OPERATION MOUSE TRAP

Part - 1- Hit Job... Publicly and Brutally...


"గోపి... ఆ కార్ కి కనీసం 150 మీటర్ల డిస్టెన్స్ ఉండేలా చూసుకో... మరీ దగ్గరగా వెళితే ఆ కార్ డ్రైవర్ మనల్ని గుర్తించే ఆస్కారం ఉంది... BE CAREFUL " అని అన్నాడు వెంకట్... గోపి... వెంకట్... వాళ్లిద్దరూ గచ్చిబౌలి నుంచి BHEL వెళ్లే దారిలో మోటార్ సైకిల్ మీద ఒక కార్ ని ఫాలో అవుతున్నారు... వాళ్ళిద్దరూ  క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు... గోపి మోటార్ సైకిల్ నడుపుతున్నాడు... వెంకట్ వెనక సీట్ మీద కూర్చుని ఉన్నాడు... ఆ ఇద్దరూ చాలా సేపటినుంచి అదే రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఒక వైట్ కలర్  స్కోడా కార్ ని షాడో చేస్తున్నారు... ఆ కారులో మొత్తం ముగ్గురు ఉన్నారు... డ్రైవర్... అతని వెనకాల సీట్ లో ఇద్దరు కూర్చుని ఉన్నారు...  సమయం  సాయంత్రం నాలుగు గంటలు అవుతోంది... గచ్చిబౌలి నుంచి BHEL వెళ్ళే దారిలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది... ప్రతి వాహనం చాలా నెమ్మదిగా కదులుతున్నాయి...  అదే సమయంలో వెంకట్ మొబైల్ ఫోన్ మోగింది... 


DSP గురుమూర్తి : వెంకట్... మీ లొకేషన్ ఏమిటి?


వెంకట్: సర్... మేము ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియం రోడ్ దగ్గర ఆ కార్ వెనకాలే ఉన్నాము... 


DSP గురుమూర్తి : గుడ్... వాళ్ళు మూమెంట్స్ ని జాగ్రత్తగా అబ్సర్వ్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చెయ్యండి... 


వెంకట్ : తప్పకుండా సర్... 


ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది... దాదాపు ముప్పై నిమిషాల తర్వాత వైట్ స్కోడా కార్ స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ దాటింది... ఆ కార్ వెనకాలే నూట యాభై మీటర్ల దూరం లో పోలీస్ కానిస్టేబుల్స్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ ఉంది... సడన్ ఆ వైట్ కలర్ స్కోడా కార్ రైట్ సైడ్ రోడ్ లోకి టర్న్ తీసుకుని అపర్ణ లక్సర్ పార్క్ మీదుగా బొటనికల్ పార్క్ వైపు ప్రయాణించే సాగింది... వెంకట్ వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి DSP గురుమూర్తి కి తెలియచేసాడు... ఇది వినగానే...  


DSP గురుమూర్తి(కొంచెం ఖంగారుగా): మీరు జాగ్రత్త గా వాళ్లని ఫాలో అవ్వండి... ఒక అయిదు నిమిషాల క్రితం నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి... సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కార్ లో ఉన్న వాళ్లలో ఒకడు పాకిస్తాన్ లో ట్రైనింగ్ పొందిన టెర్రరిస్ట్ అని తెలిసింది... నీ దగ్గరనుంచి ఫోన్ వచ్చేముందు నేను ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి చెప్పడం జరిగింది... మాకు అందిన సమాచారం ప్రకారం... ఆ టెర్రరిస్ట్ అమీర్ పెట్ వస్తున్నట్లు తెలిసింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ప్రస్తుతం కూకట్ పల్లి లో ఉన్నాడు... మీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అతనికి తెలియజేయండి... ఏమి చెయ్యాలో ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి తెలుసు... 


DSP గురుమూర్తి చెప్పింది వినగానే వెంకట్ కి భయమేసింది... వెంటనే మోటార్ బైక్ నడుపుతున్న గోపి చెవిలో "ఇన్స్పెక్టర్ శ్రీకర్ రంగంలోకి దిగాడు" అని అన్నాడు... గోపి కి పరిస్థితి పూర్తిగా అర్ధమయ్యింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ సీన్ లోకి వచ్చాడంటే... శవం లేవాల్సిందే... ఇన్స్పెక్టర్ శ్రీకర్ పోలీస్ డిపార్ట్మెంట్ తయారుచేసిన KILLING MACHINE... ENCOUNTER SPECIALIST... గత ఆరేళ్లలో దాదాపు నూట పాతిక కి పైగా ఎన్కౌంటర్స్ చేసాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ చేతికి ఏదైనా ఫైల్ ఇస్తే... దాని మీద CASE CLOSED అన్న రబ్బర్ స్టాంప్ పడటానికి ఎక్కువ సమయం పట్టదు...  వైట్ కలర్ స్కోడా కార్ ట్రాఫిక్ లో నెమ్మదిగా ప్రయాణిస్తూ మసీద్ బండ రోడ్డు దాటి బొటనికల్ గార్డెన్ దగ్గరున్న ఫ్లై ఓవర్ ఎక్కింది... ఇది గమనించిన వెంకట్ ఆ విషయాన్ని DSP గురుమూర్తి కి చెప్పే లోపల అతని మొబైల్ ఫోన్ కి ఒక కాల్ వచ్చింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ కాల్ చేసాడు... వెంకట్ ఖంగారుగా ఫోన్ కాల్ ఆన్సర్ చేసాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: హలో... ఎవరు మాట్లాడుతోంది?


కానిస్టేబుల్ వెంకట్: సర్... నా పేరు వెంకట్... నేను... నా కొలీగ్ గోపి వైట్ కలర్ స్కోడా కార్ ని ఫాలో అవుతున్నాము... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: గుడ్... ప్రస్తుతం ఆ కార్ ఎక్కడున్నది?


కానిస్టేబుల్ వెంకట్: బొటనికల్ గార్డెన్ దగ్గరున్న ఫ్లై ఓవర్ ఎక్కి... ఇప్పుడే ఆల్విన్ క్రాస్ రోడ్స్ వైపు వెళ్తోంది... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: OK... మీరు ఫోన్ కాల్ కట్ చెయ్యకుండా ప్రతి నిమిషానికి నాకు అప్డేట్ ఇవ్వండి... ఎట్టి పరిస్థితి లో ఆ కార్ మీ ద్రుష్టి నుండి మిస్ అవ్వకుండా చూసుకోండి... నేను కూకట్ పల్లి నుండి BHEL వైపు వస్తున్నాను... 


కానిస్టేబుల్ వెంకట్: అలాగే సర్... లైన్ లోనే ఉంటాను..... 


వైట్ కలర్ స్కోడా కార్ నెమ్మదిగా ప్రయాణిస్తూ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గరకి చేరుకొని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది... ఆ కార్ రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోబోతున్నట్లు సిగ్నల్ లైట్ వెలుగుతోంది... 


కానిస్టేబుల్ వెంకట్ (ఫోన్ లో): సర్ ఆ కార్ మియాపూర్ వైపు టర్న్ అవ్వడానికి డ్రైవర్ సిగ్నల్ ఇస్తున్నాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: గుడ్... నేను ఇక్కడ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను... JNTU దగ్గర ఏదో ఆక్సిడెంట్ అయ్యిందని న్యూస్ వస్తోంది... నేను మెట్రో రైల్ ఎక్కి మియాపూర్ వస్తాను... నాకు ఆ కార్ లొకేషన్ గురించి లైవ్ డీటెయిల్స్ చెప్పండి... 


కానిస్టేబుల్ వెంకట్: సర్... ఆ కార్ ఇప్పుడే మియాపూర్ వైపు టర్న్ తీసుకుంది... మేము దాని వెనకాలే ఉన్నాము... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ వెంటనే తన పోలీస్ వాన్ నుంచి దిగిపోయి దగ్గర ఉన్న కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెట్రో స్టేషన్ వైపు పరిగెత్తాడు... దాదాపు పది నిమిషాల తర్వాత హైదరాబాద్ మెట్రో స్టేషన్ చేరుకున్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ని చూడగానే ఆ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ గార్డ్ స్కానర్ పక్కనుంచి లోపలి పంపించాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఎస్కలేటర్ మీద పరిగెత్తుకుంటూ వెళ్లి మెట్రో రైల్ ప్లాటుఫారం చేరుకున్నాడు... సరిగ్గా అదేసమయంలో ఇన్స్పెక్టర్ శ్రీకర్ చెవిలోని ఐఫోన్ AIRPODS లో "సర్... ఆ వైట్ కలర్ స్కోడా కార్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఆగింది... అందులోంచి ఒక వ్యక్తి కిందికి దిగాడు... " అనగానే... ఇన్స్పెక్టర్ శ్రీకర్ "వాడి ఫోటో తీసి నాకు వెంటనే పంపించు" అని అన్నాడు... రెండు నిమిషాలు గడిచాయి... ఇన్స్పెక్టర్ శ్రీకర్ మెట్రో రైల్ ప్లాట్ ఫారం మీద అసహనంగా తిరగసాగాడు... అప్పుడే ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది... అందులో ఒక ఫోటో ఉంది... దాని చూడగానే ఇన్స్పెక్టర్ శ్రీకర్ భారంగా ఊపిరి ఒదిలాడు... ఫోన్ లో 


కానిస్టేబుల్ వెంకట్: సర్... ఆ వ్యక్తి మియాపూర్ మెట్రో స్టేషన్ లోకి వెళ్తున్నాడు... నేను వాడి వెనకాలే ఫాలో అవుతున్నాను...


