైం పడుతుంది.

కాబినెట్ సెక్రటరీ : ఎస్... వాళ్ళని అరెస్ట్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ ఫెసిలిటీస్ మహీంద్ర నడుపుతున్నాడని ఎలా ప్రూవ్ చెయ్యడం?

రవీంద్ర : సర్... ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని మహింద్ర కి లింక్ చేసి ప్రూవ్ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది. మన దేశం లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు అవుతున్నాయని కాన్ఫిడెంట్ గా చెప్పగలం. ముందు వీటిని ఎలా నాశనం చెయ్యాలో ఆలోచించాలి.

కాబినెట్ సెక్రటరీ (మాధవ్ తో) : వాట్ అర్ ది అషన్స్?

మాధవ్ : ఓన్లీ వన్ ఆప్షన్... కమెండో ఆపరేషన్.. ఒక్కో చోట కనీసం 100 కి పైగా సెక్యూరిటీ గార్డ్స్ రైఫిల్స్ తో వున్నారని తెలుస్తోంది. మనం కనీసం ఒక్కో చోటకి 200 ఆర్మీ జవాన్స్ ని పంపి వాళ్ళని చంపేసి ఆ ఫ్యాక్టరీస్ ని తగలపెట్టెయ్యాలి...

కాబినెట్ సెక్రటరీ : సౌండ్స్ గుడ్... నేను PMO లో డిస్కస్ చేసి ఏమి చెయ్యాలో చెప్తాను... బీ రెడీ ఫర్ ఆక్షన్... ఎలాగైనా వీటిని మహీంద్ర కి లింక్ చెయ్యగల ప్రూఫ్స్ సంపాదించండి.


అదే సమయానికి హైదరాబాద్ లో విశ్వామిత్ర మహీంద్ర గ్రూప్ అఫ్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ లోని డేటా సెంటర్ ని హాక్ చేయడం తో మొత్తం నెట్వర్క్ డిటైల్స్ కనుక్కున్నాడు. మహీంద్ర డ్రగ్స్ తయారుచేయడానికి కావాల్సిన ముడి పదార్ధాలు అడవుల్లో పెంచుతున్నాడు. కావాల్సిన కెమికల్స్ ని విదేశాల్లోంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు. MACHATE... TELCHAT... CHAPORI ప్లాంట్స్ సుపీరియర్ క్వాలిటీ డ్రగ్స్ ని తయారు చేస్తాడు. వాటిలో 80% విదేశాలకి ఎక్సపోర్ట్ చేస్తాడు. దానికి పెద్ద నెటవర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న స్టెప్స్ లో డ్రగ్స్ ని కదిలిస్తాడు.

1. మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ నుంచి డ్రగ్స్ ని ఆదివాసుల సహాయంతో వాళ్ళ గాడిదలమీద అడవి చివరిదాకా కదిలిస్తాడు. దాన్ని స్టేజి 1 అంటారు.స్టేజి 1 దగ్గర బాగా నమ్మకమైన వ్యక్తి డెలివరీ తీసుకుంటాడు. MACHATE దగ్గర గైక్వాడ్ వస్తాడు. TELCHAT దగ్గర సుభాష్... CHAPORI దగ్గర సింహాద్రి ఇంచార్జ్ గా ఉంటారు. ఆదివాసులతో వాళ్ళే డీల్ చేస్తారు.

2. స్టేజి 2 దగ్గర నుంచి డ్రగ్స్ ని దగ్గరలో ఒక గ్రామానికి చేరుస్తారు. అక్కడ డ్రగ్స్ ని చిన్న చిన్న లాట్స్ లో విభజించి ఎక్కువ భాగాన్ని బాగా నమ్మకమైన వ్యక్తులద్వారా విదేశాలకి ఎక్సపోర్ట్ చెయ్యించడానికి స్టేజి 3 పంపిస్తారు. మిగిలిన డ్రగ్స్ ని గైక్వాడ్ ముంబై తీసుకెళ్తాడు. సుభాష్ హైదరాబాద్ తెస్తాడు. CHAPORI లో తయారైన డ్రగ్స్ మొత్తం అమెరికా కి ఎక్సపోర్ట్ చేస్తారు.

3. స్టేజి 3 దగ్గర అన్ని లాట్స్ ని కలిపి ఒక లారీ లో ఎక్కించి చిన్న పోర్ట్స్ కి పంపిస్తారు. దీనికి ఒక కొత్త విధానాన్ని ఎంచుకున్నాడు. స్టేజి 3 దగ్గరనుంచి బాగా నమ్మకమైన వాడు లారీ ని మొదటి 100 కిలోమీటర్స్ నడుపుతాడు. ముందుగా నిర్ణయించుకున్న లారీ ని పార్క్ చేసి లారీ తాళాలు... డబ్బులు ఒక చిన్న బాక్స్ లో పెట్టి దాన్ని డ్రైవర్ సీట్ కింద పెట్టి కమాండ్ సెంటర్ కి ఫోన్ చేసి  లారీ లొకేషన్ డీటెయిల్స్ ని పంపించి వెళ్ళిపోతాడు. కమాండ్ సెంటర్ దగ్గర లారీ డ్రైవర్స్ లిస్ట్ వుంది. వాళ్లలో ఒకళ్ళకి మెసేజ్ పంపుతారు. ఆ మెసేజ్ లో లారీ నెంబర్... లొకేషన్... డెస్టినేషన్ డీటెయిల్స్... ఉంటాయి. ఆ రెండో డ్రైవర్ ఆ లొకేషన్ కి వెళ్లి డ్రైవర్ సీట్ కిందనున్న బాక్స్ లో డబ్బులు తీసుకొని... లారీ ని ఇంకో 100 కిలోమీటర్స్ నడుపుతాడు. ఆ రెండో డ్రైవర్ కి ఆ లారీ ఎవరిదో... అందులో ఉన్న సరుకు ఏమిటో... చెప్పరు. ఆ డ్రైవర్ పని లారీ ని ఎక్కడా ఆపకుండా నడిపి ఇంకో 100 కిలోమీటర్స్ దూరం నడిపి డెస్టినేషన్ చేరుకోగానే కమాండ్ సెంటర్ కి ఫోన్ చేసి విప్పి వెళ్ళిపోతాడు. అక్కడ మహింద్ర మనిషి ఒకడు ఆ లారీ డ్రైవర్ సీట్ కింద బాక్స్ లో డబ్బులు పెట్టి కమాండ్ సెంటర్ కి ఫోన్ చేస్తాడు. కమాండ్ సెంటర్ ఇంకో డ్రైవర్ కి ఫోన్ చేస్తుంది. ఇలా ప్రతి 100 కిలోమీటర్స్ కి ఒక డ్రైవర్ మారిపోతాడు. చివరికి ఆ లారీ స్టేజి 4 చేరుకుంటుంది. ఒకవేళ దారి మధ్యలో లారీ ఎక్కడైనా పట్టుబడితే... ఆ లారీ ఎవరిదీ? ఆ లారీ లో డ్రగ్స్ ఎవరు పెట్టారు? ఆ లారీ ఎక్కడనుంచి బయలుదేరింది? దాని డెస్టినేషన్ ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. మహేంద్ర మనుషులు నెమ్మదిగా ఆ డ్రైవర్ ని ఎటువంటి కేసులోనూ ఇరుక్కోకుండా జాగ్రత్తగా బయటకి తీసుకొని వస్తారు...

4. స్టేజి 4 దగ్గర మహీంద్ర ఏజెంట్ ఉంటాడు. ఆ లారీ లోని డ్రగ్స్ ని ఒక కంటైనర్ లోకి వేరే వస్తువులతో కలిపి లోడ్ చేయిస్తాడు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఎక్సపోర్ట్ డాకుమెంట్స్ తో పోర్ట్ కి తీసుకొని వెళ్తాడు. లోడింగ్ డాక్ దగ్గరికి వెళ్లి కదలటానికి రెడీ గా ఉన్న షిప్ లోకి ఆ కంటైనర్ ని ఎక్కించి ఆ షిప్ పోర్ట్ వొదిలి వెళ్ళేదాకా ఉండి... కమాండ్ సెంటర్ కి ఫోన్ చేసి షిప్ నేమ్... కంటైనర్ నెంబర్... డేట్ అండ్ టైం అఫ్ డిపార్చర్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తాడు.

5. MACHATE లో తయారైన కొకెయిన్... TELCHAT లో తయారైన ఓపియం నేరుగా యూరోపియన్ మర్కెట్స్ కి ఎక్సపోర్ట్ చేస్తాడు. దానికి ఎక్కువగా ముంబై... కాండ్ల... గోవా... కొచ్చిన్ పోర్ట్స్ ని వాడతాడు. అక్కడ చాలా మంది పోర్ట్ ఆఫీసర్స్ మహీంద్ర పే రోల్ లో పనిచేస్తారు. వాళ్లకి రెగ్యులర్ గా డబ్బులు చేరతాయి.

6. CHAPORI లో తయారైన కన్నబిస్ వైజాగ్... పారాదీప్ పోర్ట్స్ నుంచి డైరెక్ట్ గా మలేసియా... ఇండోనేషియా... హాంకాంగ్ కి పంపిస్తారు. అక్కడ నుంచి ఆ కంటైనర్లు ని మదర్ వెస్సెల్ లో ఎక్కించి శాంఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ పోర్ట్స్ కి పంపిస్తారు. అమెరికా లో కన్నబిస్ కొన్ని రాష్ట్రాల్లో లీగల్ గా అమ్మవచ్చు. మార్కెట్ చాలా పెద్దది.

7. ఈ డ్రగ్స్ ని డెస్టినేషన్ కి చేర్చడానికి మహీంద్ర కొంత మంది ఏజెంట్స్ ని పెట్టుకున్నాడు. వాళ్ళు లిస్బన్... రోటర్ డాం... హాంబర్గ్... మార్సెల్... లండన్ లో కంసైన్మెంట్ ని వేరే ఏజెంట్స్ కి అమ్ముతారు. ఆ డబ్బులు ఆయా దేశాల్లో డమ్మి కార్పొరేషన్స్ అకౌంట్స్ లో జమ చేస్తారు. ఆ డమ్మి కార్పొరేషన్స్ ఆ డబ్బుని ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్ ద్వారా UNTRACEBLE రూట్స్ లో CIRCUMVENT చేసి చివరికి ఆ డబ్బులు ఫారిన్ ఇన్వెస్టుమెంట్ రూపం లో ఇండియా కి పంపిస్తారు.

8. హైదరాబాద్... ముంబై లోకి తెచ్చిన డ్రగ్స్ ని రాత్రి పూట డ్రోన్స్ వాడి రిటైల్ డీలర్స్ కి ముందుగానే డబ్బులు తీసుకొని డెలివరీ ఇస్తారు.

ఇండియా లో డ్రగ్స్ చాలా తక్కువగా అమ్మడంతో మహీంద్ర కి ఇండియా లో డ్రగ్ లార్డ్స్ తో పెద్దగా ప్రాబ్లెమ్ రాలేదు. చాలా అర్గనైజ్డ్ గా బిజినెస్ చేస్తున్నాడు. మహీంద్ర కి దేశం లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే కాపాడడానికి ఒక సుప్రీం కోర్ట్ లాయర్... పొలిటికల్ సపోర్ట్ సంపాదించుకున్నాడు.

ఈ డీటెయిల్స్ మొత్తం అవినాష్ ద్వారా Op Center కి చేరాయి... అక్కడ నుంచి కేబినేట్ సెక్రటరీ కి చేరాయి.

కాబినెట్ సెక్రటరీ : మహింద్రకి ఎన్ని దేశాల్లో డమ్మి కార్పొరేషన్స్ ఉన్నాయో.. పూర్తి డీటెయిల్స్ కావాలి. ఆ కార్పొరేషన్స్ వాడే బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్... ఏ ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్ ద్వారా ఆ డబ్బులు ఇండియా కి తీసుకొని వస్తాడో తెలియాలి.

రవీంద్ర : చాలా టైం పడుతుంది.

కాబినెట్ సెక్రటరీ : అంత టైం లేదు. ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. గెట్ మి అల్ ది డీటెయిల్స్. నేను ఆ డమ్మి కార్పొరేషన్స్ బ్యాంకు అకౌంట్స్ ని ఫ్రీజ్ చెయ్యింస్తాను. ఇక్కడ మహీంద్ర కి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో లిస్ట్ కావాలి. IT... ED... ని కూడా ఇన్వొల్వె చెయ్యండి.

మాధవ్ : ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని నాశనం చేసే విషయం లో ఏదైనా డెసిషన్ తీసుకున్నారా?

కాబినెట్ సెక్రటరీ : ఎస్... PMO కి ఇన్ఫోర్మ్ చేసాను... ఆప్షన్స్ అడిగారు. కమెండో ఆపరేషన్ గురించి చెప్పాను. వేరే ఆప్షన్స్ కూడా చూడమని చెప్పారు.


ఒకరోజు ఉదయం CI చక్రవర్తి నిద్ర లేచి తన మొబైల్ ఫోన్ చూసుకున్నాడు. కంట్రోల్ రూమ్ నించి మెసేజెస్... రెండు మిస్డ్ కాల్స్... ఒక వాట్సాప్ మెసేజ్ కనిపించాయి. ముందు కంట్రోల్ రూమ్ నుంచి వచ్చిన మెసేజెస్ చెక్ చేసాడు. తరువాత మిస్డ్ కాల్స్ ని ఫోన్ చేసాడు. చివరిగా వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసాడు. ఎదో కొత్త నెంబర్ నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ప్లే చేసాడు. దాదాపు 10 నిమిషాల వీడియో ముందు అర్ధం కాలేదు... అర్ధం కాగానే కాళ్ళ కింద భూమి బద్దలైన ఫీలింగ్స్. గొంతు తడి ఆరిపోయింది... వొళ్ళంతా కంపించింది. చెమటలు పొయ్యసాగాయి... వీడియో మొత్తం చూసాడు. మతి పోయింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. ఎదో కొత్త నెంబర్...

చక్రవర్తి : హలో...

కొత్త నెంబర్ : వీడియో చూసావా?

చక్రవర్తి : చూసాను. అది మీకు ఎక్కడ దొరికింది.

కొత్త నెంబర్ : అది నీకు అనవసరం. నీతో చాలా మాట్లాడాలి. నేను ఎప్పుడు కలవాలి... ఎక్కడ కలవాలి... డీటెయిల్స్ పంపిస్తా... ఎవరికైనా చెప్తే... నీకే నష్టం

చక్రవర్తి : నో... ఎవరికి చెప్పను...

ఫోన్ కట్ అయింది... ఏమి చెయ్యాలో అర్ధం కాక బెడ్ మీద అలాగే కూర్చున్నాడు. ఇంకోసారి ఆ వీడియో చూసాడు. ఆ వీడియో లో ఇరానీ కేఫ్ లోపలి భాగం చాలా క్లియర్ కనిపిస్తోంది... వచ్చే పోయే కస్టమర్స్ తో చాలా బిజీ గా ఉంది... కేఫ్ లో పనిచేసే కుర్రోళ్ళు టీ... బిస్కేట్స్ సప్లై చేస్తూ కస్టమర్స్ దగ్గర డబ్బులు తీసుకుంటూ...  చాలా బిజీ గా ఉన్నారు... సడన్ అప్పుడే ఆ కేఫ్ లోకి ఒక బికారి రావడం... కేఫ్ ఓనర్ వాడిని తరిమెయ్యమని తన వాళ్లకి చెప్పడం... బికారి కేఫ్ లోపలి దూసుకొచ్చి తుపాకీతో కాల్పులు జరపడం... జనాలని చంపడం... చివరి కేఫ్ లో పని చేసే కుర్రోళ్ళు ఆ బికారి ని లొంగదీసుకోవడం... పోలీసులు కేఫ్ లోకి దూసుకెళ్లడం... ముఖ్యంగా CI చక్రవర్తి ఆ కేఫ్ లో బుల్లెట్స్... వాటి షెల్స్ ని చాలా జాగ్రతగా వెతికి తీసుకోవడం... చాలా క్లియర్ గా రికార్డు అయ్యింది... చక్రవర్తి ఒళ్ళు జలదరించింది... ఆలోచించడం మొదలెట్టాడు... ' షూట్ అవుట్ కి ముందు రోజు తానే స్వయంగా ఇరానీ కేఫ్ కి వెళ్లి లోపల ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవన్న విషయాన్ని నిర్ధారించుకున్నాడు...  అటువంటప్పుడు ఈ వీడియో ఎవరు తీశారు? రికార్డింగ్ చాలా క్లియర్ గా ఉంది... ఎవరో ప్రొఫెషనల్స్ తీసినట్లు ఉంది. ఎవరిపని? కైలాష్ గౌడ్ మనుషుల పనా? లేక వేరే వాళ్లకి షూట్ ప్లాన్ లీక్ అయ్యిందా? ఇప్పుడు ఈ వీడియో తనకి ఎందుకు పంపారు? వాళ్లకి ఏమి కావాలి? కైలాష్ కి ఈ విషయం చెప్పాలా... వొద్దా? వాళ్లకి ఏమి కావాలి? ఆ వీడియో లో తానూ బుల్లెట్స్... వాటి షెల్స్ ని వెతకడం చాలా క్లియర్ గా రికార్డు అయ్యింది. ఈ వీడియో డిపార్ట్మెంట్ కి చేరితే పెద్ద గొడవ అవుతుంది... ఇప్పుడు ఏమి చెయ్యాలి?'


Part - 22 - The Smooth Criminal

వికాస్ దేశాయ్... aka... Smooth Criminal. వికాస్ ముంబై లో పుట్టి పెరిగాడు. వికాస్ ఫాదర్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లో స్టాక్ బ్రోకర్. వికాస్ తన విద్యాభ్యాసం మొత్తం కేథడ్రాల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ లో చదువుకున్నాడు. అహ్మదాబాద్ లో IIM చేస్తున్న రోజుల్లో ఆకాంక్ష మెహతా తో పరిచయం అయ్యింది. ఆకాంక్ష తండ్రి కోమల్ మెహతా డైమండ్ పాలిషింగ్ బిజినెస్ చేసేవాడు. కోమల్ మెహతా కు బిజినెస్... పొలిటికల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వికాస్ పెళ్లి అయ్యాక ముంబై లో కొంత కాలం తన ఫాదర్ స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ లో పనిచేశాడు. విపరీతంగా సంపాదించాడు. ఆకాంక్ష తండ్రి సహాయం తో ఢిల్లీ లో ఒక పవర్ బ్రోకర్ గా అవతారమెత్తాడు. సెంట్రల్ ఢిల్లీలో బాగా పలుకుబడి ఉన్న వర్గాన్ని Lutyens Society అని అంటారు. ఆ సొసైటీ లో బాగా కలిసిపోయాడు. ఆ సొసైటీ లో ఎక్కువగా రాజకీయ నాయకులు... వాళ్ళ చుట్టూ తిరిగే లాబీయిస్టులు... భజన సంఘం... మీడియా హెడ్స్... బిజినెస్ హెడ్స్...సినిమా యాక్టర్స్... ఫారిన్ ఎంబసీ స్టాఫ్... అది ఒక వేరే ప్రపంచం. ఆ సొసైటీ లోకి చేరాలని దేశంలో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అందరికి ప్లేస్ దొరకదు. ఒకసారి ఆ సొసైటీ వాతావరణానికి అలవాటు పడితే... దూరంగా ఉండటం చాలా కష్టం. వికాస్ స్వతహాగా బిజినెస్ కమ్యూనిటీ కి చెందిన వాడు కావడంతో పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు.

Lutyens Delhi లో ఒక ప్రముఖ వ్యక్తి ఇచ్చే కాక్టెయిల్ పార్టీస్ కి చాలా పేరు ఉంది. ఆ వ్యక్తి ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ కి చెందిన MP. ఆయన తన సొంత పార్టీ అధికారంలో ఉన్నా... లేకయినా ... ఆయన వ్యాపార... వ్యవహారాలకు ఎటువంటి ఆటంకం ఉండదు. అన్ని పార్టీస్ చెందిన లీడర్స్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. ఆయన ఇంట్లో పార్టీ కి ఇన్విటేషన్ అందితే చాలు వెంటనే దేశంలో ఉన్న పెద్ద పెద్ద డ్రెస్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా... రోహిత్ బెహల్... రైతు బేడీ... నీతా లుల్లా... విపరీతంగా బిజినెస్ చేస్తారు. ఒక్కోసారి ఆ పార్టీ లో ఫ్యాషన్ పరేడ్ కూడా నిర్వహిస్తారు. ఒకసారి కర్ణాటక కి చెందిన ఒక పెద్ద సినిమా డైరెక్టర్ షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ కి వెళ్ళాడు. అదే సమయంలో ఈ ప్రముఖ వ్యక్తి ఇస్తున్న పార్టీ కి ఇన్విటేషన్ వచ్చింది. అంతే... షూటింగ్ మధ్యలో ఆపేసి వెనక్కి వచ్చి పార్టీ కి వెళ్ళాడు. ప్రస్తుతం వికాస్ ఆ పెద్ద మనిషి ఇస్తున్న పార్టీ లో ఒక ప్రముఖ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ని కలిసాడు. ఆ యూనియన్ కాబినెట్ మినిస్టర్ వికాస్ తో "నీ గురించి చాలా విన్నాను. పెద్ద పెద్ద డీల్స్ చేస్తావని తెలిసింది. నాకు ఒక డీల్ ఫైనలైజ్ చెయ్యడానికి నీ సహాయం కావాలి..." అంటూ ఒక గంట సేపు చాలా వివరంగా చెప్పాడు.

వికాస్ కి తన నెటవర్క్ మీద చాలా నమ్మకం. దేశంలో జరిగే ముఖ్యమైన విశేషాలు తనకి తప్పకుండా తెలుస్తాయని బాగా నమ్మకం తో ఉండేవాడు. ఇందాక మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత ఆ నమ్మకం కొంచం సడలింది. వికాస్ కి తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి... యూనియన్ మినిస్టర్ చెప్పిన పని చెయ్యడానికి మరుసటి ఉదయం స్పెషల్ ఛార్టర్డ్ ప్లేన్ లో హైదరాబాద్ చేరుకున్నాడు... ఎయిర్పోర్ట్ నుంచి మహేంద్ర ఆఫీస్ కి వెళ్తూ దారిలో మహేంద్ర పర్సనల్ నెంబర్ కి ఫోన్ చేసాడు.... మహేంద్ర పర్సనల్ సెక్రటరీ మాట్లాడాడు " Mr. మహేంద్ర చాలా బిజీ గా ఉన్నారు. ఆయన ఎవ్వరిని అప్పోయింట్మెంట్ లేకుండా కలవారు" అని చెప్పి ఫోన్ కట్ చేసేసాడు. వికాస్ వెంటనే అదే నెంబర్ కి ఒక మెసేజ్ పంపాడు. "MACHATE... TELCHAT... CHAPORI". కార్ మహేంద్ర ఆఫీస్ కి చేరే లోపల మహేంద్ర స్వయంగా ఫోన్ చేసి "ప్లీజ్ కం అలోంగ్.... ఐ అం వెయిటింగ్ ఫర్ యు" అని అన్నాడు. బిల్డింగ్ రిసెప్షన్ లో కళాధర్ వెయిట్ చేస్తున్నాడు. నార్మల్ గా ఆ బిల్డింగ్ లోకి ఎవరు వెళ్లాలన్న... ముందు విజిటర్ రిజిస్టర్ లో డీటెయిల్స్ వ్రాసి, విజిటర్ id కార్డు తీసుకొని లోపలికి వెళ్తారు. వికాస్ బిల్డింగ్ లో అడుగుపెట్టగానే కళాధర్ వెంటనే తనతో పాటు టాప్ ఫ్లోర్ లోని చైర్మన్ చాంబర్స్ కి తీసుకొని వెళ్ళాడు. వికాస్ వచ్చి వెళ్లినట్లు ఎక్కడా ఎంట్రీ ఉండదు.

టాప్ ఫ్లోర్ మొత్తం మహేంద్ర... ఆయన పర్సనల్ స్టాఫ్ తప్ప ఎవరూ ఉండరు. చాలా విశాలమైన గది. మూడువైపులా గ్లాస్ డోర్స్... అక్కడనుంచి గచ్చిబౌలి... ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్... చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ప్రపంచంలోనే ఖరీదైన ఫర్నిచర్ ఆ రూమ్ లో ఉంది. ఆ రూమ్ లో ఎంతో ముఖ్యమైన వాళ్ళని తప్ప వేరే వాళ్ళని కలవాడు. బిజినెస్ వ్యవహారాలన్నీ ఆ రూమ్ కి పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ రూమ్ లో జరుపుతాడు. ఆ రోజు వికాస్ ని తన పర్సనల్ చాంబర్స్ లోనే కలిసాడు.

మహేంద్ర : వెల్కమ్ Mr. వికాస్... మీ గురించి చాలా విన్నాను. నిన్న రాత్రి మీరు Lutyens Society పార్టీ కి వెళ్లారని తెలిసింది. Anything interesting?

వికాస్ : In fact... Yes... నిన్న పార్టీ లో ఒక పెద్ద మనిషిని కలిసాను. రీసెంట్ గా ఢిల్లీ లో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. నిజం చెప్పాలంటే... ఆ డెవలప్మెంట్స్ గురించి ఆయన చెప్పేదాకా నాకు కూడా తెలియదు. Pretty Sensitive matter. మీ గురించి మాట్లాడాడు. మీరు చాలా డెలికేట్ సిట్యుయేషన్ లో ఉన్నారని తెలిసింది.

మహేంద్ర : Please be open and straight forward... టైం సేవ్ అవుతుంది.

వికాస్ : వెరీ సూన్... మీ డ్రగ్స్ బిజినెస్ కి పెద్ద ప్రమాదం రాబోతోంది.

మహేంద్ర : Drugs? What drugs?

వికాస్ : మీరు నడుపుతున్న డ్రగ్స్ బిజినెస్. ఇందాక నేను మీకు ఒక మెసేజ్ పంపాను. మీ డ్రగ్ ఫార్మ్స్ గురించి యూనియన్ కాబినెట్ కి తెలిసిపోయింది. వాళ్ళు MACHATE... TELCHAT... CHAPORI... ఈ లొకేషన్స్ ని డిస్ట్రాయ్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు. మీ డిస్ట్రిబ్యూషన్ నెటవర్క్... అడవిలో ఆదివాసులని... హైదరాబాద్ సిటీ లో స్కూల్ స్టూడెంట్స్ ని... MULES లాగా వాడుకొని డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని... మెజారిటీ పోర్షన్ ని వేరే దేశాలకి వివిధ పోర్ట్స్ నుంచి ఎక్సపోర్ట్ చెయ్యడం... ఆఫ్ షోర్ అకౌంట్స్ లో డబ్బులు... ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్ ద్వారా ఆ డబ్బులు CIRCUMVENT చేయించి ఫారిన్ ఇన్వెస్టుమెంట్ రూపం లో ఇండియా కి తెచ్చి మీ గ్రూప్ అఫ్ కంపెనీస్ లో పెట్టుబడులుగా చూపించడం... పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ లో పెద్దలకి తెలిసిపోయింది. వాళ్ళు ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు.

మహేంద్ర కొంచం సేపు సైలెంట్ గా ఉండిపోయాడు. మనసులో ఆలోచించసాగాడు 'తన డ్రగ్స్ బిజినెస్ గురించి గవర్నమెంట్ కి తెలిసిపోయింది... వాళ్ళు వెంటనే ఎందుకు తనని అరెస్ట్ చెయ్యలేదు? తనకి చెప్పకుండానే ఆ లొకేషన్స్ ని డిస్ట్రాయ్ చెయ్యొచ్చుగా... ఎందుకని చేయలేదు? వికాస్ ఇక్కడికి ఎందుకొచ్చాడు? ఏదైనా డీల్ మాట్లాడడానికి వచ్చాడా? YES. అదే అయ్యుంటుంది...'

మహేంద్ర : అన్ని తెలిస్తే... యాక్షన్ తీసుకోవొచ్చుగా... నాకు ఇన్ఫోర్మ్ చెయ్యాల్సిన పనిలేదు.

వికాస్ : ఢిల్లీ లో మీకు ఒక వెల్ విషర్ ఉన్నాడు. మీ ఫామిలీ మెంబెర్ పేరు ఎదో రేప్ కేసు లో వినిపిస్తోందని ని కూడా అన్నాడు. మీకు ఏదైనా సహాయం కావాలంటే చెయ్యడానికి ఆ వెల్ విషర్ రెడీ గా ఉన్నాడు. అఫ్ కోర్స్... కండిషన్స్ అప్లై.

మహేంద్ర : మా ఫామిలీ మెంబెర్ పేరు అనవసరంగా ఆ రేప్ కేసు లో వినిపించింది. మా వాడి ఫ్రెండ్ SUV ని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాడు చెప్పకుండా తీసుకొని వెళ్లి ఎవరో అమ్మాయిని కిడ్నప్ చేసి రేప్ చేసి రోడ్ మీద పడేస్తూ పోలీసులకు చిక్కారు. ఆ SUV లో ఫింగర్ ప్రింట్స్ లో మావాడివి కూడా ఉండడంతో వాడి పేరు బయటకి వచ్చింది. ఫ్రెండ్ వెహికల్ లో ట్రావెల్ చెయ్యడం క్రైమ్ కాదుకదా... వాడు ఈ కేసు లోంచి ఈజీ గా బయట పడతాడు.

వికాస్ : ఎదో వీడియో ఎవిడెన్స్ కూడా బయటకి వచ్చిందని తెలిసింది.

మహేంద్ర : అవును. ఎదో మార్క్ఫెడ్ వీడియో... మా వాడి ఫ్రెండ్ SUV ని దొంగిలించినవాళ్లు వేసిన ప్రాంక్... ఆ వీడియో నిజమైనదైతే... దాన్ని తీసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఆ సమయం లో అక్కడ ఎందుకున్నారు? ఒకవేళ నిజం మా పిల్లలే కిడ్నప్ చేసివుంటే... వాళ్ళు ఎందుకు ఆపలేదు? పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఎందుకు ఫోన్ చేసి ఎందుకు రిపోర్ట్ చెయ్యలేదు? ఇన్నాళ్లు ఆ వీడియో ని ఎందుకు దాచి పెట్టారు? సడన్ గా ఇప్పుడెందుకు బయటకితీశారు? అది జస్ట్ 4 నిమిషాల వీడియో... కోర్ట్ లో నిలబడదు. మేము మా డిఫెన్స్ గట్టిగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా లాయర్ కాంతారావు బాగా కష్టపడుతున్నాడు.

వికాస్ : ఢిల్లీ లో మీ వెల్ విషర్ నాకు మీరు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి... ఎక్సపోర్ట్ చేస్తునాన్రని చెప్తే నేను నమ్మలేక పోయాను. మీరు బాగా మేనేజ్ చేశారు.

మహేంద్ర : ఢిల్లీ లో పెద్దలకి ఆ డ్రగ్స్ బిజినెస్ నాదేనని తెలిసినప్పుడు... నామీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?

వికాస్ : యాక్షన్ తీసుకుంటే వాళ్లకి ఏం లాభం? మీ డ్రగ్ ఫార్మ్స్ ని నాశనం చేస్తే... వాళ్లకి ఒరిగేదేమి లేదు. ఆ డ్రగ్ ఫార్మ్స్ ని మీకు లింక్ చేస్తూ వాళ్ళ దగ్గర సరైన ఎవిడెన్స్ లేదు. కాకపోతే... మీ ఆఫ్ షోర్ అకౌంట్స్ ని డిప్లొమాటిక్ కనెక్షన్స్ వాడి ఫ్రీజ్ చెయ్యొచ్చు...

మహేంద్ర : ఆ డ్రగ్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చేసినా... అఫ్ షోర్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినా... పెద్ద ప్రాబ్లెమ్ లేదు. వాళ్ళు నన్ను జైల్లో పెట్టగలరా... నా మీద కేసు పెట్టినా... దాన్ని ప్రూవ్ చెయ్యగలరా? మీరు ఎదో ఒక ఆఫర్ తీసుకొని వచ్చేవుంటారు. అదేమిటో చెప్పండి... దాని గురించి మాట్లాడుకుందాం.

వికాస్ : సింపుల్. మీ డ్రగ్స్ బిజినెస్ లో 40% వాటా కావాలంటున్నారు. మీకు ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటారు.

మహేంద్ర : ఇవ్వకపోతే...

వికాస్ : మల్టీ స్టెప్ ప్లాన్ రెడీ గా ఉంది. స్టెప్ 1 : పూణే... సికింద్రాబాద్ లో మూడు బటాలియన్స్ రెడీ గా ఉన్నాయి. ఒక్కో బటాలియన్ ఒక్కో లొకేషన్ కి వెళ్లి రెడీ గా ఉంటుంది. స్టెప్ 2 : ఢిల్లీ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ బేస్ లో ఫైటర్ జెట్స్ రెడీ గా ఉన్నాయి. AIR STRIKE APPROVE కాగానే... జెట్స్ బయలుదేరి ఆ మూడు లొకేషన్స్ మీద SIMULTANEOUS AIR STRIKES చేస్తారు. వెంటనే... అక్కడ ముందుగానే డిప్లొయ్ చేసిన ఆర్మీ జవాన్స్ అక్కడి సెక్యూరిటీ గార్డ్స్ ని... అడ్డమొస్తే ఆదివాసుల్ని చంపేస్తారు. స్టెప్ 3 : ఏరో ప్లేన్స్ లో ఆ మూడు చోట్ల... కోకో... పాపి సీడ్స్... కన్నబిస్ ప్లాంటేషన్స్ ని కెమికల్స్ జల్లి నాశనం చేస్తారు. స్టెప్ 4: మీ ఆఫ్ షోర్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేస్తారు. మీరు ఏ రూట్స్ లో ఆ డబ్బులు ఇండియా తీసుకొచ్చి ఏ ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారో వాటిని ENFORCEMENT DIRECTORATE తో రైడ్ చేయించి... కుదిరితే మీ అసెట్స్ అటాచ్ చేస్తారు. బాటమ్ లైన్... మీ బిజినెస్ ని బాగా డిస్టర్బ్ చేస్తారు. ఆలోచించుకోండి.

మహేంద్ర : హియర్ ఈస్ మై కౌంటర్ ప్రపోజల్... 1. మా కిడ్స్ ని ఆ రేప్ కేసు లోంచి కంప్లీట్ గా బయట పడెయ్యాలి. 2. నాకు రాజ్యసభ లో మెంబెర్ షిప్ ఇవ్వాలి. 3. యూనియన్ కాబినెట్ మినిస్టర్ ని చెయ్యాలి. 4. నేను కొత్తగా పెట్టబోతున్న ఇండస్ట్రీ కి 20000 కోట్ల బ్యాంకు లోన్ ఇప్పించాలి. 5. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్టుమెంట్ స్కీం లో నేను తెచ్చే డబ్బుల తో వెస్ట్ కోస్ట్ లో ఒక కొత్త పోర్ట్ డెవలప్ చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వాలి. 6. వచ్చే ఎలక్షన్స్ లో నా ఫ్రెండ్ ధనంజయ ని చీఫ్ మినిస్టర్ ని చెయ్యాలి. 7. నాకు కొన్ని పాత బ్యాంకు లోన్స్ ఉన్నాయి. వాటిని బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేయించాలి. 8. ఢిల్లీ AIIMS లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆ అమ్మాయి చనిపోవాలి. ఇవన్నీ చేస్తే... నేను మీకు ఒక పెద్ద ఆఫర్ ఇస్తాను. నా డ్రగ్స్ బిజినెస్ లో 40% PARTNERSHIP బదులు... నేను కొత్తగా డెవలప్ చేస్తున్న నాలుగో డ్రగ్ ఫార్మ్ లో 100% OWNERSHIP ఇచ్చేస్తాను... అది ఇప్పుడు ఉన్న ఈ మూడు లొకేషన్స్ కన్నా చాలా పెద్దది. 20000 అడివి ప్రాంతాన్ని మేము చదును చేసి ఫార్మింగ్ మొదలుపెట్టబోతున్నాము. నా డిస్ట్రిబ్యూషన్ నెటవర్క్ తో ఆ డ్రగ్స్ ని ఎక్సపోర్ట్ చేస్తాను. వాళ్లకి సెపరేట్ ఆఫ్ షోర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తాను. ఆ అకౌంట్స్ లో డబ్బుని నా ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్ ద్వారా మీకు ఈ ప్రపంచం లో ఎక్కడికి కావాలంటే... అక్కడకి... 24 * 7 ఫండ్ ట్రాన్సఫర్ అయ్యేలా చూస్తాను... అయితే... కొంత కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది... నాకు కాదు... ఏజెంట్స్... ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్స్... షిప్పింగ్ కార్పొరేషన్స్... వాళ్ళకి ఇవ్వాలి. మీకు ఈ ఆఫర్ నచ్చితే ఆ నాలుగో డ్రగ్ ఫార్మ్ లొకేషన్ కోఆర్డినెట్స్ మీకు ఇస్తాను. డ్రగ్స్ బిజినెస్ ప్రపంచంలో ప్రతి రోజుకి పెరిగిపోతోంది. 100% PURE కొకెయిన్ కి విపరీతమైన డిమాండ్. నెను తయారుచేసి అమ్మక పోయినంత మాత్రాన ఆ బిజినెస్ ఆగిపోదు. నేను కాకపోతే... ఇంకోడు... ఢిల్లీ లోని నా వెల్ విషర్ కి నా డ్రగ్స్ బిజినెస్ లో 35% ఇస్తే అన్ని చూసుకుంటారని చెప్పారు... ప్రతి ఒక్కడూ డ్రగ్స్ బిజినెస్ అంటే ఇష్టం లేనట్లు మాట్లాడతారు. ఛాన్స్ దొరికితే PARTNERSHIP అడుగుతారు.

వికాస్ : మీరు " ZERO... ZERO... ZERO" క్వాలిటీ మైంటైన్ చేస్తున్నారా?

మహేంద్ర : ఎస్... చాలా కష్టపడ్డాను. నా ప్రోడక్ట్ కి యూరోప్ లో చాలా డిమాండ్ ఉంది.

వికాస్ : మీకు తెలిసే ఉంటుంది... ప్రతి SUCCESSFUL డీల్ మీద నేను 1% కమిషన్ తీసుకుంటాను. ఈ డీల్ అందరికి OK అయితే... డీల్ వేల్యూ ని ఎలా నిర్ణయించి నాకు కమిషన్ పే చేస్తారు?

మహేంద్ర తన ముందున్న నోట్ పాడ్ లోంచి ఒక పేపర్ చింపి... దాని మీద ఒక అంకె వ్రాసి వికాస్ ఇస్తూ... " I WILL DEPOSIT THIS AMOUNT IN ANY BANK ACCOUNT IN ANY COUNTRY OF YOUR CHOICE" అని అన్నాడు. ఆ నెంబర్ చూడగానే వికాస్ కి గొంతు తడి ఆరిపోయింది... ఒక డీల్ చేస్తే తనకి ఎప్పుడూ అంత అమౌంట్ లభించలేదు. టేబుల్ మీద తన ముందున్న గ్లాస్ లో నీళ్లు గటగటా తాగేశాడు. వెంటనే అదే పేపర్ మీద స్విట్జర్లాండ్ లో ఒక బ్యాంకు పేరు... అకౌంట్ నెంబర్... IBAN NUMBER వ్రాసి ఇచ్చి... థాంక్స్ చెప్పి వెంటనే బయలుదేరి వెళ్లిపోయాడు.

మహేంద్ర మనసులో "అందరూ కరప్షన్ కి బాగా అలవాటు పడిపోయారు. వీళ్లా... నన్ను పట్టుకొని శిక్షించేది?" అని అనుకున్నాడు.


సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో ఇంకో చోట CI చక్రవర్తి తన ఆఫీస్ లో కూర్చొని ఉన్నాడు. మఫ్టీ లో ఉన్నాడు. జీన్స్ ప్యాంటు... టీ షర్ట్... రన్నింగ్ షూస్ వేసుకొని ఉన్నాడు. టేబుల్ మీదున్న ల్యాండ్ లైన్ మ్రోగగానే తీసి "హలో.. " అన్నాడు. అవతలి వైపు " నువ్వు ఉన్న ఫళంగా లేచి... నీ పర్స్... వెపన్... ఆఫీషియల్ ID... మొబైల్ ఫోన్... అన్నింటిని ఆఫీస్ లోనే వొదిలేసి ఖాళీ గా బయటకి వచ్చి... అక్కడ ఆగిఉన్న... 5678 నెంబర్ గల స్కోడా కార్ వెనక సీట్ లో కూర్చో..." అని చెప్పి ఫోన్ పెట్టేసారు.

చక్రవర్తి ఫోన్ లో చెప్పిన విధంగా తన జేబులన్నీ ఖాళీ చేసి బయటకి వెళ్లి అటూ... ఇటూ చూసాడు. కొంచం దూరం లో 5678 నెంబర్ ప్లేట్ కనిపిచింది. వెళ్లి వెనక సీట్ డోర్ తియ్యగానే... వెనకనుంచి ఎవరో చక్రవర్తి ని లోపలి నెట్టి అతను కూడా ఎక్కాడు. అప్పటికే ఒక వ్యక్తి లోపల కూర్చొని ఉన్నాడు. చక్రవర్తి ఇద్దరిమధ్యలో ఇరుక్కొని కూర్చున్నాడు. ముందు సీట్ లో కూర్చున్న వ్యక్తి డ్రైవర్ తో " పద వెళదాం..." అన్నాడు. కార్ కదిలింది. చక్రవర్తి వాళ్ళు తన మొహం మీద ముసుగు వేస్తారేమో అని అనుకున్నాడు. అలాంటి పని చెయ్యలేదు. చక్రవర్తి కి వాళ్ళు ఎటు వెళ్తోంది చాలా క్లియర్ గా తెలుస్తోంది. కార్ లో ఎవ్వరూ మాట్లాడడం లేదు. దాదాపు ఒక గంట సేపు ప్రయాణం చేసాక ఒక మారుమూల ఏరియా కి చేరుకున్నారు. కార్ దిగి అందరూ ఒక ఇంట్లో కి వెళ్లారు. అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూడగానే చక్రవర్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఫీలింగ్ వచ్చింది... ఊపిరి అందడం లేదు... అక్కడ కరుణాకర్ కూర్చొని ఉన్నాడు. తనని తీసుకొచ్చిన వాళ్ళు కరుణాకర్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టారు. చక్రవర్తి మనసులో 'అంటే... నన్ను తీసుకొచ్చింది డిపార్టుమెంటు వాళ్లేనా' అని అనుకున్నాడు.

కరుణాకర్ : నా ప్రశ్నలకి సూటిగా సమాధానం ఇవ్వండి. ఆ రోజు ఇరానీ కేఫ్ లో షూట్ అవుట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది?

చక్రవర్తి : కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే వెళ్ళాము.

కరుణాకర్ : ఇప్పుడే చెప్పగా... సూటిగా సమాధాం ఇవ్వమని... అబధం ఎందుకు చెప్తున్నారు...

చక్రవర్తి : నేను నిజమే చెప్తున్నా...

కరుణాకర్ : ఆ రోజు ఆ సమయం లో కంట్రోల్ రూమ్ కి కేఫ్ షూట్ అవుట్ గురించి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. మేము కంట్రోల్ రూమ్ కాల్ లాగ్స్ చెక్ చేసాము. మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం... ఇరానీ కేఫ్ లో మొదటి సారి తుపాకీ ఉదయం 10:55 కి పేలింది. మీరు సరిగ్గా అదే సమయానికి ఆ రోడ్ లోకి ప్రవేశించారు. ఎలా పాజిబుల్? అంతలోనే కంట్రోల్ రూమ్ కి ఎవరు ఫోన్ చేశారు? కంట్రోల్ రూమ్ లాగ్స్ ప్రకారం ఆ సమయంలో మీ పోలీస్ స్టేషన్ కి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. మీ పోలీస్ స్టేషన్ నుంచి ఆ సమయంలో ఆ ఇరానీ కేఫ్ కి చేరుకోవాలంటే... కనీసం 15 నిమిషాలు పడుతుంది. కావాలంటే మీ వాట్సాప్ కి వచ్చిన వీడియో చెక్ చెయ్యండి. అందులో డేట్ అండ్ టైం స్టాంప్ ఉంది. మీరు నిజం చెప్తే అందరికి మంచిది. ప్రస్తుతం మేము ఇన్ఫార్మల్ గా మిమ్మల్ని అడుగుతున్నాము. అవసరమైతే ఈ వీడియో CBI కి చేరుతుంది. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు.

చక్రవర్తి మౌనంగా ఉండిపోయాడు. రెండు నిమిషాల తరువాత...

చక్రవర్తి : మొత్తం చెప్తాను... ఆ ఇరానీ కేఫ్ షూట్ అవుట్ కి ముందు రోజు సాయంత్రం నాదగ్గరికి కొంతమంది మనుషులు వచ్చి నన్ను కైలాష్ గౌడ్ దగ్గరకి తీసుకొని వెళ్లారు. కైలాష్ నాతో "రేపు ఉదయం 11 గంటల ప్రాంతం లో మీ పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఒక ఇరానీ కేఫ్ లో షూట్ అవుట్ జరగబోతోంది. నువ్వు ఆ సమయానికి అక్కడికి వెళ్లి ఆ షూట్ అవుట్ సరిగ్గా జరిగేలా చూడాలి. ఆ తరువాత ఆ షూటర్ చేతుల్లోని రివాల్వర్ ని స్వాధీనం చేసుకొని... 16 షెల్స్... 16 బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకోవాలి. ఆ తరువాత ఆ షూటర్ ని జాగ్రత్తగా తీసుకొని నువ్వు మీ పోలీస్ స్టేషన్ లో పెట్టు. వాడిని పిచ్చోడని అందరిని నమ్మించు. మరుసటి వాడిని నువ్వు కోర్ట్ లో ప్రవేశపెట్టు... వాడు పిచ్చోడని చెప్తే... గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపిస్తారు. అక్కడ మా వాళ్ళు అంతక ముందే ఒక పిచ్చోడిని ఏర్పాటు చేస్తారు. ఆ నిజమైన పిచ్చోడిని నీ కస్టడీ లోకి తీసుకొని ఆ షూటర్ ని వొదిలెయ్యి. నువ్వు ఆ షూటర్ వాడిన తుపాకీ... వాటి షెల్స్... బుల్లెట్స్ మావాళ్లకి ఇవ్వు. నీకు వాళ్ళు ఆ పిచ్చోడి ఫింగర్ ప్రింట్స్ ఉన్న రివాల్వర్... బుల్లెట్స్... షెల్స్ ఇస్తారు... వాటిని నీ రిపోర్ట్ లో పెట్టుకో..." అని చెప్పారు. నేను ఆ రోజు సరిగ్గా షూట్ అవుట్ మొదలయ్యే సమయానికి అక్కడికి వెళ్లి ఆ ఇరానీ కేఫ్ ముందు... వెనక... డోర్స్ ని బ్లాక్ చేసేసాము. షూట్ ఆగిపోయింది. మేము లోపలి వెళ్లి ఆ షూటర్ చేతిలోని తుపాకీ లాక్కునఆ క్రైమ్ సీన్ లో బుల్లెట్స్... వాటి షెల్స్ ని మేము రికవర్ చేసుకున్నాము.మేము ఆ షూటర్ ని మా పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉంచాము. అప్పుడే మాకు కైలాష్ మనుషులు ఒక రివాల్వర్... బుల్లెట్స్... షెల్స్... తీసుకొని వచ్చి... ఆ షూటర్ వాడిని రివాల్వర్... వాటి బుల్లెట్స్... షెల్స్ తీసుకొని వెళ్లారు. మేము మరుసటి రోజు ఆ షూటర్ ని కోర్ట్ లో ప్రొడ్యూస్ చేసాము. కోర్ట్ వాడిని సైకాలాజికల్ ఎవాల్యూయేషన్ కి వాడిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి కి పంపారు. అక్కడ కైలాష్ మనుషుల ఆ షూటర్ వొదిలేసి వేరే పిచ్చోడిని మాకు అప్పగించారు. వాడు నిజం గానే పిచ్చోడు. పైగా వాడికి రెగ్యులర్ గా హాస్పిటల్ నుంచి పారిపోయే అలవాటు ఉంది. చాలా సార్లు మా పోలీసులు వాడిని పట్టుకొని హాస్పిటల్ కి అప్పగించారు. దాంతో కోర్ట్ ని నమ్మించడం పెద్ద కష్టం కాలేదు. ఆ పిచ్చోడిని కోర్ట్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి అప్పగించి వాడు ఇంకోసారి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది.

కరుణాకర్ : ఆ షూటర్ గురించి చెప్పు...

చక్రవర్తి : మన వూరు వాడు మాత్రం కాదు. నా అనుమానం ప్రకారం వాడు బెంగాలీ అయి ఉండాలి... లేదా బంగ్లాదేశీ అయినా అయ్యుండాలి. రాత్రంతా వాడు సెల్ లో అర్ధం పర్ధం లేని భాషలో పాటలు పాడుతూ అరుస్తూ నిజం గా పిచ్చోడిలా గానే ప్రవర్తించాడు. మా స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ వాడి పిలిచి వాగుడు రికార్డు కూడా చేసాడు.

కరుణాకర్ : ఆ క్రైమ్ సీన్ లో మీరు 16 షెల్స్ రికవర్ చేశారు... బానే వుంది... మరి బుల్లెట్స్ ఎలా దొరికాయి? విక్టిమ్ బాడీ లో ఒక్కటికూడా ఉండిపోలేదా?

చక్రవర్తి : అదే ఆశ్చర్యం... ప్రతి విక్టిమ్ కి ఎగ్జిట్ ఊండ్ ఉంది. బాగా క్లోజ్ రేంజ్ లో కాల్చాడు. షూటర్ చాలా పవర్ఫుల్ వెపన్ వాడాడు. ప్రతి బులెట్ విక్టిమ్ బాడీ లోంచి దూసుకొని బయటకి వెళ్ళింది. ఒక్కటి కూడా విక్టిమ్ బాడీ లో ఇరుక్కోలేదు. క్లూస్ టీం కి 15 బుల్లెట్స్... 16 షెల్స్ దొరికాయి. ఒక బులెట్ మిస్ అయింది. ఎంత వెతికినా దొరకలేదు. మేము కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే... మా రిపోర్ట్ లో పెట్టింది వేరే రివాల్వర్... వాటి బుల్లెట్స్... షెల్స్.

కరుణాకర్ : పోస్ట్ మార్టూమ్ రిపోర్ట్ ని ఎలా మేనేజ్ చేసారు?

చక్రవర్తి : కైలాష్ గౌడ్ మనుషులు నాకు ఇచ్చిన బుల్లెట్స్ ని డాక్టర్ కి ఇచ్చాను... డాక్టర్ వాటిని ప్రతి డెడ్ బాడీ ఊండ్ లో ముంచి వాటికి విక్టిమ్ బ్లడ్... టిష్యూ... ఆ బుల్లెట్స్ కి అంటుకునేలా చేసి అవి విక్టిమ్ బాడీ లోంచి రికవర్ చేసినట్లు రిపోర్ట్ లో వ్రాసాడు. ఫోరెన్సిక్ టీం ఆ బుల్లెట్స్... మేము ఇచ్చిన రివాల్వర్... షెల్స్ ని అనలైజ్ చెయ్యగా... అన్ని మ్యాచ్ అయ్యాయి...

కరుణాకర్ : నీకు ఏదైనా వింతగా అనిపించిందా...

చక్రవర్తి : మొత్తం ఇన్సిడెంట్ అంతా వింతగానే ఉంది. కైలాష్ కి ముందుగానే ఆ ఇరానీ కేఫ్ లో షూటింగ్ జరుగుతుందని తెలుసు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక్కటి మాత్రం అర్ధం కాలేదు. ఆ రోజు మార్చురీ కి షూట్ అవుట్ లో చనిపోయిన వాళ్ళ బాడీస్ రాగానే కైలాష్ మనుషులు ఒక ముసలోడి డెడ్ బాడీ ని ఫొటోస్ తీసుకొని వెళ్లిపోయారు. మిగతా శవాల గురించి అసలు పట్టించుకోలేదు.

కరుణాకర్ : ఆ ముసలోడు ఎవరో తెలుసా?

చక్రవర్తి : తెలుసు. రిపోర్ట్ లో వుంది. తెలంగాణ లో ఎదో మారుమూల పల్లెటూరు కి చెందిన వాడు. ఆ రోజే హైదరాబాద్ వచ్చాడు. ఆయన కొడుకు హై కోర్ట్ లో పనిచేస్తాడు. అతను వచ్చి బాడీ ని తీసుకొని వెళ్ళాడు.

కరుణాకర్(ఒక మొబైల్ ఫోన్ ఇస్తూ) : నాకు... ఆ ముసలోడి కొడుకు పేరు... అడ్రస్... కావాలి. దాంతో పాటు ఆ రాత్రి ఆ షూటర్ పిచ్చ ప్రేలాపన మీ కానిస్టేబుల్ రికార్డు చేసాడని చెప్పావుగా... అది కూడా వెంటనే మీ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి తెప్పించు.

చక్రవర్తి వెంటనే తన స్టేషన్ కి ఫోన్ చేసి ఆ ముసలాయన కొడుకు డీటెయిల్స్... పిచ్చోడి ప్రేలాపన రికార్డింగ్... తెప్పించాడు.

కరుణాకర్ "ప్రస్తుతానికి మేము నిన్ను క్వశ్చన్ చేసిన సంగతి ఎవ్వరికి చెప్పకు. అవసరమైతే మేము నిన్ను కాంటాక్ట్ చేస్తాము. మా వాళ్ళు నిన్ను వెనక్కి తీసుకెళ్తారు" అని చెప్పి వెళ్ళిపోయాడు.

చక్రవర్తి ని కార్ ఎక్కించారు. ఈసారి చక్రవర్తి ని కార్ నడపమన్నారు. చక్రవర్తి పక్కనే ఇంకో వ్యక్తి కూర్చున్నాడు. చక్రవర్తి కార్ నడపసాగాడు. కార్ ఊర్లోకి వచ్చింది... ట్రాఫిక్ చాలా స్లో గా కదులుతోంది. ఒక పెద్ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. చక్రవర్తి పక్కన కూర్చున్న వ్యక్తి సడన్ గా కార్ దిగి ఎటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు చక్రవర్తి ఒక్కడే ఆ కార్ లో ఉన్నాడు. తాను కూడా ఆ కార్ వొదిలేసి వెళ్లిపోదామనుకుంటుండగా సిగ్నల్ గ్రీన్ అయింది. దాంతో వేరే గత్యంతరం లేక కార్ ని ముందుకు పోనిచ్చాడు.

కరుణాకర్ వెంటనే రవీంద్ర కి ఫోన్ చేసి చక్రవర్తి చెప్పిన డీటైల్స్ అన్ని చెప్పి...షూటర్ వాయిస్ రికార్డింగ్... ముసలోడి కొడుకు డీటెయిల్స్ పంపించాడు. ఆ ముసలోడి కొడుకు డీటెయిల్స్ ని అవినాష్ కి పంపించి ఎంక్వయిరీ చేయించామని అడిగాడు.


Part - 23 - The Sad End

అవినాష్ ఆఫీస్ కి ఒక వ్యక్తి వచ్చాడు. "నా పేరు గంగాధర్... ACP గారిని కలవాలి. రమ్మని మీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది" అని అన్నాడు. అతడిని అవినాష్ రూమ్ లోకి పంపారు. అక్కడ అవినాష్... DSP శేఖర్... SI శ్రీధర్ తో ఎదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాడు.

అవినాష్ : ఇరానీ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో మీ నాన్న గారు కూడా ఉన్నారని మాకు తెలిసింది. ఆయన ఆరోజే మీ ఊరునించి వచ్చారని కూడా తెలిసింది.

గంగాధర్ : అవును సర్.. మాది తెలంగాణ లో మారుమూల గ్రామం. హైదరాబాద్ రావాలంటే 3 బస్సులు మారాలి.

అవినాష్ : ఆయన ఏదైనా పనిమీద వచ్చారా?

గంగాధర్ : అదే తెలీదు సర్... ఆయనకు ఈ సిటీ వాతావరణం అంటే ఇష్టం లేదు. ఆయన మావూరు వొదిలి ఎక్కడికి వెళ్ళరు. అలాంటిది ఆయన బయలుదేరడానికి ఒక రోజు ముందు నాకు ఫోన్ చేసి "నీతో అర్జెంటు గా మాట్లాడాలి... హైదరాబాద్ వస్తాను... పెద్ద దేశద్రోహం జరుగుతోంది" అని అన్నారు.

అవినాష్ : మీ ఫాదర్ ఊర్లో ఏమి చేస్తారు...

గంగాధర్ : వ్యవసాయం... మాకు వూర్లో 6 ఎకరాల పొలం వుంది

అవినాష్ : మీరు హైదరాబాద్ లో ఏం చేస్తారు?

గంగాధర్ : నేను హైకోర్టు లో క్లర్క్. ఆయనకు కోర్టు వాతావరణం పడదు. ఆయన డైరెక్ట్ గా ఇమ్లిబన్ బస్టాండ్ నుంచి ఆ ఇరానీ కేఫ్ కి వెళ్లారు. నేను ఆయనను కలవడానికి అక్కడికి వెళ్లే లోపలే కాల్పులు జరిగాయి.

అవినాష్ : ఆయన ఇక్కడికి ఎందుకొచ్చింది మీకు నిజం గా తెలీదా?

గంగాధర్ : లేదండి. నేను మా వాళ్ళని అడిగాను... హైదరాబాద్ రావడానికి ఒక రోజు ముందు ఆయన తెల్లవారుఝామునే లేచి ఎక్కడికో వెళ్ళారంట. సాయంత్రం చాలా కంగారుగా ఇంటికి వచ్చి మా అమ్మతో "దేశానికి ద్రోహం జరుగుతోంది... గంగాధర్ కి వెంటనే చెప్పాలి" అని అన్నాడంట. ఆ అమ్మ ఎంత అడిగినా వివరాలు చెప్పలేదంట. ఆ రోజు ఆయన వేకువఝామున నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికి తెలియదు. మావూరు చుట్టూ అడవులు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు.

అవినాష్ : మీవూరు పేరు?

గంగాధర్ : రాపూరు... చాలా చిన్న గ్రామం.

అవినాష్ : ఎక్కడుంది?

గంగాధర్ : తెలంగాణ బోర్డర్ లో ఉంది. మా ఊరి సరిహద్దు దాటితే ఛత్తీస్ ఘడ్ మొదలవుతుంది.

అవినాష్ : ఆల్రైట్... మీ నాన్నగారు మీతో ఎం చెప్పాలనుకున్నారో తెలిస్తే... మాకు చెప్పండి.

గంగాధర్ ఆ రూమ్ లోంచి వెళ్ళిపోగానే... "ఈ గంగాధర్ నిజమే చెప్తున్నట్లున్నాడు..." అని అన్నాడు శేఖర్. అవినాష్ అంగీకరిస్తున్నట్లు తలా పంకించాడు.

అవినాష్ : ఒకవేళ ఈ ముసలాయన సుభాష్ డ్రగ్స్ డెలివరీ తీసుకోవడం చూశాడంటారా...

శేఖర్ : పాజిబుల్... నేను ఆరా తీస్తాను. కైలాష్ గౌడ్ మనుషుల్లో ఒకడున్నాడు... పేరు ఓబులేసు... కైలాష్ వాడిని బాగా నమ్ముతాడు.

ఈ సంభాషణ వింటున్న SI శ్రీధర్... వెంటనే బయటకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి ఓబులేసు ఎక్కడున్నా ఎత్తుకొని గుడి కి తీసుకొని రమ్మన్నాడు... గుడి అంటే వాళ్ళ కోడ్ భాషలో టార్చర్ రూమ్... ఓబులేసు కోసం పోలీసులు పెద్దగా కష్టపడలేదు. ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఓబులేసు పోలీసులతో వెళ్తూ "కైలాష్ భాయ్ కి నన్ను పోలీసులు తీసుకెళ్లారని ఫోన్ చెయ్యి" అని భార్యతో చెప్పాడు. ఓబులేసు ని తీసుకొచ్చి గుడిలో ఒక కుర్చీలో కూర్చోపెట్టి చేతులు... కాళ్ళు... కుర్చీకి కదలకుండా కట్టేసి... నోట్లో గుడ్డలు కుక్కి వెళ్లిపోయారు. ఆ రూమ్ లో ఓబులేసు ఒక్కడే ఉన్నాడు. ఓబులేసు కి ఈ ఇంట్రాగేషన్స్... థర్డ్ డిగ్రీ కొత్త కాదు. చాల అనుభవం ఉంది. అందుకే పెద్దగా ఖంగారుపడడం లేదు. మహా అయితే... రోజంతా కొడతారు. నోరుమూసుకుంటే లాయర్ వచ్చి తీసుకెళ్తాడు.

ఒక పది నిమిషాల తరువాత ఇద్దరు కానిస్టేబుల్స్ లోపలి వచ్చారు. ఇద్దరూ చాలా బలంగా ఉన్నారు. ఒకడి చేతిలో పెద్ద సైజు స్లెడ్జి హమ్మర్ ఉంది. బరువుగా ఉండడం తో నెల మీద ఈడ్చుకుంటూ తెచ్చాడు. ఆ స్లెడ్జి హమ్మర్ నేలమీద భయంకరంగా చప్పుడు చేస్తోంది. ఓబులేసు కొంచం ఖంగారుగా ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వైపు చూసాడు. మామూలుగా పోలీసులు లాఠీలతో థర్డ్ డిగ్రీ చేస్తారు. ఇటువంటి స్లెడ్జి హమ్మర్ ని ఎప్పుడూ చూడలేదు. హఠాత్తుగా కానిస్టేబుల్ ఆ స్లెడ్జి హామ్మర్ ని గాల్లో పైకెత్తి గట్టిగా అరుస్తూ ఓబులేసు కుడి కాలు మీద కొట్టాలని ప్రయత్నించగా అది కుడి కాలు పక్కన నేలమీద పడింది. దాంతో నేలమీదున్న నాపరాయి పగిలింది. ఇదంతా పక్కువుంది గమనిస్తున్న రెండో కానిస్టేబుల్ "మళ్ళీ గురితప్పి గచ్చు పగలకొట్టావా... ఆవేశం తో కొట్టకు... అలోచించి కొట్టు..." అని సలహా ఇచ్చాడు. పగిలిన గచ్చు చూసి ఓబులేసు బాగా ఖంగారు పడ్డాడు. కళ్ళలో కొత్తగా భయం కనిపిచింది.

మొదటి కానిస్టేబుల్ రెండో సారి స్లెడ్జి హమ్మర్ ని గాల్లో కి ఎత్తి చాలా బలంగా ఓబులేసు కుడి కాలు మీద కొట్టాడు. కాలిమడమ లో ఒక బోన్ ఉంటుంది. దాన్ని TALUS అంటారు. ఈ TALUS బోన్ మడమని... కాలికి కనెక్ట్ చేస్తుంది. సరిగ్గా ఆ బోన్ మీద స్లెడ్జి హమ్మర్ పడడంతో అది విరిగిపోయింది. ఓబులేసు వొళ్ళంతా భూకంపం వచ్చినట్లు ఊగిపోయింది. ఒక్కసారిగా వెనక్కి జరగాలని చూడడంతో కుర్చితో సహా వెనక్కి పడిపోయాడు. ఓబులేసు వొళ్ళంతా... చెమటలతో నిండి పోయింది... కళ్ళు బైర్లుకమ్మాయి... నోట్లో గుడ్డలు కుక్కినా కూడా గొంతులోంచి బలమైన పెనుకేక వినిపించింది. కానిస్టేబుల్స్ కుర్చితో సహా ఓబులేసు ని లేపి కూర్చో పెట్టి నోట్లోంచి గుడ్డలు తీశారు... ఒక్కసారిగా ఓబులేసు నొప్పి తట్టుకోలేక గట్టిగా అరిచాడు. ఒక కానిస్టేబుల్ ఓబులేసు కి మంచి నీళ్లు పట్టాడు... బాటిల్ మొత్తం తాగేసి తేరుకున్నాడు.

ఓబులేసు పెట్టిన కేక విని శ్రీధర్ గుడిలోకి అడుగుపెట్టాడు. శ్రీధర్ ని చూడగానే ఒక కానిస్టేబుల్ కుర్చీని తెచ్చి వేస్తూ "సార్ అడిగినదానికి సరిగ్గా జవాబు చెప్పాలి. లేకపోతే రెండో కాలు విరుగుతుంది" అని అన్నాడు. శ్రీధర్ వచ్చి ఓబులేసు ముందు కూర్చొని ఓబులేసు కాలివైపు చూసాడు. మడమ బాగా వాచిపోయింది. హమ్మర్ దెబ్బ పడినచోట బాగా కమిలిపోయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది. TALUS బోన్ యాంకిల్ జాయింట్ దగ్గర ఉంటుంది. అది విరిగితే అతుక్కోవడానికి చాలా కాలం పడుతుంది. అక్కడ కట్టు కట్టినా కష్టమే... ఆపరేషన్ తప్పకుండా చేయాల్సివస్తుంది. బెడ్ మీద కనీసం 3 నెలలు పడుకోవాలి. శ్రీధర్ తన చేతిలోని లాఠీ తో హమ్మర్ దెబ్బ పడ్డ చోట టచ్ చేసాడు. ఓబులేసు నొప్పితో విలవిల్లాడాడు... లాఠీ ని కొంచం పైకెత్తి...

శ్రీధర్ : ఇరానీ కేఫ్ లో కాల్పులు ఎవరు జరిపించారు?

ఓబులేసు : కైలాష్ భాయ్...

శ్రీధర్ : ఎందుకు?

ఓబులేసు : ఎవరో ఒక ముసలోడిని చంపాలని ప్లాన్ వేసాడు. ఆ ముసలోడి వల్ల పెద్ద సమస్య వచ్చిందని... వాడిని చంపేయాలని సెట్ అప్ చేసాడు.

శ్రీధర్ : ఇరానీ కేఫ్ లో కాల్పులు చేసింది ఎవరు?

ఓబులేసు : వాడి పేరు పాషా... ఈ ఊరోడు కాదు. కైలాష్ వాడిని ఎక్కడినుంచో పిలిపించాడు.

శ్రీధర్ : ఇక్కడ చాలా మంది ఉండగా ఎక్కడినించో పిలిపించడం ఎందుకు?

ఓబులేసు : అది తెలీదు. వాడు చాలా పిచ్చి పిచ్చి గా మాట్లాడేవాడు. వాడికి హిందీ... ఉర్దూ... సరిగ్గా రాదు. కొంచం బెంగాలీ లో మాట్లాడతాడు.

శ్రీధర్ : వాడు ఎక్కడుంటాడు.

ఓబులేసు : నాకు తెలీదు...

శ్రీధర్ స్లెడ్జి హమ్మర్ పట్టుకున్న కానిస్టేబుల్ వైపు చూసి " ఇంకో దెబ్బేయ్యి..." అన్నాడు... అది విన్న ఓబులేసు.... వణికిపోయాడు.... "వొద్దు.... వొద్దు.... నాకు నిజం గా ఆ పాషా ఎక్కడుంటాడో తెలీదు ...నేను వాడిని పోలీసులు వొదిలేశాక ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళాను. వాడు విమానమెక్కి కలకత్తా వెళ్ళాడు" శ్రీధర్ ఆ కానిస్టేబుల్ ని వారిస్తూ... "బాగా ఆలోచించుకొని చెప్పు...విరిగిన కాలుతో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. కనీసం 5 నెలలు బెడ్ మీదే ఉండాలి. కాబట్టి నువెక్కడుంటావో మాకు తెలుసు. నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే... ఈసారి రెండో కాలితో పాటు... మోకాలు కూడా పగులుతుంది... నిన్ను ఇప్పుడు మేము హాస్పిటల్ ముందు వొదిలేస్తాము. మేము నిన్ను కొట్టామని ఎవరికైన చెప్తావా?" అని అడిగాడు... ఆ మాట విన్న ఓబులేసు వొణికిపోతూ... "లేదు సారూ... నేను ఎవ్వరికి చెప్పను..." అని గట్టిగా అరిచాడు. "లేదురా... అందరికి చెప్పు... శ్రీధర్ కి బాగా కోపం వచ్చిందని... దొరికిన ప్రతివాడికి కాళ్ళు... చేతులు విరకొట్టి హాస్పిటల్లో పడేస్తానని చెప్పు... అర్ధమయ్యిందా? " అని అన్నాడు. ఓబులేసు అయోమయంగా చూస్తూ తలని అన్ని కోణాల్లో ఆడించాడు.

పోలీసులు ఓబులేసు ని దగ్గరలోని హాస్పిటల్ ముందు వొదిలేశారు. శ్రీధర్ తాను తెలుసుకున్న సమాచారం శేఖర్ కి చెప్పాడు... అంతా విని " ఈ సారి ఏ ఎముక విరగొట్టావు?" అని అడిగాడు. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు.

అవినాష్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పాషా కలకత్తా వెళ్లిన రోజు CCTV ఫుటేజ్ తెప్పించి చూసాడు. సెక్యూరిటీ చెక్ దగ్గర పాషా పేస్ చాలా క్లియర్ గా కంపించింది. ఆ ఫుటేజ్ ని వెంటనే Op Center కి పంపాడు. రవీంద్ర ఆ ఫుటేజ్ ని జాగ్రత్త పరిశీలించి పాషా ఫోటో ని కలకత్తా IB డిపార్ట్మెంట్ కి పంపి వాడు ఎక్కడున్నా వెంటనే ఢిల్లీ తీసుకొని రమ్మని చెప్పాడు.

>

మహేంద్ర ఆఫీస్... కాంతారావు చాలా సీరియస్ గా ఎదో ఎక్సప్లైన్ చేస్తున్నాడు. అది వింటున్న మహేంద్ర కి కోపం పెరిగిపోతోంది. మొహంమంతా ఎర్రగా తయారయ్యింది... కాంతారావు చెప్పింది మొత్తం విని ఒక్క సారి తన కుర్చీలోంచి లేచి "నో..... అలా జరగడానికి నేను ఒప్పుకోను." అని గట్టిగా అరిచాడు.

కాంతారావు : నా మాట విను... ఈసారికి ఇలా కానివ్వు... ఎక్కువగా లాగకు.

మహేంద్ర : ఇది నా పాలసీ కి విరుద్ధం... మన వాళ్ళు సరిగ్గా ట్రై చేయలేదు. అనవసరంగా ఇంత దూరం తీసుకొని వచ్చారు. ఆ డాక్టర్ ప్రభావతి పిల్లల్ని కిడ్నప్ చేసి కూడా పని పూర్తి చేయలేదు.

కాంతారావు : నిజమే... ప్రస్తుతానికి ఈ సమయంలో నేను చెప్పినట్లు కానివ్వు. నేను ధనంజయ తో మాట్లాడాను. ముందు వాడు కూడా నీలాగే అరిచాడు. నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు. ఈ ప్లాన్ నీకు నచ్చితే వాడు ముందుకెళ్తాడు. మనం ఎంత తొందరగా ఈ విషయాన్ని క్లోజ్ చేస్తే మనకి అంత మంచిది. ఈ విషయం ఎక్కువ టైం వేస్ట్ చెయ్యొద్దు. చాలు... ఇది ఇక్కడితో ముగించుదాం. మనకి ఇంకో ఛాన్స్ తప్పకుండా వస్తుంది. అప్పుడు ఆ లేడీ డాక్టర్ ని హ్యూమిలియేట్ చేదాం... ప్లీజ్ నా మాట విను... ఆమెకి డిపార్ట్మెంట్ లో చాల మంచి పేరుంది. మనం ఇప్పుడు ఆమెకి ఏదైనా హాని తలపెడితే మనకి పెద్ద తలకాయనొప్పి గా తయారవుతుంది. ఆమె ఎక్కడికి వెళ్తుంది? మన కళ్లెదుటే ఉంటుంది. ఎదో ఒక డిసిప్లినరీ ఆక్షన్ తీసుకొని మన కక్ష సాధించుకుందాం.

మహేంద్ర : సరే... కానివ్వు... ఒక్కటి గుర్తుపెట్టుకో నాకు ఎవరు ఎదురుతిరిగినా సహించను.

కాంతారావు వెంటనే ఫోన్ చేసి ధనంజయ తో "మహేంద్ర ఒప్పుకున్నాడు... పని పూర్తిచెయ్యి" అని చెప్పాడు. ధనంజయ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ తో " ఆ GO మీద CM చేత సాంతం పెట్టించి వెంటనే అనౌన్స్ చెయ్యండి" అని అన్నాడు. CMO లో ప్రిన్సిపాల్ సెక్రటరీ ఒక GO ని తీసుకెళ్లి CM ఎక్సప్లైన్ చేసి సంతకం తీసుకొని వెంటనే వెబ్ సైట్ లో కి ఎక్కించి... Dr ప్రభావతి కి ఫోన్ చేసి " కంగ్రాట్యులేషన్స్ డాక్టర్... మిమ్మల్ని CM గారు తన ఆఫీస్ లో Health Adviser గా అప్పోయింట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన నన్ను మీకు పర్సనల్ గా చెప్పమన్నారు... ఈ పోస్టింగ్ with immediate effect... మీరు వెంటనే మీ డ్యూటీస్ ని Dr సురేంద్ర కి హ్యాండ్ ఓవర్ చేసి CMO రండి... వి అర్ వెయిటింగ్" అని అన్నాడు... ప్రభావతి నమ్మలేదు. ఎదో ప్రాంక్ కాల్ అని అనుకుంది. కానీ... రెండే రెండు నిమిషాల్లో అందరూ వచ్చి congratulate చేయసాగారు. Dr సురేంద్ర కి ప్రభావతి డ్యూటీస్ ని తీసుకోమని ఆర్డర్స్ కూడా వచ్చాయి... Dr ప్రభావతి వెంటనే రిలీవ్ అయ్యింది. ఆమె తన ఆఫీస్ లోంచి వెళ్లిన 5 నిమిషాల్లో కైలాష్ మనుషులు తీసుకొచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద Dr సురేంద్ర సంతకం చేసి రబ్బర్ స్టాంప్ వేసాడు.

మరుసటి రోజు CI సుధీర్ మీడియా చూస్తూండగా యాదగిరి గ్యాంగ్ ని తీసుకొని సీన్ అఫ్ క్రైమ్ కి వెళ్ళాడు. అక్కడ ముందుగానే అనుకున్నట్లు యాదగిరి గ్యాంగ్ పోలీసుల మీద భయంకరంగా దాడి చేశారు. అదంతా టీవీ ఛానెల్స్ చేశాయి. పోలీసులు ముందుగా మూడు సార్లు గాల్లో కాల్పులు జరిపి తరువాత యాదగిరి గ్యాంగ్ కి వార్నింగ్ ఇచ్చి మరి కాల్చి చంపేశారు. వెంటనే క్లూస్ టీం అక్కడికి రావడం... ఫొటోస్ తీసుకోవడం... క్లూస్ కలెక్ట్ చేసుకోవడం... అంబులెన్సు లో యాదగిరి గ్యాంగ్ శవాలని తీసుకొని వెళ్లడం... ఇదంతా మీడియా... ప్రజలు చూస్తుండగా జరిగిపోయింది. ఆ రోజుతో ఊరూ... పేరు... తెలియని అభాగ్యురాలి రేప్ కేసు క్లోజ్ అయ్యింది.


సరిగ్గా అదే సమయానికి న్యూ ఢిల్లీ లోని AIIMS హాస్పిటల్ లో Dr ఇందు బసు తనకి సీనియర్... బాగా మంచి ఫ్రెండ్ Dr గాయత్రి ఆఫీస్ కి వెళ్ళింది. గాయత్రి Cardio Vascular సర్జన్.

గాయత్రి : హాయ్... ఇందు... హౌ అర్ యు?

ఇందు : ఐ యాం ఫైన్... నీ తో కొంచం మాట్లాడాలి.

గాయత్రి : టెల్ మి... హౌ కెన్ ఐ హెల్ప్ యు?

ఇందు : నీ తెలుసుగా నేను ఆ హైదరాబాద్ రేప్ విక్టిమ్ కి ఇంచార్జి గా ఉన్నానని...

గాయత్రి : ఎస్... ఆ అమ్మాయి కి ఎలా ఉంది?

ఇందు : ట్రీట్మెంట్ కి బాగా రెస్పాండ్ అవుతోంది. ఇంటర్నల్ ఇంజ్యూరిస్ బాగా తగ్గుతున్నాయి... కానీ.. ఇవ్వాళా Dr పారిక్ ఆమెకి డ్రగ్ ప్రోటోకాల్ మార్చేశాడు. దాని వల్ల ఆమె తొందరగా రికవర్ అవ్వొచ్చు... లేదా... పెర్మనెంట్ కోమా లోకి పోవొచ్చు... అది ఇది కాకపోతే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏం చెయ్యాలో తెలియడం లేదు.

గాయత్రి : ఈ విషయం ఎంతమంది కి తెలుసు?

ఇందు : నాకు... Dr పారిక్... నర్స్ స్టాఫ్...

గాయత్రి : నర్స్ స్టాఫ్ ఎంతమంది?

ఇందు : అన్ని షిఫ్ట్స్ కలిపి 8 మంది.

గాయత్రి : మనం ఏమి చేయలేము. నువ్వు Dr పారిక్ చెప్పినట్లు చెయ్యి... మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు.

ఇందు : ఈ విషయం నీకు చెప్పినట్లు ఎవ్వరికీ చెప్పకు... అనవసరంగా కాంట్రవర్సీ అవుతుంది.

గాయత్రి : నీకేం భయం లేదు. నేను ఎవరికీ చెప్పను. నువ్వు కూడా ఎవ్వరికీ చెప్పకు.

ఆ రోజు రాత్రి గాయత్రి ఇంటికి వాళ్ళ అన్నయ... వదిన డిన్నర్ కి వచ్చారు. ఆమె అన్నయ మాటల్లో హైదరాబాద్ రేప్ విక్టిమ్ గురించి అడిగాడు.... " ఫరవాలేదు బానే రెస్పాండ్ అవుతోంది... ఇంకా అవుట్ అఫ్ డేంజర్ కాదు... ఇవ్వాళే ఆమెకి డ్రగ్ ప్రోటోకాల్ మారింది. త్వరలోనే ఫుల్ గా రికవర్ అవ్వొచ్చు... లేదా ఏదైనా జరగొచ్చు...చూడాలి ఏమవుతుందో" అని అన్నది...

ఈ సంఘటన జరిగిన మూడో రోజు AIIMS ఒక ప్రెస్ స్టేటుమెంట్ రిలీజ్ చేసింది... దాని సారాంశం " హైదరాబాద్ లో రేప్ కి గురయ్యి ఇక్కడ చికిత్స పొందుతున్న అమ్మాయి ఒక గంట క్రితం మాసివ్ హార్ట్ ఎటాక్ రావడం తో చనిపోయింది. ఆమె అనాధ కావడంతో అంత్యక్రియలు గవర్నమెంట్ జరిపించడానికి నిర్ణయించుకుంది"

చనిపోయిన అమ్మాయి శవానికి పోస్టుమార్టం చేయాలని అంటే... Dr పారిక్ కన్నీళ్లతో " వొద్దు... ఆమె ఇప్పటికే చాలా నరకయాతన అనుభవించింది. ఇంకా ఆమె శరీరాన్ని చింద్రం చెయ్యొద్దు... మానవతా దృక్పధంతో ఆమెకి డైరెక్ట్ గా ఫైనల్ రైట్స్ జరిపించుదాం" అని అన్నాడు.


Part - 24 - The Mole Hunt

CI సుధీర్ తలుపు తీసుకొని కాంతారావు ఆఫీస్ లోకి అడుగుపెట్టాడు. అతడిని చూడగానే కాంతారావు "కంగ్రాట్యులేషన్స్... కం సిట్ డౌన్... ఏ ప్రాబ్లెమ్ రాలేదుగా?" అని అడిగాడు.

సుదీర్(చాలా ఆశ్చర్యంగా చూస్తూ) : ఏ ప్రాబ్లెమ్ రాలేదు... కానీ...

కాంతారావు : ప్లాన్ చివరి నిమిషం లో ఎందుకు చేంజ్ చేసానో... తెలుసుకోవాలని ఉంది కదా...

సుధీర్ : అవును సర్...

కాంతారావు : ORGANISED CRIME SYNDICATE మెయిన్ రూల్ ఏమిటో తెలుసా?

సుధీర్ : లేదండి.

కాంతారావు : బాస్ ఏది చెప్తే... తూ... చా... తప్పకుండా అమలు చేయాలి. ఒక్కోసారి ప్లాన్ ప్రకారం పని జరగదు. అటువంటప్పుడు బాస్ కి వెంటనే ఇన్ఫోర్మ్ చెయ్యాలి. యాదగిరి కి మేము చాలా క్లియర్ గా ఏమి చెయ్యాలో... ఎలా చెయ్యాలో... చెప్పాము. దారుణంగా ప్లాప్ అయ్యింది. చాలా పెద్ద ప్రాబ్లెమ్ తెచ్చి పెట్టారు. పిల్లలు ఇరుక్కున్నారు. ఒక్క ఫోన్ కాల్ చేసుంటే ఈ ప్రాబ్లెమ్ వచ్చేదే కాదు. పని పూరి చెయ్యకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టారు. యాదగిరి గ్యాంగ్ కి ఎంతో నచ్చచెప్పాము... వాళ్ళ ఫామిలీస్ కి చాలా డబ్బులు ఆఫర్ చేసాము... అన్నింటికీ ఒప్పుకొని... చివరికి గొంతెమ్మ కోరికలు కోరారు... మేము వాళ్ళని శాశ్వతం గా కేరళ వెళ్ళిపొమ్మని అన్ని ఏర్పాట్లు చేసాము... వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో దుబాయ్ కి పంపమని అడిగారు. పైగా ప్రతి నెల డబ్బులు కూడా పంపాలని కండిషన్ పెట్టారు. ఇదేదో చాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుందని అర్ధమయ్యింది. ఇది కాకుండా నువ్వు వేసిన ప్లాన్ అవినాష్ కి తెలిసిపోయింది.

సుధీర్ : అవినాష్ కి ఎలా తెలిసింది? నేను వేసిన ప్లాన్ మీకు... నా టీం కి తప్ప వేరే ఎవరికి తెలీదు.

కాంతారావు : నీ టీం లో హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఉండేవాడు కదా...

సుధీర్ : అవును. మొన్ననే ప్రమోషన్ వచ్చి SI అయ్యాడు...

కాంతారావు : సడన్ గా ప్రమోషన్ ఎందుకొచ్చిందో తెలుసా? నువ్వు వేసిన ప్లాన్ వాడు DSP శేఖర్ కి చెప్పాడు. శేఖర్ ఈ విషయం అవినాష్ కి చెప్పాడు.

సుధీర్ : నేను నమ్మను... శ్రీకాంత్ నాకు చాలా నమ్మకమైన వాడు. వాడు చెప్పే ఛాన్స్ లేదు...

కాంతారావు : నీకు శ్రీకాంత్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

సుధీర్ : నార్మల్ బ్యాక్ గ్రౌండ్. చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు. నాతో గత 8 ఏళ్లుగా పనిచేశాడు.

కాంతారావు : డీస్పీ శేఖర్ భార్య... శ్రీకాంత్... ఒకే ఊరి వాళ్ళు. శేఖర్ ద్వారానే వాడికి కానిస్టేబుల్ గా వుద్యోగం వచ్చింది. వాడు శేఖర్ మనిషి.

సుధీర్ : ఈ సంగతి నాకు నిజంగా తెలీదు...

కాంతారావు : That's OK... అదృష్టం కొద్ది శ్రీకాంత్ నీ ప్లాన్ మొత్తం శేఖర్ కి చెప్పడం వల్ల మనకేం నష్టం కలగలేదు. చాలా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు సడన్ గా ఎందుకొచ్చావు?

సుధీర్ : ఈ పని కోసం నేను మీ దగ్గర 15 కోట్లు తీసుకున్నాను. ఇప్పుడు ప్లాన్ పూర్తిగా చేంజ్ అవ్వడంతో అంత డబ్బులు అవసరం లేదు. చాలా మిగిలింది. మీకు వెనక్కి ఇద్దామని వచ్చాను.

కాంతారావు : నీ నిజాయితి నాకు బాగా నచ్చింది. ఆ డబ్బులు ప్రస్తుతానికి నీ దగ్గరే ఉంచు... ఫ్యూచర్ లో ఏదైనా పనికి చెయ్యాలంటే పనికొస్తుంది. నేను చివరి నిమిషం లో ప్లాన్ మార్చడంతో నీకేమి ప్రాబ్లెమ్ రాలేదుగా...

సుధీర్ : FAKE BULLETS వాడివుంటే మీరిచ్చిన ఆ 15 కోట్లు ఖర్చుపెట్టి అంబులెన్సు స్టాఫ్... మార్చురీ స్టాఫ్... డాక్టర్స్... నర్స్ స్టాఫ్... అందరిని మేనేజ్ చెయ్యడానికి... డెడ్ బాడీస్ కొనడానికి సరిపోయేది. కానీ... మీరు చివరి నిమిషం లో ఇచ్చిన ఇంస్ట్రుక్షన్స్ ప్రకారం మేము REAL BULLETS వాడి యాదగిరి గ్యాంగ్ ని లేపెయ్యడం తో చాలా ఖర్చులు కలిసొచ్చాయి...

కాంతారావు : గుడ్. ఇలా ప్లాన్ ప్రకారం పని జరిగితే ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు. టచ్ లో ఉండు... ఎప్పుడైనా నీ హెల్ప్ అవసరమైతే చెప్తాను...


న్యూ ఢిల్లీ... కాబినెట్ సెక్రటరీ ఆఫీస్... మాధవ్... రవీంద్ర... ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. సడన్ గా తలుపు తెరుచుకుంది... కాబినెట్ సెక్రటరీ చాలా కోపంగా రూమ్ లోకి వచ్చి చేతిలోని ఫైల్స్ ని విసురుగా టేబుల్ మీద పడేసి సీట్ లో కూర్చొని...

కాబినెట్ సెక్రటరీ : STOP CHASING MR. MAHENDRA... IT'S AN ORDER.

మాధవ్ : తప్పకుండా... కారణం తెలుసుకోవొచ్చా?

కాబినెట్ సెక్రటరీ : మీరు సంపాదించిన ప్రూఫ్స్ తో మహేంద్ర పేరు మీద కోర్ట్ నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొని రాగలరా?

మాధవ్ : కొంచం కష్టం... డైరెక్ట్ లింక్స్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు.

కాబినెట్ సెక్రటరీ : స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా మహేంద్ర ని టచ్ చెయ్యవొద్దని ఆర్డర్స్... కాబినెట్ మీటింగ్ లో చాలా ప్రశ్నలు వేశారు... అడవిలో ఆ ఫార్మ్స్ కి మహేంద్ర కి డైరెక్ట్ లింక్ ఉందని ఎలా చెప్పగలరు? ఆ డ్రగ్స్ ని మహేంద్ర ఎక్సపోర్ట్ చేసాడనడానికి రుజువులు ఉన్నాయా? ఆ డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బు ఏ దేశం లో... ఏ బ్యాంకు లో ఉన్నాయి? ఆ డబ్బులు మన దేశం లోకి వచ్చాయా? ఒకవేళ వచ్చిఉంటే... ఆ ఫండ్స్ ఎక్కడున్నాయి? ఏదైనా ఇండస్ట్రీ లో పెట్టుబడి పెట్టాడా? మీకు ఆఫ్ షోర్ బ్యాంకు అకౌంట్స్ గురించి ఎలా తెలిసింది? ఎవరు ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్... కాబినెట్ మీటింగ్ లో చాలా ప్రశ్నలు వేశారు. ఒక్కదానికి కూడా నాదగ్గర సరైన జవాబు లేదు.

రవీంద్ర : ఆ డీటెయిల్స్ సంపాదించడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల మనం ఫారెస్ట్ లో ఆ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని నాశనం చెయ్యొచ్చుకదా... ఆ ఫార్మ్స్ మహేంద్ర వి అయినా... కాకున్నా... వాటి మీద ఆక్షన్ తీసుకోవడం మన డ్యూటీ. కనీసం డ్రగ్స్ తయారీ ఆగిపోతుంది. హైదరాబాద్ సిటీ లోకి డ్రగ్స్ రావడం ఆగిపోతుంది.

కాబినెట్ సెక్రటరీ : డ్రగ్ ఫార్మ్స్ ని డిస్ట్రాయ్ చెయ్యడానికి కూడా ఒప్పుకోవడం లేదు. వాటిని నాశనం చెయ్యడం వల్ల ECOLOGICAL DISASTER సంభవించే ప్రమాదం ఉందని వాదించారు. వాటిని AIR STRIKES ద్వారా నాశం చేస్తే... అడవి మొత్తం అంటుకునే ప్రమాదం ఉందని వాదించారు.

మాధవ్ : అందుకే కదా... ఆర్మీ యాక్షన్ చేద్దామని మొదట్లో ప్రపోజ్ చేసాము. ఒక్కొచోటకి ఒక్కో బటాలిన్ పంపిస్తే చాలు. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ని చంపేసి ఆ ఫార్మ్ ని మన అధీనం లోకి తీసుకొని... అక్కడ తయారవుతున్న డ్రగ్స్ ని... పంటని... నాశనం చేద్దామని మీకు చెప్తే... మీరు ఆప్షన్స్ అడిగారు.

కాబినెట్ సెక్రటరీ : ఈ రోజు మీటింగ్ లో ఒక సభ్యుడు ఏమన్నాడో తెలుసా... 'మనకి తెలియకుండా ఏదైనా కొత్త టెర్రరిస్ట్ ఆర్గనైజషన్ పుట్టుకొచ్చిందా? వాళ్ళు ఫండ్స్ కోసం డ్రగ్స్ తయారు చేసి... ఎక్సపోర్ట్ చేయడంవల్ల వచ్చిన డబ్బుతో ఆయుధాలు కొంటున్నారా? వాళ్లకి వేరే దేశాలతో సంబంధాలు ఉన్నాయా? మన దేశం మీదకి తిరుగుబాటు ప్లాన్ చేస్తున్నారా? అక్కడ టెర్రర్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టారా? టెర్రర్ లాంచింగ్ పాడ్స్ కూడా పెట్టారా? ఇప్పటిదాకా ఎంత మందిని దేశం లోకి వొదిలారు? ఇంకా ఎంత మంది వున్నారు? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి? ఆదివాసుల్ని కూడా వాళ్ళు తమ ఆర్గనైజేషన్ లో చేర్చుకుంటున్నారా? మన ఇంటలిజెన్స్ డిపార్టుమెంటు కి తెలియకుండా ఇంత దూరం ఎలా వచ్చింది? ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగిందా? లేదా గత ప్రభుత్వాలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదా? పాలసీ పరాలిసిస్ జరిగిందా? ఇంకా మన దేశం లో ఎన్ని అడవుల్లో... ఎన్ని డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ ఉన్నాయి? నా దేశ అడవి సంపదని నాశనం చేస్తోంది ఎవరు? నా పవిత్ర భారతదేశాన్ని కొలంబియా దేశం లా మార్చేస్తున్న ఆ ఎస్కోబార్ ఎవరు? వాడు మన భారతీయుడా... లేక వేరే దేశానికి చెందినవాడా?' అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మాధవ్ : సర్... ఆ పరమ దేశ భక్తుడి పేరు తెలుసుకోవొచ్చా...

కాబినెట్ సెక్రటరీ : చెప్తే ఏమి చేస్తావ్? అసలే ఆయన మన దేశం లో అతి పెద్ద రాష్టానికి చెందిన అతి పెద్ద రాజకీయనాయకుడు. మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఆయనకి వచ్చినన్ని ఓట్లు ఇప్పటివరకు ఏ రాజకీయనాయకుడికి రాలేదు... ఆయన మీద పోటీ చేసినవాళ్లందరికి డిపాజిట్స్ కూడా దక్కలేదు. ఆయన మనోవ్యధ చూసి తట్టుకోలేకపోయాను. కాబినెట్ మీటింగ్ లో ఏమి జరిగినా బయటకి చెప్పకూడదు. అది నా వృత్తి ధర్మం కాదు.

మాధవ్ : సర్... ఐ యామ్ సారీ... మిమ్మల్ని ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి?

కాబినెట్ సెక్రటరీ : మీరు ముందుగా ఆ అడవుల్లో ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తయారవుతోందేమో తెలుసుకోండి... ఒకవేళ అలాంటిదేదన్న ఉంటే... వాటి వెనుక ఏదైనా విదేశాల లింక్స్ ఉంటే వాటిని కనిపెట్టాలి. మీరు ఆ డ్రగ్స్ ఫార్మ్స్ ని టచ్ చెయ్యకుండా... అక్కడున్న వాళ్లకి ఎటువంటి అనుమానం రాకుండా... ఇన్వెస్టిగేట్ చేసి స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకొని రమ్మని చెప్పారు. ఈ లోపల నేషనల్ సెక్యూరిటీ కి ఎటువంటి భంగం కలకుండా అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నింటిని కలిసి పనిచెయ్యమని చెప్పారు. ముఖ్యం గా మనీ ట్రయిల్ ని కనుక్కోమని చెప్పారు.

కాబినెట్ సెక్రటరీ తన ముందున్న ఒక ఫైల్ ని ఓపెన్ చేసి అందులో ఒక వైట్ పేపర్ పెట్టి దాని మీద ఎదో వ్రాసి... ఫైల్ మూసేసి... మాధవ్ కి ఇస్తూ " వెంటనే రిపోర్ట్ తయారుచేసి ఇవ్వండి" అని అన్నాడు. ఆ ఫైల్ తీసుకొని మాధవ్... రవీంద్ర లేచి నుంచొని సెల్యూట్ కొట్టి "జై హింద్" అని చెప్పి బయటకి వచ్చారు. మాధవ్ తన కార్ ఎక్కబోతూ కాబినెట్ సెక్రటరీ ఇచ్చిన ఫైల్ ఓపెన్ చేసి చూసాడు. అందులో ఒకే ఒక్క పేపర్ వుంది. దాని మీద " THERE IS A MOLE IN OP CENTER... FIND IT IMMEDIATELY" అని రాసి ఉంది. ఆ ఫైల్ ని రవీంద్ర కి ఇచ్చి తన కార్ ఎక్కి OP CENTER కి వెళ్ళిపోయాడు. రవీంద్ర ఆ ఫైల్ లో వ్రాసివున్నది చదువుకొని 'వాడెవడో... ఇవ్వాళ చచ్చాడు' అని అనుకుంటూ కార్ ఎక్కి తన ఆఫీస్ కి వెళ్ళాడు.