ఇన్స్పెక్టర్ శ్రీకర్: "వెంకట్... నీ దగ్గర వెపన్ ఉందా?" 


కానిస్టేబుల్ వెంకట్: "లేదు సర్...


ఇన్స్పెక్టర్ శ్రీకర్: వెంకట్... BE CAREFUL... నువ్వు ఫాలో అవుతున్నది ఒక టెర్రరిస్ట్... వాడు చాలా డేంజర్ అని తెలిసింది... అనుమానం కలగకుండా వాడి మూమెంట్స్ ని అబ్సర్వ్ చేసి నాకు ఎప్పటికప్పుడు చెప్పు... నేను కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మెట్రో స్టేషన్ లో ఉన్నాను...


కానిస్టేబుల్ వెంకట్: అలాగే సర్... నా ఫోన్ ఆన్ లోనే ఉంటుంది... మీకు వాడి ప్రతి మూమెంట్ చెప్తాను... 


కానిస్టేబుల్ వెంకట్ ప్రతి నిమిషం అప్డేట్ ఇస్టుతోనే ఉన్నాడు... 


"సర్... వాడు సెక్యూరిటీ గేట్ దాటాడు... " 


"ఇప్పుడు ఎస్కలేటర్ మీదున్నాడు" 


"వాడు అమీర్ పేట్ వైపు వెళ్లే ప్లాట్ ఫార్మ్ చేరాడు" ఇది వినగానే ఇన్స్పెక్టర్ శ్రీకర్  పరిగెత్తుకుంటూ మియాపూర్ వైపు వెళ్లే ప్లాట్ ఫార్మ్ మెట్లు దిగిపోయి... CONCOURSE చేరుకొని అమీర్ పేట్ వైపు వెళ్లే ప్లాట్ ఫార్మ్ చేరుకొని మియాపూర్ నుంచి వచ్చే మెట్రో రైల్ కోసం ఎదురు చూడసాగాడు... అదే సమయంలో... కానిస్టేబుల్ వెంకట్ ఫోన్ లో "సర్... ఇప్పుడు వాడు మెట్రో రైల్ ఎక్కాడు... రైలు బయలుదేరింది... నెక్స్ట్ స్టేషన్ JNTU కాలేజీ... ఈ రైల్ ఇంకో రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది" అన్న అప్డేట్ వచ్చింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ కొంచెం రిలాక్స్డ్ గా ఊపిరి పీల్చుకున్నాడు... రైల్  JNTU కాలేజీ మెట్రో స్టేషన్ నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ మెట్రో స్టేషన్ రావడానికి ఇంకో రెండు నిమిషాలు పడుతుంది... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ (ఫోన్ లో): వెంకట్... వాడు ఎన్నో కంపార్ట్మెంట్ లో ఉన్నాడు? కూచున్నాడా? నుంచున్నాడా?


కానిస్టేబుల్ వెంకట్: సర్... వాడు మూడో కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉన్నాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: వాడి కి కుడివైపు... ఎడమవైపు ... ఎంతమంది ఉన్నారు?


కానిస్టేబుల్ వెంకట్: సర్... వాడు డోర్ కి దగ్గర ఉన్న TWO SEATER లో కూర్చొని ఉన్నాడు... వాడికి కుడి వైపు ఒక వ్యక్తి ఉన్నాడు... వాడికి ఎడమ వైపు గ్లాస్ పార్టిషన్ ఉంది... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: ఆ కంపార్ట్మెంట్ లో జనాభా ఎంతమంది ఉన్నారు?