మాధవ్ కార్ లో ఆలోచించసాగాడు... మనసులో OP CENTER లో ఎవరెవరు మహేంద్ర కోసం ఏర్పాటు చేసిన OPERATION CROSS FIRE లో పనిచేస్తున్నారో ఒక లిస్ట్ తయారు చేసుకున్నాడు. చాలా మంది ఉన్నారు. ఎలా పట్టుకోవాలి? ముందుగా ఒక అయిదు పేర్లు సెలెక్ట్ చేసుకున్నాడు. 1. కరణ్ నాగర్ 2. దేవేందర్ మల్హోత్రా 3. మాక్ కటావకర్ 4. ముత్తు మరియప్పన్ 5. రచన నేగి... ఆఫీస్ కి చేరుకోగానే ముందుగా కరణ్ నాగర్ ని తన ఛాంబర్ కి పిలిచి...

"మహేంద్ర ఇన్వెస్టిగేషన్ లో ఒక పెద్ద బ్రేక్ దొరికింది. అరెస్ట్ చెయ్యడానికి కావాల్సిన ఒక పెద్ద ప్రూఫ్ మన చేతికి దొరకబోతోంది. అతని పేరు కార్తికేయన్. మహేంద్ర ఆఫీస్ లో పనిచేస్తాడు. డ్రగ్స్ నెటవర్క్ లో ఒక పెద్ద లింక్ కి సంభందించిన డాకుమెంట్స్ అతని దగ్గరున్నాయి... కార్తికేయన్ అప్రూవర్ మారడానికి రెడీ గా ఉన్నాడు. కొంచం భయపడుతున్నాడు. జనకపురి లో ఉన్నాడు. ఇది అతని అడ్రస్. వెళ్లి ఆ డాకుమెంట్స్ తీసుకొని రా...జాగ్రత్త... వెపన్ తీసుకొని వెళ్ళు... అవసరం అనుకుంటే కాల్చడానికి వెనకాడకు. ఈ లోపల రవీంద్ర కోర్ట్ నుంచి అరెస్ట్ వారంట్ తేవడానికి లాయర్ తో మాట్లాడుతున్నాడు" అని చెప్పాడు. వెంటనే జనకపురి పోలీస్ స్టేషన్ కిఫోన్ చేసి కరణ్ వెళ్తున్న అడ్రస్ ఇచ్చి " ఇక్కడికి మా RAW ఏజెంట్ కరణ్ నాగర్ వస్తాడు... అతను కార్తికేయన్ అనే వ్యక్తి కోసం అడుగుతాడు. అతని ID చెక్ చేసి నాకు ఫోన్ చెయ్యండి. ఒక వేళ అతను కాకుండా వేరే ఎవరైనా వస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నాకు ఫోన్ చెయ్యండి. జాగ్రత్త... ఆ వచ్చే వాళ్ళ దగ్గర వెపన్స్ వుండే ఛాన్స్ ఉంది." అని ఇన్ఫోర్మ్ చేసాడు.

ఒక్కొక్కళ్ళని పిలిచి ఇలాగే చెప్పి ఒక్కో అడ్రస్ కి పంపాడు. కరణ్ తనకి ఇచ్చిన జనకపురి అడ్రస్ కి వెళ్ళాడు... అక్కడ సివిల్ డ్రెస్ లో జనకపురి పోలీసులు కనిపించారు. కరణ్ ని చూడగానే "కౌన్ హై తూ?" అని అడిగారు. కరణ్ ఒక పంజాబీ... పుట్టిపెరిగింది ఢిల్లీ షాలిమార్ బాగ్ లో... పైగా పనిచేస్తోంది RAW టీం లో... పోలీసులు అడిగిందానికి బదులుగా "తు కౌన్ హై B.... C....?" అని అడిగాడు. దాంతో జనకపురి పోలీసులకి అర్ధమయింది... వీడు RAW ఏజెంట్... తమ ID కార్డు చూపించి కరణ్ ID చెక్ చేసి... "తేరా బాస్ కో ఫోన్ కరో..." అని చెప్పి వెళ్లిపోయారు. కరణ్ అంత అయోమయంగా ఉంది. వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి "ఇక్కడ కార్తికేయన్ లేడు... జనకపురి పోలీసులు ఉన్నారు" అని అన్నాడు. తడిని వెనక్కి రమ్మని చెప్పాడు. తన ముందున్న లిస్ట్ లో కరణ్ నాగర్ పేరు కొట్టేసాడు.

మాక్ కటావకర్... మరియప్పన్... రచన... ఈ ముగ్గురూ కూడా తమకి ఇచ్చిన అడ్రస్ కి వెళ్లారు. వాళ్లకి అక్కడ లోకల్ పోలీసులు కనిపించారు. వాళ్ళు కూడా వెంటనే మాధవ్ కి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళని కూడా వెనక్కి రమ్మని చెప్పాడు.

దేవేందర్ మల్హోత్ర... తనకి మాధవ్ ఇచ్చిన అడ్రస్ ని వెంటనే ఢిల్లీ లో ఉన్న మహేంద్ర వెల్ విషర్ కి ఫోన్ చేసి ఇచ్చి కార్తికేయన్ గురించి చెప్పాడు. ఆ వెల్ విషర్ వెంటనే తన మనుషులు ఇద్దరిని ఆ అడ్రస్ ఇచ్చి కార్తికేయన్ ని చంపెయ్యమని చెప్పాడు. వాళ్ళు ఆ అడ్రస్ కి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు... అక్కడ పోలీసులని చూడగానే ఆ ఇద్దరూ పారిపోబోయారు. పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. అంతే... ఆ ఇద్దరూ ఆగిపోయారు. లోకల్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి మాధవ్ కి ఫోన్ చేశారు. వెంటనే మాధవ్ దేవేందర్ మల్హోత్ర డీటెయిల్స్ ని ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి పంపించి రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేయించాడు.

కరణ్... కటావకర్... మరియప్పన్... రచన... వెనక్కి రాగానే వాళ్ళని తన ఛాంబర్ కి పిలిపించి దేవేందర్ మల్హోత్ర పేరు మీద రెడ్ అలర్ట్ నోటీసు ఇష్యూ అయిన విషయం చెప్పాడు.


Part - 25 - The Pharmacist

ఢిల్లీ పోలీస్ లాక్ అప్ లో విచారణ జరుగుతోంది. పాషా ని కలకత్తా పోలీసులు చాల కస్టపడి సిలిగురి లో పట్టుకొని నేరుగా న్యూ ఢిల్లీ తీసుకొని వచ్చారు. ఢిల్లీ పోలీస్ పాషా మొహమంతా పచ్చడయ్యేలా కొట్టారు. చేతి వేళ్ళు విరిచేసారు. వాడి మీద ఇప్పటిదాకా ఎటువంటి కేసు ఫైల్ చెయ్యలేదు. పాషా ని తెచ్చిన విషయం బయట ప్రపంచానికి తెలియదు. చివరికి బాధ భరించలేక మాట్లాడసాగాడు.

ఢిల్లీ పోలీస్ : హైదరాబాద్ లోని ఇరానీ కేఫ్ షూట్ అవుట్ కాంట్రాక్టు ఎవరు ఇచ్చారు?

పాషా : వాడిపేరు కిషన్. హైదరాబాద్ లో కైలాష్ గౌడ్ కి బాగా కావాల్సిన వాడు.

ఢిల్లీ పోలీస్ : ఎక్కడ కలిసాడు?

పాషా : నాకు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నాడు... ఒక ముసలాయన ఫోటో చూపించి... వాడిని చంపమని చెప్పారు... వాడి ఒక్కడిని చంపితే ప్రాబ్లెమ్ వస్తుందని, వాడితో పాటు వీలయినంత మందిని చంపమని చెప్పారు. ఒక పిచ్చోడిలా ప్రవర్తించి చంపమని చెప్పారు. ఆ పని చేసినందుకు నాకు 10 లక్షలు ఇచ్చారు.

ఢిల్లీ పోలీస్ : అక్కడనుంచి ఎలా పారిపోయావు?

పాషా : నేను పారిపోలేదు. నన్ను అక్కడి పోలీసులు ఒకరోజు లాక్ అప్ లో పెట్టారు. నేను ఆ రాత్రంతా ఒక పిచ్చోడిలా ప్రవర్తించాను. మరుసటి రోజు నన్ను కోర్ట్ కి తీసుకెళ్లారు. అక్కడ నేనొక పిచ్చోడినని చెప్పి... హెల్త్ చెక్ అప్ కోసం నన్ను మెంటల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. హాస్పిటల్ కి వెళ్ళగానే... నాకు డ్రెస్ చేంజ్ చేసి వొదిలేశారు. కైలాష్ గౌడ్ మనిషి ఒకడు నన్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వొదిలిపెట్టాడు. నేను కలకత్తా వచ్చేసాను.

ఢిల్లీ పోలీస్ : హైదరాబాద్ లో ఈ పని చెయ్యడానికి చాలా మంది ఉన్నారు... నిన్ను ప్రత్యేకం గా కలకత్తా నించి ఎందుకు పిలిచారు?

పాషా : నేను ఒకసారి చెన్నై లో ఇలాగే ఒక పిచ్చోడిలా నటించి ఒక ఇంట్లోకి దూరి ఒక హత్య చేసాను. పిచ్చివాడిలాగా నేను బాగా నటిస్తాను. ఆ సంగతి కిషన్ కి తెలుసు. వేరే వూరు వాడు కావాలని నన్ను పిలిచారు.

ఢిల్లీ పోలీస్ : ఇప్పటిదాకా ఎన్ని హత్యలు చేసావు?

పాషా : ముప్పయి నాలుగు... నేను బంగ్లదేశ్ నుంచి వచ్చాను. అక్కడే 28 హత్యలు చేసాను. కలకత్తా లో ఒక హత్య చేయించడానికి నన్ను పిలిపించారు.

ఢిల్లీ పోలీస్ : ఎవరు పిలిపించారు?

పాషా : వాడి పేరు సన్యాల్ దాదా... జల్పైగురి లో ఒక హత్య చేయించడానికి నన్ను బంగ్లాదేశ్ నుంచి పిలిపించాడు. అప్పటినుంచి ఇండియా లో నాకు కాంట్రాక్ట్స్ రావడం మొదలెట్టాయి. సన్యాల్ దాదా... కిషన్ చాలా మంచి ఫ్రెండ్స్.

ఢిల్లీ పోలీస్ : సన్యాల్ దాదా అంటే... డ్రగ్స్ మాఫియా హెడ్ కదా...

పాషా : అవును. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ లో మెంబెర్...

ఢిల్లీ పోలీస్ : నువ్వు హైదరాబాద్ లో ఎవరెవరి ని చంపావో తెలుసా?

పాషా : నాకు ఆ ముసలాయన ఫోటో చూపించి వాడిని తప్పకుండా చంపాలని చెప్పారు. ఆ రోజు నేను కేఫ్ లో దూరి ఆ ముసలాయన ఎక్కడున్నాడో వెతికి చంపాను. ఆ తరువాత ఇంకో ఏడుగురిని చంపేసి లొంగి పోయాను.

ఢిల్లీ పోలీస్ : నువ్వు ఎక్కడెక్కడ... ఎవరెవరిని చంపావో... లిస్ట్ చెప్పు...

పాషా లిస్ట్ ఇచ్చాడు... బాంగ్లాదేశ్ లో మీర్పూర్... ఢాకా... తొంగి.. నారాయనఘడ్... ఇండియా లో సిలిగురి... చెన్నై... అమృతసర్... జమ్ము... హైదరాబాద్... భువనేశ్వర్... డార్జిలింగ్... పాట్నా... నగరాలలో హత్యలు చేసాడు. ఢిల్లీ పోలీస్ ఈ విషయం మాధవ్ కి చెప్పారు... "కేసు ఫైల్ చేశారా?" అని అడిగాడు... "పాషా ని తీసుకొని రావడం ఆఫీషియల్ గా ఎవరికీ తెలియదు" అని ఢిల్లీ పోలీస్ చెప్పారు. మాధవ్ ఒక్క నిమిషం అలోచించి " ఉస్కో ఉడావ్" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఢిల్లీ పోలీస్ వెంటనే పాషా ని మారుమూల ప్రాంతానికి తీసుకొని వెళ్లి చంపేశారు.


మహేంద్ర తన ఆఫీస్ లోంచి కమాండ్ సెంటర్ ని వేరే చోటకి షిఫ్ట్ చేసేసాడు. హెడ్ క్వార్టర్స్ లోని డేటా సెంటర్ లో సర్వర్ కి రెప్లికా సర్వర్ ని ఎప్పుడో వేరే చోట ఏర్పాటు చేసాడు. ఆ కమాండ్ సెంటర్ కి సంభందించిన హార్డ్ డ్రైవ్స్ అన్నింటిని అక్కడినుంచి తీసేసారు. అయినా... విశ్వామిత్ర దృష్టినుంచి తప్పించుకులేకపోయారు. విశ్వామిత్ర కి కొత్త కమాండ్ సెంటర్ లొకేషన్ కూడా తెలుసు. ఆ కమాండ్ సెంటర్ సర్వర్ లో హిస్టారికల్ డేటా ని బాగా స్టడీ చేసాడు. కమాండ్ సెంటర్ నుంచి మొత్తం వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఆర్డర్స్ తీసుకోవడం... రా మెటీరియల్స్ కొనడం... వాటిని డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేయించడం... సప్లై చేసినవాళ్ళకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చెయ్యడం... కస్టమర్స్ నుంచి కలెక్షన్స్... బ్యాంకు డిపోసిట్స్... ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కి డబ్బులు ఇవ్వడం... వివిధ గవర్నమెంట్... పోలీస్... పోర్ట్ ఆఫీషియల్స్ కి ఇచ్చిన లంచాల వివరాలు... ఏజెంట్స్ కి ఇవ్వాల్సిన కమిషన్ డీటెయిల్స్... చాలా వివరంగా తెలుసుకున్నాడు. కొన్ని ట్రెండ్స్ ని కనిపెట్టగలిగాడు. సప్లై చైన్ పూర్తిగా అర్ధం చేస్తుకున్నాడు. డ్రగ్స్ ని రవాణా చేసే షిప్పింగ్ కంపెనీస్ డీటెయిల్స్ అన్ని దొరికాయి. ఎప్పుడెప్పుడు మెటీరియల్ దిగుమతి అవుతుంది... ఎప్పుడెప్పుడు ఎగుమతి అవుతుంది... ట్రెండ్స్ తెలుసుకోగలిగాడు.

మహేంద్ర ముఖ్యంగా కెమికల్స్ ని విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటాడు. ప్రపంచంలో పెద్ద పెద్ద కెమికల్ కంపెనీస్ తయారుచేసే హై క్వాలిటీ లిక్విడ్స్ ని జర్మనీ... అమెరికా... జపాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాడు. క్వాలిటీ రా మెటీరియల్స్ వాడితేనే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారవవుతుందని బాగా నమ్ముతాడు. దాని కోసం కొలంబియా... మెక్సికో దేశాలనుంచి పెద్ద పెద్ద ఎక్సపర్ట్స్ ని ఇండియా పిలిపించి ఓపియం... కొకెయిన్... కన్నబిస్... డ్రగ్స్ కి క్వాలిటీ కంట్రోల్ చేయిస్తాడు. దానికి ఒక చీఫ్ సైంటిస్ట్ ని కూడా పెట్టుకున్నాడు. వాడి పేరు సెబాస్టియన్ వెలాస్కో... వాడికి ఇంకో పేరు కూడా ఉంది... The Pharmacist. సెబాస్టియన్ వెలాస్కో రెండు నెలలకోసారి ఇండియా వస్తాడు. మహేంద్ర హైదరాబాద్ లో ఒక లాబరేటరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ల్యాబ్ లో MACHATE... TELCHAT... CHAPORI లో తయారయిన డ్రగ్స్ కి పర్సనల్ గా క్వాలిటీ చెక్ చేస్తాడు. సెబాస్టియన్ వెలాస్కో ఇచ్చే సర్టిఫికెట్ ని మహేంద్ర తన ఏజెంట్స్ ద్వారా కస్టమర్స్ కి పంపిస్తాడు. ప్రపంచం అంతా వెలాస్కో ఇచ్చే సర్టిఫికెట్ కి చాలా విలువ ఉంటుంది. అది అండర్ వరల్డ్ లో ఒక ISO సర్టిఫికెట్ లా పనిచేస్తుంది.

సెబాస్టియన్ వెలాస్కో కి ఏ నేలలో ఏ పంట వెయ్యాలి... ఆ పంట బాగా రావాలంటే ఎటువంటి ఎరువులు వాడాలి... ఏ సమయం లో పంట కొయ్యాలి... ఎలా ప్రాసెస్ చెయ్యాలి... ఎటువంటి కెమికల్స్... ఏ ఏ మోతాదుల్లో వాడాలి... ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా మైంటైన్ చెయ్యాలి... ఇలాంటి విషయాలలో మహేంద్ర కి సలహాదారుగా వ్యవహరిస్తాడు. కన్సల్టేషన్ ఫీ చాలా వసూలు చేస్తాడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా రాబోయే 60 రోజుల ప్రొడక్షన్... డిస్ట్రిబ్యూషన్... ప్లాన్స్ ని రివ్యూ చేసి ఫైనలైజ్ చేస్తాడు.

కమాండ్ సెంటర్ డేటా ని అనలైజ్ చేస్తున్న విశ్వామిత్ర కి ఒక విషయం తెలిసింది... సెబాస్టియన్ వెలాస్కో అప్పటికి హైదరాబాద్ వచ్చి నెల రోజులయ్యింది. రాబోయే మూడు నెలల కి సరిపడా ప్రొడక్షన్ ప్లాన్ ఫైనలైజ్ చేసి వెళ్ళాడు. ఈసారి ప్రొడక్షన్ చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది... అన్నిరకాల రా మెటీరియల్స్ ని జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. పైగా ఇంకో విషయం తెలిసింది... వీళ్ళు నాలుగో ఫార్మ్ ని కూడా మొదలుపెడుతున్నారా?

విశ్వామిత్ర తన ఫైండింగ్స్ ని అవినాష్... మాధవ్... రవీంద్ర కి చెప్పాడు. అవినాష్ ని తీసుకొని ఢిల్లీ చేరుకున్నాడు. మాధవ్ ఇంట్లో నలుగురూ కూర్చొని విస్కీ తాగుతూ మాట్లాడుకున్నారు. విశ్వామిత్ర ఆ ముగ్గురికి తనకి తోచిన ప్లాన్ చెప్పాడు... అది విన్న వెంటనే ఆ ముగ్గురూ ముక్తకంఠం తో NO చెప్పారు.

విశ్వామిత్ర : మీ ఇష్టం... ఇంకో నెలలో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ విదేశాలకి ఎక్సపోర్ట్ కాబోతున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి... మహేంద్ర తన డ్రగ్స్ ని స్టోర్ చెయ్యడానికి ఒక కొత్త ప్రదేశం వెతుకున్నాడు. లక్షదీప్... ఇక్కడ మొత్తం 36 దీవులు ఉన్నాయి... వాటిలో ఎక్కువ దీవులలో జనసంచారం ఉండదు. అటువంటి ఒక దీవిని సెలెక్ట్ చేసుకున్నాడు. కేరళ లోని ఒక చిన్న పోర్ట్ ని కూడా కొన్నాడు. ఆ పోర్ట్ నుంచి ఎక్కువగా చేపలు పట్టే ట్రాలర్స్ ఉంటాయి. ముందుగా డ్రగ్స్ ని ఆ పోర్ట్ కి చేర్చి... అక్కడ నుంచి ఆ ఫిషింగ్ ట్రాలర్స్ లో లక్షదీవుల్లో తాను ఎంచుకున్న దీవికి తీసుకెళ్లి స్టోర్ చేస్తాడు. ఆ తరువాత వాటిని షిప్ కి ఎక్కించి వేరే దేశాలకు ఎక్సపోర్ట్ చెయ్యాలని ప్లాన్ వేస్తున్నాడు. ఈ మధ్య నే మహేంద్ర 50 THURAYA సాటిలైట్ ఫోన్ సెట్స్ కొన్నాడు. వాటిని ఆపరేట్ చెయ్యడానికి ఒక కంట్రోల్ స్టేషన్ కూడా రెడీ చేసుకుంటున్నాడు.

మాధవ్ : మాకు ఆఫీషియల్ గా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. మేము వాటిని ఫాలో అవ్వాలి. లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లెమ్ వస్తుంది.

విశ్వామిత్ర : మీకు తెలిసి యాక్షన్ తీసుకోపోతే... వేల కోట్ల విలువైన డ్రగ్స్ మార్కెట్ లోకి వస్తూనే ఉంటాయి. మీరు చూస్తూ కూర్చోవాలి.

రవీంద్ర : నువ్వు చెప్పిన ప్లాన్ చాలా రిస్క్... రిజల్ట్ చాలా టెంప్టింగ్ గా ఉంది. కానీ... ఈ ప్లాన్ సరిగ్గా వర్క్ అవుతుందన్న నమ్మకం లేదు. ఏ స్టేజి లోనైనా ఫెయిల్ అయ్యేచాన్సు ఉంది.

మాధవ్ : అది చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది.

విశ్వామిత్ర : మీకు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్... ఇండస్ట్రియల్ ఎస్పినోజ్ గురించి బాగా తెలుసు అనుకుంటాను...

మాధవ్ : తెలుసు.

విశ్వామిత్ర : ప్రపంచం లో జరిగే ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ లో 60% మనుషులు కావాలని చేస్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం... కంపెటేషన్ లేకుండా చెయ్యడానికి... పొలిటికల్ రీజన్స్... ఫ్యాక్టరీ లాక్ ఔట్స్ కోసం... సివిల్ డిస్టర్బన్స్... డబ్బులిస్తే ఇలాంటివన్నీ చెయ్యడానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. మనం చేసినట్లు ఎవరికి తెలియదు. పని అవుతుంది.

మాధవ్ : అది మా పాలసీ కి విరుద్ధం. పైగా చాలా ఖర్చుతో కూడిన పని. గవర్నమెంట్ బడ్జెట్ లో ఈ పని చెయ్యలేము.

రవీంద్ర : ఆ ఫార్మ్స్ లో ఏదైనా జరిగితే ముందుగా మా ఇద్దరినీ అనుమానిస్తారు. వాటిని నాశనం చెయ్యడానికి కావాల్సిన ప్లాన్ కూడా వేసాము. మాకు తెలిసిన సమాచారం ప్రకారం... ఆ ఫార్మ్స్ చుట్టూ పక్కల చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఫోర్స్ ని పెట్టారు. మీరు చెప్పిన THURAYA సెట్స్ అక్కడ కూడా ఉన్నాయి. వెంటనే ఇన్ఫర్మేషన్ చేరాల్సిన వాళ్లకి చేరి పోతుంది. ముందుగా మమ్మల్ని అడుగుతారు. ఇది అయ్యేది కాదు. ఇంకో సంగతి... ఒక చోట ఏదైనా జరిగితే దాన్ని ACCIDENT అంటారు... ఒకే ప్రమాదం ఒకేసారి రెండుచోట్ల జరిగితే... COINCIDENCE అంటారు... కానీ... మూడు లేదా నాలుగు చోట్ల ఒకేసారి జరిగితే...

మాధవ్ : దాన్ని SABOTAGE అంటారు.

విశ్వామిత్ర : నన్ను పూర్తిగా చెప్పనివ్వండి... ఇది చాలా సింపుల్ గా జరిగిపోయే పని. కమాండ్ సెంటర్ డేటా ప్రకారం... ఇంకో 5 రోజుల్లో జర్మనీ లోని హాంబర్గ్ పోర్ట్ నుంచి ముంబై పోర్ట్ కి భారీ ఎత్తున కెమికల్స్ వస్తున్నాయి. అవి ఒక పెద్ద కంటైనర్ లో కట్టుదిట్టంగా ప్యాక్ చెయ్యబడతాయి. ఆ కంటైనర్ ని Last to Load... First to unload బేసిస్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు...

రవీంద్ర : అంటే?

విశ్వామిత్ర : హాంబర్గ్ పోర్ట్ లో ఈ కెమికల్స్ ని ఒక 40 ఫీట్ కంటైనర్ లో లోడ్ చేసి చివరిగా ఆ కంటైనర్ ని షిప్ లోకి లోడ్ చేయిస్తారు... అది అన్ని కంటైనెర్స్ పైన ఉంటుంది. ముంబై చేరాక ఆ కంటైనర్ ని ప్రయారిటీ బేసిస్ లో ముందుగానే అన్లోడ్ చేయిస్తారు. టైం వేస్ట్ కాకుండా.... ఆ కంటైనర్ లోని కెమికల్స్ ని ఆ ఫార్మ్స్ కి తీసుకొని వెళ్తారు. మనం వెళ్లాల్సిన పని లేదు. మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోపోతే... జరిగేది చూస్తూ కూర్చోవాలి. ఆలోచించుకోండి. ట్రై చెయ్యడం లో తప్పు లేదు.

మాధవ్ : ఇది బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం.

విశ్వామిత్ర : అవును. అమెరికన్ డాలర్స్ లో పేమెంట్ చెయ్యాలి. మిలియన్స్ కావాలి.

మాధవ్ : మిలియన్స్... అది సాధ్యంకాదు...

విశ్వామిత్ర : డబ్బులు రెడీ గా ఉన్నాయి. జస్ట్ ఒక బ్యాంకు అకౌంట్ నుంచి ఇంకో బ్యాంకు అకౌంట్ కి ఫండ్ ట్రాన్సఫర్ చేస్తే చాలు. పని అవుతుంది.

మాధవ్ (అనుమానంగా): ఆ డబ్బు ఎవరిదీ? ఎక్కడుంది?

విశ్వామిత్ర : మహేంద్ర కి చాలా ఆఫ్ షోర్ అకౌంట్స్ ఉన్నాయి. నాకు వాటి డీటెయిల్స్ తెలిసాయి. ఆ అకౌంట్స్ లో చాలా అమౌంట్ ఉంది. మనం ఆ అకౌంట్ హాక్ చేసి పేమెంట్ చేదాం.

ఇది విన్న తరువాత మాధవ్... రవీంద్ర... అవినాష్... చాలా సేపు సైలెంట్ గా ఉండిపోయారు. మౌనంగా విస్కీ తాగుతున్నారు. అప్పటిదాకా సైలెంట్ గా కూర్చొని మొత్తం సంభాషణ వింటున్న అవినాష్ నెమ్మదిగా మాట్లాడాడు... "నాకు విశ్వామిత్ర ప్లాన్ నచ్చింది. కానీ... నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి... స్టెప్ బై స్టెప్..." అని అన్నాడు.

మాధవ్... రవీంద్ర ఏమి మాట్లాడ లేదు. విశ్వామిత్ర చెప్పడం మొదలెట్టాడు.


Part - 26 - The Ground Work for Destruction

విశ్వామిత్ర రెండు గంటల సేపు ముగ్గురికి తన ప్లాన్ ని వివరించాడు... డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ ని ఎలా డిస్ట్రాయ్ చెయ్యాలనుకుంటున్నాడో... ఎవరి సహాయం తీసుకోబోతున్నాడో... వాళ్ళు ఎవరో... వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలో... ఎలా ఇవ్వాలో... అన్ని డీటెయిల్స్ చెప్పాడు. ముగ్గురూ చాలా జాగ్రత్త గా విన్నారు. కానీ... ఏ ఒక్కరూ కన్విన్స్ కాలేదు. వాళ్లకి ఈ ప్లాన్ పనిచేస్తుందని నమ్మకం కలగలేదు.

అవినాష్ : వినడానికి ఈ ప్లాన్ చాలా బాగుంది. హాలీవుడ్ సినిమా తియ్యడానికి పనికొస్తుంది. అనుకున్నట్లు జరుగుతుందని నమ్మకం లేదు. ఏ స్టేజి లోనైనా ఫెయిల్ అవ్వొచ్చు...

విశ్వామిత్ర : మీ దగ్గర ఏదైనా బెటర్ ప్లాన్ ఉందా?

అవినాష్ : లేదు. నీ ప్లాన్ మాత్రం చాలా రిస్కీ ఎఫైర్. బాగా ఎక్సపెన్సివ్ కూడా...

విశ్వామిత్ర : మీకున్న మెయిన్ డౌట్ ఏమిటీ?

అవినాష్ : నువ్వు మెర్సినరీస్ ని రంగంలోకి దింపుతున్నావు. అది ఎథికల్ కాదు.

విశ్వామిత్ర : మరి మీరు ఆ డ్రగ్ ఫార్మ్స్ ని ఏమి చెయ్యబోతున్నారు.

రవీంద్ర : అవి ఉండడం మాకు కూడా ఇష్టం లేదు. ఆఫీషియల్ గా డిస్ట్రాయ్ చెయ్యడానికి ట్రై చేసాము. పొలిటికల్ ప్రెషర్... ఇంటలిజెన్స్ సమీకరించడం మా పని... ఆర్డర్స్ లేకుండా ఏమి చేసినా చాలా పెద్ద ప్రాబ్లెమ్ లో ఇరుక్కుంటాము.

విశ్వామిత్ర : మహేంద్ర వచ్చే రెండు నెలల్లో భారీ ఎత్తున డ్రగ్స్ ని ఎగుమతి చెయ్యబోతున్నాడు. లక్షదీప్ లో కూడా స్టోరేజ్ ఫెసిలిటీ పెట్టుకున్నాడు. అది చాలా పెద్ద నేరం. లక్షదీప్ ఎన్విరాన్మెంట్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అరేబియా సముద్రం లో లక్షదీప్ ఇండియా కి స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడున్న మీ డిఫెన్స్ ఎస్టాబ్లిషమెంట్ కి పెద్ద దెబ్బ.

రవీంద్ర : అక్కడ ఇండియా కి డిఫెన్స్ ఎస్టాబ్లిషమెంట్స్ ఏమి లేవు.

విశ్వామిత్ర చిరునవ్వు తో మాధవ్ వైపు చూసాడు.

మాధవ్ : అక్కడ ఒక ఐలాండ్ లో ఇండియా కి లిజినింగ్ పోస్ట్ ఉంది. వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ తో ఏర్పాటు చేసింది. SIGINT కి చాలా ఉపయోగపడుతోంది. ఆ ఫెసిలిటీ గురించి బయట ఎవరికి తెలియదు. ఆ రీజియన్ లో ఎటువంటి ఎనిమి కదలక ఉన్నా తెలుస్తుంది. మహేంద్ర ఫిషింగ్ ట్రాలర్స్ ని డ్రగ్స్ ని కదల్చడానికి వాడడం తో మాకు ఇంతవరకు అనుమానం రాలేదు. ఇప్పుడు మిలిటరీ లిజెనింగ్ పోస్ట్ కి దగ్గరలోనే డ్రగ్స్ స్టోరేజ్ అంటే... మామూలు విషయం కాదు. పైగా వాళ్ళ దగ్గర కూడా చాలా ఆడ్వాన్సుడ్ టెక్నాలజీ ఉండడంతో... మిలిటరీ ఫ్రీక్యెన్సీ డిస్టర్బ్ అవుతోంది. మహేంద్ర డ్రగ్స్ బిజినెస్ ఆపడం చాలా ఇంపార్టెంట్.

అవినాష్ : ఎవరికీ తెలియని విషయం విశ్వామిత్ర కి ఎలా తెలిసింది?

మాధవ్ : నీకు విశ్వామిత్ర గురించి ఏమి తెలుసు?

అవినాష్ : విశ్వామిత్ర ఒక టెక్నాక్రాట్... ఎథికల్ హకెర్... బ్రిలియెంట్ మైండ్...

మాధవ్ : కనీసం ఇప్పుడైనా నీకు విశ్వామిత్ర గురించి చెప్పాలి... విశ్వామిత్ర అసలు పేరు గిరీశం. కేంబ్రిడ్జి యూనివర్సిటీ స్కాలార్... పెద్ద క్రిప్టాలజీ ఎక్సపెర్ట్. టాప్ క్లాస్ కోడ్ బ్రేకర్... HUMINT... SIGINT లో స్పెషలిస్ట్. MI6 FIELD OPERATIVE.

అవినాష్ : MI6 FIELD OPERATIVE.... OH MY GOD... REALLY?

విశ్వామిత్ర : ఒకప్పుడు... ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను. MI6 కి నాకు ఎటువంటి సంభంధం లేదు. వాళ్ళ దృష్టిలో నేను 7 జులై 2005 లో జరిగిన లండన్ బాంబింగ్స్ లో చనిపోయాను.

మాధవ్ : ఆ విషయం MI6 నమ్మడం లేదు. వాళ్ళు ఇప్పటికి నిన్ను వెతుకుతున్నారు. నువ్వు ఎదో ఒకరోజు వాళ్లకి దొరుకుతావు. ONCE A SPY IS ALWAYS A SPY... NO RETIREMENT.

విశ్వామిత్ర : ఇప్పుడు నేను ఎక్కువగా SIGINT సంపాదిస్తాను. IN SPY BUSINESS INFORMATION IS KNOWLEDGE... KNOWLEDGE IS POWER. ఎవరి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్... ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది.

అవినాష్ : నమ్మలేక పోతున్నా.... ఇన్నాళ్లు నేను నిన్ను ఒక TECHIE అనుకున్నా... OMG... నిన్ను ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా...

విశ్వామిత్ర : ఉంది. రెండు విషయాలు జరగవొచ్చు. 1. నన్ను ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి HIGH TREASON కింద జైలు కి పంపొచ్చు. 2. ఎవరికీ చెప్పకుండా మాధవ్ నన్ను తన కస్టడీ లోకి తీసుకొని అన్ని రకాలుగా హింసించి నా బుర్రలో ఉన్న ఇన్ఫర్మేషన్ లాగేసి నన్ను చంపేసి రోడ్ మీద పడెయ్యొచ్చు. మహేంద్ర విషయానికొస్తే... మీకు నచ్చినా... నచ్చకపోయినా... మీరు ఒప్పుకున్నా... లేకపోయినా... కొద్ది రోజుల్లో... మహేంద్ర డ్రగ్ ఫార్మ్స్ ని లేపేస్తాను. నాకు తోచిన పద్దతిలో వాటిని లేపేస్తాను.

మాధవ్ : ఎట్టి పరిస్థితిలోనూ ఫారిన్ మెర్సనరీస్ ని ఇండియా లో అడుగుపెట్టనివ్వను. నేనే వాళ్ళని లేపేస్తాను.

విశ్వామిత్ర : వాళ్ళు ఇండియా లోకి రారు. నా గారంటీ...

మాధవ్ : నువ్వు ఏమి చేసినా మాకు చెప్పి చెప్పి మా ముందు కూర్చొని చెయ్యాలి. నువ్వు చేసే ప్రతి పని నేను గమనిస్తాను. ఈ పని చెయ్యడానికి ఏమి కావాలో చెప్పు... ఏర్పాటు చేస్తాను. BUT... YOU ARE NOT MOVING OUT OF THIS HOUSE WITHOUT MY PERMISSION.

విశ్వామిత్ర : నాకు కొత్త లాప్ టాప్... సెక్యూర్ కనెక్షన్...VPN... కావాలి. ఇప్పుడే కాంట్రాక్టర్స్ తో మీ ముందే డీల్ క్లోజ్ చేస్తాను.

మాధవ్ వెంటనే విశ్వామిత్ర కి కావాల్సిన హార్డ్ వేర్ ఆరెంజ్ చేసాడు. విశ్వామిత్ర కొత్త లాప్ టాప్ ని తనకి కావాల్సిన విధం గా ఫార్మాట్ చేసుకొని అందులో డార్క్ వెబ్ ని యాక్సిస్ చెయ్యడానికి కావాల్సిన వెబ్ బ్రౌసర్ ని ఇన్స్టాల్ చేసాడు.

ఇంటర్నెట్ లో మూడు లేయర్స్ లో ఉంటాయి. 1. SURFACE WEB -- ప్రపంచం లో అందరూ ఇంటర్నెట్ ని గూగుల్... బింగ్... యాహు... వెబ్ బ్రౌజర్స్ వాడి యాక్సిస్ చేసుకుంటారు. SURFACE WEB కిందకి వెళితే DEEP WEB... ఇది ఒక SPIRAL STAIR CASE లాంటింది. కిందకి వెళ్ళినకొద్దీ... జనరల్ పబ్లిక్ కి దొరకని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇలా కిందకి వెళ్లడాన్ని DIGGING DEEP అంటారు. దాన్నే DEEP WEB అంటారు. ఈ SURFACE WEB... DEEP WEB దాటి వెళితే DARK WEB ఉంటుంది. డార్క్ వెబ్ లో 100% ఇల్లీగల్ పనులే జరుగుతాయి. అక్కడ దొరకని ఇన్ఫర్మేషన్... ప్రొడక్ట్స్... అంటూ ఉండవు. చిత్రమేంటంటే... క్రిమినల్స్ తో పాటు గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా డార్క్ వెబ్ ని ఎక్కువ గా వాడతారు. అక్కడ జరిగే ఆక్టివిటీస్ మీద నిఘా పెడతారు. దానికోసం అన్ని దేశాల గవర్నమెంట్స్ ఎంతో ఖర్చు పెడతారు. స్టేట్ అఫ్ ఆర్ట్ టెక్నాలజీ ని వాడతారు.

విశ్వామిత్ర డార్క్ నెట్ లో కి ప్రవేశించి తనకి కావాల్సిన కాంట్రాక్టర్ ని వెతికి పట్టుకున్నాడు.

విశ్వామిత్ర : ఒక ఆపరేషన్ చెయ్యాలి. DESTRUCTION OF DRUGS MANUFACTURING FECILITIES

కాంట్రాక్టర్ : FECILITIES? HOW MANY?

విశ్వామిత్ర : 4... ఇండియా లో ఉన్నాయి.

కాంట్రాక్టర్ : ఇండియా లో ఎక్కడ?

విశ్వామిత్ర : రిమోట్ లొకేషన్స్... అడవుల్లో బాగా లోపల వున్నాయి.

కాంట్రాక్టర్ : మేము ఇండియా లో పెద్ద సిటీస్ లో మాత్రమే వెళ్లగలము. అడవుల్లోకి వెళ్లలేము. మా వాళ్లంతా యూరోపియాన్స్... ఈజీ గా దొరికిపోతాము.

విశ్వామిత్ర : మీరు రావాల్సిన పని లేదు. ఇంకొన్నాళల్లో హాంబర్గ్ నుంచి షిప్ లో కెమికల్స్ ఇండియాకి రాబోతున్నాయి. వాటిని డెస్టినేషన్ లో పేలిపోయేలా చెయ్యగలగాలి.

కాంట్రాక్టర్ : మేము అక్కడికి వెళళ్లేము కాబట్టి... రిమోట్ గా DETONATE చెయ్యాలి... 1. IED వాడాలి... 2. జర్మనీ నుంచి వస్తున్న కెమికల్స్ లో వేరే కెమికల్స్ కలపాలి.

విశ్వామిత్ర : అవును. DELAYED DETONATION.

కాంట్రాక్టర్ : ఆ కెమికల్స్ ఎక్కడ తయారవుతున్నాయి...

విశ్వామిత్ర జర్మనీ లో ఒక కంపెనీ పేరు... మహేంద్ర ఇంపోర్ట్ చేసుకుంటున్న కెమికల్స్ డీటెయిల్స్... QUANTITIES... షిప్పింగ్ డీటెయిల్స్... షిప్ డెస్టినేషన్...

కాంట్రాక్టర్ : ఓహ్... అది చాలా పెద్ద కంపెనీ. ఆ కంపెనీ లో ఎటువంటి మిక్సింగ్ చెయ్యడానికి కుదరదు. పైగా మీరు చెప్పిన కెమికల్స్ లో ఏదైనా కలిపితే... వెంటనే DETONATION జరుగుతుంది. మీకు కావాల్సిన చోట పేలాలంటే... DELAYED DETONATION ప్లాన్ చెయ్యాలి. ఈ కెమికల్స్ పెద్ద QUANTITIES లో ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒకే చోటికి వెళ్తున్నాయా?

విశ్వామిత్ర : లేదు. 4 లొకేషన్స్ కి వెళ్తాయి.

కాంట్రాక్టర్ : ముంబై పోర్ట్ నుంచి ఆ లొకేషన్స్ ఎంత దూరంలో ఉన్నాయి? LAST DESTINATION OR FARTHEST DESTINATION ఎంత దూరం?

విశ్వామిత్ర : FARTHEST DESTINATION AROUND 1400 KILOMERTES FROM MUMBAI PORT.

కాంట్రాక్టర్ : ముంబై నుంచి లాస్ట్ డెస్టినేషన్ కి చేరడానికి ఎంత టైం పడుతుంది.

విశ్వామిత్ర : 4 DAYS... MAXIMUM.

కాంట్రాక్టర్ : ముంబై పోర్ట్ లో కంటైనర్ క్లియర్ కావడానికి ఎంత టైం పడుతుంది.

విశ్వామిత్ర : MAXIMUM ONE DAY.

కాంట్రాక్టర్ : ఆ కెమికల్స్ 100 లీటర్లు కార్బాయ్ లో రవాణా అవుతున్నాయి. 80 కార్బాయ్స్ ఉన్నాయి. ఒక్కో లొకేషన్ కి 20 కార్బాయ్స్ వెళ్తున్నాయి అనుకుందాము. మా వాళ్ళు ఆ కార్బాయిస్ లో కెమికల్ గ్రాన్యూల్స్ కలుపుతారు. ఈ గ్రాన్యూల్స్ మూడు పొరలు కలిగిన ట్యూబ్స్ లో ఉంటాయి. ఆ కెమికల్స్ లో ఒక్కో పొర కరగడానికి కనీసం 72 గంటలు పడుతుంది. ఆ మూడు పొరలు కరగడానికి 216 గంటల సమయం పడుతుంది. అంటే... 9 రోజులు... ఆ తరువాత ఆ గ్రాన్యూల్స్ డైరెక్ట్ గా కెమికల్స్ లో కలిసిపోతాయి. అప్పుడు ఒక 10 నిమిషాల్లో పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఆ 20 కార్బాయ్స్ లో కెమికల్స్ పేలిపోతే కనీసం 1 కిలోమీటర్ RADIUS లో విస్పోటం జరుగుతుంది. మీ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎలాంటిది? వుడెన్ స్ట్రక్చర్... కాంక్రీట్ స్ట్రక్చర్...

విశ్వామిత్ర : వుడెన్ స్ట్రక్చర్...

కాంట్రాక్టర్ : వెరీ గుడ్. ఆ కెమికల్స్ పేలితే ఆ వుడెన్ స్ట్రక్చర్ మొత్తం కాలిపోతుంది. అక్కడున్న డ్రగ్స్ కూడా కాలిపోతాయి. మావాళ్లు ఆ కార్బాయ్స్ లో గ్రాన్యూల్స్ వున్న ట్యూబ్స్ ని వెయ్యగానే మీకు నేను మెసేజ్ పంపుతాను. అప్పటినుంచి మీకు 216 గంటల సమయం మాత్రమే ఉంటుంది.

విశ్వామిత్ర : మీ వాళ్ళు ఎలా కలుపుతారు? ఎక్కడ కలుపుతారు?

కాంట్రాక్టర్ : అది మా ట్రేడ్ సీక్రెట్... ఇది చాలా కాస్టలీ కాంట్రాక్టు. చాలా ఖర్చు అవుతుంది. 100% అడ్వాన్స్ పేమెంట్...

విశ్వామిత్ర : ఎంతవుతుంది?

కాంట్రాక్టర్ ఒక అమౌంట్ చెప్పి "అమెరికన్ డాల్లర్స్..." అని అన్నాడు.

విశ్వామిత్ర : నేను మీకు ఒక బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తాను... ఆ అకౌంట్ కి ఇంటర్నెట్ ID... పాసువర్డ్... నీకు ఇమెయిల్ చేస్తాను. నువ్వే ఆకౌంట్ ని చెక్ చేసుకొని అందులో అమౌంట్ నీకు నచ్చితే కాంట్రాక్టు కి ఒప్పుకో... లేదంటే వేరే వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను.

కాంట్రాక్టర్ : అబంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించు.... చెక్ చేసి చెప్తాను.

విశ్వామిత్ర వెంటనే మహేంద్ర కి సంబందించిన ఒక అఫ్ షోర్ బ్యాంకు అకౌంట్ ఇంటర్నెట్ ID పాసువర్డ్ ని ఆ కాంట్రాక్టర్ కి పంపాడు. ఆ కాంట్రాక్టర్ ఆ అకౌంట్ ని చెక్ చేసి అందులో బాలన్స్ చెక్ చేసి...

కాంట్రాక్టర్ : WOW... BIG AMOUNT... ఐ విల్ టేక్ అప్ థిస్ జాబ్... ఆ షిప్ డీటెయిల్స్ పంపించు...

విశ్వామిత్ర మర్చంట్ వెస్సెల్ నెంబర్... నేమ్... కంటైనర్ నెంబర్... ఇన్వాయిస్ కాపీస్... అన్ని డాకుమెంట్స్ పంపాడు.

కాంట్రాక్టర్ : OH... ఇంకో మూడు రోజుల్లో షిప్ హాంబర్గ్ నుంచి బయలుదేరుతుంది. అది 17 రోజుల్లో ముంబై చేరుకుంటుంది. నేను మీకు మా వాళ్ళు పని పూర్తి చెయ్యగానే ఒక మెసేజ్ పంపిస్తాను. అప్పటినుంచి 216 గంటల సమయం ఉంటుంది.

విశ్వామిత్ర : SOUNDS GREAT... ఆ బ్యాంకు అకౌంట్ నీదే... నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో... పని మాత్రం కావాలి.

కాంట్రాక్టర్ : DONT WORRY.... ఒకవేళ పని కాకపోతే... నన్ను కాంటాక్ట్ చెయ్యి... మనీ రిటర్న్ చేస్తాను. పని అవుతుంది. WAIT FOR MY MESSAGE.

విశ్వామిత్ర కనెక్షన్ వెంటనే టెర్మినేట్ చేసేసాడు. ఆ లాప్ టాప్ ని క్లోజ్ చేసి మాధవ్ కి ఇస్తూ "THE COUNTDOWN BEGINS" అని అన్నాడు...