కానిస్టేబుల్ వెంకట్: చాలా రష్ గా వుంది సర్... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ కళ్ళు మూసుకొని ఒక్క క్షణం మెట్రో రైల్ లోపల దృశ్యాన్ని VISUALIZE చేసుకున్నాడు... కంపార్ట్మెంట్ నిండా జనాలు... పెద్దలు... పిల్లలు... కూర్చున్నవారు కొందరు... ఎక్కువమంది నిలబడి  ఉంటారు... TWO SEATER లో కూర్చున్న టెర్రరిస్ట్ ని CLOSE RANGE లో చంపాలి... అదే సమయంలో ఫోన్ లో "సర్... మేము ఇంకొన్ని క్షణాల్లో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు స్టేషన్ కి చేరుకుంటాము" అని అన్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ తన జాకెట్ లోని వెపన్ ని తడుముకుంటూ ప్లాటుఫారం చివరికి చేరుకొని రైల్ ఆగగానే మొదటి కంపార్ట్మెంట్ ఎక్కడానికి రెడీ అవుతూ ఫోన్ లో  " వెంకట్... ఆ టెర్రరిస్ట్ ఎటువంటి డ్రెస్ వేసుకున్నాడు?" అని  అడిగాడు... వెంకట్ దానికి బదులుగా "సర్... వాడు తెల్ల పైజామా... ఎర్రటి కుర్తా... నల్లటి జాకెట్ వేసుకున్నాడు" అని అన్నాడు... అదే సమయానికి రైల్ ప్లాటుఫారం మీద ఆగింది... జనాలు తోసుకుంటూ దిగడం... ఎక్కడం జరిగింది... రైల్ తలుపులు మూసుకున్నాయి... రైల్ ఒక చిన్న జర్క్ ఇచ్చి బయలుదేరింది... రైల్ లో నుంచున్న వాళ్ళు అటూ... ఇటూ.. తూలడం శ్రీకర్ గమనించాడు... కదలకుండా మొదటి కంపార్ట్మెంట్ లో నుంచున్నాడు... రెండు నిమిషాల తర్వాత DR. B.R. అంబేద్కర్ బాలానగర్ స్టేషన్ వచ్చింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ రైలు ఆగటం చాలా జాగ్రత్తగా గమనించాడు... రైల్ ఒక చిన్న కుదుపుతో ఆగింది... జనాలు తోసుకుంటూ దిగారు... ఎక్కారు... రైల్ తలుపులు మూసుకున్నాయి... చిన్న కుదుపుతో రైల్ కదిలింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ మదిలో ఒక ప్లాన్ మెదిలింది... రైల్ కుదుపులు ఆసరాగా తీసుకుని పని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు... హైదరాబాద్ మెట్రో రైల్ మ్యాప్ చెక్ చేసాడు... తర్వాత వచ్చే స్టేషన్ మూసాపేట్... అక్కడనుంచి అమీర్ పేట్ మధ్యలో భరత్ నగర్... ఎర్రగడ్డ... ESI హాస్పిటల్... SR నగర్ స్టేషన్స్ ఉన్నాయి... అవన్నీ చిన్న చిన్న స్టేషన్స్... పెద్దగా జనాలు మూమెంట్ ఉండకపోవొచ్చు... మనసులో 'అమీర్ పేట్ స్టేషన్ వచ్చేలోపల పని పూర్తి చెయ్యాలి...' అని డిసైడ్ అయ్యాడు... నెమ్మదిగా కదులుతూ రెండవ కంపార్ట్మెంట్ VESTIBULE చేరుకొని క్రీగంట మూడవ కంపార్ట్మెంట్ డోర్ పక్కన ఉన్న TWO SEATER ని చెక్ చేసాడు... కానిస్టేబుల్ వెంకట్ చెప్పినట్లు అక్కడ గ్లాస్ పార్టిషన్ ఆనుకొని పాకిస్తానీ టెర్రరిస్ట్ కూర్చొని ఉన్నాడు. చేతి లోని మొబైల్ ఫోన్ లో ఎదో చూస్తున్నాడు... చాలా రష్ గా ఉంది... సరిగ్గా ఆ టెర్రరిస్ట్ ముందు ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు... వాడి వీపుకి పెద్ద బ్యాక్ ప్యాక్ ఉంది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి రైల్ లో ఎవరైనా పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్ పెట్టుకొని ప్రయాణిస్తే చాలా కోపం... చిరాకు... ఆ బ్యాక్ పాకెర్స్ అటూ...  ఇటూ... కదిలినప్పుడు ఆ పక్కన నిలబడి ఉన్న  పాసెంజర్ కి తగిలి న్యూసెన్స్ గా ఉంటుంది... ఈ విషయం మీద చాలా సార్లు ఆ బ్యాక్ పాకెర్స్ తో గొడవ పడ్డాడు... "రైల్ లో కి ఎక్కిన తర్వాత... మీ దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా ఆ బ్యాక్ ప్యాక్ ని కింద పెట్టుకోవచ్చు కదా" అని లెక్చర్లు కూడా ఇచ్చాడు... కానీ ఇప్పుడు ఆ బ్యాక్ పాకర్ ని చూడగానే ఇన్స్పెక్టర్ శ్రీకర్ మనసులో ఒక ప్లాన్ మెదిలింది... అదే సమయంలో రైల్ ESI హాస్పిటల్ మెట్రో స్టేషన్ లో చిన్న కుదుపుతో ఆగింది... యధావిధిగా జనాలు దిగడం... ఎక్కడం జరిగింది... ESI హాస్పిటల్ స్టేషన్ లో కొంచెం ఎక్కువ మంది రైలు ఎక్కడం జరిగింది... దీంతో రైల్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ JAM PACKED గా ఉన్నాయి... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్  తాను వేసుకున్న జాకెట్ లో ఉన్న వెపన్ ని తడిమి చూసుకున్నాడు... అతని చేతికి గన్ HOLSTER లో ఉన్న WALTHER PPK .38  తగిలింది... ఆఖరిసారిగా చుట్టూ చూసి మొబైల్ ఫోన్ లో కానిస్టేబుల్ వెంకట్ తో "నువ్వు రైల్ లో ఉండు... నేను ఆ పాకిస్తాన్  టెర్రరిస్ట్ ని సరిగ్గా అమీర్ పేట్ స్టేషన్ వచ్చే ముందు షూట్ చేసి దిగి వెళ్ళిపోతాను... నువ్వు నా బుల్లెట్ షెల్స్ ని జాగ్రత్తగా రికవర్ చేసుకొని రా" అని అన్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ చెప్పింది శ్రద్ధగా విని కానిస్టేబుల్ వెంకట్ ఒకే ఒక్క ప్రశ్న వేసాడు "సర్... ఎన్ని బుల్లెట్స్ వాడతారు?" దానికి బదులుగా ఇన్స్పెక్టర్ శ్రీకర్ "రెండు" అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసేసాడు... అదే సమయానికి మెట్రో రైల్ SR నగర్ స్టేషన్ లో ఆగింది... చాలామంది తోసుకుంటూ దిగారు... అదే ఆసరాగా తీసుకొని ఇన్స్పెక్టర్ శ్రీకర్ తన జాకెట్ కింద HOLSTER లో ఉన్న WALTHER PPK .38 పిస్టల్ ని బయటకు తీసి ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ముందు నుంచుని ఉన్న కుర్రాడి పెద్ద బ్యాక్ ప్యాక్ పక్కన ఎవ్వరికి కనిపించకుండా పెట్టి... గురి చూసుకున్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ పిస్టల్ కి MICRO SUPPRESSOR అమర్చి ఉంది... సాధారణంగా పిస్టల్ ని పేల్చినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది... ఆ శబ్దం తో పాటు బుల్లెట్ గన్ బారెల్ నుంచి బయటకు వెళ్లే సమయానికి సమయానికి పెద్ద ఎత్తున నిప్పు... పొగ... వెలువడతాయి... ఆ శబ్దం... పొగ... నిప్పు... పక్కన ఉన్న వాళ్లకి కూడా తెలియకుండా చూసుకోవడానికి SHOOTERS సాధారణంగా పిస్టల్ బారెల్ కి SILENCER లేదా SUPPRESSOR ని అమరుస్తారు...  ఈ SILENCER లేదా SUPPRESSOR కి కొద్దిపాటి తేడాలు ఉన్నాయి... సాధారణంగా పిస్టల్ ని పేల్చినప్పుడు బుల్లెట్ లోని గన్ పౌడర్ తగలబడి నిప్పు... పొగని ఉత్పత్తి చేస్తాయి... పైగా పెద్ద ఎత్తున శబ్దం కూడా వస్తుంది... గన్ బారెల్ కి SILENCER అమర్చి పేలిస్తే... బుల్లెట్ లోని గన్ పౌడర్ కాలినప్పుడు వచ్చే నిప్పు... పొగ... బయటకు వెళ్లకుండా SILENCER లోని వివిధ చాంబర్స్ లో బంధించబడతాయి... పిస్టల్ పేలినప్పుడు వచ్చే శబ్దం కూడా బాగా తగ్గుతుంది... దాదాపు 30 డెసిబుల్స్ శబ్దం మాత్రమే వస్తుంది... అయితే SUPPRESSOR కూడా SILENCER చేసే పనే చేస్తుంది... ఒకే ఒక్క తేడా ఏమిటంటే... SUPPRESSOR ని పిస్టల్ బారెల్ కి అమర్చి పేలిస్తే వచ్చే శబ్దం దాదాపు 20 డెసిబిల్స్ కన్నా తక్కువగా ఉంటుంది... ఈ కారణం వల్లనే ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఎప్పుడు తన WALTHER PPK .38 వెపన్ కి SUPPRESSOR ని వాడతాడు... మెట్రో రైల్ స్పీడ్ క్రమంగా తగ్గసాగింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి అర్ధమయ్యింది... కొన్ని సెకండ్స్ లో రైల్ అమీర్ పేట్ రైల్ వే స్టేషన్ కి చేరుకుంటోంది... సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ శ్రీకర్ వెనకాల ఎవరో వచ్చి నుంచున్నారు... అతను ఎవరో కాదు... కానిస్టేబుల్ వెంకట్... రైల్ అమీర్ పేట్ స్టేషన్ లోకి ప్రవేశించింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని... తన కుడి చేతి బొటన వేలితో WALTHER PPK .38  SAFETY CATCH ని రిలీజ్ చేసి అతి చాకచక్యంగా పిస్టల్ ని తన ముందు నుంచున్న కుర్రోడి పెద్ద సైజు బ్యాక్ ప్యాక్ ని సపోర్ట్ తీసుకొని పాకిస్తానీ టెర్రరిస్ట్ ఛాతికి కి గురిపెట్టి... మెట్రో రైల్ స్టేషన్ లో ఆగే ముందు వచ్చిన కుదుపు కి అనుగుణంగా బ్యాక్ ప్యాక్ కుర్రోడిని తన ఎడమ చేత్తో పాకిస్తానీ టెర్రరిస్ట్ మీదకు తోస్తూ... ఒక్కసారిగా తన పిస్టల్ ట్రిగ్గర్ ని రెండు సార్లు ఆపకుండా నొక్కాడు... అంతే... రెండు 0.38 బుల్లెట్స్ దూసుకొని వెళ్లి పాకిస్తానీ టెర్రరిస్ట్ ఛాతిలో దిగబడ్డాయి... ఆ సమయం లో మెట్రో రైల్ లోని ప్రయాణికుల ద్రుష్టి అంతా పాకిస్తానీ టెర్రరిస్ట్ మీద పడ్డ బ్యాక్ ప్యాక్ కుర్రోడి మీదకి మళ్లింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ పిస్టల్ పేలినప్పుడు వచ్చిన శబ్దం... చిన్నపాటి పొగ... ఎవరి కంట పడలేదు... రెండుసార్లు పిస్టల్ ని వాడిన వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీకర్ అమీర్ పేట్ లో దిగిపోయే ప్రయాణికులతో కలిసి రైల్ దిగి నేరుగా రాయదుర్గ్ నుంచి నాగోల్ వెళ్లే బ్లూ లైన్ రైల్ ప్లాట్ ఫామ్ రైలు కోసం ఎదురు చూడసాగాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ పిస్టల్ వాడి రైలు దిగి వెళ్ళిపోగానే... అతని వెనకాల నుంచున్న కానిస్టేబుల్ వెంకట్ కావాలనే బాలన్స్ తప్పి పడిపోయినట్లు నటిస్తూ... ఇన్స్పెక్టర్ శ్రీకర్ పిస్టల్ నుండి వెలువడిన రెండు బుల్లెట్ షెల్స్ ని రికవర్ చేసుకొని తాను కూడా రైల్ దిగి నేరుగా అమీర్ పేట్ రైల్ వే స్టేషన్ బయటకు వస్తూ... తన కొలీగ్ గోపి కి ఫోన్ చేసి "నేను అమీర్ పేట్ స్టేషన్ బయట నీకోసం వెయిట్ చేస్తాను" అని చెప్పాడు... మెట్రో రైల్ లో పాకిస్తానీ టెర్రరిస్ట్ మీద పడ్డ కుర్రోడిని సహా ప్రయాణికులు కొంచెం కష్టపడి లేవదీశారు... అప్పటికే రైలు అమీర్ పేట్  స్టేషన్ దాటింది... సడన్ గా ప్రయాణికులు హాహాకారాలు పెట్టారు... కారణం... వాళ్ళకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఛాతి దగ్గర పెద్ద రక్తపు మరక కనిపించింది... బ్యాక్ ప్యాక్ కుర్రోడి చేతికి కూడా రక్తం అంటింది... అందరూ భయంతో పక్క కంపార్ట్మెంట్ లోకి సర్దుకున్నారు... అదే సమయానికి మెట్రో రైల్ పంజగుట్ట స్టేషన్ చేరుకుంది... రైలు తలుపులు తెరుచుకోగానే ప్రయాణికులు అందరూ ఒకరినొకరు తోసుకుంటూ ప్లాట్ఫామ్ మీద కు దిగిపోయి రైలు PILOT / DRIVER కి మూడో కంపార్ట్మెంట్ లో చనిపోయిన ప్రయాణికుడి గురించి చెప్పారు... వెంటనే రైల్ PILOT / DRIVER పరిగెత్తుకుని వచ్చి మూడో కంపార్ట్మెంట్ లో ని శవాన్ని చూసి వెంటనే తన INTERCOM లో ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకి తెలియచేసాడు... వాళ్ళు వెంటనే మియాపూర్ - LB నగర్ లైన్ లోనే రైళ్లు దగ్గరలోని స్టేషన్స్ లో ఆపేసి... ఈ విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్పారు... పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు వెంటనే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఒక టీం ని మెట్రో రైల్ స్టేషన్ కి పంపించారు... ఈ రైల్లో శవం ఉన్నదన్న వార్తా ప్రెస్ మరియు టీవీ మీడియా వారందరికీ తెలిసిపోయింది... పంజగుట్ట మెట్రో స్టేషన్ చేరుకున్న పోలీస్ టీం వెంటనే రైల్లోని శవం ఫోటో తీసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించారు... హైదరాబాద్ పోలీసులు ఆ ఫొటోస్ ని వెంటనే న్యూ ఢిల్లీ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ చేరవేశారు... ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తన మొబైల్ ఫోన్ లో ఒక నెంబర్ కి కాల్ చేసి "జైహింద్ సర్... పాకిస్తాన్ లో ట్రైనింగ్ పొంది...  మనదేశంలోకి చొరబడిన టెర్రరిస్ట్ "మసూద్ అన్సారి" ని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ షార్ప్ షూటర్ ఇన్స్పెక్టర్ శ్రీకర్ చంపేశాడు" అని అన్నాడు... అవతలి వ్యక్తి అంతా శ్రద్దగా విన్న తర్వాత ఒకే ఒక్క ప్రశ్న వేసాడు "ANY CIVIL CASUALTIES OR COLLATERAL DAMAGE?" అని అడిగాడు... "అలాంటిదేమి లేదు... IT'S A CLEAN HIT" అని అన్నాడు... అవతలి వ్యక్తి "గుడ్... వెంటనే ఈ న్యూస్ ని ఫొటోస్ తో సహా నేషనల్ న్యూస్ చానెల్స్ కి తెలియజేయండి... BY THE WAY WHAT IS THE NAME OF THE OFFICER WHO SHOT THE TERRORIST?" అని అడిగాడు... "సర్... అతని పేరు ఇన్స్పెక్టర్ శ్రీకర్" అని అన్నాడు... దానికి బదులుగా అవతలి వ్యక్తి "KEEP AN EYE ON THIS GUY... JAI HIND" అని ఫోన్ కాల్ కట్ చేసేసాడు... ఒక పది నిమిషాల్లో మసూద్ అన్సారి మరణవార్త ప్రపంచమంతా తెలిసిపోయింది... చాలా మంది ఆశ్చర్యపోయారు... గత మూడేళ్లుగా మసూద్ అన్సారీ ఎక్కడున్నది ఎవరికీ తెలీదు... INTERPOL... CIA... FBI... SCOTLAND YARD... MOSSAD లాంటి పెద్ద పెద్ద గూఢచార సంస్థ కు చెందిన ఏజెంట్లు మసూద్ అన్సారి కోసం ప్రపంచమంతా గాలిస్తున్నారు...  చాలా భయంకరమైన టెర్రరిస్ట్ ఇంత సడన్ గా హైదరాబాద్ మెట్రో రైల్ లో శవమై కంపించడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది... 


DSP గురుమూర్తి తన ఆఫీస్ లో కూర్చుని ఉన్నాడు... అతని కి ఎదురుగా టీవీ లో న్యూస్ చూస్తున్నాడు... "మరోసారి విజృంభిచిన హైదరాబాద్ SUPERCOP... కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం ENCOUNTER SPECIALIST... ఇన్స్పెక్టర్ శ్రీకర్ అతి చాకచక్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాకిస్తానీ టెర్రరిస్ట్ మసూద్ అన్సారి ని అవలీలగా హతమార్చాడు... మసూద్ అన్సారి పాకిస్తాన్ ఆర్మీ... ISI ల ద్వారా ట్రైనింగ్ పొందిన కరుడుకట్టిన టెర్రరిస్ట్... ప్రపంచం లో చాలా చోట్ల బాంబు దాడులు... హత్యలు చేసాడు... ఎంతో కాలం గా  INTERPOL... CIA... FBI... SCOTLAND YARD... MOSSAD... KGB లాంటి గూఢచార సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్నాడు... చివరికి హైదరాబాద్ లో మన SUPERCOP ఇన్స్పెక్టర్ శ్రీకర్ చేపట్టిన షూట్ అవుట్ లో చనిపోయాడు... ఈరోజు ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఎంతో సాహసం గా సామాన్య ప్రజలకి ఎటువంటి ఆపద కలగకుండా మాసోడ్ అన్సారి ని హైదరాబాద్ మెట్రో రైల్లో హతమార్చాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ చేతిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతోంది... మసూద్ అన్సారి నెంబర్ #124... ఇన్స్పెక్టర్ శ్రీకర్ 124 NOT OUT... " అంటూ  టీవీ న్యూస్ రీడర్ చెప్తోంది... ఆ న్యూస్ ప్రోగ్రాం చూస్తున్న DSP గురుమూర్తి కి రక్తం మరిగిపోతోంది... మనసులో 'ఆఫ్ట్రాల్... నా కింద స్థాయి ఉద్యోగి... నేను చెప్పిన ప్రతి పని చేసే ఒక సాధారణ ఇన్స్పెక్టర్ కి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా పబ్లిసిటీ ఇస్తున్నారు... వాడి ని ఒక పెద్ద నేషనల్ హీరో లాగా చూస్తున్నారు... నేను వాడి బాసుని... కానీ... నాగుంచి ఒక్కసారి కూడా ఈ మీడియా వాళ్ళు ప్రస్తావించలేదు... నా ఉనికి బయట ప్రపంచానికి తెలీదు... బయట ప్రపంచం దేవుడెరుగు... సొంత డిపార్ట్మెంట్ లో కూడా నా పేరు ఎవరికీ తెలీదు... ఈ ఇన్స్పెక్టర్ శ్రీకర్ మాత్రం రోజురోజుకు హీరో అయిపోతున్నాడు... ఎలాగైనా వాడిని దెబ్బ తియ్యాలి" అని అనుకుంటుండగా అతని మొబైల్ ఫోన్ మోగింది... రాష్ట్రం లో ఒక పెద్ద రాజకీయ నాయకుడు దగ్గరనుంచి ఫోన్ కాల్ వచ్చింది... DSP గురుమూర్తి హడావిడిగా ఫోన్ లో... 


DSP గురుమూర్తి : హలో సర్...బాగున్నారా... చాలా కాలమయ్యింది మీ దగ్గరనుంచి ఫోన్ కాల్ వచ్చి... 


రాజకీయ నాయకుడు: నేను బానే ఉన్నాను... నువ్వెలావున్నావు గురుమూర్తి? 


DSP గురుమూర్తి(కొంచం నిరుత్సాహంగా): ఏం చెప్పమంటారు? నా డిపార్ట్మెంట్ లో నా పేరు నా పై అధికారికి కూడా సరిగ్గా తెలీదు... కానీ... నా కింద పనిచేసే ఆ ఇన్స్పెక్టర్ శ్రీకర్ పేరు మాత్రం దేశమంతా మారుమోగిపోతోంది... 


రాజకీయ నాయకుడు(గట్టిగా నవ్వుతూ): అందరికి అన్ని దొరకవు... నీకు హైదరాబాద్ లో రెండు ఫార్మ్ హౌసులు ఉన్నాయి... భారీగా నగదు... బంగారం ఉన్నాయి... ఆ ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి అటువంటివి ఏమీ లేవు... ఒక్క పేరు తప్ప... అదంతా పక్కన పెట్టు... నువ్వు అర్జెంటు గా నాకు ఒక పెద్ద పని చేసి పెట్టాలి... 


DSP గురుమూర్తి (ఆనందంగా): చెప్పండి సార్... మీకు ఏమి కావాలంటే అది చేసి పెడతాను... 


రాజకీయ నాయకుడు: ఈ విషయం మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి... ఎట్టి పరిస్థితిలో నేను నీకు ఈ పని అప్పగించిన విషయం మూడో వాడికి తెలియకూడదు... చాలా సీక్రెట్ గా పని అవ్వాలి... 


DSP గురుమూర్తి: అలాగే సార్... మూడో కంటికి తెలియకుండా మీ పని చేస్తాను... చెప్పండి ఏమి చెయ్యాలి? 


రాజకీయ నాయకుడు: నీకు మన ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ భరద్వాజ్ తెలుసా?


DSP గురుమూర్తి: ఎందుకు తెలీదు సార్... బాగా తెలుసు... మంచి పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసాడు... 


రాజకీయ నాయకుడు: అవును... వాడే... ప్రస్తుతం వాడు ఒక భారీ తారాగణంతో PAN INDIA లెవెల్ లో ఒక ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా ని తెలుగు... తమిళ్... కన్నడ... మలయాళం... హిందీ భాషల్లో ఒకేసారి తీస్తున్నాడు... 


DSP గురుమూర్తి: అవును సార్... ఆ సినిమా లో అన్ని భాషల హీరోలు నటిస్తున్నారు... బడ్జెట్ కూడా చాలా పెద్దది దాదాపు RS. 500 కోట్ల పైనే అని బయట టాక్ ఉంది... 