Part - 27 - The Shipment

విశ్వామిత్ర తో మాట్లాడి కాంట్రాక్టు తీసుకున్న వెంటనే డార్క్ నెట్ కాంట్రాక్టర్... హాంబర్గ్ నగరం లో తనకు బాగా నమ్మకమైన ఫ్రెండ్ హెర్మన్ వోగెల్ తో మాట్లాడాడు... హెర్మన్ ఒక మర్చంట్ నేవీ క్రూ మేనేజిమెంట్ కంపెనీ ఓనర్. హెర్మన్ చాలా షిప్పింగ్ కంపెనీస్ కి ఎంప్లాయిస్ ని సప్లై చేస్తాడు. తన ఫ్రెండ్ అడిగిన పని చాలా సెన్సిటివ్ అని అర్ధమయ్యింది... ఆ పని చెయ్యడానికి చాలా నైపుణ్యం కలిగిన స్పెషలిస్ట్ డెక్ క్రూ మెంబెర్స్ కోసం తన డేటా బేస్ మొత్తం వెతికాడు. కొంచం కష్టపడాల్సి వచ్చింది. కెమికల్స్ గురించి నాలెడ్జి బాగా ఉన్న మర్చంట్ నేవీ క్రూ మెంబర్స్ కోసం తన ఫ్రెండ్స్ ని కూడా సహాయం అడిగాడు. చివరికి  అయిదుగురు దొరికారు. ఆ అయిదుగురు మహేంద్ర కొన్న కెమికల్స్ తీసుకొని వెళ్తున్న మర్చంట్ వెస్సెల్ హానోవర్ క్రూ లో పనిచేస్తున్నారు. ఆ షిప్ హాంబర్గ్ నుంచి బయలుదేరడానికి పెద్దగా సమయం లేదు... హెర్మన్ ఆ అయిదుగురిని పర్సనల్ గా కలిసి షిప్ లో చెయ్యాల్సిన పని చాలా వివరంగా చెప్పాడు... వాళ్ళు హెర్మన్ ని చాల ప్రశ్నలు వేశారు... ఆ కెమికల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు... ఆ పని పూర్తి చెయ్యడానికి కావాల్సిన పరికరాల లిస్ట్ వ్రాసి హెర్మన్ కి ఇచ్చారు... చివరికి ఆ పని చెయ్యడానికి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు. హెర్మన్ వాళ్లకి వెంటనే ఆ అమౌంట్ ని వాళ్ళ బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేసాడు. షిప్ బయలుదేరడానికి ఓకే ఆరోజు ముందు ఆ ఐదుగురికి కావలసిన పరికరాలు... కెమికల్ గ్రాన్యూల్స్ ఉన్న ట్యూబ్స్ ని  అందించాడు. వాళ్లకి ఖచ్చితంగా ఏ రోజున కెమికల్ కార్బాయ్స్ లో  గ్రాన్యూల్స్ ట్యూబ్స్ ని వెయ్యాలో మరీ మరీ చెప్పాడు. " మీరు ఈ ట్యూబ్స్ ని ఆ కార్బాయ్స్ లో వెయ్యగానే నాకు మెసేజ్ పంపాలి... ఇది వెరీ ఇంపార్టెంట్... కార్బొయ్ లో ట్యూబ్స్ పడ్డ మరుక్షణం కౌట్ డౌన్ మొదలవుతుంది... నా కస్టమర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. కౌంట్ డౌన్ టైం వాళ్లకి చాలా ఇంపార్టెంట్... " అని చెప్పాడు. ఆ అయిదుగురు మౌనంగా తలూపారు..

మర్చంట్ వెస్సెల్ హానోవర్ ఒక కంటైనర్ షిప్... అందులో 20 ఫీట్... 40 ఫీట్ కంటైనర్లు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. షిప్ డెక్ మీద ముందుగా రెండు 20 ఫీట్ కంటైనర్లు పక్కపక్కనే లోడ్ చేస్తారు. వాటి మీద 40 ఫీట్ కంటైనర్లు లోడ్ చేస్తారు. హెర్మన్ క్రూ మెంబెర్స్ ఐదుగురు తమకిచ్చిన టూల్స్... కెమికల్ గ్రాన్యూల్స్ ట్యూబ్స్ ని ఎవరికి అనుమానం రాకుండా తమ క్రూ చెస్ట్ తో పాటు షిప్ లోకి చేర్చారు. హెర్మన్ వాళ్లకి కంటైనర్ నెంబర్... పంపించాడు. హెర్మన్ క్రూ లీడర్ షిప్ ఎక్కగానే ఆ కంటైనర్ ఎక్కడుందో వెతికాడు. ప్రతి షిప్ ముందు భాగాన్ని BOW అంటారు...షిప్ వెనుక భాగాన్ని STERN అంటారు... BOW  మరియు STERN మధ్యలో వుండే ఖాళీ భాగాన్ని DECK అంటారు... DECK కింద షిప్ లోపలి భాగాన్ని HULL అని అంటారు... DECK మధ్యలో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది... దాన్ని BRIDGE అని అంటారు... అక్కడనుండి షిప్ ని నావిగేట్ చేస్తారు... DECK మీద BRIDGE కి ముందు... వెనుక... కంటైనెర్స్ ని పెడతారు. షిప్ ముందు భాగం... షిప్ ముందుకు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ భాగాన్ని PORT సైడ్ అని అంటారు... లెఫ్ట్ సైడ్ భాగాన్ని STARBOARD సైడ్ అని అంటారు. మర్చంట్ వెస్సెల్ హానోవర్ 14500 కంటైనెర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయగలదు...  మహింద్ర కొన్న కెమికల్స్ వున్న కంటైనర్ ని STERN కి దగ్గరలో మూడో అంతస్తులో లోడ్ చేశారు...   మహేంద్ర ఇంపోర్ట్ చేసుకుంటున్న కెమికల్స్ లోడ్ చేసి ఉన్న కంటైనర్ 40 ఫీట్ పొడుగూ... 8 అడుగుల వెడల్పు... 8.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ కంటైనర్ లో గోడలకి ఆనించి కార్బాయ్స్ ని లోడ్ చేశారు. అవి కదలకుండా నీట్ గా బెల్ట్ తో కట్టారు. ఆ కంటైనర్ లో మొత్తం 80 కార్బాయ్స్ ఉన్నాయి. ప్రతి కార్బాయ్ మీద కంపెనీ స్టిక్కర్స్ ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ సీల్ కూడా ఉంది. డెక్ మీద ముందుగా రెండు 20 ఫీట్ కంటైనర్లు ఉన్నాయి. వాటి మీద మూడో అంతస్తులో అన్నిటికన్నా పైన మహేంద్ర కి చెందిన కంటైనర్ ని లోడ్ చేశారు. హెర్మన్ క్రూ మెంబెర్స్ ఆ కంటైనర్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేశారు. మర్చంట్ వెస్సెల్ హానోవర్ కి క్రూ కి HULL ఏరియా లో స్లీపింగ్ రూమ్స్... మెస్ రూమ్... చిన్న లైబ్రరీ... టీవీ రూమ్ ఉన్నాయి. హెర్మన్ క్రూ మెంబెర్స్ రెగ్యులర్ గా డిన్నర్ తరువాత లైబ్రరీ రూమ్ లో కలిసి తాము చెయ్యబోయే ఆపరేషన్ ని ప్లాన్ చెయ్యాలని డిసైడ్ చేసుకున్నారు.

హాంబర్గ్ పోర్ట్ ఎల్బే నది మీద ఉంది. మర్చంట్ వెస్సెల్ హానోవర్ టైం ప్రకారం బయలుదేరి ఎల్బే నదిలోకి ప్రవేశించింది. గంటకి 10 నాటికల్ మైల్స్ వేగంతో ప్రయాణిస్తూ నార్త్ సీ లో కి ప్రవేశించింది. నార్త్ సి ద్వారా దాదాపు 800 కిలోమీటర్స్ ప్రయాణం చేసి ఇంగ్లీష్ ఛానల్ చేరుకొని  వేగంగా ప్రయాణిస్తూ... నార్త్ అట్లాంటిక్ మహాసముద్రం చేరింది. అక్కడి నుంచి గంటకి 25 నాటికల్ మైల్స్ వేగంతో జిబ్రాల్టర్ జలసంధి ని చేరుకుంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం తో ప్రయాణం సాఫీగా సాగుతోంది. అప్పటికి హెర్మన్ క్రూ తమ ప్లాన్ ఫైనలైజ్ చేసుకున్నారు. తమకిచ్చిన పనిని పూర్తి చేయడానికి సరైన రోజు ఎన్నుకున్నారు. మర్చంట్ వెస్సెల్ హానోవర్ మెడిటరేనియన్ సముద్రం దాటి నైల్ నది లోకి ప్రవేశించింది. షిప్ సుయెజ్ కెనాల్ దాటే లోపల పని పూర్తి అవ్వాలి. ఆ రాత్రి 2 గంటల సమయంలో హెర్మన్ క్రూ ఎవరికంతా పడకుండా షిప్ డెక్ మీదకి చేరుకొని STERN వైపుకు వెళ్లారు. అందరూ నల్లటి బట్టలు వేసుకున్నారు. అందరి చేతుల్లో కంటైనర్లు ఎక్కడానికి కావాల్సిన SUCTION CUPS ఉన్నాయి. వాళ్ళ భుజాన నల్లటి నైలాన్ రోప్స్ కూడా ఉన్నాయి. SUCTION CUPS సహాయంతో ఆ అయిదుగురు చాలా సులువుగా 36 అడుగుల ఎత్తు ఎక్కి మహేంద్ర కి చెందిన కెమికల్స్ కంటైనర్ మీద కూర్చున్నారు

ఆ ఐదుగురిలో సన్నగా... తక్కువ బరువుతో ఉన్న ఒకడి నడుముకి నైలాన్ రోప్ కట్టి నెమ్మదిగా కిందకి దింపారు. ఆ నైలాన్ రోప్ రెండో చివరికి కంటైనర్ రూఫ్ మీద అతికించిన SUCTION CUPS కట్టేశారు. సరిగ్గా కంటైనర్కి వేసిన కస్టమ్స్ సీల్ దగ్గరకి చేరగానే కంటైనర్ తలుపు మీద రెండుసార్లు కొట్టాడు. దాంతో కంటైనర్ మీదున్న వాళ్ళు అతడిని కిందకి దింపడం ఆపేసారు. అతను గాల్లో వేళ్ళాడుతూ కంటైనర్ కి హాంబర్గ్ కస్టమ్స్ వాళ్లు వేసిన సీల్ ని కట్ చేసి... నెమ్మదిగా కంటైనర్ తలుపు తెరచి లోపలికి వెళ్ళాడు. మొదటి వాడు లోపలి వెళ్ళగానే... అతని వెనకాలే అందరూ నైలాన్ రోప్ ని పట్టుకొని జాగ్రత్తగా కంటైనర్ లోకి చేరుకొని కంటైనర్ తలుపు లోపల నుంచి మూసేసారు.

కంటైనర్ లోపాలకి చేరగానే అందరూ గ్యాస్ మాస్కులు వేసుకొని నైట్ విజన్ గాగుల్స్ పెట్టుకున్నారు. కొంచం సేపు కంటైనర్ లోపల చీకటి కి కళ్ళు అలవాటు పడేదాకా కలకుండా 10 నిమిషాలు నుంచున్నారు. ఇప్పుడు వాళ్లకి కంటైనర్ లోపల క్లియర్ గా కనిపిస్తోంది.  ముందుగా నిర్ణయించున్న విధంగా... మొదటి వాడు కార్బాయ్స్ ఒక్కొక్కటి లెక్కపెడుతూ వెళ్లి 16వ నెంబర్ కార్బాయ్ దగ్గర ఆగాడు. రెండో వాడు అ 32వ కార్బాయ్ దగ్గర... మూడో వాడు 48వ కార్బాయ్ దగ్గర... నాలుగో వాడు 64 కార్బాయ్ దగ్గర... చివరి వాడు 80వ కార్బాయ్ దగ్గర ఆగారు... అంటే ఒక్కొక్కరూ 16 కార్బాయ్స్ లో ఒకే టైం లో గ్రాన్యూల్స్ ట్యూబ్స్ ని వెయ్యాలి.

స్టెప్ 1. అందరూ కార్బాయ్ కి అంటించిన ప్రోడక్ట్ స్టికర్ ని జాగ్రత్త చిరగకుండా సగానికి పైగా పైకి లేపారు...

స్టెప్ 2. తమతోపాటు తెచ్చుకున్న డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ తో 2 ఇంచెస్ డయామీటర్ లో చాలా జాగ్రత్తగా  గుండ్రంగా డ్రిల్ల్ చేశారు... అందరూ కలసి ఆ 80 కార్బాయ్స్ ని డ్రిల్లింగ్ చేయడం పూర్తి చేశారు.

స్టెప్ 3. స్క్రూ డ్రైవర్ వాడి ఆ డ్రిల్ల్ చేసిన పోర్షన్ ని మూడొంతులు పైకి లేపారు. ఒక్కసారిగా భయంకరమైన కెమికల్ వాసన వేసింది. వాళ్ళు మొహానికి గ్యాస్ మాస్క్ పెట్టుకోవడంతో వాళ్లకి అంతగా తెలియలేదు... నార్మల్ గా అయితే ఆ కెమికల్ స్మెల్ కి కళ్ళు తిరిగి పడిపోతారు... ప్రాణాలు పోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు... అందుకే వాళ్లంతా పెద్ద ఎత్తున డబ్బులు అడిగారు...

స్టెప్ 4: హెర్మన్ర్ క్రూ లీడర్ అందరూ చూస్తుండగా 60 సెకండ్స్ టైమర్ సెట్ చేసాడు. అది స్టార్ట్ కాగానే వాళ్ళు ఏమాత్రం ఖంగారు పడకుండా ఒక నిమిషం టైం లో ఒక్కొక్కళ్ళు తమకి అలాట్ చేసిన 16 కార్బాయ్స్ లోకి కెమికల్ గ్రాన్యూల్స్ ట్యూబ్స్ ని చాలా జాగ్రత్తగా వదిలారు. మొత్తం 80 కార్బాయ్స్ ట్యూబ్స్ ని వొదలడానికి 52 సెకండ్స్ పట్టింది.

స్టెప్ 5: హెర్మన్ క్రూ లీడర్ వెంటనే తమ మొబైల్ ఫోన్ లో హెర్మన్ కి "DONE" అని మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ కోసమే హాంబర్గ్ లో ఎదురు చూస్తున్న హెర్మన్ వోగెల్ వెంటనే తన కాంట్రాక్టర్ ఫ్రెండ్ కి "215" అని ఒక మెసేజ్పంపాడు. అంటే... 215 గంటల కౌంట్ డౌన్ మొదలయ్యింది అని అర్ధం. కాంట్రాక్టర్ ఆ మెసేజ్ విశ్వామిత్ర కి పంపాడు. విశ్వామిత్ర దాన్ని రవీంద్ర... మాధవ్... అవినాష్ కి ఫార్వర్డ్ చేసాడు.

స్టెప్ 6: కార్బాయ్స్ లో ట్యూబ్స్ వెయ్యడం పూర్తికాగానే... వాళ్ళు లాస్ట్ స్టెప్... ఆ కార్బాయ్స్ ని ఒక్కొక్కటిగా డ్రిల్ల్ చేసిన పోర్షన్ ని సీలింగ్ సొల్యూషన్ తో క్లోజ్ చేసేసి దాని మీదున్న ప్రోడక్ట్ స్టిక్కర్ ని యథాస్థానానికి అంటించేసేసారు. ఇప్పుడు ఆ కార్బాయ్స్ ని టాంపర్ చేసిన గుర్తులు కనిపించలేదు.

పని పూర్తి కాగానే ఒకరి తరువాత ఒకరు గా నైలాన్ రోప్ పట్టుకొని కంటైనర్ మీదకి చేరుకున్నారు. చివరిగా సన్నటి వ్యక్తి  నైలాన్ రోప్ పట్టుకొని సగం పైకి ఎగబాకి కంటైనర్ ని లాక్ చేసి హెర్మన్ వోగెల్ ఇచ్చిన హాంబర్గ్ కస్టమ్స్ సీల్ ని ఆ కంటైనర్ కి వేసి పైకి చేరుకున్నాడు. అందరూ కంటైనర్ పైకి చేరుకొని చాలా సేపు ఆ కంటైనర్ మీద ఎల్లికలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ ఉండి పోయారు... ఆకాశం లో ఆ సమయం లో ఎటువంటి మేఘాలు లేకపోవడం తో ఆకాశంలో నక్షత్రాలు చాలా క్లియర్ గా కనిపించాయి... చూడడానికి ఆ దృశ్యం చాలా అద్భుతం గా ఉంది. తెల్లవారు ఝామున వాళ్ళందరూ ఒకరి తరువాత ఒకరు నెమ్మదిగా ఆ కంటైనర్ ని దిగి కిందకి వచ్చి వాళ్ళు వేసుకున్న స్పెషల్ సూట్స్... బూట్స్... గాగుల్స్... గ్యాస్ మాస్కులు... నైలాన్ రోప్స్... SUCTION CUPS... అన్నింటిని ఒక్కొక్కటిగా షిప్ వెనక భాగం STERN నుంచి సముద్రంలోకి విసిరేశారు. సరిగ్గా అప్పుడే మర్చంట్ వెస్సెల్ హానోవర్ సుయెజ్ కెనాల్ లోకి ప్రవేశించింది.  సుయెజ్ కెనాల్ మెడిటరేనియన్ మరియు ఎర్ర సముద్రాలను కలుపుతుంది... ఈ కాలువ పొడుగు 194 కిలోమీటర్స్... సుయెజ్ కెనాల్ అథారిటీ దీని నిర్వహణ కార్యక్రమాలు చూస్తూ ఉంటుంది. ఈ కాలువ దాటే ప్రతి షిప్ టోల్ టాక్స్ కడతారు...

తెల్లారింది... ఆ రోజు హెర్మన్ క్రూ లేచేటప్పటికి బాగా తెల్లారిపోయింది... క్రూ లీడర్ నిద్రలో ఉండగా అతని మొబైల్ ఫోన్ మోగింది... హెర్మన్ వోగెల్... ఫోన్ చేశాడు... క్రూ లీడర్ ఫోన్ లో "హలో" అన్నాడు... అంతే... అవతలివైపు నుంచి హెర్మన్ చాలా ఖంగారుగా జర్మన్ లాంగ్వేజ్ లో గట్టిగా అరవసాగాడు... ముందు హెర్మన్ ఏమి చెప్తున్నాడో క్రూ లీడర్ కి అర్ధం కాలేదు... హెర్మన్ మళ్ళీ ఇంకోసారి నెమ్మదిగా చెప్పాడు... అది విన్న వెంటనే క్రూ లీడర్ పక్కలో బాంబు చూసినట్లు కంగారుపడి... ఒక్క ఉదుటున బంక్ బెడ్ మీద నుంచి కిందికి దూకి చుట్టూ చూసాడు... ఎవ్వరూ లేరు. స్లీపింగ్ రూమ్ అంతా ఖాళీగా ఉంది. అదిరే గుండెల తో  అతి వేగంగా షిప్ డెక్ మీద కి వెళ్ళాడు. షిప్ క్రూ మొత్తం... కెప్టెన్ తో సహా అందరూ STERN దగ్గర గుమిగూడి బైనాక్యులర్స్ లో చూస్తున్నారు. క్రూ లీడర్ కి తన గుండె చప్పుడు చాలా క్లియర్ గా వినపడుతోంది... అతి వేగంగా కొట్టుకుంటోంది.

క్రూ లీడర్ నెమ్మదిగా STREN చేరుకొని తను కూడా అందరూ చూస్తున్న వైపు చూసాడు... ఒక FURLONG దూరంలో ఒక షిప్ అడ్డం తిరిగింది... దాని పేరు మర్చంట్ వెస్సెల్ ఎవర్ గివెన్ సుయెజ్ కెనాల్ కి అడ్డంగా తిరిగింది. ఎవర్ గివెన్ చాలా పెద్ద షిప్... రోటర్ డాం వెళ్తూండగా సుయెజ్ కెనాల్ లో సడన్ పెద్ద ఎత్తున గాలులు... డస్ట్ స్టార్మ్ రావడంతో గతి తప్పి సుయెజ్ కెనాల్ కి అడ్డంగా ఇరుక్కుపోయింది... దాంతో  సుయెజ్ కెనాల్ కి రెండు వైపులా షిప్పింగ్ ట్రాఫిక్ ఆగిపోయింది... తన పక్కనే ఉన్న ఒక సీనియర్ క్రూ మెంబెర్ ని అడిగాడు... " మన షిప్ జర్నీ టైం లో మార్పు ఉందా?" దానికి బదులుగా ఆ సీనియర్ క్రూ మెంబెర్ "రిలాక్స్... మనం జస్ట్ తప్పించుకున్నాం... ఆ షిప్ మన షిప్ ని దాటి ముందుకు వెళ్లి సుయెజ్ కెనాల్ లో ప్రవేశించగానే వాతావరణం లో మార్పు రావడంతో కంట్రోల్ తప్పి సుయెజ్ కెనాల్ కి అడ్డం గా తిరిగి ఇరుక్కుపోయింది... ఆ షిప్ కెనాల్ దాటేదాకా రెండు వైపులా షిప్స్ సుయెజ్ కెనాల్ దాటలేవు... అదృష్టవశాస్తు మనం తప్పించుకున్నాం... ఇంకాసేపట్లో రెడ్ సీ లోకి ప్రవేశిస్తున్నాం... మనం టైం ప్రకారం ముంబై పోర్ట్ చేరుకుంటాము" అని అన్నాడు. అప్పటికి కానీ... హెర్మన్ క్రూ లీడర్ కి గుండె దడ తగ్గలేదు... అక్కడే ఒక 20 నిముషాలు కూర్చొని... ఎవరూ లేని సమయం లో హెర్మన్ వోగెల్ కి ఫోన్ చేసి " WE ARE SAFE... JUST ENTERING RED SEA ..." అని చెప్పాడు.

షెడ్యూల్ ప్రకారం మర్చంట్ వెస్సెల్ హానోవర్ ముంబై పోర్ట్ చేరుకుంది. షిప్ లోంచి కంటైనర్లు దింపుతున్నారు. హెర్మన్ వోగెల్ క్రూ మెంబెర్స్ చూస్తుండగానే మహేంద్ర కంటైనర్ ని ఒక పెద్ద గ్యాంట్రీ క్రేన్ పైకి లేపింది... హెర్మన్ క్రూ మెంబెర్స్ ఐదుగురూ ప్రాణాలు ఉగ్గపట్టుకొని చూస్తున్నారు... ఒక పెద్ద గ్యాంట్రీ క్రేన్ నెమ్మదిగా ఆ కంటైనర్ ని ఒక లారీ మీదకి లోడ్ చేసింది. ఆ లారీ వాళ్ళు చూస్తుండగానే కనుమరుగయ్యింది. ఆ క్రూ లీడర్ వెంటనే ఫోన్ చేసి హెర్మన్ వోగెల్ కి చెప్పాడు... అంతా విన్న హెర్మన్ ఆ క్రూ లీడర్ తో " మీరు సుయెజ్ కెనాల్ లో ఇరుక్కొని ఉంటే... షిప్ వారం రోజులు లేట్ గా ముంబై చేరుకునేది. షిప్ ముంబై డాక్స్ చేరగానే ఆ కంటైనర్ లో కెమికల్ కార్బాయ్స్ పేలిపోయేవి. దాంతో... సగం ముంబై పోర్ట్ నాశనమయ్యేది... దాన్ని టెర్రెర్ ఎటాక్ అనుకోని ఇండియన్ ఆర్మీ... నేవీ... ఎయిర్ ఫోర్స్... ముందు వెనక చూడకుండా పాకిస్తాన్ వైపు దూసుకెళ్ళేవాళ్ళు... మీ అదృష్టం బాగుండి టైం ప్రకారం షిప్ ముంబై డాక్స్ చేరింది.. జర్మనీ 1939 లో పోలాండ్ మీద దండయాత్ర చెయ్యడం తో రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యింది... మీరు లేట్ గా ముంబై పోర్ట్ చేరివుంటే... ఇండియా మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టేది..." అని అన్నాడు.

మహేంద్ర కంటైనర్ లారీ పోర్ట్ ఏరియా దాటగానే దాని కోసమే ఎదురుచూస్తున్న మాధవ్ టీం ఆ కంటైనర్ ని ఫాలో అవుతూ గాల్లోకి చిడియాలని వొదిలారు... క్షణాల్లో ఆ కంటైనర్ లారీ మీద 15 చిడియాలు చేరాయి... గాల్లో రెండు ఈగిల్స్ ఒకదాని వెనక ఒకటి 3 కిలో మీటర్స్ దూరంలో ఎగురుతున్నాయి. వాటికి 2 కిలోమీటర్స్ దూరం లో ఒక SUV లో శాండీ వాటిని కంట్రోల్ చేస్తూ ఫాలో అవుతున్నాడు.


Part - 28 - The Confiscation

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో... NCB యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆధీనం లో పనిచేసే ఏజెన్సీ. 1986 లో దీనిని స్థాపించడం జరిగింది. ఈ ఏజెన్సీ ముఖ్యఉద్దేశ్యం... దేశం లో NARCOTIC DRUGS AND PSYCHOTROPIC SUBSTANCES ACT కింద ఎక్కడైనా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతూంటే పట్టుకోవడం. ఇందులో పనిచేసే వాళ్ళు ఎక్కువగా INDIAN REVENUE SERVICE... INDIAN POLICE SERVICE... PARAMILITARY SERVICES ద్వారా చేరతారు. కొంతమందిని డైరెక్ట్ గా కూడా రిక్రూట్ చేసుకుంటారు. NCB కి వేరే డిపార్టుమెంట్స్... CUSTOMS AND CENTRAL EXCISE... STATE POLICE DEPARTMENT... CBI... CENTRAL ECONOMIC INTELLIGENCE BUREAU... INTELLIGENCE BUREAU... కూడా సహాయం చేస్తాయి. ఆ రోజు NCB DIRECTOR న్యూ ఢిల్లీ లో NORTH BLOCK లో హోమ్ సెక్రటరీ తో ఒక రివ్యూ మీటింగ్ కి వచ్చాడు.

హోమ్ సెక్రటరీ : దేశం లో డ్రగ్స్ చాలా విరివిగా చలామణి అవుతున్నాయని ఇంటలిజెన్స్ రిపోర్ట్. అన్ని మెట్రో సిటీస్... A, B గ్రేడ్ సిటీస్ లో జనాలు డ్రగ్స్ కి బాగా అలవాటు పడ్డారు. పంజాబ్ లో చాలా సిటీస్ లో స్టూడెంట్స్... హౌస్ వైవ్స్... డ్రగ్స్ వాడుతున్నారు.

NCB డైరెక్టర్ : మేము చాలా కష్టపడుతున్నాం... సిట్యుయేషన్ చాలా కాంప్లెక్స్... కంప్లికేటెడ్ గా ఉంది. లోకల్ పోలీస్... చిన్న సైజు పొలిటిషన్స్ ఈ డ్రగ్స్ బిజినెస్ ని నడుపుతున్నారు. ఇది వరకు ఈ డ్రగ్స్ ఎక్కడనుంచి వస్తున్నాయో ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు అలా కాదు. రకరకాల దారుల్లో వస్తున్నాయి. బస్సుల్లో... రైళ్లలో... షిప్స్... ఇప్పుడు ఫ్లైట్స్ లో కూడా చిన్న చిన్న మొత్తాల్లో తీసుకొని వస్తున్నారు. మీరు నమ్ముతారో లేదో.... ముంబై లో MIGRANT CONSTRUCTION వర్కర్స్ చాలా మంది UP... బీహార్... ఒడిశా... ఆంధ్ర ప్రదేశ్ నుంచి డ్రగ్స్ ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళు MULES లాగా ఉపయోగపడుతున్నారు. చాలా కష్టం గా ఉంది. సరైన ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. మొన్న మార్చ్ 5 న మినికాయ్ దీవిదగ్గర ఒక షిప్ ని మన నేవీ ఆపింది... అందులో 200 కిలోల హెరాయిన్... 60 కిలోల హషిష్ తీసుకొని వచ్చారు. కోస్ట్ గార్డ్స్ ని చూడగానే JETTISON చేసేసారు. మార్చ్ 18 న ఇంకో షిప్ ని ఆపారు... అందులో RS. 3000 కోట్ల విలువగల డ్రగ్స్... 5 AK 47 అస్సౌల్త్ రైఫిల్స్... 1000 రౌండ్స్ అమ్మూనిటిన్... దొరికాయి... ఈ షిప్స్ రెండూ కొలంబో దగ్గరున్న CHILAW... TANGALLE నుంచి వచ్చాయి. వీళ్ళు లక్షదీవుల్ని వాళ్ళ డ్రగ్స్ మార్కెట్ కి ఒక సెంట్రల్ ప్లేస్ లాగా వాడుతున్నారని అనుమానం. నవంబర్ 2020 నుంచి మార్చ్ 2021 వరకు పట్టుపడ్డ డ్రగ్స్ విలువ దాదాపు RS.5000 కోట్ల పైనే ఉంటుంది. లక్షద్వీప్ 2021 - 2022 బడ్జెట్ ఆలోకేషన్ RS. 1350 కోట్లు మాత్రమే... ఇదే కాక మన దేశం లో కూడా చాలా చోట్ల డ్రగ్స్ పట్టుపడుతున్నాయి. మేము చాలా అలెర్ట్ గా వున్నా కూడా డ్రగ్ కార్టెల్ కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. వీళ్ళని అదుపులోకి తేవాలంటే... ఒక పెద్ద ఆపరేషన్ జరగాలి. అప్పుడే ఏదైనా కొంత ప్రయోజనం ఉంటుంది.

హోమ్ సెక్రటరీ : మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా?

NCB డైరెక్టర్ : కాంక్రీట్ ప్లాన్ అంటూ ఏది లేదు. మాకు దొరికిన ఇంటలిజెన్స్ ని వాలిడేట్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాము.

హోమ్ సెక్రటరీ ఒక తన ముందున్న పాడ్ లోంచి ఒక పేపర్ ని సగానికి చింపి దాని మీద " TALK TO RAVINDRA" అని వ్రాసి NCB డైరెక్టర్ కి చూపించి వెంటనే ఆ కాగితాన్ని సిగరెట్ లైటర్ తో కాల్చేశాడు.

హోమ్ సెక్రటరీ : మీరు సాధ్యమైనంత త్వరగా ఏదైనా చెయ్యండి. ఇది చాలా సీరియస్ విషయం.

NCB డైరెక్టర్ మీటింగ్ పూర్తి అయ్యాక నార్త్ బ్లాక్ నుంచి బయలుదేరి తన ఆఫీస్ కి వచ్చాడు. దారిలో రవీంద్ర కి ఒక మెసేజ్ పంపాడు. " CAN WE MEET URGENTLY?" ఆ మెసేజ్ వెళ్లిన రెండు నిమిషాల్లో రవీంద్ర దగ్గరనుంచి ఒక లొకేషన్ లింక్ వచ్చింది. NCB డైరెక్టర్ ఆ లింక్ ని ఆన్ చేసి తన డ్రైవర్ కి డ్రైవింగ్ డైరెక్షన్స్ ఇవ్వసాగాడు. కన్నాట్ ప్లేస్... రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర రవీంద్ర కార్ లో వెయిట్ చేస్తున్నాడు. NCB డైరెక్టర్ తన కార్ దిగి నడుచుకుంటూ వెళ్లి రవీంద్ర కార్ ఎక్కాడు. రవీంద్ర కార్ ని నడపసాగాడు. కార్ లో వాళ్లిద్దరే ఉన్నారు. వాళ్ళ వెనక NCB డైరెక్టర్ కార్ వస్తోంది.

NCB డైరెక్టర్ : హోమ్ సెక్రటరీ నన్ను మీతో మాట్లాడమని చెప్పాడు.

రవీంద్ర : మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో భారీ ఎత్తున డ్రగ్స్ రవాణా కాబోతున్నాయి. మీ దగ్గర బాగా నమ్మకమైన ఆఫీసర్స్ ఎంత మంది ఉన్నారు?

NCB డైరెక్టర్ : ఉన్నారు. ఒక 20 మంది దాకా ఉంటారు.

రవీంద్ర : మీకు 14 మంది అతి నమ్మకస్తులు కావాలి. వెంటనే వాళ్ళని అలర్ట్ చెయ్యండి. మీకు పెద్దగా టైం ఉండకపోవచ్చు.

NCB డైరెక్టర్ : ఏ స్టేట్ లో డ్రగ్స్ మూవ్ అవుతున్నాయో చెప్తే.. ఆ స్టేట్ పోలీస్ డిపార్టుమెంటు ని అలెర్ట్ చేస్తాను.

రవీంద్ర : నో... నో లోకల్ పోలీస్... మీకు పారామిలటరీ కావాలి. బ్రిగేడియర్ మాధవ్ మీకు కావాల్సిన టీమ్స్ ని రెడీ గా ఉంచుతాడు. మీకు 3 - 6 గంటలు మించి ఎక్కువ సమయం దొరక్కపోవొచ్చు. మీకు నేను ఏ లొకేషన్స్ లో ఈ డ్రగ్స్ దొరుకుతాయో చెప్తాను. అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూండగా... దారిలో మీరు వాటిని కాన్ఫిస్కేట్ చెయ్యాలి.

రవీంద్ర వెనక సీట్ లో ఉన్న ఒక ఫోల్డర్ ని NCB డైరెక్టర్ కి ఇచ్చాడు.

రవీంద్ర : ఈ ఫోల్డర్ లో 14 లొకేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. మహారాష్ట్ర... తెలంగాణ... ఆంధ్ర ప్రదేశ్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ 14 లొకేషన్స్ ఉన్నాయి. మీకు బాగా నమ్మకమైన వాళ్ళని ఈ ఆపరేషన్ కి వాడండి. అన్నిచోట్లా ఒకేసారి రైడ్ జరగాలి. ఏమాత్రం తేడా వచ్చినా... అన్ని లొకేషన్స్ అలెర్ట్ అవుతారు. ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది.

NCB డైరెక్టర్ ఆ లిస్ట్ ని చాలా జాగ్రత్తగా చదివి...

NCB డైరెక్టర్ : ఇంత డిటైల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా దొరికింది?

రవీంద్ర : అది కాన్ఫిడెన్షియల్. మా సోర్స్ ని మీకు చెప్పలేము. ఇంకో సంగతి... మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వలేదు. THIS MEETING NEVER TOOK PLACE. మీరు ఆ లొకేషన్స్ లో మీవాళ్ళని ఇంకో రెండు రోజుల్లో రెడీ గా ఉండమని చెప్పండి. ఆపరేషన్ కి రెండు గంటల ముందు మీకు పారామిలటరీ బలగాలు వచ్చి చేరతాయి. మీకు ఏ ఏ లొకేషన్ లో... ఏ ఏ వెహికల్ లో ఈ డ్రగ్స్ టాన్స్పోర్టు అవుతున్నాయో... వాటిలో ఎంత మంది మనుషులు ఉంటారు? వాళ్ళ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి? ఇలాంటి డీటెయిల్స్ మేము పారామిలటరీ ఫోర్సెస్ కి అందేలా చేస్తాము. మీరు ఆ డ్రగ్స్ ని పట్టుకొనే టైం కి టీవీ... మీడియా ని అక్కడికి వచ్చేలా చేస్తాము. మీరు కాన్ఫిస్కేట్ చేస్తున్న దృశ్యాలు దేశం మొత్తం తెలిసేలా చేస్తాము. మీరు మాత్రం గ్రౌండ్ లెవెల్ లో ఎటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి.

NCB డైరెక్టర్ : డ్రగ్స్ ఏమాత్రం దొరకవొచ్చు?

రవీంద్ర : మీకు ఈ మధ్య మినికాయ్ దీవుల్లో మన కోస్ట్ గార్డ్స్ పట్టుకున్న డ్రగ్స్ విలువ ఎంతో తెలుసా?

NCB డైరెక్టర్ : ఎస్. అరౌండ్ RS 5000 కోట్లు.

రవీంద్ర : 2021 - 2022 కి ఉత్తర్ ప్రదేశ్ వార్షిక బడ్జెట్ RS. 5,50,271 కోట్లు... హిమాచల్ ప్రదేశ్ వార్షిక బడ్జెట్ RS. 50,192 కోట్లు... మీకు ఈ రైడ్స్ లో అన్నిచోట్లా దొరికే డ్రగ్స్ విలువ దాదాపు హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ కి సరిసమానంగా ఉండొచ్చని నా అనుమానం.


ముంబై పోర్ట్ లోంచి బయలుదేరిన కంటైనర్ లారీ ఒక ఇండస్ట్రియల్ ఏరియా లోకి వెళ్ళింది. అక్కడ అప్పటికే 4 లారీలు రెడీ గా ఉన్నాయి. కంటైనర్ లోని కెమికల్ కార్బాయ్స్ ని ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్త గా కిందకి దింపారు. మొత్తం 80 కార్బాయ్స్ వచ్చాయి. వాటిని లెక్కప్రకారం 4 లారీల్లో ఎక్కించారు. ఒక్కో లారీలో 20 చొప్పున మొత్తం 80 కార్బాయ్స్ ని ఎక్కించారు. అవి వెంటనే బయలుదేరాయి... కంటైనర్ లారీ మీదెక్కిన చిడియాలు నెమ్మదిగా ఆ నాలుగు లారీల మీదకి చేరాయి.

విశ్వామిత్ర ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం... ఆ నాలుగు లొకేషన్స్ లో ఈ కెమికల్స్ చాలా అర్జెంటు గా కావాలి. ఈ మధ్య నే మహేంద్ర తన ఏజెంట్స్ దగ్గరనుంచి పెద్ద ఎత్తున అడ్వాన్స్ అమౌంట్స్ వసూలు చేసాడు. ఆ డబ్బంతా ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టుమెంట్ రూపంలో ఇండియా కి చేరింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద డ్రగ్స్ ని తయారుచేసి ఎక్సపోర్ట్ చెయ్యాలి. ఇప్పటికే ఆ నాలుగు లొకేషన్స్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారయ్యి ఎక్సపోర్ట్ చెయ్యడానికి రెడీ గా ఉన్నాయి. రెండు లారీలు వెంటనే MACHATE... TELCHAT లొకేషన్స్ కి వెళ్లాయి... ఒక లారీ ఎటువెళ్తుందో తెలియదు... దాన్ని ఫాలో అయ్యి నాలుగో లొకేషన్ కనుక్కోవాలి. ఒక లారీ నేరుగా ముంబై లోని ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. అక్కడ రెడీగా ఒక ట్రాన్స్పోర్ట్ విమానం ఉంది. ఒక ఆ లారీని నేరుగా ఆ విమానం లోకి ఎక్కించారు. కదలకుండా గట్టిగా ఐరన్ కేబుల్స్ తో కట్టేశారు. ఆ విమానం నేరుగా వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. అక్కడినుంచి ఆ లారీ నేరుగా CHAPORI లొకేషన్ కి వెళ్తుంది.

MACHATE... TELCHAT... నాలుగో లొకేషన్... ఈ మూడు చోట్ల ఈ లారీల్లో వెళ్తున్న కెమికల్స్ ని ఆదివాసులకు ఇచ్చి... వాళ్ళు తెస్తున్న డ్రగ్స్ ని ఎక్కించుకొని నేరుగా కొచ్చిన్ పోర్ట్ కి డ్రగ్స్ ని తీసుకొని వెళ్తారు. CHAPORI లొకేషన్ లో కూడా కెమికల్స్ ఆదివాసులకిచ్చి... వాళ్ళు తెచ్చే డ్రగ్స్ ని నేరుగా పారదీప్ పోర్ట్ కి తీసుకొని వెళ్లి షిప్ లో లోడ్ చేయించి సాన్ ఫ్రాన్సిస్కో పంపిస్తారు.

అవినాష్ మనుషులు అప్పటికే MACHATE... TELCHAT... CHAPORI లొకేషన్స్ లో రెడీ గా ఉన్నారు. నాలుగో లొకేషన్ ఎక్కడో ఇప్పుడు తెలుస్తుంది. లారీల మీదున్న చిడియాలు రియల్ టైం లో లొకేషన్ సిగ్నల్స్ పంపిస్తున్నాయి. ఆ మూడు లారీల వెనకాలే కొంచం దూరంగా శాండీ టీమ్స్ ఫాలో అవుతున్నాయి. అందరి ద్రుష్టి ముందు వెళ్తున్న లారీల మీదుంది.

హై వే మీద మూడు లారీలు మంచి స్పీడ్ గా వెళ్తున్నాయి. రెండు లారీలు MACHATE... TELCHAT లొకేషన్ వైపు డైవర్ట్ అయ్యాయి... మూడో లారీ వెనక శాండీ వెళ్తున్నాడు. చాలా దూరం ప్రయాణించిన తరువాత హైవే మీదనుంచి గ్రామాల వైపు వెళ్ళసాగింది. అప్పటికే బాగా చీకటి పడింది. శాండీ తన కార్ హెడ్ లైట్స్ ఆఫ్ చేసి జాగ్రత్తగా నడపసాగాడు. ముందు వెళ్తున్న లారీ టైల్ లైట్స్ ని చూస్తూ ఫాలో అవుతున్నాడు. R&AW ట్రైనింగ్ లో నైట్ టైం లైట్స్ ఆఫ్ చేసి వెహికల్ ని నడపడం నేర్పుతారు. శత్రువులని వెంటాడుతున్నప్పుడు ఒక్కోసారి చీకట్లో ముందు వెళ్తున్న వెహికల్ కి తెలియాకుండా ఫాలో అవడం నేర్పుతారు. ముందు వెళ్తున్న లారీ మల్లి డైవెర్షన్ తీసుకుంది. ఈసారి బాగా కచ్చా రోడ్ మీద వెళ్తోంది... లారీ వెళ్తూంటే బాగా దుమ్ము లేస్తోంది... ఆ దుమ్ములో ముందు వెళ్తున్న వెహికల్ టైల్ లైట్స్ సరిగ్గా కనిపించడం లేదు. శాండీ పక్కన కూర్చున వ్యక్తి "ఇలా డ్రైవ్ చెయ్యడం చాలా డేంజర్... మనం ఇక్కడే ఆగుదాము... ఆ లారీ ఎటూ రేపు ఉదయం వెనక్కి రావాలి... అప్పుడు దాన్ని డే టైం లో ఫాలో అవడం ఈజీ" అని అన్నాడు. శాండీ ఆ ప్లాన్ నచ్చింది. వెంటనే తన కార్ ని వెనక్కి తిప్పి కచ్చా రోడ్ మీద వెనక్కి వెళ్లి విలేజ్ రోడ్ ఎక్కి కొంచం దూరంగా కార్ ఆపి... ఉదయం వచ్చే లారీ కోసం వెయిట్ చేయసాగారు. శాండీ ఈ విషయం వెంటనే ఫోన్ చేసి OP CENTER కి ఇంఫార్మ్ చేసాడు...

సూర్యోదయమయ్యింది... సూరీడు 5:30 నిమిషాలకి వచేసాడు. శాండీ తన కొలీగ్ తో కార్ లో రెడీ గా ఉన్నాడు. సడన్ గా దూరం లో దుమ్ము లేస్తూ కనిపిచింది. శాండీ కి అర్ధమయ్యింది... లారీ కెమికల్స్ దింపి... డ్రగ్స్ ఎక్కించుకొని వస్తోందని... లారీ నెమ్మదిగా విలేజ్ రోడ్ ఎక్కింది. లోడ్ బాగా ఉండడంతో నెమ్మదిగా వెళ్తోంది. ఆ లారీకి 3 కిలోమీటర్స్ దూరం లో శాండీ ఫాలో అవుతున్నాడు. ఫోన్ చేసి OP CENTER కి ఇంఫార్మ్ చేసాడు. సరిగ్గా అదే సమయానికి MACHATE... TELCHAT... CHAPORI నుంచి కూడా కెమికల్స్ ని డెలివర్ చేసి... డ్రగ్స్ లోడ్ చేసుకొని బయలుదేరినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది.

రవీంద్ర వెంటనే NCB డైరెక్టర్ కి ఫోన్ చేసి "మీ టీమ్స్ ని నేను చెప్పిన లొకేషన్స్ లో టీవీ మీడియా తో సహా రెడీ గా ఉండమని చెప్పండి" అని అన్నాడు... రవీంద్ర పంపిన అన్ని హైవే లొకేషన్స్... ముంబై లో 5 లొకేషన్స్... హైదరాబాద్ లో వసంత ట్యూషన్ సెంటర్... కైలాష్ లంబర్ మిల్... హైదరాబాద్ నగర శివార్లలో ఒక చోట... కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ లో అప్పటికే స్టోర్ చేసి పెట్టిన ఒక కంటైనర్... లక్షదీవుల్లో ఒక లొకేషన్... అన్ని చోట్ల ఇక కాలం లో రైడ్స్ మొదలయ్యాయి...

అన్ని వెహికల్స్ హై మీదకి రాగానే పారామిలటరీ దళాలు రోడ్ కి అడ్డంగా నిలబడ్డారు... వాళ్ళని చూడగానే ఒక డ్రైవర్ లారీ ని రోడ్ మీద ఆపేసి దిగి పారిపోయాడు. ఒక మిలిటరీ జవాన్ వాడి వెనకాలే పరిగెత్తి వెళ్లి పట్టుకొని వచ్చాడు. రెండో చోట హైవే మీద మిలిటరీ ఫోర్స్ ని చూడగానే డ్రైవర్ లారీ స్పీడ్ పెంచి దూసుకొని వెళ్ళడానికి ప్రయత్నించాడు... పారామిలటరీ వాళ్ళు అది ముందుగానే ఊహించి ముందు వెనక చూడకుండా ఫైరింగ్ మొదలెట్టారు.... లారీ టైర్స్ కి బుల్లెట్స్ తగలడం తో లారీ కంట్రోల్ తప్పి హైవే మీద అడ్డంగా తిరగపడింది. ఇంకో చోట కూడా డ్రైవర్ లారీ ని వేగంగా నడిపి తప్పించుకోవడానికి ట్రై చేసాడు... కానీ... కుదరలేదు... మిలిటరీ ఫోర్స్ చేసిన కాల్పుల్లో బులెట్ లారీ డ్రైవర్ కి తగలడం తో చనిపోయాడు. లారీ పూర్తిగా కంట్రోల్ తప్పి రోడ్ పక్కనేవున్న పొలాల్లోకి దూసుకొని వెళ్లి ఆగిపోయింది. వైజాగ్ దాటి పారదీప్ పోర్ట్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ మాత్రం అందరిని దాటుకుంటూ ఒక 10 కిలోమీటర్స్ దూసుకొని వెళ్ళాడు... ఆ లారీని మిలిటరీ దళాలు చేస్ చేసిమరీ పట్టుకున్నాయి.

ముంబై లో 5 లొకేషన్స్ లో ఒకేసారి జరిగిన NCB దాడుల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుపడ్డాయి... హైదరాబాద్ లో వసంత ట్యూషన్ సెంటర్... కైలాష్ లంబర్ మిల్స్ మీద జరిగిన దాడుల్లో ఎవరూ వూహిచని విధంగా 3000 కిలోల డ్రగ్స్ దొరికాయి. హైదరాబాద్ అవుట్ స్కర్ట్క్స్ లో ఒక చెక్ పోస్ట్ దగ్గర సుభాష్ తెస్తున్న డ్రగ్స్ ని పట్టుకొని సుభాష్ ని... వాడితో పాటు ఇంకో ముగ్గురిని కస్టడీ లోకి తీసుకున్నారు.

లక్షదీప్ లో నేవీ కోస్ట్ గార్డ్ కి అందిన సమాచారం ప్రకారం వాళ్ళు ఒక దీవి లో సెర్చ్ చేయగా... దాదాపు 2000 కిలోల కొకెయిన్ దొరికింది. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ లో ఒక కంటైనర్ ని చెక్ చేస్తే ఎక్సపోర్ట్ చెయ్యడానికి రెడీ గా ఉన్న కొకెయిన్... ఓపియం... దొరికాయి...

హైవే మీద అన్ని చోట్లా ట్రాఫిక్ ఆగిపోయింది... జనాలు వెహికల్స్ లోంచి దిగి దూరంగా నుంచొని మొబైల్ ఫోన్ తో ఫొటోస్... వీడియోస్ తీసి సోషల్ మీడియా లో పెట్టసాగారు. ఒక అరగంట లోపల టీవీ మీడియా కూడా హైవే మీద ఆ నాలుగు లొకేషన్స్ కి చేరుకున్నాయి. అంతే... నిమిషాల్లో డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చేసిన విషయం ఇండియా లోనే కాదు... ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. హైదరాబాద్ లో జరిగిన రైడ్స్ విషయం... కైలాష్ గౌడ్ కి వెంటనే తెలిసిపోయింది... లాయర్ కాంతారావు కి ఫోన్ చేస్తే "నువ్వు వెంటనే అండర్ గ్రౌండ్ కి వెళ్ళు... నేను చెప్పే దాకా బయటకి రాకు" అని సలహా ఇచ్చాడు. కైలాష్ తనతో పాటు కిషన్ ని కూడా తీసుకొని కార్ లో బయలుదేరాడు. ఇలాంటి పని ఎదో జరుగుతుందని తెలిసి... SI శ్రీధర్ వాళ్ళని వెంబడించి పట్టుకొని "గుడికి" తీసుకొని వెళ్ళాడు.

లాయర్ కాంతారావు రైడ్స్ విషయాన్ని మహేంద్ర కి చెప్పాడు... అప్పటికే మహేంద్ర కి ఫోన్ కాల్స్ వచ్చాయి... టీవీ లో న్యూస్ చూస్తున్నాడు... మొత్తం కంసైన్మెంట్ NCB చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్క కిలో డ్రగ్ కూడా లేదు. తయారుచెయ్యాలి. "ఎందుకైనా మంచిది నువ్వు వెంటనే ఇంగ్లాండ్ వెళ్ళు..." అని కాంతారావు సలహా ఇచ్చాడు. సరిగ్గా అదే సమయానికి ఆదివాసులు కెమికల్ కార్బాయ్స్ ని డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ కి చేర్చారు... అప్పటికే 200 గంటలు పూర్తిఅయ్యాయి... ఇంకో 16 గంటల వ్యవధి మాత్రమే మిగిలివుంది.


Part - 29 - The Identity of the Victim

మహేంద్ర తన వ్యాపారాలన్నీ తన ఫామిలీ మెంబెర్స్ పేరు మీద నడుపుతాడు. మహేంద్ర గ్రూప్ కి తాను చైర్మన్ మాత్రమే... మొత్తం బిజినెస్ అంతా ఫామిలీ మెంబెర్స్ చూస్తుకుంటారు. మహేంద్ర లేకపోయినా ఎటువంటి ఆటంకం ఉండదు. మహేంద్ర కి విపరీతంగా ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి... కళాధర్ కి ఆ కాల్స్ ని హేండిల్ చెయ్యడం చాలా కష్టం గా ఉంది. కాంతారావు ఇచ్చిన సలహా మేరకు మహేంద్ర వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు. అక్కడ తన పర్సనల్ జెట్ రెడీ గా ఉంది. 10 గంటల్లో లండన్ చేరుకుంటాడు. ఇక్కడ అంతా సర్దుమణిగాక వెనక్కి రావొచ్చు... కార్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తూ తన చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కి ఫోన్ చేసి "నేను అర్జెంటు పని మీద లండన్ వెళ్తున్నాను... రావడానికి కనీసం ఓక 3 నెలలు పడుతుంది... నువ్వు వెంటనే మన ఓవర్సీస్ ఏజెంట్స్ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ పేమెంట్ ని వెనక్కి ఇచ్చెయ్యి. ప్రోడక్ట్ డెలివరీ బాగా డిలే అవుతుందని చెప్పు... నేను వాళ్ళని పర్సనల్ గా కలిసి మొత్తం ఎక్సప్లైన్ చేస్తాను..." అని అన్నాడు...

మహేంద్ర CFO కమాండ్ సెంటర్ కి ఫోన్ చేసి ఏ ఏ ఏజెంట్ ఎంత అమౌంట్ ఇచ్చాడో స్టేటుమెంట్ పంపమని అడిగాడు. ఆ లిస్ట్ రాగానే ఆఫ్ షోర్ పేమెంట్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి అమౌంట్స్ రిఫండ్ చెయ్యడానికి ట్రై చేసాడు... ఆ అకౌంట్ లో జీరో బాలన్స్ కనిపించింది... అర్ధం కాలేదు... మహేంద్ర ఆ డబ్బులు వాడుక ఉన్నాడేమోనని వేరే అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడు... అందులో కూడా మినిమం బాలన్స్ ఉంది. కళాధర్ కి ఫోన్ చేసి "ఈ మధ్య మహేంద్ర సర్ ఏదైనా ఫండ్ ట్రాన్సఫర్ చేశారా?" అని అడిగాడు. దానికి బదులుగా కళాధర్ "ఏ బ్యాంకు అకౌంట్?" అని అడిగాడు. CFO బ్యాంకు పేరు చెప్పాడు... "లేదే... ఆ అకౌంట్ ని మీరు... నేను తప్పా... వేరే ఎవరూ టచ్ చెయ్యరు. ఏమిటీ ప్రాబ్లెమ్?" అని అడిగాడు. CFO చెప్పాడు... అది విన్న వెంటనే "నేను మీ కేబిన్ కి వస్తున్నా" అని కళాధర్ అన్నాడు.

కళాధర్ రాగానే CFO తాను చెక్ చేసిన రెండు అకౌంట్స్ ని చూపించాడు. "మహేంద్ర సర్ నన్ను మనం కలెక్ట్ చేసిన అడ్వాన్స్ అమౌంట్స్ ని వెంటనే రిఫండ్ చెయ్యమని చెప్పారు. నా దగ్గర ఏజెంట్స్ ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ లిస్ట్ ఉంది. కానీ... ఈ అకౌంట్స్ లో బాలన్స్ లేదు" కళాధర్ ఆ అకౌంట్స్ ని చెక్ చేసాడు. రీసెంట్ గా జరిగిన కొన్ని డెబిట్ ట్రాన్సక్షన్స్ కనిపించాయి.. కళాధర్ ఆ అమౌంట్స్ ని CFO కి చూపిస్తూ "ఈ అమౌంట్స్ మీరు ట్రాన్స్ఫర్ చేశారా?" అని అడిగాడు దానికి బదులుగా CFO "లేదు. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి నాకు తెలియదు. ఇందాక మహేంద్ర గారు ఫోన్ చేసేదాకా నేను ఈ అకౌంట్స్ ని టచ్ చెయ్యలేదు" అని అన్నాడు. కళాధర్ కి అర్ధం కాలేదు... అమెరికన్ డాల్లర్స్ మిలియన్స్ లో ట్రాన్సఫర్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరు చేశారు? ఎందుకైనా మంచిదని అన్ని ఆఫ్ షోర్ అకౌంట్స్ ని చెక్ చేసాడు. అన్నింటిలోనూ మినిమం బాలన్స్ ఉంది. ఇద్దరికీ చెమటలు పట్టాయి... వందల మిలియన్స్ డాల్లర్స్ మాయమయ్యాయి... వివిధ దేశాల్లో ఉన్న డ్రగ్ డీలర్స్ ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్స్... ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం... 50% అమౌంట్ ని అడ్వాన్స్ గా ఇస్తారు. మిగతా 50% డ్రగ్స్ డెలివర్ చేసాక వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 50% అడ్వాన్స్ కి సరిపడా డ్రగ్స్ పంపాలి... లేదా... వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలి. ప్రస్తుతం డ్రగ్స్ ని సప్లై చెయ్యడం కుదరదు కాబట్టి మహేంద్ర తాను తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్స్ ని రిఫండ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. డబ్బులు వెనక్కి ఇస్తే గుడ్ విల్ కి ఎటువంటి ప్రమాదం ఉండదు. అండర్ వరల్డ్ లో గుడ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షన్స్ అన్ని గుడ్ విల్ మీద నడుస్తాయి.

కళాధర్... CFO ఇద్దరూ అన్ని బ్యాంక్స్ కి ఫోన్ చేశారు. ఫ్రాడ్ జరిగిందని రిపోర్ట్ చేశారు. తమ అకౌంట్ ని ఎవరో హాక్ చేసి డబ్బులు దొంగిలించారని చెప్పారు. ఆ బ్యాంకు వెంటనే ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ ట్రాన్సాక్షన్స్ ఏ IP అడ్రస్ నుంచి జరిగాయో తెలుసుకొని ఆ డీటెయిల్స్ వెంటనే కళాధర్ కి ఇచ్చారు. కళాధర్ ఆ IP అడ్రస్ లు అన్నింటిని చెక్ చేసాడు... ఆ IP అడ్రస్ లు అన్ని తమ కమాండ్ సెంటర్ కి చెందినవి. కళాధర్ వెంటనే అన్ని ఆఫ్ షోర్ బ్యాంక్స్ ని కాంటాక్ట్ చేసి ఆ బ్యాంకు అకౌంట్స్ లో జరిగిన డెబిట్ ట్రాన్సాక్షన్స్ కి సంభందించిన IP అడ్రస్ లు సంపాదించుకున్నాడు. అవికూడా కమాండ్ సెంటర్ కి చెందినవే... వెంటనే హోమ్ మినిస్టర్ ధనంజయ కి ఫోన్ చేసి చెప్పాడు. ధనంజయ పోలీస్ డిపార్టుమెంటు లో బెస్ట్ టెక్ స్పెషలిస్ట్ ని మహేంద్ర ఆఫీస్ కి పంపించాడు. సరిగ్గా అదేసమయంలో కళాధర్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక కొత్త నెంబర్. నార్మల్ గా తెలియని నంబర్స్ నుంచి ఫోన్ వస్తే కళాధర్ రెస్పాండ్ అవ్వడు... కానీ... ఆ నెంబర్ పదే పదే ఆగకుండా రింగ్ చెయ్యడంతో విసుగెత్తి కోపంగా "ఎవడ్రా... నువ్వు?" అని గట్టిగా అరిచాడు. అవతల నుంచి " కోపగించుకోకండి... నేను మీ కమాండ్ సెంటర్ లో పని చేస్తాను. నా పేరు అశోక్ కుమార్. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మీతో అర్జెంటు గా మాట్లాడాలి. కమాండ్ సెంటర్ లో ఎదో ఫ్రాడ్ జరుగుతోంది. ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. మీకు కొన్ని బ్యాంకు డాక్యూమెంట్స్ ఇవ్వాలి. మీకు అభ్యంతరం లేకపోతే... మన హెడ్ క్వార్టర్స్ కి దగ్గరలోవున్న STARBUCKS COFFEE షాప్ కి రాగలరా? మీకు నేను కొన్ని బ్యాంకు డాక్యూమెంట్స్ ఇవ్వాలి..." అని అన్నాడు. అది విన్న కళాధర్ "నువ్వు వెంటనే కమాండ్ సెంటర్ చీఫ్ దగ్గరికి వెళ్లి ఆ డాక్యూమెంట్స్ ఇవ్వు. అవి నా దగ్గరకి వస్తాయి" అని అన్నాడు... దానికి బదులుగా అశోక్ " ఆ ఫ్రాడ్ చేసింది మన కమాండ్ సెంటర్ చీఫ్... మళ్ళీ నేను ఈ డాక్యూమెంట్స్ ని ఆయనకీ ఇస్తే మీకు చేరతాయని నాకు నమ్మకం లేదు. మీకు ఇంటరెస్ట్ ఉంటే... ఇంకో 10 నిమిషాల్లో STARBUCKS రండి... నేను ఇక్కడ ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తాను. మీరు రాకపోతే నేను వెళ్ళిపోతాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

కళాధర్ ఒక నిమిషం ఆలోచించాడు... కమాండ్ సెంటర్ చీఫ్ కి ఫోన్ చేసి "అక్కడ అశోక్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడా?" అని అడిగాడు. కమాండ్ సెంటర్ చీఫ్ "అవునండి... జూనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్... ఏమయ్యింది?" అని అడిగాడు... దానికి బదులుగా కళాధర్ "అశోక్ ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాడా?" అని అడిగాడు. "అశోక్ ఈవెనింగ్ షిఫ్ట్ లో పనిచేస్తాడు... ANY PROBLEM?" అని అడిగాడు. కళాధర్ "NO PROBLEM" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. ఎవ్వరికీ చెప్పకుండా లైఫ్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకొని అక్కడున్న గార్డ్ తో "నువ్వు నాతో రా..." అని అన్నాడు. గార్డ్ వెంటనే కళాధర్ వెనకాలే బయలుదేరాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఆఫీస్ కి దగ్గరలోని STARBUCKS COFFEE షాప్ కి చేరుకునే లోపల కళాధర్ పక్కన ఒక వాన్ వచ్చి ఆగింది. కళాధర్ వెనకాలే వస్తున్న గార్డ్ ప్రమాదం పసికట్టి రియాక్ట్ అయ్యేలోపల గార్డ్ ని వెనక నుంచి ఎవరో పట్టుకొని విసురుగా పక్కకి నెట్టేశారు. ఆ గార్డ్ కింద పడ్డాడు... లేచి నుంచునేలోపల ఆ వాన్ తలుపులు తెరుచుకొని కళాధర్ ని లోపలి లాగేసారు. గార్డ్ ని వెనక నుంచి తోసేసిన వ్యక్తి కూడా రెప్పపాటులో వాన్ ఎక్కేసాడు. వాన్ వెళ్ళిపోయింది. గార్డ్ వెంటనే పరిగెత్తుకుంటూ ఆఫీస్ కి వెళ్లి కళాధర్ ని ఎవరో కిడ్నప్ చేశారని చెప్పాడు.

>

కళాధర్ ని వాన్ లోపలి లాగేసి... వెంటనే నోటికి ప్లాస్టర్ అతికించి... చేతులని వెనక్కి విరిచి కట్టేసి మొహాన ముసుగేసేసారు. కళాధర్ గింజుకున్నాడు. వాన్ లో ఒకడు పిడికిలి బిగించి బలంగా కళాధర్ గుద్దాడు... కళాధర్ గింజుకోవడం ఆపి మూలిగాడు. ఆ వాన్ ఒక గంట సేపు అటూ ఇటూ తిరిగి నేరుగా "గుడి" కి చేరుకుంది.

వాన్ ఆగగానే కళాధర్ ని ఈడ్చుకుంటూ లోపలి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి చేతులు... కాళ్ళు... కదలకుండా గట్టిగా ఆ కుర్చీకి కట్టేశారు. మొహం మీద ముసుగు అలాగేఉంది. తనని ఎవరు కిడ్నప్ చేశారో... ఎందుకు చేశారో... అర్ధంకాలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు... సడన్ గా ఆ రూమ్ లో ఆక్టివిటీ మొదలయ్యింది. యేవో చప్పుళ్ళు వినిపించాయి. మొహాన ముసుగు ఉండడంతో ఏమి కనిపించడం లేదు. అప్పుడే ఎవరో కళాధర్ ముసుగు తొలగించారు... కళాధర్ కి ఆ రూమ్ లో ఒకవైపు కైలాష్ గౌడ్... ఇంకో వైపు కిషన్ కనిపించారు. వాళ్ళిద్దరినికూడా తనలాగే కుర్చీలకి కట్టేశారు. కళాధర్ చూస్తుండగానే ఆ రూమ్ లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు... ఒకడి చేతిలో పెద్ద సైజు స్లెడ్జి హమ్మర్ ఉంది. వాడు దాన్ని నేల మీద ఈడుస్తూంటే భయంకరంగా శబ్దం చేస్తోంది. ఆ ఇద్దరూ నిశబ్దం గా నుంచున్నారు. చూడడానికి చాలా బలంగా ఉన్నారు. ఆ ఇద్దరూ కిషన్ దగ్గర నుంచున్నారు.

ఆ రూమ్ లోకి ఇంకో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు... SI శ్రీధర్... DSP శేఖర్... ACP అవినాష్... వాళ్ళని చూడగానే... కైలాష్... కిషన్... కళాధర్ లకు అర్ధమయ్యింది... వాళ్ళని కిడ్నప్ చేసింది పోలీస్ డిపార్టుమెంటు. అవినాష్ ఒక ఖాళీ కుర్చీ తీసుకొని కైలాష్ ముందు వేసి కూర్చొని స్లెడ్జి హమ్మర్ పట్టుకున్న వాడికి సైగ చేసాడు. వాడు వెంటనే భయంకరంగా అరుస్తూ స్లెడ్జి హమ్మర్ ని గాల్లోకి లేపి కిషన్ ఎడమ కాలికి గురిపెట్టి కొట్టాడు... అది మామూలుగానే గురితప్పి నేలమీద నాపరాయి ని మీద పడింది. అది చూడగానే కిషన్ కి గుండెలు అదిరాయి.... ఆ కానిస్టేబుల్ మళ్ళీ స్లెడ్జి హమ్మర్ ని గాల్లోకి లేపి ఈ సారి గురి తప్పకుండా కిషన్ ఎడమ కాలు మీద చాలా బలంగా కొట్టాడు... ఆ దెబ్బకి కిషన్ నోట్లోంచి రావాల్సిన పెద్ద గావుకేక నోటికున్న టేప్ వల్ల పెద్ద మూలుగులాగా అందరికి వినిపించింది. అవినాష్ ఇంకోసారి సైగ చేసాడు... ఆ కానిస్టేబుల్ ఇంకోసారి బలంగా అదే కాలు మీద కొట్టాడు. దాంతో కిషన్ స్పృహ తప్పాడు... కైలాష్... కళాధర్... ఇదంతా కళ్లప్పగించి చూసారు... వాళ్లకి వొళ్ళు కంపించసాగింది... అవినాష్ కుర్చీలోంచి లేచి కైలాష్ నోటికున్న టేప్ ని తొలగించి...

అవినాష్ : నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను. నాకు సూటిగా సమాధానాలు కావాలి. నాకు ఓపిక... తీరిక... చాలా తక్కువ. మీరు నోరు విప్పక పోతే... మీ వాడి కాళీ మీద పడ్డ సుత్తి దెబ్బలు మీ వొంటి మీద కూడా పడతాయి. నేను మిమ్మల్ని తీసుకొని వచ్చినట్లు పోలీస్ రికార్డ్స్ లో లేదు. అందరి దృష్టిలో మీరు... కిషన్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. ప్రస్తుతం మీవాళ్లు... మా వాళ్ళు... మీకోసం వెతకరు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే... మిమ్మల్ని అండర్ గ్రౌండ్ కి వెళ్లేలా చేస్తాను... లేదంటే... చంపేసి కాటికి పంపిస్తాను.

కైలాష్ (భయంగా చూస్తూ): అడగండి... చెప్తాను.

అవినాష్ : మీకు మహేంద్ర... కాంతారావు... ధనంజయ... ఎన్నేళ్లుగా తెలుసు?

కైలాష్ : చాల కాలంగా... గత 25 ఏళ్లగా తెలుసు.

అవినాష్ : మీరు ఏ ఏ బిజినెస్ లు చేస్తారు?

కైలాష్ : కన్స్ట్రక్షన్... సినిమా ఫైనాన్సింగ్...

అవినాష్ : అంతేనా...

కైలాష్ : అవును...

అవినాష్ : నిజం చెప్పండి... డ్రగ్స్... కిడ్నాపింగ్... మర్డర్స్... మనీ లాండరింగ్... సంగతి?

కైలాష్ మౌనంగా ఉండిపోయాడు. అవినాష్ తన కానిస్టేబుల్ కి సైగ చేసాడు... వాడు వెంటనే సుత్తి గాల్లోకి లేపి బలంగా కిషన్ కుడి కాలు మీద కొట్టాడు... అప్పటికే స్పృహ తప్పిపడివున్న కిషన్ స్పృహలోకి వచ్చి... చాలా భయంకరంగా మూలగడం మొదలెట్టాడు... అవినాష్ మౌనంగా కైలాష్ వైపు చూసాడు. కైలాష్ కి వొంట్లో వొణుకు మొదలయ్యింది.

కైలాష్ : అవి కూడా నేనే చేస్తాను... కానీ... ఆర్డర్స్ మాత్రం మహేంద్ర... కాంతారావు... ధనంజయ ఇస్తారు. వాళ్ళు ఏమి చెప్తే అది చేయడం నా పని. ప్లానింగ్ఈ అంతా వాళ్ళే చేస్తారు. నెను వాటిని అమలుచేస్తాను. పనులు చేస్తే వాళ్ళు నాకు వాటా ఇస్తారు.

అవినాష్ : ఇరానీ కేఫ్ లో షూటింగ్ ఎందుకు చెయ్యించావు?

కైలాష్(ఆశ్చర్యంగా): ఆ ఇరానీ కేఫ్ లో షూటింగ్ కి... నాకు ఎటువంటి సంభంధం లేదు.

అవినాష్ : అంతగా నటించకండి. ఆ సుత్తి దెబ్బ మీ కాళీ మీద పడగలదు.

కైలాష్ మౌనంగా ఉండిపోయాడు. అవినాష్ విసుగ్గా "ఈసారి మోకాలి చిప్ప పగిలేలా కొట్టండి" అని అరిచాడు... అది విన్న కానిస్టేబుల్ ఆవేశంగా హామర్ ని గాల్లోకి లేపగానే... కైలాష్ గట్టిగా "వొద్దు... వాడిని కొట్టొద్దు... చెప్తాను... " అని అన్నాడు... అవినాష్ ఆ కానిస్టేబుల్ ని వారించాడు. ఇదంతా చూస్తున్న కళాధర్ ఖంగారుగా కుర్చీలో కదులుతూ "వొద్దు... చెప్పొద్దు ..." అన్నట్లు తలని అడ్డంగా ఊపసాగాడు. అది గమనించిన అవినాష్ "DON'T WORRY... JUST WAIT... నీతో కూడా చాట్ చేస్తాను... కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. లేదంటే... "అంటూ సుత్తి వైపు చెయ్యి చూపించాడు.

కైలాష్: చాలా మందికి మేము డ్రగ్స్ బిజినెస్ చేస్తామని తెలియదు. కొంత మందికి మాత్రమే తెలుసు... చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నాము.

అవినాష్ : ఆ డ్రగ్స్ మీకు ఎవరు సప్లై చేస్తారు?

కైలాష్ : మేమే తయారుచేస్తాము...

అవినాష్(ఆశ్చర్యం నటిస్తూ): మీరు తయారుచేస్తారా? ఎలా? ఎక్కడ?

కైలాష్ : మొత్తం 4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి.

అవినాష్: ఎక్కడ?

కైలాష్ : అది చెప్పడం చాలా కష్టం... మహేంద్ర చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ ఫ్యాక్టరీస్ అడవుల్లో పెట్టాడు.

అవినాష్ : అడవుల్లోనా.... ఏ అడవుల్లో?

కైలాష్ : మహారాష్ట్ర... తెలంగాణ... ఛత్తీస్ ఘడ్... ఆంధ్ర... ఒరిస్సా సరిహద్దుల్లో అడవులు ఉన్నాయి... ఆ అడవుల్లో మహేంద్ర నాలుగు చోట్ల ఫ్యాక్టరీస్ పెట్టాడు.

అవినాష్ : అడవుల్లో ఫ్యాక్టరీస్ పెట్టడం చాలా కష్టం... మీకు ముడి పదార్ధాలు ఎవరిస్తారు?

కైలాష్ : మేమె పండించుకుంటాము... మహేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ సరిహద్దుల్లో అడవులు ఆక్రమించి అక్కడ పంట వేసి... బయటనుంచి కావాల్సిన వస్తువులు తెప్పించి అక్కడ తయారుచేస్తాము.

అవినాష్ : బయటనుంచి అంటే?

కైలాష్ : విదేశాల్లోంచి... దిగుమతి చేసుకుంటాము.

అవినాష్ : ఏమిటీ? వింటున్నాము కదాని కధలు చెప్తున్నావా?

కైలాష్(ఖంగారుగా): లేదండి... నిజమే చెప్తున్నా...

కైలాష్ మొత్తం చెప్పాడు... ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు... ఆ మెటీరియల్ ఎలా అడవుల్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు... ఆ పనికి ఆదివాసులని ఎలా వాడుకుంటున్నారు... అడవుల్లో తయారయిన డ్రగ్స్ ని హైదరాబాద్... ముంబై... ఎలా పంపిస్తారు... అక్కడనుంచి విదేశాలకి ఎలా ఎక్సపోర్ట్ చేస్తున్నారు... అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు.. ఈ విషయాలు అన్ని అవినాష్... శేఖర్... శ్రీధర్ కి ముందుగానే తెలియడం తో ఇప్పుడుకైలాష్ చెప్పింది నిజమో... కాదో... ఈజీ గా తెలిసిపోయింది. అంతా విన్న తరువాత...

అవినాష్ : మామూలుగా ఆదివాసులు ఎవరికి కోఆపరేట్ చెయ్యరు. వాళ్ళని మీరు ఎలా ఒప్పించారు.

కైలాష్ : అది మహేంద్ర వేసిన ప్లాన్... ఆ ఆదివాసులకు ముందుగా డ్రగ్స్ అలవాటు చేసాము... కొంత కాలానికి వాళ్ళు ఆ డ్రగ్స్ కోసం మేము ఏమి చెప్తే అది చెయ్యడానికి రెడీ అయ్యారు. మేము వాళ్లకి డైలీ డ్రగ్స్ ఇస్తాము.

అవినాష్ : ఇప్పుడు నువ్వు చెప్పినదానికి... ఆ ఇరానీ కేఫ్ షూటింగ్ కి ఏమిటీ సంభంధం...

కైలాష్ : అడవిలో ఫ్యాక్టరీస్ విషయం ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాము... కానీ... తెలంగాణ... ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని ఫ్యాక్టరీ గురించి అక్కడి గ్రామం లో ఒక ముసలోడి తెలిసిపోయింది.

అవినాష్: ఆ గ్రామం పేరు?

కైలాష్ : రాపూరు... ఆ ఊళ్ళో ఒక ముసలోడు ఒక రోజు ఆదివాసులు డ్రగ్స్ తీసుకొచ్చి మా వాళ్లకి ఇవ్వడం చూసాడు. వాడు ఆ ఆదివాసుల వెనకాలే వెళ్లి మా ఫ్యాక్టరీ ని కనిపెట్టాడు. అక్కడ మేము డ్రగ్స్ తయారు చేస్తున్న విషయం బయట అందరికి తెలిసిపోతుందని భయపడ్డాము... మా సెక్యూరిటీ వాళ్ళు ఆ ముసలోడిని పట్టుకోవడానికి వాడి వెనకాలే వెళ్లారు... కానీ వాడు మాకు దొరక్కుండా వూరు చేరుకున్నాడు. ఆముసలోడు హైదరాబాద్ లో తన కొడుక్కి ఫోన్ చేసి చెప్పడం కూడా తెలిసింది. ఆ ముసలోడిని ఆ ఊళ్ళో చంపితే ప్రాబ్లెమ్ వస్తుందని... వాడు హైదరాబాద్ రాగానే ఇరానీ కేఫ్ లో చంపేశాము.

అవినాష్ : ఆ రోజు ఇరానీ కేఫ్ లో 8 మంది చనిపోయారు... అందరిని మీరే చంపించారా?

కైలాష్ : ఆ ముసలోడు ఒక్కడినే చంపితే ఏదైనా ప్రాబ్లెమ్ వస్తుందని... ఒక పిచ్చోడు ఆ ఇరానీ కేఫ్ లోకి ఒక పిచ్చోడు దూరి ఇష్టంపచినట్లు కాల్పులు జరిపినట్లు సృష్టించాము.

అవినాష్(కోపంగా): మిగతా 7 మందిని మీరు ఉత్త పుణ్యానికి చంపేసారా?

కైలాష్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు.

అవినాష్ : ఆ చనిపోయిన 7 మంది ఎవరో తెలుసా?

కైలాష్(కొంచం భయపడుతూ): వాళ్ళ గురించి మేము పెద్దగా ఆలోచించలేదు.

అవినాష్ విపరీతమైన ఆవేశంతో ఊగిపోతూ కుర్చీలోంచి లేచి కైలాష్ గూబ పగిలేలా కొట్టాడు... అతని ఆవేశం చూసి కైలాష్ కి భయమేసింది. చంపేస్తాడేమోనని అనుమానం వచ్చింది. అవినాష్ తనని తానూ కంట్రోల్ చేసుకొని కుర్చీలో కూర్చొని...

అవినాష్: మీకు సాటి మనుషుల ప్రాణాలంటే లెక్క ఉండదా... అయితే మీకు ఆ రోజు ఇరానీ కేఫ్ లో చనిపోయిన మిగతా 7 మంది గురించి ఏమి తెలియదన్నమాట.

కైలాష్ : ఒట్టేసి చెప్తున్నా... ఆ ముసలోడిని ఒక్కడినే చంపితే ప్రాబ్లెమ్ వస్తుందని... వాడితో పాటు ఇంకొంతమందిని చంపించాము... ఆ 7 మందితో మాకు ఎటువంటి సంభంధం లేదు.

ఇది విన్న అందరూ కొంచం సేపు ఏమి మాట్లాడకుండా నిశబ్ధంగా ఉండిపోయారు... ఆ రూమ్ లో కిషన్ నొప్పితో మూలగడం తప్ప వేరే శబ్దాలు వినపడడం లేదు.

అవినాష్ : యాదగిరి మనుషులు ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ నుంచి ఎందుకు కిడ్నప్ చేశారు?

కైలాష్ : అది కిడ్నప్ కాదండి.

సరిగ్గా అదే సమయంలో కళాధర్ భయంగా... ఖంగారు పడుతూ... ఏమి చెప్పొద్దూ అన్నట్లు తన తలని అడ్డంగా ఊపసాగాడు. అప్పటిదాకా కైలాష్ చెప్పింది విని అవినాష్ కి సహనం చచ్చిపోయింది... విపరీతమైన కోపంలో ఉన్నాడు... కళాధర్ తలా అడ్డంగా ఊపడం చూసి... కానిస్టేబుల్ కి సైగ చేసాడు... అంతే... వెంటనే కళాధర్ కుడి కాలి మీద సుత్తి దెబ్బ చాలా బలంగా పడింది. ఇదంతా చూస్తున్న కైలాష్ వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది...

అవినాష్ : చెప్పు... ఆ అమ్మాయిని మీ వాళ్ళు ఎందుకు తీసుకొని వెళ్లారు?

కైలాష్ : ఒకరోజు లాయర్ కాంతారావు నన్ను పిలిచి 'నీతో పెద్ద పని ఉంది... నీకు బాగా నమ్మకమైన వాళ్లకు ఒక నలుగురిని రెడీ చెయ్యి' అన్నాడు. నేను యాదగిరి గ్యాంగ్ ని రెడీ గా ఉండమని చెప్పాను. కాంతారావు నాకు రెండు రోజుల తరువాత మళ్ళీ పిలిచి తన మొబైల్ లో రెండు ఫొటోస్ చూపించాడు ఒకటి... ఆ అమ్మయి... రెండోది ఒక ముసలోడిది... ఆ ఫొటోస్ నా మొబైల్ పంపించి 'వీళ్లిద్దరూ ఇవ్వాళ రాత్రి ముంబై నుంచి రైల్ లో సికింద్రాబాద్ వస్తారు. నువ్వు యాదగిరి గ్యాంగ్ ని పంపించి ఆ ఇద్దరినీ తమతో పాటు తీసుకొని ఊరిబయటకి తీసుకెళ్లి చంపేసి.... ఇద్దరినీ వాళ్ళ లగ్గేజ్ తో సహా తగల పెట్టెయ్యండి... ఎటువంటి ఆనవాళ్లు ఉండకూడదు' అని చెప్పాడు...

కైలాష్ చెప్పింది ఆ రూంలో అందరూ విన్నారు... అందరూ ముక్త కంఠంతో "అయ్యాయో..." అని అరిచారు. అవినాష్ కోపంతో ఊగిపోయాడు... గట్టిగా అరుస్తూ ఆ రూమ్ లోంచి బయటకి వెళ్ళిపోయాడు. ఒక అరగంట తరువాత మళ్ళీ ఆ రూమ్ లోకి వచ్చాడు...

అవినాష్ : కాంతారావు ఆ ఇద్దరినీ ఎందుకు చంపమన్నాడు?

కైలాష్ : నాకు తెలియదండి...

అవినాష్(కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ): నిజం చెప్పు... లేదంటే ఆ సుత్తి తీసుకొని నేనే నీ వొంట్లో ఎముకలు ఒక్కొక్కటిగా పొడి పొడి చేస్తా...

కైలాష్ : నిజం గా నాకు తెలియదండి. కాంతారావు... మహేంద్ర... ధనంజయ... నాకు అన్ని విషయాలు చెప్పరు. వాళ్ళు ఏది చెపితే అది చెయ్యడం నా పని. ప్రశ్నలు అడగను.

అవినాష్: యాదగిరి గ్యాంగ్ వాళ్ళని తీసుకెళ్లి చంపెయ్యాలి కదా... మరి మధ్య లో నీకొడుకు... వాడి ఫ్రెండ్స్ ఎందుకు ఆమెని తీసుకెళ్లి రేప్ చేశారు...

కైలాష్: అదే పెద్ద సమస్య... యాదగిరి గ్యాంగ్ వాళ్ళిద్దరిని తమతో పాటు తీసుకెళ్తూండగా ఈ కుర్రోళ్ళు ఆ అమ్మాయిని చూసారు. మా వివేక్ యాదగిరి కి ఫోన్ చేసి వాళ్ళని మా పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మని చెప్పాడు. అక్కడ వివేక్ అమ్మాయి గురించి అడిగితే... వాళ్ళని ఏమి చేయబోతున్నారో చెప్పాడు... అది వినగానే "ఆ అమ్మాయిని మీరు ఎటూ చంపెయ్యడానికి తీసుకెళ్తున్నారు కాబట్టి... ఆమెని కొంచం సేపు మాకు వొదిలెయ్యమని అడిగారు"... యాదగిరి దానికి వొప్పుకొని ఆమెని వాళ్లతో పంపించాడు...అడ్డమొచ్చిన ఆ ముసలోడిని మావాడు ఒకడు రాడ్ పెట్టి కొట్టి చంపేశాడు... ఆ తరువాత మా కుర్రోళ్ళు ఆ అమ్మాయిని రేప్ చేసి యాదగిరి గ్యాంగ్ కి అప్పగించి వెళ్లిపోయారు. యాదగిరి ఆ అమ్మాయిని వాళ్లతో పంపేముందు నాకు ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే... అసలు ఈ ప్రాబ్లెమ్ వచ్చేది కాదు.

ఇదంతా విన్న అవినాష్ కి కళ్ళవెంబడి నీళ్లు తిరిగాయి... కైలాష్ ని తన చేతుల్తో చంపేయాలన్న కోపం వచ్చింది... మళ్ళీ కుర్చీలోంచి లేచి బయటకి వెళ్లి ఒక అరగంట తరువాత వచ్చాడు.

అవినాష్ : అసలు ఆ అమ్మయిని... ఆమెతో ఉన్న ఆ ముసలాయనని మీ లాయర్ ఎందుకు చంపెయ్యమని చెప్పాడు...

కైలాష్ : నాకు నిజం గా తెలియదండి... వాళ్ళు చెప్పింది చెయ్యడమే నా పని.

అవినాష్(కళాధర్ వైపు చూస్తూ): ఆ రోజు ఆ అమ్మాయి రైల్వే స్టేషన్ నుంచి నీకు యాదగిరి ఫోన్ నుంచి ఒక కాల్ చేసింది. ఆమెకి నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? నీకెందుకు ఫోన్ చేసింది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పక పోతే నేనే ఆ సుత్తి తో కొడతాను.

కళాధర్ : ఆ అమ్మాయి ఫోన్ చేసింది నాకు కాదు. ఆ నెంబర్ నాది కాదు. అది మహేంద్ర పర్సనల్ నెంబర్. ఆ నెంబర్ నా పేరు మీద ఉంటుంది. కానీ... చాలా ఇంపార్టెంట్ వ్యక్తులకి మాత్రమే ఆ నెంబర్ తెలుసు. ఆ రాత్రి ఆమె మహేంద్ర కోసం ఫోన్ చేసింది. నేను రిసీవ్ చేసుకొని ఫోన్ ని మహేంద్ర కి ఇచ్చాను. మహేంద్ర ఫోన్ లో "వాళ్ళు మనవాళ్లే... వాళ్ళతో వచ్చెయ్" అని చెప్పి ఫోన్ నాకు ఇచ్చాడు. నేను ఆమెతో మాట్లాడే లోపల ఆమె ఫోన్ పెట్టేసింది.

అవినాష్ : ఆమె మహేంద్ర కి ఎందుకు ఫోన్ చేసింది.

కళాధర్ : ఆమె పేరు స్పందన... మహేంద్ర కూతురు...


Part - 30 - The Flashback

అవినాష్ కొంచంసేపు మాట్లాడకుండా కళాధర్ వైపే చూస్తూ ఉండిపోయాడు.

అవినాష్ : స్పందన... మహేంద్ర కూతురని నీకెలా తెలుసు?

కళాధర్ : స్పందనకి సంభందించిన ప్రతి విషయానికి నేను ప్రత్యక్ష సాక్షి...

కళాధర్ చెప్పడం మొదలెట్టాడు...

"నేను... మహేంద్ర... ఇద్దరం కాలేజీ రోజులనించి ఫ్రెండ్స్. నేను గ్రాడ్యుయేషన్ తరువాత ఆపేసాను. మహేంద్ర అహ్మదాబాద్ లో IIM చేసి వచ్చాడు. మహేంద్ర ఫామిలీ బాగా రిచ్... వాళ్లకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. మహేంద్ర హైదరాబాద్ రాగానే నన్ను కలసి 'ఇకనుంచి నువ్వు నా పక్కనే ఉండు. నీలాంటి నమ్మకమైన వాడు కావాలి' అని తనకి పర్సనల్ సెక్రటరీ గా వుద్యోగం ఇచ్చాడు. నాకు తెలియకుండా ఏది జరిగేది కాదు. మహేంద్ర కి కాంతారావు కూడా చిన్నప్పటి ఫ్రెండ్. కాంతారావు సలహా తీసుకోకుండా ఏపని చెయ్యడు. సరిగ్గా 23 ఏళ్ళ క్రితం మహేంద్ర గోదావరి జిల్లాలో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి వెళ్ళాడు. మహేంద్ర తో పాటు నేను కూడా వెళ్ళాను. సైట్ ఆఫీస్ లోనే ఉండేవాళ్ళం. ఆ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. మేము అప్పుడప్పుడు ఆ సైట్ కి దగ్గరలోని ఒక టౌన్ కి వెళ్తూండేవాళ్ళము. ఎలా పరిచయం అయ్యిందో.... మహేంద్ర కి సుప్రియ పరిచయం అయ్యింది. సుప్రియ ఆ టౌన్ లో జూనియర్ కాలేజీ లో జాబ్ చేసేది. ఇద్దరి మధ్య లవ్ బాగా పెరిగింది. మహేంద్ర తన అసలు ఐడెంటిటీ దాచిపెట్టి తాను ఒక సాధారణ ఉద్యోగి అని చెప్పాడు. తన పేరు కూడా సురేంద్ర అని చెప్పాడు. సుప్రియ... సురేంద్ర ని బాగా నమ్మింది. తన పేరెంట్స్ కి పరిచయం చేసింది. సుప్రియ ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్ళిచూపులకి వేరే ఎవరినో తన పేరెంట్స్ అని చెప్పి తీసుకొని వచ్చాడు. సుప్రియ పేరెంట్స్ కి తన డీటెయిల్స్ తెలియయకుండా జాగ్రత్త పడ్డాడు... నాకు కూడా చెప్పలేదు... ఒక రోజు తన పెళ్లి శుభలేఖ చూపించాడు. అందులో సురేంద్ర వెడ్స్ సుప్రియ అని ఉంది.

దొంగ తల్లి తండ్రులు... దొంగ బంధువులు... దొంగ స్నేహితులు... దొంగ పెళ్లి... సుప్రియ ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళు ఆమె తో కాపురం చేసాడు. ఒక రోజు తాను ముంబై లో పెద్ద జాబ్ వచ్చింది రెండు నెలల్లో సుప్రియ ని తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు కొన్నాళ్ళు ఎదురుచూసారు. ఈ లోపల నేను కూడా హైదరాబాద్ వచ్చేసాను. అదే సమయం లో మహేంద్ర పెళ్లిచేసుకొని 10 ఏళ్ళ పాటు అమెరికా వెళ్ళిపోయాడు. నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. మహేంద్ర కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము అమెరికా లో ఉన్నప్పుడు ఇక్కడ గోదావరి జిల్లాలో ఏమి జరిగిందో మాకు తెలియదు.. మహేంద్ర బిజినెస్ బాగా పెద్దదయ్యింది. ఎవరి గురించి ఆలోచించే సమయం... అవసరం రాలేదు.

రెండు సంవత్సరాల కిందట మహేంద్ర పని మీద ముంబై వెళ్ళాడు. వెంట నేను కూడా వెళ్ళాను. అక్కడ మేము మహేంద్ర ఫ్రెండ్ ఒకరిని కలవడానికి ముంబై IIT క్యాంపస్ కి వెళ్ళాము. అక్కడ చాలా ఏళ్ళ తరువాత సుప్రియ తండ్రిని చూసాము... ఒక 22 ఏళ్ళ ఆడపిల్లతో కనిపించాడు. నేను... మహేంద్ర... ఆయనని వెంటనే గుర్తుపట్టాము. ఆయనలో పెద్ద మార్పులేదు. అదే పర్సనాలిటీ... బట్ట తల... అదే లాల్చీ... పైజామా... బాగా ముసలితనం వచ్చింది. ఆయనని చూడగానే మా ఇద్దరికీ గోదావరి జిల్లా... ఇండస్ట్రీ సైట్ ఆఫీస్... సుప్రియ... దొంగ పెళ్లి... అన్ని గుర్తుకొచ్చాయి... మహేంద్ర నన్ను ఆయన గురించి ఎంక్వయిరీ చెయ్యమని చెప్పాడు.

ఆ ఎంక్వయిరీ లో... మహేంద్ర వెళ్ళిపోయినా తరువాత సుప్రియ ఫామిలీ చాలా రోజులు ఎదురుచూసారు. సుప్రియ కి ఒక పాప పుట్టింది. వాళ్లకి తాము మోసపోయామన్న విషయం చాలా నెమ్మదిగా తెలిసింది. వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి మాత్రం చాలా త్వరగా తెలిసింది. సుప్రియ తల్లి తండ్రులు ఆ ఊళ్ళో ఉండలేక వైజాగ్ వెళ్లిపోయారు. సుప్రియ మోసపోయానన్న బెంగతో చనిపోయింది. సుప్రియ తల్లి తండ్రులు స్పందన ని పెంచారు. స్పందనకి వాళ్ళు అసలు విషయం చెప్పలేదు. వాళ్ళు స్పందన కి "నువ్వు ఒక అనాధ పిల్లవి... మాకు పిల్లలు లేకపోవడంతో నిన్ను అనాధ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకుంటున్నాం" అని చెప్పారు. స్పందన కి ఎటువంటి అనుమానం రాకుండా పెంచారు. స్పందన చాలా తెలివైనది. చిన్నప్పటినుంచి ప్రతి క్లాస్ లో ఫస్ట్... స్కూల్ ఫస్ట్ వచ్చేది... 10వ తరగతి స్టేట్ లెవెల్ లో ఫస్ట్ వచ్చింది... ఇంటర్మీడియట్ లో కూడా స్టేట్ ర్యాంకర్... ఫస్ట్ అట్టెంప్ట్ లో ఆమెకి బొంబాయి IIT లో సీట్ వచ్చింది... ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ లో MBA చెయ్యడానికి అప్లై చేసింది... అక్కడ సీట్ తో పాటు ఫుల్ స్కాలర్షిప్ కూడా దొరికింది... IIT లో కోర్స్ పూర్తికాగానే అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది...

ఈ డీటెయిల్స్ ని మహేంద్ర తన లాయర్ ఫ్రెండ్ కాంతారావు కి చెప్పి సుప్రియ తండ్రిని కలవమని చెప్పాడు. కాంతారావు వెంటనే తన దగ్గర పనిచేసే ఒక జూనియర్ ని పంపించి సుప్రియ తండ్రిని పిలిపించాడు. ఇక్కడ మాకు తెలియని విషయం ఒకటి ఉంది... అదేమిటంటే... సుప్రియ తండ్రికి నెమ్మదిగా అన్ని విషయాలు తెలిసాయి. సురేంద్ర అసలు పేరు మహేంద్ర అని... పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఫామిలీ వాడని ఈజీ గా తెలుసుకున్నారు. కానీ... ఎప్పుడూ మహేంద్ర ఫామిలీ ని కలవలేదు. కాంతారావు ని కలిసినప్పుడు "నేను స్పందనకి అసలు విషయం చెప్పలేదు. ఆమె నన్ను తన తండ్రి అనుకుంటోంది. ఆమె చాలా తెలివైనది. త్వరలో పై చదువులకి అమెరికా వెళ్లబోతోంది... నా వయస్సు అయిపొయింది. నాకు తోబుట్టువులు ఎవరూ లేరు. సుప్రియ బెంగతో చనిపోయింది. నా భార్య అనారోగ్యంతో పోయింది. నేను కూడా ఎక్కువ రోజులు బ్రతకను. ఈలోపల స్పందన కి చదువు పూర్తి అయితే చాలు. ఆమె తన దారి చూసుకుంటుంది" అని చెప్పాడు.

మహేంద్ర... కాంతారావు... ఇద్దరూ ఇక్కడే పెద్ద తప్పు చేశారు. మహేంద్ర తానే తండ్రి అని స్పందన కి చెప్పాలని అనుకున్నాడు. కాంతారావు కూడా సమర్ధించాడు. వాళ్లిద్దరూ ఎప్పుడో చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దే పనిలో పడ్డారు. నేను వ్యతిరేకించాను... "మీకు ఇష్టముంటే ఆమెకి కావాల్సిన డబ్బుని ఏదైనా SCHOLARSHIP రూపంలో ఇవ్వండి... ఆమెకి తన గతం గురించి ఇప్పుడు చెప్పొద్దు. ఇండైరెక్ట్ ఆమెని సపోర్ట్ చెయ్యండి" అని చెప్పాను. వాళ్ళు వినలేదు. కాంతారావు తనతో సుప్రియ తండ్రి... పట్టాభి ని తీసుకొని ముంబై వెళ్లి స్పందనని కలిసి జరిగింది మొత్తం చెప్పాడు.

స్పందన అంతా విని "నాకు ఎవరి సహాయం అక్కరలేదు. నాకు ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ డబ్బులు చాలకపోతే నేను అమెరికాలో వుద్యోగం చేసుకుంటూ చదువుకుంటాను. నన్ను మీరు ఇంకోసారి కలవడానికి ప్రయత్నించకండి" అని ఖరాకండి గా చెప్పేసింది. మహేంద్ర ఇగో హర్ట్ అయ్యింది. ఎలాగైనా ఆమె ని ఒప్పించి డబ్బులు ఇవ్వాలని చాలా సార్లు ట్రై చేసాడు. ఆమె వినలేదు. ఒకరోజు మహేంద్ర... కాంతారావు... నేను ముంబై వెళ్ళాము... ఆమెని మేముంటున్న హోటల్ రూమ్ కి పిలిచాము... మహేంద్ర... స్పందన మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. స్పందన ఆ రూమ్ లోంచి వెళ్ళిపోతూ "నేను నీ కూతురన్న సంగతి పబ్లిక్ గా అందరికి చెప్పగలిగితే నేను నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను... నీకు 30 రోజుల టైం ఇస్తున్న... నువ్వు మా అమ్మని ప్రేమించడం... దొంగపెళ్ళిచేసుకోవడం... మమల్ని వొదిలేసి వెళ్లడం... అందరికి చెప్పాలి... లేకపోతే నేనే నేషనల్ మీడియా లో చెప్తాను" అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. స్పందన వినలేదు... మహేంద్ర కూతురు కదా... తండ్రిని మించిన మొండిది... మహేంద్ర కి అప్పుడు అర్థమయ్యింది... తాను చేసిన రెండో తప్పు... కాంతారావు డామేజ్ కంట్రోల్ చెయ్యడానికి చాలా ట్రై చేసాడు.