రాజకీయ నాయకుడు: ఆ సినిమా బడ్జెట్ చాలా పెద్దది... నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి... నా పేరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు... ఒకవేళ నా పేరు బయటకు వస్తే... నీకు చాలా ప్రమాదం... 


DSP గురుమూర్తి: అమ్మమ్మా... ఎంత మాట... ఇప్పటిదాకా నేను మీకు ఎన్నో పనులు చేసి పెట్టాను... ఎప్పుడైనా మీకు చెడ్డ పేరు తెచ్చానా? నన్ను నమ్మండి... మీ పేరు రాకుండా జాగ్రత్త పడతాను... ఏం చెయ్యాలో చెప్పండి... చేసేస్తాను... 


రాజకీయ నాయకుడు: నీకు సినిమా నటి సమీరా శర్మ తెలుసు కదా... 


DSP గురుమూర్తి: హా... బాగా తెలుసు... మన సౌత్ ఇండియా సినిమా లో చాలా పెద్ద హీరోయిన్... 


రాజకీయ నాయకుడు: ఆమెకు...  నాకు...  మంచి ఫ్రెండ్షిప్ ఉంది... ఈ మధ్య ఆమెకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది... ఆమె నా సహాయం కోరింది... 


DSP గురుమూర్తి కి మాత్రమే కాదు... హైదరాబాద్ లో చాలా మందికి ఆ రాజకీయ నాయకుడికి... సమీరా శర్మ కి మధ్య ఉన్న "ఫ్రెండ్షిప్" గురించి బాగా తెలుసు... ఆ రాజకీయ నాయకుడి భార్య ఒకసారి ఒక పార్టీ లో సమీరా శర్మ తో "నా భర్త కి దూరంగా ఉండు... లేకపోతే నీ బొందిలో ప్రాణం ఉండదు... ఎక్కడో పంజాబ్ నుంచి ఇక్కడికి సినిమా లో నటించడానికి వచ్చావు... ఆ పని చూసుకో... ఇంకోసారి నువ్వు నా మొగుడితో తిరిగినట్లు తెలిస్తే ఏమైనా జరుగుతుంది... మా నాన్నకి ఇక్కడ చాలా పలుకుబడి ఉంది... నీ కుటుంబానికి కనీసం నీ శవం కూడా దొరకదు... జాగ్రత్త..." అని చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చింది...  ఈ గొడవ జరిగిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు కొంతకాలం సమీరా శర్మ కి దూరంగా ఉన్నాడు... కానీ... వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటూ ఉంటారని హైదరాబాద్ లో ఒక సెలెబ్రెటీ గాసిప్ వెబ్సైటు "గుసగుసలు" చాలా సార్లు వాళ్ళిద్దరి ఫొటోస్ తో  MEMES తయారు చేసి తమ వెబ్సైట్ లో పోస్ట్ చేసింది... కొన్ని సర్వేలు కూడా కండక్ట్ చేసింది... 


DSP గురుమూర్తి: చెప్పండి సర్... నన్ను ఏమి చెయ్యమంటారు? 


రాజకీయ నాయకుడు: ఆ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ సమీరా శర్మ ని తాను తీస్తున్న PAN INDIA సినిమాలో ఆమెని ITEM SONG లో డాన్స్ చేయమని బలవంతం చేస్తున్నాడు ... సమీరా శర్మ కి ఇష్టం లేదు... నువ్వు ఆ సినిమా డైరెక్టర్ తో మాట్లాడి ఎలాగైనా వాడు సమీరా శర్మ ని ఇబ్బంది పెట్టకుండా చూడాలి... 


DSP గురుమూర్తి: తప్పకుండా సార్... నేనే పర్సనల్ గా ఆ సినిమా డైరెక్టర్ తో మాట్లాడి సమీరా శర్మ గదికి ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చూస్తాను... మీరు నిశ్చింతగా ఉండండి... 


DSP గురుమూర్తి ఫోన్ లో రాజకీయ నాయకుడికి అభయం ఇచ్చిన తర్వాత చాలా సీరియస్ గా ఆలోచించసాగాడు... అదే సమయం లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అరవింద్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది... 


DSP గురుమూర్తి: గుడ్ ఈవెనింగ్ సర్... 


సిటీ పోలీస్ కమిషనర్ అరవింద్ : గుడ్ ఈవెనింగ్... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఎక్కడున్నాడు? 


DSP గ్గురుమూర్తి(నవ్వుతూ): ప్రెస్... మీడియా కి దూరంగా దాక్కున్నాడు... మీ దగ్గరికి పంపమంటారా?


సిటీ పోలీస్ కమిషనర్ అరవింద్ : ఇప్పుడు వొద్దు... మా ఆఫీస్ దగ్గర కూడా మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు... రేపు ఉదయం 11:00 గంటలకి రమ్మని చెప్పండి... మధ్యాన్నం 12 గంటలకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాము... అందులో ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఆ పాకిస్తానీ టెర్రరిస్ట్ మసూద్ అన్సారి ని ఎలా మట్టుపెట్టింది డిటైల్డ్ గా మీడియా కి వివరించే ఏర్పాటు చేస్తున్నాము... ఇంకో విషయం... సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరనుంచి నాకు ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది... ఈ సారి మన ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి ప్రెసిడెంట్ మెడల్ కి రికమండ్ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది... మీరు అతని కి ఇప్పుడే ఏమి చెప్పొద్దు... రేపు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నేనే చెప్తాను... మసూద్ అన్సారి ని ఎలిమినేట్ చేసినందుకు మీకు... మీ టీం కి కంగ్రాట్యులేషన్స్... KEEP UP THE GOOD WORK... 


DSP గురుమూర్తి: థాంక్యూ వెరీ మచ్ సర్... రేపు ఉదయం 11:00 గంటలకి ఇన్స్పెక్టర్ శ్రీకర్ మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్ వచ్చేలా చూస్తాను... 


DSP గురుమూర్తి ఫోన్ లో సిటీ పోలీస్ కమిషనర్ అరవింద్ తో మాట్లాడిన తర్వాత కోపంతో కుతకుతలాడిపోయాడు... మనసులో 'ఈ ఇన్స్పెక్టర్ శ్రీకర్ రోజురోజుకి బాగా ఫేమస్ అవుతున్నాడు... ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి... మీడియా వాడిని ఒక పెద్ద హీరో ని చేసేసింది...   ఇన్స్పెక్టర్ శ్రీకర్ నా మాట వినడం మానేసి చాలా రోజులయ్యిది... ఇప్పడు ప్రెసిడెంట్ మెడల్ కూడా వస్తే ఇంకేముంది? డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ లాగా ఫోజ్ కొడతాడు... ఎలాగయినా వీడిని దెబ్బ తియ్యాలి... పోలీస్ డిపార్ట్మెంట్ లో సీనియర్స్ అంటే ఏమిటో చూపించాలి' అని అనుకుంటున్న సమయంలోనే టీవీ వాళ్ళు అంత త్వరగా ఎలా సంపాదించారో తెలీదు... వాళ్ళు హైదరాబాద్ మెట్రో సీసీటీవీ ఫుటేజ్ ని తమ టీవీ లో చూపించసాగారు... ఆ ఫుటేజ్ లో మసూద్ అన్సారి మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్ లో ప్రవేశించడం... రైల్ ఎక్కడం... ఆ తర్వాత కూకట్ పల్లి హోసింగ్ బోర్డ్ కాలనీ మెట్రో స్టేషన్ లో ఇన్స్పెక్టర్ శ్రీకర్ అదే రైలు ఎక్కడం... చివరికి అమీర్ పేట్ లో ఇన్స్పెక్టర్ శ్రీకర్ దిగిపోవడం... వేరే ప్లాటుఫారం చేరుకొని రాయిదుర్గ్ నుంచి LB నగర్ వెళ్లే మెట్రో రైల్ ఎక్కి చివరికి పారడైస్ స్టేషన్ లో దిగడం... చూపిస్తున్నారు... DSP గురుమూర్తి ఒక నిమిషం పాటు టీవీ వాళ్ళు  పారడైస్ మెట్రో స్టేషన్ లో తాపీగా... చాలా స్టైలిష్ గా నడుస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీకర్ ని చూడగానే అదేదో హాలీవుడ్ సినిమా లో హీరో ని చూసినట్లు అనిపించింది... DSP గురుమూర్తి తట్టుకోలేకపోయాడు... సిగరెట్ కాలుస్తూ సీరియస్ గా ఆలోచించసాగాడు... ఒక పావుగంట తర్వాత తన ఆఫీస్ లో ఉన్న ఒక ఐరన్ సేఫ్ ఓపెన్ చేసి... అందులోంచి ఒక కొత్త NOKIA 125 సాధారణ BASE MODEL  మొబైల్ ఫోన్ ని బయటకి తీసి... దాంట్లో ఒక కొత్త SIM కార్డు వేసి... తన స్మార్ట్ ఫోన్ లో ఒక మొబైల్ నెంబర్ వెతికి దాన్ని NOKIA 125 లో ఫీడ్ చేసుకొని... తన ఆఫీస్ రూమ్ లోంచి బయటకు వెళ్లి ఆ నెంబర్ డయల్ చేసాడు... అవతలనుంచి రెస్పాన్స్ రాగానే... "హలో... మదన్... నేనే గురుమూర్తి ని... నాకు అర్జెంటు గా సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఈరోజు ఏ ఏ సమయం లో ఎక్కడెక్కడ ఉంటాడో తెలియాలి... చాలా అర్జెంటు... నువ్వు ఎలా ఇన్ఫర్మేషన్ సంపాదిస్తోవో తెలీదు... వీలైనంత త్వరగా సినిమా డైరెక్టర్ భరద్వాజ్ WHERE ABOUTS నాకు తెలియాలి... ఇదే నెంబర్ మీద ఫోన్ చేసి డీటెయిల్స్ ఇవ్వు" అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేసేసాడు... పోలీస్ డిపార్ట్మెంట్ DSP గురుమూర్తి టీం కోసం NOKIA 125 -- చాలా సాధారణ GSM BASEMODEL మొబైల్ ఫోన్స్... SIM CARDS ని ఇచ్చింది... ఆ ఫోన్స్ ని DSP గురుమూర్తి టీం ఆఫీషియల్ వర్క్ కోసం ఆ BURNER PHONES  విపరీతం గా వాడతారు... ఆ ఫోన్స్ కి లెక్క చెప్పాల్సిన పని లేదు... 