మహేంద్ర కి టైం బాలేదు... అదే సమయానికి రాజ్య సభ సభ్యత్వం కూడా దాదాపు ఖరారు అయింది. రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నాడు... అప్పుడే ధనంజయ "నువ్వు పబ్లిక్ లైఫ్ లో లేనంతసేపు... నువ్వు ఎన్ని వెధవ వేషాలు వేసినా ఫర్వాలేదు... రాజకీయాల్లోకి వచ్చాక నువ్వు సుప్రియ ని మోసం చేశావన్న విషయం బయటకి వస్తే... నీ రాజకీయ జీవితమే కాదు... వ్యక్తిగత జీవితం కూడా దెబ్బ తింటుంది. నీ లైఫ్ ఫినిష్ అవుతుంది" అని అన్నాడు. ఈ మాటలు మహేంద్ర మీద చాలా ప్రభావం చూపించాయి... నెమ్మదిగా తాను చేసిన రెండో తప్పు తెలిసింది. ఎలా బయటపడాలో ఆలోచించాడు... స్పందన ని ముంబై లోనే లేపెయ్యాలని ప్లాన్ వేసాడు. పట్టాభి ముసలోడు... వాడిని ఎప్పుడైనా డీల్ చెయ్యొచ్చు అనుకున్నాడు... కాంతారావు దానికి ఒప్పుకోలేదు... "నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే... హైదరాబాద్ లో చెయ్యి... ముంబై లో ఏదైనా పొరపాటు జరిగితే మన కంట్రోల్ లో ఉండదు. ఇక్కడ ఏది జరిగినా... ధనంజయ చూసుకుంటాడు" అని అన్నాడు.

మహేంద్ర వెంటనే స్పందనకి ఫోన్ "నువ్వు మీ తాత ని తీసుకొని హైదరాబాద్ వచ్చెయ్యి... నిన్ను మావాళ్లకి పరిచయం చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ముందు నా ఫామిలీ కి పరిచయం చేస్తాను. ఆ తరువాత నెమ్మదిగా అందరికి నిన్ను పరిచయం చేస్తాను. నా వైఫ్ కి ఆల్రెడీ చెప్పాను" అని అన్నాడు. అది నమ్మి స్పందన... పట్టాభి హైదరాబాద్ వచ్చారు." అంటూ ముగించాడు.

అవినాష్ : మీరు అసలు మనుషులేనా... ఒక అమ్మయిని మోసంచేశారు... దొంగపెళ్ళి చేసుకొని సంసారం చేసి వొదిలేశారు... పాపం ఆ కుటుంబం వాళ్లకి జరిగిన అన్యాయం తెలిసినా మీ దగ్గరికి రాలేదు. మీడియా దగ్గరకి వెళ్ళలేదు. పాపం వాళ్ళ దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. మీకు వాళ్ళ ఉనికి తెలిసినప్పుడు మీరు కామ్ గా వుండాల్సింది పోయి... వాళ్ళ జీవితాల్ని కెలికారు. మహేంద్ర ఇగో దెబ్బతిన్నదని చాలా సింపుల్ గా చెప్పావు. పట్టాభి ని ఆ పెట్రోల్ బంక్ లో చంపేశారు... స్పందనని కిడ్నప్ చేసి రేప్ చేసి టార్చర్ చేసి రోడ్ మీద పడేసారు. చివరికి ఆమె చనిపోతే ఒక అనాథ శవంలా ఎవరికి తెలియకుండా అంత్యక్రియలు చేశారు. ఆ మహేంద్ర ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేసాడు?

కళాధర్ : చాలా మందిని... వాళ్ళందరిని డబ్బుతో కొనేసాడు. స్పందన విషయం లో కూడా డబ్బుతో పని పూర్తి చెయ్యాలని చూసాడు. కుదరలేదు.

అవినాష్ నిశబ్దం గా లేచి తనతో పాటు శేఖర్... శ్రీధర్ ని బయటకి వెళ్ళాడు...

అవినాష్ : నెక్స్ట్ ప్లాన్ ఏమిటీ?

శేఖర్ : అందరి దృష్టిలో కైలాష్... కిషన్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు. కళాధర్ కిడ్నప్ అయిన విషయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది.

అవినాష్ : మీ ఇష్టం... వాళ్ళని వొదిలేసినా... లేక ఏదైనా చేసినా... నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంతా మీ ఇష్టం. మీకు ఏది రైట్ అనిపిస్తే అది చెయ్యండి. ఫైనల్ గా మీరు ఏమి చేసింది చేప్తే చాలు. జస్ట్ ఫర్ మై ఇన్ఫర్మేషన్... నాట్ ఫర్ రికార్డ్స్...

అవినాష్ వెళ్ళిపోయాడు.

శేఖర్ (శ్రీధర్ తో): ఏమి చేద్దాం?

శ్రీధర్ : ఏం చెప్పబోతున్నానో డీటెయిల్ గా చెప్పమంటారా... లేక... అంతా అయ్యాక "పని పూర్తి అయ్యింది" అని చెప్పమంటారా...

శేఖర్ : పని పూర్తి అయితే చాలు. ఇక నీ ఇష్టం...

శేఖర్ కూడా వెళ్ళిపోయాడు. శ్రీధర్ వెంటనే పారిపోవడానికి కైలాష్ వాడిన SUV దగ్గరికి వెళ్లి... బోనెట్ పైకెత్తి... ముందుగా ఇంజిన్ నెంబర్ లేపేసాడు... తరువాత చాసిస్ నెంబర్ కూడా తుడిపేసాడు. వెనక సీట్లో రెండు పెద్ద పెద్ద కేన్స్ లో పెట్రోల్ నింపి పెట్టాడు. గుడి లోకి వెళ్లి ముందు కిషన్ కి కట్లు విప్పి అతని చేతులు వెనక్కి విరిచి కట్టేసి... నోటికి ప్లాస్టర్ వేసి మొహానికి ముసుగు వేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి SUV వెనక సీట్ లోపడేసి ఎవరికి కనపడకుండా దుప్పటి కప్పేసాడు... అదే విధంగా కళాధర్... కైలాష్ ని కూడా కట్టేసి SUV లో పడేసి డ్రైవర్ సీట్ లో కూర్చొని నడుపుకుంటూ ఊరి బయట అడవి ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. శ్రీధర్ వెనకాలే ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా రెండు మోటార్ సైకిల్స్ మీద ఫాలో అయ్యారు. అడవిలో బాగా దూరంగా తీసుకొని వెళ్లి SUV ఆపాడు. చుట్టూ చిట్టడవి... కనుచూపుమేర ఎటువంటి జన సంచారం లేదు... సమయం సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది... తన వెనకాలే వచ్చిన కానిస్టేబుల్స్ తో "బాగా ఎండిపోయిన కట్టెలు కావాలి... ఈ ముగ్గురిని... వెహికల్ తో సహా ఆనవాళ్లు లేకుండా తగలపెట్టాలి... బాగా పెద్ద ఎత్తున కట్టెలు కావాలి... ఈ అడవిలో దొరికింది తీసుకొని రండి... ఈ రోజుతో ఈ ముగ్గురి జీవితాలు సమాప్తం కావాలి" అని అన్నాడు.కానిస్టేబుల్స్ ఇద్దరూ ఎండు కట్టెలు తీసుకొని రావడానికి తలోదిక్కు వెళ్లారు... దాదాపు రెండు గంటల సేపు కట్టెలు ఏరుకొని తీసుకొచ్చారు.

శ్రీధర్ తనతో పాటు తెచ్చుకున్న ఒక పెద్ద కత్తితో ముందు కిషన్... తరువాత... కళాధర్... కైలాష్ ల పీకలు కర్కశంగా కోసేశాడు... ఆ ముగ్గురూ మెడ కోసిన కోడి పుంజుల్లాగా గింజుకున్నారు... వారి నోట్లోంచి మాట బయటకి రాలేదు... కానిస్టేబుల్స్ తాము తీసుకొచ్చిన ఎండు కట్టెలు SUV లోపల... బయట... కిందా... పైన కుక్కి నింపేశారు... ఇప్పుడు SUV స్తానం లో ఒక పెద్ద కట్టెల మోపు ఉంది. వాళ్ళతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ మొత్తం ఆ కట్టెల మోపు మీద పోసేసి... నిప్పంటించారు. దాంతో కైలాష్ గౌడ్... కళాధర్... కిషన్ ల జీవితాలు ముగిసాయి.

అవినాష్ తన ఆఫీస్ కి వెళ్లి OP CENTER కి ఫోన్స్ చేసి మొత్తం డీటెయిల్స్ చెప్పాడు...

>

సరిగ్గా అదే సమయానికి కెమికల్స్ లో గ్రాన్యూల్స్ ట్యూబ్స్ వేసి 216 గంటలు పూర్తి అయ్యింది. MACHATE... TELCHAT... CHAPORI... నాలుగో లొకేషన్... అన్ని చోట్ల కెమికల్స్ ఉన్న కార్బాయ్స్ లోని ట్యూబ్స్ మూడు పొరలు పూర్తిగా కరిగిపోయాయి... ఒక్కసారిగా గ్రాన్యూల్స్ ఆ కెమికల్స్ లోకి రిలీజ్ అయ్యాయి... 15 సెకండ్స్ లో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యింది... ముందుగా ఆ కార్బాయ్స్ లోంచి పొగలు వచ్చాయి... ఆ పొగ ఘాటుకి చుట్టూ వున్న జనానికి ముందుగా కళ్ళు మండాయి... ఆ తరువాత కంటి చూపు పోయింది... ఊపిరి ఆడలేదు... ఒక్కసారిగా పెద్ద శబ్దం తో అన్ని కార్బాయ్స్ పేలిపోయాయి... వాటి లోని కెమికల్ ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మొత్తం వ్యాపించింది... ఆ కెమికల్స్ అప్పటికే అక్కడ వాడుతున్న వేరే కెమికల్స్... తయారవుతున్న డ్రగ్స్ తో కలవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి... అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా అంటుకోవడం తో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడి పెద్ద పెద్ద పేలుళ్లు సంభవించాయి...

డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అన్ని కొండల మధ్య లోయల్లో ఉండడంతో పేలుళ్ల శబ్దాలు చాలా దూరం రీసౌండ్ చేశాయి... చుట్టూ ఉన్న అడవుల్లో జంతవులు భయంతో కకావికలాంగా పరుగులు తీశాయి... TELCHAT లొకేషన్ కి దగ్గరలోవున్న రాపూరు గ్రామస్తులకు పేలుడు శబ్దాలు వినిపించాయి. వాళ్ళు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పారు. ఒక అరగంటలో ఈ విషయం హైదరాబాద్ పోలీస్ కి తెలిసింది. కానీ... పేలుడు సంభవించిన 5 నిమిషాల్లోనే బ్రతికి బయటపడిన సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే ఈ విషయాన్ని కమాండ్ సెంటర్ కి తెలియచేసారు. మహేంద్ర కి ఇంకో 5 నిమిషాల్లో తెలిసింది.

మహేంద్ర బుర్ర చాలా చురుగా పనిచేసింది... వెంటనే ఫోన్ చేసి " వికాస్... నువ్వు అర్జెంటు గా లండన్ రా... జీవితం లో నువ్వు ఊహించనంత పెద్ద డీల్ చేయాలి" అని అన్నాడు.


Part - 31 - The New Deal

లండన్ మహానగరం... ఉదయం 11 గంటల సమయం... మహేంద్ర సెంట్రల్ లండన్ లోని హైడ్ పార్క్ బెంచ్ మీద కూర్చొని వికాస్ దేశాయ్ కోసం వెయిట్ చేస్తున్నాడు... వికాస్ 30 నిమిషాలు లేట్ గా వచ్చాడు...

మహేంద్ర : నువ్వు నేను చెప్పిన టైం కి రాలేదంటే... నీకు ఈ మీటింగ్ మీద పెద్ద ఆసక్తి లేదనుకుంటాను

వికాస్ : మీ మీదున్న గౌరవంతో ఈ రోజు వచ్చాను... ఢిల్లీ లో అందరూ మీరు HINDUSTAN LEAVER CLUB లో చేరారు అనుకుంటున్నారు.

మహేంద్ర(నవ్వుతూ): నాకు ఆ ఆలోచన లేదు... ఆ క్లబ్ లో చేరాల్సిన అవసరం కూడా లేదు. లాస్ట్ టైం మనం కలిసినప్పుడు మనం ఒక ఒప్పందానికి వచ్చాము... నేను LUTYENS SOCIETY మెంబెర్స్ కి ఒక ఫార్మ్ ఇస్తానని చెప్పను... ఇచ్చాను... దానికి బదులుగా ప్రొటెక్షన్ కోరాను... అయినా కూడా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చేశారు... నా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్స్ ని తగలబెట్టారు. ఏదైనా పొరపాటు జరిగిందా? నేను ఇచ్చిన మాట సరిగ్గా నిలపెట్టుకోలేదా?

వికాస్ : నాకు తెలిసి అలాంటిదేమి లేదు...

మహేంద్ర : మరి... నాకు ఇలా భారీ స్థాయి లో ఎందుకు నష్టం కలిగించారు?

వికాస్ : మీకు కలిగిన నష్టానికి... LUTYENS SOCIETY కి సంభంధం లేదు... మీ డ్రగ్స్ కాన్ఫిస్కేట్ చేసింది NCB

మహేంద్ర : నాకు తెలిసి... NCB ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ... LUTYENS SOCIETY మెంబెర్ కి తెలియకుండానే రైడ్స్ జరిగాయా? NCB కాన్ఫిస్కేట్ చేసిన డ్రగ్స్ లో ఆ మెంబెర్ కి చెందిన డ్రగ్స్ కూడా ఉన్నాయి.

వికాస్: అదంతా చాలా పెద్ద లెవెల్ లో జరిగింది... రైడ్స్ జరిగేదాకా మీ WELL WISHER కి కూడా తెలియదు. ఇప్పుడు మీరు చాలా పెద్ద ప్రాబ్లెమ్ లో ఉన్నారు. వాళ్ళు మీకు హెల్ప్ చెయ్యడానికి ముందుకురారు...

మహేంద్ర: ప్రాబ్లెమ్? ఏం ప్రాబ్లెమ్??

వికాస్ : మీరు ఇంటర్నేషనల్ డీలర్స్ దగ్గరనుంచి భారీ ఎత్తున డబ్బులు అడ్వాన్స్ గా తీసుకున్నారని... ఇప్పుడు ఆ డీలర్స్ ప్రోడక్ట్ ఇచ్చే స్థితిలో లేరని... మీ ఆఫ్ షోర్ బ్యాంకు అకౌంట్స్ లో ప్రాబ్లెమ్ వచ్చిందని... మీ పర్సనల్ సెక్రటరీ కళాధర్ కనిపించడం లేదని... కళాధర్ మీ బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మాయం చేసాడని... మీరే ఆయనని ఎదో చేశారని... రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

మహేంద్ర: నా ఆఫ్ షోర్ బ్యాంకు అకౌంట్స్ లో డబ్బులు మాయమైన మాట నిజమే... కానీ... దానికి... కళాధర్ కి ఎటువంటి సంభంధం లేదు. నేను ప్రోడక్ట్ డెలివర్ చెయ్యలేని స్థితిలో ఉన్నానని ఎవరు చెప్పారు? NCB ట్రాన్స్పోర్ట్ చేస్తున్న డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చేశారు... మిగతా చోట దాచిన డ్రగ్స్ ని వాళ్ళు టచ్ చెయ్యలేదు...

వికాస్ : లేదు... వాళ్ళు మీ డ్రగ్స్ అన్నింటిని కాన్ఫిస్కేట్ చేశారు... లారీ లో వస్తున్న డ్రగ్స్ ని హైవే మీద ఆపేసారు... కొచ్చిన్ పోర్ట్ లో ఒక కంటైనర్ ని స్వాధీనం చేసుకున్నారు... లక్షదీప్ లో మీరు దాచిన డ్రగ్స్ ని కూడా కోస్ట్ గార్డ్ పట్టుకున్నారు...

మహేంద్ర(నవ్వుతూ): కొచ్చిన్ పోర్ట్ కంటైనర్ ని ఓపెన్ చేశారా?

వికాస్: తెలియదు

మహేంద్ర : ఫోన్ చేసి వెంటనే ఓపెన్ చెయ్యమని చెప్పండి...

వికాస్ కి ఎదో అనుమానం వచ్చింది... వెంటనే LUTYENS SOCIETY లో మహేంద్ర WELL WISHER కి ఫోన్ చేసి కొచ్చిన్ పోర్ట్ లో కంటైనర్ ని అర్జెంటు ఓపెన్ చేసి చెక్ చేయమని చెప్పాడు...

మహేంద్ర : నేనంటే ఏమనుకుంటున్నారు? మీరు చెప్పినట్లు ఆడే బొమ్మననుకుంటున్నానురా? నా జాగ్రత్తలో నేనున్నాను... మీరు సీజ్ చేసిన కంటైనర్ లో డ్రగ్స్ లేవు. అవి ఎప్పుడో దేశం దాటాయి... చేరాల్సిన చోటికి చేరాయి... డెలివరీ జరిగిపోయింది. NCB కాన్ఫిస్కేట్ చేసిన ప్రోడక్ట్ వల్ల నాకు బానే నష్టం కలిగింది... డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని కాల్చెయ్యడం తో బిజినెస్ పూర్తిగా నాశనమయ్యింది. కానీ... నా డెలివరీ కమిట్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లెమ్ రాలేదు...

అదే సమయంలో వికాస్ మొబైల్ కి కాల్ వచ్చింది... అవతల వ్యక్తి చెప్పింది విని షాక్ అయ్యాడు...

మహేంద్ర: చెప్పగా... ఆ కంటైనర్ లో డ్రగ్స్ లేవు... ఇంకో సంగతి చెప్పనా... లక్షద్వీప్ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ పట్టుకున్న డ్రగ్స్ నావి కాదు... ఎవరివో తెలుసా?

వికాస్(కొంచం ఖంగారుగా): ఎవరివి?

మహేంద్ర: అవి సౌత్ ఆఫ్రికా నుంచి శ్రీలంక మీదుగా... మలేసియా... ఇండోనేషియా... ఆస్ట్రేలియా... న్యూజిలాండ్ వెళ్తున్న సౌత్ ఆఫ్రికన్ డ్రగ్ కార్టెల్ CONSIGNMENT... నా ప్రోడక్ట్ వేరే ద్వీపం లో ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ సౌత్ ఆఫ్రికన్ డ్రగ్స్ పట్టుకోగానే... నేను మా స్టాక్ మొత్తం వేరే షిప్ లో పంపేసాను. నాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు. నేను ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. కాకపోతే... ఎన్నో ఏళ్లుగా ఏర్పర్చుకున్న నా డ్రగ్స్ బిజినెస్ మొత్తం నాశనమయ్యింది. ఈ పని ఎందుకు చేశారు? ఇంటలిజెన్స్ బ్యూరో దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ని NCB ఎందుకిచ్చారు? పారామిలటరీ ఫోర్స్ ని ఎవరు అప్రూవ్ చేశారు? ఎందుకు చేశారు? నాతో అన్నింటికీ వొప్పుకొని సడన్ గా రైడ్స్ ఎందుకు చేయించారు? డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని ఎందుకు పేల్చేశారు? దీనివల్ల నాకు ఎటువంటి లాస్ లేదు. ఇప్పుడు మీరు కావాలన్న నన్ను డ్రగ్స్ రాకెట్ లో ఇరికించలేరు. నేను చేస్తున్న ఇతర వ్యాపారాలన్నీ లీగల్... ఎటువంటి IRREGULARITY మీకు దొరకదు. నిన్ను ఇక్కడికి పిలిచింది కొత్త డీల్ కోసం కాదు... నువ్వు ఇదివరకు చేసిన డీల్ గురించి డిస్కస్ చేయడానికి పిలిచాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికేదాకా నువ్వు హైడ్ పార్క్ దాటి పోలేవు. ఇక్కడ నా మనుషులు ఉన్నారు. సిగ్నల్ ఇస్తే చాలు నిన్ను మాయం చేస్తారు. చెప్పు... ఏం జరిగింది?

వికాస్ చాలా సేపు మాట్లాడకుండా కూర్చున్నాడు... చివరికి మాట్లాడసాగాడు...

వికాస్ : LUTYENS SOCIETY లో కొంత మంది మెంబెర్స్ కి మీరంటే ఇష్టం లేదు... మీరు వాళ్ళని సరిగ్గా గౌరవించరని బాగా కోపం... పార్టీస్ కి పిలిచినా రారు... మీరు వాళ్ళని లెక్క చెయ్యరని చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీకు రాజ్యసభ సభ్యత్వం.... యూనియన్ కాబినెట్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం వాళ్లకి ఇష్టం లేదు. మనం ఇది వరకు కలిసినప్పుడు మీరు పెట్టిన కండిషన్స్ వాళ్లకి నచ్చలేదు. వాళ్ళు మిమల్ని కంట్రోల్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. మీరు వాళ్లకి లొంగడం లేదు. అందుకే మీ మీద కేసులు పెట్టి లోపల వెయ్యాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని వాళ్ళ ప్రయత్నం.

మహేంద్ర: ఆ డ్రగ్స్ కి నాకు ఏమిటీ సంబంధం? NCB డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చెయ్యగానే... కైలాష్ గౌడ్... కిషన్... అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు. ఆ డ్రగ్స్ వాళ్ళవని చెప్తాను. మీరు నా మీద ఎలా కేసు పెట్టగలరు? కేసు పెట్టినా నేను ఈజీ గా బయటకి వచ్చేస్తాను. ఇప్పుడు మీరు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని కూడా నాశనం చేసేసారు... డ్రగ్స్ లేవు... మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ లేవు... నన్ను ఎలా ఇరికిస్తారు?

వికాస్: అదే ఎవ్వరికీ అర్ధం కావడం లేదు... ఇంటలిజెన్స్ బ్యూరో కి మీ డ్రగ్స్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసాయి... అదీగాక మనం కలిసినప్పుడు మీరు LUTYENS SOCIETY మెంబెర్స్ కి మీరు ఒక లోకేషన్ కూడా ఇచ్చేసారు... మీ డ్రగ్ నెటవర్క్ వాళ్లకి పూర్తిగా తెలుసు... డ్రగ్స్ ని కాన్ఫిస్కేట్ చేసి మిమ్మల్ని అరెస్టు చెయ్యాలని ప్లాన్ చేశారు... అందుకే NCB కి డ్రగ్స్ ని సీజ్ చెయ్యమని ఆర్డర్స్ ఇచ్చారు... పారామిలటరీ ఫోర్స్ ని కూడా అప్రూవ్ చేశారు... డ్రగ్స్ సీజ్ అయ్యాయి... మీ కమాండ్ సెంటర్ మార్చిన విషయం వాళ్లకి తెలిసింది. వాళ్ళకి మీ కమాండ్ సెంటర్ లో కంప్యూటర్స్ కి యాక్సిస్ ఉంది. మీరు అడ్వాన్స్ గా తీసుకున్నడబ్బుని కూడా వాళ్ళే మాయం చేశారు. మీ డ్రగ్స్ కాన్ఫిస్కేట్ చేసి... మీ ఆఫ్ షోర్ అకౌంట్స్ లో డబ్బులు మాయం చేస్తే మీరు మీ కస్టమర్స్ కి డ్రగ్స్ సప్లై చెయ్యలేక... డబ్బులు వాపస్ ఇవ్వలేక ఇబ్బందుల్లో పడతారు. తీసుకున్న అడ్వాన్స్ కి సరిపడా డ్రగ్స్ ఇవ్వకపోయినా... డబ్బులు వాపస్ ఇవ్వకపోయినా... ఆ డ్రగ్ కార్టెల్ కస్టమర్స్ మిమ్మల్ని చంపేస్తారని ఊహించారు. వాళ్ళ చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుందని... మీరు నడుపుతున్న ఆ నాలుగు డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని వాళ్ళు కంట్రోల్ చేయవచ్చు అని అనుకున్నారు. పైగా మీ దగ్గర దేశానికి సంభందించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందని వాళ్ళ అనుమానం... ఇదే వాళ్ళ ఒరిజినల్ ప్లాన్...

మహేంద్ర: మరి... ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ని ఎందుకు పేల్చేశారు?

వికాస్ : అదే పెద్ద మిస్టరీ... డ్రగ్స్ కాన్ఫిస్కేషన్ మాత్రమే ప్లాన్ చేశారు. ఆ రోజు డ్రగ్స్ సీజ్ కాగానే... కైలాష్ గౌడ్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు... మీరు అదే రోజు దేశం వొదిలి వెళ్లిపోయారు... దాంతో LUTYENS SOCIETY మెంబెర్స్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందని సెలెబ్రేట్ చేసుకుందామని ఆ రోజు నైట్ పెద్ద పార్టీ ఏర్పాటు చేసుకున్నారు... కానీ... అంతకు ముందే ఆ నాలుగు లొకేషన్స్ పేలి పోయాయి... ఎవరు పేల్చారో... ఎందుకు పేల్చారో... తెలియదు... దీంతో వాళ్ళ ప్లాన్ పూర్తిగా అప్సెట్ అయింది. ఇప్పుడు చూడబోతే... మీరు మీ కస్టమర్స్ కి డ్రగ్స్ ని డెలివర్ చెయ్యడం కూడా జరిగిపోయింది... మనీ ప్రాబ్లెమ్ కూడా లేదు. యు అర్ ఆ ఫ్రీ బర్డ్.

మహేంద్ర(చాలా కూల్ గా): ఇప్పుడు మాట్లాడుకుందాం కొత్త డీల్... ఫ్రెష్ డీల్... న్యూ కండిషన్స్... ఎందుకైనా మంచింది నువ్వు ఒక్కసారి మీ LUTYENS SOCIETY కస్టమర్స్ కి ఫోన్ చేసి అన్ని విషయాలు క్లియర్ గా చెప్పి... వాళ్ళ పర్మిషన్ తీసుకో... ముందుగా... మీ వాళ్ళు నా ఆఫ్ షోర్ అకౌంట్స్ లోంచి కొట్టేసిన డబ్బులు వెంటనే... ఈ బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పు... ఇది న్యూ డీల్ లో కండిషన్ కాదు.

మహేంద్ర ఒక పేపర్ మీద స్విస్ బ్యాంకు అకౌంట్ పేరు... అకౌంట్ నెంబర్... IBAN వ్రాసి ఇచ్చాడు. వికాస్ దేశాయ్ LUTYENS SOCIETY మెంబెర్ కి ఫోన్ చేసి లండన్ లో మహేంద్ర తో జరిగిన సంభాషణ గురించి చెప్పి... ముందుగా లక్షద్వీప్ లో దొరికిన డ్రగ్స్ ఎవరివో కనుక్కోమని చెప్పాడు. మహేంద్ర కొత్త డీల్ మాట్లాడడానికి పర్మిషన్ అడిగాడు. "మహేంద్ర కండిషన్స్ ఏమిటో తెలుసుకో... నేను మా వాళ్ళతో మాట్లాడి ఇంఫార్మ్ చేస్తాను... మహేంద్ర చెప్పింది కరెక్ట్... ఆ డ్రగ్స్ సౌత్ ఆఫ్రికన్ వాళ్ళవి." అని చెప్పాడు.

మహేంద్ర ఒక గంటసేపు తనకి ఏమి కావాలో చాలా వివరంగా వికాస్ కి చెప్పి వెళ్ళిపోయాడు. వికాస్ బుర్ర కంప్లీట్ గా బ్లాంక్ అయ్యింది... "ఇదేమిటీ? మహేంద్ర ని ఇరికిద్దామనుకుంటే... మొత్తం LUTYENS SOCIETY ని తన కంట్రోల్ లోకి తీసుకొనే ప్లాన్ వేసాడు" అని అనుకున్నాడు. ఫోన్ చేసి LUTYENS SOCIETY మెంబెర్ కి మహేంద్ర కొత్త డీల్ కండిషన్స్ ఒక్కొక్కటి చాలా క్లియర్ గా చెప్పాడు. అంతా విన్న తరువాత WELL WISHER చాలా సేపు మాట్లాడకుండా కూర్చింది పోయాడు. ముందు ఒక ఫోన్ కాల్ చేసి మహేంద్ర డబ్బులు స్విస్ బ్యాంకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పాడు... రెండో ఫోన్ కాల్ లండన్ లో ఒక పాత ఫ్రెండ్ కి ఫోన్ చేసి "बारात निकलने का वक्त आ गया... दुल्हन घर पर मिलेगी। तोफा दे दो"... అంటే... మహేంద్ర ని వెంటనే చంపెయ్యమని ఆర్డర్స్ ఇచ్చాడు


ఆ రోజు రాత్రి లండన్ నుంచి బ్రైటన్ వెళ్లే దారిలో ఒక వాన్ వెళ్తోంది... అందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అందరూ నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఎవరూ మాట్లాడుకోవడం లేదు. కార్ రేడియో లో సాంగ్స్ వింటూ వెళ్తున్నారు. లండన్ కి దూరంగా హార్లీ అని ఒక చిన్న టౌన్ ఉంది. ఆ ఊర్లో ఒక మోస్తరు ఇంటికి కొంచం దూరంలో ఆ వాన్ ఆగింది. రోడ్ మీద జనసంచారం లేదు. ఆ నలుగురు వ్యక్తులు ఆ వాన్ దిగి కొంచం దూరంలోని ఒక ఇంటి కాంపౌండ్ లోకి ప్రవేశించారు. ఆ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో లైట్ వెలగడం లేదు. ఫస్ట్ ఫ్లోర్ బెడ్ రూమ్ లో నైట్ లాంప్ వెలుగుతోంది. వాళ్ళు మెయిన్ డోర్ సమీపించారు... డోర్ హేండిల్ మీద చెయ్యి వెయ్యబోయి ఎదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగారు... వాళ్ళ వెనకాల వేరే ఆరుగురు వ్యక్తులు తుపాకులు పట్టుకొని నుంచున్నారు... వాళ్ళ తుపాకులకు సైలెన్సర్స్ ఉన్నాయి. ఆ తుపాకులు సైలెంట్ గా గర్జించాయి... ముందున్న ఆ నలుగురు చనిపోయారు. ఆ ఆరుగురు సైలెంట్ గా వెళ్లి పోయారు. వాళ్లల్లో ఒకడు తన మొబైల్ లో ఇండియా కి ఒక ఫోన్ కాల్ చేసి 5 సెకండ్స్ మాట్లాడి... ఆఫ్ చేసి దాంట్లోంచి SIM కార్డు తీసేసి నోట్లో వేసుకొని నమిలేశాడు. మొబైల్ ఫోన్ ని పేవుమెంటు మీద పడేసి కాలితో విరిగిపోయేలా తొక్కేసి ఆ ముక్కలు డ్రైనేజీ కెనాల్ లో పడేలా తోసేసి వెళ్ళిపోయాడు.

లాయర్ కాంతారావు ఢిల్లీ లోని WELL WISHER కి ఫోన్ చేసి "ఏమిటీ? మహేంద్ర మీద నువ్వు చేసిన ఎటాక్ ఫెయిల్ అయ్యిందని విన్నాను... అదే నిజమైతే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది..." అని అన్నాడు... WELL WISHER వెంటనే లండన్ లో తన ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు... ఆ ఫ్రెండ్ "అవును... టార్గెట్ మిస్ అయ్యింది... మీవాడు పారిపోయాడు" అని చెప్పాడు.

సరిగ్గా అదే సమయానికి GATWIK ఎయిర్పోర్ట్ నుంచి ఒక గల్ఫ్ స్ట్రీమ్ G500 ఆకాశంలోకి లేచింది... అందులో ఒకే ఒక్క పాసెంజర్ ఉన్నాడు... ఆ విమానం 20000 అడుగుల ఎత్తుకు చేరగానే... పైలట్... "MR. MAHENDRA... THE SKIES ARE CLEAR... WE SHOULD BE ABLE TO REACH VIENNA IN 4 HOURS TIME. RELAX AND ENJOY THE FLIGHT ... "


Part - 32 - The Hell is here.....

వికాస్ దేశాయ్ లండన్ హైడ్ పార్క్ లో మహేంద్ర ని కలవబోతున్నాడని తెలియగానే మాధవ్ హైడ్ పార్క్ కి దగ్గరలోనే తన మనుషులతో మాటువేసి వికాస్ పార్క్ లోపలికి వెళ్ళే లోపల పట్టుకున్నాడు.

మాధవ్ : నేనెవరో తెలుసా?

వికాస్(కొంచం భయంగా) : తెలుసు... RAW ఆఫీసర్...

మాధవ్ : భయపడకండి... ఒక చిన్న హెల్ప్ కావాలి... మాకు మహేంద్ర ఫోన్ ని హాక్ చెయ్యడం లో మీ హెల్ప్ కావాలి... మీ ఫోన్ ఇస్తారా...

వికాస్ చాలా భయంగా తన మొబైల్ ఫోన్ ఇచ్చాడు. మాధవ్ తనతో పాటు వచ్చిన iKHAN కి ఆ ఫోన్ ఇచ్చాడు... iKHAN ఆ ఫోన్ ని తన లాప్ టాప్ కి కనెక్ట్ చేసి అందులో ఒక SPYWARE app ను INSTALL చేసి వెనక్కి ఇచ్చేసాడు. "ఇప్పుడు మీరు మహేంద్ర కి ఫోన్ చేసి తన లొకేషన్ లింక్ పంపమని అడగండి..." అని అన్నాడు మాధవ్... వికాస్ ఫోన్ చేసి హైడ్ పార్క్ లో మహేంద్ర ఎక్కడుంది లొకేషన్ లింక్ పంపమని అడిగాడు. మహేంద్ర వెంటనే తన లొకేషన్ లింక్ ని వాట్సాప్ ద్వారా పంపాడు... అంతే... వికాస్ మొబైల్ ఫోన్ ద్వారా iKHAN SPYWARE app ని రిమోట్ గా మహేంద్ర మొబైల్ ఫోన్ లో ఇంస్టాల్ చేసాడు. ఇప్పుడు మహేంద్ర మొబైల్ ఫోన్ మాధవ్ టీం ఆధీనం లో కి వచ్చింది. హైడ్ పార్క్ లో వికాస్... మహేంద్ర ల మధ్య మీటింగ్ పూర్తి అయ్యే లోపల... iKHAN మహేంద్ర ఫోన్ ని పూర్తిగా చెక్ చేసాడు... ఫోన్ కాల్ రికార్డ్స్... SMS... వాట్సాప్ లిస్ట్... ఇమెయిల్... ఇతర ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నింటిని క్షుణ్ణంగా చెక్ చేసాడు... ఇమెయిల్ చెక్ చేసినప్పుడు.... మహేంద్ర ఇంకో రెండు రోజుల్లో వియన్నా లో ఒక వెపన్స్ డీలర్ ని కలవబోతున్నట్లు తెలిసింది... అతని పేరు " THE APPROVER... " ఈ పేరు వినగానే... మాధవ్ అలెర్ట్ అయ్యాడు...

ఇంటర్నేషనల్ స్పై నెట్వర్క్ లో THE APPROVER అన్న పేరు మాధవ్ చాలా సార్లు విన్నాడు... ఆ APPROVER రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియదు... APPROVER ఆడదా... మగవాడా... కూడా తెలియదు. కానీ... చాలా మంది THE APPROVER సర్వీసెస్ ని వాడుకుంటారు. THE APPROVER ఎటువంటి డీల్ అయినా చెయ్యగలడు... ఉదాహరణకు... ఇంగ్లాండ్ లో ఒక BUYER... రష్యా లో ఉన్న ఒక SELLER నుంచి ఒక ఐటెం కొనాలని అనుకున్నాడు... కానీ.... ఆ ఐటెం నిజం గా ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవడం కోసం THE APPROVER సర్వీసెస్ ని వాడుకుంటాడు. THE APPROVER రష్యా వెళ్లి SELLER ని కలసి ఐటెం చూసి అది ఒరిజినల్ అవునో కాదో... ఫోన్ చేసి BUYER చెప్తాడు. అప్పుడు BUYER డబ్బులు SELLER అకౌంట్ కి ట్రాన్సఫర్ చేస్తాడు. SELLER ఆ ఐటెం ని THE APPROVER కి ఇస్తాడు. THE APPROVER ఆ ఐటెం ని జాగ్రత్తగా BUYER చేరుస్తాడు. చివరికి THE APPROVER కి మంచి కమిషన్ దొరుకుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ వరల్డ్ లో THE APPROVER కి చాలా పెద్ద పేరు ఉంది. THE APPROVER ఎప్పుడూ SELLER దగ్గరకే వెళ్తాడు... అంటే ఇంకో రెండు రోజుల్లో మహేంద్ర ఎదో అమ్మబోతున్నాడని అర్ధమయ్యింది... అప్పటినుంచి మాధవ్ మనుషులు మహేంద్ర ని క్లోజ్ గా ఫాలో అవ్వసాగారు... మహేంద్ర ఫోన్ ఆక్టివిటీ ని మోనిటర్ చేశారు. ఇన్కమింగ్... అవుట్ గోయింగ్ ఫోన్ కాల్స్ వినసాగారు... మహేంద్ర కి ఆ రోజు ఈవెనింగ్ కాంతారావు ఫోన్ చేసి " ఈ రాత్రి నీ మీద ఎటాక్ జరగబోతోంది... నేను కౌంటర్ ఎటాక్ ప్లాన్ చేసాను... నువ్వు ఈ రాత్రే వియన్నా వెళ్ళిపో" అని చెప్పాడు...

మాధవ్ వెంటనే వియన్నా చేరుకొని ఇండియన్ ఎంబసీ కి వెళ్లి ఒక టీం ని తయారుచేసుకున్నాడు... ఇద్దరు ఏజెంట్స్ మహేంద్ర ప్రయాణిస్తున్న విమానం వియన్నా లో ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పటి నుంచి ఫాలో అవ్వసాగారు. మహేంద్ర ఎక్కిన కార్ వియన్నాలో ప్రైవేట్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి దాదాపు 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న HALLSTATT అనే చిన్న వూళ్ళో ఒక విల్లా చేరుకున్నాడు. మహేంద్ర ని ఫాలో అవుతున్న ఏజెంట్స్ ఈ విషయాన్ని వెంటనే ఫోన్ చేసి ,మాధవ్ కి చెప్పాడు... మాధవ్ ఆ విల్లా లొకేషన్ మీ మ్యాప్ లో చెక్ చేసాడు... ఆ విల్లా ఊరికి దూరంగా ఉంది. చుట్టూ దాదాపు 10 కిలోమీటర్స్ దాకా ఎటువంటి మానవ సంచారం లేదు... విల్లా కి ముందు భాగం లో మెయిన్ రోడ్ కి అన్నికోని ఒక పార్క్ వుంది... వెనక భాగం లో పెద్ద అడవి కనిపిచింది... మాధవ్ ఆ విల్లా చుట్టూ ప్రతి ఎంట్రీ పాయింట్ కవర్ అయ్యేలా ప్రతి 20 డిగ్రీస్ కి ఒక చిడియా... ప్రతి 60 డిగ్రీస్ కి ఒక ఈగిల్ ని పెట్టాడు...ఆ విల్లా కి ముందు వైపు సింహ ద్వారానికి మెయిన్ రోడ్ దాదాపు ఒక కిలోమీటర్ ఉంటుంది... వెనకాల నుంచి అడవి ప్రాంతానికి ఒక కాలిబాట కూడా వుంది... ఆ ఇంటినుంచి అడవి దాదాపు రెండు కిలోమీటర్స్ దూరంలో వుంది... ఎవరైనా ఆ అడవిలోకి ప్రవేశిస్తే కనుక్కోవడం అంత సులభం కాదు.

మహేంద్ర ఒక రోజంతా విల్లా ని విడిచి బయటకి కదలలేదు. ఫుడ్ హోమ్ డెలివరీ తెప్పిచుకున్నాడు... కాంతారావు తో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడాడు... ఇదంతా మానిటర్ చేస్తున్న iKHAN కి సడన్ గా మహేంద్ర ఫోన్ లో ఒక ఆక్టివిటీ కనిపిచింది... ఎదో 8 అంకెలు కనిపించాయి... ముందు అర్ధం కాలేదు... మహేంద్ర మొబైల్ ఫోన్ లో ఇంస్టాల్ చేసిన SPYWARE APP కొన్ని నంబర్స్ ని ట్రాన్స్మిట్ చేసింది... iKHAN పెదాల మీద చిరునవ్వు వెలసింది... నెంబర్ కీ పాడ్ లో ప్రతి నెంబర్ కి ఒక కంపోజ్డ్ టోన్ ఉంటుంది... పుష్ బటన్ ఫోన్ నంబర్స్ ప్రెస్ చేస్తే ఒక రకమైన మ్యూజిక్ వస్తుంది... ప్రతి నెంబర్ కి ఒక డిఫరెంట్ కంపోజ్డ్ టోన్ ఉంటుంది. మహేంద్ర ఫోన్ లోని SPYWARE APP పరిధిలో ఎవరైనా కీ పాడ్ ని నొక్కితే... ఆ కీ పాడ్ లోంచి వచ్చే ధ్వని తరంగాలను అంకెల రూపం లో iKHAN కంప్యూటర్ కి ట్రాన్సిమిట్ చేస్తుంది... విల్లా లో మహేంద్ర కి పెద్ద సెక్యూర్ సేఫ్ వుంది... ఆ సేఫ్ కి ఒక కీ పాడ్ వుంది... ఆ సేఫ్ ని ఓపెన్ చేయడానికి 8 అంకెల పాస్ కోడ్ కావాలి. ఆ సేఫ్ కి ఒక ప్రత్యేకత వుంది... ప్రతి 5 నిమిషాలకి పాస్ కోడ్ మారిపోతూ ఉంటుంది... ఆ సేఫ్ ని ఓపెన్ చేయాలంటే... మహేంద్ర తన మొబైల్ ఫోన్ లో ఆ సేఫ్ కి సంభందించిన ఒక app ని ఓపెన్ చెయ్యాలి... అప్పుడు ఆ app 8 అంకెల కోడ్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది... ఆ కోడ్ ని వాడితే ఆ సేఫ్ ఓపెన్ అవుతుంది... ఆ రోజు మహేంద్ర ఆ సేఫ్ ని ఓపెన్ చేసినప్పుడు వాడిన 8 అంకెల పాస్ కోడ్ ని ఆ ఫోన్ లో ఇన్స్టాల్ చేసిన SPYWARE APP కీ పాడ్ సౌండ్స్ ని నంబర్స్ గా కన్వెర్ట్ చేసి iKHAN కి మెసేజ్ పంపించింది... ఇది గమనించిన iKHAN మాధవ్ కి ఫోన్ చేసి "ఒక పెద్ద గుడ్ న్యూస్... ఆ విల్లా లో ఒక సెక్యూర్ సేఫ్ ఉంది... మహేంద్ర ఆ సేఫ్ ఓపెన్ చెయ్యడానికి పాస్ కోడ్ ని ఎంటర్ చేసినప్పుడల్లా... మహేంద్ర మొబైల్ ఫోన్ లోని SPYWARE అప్లికేషన్ కీ పాడ్ సౌండ్స్ ని నంబర్స్ గా మార్చి నాకు మెసేజ్ చేస్తోంది... నాకు సెక్యూర్ సేఫ్ ఓపెన్ చెయ్యడానికి కావాల్సిన పాస్ కోడ్ తెలుసు..." అని చెప్పాడు...

మాధవ్ వెంటనే ఆక్షన్ ప్లాన్ తయారుచేసాడు.... 12 మంది ఏజెంట్స్ ని ఆ రాత్రి విల్లా చుట్టూ ఉండేలా ఏర్పాటు చేసాడు... ఉదయం కల్లా తాను కూడా విల్లా చేరుకుని దాని ముందున్న పార్క్ లో THE APPROVER రాక కోసం వెయిట్ చేయ్యసాగాడు... దాదాపు 11 గంటల సమయం లో iKHAN దగ్గరనుంచి మెసేజ్ వచ్చింది... ఇంకో పది నిమిషాల్లో THE APPROVER విల్లా చేరుకుంటున్నాడు. మాధవ్ అందరిని అలెర్ట్ చేసాడు...

ఒక బ్లాక్ కలర్ బెంజ్ కార్ నెమ్మదిగా విల్లా చేరుకుంది... డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి డోర్ తీసుకొని కిందకి దిగాడు... చాలా పెద్ద విగ్రహం... కనీసం 6 అడుగులా 6 అంగుళాల ఎంట్ ఉంటాడు... చాలా బలిష్టంగా ఉన్నాడు. అతని భుజానికి అస్సౌల్త్ రైఫిల్ ఉంది... అంతే కాదు... అతని వేసుకున్న కోటు కింద వెనుక భాగాన బెల్ట్ కి రెండు రివాల్వర్లు కూడా ఉన్నాయి... కార్ దిగిన తరువాత రెండు నిమిషాలు విల్లా చుట్టూ పరికించి చూసాడు... ఎటువంటి అనుమానాస్పదమైన కదలికలు కనిపించలేదు. అంతా సేఫ్ అనుకున్న తరువాత కార్ వెనుక సీట్ డోర్ ఓపెన్ చేసాడు... ఆ కార్ లోంచి దాదాపు ఆరు అడుగుల పొడుగు... సన్నగా ఉన్న వ్యక్తి కిందకి దిగాడు... బట్టతల... కోలా మొహం... బాగా ఖరీదైన సూట్ వేసుకొని... తలమీద హాట్ పెట్టుకొని ఉన్నాడు... అతని కుడి చేతిలో ఒక పెద్ద సైజు బ్రీఫ్ కేసు ఉంది... ఆ బ్రీఫ్ కేసు హేండిల్ కి ఒక చైన్ ఉంది... ఆ చైన్ కి రెండో వైపు హ్యాండ్ కఫ్స్ ఉన్నాయి... ఆ హ్యాండ్ కఫ్స్ అతని కుడి చేతికి వేసి ఉన్నాయి. ఎవరైనా ఆ బ్రీఫ్ కేసు దొంగతనంగా లాక్కోవాలంటే... అతని కుడి చెయ్యి మణికట్టు ని నరికితే కానీ బ్రీఫ్ కేసు వేరే పడదు... ఆ ఇద్దరూ విల్లా లోకి వెళ్లారు... మాధవ్ తన టీం ని అలెర్ట్ చేసాడు...

దాదాపు ఒక 20 నిమిషాల తరువాత iKHAN దగ్గరనుంచి ఒక మెసేజ్ వచ్చింది... "మహేంద్ర ఇప్పుడే సేఫ్ ఓపెన్ చేసాడు". మాధవ్ తన టీం తో "ఆ బట్టతల వాడి బాడీ గార్డ్ ని చంపేయండి... ఆ బట్టతల వాడు నాకు ప్రాణాలతో కావాలి. లోపల ఎంత మంది ఉన్నారో తెలియదు... మీకు ఎవరైనా అనుమానం గా కనిపిస్తే... ముందు గాయపరచడానికి ప్రయత్నించండి... కుదరకపోతే చంపెయ్యండి... మహేంద్ర ని మాత్రం ఎవరూ టచ్ చెయ్యకూడదు. మహేంద్ర సంగతి నేను చూసుకుంటాను" అని స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అందరూ విల్లా వైపు పరిగెత్తారు... విల్లా ముందున్న కార్ డ్రైవర్ కంట పడకుండా... మెయిన్ డోర్ వైపు కాకుండా సైడ్ ఎంట్రన్స్ వైపు వెళ్లారు... ఒక డోర్ కనిపిచింది... సైలెన్సర్ తుపాకీతో ఆ డోర్ హేండిల్ దగ్గర కాల్చి ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు... విల్లా అంతా ఖాళీగా ఉంది... మెయిన్ హాల్ లోకి వచ్చారు... అక్కడ బేస్ మెంట్ లోకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి... మాధవ్ తన టీం తో చప్పుడు కాకుండా ఒక్కో మెట్టు జాగ్రత్త గా దిగుతూ బేస్ మెంట్ లోకి ప్రవేశించారు... అక్కడ బేసెమెంట్ లో ఒక పెద్ద రూమ్ వుంది... ఆ రూమ్ మధ్యలో పెద్ద సోఫా సెట్ ఉంది... ఆ సోఫా లో ఒక వైపు THE APPROVER కూర్చొని ఉన్నాడు... అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ని చాలా జాగ్రత్త గా వెరిఫై చేస్తున్నాడు... THE APPROVER వెనకాల అతని బాడీ గార్డ్ నుంచొని ఉన్నాడు. ఆ ఇద్దరికీ ఎదురుగా ఇంకో సోఫా లో మహేంద్ర కూర్చొని ఉన్నాడు. మహేంద్ర వెనకాల ఒక పెద్ద బుక్ షెల్ఫ్ ఉంది. ఆ సెక్యూర్ సేఫ్ ఆ బుక్ షెల్ఫ్ వెనకాల ఉండాలి... ఆ రూమ్ లో ఆ ముగ్గురూ తప్ప వేరే ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత మాధవ్ తన టీం కి సిగ్నల్ ఇచ్చాడు.

ఒక ఏజెంట్ గురి చూసి THE APPROVER బాడీ గార్డ్ ని తన సైలెన్సర్ రివాల్వర్ తో తల కి తగిలేలా కాల్చాడు... ఆ ఏజెంట్ గురి తప్పలేదు... ఆ బాడీ గార్డ్ మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు... THE APPROVER... మహేంద్ర ఇద్దరూ రియాక్ట్ అయ్యే లోపల మాధవ్ తన టీం తో రూమ్ లోకి ప్రవేశించాడు... ఇద్దరు ఏజెంట్స్ THE APPROVER వెనకాల నుంచున్నారు... ఇంకో ఇద్దరు ఏజెంట్స్ మహేంద్ర చేతులకి వెనక నుంచి హ్యాండ్ కఫ్స్ వేశారు... మహేంద్ర... THE APPROVER .... ఆ ఇద్దరూ ఈ డెవలప్మెంట్ ఊహించలేదు... మహేంద్ర ఆ మీటింగ్ గురించి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు... అయినా కూడా ఇండియన్ RAW ఏజెంట్స్ కి ఎలా తెలిసింది?

మాధవ్ ఫోన్ చేసి విల్లా బయట మిగిలిన టీం ని కూడా విల్లా లోకి రమ్మన్నాడు... RAW ఏజెంట్స్ రైఫిల్స్ పట్టుకొని రావడం చూసిన బెంజ్ కార్ డ్రైవర్ చేతులు పైకెత్తి సరెండర్ అయిపోయాడు... ఆ డ్రైవర్ చేతికి కఫ్స్ వేసి అతడిని ఆ బెంజ్ కార్ డిక్కీ లో పడుకోపెట్టారు... ఇంకో ఇద్దరు ఏజెంట్స్ ఒక పెద్ద ట్రంక్ పెట్టెని విల్లా బేస్ మెంట్ లోకి తీసుకొని వెళ్లారు... అందరూ రాగానే మాధవ్ గోడకున్న బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్లి జాగ్రత్త పరిశీలించాడు... ఒక చోట చిన్న గ్యాప్ కనిపిచింది.. ఆ గ్యాప్ లో చెయ్యి పెట్టి బుక్ షెల్ఫ్ ని ముందుకు లాగాడు... బుక్ షెల్ఫ్ అంతా జరిగింది... దాని వెనకాల ఒక సెక్యూర్ సేఫ్ కనిపిచింది... మాధవ్ ఐకాన్ కి ఫోన్ చేసి ఆ సేఫ్ ఓపెన్ చెయ్యడానికి కావాల్సిన లేటెస్ట్ 8 అంకెల కోడ్ అడిగాడు... iKHAN వెంటనే తన లాప్ టాప్ లో మహేంద్ర మొబైల్ ఫోన్ లోని సెక్యూర్ సేఫ్ అప్ ని ఓపెన్ చేసి అందులో దొరికిన లేటెస్ట్ 8 అంకెల కోడ్ ని మాధవ్ మొబైల్ ఫోన్ పంపాడు... మాధవ్ తన మొబైల్ ఫోన్ లో iKHAN పంపిన 8 అంకెల కోడ్ ని సెక్యూర్ సేఫ్ కీ పాడ్ మీద ఎంటర్ చేసాడు.. సేఫ్ ఓపెన్ అయింది...

సెక్యూర్ సేఫ్ లో 5 అరలు కనిపించాయి... మాధవ్ RAW ఏజెంట్స్ తెచ్చిన ట్రంక్ పెట్టె ని ఓపెన్ చేసాడు... అందులో ఒక స్కానింగ్ డివైస్ తీసి సేఫ్ లోని అన్ని అరలని జాగ్రత్త గా స్కాన్ చేసాడు... ఆ సేఫ్ లో ఎటువంటి పేలుడు పదార్ధాలు లేవని నిర్ధారించుకొని ఒక్కొక్కటిగా ఆ సేఫ్ లోని ఫైల్స్ ని ఎంబసీ ట్రంక్ పెట్టె లో జాగ్రత్త పెట్టసాగాడు... చాలా ఫైల్స్ ఉన్నాయి... బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రోజుల మిలిటరీ డాకుమెంట్స్ కూడా కనిపించాయి... 1857 SEPOY MUTINY... నుంచి ప్రస్తుత కాలం దాకా ఇండియా లోని కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంభందించిన ఫైల్స్... డాకుమెంట్స్... మ్యాప్స్... దొరికాయి... ఆ సేఫ్ లో కొన్ని తాళపత్ర గ్రంధాలు కూడా దొరికాయి... అన్నింటిని చాలా జాగ్రత్తగా ట్రంక్ పెట్టె లో పెట్టి లాక్ చేసి దాన్ని భద్రంగా తన జేబులో పెట్టుకున్నాడు... వెంటనే ఎంబసీ కి ఫోన్ చేసి "WE ARE READY" అని అన్నాడు.

మాధవ్... తనతో పాటు వచ్చిన ఒక ఏజెంట్ కి సైగ చేసాడు... ఆ ఏజెంట్ వెంటనే THE APPROVER వేసుకున్న లాంగ్ కోట్ ని విప్పేసి తను వేసుకున్నాడు... THE APPROVER కళ్ళజోడు పెట్టుకొని... అతని హాట్ నెత్తికి పెట్టుకొని నలుగురు ఏజెంట్స్ తో కలసి వెళ్ళడానికి రెడీ గా ఉన్నాడు. సరిగ్గా 5 నిమిషాల్లో విల్లా కాంపౌండ్ లో 3 హెలీకాఫ్టర్స్ దిగాయి... ముందుగా ఒక హెలికాఫ్టర్ లో నలుగురు RAW ఏజెంట్స్ తో పాటు THE APPROVER కోట్ వేసుకున్న ఏజెంట్ ఒక హెలికాప్టర్ ఎక్కాడు... వెంటనే ఆ హెలికాఫ్టర్ గాల్లోకి లేచింది... దాంతో పాటే ఇంకో హెలికాఫ్టర్ కూడా వెళ్ళింది... మాధవ్ ఊహించినట్లే... THE APPROVER ని ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళ మనుషులు ఆ హెలికాఫ్టర్ వెళ్లిన డైరెక్షన్ లో వెళ్లారు... ఇంకో నలుగురు RAW ఏజెంట్స్ నిజమైన THE APPROVER ని తీసుకొని ఒక SUV లో వియన్నా లోని ఒక ప్రైవేట్ ఎయిర్పోర్టు కి వెళ్లారు. అప్పటికే అక్కడ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉన్న ఒక ఇండియన్ మిలిటరీ విమానం లో THE APPORVER ని ఎక్కించుకొని ఢిల్లీ తీసుకెళ్లారు... మిగిలిన నలుగురు RAW ఏజెంట్స్ ట్రంక్ పెట్టె, THE APPROVER కార్ డ్రైవర్ ని తీసుకొని మూడో హెలికాఫ్టర్ ఎక్కి వియన్నా లో ఇండియన్ ఎంబసీ కి వెళ్లారు... ఇప్పుడు ఆ విల్లా లో ఇద్దరే ఉన్నారు. మాధవ్... మహేంద్ర...

మాధవ్ (మహీంద్ర చేతికి వేసిన హ్యాండ్ కఫ్స్ వూడతీస్తూ) : నీ దగ్గర గవర్నమెంట్ కి సంభందించిన వెరీ సెన్సిటివ్ డాకుమెంట్స్ దొరికాయి. అది HIGH TREASON... ఇది కాక మీరు... మీ ఫ్రెండ్స్ చాలా నేరాలు చేశారు... ఇల్లీగల్ బిజినెస్... కిడ్నప్... ఎక్స్ టార్షన్... కిల్లింగ్స్... డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్... డిస్ట్రక్షన్ అఫ్ ఫారెస్ట్స్... ఇంకా చాలా నేరాలు చేసారు... ఇవన్నీ కాకుండా ఆ అమ్మాయి... స్పందన... ఆమె తల్లిని మీరు మోసం చేశారు... ఆమె దిగులుతో చనిపోయింది... ఆమె పేరెంట్స్ చాలా కస్టాలు పడ్డారు... స్పందన ఒక అనాథగా పెరిగింది. మీరు ఆమెని... పట్టాభి ని చంపాలని ప్లాన్ చేశారు. చివరికి స్పందన కిడ్నప్... రేప్... టార్చర్ కి గురిఅయింది. పట్టాభి దారుణంగా చంపబడ్డాడు. ఎంతో మందిని చంపారు... ఎందుకు? ఇంత దారుణంగా ప్రవర్తించారు?

మహేంద్ర : స్పందన విషయం లో ఒక పొరపాటు జరిగింది. ఆమెని వొదిలెయ్యాల్సింది... కానీ... పరిస్థితులు చెయ్యి దాటి పోయాయి... చివరికి తప్పలేదు... ఈ రోజుల్లో నేరాలు ఘోరాలు ఎవరు చేయడం లేదు? డబ్బు... పలుకుబడి... పవర్ ఉన్న వాళ్ళు అందరూ నేరాలు చేస్తున్నారు. ఢిల్లీ లో ఎంతమంది క్రిమినల్స్ లేరు? మన దేశం లో ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో... పార్లమెంట్ లో నేరస్తులు ఉన్నారు... నాకు ఛాన్స్ దొరికింది... క్రైమ్ చేసాను... మీరు నన్ను ఏమి చెయ్యలేరు... మహా అయితే నన్ను అరెస్ట్ చేసి ఇండియా తీసుకొని వెళ్తారు... అక్కడ నన్ను ఎవరూ ఏమి చెయ్యలేరు... నాకు చాలా పలుకుబడి ఉంది... నా అవసరం చాలా మందికి వుంది.

మాధవ్ : నేను మిమ్మల్ని ఇక్కడే చంపనని గారంటీ ఏమిటీ?

మహేంద్ర : మీకు నన్ను చంపే ఉద్దేశ్యం ఉండి ఉంటే... ఇలా కూర్చొని నాతో మాట్లాడరు... ఈ పాటికి చంపేసి వెళ్ళిపోయేవారు.

మాధవ్ : ఇంత సేపు మిమ్మల్ని ఎందుకు చంపలేదో తెలుసా?

మహేంద్ర : ఎందుకు?

మాధవ్: మీకో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి... మీ కూతురు... స్పందన... ఆమె బ్రతికేవుంది...

మహేంద్ర(షాక్ అయ్యి): ఏమిటీ??? ఎలా సాధ్యం? DR. పారిఖ్ స్పందన చనిపోయిందని అనౌన్స్ చేసాడు... స్పందన బాడీ ని ఎక్కడ పాతిపెట్టింది నాకు తెలుసు... మావాళ్లు వీడియో తీసి నాకి పంపారు...

మాధవ్ : DR. పారిఖ్ ఏ రోజైతే స్పందన డ్రగ్ ప్రోటోకాల్ మార్చాడో... వెంటనే ఆ విషయం DR. గాయత్రి కి తెలిసింది... మీకు DR. గాయత్రి ఎవరో తెలుసుగా?

మహేంద్ర(ఇంకా షాక్ లోనే): AIIMS లో కార్డియో వాస్క్యూలర్ సర్జన్ కదా?

మాధవ్: అవును. ఆమె ఎవరో తెలుసా? IB డైరెక్టర్... రవీంద్ర చెల్లెలు. DR. పారిఖ్ డ్రగ్ ప్రోటోకాల్ మార్చిన విషయం రవీంద్ర కి చెప్పింది... నేను... రవీంద్ర... ఆ రాత్రికి రాత్రే... స్పందన ని న్యూ ఢిల్లీ లోని AIIMS నుంచి అమృత్సర్ కి తీసుకెళ్ళాము. అక్కడ మాకు తెలిసిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమెని చేర్చాము. ఆమె పూర్తిగా రికవర్ అయ్యింది... శారీరకంగా... మానసికంగా... నరకం అనుభవించింది. ఆమెకి ఫిజికల్ గా రికవర్ అయ్యాక... సైకలాజికల్ కౌన్సిలింగ్ చెయ్యించాము... వెరీ బ్రేవ్ లేడీ... బాగా రికవర్ అయ్యింది... చాలా కాన్ఫిడెంట్ లేడీ... ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని జయించడానికి రెడీ అవుతోంది... ఆమె కి అండగా మేమున్నాము... ఎవరైనా ఆమె జోలికి వస్తే... అతి దారుణాతి దారుణంగా చస్తారు...

మహేంద్ర : ఆ రోజు హాస్పిటల్ వాళ్ళు పాతి పెట్టింది ఎవరిని?

మాధవ్(నవ్వుతూ) : 60 కిలోల బరువున్న బెడ్ షీట్స్... ఇప్పుడు మీ వంతు... మిమ్మల్ని హింసించి చంపడానికి వచ్చాను...

మాధవ్ ఆ తరువాత ఒక రెండు గంటల సేపు మహేంద్ర కి రకరకాలుగా హింసించి నరకం చూపించాడు... ఆ రోజు రాత్రి స్పందన ఏ విధమైన టార్చర్ కి గురి అయిందో... మహేంద్ర అంతకన్నా దారుణమైన హింసకి గురయ్యాడు.... మహేంద్ర ఒంట్లో ఎముకలు విరిగాయి... జాయింట్స్ ఊడాయి... షోల్డర్ బాల్ సాకెట్ లోంచి బయటకు వచ్చింది... వెన్నెముక వంగిపోయింది... లంగ్స్ పంక్చర్ అయ్యాయి... మహేంద్ర కి నరకం కనిపించింది... మహేంద్ర శరీరం ఆ బేస్ మెంట్ లో అన్ని మూలలకు ఫుట్ బాల్ లాగా తిరిగింది. ఎప్పుడు ప్రాణం పోయిందో తెలియదు... శరీరం రక్తం తో తడిసి మాంసం ముద్ద అయ్యింది. మహేంద్ర జీవితం ఆ విధం గా సమాప్తం అయ్యింది. అదే రోజు రాత్రి ఇండియా లో ఇంకో రెండు సంఘటనలు జరిగాయి...

మొదటి సంఘటన... ఢిల్లీ లో... రాత్రి ఒంటి గంట సమయం... మెహ్రౌలీ ఏరియాలో చాలా ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి. వాటిలోని ఒక ఫార్మ్ హౌస్ లో జరుగుతున్న పార్టీ కి కాంతారావు వచ్చాడు... బాగా ఎంజాయ్ చేసాడు... రాత్రి ఒంటిగంట సమయంలో తనకి బాగా తెలిసిన ఒక సుప్రీంకోర్టు లాయర్ ని కలవడానికి గురుగ్రామ్ బయలుదేరాడు. కాంతారావు ప్రయాణిస్తున్న కార్ మెహరౌలీ - గురుగ్రం రోడ్ మీద వెళ్తోంది... ఆ సమయం లో ఆ రోడ్ చాలా నిర్మానుష్యం గా ఉంది. సరిగ్గా ఢిల్లీ - హర్యానా బోర్డర్ చేరుకోగానే... సడన్ గా రోడ్ కి అడ్డంగా ఢిల్లీ పోలీస్ బారికేడ్ కనిపిచింది... ఆ బారికేడ్ వెనకాల పోలీస్ కానిస్టేబుల్స్ కనిపించారు. ఒక కానిస్టేబుల్ కాంతారావు కార్ దగ్గరకి వచ్చి... డ్రైవర్ ని విండో కిందకి దింపమని సైగ చేసాడు. డ్రైవర్ విండో కిందకి దింపాడు. ఆ డ్రైవర్ తో కానిస్టేబుల్ "లైసెన్స్... రెజిస్ట్రేషన్... పొల్యూషన్ సర్టిఫికెట్... తీసుకొని ఆ వాన్ దగ్గరకు వెళ్ళు... అక్కడ నీకు ఆల్కహాల్ టెస్ట్ చెయ్యాలి" అన్నాడు... డ్రైవర్ డాక్యూమెంట్స్ తీసుకొని ఒక 100 మీటర్స్ దూరం లో పార్క్ చేసిన పోలీస్ వాన్ దగ్గరికి వెళ్ళాడు... అక్కడ ఎవరూ లేరు... వాన్ ఖాళీగా ఉంది. ఏదో అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకి వచ్చాడు... అక్కడ పోలీస్ కానిస్టేబుల్ లేడు... కాంతారావు కార్ డ్రైవర్ సైడ్ డోర్ తెరచి వుంది... డ్రైవర్ కార్ వెనక సీట్ లోకి తొంగి చూసాడు... అక్కడ వెనక సీట్ లో కాంతారావు పడుకొని ఉన్నాడు... కాంతారావు ఛాతీ మీద పెద్ద రక్తపు మరక... డ్రైవర్ ఠారెత్తి పోయాడు... వెంటనే నిజమైన పోలీసులకి ఫోన్ చేసాడు... వాళ్ళు రావడానికి 15 నిమిషాలు పట్టింది... అప్పటికే కాంతారావు చనిపోయి చాలా సేపయ్యింది. ముందుగా క్రైమ్ సీన్ కి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు... హత్య ఢిల్లీ - హర్యానా స్టేట్ బోర్డర్ దగ్గర జరగడం తో ఆ హత్య ఏ స్టేట్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుందో అర్ధం కాక గురుగ్రం పోలీసులకి కూడా ఫోన్ చేశారు... ఆ రెండు రాష్ట్రాల పోలీసులు మధ్య వాదన మొదలయ్యింది... "హత్య ఏ రాష్ట్రం లో జరిగింది?" ... ఇంతలో కాంతారావు కార్ డ్రైవర్ ఢిల్లీ లో ఒక సుప్రీమ్ కోర్ట్ లాయర్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు... ఆయన వెంటనే ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి కాంతారావు డెడ్ బాడీ ని న్యూ ఢిల్లీ వచ్చేలా ఏర్పాట్లు చేసాడు...

రెండో సంఘటన... హైదరాబాద్... జూబ్లీ హిల్స్ ఏరియా... రాత్రి 2 గంటల సమయం... బాగా పాపులర్ పబ్... లోపల చాలా వరకు యంగ్ క్రౌడ్ తో నిండి ఉంది... అప్పటికే పబ్ క్లోజ్ చేసే టైం అయ్యింది... కానీ... అక్కడికి వచ్చేది హైదరాబాద్ లో పెద్ద పెద్ద కుటుంబాలకి చెందిని పిల్లలు కావడంతో పబ్ ఓనర్స్ టైమింగ్స్ ని పెద్దగా పట్టించుకోరు... పబ్ నుంచి నలుగురు కుర్రాళ్ళు బయటికి వచ్చారు... వివేక్... సంజీవ్... రాకేష్... కిరణ్... వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఇండియా కి వచ్చి ఒక వారం రోజులయ్యింది. బాగా డ్రింక్ చేసి ఉన్నారు. సంజీవ్ VALET ని తన కార్ తెమ్మని టోకెన్ ఇచ్చాడు... ఒక 5 నిమిషాల్లో PORSCHE CAYENNE వచ్చింది... నలుగురూ ఎక్కారు... సంజీవ్ నడుపుతున్నాడు... కార్ స్టార్ట్ చేసి ADAPTIVE CRUISE CONTROL (కార్ యాక్సిలరేషన్... బ్రేకింగ్ సిస్టం ని ఆటోమేటిక్ గా కార్ లోని కంప్యూటర్ చిప్ కంట్రోల్ చేస్తుంది) ని సెట్ చేసాడు... 70 కిలోమీటర్స్... 4 సెకండ్స్ కి సెట్ చేసాడు... ఎప్పుడైతే ADAPTIVE CRUISE CONTROL ని ఆన్ చేసాడో... వెంటనే కార్ విశ్వామిత్ర కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది... ఇప్పుడు ఆ కార్ విశ్వామిత్ర చెప్పినట్లు వింటుంది. సంజీవ్ నడుపుతున్న కార్ బయలుదేరింది... దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది... సంజీవ్ కార్ ని ఆపాడు... బాగా తాగి ఉండడంతో సడన్ గా ADOPTIVE CRUISE CONTROL ఆఫ్ అవ్వడం గమనించలేదు (విశ్వామిత్ర రిమోట్ గా ADAPTIVE CRUISE CONTROL ని ఆఫ్ చేసి కార్ యాక్సిలరేషన్ అండ్ బ్రేకింగ్ సిస్టం ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు) గ్రీన్ సిగ్నల్ వచ్చింది... కార్ ముందుకు కదిలింది... ఒక్కసారిగా కార్ విపరీతమైన వేగం పుంజుకుంది... సంజీవ్ బ్రేక్ వెయ్యడానికి ట్రై చేసాడు... బ్రేక్ పనిచెయ్యడం లేదు... హ్యాండ్ బ్రేక్ ట్రై చేసాడు... అది స్టక్ అయ్యింది... కార్ క్షణక్షణానికి వేగం పుంజుకుంటోంది... సంజీవ్ కంట్రోల్ లో లేదు... విశ్వామిత్ర తన లాప్ టాప్ లోని ఒక అప్లికేషన్ ద్వారా సంజీవ్ కార్ ని కంట్రోల్ చేయ్యసాగాడు... కార్ లో సంజీవ్ మిత్రులు ముగ్గురు ఫ్రెండ్స్ బాగా తాగి ఉండడం తో ఇదేమి గమనించకుండా మత్తుగా పడుకొని ఉన్నారు... సంజీవ్కా ర్ ని పక్కకి తిప్పాలని ట్రై చేసాడు... స్టీరింగ్ వీల్ కూడా పనిచెయ్యడం లేదు... కార్ విపరీతమైన వేగం తో వెళ్తోంది... స్పీడ్ 250 KMPH దాటింది... సంజీవ్ కి సడన్ గా మెట్రో రైల్ పిల్లర్ కనిపించింది... దాన్ని తప్పించాలని విశ్వప్రయత్నం చేసాడు... కార్ తన కంట్రోల్ లో లేదు... దాదాపు 300 KMPH వేగంతో వెళ్లి ఎదురుగావున్న హైదరాబాద్ మెట్రో రైల్ పిల్లర్ ని గుద్దుకుంది... కార్ మొత్తం పిప్పిపిప్పి అయ్యింది... కార్ లోపల ఉన్న వెనక సీట్లో కూర్చున్న కుర్రోళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోక పోవడంతో NEWTON LAW OF INERTIA వల్ల తమ ముందున్న సీట్స్ కి అతి వేగంతో గుద్దుకున్నారు... దాంతో ఒకడికి మెడ విరిగిపోయింది.... రెండో వాడికి వెన్నుముక తునాతునకలయ్యింది... డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్న వివేక్ ఫ్రంట్ విండ్ షీల్డ్ కి బలంగా గుద్దుకోవడం తో తలపగిలిపోయింది... కార్ నడుపుతున్న సంజీవ్ కి స్టీరింగ్ వీల్ ఛాతీ లోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు... ఇంత జరిగినా ఎయిర్ బాగ్స్ ఓపెన్ కాలేదు...

PORSCHE CAYENNE... చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తో తయారైన కార్... కంప్యూటర్ చిప్ తో కంట్రోల్ చెయ్యొచ్చు... విశ్వామిత్ర ఆ కార్ సిస్టం ని హాక్ చేసి... స్పీడ్... స్టీరింగ్ వీల్ కంట్రోల్, ఎయిర్ బాగ్ డిప్లొయిమెంట్, సీట్ బెల్ట్ వార్నింగ్... ఇలా అన్నింటిని టాంపర్ చేసాడు... దాంతో... ఆ కార్ విపరీతమైన వేగం తో వెళ్లి హైదరాబాద్ మెట్రో రైల్ పిల్లర్ కి గుద్దుకుంది... పోలీస్... అంబులెన్సు వచ్చి ఆ నలుగురు కుర్రోళ్లని అపోలో హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు... అక్కడ ఎమర్జెన్సీ రూమ్ లో డాక్టర్ వాళ్ళని పరీక్షించి రిపోర్ట్ లో "DEAD ON ARRIVAL" అని వ్రాసాడు...

మరుసటి రోజు ఉదయం టీవీ న్యూస్ లో కార్ ఆక్సిడెంట్... నలుగురు కుర్రోళ్ళ డెత్ గురించిన వార్త చూసిన విశ్వామిత్ర "GUTEN MORGEN... WILLKOMMEN IN DER HOLLE... ARSCHLOCHERS" అని స్వచ్ఛమైన జర్మన్ భాషలో అన్నాడు...


Part - 33 - The Final Destination

హైదరాబాద్ మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది... గత రాత్రి జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ మెట్రో పిల్లర్ కి గుద్దుకొని ఒక కార్ లో నలుగురు యువకులు మరణించారన్న వార్త తెలుగు రాష్ట్రాలలో అన్ని టీవీ న్యూస్ ఛానెల్స్ లో చూపించారు. ఈ వార్త ఒక పెను సంచలనం సృష్టించింది. మరణించిన యువకులు వివేక్... రాకేష్... కిరణ్... సంజీవ్... వీళ్ళు హైదరాబాద్ లో పెద్ద కుటుంబాలకి చెందినవారు కావడం... రీసెంట్ గా వాళ్ళ పేర్లు ఒక రేప్ కేసులో వినపడడం... పైగా సంజీవ్... ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కుమారుడు కావడం... ఒక్కసారిగా ఊరంతా వేడెక్కింది... ఆ కుర్రోళ్ళ శవాలకు పోస్ట్ మార్టం చేశారు... ఆల్కహాల్ విపరీతంగా త్రాగి వాహనం నడపడం వల్ల ఆక్సిడెంట్ జరిగిందని నిర్ధారించారు... అపోలో హాస్పిటల్ నిండా ఆ కుర్రోళ్ళ ఫామిలీ మెంబెర్స్... క్లోజ్ ఫ్రెండ్స్ తో నిండి పోయింది... ముందుగా హోమ్ మినిస్టర్ ధనంజయ హాస్పిటల్ కి చేరుకున్నాడు. కొడుకు చనిపోయాడన్న వార్త వినగానే గుండె పోటు వచ్చింది. ఆయనకి వెంటనే CPR చేశారు... స్పృహలోకి వచ్చాడు... బీపీ చాలా ఎక్కువగా ఉండడం తో ICU లో పెట్టారు. ఒక గంట తరువాత మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చింది. డాక్టర్స్ రెస్పాండ్ అయ్యేలోపలే ధనంజయ మరణించాడు. ఒకే రోజు తండ్రి... కొడుకు మరణించారు...

హాస్పిటల్ కి వచ్చిన వాళ్లలో కొంత మంది కైలాష్ గౌడ్ ఎక్కడా అని అడిగారు... కైలాష్ గౌడ్ ఫామిలీ మెంబెర్స్ వచ్చారు... కైలాష్ రాలేదు. అండర్ గ్రౌండ్ నుంచి తప్పకుండా వస్తాడని లోకల్ పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఉదయం 10 గంటల సమయం లో నేషనల్ న్యూస్ ఛానెల్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ ని ప్రసారం చేశాయి... " గత రాత్రి మెరౌలీ... గురుగ్రామ్ రోడ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దేశం లో ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది కాంతారావు ని దారుణంగా గా కాల్చి చంపారు... ఆ హత్య ఖచ్చితంగా ఢిల్లీ... హర్యాణ రాష్ట్ర సరిహద్దు మీద జరగడంతో... ఈ కేసుని ఎవరు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చెయ్యాలో తేల్చుకోలేక పోతున్నారు" ఈ వార్త హైదరాబాద్ ని కుదిపేసింది... ఒకే రోజు రాష్ట్ర హోమ్ మినిస్టర్ ధనంజయ... ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాంతారావు మరణించారు... వారి కొడుకులు సంజీవ్... రాకేష్ కూడా ఆక్సిడెంట్ లో మరణించారు... కైలాష్ గౌడ్ ఆచూకీ తెలియదు. బిజినెస్ టైకూన్ మహేంద్ర మేనల్లుడు కూడా ఆ చనిపోయిన నలుగురు కుర్రాళ్లలో ఒకడు... అందరూ కైలాష్ గౌడ్ కోసం ఎదురు చూస్తున్నారు... రాలేదు... కైలాష్ గౌడ్ ఫామిలీ మెంబెర్స్ కి అనుమానం వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు చనిపోతే తండ్రి ఎందుకు రాలేదు? కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చెయ్యలేదు... ఆ నలుగురు కుర్రోళ్ళ యాక్సిడెంట్... రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆకస్మిక మరణం... దేశంలోనే ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ లాయర్ హత్య... కైలాష్ గౌడ్ కనపడక పోవడం... చాలా కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాయి... తెలుగు రాష్ట్రాలలో న్యూస్ ఛానెల్స్ ఒక్కోటి ఒక్కో రకకంగా డిస్కషన్స్ పెట్టాయి... ధనంజయ... అతనికుమారుడు... కాంతారావు... అతని కుమారుడు... ఒకే రోజు మరణించడం కాకతాళీయమా... లేక అందులో ఏదైనా CONSPIRACY ఉందా? ఈ విషయాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడసాగారు. కైలాష్ గౌడ్ రాకపోవడంతో... వాళ్ళ గ్యాంగ్ మెంబెర్స్ కి డౌట్ వచ్చింది..." అండర్ గ్రౌండ్(ముంబై) కి వెళ్లిన కైలాష్ ఎందుకు రాలేదు? కనీసం ఫోన్ కాల్ కూడా ఎందుకు చెయ్యలేదు? దేశం మొత్తం టీవీ లో న్యూస్ ని కవర్ చేస్తున్నారు... బయటకి రాలేని పరిస్థితిలో ఉన్నాడా? అసలు ఉన్నాడా... లేడా... ఎవరైనా లేపేసారా?" ఇలాంటి సందేహాలు వచ్చాయి... హైదరాబాద్ పోలీస్ డిపార్టుమెంటు చాలా బిజీ గా ఉంది. రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆకస్మికంగా చనిపోవడం తో తెలుగు రాష్ట్రాలనుంచి వేళా సంఖ్యలో జనాలు హైదరాబాద్ కి వస్తున్నారు... ఢిల్లీ నుంచి కూడా పొలిటికల్... బ్యూరోక్రాట్ వర్గాల నుంచి కూడా జనాలు వస్తారు...

ఇది కాక సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది పార్థివ శరీరం కూడా ఢిల్లీ రాబోతోంది... హైదరాబాద్ పోలీసులు ఒక్కసారిగా విపరీతమైన ప్రెషర్ కి లోనయ్యారు... హైదరాబాద్ పోలీసులకి ఇంకో సమస్య వచ్చింది... ఒకవేళ కైలాష్ గౌడ్ వస్తే... అరెస్ట్ చెయ్యాలా... వొద్దా... ఈ విషయాన్ని చాలా సీరియస్ డిస్కస్ చేస్తున్నారు...

సాయంత్రం 6 గంటల సమయం... ఇంటర్నేషనల్ న్యూస్ బ్రేక్ వచ్చింది... ఆస్ట్రియా దేశం లోని వియన్నా నగరానికి సమీపం లో ఉన్న HALLSTATT గ్రామం లోని ఒక విల్లా లో స్థానిక పోలీసులు రెండు శవాలని కనుక్కున్నారు... అందులో ఒక శవం జర్మనీ దేశానికి చెందిన ఒక పెద్ద సెక్యూరిటీ కంపెనీ లో పనిచేస్తున్న హాన్స్ బ్రాంట్ గా గుర్తించారు... హన్స్ కి తలకి బులెట్ తగలడం తో మరణించాడని నిర్ధారించారు... రెండో శవం ఇండియా లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర భూపతి గా గుర్తించారు... మహేంద్ర భూపతి మరణానికి ముందు అతిదారుణం గా హింసించబడ్డాని ప్రాధమిక విచారణలో తేలింది...

మహేంద్ర మరణ వార్త దేశాన్ని కుదిపేసింది... ఒకే రోజు... మహేంద్ర భూపతి అతి దారుణంగా హింసించబడి మరణించాడు... అతని సన్నిహిత మిత్రుడు ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ లాయర్ నేషనల్ కాపిటల్ రీజియన్ లో దారుణంగా హత్య కి గురయ్యాడు... ఇంకో మిత్రుడు గుండె పోటు తో మరణించాడు... మరొక మిత్రుడి ఆచూకీ తెలియడం లేదు... అసలు బ్రతికున్నాడో... చనిపోయాడో... పోలీసులు నిర్ధారించలేక పోతున్నారు... వాళ్ళ పిల్లలు నలుగురు అదే రాత్రి ఘోరమైన రోడ్ ప్రమాదం లో మరణించారు... ఇందులో కొసమెరు ఏంటంటే... మహేంద్ర పర్సనల్ సెక్రటరీ కిడ్నప్ కి గురిఅయ్యాడు... ఇప్పటిదాకా ఆచూకీ తెలియదు...

రాత్రి 9 గంటల ప్రాంతం లో ఒక నేషనల్ న్యూస్ ఛానల్ లో స్పెషల్ బులెటిన్ ప్రసారం అయ్యింది... కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక అనామకురాలి రేప్... టార్చర్... అందులో ప్రస్తుతం అండర్ గ్రౌండ్ కి వెళ్లిన కైలాష్ గౌడ్ కొడుకు SUV ఇన్వొల్వె అవ్వడం... నలుగురు కుర్రోళ్ళ పేర్లు లింక్ అవ్వడం... ఆ రేప్ కి గురైన అమ్మాయి మరణించడం... ఇప్పుడు యాక్సిడెంట్ లో ఆ నలుగురు కుర్రోళ్ళు మరణించడం... దాంతో పాటు ఆ నలుగురి కుర్రోళ్ళ లో ముగ్గురు కుర్రోళ్ళ తండ్రులు కూడా మరణించడం... నాలుగో కుర్రోడి మేనమామ దారుణంగా హింసకి గురయ్యి మరణించడం... దీని వెనకాల ఒక పెద్ద CONSPIRACY తప్పకుండా ఉన్నదని పెద్ద THEORY ని తయారుచేసింది...

ఢిల్లీ లో ... ఆ స్పెషల్ న్యూస్ బులిటిన్ చూస్తున్న ఇద్దరు ప్రముఖ LUTYENS SOCIETY మెంబెర్స్ మధ్య జరిగిన సంభాషణ...

మొదటి ప్రముఖ వ్యక్తి : మనం ఇంగ్లాండ్ లో మహేంద్ర మీద జరిగిన ఎటాక్ ఫెయిల్ అయినప్పుడు కాంతారావు మనకి వార్నింగ్ ఇచ్చాడని... మనం వాడిని ఢిల్లీ - గురుగ్రామ్ బోర్డర్ లో చంపేసి... లీగల్ జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లెమ్ ని క్రియేట్ చేసాము.... ఇప్పుడు ఢిల్లీ - హర్యానా పోలీసులు కొట్టుకుంటున్నారు... కానీ... అదే సమయం లో హైదరాబాద్ లో యాక్సిడెంట్... ఆస్ట్రియా లో మహేంద్ర హత్య... ధనంజయ హార్ట్ ఫెయిల్యూర్... కైలాష్ గౌడ్ మిస్ అవ్వడం... ఇదేదో మన తలకి చుట్టుకునే వ్యవహారంలా ఉంది...

రెండో ప్రముఖ వ్యక్తి : ఇప్పుడు మనం ఏమి చెయ్యకుండా సైలెంట్ గా ఉండడమే మంచిది. ఈ వ్యవహారం లో మనం ఏమాత్రం ఇంటరెస్ట్ చూపినా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మన వెంట పడతాయి...

మొదటి ప్రముఖ వ్యక్తి : కాంతారావు హత్య కేసు ని డెఫినిట్ గా CBI కి అప్పగిస్తారు... మనం CBI ని ఇంఫ్లుయెన్స్ చేస్తే?

రెండో ప్రముఖ వ్యక్తి : ఒద్దు...దీని వెనక ఒక్క CBI కాదు... ఢిల్లీ... హర్యానా... హైదరాబాద్ పోలీస్ డిపార్టుమెంట్స్ కూడా పనిచేస్తాయి... ఒద్దు... ఏమి చెయ్యకు... ఏమి జరుగుతుందో వెయిట్ అండ్ వాచ్... చాలా జాగ్రత్త గా వ్యవహరించాలి...

మొదటి ప్రముఖ వ్యక్తి : ఆ రవీంద్ర తో పెద్ద తలకాయ నొప్పిగా ఉంది... మన పనులు ఒక్కటి కూడా సరిగ్గా జరగడం లేదు... ఏదైనా ఐడియా ఇవ్వు...

రెండో ప్రముఖ వ్యక్తి : ఎందుకు కొరివితో తల గోక్కుంటావు? రవీంద్ర... మాధవ్... వీళ్ళిద్దరూ రిటైర్ అయ్యేదాకా మనం ఏమి చేయలేము.

మొదటి ముఖ్యమైన వ్యక్తి : వాళ్ళని ఆ పోసిషన్ లోంచి తప్పిస్తే...

రెండో ప్రముఖ వ్యక్తి : వాళ్లకి ఏదైనా పెద్ద ప్రమోషన్ ఇచ్చి వేరే చోటకి ట్రాన్సఫర్ చేయించాలి... అది కుదురుతుంది... నీకు పోలీస్... మిలిటరీ లో ఎన్నిరకాల మనుషులు చేరతారో తెలుసా?

మొదటి ప్రముఖ వ్యక్తి : లేదు.

రెండో ప్రముఖ వ్యక్తి : 4 రకాలు... మొదటి రకం వ్యక్తులకి పోలీస్... మిలిటరీ లో చేరడం ఒక ఫ్యామిలీ ట్రెడిషన్... తండ్రి... తాత... ముత్తాత... ఫామిలీ మెంబర్స్ లో ప్రతి జనరేషన్ లో ఎవరో ఒకరు పోలీస్ లేదా మిలిటరీ... లో చేరతారు... రెండో రకం... వీళ్ళు దేశభక్తులు... పోలీస్ / మిలిటరీ లో చేరి దేశానికి సేవయే చెయ్యాలని వీరి ఆశయం... వీళ్ళు దేశం కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉంటారు... ఈ రెండు రకాల వ్యక్తులతో మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు... మూడో రకం... వీళ్ళకి పోలీస్ లేదా మిలిటరీ అనేది ఒక వుద్యోగం మాత్రమే... వీళ్ళలో రెండు రకాలు ఉంటారు... 1. సిన్సియర్... రూల్స్ ప్రకారం పనిచేసి జీతం తీసుకుంటారు... వీళ్ళతో కూడా మనకి ప్రయోజనం ఉండదు... 2. వీళ్ళు అవినీతి కి బాగా లొంగుతారు... వీళ్ళు మాత్రమే మనకి పనికొస్తారు... ఇంక... నాలుగో రకం... వీళ్ళతో చాలా డేంజర్... వీళ్ళు పోలీస్... మిలిటరీ లో చేరడం అంటే... జనాలని చంపడానికి లైసెన్స్ సంపాదించడం... వీళ్ళు చాలా స్మార్ట్... రూల్స్ ని పాటించకుండా... వాళ్లకి ఏది రైట్ అనిపిస్తే... అది చెయ్యడానికి వెనుకాడరు... మాధవ్...రవీంద్ర ఈ నాలుగో రకం వ్యక్తులు... వీళ్ళతో మనలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి... ఏమాత్రం తేడా వచ్చినా... చూసావుగా... మహేంద్ర ఎంత దారుణంగా చచ్చాడో... ఒద్దు... వీళ్ళ జోలికి వెళ్లొద్దు... వొదిలెయ్యి... చూద్దాం... ఏమి జరగబోతోందో...


బోస్టన్... మసాచుసెట్స్... యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా...

బోస్టన్ మహా నగరం లో వెళ్తోంది... అందులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు... మాధవ్ కార్ నడుపుతున్నాడు... పక్క సీట్లో స్పందన కూర్చొని ఉంది. కార్ విండో లోంచి బోస్టన్ మహానగర పరిసరాల్ని చూస్తోంది...

మాధవ్ : హౌ డు యు ఫీల్?

స్పందన : ఐ యాం గ్రేట్... మీరు... రవీంద్ర లేకపోతే నేను ఈ రోజు బ్రతికి ఉండేదాన్ని కాదు... I CANNOT THANK YOU ENOUGH...

మాధవ్ (నవ్వుతూ): IT IS OUR RESPONSIBILITY... నీకు ఎప్పుడు... ఎలాంటి సహాయం కావాలన్న... నేను నీకు ఇచ్చిన ఫోన్ నంబర్స్ లో ఎదో ఒక నెంబర్ కి ఫోన్ చెయ్యి... వెంటనే నీకు కావాల్సిన సహాయం దొరుకుతుంది. YOU MAY BE ALONE HERE... BUT DON'T FEEL LONELY... A BRAND NEW WORLD IS WAITING FOR YOU. IT'S YOUR TIME TO SHINE. GO CLAIM WHAT IS RIGHTFULLY YOURS...

ఇంతలో కార్ నావిగేషన్ సిస్టం లోంచి మెసేజ్ వచ్చింది " YOUR HAVE REACHED YOUR DESTINATION. YOUR DESTINATION IS ON YOUR RIGHT SIDE..."

మాధవ్ కార్ ఆపి... స్పందన కి షేక్ హ్యాండ్ ఇస్తూ " THIS IS YOUR DESTINATION. TIME MAKE YOUR MARK... NOW ONWARDS... WHATEVER YOU DO... JUST DON'T LOOK BACK... KEEP GOING... BEST OF LUCK IN YOUR ENDEAVOURS. CALL ME IF YOU NEED ANYTHING" అని అన్నాడు... స్పందన కార్ దిగి ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వైపు అడుగులు వేసింది. ఆమె ఆ బిల్డింగ్ లోకి వెళ్లడం చూసి అక్కడనుండి మాధవ్ బయలుదేరాడు.

స్పందన బిల్డింగ్ మెయిన్ డోర్ తోసుకొని లోపలి వెళ్ళింది... చాలా పాత బిల్డింగ్... దాదాపు ఒక 100 సంవత్సరాల కిందట నిర్మించి ఉంటారు... వుడెన్ ఫ్లోరింగ్... గోడలకి వుడెన్ పానెలింగ్... వాతావరణం చాలా గంభీరం గా ఉంది... స్పందన ప్రతి రూమ్ డోర్ మీద వ్రాసివున్న సైన్ బోర్డు చూస్తూ తాను వెళ్లాల్సిన రూమ్ వెతుకుతోంది... పెద్దగా కష్టపడకుండానే ఆ రూమ్ దొరికింది... ఆ రూమ్ డోర్ మీద " DEAN OF ADMISSIONS" అని వ్రాసి ఉంది. స్పందన మృదువుగా డోర్ మీద " టప్... టప్" అని రెండుసార్లు కొట్టింది... లోపలినుంచి "ITS OPEN... YOU MAY ENTER ..." అని ఒక ఫిమేల్ వాయిస్ వినిపించింది. స్పందన డోర్ తెరచుకొని లోపలి వెళ్ళింది... అక్కడ ఒక డెస్క్ వెనక ఒక లేడీ కూర్చొని ఉంది... ఆమె ని చూస్తూ " HAI... MY NAME IS... " అంటూ వాక్యం పూర్తికాకుండానే... ఆ డెస్క్ వెనకాల కూర్చున్న ఆమె " YOU ARE MISS. SPANDANA.. FROM MUMBAI... I AM JESSICA BROWN... COMMON... DEAN HARRY IS WATING FOR YOU..." అంటూ ఇంకో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి " HARRY... THIS IS SPANDANA FROM MUMBAI... SPANADNA... THIS DEAN HARRY..." అంటూ ఒకరికొకరిని పరిచయం చేసి ఆ రూమ్ లోంచి వెళ్ళిపోయింది...

DEAN HARRY : I AM HARRY ROBERTSON... I LOOK AFTER ADMISSIONS... I HAVE GONE THROUGH YOUR FILE... QUITE IMPECCABLE RECORD... Magna cum laude... VERY IMPRESSIVE... DO YOU THINK YOU COULD BE Magna cum laude... IN NEXT TWO YEARS?

SPANDANA : ABSOLUTELY... ANYTHING LESS THAN THAT IS NOT ACCEPTABLE TO ME...

DEAN HARRY : I LIKE THAT CONFIDENCE... I READ YOUR PAPER... DO YOU REALLY THINK CURRENT INFORMATION TECHNOLOGY WOULD BE ABSOLUTE IN NEXT TEN YEARS?

స్పందన ఒక గంట సేపు రాబోయే దశాబ్దంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎటువంటి మార్పులు రాబోతున్నాయి... దాని వల్ల... సప్లై చైన్... ఇండస్ట్రీ... బ్యాంకింగ్... షిప్పింగ్... హెల్త్ కేర్... కాపిటల్ మర్కెట్స్... ట్రేడ్ అండ్ కామర్స్... ఇంటర్నేషనల్ రిలేషన్స్... వివిధ రంగాలలో ఎటువంటి మార్పులు వస్తాయో... చాలా డిటైల్డ్ గా వివరించింది... ఆమె చెప్పింది చాలా జాగ్రత్త గా విని మధ్య మధ్యలో చాలా ప్రశ్నలు వేసాడు... ప్రతి ఒక్క ప్రశ్నకి ఆమె సమాధానం ఇచ్చింది... చివరికి డీన్ హారీ తన సీట్లోంచి లేచి నుంచొని స్పందనకి షాక్ హ్యాండ్ ఇస్తూ " MISS. SPANDANA... WELCOME TO HARVARD..." అని అన్నాడు...


Part - 34 - The Next Chapter...