DSP గురుమూర్తి ఫోన్ లో మదన్ తో మాట్లాడుతున్నప్పుడు అతని ఆఫీస్ కి దగ్గరలో ఇంటెలిజెన్స్ బ్యూరో కి చెందిన ఒక CELLULAR RECONNAISSANCE VEHICLE తచ్చాడుతోంది... ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి మసూద్ అన్సారి అనుచరుడు ఒకడు DSP గురుమూర్తి ఆఫీస్ ఉన్న ఏరియా లో తిరుగుతున్నట్లు ఇన్ఫర్మేషన్ రావడం తో వాళ్ళు అక్కడ RECCE - రెక్కీ... చెయ్యడానికి వచ్చారు... వాళ్ళ వాన్ లో ఆ చుట్టుపక్కల 500 మీటర్స్ దూరం లో పనిచేస్తున్న ప్రతి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ని కనిపెట్టడమే కాకుండా... మొబైల్ ఫోన్ సంభాషణల్ని రికార్డు కూడా చెయ్యగల POWERFUL EQUIPMENT ఉంది... ఆ సమయంలో ఆ వాన్ లోపల టెక్నీషియన్స్ తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో - హైదరాబాద్ బ్రాంచ్ DSP కరుణాకర్ కూడా ఉన్నాడు... వాళ్ళందరూ DSP గురుమూర్తి తన BURNER PHONE లో మదన్ అనేవాడితో చేసిన సంభాషణ వినడమేకాదు... వాళ్ళ వాన్ లోని కంప్యూటర్ లో రికార్డు కూడా అయ్యింది... DSP కరుణాకర్ తన స్టాఫ్ మెంబెర్ తో "DSP గురుమూర్తి వాడిన మొబైల్ ఫోన్ నెంబర్ కాల్ లిస్ట్ నాకు కావాలి" అని అన్నాడు... ఆ స్టాఫ్ మెంబెర్ వెంటనే DSP గురుమూర్తి వాడిన మొబైల్ ఫోన్ SIM CARD డీటెయిల్స్ ని చెక్ చేసాడు... అందులో ఎటువంటి డేటా లేదు... వెంటనే ఆ మొబైల్ ఫోన్ నెంబర్ కి సంభందించిన కాల్ లిస్ట్ చెక్ చేసాడు... ఒకే ఒక్క ఫోన్ కాల్ డీటెయిల్స్ కనిపించాయి... అదే విషయాన్ని DSP కరుణాకర్ కి చెప్పాడు... DSP కరుణాకర్ ఒక నిమిషం అలోచించి... "ఆల్రైట్... DSP గురుమూర్తి BURNER PHONE వాడినట్లున్నాడు... ఆ నెంబర్ ని మన వాన్ ఇక్కడ ఉన్నంతసేపు మానిటర్ చెయ్యండి... వేరే CALL ACTIVITY ఏదైనా ఉంటే దాన్ని రికార్డు చెయ్యండి... DSP గురుమూర్తి ఎవరికి కాల్ చేసాడో ఆ నెంబర్ చెక్ చెయ్యండి" అని అన్నాడు... ఆ వాన్ లోని టెక్నీషియన్ వెంటనే DSP గురుమూర్తి ఫోన్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ ని డేటాబేస్ లో చెక్ చేసి "సర్... ఎవరో మదన్ కుమార్... అనే వాడితో మాట్లాడాడు..." అని అన్నాడు... ఇది వినగానే DSP కరుణాకర్ 'ఆల్రైట్... ఆ మదన్ కుమార్ ఫోన్ నెంబర్ ని మానిటర్ చెయ్యమని మన లోకల్ హెడ్ క్వార్టర్స్ కి చెప్పండి" అని అన్నాడు... ఆ టెక్నీషియన్ వెంటనే DSP కరుణాకర్ చెప్పిన పని చేసాడు... 


DSP గురుమూర్తి తో మాట్లాడిన తరువాత మదన్ కొంచం సేపు ఆలోచించి... తన ఇంట్లోంచి బయటకి వచ్చి... ఆ రోడ్ చివర ఉన్న ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్లి ఒక సిగరెట్ కొనుక్కొని కాలుస్తూ... ఆ పాన్ షాప్ లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ నుంచి గుసగుసలు.COM వెబ్సైటు కి ఫోన్ చేసి తన ఫ్రెండ్ తో "నాకు చాలా అర్జెంటు గా ఇవ్వాళ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఎక్కడుంటాడో లొకేషన్ డీటెయిల్స్ కావాలి.. చాలా అర్జెంటు..." అని అన్నాడు... ఇది వినగానే గుసగుసలు.COM  లో పనిచేసే ఫ్రెండ్... "ఆ డీటెయిల్స్ నీకు ఇస్తే నాకేమిటి లాభం?" అని అడిగాడు... మదన్ వెంటనే తడుముకోకుండా "నీ వెబ్సైటు కి సినిమా డైరెక్టర్ తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తాను..." అని అన్నాడు... అంతే... గుసగుసలు.COM లో పనిచేసే మదన్ ఫ్రెండ్ ముందు వెనక ఆలోచించకుండా తెలుగు సినిమా ఫీల్డ్ లో తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి దాదాపు నలబై నిమిషాల తరువాత మదన్ కి ఫోన్ చేసి " సినిమా డైరెక్టర్ భరద్వాజ్ కి సికింద్రాబాద్ సైనిక్ పూరి దగ్గరలో ఉన్న వాయుపురి లో ఒక ఇల్లు ఉంది... అప్పుడప్పుడు ఆ ఇంట్లో భరద్వాజ్ కొత్త యాక్టర్స్ కి AUDITIONS చేస్తాడని తెలిసింది... ఇవ్వాళ రాత్రి అక్కడ ఉంటాడని తెలిసింది..." అని చెప్పి వాయుపురి లో సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఇంటి అడ్రస్ మదన్ కి ఇచ్చాడు... మదన్ వెంటనే సినిమా డైరెక్టర్ భరద్వాజ్ వాయుపురి ఇంటి అడ్రస్ ని DSP గురుమూర్తి ఇచ్చిన BURNER PHONE నెంబర్ కాల్ చేసి చెప్పాడు... ఈ ఫోన్ కాల్ సంభాషణ కూడా అక్కడే తచ్చాడుతున్న ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ CELLULAR RECONNAISSANCE VEHICLE రికార్డు చేసింది... వాళ్ళు ఆ ఫోన్ కాల్ గురించి పెద్దగా పట్టించుకోలేదు... ఆ వాన్ నెమ్మదిగా అక్కడ నుంచి కదలి వేరే చోటకి వెళ్ళిపోయింది... 


DSP గురుమూర్తి ఇంకో సిగరెట్ కాలుస్తూ ఒక పది నిమిషాల పాటు తాను చెయ్యబోయే పని గురించి అలోచించి ఒక పేపర్ మీద చాలా డిటైల్డ్ గా STEP BY STEP ACTION PLAN వ్రాసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి ముందుగా ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి ఫోన్ చేసాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: గుడ్ ఈవెనింగ్ సర్... 


DSP గురుమూర్తి: CONGRATULATIONS...  WELLDONE... ఎక్కడున్నావు?


ఇన్స్పెక్టర్ శ్రీకర్(ఆనందంగా): THANK YOU VERY MUCH SIR... మన ఆఫీస్ కి దగ్గరలోనే ఉన్నాను... 


DSP గురుమూర్తి : నువ్వు వెంటనే ఆఫీస్ రా నీతో చాలా పని ఉంది... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: ఇప్పుడే బయలుదేరుతాను... ఒక పది నిమిషాల్లో ఆఫీస్ లో ఉంటాను... 


DSP గురుమూర్తి వెంటనే హైదరాబాద్ లో ఒక పెద్ద బిల్డర్ మాఫియా హెడ్ శేఖర్ అనే వాడికి ఫోన్ కాల్ చేసాడు... 


DSP గురుమూర్తి: హలో శేఖర్... ఎలా ఉన్నావు?