రోజులు గడుస్తున్నాయి... హైదరాబాద్ లో జనాలు గత కొన్ని నెలలుగా జరిగిన విషయాలు మర్చిపోయారు... వానాకాలం వచ్చింది... విపరీతంగా వర్షాలు కురిశాయి... లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి... ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో 1౦,౦౦౦చెరువులు ఉండేవి... కాల క్రమేణా ఆ చెరువులు ఎండిపోయాయి... వాటి స్థానాన కాలనీలు వెలిశాయి... ఆ సంవత్సరం కురిసిన వానలకి ఆ కాలనీలలోకి నీరు చేరింది... ఊరంతా కొత్త గా చెరువులు వెలిశాయి... ప్రజలకి కొత్త కష్టాలు కనిపించాయి... పాత విషయాలు మార్చే పోయారు... పోలీసులు ఆ నలుగురు కుర్రోళ్ళు డ్రింక్ అండ్ డ్రైవ్ లో చనిపోయారని వ్రాసి కేసు క్లోజ్ చేశారు... ధనంజయ హార్ట్ ఎటాక్ తో పోవడంతో ఆ నియోజక వర్గం లో ఉపఎన్నిక జరిగింది. ఎవరో గెలిచారు... కైలాష్ బ్రతికి ఉన్నాడా... బ్రతికి ఉంటే ఎక్కడున్నాడు? అని పోలీస్ డిపార్టుమెంటు లో డిబేట్ నడుస్తోంది... కాంతారావు కేసు ని CBI ఇన్వెస్టిగేట్ చేస్తోంది... మహేంద్ర వేరే దేశం లో చనిపోవడం తో మన దేశం లో పోలీస్ డిపార్టుమెంటు పెద్దగా పట్టించుకోలేదు... మహేంద్ర బిజినెస్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నడుపుతున్నారు...

నవంబర్ నెల... హైదరాబాద్ లో ప్రజలంతా ఆనందోత్సవాలతో దీపావళి జరుపుకుంటున్నారు... ఆ రోజు మధ్యాన్నం 1:30 నిమిషాల సమయం లో... హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఒక UPSCALE RESIDENTIAL లొకాలిటీ... అక్కడ ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో 5 పెద్ద పెద్ద అపార్టుమెంట్ టవర్స్ ఉన్నాయి... ఒక్కోటవర్ లో 25 అంతస్తులు... ఒక్కో అంతస్తుకి 8 అపార్టుమెంట్స్... అంటే ఒక్కో టవర్ లో 200 కుటుంబాలు ఉంటాయి... ఆ కాంప్లెక్స్ మధ్యలో ఒక రిక్రియేషన్ సెంటర్ ఉంది... అక్కడ చాలా కోలాహలంగా ఉంది... దీపావళి మేళ జరుగుతోంది...

టవర్ C... టాప్ ఫ్లోర్ లో అపార్టుమెంట్ నెంబర్ 2508... 4 బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, కిచెన్, 4 బాత్రూం, సర్వెంట్ రూమ్ కలిగిన అపార్టుమెంట్... ఆ అపార్టుమెంట్ లో ఒక బెడ్ రూమ్ ని కంప్లీట్ గా సౌండ్ ప్రూఫ్ చెయ్యబడి ఉంది. లోపలి సౌండ్స్ బయటకి... బయటి సౌండ్స్ లోపలి కి వినపడవు... ఆ రూమ్ లో Work From Home సెటప్ ఉంది. ఆఫీస్ టేబుల్... చైర్... iMAC కంప్యూటర్... iPad Pro... హై స్పీడ్ సెక్యూర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్... ఒక ఆఫీస్ కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి... కాఫీ కప్ పట్టుకొని ఖుర్రమ్ ఆ రూమ్ లోకి ప్రవేశించాడు. కంప్యూటర్ ఆన్ చేసి సెక్యూర్ నెట్వర్క్ ద్వారా డార్క్ వెబ్ లోకి ప్రవేశించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న చాట్ రూమ్ లోకి లాగిన్ అయ్యాడు... అందులో చాలా USER IDs ఆక్టివ్ గా ఉన్నాయి... అందులో సిద్దికీ ID కూడా ఆక్టివ్ గా కనిపిచింది... ఖుర్రమ్ రెండు నిమిషాలు సీరియస్ గా అలోచించి సిద్దికీ ID మీద క్లిక్ చేసాడు... న్యూ ఢిల్లీ లోని OP CENTER లో ఎంతో కాలంగా ఖుర్రమ్ కోసం ఎదురుచూస్తున్న రంజిత్ ముందున్న కంప్యూటర్ స్క్రీన్ మీద చాట్ రూమ్ లోకి ఖుర్రమ్ రావడం కనిపిచింది... వెంటనే ఫోన్ చేసి " సర్... ఖుర్రమ్ ఈజ్ ఆన్ లైన్..." అని మాధవ్ కి చెప్పాడు... మాధవ్ వెంటనే రంజిత్ వర్క్ స్టేషన్ దగ్గరకి వెళ్ళాడు... "ఈసారి ఖుర్రమ్ లొకేషన్ ని ట్రేస్ చెయ్యాలి.." అని రంజిత్ పక్కనేవున్న ఒక ఏజెంట్ కి చెప్పాడు...

రంజిత్ (సిద్దికీ లాగా చాట్ చేస్తూ) : హాయ్ ఖుర్రమ్... ఎలా ఉన్నావు? చాలా రోజులయ్యింది...

ఖుర్రమ్ : నువ్వు ఎవరు?

రంజిత్ : నేను ... సిద్దికీ... మనం చాలా సార్లు చాట్ చేసాము...

ఖుర్రమ్ : సిద్దికీ చనిపోయి చాలా రోజులయ్యింది... సిద్దికీ ని కలవడానికి హైదరాబాద్ హై కోర్ట్ దగ్గరలో ఒక కేఫ్ కి రమ్మని చెప్పాను... వచ్చాడు... నేను ఆ కేఫ్ లోపలి వెళ్లే లోపల ఎవరో ఒక పిచ్చోడు ఆ ఇరానీ కేఫ్ లోకి దూరి కాల్పులు జరిపాడు. అది చూసి నేను వెళ్ళిపోయాను. తరువాత ఎంక్వయిరీ చేస్తే... ఆ కేఫ్ షూటింగ్ లో చనిపోయిన వాళ్లలో సిద్దికీ కూడా ఉన్నాడని తెలిసింది. సిద్దికీ నన్ను కలవడానికి వచ్చి చనిపోవడంతో మీరు నన్ను అనుమానిస్తారని నేను ఈ చాట్ రూమ్ కి ఇన్నాళ్లు దూరంగా ఉన్నాను... నీ పేరు?

రంజిత్ : నా పేరు రంజిత్... నేను సిద్దికీ బ్యాక్ అప్ ఏజెంట్... సిద్దికీ ని నువ్వే చంపావని మా అనుమానం...

ఖుర్రమ్ : సిద్దికీ ని నేను చంపలేదని మీకు ఈపాటికి తెలిసివుంటుంది... వాడెవడో పాషా అని ఒక బంగ్లాదేశీ కాంట్రాక్టు కిల్లర్ ఆ ఇరానీ కేఫ్ లో షూట్ అవుట్ జరిపాడని మీకు తెలిసిందని నాకు తెలిసింది...

రంజిత్ : అవును... ఇప్పుడు కాంటాక్ట్ చెయ్యడానికి ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉందా...

ఖుర్రమ్ : ఉంది... ఈ మధ్య నాకు పాకిస్తాన్ లో ఒక కాంటాక్ట్ దొరికాడు. వాడి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది... నేను పర్సనల్ గా వాడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసాను. గుడ్ అసెట్... ఒకప్పుడు పాకిస్తాన్ మిలిటరీ లో పనిచేశాడు... ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్... స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ లో పనిచేసి మిలిటరీ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు... మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చెయ్యడానికి రెడీ గా లేడు... నన్ను మీడియేట్ చెయ్యమన్నాడు... మీకు ఇష్టముంటే నేను మీ ఇద్దరికీ మిడ్ పాయింట్ గా వ్యవహరిస్తాను... నా కమిషన్ నేను తీసుకుంటాను... 10% OF THE DEAL VALUE... మీకు ఇష్టముంటే నేను నెక్స్ట్ వీక్ షాడో మీటింగ్ ఏర్పాటు చేస్తాను...

షాడో మీటింగ్ లో మూడు పార్టీస్ ఉంటాయి... ఒక పార్టీ మీడియేటర్ గా వ్యవహరిస్తాడు... మిగతా రెండు పార్టీస్ కి ఒకరి ఐడెంటిటీ... లొకేషన్... రెండో పార్టీ కి తెలియదు... టోటల్ సేఫ్... అన్ని డీటెయిల్స్ మీడియేటర్ ద్వారా నే జరుగుతాయి.

మాధవ్ కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చెయ్యసాగాడు...

మాధవ్ : ఈ కాంటాక్ట్ ఎన్నేళ్లు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్ లో పనిచేశాడు? టైం పీరియడ్ చెప్పగలవా?

ఖుర్రమ్ : టైం పీరియడ్... సర్వీస్ డీటెయిల్స్ చెప్తే... మీరు ఆ అసెట్ పేరు ఈజీ గా గుర్తు పట్టే ఛాన్స్ ఉంది... దాంతో మీకు నాతో పని ఉండదు. నేను ఆ డీటెయిల్స్ ఇవ్వను. ఆ అసెట్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో నా ద్వారా మీకు తెలుస్తుంది... మీ ఇద్దరికీ డీల్ ఓకే అయితే నాకు నా కమిషన్ వస్తుంది... మీకు ఇష్టం లేకపోతే నేను ఆ అసెట్ ని వేరే పార్టీ కి పరిచయం చేస్తాను...

మాధవ్ : ముందు ప్రిలిమినరీ మీటింగ్ ఏర్పాటు చెయ్యి... ఆ తరువాత మా పొజిషన్ ఏమిటో మీకు చెపుతాము...

ఖుర్రమ్ : గుడ్... నెక్స్ట్ వీక్ నేను మీ ఇద్దరికీ షాడో మీటింగ్ ఏర్పాటు చేసి డీటెయిల్స్ పంపిస్తాను... ఇకనుంచి ఈ చాట్ రూమ్ ని వొదిలేస్తున్న... మీకు నేను కొత్త చాట్ రూమ్ డీటెయిల్స్ ఇమెయిల్ చేస్తాను...

ఖుర్రమ్ డార్క్ వెబ్ చాట్ రూమ్ లోంచి పెర్మనంట్ గా లాగ్ అవుట్ అయ్యాడు... కొత్త చాట్ రూమ్ ని వేరే ఒక కొత్త సెక్యూర్ వెబ్ సైట్ లో రెడీ చేసాడు... ఇకనుంచి కొత్త వెబ్ సైట్ నుంచి చాట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కంప్యూటర్ మాత్రం ఆన్ వుంది... iPAD... iMAC కి 24*7 సింక్ అయ్యి ఉంటుంది. ఖుర్రమ్ బయటకి వెళ్ళేటప్పుడు iPAD ని తప్పకుండా తీసుకొని వెళ్తాడు. ఖుర్రమ్ డార్క్ వెబ్ లోంచి బయటకి రావడం సౌత్ ఆఫ్రికా లోని కేప్ టౌన్ నగరం లో పీటర్ వాన్ డైక్ అనే వ్యక్తి గమనించాడు... వెంటనే పాకిస్తాన్ లోని లాహోర్ నగరం లోని ఒక నెంబర్ కి కాల్ చేసి " ARE YOU STILL SEARCHING FOR KHURRAM?" అని అడిగాడు... అవతల నుంచి "YES... WE ARE..." అని అన్నాడు... దానికి బదులుగా పీటర్ వాన్ డైక్ "HOW MUCH WILL YOU PAY FOR EXACT GEO COORDINATES OF KHURRAM?" అని అడిగాడు... లాహోర్ నుంచి మాట్లాడుతున్న వ్యక్తి ఒక అంకె చెప్పి... "HALF NOW... HALF LATER..." అని అన్నాడు... పీటర్ వాన్ డైక్ "DONE ... GIVE ME 20 MINUTES... " అని చెప్పి తన బ్యాంకు పేరు... అకౌంట్ నెంబర్... IBAN పంపాడు...

సరిగ్గా ఇదే సమయానికి ఢిల్లీ లోని OP CENTER లో రంజిత్... "ఒక 20 నిమిషాల్లో ఖుర్రమ్ లొకేషన్ మీకు చెప్తాను..." అని మాధవ్ తో అన్నాడు... మాధవ్ తల పంకించి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. రంజిత్ కొత్తగా తయారుచేసిన సాఫ్ట్ వేర్ ని రన్ చేసాడు... రకరకాల VPN ని దాటుకుంటూ ప్రపంచమంతా స్కాన్ చేస్తోంది... కేప్ టౌన్ లో పీటర్ వాన్ డైక్ కూడా ఇలాంటి సాఫ్ట్ వేర్ నే తయారుచేసుకున్నాడు... అది కూడా ఖుర్రమ్ లొకేషన్ ని స్కాన్ చెయ్యసాగింది... అదే సమయానికి పీటర్ వాన్ డైక్ బ్యాంకు నుంచి ఒక మెసేజ్ వచ్చింది... లాహోర్ నుంచి 50% అమౌంట్ క్రెడిట్ అయ్యింది...

ఖుర్రమ్ కాఫీ కప్ తీసుకొని డ్రాయింగ్ రూమ్ లోని బాల్కనీ లోకి వచ్చాడు... పక్క బాల్కనీ లో జనసంచారం గమనించి అటువైపు చూసాడు... పక్క ఫ్లాట్ ఓనర్ రంగారావు... ఆయన పక్కనే ఇంకో వ్యక్తి... రంగారావు ఆ వ్యక్తి ని ఖుర్రమ్ కి చూపిస్తూ...

రంగారావు : హలో సర్... ఎలా ఉన్నారు ? చాలా రోజులయ్యింది... ఇతను నా కొలీగ్... సత్యమూర్తి... మన టవర్ లోనే 2ND ఫ్లోర్ లో 206 లో ఈ నెలలోనే చేరారు... సత్య... ఈయన పేరు విశ్వామిత్ర... మన సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లోనే పనిచేసి రిటైర్ అయ్యారు...

ఖుర్రమ్ / విశ్వామిత్ర : హలో సత్యమూర్తి గారు... ఎలా ఉన్నారు?

సత్యమూర్తి : ఐ యాం ఫైన్... ఫ్యామిలీ వూర్లో లేరా?

విశ్వామిత్ర : లేరండి... వాళ్ళు యూరోప్ లో ఉన్నారు... పిల్లల చదువులు...

సత్యమూర్తి : ఇక్కడికి అప్పుడప్పుడూ వస్తారా...

విశ్వామిత్ర (నవ్వుతూ) : లేదండి... వాళ్లకి యూరోప్ బాగా అలవాటయ్యింది... వాళ్ళు రారు... త్వరలో నేనే వెళ్తాను...

సత్యమూర్తి : అంటే... మీరు ఇప్పడు ఒంటరిగా ఉన్నారా? అయితే మా ఇంటికి రండి... ఈరోజు మేము ఇంట్లో దీపావళి పూజ చేస్తున్నాము... 3:00 గంటలకి మొదలవుతుంది. రంగా... విశ్వామిత్ర గారిని కూడా తీసుకొని రా...

విశ్వామిత్ర మొహమాటం గా వస్తానని చెప్పాడు... అప్పుడు సమయం మధ్యాన్నం 2:30 నిమిషాలు అవుతోంది.... విశ్వామిత్ర పూజకి వెళ్ళడానికి స్నానం చేసి కొత్త లాల్చీ... పైజామా వేసుకొని రెడీ గా ఉన్నాడు... సరిగ్గా 2:55 నిమిషాలకి రంగారావు విశ్వామిత్ర ఫ్లాట్ మెయిన్ డోర్ మీద "టక్... టక్... టక్..." అని చప్పుడు చేసాడు... విశ్వామిత్ర వెంటనే తన iPHONE... iPAD... వాలెట్ తీసుకొని ఫ్లాట్ ని లాక్ చేసి రంగారావు తో కలసి 2nd ఫ్లోర్ లో సత్యమూర్తి ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కాడు...

అప్పుడు సమయం 3:00 గంటలు... కేప్ టౌన్ నుండి పీటర్ వాన్ డైక్ ఖుర్రమ్ GEO LOCATION COORDINATES ని ఒక ఇమెయిల్ అడ్రస్ కి పంపాడు... ఆ ఇమెయిల్ లాహోర్ లో ISI ఆఫీస్ వాళ్లకి చేరింది. వాళ్ళు దాన్ని రన్ చేశారు... ఖుర్రమ్ అడ్రస్ దొరికింది... అపార్టుమెంట్ నెంబర్ తో సహా... TOWER C... 2508... EMERALD CITY, MADAPUR, HYDERABAD... ఆ ఆఫీసర్ ఆనందానికి అంతులేదు... వెంటనే హైదరాబాద్ లో తమ ఏజెంట్స్ కి మెసేజ్ పంపాడు...

సరిగ్గా అదే సమయానికి... OP CENTER నుండి అదే అడ్రస్ అవినాష్ కి చేరింది... ఒకే అడ్రస్ కి రెండు టీమ్స్... ఖుర్రమ్ ని కాప్చర్ చెయ్యడానికి బయలుదేరాయి... ముందు గా ISI ఫీల్డ్ ఏజెంట్ సైఫుద్దీన్ తన టీం ని తీసుకొని EMERALD CITY చేరుకున్నాడు...

విశ్వామిత్ర మొబైల్ ఫోన్ మోగింది... సత్యమూర్తి ఇంట్లో పూజ నడుస్తోంది... వాళ్లని డిస్టర్బ్ చెయ్యకుండా బాల్కనీ లోకి వెళ్లి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు EMERALD CITY లోకి 4 SUV లు ప్రవేశించడం గమనించాడు... ఆ వెహికల్స్ విజిటర్స్ కోసం ఏర్పాటు చేసిన ఏరియా లో పార్క్ అయ్యాయి. ఒక SUV లోంచి సైఫుద్దీన్ దిగడం విశ్వామిత్ర కి చాలా క్లియర్ గా కనిపిచింది... విశ్వామిత్ర పెదాల మీద చిరునవ్వు వెలసింది... ఆకాశం వైపు చూసి "భగవాన్... మళ్ళీ వేట మొదలయ్యింది..." అని అనుకున్నాడు... సైఫుద్దీన్ తన టీం తో TOWER C లోకి రావడం చూసి... "ఈసారి సైఫ్ కి ఫ్లాట్ నెంబర్ కూడా దొరికిందన్నమాట..." అని సన్నగా నువ్వుకుంటూ పూజ జరుగుతున్న రూమ్ లోకి వచ్చి... దేవుడి పటానికి నమస్కరించి... తన iPAD తీసుకొని రంగారావు తో "ఇప్పుడే... ఒక 15 మినిట్స్ లో వస్తా..." అని చెప్పి సత్యమూర్తి ఇంట్లోంచి బయటకి వచ్చి... స్టెయిర్ కేసు డోర్ ఓపెన్ చేసుకొని మెట్ల మీదుగా ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకునే లోపల తన iPAD లో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఆక్టివేట్ చేసాడు... అంతే... ఒక ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది... రెండే రెండు నిమిషాల్లో విశ్వామిత్ర చేతిలోని iPAD... అపార్టుమెంట్ 2508 లోని iMAC లోని డేటా మొత్తం ముందుగా క్లౌడ్ అకౌంట్ కి అప్లోడ్ చేసి iMAC పూర్తిగా ఎందుకూ పనికిరాకుండా ఫార్మాట్ చేసేసింది. విశ్వామిత్ర లాల్చీ జేబులోంచి తాళాల గుత్తిలో ఒక కీ తో అపార్టుమెంట్ 108 ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టాడు... లైట్ వెయ్యకుండా డైరెక్ట్ గా మాస్టర్ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు... అపార్టుమెంట్ 108 కూడా సరిగ్గా 2508 కి రెప్లికా అపార్టుమెంట్ ...మొత్తం ఖాళీగా వుంది... కనీసం ఒక కుర్చీ కూడా లేదు... విశ్వామిత్ర మాస్టర్ బెడ్ రూమ్ లో వార్డ్ రోబ్ ఓపెన్ చేసాడు... అక్కడ... ఒక కోట్ కవర్... ఒక సూట్ కేసు... ఆ సూట్ కేసు పైన ఒక ఐపాడ్ ఫోల్డర్... వాటితో పాటు ఇంకో పెద్ద బ్యాగ్ కూడా ఉంది. విశ్వామిత్ర ఆ బ్యాగ్ తీసుకొని నేరుగా మాస్టర్ బెడ్ రూమ్ బాత్రూం లోకి వెళ్ళాడు. బాగ్ నెల మీద పెట్టి ఓపెన్ చేసాడు... అందులో చాలా సామాన్లు ఉన్నాయి...


అదే సమయానికి సైఫుద్దీన్ తన టీం తో అపార్టుమెంట్ 2508 చేరుకున్నాడు... అపార్టుమెంట్ డోర్ హ్యాండిల్ ని పట్టుకొని ఓపెన్ చెయ్యడానికి ప్రత్నించాడు... డోర్ లాక్ చేసి వుండడం గమనించి కాలింగ్ బెల్ కొట్టాడు... రెస్పాన్స్ లేదు... తన సైలెన్సర్ గన్ తో లాక్ ని కాల్చేసి తలుపు ఓపెన్ చేసి అపార్టుమెంట్ లోకి అడుగుపెట్టాడు... ఎవ్వరూ లేరు... ఖాళీగా ఉంది... విపరీతమైన కోపం తో ముందు హిందీ లో మొదలుపెట్టి... తరువాత... ఉర్దూ లో.. ఆ తరువాత... పశ్తో... పెర్షియన్... అరబిక్ భాషల్లో అన్ని బూతులు తిట్టాడు.... ప్రతిసారి ఖుర్రమ్ తప్పించుకుంటున్నాడు... ఈసారి తప్పకుండా పట్టుపడతాడని ఆశించాడు... ఫ్లాట్ మొత్తం చెక్ చేసాడు... iMAC కనిపించింది... దాన్ని తీసుకొని తన టీం తో అక్కడనుంచి వెళ్ళిపోయాడు... ఒక రెండు నిమిషాల తరువాత అవినాష్ అదే అపార్టుమెంట్ కి చేరుకున్నాడు... బులెట్ షాట్స్ కి చెల్లాచెదురయినా మెయిన్ డోర్ కనిపించింది... వెంటనే తన రివాల్వర్ ని బయటకి తీసి జాగ్రత్తగా తలుపు తీసుకొని అపార్టుమెంట్ లో కి ప్రవేశించాడు...


అపార్టుమెంట్ నెంబర్ 108 లోని బాత్రూం లో విశ్వామిత్ర బాగ్ లోంచి ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ ని జాగ్రత్త బయటకి తీసి దాంతో వాష్ బేసిన్ పూర్తిగా కవర్ అయ్యేలా పరిచాడు... నేల మీద కూడా బాగా కవర్ అయ్యేలా చూసుకున్నాడు. ఆ ప్లాస్టిక్ కవర్ మీదే నుంచొని తన వొంటి మీద బట్టలు అన్నింటిని విప్పి వాటిని తాను వేసుకున్న చెప్పులతో సహా జాగ్రత్త గా బాగ్ లో పెట్టాడు. అదే బాగ్ లోంచి PHILLIPS షేవింగ్ కం ట్రిమ్మర్ బయటకి తీసి... నగ్నంగానే ప్లాస్టిక్ షీట్ మీద నుంచొని వాష్ బేసిన్ మీదున్న అద్దం లో చూస్తుకుంటూ జాగ్రత్త గా ఎన్నో ఏళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని తీసేసాడు... ఇప్పుడు విశ్వామిత్ర మొహం రెండు రంగుల్లో కనిపిస్తోంది... ఇన్నాళ్లు గడ్డం కవర్ చేసిన ఏరియా చాలా తెల్లగా ఉంది... మొహంమీద మిగతా భాగం... నుదురు... ముక్కు... చెక్కిళ్ళు... షేవింగ్ చెయ్యని ఏరియా మొత్తం డార్క్ టాన్ గా ఉంది... ముక్కు మీద కొంచం ఉబ్బి కూడా ఉంది. విశ్వామిత్ర కావాలని మొహం మీద గడ్డం తో కవర్ అవ్వని భాగాన్ని వారానికోసారి కెమికల్ టానింగ్ చేసేవాడు... ముక్కు మీద ఉబ్బు కూడా కెమికల్ వాడి పెట్టుకునేవాడు... బయట ప్రపంచానికి విశ్వామిత్ర గడ్డం... మీసాలు... ముక్కు మీద వాపుతో... డార్క్ ఛామన చాయ తో కనిపించేవాడు... తల మీద వెంట్రుకలకి కూడా రెగ్యులర్ గా తెల్లటి రంగు వేసేవాడు... బాగ్ లోంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీసాడు. అందులో ఫేస్ ప్యాక్ షీట్స్ ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని తీసుకొని మొహం మీద వేసుకొని తన కుడి చేతి మణికట్టు దగ్గర పల్స్ ని కౌంట్ చెయ్యడం మొదలెట్టాడు... సరిగ్గా 6 నిమిషాల తరువాత ఆ ఫేస్ ప్యాక్ తీసేసి అద్దం లో చూసుకున్నాడు... టానింగ్ ఇంకా ఉంది... ఇంకో ఫేస్ ప్యాక్ షీట్ తీసుకొని మొహం మీద వేసుకొని మళ్ళీ కుడి చేతి మణికట్టు దగ్గర పల్స్ ని కౌంట్ చేసాడు... ఇంకో 4 నిమిషాల తరువాత ఫేస్ ప్యాక్ తీసి అద్దం లో క్లోజ్ గా చెక్ చేసాడు... ఇంకా ఒక షేడ్ టానింగ్ కనిపిస్తోంది... మూడో సారి ఫేస్ ప్యాక్ ని 3 నిమిషాల పాటు ఉంచాడు... ఇప్పుడు మొహమంతా తెల్లగా ఒకే కలర్ లో కనిపిస్తోంది... ముక్కుమీదున్న ఉబ్బు కూడా మాయమయింది...


అవినాష్ అపార్టుమెంట్ 2508 మొత్తం చాలా జాగ్రత్తగా చెక్ చేసాడు... పెద్దగా సామాన్లు ఏమి లేవు... కిచెన్ చాలా నీట్ గా ఉంది. ఫ్రిడ్జ్ లో కొన్ని ఫ్రూట్స్... కోకా కోల టిన్స్ ఉన్నాయి... పక్కనే షెల్ఫ్ లో JOHNNEY WALKER DOUBLE BLACK బాటిల్స్ కనిపించాయి... వాటిని చూసి అవినాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి... ఇంకోసారి అపార్టుమెంట్ ని చాలా జాగ్రత్తగా చెక్ చేసాడు... మాస్టర్ బెడ్ రూమ్ లోని వార్డ్ రోబ్ ని ఓపెన్ చెయ్యడానికి ట్రై చేసాడు అది లాక్ చేసి ఉంది... వార్డ్ రోబ్ హేండిల్ ని పట్టుకొని బలవంతగా లాగాడు... డోర్ ఓపెన్ కాలేదు... హేండిల్ విరిగింది... వొళ్ళు మండి... రివాల్వర్ తో వార్డ్ రోబ్ లాక్ ని కాల్చి విరగొట్టాడు... డోర్ ఓపెన్ చెయ్యగానే... నీట్ గా హ్యాంగర్స్ కి వేళ్ళాడుతున్న విశ్వామిత్ర ఖద్దరు లాల్చీలు... వాటి పక్కనే జీన్స్ పాంట్స్... కనిపించాయి... వాటిని చూడగానే నీరసం వచ్చిన వాడిలాగా బెడ్ మీద కూర్చుండి పోయాడు... అయిదు నిమిషాల తరువాత తేరుకొని ఇల్లంతా ప్రతి అంగుళం చెక్ చెయ్యసాగాడు.


విశ్వామిత్ర ఆదం లో తన ప్రతిబింబాన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్నాడు... బాగుంది... తృప్తిగా తలపంకించి ఫేస్ ప్యాక్ కవర్ ని జాగ్రత్త గా బాగ్ లో పెట్టేసాడు... ఇప్పుడు PHILLIPS ట్రిమ్మర్ ని లెంగ్త్ 7 కి సెట్ చేసి జుట్టు ని చాలా జాగ్రత్త గా కట్ చేయ్యసాగాడు... ఒక 15 నిమిషాల్లో ఎన్నో ఏళ్లతరబడి పెంచిన పొడుగాటి జుట్టు మొత్తం పోయింది... హెయిర్ కట్ ని క్లోజ్ గా చెక్ చేసాడు... అంత తృప్తి గా లేదు... వెంటనే ట్రిమ్మర్ లెంగ్త్ ని 5 కి సెట్ చేసి ఇంకో సారి హెయిర్ కట్ చేసాడు... ఇప్పుడు చూడడానికి బాగుంది... ట్రిమ్మర్ ని జాగ్రత్తగా బాగ్ లో పెట్టేసి... ఒక షాంపూ బాటిల్... సోప్... షవర్ షెల్ఫ్ లో పెట్టాడు... ఒక టవల్ ని షవర్ హేండిల్ మీద వేసాడు... ఆ బాత్ రూమ్ లో వాష్ బేసిన్ మీదనుంచి కిందకి నేలమీద వరకు వేసిన ప్లాస్టిక్ షీట్ చాలా జాగ్రత్తగా ఒక్క వెంట్రుక కూడా నేల మీద పడకుండా చాలా జాగ్రతగా మడచి దాన్ని బాగ్ లో పెట్టేసాడు... నేరుగా వెళ్లి షవర్ కింద నుంచొని ఒక 30 నిమిషాల పాటు తనివితీరా స్నానం చేసి టవల్ తో శుభ్రంగా తుడుచుకొని దాన్ని కూడా ఆ బాగ్ లో పడేసి జిప్ వేసేశాడు... ఆఖరున తాను పెట్టుకున్న కాంటాక్ట్ లెన్స్ ని తీసేసి టాయిలెట్ లో పడేసి ఫ్లష్ చేసాడు. ఒక 5 నిమిషాల పాటు ఆ బాత్రూం అంతా జాగ్రతగా చెక్ చేసి సంతృప్తి చెంది... బాత్రూం లో లైట్ ఆఫ్ చేసి డోర్ వేసి బెడ్ రూమ్ లోకి వచ్చి వార్డ్ రోబ్ లోని కోట్ కవర్ ఓపెన్ చేసాడు... అందులో లండన్ లోని "సవిల్లి రో" లోని ఒక పెద్ద టైలర్ కుట్టిన సూట్ ఉంది... ముందుగా అండర్ వేర్... ప్యాంటు... షర్ట్ బయటకి తీసి వేసుకొని షూస్ తొడుక్కొని ఆ కోట్ కవర్ ని కూడా బాగ్ లోపల పెట్టేసాడు... చివరిగా కోట్ తొడుక్కొని... ఆ కోట్ పాకెట్ లోంచి SPECTS బయటకి తీసి పెట్టుకున్నాడు... కోటుకున్న ఇంకో పాకెట్ లో రెండు పాస్ పోర్ట్స్ ఉన్నాయి. వేరే పాకెట్ లో కొత్త iPHONE ఉంది. పాత iPHONE... iPAD ని కూడా బాగ్ లో పడేసాడు... కొత్త ఐఫోన్ ని ఆన్ చేసి ఒక మెసేజ్ పంపి... సూట్ కేసు... లాప్ టాప్ ఫోల్డర్... బాగ్ ని తీసుకొని చివరిసారిగా ఆ అపార్టుమెంట్ ని పూర్తిగా పరికించి చూసుకొని మెయిన్ డోర్ క్లోజ్ చేసి లిఫ్ట్ లోకి వెళ్లి బేస్ మెంట్ పార్కింగ్ కి వెళ్ళడానికి బటన్ నొక్కాడు... అపార్టుమెంట్ 108 లోపలి వెళ్లిన జంగందేవర లాంటి విశ్వామిత్ర కి... బయటకి వచ్చిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లాంటి వ్యక్తి కి ఎటువంటి పోలిక లేదు.


అవినాష్ అపార్టుమెంట్ 2508 ని పూర్తిగా చెక్ చేసి చివరిగా OP CENTER కి ఫోన్ చేసి మాధవ్ తో "I HAVE A REASON TO BELIEVE THAT VISWAMITRA AND KHURRAM ARE ONE AND SAME. I AM AT HIS APARTMENT... I FOUND HIS CLOTHES... SHOULDER BAG... AND LIQUER BOTTLES... NOW HE IS GONE..." అని చెప్పాడు... మాధవ్ వెంటనే ఎయిర్పోర్ట్స్... రైల్వే స్టేషన్స్... బస్ స్టాండ్స్... అన్నిన్నిటికి LOOKOUT NOTICE వెళ్ళేలాగా చూసాడు... మాధవ్ కి తెలుసు... ఇదంతా వేస్ట్ అని... ఒక MI6 ఆపరేటివ్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు... అయినా తన ప్రయత్నం చేస్తున్నాడు... ఫోన్ చేసి రవీంద్ర కి కూడా ఈ విషయాన్ని చెప్పాడు...


విశ్వామిత్ర అపార్టుమెంట్ నుంచి కోపంతో బయలుదేరిన సైఫుద్దీన్ కార్ లో వెళ్తూ మనసులో ఆలోచించసాగాడు.... 'ఇది మూడోసారి... ఖుర్రమ్ చేతుల్లోంచి జారిపోవడం... మొదటిసారి టొరంటో లో తప్పించుకున్నాడు... ఇలాగే ఒక ఇల్లు రైడ్ చేస్తే లాప్ టాప్ తప్పా ఏమి దొరకలేదు... వారం రోజులు చాలా మంది ఏజెంట్స్ ఎయిర్పోర్ట్స్... సీ పోర్ట్స్... నేషనల్... ఇంటర్నేషనల్ బోర్డర్స్ అన్ని మానిటర్ చేశారు... వాడు మాత్రం ఎక్కడికి పోకుండా ఒక నెల రోజులు ఏ ఇంటిని రైడ్ చేశారో... దాని పక్క ఇంట్లోనే దాక్కున్నాడని తెలిసింది... రెండోసారి... డబ్లిన్... ఇలాగే ఊళ్ళోనే దాక్కొని నెమ్మదిగా ఫిషింగ్ బోట్ లో ఇంగ్లాండ్ చేరుకున్నాడు... ఇది మూడోసారి... పారిపోవడం...." సడన్ గా సైఫుద్దీన్ కి బుర్రలో ఫ్లాష్ అయ్యింది.... మళ్ళీ అన్ని భాషల్లో బూతులు తిట్టడం మొదలెట్టాడు... "కార్ వెనక్కి పోనియ్యి... వాడు ఆ EMERALD CITY లోనే వేరే అపార్టుమెంట్ లో దాక్కొని ఉంటాడు... మనం అక్కడ స్టేక్ అవుట్ చెయ్యాలి" అంటూ ఆర్డర్ వేసాడు... కార్ వెనక్కి తిరిగింది.... EMERALD CITY వైపు వెళ్తోంది...


విశ్వామిత్ర నేరుగా బేస్ మెంట్ లోని కార్ పార్కింగ్ కి చేరుకున్నాడు... అక్కడ ఒక స్కోడా రాపిడ్ కార్ ఉంది... దాని బూట్ ఓపెన్ చేసి తనతోపాటు తెచ్చుకున్న బాగ్ ని జాగ్రతగా అందులో పెట్టాడు... బూట్ లోపల కుడి... ఎడమ వైపు పెద్ద పెద్ద ప్లాస్టిక్ కాన్స్ ఉన్నాయి... వాటిలోంచి బాగా ఘాటైన వాసన వస్తోంది. విశ్వామిత్ర తన మనీ వాలెట్... పాత మొబైల్... పాత iPAD ని కూడా బూట్ లోని బాగ్ లో పెట్టి జిప్ వేసాడు... విశ్వామిత్ర తన సూట్ కేసు... లాప్ టాప్ ఫోల్డర్ ని మాత్రం కార్ వెనక సీట్ లో పెట్టుకొని తాను డ్రైవర్ సీట్ లో కూర్చొని కార్ స్టార్ట్ చేసాడు... సరిగ్గా అదేసమయం లో విశ్వామిత్ర కొత్త iPHONE కి ఒక మెసేజ్ వచ్చింది... అది ఎయిర్ టికెట్... హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ... విశ్వామిత్ర నెమ్మదిగా కార్ ని బేస్ మెంట్ లోంచి బయటకి తీసి రోడ్ మీదకి వచ్చాడు... నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వైపు కార్ ని నడపసాగాడు... అదే సమయం లో రోడ్ కి అవతలి వైపున EMERALD CITY వైపు వెళ్తున్న సైఫుద్దీన్ ఇటు వైపు చూసినట్లయితే... ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్న స్కోడా కార్... దాని నడుపుతున్న ఖుర్రమ్ కనపడి ఉండేది... బాడ్ లక్...


విశ్వామిత్ర హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా కి చేరుకొని లాంగ్ టర్మ్ పార్కింగ్ టోకెన్ తీసుకున్నాడు... పార్కింగ్ ఏరియాలో దూరంగా ఖాళీగా ఉన్న ప్రదేశం లో స్కోడా రాపిడ్ ని పార్క్ చేసి... వెనక సీట్ లోంచి సూట్ కేసు... లాప్ టాప్ ఫోల్డర్ తీసుకొని కార్ డోర్స్ వేసి... వెనకాల బూట్ ని ఓపెన్ చేసాడు... బూట్ లోపల కుడి... ఎడమ... ఉన్న ప్లాస్టిక్ క్యాన్స్ కి ఒక కత్తి తో బొక్కలు పెట్టాడు... ఆ క్యాన్స్ లోంచి లిక్విడ్ కెమికల్ ఆ బూట్ లోకి కారసాగింది... బూట్ ని లాక్ చేసి సూట్ కేసు తీసుకొని నెమ్మదిగా ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి VISTARA విమానం ఎక్కి రెండు గంటల తరువాత ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 లో ల్యాండ్ అయ్యాడు. సరిగ్గా అదేసమయానికి విశ్వామిత్ర మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది... అది స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ నగరం వెళ్ళడానికి SWISS AIR టికెట్... బాగేజ్ క్లెయిమ్ చేసుకొని ARRAIVAL TERMINAL బయటకి వచ్చి లిఫ్ట్ ఎక్కి పైనున్న ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్ కి చేరుకొని లోపలి కి వెళ్లి SWISS AIR కౌంటర్ దగ్గరికి వెళ్లి ZURICH వెళ్ళడానికి టికెట్ ని చూపించాడు... ఆ కౌంటర్ లో క్లర్క్ ఆ టికెట్ ని వెరిఫై చేసి " YOUR PASSPORT PLEASE... " అంది...అక్కడితో గిరీశం వేసిన "విశ్వామిత్ర" పాత్ర ముగిసింది... విశ్వామిత్ర స్థానంలో "JACOB EPSTEIN" ప్రత్యక్షమయ్యాడు... JACOB EPSTEIN తన కోట్ పాకెట్ లోంచి POLISH PASSPORT ని తీసి కౌంటర్ లోని క్లర్క్ కి ఇచ్చాడు... ఆమె PASSPORT మీదున్న పేరుని ఎయిర్ టికెట్ మీదున్న పేరుని టాలీ చేసుకొని FIRST CLASS బోర్డింగ్ పాస్ ని JACOB EPSTEIN కి ఇచ్చి... " HAVE A NICE JOURNEY..." అని అన్నది... JACOB EPSTEIN అక్కడనుంచి బయలుదేరి... ఇమ్మిగ్రేషన్... సెక్యూరిటీ చెక్... పూర్తి చేసుకొని... డ్యూటీ ఫ్రీ షాప్ లో షాపింగ్ చేసుకొని ZURICH వెళ్లే SWISS AIR విమానం ఎక్కాడు...

ఇండియా లో ఉదయం 5 గంటల ప్రాంతం లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో లాంగ్ టర్మ్ పార్కింగ్ లో పెట్టిన స్కోడా రాపిడ్ కార్ బూట్ లో పెద్ద పేలుడు సంభవించింది... బూట్ లోపల క్యాన్స్ లోంచి లీక్ అయిన కెమికల్స్ కార్ లోని పెట్రోల్ లో కలవడం తో విపరీతమైన విస్పోటం జరిగింది... ఫైర్ ఫైటింగ్ టీం వచ్చి మంటల్ని అదుపు చేసే లోపల కార్ మొత్తం కాలిపోయింది... కార్ ఇంజిన్... చాసిస్ నెంబర్ దొరకలేదు...


(ప్రియమైన పాఠకులారా... ఈ నవల ఇక్కడితో ముగిసింది... నేను ఈ నవలకి మూడు రకాల ముగింపులు ఆలోచించాను... ఆ మూడింటిని మీ ముందుంచుతున్నాను... మీకు ఏది బాగా నచ్చిందో తెలిపితే ఆనందిస్తాను)

మొదటి ముగింపు

స్విట్జర్లాండ్... జ్యూరిక్ మహానగరం... నవంబర్ నెల... మంచు కురవడం మొదలయ్యింది... ఎయిర్పోర్ట్ అంతా పల్చటి మంచు తో నిండివుంది... బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి... న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరిన స్విస్ ఎయిర్ విమానం 12 గంటల ప్రయాణం చేసి జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ ని పూర్తిచేసుకొని బయటకి వచ్చిన ఇజ్రాయెల్ MOSSAD ఫీల్డ్ ఏజెంట్ GIRISAM aka... VISWAMITRA aka... KHURRAM aka... JACOB EPSTEIN aka... URI RICCHETTI aka... AVIV RAFAELI... తన కోసం ఎదురుచూస్తున్న తన భార్య / MOSSAD ఫీల్డ్ ఏజెంట్ RUTH GASTER aka... HANNAH SCHAAL... aka... LYDIA SCHWARZ aka... MEIKE HOFFMANN... aka... RACHEL GREEN aka... MIRIAM HALEVI ని కలసి కార్ ఎక్కి స్వచ్చమైన హీబ్రూ భాషలో సంభాషించుకుంటూ వెళ్ళిపోయాడు...

రెండవ ముగింపు

స్విట్జర్లాండ్... జ్యూరిక్ మహానగరం... నవంబర్ నెల... మంచు కురవడం మొదలయ్యింది... ఎయిర్పోర్ట్ అంతా పల్చటి మంచు తో నిండివుంది... బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి... న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరిన స్విస్ ఎయిర్ విమానం12 గంటల ప్రయాణం తరువాత GIRISAM aka... VISWAMITRA aka... KHURRAM aka... JACOB EPSTEIN aka... URI RICCHETTI aka... AVIV RAFAELI... ZURICH చేరుకొని బయట తన కోసం ఎదురుచూస్తున్న తన భార్య MIRIAM HALEVI aka... HANNAH SCHAAL... aka... LYDIA SCHWARZ aka... MEIKE HOFFMANN... aka... RACHEL GREEN aka... RUTH GASTER ని కలిసాడు... అతడిని చూడగానే " ఈ సారి నువ్వు పెర్మనెంట్ గా వచ్చేసావని అనుకుంటాను..." అని అడిగింది... బదులుగా " Yes... ఇంక వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు..." అంటూ తన లగేజ్ ని కార్ బూట్ లో పెట్టాడు... మిరియం డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంది. జాకబ్ డ్రైవర్ సెట్లో కూర్చొని కార్ ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్లడానికి గేర్ మార్చాడు... సరిగ్గా అదే సమయం లో కార్ ముందు ఎవరో నుంచున్నారు... జాకబ్ సడన్ బ్రేక్ వేసి కార్ ని ఆపి.. డోర్ తీసుకొని కిందకి దిగాడు... రెండో వైపునుంచి మిరియం కూడా దిగింది...

కార్ కి అడ్డంగా నుంచున్న వ్యక్తి మిరియం ని చూసి " Hello Mrs. Miriam Halevi... I am ..." అంటూ అతను వ్యాక్యాన్ని పూర్తిచేసే లోపల మిరియం " Brigadier. Madhav Rao... R&AW Operative..." అని అన్నది... అప్పుడే జాకబ్ వెనకాల చేరిన ఇంకో వ్యక్తిని గమనించింది... అతను మిరియం వైపు చూసి చిన్నగా నవ్వి... చెయ్యి ఊపాడు... అతడిని చూసి "Of Course Herr Direktor Mr.Ravindra..."

మాధవ్... రవీంద్ర... ఇద్దరూ కార్ వెనుకసీట్లో కూర్చున్నారు... జాకబ్ కార్ నడపసాగాడు... అతని పక్కనే మిరియం కూర్చొని ఉంది...

మాధవ్ : So... You are The MOSSAD Field Operative in MI6...

జాకబ్ : How did you figure out?

మాధవ్ : You have to ask Avinash... He found out everything... He told us about your destination... So we also booked tickets for the same flight... of course we flew economy... we need to talk... by the way... how do we address you?

జాకబ్ నువ్వుతూ కార్ నడపసాగాడు...

మూడవ ముగింపు

స్విట్జర్లాండ్... జ్యూరిక్ మహానగరం... నవంబర్ నెల... మంచు కురవడం మొదలయ్యింది... ఎయిర్పోర్ట్ అంతా పల్చటి మంచు తో నిండివుంది... బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి... న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరిన స్విస్ ఎయిర్ విమానం 12 గంటల ప్రయాణం తరువాత GIRISAM aka... VISWAMITRA aka... KHURRAM aka... JACOB EPSTEIN aka... URI RICCHETTI aka... AVIV RAFAELI... ZURICH చేరుకొని బయట తన కోసం ఎదురుచూస్తున్న తన భార్య MIRIAM HALEVI aka... HANNAH SCHAAL... aka... LYDIA SCHWARZ aka... MEIKE HOFFMANN... aka... RACHEL GREEN aka... RUTH GASTER ని కలిసాడు... అతడిని చూడగానే " ఈ సారి నువ్వు పెర్మనెంట్ గా వచ్చేసావని అనుకుంటాను..." అని అడిగింది... బదులుగా " Yes... ఇంక వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు..." అంటూ తన లగేజ్ ని కార్ బూట్ లో పెట్టాడు... మిరియం డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంది.

జాకబ్ కార్ నడపడానికి డ్రైవర్ సీట్ డోర్ ని ఓపెన్ చేసాడు... సరిగ్గా అదేసమయానికి ఆ కార్ పక్కనే ఒక డార్క్ కలర్ ప్యానెల్డ్ వాన్ సడన్ బ్రేక్ వేసి ఆగింది... ఆ వాన్ డోర్ కొద్దిగా తెరుచుకుంది... జాకబ్... మిరియం రియాక్ట్ అయ్యేలోపల ఆ వాన్ లోంచి మెషిన్ గన్ గర్జించింది... కొన్ని బుల్లెట్స్ జాకబ్ ఓపెన్ చేసిన కార్ డోర్ కి... విండ్ షీల్డ్ కి తగిలాయి... కొన్ని బుల్లెట్స్ జాకబ్ ఛాతీ కి తగిలాయి... అప్పటికే మిరియం రెండో వైపు నుంచి కార్ దిగి గన్ బయటకి తీసి ఆ వాన్ మీద కాల్పులు జరిపింది... ఆమె గన్ బుల్లెట్స్ వాన్ కి తగలంగానే వాన్ దూసుకెళ్ళిపోయింది...

జాకబ్ నెల మీద వొరిగిపోయాడు... అపప్టికే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కూడా అక్కడికి చేరుకుంది... ఒక పోలీస్ వాన్ కాల్పులు జరిపిన ప్యానెల్డ్ వాన్ ని వెంబడిస్తూ వెళ్ళింది... అదే సమయానికి అంబులెన్సు కూడా అక్కడికి చేరుకుంది... పారామెడిక్స్ జాకబ్ ని స్ట్రెచర్ మీద కి చేర్చి అంబులెన్సు ఎక్కించారు... వాళ్ళతో పాటు మిరియం కూడా అంబులెన్సు ఎక్కింది... అంబులెన్సు సైరెన్ మోగిస్తూ వేగంగా హాస్పిటల్ వైపు దూసుకెళ్లింది...

JAI HIND