శేఖర్ (చాలా కోపంగా): నా తమ్ముడిని చంపించడమే కాకుండా నాకు ఫోన్ చేసి 'ఎలా వున్నావు?' అని అడుగుతావా... ఎన్ని గుండెలు నీకు?


DSP గురుమూర్తి: నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను... నీ తమ్ముడిని అదుపులో పెట్టుకోమని... నువ్వు నామాట వినలేదు... ఆ ఇన్స్పెక్టర్ శ్రీకర్ నీ తమ్ముడిని వేసెయ్యడానికి వస్తున్నాడన్న విషయం కూడా నీకు చెప్పను... కానీ... నీ తమ్ముడు దూకుడుగా ఇన్స్పెక్టర్ శ్రీకర్ మీద కాల్పులు జరిపాడు... చివరికి చచ్చాడు... 


శేఖర్(ఇంకా కోపంగా): ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? 


DSP గురుమూర్తి: నీ తమ్ముడు చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా?


శేఖర్: ఏమంటున్నావు? 


DSP గురుమూర్తి: నీ తమ్ముడి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే చెప్పు... అది ఈ రాత్రికి తీరేలా ఏర్పాటు చేస్తాను... 


శేఖర్ రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయి చివరికి "నా పాగా ఎలా తీరుతుంది?" అని అడిగాడు... DSP గురుమూర్తి దాదాపు ఒక పదిహేను నిమిషాలపాటు శేఖర్ కి ఏమి చెయ్యాలో చెప్పాడు... అది వినగానే శేఖర్ ఎగిరి గంతేసి... 'అన్నా... నా ప్రతీకారం తీరితే చాలు... నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను... నువ్వు చెప్పినట్లు చెయ్యడానికి నేను రెడీ... ఇప్పుడే మావాళ్లని రెడీ గా ఉండమని చెప్తాను..." అని ఫోన్ పెట్టేసాడు... సరిగ్గా అదే సమయంలో DSP గురుమూత్ర్య్ ఆఫీస్ లోకి ఇన్స్పెక్టర్ శ్రీకర్ అడుగుపెట్టి సెల్యూట్ కొట్టాడు... DSP గురుమూర్తి ఆనందంగా తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇన్స్పెక్టర్ శ్రీకర్ ని కౌగలించుకొని... 


DSP గురుమూర్తి: ONCE AGAIN CONGRATULATIONS... ఒక్క దెబ్బతో పెద్ద ఎత్తున రికగ్నిషన్ సంపాదించేసావు... ఇన్నాళ్లు హైదరాబాద్ లో గూండాలు... రౌడీ షీటర్స్...   లోకల్ మాఫియా ని లేపేసిన నువ్వు... ఇవ్వాళ నేషనల్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్నావు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: THANK YOU SIR... నాకు ముందుగా వాడు పాకిస్తానీ టెర్రరిస్ట్ అని తెలీదు... వాడిని లేపెయ్యడం చాలా ఎక్సయిటింగ్ ఉంది... 


DSP గురుమూర్తి: ఇందాక మన సిటీ పోలీస్ కమీషనర్ అరవింద్ ఫోన్ చేశారు... నిన్ను రేపు ఉదయం పదకొండు గంటలకి తన ఆఫీస్ కి రమ్మని చెప్పారు... పన్నెండు గంటలకి మీడియా తో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నారు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ (చాలా ఆనందంగా): ONCE AGAIN THANK YOU VERY MUCH SIR... 


DSP గురుమూర్తి: DON'T MENTION IT...  ఇప్పుడు నిన్ను అర్జెంటు గా ఆఫీస్ కి పిలవడానికి ఒక పెద్ద కారణం ఉంది... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: చెప్పండి సర్... 


DSP గురుమూర్తి: నీకు సినిమా డైరెక్టర్ భరద్వాజ్ తెలుసు కదా? 


ఇన్స్పెక్టర్ శ్రీకర్ (కొంచం అనుమానంగా చూస్తూ): తెలుసు... 


DSP గురుమూర్తి: నువ్వు అర్జెంటు గా వాడికి ఒక వార్నింగ్ ఇవ్వాలి... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్(ఆశ్చర్యంగా చూస్తూ): నేను సినిమా డైరెక్టర్ భరద్వాజ్ కి వార్నింగ్ ఇవ్వాలా? SIR...  ARE YOU SERIOUS?


DSP గురుమూర్తి: YES I AM VERY SERIOUS...  వాడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్(అయోమయంగా చూస్తూ): కారణం తెలుసుకోవొచ్చా?


DSP గురుమూర్తి: నీకు సినిమా యాక్ట్రెస్ సమీరా శర్మ తెలుసు కదా... ఈ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఆమెని తాను తీస్తున్న మల్టీ స్టారర్ PAN INDIA సినిమా ITEM SONG లో డాన్స్ చెయ్యమని విపరీతంగా ప్రెషర్ పెడుతున్నాడని తెలిసింది... నువ్వు అర్జెంటు గా ఆ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ని కలిసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వు... సమీరా శర్మ ని ఎప్పటికీ సతాయించకుండా ఉండమని గట్టిగా చెప్పు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్(అపనమ్మకంగా): సమీరా శర్మ మీకు కంప్లైట్ చేసిందా?


DSP గురుమూర్తి: అవును... మన సిటీ పోలీస్ కమీషనర్ అరవింద్ గారితో మాట్లాడి కంప్లైంట్ చేసింది... మన కమీషనర్ గారు నన్ను ముందు UNOFFICIAL గా డీల్ చెయ్యమని చెప్పారు... ఆ సినిమా డైరెక్టర్ ఈ రోజు సికింద్రాబాద్ లోని వాయుపురి లో ఉంటాడు... నువ్వు అర్జెంటు గా అక్కడికి వెళ్లి వాడికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వు... వాడు వింటే మంచింది... లేదంటే ఆఫీషియల్ గా యాక్షన్ తీసుకోమని కమీషనర్ గారు చెప్పారు... 


DSP గురుమూర్తి ఒక పేపర్ మీద సినిమా డైరెక్టర్ భరద్వాజ్ సికింద్రాబాద్ లోని వాయుపురి లో ఉంటున్న ఇంటి అడ్రస్ ఇచ్చాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ అయోమయంగా ఆ అడ్రస్ స్లిప్ తీసుకొని అక్కడనుండి బయలుదేరాడు... DSP గురుమూర్తి వెంటనే శేఖర్ కి ఫోన్ చేసి "ఇన్స్పెక్టర్ శ్రీకర్ వస్తున్నాడు" అని చెప్పాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ తన వెహికల్ ఎక్కి సికింద్రాబాద్ వైపు వెళ్తూ... దారిలో తన ఫ్రెండ్ జగదీష్ కి ఫోన్ చేసి "నువ్వు అర్జెంటు గా మీ ఆఫీస్ దగ్గరున్న STARBUCKS COFFEE SHOP రా... నీతో చాలా మాట్లాడాలి" అని చెప్పాడు... ఇన్స్పెక్టర్ జగదీష్ సైనిక్ పూరి కి దగ్గరున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పని చేస్తున్నాడు... వాళ్లిద్దరూ ఒకే ఊరి వాళ్ళు... చిన్నప్పటినుంచి ఒకే స్కూల్... కాలేజీ లో చదువుకున్నారు... ఇద్దరూ ఒకేసారి పోలీస్ డిపార్ట్మెంట్ లో SUB INSPECTOR పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారు... శ్రీకర్ కి జగదీష్ చాలా నమ్మకమైన మిత్రుడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ తన వెహికల్ నడుపుతూ DSP గురుమూర్తి చెప్పిన విషయం గురించి ఆలోచించసాగాడు... 'సమీరా శర్మ నిజంగా పోలీస్ కమీషనర్ కి రిపోర్ట్ చేసిందా? నమ్మశక్యంగా లేదు... ఎదో జరుగుతోంది... ఎందుకైనా మంచిది ఒకసారి భరద్వాజ్ కి ఫోన్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది?' అని అనుకుంటూ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ కి ఫోన్ చేసాడు... ఫోన్ స్విచ్ ఆఫ్ అని మెసేజ్ వస్తోంది... వెంటనే సినిమా యాక్ట్రెస్ సమీరా శర్మ కి ఫోన్ చేసాడు... అవుట్ అఫ్ కవరేజ్ ఏరియా అన్న మెసేజ్ వస్తోంది... ఇంతలో ఇన్స్పెక్టర్ శ్రీకర్ వెహికల్ వాయుపురి క్రాస్ రోడ్స్ లో ఉన్న STARBUCKS COFFEE SHOP చేరుకుంది... అప్పటికే ఇన్స్పెక్టర్ జగదీష్ అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ శ్రీకర్ కోసం వెయిట్ చేస్తున్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ని చూడగానే నవ్వుతూ "కంగ్రాట్యులేషన్స్... ఇవ్వాళ చాలా పెద్ద చాపని చంపావు" అని అన్నాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ అదేమి పట్టించుకోకుండా రెండు అమెరికానో కాఫీ లు ఆర్డర్ చేసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఇన్స్పెక్టర్ జగదీష్ కి అంతకు ముందు తనకి DSP గురుమూర్తి అప్పగించిన పని గురించి చెప్పాడు... 


ఇన్స్పెక్టర్ జగదీష్(సీరియస్ గా చూస్తూ): నువ్వు చెప్పింది నిజమేనా?


ఇన్స్పెక్టర్ శ్రీకర్: అవును... సమీరా శర్మ మన సిటీ కమీషనర్ అరవింద్ కి UNOFFICIAL COMPLAINT ఇచ్చిందని DSP గురుమూర్తి చెప్పాడు... 


ఇన్స్పెక్టర్ జగదీష్: నువ్వు సమీరా శర్మ కి లేదా భరద్వాజ్ కి ఫోన్ చెయ్యలేదా? 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: చేసాను... రెస్పాన్స్ లేదు... 


ఇన్స్పెక్టర్ జగదీష్: నీకు ఆ భరద్వాజ్ గురించి బాగా తెలుసు... నువ్వు ఇప్పుడు వార్నింగ్ ఇస్తే... వాడు కోపంతో నీ ప్రాజెక్ట్ ని ఆపేస్తాడు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: అదే ఆలోచిస్తున్నాను... అసలే ఆ భరద్వాజ్ పెద్ద కోపిష్టి... ఎవరి మాట వినే రకం కాదు... చాలా మొండి వాడు... వాడి బుర్రలో ఏ ఆలోచన వస్తే అది అమలు చేస్తాడు... ముందు వెనక ఆలోచించడు... ఎవ్వరిని లెక్క చెయ్యడు... 


ఇన్స్పెక్టర్ జగదీష్ వెంటనే తన మొబైల్ ఫోన్ బయటకి తీసి సినిమా డైరెక్టర్ భరద్వాజ్ కి కాల్ చేసాడు... లాభం లేదు... స్విచ్ ఆఫ్ అని మెసేజ్ వస్తోంది... అంటే... సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఏదో పనిలో బిజీగా ఉన్నాడన్నమాట... వెంటవెంటనే సమీరా శర్మ కి కాల్ చేసాడు... ఆమె కూడా రెస్పాండ్ అవ్వలేదు... ఒక అయిదు నిమిషాల ట్రై చేసి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి... 


ఇన్స్పెక్టర్ జగదీష్ : ఇద్దరూ ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ అవ్వడం లేదు... నువ్వు డైరెక్ట్ గా భరద్వాజ్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి... ఎట్టి పరిస్థితిలో నీ ప్రాజెక్ట్ కి మాత్రం అంతరాయం కలుగకూడదు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్(కాఫీ తాగుతూ): అదే ఆలోచిస్తున్నాను... సమీరా శర్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే నమ్మకం కలగడం లేదు... ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు... భరద్వాజ్ కి ఈ విషయం ఎలా చెప్పాలి? 


ఇన్స్పెక్టర్ జగదీష్; అరే.. శ్రీ... నువ్వు ఎంతో కస్టపడి ఇంత దూరం వచ్చావు... ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీ చేసావు... నువ్వు ఎంతోకాలం SHARP SHOOTER గా పని చెయ్యలేవు... ఎంత కష్టపడ్డా... మన డిపార్ట్మెంట్ లో నువ్వు ఎంతో ఎత్తు ఎదగలేవు... అనుకోకుండా నీకు చిన్న వయస్సులోనే రిటైర్ అయ్యే ఛాన్స్ వచ్చింది... నువ్వు నీ జీవితం లో కన్న రెండు కలలు తీరిపోయే ఛాన్స్ నీముందు ఉంది... జాగ్రతగా వ్యవహరించు... 


ఇన్స్పెక్టర్ శ్రీకర్: అవును... చాలా జాగ్రతగా వ్యవహరించాలి... సరే... నువ్వు మీ ఆఫీస్ కి వెళ్ళు... భరద్వాజ్ ఇల్లు ఇక్కడికి దగ్గరే... నేను నా వెహికల్ ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తాను... పని అయ్యాక వచ్చి వెహికల్ ని తీసుకొని వెళ్తాను... 


ఇన్స్పెక్టర్ జగదీష్: భరద్వాజ్ ఇంట్లో పని అవ్వగానే నాకు ఫోన్ చెయ్యి... నేను కూడా ఇక్కడికే వస్తాను... ఇద్దరం బార్ కెళ్ళి డ్రింక్ చేసి ఇవ్వాళ నీ మొదటి INTERNATIONAL HIT ని సెలబ్రేట్ చేసుకుందాం... 


ఇద్దరూ STARBUCKS COFFEE SHOP లోంచి బయటకి వచ్చారు... ఇన్స్పెక్టర్ జగదీష్ తాను పనిచేస్తున్న రాచకొండ కమిషనరేట్ ఆఫీస్ వైపు నడవసాగాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ నెమ్మదిగా సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఇంటి వైపు నడుస్తూ తనకి ఆ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ తో ఎలా మాట్లాడాలో రిహార్సల్ వేసుకుంటున్నాడు... దాదాపు పది నిమిషాల నడక తర్వాత వాయుపురి లో సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ఇల్లు చేరుకున్నాడు... ఆ రోడ్ అంతా నిర్మానుష్యం గా ఉంది... నాలుగు వీధి కుక్కలు మొరుగుతున్నాయి... వాటిని తరిమి కొడుతూ భరద్వాజ్ ఇంటి మెయిన్ గేట్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు... చిన్న ఇల్లు... అయిదు వందల గజాలలో కట్టుకున్న ఇల్లు... నిజానికి ఆ ఇల్లు భరద్వాజ్ భార్య కి ఆమె తండ్రి ఇచ్చిన ఇల్లు... భరద్వాజ్ అంతగా సక్సెస్ కానీ రోజుల్లో ఇక్కడే తన మామగారి ఇంట్లో ఉండేవాడు... క్రమంగా బాగా డబ్బు సంపాదించిన తర్వాత జూబ్లీ హిల్స్ లో చాలా పెద్ద ఇల్లు కట్టుకొని అందరిని ఆ ఇంటికి మారిపోయాడు... ఈ వాయుపురి ఇంట్లో ఒక చిన్న స్టూడియో లాంటిది ఏర్పాటు చేసుకొని కొత్త యాక్టర్ / యాక్ట్రెస్ లకి ఆడిషన్స్ చెయ్యడానికి... లేదా ప్రశాంతంగా కూర్చొని సినిమా స్క్రిప్ట్స్ రాసుకోవడం లేదా తన ప్రొడక్షన్ టీం తో డిస్కషన్స్ పెట్టుకోడం చేస్తూ ఉంటాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ కి ఆ ఇల్లు మొత్తం కొట్టిన పిండి... ఎన్నోసార్లు ఆ ఇంటికి వచ్చాడు... భరద్వాజ్ ఎప్పుడు ఆ ఇంటి మెయిన్ డోర్ కీ ని బయట ఉన్న గులాబీ మొక్క కుండీ కింద పెడతాడు... ఇన్స్పెక్టర్ శ్రీకర్ ఆ గులాబీ మొక్క కుండీ కింద నుంచి కీ తీసుకొని మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఆ కీ ని పట్టుకొని నేరుగా ఆడిషన్స్ జరిగే స్టూడియో రూమ్ లోకి వెళ్ళాడు... అక్కడ... ఒక కుర్చీలో భరద్వాజ్ అచేతనంగా కూర్చిని ఉన్నాడు... అతని ఛాతీలో రెండు బుల్లెట్ గాయాలు... అప్పటికే భరద్వాజ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి... సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి సందు మొదట్లో పోలీస్ వాహనాలు ప్రవేశించిన శబ్దం వినిపించడం... తన ప్యాంటు పాకెట్ లోని మొబైల్ ఫోన్ కాల్ రావడం జరిగింది... ఇన్స్పెక్టర్ శ్రీకర్ షాక్ నుంచి తేరుకొని వెంటనే ఆ ఇంటి లోపలి పరిగెత్తి కిచెన్ డోర్ ఓపెన్ చేసుకొని పెరట్లోకి వెళ్లి గోడ దూకి ఆ ఇంటి వెనకాల ఉన్న రోడ్ చేరుకొని తన మొబైల్ ఫోన్ చెక్ చేసుకున్నాడు... ఇన్స్పెక్టర్ జగదీష్ నుంచి కాల్ వచ్చింది... వెంటనే ఆన్సర్ చేసాడు "అరే... శ్రీ... కొంప మునిగింది... మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది... నువ్వు ఆ సినిమా డైరెక్టర్ భరద్వాజ్ ని చంపావని రిపోర్ట్ చేశారు" అని అన్నాడు... దానికి బదులుగా ఇన్ఫసెక్టర్ శ్రీకర్ "నువ్వు చెప్పింది నిజమే... నేను ఇక్కడికి వచ్చేలోపలే ఎవరో భరద్వాజ్ ని చంపేశారు... పోలీసులు రావడం గమనించి నేను పెరట్లో గోడ దూకి ఇంటి వెనక రోడ్ మీదకి చేరుకున్నాను... నువ్వు అర్జెంటు గా STARBUCKS COFFE SHOP దగ్గర పార్క్ చేసిన నా వెహికల్ ని తీసుకెళ్లి మా ఇంట్లో పార్క్ చెయ్యి... నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను" అని కాల్ కట్ చేసి చీకట్లో పరిగెత్తాడు...